నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గం తాలూకు గూఢచర్య వలయం అర్ధమైన తర్వాత... పీవీజీ, నెం.5 వర్గమూ తమ పని తీరుని కొన్ని దశలుగా, కొన్ని విభాగాలుగా విభజించుకున్నారు.

పనితీరు విభాగాలలో....

1]. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని దాదాపు అన్ని అంశాలని, అందరు ఏజంట్లనీ, అన్ని కేంద్రాలని నిర్థారించుకోవటం [సమాచార కేంద్రాలు, ఏవైతే గూఢచర్యం నిర్వహిస్తున్నాయో ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు, విశ్లేషణా కేంద్రాలు గట్రాలని].

2]. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులకి అనుమానం రాకుండా, చాకచక్యంగా, వాళ్ళ వలయంలోని వివిధ అంశాలకు వ్యక్తులకు కేంద్రాలకు సంబంధించిన విషయాలలో, తమ పరోక్ష ప్రమేయాన్ని ప్రవేశపెట్టటం. సమాచారాన్ని ’టాంపరింగ్’ చేయటమన్నమాట! ఈ విషయంలో ఎవరికైనా ఉపయోగపడేది ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానమే!

3]. తద్వారా ఎక్కడి కక్కడ ’కన్నా?కాలా?’ స్ట్రాటజీని అమలు చేయటం.

4]. చివరికి... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం యొక్క గూఢచర్య కలాపాలని, అందులోని వ్యక్తుల నిజరూపాలని బహిర్గతపరిచి, సువర్ణముఖులు అనుభవింపచేయటం.

5]. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ఎవరికి కనిపించకుండా, 1992 కు ముందు భారత దేశాన్ని, ప్రపంచాన్ని, ఏవిధంగా అయితే మోస చేసిందో, అవే మోసాలను మళ్ళీ వాటి చేతే తిరిగి ప్రయోగింపచేస్తూ, నెం.5 వర్గం, వాళ్ళని ’బుక్ ’ చేయటం. అదే బహిర్గతం చేయట మంటే.

ఇందుకే ’ఓటమే స్ట్రాటజీ’గా తీసుకోబడింది. తొలిదశలో నకిలీ కణిక వ్యవస్థలోని అన్ని అంశాలని, వ్యక్తులని, పనితీరుని నిర్ధారించుకున్నారు. సహజంగా అన్పించే పైకారణాలతో [over leaf reasons], ఎక్కడికక్కడ, ఏ సంఘటనకి ఆ సంఘటనలో, సమాచార ప్రసారంలోనూ, విశ్లేషణలోనూ, అమలులోనూ, అమలు గురించిన సమాచార సేకరణలోనూ ’టాంపరింగ్’ చేసుకుంటూ పోయారు. అది కూడా ఏమాత్రం తొందరపాటు లేకుండా! అవసరాన్ని, అవకాశాన్ని బట్టి! అందుచేతనే 1993 నుండి తొలి సంవత్సరాలలో, తమకి వచ్చిన అసైన్ మెంట్లకి నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు, తమవైన భాష్యాలు చెప్పుకున్నారు తప్ప, అవి long run లో ఆత్మహత్యా సదృశ్యంగా పరిణమించగల assignments అని గుర్తించలేకపోయారు.

ఇక్కడ మీకు కొన్ని పోలికలు చెబుతాను.

ఓ పెద్ద గొర్రెల మంద ఓ 100 ఎకరాల విశాలమైన వృత్తాకార పచ్చికమైదానంలో గడ్డి మేస్తున్నాయనుకొండి. కొన్ని గుంపులుగా, మరికొన్ని విడివిడిగా, ఆ మైదానంలో ఇచ్ఛానుసారంగా మేస్తున్నాయి. ఎక్కడా ఏ హద్దులూ లేవు. మైదానపు అంచుల దాకా వెళ్ళాల్సినంత అవసరమూ లేదు. ఈ దశలో... మైదానపు అంచులలో... అక్కడక్కడా... కొద్దికొద్దిగా కంచె నిర్మించుకుంటూ వచ్చామనుకొండి. ఆపైన మెల్లిగా మైదానం చుట్టూ కంచె పూర్తి చేసి, క్రమంగా ఆ కంచె వ్యాసార్ధాన్ని తగ్గించుకుంటూ వచ్చామనుకొండి. చివరికి గొర్రెల పరిధి కుదించుకు పోతుంది. మొదటి దశలో ఇవి గుర్తించవు. ఒకప్పుడు దిగంతాల అంచుల వరకూ ఉందా అన్నట్లనిపించిన మైదానం, ఇప్పుడు ఇరుకై, కదలా మెదల లేని స్థితి తయారౌతుంది. ఇదే ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకీ ఉన్న పరిస్థితి!

నిజానికి దీన్నే , ఇంతకు ముందు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, హిందూ సమాజానికి విధించింది. మత విశ్వాసాల పరంగా, సంస్కృతీ పరంగా.... అవహేళన చేయటం, ఆత్మన్యూనత సృష్టించటం, వివాదాలు పుట్టించటం, భావాజాలం మధ్య అవధులు తొలిగించటం, మొత్తం విషయాన్ని హస్వదృష్టి కలిగేటట్లు ఎక్కడికక్కడ విరిచి ప్రచారించటం వంటి వ్యూహాలతో కంచె నిర్మించింది. ఇప్పుడు నెం.5 వర్గం, గూఢచర్యం, ఆధునిక శాస్త్ర సాంకేతికతలతో, అదే స్ట్రాటజీని తిరిగి నకిలీ కణిక వ్యవస్థ మీద, నెం.10 వర్గం మీదా ప్రయోగించింది.

తొలిదశలో ఇలా ’హద్దులు’[కంచె] ఏర్పడటాన్ని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు గమనించుకోలేదు. గమనించినా, తమకి కలిగించబడిన ఒత్తిళ్ళ రీత్యా, ఎదుటి పక్షం[నెం.5 వర్గం] ఓటమిలో ఉండటంతో, పట్టించుకోలేదు. నెం.5 వర్గం దీన్నంతా నింపాదిగా, నెమ్మదిగా నిర్వహించింది. అందుకోసం కూడా ’ఓటమి స్ట్రాటజీ’ని ఎంచుకుంది. ఆ రీత్యా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు, తొలిదశలో తమకు వచ్చిన అసైన్ మెంట్లని తమ అరిషడ్వార్గాలతో చూసి, సంతృప్తిగా, ఇష్టంగా, కసిగా నిర్వహించారు. Involvement తో నిర్వహించారు.

కాబట్టే కంచె ఇరుకయ్యాకే నొప్పి తెలిసింది. దీన్నే మరో పోలికలో చెప్పాలంటే - ప్రపంచవ్యాప్తంగా తమకి బోలెడుమంది ఏజంట్లు ఉన్నప్పుడు, ఏ కారణంగానైనా, ఒక ఏజంటుని లేదా కొందరు ఏజంట్లని డ్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దగా పట్టించుకోరు. మెల్లిగా ’అనుభవజ్ఞులైన ఏజంట్లు తక్కువైపోయారు’ అన్న స్థితికి చేరినప్పుడు...? అప్పుడు నొప్పి తెలుస్తుంది. చదరంగపు బోర్డు మీద నిండుగా పావులున్నప్పుడు బంటుని కాదు కదా, ఒక శకటుని పోగొట్టుకోవాల్సి వచ్చినా పెద్దగా వెనుకాడం. అదే పావులన్నీ అయిపోయి కొన్నే మిగిలి ఉన్నప్పుడు, ఒక బంటుని చంపు కోవాలన్నా వెనక ముందు లాడతాం, అలాగన్న మాట!

ఇంకా ప్రస్పుటంగా అన్పించే పోలిక చెప్పాలంటే - లక్ష రూపాయలు చేతిలో ఉన్నప్పుడు ఓ వంద ఖర్చు పెట్టటాన్ని అసలు పట్టించుకోం. అదే వెయ్యే ఉంటే...? కాస్త వెనకడతాం. అసలు వంద రూపాయలే ఉన్నాయనుకొండి. అందులోంచి పది రూపాయలు తీసి ఖర్చు పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. సరిగ్గా ఇలాంటిదే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల నేటి పరిస్థితి!

ఈ స్థితికి వాళ్లని ఎంతో నైపుణ్యంగా, తొందరపాటు లేకుండా, నింపాదిగా నడుపుకు వచ్చింది నెం.5 వర్గం. అందుకోసం ’ఓటమే స్ట్రాటజీ’ ని అమలు పరిచింది. ఆయా సంఘటనలలో, ఆయా సందర్బాలాలలో ఎదిరి పక్షం ఓడిపోయిందనుకున్నప్పుడు ఒక ఏమరుపాటు కలుగుతుంది. తమ కామ క్రోధాది అరిషడ్వార్గాలరీత్యా, ఆయా సంఘటనలకు తమకు నచ్చే భాష్యాలు చెప్పుకున్నారు. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గూఢచర్య వలయమైనందున, ఇంతకు ముందు ఏవి తమ బలాలు[Advantages] అయ్యాయో, అవే ఇప్పుడు బలహీనతలు [Disadvantages] అయ్యాయి.

గతటపాలలో చెప్పినట్లుగా... ఒకే చిత్రాన్ని, వివిధ భాగాలుగా చేసి, వేర్వేరు చిత్రాకారులు, వేర్వేరు చోట్ల, వేర్వేరు కాలల్లో, వేర్వేరు కాన్వాసుల పైన చిత్రించారను కొండి. అన్ని చిత్రాల విభాగాలని సరైన క్రమంలో అమర్చితేనే, అసలు మొత్తంగా చిత్రించబడిన బొమ్మ ఏమిటో అర్ధమౌతుంది. ఇదే బరాక్ ఒబామా చిత్రాన్ని ఒంటి మీద చిత్రించుకున్న మనుష్యుల పోలికతో గతటపాలో చెప్పాను.

ఈ ’విభజించి - పనిచేయటం’ అనే తంత్రాన్ని, అంతకు ముందు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచం మీద ప్రయోగించింది. ఇప్పుడు దాన్నే, నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ మీద ప్రయోగిస్తోంది. అయితే... చాలా సంఘటనలు వరుసగా జరిగాక, అనుభవంరీత్యా, అంతఃచ్చేతనకి [6th sense కి] ఓ విషయం అర్ధమౌతుంది. ’ఎటు పోయి ఎటు వచ్చినా గుండు పగిలేది తమకే, నష్టపోయేది తమే!’ అన్న స్పృహ అది. గూఢచర్యంలో ఎవరికి పట్టు ఉంటే వారు, ఎదిరి వర్గానికి ఇంకించగలిగిన స్పృహ! కాబట్టే నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ ఇప్పుడిప్పుడే ఈ స్పృహ కలుగుతోంది.

అచ్చంగా... గుండమ్మ కథ లో రమణారెడ్డి లాగా! ఆ నలుపు తెలుపు చిత్రం చాలామంది చూసి ఉంటారు. సూర్యాకాంతం, సావిత్రి, జమున, ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీ రంగారావు నటించిన పాత చిత్రం! అందులో ఎన్టీఆర్[అంజి], పిల్లని చేసుకునేందుకు గుండమ్మ గారింట పనివాడిలా చేరతాడు. గుండమ్మ గారికి వరుసకి అన్న ఘంటన్నగా రమణా రెడ్డి నటించాడు. అందులోని చాలా సన్నివేశాలలో అంజి కీ, ఘంటన్నకీ మధ్య నడిచే హాస్య సంభాషణలో ’ఎటుపోయి ఎటు వచ్చినా’ ఘంటన్న మీదే సెటైర్ పడుతుంటుంది. అది చూసి మనం కడుపుబ్బ నవ్వుకుంటాం. సరిగ్గా... అలాగ... గూఢచర్యంలో ఎవరికి పట్టు ఉంటే వాళ్ళు , ఎదిరి వర్గానికి, ఏం చేసినా అందులోంచి Disadvantage మాత్రమే పొందేలా వ్యవహారం నడుపుతారు.

ఒకప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ఇందిరాగాంధీ వంటి వారికి ఈ స్థితి కలిగించింది. ఇప్పుడు అదే స్థితిని, నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థకీ నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా గట్రాలకి కలిగిస్తోంది.

ఈ ’ఓటమి స్ట్రాటజీ’ ని నెం.5 వర్గం ఎంచుకోవటానికి -

1992 నాటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పట్టు ఒక కారణం అయితే, ప్రజల వైపు నుండి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఈ టపాల మాలికలోని గతటపాలలో కొన్ని కారణాలు వివరించాను. మరికొన్ని ఇక్కడ...

1]. గత టపాలలో చెప్పినట్లు, మన ఒక్కరి ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలదు. వీధిలో అందరూ శుభ్రంగా ఉండనిదే, వీధి శుభ్రంగా ఉండనిదే మన ఇల్లు శుభ్రంగా ఉండటం అసాధ్యం. అందునా ఇది ప్రపంచవ్యాప్త వలయం అయినందునా, అన్నిదేశాలూ పరస్పర ఆశ్రితాలు అయినందునా ఇది తప్పని సరి! అందుచేత, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజా దృక్పధంలో మార్పు రావాలి. ప్రజలలో రజోగుణం రగలాలి. అందుకు తగినంత సమయం పడుతుంది. అందుకు సైతం నెం.5 వర్గం ’ఓటమే స్ట్రాటజీ’గా ఎంచుకున్నది.

2]. మరో కారణం ఏమిటంటే - ప్రజల అవగాహనా స్థాయి అప్పటికి చాలా తక్కువగా ఉండటం. సినిమా వంటి కళారూపాలు, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ తంత్రాలతో ప్రజల తార్కికత, ఆలోచనా పటిమ తామసంతో నిండి ఉన్నాయి. నకిలీ కణిక వ్యవస్థ సృష్టించిన అనేక ద్వంద్వాలని, వితండ వాదనలని నమ్ముతూ కొందరూ, ఆ స్వార్ధపు పరుగులో మునిగి కొందరు, ఏది చెప్పినా అర్ధం చేసుకోగలిగే స్థితిలో లేరు. అందుకూ తగినంత సమయం అవసరమే!

3]. మరో కారణం కూడా ఉంది. అప్పటికే తలకెక్కిన స్వార్ధం, అహంకారం, అజ్ఞానాలతో...."ఈ రోజుల్లో సుఖంగా బ్రతకాలంటే పాపం పుణ్యం, మంచీ చెడూ అని ఆలోచించకూడదు. చెప్పేటందుకే నీతులు బాగుంటాయి. ఆచరించటానికి కాదు" గట్రా భావజాలంతో, ప్రజలలో అత్యధికులు... అవకాశం లేక గానీ, వీలు కుదిరిందో తామూ ఒక రామోజీ రావులే! దీన్నే వై.యస్. తన ’గారెల వంట’ గూఢచర్యంతో నిరూపించాడు కూడా!

కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం. దొంగల/మాఫియా ముఠాల నాయకుడు గనక, ఏకారణంచేతనైనా వెనక్కి తిరిగితే, ’ఈ పదవి వద్దు’ అంటే, అప్పటి వరకూ ఆ నాయకుడికి కుడిభుజంగా ఉన్న అనుచరుడు, సదరు నాయకుణ్ణి ప్రక్కకు తప్పించి తానే గుంపుకి నాయకుడై పోయినట్లు!

మన పురాణాల్లో... మషిషాసురుడి దేహం నుండి నేల రాలిన ప్రతి రక్తపు బొట్టు మరొక మహిషాసురుడిగా ఉద్భవించినట్లు! నేలను చేరటం అంటే, తనకి తగిన చోటు లభించటం లేదా తగిన అవకాశం దొరకటం. అంతే! ప్రతీ రక్తపు బొట్టు మరొక రాక్షసుడిగా రూపాంతరం చెందుతుంది. అందుకే ఆ జగదాంబ అపర కాళికయై, అనేక ఆయుధాలని ఏకమాత్రంగా ఉపయోగిస్తూ, నేలను జారే ప్రతి రాక్షస రుధిర బిందువునీ తన పొడవైన నాలుకతో గ్రహించివేస్తుంది. వాడి శిరస్సు ఖండించినప్పుడు సైతం, రక్తాన్ని పాత్రకు నింపి పానం చేస్తుంది. అదీ రాక్షస సంహారం అంటే!

దాదాపు, ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి కూడా ఇదే! అవకాశం దొరికితే ప్రజలలో అత్యధికుల లోని అవినీతి, రాజకీయ నాయకులకి, రామోజీరావుకి ఏమాత్రం తీసిపోదు. అందుకోసం కూడా నెం.5 వర్గం తగినంత సమయం ఇవ్వాలనుకుంది. అందుకోసమే ’ఓటమే స్ట్రాటజీ’గా తీసుకుంది. అందుకోసమే... అక్కడక్కడా అన్యాయానికి ఎదురొడ్డి, ఫిర్యాదుల రూపేణానో, ఫిర్యాదులకి స్పందిస్తూనో పోరాడిన వారిని [రాజకీయ నాయకుల దగ్గరి నుండి ఉద్యోగ వర్గం దాకా... సామాన్యుల దగ్గరి నుండి వ్యాపారుల దాకా!] ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రక్కకు తప్పించింది. ఆ విధంగా బారికేడ్లు ఎత్తివేయడంతో అవినీతిలో పోటీ ఎక్కువైంది. గతటపాలలో దీని గురించి వివరించాను.

హద్దులు తీసి అవినీతిలో పోటీ ఎక్కువై, పంపకాల దగ్గర వివాదాలు రగిలి, అసలు గుట్టు రట్టు అవుతుండటం ఇప్పుడు మనం చూస్తున్నదే! ఈ విధంగా... ’ఓటమే స్ట్రాటజీ’గా తీసుకొని నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థలోని గూఢచర్య వలయంలోకి చొరబడి, సమాచార ప్రసారంలోనూ, విశ్లేషణల్లోనూ టాంపరింగ్ చేయటం అనే ప్రక్రియలో, ఎక్కడా ప్రత్యక్ష జోక్యం లేకపోవటంతో, నెం.5 వర్గంలో, ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవటం నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికి అసాధ్యమైపోయింది.

ఇందులో నెం.5 వర్గపు పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవాలంటే - చిన్న ఉదాహరణ ఇస్తాను.

అత్యధిక శాతం ప్రజలలో, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ ఏజంట్లలో ’డబ్బు తప్ప ఏదీ ముఖ్యం కాదు. డబ్బు కోసం ఏ పనైనా చేయవచ్చు, నీతి, విలువలు అనేవి బ్రతక చేతగాని వాళ్ళమాటలు’ అన్న అభిప్రాయం వేళ్ళూనుకొని ఉంది.

ప్రజలలో ఇంతగా ఈ దృక్పధాన్ని ఇంకించిన నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు, తమ అనుచరులు మాత్రం, తమ పట్ల ’కృతజ్ఞత, నమ్మకం, విధేయత’ వంటి పాజిటివ్ లక్షణాలు చూపాలనుకుంటారు.

"నమ్మించి ద్రోహం చేస్తావా?" అంటే

"నమ్మకపోతే ద్రోహం ఎలా చెయ్యటం" అంటూ విలన్ నవ్వులు నవ్వటాన్ని, సినిమా జోకులతో ప్రజలకి పరిచయం చేసిన నకిలీ కణిక వ్యవస్థ, తమకి మాత్రం తమ అనుచరులు, ఎన్నడూ నమ్మక ద్రోహం చెయ్యకూడదు. కృతజ్ఞత, విధేయతలే చూపాలి.

సరిగ్గా ఇక్కడే నెం.5 వర్గం పనితీరు ప్రభావం చూపింది. ఇందుకోసం తమ పట్టు బలపడే వరకూ ’ఓటమి’ పొందుతూ, సమయాన్ని gain చేసుకుంది. ఇప్పుడు చూసుకుంటే - నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని వారికి నమ్మకస్థులైన ఏజంట్ల ముందు "కన్నా?కాలా?" స్ట్రాటజీ ఏవిధంగా ఎదురుగా నిలబడిందంటే - ఇప్పటి వరకూ తమకి కెరీర్, డబ్బూ, ఇమేజ్ ఇచ్చిన తమ బాస్ ల పట్ల విశ్వాసం, కృతజ్ఞత, విధేయత ప్రకటిస్తూ, వారికి రక్షణ కవచంలా పనులు చేసిపెడితే... నెం.5 వర్గం తమ లొసుగుల్ని, అవకతవకలని, అక్రమ సంపాదనలని బహిర్గతం చేస్తోంది. తమ జాతర బొమ్మల చేత తమ గుట్లు రట్టు చేయిస్తోంది. జాతర బొమ్మలకి, తమ కెరీర్ కోసం, తప్పని సరిగా ఎదుటి వాడిని unpopular చేయక తప్పదు కూడా! ఇది చంద్రబాబు Vs వై.యస్. విషయంలో మనకి బాగా కన్పిస్తుంది. అలాగే నియోజక వర్గాలలో ఇరు పార్టీల నాయకుల మధ్యకూడా ఇదే బాపతు స్ట్రాటజీ!

గూఢచర్య పట్టు చేజారిన, బలహీనపడిన నకిలీ కణిక వ్యవస్థ, [అందులోని తమ బాస్ లు ఎవరైతే వాళ్ళు] ఇప్పుడు తమని రక్షించలేకపోతోంది. తాము ఎదురుతిరిగితే తమని శిక్షించనూ లేకపోతోంది. అలాంటప్పుడు ’నమ్మకద్రోహం చేయకూడదు’, ’ఒకప్పటి బాస్ ల పట్ల కృతజ్ఞతా, విధేయతా కలిగి ఉండాలనే’ నీతులెవరి క్కావాలి? డబ్బుపరుగులో వెనకపడకూడదు. ఇవాళా రేపూ ఇదే బ్రతక నేర్చినతనం! ఇదే నకిలీ కణిక వ్వవస్థలో దిగువస్థాయి ఏజంట్ల దగ్గర మొదలై పైస్థాయి ఏజంట్ల దాకా పాకిన స్థితి. [దీనికి ఉదాహరణ సీతారాం కేసరి Vs శరద్ పవార్! శరద్ పవార్ కే AICC అధ్యక్ష పదవి కాని, ప్రధాన మంత్రి పదవి ఇస్తానన్న హామీ గానీ ఇచ్చిఉంటే, కాంగ్రెస్ నుండి బయటికి వచ్చేవాడు కాదు.]

"డబ్బు ముందు నీతులు, విలువలూ పనికిరావు. డబ్బేముఖ్యం" అంటూ, తము నేర్పిన దృక్పధం ఇప్పుడు తమకే ప్రాణాంతకమవ్వటం, తము ప్రయోగించిన ఆయుధం తిరిగి తమనే గాయపరిచినట్లుగా అయ్యింది.

ఇందుకు నెం.5 వర్గం జాతర బొమ్మలనే ఎంచుకుంది. ఎటూ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ఎక్కడికక్కడ జాతర బొమ్మలనీ, జంట పీతలని తయారు చేసిందయ్యె! ఆ సమాచారం మొత్తాన్నీ, నెట్ వర్క్ అంతటినీ, Take over లేదా over power చేసిన నెం.5 వర్గం, ఆ జాతర బొమ్మలకీ - ఒకరి గురించి [లొసుగులు, అక్రమాలు, బలహీనతల గురించీ] మరొకరికి సమాచారాన్ని leak చేయటమే గాక ’కన్నా?కాలా?’ అన్నతంత్రం ప్రయోగించి ’చంపు లేదా ఛస్తావ్’ అనే స్థితిని కలిగించింది, కలిగిస్తోంది.

దీనికి ఉదాహరణగా - సోనియా ఎన్ని తప్పులు చేసినా అద్వానీ వాటన్నిటిని వదిలేస్తూ, ఏవో రాజకీయ భాష్యాలు చెప్తూ ఉంటే, దిగువస్థాయిలో పార్టీ మీద ఒత్తిడి ఎక్కువయింది. అద్వానీ, సోనియాని విమర్శించటం తూతూమంత్రంగా చేస్తున్నాడు. కాబట్టి అనివార్యంగా పదవి నుండి బయటికి రావలసి వచ్చింది. ఇది ఒకరకంగా కన్నా? కాలా? స్ట్రాటజీ లాంటిదే. సోనియాని విమర్శిస్తూ, ఇరుకున పెట్టటం ఉధృతం అయినా చేయాలి, లేదా పార్టీ పదవి నుండి తప్పుకోవాలి. చెల్లెలులాంటి సోనియాని ఏం విమర్శిస్తాడు? అందునా, వీళ్ళిద్దరూ ఎప్పుడూ జాతర బొమ్మలు కాదయ్యే!

ఇదంతా నిర్వహించడానికి... నెం.5 వర్గం, ఎక్కడా ఎవరినీ, ప్రత్యక్షంగా కలవటం గానీ, పని పురమాయించడం గానీ చేయటం లేదు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం తాలూకూ సమాచార వలయం లోంచే, గూఢచర్యవలయంలోంచే తమపని చక్కబెట్టుకుంటూపోతోంది. ఎవరికైనా వారి సంకల్పం ఏదైతే అదే రకమైన అసైన్ మెంట్ రావటమే ఇక్కడ విశేషం! అలాగని మంచి వారి పట్ల, దుష్ట సంకల్పాలు ఫలిస్తాయనుకుంటే అది దురాశే!

కాబట్టే - గతటపాలలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ఎవరినైనా... భయపడితేనే భయపెట్టగలదనీ, ప్రలోభపడితేనే ప్రలోభపెట్టగలదనీ, ధైర్యపడిన వాళ్లని అది ఏమీ చేయలేదనీ వ్రాసాను.

కావాలంటే పరిశీలించండి.....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

If you reveal their strategy this way, how can they(N0.5) continue the operation?

అమ్మా! ఇక మిమ్మల్ని అడగకుండా ఉండటం నావల్ల కాదు. నెం.5 / నెం.10 వర్గాలంటే ఏమిటో విశిదీకరించండి, వాటి అర్థం తెలీకుండా వ్యాసలు చదవలేకున్నాను. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూంటాను.

gsnaveen gaaru,

Read this tapaa...
http://ammaodi.blogspot.com/2009/05/assumptions-11no10-vs-no5.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu