దాదాపు సంవత్సర కాలంగా నిర్వహించబడుతున్న ఈ బ్లాగులో ఉన్న 440+ టపాలలో, పది పదిహేను టపాలు తప్ప, మిగిలిన అన్నీ ఒకదానికొకటి సంబంధమున్నవే. 301 నుండి ఈ టపాలో ఉన్నాయి. దీని తరువాత దానిని అనుసరించగలరు.

భారతదేశం మీద, హిందూమతం మీద, హిందూ జీవనవిధానం మీద, హిందూ సంస్కృతి మీద, ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం మానవత్వం మీద, సుదీర్ఘకాలం నుండి, అన్నిరంగాలలో జరిగిన, జరుగుతున్న కుట్రని వివరించటానికే అన్ని టపాలూ ఉద్దేశింపబడినాయి.

అయితే, కొత్తగా ఈ బ్లాగులోకి వచ్చేవారికి ఇన్ని టపాలలో మొదటి చదువుకోవాలంటే…..ఇన్ని సుదీర్ఘమైన అనేక టపాలలో ఏది ముందో ఏది వెనకో తెలుసుకోవాలంటే….. దాన్ని బట్టి Sequence అర్ధం చేసుకోవాలంటే…… ఉన్న ఇబ్బందిని తొలగించటానికి ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా ఒక విషయం: మనదేశం మీద, మన సంస్కృతి మీద, మన మతం మీద, మన మీద జరుగుతున్న ఈ కుట్ర గురించిన పరిజ్ఞానం, అవగాహన విషయంలో కుట్రదారులు Ph.D. స్థాయిలో ఉంటే, సామాన్య ప్రజలలో అత్యధికులు నిరక్షరాస్యుల స్థాయిలోనూ, కొద్దిమంది ‘అఆఇఈల’ స్థాయిలోనూ ఉన్నారు. ఎందుకంటే సామాన్యప్రజలు, ఎంతగా మీడియా విషప్రచారంలో పడి కొట్టుకుపోతున్నా, ప్రాధమికంగా అంతగా చెడుని, కుట్రలని ఊహించలేరు కాబట్టి. ఊహించనే లేని వారికి వాటిని గుర్తించటం, అర్ధం చేసుకోవటం కొంచెం తికమకగా, గందరగోళంగా అన్పిస్తుంది.

అంతేగాక, మా బ్లాగులోనికి కొత్తగా వచ్చేవారికి, కొన్నిపదాలు కూడా వింతగానూ, తలా తోక తెలియనట్లుగానూ ఉంటాయి. వాటి తొలివివరణ ఎక్కడో ముందటి టపాలలో ఉంటుంది.

అటువంటి అసౌకర్యాలని పరిష్కరించటానికి, అన్నిటపాలని, తేదీల వారిగా మొదటి నుండి చూడగలిగేటట్లు, ఈ టపా ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. ‘ఈ బ్లాగుని అనుసరించటం ఎలా?’ అనీ మరో టపాలో లేబుల్స్ ప్రకారం బ్లాగు టపాలని రిఫర్ చేయగలిగే ఏర్పాటు చేసాము.

ముఖ్యగమనిక: ఇది నేను ఎవరి కోసం వ్రాస్తున్నానంటే – ఎవరయితే ’ఇది నిజం, వీటి గురించి తెలుసుకోవాలి’ అని నమ్మేవాళ్ళ కోసం వ్రాస్తున్నాను. ఈ టపాలు అర్ధరహితంగా అన్పించిన వాళ్ళు, ఈ బ్లాగును నిరభ్యంతరంగా విస్మరించవచ్చు.

301. ఓటమే స్ట్రాటజీగా... [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 06][Feb. 11, 2010]

302. శివరాత్రి శుభాకాంక్షలతో ఓ చిన్న కథ [Feb. 12, 2010]

303. ఓటమి స్ట్రాటజీనే ఎందుకు? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 07] [Feb. 13, 2010]

304. సమాచార సేకరణ - విశ్లేషణ - అమలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 08] [Feb. 14, 2010]

305. నిర్ధారణ - టాంపరింగ్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 09] [Feb. 16, 2010]

306. నాలుగు దశలలో తొలిదశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 10] [Feb. 17, 2010]

307. ప్రధానిగా పీవీజీ ఓటమి వరకూ రెండోదశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 11] [Feb. 18, 2010]

308. మధ్యంతర ఎన్నికలు - మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 12] [Feb. 19, 2010]

309. వెతుకులాటలు - మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 13] [Feb. 20, 2010]

310. నాలుగు తగిలిస్తే అమ్మభాష అదే గుర్తుకొస్తుంది! [Feb. 21, 2010]

311. టాంపరింగ్ అన్వేషణ – మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 14] [Feb. 22, 2010]

312. పీవీజీ మరణం వరకూ – మూడో దశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 15] [Feb. 23, 2010]

313. ఇందిరా గాంధీ – సోనియా – నాలుగో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 16] [Feb. 24, 2010]

314. ఓటమే స్ట్రాటజీ మా కేసులో – రామోజీరావు off/on [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 17] [Feb. 25, 2010]

315. రామోజీరావు కీ, నెం.5 వర్గానికీ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 18] [Feb. 26, 2010]

316. చేదు గురుతులే కాదు తీపి జ్ఞాపకాలు కూడా! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 19] [Feb. 27, 2010]

317. అందరికీ హోలీ శుభాకాంక్షలతో..... మాయా మోహం గురించిన ఉపనిషత్కథ [Feb. 28, 2010]

318. మా గురించి [Feb.28, 2010]

319. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ [301 నుండి] ఒకేసారి చూడాలంటే – [Feb. 28, 2010]

320. మనిషి బొమ్మ తిరగేస్తే మ్యాపే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 20] [March. 01, 2010]

321. పది - తాత - రక్షకుడు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 21] [March. 02, 2010]

322. పూసలోళ్ళ చేపల పులుసు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 22] [March. 04, 2010]

323. మాకూ, నెం.5 వర్గానికి మధ్య గల సంబంధం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 23] [March. 05, 2010]

324. ప్రజాస్వామ్యంలో పౌరధర్మం, రాజధర్మం అంటూ వేరుగా లేవు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 24] [March. 06, 2010]

325. కామం తీరని క్రోధం, ఆ పైన దుఃఖం [March. 08, 2010]

326. నూజివీడు దాండియా – చోటా మోటాల ఆట [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 25] [March. 09, 2010]

327. సినిమాల నేపధ్యంలో నడిచే భాష - భారతీయుడు, ఠాగూర్ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 26] [March. 10, 2010]

328. భారతీయ మహిళ – వివాహ వ్యవస్థ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 27] [March. 11, 2010]

329. మనం జీవించడం దేశాన్ని ఉద్దరించడమా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 28] [March. 12, 2010]

330. చట్టాలు - సామాజిక బాధ్యతలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 29] [March. 15, 2010]

331. వస్తోంది వస్తోంది ఉగాది! వచ్చేసింది…. ఉగాది! [March. 16, 2010]

332. 300 యోధులు – నకిలీ కణిక అనువంశీయుడికి అచ్చమైన ప్రతిరూపమే జెక్సీస్ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 30] [March. 17, 2010]

333. బానిసత్వానికీ, స్వేచ్ఛాస్వాతంత్రాలకీ ఉన్న వ్యత్యాసం [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 31] [March. 19, 2010]

334. మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 32] [March. 20, 2010]

335. లియోనైడర్స్ రాణి – రామోజీరావు భాష ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 33] [March. 21, 2010]

336. మరికొన్ని సినిమాలు – మరికొంత భాష ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 34] [March. 23, 2010]

337. శ్రీరామ నవమి శుభాకాంక్షలతో – శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మనకేం చెప్పారు? [March.24, 2010]

338. లగాన్ – ఖడ్గం – కథ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 35] [March. 27, 2010]

339. అరుంధతిలో అన్వర్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 36] [March. 29, 2010]

340. మరణానంతరమూ కొనసాగే భావప్రసారం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 37] [March. 30, 2010]

341. రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం – సమస్య [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 38] [March. 31, 2010]

341. క్రికెట్ లో క్యాచ్ లాగా పలుకోణాలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 39] [April 01, 2010]

342. తెల్లకాకులని ఎప్పుడైనా చూసారా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 40] [April 03, 2010]

343. మా పాపకి జన్మదిన శుభాకాంక్షలతో.... [April 05, 2010]

344. గయోపాఖ్యానం కి మరో రూపం [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 41] [April 06, 2010]

345. సుందోప సుందులతో నెం 5 వర్గపు ఆట ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 42] [April 08, 2010]

347. పకోడి ముక్క కోసం బోనులో చిక్కిన ఎలుక! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 43] [April 10, 2010]

348. 8 గమ్మత్తు – 7వ తారీఖు, 7వ నెల! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 44][April 12, 2010]

349. తెర మీద పెళ్ళి – విదేశీ కోచ్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 45][April 13, 2010]

350. అందరూ కోచ్ లే – అద్దం కథ ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 46][April 14, 2010]

351. సెలబ్రిటీల జీవితాలు – సుడి గుండాలు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 47] [April 16, 2010]

352. సోనియాకి దెబ్బలమ్మాయి సానియా![ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 48] [April 17,2010]

353. నేదురుమల్లి బాలకృష్ణా రెడ్డి గారితో నా పరిచయం ! [April 18, 2010]

354. తెలంగాణా – రెడీ 123… [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 49] [April 19, 2010]

355. తమిళ కారన్ - సోనియా ఉజ్జయినీ మొక్కు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 50] [April 20, 2010]

356. తమకు రాని విద్యని మరొకరికి నేర్పటమంటే కామెడీనే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 51] [April 21,2010]

357. 10 అనుకుంటే భయపడు, 5 అనుకుంటే భ్రమపడు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 52] [April 22, 2010]

358. హింట్స్ ఇచ్చి వ్యాసం - హెడ్డింగులు ఇచ్చి విషయపు పూర్తి పాఠం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 53] [April 23, 2010]

359. ద్రౌపది ధర్మసందేహం - వికటకవి సమాధానం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 54] [April 24, 2010]

360. గంగ మెట్ల మీద ’నాగపూర్’ అంటే నవ్వారు! [April 25, 2010]

361. చిత్తశుద్ది లోపిస్తే చట్టంలో మిగిలేది భావం లేని భాషే - అదే రెడి టేపిజం! [April 27, 2010]

362. ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతిపుంజముగా [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 55] [April 27, 2010]

363. లోపలి మనిషి నుండి అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 56] [April 28, 2010]

364. సంకల్ప సిద్ది - తాత ఎవరికయినా తాతే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 57] [April 29, 2010]

365. మాతృభూమిపై మమకారం ఎప్పుడుంటుంది? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 58] [April 30, 2010]

366. ‘దుష్టశిక్షణ – శిష్టరక్షణ’ విషయమై నెం 5 వర్గపు పనితీరు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 59] [May 01, 2010]

367. వాదులాటలు – చొప్పదంటు మాటలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 60] [May 03, 2010]

368. మానసిక యుద్ధతంత్రాలు - మా తోటి సైనికులు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 61] [May 04, 2010]

369. ఇది ఒక అజ్ఞాత సైనికుడి పరిశీలన ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 62] [May 05, 2010]

370. వ్యవస్థీకృత కుట్ర ఉంది – కుట్రా? అలాంటిదేం లేదే ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 63] [May 06, 2010]

371. గురుశిష్యుల మధ్య సంబంధం – ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 04] [May 10, 2010]

372. బియ్యం పారబోసి, మిగుల్చుకున్న తవుడు! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 05] [May 11, 2010]

373. ఒక కార్యం సాధించబడాలంటే అందులో ఎన్నో మెలికలు, మలుపులు! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 06] [May 12, 2010]

374. యుగానికొక్కడు – సినిమా రివ్యూ [May 13, 2010]

375. పిల్లల్లో శ్రమించే తత్త్వం నేర్పడం గురించి చిన్నకథ ! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 07] [May 14, 2010]

376. కాపీలు కొట్టి పరీక్షల్లో విజయం సాధిస్తే! – విద్య గురుముఖతః నేర్చుకుంటే! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 08] [May 17, 2010]

377. ఎవ్వరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదా? - ఓ కొత్త కథ! [May 18, 2010]

378. బ్రిటీషు వాడి అవినీతి చదువు ఒక విషవృక్షం! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 09] [May 20, 2010]

379. గూఢచర్యానికి మరో పర్యాయపదమే రెడ్ టేపిజం! [May 25, 2010]

380. రేపటి భవిష్యత్తు కోసం అంటూ, ఇంత ఒత్తిడి ఈ రోజు అవసరమా? [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 10] [May 26, 2010]

381. విద్యార్ధుల సమీకరణకు, ఫలితాల పంపకానికి నెట్ వర్క్! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 11] [May 27, 2010][35 Page]

382. పిల్లితల్లి తన చిన్నకూనకి ఏం నేర్పుతుంది ? [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 12] [June 02, 2010]

383. నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్ - ఒక స్ట్రాటజీ! [June 03, 2010]

384. పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ - మరో స్ట్రాటజీ! [June 04, 2010]

385. వ్యాపారం నాడు – నేడు ![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 01] [June 05, 2010]

386. బట్టతల మీద జుట్టు – ప్రజల అభివృద్ది ! [June 07, 2010]

387. కుంకుడు కాయలు - రసాయనిక ఎరువులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 02] [June 08, 2010]

388. కాగితపు కట్టడం – ఆర్దిక గణాంకాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 03] [June 09, 2010]

389. ఆముదం – కార్పోరేట్ కంపెనీల ఉత్తుత్తి పోటీ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 04] [June 10, 2010]

390. అండర్సన్ లు – అధిష్టానాలు – ఎన్ని విషవాయువులో! [June 11, 2010]

391. సిమెంట్ సిండికేట్ – మీడియా సహకారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 05] [June 12, 2010]

392. తాగుడు వ్యసనపు విన్యాసం ! [June 13, 2010]

393. అప్పుడు ఆయుధాలు – ఇప్పుడు ఆరోగ్యాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 06] [June 14, 2010]

394. ఉల్లిపాయలు – ముంగారు మొలకలు – ఈగా, మజాకా !? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 07] [June 17, 2010]

395. కప్పకాళ్ళు – కాఫీ టీ లు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 08] [June 18, 2010]

396. ఈ దేశం గాలి సోదరులదీ, అంబానీ సోదరులదేనా? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 09] [June 19, 2010]

397. ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 10] [June 21, 2010]

398. హేతువాద సంఘాలు ఎందుకు కిమ్మనవో? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 11] [June22 , 2010]

399. క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12] [June23 , 2010][157 Page]

400. పుకార్లతో చీరల వ్యాపారం - వీరప్పన్ వ్యవహారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 13] [June24 , 2010]

401. వర్తకుల నిజాయితీ – ముత్యపు చిప్పల కలలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 14] [June25 , 2010][02 Page]

402. బుజ్జిగాడి కలలు![ఉపనిషత్తులూ Vs ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం – 01][June26 , 2010]

403. ప్రజల్ని గోతిలో పడెయ్యటం ఎలా? – ఎంసెట్ లెక్క! [July 01, 2010]

404. మిశ్రమ ఆర్దిక వ్యవస్థతో అభివృద్ది ఆకాంక్షలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 15] [July03 , 2010]

405. నాడు రోడ్డుప్రక్క రత్నాల రాశులు – నేడు ఫోన్లు, బైకులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 16][July 05 , 2010]

406. సహకార సంఘాలూ – ఉపాధి హామీలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 17][July 06 , 2010]

407. ఏం చేసినా వచ్చేది డిజ్ ఎడ్వాంటేజే ! – మర్యాద రామన్న కథ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 18][July 08 , 2010]

408. అంబానీల ఐశ్వర్యం – వెండి లండన్ కు చేరవేత ! [July 09 , 2010]

409. ప్రభుత్వానికి తక్షణ ఆదాయం – పరమ రహస్యం సుమా![July 12, 2010]

410. సందుగొందుల నుండి రహదారి మీద ప్రయాణం! [జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 05] [July 13 , 2010]

411. భాజపా రాంజఠ్మలానీలూ, నారిమన్ లూ! [నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు [Circumstantial] – 16] [July 15, 2010]

412. ఇరాన్ అమీరీలు – జార్ఖండ్ శిబు శోరెన్ లు – అకౌంట్లలో డబ్బులు ! [నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు [Circumstantial] – 17] [July 16, 2010]

413. తెలుగు వారిలో ఆత్మగౌరవం, ఐకమత్యం లోపించాయా? [ఒకే అంశం – విభిన్న కోణాలు -01] [July 21, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/01.html
414. ‘మహా కిరాతకం’లో కొన్ని కీలక ఘటనలు![ఒకే అంశం – విభిన్న కోణాలు -02] [July 24, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/02.html
415. పరమ గురువు, తాత పీవీజీ కి అక్షర నీరాజనం ![July 25, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post_25.html
416. రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం![ఒకే అంశం – విభిన్న కోణాలు -03] [July26,2010]
http://ammaodi.blogspot.com/2010/07/03.html
417. చంద్రబాబు, రామోజీరావు+సోనియాల మధ్య నడుస్తున్న సంకేత భాష![ఒకే అంశం – విభిన్న కోణాలు-04][July 27,2010]
http://ammaodi.blogspot.com/2010/07/04.html
418. మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు -05] [July 28, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/05_28.html
419. జనం పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు -06] [July 31, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/06.html
420. చేసింది చెప్పకా తప్పదు! తిన్నది కక్కకా తప్పదు! [ఒకే అంశం – విభిన్న కోణాలు -07] [Aug. 01, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/07.html
421. రానున్న వెయ్యేళ్ళ పాటు ఎవ్వరూ గూఢచర్యం జోలికెళ్ళకూడదు![ఒకే అంశం – విభిన్న కోణాలు -08][Aug.03,2010]
http://ammaodi.blogspot.com/2010/08/08.html
422. చెప్పనిస్తే ఎన్ని వాదనలైనా చెబుతారు![ఒకే అంశం – విభిన్న కోణాలు -09] [Aug. 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/09.html
423. కోడి కూర తినమంటే కెవ్వుమనే చిన్నారి ![Aug. 09, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/blog-post.html
424. పార్క్ ఉడ్ పాపం దేనికి ప్రతిఫలం? [Aug. 11, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/blog-post_11.html
425. భోపాల్ పాపాలు పీవీజీవేనా? – 1[Aug. 13, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/1.html
426. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో![Aug.15, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/blog-post_15.html
427. భోపాల్ పాపాలు పీవీజీవేనా? – 2[Aug. 16, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/2.html
428. రాజకీయ ఫిక్షన్ కథ - టైం మెషిన్! [Aug. 17, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/blog-post_17.html
429. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నేను![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 19][Aug.19,2010]
http://ammaodi.blogspot.com/2010/08/19.html
430. వీళ్ళు నీమీద ఫిర్యాదు ఇచ్చారు. ఓ చూపు చూస్కో![Aug. 21 , 2010]
http://ammaodi.blogspot.com/2010/08/blog-post_21.html
431. పరిశ్రమ అంటే ఎన్ని అనుమతులో![భారతీయత మీద ఆర్దిక,వాణిజ్య రంగాల ద్వారా కుట్ర– 20][Aug.23,2010]
http://ammaodi.blogspot.com/2010/08/20.html
432. టైం మెషిన్ లో మరికొందరు - [ఫిక్షన్ కథ - 2][Aug. 26, 2010]
http://ammaodi.blogspot.com/2010/08/2_26.html
433. పరిశ్రమల రంగంలో ఓనమాలు![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 21][Aug. 28 , 2010] http://ammaodi.blogspot.com/2010/08/21.html
434. ఆకాశానికి పందిరి గుంజలు![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 22][Aug. 30 , 2010] http://ammaodi.blogspot.com/2010/08/22.html
435. మన్ను వెన్న రెండూ ఒకటే కన్నయ్యకి! – శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు![Sep. 01 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/blog-post.html
436. నిజంగా ఈ పాపం ఎవరిది? పాక్ ఆటగాళ్ళదేనా? – 01 [Sep. 02 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/01.html
437. క్రికెట్లో కూడా సంకేత భాష ! [నిజంగా ఈ పాపం ఎవరిది? – 02] [Sep. 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/09/02.html
438. ఈ రోజు ప్రశంసలు–రేపు విమర్శలు![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 23][Sep.07,2010]
http://ammaodi.blogspot.com/2010/09/23.html
441. సోనియా, మీడియా సయామీ కవలలా?[జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 06] [Sep. 10 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/06.html
442. దేవగణనాధునికి దూర్వార పత్రాలెందుకు? – వినాయక చవితి శుభాకాంక్షలతో![Sep. 11, 2010]
http://ammaodi.blogspot.com/2010/09/blog-post_11.html
443. ఈవెంట్ మేనేజ్ మెంట్ వ్యాపారం ఎలా పుట్టిందంటే ? [Sep. 15 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/blog-post_15.html
444. ఓదార్పు యాత్ర ఈటీవీ సీరియల్‌లా సాగుతోంది ఎందుకంటే…. [జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 07] [Sep. 20 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/07.html
445. అంతా ‘పై బాసు/బాసిని’ ల గొప్పదనం![Sep. 23 , 2010][111 Page]
http://ammaodi.blogspot.com/2010/09/blog-post_23.html
446. దీపాలు మింగే ఉండ్రాళ్ళ తద్దె![Sep. 24 , 2010]
http://ammaodi.blogspot.com/2010/09/blog-post_24.html
447. అవినీతి – చేపల కంపు – సుగంధ వేళ్ళు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 24][Sep. 28, 2010]
http://ammaodi.blogspot.com/2010/09/24.html
448. విశ్వవేదికపై భారతీయ హృదయరాగం – కామెన్వెల్త్ ప్రారంభ సంరంభం![Oct. 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/10/blog-post.html
449. ఆర్దిక సిద్ధాంతాలన్నీ కాగితపు సత్యాలు, మిధ్యాపులులు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 25][Oct. 06 , 2010]
http://ammaodi.blogspot.com/2010/10/25.html
450. అమలు ఎవరిదైనా, పధక రచన ఒకరిదే ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 26][Oct. 07 , 2010]
http://ammaodi.blogspot.com/2010/10/26.html
451. దారి మెలికలు తిరిగినా తూర్పుకే ప్రయాణిస్తే! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 27] [08/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/27.html
452. మృత్యుబాండ్ల వ్యాపారం ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 28] [09/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/27_09.html
453. ఈ గోపాల్ ఎవరు? – ఎక్కడో లొసుగుంది? [11/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/blog-post_11.html
454. చిల్లపెంకుల బిందె వ్యాపారం కోట్లాది రూపాయలు ![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 29] [13/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/29.html
455. బ్రాంచ్ లిమిట్ – మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 30] [15/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/vs-30.html
456. వినూత్నంగా ఆలోచిస్తే విజయం మనదే! – విజయదశమి శుభాకాంక్షలతో…. [17/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/blog-post_17.html
457. వడ్డీ ఎక్కువా? – డివిడెండ్ ఎక్కువా?[భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 31] [23/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/31.html
458. షేర్లు – ‘నత్తల నడకల మీదా, పీతల పరుగుల’ మీదా పందేలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 32] [29/10/10]
http://ammaodi.blogspot.com/2010/10/32.html
459. సంపుటి (e-మ్యాగజైన్ -పక్షపత్రిక) ఆహ్వానం![01/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/e.html
460. సామాన్య మదుపరులు రాజ హంసలు కారు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 33] [03/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/33.html
461. లేమాన్ బ్రదర్సే కాదు, లయన్ బ్రేవరీస్ కూడా![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 34] [04/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/34.html
462. కట్టాలున్నా కిట్టుడి నవ్వు! – దీపావళి శుభాకాంక్షలతో… [05/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/blog-post.html
463. నెం.10 వర్గానికి, నెం.5 వర్గం ఇచ్చిన `బంపర్ ఆఫర్’![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 35] [08/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/10-5-35.html
464. అమ్మతనం ఎంత కమ్మనో... భగవంతుని ప్రేమా అంతే తియ్యన! [09/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/blog-post_09.html
463. పచ్చి అబద్దాలు – పక్కా 420 తనం కాదా? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 36] [19/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/420-36.html
464. మరికొన్ని వివరాలు తెలిస్తే చెప్పగలరా? [20/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/blog-post_20.html
465. రోల్స్ రాయల్స్ కారుకు ఆర్డర్ – ఫ్రిజ్జ్ కు లైఫ్ టైమ్! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 37] [22/11/10]
http://ammaodi.blogspot.com/2010/11/37.html
466. [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 38] [23/11/10] http://ammaodi.blogspot.com/2010/11/38.html

నాబ్లాగు చుట్టాలందరికీ ఒక విషయం స్పష్టపరచాలి. ఇది నేను ఊసుపోకనో లేక కాలక్షేపానికో వ్రాయలేదండి. అలాగే ఏదీ ఆశించి కూడా వ్రాయటం లేదు.

నేను 17+ ఏళ్ళుగా పోరాడి, అనుభవించి తెలుసుకున్న నిజాన్ని చెప్పడానికి వ్రాస్తున్నాను.
చాలామంది ఎవరీ నకిలీ కణికుడనీ, అతడికీ మనకీ సంబంధం ఏమిటని అడిగారు. మరికొంత మందికి ’నేనెవరూ, నేను చెబుతున్నది ఎంత వరకూ నిజం?’ అన్న కుతుహలమో లేక సందేహమో కలిగింది.

అందుకే ఈ చిన్న వివరణ.

నా పేరు ఆది లక్ష్మి. నా భర్త పేరు లెనిన్ బాబు. మా పాప పేరు గీతాప్రియ. ఇదీ నా కుటుంబం.

ఇక నా నేపధ్యం -

అదీ 1992 వ సంవత్సరం. అప్పటికి నేను అవివాహితని. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెలూ, ప్రేమాను బంధాలున్న కుటుంబం. అప్పటికి వృతిరీత్యా నేను Lead Acid Batteries Manufacturerని. ఆరోజుల్లో 45 లక్షల రూపాయల విలువ గల చిన్న తరహా పరిశ్రమని నడుపుతుండేదాన్ని.

మహిళా పారిశ్రామికవేత్తగా 1989 లో నాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ గారి చేత ప్రారంభించబడిన సంస్థనాది. ఉత్తమ మహిళా జౌత్సహిత పారిశ్రామికవేత్తగా 1990లో నాటి గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ నుండి బహుమతి అందుకున్న కెరీర్ నాది. ఫ్యాక్టరీ నడపడంలో ఒడిదుడుకులెదుర్కొన్న ఇండస్ట్రీయలిస్టుగా నా అనుభవాన్ని COUP ON BUSINESS FIELD లోని ఓ అంశంలో ఆంగ్లంలో ప్రస్తావించాను.

ఈ నేపధ్యంలోనే - అయోధ్య రామమందిరపు వివాదం విషయమై బి.జె.పి. రాజకీయ డ్రామాలు భారీ ఎత్తున నడుస్తున్న నేపధ్యంలో పాతబస్తీ అల్లర్లలో చాలామంది కత్తిపోట్లకు గురయ్యారు. 11 నెలల పసిపాప ముఖం మీద ఎడమ నొసటి దగ్గర నుండి ముక్కు మీదగా కుడి చెంప వరకూ 11 కుట్లు పడిన [కత్తిపోటు బాధితురాలు] ఫోటో ఇండియా టుడే [నాకు గుర్తున్న వరకూ అదే పక్షపత్రిక] కవర్ పేజీగా ప్రింటయ్యింది.

అది చూసి నాకు భరించలేనంత బాధ కలిగింది. మొన్న ముంబాయి ముట్టడి చూసినప్పడు మీరంతా ఎంత రగిలిపోయారో, నేను అప్పడంతగా రగిలిపోయాను. అదే సమయంలో మన దేశం మీద జరుగుతున్న గూఢచార కుట్రలు[నిజానికి అవి గూఢచార కుట్రలని తరువాత తెలిసింది] దైవికంగా నాకు తెలిసింది. అది నా కర్తవ్యాన్ని నాకు తెలిపింది.[పాఠశాలలో ఆదర్శవంతమైన విద్యార్ధిని కదా!]

ఆ వివరాలన్నిటితో నాటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు కి ఫిర్యాదు [Confidential Complaint ] ఇచ్చాను. అదీ ప్రారంభం.

అప్పటి నుండి అంటే 1992 నుండీ నేటి వరకూ 16 ఏళ్ళుగా నా జీవితంలో అదే అనివార్య పోరాటం. ఆ పోరాటంలో పారిశ్రామికవేత్తగా నా కెరియర్ పోగొట్టున్నాను. ఎంసెట్ ఫిజిక్సు లెక్చరర్ అవతారం ఎత్తాను. తర్వాత అక్కడ నుండి క్రమంగా చిన్నపిల్లలకు పంతులమ్మ నయ్యాను. కుటుంబం విచ్ఛిన్నమైంది. నా నిజమైన స్నేహితుడు నా భర్త. 16 సంవత్సరాలుగా మేమిద్దరం పోరాటం చేస్తున్నాం.

ఆర్ధిక దృష్ట్యా పై మెట్టు మీద నుండి క్రింది మెట్లకు దిగాను. [అది పూర్తిగా Organized harassment]. ఆత్మోన్నతి దృష్ట్యా లేదా ఙ్ఞానపు దృష్ట్యా అయితే క్రింద మెట్టు పై నుండి పైకి ఎక్కాను.

పదహారు సంవత్సరాల పోరాటం, నాకు జీవితంలో మరింత toughness నీ, పరిశీలననీ నేర్పింది. నిజానికి భగవద్గీతే మార్గదర్శనం చేసింది.

నా పోరాటంలో నేను తెలుసుకున్న కుట్ర స్వరూపాన్ని సాక్ష్యాధారలతో సహా, తార్కికంగా, దృష్టాంత సహితంగా మీముందు ఉంచుతానని గత టపాల్లో వ్రాసాను.

నిజానికి పదహారు సంవత్సరాల పోరాటంలో పరిశోధనల్ని ఆంగ్లంలో అక్షరబద్దం చేయడానికి చాలా సమయం పట్టింది. అలాగయ్యి కూడా నా అలోచనలని సంపూర్ణంగా అక్షరబద్దం చేయలేదు. అలా వ్రాయలంటే నాకు చాలా కాలం పడుతుంది. సాక్ష్యాధారాలు అంటే Documentary Evidence 2000 నుండి సేకరించాను.

`నకిలీ కణికుడెవరూ, మన మీద అతని కుట్ర ఏమిటి అన్న ఆసక్తి తో ఆలోచిస్తూ, తెలుసుకోవాలన్న ఙ్ఙిఙ్ఞాస గల తోటి బ్లాగర్లు నా ఆంగ్ల బ్లాగ్ COUPS ON WORLD లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

దాన్ని దఫాల వారీగా తెలుగులోకి అనువదిస్తున్నాను. నేనిచ్చిన సమాచారం తో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు గారు తీసుకున్న చర్యలు, పర్యవసానంగా మారిన భారతదేశం దిశ, అలాగే నా జీవితంలోని మార్పులు COUP ON INDIAN POLITICS లో వివరంగా వ్రాసాను. అదే విషయాన్ని EVENTS’ LIST లోనూ క్లుప్తంగా అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఆదివారంనాడు, హోలీ పండుగ సందర్భంగా ఓ కథనీ, మన జీవితాల్లో దాని అనువర్తననీ వ్రాసి నా బ్లాగు మిత్రులని అలరించాలని ఇది వ్రాస్తున్నాను. ఇది నేను డిగ్రీ చదువుతుండగా మా జేకేసీ కళాశాల గ్రంధాలయం నుండి తెచ్చుకున్న పుస్తకంలో చదివాను. ఏ ఉపనిషత్తులోదో తెలియదు గానీ ఉపనిషత్కథ గానే చదివినట్లు గుర్తు.

ఇక నేరుగా కథలోకి!

అనగా అనగా....

ఓ అడవిలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయన అఖండ తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞానపూర్ణుడు, శాంతమూర్తి. భవిష్యద్వర్తమానాలని తిలకించగల ద్రష్ఠ. ఆయన దగ్గర ఓ శిష్యుడుండేవాడు. ఎంతో శ్రద్ధాభక్తులతో గురువుని సేవించేవాడు. గురువు సైతం శిష్యుణ్ణి వాత్సల్యంతో ఆదరిస్తూ జ్ఞాన బోధ చేస్తుండేవాడు. ఆశ్రమంలో ఇంకా ఇతర శిష్యులున్నా గురువుగారికి ఇతడంటే ఆదరణ ఎక్కువ. అందుకు తగ్గట్టే శిష్యుడు కూడా వినయశీలి, జ్ఞాన తృష్ణ, గురుభక్తి కలవాడు.

ఇలా ఉండగా... గురువుగారికి మరణ సమయం ఆసన్నమైంది. అశ్రునయనాలతో శిష్యుడు గురువుకి శుశ్రూష చేస్తున్నాడు. గురువు శిష్యుణ్ణి చేరబిలిచి "నాయనా! జన్మంతా తపమాచరించినా, గత జన్మ పాపఫలం ఇంకా అనుభవింప వలసే ఉంది. మరుజన్మలో నేను పందినై పుడతాను. పుట్టిన రెండు ఘడియల లోపల తనువు చాలిస్తే శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతాను. లేనట్లయితే మరికొన్ని కర్మల నాచరింపక తప్పదు. పంది జన్మ అయినందున, పాపమే చేస్తానో పుణ్యమే చేస్తానో? ఆయా చర్యల ఫలితంగా మరికొన్ని జన్మలెత్తక తప్పదు. కాబట్టి, నాయనా! గురుదక్షిణగా నువ్వు నాకోసం ఓ పని నిర్వహించాలి. నేను ఫలానా ప్రదేశంలో, ఫలానా సమయంలో ఫలానా చోట ఓ పందికి పుట్టిన పదిపిల్లల్లో ఒకటిగా పుడతాను. నా నుదుట ఓ తెల్లని మచ్చ ఉంటుంది. ఇదే గుర్తు! నువ్వు నేను చెప్పిన చోటుకు, ముందుగా చేరుకొని, నేను పంది పిల్లగా జన్మించిన వెంటనే నన్ను చంపివేయి. ఇదే నేను నిన్ను కోరే గురుదక్షిణ!" అన్నాడు.

శిష్యుడు విభ్రాంతి చెందాడు. తేరుకొని వినయంగా గురువు పాదాలు తాకి "మీ ఆజ్ఞ శిరసావహిస్తాను,. గురువర్యా!" అన్నాడు. గురువు మరుజన్మ వివరాలు చెప్పి చిరునవ్వుతో ప్రాణాలు విడిచాడు. ఈ శిష్యుడు, ఇతర శిష్యులతో కలిసి గురువుగారికి దహన సంస్కారాది ఉత్తర క్రియలన్నీ నిర్వహించాడు.

తర్వాత గురువు గారు చెప్పిన చోటుకి వెళ్ళాడు. అక్కడ నిండు చూలుతో ఓ పంది కన్పించింది. శిష్యుడు తనతో తెచ్చుకున్న కత్తితో సిద్దంగా ఉన్నాడు. గురువు గారు చెప్పినట్లే, ఆ పంది నిర్ధిష్ట సమయంలో పది పిల్లల్ని కన్నది. అందులో ఒక పిల్ల నుదుట తెల్లని మచ్చ ఉంది. అది మిగిలిన పంది పిల్లల కంటే భిన్నంగా ఉంది. శిష్యుడు దాన్ని గుర్తించాడు. వెంటనే తన చేత నున్న కత్తితో దాన్ని చంప నుద్యుక్తు డయ్యాడు.

ఆ చిన్న పందిపిల్ల ఒక్కసారిగా మానవ భాషలో మాట్లాడసాగింది. పూర్వ జన్మలో తన గురువైనందున ఆ పందిపిల్ల మానవ భాషలో మాట్లాడ గలుగుతోందో, గురువు ఆశీస్సుల వల్ల తానే దాని భావనలని భాషగా విన గలుగుతున్నాడో, అర్ధం కాని అయోమయంలో శిష్యుడుండగానే.... ఆ పందిపిల్ల.... "ఏమయ్యా! మనిషివి. అందునా చూడబోతే విద్యాబుద్దులు నేర్చిన వాడిలా ఉన్నావు. నేను చిన్న ప్రాణిననే కదా చంపే పాపానికి ఒడిగట్టావు? నేను నీకేం ద్రోహం చేసానయ్యా?" అంది.

శిష్యుడు నివ్వెర పడ్డాడు. అతడేదో అనబోయేంతలోనే అది "ఏం మనుషులయ్యా మీరు? మళ్ళీ చెప్పడానికి ఇన్ని నీతులు చెబుతారు? చిన్నపిల్లని. పుట్టి అరఘడియ కాదు గదా, కొన్ని క్షణాలైనా కాలేదు. ఇంకా తల్లి పాల తీయదనాన్నైనా చవి చూడలేదు. తల్లి కడుపు మీద వాలి, పొదుగులోకి తలదూర్చి, తనివితీరా తల్లి ప్రేమని ఆనందించనైనా లేదు. ముక్కు పచ్చలారని పసిదాన్ని. లేత ఒంటితో గునగునలాడుతున్న నన్ను చంపేందుకు, నీకు చేతులెలా వచ్చాయి? దుర్మార్గుడా! నీకు పాప పుణ్యాల చింతనైనా లేదా?" అంది.

అప్పటికి శిష్యుడు కొంత తమాయించుకున్నాడు. "అయ్యో! ఇదేమిటి స్వామీ!? పూర్వజన్మలో మీరు నాకు గురుదేవులు. మీ ఆజ్ఞ ప్రకారమే, ఈ జన్మలో పందిగా పుట్టిన మిమ్మల్ని సంహరించ వచ్చాను. మీకు గుర్తులేనట్లుంది" అన్నాడు.

పందిపిల్ల కోపంగా "చాలు చాల్లేవయ్యా! మహా చెబుతున్నావు. నీకు నచ్చిన కథలన్నీ చెబుతున్నావా ఏం? ఎవరు నువ్వు, ఎవరు నేను? పోయిన జన్మలో నేను నీ గురువునా? నువ్వు నా శిష్యుడివా? ఎవరు చూసొచ్చారు? ఇలాంటి కథలు, అభూతకల్పనలు చెప్పి, బలహీనులైన మాలాంటి అల్పప్రాణుల మీద అధిక్యత చూపాలని, అణచి వెయ్యాలని చూస్తున్నట్లున్నావు. అదేం కుదరదు" అంది.

శిష్యుడు సహనంగా "ఇప్పుడు పందిపిల్లగా ఉన్నారు గనుక మీరు గ్రహించలేకుండా ఉన్నారు గానీ, పంది జన్మలో ఏమున్నది గురువర్యా? సమయం దాటితే మోక్షసిద్ది పొందే అర్హత కోల్పోతారు. కాబట్టి మిమ్మల్ని కడతేరుస్తాను. అదే నాకు గురువాజ్ఞ" అన్నాడు.

పందిపిల్ల ఖస్సుమంటూ "మోక్షమా మరేమన్నానా? ఏం చెబుతున్నావు? అయినా ఈ బురదలో ఎంత సుఖముందో నీకేం తెలుసు? మెత్తటి ఈ బురదలో దొర్లుతూ, తోటి పందులతో తోసుకుని ఘర్ణిల్లుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది! నీకు నీ ఆశ్రమంలో, గున్నమామిడి చెట్టు క్రింద, ధ్యాన సమాధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, నాకు ఈ బురద గుంటలో పొర్లాడుతుంటే అంత ఆనందంగానే ఉంటుంది. నీ ఆనందం నీది, నా ఆనందం నాది. నీ జన్మ, నీ ఆనందం, నీకు గొప్ప. నాకు నా జీవితం గొప్ప. తీయని తాజా పళ్ళు తింటూ నీ వెంత తృప్తి పొందుతావో, కుళ్ళి కంపెత్తుతున్న వ్యర్థాలని తింటూ నేనూ అంతే తృప్తి పొందుతాను. అయినా మోక్షసిద్ది అంటూ ఏదేదో చెబుతున్నావే! తల్లి ఒడిలోని చిన్నిపిల్లని, నీకు ఏ కీడూ చేయని దాన్ని , నన్ను చంపేందుకు నీకు ’పాపం’ అన్న భయంగానీ లేదా? ఇంత ముద్దుగా ఉన్నానే! నన్ను చూసి జాలి కూడా కలగటం లేదా? ఎంత కఠినాత్ముడివయ్యా నువ్వు?" అంది.

శిష్యుడికి ఓ క్షణం పాపభీతి తోచింది. వంద సందేహాలు వచ్చాయి. నిజమే! ఈ పందిపిల్ల తనకి ఏ కీడూ చెయ్యలేదు. అది తనకి ఆహారం కూడా కాదు. దాన్ని చంపి పాపం మూటగట్టుకుంటానా? అనిపించింది. తన ప్రాణం కోసం అది చేస్తున్న వాదన, ప్రతిఘటన సరియైనవనిపించింది. కత్తి వెనక్కి తీసుకున్నాడు.

అంతలో గురువు గారు చెప్పిన సమయం మించి పోతున్నదని గుర్తుకు వచ్చింది. "ఈ జన్మలోని ఈ పందిపిల్ల తన గురువు కాదు. గత జన్మ లో తన గురువు కావచ్చు, కాకపోవచ్చు. పందిపిల్ల అన్నట్లు జన్మలుండనీ, ఉండక పోనీ! ఆ మీమాంస తనకి అనవసరం. తాను తన గురువుకి మరణ సమయంలో మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే ఇక్కడికి వచ్చాడు. ఈ సమయంలో ఇక్కడ పుట్టిన ఈ పందిపిల్లని చంపుతానన్నాడు. ఇచ్చిన మాట తప్పటం సరికాదు. అదీ గురు దక్షిణంగా సమర్పిస్తానన్నాడు. ఈ పందిపిల్లని చంపడం వల్ల తనకి పాపమే రానీ గాక! పాప పరిహారం కోసం, మరింత కష్ట పడి సాధన చేస్తాను. అంతే తప్ప, గురువు గారికి ఇస్తానన్న గురు దక్షిణ ప్రమాణం తప్పను.

అంతే కాదు. తనకు గురువు ఇచ్చిన ఆజ్ఞతోనే నిమిత్తం కానీ, ఈ పందిపిల్ల సంవాదంతో ఏ నిమిత్తమూ లేదు. గురువు తనకి చెప్పిన పని ’ఈ పందిపిల్లని చంపడం’. దాంతో తనకి పాపమే రానీ, పుణ్యమే రానీ! అది ఫలితం. తనకి ఫలితంతో పనేమిటి? చెప్పిన పని చేయటం వరకే తన ధర్మం. శిష్యునిగా గురువాజ్ఞ పాటించడం తన కర్తవ్యం. ఫలితం ఏమైనా గానీ!" - ఈ విధమైన స్థిర నిశ్చయానికి రాగానే శిష్యుడు మరిక ఆలస్యం చేయలేదు. నిర్ణీత సమయం ముగియక ముందే పందిపిల్లని హతమార్చాడు.

మరుక్షణం, కళ్ళ ఎదుట దేదీప్యమాన తేజస్సుతో, దివ్య శరీర ధారియై గురువు సాక్షాత్కరించాడు. శిష్యుడు వినమ్రంగా నమస్కరించగానే "నాయనా! నన్ను ముక్తుణ్ణి చేశావు. నీకివే నా ఆశీస్సులు!" అంటూ గురువు చేయెత్తి దీవించాడు.

శిష్యుడు ఆతృతగా "గురువర్యా! దివ్య జ్ఞాన సంపన్నులు మీరు! భవిష్యత్తు ను దర్శించగల ప్రభావశీలి! అలాంటి మీరు, పంది జన్మ మీద అంత పెనుగులాడారేమి స్వామి? ఇది నాకు అర్ధం కాలేదు. దయచేసి నా సందేహ నివృత్తి చేయండి" అని అడిగాడు.

గురువు చిరునవ్వు నవ్వి "నాయనా! అదే మాయా మోహం! ఎంతటి వాడైనా ఆ మాయ అనే బురద [రొచ్చు]లో పడితే అంతే! అదే పరమ సుఖమనీ, శాశ్వతమనీ అనుకుంటారు. నాయనా, మాయ దాట సాధ్యం కానిది. దైవకృప ఉంటేనే దాటగలం. ఇప్పుడు నువ్వు, పందిపిల్ల చేసిన సంవాద ప్రభావంతో నా ఆజ్ఞ మీరి ఉంటే, నీకు అప్పగించిబడిన పనిని సందేహరహితంగా, ఫలాపేక్షరహితంగా చేయనట్లయితే, నాకు ముక్తి లభించి ఉండేది కాదు. ఆ విధంగా నిన్నూ నన్నూ కూడా దైవమే రక్షించింది. ఆ దైవకృప మనమీద ఉండాలంటే మనం సాధన చేయాలి. ఇది ఎవరికైనా తప్పదు" అన్నాడు.

శిష్యుడు సంతోషాంతరంగంతో గురువుకి ప్రణామాలర్పించాడు. గురువు శిష్యుణ్ణి, ధర్మార్ధ కామమోక్ష సాధనలో సాగమని దీవించి అంతర్హితుడైనాడు.

ఇదండీ కథ!

నిజానికి ఈ కథ.... శిష్య, సూకర సంవాదంగా, సుదీర్ఘంగా సాగిన గ్రంధం! అప్పటికి నాకు అవగాహన లేని రీత్యా నాకు అర్ధమైంది తక్కువ. అందులో గుర్తున్నంత వరకూ ఇప్పుడు వ్రాసాను. జన్మాంతర స్థితిగతుల గురించి, జన్మ రహితాలని, జన్మ రాహిత్యాలని తర్కిస్తూ, ఆత్మ శరీర సంబంధాలని కూడా ఆ గ్రంధంలో చర్చించారు. అప్పటికే జేగురు రంగుకు తిరిగిన కాగితాలతో ఉన్న పాతగ్రంధం అది. బహుశః ఇప్పుడు లభ్యం కూడా కాదేమో! ఎవరికైనా, ఇది ఏ ఉపనిషత్తు లేదా ఇతర గ్రంధంలోదో తెలిస్తే చెప్ప వలసిందిగా నా విన్నపం.

ఇక మన జీవితాల్లో ఈ కథ అనువర్తన ఏమిటంటే - మనం కూడా మాయామోహంలో పడి, పెద్దలని తూలనాడుతూ ఉంటాము. మంచి చెప్పవచ్చిన వారిని, హితవు కోరిన వారినీ, చాలు పొమ్మంటాము. స్వానుభవం తర్వాత గాని మనకదంతా తెలిసి రాదు. ఎందుకంటే మాయా ప్రభావం తత్కాల సుఖమై ఉంటుంది. అబద్దం తీయగా, నిజం చేదుగా ఉండటం సహజం కదా!

ఉదాహరణకి ధూమపానమో, మద్యపానమో వ్యసనమై ఉందనుకొండి. ’వద్దురా బాబూ, ఒళ్ళూ ఇల్లూ గుల్లవుతుంది!’ అంటే, సదరు వ్యసన పరులు ఏమంటారు? నీతులు చెప్పింది చాల్లే పొమ్మంటారు. ’ఇది కాదు నాయనా జీవితం! దీనికి భిన్నమైన దృక్పధం ఒకటుంది’ అంటే, నచ్చని వాళ్ళు ఏమంటారు? ’నీకు నీ అభిప్రాయం ఎంత గొప్పో, మాకు మా అభిప్రాయమూ అంతే గొప్ప’ పొమ్మంటారు. అనుభవం తర్వాత నిజం తెలుసుకునేటప్పటికి జీవితం కాస్తా ముగింపుకి వచ్చేస్తుంది. జీవిత చరమ దశలో జీవిత సత్యాలు తెలుసుకుని లాభమేముంటుంది? అప్పటికి ఆచరించేందుకు సమయమూ, ఓపిక ఉండవు కదా!

కాబట్టే మాయ దాట శక్యం కానిది. దైవకృప ఉంటేనే అది దాటగలం. దీన్నే గీతాశ్లోకాలు

శ్లోకం:
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే

భావం:
దివ్యము, త్రిగుణాన్వితమూయైన నా మాయ దాట శక్యం గానిది. నన్ను శరణు వేడే వాళ్ళు మాత్రమే ఈ మాయను తరించగలుగుతారు.

శ్లోకం:
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
మాయ యా2పహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః

భావం:
రాక్షసభావ యుతులూ, మాయావృతమేధావులూ, దుష్కృతులూ, మూర్ఖులూ, నీచులూ నన్ను ఆశ్రయించలేరు.

శ్లోకం:
చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2ర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్థార్దీ జ్ఞానీ చ భరతర్షభ

భావం:
భరతశ్రేష్ఠా! ఆపదల్లోపడిన వాడు, జిజ్ఞాసువు, సంపదల్ని కోరేవాడు, జ్ఞానీ - యీ నాలుగు విధాల పుణ్యాత్ములే నన్ను సేవిస్తారు.

అందరికీ హోలీ శుభాకాంక్షలతో.....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం, నెం.5, నెం.10 వర్గాల ప్రభావము మేం గుర్తించుకోక ముందూ, గుర్తించుకున్నాక కూడా కొనసాగాయి, కొనసాగుతునాయి. కొన్ని వేల సంఘటనలని[అతిశయోక్తి కాదండి. నిజంగానే వేల సంఘటనలు] పరిశీలించుకున్న తర్వాత ఈ నిర్దారణకి వచ్చాము. జీవితంలో వేధింపులే కాదు మధుర జ్ఞాపకాలు కూడా కనపడ్డాయి.

ఓ సారి.... 1995 లో మేం శ్రీశైలంలో పాతాళగంగ మెట్ల దారిలో గుడిసెలో ఉండేవాళ్ళం. అప్పటికి నేను నిండు గర్భిణిని. అప్పటి వరకూ మాతో కాస్త బాగానే ఉండే ఇరుగుపొరుగు గుడిసెల వాళ్ళు కూడా, హఠాత్తుగా మొహం తిప్పుకోవటం మొదలు పెట్టారు. చెప్పుకునేంత కారణాలు కూడా ఏం లేవు. అయినా ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉండటం మొదలు పెట్టారు. బహుశః త్వరలో మాకు తమ అవసరం వస్తుంది ఎందుకొచ్చింది? అనుకున్నారేమో!

అప్పటికి గ్రామసేవిక.... నాకు, గర్భస్త శిశువుకి, ఇవ్వాల్సిన ఇంజక్షన్లు ఇస్తూ ఉండేది. ఆమె, ఇంకా వారానికి గాని కాన్పు రాదన్నది. అప్పట్లో ప్రతిరోజూ గుడికి వెళ్ళేవాళ్ళం. రాత్రి 9.30 గంటల తర్వాత మల్లయ్య స్వామి ఉచిత దర్శనం చేసుకునేవాళ్ళం. నిజానికి స్థానికులని ఎవరూ ఆపరు. కాని ఆపుతారేమోనని భయం కొద్దీ టిక్కెట్టు దర్శన వేళలో వెళ్ళేవాళ్ళం కాదు. [ఇప్పుడు ఏ వేళయినా ఉచితదర్శనమే!] ప్రతీరోజూ రత్నగర్భ గణపతి ముందు "నాకు పాపే కావాలి స్వామి. విద్యల ఒజ్జవు, సద్బుద్ది గల చక్కని పాపనివ్వు" అని మొక్కుకునే దాన్ని.

అప్పటికి కాన్పు సమయానికి ’ఎవ్వరు సాయం రాబోము’ అన్న సంకేతాలిస్తున్నారని అర్ధమైపోయింది. అందుకు మానసికంగా వారంక్రితమే సిద్దపడి పోయాము. మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకున్న [ఆర్.ఎం.పి. డాక్టరు] మా విద్యార్ధి ఒకరి దగ్గరి నుండి ’Where there is no Doctor' అనే పుస్తకం తెచ్చుకుని చదువుకున్నాము.

మా ఇంట్లో నా చిన్నప్పటి నుండి ఆవులూ, గేదేలూ ఉండేవి. నేను ఆవుపాలతో పెరిగాను. మా నల్లమ్మ[ఆవు] మా ఇంట 21 ఈతలు ఈని పాతికేళ్ళపాటు మమ్మల్ని సాకింది. ఆమె [అలా అనటమే అలవాటు], ఆమె దూడలు ఈనినప్పుడల్లా.... మా నాన్న, పుట్టిన బుజ్జాయికి, తల్లి ఆవుకి సపర్యలు చేసేవాడు. అప్పుడు మా నాన్నకు నేను, కావలసిన వస్తువులు అందిస్తూ సహాయం చేసేదాన్ని. ఆ అనుభవంతో మా వారికి కాన్పు ఎలా జరుగుతుందో, బొడ్డు కోయటం ప్రక్రియల గురించి వివరణ ఇచ్చాను. ఆ పైన ’డాక్టరు లేని చోట’ అన్నపుస్తకం చదివి మరింత అవగాహన తెచ్చుకున్నాము. కొత్త బ్లేడు ఒకటి కొని తెచ్చుకున్నాము. శ్రీశైలానికి ప్రక్కనే 9 కిలోమీటర్ల దూరంలో సున్నిపెంటలో ప్రాజెక్ట్ ఆసుపత్రి ఉంది. కానీ ఆసుపత్రికి వెళ్ళెందుకు మా దగ్గర డబ్బుల్లేవు.

మా గుడిసెకు ఎదురుగా, టీకొట్టు నడిపే ఆమె మంత్రసాని పని కూడా చేసేది. మా ప్రక్క గుడిసెలో ఉండే మహిళకి అంతకు అయిదారు నెలల క్రితమే పురుడు కూడా పోసింది. అయితే నాకు కాన్పు సమయం దగ్గర పడే సరికి, సదరు మంత్రసాని కూడా, అప్పటి వరకూ మాతో కాస్త బాగానే మాట్లాడేది కూడా ముభావంగా ఉండేది. ఇక మేము మల్లయ్య, భ్రమరాంబల మీదే భారం వేసాము. ఆ రోజు రాత్రి కూడా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము.

అర్ధరాత్రి ఒంటిగంట దాటాక నాకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామ సేవిక, కాన్పుకి ఇంకా వారం సమయం ఉంటుందన్నది గనుక నేను వాటిని కాన్పు నొప్పులుగా అనుకోలేదు. కాస్సేపటికి ఓర్చుకోలేక, మా వారిని ఎదురు గుడిసెలోని మంత్రసానిని లేపమని చెప్పాను. వెళ్ళి లేపితే ఆమె వచ్చి నన్ను Assist చేసింది. ఎలాగో తెల్లవారింది. అప్పటికి ఉన్న పరిస్థితులన్నీ హఠాత్తుగా మారిపోయాయి. సాయం చెయ్యడానికి చాలామంది ముందుకొచ్చారు. మా పూర్వవిద్యార్ధి వెళ్ళి జీపు తెచ్చాడు. చుట్టుప్రక్కల వాళ్ళ పరిస్థితులలో పెద్ద తేడా లేదు కాని ఒకరు మాత్రం సాయం చేసారు. ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టరు, నర్సులూ అందరూ ఎంతో ఆదరంగా చూశారు.

మేము ఆసుపత్రికి వెళ్ళే సమయానికి, మా వారి జేబులో 12/- రూ. ఉన్నాయి. మా పాప పుట్టిన గంటకి తన జేబులో 1200/- రూపాయలున్నాయి. మా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కొందరు, ఎదురింటి మంత్రసాని.... ఇలా, మా వారి జేబులో "ఉంచండి సార్!" అంటూ డబ్బు పెట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట నుండి ప్రసవ వేదన భరించిన నేను, మర్నాటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత, నా కళ్ళ ముందుకొచ్చిన నా పసిపాపని చూసుకుని అన్నీ మరిచిపోయాను. అది ఎప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని రోజు! నా సంతోషాన్ని, సంతృప్తిని మాటల్లో చెప్పలేను కూడా!

తలపై నల్లని టోపీ పెట్టినట్లు ఒత్తైన జుట్టుతో, తెరచిన గుప్పిళ్ళతో మా కోసం అంతులేని ఆనందాన్ని తెచ్చిందా అన్నట్లు పువ్వులాంటి నా పాప! అసలుకే పాపే కావాలి అని దేవుణ్ణి పదే పదే కోరుకున్నాను. రకరకాల బొట్లు, కాటుక దిద్దుకొని, రకరకాల జడలల్లుకుని అలంకరించుకోవచ్చునని నాకు పాపలంటే ఇష్టం! "అబ్బాయేముంది! ఎంత అల్లరి బుడుగులాంటి భడవైనా, ఇంత పౌడర్ ముఖాన వేసి, ప్రక్కపాపటితో క్రాపు దువ్వి, ఓ చొక్కా లాగు తగిలించి ’ఇక పోరా’ అంటే పోతాడు. పాపలకైతే అలాకాదు గదా?" అనుకునేదాన్ని. నాకు పాపలంటే ఇష్టమని నా శిష్యురాలొకామె, కొత్త సంవత్సరానికి, ముద్దుగా బొద్దుగా ఉన్న పాపాయి ఫోటోతో ఉన్న గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. అది చూసుకుంటూ పాపే కావాలి అని కలలు కనేదాన్ని.

మా పాప పుట్టిన రోజు నాడైతే.... నర్సుని "సిస్టర్! పాపా బాబా?" అని అడిగాను. "బాబు" అంది. ఒక్క క్షణం నిరాశ అన్పించింది. నర్సు నవ్వుతూ "కాదమ్మా పాపే!" అంది. నా కంటే ముందుగా మా పాపని మా వారే చూశారు, ఎత్తుకున్నారు.

ఆసుపత్రిలో మాకు ఎవరూ లేరని, డాక్టర్లు నర్సులూ సిబ్బంది చాలా ఆదరంగా చూశారు. అక్కడి ఆయా పాపని ఎలా ఎత్తుకోవాలో, స్నానం ఎలా చేయించాలో డెమో చూపించి నేర్పించింది. మమ్మల్ని డబ్బులు ఇమ్మని కూడా ఎవరూ అడగలేదు, ఒకామె తప్ప! కాన్పుల వార్డులో సాధారణంగా మగ వారిని allow చేయరు. అలాంటిది నాకు Assist చేయడానికి మా వారిని అనుమతించారు. ఆ సమయంలో మా వారే నాకు అన్నీ అమ్మలాగా చేశారు. మా పాప తెల్లగా పువ్వులా ముద్దుగా ఉండటాన్ని మేము చాలా ఆనందించాము.

మేము ఆసుపత్రిలో ఉండగా పరిచయమైన కుటుంబం ఖాసిం కుటుంబం. మేము ఆసుపత్రిలో ఉండగానే మా గురించి ఎవరో చెప్పారని, అటవీశాఖలో Non Government Organisation క్రింద పనిచేసే వనసంరక్షణ సమితిలో మా ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంది. ఆసుపత్రిలో ఉండగానే ఉద్యోగం రావటంతో, అప్పటి దాకా ఎన్నో సమస్యలతో ఉన్న మేము చాలా ఆనందించాము. జీతంలో సగం అడ్వాన్సు కూడా ఇవ్వబడింది. దాంతో ఏ ఇబ్బందీ లేకుండా మా పాప పుట్టిన 21 వ రోజు బారసాల జరుపు కున్నాము. మా గుడిసె వెనక వెదురుతో గుండ్రని పర్ణకుటీరం లా ఉండేది. ఎత్తుగా మట్టిపోసి మా వారు సిద్దం చేశారు. మా పాప పుట్టే నాటికి సిద్దం కావాలని, అడవిలో లోతట్టుకెళ్ళి లేత వెదురు బొంగులు తెచ్చి కట్టుకున్నాము. దానికి పైకప్పు ఉండేది కాదు. నేరేడు చెట్టు గుబురు కప్పులాగా నిండి ఉండేది.

మేం చీర ఊయలకి సెటిల్ అయ్యాము. కాని మా విద్యార్ధుల తల్లిదండ్రులు, తమకి తెలిసిన వాళ్ళ దగ్గర స్టాండ్ ఊయల ఉందని చెప్పి, మా విద్యార్ధి ద్వారా మా ఇంటికి పంపారు. దాన్ని అలంకరించి, అందులో మా పాప బారసాల నిర్వహించుకున్నాము. ఆమె పుట్టడానికి ముందే ’ఫణి గీతా ప్రియదర్శిని’ అన్నపేరు నిర్ణయించుకున్నాము. ఆ పేరే పెట్టుకున్నాము. అప్పటికే, మా గుడిసె గోడకి బయటవైపు ఉన్న కన్నంలో పెద్దపాము ఉండేది. దాదాపు ఆరడుల పాము. చాలా భయం వేసేది. చంపుదామా అంటే అందరూ ’అదెప్పుడో మేమక్కడికి రాకముందు నుండీ ఉండేదని, మధ్యలో ఎక్కడికో పోయి మళ్ళీ వచ్చి చేరిందనీ’ అన్నారు. నేను బట్టలు ఉతికి ఆరవేస్తుంటే అది కన్నంలోంచి తలబయటికి పెట్టి చూస్తూ ఉండేది. భయం భయంగా తిరిగే దాన్ని. మెల్లిగా అలవాటు పడిపోయాము. అందుకని మా పాప పేరులో నాగేంద్రుడి పేరు రావాలనుకున్నాము.

అంతేగాక, ఆమె నా బొజ్జలో ఉన్నప్పుడు - ఓ బుల్లి ఉడత పిల్లను పెంచుకునే దాన్ని. ఈదురుగాలికి గూట్లో నుండి పడిపోయిన చిన్నిది. పిల్లలకి దొరికితే నేను తీసుకుని పెంచుకున్నాను. అది మాకు దొరికినప్పుడు ఎంత చిన్నదంటే... చూపుడు వేలంత కూడా ఉండేది కాదు. కప్పుతో పాలు తాగడం వచ్చేది కాదు. దూదిని తల్లిరొమ్ములా చేసి, పాలతో తడిపి, చెంచా చివరన పెట్టి, చెంచాతో పాలు చుక్కల్లాగా పడేటట్లు చేసి, దాని నోట్లో పెట్టేదాన్ని. క్రమంగా కప్పులో పాలు తాగేంత పెద్దదయ్యింది. చిన్న వెదురు బుట్టలో పెట్టుకుని గుడికి వెళ్తున్నా తీసుకెళ్ళేదాన్ని. ’పప్పు’ అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం.

మా పాప పుట్టడానికి నెలన్నర ముందు.... ఓ రోజు వేసవి కావటంతో మా గుడిసె ముందు ఆరుబయట నిద్రపోయాము. రాత్రి నిద్రలో ఉండగా, నా జుట్టులో ఏదో కదులుతున్నట్లనిపించి మెలకువ వచ్చింది. నా ఉడుత పెల్లేమో అనుకొని "అరే పప్పు!" అంటూ చేత్తో తీసాను. చూద్దును గదా! నా చేతుల్లో మూరెడు పొడవున్న పాము! గభాలున దూరం విసిరి మా వారిని లేపాను. మేమున్నదే అడవి. పాములు రాక ఏముంటుంది? అనుకొని మళ్ళీ పడుకున్నాము.

ఈ రెండు అనుభవాలతో మా పాపకి నాగేంద్ర స్వామి పేరు పెట్టుకోవాలని మొక్కుకున్నాము. గీత మా ఊపిరి అయినందున ’గీత’ అన్న నామధేయం తప్పని సరి! నాకు ఇందిరాగాంధీ అంటే అభిమానం. నా పాప ఆమె అంతటి గొప్ప వ్యక్తి కావాలి అనుకొని, మొత్తంగా ’ఫణి గీతా ప్రియదర్శిని’ అన్న పేరు నిర్థారించుకున్నాము.

బారసాలకి శ్రీశైలంలో మా విద్యార్ధులనీ, వారి తల్లిదండ్రులని పిలుచుకొని, ఓ 50 మంది Gathering తో ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. అందరూ మమ్మల్ని ఎంతో ప్రేమగా, అభిమానంగా ఆదరించారు. నిజానికి ఇప్పటికీ మాకు శ్రీశైలంలోనే పరిచయస్థులు గానీ, మిత్రులు గానీ, ఆత్మీయులు గానీ ఎక్కువ. ఇంతగా మాకు ఎక్కడా ఎవరితోనూ పెద్దగా terms ఉండవు.

మా పాప బారసాల అయిపోయాక, నెల తిరిగే లోపలే ఎలా వచ్చిన ఉద్యోగం అలాగే ఊడింది. ఈ లోపున మాత్రం మన్ననూరు, బైర్లూటి వంటి ప్రాంతాలలో లోతుగా గిరిజనుల జీవన సరళి, ఆలోచనా సరళిని పరిశీలించాము. అటవీ శాఖలో అవినీతినీ, వాళ్ళ మీటింగులోనూ, చెక్ పోస్టుల్లోనూ, ఉద్యోగుల అంతర్గత సంభాషణల్లోనూ పరిశీలించి ఖంగు తిన్నాము; అది వేరే సంగతి. దీని గురించి గతటపాలలోనూ వ్రాసాను.

ఒక్క మా పాప బారసాలే కాదు, 2005 ప్రారంభంలో, మా పాపకు ఓణీలు వేసే ఉత్సవం సందర్భంలోనూ శ్రీశైలంలో స్కూలు నడుపుతున్నాము. నా ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె ఫంక్షను గొప్పగా నిర్వహించుకున్నాము. మా విద్యార్ధుల తల్లిదండ్రులని[ఓ 200 మంది] పిలిచి, విస్తరేసి అన్నం పప్పూ, నాలుగు కూరలు నెయ్యి గట్రాలతో తెలుగు వారి భోజనం పెట్టాలనుకున్నాము. బఫేలంటూ నిలబడి ఆదరాబాదరా తినటం, తినమనటం మాకు నచ్చదు. అడిగి వడ్డిస్తూ, అందరినీ పలకరిస్తూ ఇష్టంగా ఆ పండగ జరుపుకున్నాము. ఒకరిద్దరు తప్ప మేము పిలిచిన వాళ్లంతా వచ్చారు. వాళ్ళిచ్చిన కానుకల కంటే, అందరూ వచ్చి, తాముగా అన్నీపనుల్లో పాలుపంచుకొనటం! అదంతా మేమెంతో ఆనందించాము. ఒక్క శ్రీశైలంలో తప్ప మేము అలా ఎక్కడా నిర్వహించుకోలేమేమో!

అప్పుడే కాదు, మా పాప పుట్టాక కూడా.... 1995 లో మా పాప పుట్టాక మేము మళ్ళీ గుంటూరు వెళ్ళి పోయాము. అక్కడ ఫ్యాక్టరీ APSFC కి అప్పగించి, ఖాళీ చేసి, నంబూరులో, గుంటూరులో, ఉన్నప్పుడు.... దాదాపు మా పాపకి స్కూలు కెళ్ళే వయసు వచ్చే వరకూ, మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఆమెని దగ్గరుండి చూసుకున్నాము. తన శైశవాన్ని తొలి రెండు మూడేళ్ళు నేను చాలా ఆస్వాదించాను. మాతృత్వం లోని మాధుర్యం నేను తనవి తీరా ఆనందించాను.

అప్పట్లో నంబూరులోని కమిటీ కాలేజీలో ఓ రెండుగంటలు, అదీ ఇంగ్లీషు చెప్పేదాన్ని. నా సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినా వాళ్ళకి ఇంగ్లీషు లెక్చరర్ లేనందున నన్ను ఇంగ్లీషు చెప్పమన్నారు. ఉదయం సాయంత్రం ఇంట్లో ట్యూషన్లు చెప్పేదాన్ని. నాకు ఆదాయమే కాదు, నా బుడ్డి దానికి పిల్లలు ఇంటి నుండి బ్యాగుల్లో సున్నండలు, కారప్పూస లాంటివి తెచ్చి దానికి తినిపించేవాళ్ళు. ఆ విధంగా ఆమె పిల్లలతో కలిసి ఆడటమే గాక, వాళ్ళ ప్రేమని కూడా చవిచూసింది. అందుకే నేను ట్యూషన్లు చెప్పేదాన్ని. ఆ విధంగా తనకి ఎప్పుడూ ’ఒంటరిని’ అన్న పీలింగ్ రాలేదు/ రానివ్వలేదు.

మా వారు ప్రైవేటు కంపెనీలలో.... వాణిజ్యప్రకటనలకు రెప్ గా పనిచేసేవారు. నేనైతే మధ్యాహ్నం రెండుగంటలు కాలేజీకి వెళ్ళి వచ్చేంత సేపు తప్ప, రోజంతా మా పాపతో గడిపేదాన్ని. సాయంత్రం ఓ గంట జోలపాటల గానా బజానా! దోబూచి, దాక్కునే ఆట, కథలు! ఆమెతో రోజంతా ఆటలే! తనకి రెండున్నరేళ్ళ దాకా తల్లి పాలే పట్టాను. ఆమె బాల్యంలోని ప్రతి మూమెంట్ నీ, మధురమైన జ్ఞాపకంగా మిగిల్చుకున్నాము. చెబితే అదేపెద్ద గ్రంధం అయ్యేంతగా! ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డ అపురూపమే కదా!

ఇలా.... మా జీవితాలలో చేదుతో పాటుగా ఉన్న ఈ మాధుర్యాన్నంతా, 2005 ఆగస్టు, సెప్టెంబరులలో, రామోజీరావు ఉనికిని మా జీవితాలలో గుర్తించుకున్నాక, పునః పరిశీలించుకుని, పునరాలోచించుకున్నాము. 2005 అక్టోబరులో - ’1992 లో మేము పీవీజీకి, రామోజీరావు కార్యకలాపాల మీద ఇచ్చిన ఫిర్యాదు గురించీ, తదుపరి మాపై నడుస్తున్న వ్యవస్థీకృత వేధింపు గురించీ’ ప్రధాని మనోహన్ సింగ్ కి ఫిర్యాదు ఇచ్చాక అతడి స్పందన కోసం ఎదురుచూశాము. అలాంటి వేవీ రాకపోగా.... మా మీద ఒత్తిడి పెరగటం, నీళ్ళూ కరెంటు వేధింపులు పెరగటం గమనించాము. అప్పుడే శ్రీశైల దేవస్థానపు D.E.O ఫోనులో మమ్మల్ని హెచ్చరించాడు. అతడి వంటవాడే ఆ పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నాడనుకొని మేము పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. ఆ వివరాలన్నీ మీరు మా కథలో చదివి ఉన్నారు.

ఇవన్నీ పరిశీలించుకు ఆలోచిస్తున్నప్పుడు మాకంతా అయోమయంగా అన్పించేది. మేము రామోజీరావు మీద 1992లో ఫిర్యాదు ఇచ్చినప్పటి నుండి మొదలైన విచిత్రాలు, మా జీవితాల్లో ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చిన నెలరోజుల లోపల, అప్పటికీ ఢిల్లీలోనే ఉన్న నన్ను కలవకుండా, ఫ్యాక్టరీకి వెళ్ళి నా తల్లిదండ్రులని ఐబీ అధికారులు కలవటంతో ప్రారంభమైన విచిత్రాలూ, వింతలూ! సాక్షాత్తూ ఫిర్యాదు ఇచ్చిన నేను, 2 KM ల దూరంలో ఉంటే, 2000 KM ల దూరంలో ఉన్న మా అమ్మానాన్నల దగ్గరికి ఎందుకు?

అప్పుడు ప్రారంభమైన ’ఆలోచన - పరిశోధన’.... అన్నీకోల్పోయి, అయిన వాళ్ళనీ కోల్పోయి.... ఒంటరినై.... తోడుగా నిలిచిన లెనిన్ ని వివాహం చేసుకుని జంటగా కష్టాలు ఎదుర్కొని.... చివరికి అన్నీ మరిచిపోదామని గట్టి నిర్ణయానికి వచ్చి.... 1995 నుండి అసలేమీ ఆలోచించకుండా గడిపి వేశాము. దేశంలో కాదు గదా చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. మా బ్రతుకు - మా పాప -, మా కెరీర్ - భక్తి. అంతే! అదీ ఎంతగా దైవభక్తి అంటే.... చివరికి మా పాపకి చెప్పేవన్నీ దేవుడి కథలే! తన చిన్నప్పుడే రామాయణ భారత భాగవతాలన్నీ చెప్పేసాను. భట్టి విక్రమార్క కథలు... పంచతంత్రం కథలు .... మహాభక్తుల కథలు.... నాకు తెలిసిన అన్నీ! తిరుపతి కొండమెట్లు ఎక్కేలోపల దశావతారాల కథలూ పూర్తి చేసేదాన్ని. కనీసం పదివేల కథలు చెప్పి ఉంటాను తనకి.

తన చిన్నప్పుడు తనకి అమ్మమ్మ, తాతయ్య, మామయ్య ఎలా ఉంటారో తెలియదు కదా! అందుచేత అన్నం తినిపించేటప్పుడు "ఇది మల్లయ్య స్వామి ముద్ద. ఇది భ్రమరాంబ తల్లి ముద్ద. ఇది గోవిందుడి ముద్ద. రామయ్య తండ్రి.... సీతమ్మ తల్లి ముద్ద" ఇలా తినిపించేదాన్ని. పేచీ లేకుండా తినేసేది. ఇంకా నేను మరిచిపోతానేమోనని తనే " మీసాల సామి ముద్దా, రెక్కల సామి ముద్దా" అని అడిగి నోట పెట్టించుకునేది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆమె భాషలో మీసాల సామి. తిరుపతి మెట్ల దారి ప్రారంభంలోని గరుత్మతుని భారీ విగ్రహం తనకి చాలా ఇష్టం. అంచేత రెక్కల సామి ముద్ద ఇష్టమన్న మాట! ఎప్పుడైనా ఓ ముద్ద తక్కువ తింటే - "నీకు ఆంజనేయస్వామికీ, భీముడికీ ఉన్నంత బలం వద్దా?" అంటే చాలు, "ఆ ఆ" అంటూ నోరు తెరిచేది.

అంతగా భగవంతుడితో అనుబంధామూ, భక్తీ పెంచుకున్నాము. అందునా చుట్టపక్కాలూ లేరు. చుట్టుప్రక్కలా సాధారణ సంబంధాలే! దానితో అన్నీ దేవుడే!

పాప పెంపకం తాలూకూ ఏమయినా సమస్యలు వస్తే, ఈనాడు ’వసుంధర’లో పిల్లల పెంపకం తాలూకూ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు వచ్చేవి. సింగిల్ చైల్డ్ తాలూకూ సమస్యల గురించి హెచ్చరిస్తూ పరిష్కారాలు వస్తూండేవి. 2005 లో ఇవన్నీ ఆలోచిస్తూ, మేము గమనించి చూస్తే చాలా మంది సింగిల్ చైల్డ్ తాలూకూ సమస్యలతో బాధలు పడుతూ కనిపించారు/కనిపిస్తున్నారు. మరి అప్పుడు మమ్మల్ని ఎవరు హెచ్చరించారు?

ఇవన్నీ తలచుకు ఆలోచిస్తున్నప్పుడు మాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. దానితో పాటు మరెన్నో సందేహాలూ తలెత్తాయి. ఒక విషయం ఆలోచించి అవగాహన చేసుకునే కొద్దీ మరిన్నీ సందేహాలు తలెత్తేవి. ఒక తలుపు తెరిస్తే తెరవాల్సిన తలుపులు మరో పది కనబడినట్లు! అప్పట్లో [2005] రోజంతా స్కూలులో పిల్లలకి చదువు చెప్పేవాళ్ళం! ఉదయం ఆరుగంటలకి మొదలయ్యే స్కూలు దినచర్య రాత్రి 7.30 కి పూర్తయ్యేది. ఇక అప్పటి నుండి అర్ధరాత్రి 12 గంటల దాకా ఒకటే ఆలోచన! తర్క వితర్కాలు చేసుకునేవాళ్ళం!

అప్పటి నుండి సంవత్సరాల గడిచే కొద్దీ, మెల్లిగా, మాకు మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం అర్ధమైంది. రామోజీరావు వర్గమే గాక, అతడి ప్రత్యర్ధి వర్గపూ ఉనికీ అనుభవానికి వచ్చింది. ఇద్దరు, గూఢచర్యం అనే చదరంగపు ఆటగాళ్ళ చేతిలోని ఆట కూడా అర్ధమైంది. ఆ రెండు వర్గాలకీ నెం.10, నెం.5 వర్గాలని పిలిచాము. వెనుదిరిగి చూస్తే మా జీవితాల్లో మేం ఎదుర్కున్న ప్రతి అనుభవానికి శృతి, లయ కనిపించాయి. అలాగే రాష్ట్ర, దేశ, ప్రపంచంలోని ఏ సమస్యకైనా ఒకే శృతి, లయ, ఒకేరకమైన స్ట్రాటజీలు కనిపించాయి. ఇప్పుడంటే, ఈనాడు పత్రిక, మరీ రాష్ట్రానికి కుదించుకుపోయింది గాని, ఆ రోజుల్లో ప్రపంచవార్తలు బాగానే వ్రాసేది.

మమ్మల్ని వేధిస్తూ వెంటబడుతున్న వర్గం మా ప్రాణాలెందుకు తీయటం లేదో, మా ప్రాణాలు తీయనీయకుండా అడ్డుకుంటున్న వర్గం మమ్మల్ని వేధింపు నుండి ఎందుకు రక్షించడం లేదో ఆర్ధమయ్యేది కాదు. వేధించటం కన్నా ప్రాణాలు తీయటం సులభం. తమ మీద ఫిర్యాదు ఇచ్చామనే దుగ్ధ వేధింపుకు కారణం అయితే, ఆ పగకి ’పీక కోయటం’తో ప్రతీకారం తీర్చుకోవచ్చు. అది వదిలేసి.... ఇంత సమయం, ఖర్చు, ఓపికతో కూడుకొని వేధించటం ఎందుకు?

ఎవరికి ఫిర్యాదు చేసినా, వాళ్ళు న్యాయం చేయకపోగా, ఫిర్యాదులో నేను ఏ సమస్యనయితే చెప్పానో ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యేది. ’ప్రతి పావు నాదే అంటూ ఎవరూ నిన్ను రక్షించరు’ అని మాకు ఇంకించటానికి ప్రయత్నించేవాళ్ళని తర్వాత అర్ధమయ్యింది. ఆ విధంగా రామోజీరావు పరిధి ఎంతో.... బాగా అర్ధమయ్యింది. ఆయా వ్యక్తుల మధ్య, సంఘటనల మధ్య కార్యకారణ సంబంధాలు బాగా అర్ధమయ్యాయి.

అలాగని ఫిర్యాదు చేసిన ప్రతిసారీ, ’ఎందుకు ఫిర్యాదు చేస్తారు, ఫిర్యాదుతో సమస్యలు పరిష్కారం అవుతాయా’ అంటూ ఓ ఏడుపు వినిపింపబడేది. అదీ మాకు అర్ధమయ్యేది కాదు. అన్నీ చోట్ల తామే అడ్డుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ ఏడుపు! - ఇదీ మా ముందున్న ప్రశ్న , పరిశోధన. [ఇలా వరసగా ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పెట్టుకుంటూ పోతే, 17 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే.... రామోజీరావు off/on లతో, నిరూపింపబడ్డాడు.]

దీనితో రుడ్ యార్డ్ క్లిపింగ్ పద్యం,

I have six friends.
They taught me all I knew
They are What and Why
And When and Where and Which and Who.

మరింత అనుభవానికి కొచ్చింది.

దాంతో... ప్రతి దాన్ని పరిశీలించటం, పూర్వ జ్ఞాపకాలన్నీ తిరగతోడి ఆలోచించటం! కొన్ని వేల గంటలు అదో తపస్సులా చేశాము. గీత సాధన తో ప్రతీదీ పరిశీలించాము. ఈనాడు వ్రాతల్నీ పరిశీలించాము. ఎందుకంటే - 1992 లో నా ఈనాడు మిత్రురాలు చెప్పిన ’ఈనాడు వ్రాతల్లోని మతలబు’ లతోనే గదా నా పరిశీలిన ప్రారంభమైంది? ఆ విధంగా నిర్ధారించుకున్నాకే నేను పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు చేసాను.

అందుచేత ఈనాడు అక్షరక్షరాన్ని పరిశీలించటం ప్రారంభించాము. మధ్యరోజుల్లో [అంటే 1995 లో ఫ్యాక్టరీ పోగొట్టుకున్నప్పటి నుండీ 2005 వరకూ] వార్తాల్ని యధాలాపంగా చదివాము, చూశాము.

ఇక మళ్ళీ ’ఆచరణ - పరిశీలన’ అన్న ’కీ’తో ఈనాడు వ్రాతల్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించాము. దాంతో, ఈనాడు రామోజీరావు మాతో మాట్లాడే భాష మాకు అర్ధమయ్యింది. ఈనాడు అంటే నెం.10 వర్గానికి, నెం.5 వర్గానికి మధ్య నడిచే భాష కూడా అర్ధమైంది.

ఆచరణ - పరిశీలన అన్నదే వాటన్నిటి ’కీ’. పరిశీలిన లేని ఆచరణ, ఆచరించని పరిశీలన వృధాయే!

వివరంగా చెప్పాలంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2006 లో, మేము గుంటూరులోని ఐబి కార్యాలయానికి వెళ్ళాము. రామోజీరావు మీద, 1992 లో మేమిచ్చిన ఫిర్యాదు, దానిపై వారి కార్యాలయ అధికారులు మా ఫ్యాక్టరీని సందర్శించడం, మేము 1995 లో ఐబి వారిని కలవటం గురించి వివరించి, మా మీద వ్యవస్థీకృత వేధింపుని గురించి ఫిర్యాదు ఇవ్వడానికి, కనీసం మా కేసు వివరాలు పైకి పంపమని విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాము.

అక్కడి అధికారి, సాక్షాత్తూ రామోజీరావుకు వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిలా "ఎవరిని గురించి మీరు complaint చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు రామోజీరావు గురించి? He is a perfect business man you know!? ఇంత వరకూ ఒక్క Remark లేదు అతడిపైన" అన్నాడు.

వారం, పది రోజులు తిరిగే సరికి, ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి అవకతవకల గురించి నోరు విప్పాడు. ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, నెం.5 వర్గాల మధ్య సంభాషణ నడుస్తుంది. ఎలాగంటే - "రామోజీరావుని మీరు ఎలా claim చేయగలరు? on record అతడి మీద ఒక్క రిమార్కు లేదు. ’మచ్చలేని వ్యాపారవేత్త, మీడియా అధిపతి’గా అతడికి ఇమేజ్ ఉంది. ఎలా నిరూపించగలరు మమ్మల్ని?" - ఇదీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు, సదరు ఐబి అధికారి ముఖతః విసిరిన సవాలు!

జవాబుగా "అయితే ఇది సరిపోతుందా?" అన్నట్లు, ఉండవల్లి నోట, రామోజీరావు మార్గదర్శిలో unclaimed డిపాజిట్లు ఉండటం దగ్గర నుండి అవకతవక వ్యవహారాలు బయటి కొచ్చాయి. ఏ చిట్ ఫండ్ వ్యాపారంలోనైనా, బ్యాంకులలోనైనా, తమది కాని డబ్బుని కూడా తమది అని ప్రకటించుకునే వారితో గొడవలుంటాయోమో గాని, ఈ డబ్బు మాది అని ఎవరూ ప్రకటించని వ్యవహారాలుంటాయా!? అంత వింతలతో పాటు మరెన్నో మార్గదర్శిలో బయటికొచ్చాయి. [ఇక ఆ ఒరవడిలో.... కంఫానీ నిధులు రామోజీరావు సంస్థల్లోకి మళ్ళటం తదితర వ్యవహారాలెన్నో బయటికొచ్చాయి, వస్తూనే ఉన్నాయి. రామోజీ ఫీల్మ్ సిటిలోని భూవివాదాలతో సహా!]

తమ అనుచరుడైన ఉండవల్లికి ఆ విధమైన అత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్ ని తామో ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇచ్చుకోకపోతే ఏముంది? ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో భాగంగా మరింకో కష్టమేదో ముంచుకొస్తుంది. ’ఆ పొయ్యి కంటే ఈ పెనమే మేలు’ అనుకొని తమ అనుచరులకి అలాంటి ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు ఇచ్చుకోక తప్పదు.

అయితే, 2006 -07 లలో జరిగిన ఈ సంఘటనలలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ’కన్నా?కాలా?’ స్ట్రాటజీని దాటి, సదరు అసైన్ మెంట్ కి తమవైన, తమకి నచ్చిన భాష్యం చెప్పుకున్నారు. అది - మార్గదర్శి వివాదాన్ని ఎత్తుకోవడం ద్వారా వై.యస్., ఉండవల్లి మాదృష్టిని ఆకర్శిస్తే... మేం అతణ్ణి అప్రోచ్ అయితే.... మాదగ్గర ఏయే రహస్యాలున్నాయో, వివరాలున్నాయో తెలుసుకోవచ్చు. నమ్మి మా అంతట మేం అప్రోచ్ అయితేనే ఎవరికైనా ఏమైనా చెబుతామన్నది వాళ్ళ అభిప్రాయం. అలా మాకుగా మేం ఉండవల్లిని, వై.యస్.ని నమ్మి అప్రోచ్ అయితే మొత్తం విని, తమకు కావలసిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకుని, ఆపైన సోనియాని కలుద్దాం పదమంటూ తీసికెళ్ళనూ వచ్చు!

అందునా ఉండవల్లి అరుణ్ కుమార్, సోనియాకి ఆంధ్రా వచ్చినప్పుడల్లా వ్యక్తిగత ఉపన్యాస అనువాదకుడిగా పనిచేసేంత సన్నిహిత అనుచరుడు! ఆ నమ్మిక కోసమే ఉండవల్లి, "వారం రోజుల్లో రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తాను" అన్నాడు. ఆ వారం ఇంతవరకు రాలేదు. రామోజీరావు ఆ విషయమై పరువునష్టం దావా కూడా వేయలేదు. అదీ ఇక్కడ విచిత్రం.

[సోనియా దగ్గరికి మమ్మల్ని చేరిస్తే వాళ్ళకేం ఒరుగుతుందన్న విషయం తర్వాత! అందుకోసం మాత్రం వీర పెనుగులాట అడుతూనే ఉంటారు. ఈనాడు సాక్షిగా... చాలా స్పష్టంగా! దీన్ని గురించి, మరికొన్ని సంఘటనలు వివరించిన తర్వాత చెబుతాను.]

ఇదొక్కటే కాదు, 2007 మార్చిలో, మాపై రామోజీరావు వేధింపు గురించి, ప్రధాని, సోనియా, రాష్ట్రపతులకి 2005 నుండి మేము పంపుతున్న ఫిర్యాదులకు స్పందనగా, శ్రీశైలం పోలీసు సీఐ, ఎస్.ఐ.లు విచారణ చేపట్టామని చెప్పుకున్నారు. మా కేసులో ఉటంకించిన వారి నుండి స్టేట్ మెంట్లు తీసుకున్నామంటూ, మా దగ్గర స్టేట్ మెంట్లు తీసుకున్నారు.

ఆ నేపధ్యంలో సీఐ ఎంతో గంభీరమైన ముఖంతో "మీరు అసలు క్రింది నుండి పైకి ఫిర్యాదులు పంపవలసింది. పై వారికి ఫిర్యాదులిచ్చినా మా దగ్గరకు రావలసిందే!" అన్నాడు. నేను "ఇప్పుడెందుకు ఇదంతా చేస్తున్నారు?" అని అడిగాను. సీఐ "అది కాదమ్మా! మీరు ఫిర్యాదు ఇచ్చి కొన్ని రోజులు/నెలలు గడిచాయి కదా! ఈ లోపున ఏమైనా జరగచ్చు. మీరు అభిప్రాయం మార్చుకొని ఉండవచ్చు! అందుచేత మరోసారి స్టేట్ మెంట్ వ్రాయించుకున్నాము" అన్నాడు.

నేను "అలాంటిదేం లేదండి! ఇప్పటికీ మేము మా ఫిర్యాదుకే కమిట్ అయి ఉన్నాము. వందసార్లయినా ఇదే చెబుతాము" అన్నాను. "సరే నమ్మా! మీ ఇష్టం!" అన్నాడతడు. నేను "ఒకే సరే! ఇప్పుడు స్టేట్ మెంట్లు తీసుకున్నారు. ఏం జరుగుతుంది?" అనడిగాను.

అతడు చాలా గంభీరంగా "ఏమైనా జరగవచ్చమ్మా. మేమిది పైకి పంపిస్తాము. రామోజీరావుని హైదరాబాదులో అరెస్టు చేస్తారో లేక అతణ్ణి అరెస్టు చెయ్యమని మాకే ఆర్డర్స్ ఇస్తారో!" అన్నాడు. ఆ క్షణం అది మాకు చాలా oddగా అన్పించింది. ఏది జరిగినా వెంటనే స్పందించక పోవడం అప్పటికే మాకు బాగానే అలవాటయ్యింది. దాంతో ఏమీ అనకుండా అతడికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాము. ఆ తర్వాత నాలుగురోజులకే, మా గది కేటాయింపుని రద్దుచేస్తూ మాకు నోటీసు ఇవ్వబడింది.

’రేపో ఎల్లుండో రామోజీరావుని అరెస్టు చేస్తారు’ అన్నట్లుగా ఆలోచనలు రేకెత్తించి, ఒకవేళ మేం గాని అందుకోసం ఆశగా ఎదురు చూస్తుంటే.... ఒక్కసారిగా అశనిపాతానికి గురిచెయ్యటం! ఎంతగా ఆశకి గురవుతామో అంతగా నిరాశకీ గురవ్వటం మానవ సహజం. ఆ అటుపోట్లకి, మానసిక తంత్రాలకి, బ్రేక్ అవ్వటం కూడా అంతే సహజం. ఈ విధమైన ’సైకలాజికల్ ప్లే’ మా మీద చాలా విషయాల్లో, చాలాసార్లు, పెద్దమోతాదులలో ప్రయోగింపబడింది. ఆ అనుభవాలకి కూడా రాటుదేలి పోయాము. గతటపాలలో చెప్పినట్లు ’గీత మా సాధన, ఇతిహాసాలు మా పరికరాలు.’ ఆ రీత్యా కూడా, అలాంటి అనుభవాలతో ఎంతో కొంత సమబుద్దిని సాధించాము.[స్థితప్రజ్ఞత అనేంత మాట ఉపయోగించటం సాహసమే అవుతుంది.]

ఈ కేసు విషయంలో... మేం ఎవరికి ఫిర్యాదు చేసినా.... మాకు రామోజీరావు నుండి, అతడి పత్రిక ద్వారా పరోక్షంగా, ఎవరికైతే ఫిర్యాదు చేశామో వారి ద్వారా ప్రత్యక్షంగా, మాకు విన్పించబడే దేమిటంటే - "ఇది కూడా మా పావే! ఇతడు/ఈమె నా వాళ్ళే! వీళ్ళకి ఫిర్యాదు చేస్తే వీళ్ళేదో నీకు సాయం చేస్తారనుకుంటున్నావా? ఏమీ లేదు. మాకు లొంగి పోవటం మినహా మీకు మరో దారి లేదు" అని!

ఎస్.పీ., కలెక్టర్ లు, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, వై.యస్..... ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.... ఇలా ఎవరికి ఫిర్యాదు చేసినా.... జవాబు రాకపోగా, వేధింపు మరింత తీవ్రమై కొనసాగటంలో మాకు ఇవ్వబడిన హెచ్చరిక అదే!

అయినా ఆపకుండా మేం అడ్మినిస్ట్రేషన్ యుద్దం కొనసాగించుకుంటూ పోయాము. దాదాపు 100 ఫిర్యాదులు వ్రాసాము. ప్రతీచోట "ఇతడు/ఈమె కూడా నా వాళ్ళే. నీకు న్యాయం జరగదు" అంటూ మమ్మల్ని బ్రేక్ చేయాలనే రంధిలో, పంతంలో పడిన నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు, మరోవైపు తాము నిరూపింపబడుతున్నామన్న విషయాన్ని విస్మరించారు.

ఈ విషయంలో.... సూర్యాపేటలో మా ఇంటి ఒనరైతే మమ్మల్ని బూతులు తిడుతూ ఓ రోజు "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కులేదు. ఏం చూసుకుని ఇంత పొగరు?" అనేసింది కూడా! ఇదే మరో రకంగా... శ్రీశైలంలోని మా పూర్వవిద్యార్ధి ఒకరు "ఏముంది సార్! మీరు ఏ నక్సల్స్ అంటూ పోలీసులు తీసికెళ్ళి ఎన్ కౌంటర్ చేస్తే మాత్రం ఎవరేమంటారు?" అన్నాడు. మా ఇంటి ఓనరుకైతే మేం జవాబివ్వలేదు గాని, మా పూర్వవిద్యార్ధికి మాత్రం "అదే అయితే కొండంత అండ, గుడిలో మల్లయ్య స్వామి భ్రమరాంబ తల్లి ఉన్నారు, మేమున్నాము అనుకుంటాములే" అని నవ్వేసాము. మొదటి సందర్భంలో అప్పటికింకా మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయాన్ని గుర్తించనందున అంతకంటే పెద్దగా అలోచించలేదు.

ఈ పరిణామ క్రమంలోనే.... 2007 మార్చిలో శ్రీశైలం సీఐ నడిపిన ’ఎంక్వయిరీ - స్టేట్ మెంట్ల సంగ్రహణ’ నాటకం అనంతరం అదే పైకారణంగా చూపిస్తూ మా గది కేటాయింపు రద్దయినప్పుడు [ఆ వివరాలు మా కథలో వ్రాసాను.] మేం హైదరాబాద్ లో CBCID, IG కృష్ణరాజ్ ని కలిసామని గతటపాలలో కూడా వ్రాసాను. అప్పుడతడు "మీరు ఫిర్యాదులలో collective News వ్రాస్తున్నారు" అన్నాడు.

అంటే - ఆవిధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం "ఇదంతా collective News అంటాను. ఎలా నిరూపించగలవు?" అని సవాలు విసిరింది. మాకు కాదు, నెం.5 వర్గానికి. ప్రత్యక్షంగా కాదు, CBCID, IG కృష్ణరాజ్ ద్వారా! అందునా సదరు కృష్ణరాజ్, వై.యస్. ద్వారా నియమితుడై మార్గదర్శి అవకతవకలపైన విచారణ జరుపుతున్నాడు. అప్పటికే పలుమార్లు టీవీ వార్తల్లో మార్గదర్శి దస్త్రాలు పట్టుకెళుతూ, కోర్టుకు వివరణలు ఇస్తూ విజువల్స్ ద్వారా కనబడతున్నాడు. పేపర్ల ఫోటోలలో ప్రచురితమౌతూ ఉన్నాడు.

దానికి జవాబుగా అన్నట్లు - మేం హైదరాబాద్ లో చేసిన ప్రయత్నాలు ఫలించక, [ఈనాడు పోటీ పత్రికలైన వార్త, ఆంధ్రజ్యోతిల నుండి సహాయం పొందలేక, ’వార్త’ ఉపసంపాదకుడి చేత బుర్ర కడుగుడు కూడా భరించి] వెనుదిరిగి శ్రీశైలం వచ్చేసాము. గది కేటాయింపు రద్దుచేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞాపన పత్రం వ్రాసుకుని[మార్చి 29న] దేవాలయ ఈవోని కలిసాము. అతడు నిరాకరించాడు. మరునాడు మా విద్యార్ధుల తల్లిదండ్రుల బృందంతో[మార్చి 31న] సహా వెళ్ళి ప్రయత్నించాము. గది రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడిగాము. కనీసం గది ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరాము. చివరికి 5 వారాల సమయమిచ్చాడు.[మే 7 తేదీ వరకు]

సమయం తీసుకోగానే, ఏప్రియల్ 1 తేదినే వై.యస్.కి రామోజీరావు గురించి ప్రస్తావించకుండా, ఓ సాధారణ టీచర్లుగా మేము ఒక అభ్యర్ధన లేఖ పంపాము. మా గది రద్దు నిర్ణయాన్ని ఆపివేయించాలని, "దేవస్థానంలో ఒక కూలీ పాటి సర్వీసు చేయదా ఒక టీచర్ సర్వీసు" అని వ్రాసాము.

ప్రత్యామ్నాయ వసతి చూసుకునే ప్రయత్నాలు చేస్తుండగా.... ఏప్రియల్ 11, 2007 న శ్రీశైల దేవస్థానపు డిఫ్యూటీ ఈవో నుండి మాకు ఓ తాఖీదు అందింది. మా గది కేటాయింపు రద్దుని వెనక్కు తీసుకోవాల్సిందిగా మార్చి 29 న మేము ఈవోకు ఇచ్చిన విజ్ఞాపన పత్రం మీద, ఈవో regrat అని వ్రాసాడు కాబట్టి, మేం తక్షణం గది ఖాళీ చేయవలసిందనీ, లేనట్లయితే తాము తీసుకునే చట్టపరమైన న్యాయపరమైన చర్యలకు మేమే బాధ్యులమనీ అందులో సారాంశం.

అయితే మార్చి 31న, మేము మా విద్యార్ధుల తల్లిదండ్రులూ బృందంగా కలిసి వెళ్ళి విజ్ఞప్తి చేయగా, ఈవో మాకు మే 7 వ తేదీ వరకూ సమయం ఇచ్చిన విషయం ఆడిగితే... ఆ దస్త్రం తమకింకా చేరలేదనీ, తమకు ఫార్వార్డు చేయబడిన regretted letter మీదే తాము Further action తీసుకున్నామనీ Dy.E.O. చెప్పాడు.

"మాకు Favourable అయిన letter పదిరోజులు దాటినా తమకి చేరదు. అది చేరలేదు కాబట్టి, infavourable letter చేరింది కాబట్టి react అయ్యారట. అదే మాకు infavourable గా దేవస్థానపు కాంట్రాక్టు [కూలీలు] అటెండర్లు ఈవోకి పిటీషను పెడితే మాత్రం, రెండురోజుల్లో, వెనువెంటనే, react అయిపోయారు. దీన్ని వేధింపుగాక ఏమంటారు? రామోజీరావు గురించి వ్రాయకుండా ఏప్రియల్ 1 తేదీన మేము పంపిన అభ్యర్ధన లేఖకు సమాధానం లేదు. "ఫిర్యాదులో రామోజీరావు పేరు వ్రాయకపోతే రెడ్ టేపిజం అంటూ ఏ న్యాయం జరగదు. ఫిర్యాదులో రామోజీరావు పేరు వ్రాస్తే collecting News అంటారు. ఇది ఏరకమమైన వేధింపు?" అంటూ మరో ఫిర్యాదుని రాష్ట్రపతి కలాం గారికి, ప్రధానమంత్రికి, సోనియాకి స్పీడ్ పోస్టులో పంపాము.

మేం పంపిన ఫిర్యాదుకి రాష్ట్రపతి స్పందిస్తూ, తాము రాష్ట్ర సీఎంకి ఈ విషయాన్ని Direct చేస్తున్నామని మాకు లేఖ పంపారు. అది ప్రయాణం చేసి చేసి, మేము శ్రీశైలం వదలి వచ్చాక చేరింది. అయితే ప్రధానమంత్రి స్పందించలేదు. ఇక సోనియా తనకి ఫార్వార్డ్ చేసిందనీ, ఫిర్యాదులోని విషయాలు తన పరిశీలనలో ఉన్నాయనీ దిగ్విజయ్ సింగ్ నుండి మాకు లేఖ వచ్చింది.

ఈ లేఖ రిఫరెన్సుతో మేము 2007 మే17న ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ని కలిసాము. అతడు, ఆ రోజే అక్కడికి వచ్చి ఏపీ భవన్ లో విడిది చేసి ఉన్న అప్పటి సీఎం వై.యస్. కి, మా గురించి సిఫార్సు లేఖ వ్రాసి ఇచ్చాడు. దానిపైన "కేసు సంగతి తర్వాత ముందు గది విషయం చూద్దాం" అంటూ హామీ ఇచ్చిన వై.యస్.... ఆ తర్వాత డ్రామాలు, సంఘటనల గురించి ’పీవీజీ - రామోజీరావు - మా కథ’లో వివరంగా వ్రాసాను.

ఆ విధంగా... "collecting News వ్రాసారు అంటాము. మీరేం చెయ్యగలరు?" అంటూ CBCID, IG కృష్ణరాజ్ ముఖతః నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గం అన్పించిన మాటకి, సవాలుకి, నెం.5 వర్గం చెప్పిన సమాధానమన్నమాట Dy.E.O. ఇచ్చిన తాఖీదు, దానిపై రాష్ట్రపతి, సోనియా తనకి పంపిదంటూ దిగ్విజయ్ సింగ్ స్పందన లేఖలు, తదుపరి సంఘటనలు! "చాలా! ఇంకా సాక్ష్యాధార పత్రాలు, దృష్టాంతాలు కావాలా?" అన్నదే నెం.5 వర్గం చెప్పిన జవాబు! ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్రపతి, దిగ్విజయ్ సింగ్ ల చేత స్పందన లేఖలు మేం వ్రాయించలేము కదా!

ఈ మొత్తం ప్రకరణంలో.... రాష్టపతిగా APJ కలాం, మా దస్త్రాన్ని, కేసుని, సీఎం కూడా స్పందించకపోవటంతో హోంశాఖకు పంపినట్లుగా మాకు లేఖ పంపారు. తదుపరి.... నవంబరు 2007లో మేం మరోసారి ఢిల్లీ వెళ్ళి, కేసు వివరాలని కవరింగ్ లేఖకు జోడించి, స్వయంగా హోంశాఖలో దాఖలు చేసి రసీదు పుచుకున్నాము.

2007, జూన్ 2 న రాష్ట్రపతిగా కలాం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రతీకారమేమో అన్నట్లుగా.... APJ కలాం ఆవేదనా భరిత సంఘటనల అనంతరం పదవి దిగిపోయాడు. జూన్ - జూలై మాసాల్లో, రాష్ట్రపతిగా కలాంని కొనసాగిస్తారా లేదా అనే మీమాంస వచ్చింది. కలాం రెండో పర్యాయం రాష్ట్రపతిగా సాగేందుకు సుముఖత కూడా వ్యక్తం చేసారు. అనూహ్యంగా, APJ కలాం గురించి నిందాత్మక లేఖ వార్తలో కొచ్చింది. తనకు అది ఖేదం కలిగించిందనీ, ఆవేదన చెందాననీ పేర్కొన్న కలాం, తర్వాత మాజీ రాష్ట్రపతిగా ఆర్.పీ. భవనం వీడారు.

ముందటి టపాలో చెప్పినట్లుగా... ఎంతటి వాడైనా [సోనియా, రామోజీరావులైనా] పడవ ఎక్కాక సరంగు మాట వినాల్సిందే, సరంగు చెప్పిన చోట కూలబడాల్సిందే! ఆది ఆ సీటు ఆధిక్యత! అందుకే తదుపరి రాష్ట్రపతిగా, అప్పటి వరకూ పేరు పెద్దగా తెలియని ప్రతిభాదేవి సింగ్ షేకావత్ హఠాత్తుగా తెర మీదికి వచ్చింది. ఈ విషయాన్నే గునుస్తూ, తెలంగాణా కాకా, జి. వెంకట స్వామి చాలాసార్లు మొత్తు కున్నాడు కూడా! ఇక రాష్ట్రపతి భర్తా, మరిది, ఇతర సమీప బంధువులపై ఆర్ధిక నేరాల దగ్గరి నుండి హత్యా నేరాల దాకా, అభియోగాలు బయటికి రావడం భారతదేశం గతంలో చూడనిది.

ఈ విధంగా నెం.5 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవటం, మెదళ్ళతోనే గాక మాటలతోనూ యుద్దం చేసుకోవటం, మా కేసు విషయంలోనే కాదు, మా జీవితంలోని సంఘటనల విషయంలోనూ నడుస్తుంది. దేశ కాలమాన పరిస్థితులపైనా నడుస్తుంది.

ముందుగా మా జీవితంలో...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1992 తర్వాత, మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం ప్రారంభమయ్యాక, అన్నిచోట్ల, అన్ని విషయాల్లో ఓటమినే చవిచూశాను.

సాధారణంగా ఏ మనిషి జీవితంలోనైనా, ఏ ప్రయత్నాలలోనైనా గెలుపోటములు 50:50 ఉంటాయి. నా జీవితంలో 1992 కు ముందర అది 70:30 ఉండేది. అంటే నూరు ప్రయత్నాలు చేస్తే అందులో 70 గెలుపులు సాధించేదాన్ని. అదే 1992 లో పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు చేశాక, ఆ నిష్పత్తి 0:100 అయిపోయింది. నూరు ప్రయత్నాలు చేస్తే నూరింటిలోనూ ఓటమే పొందడం!

సంభావ్యతా సిద్దాంతం [Theory of Probability] ప్రకారమైనా, నూటికి నూరు శాతం సంభావ్యత ఉన్నప్పుడు దాన్ని అనిశ్చిత ఘటన [Random event] అనరు. నిర్దిష్ట ఘటన [Definite event] అంటారు.

ఇదే విషయాన్ని నా గతటపాలలోనూ, ప్రధాని మన్మోహన్ సింగూ, రాష్ట్రపతి కలాం, సోనియాలకు ఇచ్చిన ఫిర్యాదులలోనూ కూడా వివరించాను.

ఇక మా జీవితాలలో ఈ ఓటమి స్ట్రాటజీ, మా ప్రమేయం లేకుండానే ఎలా అమలు చేయబడిందీ అంటే - ఎప్పటి కప్పుడు, ఎక్కడక్కడ ఓటమి పొంది ఊరు వదిలి పోవటమే!

పారిశ్రామిక వేత్తగా 1988 లో స్థాపించిన, బ్యాటరీ తయారీ సంస్థని నష్టపోయి, 1995 చివరిలో, ఫ్యాక్టరీ ఖాళీ చేసి, నంబూరు పల్లెలో నివాసం మొదలు పెట్టాము. 1½ సంవత్సరాల తర్వాత, భౌతిక దాడికి గురయ్యి, అక్కడి నుండి గుంటూరు వికాస్ కాలేజీలో లెక్చరర్ గా చేరి, నివాసం గుంటూరుకు మార్చాము. అక్కడి నుండి ఎక్సెల్ కి మారాను. అక్కడి డైరెక్టర్లకు నేను పూర్వ విద్యార్థిని. ఫీజిక్సు చలపతిరావు గారి శిష్యురాలిని. ఎంసెట్ గ్రంధ రచయితగా, గుంటూరు విద్యాకేంద్రంగా భాసిల్లడానికి బాటలు వేసిన త్రిమూర్తులు [మాధ్స్ - సోమయాజులు గారు, ఫీజిక్స్ - చలపతి రావు గారు, కెమిస్ట్రీ - ముజీర్ గారులు] లో ఒకరిగా, అప్పటికే దాదాపు ఐదు దశాబ్దాల బోధనా కెరీర్ గలిగిన చలపతిరావు గారికి, sub hand గా పనిచేసే అవకాశం దొరకగానే సంతోషంగా ఎక్సెల్ లో చేరిపోయాను. అయితే అక్కడ డైరెక్టర్ల అంతర్గత విభేదాలు అనే పైకారణంతో ఒక్క సంవత్సరం లోనే అక్కడ నా కెరీర్ ముగిసి పోయింది. మంచి లెక్చరర్ గా పేరు లేదా అంటే ఉంది. అయినా గుంటూరు మాత్రం నాకు space run out అయిపోయింది.

ఆ సమయంలో, సూర్యాపేటలోని కాలేజీలో ఆఫర్ రావటంతో గుంటూరు నుండి సూర్యాపేటకు మకాం మార్చాము. గుంటూరు కార్పోరేట్ కాలేజీలలో లెక్చరర్స్ గా మేము ఏదో ఒక బ్రాంచి డీల్ చేస్తాము. నేను మెకానిక్స్ చెప్పేదాన్ని. ఇంటి దగ్గర నలుగురైదుగురు పిల్లలకి ఎంసెట్ లో ఎలక్ట్రిసిటి, వేవ్ నేచర్ గట్రాలతో మొత్తం సిలబస్ చెప్పేదాన్ని. అయితే కాలేజీల్లో కేవలం ఒకే బ్రాంచి చెప్పడం వల్ల కొన్నేళ్ళకు మిగిలిన అంశాలలో handicap అయిపోతామనే ఆందోళన లెక్చరర్స్ లో ఉండేది.

ఆ చర్చల ప్రభావంతో కూడా, గుంటూరులో అవకాశాలు మూసుకుపోయి, సూర్యాపేటలోని చిన్న కాలేజీలో మొత్తం Physics [Inter + Eamcet] ని సింగిల్ హాండ్ తో డీల్ చేసే అవకాశం కనిపించడంతో, ముందడుగు వేశాము. జరుగుతున్నవన్నీ ’విధివ్రాత’ అనుకునే దశలో ఉండటం వల్ల, అందులో ఏమాత్రం గూఢచర్యాన్ని గుర్తించలేదు. అన్నితలుపులు మూసి ఉంచిన గదిలోని పాము, ఎటు తలుపు తెరిచి ఉంటే అందులోంచే బయటకు రావలసినట్లుగా, తాము గురి పెట్టుకున్న వ్యక్తులపై గూఢచర్యం పనిచేస్తుందన్న ఊహ కూడా అప్పట్లో మాకు లేదు.

కాబట్టే - ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళు ఆడుతున్న ఆటలో ’మేము పావులం’ అని వ్రాసాను గతటపాలలో! కాకపోతే, మా చేతిలో మాత్రం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అదేమిటంటే - ’ఎటు వైపు మొగ్గటమా?’ అన్నది. ఏ దశలోనైనా... పరిస్థితులతో రాజీపడటం లేదా పరిస్థితులకి ఎదురు తిరగటం అనే అవకాశం ఎప్పుడూ మా చేతిలోనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం.

ఉద్యోగాలు పదేపదే ఏదో ఒక పైకారణంతో ఊడిపోయేవి. అలాగని సొంత వెంచర్ పెట్టుకుంటే, అది మూతపడేదాకా అక్కడి స్థానిక పరిస్థితులు ఉండేవి. మళ్ళీ ఉద్యోగప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. తరువాత కాలేజీ పెట్టే అవకాశం వచ్చింది. కాని అక్కడా ర్యాంకుల అక్రమాలు సహిస్తేనే అన్నది షరతు అయ్యింది. దాన్ని వదులు కున్నాము. ఆ విధంగా ఎప్పుడూ అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం!

అయితే అదృష్టవశాత్తూ అనండి, భగవంతుడి కరుణ అనండి, గూఢచర్యం గురించి ఊహ కూడా లేని రోజుల్లోనైనా, ఇప్పుడైనా, మా మార్గదర్శి భగవద్గీతే! గీతా శ్లోకాల సహాయంతో ఎప్పటికప్పుడు ’ఎటు వైపు నిర్ణయించుకోవాలా?’ అన్నదే తర్కించుకునే వాళ్ళం. జన్మతః వచ్చిన బుద్దీ, తల్లిదండ్రులూ గురువులూ నేర్పిన సంస్కారం మమ్మల్ని ధర్మమార్గం తప్పనివ్వలేదు. ఫలితంగా పరిస్థితులు విషమించటం, మేం ఊరు ఖాళీ చేయాల్సి రావటం.... అలా సాగిపోయాయి.

సూర్యాపేటలో నుండి ఇల్లూ వాకిలీ ఊడగొట్టి మరీ తరిమి వేయబడ్డాము. అవన్నీ మీరు ’పీవీజీ - రామోజీరావు - మా కథలో’ చదివినదే! సూర్యాపేట నుండి మిత్రుల ఇళ్ళలో కొన్నాళ్ళు తలదాచుకుని చివరికి హైదరాబాదులో కొన్ని నెలలు నివసించాము. మళ్ళీ శ్రీశైలం! అక్కడి నుండీ నివాస గది రద్దు చేయబడి, నడుపుతున్న చిన్నస్కూలు వదులుకుని నంద్యాల చేరాము.

ఎప్పటికప్పుడు, ఎక్కడకక్కడ, ఇలా ఓటమితో ఊరు వదిలి రావటం.... మా జీవితంలో పరిపాటి అయిపోయింది. ఎక్కడి కక్కడ, ఎవరు పడితే వాళ్ళు "ఏదో ఒక ఊరులో సెటిల్ అవ్వచ్చు కదా?" అనేవాళ్ళు! ఊళ్ళు తిరగటం మాకైనా సరదానా! ఇది తలుచుకు ఆలోచిస్తున్నప్పుడు, మాకు గీతాశ్లోకాలు

శ్లోకం:
సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో
శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః

శ్లోకం:
తుల్య నిందాస్తుతి ర్మౌనీ సంతుష్ణో యేన కేనచిత్
అనికేతః స్థిరమతి : భక్తిమాన్ మే ప్రియో నరః

భావం:
శత్రుమిత్రుల గురించి సమదృష్టిగలవాడు - మానావమాన, శీతోష్ణ, సుఖదుఃఖాదులందు సముడూ - వాంఛారహితుడూ - దొరికిన దానితో తృప్తిజెందేవాడు - మౌనియై, స్థిర నివాసం లేక, సుస్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు.

తోడుగా నిలిచి స్ఫూర్తి నింపేవి.

"అస్థిర నివాసులం అయితే అయ్యాము గాక, స్థిరబుద్ది లేనివాళ్ళం కాలేదు. అంతే చాలు" అనుకునే వాళ్ళం!

అయితే.... ఈ ఓటమి క్రమంలో పారిశ్రామిక వేత్త స్థాయి నుండి ఎంసెట్ లెక్చరర్ స్థాయికి, అక్కడి నుండి స్కూలు టీచరు స్థాయికి పడిపోయాను. ఇదే విషయం ప్రస్తావిస్తూ ప్రధానికీ, సోనియాకీ, రాష్ట్రపతికీ, రాష్ట్ర అప్పటి సీఎం వై.యస్.కి పంపిన చివరి ఫిర్యాదులలో "ఒకవేళ ప్రభుత్వం గనక LKG, UKG పిల్లలకి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తే, మేము వాళ్ళకి చదువు చెప్పేందుకు కూడా పనికి రాము అంటారేమో" నని వ్రాసాము.

సూర్యాపేటలో ఉండగా, విద్యార్ధులకి ఐఐటీ బేసిక్స్, ఇంటర్ పీజిక్స్, బోధించేదాన్ని. ఎంసెట్ కు శిక్షణ నిచ్చేదాన్ని. అప్పుడు ప్రారంభమైంది ఎంసెట్ ర్యాంకుల అవకతవకలు, ఇంటర్ మార్కుల అక్రమాలపై ఫిర్యాదుల పర్వం! పర్వవసానంగా, సూర్యాపేటలో, పూర్తిగా అప్రకటిత సాంఘీక బహిష్కరణని ఎదుర్కొన్నాము. వ్యవస్థీకృత వేధింపుని ఎదుర్కొన్నాము. నీళ్ళు కరెంట్ సరఫరాలని నిలిపి వేయటం, పాలవాణ్ణి సైతం రానివ్వక పోవటం, బూతులు తిట్టడం, ఇంటికి తాళాలు వేయటం..... ఒకటా రెండా! వీలయిన అన్ని మార్గాల్లో వేధించారు. రాబడికి గండికొట్టటం, ఖర్చులు పెరిగేలా చేయటం! ఊరు మారినా తీరని వేధింపు!

అప్పట్లో మా జీవితాల్లో రామోజీరావు ఉనికిని మేము గ్రహించుకోలేదు. విధివ్రాత అనుకుంటూ, ఎదురుగా పైకారణంగా[over leaf reasons] కన్పించేవాటిని, వారిని పరిశీలించటం, ఫిర్యాదులలో ఉటంకించటం చేసాము. సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ’సిండికేట్’ అయ్యి మమ్మల్ని వేధిస్తున్నారనుకున్నాము. దానికి స్థానిక రాజకీయ కారణాలు జతయ్యాయనుకున్నాము. అదే మా ఫిర్యాదులలో వ్రాసాము.

అప్పటికి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రముఖ్యమంత్రి. కేంద్రంలో అద్వానీ అద్వర్యంలో వాజ్ పేయి ప్రధానిగా, ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు చక్రం తిప్పగా, ఈనాడు రామోజీరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దాడన్న విషయం అందరికీ తెలిసిందే!

ఈ నేపధ్యంలో.... మేం రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబుకి పంపిన ఫిర్యాదులలో ఎక్కడా రామోజీరావు ప్రసక్తే లేదు. అతణ్ణి నిందితుడిగా పేర్కొంటూ ఫిర్యాదులిస్తే.... తమవాడి మీద ఫిర్యాదు ఇచ్చినందుకు వేధించారన వచ్చు. అంతేకాదు, తమ వాడి మీద ఫిర్యాదు ఇచ్చినందుకే స్పందించలేదన వచ్చు. ఎందుకంటే చంద్రబాబుకి అప్పట్లో రామోజీరావు అండదండలు ఎక్కువగా ఉండటం, అసలు తెదేపా ఆవిర్భావమే ఈనాడు భుజస్కంధాల మీద నడవటం అందరికీ తెలిసిందే కాబట్టి.

ఈ ఫిర్యాదుల ప్రకరణం, ఎంసెట్ 2000 ర్యాంకుల అవకతవకల తో ప్రారంభమై, వ్యవస్థీకృత వేధింపుపై వరసగా, 2001 లో స్వయంగా చంద్రబాబుని సెక్రెటేరియట్ లో కలిసి ఫిర్యాదు ఇవ్వటం వరకూ కొనసాగింది. అదే చివరి ఫిర్యాదు. ఇంటి నుండి గెంటి వేయబడి, చేతిలో డబ్బూ, నిలువ నీడా లేక దాదాపుగా నడిరోడ్డు మీద నిలబడిన స్థితిలో ఇచ్చాము.

ఆ నాటి అతడి వింత ప్రవర్తన గురించి గతటపాలలో వ్రాసాను. కోపంతో జేవురించిన ముఖంతో "ఎందుకు? ఎందుకు వేధిస్తున్నారు?" అంటూ ఎదురు నాపైనే మండిపడటంతో అయోమయానికి గురయ్యాను. ఆ తర్వాత న్యాయం జరుగుతుందన్న ఆశ వదిలేసుకున్నాము.

ఆ తర్వాత, 2004 లో వై.యస్. ప్రభుత్వం వచ్చింది. అప్పటికి మేం శ్రీశైలంలో చిన్నస్కూలు పెట్టుకుని సంవత్సరం అయ్యింది. మా విద్యార్ధి ఒకరికి 7 వ తరగతి ప్రైవేటుగా వ్రాయించగా మళ్ళీ అదే ఫలితం! చెప్పుకోదగినంతగా ప్రతిభగల విద్యార్ధి, తీవ్రకృషి చేసి, చక్కగా వ్రాసిన పరీక్షలు... అత్తెసరు మార్కులు! పరీక్షా కేంద్రం వారి, పోటీ స్కూళ్ళ వారి అనుమానాస్పద ప్రవర్తనా సరళి!

అప్పుడూ హైదరాబాద్ వెళ్ళి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సీఎంగా ఉన్న వైయస్ ని వ్యక్తిగతంగా కలిసి, ఎంసెట్ వ్వవహారం దగ్గరి నుండి మా ఫిర్యాదుల గురించి, మాపై జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపు గురించి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాము. క్రిక్కిరిసిన పత్రికా విలేఖరులందరూ మౌనంగా చూస్తుండగా, ఇదంతా మౌఖికంగా వివరిస్తూ మరీ ఫిర్యాదు పత్రం ఇచ్చాము. అప్పటికీ రామోజీరావు గురించిన ప్రస్తావన మా ఫిర్యాదులలో లేదు. ఎందుకంటే అప్పటికీ అతడి ప్రమేయాన్ని మేం గుర్తించలేదు.

అయితే - 2005 లో మా మీద, సునిశితమైన, నిగూఢమైన తంత్రాలు ప్రయోగింపబడటం, వేధింపులో పరాకాష్టలని చవిచూడటంతో, అప్పటి వరకూ నడిచిన అన్ని సంఘటనలని పునః పరిశీలించుకున్నాము. ’నల్లమేక - నలుగురు దొంగలు’ కథలో ముసలి వాడి చేతిలోని మేకని నలుగురు దొంగలు తన్ని లాక్కుంటే... అది నేరం. అతడంతట అతడే వదిలేసుకునేటట్లు చేస్తే.... అది గూఢచర్యం. వ్యక్తిని హత్య చేస్తే అది నేరం. ఆత్మహత్యకు పురికొల్పితే.... అది నిగూఢం.

పునః పరిశీలన, పునరాలోచనలతో, మా జీవితాలలో ఈ రకపు గూఢచర్యపు ప్రమేయం అర్ధమయ్యింది. 2005 అక్టోబరులో ఢిల్లీ వెళ్ళి, స్వయంగా ప్రధాని కార్యాలయంలో, వీటన్నిటి గురించిన ఫిర్యాదు దాఖలు చేసాము. 1992 లో పీవీజీకి రామోజీరావు మీద ఫిర్యాదు, దరిమిలా 2005 వరకూ మా జీవితాల్లో జరిగిన వ్యవహారాలని, తదనుగుణమైన దేశకాల పరిస్థితులని, మా కోణంలో వివరిస్తూ క్లుప్తంగా వ్రాసాము. అప్పటికి మాకు ఏదేమిటో, ఎవరేమిటో అంతగా తెలియదు. ఆ ఫిర్యాదు లేఖలోని సబ్జెక్ట్ , రిఫరెన్సులలో రామోజీరావు, చంద్రబాబు నాయుడులతో పాటు, పీవీజీ పేరు కూడా వ్రాసాము.

ఇదంతా పీవీజీ బ్రతికి ఉండగా మేం గమనించుకోలేదనీ, గమనించుకొని ఉంటే ఆయన్నే కలిసి ప్రశ్నించి ఉండేవాళ్ళమనీ స్పష్టంగా వ్రాసాము. ఆ ఫిర్యాదు అసలు ప్రతిని Coups on World లోని స్కాన్డ్ కాపీస్ లో కూడా ఉంచాము.

అప్పటి నుండి, మరింత పకడ్బందీగా, వేధింఫు తీవ్రం అయ్యింది. కాకపోతే ఈ సారి ’తీరు’ మారింది. ఆయా సంఘటనల వివరాలనీ నా ఆంగ్ల బ్లాగు Coups on World లోని Events List లోనూ, Documentary evedence లోనూ పొందుపరిచాను. మా కథలోనూ వివరించాను. 2005 అక్టోబరులో ప్రారంభమైన రెండోసారి ఫిర్యాదుల పర్వం 2007 సంవత్సరాంతం వరకూ కొనసాగింది.

ఈ వరుస ఫిర్యాదులలో, మేము ప్రతి దానిలోనూ, మా జీవితాల్లో రామోజీరావు గూఢచర్యం తాలూకూ అస్తిత్వాన్ని సంఘటనాత్మకంగా, పత్రాల సహితంగా కొనసాగించాము. సీబిసిఐడీ ఐజీ కృష్ణరాజ్ నుండి ఫోన్, వ్యక్తిగత సందర్శన, శ్రీశైలం సీఐ ఎస్ ఐ ల ’విచారణ - స్టేట్ మెంట్ల సంగ్రహణ’ ల సాక్షిగా, ఎప్పటికప్పుడు, అడ్మినిస్ట్రేషన్ పరంగా.... దృష్టాంతసహితంగా.... పత్రాల సాక్షిగా... ఫిర్యాదులు కొనసాగించాము. సంపూర్ణంగా, రామోజీరావు ప్రమేయాన్ని నిరూపించాము.

దాదాపు 60 కి పైగా గల ఈ ఫిర్యాదులలో రామోజీరావు ప్రధాన సబ్జెక్టు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి. స్వయంగా అతడే కోర్టులకి లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించి మరీ ప్రకటించుకున్న కాంగ్రెస్ వ్యతిరేకి. అయినా యూపీఏ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమాత్రం అతడిపై మా ఫిర్యాదులకి స్పందించలేదు.

ఎన్డీయే ప్రభుత్వానికి, అందులో భాగస్వామి అయిన తెదేపా చంద్రబాబుకీ రామోజీరావు ప్రియమైన వాడు. ’అతడి మీద ఫిర్యాదు చేస్తే తొక్కిపెట్టారనుకోవచ్చు!’ అనే మాటకు ఆస్కారం లేదు. ఎందుకంటే - ఎన్డీయేకి, తెదేపాకి ఫిర్యాదు, చేసేటప్పుటికి మా ఫిర్యాదులలో రామోజీరావు నమోదై లేడు. [off అయి ఉన్నాడు.] అయినా ఎన్డీయే, తెదేపా మా ఫిర్యాదులకి స్పందించలేదు. పైగా వేధింపుని కొనసాగనిచ్చింది.

యూపీఏ ప్రభుత్వానికి, అందులో భాగస్వామి అయిన కాంగ్రెస్ కి, రామోజీరావు వ్యతిరేకి. అతడి మీద ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోవచ్చు. అంతేగాక, యూపీఏ కి, కాంగ్రెస్ కి చేసిన ఫిర్యాదులలో పూర్తిగా రామోజీరావు ప్రమేయాన్ని ఉటంకించాము, సాక్ష్యాధార పత్రాలన్నీ ఇచ్చాము కూడా! ఆ రకంగా మా ఫిర్యాదులో రామోజీరావు నమోదై ఉన్నాడు. [on లో ఉన్నాడు.] అయినా యూపీఏ, కాంగ్రెస్, మా ఫిర్యాదులకి స్పందించలేదు. పైగా వేధింపుని కొనసాగనిచ్చింది.

రామోజీరావు ఊసు ఎత్తకపోతే, ఫిర్యాదుకి స్పందించకుండా ’రెడ్ టేపిజం’ అన్నారు. రామోజీరావు ఊసెత్తితే.... నాకు పిచ్చనీ, భ్రమతో [హెలూసినేషన్] అందరితో తగవులు పెట్టుకుంటాననీ మా చెవులకి చేరేటట్లు చూసే వారు. అది కూడా మాటలలోనే సుమా! మా కేసు ఎంతవరకు వచ్చిందని మేం అడిగితే మాత్రం ఎంక్వయిరీ చేస్తున్నామన్న సమాధానం వచ్చేది.

15 సంవత్సరాల క్రితం, ఫ్యాక్టరీ పోగొట్టుకున్నందున, ఆ పర్వెర్షన్ తో, హెలూసినేషన్ తో రామోజీరావుని క్లెయిమ్ చేస్తున్నానట. ఈ విషయమై ’వార్త’ పత్రిక ఉపసంపాదకుడు, ఓ అడుగు ముందుకు వేసి, మాకు ఓ గంట పాటు మెదడు కడుగుడు [Brain wash] కార్యక్రమం కూడా చేపట్టాడు. దానికి మా వారు "తనకైతే ఫ్యాక్టరీ పోగొట్టుకోవటం. మరి నాకు అలాంటిదేం లేవుగా? నాకూ జరుగుతున్న సంఘటనలు యదార్ధంగానే కన్పిస్తున్నాయిగా?" అని అడిగితే సంభాషణ దొర్లించేసాడు. పైగా ఈ భ్రమతో, తప్పుడు దృక్పధంతో [wrong attitude] నేను నా జీవితాన్నే గాక నా భర్త, నా కుమార్తెల జీవితాన్ని కూడా నాశనం చేసేస్తున్నానని హితవు చెప్పాడు. ’అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం, వేధింపుకి ఎదురు తిరుగుతూ ఫిర్యాదు చేయటం wrong attitude అన్నమాట’ అనుకున్నాము.

చిత్రంగా.... అంతకు ముందురోజు CBCID, IG, కృష్ణరాజ్ కూడా అదేమాట అనటం! మేమతణ్ణి అతడి కార్యాలయంలో సందర్శించినప్పుడు "మీరు collective News వ్రాసి complaints ఇస్తున్నారు" అన్నాడు. దేశరాజకీయాల సంగతి దేముడెరుగు, అప్పటి మా ఫిర్యాదులలో ఉన్నది మా జీవితాల్లోని వ్యవస్థీకృత వేధింపు గురించే. అందులో collective News ఏముంటుంది, facts తప్ప? అదీ... ఆయా సమయాల్లో.... పోలీసుల సాక్షిగా.... ఇరుగుపొరుగుల సాక్షిగా... ఫోన్ బెదిరింపుల సాక్షిగా.... నమోదైన ఫిర్యాదులు!

అయితే అతడు మా వాదన ఏం పట్టించుకోకుండా, మేము దాఖలు చేస్తున్న సాక్ష్యాధార పత్రాల్ని పరిశీలించకుండా...."మీరీ రకపు attitude తో ప్రపంచపు నలుమూలకు, ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యకు పరిష్కారం రాదు. మీరు మీ wrong attitude తో మీ జీవితమే గాక, మీ వారి, మీ పాపల జీవితాలనీ కూడా నాశనం చేస్తున్నారు!" అంటూ ధృఢ స్వరంతో చెప్పాడు.

అచ్చంగా.... పెరటిలో ఎప్పుడో వేసిన విత్తనం.... రోజుల తరబడి అలా పడి ఉన్నా.... ఎప్పుడో.... వర్షం, తేమ, ఎండా వెలుతురు సరిపోయిన స్థితిలో మొలకెత్తినట్లు.... బుర్రలో ఓ ’ఆలోచన’ని నాటితే, అప్పటికి పనిచేయకపోయినా... ఎప్పుడో నిరాశా నిస్పృహలు అవరించినప్పుడో, ఓటమి మరింతగా ఓపికని నశింప చేసినప్పుడో.... ఆలోచన మొక్కై, చెట్టై, పెనువృక్షం గాక పోతుందా? ప్రభావం చూపకపోతుందా? - ఇదీ అప్పుడు నడిపింపబడిన మానసిక తంత్రం!

అందుకే, వరుసగా... ఒకరిద్దరు[గతంలో చాలామంది] పదేపదే అదే చెప్పారు. ఇంతగా.... ప్రతిదశలో ఓడిపోతూ, ఊరు ఖాళీ చేసి వలసలు పోతూ.... ఇన్నేళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే మా కేసులో రామోజీరావు [on & off లతో] ప్రమేయం, అతణ్ణి రక్షిస్తూ తెదేపా, కాంగ్రెస్ లు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు పూర్తిగా నిరూపించబడ్డారు. ’ఓటమే స్ట్రాటజీ’గా నడిచిన ఈ అంశంలో, మా ప్రమేయం లేకుండానే ఇదంతా నిరూపించబడింది. మా ప్రమేయం ఏమైనా ఉంది అంటే, అది... ఎప్పటికీ సత్యాన్ని, ధర్మాన్ని వదలక పోవటమే!

ఈ నేపధ్యంలోనే - మాకు రామోజీరావు మాతో మాట్లాడే భాష అర్ధమైంది. ఆ ’కీ’తో ఓపెన్ చేస్తే, అతడి ఈనాడు పత్రిక, మాకు మరిన్ని వివరాలు చెప్పింది. ఆ నేపధ్యంలో రామోజీరావుకి ప్రత్యర్ధిగా మరో వర్గం పనిచేస్తుండటమూ అర్ధమైంది. దానికే నెం.5 వర్గంగా పేరుపెట్టాము. రామోజీరావు వర్గానికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అని పేరు పెట్టాము. ఈ రెండు వర్గాలకీ మధ్య నడిచే పోరాటమూ, భాషా కూడా మాకు స్పష్టంగానే అర్ధమయ్యాయి, అవుతూనే ఉన్నాయి.

వివరంగా చెబుతాను. ఆ ’కీ’తో తెరిస్తే.... మీకూ స్పష్టంగానే అర్ధమౌతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2004 డిసెంబరులో పీవీజీ మరణం వరకు మూడోదశ అయితే, అప్పటి నుండి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది నాలుగోదశ.

పీవీజీ మరణంతో, నెం.5 వర్గానికి గల ప్రపంచవ్యాప్త గూఢచార పట్టు సడలుతుందన్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల ఆశ అడియాస అయ్యింది. ఆ పెనుగులాటలోనూ, వెదుకులాటలోనూ వాళ్ళుండగానే ’మెదళ్ళతో యుద్దం’ మరింత తీవ్రతరం అయ్యింది.

వ్యక్తులపై, వ్యవస్థలపై, దేశాలపై కూడా ’ఆడది, ఆకలి’ ప్రయోగించటం నకిలీ కణిక వ్యవస్థ స్ట్రాటజీ అయితే, అందులో అహం రెచ్చగొట్టటం లేదా సంతృప్తి పరచటం లాగా పదే తంత్రాలుండటం గతటపాలలో వివరించాను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ బలహీనతలని ఆధారం చేసుకుని పనులు పూర్తి చేసుకోవటం వాళ్ళకి అలవాటు. అందుకే ప్రజలని తామసపు చీకటిలోకి తీసుకుపోతారు.

నెం.5 వర్గం.... నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గంలోని వారిపై ’కన్నా?కాలా?’ తంత్రం ప్రయోగించటం, ఆయా వ్యక్తుల నిజస్వరూపాలను బహిర్గతం చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం [చేసిన కర్మఫలితాన్ని అనుభవింపచేయటం] గురించి గతటపాలలో చాలా చోట్ల వివరించాను.

ఈ క్రమంలో, భారతదేశం మీద నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం పన్నిన, సుదీర్ఘ కాలంగా అమలు జరుపుతున్న , కుట్ర బహిర్గతం అయ్యింది, అవుతోంది. ఒక్క భారతదేశమ్మీదే కాదు, యావత్ర్పపంచం మీద, మొత్తంగా మానవత్వం మీదే జరుగుతున్న కుట్ర ఇది!

ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను. ఇందిరాగాంధీ హయాంలో, ఆవిడ మనదేశమ్మీద విదేశీ కుట్ర జరుగుతోందంటే జోకులేయటమే కాదు, ’తొక్కలో ఇండియాలో ఏముందని కుట్ర చేయడం?’ అంటూ ఎద్దేవా కూడా చేశారు. వెయ్యేళ్ళ ముస్లిం ముష్కర పాలనలో, 200 ఏళ్ళ బ్రిటిషు భయంకర దోపిడిలో, ఏమీ మిగలని ఇండియా, రసం పిండిన చెరకు పిప్పిలా ఉంది. "పేద దేశం? ఏముందని, ఏం దోచుకుపోవాలని కుట్ర చేయడం? తన అధికారం నిలబెట్టుకోవటానికి, సమస్యలని ప్రక్కదారి పట్టించడానికి [అంటే హైజాక్ చేయటం అన్నమాట] ఇందిరాగాంధీ ఈ ఆరోపణలన్నీ చేస్తోంది. పాక్ ని ప్రత్యక్షంగా, అమెరికాని పరోక్షంగా నిందిస్తోంది" అన్నారు.

అయితే ఇప్పుడు చూసుకుంటే...? రంగురాళ్ళ పేరుతో చల్లగా తరలి పోతున్న రతనాల సీమ రాయలసీమ రత్నాలు! ఎన్ని ఖనిజాలు!? అపారమైన గ్యాస్ నిక్షేపాలు! ఇటీవల బయటపడిన పుల్లరిన్ నిక్షేపాలు. బంగారం కంటే కూడా విలువైన పుల్లరిన్, 500 టన్నుల దాకా, దక్షిణ భారత్ లో నిక్షేపాలున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు. లక్షల కోట్ల డాలర్ల ఖరీదయ్యే పుల్లరిన్ నిక్షేపాలు! ఇవి ఇప్పుడు అధికారికంగా బయట పెట్టబడుతున్నాయి గానీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు, ఇలాంటి వాటి గురించి ఎంతో ముందు గానే సమాచారం సేకరించి పెట్టుకుంటారు. అలాంటిదే ముఖేష్ అంబానీకి అప్పగించాక అతడి అదృష్టం కొద్దీ, అద్భుతరీతిలో బయటపడ్డ గ్యాస్ నిక్షేపాలు!

దక్షిణాఫ్రికా లో బంగారు ఖనిజాలున్నా అక్కడి స్థానికులు మాత్రం దారిద్ర్యంతో కునారిల్లుతూనే ఉంటారు. గనులు గుత్తకు తీసుకున్న అంతర్జాతీయ కార్పోరేటు కంపెనీల వారు కోట్ల డాలర్లకు పడగలెత్తుతారు. రాయలసీమలో రతనాలు రంగురాళ్ళ పేరుతో చాలా మామూలుగా తరలిపోతుంటాయి. ఇక్కడి వాళ్ళ దారిద్ర్యం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అదే గల్ఫ్ దేశాల పెట్రోలు అయితే....? ఆయా దేశాల సుల్తానులు, రాజులు దర్జాగా మార్కెట్ చేసుకుంటారు. అక్కడి చమురు బావుల్ని అమెరికా, బ్రిటన్ గట్రా ఏ దేశాల కార్పోరేట్ కంపెనీలూ గుత్తకి తీసుకుని దోచుకోలేవు.

దక్షణాఫ్రికా లాగే మనదేశంలోనూ, ఎన్ని సహజ వనరులూ, ఖనిజనిక్షేపాలున్నా మామూలుగా ముడిసరుకు తరలిపోతోంది. అంతిమ ఉత్పత్తి అమ్మకాలకి మళ్ళీ మనమే మార్కెట్టు అవకాశం అయి కూర్చుంటాము. ఇదే కదా స్వాతంత్రం పూర్వం బ్రిటిషు వాడు చేసింది?

ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి ఖనిజం ఖరీదు చాలా తక్కువ ఉంటుంది. అదే ప్రైవేటు పరం చేయగానే లాభాల పంటలు పండుతాయి. గాలి జనార్ధన రెడ్డి సోదరులకి గుత్తకిచ్చిన ఓబుళాపురం గనులు అందుకు పెద్ద ఉదాహరణ. దేశవ్యాప్తంగా కూడా ఇదే కథ. గుత్తకిచ్చాక ఇనుప ఖనిజానికి భారీగా ధర పెరిగింది. రవాణా మార్గం పొడవునా సామాన్యులు, దుమ్ముధూళి పీడితులై రోగాల బారిన పడితే, గుత్తేదార్లు మాత్రం స్వంత హెలికాప్టర్లలో గగన విహారాలు చేస్తారు. [ప్రజల రోగాల వలన మందుల కంపెనీలకు, కార్పోరేట్ హాస్పటల్స్ కు గిరాకీ బాగుంటుంది. ఎలాగూ ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి కదా! మందుల వ్యాపారం ఎంత ఎక్కువ జరిగితే మన GDP వృద్ది రేటు కూడా అంత పెరుగుతుంది.] ఇటువంటి వారంతా నకిలీ కణిక వ్యవస్థలోని అనుచర కార్పోరేట్లే. కాకపోతే వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలొచ్చి గుట్టు మట్లు బయటపెట్టుకున్నారు. అంతే!

ఇది ఈ రత్నగర్భలోని ఖనిజ సంపద అయితే, ఇక ఇక్కడి మానవ వనరులూ, మేధో వనరులూ అపారం! భారతీయులు శ్రమజీవులు. సహనం, సామర్ధ్యం కలవాళ్ళు. శ్రమించటం, పొదుపు మొదలైన లక్షణాలతో బాగా సంపాదిస్తున్నారనే ఈర్ష్య కొద్దీనే ఆస్ట్రేలియా లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయని వాళ్ళేగాక చాలామంది అంగీకరించారు. అంతగా భారతీయులు శ్రమజీవులు. శారీరకంగానైనా, మేధో పరంగా నైనా, శ్రమ, సహన శక్తి గల వాళ్ళు. ఐటీలో భారతీయులు ముందంజ అదే నిరూపిస్తోంది.

[ఇక్కడ చిన్న విషయం. ఇంతకు క్రితం చెప్పినట్లు, 1992 క్రితం వరకూ ఉన్న నానుడి ’ప్రపంచంలో భారతీయులు వ్యర్ధజీవులు. భారతీయులలో ఆంద్ర్హులు వ్యర్ధ జీవులు’ అన్న మాట. అది తిరగబడి ’ఐటీలో, భారత్ ప్రపంచలోనే మేటి. భారత్ లో ఆంధ్రవాళ్ళు మేటి’ అన్న నానుడి వచ్చింది.]

ఇక భారత్ మార్కెట్టయితే, హిందూ మహా సముద్రమంత విస్తారంగా కన్పిస్తోంది విదేశీ కంపెనీలకి! అలాంటప్పుడు ఎందుకు చేయరు కుట్రలు? ఇందిరా గాంధీ హయాం నుండీ పీవీజీ హయాం దాకా, తరుముకు వెళ్ళింది, ఈ విదేశీయులకి భారత్ లొ మార్కెట్ల గేట్లు తెరిపించు కోవటానికే గదా? ఇక ఇప్పుడైతే....? చింతపండు కొట్టు i.e. సూపర్ మార్కెట్లు రిటైల్ దుకాణాలు దగ్గర నుండి సెలూన్ల దాకా పోటీలు పడుతున్నారు. సందు చివర కొట్టు పెట్టుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులని కూడా చితక్కొడుతున్నారు.

ఇక మంగలి షాపులు పెట్టుకుంటే.... ఎటూ ఆడవారికీ, మగవారికీ కూడా శిరోజాలంకరణ[హెయిర్ స్టైలిస్ట్ ]దుకాణాలు,[పార్లర్లు] తెరుస్తున్నారయ్యె! అందుకే కదా జడలు కత్తిరింపచేసి మరీ ఫ్యాషన్ల పేరుతో రక రకాల అలంకరణలు వచ్చింది. ఎంత తలకి మాసిన వాళ్ళైనా నెలకో సారైనా క్షవరం[బుడుగు భాషలో అయితే మెడ్రాసు క్రాపింగు షాపింగు] చేయించుకోక తప్పదు.

నూరుకోట్ల మందిలో కనీసం సగం మందైనా నెలకో సారి క్షవరం చేయించుకున్నా.... కనీసం తడవకి వందరూపాయలన్నా.... ఎంత వ్యాపారం? 50 కోట్లు x 100 = 5000 కోట్ల రూపాయలు. సంవత్సరానికి అరవై వేల కోట్ల వ్యాపారం.[మన సీఎం ఘనంగా చెప్పుకుంటున్న బడ్జెట్ లో సగంపైనే]. ఇదే నిష్పత్తిలో లోదుస్తుల దగ్గరి నుండీ పైదుస్తుల దాకా, కాస్మీటిక్స్ దగ్గరి నుండి తినుబండారాల దాకా, సినిమాల నుండి సెక్స్ వర్కర్స్ దాకా[ఇప్పుడు ఎలాగు వీళ్ళకి లైసన్స్ లు ఇస్తున్నారు కదా!]! ఎన్ని ఉత్పత్తులకి ఎంతెంత మార్కెట్!! ఇప్పటికే సెల్ ఫోన్ల విషయంలో ఇది మనందరం ప్రత్యక్షంగా చూసిందే!

ఇక విద్య, వైద్య రంగాలలోకి కార్పేరేట్లు ప్రవేశిస్తే, దోపిడి ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం కదా? పిల్లల్ని చదివించుకోకా, రోగం వస్తే వైద్యం చేయించుకోకా ఛస్తామా? వినోద రంగంలోకి, సినిమా నిర్మాణం లోకి ఇప్పటికే కార్పోరేట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఫలితాలూ కనుచూపు మేరలోనే ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యప్రజలు బ్రతకాల్సింది కార్పోరేట్ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టేందుకే! ముడి సరుకు దగ్గరినుండి తయారీ వరకూ, తయారీ నుండి రవాణా వరకూ, ఆపైన వినియోగం వరకూ.... అన్నిటా.... సామాన్యులు.... ఉద్యోగులుగా, కార్మికులుగా, శ్రామికులుగా చివరికి వినియోగదారులుగా.... అన్నిరకాలుగా వారి నియంత్రణలోనే ఉండాలి!

ఎటూ కార్పోరేట్ వ్యాపారులూ, అందులో వాటాలు కలిగిన రాజకీయ నాయకులూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంనికి అనుచరులే! అలనాడు చక్రవర్తులకి కట్నకానుకలూ, కప్పాలూ సమర్పించుకునే సామంతులూ, పాలెయ్యగాళ్ళ వంటి వారే.... నేడు నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులకి.... కార్పోరేట్ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఉన్న అనుచరులు.

కాకపోతే అప్పట్లో ఫలానా వాడు ఫలానా ప్రాంతానికి చక్రవర్తి అన్న రికార్డు ఉండేది. ఇప్పుడు ఆయాపదవుల పేర్లుగా అది రూపాంతరం చెందింది. ప్యాకింగ్ మారినా లోపలి సరుకు ఒకటే ఉన్నట్లుగా! అప్పట్లో అధికారంలో తెల్లతోలు వాళ్ళుంటే, ఇప్పుడు నల్లతోలు వాళ్ళున్నారు. అంతే!

లేకపోతే.... పొద్దున లేస్తూనే కుటుంబంలోని పెద్దలు తలా ఒక దిక్కుకు టిఫిన్ డబ్బాలు పట్టుకుని ఉరికితే, పిల్లలు మరో దిక్కుకు పుస్తకాల గోతాలు వీపుకేసుకుని ఉరుకుతూ.... ఉద్యోగమే పరమావధిగా... బ్రతకడమే లక్ష్యంగా.... ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికుల జీవన సరళి!

ఆ నాణానికి మరో పార్శ్యమే - ’జనం బ్రతకడమే తమ వ్యాపారం కోసం’ అన్న కార్పోరేట్ మంత్రం! ఇంకా... తమ వ్యాపారం కోసం కొత్తకొత్త పండగలు, దినాలు [ప్రేమికుల దినం, తల్లిదండ్రుల దినం, భాషకో దినం గట్రాలు], సెంట్ మెంట్లు, మోజులు, మోడళ్ళు, కొత్త ఆచారాలు [ధన్ తేరస్ లు ] గట్రా పుట్టిస్తారు.

అలాంటి చోట - భారతదేశంలో విశాల భూభాగం, భూగర్భ సంపద, అత్యధిక జనాభా! అందునా.... శ్రమించగల, మేధస్సుని ఉపయోగించగల, ఉద్యోగధర్మం అనుకుంటూ నిజాయితీగా కంపెనీల లాభాల కోసం ఆకలి ఆరోగ్యాలని, ఆలు బిడ్డలని విస్మరించి, పనిలో మునిగి పోయేంతగా దీక్ష చూపగల జనాభా!.... ఇంతకంటే వ్యాపార దిగ్గజాలకి ఇంకేం కావాలి?

ఇంతగా, ఈ దేశంలో దోచుకోవటానికి, వ్యాపారం చేయటానికి ఇన్ని వనరులు ఉన్నప్పుడు చేయరా కుట్రలు? అయితే పాతికేళ్ళ క్రితం, 1970 - 80లలో ఇందిరాగాంధీ ఈ మాట అంటే అంతర్జాతీయ మీడియా తెగ నవ్వేసింది మరి!

ఇప్పుడు సోనియా, ఆమె బృందం చేసినట్లుగానే.... దోపిడి, కార్పోరేట్ కంపెనీల దోపిడికి సహాయ సహకారాలందివ్వటం చేసి ఉంటే, ఇందిరాగాంధీ సైతం, ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్న సోనియా బృందం మాదిరిగానే, డబ్బు దాచుకోలేక పోయి ఉండేదా? దోచుకున్నన్ని నాళ్ళు, దోచుకున్నంత దోచుకుని, స్వదేశం విడిచిపోయిన ఇమెల్డా మార్కోస్ ల లాగా, తానూ వెళ్ళిపోవచ్చునని తెలియనిది కాదే? ఇమెల్డా మార్కోస్ పారిపోయినప్పుడు ఆమె ఇంటిలో పదివేల జతల చెప్పులు బయటపడ్డాయి. అదీ ఆ నాయకురాలి మోజు, సుఖలాలస క్రేజు! ఇలాంటి విషయాల్లో.... ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏం జరుగుతోందో అర్ధం కాని అమాయకురాలు కాదే ఇందిరాగాంధీ? అలా రాజీ పడటానికి బదులుగా ఎందుకు తుపాకీ గుళ్ళకు బలయ్యింది?

తన తర్వాత, తన కుమారుల పరిస్థితయినా ఇంతేనని తెలియనిది కాదు. అప్పటికే ఒక కొడుకు కళ్ళముందే అకాలమరణం చెందాడు. కుట్రకు వ్యతిరేకంగా పోరాడకుండా కుట్రదారులతో చేతులు కలిపి ఉంటే.... కోడలు సోనియాకి వచ్చినట్లు తనకీ ఇమేజ్, సమర్ధ నాయకురాలు బిరుదులు, ప్రపంచ ప్రభావశీల మహిళగా ప్రపంచవ్యాప్త రేటింగులూ వస్తాయని ఊహించలేనిది కాదు. ప్రతిపక్షాల చేత తనకి దాసోహం అనిపించుకునేది కదా? అప్పటి నుండి ఇప్పటి వరకూ మీడియా ప్రచారిస్తున్నట్లుగా, ఆమెకే గనక కీర్తి కాంక్ష ఉండి ఉంటే, కుట్రదారులతో చేతులు కలపటం తన చేతిలోని పని కదా! అప్పడెంతగా మీడియా తనని ఆకాశానికి ఎత్తేస్తుందో, అమెరికా సైతం తనకి ఎంత ప్రాధాన్య ప్రాముఖ్యతలిచ్చి వ్యక్తిగత ఇమేజ్ ఇస్తుందో ఇందిరాగాంధీకి తెలియని విషయమేం కాదు. అందునా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు స్పష్టంగానే తెలియజెబుతారు.

అయినా కుట్రకు వ్యతిరేకంగా పోరాడి తూటాలకి బలయ్యింది. రాజీవ్ గాంధీ సైతం బాంబుకు ఎరయై తునాతునకలయ్యాడు. అదే పోరాట బాటలో పీవీజీ మరణ పర్యంతం, మరణానంతరం అవమానాలే ఎదురౌతాయనీ తెలిసీ, ముందడుగే వేసాడు. అదీ భారతీయుల వారసత్త్వం, పోరాట ధీరత్వం!

అయితే విచారించదగ్గ, విషయం ఏమిటంటే - ఇలాంటి వారసత్వం కలిగి ఉన్న భారతీయుల్లో కూడా.... వెయ్యేళ్ళ క్రితం ఆఫ్ఘన్ ఇసుకపర్రల నుండి దోచుకునేందుకు భారత్ కు వచ్చిన ముస్లిం రాజులు గజనీ మహమ్మదులతో, ఘోరీ మహమ్మదులతో చేతులు కలిపి ప్రజాద్రోహానికి, దేశ ద్రోహానికి, ధర్మద్రోహానికి పాల్పడిన జయచంద్రుల్లాంటి వాళ్ళు.... రెండు మూడు వందల ఏళ్ళక్రితం యూరోప్ నుండి దోచుకునేందుకు భారత్ కు వచ్చిన బ్రిటీషు,ఫ్రెంచి వాళ్ళతో చేతులు కలిపి, సర్వద్రోహాలకు ఒడిగట్టిన గ్యాలియర్ సింధియాలు, విజయనగర గజపతులు వంటి వాళ్ళు.... ఉండటం.

మరింత విచారించదగ్గ విషయం ఏమిటంటే - అప్పుడు పోల్చి చూస్తే అల్పంగా ఉన్న ద్రోహుల సంఖ్య[ప్రత్యక్షంగా, పరోక్షంగా] ఈనాడు అత్యధికంగా ఉండటం.

ఇంతకీ ’ఎందుకంతగా ప్రాణాలు అర్పించి మరీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడారూ?’ అంటే - ప్రపంచదేశాల్లో ఆర్ధిక రంగంలో ఏం జరుగుతోందో, పెద్దవ్యాపారుల చేతిలో సామాన్యులు ఎలా నలిగి పోతారో, దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికే మన నాయకులకి అంచనా ఉంది! అందుకే రష్యాలో ఉన్నట్లు బలవంతపు సామ్యవాదాన్ని గానీ, అమెరికాలో ఉన్నట్లు పూర్తి స్వేచ్ఛా వాణిజ్యాన్నీ గానీ ఎంచుకోలేదు. అటు ప్రభుత్వ పెట్టుబడులతో ఉత్పత్తి వాణిజ్య సంస్థలుండేటట్లు, ఇటు ప్రైవేటు పెట్టుబడులతోనూ ఉండేటట్లు, పరస్పర పోటితో మార్కెట్టు నియంత్రణలో ఉండేటట్లు, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థని ప్రవేశపెట్టారు.

ఆచరణలో దానికి తూట్లు కొట్టటం ఎలాగో మనకి కుట్రదారులు చూపారు. సింగరేణి గనుల దగ్గరి నుండి ఆర్ టీసీ దాకా కార్మిక నాయకులు ప్రత్యక్షంగా రాజకీయనాయకుల జేబులో బొమ్మలు, పరోక్షంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు రామోజీరావుల చేతిలో పావులు. కొందరు కార్మికనాయకులు మరికొంత ముందుకెళ్ళి రాజకీయనాయకులు అయ్యారు. ఆయా నాయకత్వాల అధ్వర్యంలో, ఆయా సంస్థలు నష్టాలు చవిచూసాయి/ చూస్తాయి. అప్పటి ప్రభుత్వాలు అలాంటి వాటిని ప్రైవేటీకరించ నిరాకరించి నిందలూ నష్టాలూ పొందితే, ఇప్పటి ప్రభుత్వాలు నష్టాల వంక చూపి కొన్నిటినీ, లాభాలొస్తున్నా అదే దారిలో అన్నిటినీ అమ్మిపారేసాయి/పారేస్తున్నాయి.

పీవీజీ "ఇంటి సామానుల కోసం ఇల్లమ్ముకోవడం లాంటిది ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మడం" అన్నాడు. ఆయన హయాంలో రాజకీయ జీవితం ప్రారంభించిన అప్పటి విత్తమంత్రి, ఇప్పటి ప్రధానమంత్రి మాత్రం, సోనియా అధ్వర్యంలో, ప్రభుత్వరంగ సంస్థలని అంతరాయరహితంగా అమ్మిపారేస్తూ పోతున్నాడు.

ఇక్కడి భూగర్భ నిక్షేపాలని ముడిసరుకులుగా తరలించుకుపోయి, లేదా ఇక్కడే ప్రాసెస్ చేసి, అంతిమ ఉత్పత్తుల అమ్మకాలకీ మనల్నే మార్కెట్ గా మలచుకొని చేసే వ్యాపార దోపిడి ఇప్పటిది కాదు, బ్రిటీషు కాలం నాటి నుండి ఉన్నదే! ఇక్కడి పత్తి నెత్తుకెళ్ళి, బట్టల కట్టలుగా మార్చి, ఇక్కడికే తెచ్చి అమ్మేవాళ్ళు. పత్తిని వాళ్ళు చెప్పిన తక్కువధరకు అమ్మాలి. బట్టలని వాళ్ళు చెప్పిన ఎక్కువ ధరకు కొనాలి. ఇదీ దోపిడి! అందుకే బాపూజీ, ఆనాడు విదేశీ వస్త్ర మోజు అనే మాయలో పడి దోపిడికి గురవుతున్న వైనాన్ని ప్రదర్శింప చేస్తూ చరఖా చేబూనాడు.

మన వస్తువు కొనేటప్పుడూ, వాడి వస్తువు అమ్మేటప్పుడూ.... రెండుసార్లూ వాడు చెప్పిందే ధర! ఇక్కడే ఉంది దోపిడి కిటుకు! కావాలంటే పరిశీలించండి! కార్పోరేటు కంపెనీల వాళ్ళు తయారు చేసే సెంటూ సీసా దగ్గరి నుండీ టీవీ సెట్టు దాకా, ఉత్పత్తిదారుడే తన ఉత్పత్తి ధరని నిర్ణయించుకుంటాడు. అదే తిండి గింజలని ఉత్పత్తి చేసే రైతులైతే, టమాటా దగ్గర నుండీ ఏ పంటనీ, తనకు గిట్టుబాటు అయ్యే ధరకి అమ్ముకోలేడు. సరిగ్గా పంట వచ్చే సమయానికి మార్కెట్టు ధరలు పడిపోతాయి. అదీ ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ సాక్షిగా నకిలీ కణిక వ్యవస్థకి అందించే సహకారం!

మన పప్పెట్ ప్రధాని మంత్రి గారు ఒకడుగు ముందుకేసి "రైతులకి వ్యవసాయం సరిగ్గా చేతగాకే పంట దిగుబడి తగ్గుతుంది" అన్నాడు. అంటే రైతు పొలాలను అమ్ముకుంటే, ఎంచక్కా కార్పోరేట్ కంపెనీలే వ్యవసాయం చేసి బాగా పండిస్తాయని అతని అభిప్రాయం కాబోలు. ఇక రైతు దిగుబడి సమయంలో దోపిడికి గురి అవుతున్నాడనే మాటే ఉండదు. ఎలాగూ రైతులు కూలీలుగా మారిపోతారుగా! ఎటూ సెజ్ లలో కూలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు.

ఈ విధంగా, ఆనాటి ఇందిరాగాంధీ ఎందుకు విదేశీ కుట్ర అందో, ఆ కుట్ర ఫలితంగా మనం ఏం కోల్పోతున్నామో, ఈనాటి పరిస్థితులు బాగా తెలియజెపుతున్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ అన్నట్లే - ఇప్పుడు భారత్ లో తీవ్రవాదంతో, నకిలీ కరెన్సీతో, నకిలీ స్టాంపులతో, నకిలీ పాస్ పార్టులతో.... అన్నిరకాల కుట్రలలో పాక్ హస్తం ప్రత్యక్షంగా, పాకిస్తాన్ ని వెనకేసుకొస్తూ అమెరికా హస్తం పరోక్షంగా.... ఎంతగా బహిర్గతం అయ్యాయో, అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా కుట్ర బహిర్గతం [expose] అయ్యింది.

’ఓటమి స్ట్రాటజీ’ కారణంగానే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల విశ్వరూపం, నిజరూపం, కుట్ర స్వరూపం ఇంతగా ప్రదర్శితమయ్యాయి. నాలుగో దశలో ప్రధానాంశం ఇదే!

నాలుగో దశలో దేశం విషయంలోనే కాదు, మా కేసు విషయంలోనూ ’ఓటమే స్ట్రాటజీ’గా ప్రయోగింప బడింది. అందులోనూ మా ప్రమేయం లేకుండానే! వివరంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu