ఈ గూఢచర్య యుద్దంలో ’ఓటమే స్ట్రాటజీ’గా నెం.5 వర్గం ఎందుకు ఎంచుకుందీ, ఓటమినే గెలుపుగా మలుచుకొని లక్ష్యాన్ని ఎలా సాధించిందీ, సాధిస్తోందీ పరిశీలించాలంటే -

1]. నిరూపించకుండా చెబితే ఎవరూ నమ్మరు. అందుకు కొంత సమయం కావాలి. 350 ఏళ్ళుగా... మెల్లిగా ప్రారంభమై... ప్రపంచవ్యాప్తంగా బలపడిన నకిలీ కణిక వ్యవస్థనీ, నకిలీ కణిక అనువంశీయులనీ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులనీ గురించిన అస్తిత్వన్నే ఎవరూ గమనించని చోట, వారి కార్యకలాపాలనీ, నిజరూపాలనీ నిరూపించ కుండా చెబితే ఎవరు నమ్ముతారు?

1992 లో సోనియా నిజస్వరూపం ఇదని చెబితే.... ఎవరి దాకానో ఎందుకు, నేనే నమ్మను. రామోజీరావు గురించీ, మీడియా మాయాజాలాల గురించి మాత్రం?

ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొలుసు, ఒక శృతి, జరుగుతున్న కార్యకలాపాలలో ఒక సారూప్యత కనబడుతున్నాయి గానీ, 18 ఏళ్ళ క్రితం ఇంత స్పష్టత ఎక్కడిది?

కాబట్టి - నకిలీ కణికుల అనువంశీయులూ, వారి వ్యవస్థా, బహిర్గతం కావాలసిందే! ప్రపంచవ్యాప్తంగా, ముస్లిం గారాబం చేసిన/చేస్తున్న నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయమూ బహిర్గతం కావలసిందే!

అందుకు నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు పదవుల్లోకి వస్తేనే వాళ్ళ అసలు నైజం తెలిసేది! సోనియా, కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టక పోతే, ఆమె నిజరూపం ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు. సీతారాం కేసరి వంటి పప్పెట్స్ ని AICC అధ్యక్షులుగా పెట్టి రిమోట్ తో ఆడించటం చూడకపోతే, మన్మోహన్ సింగ్ వంటి మర బొమ్మలని ఎలా ఆడిస్తుందో అర్ధమయ్యేది కాదు. భర్త రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి రావద్దని గోలపెట్టిన ఇల్లాలు, 1996లో పీవీజీ ఓటమి తర్వాత, 1998లో, గడపదాటి రాజకీయాల్లోకి రాకపోతే ప్రపంచ ప్రభావశీల మహిళ ప్రాభవం ఎంతో మనకి మాత్రం ఎలా తెలిసేది?

అలాగే, భాజపా అధికారంలోకి రాకపోతే, ఎప్పటికీ అది ’క్రమశిక్షణ గల పార్టీ’ అన్న ముసుగులోనే ఉండేది. మొదట 13రోజుల పాటు, పిదప 13 నెలల పాటు అధికారంలో ఉన్నాక, ’ఒక్క అవకాశం ఇవ్వండని’ అర్ధించిన భాజపా ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఎన్టీయే అయిదేళ్ళు అధికారంలో ఉంది. అంతవరకూ తాము గర్జించిన, ప్రాణాలర్పిస్తామని గావుకేకలేస్తూ మత వైషమ్యాలని రెచ్చగొట్టి రక్తపు టేరులు పారించిన ’అయోధ్య రామమందిరం’ పట్ల గమ్మున గడిపేసింది. సరికదా, సైన్యానికి సరఫరా చేసే శవపేటికల దగ్గర నుండీ అన్నింటిలోనూ అవినీతితో, తామూ అవినీతికి మహారాజ పోషకులే అని నిరూపించుకుంది.

ముస్లిం తీవ్రవాదులు కిడ్నాప్ [కాందహార్] ప్రకరణం నిర్వహించారో లేదో... ఆఘమేఘాల మీద, రక్షణ మంత్రి స్వీయ రక్షణలో, చెరలోని టెర్రరిస్టులని విమానంలో భద్రంగా తీసికెళ్ళి మరీ అప్పగించటం చూడకపోతే, [ఈ టెర్రరిస్టులని పీవీజీ హయాంలో పట్టుకుని జైలులో వేసారు.], భాజపా సర్వకాల సర్వసామ్రాట్టు [అధ్యక్షులుగా ఎవరైనా ఉండనీయండి.] అద్వానీ... పాకిస్తాన్ కి వెళ్ళి ’జై జిన్నా’ అనటం చూడకపోతే, భాజపా అసలు రూపం అసలెప్పటికీ తెలియకపోను. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ లో కంటే ఎక్కువగా భాజపాలోనే అపహాస్యం పాలవుతుందనీ తెలియక పోను.

జాతీయ స్థాయిలో ఇలా...! అదే రాష్ట స్థాయిలో చూస్తే...? మామకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మారిన రాజకీయ గూఢచర్య నేపధ్యంలో తమకి అవసరం కాబట్టి, నకిలీ కణిక వ్వవస్థ , నెం.10 వర్గమూ, ఎన్టీఆర్ ని, అతడి రెండవ భార్య ’లక్ష్మీ పార్వతి’ అనే పైకారణంతో [over leaf reason]తో డ్రాప్ అవుట్ చేసింది. దాంతో చంద్రబాబు సీఎం అయిపోయాడు. సాపేక్షంగా గూఢచర్య అవగాహనా శక్తి ఎక్కవ ఉన్న చంద్రబాబు దిగంతాల దాకా రామోజీరావుకి లాబీయింగ్ చేసి పెట్టాడు. కేంద్రంలో దేవెగౌడ, గుజ్రాల్ ల ప్రభుత్వాలకి ’మతతత్త్వ శక్తులకి వ్యతిరేకంగా’ అంటూ మద్దతిచ్చాడు. తదుపరి దేశభద్రత, ఐక్యత దృష్ట్యా అంటూ మతతత్త్వ భాజపాకీ మద్దతిచ్చాడు. ఎన్టీయేలో భాగస్వామీ అయ్యాడు.

ఏది ఏమైనా ’కేంద్రంలో చక్రం తిప్పాడు’ అన్పించుకున్నాడు. రెండు ప్రభుత్వాలకి మద్దతు ఇప్పించటంలో రామోజీరావు పాత్ర కీలకమైనది. తెరవెనుక వ్యక్తి తెరమీదకి వచ్చాడు. భాజపా, ఎర్రపార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలతో రామోజీరావు సంబంధాలు బహిర్గతమైనాయి. అన్నిపార్టీల మధ్య, అందరి మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయ సిద్దాంతాలు లేనితనం కూడా బహిర్గతమైంది. దీన్నంతటినీ నెం.5 అడ్డుకోలేక పోయింది!? ఖచ్చితంగా చెప్పాలంటే అడ్డుకోలేదు. ఆ విధంగా పరిస్థితులని అనుమతించింది[allow చేసింది] కాబట్టే చంద్రబాబు, ఇతర రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు ఎంత అవకాశ వాదులో బట్టబయలు అయ్యింది. కానట్లయితే మామచాటు చిన్నల్లుడు చాలా నీతులూ చెప్పేవాడు. ఈ రాజకీయపార్టీలు కూడా చాలా నీతులు చెప్పేవి. గతంలో చెప్పాయి.

ఇది ఈ రాష్ట్రంలోనే కాదు. చాలా రాష్ట్రాల్లో ఉన్నది. బీహార్ లో! ’తనని అరెస్టు చేస్తే రక్తం పారుతుందన్న’ లాలూ జైలు కెళ్తే, ఎంతో రాజ్యాంగ బద్దంగా, ఏమాత్రం చదువుసంధ్యలు లేని గృహిణి రబ్రీదేవి భర్తకు ప్రతినిధిగా ముఖ్యమంత్రిణి అయిపోయింది. ఎంచక్కా పాతకాలంలోని జానపద రాజ్యాల్లాగా! ఆ విధంగా, ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని నెం.5 వర్గం బహిర్గతం చేసింది. లాలూనూ, జైలు నుండి ఇంటికి లోలకం మీద పెట్టి తిప్పినట్లు తిప్పారు. బీహార్ లో రక్తం అయితే పారలేదు గానీ, రబ్రీదేవి మాత్రం ఏడుపుపెడబొబ్బలు పెట్టి, ఏడ్చి, ఏడ్చి కళ్ళమ్మటి నీళ్ళు మాత్రం కారింది.

ఇందిరాగాంధీ తర్వాత సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీలు ’క్యూ’లో ఉంటే గొల్లున గొల పెట్టిన మీడియా, ముఖ్యంగా ఈనాడు రామోజీరావు, బీహార్ పాదుషాని పల్లెత్తు మాట అనలేదు. సరికదా అయ్యగారి కిళ్ళీ అలవాట్ల గురించి, క్రాపుల గురించి, చేపల కూరల గురించి, హస్య చతురత గురించి, ఇంకా చాలాచాలా వాటిగురించి చెప్తూ, ’దటీజ్ లాలూ స్టైల్’ అంటూ ప్రచారించింది. సాంబారు అన్నంలోకి వడియాల మాదిరిగా, మధ్య మధ్యలో చిన్న చిన్న సంఘటనలని జోడించి మరీ! రైల్వేమంత్రిగా తెగ లాభాలార్జించి అంతర్జాతీయంగా అందరికీ ప్రైవేట్ కూడా చెప్పాడనిపించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ తెచ్చిన లాభాలేమిటో గాని, ఇప్పుడు మమత ఆ లెక్కల డొక్కలు లాగుతోంది. తమిళనాడు లో కరుణానిధిలూ, మళయాళ వాడలో కరుణా కరన్ లూ ఇదే బాపతు!

వీళ్లందరూ గెలిచి పదవుల్లో కూర్చోన్నందునే వారి నిజరూపాలు బహిర్గతం అయ్యాయి. నెం.5 వర్గం ఆయా ఘటనలలో ఓడి మరీ గెలిచింది. 1992 తర్వాత మళ్ళీ గెలవనట్లయితే... కరుణా నిధిలూ, కరుణా కరన్ లూ, తాము అధికారంలో ఉన్న గతం గురించి వంద ద్వంద్వాలు, మరో వెయ్యి నీతులూ చెప్పి ఉండేవాళ్ళు. కాబట్టే తాజాగా మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రత్యక్ష ప్రసారం [live telecast] లో లాగా తమ చర్యల్ని, నిజ స్వరూపాలనీ బహిర్గత పరుచుకున్నారు, సువర్ణముఖిలూ ఎదుర్కొంటున్నారు.

ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చూసినా... పాకిస్తాన్ ప్రాభవం బహిర్గతమై, అమెరికాని సైతం అజమాయిషీ చేయగల స్థితిలో పాకిస్తానూ, సీఐఏ కంటే పటిష్టంగా ఐఎస్ ఐ ఉండటమూ ఇప్పుడందరికీ తెలుసు. వీటి గురించి మరింత వివరంగా ’ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు’ అనే టపాల మాలికలో వ్రాసాను.

2]. నిజానికి నెం.5 వర్గం తాను నెగ్గుకు రాలేక పోతున్నానన్న పిక్ఛర్ ఇస్తూ, ’ఓటమినే స్ట్రాటజీ’గా ఎంచుకుని, ఏ సంఘటనకి ఆ సంఘటనలో పోరాడి ఓడినట్లుగా గూఢచర్యాన్ని నడిపింది. సహజంగానే తమకు ’నడుస్తుంది’[గెలుస్తున్నాం] అనుకున్నప్పుడే ఎవరైనా ముందుకు అడుగులు వేస్తారు. నిజరూపాలు బయటపడినా పట్టించుకోరు. అంతా తమ అధీనం[control] లోనే ఉందనే అతిశయం అది! అదే ’నడవటం లేదు’ అన్పిస్తే....?

అతిశయమూ ఆత్మన్యూనతా పరస్పర విరుద్దాలు. తరంగాలలో గనక శృంగ ద్రోణులు [crest & Trough] ఉన్నట్లుగా, ఏ మనిషిలోనైనా, ఎంతగా అతిశయమూ అహంకారమూ ఉంటాయో, అంతగా ఆత్మన్యూనత ఉంటుంది. ’తమకి ఎదురు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి’ అనుకున్న పరిస్థితులలో అతిశయ అహంకారాలు ఉధృతంగా ఉంటే, తద్విరుద్ద పరిస్థితులలో ఆత్మన్యూనత ఉధృతంగా ఉంటుంది. [ఆశ నిరాశలు కూడా అంతే. ఎంతగా ఆశకి గురౌతామో, నెరవేరని ఉత్తర క్షణంలో అంతగా నిరాశకి గురవ్వటం చాలామందికి అనుభవమే. అందుకే గీత స్థిత ప్రజ్ఞత (balance) సాధించమంటుంది.]

అందుచేతే, నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకి ’తమకి నడుస్తోంది’ అన్పించే పరిస్థితులని, భావాలని కలగనిచ్చింది. ’అలాక్కాదు, తమకంటే నెం.5 వర్గానికే గూఢచర్య పట్టు ఎక్కువగా ఉందీ’ అనుకుని ఉంటే - నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ తమ నిజ స్వరూపాలు, కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ముసుగులు తీసుకోవడానికీ, ద్వంద్వాలు[Paradoxes] సృష్టించడానికీ ప్రయత్నించేవాళ్ళు.

ఇక్కడ మీకు ఓ సందేహం రావచ్చు. అమ్మఒడి - ఓ ప్రక్క, ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు రావటం, ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో భాగంగా నకిలీ కణిక వ్వవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులూ బహిర్గతం అవుతున్నారు, సువర్ణముఖి అనుభవిస్తున్నారు - అంటోంది.

మరోప్రక్క - ’తమకి నడుస్తుంది’ అనుకున్న పరిస్థితులలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అతిశయించి మరీ తమ నిజస్వరూపాలు బయటపెట్టుకున్నారు - అంటోంది ’ఇదేమి గందరగోళం?’ అన్పించవచ్చు.

ఈ గందరగోళం తీరాలంటే గూఢచర్య వ్యవస్థలు పనితీరు మరి కొంచెం తెలియాలి. వివరిస్తాను.

నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులతో సహా చాలామందికి, పైకారణంగా [over leaf reasons] ఇతర వృత్తులు నిర్వహిస్తూనో, నిర్వహిస్తున్నట్లు అభినయిస్తూనో ఉంటారు. అందుచేత పూర్తి సమయం గూఢచర్యానికి కేటాయించలేరు. కేటాయించినా, ఒక్కరికి లేదా ఒకరిద్దరున్న బృందానికి... వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో, వివిధ వ్యక్తులని, వివిధ పరిస్థితులని గురించిన సమాచారాన్ని విశ్లేషించుకోవటం... ఆయా ప్రాంతాల, దేశాల, వ్యక్తుల, పరిస్థితుల గతాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తుని డిజైన్ చేసుకుని, వాటన్నిటిని బట్టి వర్తమానాన్ని నియంత్రించటం అసాధ్యం. అందుచేత గూఢచర్య సంస్థలు విశ్లేషణా కేంద్రాలని[analyzing centers ని] నిర్వహిస్తూ ఉంటాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu