నాబ్లాగు చుట్టాలందరికీ ఒక విషయం స్పష్టపరచాలి. ఇది నేను ఊసుపోకనో లేక కాలక్షేపానికో వ్రాయలేదండి. అలాగే ఏదీ ఆశించి కూడా వ్రాయటం లేదు.

నేను 16 ఏళ్ళుగా పోరాడి, అనుభవించి తెలుసుకున్న నిజాన్ని చెప్పడానికి వ్రాస్తున్నాను.
చాలామంది ఎవరీ నకిలీ కణికుడనీ, అతడికీ మనకీ సంబంధం ఏమిటని అడిగారు. మరికొంత మందికి ’నేనెవరూ, నేను చెబుతున్నది ఎంత వరకూ నిజం?’ అన్న కుతుహలమో లేక సందేహమో కలిగింది.

అందుకే ఈ చిన్న వివరణ.

నా పేరు ఆది లక్ష్మి. నా భర్త పేరు లెనిన్ బాబు. మా పాప పేరు గీతాప్రియ. ఇదీ నా కుటుంబం.

ఇక నా నేపధ్యం -

అదీ 1992 వ సంవత్సరం. అప్పటికి నేను అవివాహితని. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెలూ, ప్రేమాను బంధాలున్న కుటుంబం. అప్పటికి వృతిరీత్యా నేను Lead Acid Batteries Manufacturerని. ఆరోజుల్లో 45 లక్షల రూపాయల విలువ గల చిన్న తరహా పరిశ్రమని నడుపుతుండేదాన్ని.

మహిళా పారిశ్రామికవేత్తగా 1989 లో నాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ గారి చేత ప్రారంభించబడిన సంస్థనాది. ఉత్తమ మహిళా జౌత్సహిత పారిశ్రామికవేత్తగా 1990లో నాటి గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ నుండి బహుమతి అందుకున్న కెరీర్ నాది. ఫ్యాక్టరీ నడపడంలో ఒడిదుడుకులెదుర్కొన్న ఇండస్ట్రీయలిస్టుగా నా అనుభవాన్ని COUP ON BUSINESS FIELD లోని ఓ అంశంలో ఆంగ్లంలో ప్రస్తావించాను.

ఈ నేపధ్యంలోనే - అయోధ్య రామమందిరపు వివాదం విషయమై బి.జె.పి. రాజకీయ డ్రామాలు భారీ ఎత్తున నడుస్తున్న నేపధ్యంలో పాతబస్తీ అల్లర్లలో చాలామంది కత్తిపోట్లకు గురయ్యారు. 11 నెలల పసిపాప ముఖం మీద ఎడమ నొసటి దగ్గర నుండి ముక్కు మీదగా కుడి చెంప వరకూ 11 కుట్లు పడిన [కత్తిపోటు బాధితురాలు] ఫోటో ఇండియా టుడే [నాకు గుర్తున్న వరకూ అదే పక్షపత్రిక] కవర్ పేజీగా ప్రింటయ్యింది.

అది చూసి నాకు భరించలేనంత బాధ కలిగింది. మొన్న ముంబాయి ముట్టడి చూసినప్పడు మీరంతా ఎంత రగిలిపోయారో, నేను అప్పడంతగా రగిలిపోయాను. అదే సమయంలో మన దేశం మీద జరుగుతున్న గూఢచార కుట్రలు[నిజానికి అవి గూఢచార కుట్రలని తరువాత తెలిసింది] దైవికంగా నాకు తెలిసింది. అది నా కర్తవ్యాన్ని నాకు తెలిపింది.[పాఠశాలలో ఆదర్శవంతమైన విద్యార్ధిని కదా!]

ఆ వివరాలన్నిటితో నాటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు కి ఫిర్యాదు [Confidential Complaint ] ఇచ్చాను. అదీ ప్రారంభం.

అప్పటి నుండి అంటే 1992 నుండీ నేటి వరకూ 16 ఏళ్ళుగా నా జీవితంలో అదే అనివార్య పోరాటం. ఆ పోరాటంలో పారిశ్రామికవేత్తగా నా కెరియర్ పోగొట్టున్నాను. ఎంసెట్ ఫిజిక్సు లెక్చరర్ అవతారం ఎత్తాను. తర్వాత అక్కడ నుండి క్రమంగా చిన్నపిల్లలకు పంతులమ్మ నయ్యాను. కుటుంబం విచ్ఛిన్నమైంది. నా నిజమైన స్నేహితుడు నా భర్త. 16 సంవత్సరాలుగా మేమిద్దరం పోరాటం చేస్తున్నాం.

ఆర్ధిక దృష్ట్యా పై మెట్టు మీద నుండి క్రింది మెట్లకు దిగాను. [అది పూర్తిగా Organized harassment]. ఆత్మోన్నతి దృష్ట్యా లేదా ఙ్ఞానపు దృష్ట్యా అయితే క్రింద మెట్టు పై నుండి పైకి ఎక్కాను.

పదహారు సంవత్సరాల పోరాటం, నాకు జీవితంలో మరింత toughness నీ, పరిశీలననీ నేర్పింది. నిజానికి భగవద్గీతే మార్గదర్శనం చేసింది.

నా పోరాటంలో నేను తెలుసుకున్న కుట్ర స్వరూపాన్ని సాక్ష్యాధారలతో సహా, తార్కికంగా, దృష్టాంత సహితంగా మీముందు ఉంచుతానని గత టపాల్లో వ్రాసాను.

నిజానికి పదహారు సంవత్సరాల పోరాటంలో పరిశోధనల్ని ఆంగ్లంలో అక్షరబద్దం చేయడానికి చాలా సమయం పట్టింది. అలాగయ్యి కూడా నా అలోచనలని సంపూర్ణంగా అక్షరబద్దం చేయలేదు. అలా వ్రాయలంటే నాకు చాలా కాలం పడుతుంది. సాక్ష్యాధారాలు అంటే Documentary Evidence 2000 నుండి సేకరించాను.

`నకిలీ కణికుడెవరూ, మన మీద అతని కుట్ర ఏమిటి అన్న ఆసక్తి తో ఆలోచిస్తూ, తెలుసుకోవాలన్న ఙ్ఙిఙ్ఞాస గల తోటి బ్లాగర్లు నా ఆంగ్ల బ్లాగ్ COUPS ON WORLD లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

దాన్ని దఫాల వారీగా తెలుగులోకి అనువదిస్తున్నాను. నేనిచ్చిన సమాచారం తో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు గారు తీసుకున్న చర్యలు, పర్యవసానంగా మారిన భారతదేశం దిశ, అలాగే నా జీవితంలోని మార్పులు COUP ON INDIAN POLITICS లో వివరంగా వ్రాసాను. అదే విషయాన్ని EVENTS’ LIST లోనూ క్లుప్తంగా అర్ధం చేసుకోవచ్చు.

భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్రని తదుపరి టపాల్లో కొనసాగిస్తాను.

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

నిజానికి గౌతమ మహర్షి అహల్య పట్ల చూపిన ఆదరణలాంటి సంఘటనలు ఇతిహాసాల్లో చాలా ఉన్నాయి. విష్ణువు దశావతారాల్లో ఒకటిగా మనం చెప్పుకోనే జమదగ్ని, రేణుకాదేవిల కధ కూడా ఇలాంటిదే. తాను విలువిద్యా అభ్యాసం చేస్తుంటే, బాణాలు అందిస్తున్న భార్య ఎండకు వాడి పోతోందని సూర్యుణ్ణి అధిక్షేపించిన ప్రేమ జమదగ్ని మహర్షిది. అలాంటి ఆయన భార్య, రేణుకా దేవి ఎంతో తపస్సంపన్నురాలు, మనోనిగ్రహం కలిగిన ఇల్లాలు. ఆవిడ ప్రతీరోజూ నదికి వెళ్ళి తడి ఇసుకతో కుండ చేసి, దానిలో నీళ్ళు నింపుకొని దైవ పూజకోసం తెచ్చేది. ఆ నీటితోనే రోజూ జమదగ్ని మహర్షి దైవపూజ నిర్వహించేవాడు.

ఓ రోజు ఆవిడ నదిలో స్నానం చేస్తుండగా గగనమార్గంలో వెళుతున్న గంధర్వుణ్ణి చూసింది. అతడి అందం పట్ల ఆవిడ మనస్సు ఒక్కక్షణం చలించింది. మనోనిగ్రహం సడలిన రీత్యా ఆ రోజావిడ తడి ఇసుకతో కుండ చేయలేక ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఉత్త చేతులతో వచ్చిన భార్యనిచూసి, విషయం తెలుసుకున్న జమదగ్ని మహర్షి, రేణుకా దేవి తల నరకమని కొడుకుల్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు నిరాకరించారు. సమిధల కోసం అడవికి వెళ్ళిన పరశురాముడు అప్పుడే ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి ఆజ్ఞానుసారం తల్లినీ, సోదరుల్నీ సంహరించాడు. తండ్రివరం కోరుకోమంటే వారిని పునర్జీవుల్ని చేయమన్నాడు. మళ్ళీ బ్రతికిన రేణుకని జమదగ్ని పరిత్యజించ లేదు. అంతటి క్షమా, ఔదార్యం అక్కడున్నాయి.

ఇవేవీ ఈ ఆధునిక రంగనాయకమ్మలకి, హేతువాద సంఘాలకీ అర్ధం కావు. ఎందుకంటే ఈనాటి ఆధునిక సమాజంలో, అతివేగానికి అలవాటు పడ్డ చాలామంది వ్యక్తులకి అంతమానసిక స్థాయి లేదు. పైగా నకిలీ కణికుడూ, అతని వ్యవస్థా తమ కిచ్చే ‘కెరీర్’, పేరుప్రఖ్యాతలు వగైరా వగైరా లాభాల కోసం, అసలే పదార్ధవాదులయిన ఈ విషవృక్ష సాగుదార్లు అంతటి నైతిక విలువల్ని అర్ధంచేసుకోవటం చాలా కష్టమే. ఎందుకంటే వీరిలో చాలామందికి బంధాల మీద, అనుబంధాలమీద, ప్రేమా, ఆత్మీయతల్లాంటి మానవతా విలువల మీద పెద్దగా నమ్మకాలుండవు. అలాంటి వారికి సీతారాముల బాంధవ్యం, సౌశీల్యం అర్ధం కావటం చాలా కష్టమే.

ఎందుకంటే ఈ రోజు ఒకరితో డేటింగ్ చేసి, రేపు పెళ్ళిచేసుకొని, ఎల్లుండి విడాకులు తీసుకొని, ఆవలెల్లుండి వేరొకరితో డేటింగ్ కి తయారయ్యే సంస్కృతికి వాళ్ళు స్వాగతం చెప్పే స్ధితిలో ఉన్నారు గనుక.

కాని భారతదేశంలోకోట్లాది గ్రామీణులు, మధ్యతరగతి ప్రజలూ, పేదలూ, సామాన్య భారతీయులు ఇంకా విలువల్ని మరిచి పోలేదు. ఆచరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ నాటికీ, 2 శతాబ్దాలుగా కుట్రలు పన్నుతున్నా, మన సంస్కృతిని ఎన్ని వ్యంగ్యాలూ, విమర్శలూ, జోకులూ వేసి అగౌరవపరచినా, సమూలంగా మాత్రం నాశనం చేయలేక పోయారు నకిలీ కణికుడూ అతని వ్యవస్థ. నకిలీ కణికుడూ, అతడి ఏజంట్లు కలిసి ప్రజల దృక్పధాన్ని కలుషితం చేసిన మాట నిజమే. కానీ భారతీయులు తమమీద జరుగుతున్న కుట్రని అర్ధం చేసుకున్న మరుక్షణమే ఈ కాలుష్యమంతా కరిగిపోతుందన్న విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు.

ఇది నా నమ్మకం మాత్రమే కాదు.

ఇది భారతీయుల మీద ఉన్న నమ్మకం.

ఇది మనుష్యులమీద ఉన్న నమ్మకం.

ఇది మంచి మీద ఉన్న నమ్మకం.

ఖచ్చితంగా చెప్పాలంటే

ఇది భగవంతుని మీద ఉన్న నమ్మకం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఈ చర్చ ఇక్కడ ఆపి, మళ్ళీ విశ్వామిత్రుణ్ణి పలకరిద్దాం. అడవిలో రామలక్ష్మణులకి ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్నీ, తత్త్వ విషయాలనీ బోధించాడు. యాగ రక్షణ సమయంలో తాటకిని వధించేందుకు, ఎంత రాక్షసి అయినా స్త్రీ కదా అని రాముడు సందేహిస్తున్నప్పడు విశ్వామిత్రుడు “రామా! సందేహించకు! స్త్రీ కదా, ఎలా చంపడం అని వెనకడుగు వేయకు. ఆమె తాటకి. చెడు బుద్ది కలది. మన కర్తవ్యాచరణలోనూ, ధర్మా చరణలోనూ మన తొలి ప్రాధాన్యం [మన గురించి కంటే] ధర్మాచరణకే ఉండాలి, చివరకి అది మన కీర్తికి, మంచి పేరుకి సంబంధించిన విషయమైనా సరే! ధర్మాచరణలో మనం అన్నీ త్యజించాలి, చివరకి మన గురించి అన్యులేమను కొంటారోన్నది కూడా. మన అనుభూతులూ, కీర్తిప్రతిష్టలూ, అన్నీ ధర్మాచరణ తర్వాతే”. అప్పడు రాముడు తాటకిని వధించాడు.

ఎంత ఐడియలిస్టిక్ దృక్పధం?[భావవాదం?] ధర్మాచరణలో ’మన’ అనుకున్నవేవి మనకు అడ్డురాకూడదు. అదే ఇప్పడయితే తమ స్వార్ధం కోసం అన్ని ధర్మాల్ని వదిలేస్తున్న వ్యక్తుల్ని కొల్లలూగా, కోటానుకోట్లుగా చూస్తున్నాం. ఇంతగా అవినీతి, అధర్మం, పదార్ధవాదం పెరిగిపోయాక, విషవృక్షపు రంగనాయకమ్మలూ, సినీ కవులూ, హేతువాదులమనే వాళ్ళూ, మేధావుల మనే వాళ్ళూ, భావవాదాన్ని [అంటే ధర్మాచరణ, నీతిగా ఉండటం, నిజం పలకడం] అందులో ఉండే ఆత్మతృప్తినీ అర్ధం చేసుకోలేరు. కాబట్టి రామాయణాన్నీ అర్ధం చేసుకోలేరు. అది సహజమే. ఎందుకంటే దేన్నైనా అనుభవించి తెలుసుకోవలసిందే. శ్రీరామకృష్ణ పరమహంస [బోధామృతంలో] అన్నట్లు “నెయ్యి రంగు, రుచి, వాసనా తెలియని వాడికి ఏవిధంగా చెప్పినా దాని రంగు, రుచీ, వాసనా అర్ధం కావు. వారికై వారు నెయ్యిని చూచి, తినీ, ఆఘ్రూణించి తెలుసుకోవలసిందే”.[దీనికే వేదాల్లో, వేదాంత చర్చల్లో ’నేతినేతి’ అనే ఉదాహరణంగా పెద్దలు చెబుతారు. నేతి అంటే న+ఇతి = ఇది కాదు అని అర్ధం]

ఇక రామాయణ కథా కొనసాగింపు దగ్గరికి వస్తే - శ్రీరామలక్ష్మణులు తాటకిని, ఆమె పుత్రుల్లో ఒకడైన సుబాహుణ్ణి వధించి యాగాన్ని రక్షిస్తారు. తాటకి మరో కుమారుడు మారీచుడు వారి ధాటికి పారిపోయి ఆశ్రమ జీవితం గడుపుతాడు. సీతాపహరణంలో మాయలేడి వేషధారి ఈ మారీచుడే. విశ్వామిత్రుడు, తర్వాత రామలక్ష్మణుల్ని విదేహ రాజధాని మిధిలా నగరానికి తీసుకువెళతాడు. దారిలో వారు గౌతమి మహర్షి ఆశ్రమాన్ని చేరతారు. అక్కడ శ్రీరాముడి కాలుసోకిన రాయి, అద్భుత సౌందర్యవతియైన అహల్యగా మారుతుంది. ఈవిడ గౌతమి మహర్షి భార్య.

మనిషి రాయిగా మారడం, మరో మనిషి కాలిదుమ్ము సోకి మనిషి అవ్వడం - ఇందులోని తార్కికతనీ, వాస్తవికతనీ, మన ఆధునిక [సోకాల్డ్] సైన్సునీ కాసేపు ప్రక్కన పెట్టి అహల్య కథలోకి లోతుగా చూస్తే -

ఈవిడ అద్భుత సౌందర్యవతి. బ్రహ్మదేవుని పుత్రిక. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై దేవేంద్రుడామెని వివాహమాడ కోరినా బ్రహ్మ ఆమెను గౌతమి మహర్షికిస్తాడు. దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి. అది ఒక పదవి, దేవేంద్రుడు దేవతలకి అధిపతి గానీ దేవుడు కాడు. అతడికి అరిషడ్వార్గాలన్నీ ఉంటాయి. గ్రీకుల జూపిటర్ కి లాగా. ఎవరైనా తపస్సు చేస్తే తన పదవి కోసమే అని భయపడటం దగ్గర్నుంచి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలన్నీ ఉంటాయి. వీటితోపాటు ఎంతో ఙ్ఞానం కూడా ఉంటుంది.

ఓరోజు తెల్లవారుఝామున గౌతముని ఆశ్రమం చేరి కోడికూతని అనుకరిస్తాడు దేవేంద్రుడు. తెల్లవారబోతోందను కొని గౌతముడు నదికి వెళతాడు. గౌతముడి రూపంలో అహల్య శయ్యని చేరతాడు ఇంద్రుడు. అహల్య ఇది పసికట్టినా, అంతటి దేవేంద్రుడు తనని మోహించాడు గదా అన్న గర్వం ఆవిడని అతడితో శృంగారం పంచుకొనేందుకు ప్రలోభ పరుస్తుంది. ఆ తతంగము ముగుస్తుంది. దేవేంద్రుడు సెలవు తీసికోబోతుండగా, నది నుండి వెనక్కి వచ్చిన గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరతాడు. ఆయనకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆయన అహల్యని “నీవు ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని కోల్పోయావు. పతితో గాక ఇతర పురుషుడితో శృంగారాన్ని అభిలషించావు. శిలవై పడుండు. ఎప్పుడైతే, పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడూ, సకల సుగుణ సంపన్నుడూ, ధర్మనిష్ట కలిగినవాడూ అయిన రాముని పాదం నిన్ను సోకుతుందో, ఆరోజు నీవు తిరిగి మనిషివి అవుతావు. అప్పుడే నిన్ను మళ్ళీ కలుస్తాను” అని శపించి తపస్సు చేసుకోబోతాడు.

రామ పాదం సోకిన అహల్య తిరిగి మనిషి రూపం పొంది, శ్రీరాముణ్ణి ఎంతగానో పూజిస్తుంది. ఆ సమయంలో అక్కడి కొచ్చిన గౌతమ మహర్షి శ్రీరాముణ్ణి, విశ్వామిత్రుణ్ణి కొనియాడి కృతఙ్ఞతలు తెలిపీ, తన భార్య అహల్యని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. భార్యభర్తలిద్దరూ తపస్సుకై అడవికి పోతారు. గౌతమ మహర్షి తన భార్యని మన్నించి మనస్ఫూర్తిగా గ్రహిస్తాడు. ఎందుకంటే గౌతముడు ఓ దేశానికి రాజు కాదు, రాముడిలాగా. ముందుగా ఆయనకి తన భార్య మనో నిగ్రహం కోల్పోయినప్పటికీ క్షమించగలిగే, భార్యగా అంగీకరించగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి [స్వయంగా తాను ముని కాబట్టి, తపస్సు చేయడం అంటేనే మనోనిగ్రహం కాబట్టి] మనస్సుని నిగ్రహించడం ఎంత కష్టమో తెలుసు.

అదే శ్రీరాముడయితే రావణవధానంతరం సీత దేవిని తన పతివత్ర నిరూపించుకోమన్నాడు. ఆమె అగ్నిప్రవేశం చేసింది. రాజ్య పట్టాభిషేకం తర్వాత మద్యపాన వ్యసనపరుడైన రజకుడి నిందకై సీతని అడవికి పంపాడు రాముడు. ఆమె మౌనంగా శిక్ష భరించింది తప్పు లేకుండానే. ఆయన మరో స్త్రీని పెళ్ళి చేసుకోలేదు, జీవితాన్ని సుఖించలేదు. ఎందుకంటే తాను రాజు. ప్రజలకి ఆదర్శం[రోల్ మోడల్].

గీతలో చెప్పినట్లుగా ,
“యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే”

సమాజంలో ఉత్తములనబడే వారు దేన్ని అనుసరిస్తారో జనులందరూ దాన్నే అనుసరిస్తారు. [ఇక్కడే నకిలీ కణికుడు పై స్థాయిలో నీచులు, అవినీతిపరులను,శీలరహితులను ఆ స్థానాలలోకి వచ్చేటట్లు చూసి ప్రజలందరికి కూడా ఈ రోజులలో ఇదే సరియైన విధానం అని ప్రచారిస్తున్నాడు]కనుక సాక్షాత్తు భగవానుడే[శ్రీకృష్ణుడు] గీతలో “ నేను పనిచేయవలసిన అవసరం లేదు. పని చేసి దేన్ని పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు లేనిదంటూ ఏదీ లేదు. అయినా నా విద్యుక్త కర్మ నేను నెరువేరుస్తాను. లేకపోతే జనులందరూ నన్నే అనుసరించి సోమరులవుతారు” అంటాడు. అందుకే శ్రీరాముడూ, శ్రీకృష్ణుడూ భారతీయుల దృష్టిలో దేవుళ్ళు. అంతేగాని 10 వేల చేతులో, కాళ్ళో, తలలో ఉన్నందుకు కాదు.

ఎవ్వరు సౌశీల్యవంతుడని, సకల సద్గుణ సంపన్నుడని గౌతముడు చెప్పాడో, ఎవరి కాలిదుమ్ముసోకి రాయి ఆడది అయ్యిందో, అలాంటి రాముడికి - తనలో సగం, తన అత్మ అయిన సీత పవిత్రురాలో కాదో తెలియదా? రాజ్య సుఖం వదలి తన సాన్నిహిత్యం కోసం అడవికి వచ్చిన భార్య, రావణుడి ధన, ఐశ్వర్య ప్రదర్శననీ, ప్రలోభాన్ని, ఆ రాక్షస ప్రయోగ సామ దాన భేద దండో పాయాల్ని ఎంతో ఆత్మ స్థైర్యం తో ఎదుర్కొన్న తన భార్య సీత ఔన్నత్యం రాముడికి తెలీదా? రాముడి హృదయం సీతకి తెలియదా? అయినా సరే, పాలకులుగా తమ జీవితం ప్రజలకు జవాబు దారి. అందుకూ, వాళ్ళు ధర్మాచరణలో తమ స్వంత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకి మార్గదర్శనం చూపించారు. అంతే తప్ప విషవృక్షాలు పెంచిన రంగ నాయకమ్మల వాదనల ప్రకారం అక్కడ స్త్రీని చులకన చేయటం లేదా స్త్రీని భోగ వస్తువుగా చూడటమో లేదు. [ఇదే రంగనాయకమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ, వ్వాపర ప్రకటనల్లోనూ స్త్రీ చులకన చేయబడుతున్నా, భోగవస్తువుగా వాడబడుతున్న ఏమీ స్పందించడం లేదు. ఎంత విచిత్రం?]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక రామాయణం దగ్గర కొస్తే - విశ్వామిత్ర మహర్షి దశరధుణ్ణి, తన యాగ రక్షణ నిమిత్తం శ్రీరాముణ్ణి పంపమని అర్ధించినప్పడు, దశరధ మహారాజు పుత్రవాత్సల్యం కొద్దీ సందేహించినప్పుడు, దశరధుని కుల గురువు వశిష్ట మహర్షి “దశరధ మహారాజా! విశ్వామిత్రమహర్షి శక్తిని తక్కువ అనుకోకండి. ఆయన తలుచుకుంటే తాటకాది రాక్షస వర్గాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలడు. అట్లాంటిది రాముణ్ణి తన వెంట పంపమని అడుగుతున్నాడంటే అందుకు ప్రత్యేక కారణం ఉండి ఉంటుంది. ఆయన రాముణ్ణి మరింతగా తీర్చిదిద్దగలడు. సందేహించకుండా రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పెళ్ళికి పంపుతున్నట్లుగా పంపు” అంటాడు.

నిజానికి విశ్వామిత్రుడు పూర్వాశ్రమంలో గాధేయుడన్నరాజు. వేటకెళ్ళి తిరిగి వస్తూ కామధేనువు గురించి వశిష్టని మీద వైరం పూనుతాడు. రాజు యొక్క ఆర్ధిక శక్తి, మహర్షి యొక్క తపస్సు తాలుకూ ఆత్మశక్తి ముందు ఎందుకూ కొరగాదని తెలుసుకొని, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి పోయి తపస్సు చేస్తాడు. అంచెలంచెలుగా అహంకారాన్ని వదలి బ్రహ్మర్షి అవుతాడు. అలాంటి వీరిద్దరూ ఆ వైషమ్యాన్ని దాటి, అరిషడ్వర్గాలేవి లేకుండా ఒకరి కొకరు గౌరవించుకొంటారు. [పురాణాలని, పతివత్రలుకధల్ని, వ్రతకధల్ని ఇక్కడ నేను ఉటంకించటం లేదు. ఆ కథల్లో దేవతలకి గ్రీకు దేవతా కథ ఇవయాడ్ లో లాగా సకల అరిషడ్వర్గాలు ఉంటాయి] నిజానికి ఇతిహాసాలు అంటే భారత రామాయణాలు భారతీయులకి ఈ ఆత్మసంయమనాన్ని సాధించమనే బోధిస్తాయి. ఆ కథల్లోని ఎన్నో పాత్రలు ప్రజలు అరిషడ్వర్గాలని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్ని జయించి, మానసికంగా పరిపక్వత [బ్యాలెన్స్ అఫ్ మైండ్] పొందేందుకు ప్రోత్సహిస్తాయి.

విశ్వామిత్రుడిలోని ఈ సుగుణాలని, ఆయన కథలోని విశిష్టతనీ వదిలేసి కుట్రదారులు అంటే నకిలీ కణికుడూ అతడి వ్యవస్థా, సినిమాల్లోనూ, వ్యంగ్యరచనల్లోనూ, సాహిత్యంలోనూ విశ్వామిత్రడన గానే, మేనకా విశ్వామిత్రం మాత్రమే మాట్లాడతారు. వారి పుత్రిక శకుంతల, ఆమె పుత్రుడు భరతుడు - ఆయన పేరిట భారతదేశం వెరసి భారతదేశానికి ఆ పేరు ఎవరిమూలంగా వచ్చిందో ఆ భరతుడు మేనకా విశ్వామిత్రుల మనుమడు. [శకుంతల వారి అక్రమ సంతానం, సక్రమ సంతానం కాదు అన్న విధంగా వారి ప్రచారం ఉంటుంది] నిజానికి భారత దేశానికి కాపేరు శకుంతల దుష్యంతల పుత్రుడైన భరతుడి మూలంగా కలిగింది కాదు. అల్లసాని పెద్దన గారి స్వారోచిష మనుచరిత్రలో చెప్పబడిన మనోరమా పౌత్రుడయిన భరతుడు.

నిజానికి గాధేయుడు విశ్వామిత్రుడుగా పరిణమించే కథ భారతీయులకి ఎంతో నీతిని, అహం ప్రభావం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది.

తమ మనస్సుని నిగ్రహించి చేసిన తమస్సు యొక్క తీవ్రతని బట్టి వ్యక్తులు శక్తులు పొందుతారు. ఆ శక్తిని బట్టి వారిని మునులనీ, ఋషులనీ, మహా మునులనీ, మహర్షులనీ, బ్రహ్మర్షులనీ పిలుస్తారు. వశిష్టనిపై కినుక తోనూ, ఈర్షతోనూ, తపస్సు ప్రారంభించిన గాధేయుడు కొన్నాళ్ళ తపస్సుకి కొంత శక్తివంతుడైనాడు. మేనక చేసిన తపోభంగం తో మళ్ళీ ఆయన తపస్సు మొదటికొచ్చింది. ఈ కథని కాళిదాసు తన అభిఙ్ఞాన శాకుంతలం లో మనోహరంగా వర్ణించాడు. ఇదేకథని సినిమా పండితులూ, టీవి పండితులూ ‘మేనక శృంగారం’ అనే మసాలాని దట్టించి, విశ్వామిత్రుడి సౌశీల్యాలని, విశ్వశ్రేయస్సు పట్ల ఆయన కున్న కమిట్ మెంట్[నిబద్దత]నీ ప్రక్క దారి పట్టించి ఎన్నో సినిమాలు, సీరియళ్ళు తీసారు.

ఒకసారి తపోభంగం కాగానే విశ్వామిత్రుడు మనస్సుని నిగ్రహించడం ఎంతో కష్టమో తెలుసుకున్నాడు. ఇక తర్వాత ఆయన ఏ శృంగార భావనకీ లొంగలేదు. మళ్ళీ తపస్సు చేశాడు. త్రిశంకుడనీ రాజు సశరీరంగా స్వర్గానికెళ్ళదలచి ఎవ్వరూ తన కోరిక తీర్చ లేకపోయారన్న బాధని విశ్వామిత్రుడికి చెప్పుకున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాని పని తను చేయాలని, తద్వారా తన గొప్పదనాన్ని అందరికీ తెలియజేప్పాలనే అతిశయం ఆయన్ని మరోసారి ఓడించింది. విశ్వామిత్ర సృష్టి అయిన త్రిశంకు స్వర్గం తర్వాత ఆయనకి తాను మరోసారి తపోనష్టం పొందిన విషయం అర్ధమైంది.

ఈ సారి మరింత తీవ్రతపస్సు చేశాడు. ఆత్మఙ్ఞానం పొందాలని, తర్వాత బ్రహ్మర్షి అనిపించుకోవాలన్నది కోరిక. కోరికలు విడిచి పెట్టందే ఆత్మఙ్ఞానం పొందలేనని అప్పటికి ఆయనకి తెలియదు. ఆత్మఙ్ఞానం బోధించగల గురువుని వెదికాడు. యముణ్ణి అడిగితే ఆయన తీరిక లేదన్నాడు. సూర్యుణ్ణి అడిగితే ఆయన మండిపోతున్నాను కుదరదన్నాడు. ఆదిశేషుని అడగమన్నాడు. ఆదిశేషుని అడిగితే ఆయన తన తలమీద మోస్తున్న భూమిని చూపిస్తూ “ఎలా కుదురుతుంది? భుమిని నాతలపై నుంచి దించితే తీరిగ్గా బోధిస్తాను” అన్నాడు.

“సరే! నాతపశ్శక్తితో భూమిని నిలువరిస్తాను. తలపై నుంచి దించు” అన్నాడు విశ్వామిత్రుడు.

సరేనని దించేసాడు ఆదిశేషువు. భూమి విపరీత వేగంతో జారిపోతుంది. “నా తపశ్శక్తిలో ఘడియకాలాన్ని ధారపోస్తున్నాను. భూమి ఆగు” అన్నాడు విశ్వామిత్రుడు.

భూమి ఆగలేదు. “ఒకరోజు తపస్సు ధారపోస్తున్నాను, ఆగు” అన్నాడు విశ్వామిత్రుడు.

ఉహూ! భూమి ఆగలేదు.

"సగం తపస్సు ధారపోస్తున్నాను” లాభంలేదు.

"మొత్తం తపస్సు ధారపోస్తున్నాను.”

ఒక్క క్షణం ఆగి, మళ్ళీ జారిపోవడం మొదలు పెట్టింది భూమి.

బుడుగు భాషలో చెప్పాలంటే హడ్డిలి పోయాడు విశ్వామిత్రుడు.

చిరునవ్వు నవ్వాడు ఆదిశేషువు.

భూమిని తీసి తిరిగి తన పైన పెట్టుకొని “ఈ అహాన్ని జయించడమే బ్రహ్మవిద్య. ఇదే ఆత్మజ్ణానం. అహం వెనుకే అరిషడ్వార్గాలుంటాయి. అహం పారదోలితే అంతా ఙ్ఞానమే” అన్నాడు.

అర్ధమయ్యింది విశ్వామిత్రుడికి.

ఆ తర్వాత ఆయన తపస్సు బ్రహ్మదేవునితోపాటు, వశిష్ట మహర్షి కూడా వచ్చి బ్రహ్మర్షి అని పిలిచే వరకూ నిరాటంకంగా సాగింది. ఆ తర్వాత లోకహితం కోసం విశ్వామిత్రుడి తపస్సు ఉంటుంది. ఈ కథని గురించి రంగనాయకమ్మలూ, నాస్తిక సమాజ సభ్యులూ, హేతువాద సంఘాలూ ఎన్ని వ్యంగ్యాలు పోయారో? ఆదిశేషువు తలపైన భూమి ఉంటే మిగిలిన గ్రహాలెవరి నెత్తినున్నాయనీ, మరప్పడు విశ్వామిత్రుడెక్కడ నిలబడి మాట్లాడాడనీ ... ఇలా రకరకాలుగా అన్నమాట.

ఇప్పడున్నట్లు ఉపగ్రహాలు, స్పేస్ వాక్ లు అప్పడున్నయో లేదో అన్నది హైజాక్ కాదా?

విస్తరాకులెత్తరా అంటే జనాభా లెక్కపెట్టాట్టా వెనకటికో ప్రబుద్దుడు. [విందులో అతిధులు భోజనాలయ్యాక ఆ విస్తళ్ళు తీసెయ్యరా అంటే – ‘ఎంత మంది విందుకొచ్చారూ? ఎందరు తిన్నారూ? ఇంకా ఎందరు తినాలి? తనెన్ని విస్తళ్ళు ఎత్తాలి?’ అని లెక్కలు వేసాట్ట ఈ మేధావి. అంతేగాని అసలు పని మాత్రం చెయ్యలేదు. ఇప్పడూ మనకి అలాంటి మేధావులు కనబడుతూ ఉంటారు. నిజానికి వీళ్ళు మేధావులు కారు. తమని తాము మేధావులనుకొంటారు. ఇంట్లో అమ్మ గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ ఏ ప్రిన్స్ పల్ మీద ఆధారపడి పనిచేస్తాయో చెప్పి, అన్నం పప్పు మాత్రం వండలేదనుకోండి. మన ఆకలి తీరుతుందా? అలాంటిదే ఇది.] ఇంతకీ ఈ హైజాక్ ఏమటంటారా?

విశ్వామిత్రుడు ఎక్కడ నిలబడి ఆదిశేషువుతో మాట్లాడాడు అన్న చర్చహైజాక్.

ఎందుకంటే ఈ కథ మనకి ఙ్ఞానమంటే ఏవిటి, అహం అంటే ఏమిటి? అది కలిగించే నష్టం ఏమిటి? అన్నది చెబుతుంది. మనస్సుని నియంత్రించటం ఎంత కష్టమో, నియంత్రిస్తే ఎంత శాంతి కలుగుతుందో చెబుతుంది. ఇదంతా ప్రక్కదారి పట్టించి సైన్సుని ఇతిహాసంలో వెదకడం హైజాక్ కాదా?

ఇలా ఇతిహాసాల్లో సమయ సందర్భాల జౌచిత్యాన్ని, పాత్రల ప్రవర్తనల్లోనూ, సంఘటనల్లోనూ ఉన్న సైన్సు వ్వతిరేక విషయాన్ని ఎండగట్టిన రంగనాయకమ్మలు, ఒంటి చేత్తో 100 మందిని కొట్టే హీరోల పాత్రల్నీ, నేల మీద నుండి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతానికి వ్యతిరేకంగా భూమ్మీద నుండి ఐదంతస్తుల మేడ మీదికి జంప్ చేయడాలనీ, వళ్ళంతా తూట్లు పడినా, లేదా కడుపులో కత్తులు దిగబడి, బ్యారెళ్ళ కొద్దీ రక్తం కారినా ఆపకుండా ఫైటింగ్ చేయడంలలోని ఔచిత్యాలని గానీ, సైన్సు వ్యతిరేకతని గానీ ఏమాత్రం పట్టించుకోలేదు.

పైగా “అవి సినిమాలు. వినోదం కోసం. అంతే! వాటిలో అసహజాలు పట్టించుకోకూడదు” అన్నారు.

మరి “ఇవి ఇతిహాసాలు. కొన్ని అసహజాలు సహజం. మౌలికంగా ఆ కథలు ఏ మంచి నేర్చుకొమ్మంటున్నాయి” అన్నది ఎందుకు పట్టించుకోలేదు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వారం రోజుల నుండీ పొడుగుపాటి టపాలు వ్రాసి నేనూ, చదివి మీరు అలిసిపోయి నందున చిన్న బిర్రే...క్!

ఈ లోపు కాసిన్ని కబుర్లు.....

ముందుగా బ్లాగర్ల దినోత్సవం జరుపుకుంటున్న బ్లాగర్లకి, బ్లాగు చుట్టాలకీ నా శుభాకాంక్షలు. కీ బోర్డులోంచి వచ్చిన అక్షరాలతో చెప్పడం లేదండి. మనసులోంచి వచ్చిన మాటలతో చెబుతున్నాను.

న్యూటన్ మహాశయుణ్ణి ఎవరో అడిగారట “మీరిన్ని విషయాలు ఎలా కనిపెట్టారు?" అని. ఎంతో వినయంగా “మిత్రమా! నేను నాముందు వాళ్ళ భుజాలా మీద ఎక్కి ఎక్కువ దూరం చూడగలిగాను” అన్నాట్ట ఆ శాస్త్రవేత్త.

తనముందు వారి కృషిని తాను ఉపయోగించుకున్నాననీ, ఆనందించాననీ చెప్పాడాయన.

అంతర్జాలం గురించి, కూడలి గురించి నేనూ ఇదే అనుకొంటున్నాను. “నాముందు వారంతా ఎంతో కృషి చేసి, దీని నింతగా అభివృద్ది చేశారు, కాబట్టి కదా, ఇప్పడింతగా దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం” అని.

ఈ సందర్భంలో వీవెన్ గారికి, నల్లమోతు శ్రీధర్ గారికి [బ్లాగు తెరిచే ముందు నేను వీరి కంప్యూటర్ ఎరా నుండి ఓనమాలు దిద్దాను] జ్యోతి వలబోజు గారికి, సలహా చెప్పండి బాబోయ్ అనగానే ఆదుకున్న తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారికి, శిరిష్ గారికి, రమణ గారికి, మిరియాల ప్రదీప్ కి, యోగికి, వ్యాఖ్యలు వ్రాసి ప్రోత్సాహించే రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి, బొల్లోజు బాబా గారికి, ఇంకా నాబ్లాగులో వ్యాఖ్యలు వ్రాసిన, టపాలు చదివిన అందరికీ కృతఙ్ఞతలు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మఒడి అందరూ అనందంగా ఉండాలనీ, ఎవరికి సాధ్యమైన రీతిలో వారు ఙ్ఞానాన్ని పంచాలనీ, సహాయ సహకారాలందించుకుంటూ చల్లని స్నేహంలో వెచ్చని అనుభూతుల్ని పంచుకుంటుండాలనీ, అందరికీ మంచి జరగాలనీ కోరుకుంటోంది.

మీ అందరికీ నాదో చిన్న కానుక…..

అనగా అనగా….

మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు. కాని అతడి ముఖంలో ఏదో దిగులు, విచారం! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు. కుతూహలంగా తోచింది. ఆగి పలకరించాడు. “ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు?" అడిగాడు నసీరుద్దీన్.

ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

"ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను” అన్నాడు.

నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు.

ధనికుడు “నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆనందం మాత్రం లేదు. నేనెప్పడూ సంతోషంగా గడపలేదు” అన్నాడు విచారంగా.

"అదేం? ఆరోగ్యం లేదా?" అడిగాడు నసీరుద్దీన్.

"నాకేం. పిడిరాయిలా ఉన్నాను”.

"మరి సంతానం లేదా?"

"రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు”కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు.

"వాళ్ళుత్త బడుద్దాయిలా?" అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్.

"చాలా బుద్ధిమంతులు. నే గీచిన గీత దాటరు. చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు?"

"మరేమిటి మీ సమస్య? ఎందుకు విచారం?" మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"నాకన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను. అందుకే చూడటానికి వచ్చాను. ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ. అదీ తీరేటట్లుగా కనబడటం లేదు.”

నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు. సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి. మరి ఆనందం ఎందుకు లేదు. తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి.

వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి, ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని, ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు.

"అయ్యో! అయ్యో. నాడబ్బు. నాడబ్బు” ఘొల్లుమన్నాడు ధనికుడు.

అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారూ, దుఃఖం, హడావుడీ, వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి, తేరుకొని గట్టిగా అరిచాడు.

"నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు. దొంగా! పట్టుకోండి” భయంతో కీచుమంది ధనికుడి గొంతు.

వీధంతా హడావుడిగా ఉంది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు.

ధనికుడికేం చేయాలో పాలుపోలేదు. చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ, పరిశీలిస్తూనే ఉన్నాడు.

ధనికుడికి ఆకలి వేసింది. నీరసంగా ఉంది. అలిసిపోయాడు. ఎక్కడైనా బస చేద్దామన్నా, తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు.

దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి. “ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేరకపోయి వచ్చాను. ఆనందం లేకపోతే పోయింది. ఇప్పడు తిండీ తిప్పలూ లేవు, నిద్రానిప్పులూ లేవూ. వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు. ఏం చేయాలిరా బాబూ” అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు.

అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు.

నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది. తనదే. అచ్చంగా తనదే.

ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు. డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు. చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు. కుప్పిగంతులు వేశాడు.

"ఓ హోహో! దొరికింది. నాడబ్బు దొరికింది” సంతోషంగా అరిచాడు.

చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు. మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు.

నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ “ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే.”

ఇదీ కథ.

అవును. జీవితంలో కష్టాలే లేకపోతే సుఖాల విలువా తెలియదు, ఆనందాల అనుభూతి అర్ధంకాదు. నేర్చుకొనేది ఏమీ
ఉండదు. రోజులో రాత్రిపగలులా, జీవితంలో కష్టమూ సుఖమూ రెండు ఉండాలి.

మీరే మంటారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నాబ్లాగు చుట్టాలందరికీ ఈ రోజు టపా చదివే ముందు ఓ చిన్న విషయం చెప్పాలనుకొంటున్నానండి. నిజానికి ఈ నకిలీ కణికుడూ, అతడి ఏజంట్లూ, అతడి వ్యవస్థా మన భారతదేశంమీద, ఆపైన ప్రపంచం మీదా చేస్తున్న కుట్రని సహేతుకంగా, తార్కికంగా, దృష్టాంతపూరతంగా, సాక్ష్యాధారాలతో సహా ముందుగా ఆంగ్లంలో వ్రాసాను. నకిలీ కణికుడి సుదీర్ఘ కుట్రని వివిధ శీర్షికల క్రింద విపులంగా వ్రాసాను.ఇప్పుడు మీరు తెలుగులో చదువుతున్నంత సరళంగా వ్రాసాను. కొద్దిపాటి మార్పుచేర్పులతో ఇప్పుడు తెలుగులోకి కొంచెంకొంచెంగా అనువదిస్తున్నాను.

నా ఆంగ్ల బ్లాగ్ ‘COUPS ON WORLD’ లో ఆర్ధికరంగం మీద నకిలీ కణికుడి కుట్రని ప్రచురించాను. ఈ రోజు భారతదేశ రాజకీయా, పాలనారంగం మీద నకిలీ కుట్రని ఆంగ్లంలో ప్రచురణ ప్రారంభించాను. పూర్వవేదిక అయిన చరిత్రతో సహా వివరించాను. భారతీయులే గాక ఎవరు చదివినా అర్ధంకావాలన్న ఉద్దేశంతో వ్రాశాను. నాబ్లాగు చుట్టాలలో నకిలీ కణికుడి పూర్వాపరాల పట్ల ఆసక్తి, ఆతృత గమనించినందున ఈ విషయం ఇక్కడ ప్రస్తావించాను.

మీరు ‘COUPS ON WORLD’ చదివి సమీక్షిస్తారని ఆశిస్తాను.

ఇక నిన్నటి టపా కొనసాగింపు ....


ఈ నేపధ్యంలో, భారత్ మీద నకిలీ కణికుడు, అతడి వ్యవస్థ ప్రయోగించిన మరో అంశాన్ని, దృష్టాంతంగా పరిశీలించండి.

రామాయణ విషవృక్షాలూ, హేతువాద సంఘాలూ వగైరాలతో భారతీయ ఇతిహాసాల మీద విమర్శలూ, వ్యంగ్యాలు, జోకులూ వేస్తూ ప్రజాజీవితం నుండి, సమాజం నుండీ ఇతిహాసాలని రూపుమాపే ప్రయత్నం ఓప్రక్క ముమ్మరంగా జరుగుతూ ఉండగా, స్లోపాయిజన్ లాగా మరో ప్రక్క మరో ప్రచారం కొనసాగింది. అదేమిటంటే మొగల్ చక్రవర్తి అంటే ముస్లిం చక్రవర్తి అయిన ఔరంగజేబు గురించి. నిజానికి మొగల్ సామ్రాజ్యం ఇతడి చేతికి వచ్చేనాటికి [అతడి తండ్రి షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినందున ఖజనా ఖాళీ అయినా] ఉచ్ఛస్థితిలో ఉంది. కాని దాని పతనానికి ఇతడే నాందీ పలికాడు. ఇతడి తర్వాత ఇతడి వారసులు బ్రిటిషు కంపెనీల ముందు బలహీనులయ్యారు.ఇది చరిత్ర.

అలాంటి ఔరంగజేబు గురించి ప్రచారం [మౌఖకంగానూ, మీడియా లోనూ] ఏమని ఉండేదంటే “ఔరంగజేబు ప్రజల సొమ్ముతో బ్రతకలేదట. చక్రవర్తి అయినా గానీ అతడు ఖురాన్ ని చేత్తో వ్రాసి, ఆ వ్రాతపతులు అమ్మగా వచ్చిన సొమ్ముతోనూ, స్వయంగా తాను టోపిలు కుట్టి వచ్చిన సొమ్ముతోనూ బ్రతికాడట.[మరి అంతటి ఉదాత్తుడు ఎందుకు మహారాష్ట్ర మీద చాలాసార్లు, గోల్కొండ మీద 18 సార్లు దండయాత్ర చేశాడట? ఈ ప్రశ్న ఎవరూ అడగరు. అడిగినా మీడియా ప్రచురించదు. జవాబూ రాదు] షాజహాన్ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి తనకోసం, తన భార్య ముంతాజ్ మీద ప్రేమ చిహ్నంగానూ, తమిద్దరి సమాధుల కోసం తాజ్ మహల్ కట్టడం ఔరంగజేబుకి ఇష్టం లేక తండ్రిని ఖైదు చేశాడట”. [మరి సోదరుల్ని ఎందుకు హత్య చేశాడట. ఈ ప్రశ్న పై ప్రశ్నలాంటిదే!]

ఈ ప్రచారం చాలా బలంగా, చాప క్రింద నీరులాగా 1975 నుండి సాగింది. నిజానికి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం మీది ప్రేమకు గుర్తుగా [మీడియా ప్రచారించిన ప్రకారం] తాజ్ మహల్ నిర్మించి ఉండవచ్చు. కాని వారిద్దరూ కూడా కొడుకుల వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో విఫలమయ్యారు. ఔరంగజేబు ముంతాజ్ కుమారుడే అని నేను చదివాను. అలాగాక ఔరంగజేబు షాజహాన్ మొక్క మరో భార్య కొడుకు అయితే [షాజహాన్ కి ముంతాజ్ గాక ఇంకా భార్యలున్నారని చరిత్ర చెబుతుంది] అప్పుడు షాజహాన్ కొడుకుని పెంచడంలో విఫలుడైనట్లే. కాబట్టే అతడు తన తండ్రి షాజహాన్ని గానీ, తల్లితో అతడి ప్రేమానుబంధాన్ని గానీ గౌరవించలేదు. బహుశ ఔరంగజేబుకి అసలు ప్రేమానుబంధాల మీదే నమ్మకం లేదేమో. [ఔరంగజేబు పుత్రుడు ఔరంగాబాద్ దగ్గర మినీ తాజ్ మహల్ తన తల్లి గౌరవ చిహ్నంగా కట్టించాడు. దాన్ని మీడియా అసలు ప్రచారించలేదు. ఓ భర్తకి భార్య మీద, ప్రియుడికి ప్రియురాలి మీద ఉన్నది ప్రేమ గాని ఓ కొడుక్కి తల్లిమీద ఉన్నది ప్రేమేలా అవుతుందని మీడియా ఉద్దేశం కాబోలు. లేదా తల్లీ కొడుకుల ప్రేమని ప్రచారిస్తే తమకేం వస్తుంది బూడిద! అదే శృంగారానికి దారి తీసే స్త్రీ, పురుష ప్రేమని ప్రచారిస్తే వేలంటైన్స్ డే దగ్గర్నుండీ ఎన్నో వెర్రుల్ని ఎక్కించవచ్చు అన్నవ్వాపార సూత్రం కావచ్చు.]

ఇక ఇలాంటి వ్వక్తిత్వం ఉన్న ఔరంగజేబుకి, అటు మరాఠాను కబళించే ప్రయత్నం, ఇటు గోల్కోండని వశపరుచుకొనే ప్రయత్నం అతనిలోని రాజ్యకాంక్షనీ, ధన దాహాన్ని చూపిస్తుండగా, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఔరంగజేబు కుటిల తంత్రాల్ని [సెయిస్తఖాన్ రాయబారం, శివాజీని చెరలో పెట్టించడం, స్నేహం నటించిన రాజకీయాలు] విశద పరుస్తుండగా - వ్వక్తిగా అతడు సచ్చీలుడనీ, ఇస్లాంని ఆచరించిన పవిత్రుడనీ, ప్రజల సొమ్ముతో తిండి కూడా తిననంత సాధువనీ[హిందువుల మీద జుట్టుపన్ను, పరమత సహనం లేక వేసాడట] మీడియా పరోక్షంగా ఇమేజ్ [పాజిటివ్ కాప్షన్] ఇచ్చేది, ఇచ్చింది.

ఇంతటి నెగిటివ్స్ ఉన్న ఔరంగజేబుకి, [ముస్లిం చక్రవర్తికీ] అంతటి పాజిటివ్ ఇమేజ్ ఇచ్చి - ఎంతో పాజిటివ్ వ్యక్తిత్వం కలిగిన, పుత్రుల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడంలో సఫలీ కృతులైన కౌసల్యదశరధిలకీ, మానవతా విలువల్ని పాటించి చూపించి అందరికీ ఆదర్శప్రాయుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచే రాముడికీ, ఆయన సోదరులకీ అంతగా నెగిటివ్ ఇమేజ్ ఇవ్వడానికి - ఇంత పనిగట్టుకుని ప్రచారించిన మీడియాని చూస్తే తెలియడం లేదా, ఇది పక్కా కుట్రని?

ఈ రోజుల్లో లౌకిక వాదం అంటూ రాజకీయ పార్టీలు చేస్తోన్న [నకిలీ కణికుడి కుట్రలో భాగంగా] రాజకీయం కూడా దీనికి అనుగుణమైనదే. వీళ్ళ లౌకిక వాదం అంటే ముస్లింలని వెనకేసుకు రావడం, హిందువుల్ని విమర్శించడం. ఇదే విభజించడం - రాజకీయం చేయడం. ఇదిగాక ఇంకేమిటి? 14% ఉన్న ముస్లిం ఓట్లు అంతవిలువైనవి అయినప్పుడు, యు.పి.ఏ. నాయకురాలు నాగమ్మకి 79% హిందుఓట్లు అంత చులకన ఎందుకయ్యాయి? 14% ముస్లిం ఓట్లను ఎంతమంది పంచుకోగలరు? ఎన్ని శాతం ఓట్లు ఒక్కొక్కళ్ళకి వస్తాయి?

అసలీ ఓటు బ్యాంకు రాజకీయాలన్న పేరు ఓ వంక. కుహనా లౌకిక వాదము ఓ వంక మాత్రమే. అంతర్గతంగా ఉన్నది నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా చేస్తోన్న కుట్ర మాత్రమే. గమనించి చూడండి. వరుసగా దేశాలు [మొన్న బ్రిటిషు, నిన్న రష్యా, ఈ రోజు అమెరికా, ఇక రేపు చైనా] వెలిగి, ఆరిపోతున్నాయి. చాపక్రింద నీరులా, అనుశృతంగా గల్ఫ్ దేశాల పెట్రో వ్వాపారం, డబ్బు సంపాదన మాత్రం నిరంతరాయంగా నడిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 40% మాత్రమే వారి చమురు ఉత్పత్తి. అయినా ఒపెక్ దేశాలు [దాదాపు అన్ని ముస్లిం దేశాలే] పట్టు మాత్రం సడలనిది. రసాయన ఎరువులు, సౌందర్య ఉత్పత్తులూ అన్నింటికీ ముడి చమురు నుండి వచ్చే ఉత్పత్తులు కావాలి. చౌకగా దొరికే బయోడిజీల్ ప్రయోగాలు, సాంప్రదాయేతర ఇంధన వనరులు సౌరశక్తి వగైరా వినియోగ ప్రయోగాలు ఎప్పటికి ప్రయోగశాలలోనే ఉంటాయి. పరిశోధనలు కొనసా...........గుతుంటాయి. మైలేజ్ ఎక్కువ వచ్చే వాహనాలు హిట్టవ్వవు. మోడల్ మోజు పుట్టించదు. మైలేజ్ తక్కువ ఇచ్చే వాహనాలకు యువత వెంపర్లాడతారు. అలాంటి మోజు మీడియా [టీవి, సినిమా] పుట్టిస్తుంది. సర్వకాల సర్వావస్థలయందు పెట్రో వ్వాపరం 3 పువ్వులు, 6 కాయలుగా ఉంటుంది. ప్రపంచమంతటా ముస్లిం గారాబం నడుస్తూ ఉంటుంది. క్రమంగా ఎన్నోదేశాలు ముస్లిం దేశాలైపోయాయి. [బౌద్దా చరణ గల ఇండోనేషియా నేడు ముస్లిం దేశాలై పోయినట్లు. లేదా కెరీర్ బాగుంటుందను కుంటే ఏ.ఆర్.రెహమానులు, భజన్ లాల్ కొడుకు లాంటి వాళ్ళు ముస్లింలు అయిపోయినట్లు] అలాగని ఈ నకిలీ కణికుడు పూర్తిగా ముస్లిం పక్షపాతి అనుకోకండి. ఆ మతమౌఢ్యం ఎక్కిస్తే బలి కావడానికి బకరాలు ఎక్కువ దొరుకుతాయి. నకిలీ కణికుడికీ ముస్లిం మతానికి ఏదో అవినాభవ సంబంధాలున్న యన్నది నిజమే గాని, అతడి తంత్రం మాత్రం కొద్ది మంది ముస్లింలకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. [బ్రూనే సుల్తానులూ, దుబాయ్, సౌదీ రాజులు వగైరా లన్న మాట]

భారతీయ ఇతిహాసం మీద నకిలీ కణికుడి కుట్రచెబుతానంటూ ఏదేదో చెబుతున్నదేమిటి అనుకోకండి. హిందువుల పైన వ్యతిరేకంగా కుట్ర, ముస్లింల పైన అవ్యాజానురాగం - ఈ నకిలీ కణికుడి కుట్ర అనే నాణానికి రెండూ ముఖల్లాంటివి. అందుచేత చెప్పక తప్పలేదు. గల్ఫ్ లోని ముస్లిం దేశాలకు కూడా ప్రపంచంలో ఉన్న ముస్లింల పట్ల ప్రేమేమీ లేదు. ఉండుంటే వాళ్ళ జీవన స్థాయి పెంచటానికి ప్రయత్నించేవాళ్ళు. అంతేగాని తిండి గడుస్తుందని పేదముస్లిం పిల్లలనూ మదర్సాలకూ వచ్చేటట్లు కుట్రజరగదు [ సౌకర్యాలు తగ్గితే సర్దుకోగలం. తిండికి లేక పోతే సర్ధుకోలేం కదా! ఇదే ఇక్కడ నకిలీ కణికుడు ప్రయోగించే తంత్రం].

ఇక్కడ మరో మెలిక ఉందండి. ఓప్రక్క పైన చెప్పిన నకిలీ కణికవ్యూహం నడుస్తుండగా సహజంగానే హిందువులకి రగిలిపోయింది. దాన్ని భుజానికెత్తుకొని బి.జె.పీ.లు, సంఘపరివార్ లూ, హిందూ టెర్రరిస్టులూ తెరపైకి వచ్చారు. ఏ విధంగా అయితే MIM రాజకీయ నాయకులు ముస్లింలందరికీ ప్రతినిధులు కారో, అదేవిధంగా ఈ హిందుత్వనాయకులు హిందువులందరికీ ప్రతినిధులు కారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండూ వర్గాలూ నకిలీ కణికుడి ఏజంట్లే. భారతీయులు మీద మతం పేరుతో ’విభజించి గ్రిప్ చేసే తంత్రాన్ని ప్రయోగించడానికి పనిచేస్తోన్నారంతే.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

మళ్ళీ మన ఇతిహాసాలు దగ్గరికి వస్తాను. ముందే చెప్పినట్లు, భారత రామాయణాలు భారతీయులకి రెండు కళ్ళవంటివి. ఈ రెండు కళ్ళతో ప్రజలు తమ చుట్టు ప్రపంచాన్ని, తమ జీవితాన్ని విలక్షణంగా పరికించవచ్చు, పరిశీలించవచ్చు.

ఇక భాగవతం భారతీయులకు హృదయం వంటిది. భారతీయులు తమ జీవితాల్లోని ప్రతి అనుభూతిని శ్రీకృష్ణలీలలన్నంతగా భావిస్తూ అనుభవిస్తారు [ప్రతీ తల్లీ, తన బిడ్డల్ని కన్నయ్య, కిట్టయ్య అనుకుంటుంది]. ఇక వేద విఙ్ఞానమయితే భారతీయుల మెదడు వంటిది. భారతీయులు ప్రపంచాన్ని, విశ్వాన్ని, తమ జీవితాన్ని ఈ ఙ్ఞానంతోనే పరిశీలిస్తారు, గుర్తిస్తారు.

ఇక భగవద్గీత భారతీయులకి ఏకంగా ఆత్మ వంటిది. ప్రాణం వంటిది. ఆత్మలాగే అది శాశ్వతమైనది. మనిషి జీవితానికి పునాది వంటిది. మనకి అర్థం కానివ్వండి, కాకపోనివ్వండి భగవద్గీత, అందులోని ఙ్ఞానం భారతీయుల జీవన నిర్మాణం వంటిది. మనకు అవగాహన ఉన్నా, లేకపోయినా, గీత ఙ్ఞానం భారతీయుల జీవన విధానం, జీవిత తత్త్వం.

కాబట్టి నకిలీ కణికుడూ అతడి వ్యవస్థా తమ కుట్రలో సింహ భాగం ఇతిహాసాలకే ఇచ్చారు[తరువాత భాగం రాజకీయానికి]. నేను ఈ చర్చని రామాయణంపై కుట్రతో ప్రారంభిస్తాను.

రామాయణంలోని శ్రీరాముడు సూర్యవంశీయుడు. ఇక్ష్వాకు, మనువు, సత్యహరిశ్చంద్రుడూ ఈయన వంశ పూర్వీకులు. వారు గొప్పరాజులు. అంతేగాక ధర్మాన్ని, నీతినీ, సత్యాన్ని ఆచరించిన వారు. ఇందులో సత్యహరిశ్చంద్రుడి గురించి, ఆ అంశంలో కుట్ర గురించి ఇంతకు ముందే వివరించాను. ఆవిధంగా ఒక గొప్పకధ, ఒక గొప్ప స్ఫూర్తి ప్రజల మనో ఫలకం నుండి మాసి పోయింది. దానితో పాటు జనాల్ని నిజం వైపు నడిపే శక్తి, ధర్మాచరణకి పురికొల్పే స్ఫూర్తి కూడా రూపు మాసిపోయింది. ఏ కథ సామాన్యుణ్ణి, మహత్ముణ్ణి చేసిందో, మళ్ళీ అలాంటి ప్రమాదం జరక్కుండా నకిలీ కణికుడూ, అతని వ్యవస్థా ఆ కథని సమాజం నుండి పారద్రోలేసారు. అలాంటి స్ఫూర్తి ప్రదాయక నాటకాలు, కళలో ప్రదర్శించే సురభి, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలూ వ్యూహాత్మకంగా కుప్పకూలిపోయారు. ఓ వ్యక్తి మీద, ఓ కుటుంబం మీద ఒక వ్యవస్థ [గూఢచారి వ్యవస్థ] పని చేసినప్పడు ఇలా జరగటం సహజమే.

హరిశ్చంద్రుడి కథలో ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితుడూ ఆతని సత్యదీక్షకి అండదండలదిస్తారే గానీ అడ్డంకులు కలిగించరు. కుటుంబంలో విభజించి పాలించే కణిక నీతి ప్రవేశిస్తే ఆయనైనా ఓడిపోతారేమో. ఈ నాటకాన్ని సురభిలాంటి కళాకారులూ పద్యరూప నాటకంగా ప్రదర్శిస్తే గ్రామీణులు సైతం ఆ గ్రాంధిక పద్యాల్ని భావ సహితంగా గ్రహించగలిగే వాళ్ళు. అర్థం చేసుకోగలిగే వాళ్ళు. ఈ రోజు తెలుగు ఏపాటి అర్ధమౌతుందో మనకి టీవి యాంకర్లని చూస్తే తెలుస్తోంది కదా!

ఇంకా హరిశ్చంద్రుడి కథలో, ఆయన కుటుంబం మొత్తం ‘సత్యం పలకడం’లాంటి నైతిక విలువలకి కట్టుబడి ఉంటుంది. ఇలాంటి కథలు ప్రజల్ని, కుటుంబం మొత్తం కష్టసుఖాల్లో కలిసికట్టుగా ఉండేలా ప్రోత్సాహిస్తాయి. భర్తలు కష్టాల్లో ఉన్నప్పడు వెన్నంటి ఉండాలని భార్యలకి ఇలాంటి కథలు గుర్తుచేస్తాయి. అలాంటి కథలు మీద ఎన్ని వ్యంగ్యాలు, ఎన్ని జోకులు వేసారో చూశారుగా! రంగనాయకమ్మలకి మీడియా ఇచ్చిన ప్రోత్సాహం, ఉషశ్రీల కిచ్చిన మౌనం మన కళ్ళముందు రికార్డెడ్ సత్యం కదా!

ఇక శ్రీరామ చరిత్ర గురించి చెబితే ...

దశరధ మహారాజు తన కోసల రాజ్యాన్ని, ధర్మబద్దంగా పాలించడమే కాదు, తన నలుగురు కొడుకుల్ని చక్కగా పెంచాడు కూడాను. తల్లితండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని గౌరవించేలా, ధర్మాన్ని ఆచరించేలా, కష్టాల్లో ధైర్యంగా ఉండేలా, వినయవిధేయతలూ, ధైర్యసాహసాలూ ఉండేలా కొడుకుల్ని తీర్చిదిద్దాడు. బాల్యం నుండీ రామలక్ష్మణ భరత శతృఘ్నలు సత్ర్పవర్తనకు పేరుగాంచారు. వారిలో శ్రీరామ చంద్రుడు మరింత అందమైన వాడు, సౌశీల్యుడు, ఙ్ఞాని, మృదుభాషి. అందర్నీ మన్నిస్తూ ఎవరినీ నొప్పించని మృదుస్వభావి. సహజంగానే ప్రజలు రాముణ్ణి ప్రేమించేవాళ్ళు. రామాయణంలోని ఇతర పాత్రలు శ్రీరాముణ్ణి పొగడుతూ ఉంటాయి. ఆదికవి వాల్మీకి ఇదంతా ఎంతో రమ్యమైన శ్లోకాలతో వర్ణించాడు.

దీన్ని ఉటంకిస్తూ రామాయణ విషవృక్ష రచయిత్రి రంగనాయకమ్మ, ఇంకా అలాంటి వ్యక్తులు ఎన్నో విమర్శలు చేశారు. ఈ రకంగా ఇతర పాత్రల చేత పొగిడించి, ప్రజలంతా మాస్ హిస్టీరిక్ గా రాముణ్ణి ఆరాధించేట్లు వాల్మీకి, రామ భక్తులూ చేశారట. అందరూ కలిసి శ్రీరాముడికి ’హీరో ఇమేజ్’ ఇచ్చారట కాని, నిజంగా శ్రీరాముడు అంత గొప్పవాడేం కాదట.

నిజానికి వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ణి గాని, రామాయణాన్ని గాని హిట్ చేసుకోనేందుకు పబ్లిసిటిగానీ, ప్రచారంగానీ, వాణిజ్య ప్రకటనలుగానీ ఇవ్వలేదు. రామాయణాన్ని ప్రసిద్ది చేసుకొనేందుకు ఆయన మార్కెటింగ్ కాంపయన్లు నిర్వహించలేదు. శ్రీరాముడు కూడా అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. తనిని తాను పొగుడు కోలేదు.[స్వంత గోకుడు] అవార్డులూ, రివార్డులూ, ఙ్ఞాన పీఠాలూ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులూ, ఆస్కార్ లూ కొనుక్కోలేదు. పద్మశ్రీలు, జీవన సాఫల్య బహుమతులూ తెచ్చుకోలేదు. కనీసం కళాతోరణాల్లో సన్మానాలన్నా చేయించుకోలేదు. శ్రీరాముడు, వాల్మీకి తననూ పొగిడిన వాళ్ళకే కెరీర్ ఉండేలా గాడ్ ఫాదర్ గిరీ చేయలేదు. ఈ రోజు వ్యూహత్మకంగా కొందరు హీరోల్ని, హీరోయిన్లనీ హిట్ చేస్తున్న ఏ తంత్రల్నీ [స్ట్రాటజీ] లనీ వారు ప్రయోగించలేదు.

వాల్మీకి గాని శ్రీరాముడు గాని ’నువ్వు నావీపు గోకు. నేను నీవీపు గోకుతా.’ అనే మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకోలేదు. ఈ రోజుల్లో ఇదే కదా మీడియా, సినిమా ప్రపంచం ఆచరిస్తోన్న తంత్రం? ఈ రోజు XYZ పత్రికిచ్చిన ప్రపంచపు అత్యంత ప్రభావశీల మహిళ ర్యాంకులు, ఆసియా సెక్సీయస్ట్ మహిళల ర్యాంకులు ఎంత మాయాజాలమో అందరికీ తెలిసిందే.

చిరంజీవుల్ని, రజనీ కాంతుల్ని ఆయా భాషల్లో సూపర్ స్టార్ లని చేసిన మీడియా లాంటివి అప్పట్లో లేవు. శ్రీరాముడు గానీ, వాల్మీకి కవి గాని తమ దగ్గర లైట్ అంటే సామర్ధ్యం ఉందని దండోరా వేసికొనేందుకు మీడియాని ఉపయోగించుకో లేదు. మీడియా లాంటి వేవీ లేకుండానే ప్రజలు వారిలో ఆ సుగుణాల్ని, సామర్ధ్యాల్నీ చూశారు, అంగీకరించారు.

నిజానికి ప్రస్తుత కాలాన్ని రామాయణ కాలంతో పోల్చకూడదు. రామాయణ కాలాన్ని ప్రస్తుత కాలంతో పోల్చకూడదు. [మౌలిక సదుపాయల విషయంలో పోల్చకూడదు. మానవతా విలువలు విషయంలో కాదు. ఎందుకంటే మానవతా విలువలు దేశకాల మానపరిస్థితుల్ని బట్టి మారవు] అయినా ఎందుకు పోల్చానంటే ...

ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, రామసేతు వివాదం విషయంలో విమర్శిస్తూ, "రామ సేతు ప్రకృతి సహజంగా ఏర్పడింది. అంతేగాని అది రాముడు లంకకి కట్టిన వారధి కాదు. నిజానికి రాముడంటూ ఏవ్యక్తీ పుట్టలేదు. రామాయణం కవుల కల్పన. ఎక్కడ పుట్టాడు రాముడు? ఎప్పడు పుట్టాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పడు చదివాడు? ఇంజనీరింగ్ చేశాడా? భారతదేశం నుండి లంకకి బ్రిడ్జి కట్టేందుకు ఏ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చేశాడు?" అన్నాడు.

ఈ రోజు భారత్ లో [ఇక్కడే కాదు, ప్రపంచమంతటా కూడా] ఓ మామూలు స్త్రీకి MLA భార్య పేరిట నకిలీ పాస్ పోర్టులు దొరుకుతున్నాయి. ఈ రోజు భారత్ లో ఒక్క ఉగ్రవాదికి 10 పేర్లతో 10 నకిలీ పాస్ పోర్టులూ, ఫోటో గుర్తింపుకార్డులు దొరుకుతున్నాయి. ఈ రోజు భారత్ లో అసలు బేసిక్ నిర్వచనాలైనా రాని విద్యార్దులకి ఏకంగా ఎంసెట్ స్టేట్ ర్యాంకులూ, డిస్టింక్షన్లూ వస్తున్నాయి. కేవలం డబ్బుంటే చాలు, ఆయా డిపార్టమెంట్లనీ, అధికారుల్నీ, రాజకీయ నాయకుల్నీ కొనడానికి. ఏదైనా సాధ్యమే. అటువంటప్పడు శ్రీరాముడూ,లక్ష్మణుడూ, సుగ్రీవుడూ, ఆంజనేయుడూ, నీలుడు లకి అసాధ్యమా తమిళనాడు నుండో, ఆంధ్రప్రదేశ్ నుండో లేక భారత్ నుండో, ఓ యూనివర్సిటీ నుండి, తొక్కలోది ఓ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పుట్టించడం? అవో పెద్ద ప్రామాణికాలా?

ఈ అంశం ప్రక్కన బెట్టండి.

అసలు రాముడు నిజంగా ఈ భూమ్మీద పుట్టాడో లేదో,

రాముడు కవికల్పితపాత్రో నిజమో

రాముడు లంకకి వారధి కట్టాడో లేదో,

ఏ రామ సేతుమీదైతే బి.జె.పీ., అయోధ్యలోని రామ మందిరంలాగా డ్రామలాడి లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందో, ఆ రామసేతు ప్రకృతి సహజంగా ఏర్పడిందో, మానవ నిర్మితమో –

ఏదైనా కానివ్వండి. దాన్ని కోట్లాది భారతీయులు నమ్ముతున్నారన్నది పచ్చినిజం. కనీసం ఆ నమ్మకాన్నయినా గౌరవించాల్సిన అవసరం కరుణానిధికి గాని, కేంద్రంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ. కి గానీ లేదా? భారతీయులు లేదా హిందువుల నమ్మకాలూ, మనోభావాలూ అంత చులకనా? ఏం, హిందువులకి మనోభావాలుండవా?

1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఢిల్లీ అల్లర్లలో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ 24 ఏళ్ళ తర్వాత కూడా మరిచిపోకుండా వ్యాసాలు వ్రాసే కులదీప్ నయ్యర్ [ఈయన పాకిస్తాన్ నుండి ఇక్కడికి వలస వచ్చాడు దేశవిభజన సమయంలో. నేటి సీ.ఇ.ఓ. ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత ఎల్.కే.అద్వానీ, రాజ్ కపూర్ లూ, బి.అర్.చోప్రాలు, సునిల్ దత్ లూ, దేవానంద్ లూ, రాన్ బాక్స్ అధినేతలూ - ఇలా ఎందరో ప్రముఖలు, ఎన్నో రంగాల్లో - అందరూ ఇదే వర్గీయులు[పాక్ నుండి వలస వచ్చిన వారు] కావడం ఇక్కడ విశేషం] వంటి వారికి, అదే సానుభూతిని హిందువుల పట్ల చూపించాలని ఎందుకనిపించదో? కేవలం ఇతర మతస్తులకో, దళితులకో మాత్రమే మనోభావాలు దెబ్బ తింటాయా? హిందువులు బండరాళ్ళా? వారికి మనోభావాలుండవా, లేక దెబ్బతినవా?

ఇది చూపడం లేదా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న కుట్రని? లేకపోతే కరుణానిధో మరొకరో, ఇలాంటి వ్యాఖ్యలూ, విమర్శలూ ఇతర మత విషయాల మీదగానీ, మతప్రవక్తల మీద గాని, మత నమ్మకాల మీదగాని చేయగలరా? అంతగా ఎందుకు హిందువులు చులకనా?[ఇతర మతాలని అంటే పత్రికలు కోపేసుకొస్తాయి. అదే హిందూ మతాన్ని అంటే మరింత మద్దతిస్తాయి] ఎవరు ఇంతగా హిందూ నమ్మకాల్ని, మతాన్ని హీనపరచే వారికి సహాయసహకారం ఇస్తున్నారు? సందేహం లేకుండా అది నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థే. ఆ వ్యవస్థ పేరు, ఏదైనా కానివ్వండి [సి.ఐ.ఏ. లేదా ఐ.ఎస్.ఐ. లేదా లష్కర్ లేదా తొక్క లేదా తోలు].

మళ్ళీ మనం రామాయణం, దశరధుడి దగ్గరికి తిరిగివద్దాం. రాజుగా ఆయన సఫలీకృతుడు. తండ్రిగానూ సఫలీకృతుడు. తన పుత్రుల్ని వ్యక్తిత్వం ఉన్న వారిగా పెంచాడు. వారిని ప్రజలకి బాధ్యులుగా ప్రవర్తించేలా పెంచాడు. తానూ అదే కోవకి చెందుతాడు గనుకే ఆయన రాజుగా సఫలీకృతుడని చెప్పాలి. రాజుగా తానెంత బిజీ అయినా తన తర్వాతి తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయన మరచిపోలేదు. కాబట్టి ఆయన పుత్రుల్లో తమ్ముళ్ళు, అన్నల్ని గౌరవించారు. అందరూ తల్లితండ్రుల్ని[సవతి తల్లితో సహా] గౌరవించారు. జౌరంగజేబు సింహాసనం కోసం తండ్రి షాజహన్ ని నిర్భంధంలో ఉంచినట్లు, సోదరుల్ని హత్య చేసినట్లు, దశరధ పుత్రులు సింహాసనం కోసం ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోలేదు.

మూడు నాలుగు దశాబ్ధాలు ముందు వరకూ కుటుంబంలోని పెద్దలూ తల్లితండ్రులూ రామాయణాన్ని ఉటంకించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, ఆకథల్ని పిల్లలకి చెప్పెవాళ్ళు. తాము మంచిగా ఉండటానికి, నీతినియామాల్ని పాటించటానికి ఆ కథల నుండి స్ఫూర్తి పొందే వాళ్ళు. కాబట్టే అప్పటి తరం వాళ్ళు తమ పెద్దల్ని గౌరవించే వాళ్ళు. అదే ఇప్పడు మన సమాజాన్ని గమనించినట్లయితే - పిల్లలు తమ కంటే పెద్దవాళ్ళయిన తోబుట్టువుని, అన్న లేదా అక్కా అని పిలవటం లేదు. పేరు పెట్టి పిలుస్తున్నారు. పెద్దలు, తల్లితండ్రులు పెద్దపిల్లల్ని పేరుతోనో, ముద్దుపేరుతోనూ పిలిస్తే, చిన్నపిల్లలు కూడా అదేఅనుకరిస్తారు. అప్పుడు నిజానికి పెద్దలూ, తల్లితండ్రులూ పిల్లల్ని సరిదిద్దాలి. చిన్న పిల్లలు తమకంటే పెద్దపిల్లల్ని గౌరవించేలాగా, పెద్దపిల్లలు తమకంటే చిన్నపిల్లల పట్ల వాత్సల్యం, ప్రేమ, బాధ్యతా కలిగి ఉండేలా చేయాలి.

కాని భారత రామాయణాలు సమాజంలో కనుమరుగైనరీత్యా, ప్రజల్లో చాలామంది ఈ క్రమశిక్షణ మరిచిపోయారు. చిన్నపిల్లలు తమ అన్నల్ని, అక్కల్ని పేరుతో పిలిస్తూ తల్లితండ్రుల్ని అనుకరించినప్పుడు తల్లితండ్రులు అది పిల్లల చిలిపితనంగా భావించి నవ్యుతున్నారు, ఆనందిస్తున్నారు. పిల్లల చిలిపితనాన్ని, బాల్యాన్ని ఆనందించవలసిందే. కాని క్రమశిక్షణారాహిత్యాన్ని కాదు. తాము పిల్లల అల్లరి అనుకొంటున్నదే క్రమశిక్షణా రాహిత్యానికి తొలిమెట్లనీ, విలువల బంధాల తరుగుదలకి దారులని గమనించాలి. లేకుంటే ఫలితం మన కళ్ళెదుటే ఉంది. ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు[తోబుట్టువులు] ఆస్తుల కోసం భయంకరంగా తగవులు పడటం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి అవి హత్యల దాకా దారితీయటమూ చూస్తూన్నాం. మొన్నామధ్య MLA మరియు మాజీమంత్రి కళా వెంకట్రావు ఒక తమ్ముడు మరో తమ్ముణ్ణి హత్య చేసారని వార్తపత్రికలో చదివాను. ఇలాంటి సమాజంలో ప్రేమ, అనుబంధాల చిరునామా ఎక్కడ? ఇప్పడు చాలామంది జౌరంగ జేబులు తయారయ్యారు.

రామాయణంలో లక్ష్మణుడు తన అన్న రాముడికి, అరణ్యంలో సేవ చేసేందుకు, తోడుగా ఉండేందుకు రాచ నగరులో తన సౌఖ్యవంతమైన జీవితాన్ని, యవ్వనంలో ఉన్న అందమైన భార్య ఊర్మిళనీ 14 ఏళ్ళు పాటు వదలి, అన్నకోసం తన స్వసుఖం త్వజించాడు. భరతుడు తల్లి తన వరాలతో, తన కోసం సంపాదించి పెట్టిన రాజ్యాన్ని త్వజించాడు. అతడు అన్నతో తన కంత శక్తి సామర్ధ్యాలు లేవనీ, అర్హతా లేదని చెబుతూ అన్నపై గౌరవాన్ని ప్రకటించాడు. [ఈ కధా గమనాన్నంతా రంగ నాయకమ్మ విషవృక్షం హిపోక్రసీ అన్న కళ్ళద్దాల్లోంచి చూపిస్తుంది] రాజు, రాణిలై ఉండి కూడా దశరధుడూ ఆయన భార్యలు తమ బిడ్డల్ని అంత నైతిక విలువలుండేటట్లుగా పెంచారు.

ఇప్పడు మన ఆధునిక సమాజంలో తల్లితండ్రులు దశరధుడూ, ఆయన రాణుల కన్నా బిజీగా ఉన్నారా? ఒకదేశానికి పాలకులుగా ఉండీ తమ భావితరాల్ని తీర్చిదిద్దుకున్న వారి కంటే నేటి తల్లితండ్రులు ఎక్కువ బిజీగా ఉన్నారు.

ఇంకా ఈ మధ్య సినిమాల్లోనూ, కొన్ని కుటుంబాలల్లోనూ సినిమా గారాబాలు చూశాను. తల్లితండ్రుల్ని పిల్లలు పేరుతో పిలిచేంత సినిమా గారాబం అన్నమాట. “ఒరేయ్! డాడీ!” అని కొడుకు పిలుస్తుండగా మురిసిపోయే ఓ తండ్రిని కూడా చూశాను. ఐదారేళ్ళ కొడుకు తండ్రినిలా పిలిస్తే ఇప్పడు బాగుంటుందేమో ఆతండ్రికి. పాతికేళ్ళొచ్చాక కూడా అలాగే పిలిస్తే బాగుంటుందా ఆతండ్రికయినా?[మనకు అస్సలు నచ్చదు లెండి] తండ్రిని లెక్క చేయకుండా, అగౌరవిస్తూ ఉంటే అప్పడూ బాగుంటుందా? ఇంకొంచెం పెద్దయ్యాక వృద్దాశ్రమాలకి పంపిస్తే అప్పడు బాగుంటుందా?

భారతీయ ఇతిహాసాలు, వేదాలు -

మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్య దేవోభవ అని చెబుతాయి.

అలాగని నిద్రలేవగానే తల్లితండ్రుల కాళ్ళకు దణ్ణాలు పెట్టాలని, నేను అనడం లేదు. గౌరవం, భక్తీ మనస్సులోనూ, ప్రవర్తనలోనూ ఉంటే చాలు. నడుములు పడిపోయేలా ప్రతీరోజు పాద నమస్కారాలు పెట్టక్కర్లేదు.

కాని ఇతిహాసలుకి, సంస్కృతికి దూరమైన నేటి మన సమాజంలో చాలామంది పిల్లల దృష్టిలో

తల్లి తమ కో సేవకురాలు [ఎందుకంటే తండ్రి, ప్రవర్తన తీరు తల్లి పట్ల అలాగే ఉంటుంది కాబట్టి]

తండ్రి తమకు క్యాషియర్ [ఎందుకంటే తల్లి, ప్రవర్తన తీరు తండ్రి పట్ల అలాగే ఉంటుంది కాబట్టి]

టీచర్ ఓ పలికిమాలిన వాడు[ అలాంటి ఇంటినుండి వచ్చిన పిల్లల్ని, స్కూల్ లో టీచర్ విమర్శిస్తుంది కాబట్టి, తల్లితండ్రుల దృష్టి టీచర్ పట్లా అదే కాబట్టి]

చాలా కుటుంబాల్లో, చాలామంది పిల్లల్లో ఈ రకపు క్రమశిక్షణా రాహిత్యం, పెద్దలపట్ల అవిధేయతా ఉన్నాయి. ఒక్కసారి మన బిజీ షెడ్యూల్స్ తాలుకూ హడావుడి కాస్త తగ్గించు కొని, పరిశీలిస్తే మనచుట్టూ చాలాచోట్ల ఇది కనిపిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

క్రిందటి టపాలో ఉదహరించిన పాట ఒక్కటే కాదు, అలాంటిపాటలు, సినిమా కధా సన్నివేశాలు, అలాంటి కధలు, అదేవిధమైన వాదనలు, అలాంటి జోకులు సినిమాల్లో, వార్తల్లో, ఎక్కడ ఎలా వీలైతే, అక్కడ అలా ప్రచారించారు. ఈ ప్రచారం ఎంత వరకు కొనసాగిందంటే ప్రజలదృక్పదం (యాటిట్యుడ్) పాజిటివ్ నుండి నెగిటివ్ ధింకింగ్ కీ, మంచి నుండి చెడుకీ, సహనం నుండి ప్రతీకారంకీ, ప్రేమ, సహకారం, సహాయం లనుండి ద్వేషానికీ మారేవరకూ కొనసాగింది. ఇదీ గూఢచర్యపు స్లోపాయిజన్.

కానట్లయితే, ఒక సాల్మన్ రష్ది లేదా ఒక తస్లిమా నస్రీన్ ఇస్లాంకి వ్యతిరేకంగా వ్రాస్తె ఉవ్వెత్తున మీడియాలో గొడవ చెలరేగుతుంది. విరుద్దంగా వ్రాసిన రచయిత్రి లేదా రచయితలను చంపమని ఫత్వాలు విడుదల అవుతాయి. క్రైస్తవమో మరో మతం గురించో ఎవరు ఏ విమర్శచేయరు, చేసినా మీడియా ప్రచారించదు. మరి కేవలం హిందుమతం మాత్రమే అంత చేదు లేదా చులకన ఎలా అయ్యింది. ఎవ్వరైన ఎలాంటి జోక్ అయినా వేయగలిగేంత, ఎలాంటి భాషలో నైనా, హిందుమతానికి సంబందించిన ఏ విషయాన్నైనా, విమర్శించ గలిగేంత చులకన ఎలా అయ్యింది?

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే నకిలీ కణికుడి ఏజంట్లు, తమకు తాము మేధావులమనుకోంటూ మీడియా ఎక్కించే స్లోపాయిజన్ బుర్ర నిండా నింపుకొని, తెలిసో తెలియకో నకిలీ కనికుణ్ణీ,వాళ్ళ ఏజంట్లనీ అనుసరించే కొందరు భారతీయులూ ఏమని వాదిస్తారంటే – “హిందువులు పరాక్రమ వంతులు కారు. పౌరుష హీనులు. వారికి వారి మతం మీద గౌరవం లేదు. కాబట్టి తమ మతం, తమ ఇతిహాసాలు విమర్శించినప్పుడు వారు తమ నిరసననీ, వ్యతిరేకతనీ వ్యక్తీకరించడం లేదు. కావాలంటే చూడండి, హిందు మతాన్ని విమర్శిస్తోంది, జోకులేస్తుంది హిందువులే. ఇతర మతస్తులు కాదు.”

ఇక్కడ కుట్ర ఏమిటంటే ఉషశ్రీలూ, విశ్వనాధ లాంటి వారు హిందుమతం లోని గొప్పదనం చెబితే మీడియా ప్రచురించదు, ప్రచారించదు. అదే రంగనాయకమ్మలు, హేతువాద సంఘాలూ విమర్శిస్తే ప్రచురిస్తుంది, ప్రచారిస్తుంది. అంతే కాదు ఈ నకిలీ కణికుడి విభజించి ప్రచారించమన్న కుటిల నీతిలో - కొందర్ని లేదా కొన్నిమతాలవారిని రెచ్చగొట్టడం, కొందర్ని లేదా కొన్ని మతాల వారిని ఆత్మగ్లానికి గురి చేయడం, కొందరికి లేదా కొన్ని మతాలకి విపరీతమైన కవరేజి (సానియామీర్జాలకి లాగన్న మాట) ఇవ్వడం, కొందరికి లేదా కొన్ని మతాలవారిని నిర్లక్ష్యం చేయటం (నైనా సెహ్వాల్ ల లాగా అన్నమాట) ఇవన్నీ భాగాలన్నమాట.

సరే!

ఇక పై వాదనకు సమాధానం చెప్పేముందు, మీకు ఓ చిన్న ఉదాహరణ వివరిస్తాను.
పదిమంది కుటుంబ సభ్యులున్న కుటుంబం ఉందనుకోండి. అందులో ఇద్దరు నానమ్మ, తాతయ్య. మరో ఇద్దరు అమ్మా, నాన్న. మిగిలిన 6 గురు పిల్లలు. ఇంట్లో నలుగురు పెద్దలూ నీతి నిజాయితీలని, మానవతా విలువల్నీ, వ్యత్తి ధర్మాన్ని, మొత్తంగా చెప్పాలంటే భావవాదాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారనుకొండి. వారిని [మెటీరియలిస్టిక్ గా] పదార్ధవాదులుగా, డబ్బు మనుషులుగా[కమర్షియల్] మార్చేందుకు వారిపై ఓ కుట్ర రచించి అమలుచేయబడుతోంది అనుకోండి. ఓ ప్రణాళికా ప్రకారం ఆ కుటుంబపు ఆదాయ వనరులు తగ్గుతూ, ఖర్చులు పెరిగిపోయేలా పరిస్థితులు మారతాయి. కొంతకాలానికి బాల్యం కారణంగా వ్యక్తిత్వం ఏర్పడని పిల్లలు, అనుభవలేమి కారణంగా సరైన దృక్పధం ఏర్పడని పిల్లలు, తల్లితండ్రుల మీద, ఇంట్లోని పెద్దల మీద అసంతృప్తి చెందుతారు.

మౌలికంగా ’మానవుని కోర్కెలు అనంతం. వనరులు పరిమితం!’ ఇది అర్ధశాస్త్రంలోని తొలివాక్యం.

అలాంటప్పడు పిల్లలకి పెద్దల మీద అసంతృప్తి రావడం అన్నది అసహజం కాదు. ఈ లోపున సంపద తరిగి దారిద్ర్యానికీ, పస్తులకీ పరిస్థితి దారి తీసిందనుకొండి. ఖచ్చితంగా ఆకలి వాళ్ళని భావవాదాన్ని, మానవతా విలువల్ని వ్యతిరేకించేలా చేస్తుంది. [ముంబాయి ముట్టడిలో పట్టుబడ్డ ’కసబ్’ ఇందుకు తాజా ఉదాహరణ.]

దీనికి ఉత్ర్పేరకంగా ఇరుగుపొరుగూ వారు ఈ పిల్లలకి బుర్ర కడుగుడు [బ్రెయిన్ వాష్] చేశారనుకొండి, నల్లమేక - నలుగురు దొంగలు కథలో లాగా. “చూడండి. ఇతరులందరూ ఎంతో అభివృద్ధి చెందారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ భాగ్యవంతులైనారు. కేవలం మీరు మాత్రమే పేదరికంలో ఉన్నారు. [విభజించి - ప్రచారించే కణిక నీతిలో చాలా దేశాలు పేదలే] మీ కుటుంబ పెద్దలు ఐడియలిస్టులే [భావ వాదులే] కాదు, ఇడియట్స్ కూడా! రోజులు మారిపోయాయి. నీతి నిజాయితీ అంటే నడవదు. [ఈ వాదన విని చాలా మంది అవినీతి పరులైతే సమాజం ఎలా ఉందో ఇప్పడు మనకి ప్రత్యక్షానుభవం కదా!] నీతి నిజాయితీల గురించి మాట్లాడితే వినడానికి బాగుంటుంది. కానీ ఆచరించడానికి పనికి రావు. ఈ దృక్పధానికి పేదరికమే ఫలితంగా వస్తూంది. నిజం, ధర్మం, పురాణాలు, పాపం పుణ్యం, చరిత్రా, పాపభీతి తొక్కాతోలు అన్నీ ఉత్త చెత్తమాటలు. మీ పెద్దల్ని ఎదిరించు. నిర్లక్ష్యం చెయ్యి. వాళ్ళకి తాము విలువలున్న వ్యక్తులు, మంచివాళ్ళు అనిపించుకోవాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదు. మీ సుఖ సంతోషాలూ, మీ భవిష్యత్తు వాళ్ళకి పట్టడం లేదు. ఒకరకంగా చూస్తే మీ పెద్దలు స్వార్ధపరులు. స్వార్ధం అన్నది పదార్ధం, డబ్బు పట్లే కాదు, [ఫీలింగ్స్] భావనలపరంగా కూడా ఉండవచ్చు. అంతేకాదు మీ తల్లితండ్రులు, తాతయ్యలూ అందరూ వృద్దులూ, అహంకారులూ. అందుకే మీ వాదనని పట్టించుకోవడం లేదు. ఇది అన్ని చోట్లా ఉన్నదే. తరాల అంతరం! వాళ్ళకి మిమ్మల్ని అర్ధం చేసుకోనేంత తెలివి లేదు. వాళ్ళకి సామర్ధ్యం లేదు. సరి కదా ఈ అభివృద్దిని అర్ధం చేసుకొనేంత సీన్ లేదు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు. గౌరవించవద్దు.”

నలుగురు దొంగలు కాకపోతే 40 మంది లేకుంటే ఇంకా ఎక్కువమంది పదే పదే అదేప్రచారం, అదే విభజించి పాలించమనే కణిక నీతి అమలుచేస్తే ఏం జరుగుతుంది? సహజంగా ఆ కుటుంబంలోని కొందరు పిల్లలైనా ఇరుగుపొరుగు వారి మాటలకు ప్రభావితులౌతారు. కుట్రదారులకు మద్దతుదారులౌతారు. తమ కుటుంబం మీద తామే కుట్రల్ని అమలు చేస్తారు. ఫలితం - కుటుంబం కూలిపోతుంది.

అంతేగాక, చుట్టు ఉన్న ఇరుగూ పొరుగు డబ్బు గడిస్తూ, ధనంతో సుఖిస్తూ ఉన్నట్లు కనబడతారు గనుక ఈ పిల్లలకి వాళ్ళ పట్ల ఆకర్షణ పెరుతుతుంది. [సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారని ఎందుకంటున్నానంటే 1990లో USSR కూలిపోయేవరకూ అలాగే కన్పించింది. లెనిన్ గ్రాడ్ సెయింట్ పీటర్స్ బర్గ్ అయ్యాక, రష్యా బాలలు అక్కడ విదేశీ టూరిస్టులని బిచ్చమెత్తుకొంటున్నప్పడు తెలిసింది, మానసిక ఉన్నతి లేని అభివృద్ధి కాగితం పడవనీ, ఎప్పుడైనా మునిగిపోగలదని. అంతెందుకు ఇప్పడు సబ్ ప్రైమ్ తో అమెరికా నుండి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇది కనిపించడం లేదా? ఎంతో అభివృద్ధి చెంది, అందరికీ కార్లుండే అమెరికాలో ఉన్నట్లుండి ఉద్యోగం పోతే 5 లేదా 6 నెలల్లో, కుటుంబాలు రోడ్డున పడతాయంటే ఈ ఆర్ధిక అభివృద్ధి ఎంత ’తుమ్మితే ఊడే ముక్కు’లాంటిది?]

మళ్ళీ మన ఉదాహరణ దగ్గరి కొద్దాం. ఎలాగూ పిల్లలకి తమ పట్ల ఆకర్షణ పెరిగింది కనుక, చల్లగా పొరుగువారు ఈ కుటుంబాలలో మరిన్ని విభజనలు చేశారనుకొండి. ఆడమగా అనీ, పెద్దలూ పిన్నల తరమనీ, సంపాదనా పరులూ కానివారూ అని, - ఇలాగన్న మాట. అప్పడేమౌతుంది. కుటుంబంలోని వ్యక్తులు తమ వేలితో తమ కన్నే పొడుచుకుంటారు. ఇలా అందరూ గుడ్డివాళ్ళయితే వాళ్ళని ఎక్స్ ప్లాయింట్ చేయటం [దోచుకోవటం] తేలిక. ఇకదాని మానవవనరుల్ని, శక్తి సామర్ధ్యాలనీ తేలిగ్గా, చౌకగా, చక్కగా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఇకవారి ఆస్తుల్ని దోచడం తేలిక. అప్పటికే పేదలైపోయారు కనుక దోచుకోవడానికేముంది బూడిద అనుకోకండి. మానసికంగా గుడ్డివాళ్ళయినా, ఇంకా వారికి ఇతర నైపుణ్యాలున్నాయి. అవి ఉపయోగించి, కుట్రదారులు తక్కువ ఖర్చుతో సంపదని సృష్టించుకోవచ్చు.

ఇదీ ఉదాహరణ.

వాస్తవానికి కుటుంబం సమాజానికి ప్రామాణికం వంటిది. కొన్ని కుటుంబాలు కలిసి ఓగ్రామం, ఓ కాలనీ. కొన్ని గ్రామాలు లేదా కాలనీలు కలిసి ఓ పట్టణం లేదా నగరం. కొన్ని నగరాలూ, గ్రామాలు కలిసి రాష్ట్రం. రాష్ట్రాలు కలిసి దేశం.

పైన నేను ఇచ్చిన ఉదాహరణలో కుటుంబం భారతదేశానికి, హిందూ సమాజానికి ప్రతీక. కుటుంబ సభ్యులు వివిధ వర్గాల ప్రజలకి ప్రతీకలు. ఇరుగుపొరుగులు నకిలీ కణికుడి అనుచరులకి ప్రతీకలు. కుటుంబసభ్యులపై ఇరుగుపొరుగు చేసిన బ్రెయిన్ వాష్ మీడియా, సాహిత్య, సినిమా రంగాలు చేస్తూన్నాయి. ఇదంతా 3 నుండి 4 దశాబ్దాల కాలంలో మరింత ఊపందుకొన్నాయి.

ఇదే మాదిరి కుట్ర వివిధ దేశాల మీదా జరుగుతుండవచ్చు. వ్యక్తుల పేర్లు, పైకారణాలు మారవచ్చు.

ఏ దేశమైనా కానివ్వండి, ఏ జాతిప్రజలు కానివ్వండి, ఎవ్వరు కుట్రదారులు కానివ్వండి, కుట్ర విధానం ఏదైనా కానివ్వండి, కుట్ర ఉద్దేశం మాత్రం ఒకటే - మనుష్యుల్ని సున్నితమైన భావోద్వేగాలకు దూరం చేసి, పగా ప్రతీకారం లాంటి అరిషడ్వర్గాలకి దగ్గర కేసి, కమర్షియల్ మైండెడ్ గా ఉండే రోబోల్ని చేయడం. అప్పడు ఈ నకిలీ కణికుడికి, అతడి అనుచరులకీ జనాల శక్తి, సామర్ధ్యాలు నైపుణ్యాలూ చౌకగా సంపద ఉత్పత్తి వనరులుగా దొరుకుతారు.

దశాబ్దాల, ఇంకా చెప్పాలంటే 2 శతాబ్దాల కుట్ర ఇందుకే. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి కొందరు రాజకీయ నాయకులు పిల్లల పాఠాల నుండి చరిత్రని ఎత్తేయాలని[రద్దు చేయాలని] అన్నారు. ఎందుకంటే చరిత్ర చదివితే మనకి కుట్ర అర్ధం కావచ్చు, లేదా మన వారసత్వం, శక్తీ మనకి గుర్తు రావచ్చు లేదా మనకి మన పరిస్థితి పట్ల అవగాహన రావచ్చు. సమాజం నుండి చరిత్రని రూపు మాపెస్తే ఇక మనం గత చరిత్రనుండి పాఠాలు నేర్చుకోలేం, మన వర్తమాన సమస్యలకి గత చరిత్ర నుండి పరిష్కారాలు వెదుక్కోలేం, మన పూర్వుల, పెద్దల అనుభవాన్ని వినియోగించుకోలేం. అప్పుడు కుట్రని మరింతగా కొనసాగించడం ఎంత సులభం? కాకపోతే ఎందుకు పిల్లల పాఠ్యాంశాల నుండి చరిత్రని తొలగించడం లేదా సారం మొత్తం తీసి చరిత్రని మూడు ముక్కలలో చెప్పడం లేదా వక్రీకరించటం? మన అంతర్జాలం [ఇంటర్ నెట్] లో ఏదైనా సమస్య ఎదుర్కొనప్పడు FAQ చూస్తాం, మరెవ్వరికైనా గతంలో ఇలాంటి సమస్య వచ్చిందా, వస్తే ఎలా పరిష్కరించుకొన్నారని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాం. అదే మానవ సమాజంలో చరిత్ర మాత్రం వద్దా?] భారతదేశం మీద జరుగుతున్న కుట్రలో భాగంగా, చరిత్రనే సమాజం నుండి రూపుమాపే ప్రయత్నమే ఇంతగా జరిగినప్పడు - ఇక భారతీయ ఇతిహాసాల్ని రూపుమాపేందుకు, నిర్లక్ష్యపరిచేందుకు, అవమానించేందుకు ఇంకెంత తీవ్ర ప్రయత్నం జరిగి ఉంటుందో ఊహించండి.[సజీవ ఉదాహరణ కావాలంటే 4,5 తరగతుల చరిత్ర పాఠ్యపుస్తకాలు చూడండి. స్వాతంత్ర సమరయోధులూ, సంఘ సంస్కర్తల జీవితచరిత్రలు ఎంత రసహీనంగా, అస్సలే మాత్రం పిల్లలకి స్ఫూర్తినివ్వకూడదన్నట్లు వ్రాయబడి ఉంటుందో! వారి జీవితాల్లోని ఏ స్ఫూర్తిదాయక సంఘటనా ఉండదు. కేవలం ఎక్కడ ఏసంవత్సరంలో పుట్టారు, ఏ సంవత్సరంలో బారిష్టరు చదివారు, ఏ సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టారు, స్వాతంత్రానంతరం కూడా బ్రతికి ఉంటే ఏఏ సంవత్సరాలలో ఏఏ పదవులు నిర్వహించారు, ఏ సంవత్సరంలో మరణించారు - ఈ గణాంకాలే ఉంటాయి. అదే నాచిన్నప్పడు [అంటే ఇందిరా గాంధి హయాంలో అన్నమాట] పాఠ్యాంశాలు ఇలా ఉండేవి కావు.

ఓ పాత ఉదాహరణ చూడండి. నాచిన్నప్పడు 6 తరగతి పాఠం - ఓ చిన్న బాలుడికి పచ్చకామెర్ల జబ్బుసోకింది. ఆనాటి వైద్యుడు వాతలు పెట్టాలని సూచించాడు. కష్టమైనా పెద్దలు ఆమోదించారు. వైద్యుడు చిన్న ఇనపచువ్వని కాల్చాడు. ఆ బాలునికి 10 ఏళ్ళుంటాయి. నిమ్మ పండు రంగులో మిసమిసలాడుతున్న బాలుడి దేహంపైన ఇనపచువ్వతో వాత పెట్టాలంటే వైద్యుడి చెయ్యి వణుకుతోంది. కొద్దిసేపు ఇదంతా గమనించిన ఆ బాలుడు గభాలున వైద్యుడి చేతిలోని కాలుతున్న ఇనుప చువ్వని తన చేతుల్లోకి తీసుకొని తనకు తనే వాతలు పెట్టుకొన్నాడు. ఆ బాలుడి ధైర్య స్ధైర్యాలకి అందరూ నివ్వెరపోయారు.

పసితనం లోనే అంతటి తెగువని చూపిన ఆ బాలుడే సర్ధార్ వల్లభాయ్ పటేల్. సుమారు 550 సంస్థానాల్ని [నిజాంతో సహా] భారత్ లో విలీనం చేసిన ధైర్యశాలి. ఇలాంటి వెక్కడా ఈనాటి చరిత్రపాఠాల్లో ఉండవు. మేం 5వ తరగతిలో ఉండగా మా పంతులమ్మగారు చెప్పిన అల్లూరి సీతా రామరాజు పాఠం అయిపోయేటప్పటికి మా అందరి కళ్ళల్లో నీళ్ళు. ఇప్పుడలా ఎక్కడైనా ఊహించగలమా?]

ఈ రెండు దృష్టాంతాలతో మీరు చరిత్ర చదవటం యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుందో, అలాంటప్పడు చరిత్ర రూపు మాపే ప్రయత్నం నకిలీ కణికుడు, అతడి ఏజంట్లు చేస్తారో చేయరో ఊహించండి. అలాంటప్పడు ఇక ఇతిహాసాల మీద మరింత తీవ్రప్రయత్నం చేస్తారో అర్ధం చేసుకోండి.

మరోసారి సత్యహరిశ్చంద్రుడి కథ దగ్గరకి వద్దాం.

ఓ 100 మంది సభ్యులున్న ఓ సమాజం ఉందనుకొండి. ఆ వందమందీ ఎప్పడు నిజమే చెప్పే రకం అనుకొండి. అప్పడా సమాజంలో సుఖశాంతులుంటాయి. వందమంది ఆ[అడ్వాంటేజ్] ప్రయోజనం పొందుతారు.

వందమందిలో 90 మంది ఎప్పడూ నిజం చెప్పేరకం, 10 మంది అబద్దాలు చెప్పే రకం ఉన్నారనుకొండి. అప్పుడా 10 మందీ ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే నిజం చెప్పే 90 మందీ, అబద్దాలాడే ఈ 10 మందినీ వాళ్ళూ తమలాగే నిజం చెప్పేవాళ్ళని నమ్ముతారు కాబట్టి.

అదే వందమందిలో 10 మాత్రమే నిజం చెప్పేరకం, 90 మంది అబద్దాలాడే వాళ్ళు ఉన్నారనుకొండి. అప్పడు 10 మంది నిజం చెప్పేవాళ్ళే డిస్ అడ్వాంటేజ్ [ఇబ్బందులు] పడతారు. ఎందుకంటే అబద్దాలాడే 90 మంది, నిజం చెప్పే ఈ 10 మందినీ నమ్మరు, వాళ్ళు తమలాగే అబద్దాలాడతారనుకొంటారు కాబట్టి. ఒకవేళ ఈ 10 మందీ నిజమే చెబుతారని గమనిస్తే ఎక్స్ ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి.

ఇక వందమందీ అబద్దాలాడే రకమే అనుకొండి. అప్పడు సమాజం భయోత్పత స్థితికి చేరుకుంటుంది. అక్కడ సుఖమూ, శాంతి ఉండవు. అప్పుడు అందరికీ ఒరిగేది డిస్ అడ్వాంటేజే[ఇబ్బందులే].

ఈ నాలుగు స్థితుల్లో ఇప్పడు మన సమాజం ఏ స్థితిలో ఉందో మీరే విశ్లేషించండి.

నిజానికి ఈ నాలుగు స్థితులూ మన పెద్దలు చెప్పిన నాలుగు యుగాలు[కృత,త్రేతా, ద్వాపర, కలి] వంటివి.

ప్రస్తుతపు సమాజ స్థితికి మరో ఉదాహరణ చెప్పాలంటే - కొంతమంది ఓ వృత్తాకారంలో నిలబడ్డారనుకొండి. ప్రతీ ఒక్కరు తమ కుడివైపు వారిని చెంపదెబ్బ కొడుతున్నారునుకొండి. తిరిగి వచ్చి ఆ దెబ్బ తమకీ తగులు తుంటుంది. ఆ కసితో మనం ప్రక్కవాణ్ణి మరింత గట్టిగా కొడతాం. వాడు ఆ ప్రక్కవాణ్ణి మరింత గట్టిగా ..... అలా అలా... చివరకి వారికి తగిలే దెబ్బల్లోనూ గాఢత పెరుగుతుంటుంది. అబద్దం, అవినీతి, మోసం చెంపదెబ్బలాంటివే. అప్పుడు ప్రతీవాడు బాధితుడే. [ఓ డాక్టరు పేషంట్లని పిండి సంపాదించిన సొమ్ముని మరో కార్పోరెట్ స్కూలుకో, కాలేజీకో సమర్పించుకొని తమపిల్లల్ని చదివించుకోవలసిందే. ఒకచోట దోచుకొని, మరోచోట దోచుకోబడి. కుడివైపు వాణ్ణి చెంపదెబ్బ కొట్టి, ఎడమవైపున ఉన్నవాడి చేతిలో మనం చెంపదెబ్బ తినటం లాంటిదే ఇది.] ప్రస్తుతం మనం ఇలాంటి సమాజంలోనే బ్రతుకుతున్నాం.

ఎవరిలా చేసారు మనల్ని?

ఎందుకీ స్థితి దాపురించింది?

నిజమే, ఇది నకిలీ కణికుడి కుట్ర. కాని మనం కూడా పరుగు పరుగున వచ్చి ఈ నరకం లో పడ్డాం కదా?

ఒక మోసం, ఒక దగా జరిగితే లేదా ఒక కుట్ర జరిగితే, అందులో మోసగించేవాడి తెలివికి లేదా కుటిలతకీ ఎంత పాత్ర ఉందో, మోసగింపబడిన వాడి తెలివితక్కువకీ లేదా నిర్లక్ష్యానికీ అంతే పాత్ర ఉంది.

కాబట్టే మనం, స్వయంగా మన భారతీయులం - తెలిసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో - ఈ నకిలీ కణికుడికో, అతడి ఏజంట్లుకో సహాయం పడ్డాం, సహకరించాం. కనుకనే నకిలీ కణికుడు, అతడి వ్వవస్థా కలిసి మన బ్రతుకుల్నీ, మన సమాజాన్ని, మన యువతరాన్ని, మన భవిష్యత్తునీ ధ్వంసం చేయగలుగుతున్నారు.

ఈ నేపధ్యంలో మన ఇతిహాసాల, పురాణాలను అగౌర పరచడానికి, అనాదరణ పాలు చేయడానికి జరిగిన కుట్ర రూప స్వభావాల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

నిజానికి, హిందూ మతం, హిందూ పురాణాలు, ఇతిహాసాలు భావ వాదత్మకమైనవి.[ఐడియాలిస్టిక్] బహుశః చాలా మతాలు కూడా ఐడియాలిస్టిక్ అయిఉండవచ్చు.

వాస్తవానికి హిందూ మతం ఒక మతం కాదు.

అది ఒక జీవన సరళి.

అది ఒక దృక్పధం.

అది ఒక ధర్మచింతన.

అది ఒక ప్రణాళికాబద్దమైన క్రమశిక్షణాయుతమైన కర్తవ్యాచరణ, పనితీరు[పండగలు, ఆచారాల పేరిట ఉన్నది ఆ క్రమశిక్షణే]

ఆ ప్రణాళికా బద్ధమైన, క్రమశిక్షణని బద్ధలు కొట్టడానికి, నీతిగా ఆలోచించడాన్ని అవినీతివైపు మళ్ళించడానికి, డబ్బుని గాక గుణాన్ని చూసే దృక్పధాన్ని మార్చడానికి, ఈ జీవన శైలిని నాశనం చేయడానికి - నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా పనిచేస్తోన్నాయి.

నిజానికి రామాయణం, భారతం కేవలం భారతీయుల రెండు ఇతిహాసాలు కావు. అవి భారతీయులకి రెండు కళ్ళువంటివి. ఇక్కడ కేవలం ‘భారతీయులు’ అన్నపదాన్ని భారతీయ సంస్కృతి కి పర్యాయ పదంగా వాడుతున్నాను. ఎందుకంటే హిందూ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి భారతీయుల్లో మతానికతీతంగా ఇంకిపోయింది. మతాల కతీతంగా భారతీయులందరూ విధిని, నుదుట వ్రాతని నమ్ముతారు. కాబట్టే నేను ’హిందూ’ అన్న పదానికి బదులుగా ‘భారతీయ’ అనివాడుతున్నాను. విధి అన్న సిద్ధాంతం భారతీయుల రక్తంలోనూ, జీన్స్ లోనూ ఉంది. వేయి సంవత్సరాల క్రితం భారత దేశంలో హిందువులు, బౌద్దులు, జైనులూ లాంటి భారతీయ హిందూ సోదర మతాలు తప్ప ఇస్లాం, క్రైస్తవం లేవు. ఈ నాటి ముస్లిం, క్రైస్తవుల ముందు తరాల వాళ్ళల్లోనూ ఉన్నవి భారతీయుల జీన్సే. కాబట్టే వారి దృక్పధమూ, వారసత్వమూ, సత్యం, ధర్మం, మంచి చెడుగూ పట్ల నమ్మకాలు భారతీయ తత్త్వన్ని దాటిపోవు. అలాంటి వారసత్వం కారణంగానే ఈ నాటికీ భారతీయులందరూ మతాల కతీతంగా శాంతిప్రియులూ, సహనపరులూ గానే ఉన్నారు. కాబట్టే ఈ నకిలీ కణికుడికి కూడా పాతబస్తీలాంటి ప్రాంతాలలో సైతం తక్కువమందే ఉగ్రవాదులు లభిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ మీదా, ఆఫ్గానిస్తాన్ ల మీదా ఆధారపడుతున్నాడు. సింధూ దాటితే ఆఫ్గాన్ ఇసుక పర్రలే. అక్కడి వాళ్ళు అఖండ భారతం భాగస్తులైనా భౌతికంగానే, భావపరంగా కాదు. అందుకే ఆ రక్తానికి భారతీయుల రక్తానికీ శాంతి సహనాల్లో అంత తేడా! సామర్ధ్యాల్లో సైతం అంత తేడా!

కాబట్టే ప్రపంచ ముస్లింలలో భారతీయ ముస్లింలు వేరు. ప్రపంచముస్లింలతో పోలిస్తే భారతీయ ముస్లింలకు మరిన్ని మానవతా విలువలు, నీతి నిజాయితీలూ ఉన్నాయి. కాబట్టే భారతీయ ముస్లింలు అరబ్బు ముస్లింలా, షేక్ ల చేతిలో దగా పడుతున్నారు గానీ, భారతీయ ముస్లింలు ఇతర దేశాల ముస్లింలని దగా చేయడం లేదు. ఇక్కడి పేద ముస్లిం ఆడపిల్లల్ని అరబ్ షేక్ లు పెళ్ళి పేరుతో తీసుకుపోయి దగాచేయటం, దారుణంగా, హింసాత్మకంగా ఉపయోగించుకోవటం విన్నాం, చూశాం గానీ, భారతీయ ముస్లింలు ఇతరుల్ని అలా చేయటం వినలేదు, చూడలేదు. భారతీయ ముస్లిం పేద చిన్నారుల్ని అరబ్బుషేకులు కొనుక్కుపోయి ఒంటెల మూపురాలకు కట్టి పరుగులు తీయించి పైశాచిక అనందాన్ని అనుభవిస్తారని వార్తలు చదివాం గానీ భారతీయ ముస్లింల గురించి అలాంటి కౄరకృత్యాలు వినలేదు. భారతదేశంలో డబ్బులున్న ముస్లింలు సైతం ఇలాచేయటం వినలేదు.

ఇక్కడ నేను ‘భారతీయ ముస్లిం’ అంటున్నది సాధారణ ముస్లిం పౌరులని మాత్రమే.

MIM పార్టీ రాజకీయ నాయకులని కాదు.

ఇతరుల్ని చంపమని ఫత్వాలు విడుదల చేసే ముల్లాలని కాదు.

మత ఘర్షణలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే ఇమాం బుఖారీలని కాదు.

పాక్, బంగ్లా, ఆఫ్గాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద బాంబులేసేందుకు వస్తే వారికి అన్నవసతి సౌకర్యాలు సమకూర్చే
హైదరాబాద్ పాత బస్తీలోని కొందరు ముస్లింలని కాదు.

వీళ్ళంతా ఈ నకిలీ కణికుడి వ్యవస్థలో భాగాలు, అతడి ఏజంట్లు.

కుట్రలోని ఈ కోణాన్ని, భారతీయ మూలాలపై నకిలీ కణికుడి కుట్ర అన్న అంశంలో [హిందూ ఉగ్రవాదుల్లా ప్రవర్తించే బి.జె.పి., సంఘ్ పరివార్, ఆరెస్సెస్, శివసేన ల పాత్రతో సహా] వివరంగా చర్చిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వరుస టపాలకి విరామం ఇచ్చినందులకు మన్నించాలి.

నా బ్లాగు అతిధులు అందిస్తున్న ప్రోత్సాహనికి నాకెంతో సంతోషంగా ఉంది. ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. అందరికీ ధన్యవాదాలు.
2001 లో మన దేశజనాభా 102 కోట్లు అని చదివి “ఓర్నాయనో!” అనుకొన్నాను. తర్వాత శ్రీరామకృష్ణమిషన్, శ్రీరంగనాధానంద స్వామిజీ ఇచ్చిన ప్రకటన చదివాను. అందులో “మనం 102 కోట్లమందిమి ఉన్నాం. అమ్మో! 102 కోట్ల కడుపులు నిండాలా? అన్న నిరాశావాదం ఎందుకు? పని చేయటానికి 204 కోట్ల చేతులున్నాయి. ఆలోచించటానికి 102 కోట్ల బుర్రలున్నాయి అనుకొందాం.” అని. ఇది ఆశా వాదం. ధర్మబద్దమైన ఆశ, కోరిక, కాంక్ష భగవంతుడి ప్రతిరూపాలే. ధర్మబద్దమైన, సవ్యమైన ప్రతీదీ భగవంతుడి రూపమే.

అవును, నిరాశ ఎందుకు?

మనకి ఏం తక్కువని అనుకొన్నాను. అప్పుడెంత ఆత్మస్థైర్యం, ధైర్యము పెరిగాయో, ఇప్పడు మీరు చూపిస్తున్న ప్రోత్సాహనికి అలాగే ఉంది.

శ్రీశ్రీ అన్నట్లు,

"ఆశయాలలో, ఆవేదనలో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” కదా! అలాంటిది ఒక్కరు కాదు తెలుగు బ్లాగు చుట్టాలిందరున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతఙ్ఞతలు.

ఈ సందర్భంలో మరో చిన్న విషయం _

నా ఆంగ్ల బ్లాగు “Coups On World” [URL: motherindia369.blogspot.com] లో నకిలీ కణికుడి కుట్ర వ్వాపార రంగం, ఆర్ధిక రంగాల మీద ఎలా ఉందో వ్వాస పరంపర ఉంచాను. సమయం మిమ్మల్ని అనుమతిస్తే, ఆసక్తి పలకరిస్తే, ఆ వ్యాసాలు చదివి సమీక్షించండి.

మరో చిన్న విషయం -

మనం అంతగా గమనించుకోవటం లేదు గాని, పిల్లలు బలమైన వ్యక్తిత్వంతో తయారు కావాలంటే కథల అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మన కళ్ళ ముందు జిజియా బాయి పుత్రుడు ఛత్రపతి శివాజీ, పుతలీ బాయి పుత్రుడు మహాత్మ గాంధీ ఆవిష్కరించారు.

భారతీయ ఇతిహాసాలు, కథలకు గనులవంటివి. ఇక సాహిత్యం, జానపద సాహిత్యం ఎప్పటికీ తరగని నిధుల వంటివి.

చిత్రవిచిత్రమైన మలుపులతో, అద్భుతమని పించే సంఘటనలతో, ఆపకుండా చదివించే కథా గమనంతో భారతీయ జానపద సాహిత్యంలో చెప్పుకోదగిన స్థానం కలిగిన భట్టి విక్రమాదిత్య కథలు చిన్నప్పడు చదివి వింతలోకాల్లో విహరించాను.

ఆ కథల్ని నా పాపకు చెప్పినప్పడూ, ఆమె చేత చదివించినపుడు అదే ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఆమెలో గమనించాను.

నా విద్యార్ధులకి వాటిని పరిచయం చేసినప్పడూ అదే ఫలితాన్ని చూశాను.

ఆ ఆనందం పిల్లలందరికీ కలగాలని ఆ కథల్ని ఆంగ్లంలో వ్రాసాను. తెలుగులో ఇప్పటికే ఎందరో వ్రాశారు కూడా.

నాకు సాధ్యమైనంతగా పిల్లల్ని అలరించే ప్రయత్నం చేశాను. ఆ కథలు పిల్లల్లో ఊహశక్తినీ, ధైర్య, ఉత్సాహాల్ని, చక్కని వ్యక్తిత్వాన్ని, సామర్ధ్యాన్ని పెంచుకోవాలనే పట్టుదలనీ కలిగిస్తాయని నా నమ్మకం. అందుకే వ్రాసాను.

Charconstories1.blogspot.com అన్న బ్లాగులో ఉంచాను. మీకు నచ్చితే చదవండి. మీ చిన్నారుల చేత చదివించండి. నచ్చకపోతే కొద్ది సమయం వృధా అయ్యిందను కొని వదిలేయండి.

మన ఇతిహాసల మీద నకిలీ కణికుడి కుట్రని తదుపరి టపాలో కొనసాగిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

ఎక్కడో చదివాను, ఓ ప్రఖ్యాత పాశ్చాత్య తత్త్వవేత్త [జాన్ లాకో, డేవిడ్ హ్యూమో లేక మరొకరో, పేరు గుర్తు లేదండి. మన్నించాలి]గురించి. ఆయన ఉటంకింపు ఏమిటంటే – “చీమకి గనుక ఊహాశక్తి ఉంటే 10 వేల చీమ కాళ్ళతో, మరో 10 వేల చీమ మీసాలతో [టెంట కిల్స్] తో ఓ మహాచీమని తన దేవుడిగా ఊహించుకొంటుంది. అంతేకాదు ఆ ’మహా చీమ’ కు ప్రార్ధనలు చేస్తూ కల్పిత కథలని పురాణాలంటూనో, ఇతిహాసాలంటూనో అల్లుకుంటుంది”.

బహుశః ఇది సత్యమే కావచ్చు. చీమ కలాంటి ఊహశక్తి ఉందో లేదో మనకి తెలీదు. చీమలు అలాంటి మహా చీమ దేవుణ్ణి కల్పించుకొని ప్రార్ధస్తూండవచ్చు, తమ పుట్టల్లో చీమ దేవుడికి మందిరాలు నిర్మిస్తుండవచ్చు. చీమ భాషలో వారి మహా చీమ దేవుడి గురించి చీమ పురాణాలు చెప్పుకుంటుండవచ్చు. ఎవరికి తెలుసు?

మొన్నీమధ్య మన జీవ శాస్త్రవేత్తలు డాల్ఫిన్లకు తమదైన స్వంత భాష ఉందనీ, అవి ఇతర డాల్ఫిన్లకు ప్రత్యేకించి కొన్ని పేర్లు పెట్టుకొని గుర్తించుకోగలవనీ, వాటిదైన సమాచార వ్యవస్థ వాటిమధ్య ఉందనీ, గుర్తించామని ప్రకటించారు. ఏనుగులు, పులులూ కొన్ని పక్షులూ కూడా ఇలాంటి వ్యవస్థలు కలిగి ఉన్నాయట.

అలాంటి సమాచార వ్యవస్థల్లో, పులులు వగైరా జంతువులు మధ్య సమాచార మార్పిడి మనం వినలేని తరంగ ధైర్ఘ్యం గల ధ్వని తరంగాలుగా ఉంటుందనీ విన్నాం.

కాబట్టే ఙ్ఞానం, మన పంచేంద్రియాల సామర్ధ్యం పరిమితమైన వని మనం అంగీకరించాల్సిందే.

కాబట్టి చీమల మహాచీమదేవుడి సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలి, గౌరవించాలి.

అదేవిధంగా మనం యూదుల మతాన్ని గౌరవించాలి. క్రైస్తవుల క్రైస్తవ మతాన్ని, ముస్లింల ఇస్లాం మతాన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా అందరూ [మనతో సహా] హిందూమతాన్ని గౌరవించాలి.

కాని హిందూ మతం మీద ఓ సుదీర్ఘమైన కుట్ర అమలుచేయబడుతోంది, దాన్ని అగౌరవ పరిచేందుకు, అవమానించేందుకు ఇంకా చెప్పాలంటే నాశనం చేసేందుకు. బాహుశః ప్రపంచంలోని ఇతర మతాలు కూడా ఏదో రకంగా ఇలాంటి కుట్రనే ఎదుర్కొంటుండవచ్చు. నకిలీ కణికుడు వంటి ఈ కుట్రదారుల విభజించి - ప్రచారించు అన్న తంత్రం కారణంగా ఎవరికి వారూ తమ మతమ్మీదే అసత్యప్రచారం జరుగుతోంది, కుట్రజరుగుతోంది అనుకొంటుండవచ్చు.

నా శక్తి మేరకు ఈ కుట్రని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఈ కుట్ర కేవలం హిందూ మతం మీద కాదు, భారతీయ సంస్కృతి మీద, భారతీయుల జీవన సరళి మీద, భారతీయ కళల మీద, రాజకీయం, అన్ని రంగాల మీద, మొత్తంగా చెప్పాల్సి వస్తే మానవత్వం మీద, భావ వాదం [idealism] మీద, ఇప్పటికీ అమలు చేయబడుతూనే ఉంది.

వివిధ రంగాల మీద కుట్రని విడివిడిగా వివరిస్తాను.

ఇప్పడు ఇక్కడ భారతీయపురాణాల మీద కుట్రని వివరిస్తాను.

ఇతిహాసాలు, పురాణాలు అంటే భగవంతుడి కథలు.

నిజానికి ’భగవంతుడు’ అన్నది ‘నమ్మకం’ అన్న ఆధారం మీద నిలిచిన ఒక భావన.

[దీని మీద మరింత వివరమైన చర్చని ’భారతదేశంలోని హిందూ మతం, ఇతర మతాలపై నకిలీ కణికుడి కుట్ర’ అన్న అంశం క్రింద చర్చిస్తాను]

భగవంతుడన్న సిద్దాంతమే ’నమ్మకం’ అన్న పునాదిపై నిలిచినపుడు, సైన్సు సిద్దాంతాల మాదిరి దాన్ని ఎవరూ నిరూపించలేరు. వాస్తవానికి సైన్సు సిద్దాంతాలు కూడా అసంప్షన్స్ మీద, నమ్మకాల మీద ఆధారపడి వివరింపబడేవే. ఉదాహరణకి బోర్స్ ధియరీ[అణు నమూనా]. విశ్వపు పుట్టుకకి సంబంధించిన ’బిగ్ బ్యాంగ్ ధియరీ’, యధాస్థితి వాదమూ రెండూ కూడా నమ్మకం మీద నిలిచినవే.

ఎందుకంటే - విశ్వపరివ్యాప్తితో పోలిస్తే మన ఙ్ఞానపు పరిమితి తక్కువగనుక, విశ్వ పరిమితిపై మన అన్వేషణ ఎంత తెలుసుకున్న ఇంకా అసంపూర్ణమే. విశ్వం యొక్క స్పేస్ అండ్ టైమ్ కంటిన్యూయుటి ముందు మన దృష్టి, జీవన ప్రమాణం రెండూ చాలా తక్కువ గనుక.

ఇక్కడ మనిషి నమ్మకాల గురించి మనం కొంత ముచ్చటించుకుందాం.

ఈ నేపధ్యంలో శ్రీ రామకృష్ణ పరమ హంస చెప్పిన చిన్న కధలు మీకు వివరిస్తాను.

అనగా అనగా ...

ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.

ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.
ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.

గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.

నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.

అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.

ఇదీ కథ!

ఈ కథలో శిష్యుడికి తన గురువుపై నమ్మకం ఉంది. అతడు గురువు నామాన్ని విశ్వసించాడు. అతడి ’నది దాటడం’ అన్న సమస్యని నమ్మకం దాటించింది.

ఇదే విధంగా మనం భగవంతుడి మీద నమ్మకంతో, మన జీవితంలోని సమస్యల్ని దాటుతూ ఉంటాం. ఇది మనలో చాలా మందికుండే సాధారణ అనుభవం.

ఎవరైనా నాస్తికులు “మనలో భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా, ఆ సమస్యని మీరు దాటే ఉండే వాళ్ళు. అది మనసు కున్న శక్తి, దేవుడిది కాదు. ఎందుకంటే దేవుడనే వాడు లేడు” అని వాదించారనుకొండి.

మన జవాబు ఇలా ఉండవచ్చు. “బహుశా ఆ శక్తి మనస్సుదే కావచ్చు, నాస్తికుడుగా మీరు “God is no where” అని నమ్ముతున్నారు. ఆస్తికులుగా నేను “God is now here” అని నమ్ముతున్నాను. మనిద్దరం నిలబడింది ఒకేపునాది మీద, ‘నమ్మకం’ అన్న పునాది మీద. కాబట్టి ఆవిషయంలో వాదించు కోవటంలో అర్ధం లేదు.”

అంతేకాదు.

పై కథలో శిష్యుడు వినయశీలి. గురువు అహంకారి. గురువు తన గురించి తాను అహంకరించాడు, గర్వించాడు. కనుకనే నీట మునిగిపోయాడు.

ఇదే నేపధ్యంలో, నమ్మకం గురించి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరో చిన్న కథ చెబుతాను.

అనగా అనగా...

ఓ ఊరిలో ఒక అమాయకుడుండేవాడు. వాడోసారి పనిమీద ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దారిలో చిన్న నదిని దాటవలసి వచ్చింది. మన వాడికి భయమేసింది. అంతలో అక్కడికొక యోగి వచ్చాడు. ఈ అమాయకుడు తననీ నది దాటేలా చేయమని యోగిని ప్రార్ధించాడు. ఆయోగి ఇతడి కొక రాగి తాయత్తునిచ్చాడు. దాని మీద బీజాక్షరాలు [మంత్రాక్షరాలు] వ్రాసి ఉన్నాయని, చెప్పి అది వాడి కిచ్చి “నాయనా! ఈ తాయత్తునూ చేతబట్టి, శ్రీరామ శ్రీరామ అని జంపిస్తూ నది దాటూ. ఒరవడిని తట్టుకొని నీట నడవగలవు” అని అన్నాడు.

ఈ అమాయకుడు యోగికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. యోగి తన దారిన తాను పోయాడు. అమాయకుడు ’శ్రీరామ శ్రీరామ’ అని జపిస్తూ నదిలో దిగాడు. ఆశ్చర్యం! వాడు నీటిమీద నడవగలుగుతున్నాడు. వాడికి పిచ్చి సంతోషం వేసింది. కించిత్తు గర్వంగా అనిపించింది. అప్పటికి సగం నది దాటాడు. ఉండీ ఉండీ వాడికి ఆ రాగి తాయత్తుమీద ఏమంత్రం వ్రాసి ఉందో అన్న కుతూహలం పుట్టింది. మడిచి ఉన్న రాగి తాయత్తు విప్పిచూశాడు. దాని మీద ’శ్రీరామ’ అని వ్రాసి ఉంది. అది చదివి ‘ఒట్టి రామా అనేనా? మంత్రమో, తంత్రమో కాదా!’ అనుకున్నాడు.

ఆ క్షణమే వాడు నీటిలో మునిగి పోయాడు.

ఇదీకథ!

ఈ కథలోని అమాయకుడు ఎంతసేపైతే తాయత్తు మీద, శ్రీరామ నామం మీద నమ్మకం కలిగి ఉన్నాడో అంతసేపూ నీట మునగలేదు. ఎప్పడైతే నమ్మకం కోల్పోయాడో, సందేహాన్ని ఆశ్రయించాడో ఆక్షణమే నీట మునిగాడు.

ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లోనూ చాలానే ఉంటాయి. మనం స్పృహ కలిగి పరిశీలించుకుంటే కనిపిస్తాయి. ఎప్పడైతే మనం భగవంతుడి మీద నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతామో, అప్పడే మన ఓటమి [ఏ ప్రయత్నంలోనైనా సరే!] మొదలవుతుంది.

హిందువులుగా, భారతీయులుగా మనం ఆత్మవిశ్వాసం అంటే భగవంతుడి మీద విశ్వాసం అని నమ్మకం. ఎందుకంటే అహం బ్రహ్మస్మి అన్నది పెద్దల నానుడి. సర్వజీవులూ, ప్రాణులూ ఆత్మ అయితే భగవంతుడు పరమాత్మ. దేవుడు సర్వప్రాణుల్లో ఉన్నాడు. సర్వప్రాణులూ దేవుడిలో ఉన్నాయి. ఇది భగవద్గీత మనకి చాలా స్పష్టంగా చెబుతుంది.

శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరో విషయాన్ని ఇక్కడ వ్రాస్తూన్నాను.

రామాయణంలో ఆంజనేయ స్వామి నూరు యోజనాల సాగారాన్ని లంఘంచి లంకకి చేరాడు. శ్రీరామ నామం మీది నమ్మకంతో. కాని, సాక్షాత్తు శ్రీరాముడు లంకని చేరాలంటే వారధి కట్టవలసివచ్చింది.

అదీ నమ్మకం యొక్క అపారమైన బలం!

భగవంతుణ్ణి నమ్మి, భక్తుడు అద్భుతాలు సాధించగలడు.

చిత్రమేమిటంటే దీన్ని ఆవిష్కరించటానికి దేవుడికి భక్తుడు కావాలి. [అందుకే మన పెద్దలు నరనారాయణ సంబంధం అని చెప్పారు]

భారతీయ ఇతిహాసాలు పాజిటివ్ [ఆశావాహ దృక్పధాన్ని] ఆలోచనా విధానాన్ని జనాల్లో పెరిగేలా చేస్తాయి. పురాణాలని, ఇతిహాసాలని నాశనం చేయటం ద్వారా, విమర్శించటం ద్వారా, వాటిపై జోకులు వేసి పలుచన చేయటం ద్వారా, ఈ కుట్రదారులూ, నకిలీ కణికుడు విజయవంతంగా భారతీయుల్ని నెగిటివ్ గా ఆలోచించేలా మార్చేసాయి. ఆత్మగ్లాని, మనల్ని మనం తక్కువ చేసికోవటం కూడా నెగిటివ్ ధింకింగ్ లో భాగమే.

కుక్కని చంపాలను కుంటే ముందు దానిని పిచ్చికుక్క అని ముద్రవేయాలని అంటారు. ఈ కుట్ర అలాంటిదే. హత్య చేస్తే నేరం. అదే వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పితే అది కుట్ర. నల్లమేక - నలుగురు దొంగలు కథలో దొంగలు ముసలి బ్రాహ్మణున్ని తన్ని మేకను లాక్కుంటే నేరం. అతడే తనంత తానే మేకని విడిచిపెట్టేలా చేస్తే అది కుట్ర..

రామాయణంలో ప్రసిద్దమైన హరిశ్చంద్రని కథ ఉంది. ఆయన సత్యహరిశంద్రుడిగా కీర్తి గడించాడు. అసత్యమాడకుండా ఉండటం కోసం ఆయన రాజ్యాన్ని, సంపదనీ, భార్యనీ, పుత్రుణ్ణీ, తనను తానూ త్వజించాడు. [అదే ఇప్పుడందరు అసత్వమాడటానికి ఎల్లవేళలా రెడీగా ఉంటున్నారు. పాలకులైతే మనకంటే ముందుగా రెడీ] చివరకి తన ఏకైక పుత్రుడి మృత కళేబరాన్ని అందుకొన్నప్పడు కూడా అసత్యమాడటానికి సిద్దపడలేదు. భార్యనీ తెలిసీ, ఆవిడ తల నరకటానికి సిద్దమయ్యాడే గానీ తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఎలాంటి కష్టంలోనూ, ఏ సమయంలోనూ ’సత్యం పలకడం’ అనే తన నైజాన్ని విడిచిపెట్టలేదు.

ఈ కథ మోహన గాంధీ ని మహాత్మ గాంధీగా మార్చింది. భారతీయులు ఈ కథ నుండి నిజం పలకడం, ధర్మంగా ఉండటం, నీతి కలిగి ఉండటం అనే లక్షణాలనీ, అలా ఉండాలనే స్ఫూర్తినీ పొందే వాళ్ళు. నాచిన్నతనంలో శ్రీరామ నవమి, ఇంకా ఇతర పండగ ఉత్సవాల్లో ప్రదర్శించే [సురభి] పద్యనాటకాన్ని చూచి ప్రజలు తన్మయులు అవ్వటం నాకు స్వయంగా తెలుసు.

ఇలాంటి ఈ పౌరాణిక గాధ మీద 1975 నుండి 1992 వరకూ ఒక పక్కా ప్రణాళిక ప్రకారము అన్నట్లు, ఓ ప్రచారం అమలుచేశారు. నకిలీ కణికుడు సినిమాల్లో, వారపత్రికల్లో, సాహిత్యంలో, ఇతర కళాప్రదర్శన కార్యక్రమాల్లో [మిమిక్రీ షోల్లాంటివి] ఓ
జోక్ ప్రచారింప చేశాడు. ఎలాగంటే …

టీచర్: పిల్లలూ! సత్యహరిశ్చంద్రుడి కథనుండి మీరేం నేర్చుకొన్నారు?
పిల్లలు: నిజం చేబితే చాలా కష్టాలొస్తాయని టీచర్!

లేదా
తండ్రి: ఏరా రామూ! సత్యహరిశ్చంద్రుడి కథనుండి ఏంనేర్చుకొన్నావు?
రాము: హాయిగా అబద్దం చెప్పడం మేలు నాన్నా!

ఇదే జోక్ పదే పదే, ఎన్నో రకాలుగా, జనాల్లో చివరిదాకా లేదా అట్టడుగు జనాల దాకా చేరేవరకూ ప్రచారింపబడింది.

అందరూ అదో జోక్ అన్నట్లు నవ్వేసి ఊరుకున్నారే గానీ ఎవ్వరూ ఈ స్లోపాయిజన్ గుర్తించలేదు.

ఒక్క ముద్రణా సంస్థగానీ, ఒక్క పత్రిక గానీ[దిన, వార, పక్ష, మాస పత్రికలతో సహా] ఒక్కమాటా పాజిటివ్ గా ప్రచురింపలేదు.
ఒక్క కాలమిస్టు , ఒక్క విలేఖరి కూడా ఒక చిన్న వ్యాసం కూడా వ్రాయలేదు, హరిశ్చంద్రుడు సత్యం పలికాడు గనుకే మన హృదయాల్లో సత్యహరిశ్చంద్రడై నిలిచిపోయాడని కులదీప్ నయ్యర్, లేదా నక్కీరన్ గోపాలన్ లేదా ఎన్.రామ్ లేదా రామచంద్రగుహా వగైరా వగైరా ఏ మేధావీ కూడా “వేల కొద్దీ రాజులు పుట్టారు, గిట్టారు. వారిలో సత్యహరిశ్చంద్రుడులాంటి మహానుభావులు కొందరే మనకి మార్గదర్శనం చూపారని” చెప్పలేదు, వ్రాయలేదు.

ఒక్కవార్తపత్రిక కూడా ప్రజలకి సత్యహరిశ్చంద్రుడు వేల సంవత్సరాల తర్వాత కూడా ఒక సాధారణ బాలుణ్ణి భారత జాతిపితగా మలిచాడనీ, అంత స్ఫూర్తి ప్రదాత అని వ్రాయలేదు. [ఎందుకు వ్రాస్తారు, సాక్షాత్తు అవే ఇదంతా చేయిస్తున్నప్పడు?] కనీసం ఉషశ్రీ, విశ్వనాధ లాంటి వారు నెత్తీ నోరు బాదు కున్నా అవి పత్రికలకు పట్టింది కాదు. అదే రంగనాయకమ్మలు పురాణాన్ని, ఇతిహాసాల్ని విమరిస్తే పేపర్లో పెద్దచ్చరాల్లో పడేవి.

ఇవేగాక ఎన్నో వ్యంగ్యాలూ, ఆక్షేపణలూ, సినిమాల్లో, సాహిత్యంలోనూ ఉండేవి. [ఇదంతా 1975 నుండి 1992 వరకూ ముమ్మరంగా జరిగింది] ఉదాహరణగా ఒక సినిమా పాటనూ పరిశీలించండి.

ఏ సినిమాలోనో నాకు తెలీదు. శ్రీమతి సుశీల పాడారు.

పల్లవి:

అదేవిటో! ఆడదంటే మగవారికి అలుసులే!
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే.

చరణం:

ఆలిని అమ్మాడొకడు.
అడవికి పంపాడొకడు
ఒకడేమో జూదంలో పందెం బడ్డాడూ ..... అదేమిటో....

చరణంలోని తొలి పంక్తిలో పాటరచయిత సత్యహరిశ్చంద్రుణ్ణి రిఫర్ చేశాడు. హరిశ్చంద్రుడు భార్య చంద్రమతీ దేవిని అమ్మాడని ఎద్దేవా చేశాడు. ఆ వ్యంగ్యంలో అతడు దాదాపు హరిశ్చంద్రుణ్ణి, భార్యల్ని అవమానించి, అమ్మేస్తున్నా తాగుబోతులైన వారితో సమానం చేశాడు. అవినీతి పరులై భార్యల్ని, స్త్రీలని వ్యభిచార గృహాలకి అమ్మే పురుఘలతో సమానం చేస్తూ వ్యంగ్యోక్తి ప్రచారించాడు. ఆ పాట రచయితకి చంద్రమతీ దేవి స్వయంగా, స్వచ్చందంగా భర్త వెంట అడవికీ, కాశీ నగరానికీ వచ్చిందని గానీ, ఆయన సత్యవాక్పరిపాలనలో అధైర్యపడ్డప్పుడో, చింతపడినప్పుడూ ధైర్యాన్ని, స్ధైర్యాన్ని ఇచ్చి తోడుగా నిలబడిందని గానీ, తాను స్వయంగా సత్యాచరణకు నిలబడిందని గానీ గుర్తులేదు. లేదా కావాలనే మరిచి పోయాడు. ధర్మరాజు గురించి కూడా ఇలాంటి వ్యంగ్యము, అక్షేపణే.

ఇక రెండో వాక్యంలోని ఉత్తర రామాయణం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఆపాట రచయిత శ్రీరాముడు సీతమ్మని అడవికి పంపాడని ఎద్దేవా చేశాడు. అందులో శ్రీరాముడు తన స్వసుఖం కోసం సీతని అడవికి పంపినట్లుంటుంది, అతడి వ్యంగ్యం. సీతని అడవికి పంపాక శ్రీరాముడు మరో స్త్రీతో జీవితాన్నీ సుఖించాడా లేక మరో వివాహం చేసుకున్నాడా? సమాజంలో నీతి నియామాల్ని, సత్యధర్మాల్ని ప్రతిష్టించేందుకు శ్రీరాముడూ, సీతా తమ జీవితాల్లో స్వసుఖాల్ని త్యాగం చేశారు. [త్యాగమంటే ఒక్క ప్రధాని మంత్రి సీటుని త్యాగం చేసి ఆ పి.యం. రిమోట్ కంట్రోల్ ని చేతిలో పెట్టుకూర్చున్న కుర్చీవ్యక్తి త్యాగం లాంటి త్యాగం కాదది. భర్త బ్రతికున్నప్పడు భర్తకు రాజకీయాలు వద్దు అని ఆడపులిలా కొట్లాడి, అధికారం తన చేతికి రాగానే రాజకీయాలు కూడా బాగానే ఉన్నాయి అనే వ్యక్తి ది త్యాగం అనరనుకుంటా. ఈ కాంగ్రెస్సోళ్ళకు ఇదెప్పటికి అర్ధమౌతుందో నబ్బా!]

విషయాలు తెలుసుకోకుండా, ఉంది గదా అని తాటిపట్టనుపయోగించినట్లు నాలుకని ఉపయోగించడం నిజంగా చాలా తప్పు. అలాంటి తప్పుని చాకలి వాడు చేశాడు ఉత్తర రామాయణంలో. అయినా సరే, అది ప్రజా వాక్యమని శ్రీరాముడు దాన్ని నైతిక బాధ్యతగా తీసుకొన్నాడు. సీత మౌనంగా భరించింది. వారిద్దరూ ప్రజల్లో సద్వర్తన కోసం అష్టకష్టాల్ని భరించారు. భర్త సాహచర్యం కోసం రాజ్యసుఖాల్ని వదిలేసిన సీత, ఆమె కోసం మహా సంగ్రామాన్ని నడిపిన శ్రీరాముడు, ఒక్కడు, తనప్రజల్లో ఒక్కడన్న మాటకు కట్టుబడి చేసిన పనిది. [నూరు కోట్ల మంది నోరారా తిట్టినా సిగ్గు రాని ఈ పాలకులకీ, కరుణానిధిలకీ శ్రీరాముడు ఎలా అర్ధమౌతాడు చెప్పండి. అర్ధం చేసుకోనేంత మానసిక స్థాయి ఉండాలి కదా!] ఆవిధంగా, అంతకష్టం భరించి, స్వయంగా చేసి చూపించి సమాజానికి సరైన దారినీ, నైతిక వర్తననీ గురించిన సంకేతాలు పంపించారు వారిద్దరూ. పాపం పై పాటరచయితకీ, ఆ చిత్ర దర్శకుడికీ, నిర్మాతకీ ఈ విషయం తెలియదు మరి!

ఈ పాట ఏ సినిమాలోదో, ఎవరు వ్రాశారో, ఎవరు నటించారో, దర్శకుడెవరో, నిర్మతేవరో తెలియదు గానీ ఇలాంటి ప్రక్రియల వెనుక మాత్రం సినిమారంగంలోని గాడ్ ఫాదర్ ఉన్నాడన్నది మాత్రం సుస్పష్టం.ఈ గాడ్ ఫాదర్ లూ నకిలీ కణికుడు బాహ్యరూపాలే! ప్రారంభంలో వీరి పట్టు బిగింపు కార్యక్రమాలు తెర వెనుక, పరోక్షంగా ఉండి క్రమంగా వ్యవస్థీకృతమయ్యాయి. ఇందుకు కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. నిగూఢ కార్యకలాపాల్లో, గూఢచర్య కళలో ఒక్కో ప్రణాళిక ఏళ్ళపాటు అమలు చేయబడటం, ఫలితాన్ని దశాబ్ధాల ఇంకా చెప్పాలంటే శతాబ్ధాల తర్వాత ఆశిస్తారు. [ఇదే నకిలీ కణికుడు జనాలకి మాత్రం ’ఇన్ స్టంట్’ ఫలితాల్ని అలవాటు చేస్తాడు] గూఢచార నైపుణ్యం అంత సహనంతో కూడినదని మన చరిత్ర,, ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. తిమ్మరుసు మంత్రి 16 ఏళ్ళపాటు శ్రీకృష్ణదేవరాయాల్ని నేల మాళిగలో ఉంచి శిక్షణ నిచ్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది.

తదుపరి టపాలలో ఈ ప్రయత్నాన్ని మరింత కొనసాగిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధులు నాతో పాటు సత్యాన్వేషణ చేయాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా...

ఓ అడవి. అందులో ఎన్నో జంతువులూ ఉన్నాయి.

వాటిల్లో ఓ నక్క.

దాని దురదృష్టం కొద్దీ, దానికి 10 రోజులుగా తిండి దొరక లేదు. నీరసించిపోయింది. డొక్క ఎండి పోయింది.

అలాగే కాళ్ళీడ్ఛుకొంటు ఆహారం వెదకసాగింది.

అదృష్టం!

ఓ చెట్టు తొర్రలో దానికి ఆహారం కన్పించింది.

చెట్లు కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళో, లేక వేటగాళ్ళో లేక యాత్రికులో దాచుకున్న అన్నం మూట దానికి కన్పించింది.

చెట్టు తొర్ర సన్నగా ఉంది.

లోపల తిండి దండిగా ఉంది.

వాసన నోరూరిస్తోంది, ఆకలి ఆగనంటోంది.

ఎండిన డొక్కతో ఉన్న నక్క ఒక్క ఉదుటున తొర్రలోకి దూరింది.

అన్నం పప్పు, కూరలు, అప్పడం, అప్పాలతో కమ్మటి భోజనం.

కడుపునిండా మెక్కెసింది.

పొట్టలావుగా అయ్యింది.

ఇప్పడు ఓ చిక్కొచ్చింది నక్కకి.

దాని శరీరం తొర్ర వెడల్పు కన్నా ఎక్కువలావుగా ఉంది. బయటకి రావడం కుదరటం లేదు.

లోపలే ఉంటే, తిండి దాచుకొన్న మనుషులొచ్చి నాలుగు పీకితేనో?

లేక తన్ని తగలేస్తే నో!

తలుచుకొంటేనే వళ్ళు జలదరించింది దానికి.

కుయ్యోమొర్రో మంటూ మొత్తుకోవటం మొదలుపెట్టింది.

ఆ దారినే పోతున్న ఓ కుందేలు నక్క ఏడుపు విన్నది.

దగ్గరికొచ్చి చెట్టుతొర్ర కేసి చూసింది.

ఏడుస్తున్న నక్కని చూసి, "ఏమిటి సంగతి నక్కబావా" అంది.

నక్క వివరంగా చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

"మరి లోపలికి వెళ్ళేటప్పడు ఎలా వెళ్ళావు?" లాజికల్ గా అడిగింది కుందేలు ప్రశ్నార్ధకపు ముఖం పెట్టి.

"ఆకలితో డొక్క ఎండి అప్పడు సన్నగా ఉన్నాను" అంది నక్క ఏడుపుముఖపెట్టి.

"అయితే వెళ్ళిన దారిలోనే తిరిగి రా నక్క బావా?" అంది కుందేలు చిరునవ్వుతో కళ్ళు మెరుస్తుండగా.

"అంటే మళ్ళీ 10 రోజులు పస్తుండలా?" భోరుమంది నక్క.

"అంతే మరి! కాకపోతే ఈసారి 10 రోజులు పట్టదులే. పస్తులయితే తప్పదు" అంది కుందేలు నింపాదిగా.

ఇదీకథ!

ఈకథ ఇప్పుడెందుకు చెప్పానంటే నకిలీ కణికుడు, అతడి వంశీయులు 350 ఏళ్ళుపాటు భారతదేశమ్మీద కేంద్రీకరించి, ప్రపంచమ్మీద ప్రయోగించి, మన జీవితాల్లో గత మూడు నాలుగు దశాబ్ధాలుగా తీవ్రతరం చేసిన సుదీర్ఘ కుట్రని మనం తెలుసుకోవడానికి, అర్ధం చెప్పకోవటానికి 350 ఏళ్ళు కాకపోయినా కనీసం కొన్ని రోజులైనా పడుతుంది కదా!

ఈ నకిలీ కణికుడు 350 ఏళ్ళుపాటు చెట్టుతొర్ర లాంటి గూఢచార తంత్రంలో దాక్కొని ఉన్నప్పుడు బయటికి లాగి చూపెట్టడానికి కనీసం కొన్ని రోజులైనా పట్టదా?

ఇప్పటికే నా బ్లాగు చుట్టాల్లో చాలామంది ఉత్కంఠ ఆపుకోలేక ‘ఎవరీ నకిలీ కణికుడు త్వరగా చెప్పండి’ అంటున్నారు. తప్పకుండా చెబుతాను.[ఇన్ స్టంట్ కాఫీ కి, ఇన్ స్టంట్ రిజల్ట్ కి బాగా అలవాటు పడిపోయినట్లున్నాము కదూ!నిజానికి ఈ నకిలీ కణికుడు మన జీవితాల్లో సృష్టంచిన పరుగులో ’ఇన్ స్టంట్’ అన్నదీ ఒక భాగమే. ]

అంతేకాదు, ఈ నకిలీ కణికుడి గూఢచర్యంతో కూడిన కుట్రని, సహేతుకంగా, సాక్ష్యాధారాలతో, దృష్టాంతసహితంగా నిరూపిస్తాను. ఇంకా ఈ నకిలీ కణికుడు కింగ్ మేకర్ అయితే ఇతడి కింగ్ లూ అంటే ఏజంట్లు ఏయే రంగాల్లో, ఎప్పుడెప్పుడు ఏయే అంశాలు [కుట్రలో భాగాలు] నిర్వహించారో, ఇప్పడూ ఎలా నిర్వహిస్తూన్నారో వివరంగా చెబుతాను.

కాకపోతే ఒక్క విషయం గమనించండి.

నేనిది ఊసుబోక వ్రాయటం లేదు.

ఫిక్షన్ కథో, కల్పితమో వ్రాయటం లేదు.

నిజాన్ని వ్రాస్తున్నాను.

నాజీవితంలోని నిజం, మీ జీవితంలోని నిజం, మన జీవితం లోని నిజం.

అయితే ఈ నకిలీ కణికుడెవరో తెలుసుకొనే ముందు అసలు అతడు ప్రయోగించిన కూట నీతి ఏమిటో, కుట్ర స్వరూపం ఏమిటో తెలుసుకోవడం అవసరం. మనమీద జరిగిన కుట్రకి దృష్టాంతపూరితంగా, సమగ్రంగా తెలుసుకొంటే, నేను కాదు మీరే గుర్తించగలరు, ఆ నకిలీ కణికుడెవరో.

అసలు కుట్రస్వరూపం ఏమిటో అర్ధం చేసుకోనిదే ఈ నకిలీ కణికుడి అసలు స్వరూపం తెలుసుకోవటం కష్టం. ఎందుకంటే 350 ఏళ్ళు నిరాఘాతంగా ప్రపంచమ్మీద, భారత దేశమ్మీద కేంద్రీకరించి జరిగిన కుట్రని మన తెలుగు సినిమాల్లో ఒక పాటలో దర్శకుడు చూపినట్లుగా చూడలేం కదా! ఈ నకిలీ కణికుడు కుట్ర తరతరాలుగా గాఢతనీ, పరిపక్వతనీ సంతరించు కొంటూ అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో చొచ్చుకుపోయి పట్టు బిగించింది.

ఒక్కోరంగంలో కుట్రని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, మన జీవితాల్లో అదెంత చొచ్చుకొచ్చి దగా చేసిందో అర్ధం చేసికోవాలి. కాబట్టి మీడియా ముసుగు వెనుకా, రాజకీయం వెనుకా, అవినీతి వెనుకా, కాలం మారిందంటూ మనల్ని భ్రమింపజేస్తూ ఏ రంగంలో ఎంతెంత కుట్ర ఈ నకిలీ కణికుడు చేశాడో మీకు క్లుప్తంగా అయినా స్పష్టంగా, అవసరమైన చోట సవివరంగా తెలియజేస్తాను.

నిజానికి మీడియా మాయాజాలం ఇందులో ప్రధాన భాగం.

తదుపరి టపానుండి విద్య, వైద్యం, వ్యవసాయం, వ్వాపార రంగం, రాజకీయం వగైరా రంగాల్లోని నకిలీ కణికుడి కుట్రని వివరిస్తాను.

వారం రోజుల నుండి పచ్చినిజాలు వ్రాసి నేను, చదివి మీరు అలిసిపోయి నందున చిన్న బిర్రే...క్!
సరదాగా ఈ చిన్ని బుజ్జిగాడిని చూడండి.


పైకి రావడం అంటే ఇలా కాదనుకుంటాన్రా!

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధులు నాతో పాటు సత్యాన్వేషణ చేయాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా ...

ఒకసారి నలుగురు గ్రుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నారట. నలుగురు ఏనుగుని చేరారు.

ఒకడు దాని కాళ్ళని తడిమాడు “ఒరేయ్! ఏనుగు స్తంభంలా ఉంటుందిరా. మాఇంటి వసారాలో స్తంభాలిలాగే ఉంటాయి” అన్నాడు.

మరొకడు దాని చెవులు తడిమాడు. “కాదురా! ఏనుగు చేటలా ఉంటుంది. మా అమ్మ రోజూ బియ్యం చెరిగే చేట నాకు బాగా తెలుసు. ఏనుగు చేటలా ఉంది” అన్నాడు.

ఇంకొకడు దాని కడుపు తడిమాడు. “ఛస్! నోరు ముయ్యండిరా! మీకేం తెలీదు. ఏనుగు పెద్ద బాన లాగా ఉంటుంది. మాదొడ్లో బాన కన్నా కూడా పెద్దది” అన్నాడు.

నాలుగో వాడు దాని తోక తడిమాడు. నెత్తి నోరూ కొట్టుకుంటూ “అయ్యయ్యో! కాదర్రా. మీరలా పొరపాటు పడుతున్నారు. ఏనుగు బారెడు తాడులా ఉంటుంది. మీకర్ధం కావటం లేదు” అన్నాడు

ఇదీ కథ!

మనకి బాగా తెలిసిన, మన పెద్దలు చెప్పిన పాచి పాత కథ. మన వాళ్ళు ఈ కథలో ఏనుగుని ‘బ్రహ్మ పదార్ధం’తో పోలుస్తారు అది భారతీయ తత్త్వ శాస్త్రం. మన కథలో ఏనుగు, నకిలీ కణికుడి గూఢచార తంత్రం వంటింది. ఆ గుడ్డివాళ్ళం మనమే.

మీడియా తన మాయాజాలంతో, నకిలీ కణికుడి వంశం ప్రయోగిస్తోన్న విభజించు - ప్రచారించు అన్న తంత్రంతో మనకీ గుడ్డితనం కలుగుతోంది.

వాస్తవంగా కూడా - ప్రపంచ విస్తారత రీత్యా, మనకున్న పరిమిత వనరులరీత్యా, మన రోజు వారి బ్రతుకు పోరాటం రీత్యా ఈ గుడ్డితనం అనివార్యమైనది.

నిజానికి పత్రికలు, మీడియా నిజాయితీగా ఉంటే ప్రజలకి అవి మనోనేత్రాలుగా మారి సత్యాన్వేషణ చేసేవి, దారి చూపేవి, గుడ్డితనాన్ని తొలిగించేవి.

అలాంటి నిజాయితీ స్వాతంత్ర సమర కాలంలోని పత్రికల్లో ఉండింది. ఇంతకు ముందు టపా మాలిక ’మీడియా మాయాజాలం’ లో ఇంతకు ముందే వ్రాసినట్లు, ఎక్కడ తమ కుట్ర ఓడిపోయిందో అక్కడినుండే మళ్ళీ ప్రారంభించిన ఈ నకిలీ కణిక వంశం ఈసారి పత్రికల్ని, మీడియానీ తమకు పైకవచంగా వాడుకొంటోంది.

ఇందుకు మీకు మరొక చిన్న ఉదాహరణ ఇస్తాను.

కొంతమంది చిత్రకారులున్నారనుకొండి. అందరూ కలిసి ఓ బ్రహ్మండమైన పెద్దవర్ణచిత్రాన్ని చిత్రించాలను కొన్నారనుకొండి. దానికి కాలవ్యవధి కూడా ఎక్కువ నిర్ణయించుకున్నారనుకొండి. ఆ చిత్రాన్ని 100 భాగాలు చేసికొన్నారను కొండి. ఒకొక్కొడూ ఒకో భాగాన్ని ఒకో ప్రాంతంలో ఒకో సమయంలో అందులో వరసక్రమాన్ని కూడా మార్చి చిత్రించారను కొండి. మనకి ఆచిత్రం ఏమిటో అర్ధం కావాలంటే వారి కాలవ్యవధి పూర్తయ్యకా, వారిని నియోగించిన ఆ చిత్రకారుల గుంపు లీడర్, అన్ని బొమ్మల భాగాల్ని ఒక పద్దతిలో పేర్చి చూపెట్టినప్పడు మాత్రమే అందులో ఏం చిత్రించారో మనకి అర్ధం అవుతుంది.

ఇదికూడా ఒకరకంగా కణిక నీతిలోని విభజించి - జయించడం లాంటిదే. ఇదే ఈ నకిలీ కణిక వంశీయుడు లేదా నకిలీ కణిక వంశీయుల నాయకుడు అఙ్ఞాతంగా ఉండి, నిగూఢంగా మానవ సమాజం మీద ప్రయోగిస్తున్న ’విభజించు - ప్రచారించు’అన్న స్ట్రాటజీ.

దీనికి ఒక సజీవ దృష్టాంతం పరిశీలించండి.

మన చిన్నప్పడు అంటే దాదాపు ౩౦ ఏళ్ళ క్రితం, మనలో చాలా మందిమి బడికి సెలవు లొస్తే అమ్మమ్మా తాతయ్యల ఇంటికి పరిగెట్టే వాళ్ళం. అక్కడ రాత్రి అన్నంతినేసి, ఆరుబయట నులక మంచం వేసుకొని తాతయ్య చెప్పే కథలు వింటూ నిద్రపోయే వాళ్ళం. ప్రక్కనే పశువులకొట్టం ఉండేది. మరోప్రక్క నైదిబ్బ [ఎరువు దిబ్బ] ఉండేది. అయినా ఇప్పడున్నన్ని దోమలు మాత్రం ఉండేవి కావు. సుఖంగా చందమామనీ, చుక్కల్నీ చూస్తూ, అమ్మమ్మ తాతయ్యల కథలు వింటూ నిద్రపోయే వాళ్ళం.

మరి ఇప్పడో? ఆరు బయట కాస్సేపు నిలబడితే కాళ్ళను బండకుట్టే దోమలు. వాటి కాట్లకు వచ్చే క్రొత్త రోగాలు. పర్యవసానంగా, విపరీతంగా అమ్ముడుపోతున్న జెట్ లూ, ఆల్ అవుట్లూ, మస్కిటో రిపెల్లంట్లు, మస్కిటో కాయల్స్! కోటాను కోట్ల రూపాయల వ్యాపరం.

మరొక సారి అదే ౩౦ ఏళ్ళ క్రితం నాటి ఓ వార్త ప్రభంజనాన్ని మీకు గుర్తు చేస్తాను. అప్పట్లో అంటే 1975 లనుండి 1980 లల్లో ఓ పుకారు/వార్త విపరీతంగా ప్రచారమయ్యింది.

అదేమిటంటే - చైనా వాళ్ళు కప్పకాళ్ళని తింటారనీ, మనదేశం నుండి లారీల కొద్దీ కప్పకాళ్ళు దొంగ రవాణా అవుతున్నాయనీ. మధ్యమధ్యలో అక్కడో లారీ, ఇక్కడో లారీ పట్టుబడిందని కూడా వార్తలొచ్చాయి. గ్రామీణులు కప్పల్ని చంపి, కాళ్ళు సేకరిస్తే చాలనీ, దళారులు వాళ్ళ గ్రామాల్ని అప్రోచ్ అయి కొనుగోళ్ళు చేస్తూన్నారనీ, ఒకోసారి ఇవే పత్రికల్లో అదంతా వదంతులేనని, గ్రామీణులు కప్పల్ని చంపేస్తున్నారనీ వార్తలొచ్చాయి. ఒకోసారి ఇవే పత్రికల్లో ఫలానా గ్రామంలో కొందరు కప్ప కాళ్ళమ్మి లక్షాధికారి అయ్యారని వార్తలొచ్చాయి. కొన్నాళ్ళవి పుకార్లనీ, కాదు నిజమేనని సంచలనాలు రేగాయి. కొన్నాళ్ళకి అంతా చప్పబడిపోయింది.[నల్గొండ జిల్లా సూర్యపేటలో ఒకతను ఇలా కప్పకాళ్ళ వ్వాపారం చేసి బాగా సంపాదించాడనీ, అయితే చనిపోయే ముందు అతడు చాలాకాలం మంచాన పడ్డాడనీ, అప్పుడతని శరీరం కప్పలాగా ఆకుపచ్చగా మారి, కప్ప ఆకృతిలోకి వచ్చిందనీ, 1999 లో అక్కడి సి.ఐ. చెప్పగా విన్నాను].

ఇవన్నీ ఇప్పట్లాగే అప్పడూ అందరం, ఉదయాన్నే కాఫీ కప్పుతో పాటు, అలవోకగా పేపరు చదువుతూ క్యాజువల్ గా చదివారు. కానీ ఎవరూ, క్రమంగా భారతదేశపు గడ్డ మీద జీవ సమతుల్యత దెబ్బతిందనీ, కప్పలు సంఖ్య భయకరంగా తరిగి పోయిందనీ గమనించలేదు. వాటి చప్పడు మీద అసహ్యం వేసి కొందరు నీటి గుంటల్లో, మురికి గుంటల్లో యాసిడ్ పోసి కప్పల్ని చంపారని కూడా మరికొన్ని వార్త లొచ్చాయి.

కాని ౩౦ ఏళ్ళ తర్వాత ఇప్పడు జరుగుతున్న కోట్లాది రూపాయల మస్కిటో రిపెల్లంట్ల వ్వాపారానికి, అది ఆనాడు ఆధారపేఠిక [బేస్ మెంట్] నిర్మించిందని ఉహించగలమా? ఇదే ఉహించలేని చోట మొన్నామధ్య కళ్యాణ్ రామ్ సినిమా ’హరే రామ్’లో చూపినట్లుగా రోగమూ, మందు కూడా వాళ్ళే సృష్టించి డిమాండ్ గా అమ్ముకొనే వ్వాపార కణిక నీతిని అసలు తెలుసుకోగలమా?

ఇప్పటికి దోమల రోగనిరోధక శక్తి ఎక్కువ అంటూ దానికి శాశ్వత పరిష్కారం చూపటం లేదు.

అమాయకంగా, మనం “రోజులు మారి పోయాయి. కాలుష్యం పెరిగి పోయింది. వాటితో పాటే దోమలూ, వాటి ఇమ్యూనిటీ కూడా పెరిగిపోయింది” అనుకొంటూ మన నెల వారీ సరుకుల బడ్జెట్ లో మరి 100 రూపాయలు అదనంగా మస్కిటో రిపెల్లంట్లు ను కొనడానికి కేటాయించుకొంటాం. అంతే!

ఇంత పకడ్బందీగా, ఒక్క ఆర్ధిక రంగంలో ఒక్క అంశం మీదే ప్రయోగింపబడే, నకిలీ కణిక వంశీయుల గూఢచార నైపుణ్యం, ఇక అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే దానికి చాలా లోతైన పరిశీలన కావాలి. మనం అంతలోతుగా పరిశీలించ కూడదు. పరిశీలిస్తే ఒక నాటికి కాకపోతే మరో నాటికైనా తాము చేస్తూన్న కుట్రని కనిపెడతాం. అప్పడు దగా పడం. కనుక మన జీవితాల్లో బిజీ పేరిట పరుగు సృష్టింప బడుతోంది. ఇదంతా మారిన కాల మని మనం నమ్ముతున్నాం.

ఇక్కడ మరోసారి ‘గుడ్డివాళ్ళు ఏనుగు తడుముడు’ కథ దగ్గరికి వద్దాం.

ఏనుగు ఒకోభాగాన్ని తడిమిన వాడు ఏనుగుని ఒకోరకంగా నిర్వచించినట్లుగా - మనలో కొంతమంది ఈ సుదీర్ఘ కుట్రని కుల గజ్జిగానూ, మరికొంత మంది మత మౌఢ్యంగా, మరికొందరు మతోన్మాదం, ఇంకొందరు టెర్రరిజంగా, ఇంకొందరు రాజకీయ కుళ్ళుగా, మరికొందరు పెరిగిన అవినీతిగా, ఇంకా కొందరు వ్వాపారుల స్వార్ధంగా, ఇంకొందరు కాలం మారిపోవడంగా నిర్వచిస్తూన్నారు. నిజానికి గుడ్డివాళ్ళూ గుర్తించింది విడివిడిగా ఏనుగు దేహాన్నే. కాగా మొత్తంగా ఏనుగుని కాదు. అలాంటిదే పైన వివరించిన నిర్వచనాలు కూడా. ఇవన్నీ దండలోని పూసల్లాంటివే. ఇవన్నీ కుట్రకు పైన వేయబడిన పైపూతలే.

ఈ నకిలీ కణిక వంశీయులూ, వారి నాయకుడూ కలిసి చేస్తున్న సుదీర్ఘ కుట్ర ఈ పూసల్ని గుచ్చేదారం లాంటిది.

ఈ అంతస్సూత్రం అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో పనిచేస్తూంది.

ఈ నకిలీ కణికుడెవరో, ఎక్కడి నుండి పని చేస్తున్నాడో, దేని కోసం ఇదంతా చేస్తూన్నాడో అర్ధం చేసుకోవాలంటే ఇంకొంచెం సమయాన్నీ కేటాయించాల్సి ఉంది.

అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర, భారత దేశం మీద కేంద్రీకృతమైంది.

ఎలా?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకొనే ముందు మరో కోణాన్ని పరిశీలించండి.

మనమంతా .....

ముంబాయి ముట్టడిలో పట్టుబడ్డ తీవ్రవాది ’కసవ్’ తను లక్షన్నర రూపాయలకు ఒప్పకొని, ఈ నరమేధం సృష్టంచడానికి ముంబాయికి మరో పదిమందితో కలిసి వచ్చాననీ, తాను చదువుకోలేక, కూలీకి వెళ్ళి, చిన్నచిన్న దొంగతనాలు చేసి ఆకలి తీరక, దారిద్ర్యానికి లొంగి, తీవ్రవాది అయితే కెరియర్ బాగుంటుందని ఇందులో చేరాననీ, ఈ ఆపరేషన్ చేస్తే తమ కుటుంబానికి డబ్బూ, ఇల్లూ ఇస్తామన్నారనీ, తనని చంపెయ్యమనీ లేకపోతే లష్కరే తోయిబా తమ కుటుంబసభ్యుల్ని చంపేస్తుందని వేడుకొంటున్నాడనీ మనమంతా మీడియాలో చదివాం, చూశాము. [నేనైతే డిసెంబర్ 3, 2008, ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్ లో ఇది చదివాను] రేపు ఈ తీవ్రవాదే మాటమార్చనీయండి లేదా మీడియానే మాట మార్చనీయండి. టెర్రరిజం వైపు పాక్ ముస్లిం యువత అడుగులు వేయడానికి కారణం దారిద్రమేనన్నది పచ్చినిజం. ఒక్క పాకిస్తాన్ లోనేకాదు, ఆఫ్గానిస్తాన్ అయినా, సిరియా అయినా, లిబియా అయినా, సోమాలియా అయినా, ఇండియా అయినా, బాంగ్లాదేశ్ అయినా మానవబాంబుగానో ఆత్మాహుతి దాడికో పాల్పడిన ప్రతి ఉన్మాద తీవ్రవాది - అంతకు ముందు దారిద్ర బాధితుడూ, ఆకలి బాధితుడూ లేదా చిన్నతనంలోనే అంటే ఏ ఐదారేళ్ళ వయస్సులోనో తల్లితండ్రుల దారిద్ర్యం రీత్యా రోడ్డున బడి ఉగ్రవాద సంస్ధల చేత ఉన్మాదులుగా పెంచబడిన 23 ఏళ్ళ లోపు యువకులే! ఇది చెప్పడం లేదూ వీళ్ళు మరెవ్వరి చేతిలోనో ఉన్న రిమోట్ కంట్రోల్డ్ బొమ్మలని?

నిజానికి ఇప్పడు భారత్ లో నడుస్తున్న చేపలు పట్టడం నేర్పకుండా చేపలిస్తున్న సంక్షేమ పధకాలు, నకిలీ పురుగు మందులు, ఎరువులూ, విత్తనాలూ, దళారులతో నాశనం చేయబడుతున్న వ్యవసాయాలతో ఆర్ధిక స్వావలంబన నశించాక భారతదేశమైనా పాకిస్తాన్ లాగే మారుతుంది.

ఎందుకంటే అది ఆకలి బాధ. ప్రాణికి ఆకలి బాధ భరింపరానిది. అది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తూంది.

సాక్షాత్తూ వ్యాస భగవానుడు, గీతని గ్రంధస్ధం చేసిన ఙ్ఞాని, అష్టాదశ పురాణాన్ని గ్రంధస్ధం చేసిన యోగి, భారత భాగవతాన్ని రచించిన మహామునీ, అపర ఈశ్వరుడని మనం నమ్మే మహానుభావుడు. అంతటి వ్యాసమహార్షే క్షామం వారణాసిని పట్టి పీడించినప్పడు కుక్కని చంపి తిన్నాడనీ, కాశీ నగరంలో తనకి భిక్ష దొరకనందున నగరాన్నే శపింపబోయి, కాశీ అన్నపూర్ణ శాపానికి గురై నగర బహిష్కారం పొంది వ్యాసకాశిలో నివసించాడనీ మనం పురాణాల్లో చదివాం. కాశీ వెళ్ళినప్పడు అంతే భక్తిగా వ్వాసకాశీని కూడా దర్శించి వస్తాం.

అంతటి వాణ్ణే నైచ్యానికి పురికొల్పిన ఆకలి ముందు సామాన్య మానవులం, మనం ఎంత?

ఆకలంటే దేవుడి పేరిట ఉపవాసం అంటూ ఫలహారం తినటం కాదు.

ఆకలంటే అమ్మమీదో, ఇతర కుటుంబ సభ్యుల మీదో అలిగి అన్నం మానేసినప్పడు కలిగే బాధ కాదు. అప్పడు కోపం, పంతమో ఎక్కువ. అదీగాక అలిగినప్పడు అమ్మో, మరోకరో బ్రతిమిలాడాక పోతారా అన్న ఆలోచన చుట్టు తిరుగుతుంది మనస్సు. ఇంకా చెప్పాలంటే మరీ ఆకలికి వేగలేక పోతే తినడానికైతే సిద్ధంగా తిండి ఉంది అన్న భరోసా నిజమైన ఆకలి బాధేమిటో అనుభవానికి రానివ్వదు.

నిజమైన ఆకలి దారిద్ర్యంలో వస్తుంది. ఆకలేసినా, తినడానికి తిండి లేదు, కోనడానికి డబ్బులేదు అన్నభావన, వాస్తవం భయోత్పాతం కలిగిస్తుంది.

ఆకలి నిజంగా భయంకరమైనది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాంటి ఆకలి ముందు, అలాంటి దారిద్ర్యం ముందు ఎవరైనా ఓడిపోతారు. అది ఈనాడు పాక్, అఫ్గాన్, సోమాలియా ల్లాంటి దేశాల్లోని ముస్లిం యువకుల రూపంలో కన్పిస్తున్నాయి.

ఇలాగే చూస్తూ ఉంటే ఈనాడు పాక్ ఉన్న స్ధితిలో రేపు ఇండియా ఉంటుంది, ఎల్లుండి అమెరికా ఉంటుంది, ఆ మర్నాడు మరో దేశం ఉంటుంది.

ఎందుకంటే 102 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఏ అంబానీ సోదరులో, రతన్ టాటాలో భాగ్యవంతులౌతున్నారు. 2600 కోట్ల నుండీ 4500 కోట్లదాకా ఖర్చుపెట్టీ 6 గురి కోసం విలాసవంతమైన నివాస మందిరాల్ని కట్టించుకోగల ధనవంతులు ముఖేష్ అంబానీ లాంటి కొద్దిమందే. ఇప్పటికే దోపిడి కేంద్రీకృతమై, దరిద్రుల సంఖ్య పెరుగుతోంది.

ఈ స్ధితి పాక్ లో మనకంటే ముందు జరిగింది.

మన భారతదేశపు గడ్డమీద భారతీయులం దగా పడ్డాం.

కానీ మననుండి విడిపోయిన పాకిస్థాన్ గడ్డమీద మొత్తంగా మానవత్వమే దగా పడ్డది.

వాస్తవానికి పాకిస్తాన్ ఓ బలి పీఠం.

దరిద్రం, ఆకలి కోరల్లో చిక్కిన అక్కడి యువత ఒకొక్కరూ ఒక్కో సమిధ. అంతే!

నేను వీళ్ళను చూసి జాలి పడమని చెప్పడం లేదు. వెనుక నున్న కారణాలు చూడమంటున్నాను.

నిజానికి మనమంతా అనుకొంటున్నాం, ఈ నర మేధమంతా పాకిస్తాన్ చేయిస్తోందనీ, ముస్లిం టెర్రరిస్టులు చేస్తున్నారనీ,
కానీ ఒక్కసారి రెప్పలెత్తి చూస్తే ...

పాక్ మాత్రం బావుకున్నదేముందనీ?

అక్కడా సామాన్య ప్రజలు దారిద్ర్యంతోనూ, అవిద్యతోనూ, ఆకలితోనూ, హింసతోనూ జీవితాలు అల్లకల్లోలమై ’దినదిన గండం నూరేళ్ళాయుష్షు’లాంటి బ్రతుకులు వెళ్ళతీస్తున్నారు.

ఎందుకంటే పాక్ లోనూ కొద్దిమందే ముఖేష్ అంబానీలు. వారిలో ఎక్కువమంది మాజీ సైనికాధికారులు, వారి గూఢచార సంస్ధ ఐన ఐ.ఎస్.ఐ. మాజీ అధికారులు. పాక్ లో ఉన్న పారిశ్రామిక సంస్థలో, వ్వాపార సంస్థలో ఎక్కువ భాగం వారివే నని ముషారప్ పదవిచ్యుతుడైన జూలై, 2008 వార్తపత్రికల్లో చదివాను. [జూలై 8 నుండి 15 వతేదీలోపుల అన్నట్లుగా నాకు గుర్తు]

కాబట్టి పాక్ లో ఉన్న 28కోట్ల మందిలో కొన్ని వేలమంది మాత్రమే ధనికులు. మిగిలిన వారిలో మధ్యతరగతి ప్రజలూ, కనీసం తిండి తినగల వారూ పోతే ఎక్కువ మంది ఆకలికి అలమటించే కటిక పేదవారే.

ఇప్పడు అర్ధం చేసుకోగలం కదా మానవ ప్రాణం ఎందుకు, ఎలా చౌక అయిపోయిందో?

ఎవరు మానవ బాంబులై ’రెడీ టూ యూజ్’ గా ఉన్నారో?

మనం ఓ హింస చెలరేగినప్పడు, ఓ వరుస బాంబు దాడి జరిగినప్పడు ఆవేశపడి, ఆక్రోశపడి, ఆపైన చల్లబడి మళ్ళీ మన దైనందిన జీవన వ్వాపారాల్లో చొరబడి పోయేంత తేలికైన విషయం కాదిది.

ఇలాగే వ్యవసాయం, ఆర్ధికాభివృద్దిని నిర్లక్యం చేస్తే మన కాలనీలో, ప్రక్కనున్న బస్తీల్లోంచో ఓ టీనేజర్ ఓ ఎకె 47 తో మన ఇంట్లోకే చొరబడే రోజు సమీప భవిష్యత్తులోనో మన ఇంటి తలుపుతడుతుంది.

కాబట్టి ప్రక్క మతం వాడినో, ప్రక్క దేశం వాడినో తిట్టుడం కాదు, మనం చేయవలసినది. రాజకీయం చేస్తోన్న వాళ్ళని, కుట్రలు చేస్తూన్న వాళ్ళని, వాళ్ళు చేస్తూన్నా కుట్రనీ కనిపెట్టడం.

ఎందుకంటే సమస్య ఎక్కడుందో, ఏమిటో తెలుసుకుంటే పరిష్కారం ఏమిటో, ఎలాగో తెలుస్తుంది.

ఎందుకంటే ఎక్కడ మనం వస్తువుని పారేసుకున్నామో తెలిస్తే, అక్కడే వెదక గలం. కాబట్టి మనం పోగొట్టుకున్న వస్తువు తిరిగి మనకు దొరుకుతుంది.

కాబట్టి మనం, మన మానవత్వాన్ని ఎక్కడ పారేసుకున్నమో ఆలోచించండి. ఎవరో తీయిస్తున్న పరుగులో మనమూ తెలియకుండానే ఎందుకు పరుగుపెడుతున్నామో తెలుసుకోవాలి.

ఈ సమస్యని పరిష్కరించడానికి మనం రోడ్లెక్కనక్కర లేదు.

ధర్నాలు చేయక్కర్లేదు. దిష్టిబొమ్మలు కాల్చక్కర్లేదు.

కానీ ఆలోచించాలి. మోసం ఎక్కడుందో తెలిస్తే మోసపోం కదా?

అందుకు ఆలోచించాలి. తార్కికంగా ఆలోచించాలి.

ఈ నేపధ్యంలో ఆలోచిస్తే ఈ స్వార్ధ మీడియా అంతా, ఎవరికి అంతిమ లబ్ది చేకూర్చడానికి కణిక నీతిని అంటే విభజించి - ప్రచారించు అన్న తంత్రన్ని ప్రయోగిస్తోంది?

1990 లో రష్యా కూలిపోయేదాకా అమెరికా, రష్యాలు ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో ఆయుధాలు, ఇంధనమూ ఇబ్బడిముబ్బడిగా అమ్మి వ్వాపారం చేసుకున్నారు. ఆరోజు కుట్రకు అది పైకి చెప్పబడిన కారణం.

1991 లష్కరే తోయిబా ల్లాంటి సంస్థలు ఇస్లాం మతం, జీహద్ అన్న పైకారణాన్ని బయటకు తీసాయి. నిజానికి అంతర్గత కుట్రకూ, దోపిడికి ఇవి పైపూత మాత్రమే.

నిజానికి అఖండ భారతదేశం మూడు ముక్కలు[ఇండియా, పాక్, బంగ్లాదేశ్] కావడం వెనుక ఇప్పడు ఇండో పాక్ దేశాల మధ్య నెలకొంటున్న ద్వేషం వెనుకా ఉన్నది కణిక నీతే [విభజించు - పాలించు అన్న తంత్రమే]. ఇక్కడ నేను పాకిస్తాన్ అంటోంది అక్కడి జర్దారీ ప్రభుత్వాన్ని లేక ముషారప్ ప్రభుత్వాన్ని కాదు. పాక్ గడ్డనీ, పాక్ ప్రజలనీ. పాక్ పూర్వ లేదా ప్రస్తుత ప్రభుత్వాలకీ భారత్ లోని ఎన్.డి.ఏ. లేదా యూ.పి.ఏ.ప్రభుత్వాలకీ తేడాలేదు. దొందు దొందే. ఈ రెండు ప్రభుత్వాలూ నకిలీ కణికుడి [కింగ్ మేకర్ల] చేతిలోని బొమ్మలే. కాకపోతే ఇందులో ఓ బొమ్మ ‘కీ’ మరో బొమ్మ చేతిలో ఉంటుంది. భారతదేశపు ప్రస్తుత సీ.ఈ.వో.లాంటి ప్రధానమంత్రి ‘కీ’ కుర్చీ వ్యక్తి చేతిలో ఉన్నట్లన్న మాట.

అలాంటప్పడు ఈ కుట్ర ద్వారా ఎవరు అంతిమ లబ్ది పొందుతున్నారు?

ఒకప్పడు బ్రిటన్, రష్యా, అమెరికా లాంటి దేశాలు, కె.జి.బి., సి.ఐ.ఏ. ల్లాంటి సంస్థలూ ప్రపంచాధిపత్యం చూపించాయి. లబ్ధి పొందినట్లు కన్పించాయి. ముస్లిం ఉగ్రవాద సంస్థలు, పెట్రో డాలర్లు ఆ స్థానంలోకి వచ్చిందన్న వాదన ఒ ప్రక్క విన్పిస్తోంది. మెల్లిగా దేశాలూ, నిఘా సంస్థలు ఫేడవుట్ అయిపోయి బిన్ లాడెన్ లూ, దావూద్ ఇబ్రహీముల్లాంటి వ్యక్తులు రంగం మీది కొస్తున్నాయి. దేశాలూ, సంస్థల మాదిరిగానే ఈ వ్యక్తులు కూడా నకిలీ కణికుడి చేతిలోని కీలు బొమ్మలు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అతిముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ప్రపంచాన్ని వణికించగలడనీ, నడిపించగలడనీ.

ఆ వ్యక్తిగా సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై ఉగ్రవాది దాడి ‘బిన్ లాడెన్’ ను చూపించింది.

కాని బిన్ లాడెన్ నకిలీ కణికుడి చేతిలోని మరబొమ్మ.

మరయితే ఎవరీ నకిలీ కణికుడు? ఎక్కడనుండి ఇదంతా నడుపుతున్నాడు?

ఈ ప్రశ్న చిన్నది. జవాబు సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది.

టపా నిడివి రీత్యా ఆపక తప్పడం లేదు.

దీన్ని మరింత విపులంగా చర్చించాలన్నా, సమగ్రంగా వివరించాలన్నా మరికొన్ని టపాలు అవసరం.

తదుపరి టపాలలో ఈ ప్రయత్నాన్ని మరింత కొనసాగిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది.

కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.

ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.

అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.

రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.

మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.

అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.

ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.

సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.

శతృవులని విభజించి గెలవాలి.

మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.

ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!

శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.

ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.

ఒక కథ చెబుతాను వినండి మహారాజా!

అనగా అనగా ...

ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది.

ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు.

పులి, తోడేలు, ముంగిస, ఎలుక.

ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది.

ఆరోజులలో ఒకనాడు --

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు.

బాగా ఆలోచించింది నక్క.

మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని,

"స్నేహితులారా! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరించి.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

అది కొంత సేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి.ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది.

దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి.

నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది.

నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క:

"న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.

అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.

నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి,

"బావా! ఎందుకు విచారిస్తున్నావు?" అంది.

"ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే
నాకు బాధ కలిగింది” అంటూ నక్క కన్నీరు విడిచింది.

పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ వెళ్లిపోయింది.

అంతలో ఎలక రాగా, నక్క

"విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది” అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పడు ముంగిస రాగా, “చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్నీ చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది.

హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క.

విన్నారా! మహారాజా! తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలి” అన్నాడు కణికుడు.

ఇదే కణిక నీతి.

ఈ కథలో నక్క బలమైన పులి మీద ‘పౌరుషాన్ని రెచ్చగొట్టటం’ అన్న తంత్రం ప్రయోగించింది. మిగిలిన వాటి నుండి విడగొట్టింది. తోడేలుకి పులినీ, ఎలుకకి ముంగిసనీ చూపెట్టి, విభేధాలు పుట్టించి తరిమేసింది. ఇక ఒంటరిదైన, తనకంటే బలహీనమైన ముంగిసని బాహాబాహిగా సవాలు చేసి భయపెట్టింది. ఈ విధంగా సామ దాన భేద దండోపాయాల్లాంటివి ప్రయోగించి నాలుగు జంతువుల్ని విడగొట్టి ఓడించింది.

ఇదే కణిక నీతి.

ఈ కణిక నీతిని చాలా గొప్పగా, హఠాత్తుగా బ్రిటిషు వాళ్ళు కనిపెట్టారంటూ ఈస్ట్ ఇండియా కంపెని వారి సైన్యాధికారి జనరల్ డూప్లే కనిపెట్టిన ’విభజించి - పాలించు’ అన్న స్ట్రాటజీ అంటూ ఎంతగా అదరగొట్టారు![నిజానికి డూప్లే ఫ్రెంచ్ జనరల్. ప్రచారంతో ఆ విషయం మరుగున పడిపోయింది.]

వేల సంవత్సరాల క్రితపు భారతంలోని కణికుడూ, కణిక నీతి ముందా లేక క్రీ.శ. 1450ల తర్వాత భారతదేశానికి టీ, ఇంకా మసాలా దినుసులు వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషు వాళ్ళు, వాళ్ళ జనరల్ డూప్లే ముందా? ఎవరు ఎవరి స్ట్రాటజీని అనుసరించి ఉండాలి?

నిజంగా బ్రిటీషు వాళ్ళే, భారతంలోని కణిక నీతి తెలియకుండానే, స్వతంత్రంగా వాళ్ళ బుర్రలతో ఆలోచించే ‘విభజించు - పాలించు’ మనే తంత్రన్ని కనిపెడితే, దాన్ని ఆచరణలో పెట్టి ముందుగా యూరప్ లోనే తమ ఆధిపత్యాన్ని స్పెయిన్ మీదా, హాలెండ్ మీదా, ఫ్రాన్స్ మీదా చూపించి ఉండేవాళ్ళు కదా?

క్రీ.శ. 1498 లో తొలిసారి భారత్ కు సముద్ర మార్గం కనిపెట్టే వరకూ యూరప్ లో ఇంగ్లాండు, స్పెయిన్, ఫ్రాన్స్, హాలెండ్, పోర్చుగీసులు వ్వాపారపోటీ పడ్డారన్నది చారిత్రక సత్యం. ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్న పోర్చుగీసు నావికుడు వాస్కోడ గామాకు స్పాన్సరర్ స్పెయిన్ రాజు. ఇతర ప్రాంతాలకు సముద్ర మార్గలు కనుక్కోవడానికి బయలుదేరే వాళ్ళకు డబ్బు సమకూరుస్తూ పై ఐదు దేశాలు రాజులు వాళ్ళకు ’సాహసికులు’ అన్న పాజిటివ్ కాప్షన్ పెడితే, ఆనాటి ఆయాదేశాల సామాన్య ప్రజలు ‘సముద్రపు దొంగలు, దోచుకోవడానికి క్రొత్త చోట్లు కనిపెట్టడానికి బయలుదేరారని’ ఉన్న నిజం అనేవారట. కాబట్టి తర్వాత సామ్రాజ్య వాదంతో అసలా దేశప్రజలందరికీ దోపిడిని అలవాటు చేసి అందరి ఆమోదముద్రని పొందారు ఆయా దేశాల రాజులు లేదా రాణులు.

ఎందుకంటే దోచుకోవడానికి ఇతరప్రాంతాలు లేనప్పడు తమ దేశీయుల్నే దోచుకొని మరీ తమ సుఖాలు సమకూర్చుకొన్నారు. దోచుకోవడానికి వలస రాజ్యాలు దొరకగానే, తమ దేశప్రజలకు కూడా ఆ వెసులుబాటు కలిగించి తమ దోపిడీకి ఆమోదం సంపాదించారు. తమను కాపాడేందుకు, తమ చుట్టు ఎంత ఎక్కువ మంది మద్దతుదారులుంటే అంత రక్షణ కదా!

సరే! చివరకు భారతదేశం చేరారు. వ్యాపారంలో వారి తొలి లక్ష్యం అదే. ఎందుకంటే తమ చలి ప్రాంతాల్లో, తమకి అత్యంత అవసరమూ, తమ దేశంలో అత్యంత గిరాకీ ఉన్న మిరియాలూ, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు దొరికేది భారతదేశంలోని కొంకణ తీరంలోనే. అందుకే కాన్ స్టాంట్ నోపిల్ నుండి భూమార్గం తమకు మూతబడగానే సముద్ర మార్గాన్ని కనుక్కొన్నారు.

తీరా ఇండియా చేరాక కూడా ఈ దేశాల వ్యాపార కంపెనీలు వారిలో వారు తెగకొట్టుకున్నారు. మొదట్లో వాళ్ళకి భారతదేశంలో సామ్రాజ్య స్ధాపన చేయాలన్న ఆలోచన లేదు. ఇక్కడి రాజుల దగ్గర వంగి వంగి దణ్ణాలు పెట్టి అనుమతులు పొందడంలోనూ, వ్యాపార స్దావరాలు ఏర్పాటులోనూ, వ్యాపారాభివృద్దిలోనూ పోటి పడటం మీదే ఉండేది వారి దృష్టి. [ఇప్పటికీ బ్రిటిషు వారికి రాజభక్తీ, దాస్యబుద్దీ ఎక్కువని చెప్పాడానికి బ్రిటన్ రాచరికమే పెద్ద ఉదాహరణ]

ఈ పోటి, రమారమి కొన్ని శతాబ్ధాలు నడిచింది. అప్పడెప్పడూ బ్రిటిషు వారి మేధస్సు విభిజించి - పాలించమన్న కణిక నీతిని ఆచరించ లేక పోయింది పాపం!

క్రీ.శ. 1768 లో నిజాం రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాగా వేశాక గానీ ఈ పట్టు బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి, తమ తోటి యూరోపియన్ వ్యాపార కంపెనీల మీదగానీ, భారతదేశపు చిన్న చిన్న రాజ్యాలు మీదగానీ రాలేదు. అప్పడే ఈ కణిక నీతి [విభజించు - పాలించు అన్న తంత్రం]వీరికి స్ఫూరించింది. నిజాముల నుండి ఉత్తర సర్కారుని, 1800 సంవత్సరములో రాయల సీమని దత్తత పుచ్చుకొనేదాకా వారి పట్టు ఈ భూభాగం మీద పెరిగింది. ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్, స్పెయిన్, గట్రా దేశాల కంపెనీలు అణగతొక్కపడ్డాయి. క్రీ.శ.1498 నుండి 1768 లదాకా [దాదాపు 270 ఏళ్ళు] రాని గ్రిప్ [పట్టు] 1800 లనుండి 1857 లోపల భారతదేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చుకోగలిగింది.

కేవలం కణిక నీతి అంటే విభజించు -పాలించు అనే తంత్రంతోనే ఇదంతా సాధించింది.

ఇది చరిత్ర చెప్పే సత్యం.

జరిగిపోయిన నిజం.

ఇప్పడు ఎవరు కావాలన్నా మార్చలేని నిజం.

నిజాముల చరిత్ర నుండి ప్రారంభమైన నిజం!

270 ఏళ్ళ పాటు బుర్రబద్దలు కొట్టుకున్న సాధించలేని పట్టు బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ 57 సంవత్సరాలలో సాధించగలిగింది?

ఖచ్చితంగా అది వారి మేధస్సు కాదు. వారి మేధస్సు అయితే మొదటగా యూరప్ లోనే అది పొంది ఉండే వాళ్ళు. ఇండియా గడ్డమీద అడుగుపెట్టి నప్పడే ఆధిపత్యం సంపాదించి ఉండే వాళ్ళు.

కాబట్టే నిశ్చయంగా చెప్పవచ్చు కణిక నీతిని అమలు చేయగలమేధోసంపత్తి బ్రిటిషువారిది కాదని. ఇదొక్కటే నిదర్శనం కాదు అలా చెప్పటానికి. ఈ నాడు ప్రపంచదేశాలన్నిటి మీదా, [భారతదేశంతో సహా] అమలు చేయబడుతున్న కణిక నీతి నుండి అంతిమ లబ్ద పొందుతున్నది ఇంగ్లాండు కాకపోవడం కూడా మరో నిదర్శనం.

ఈ అంశాన్ని ఇంకా సోదాహరణంగా, సహేతుకంగా, దృష్టాంతపూరితంగా నిరూపించడానికి మరికొన్ని టపాలు అవసరం. తార్కికంగా ఆలోచించడానికి కావలసిన అధారాన్ని ఈ టపాలో వివరించాను.

మరలాంటప్పడు ఇప్పడు ప్రపంచదేశాలన్నిటి మీదా, ముఖ్యంగా భారతదేశం మీదా, సరిగ్గా చెప్పాలంటే మొత్తం మానవజాతి మీదా, మానవత్వం మీదా అమలుచేయబడుతున్న కణిక నీతి వెనుక ఎవరున్నారు? ఎవరు అంతిమ లబ్ధి పొందుతున్నారు?

ఈ విషయంలో మరో ముఖ్యమైన కోణాన్ని ఇక్కడ పరిశీలించాలి.

మనదేశంలో సురభి కుటుంబాలు కొన్ని వంశ పారంపర్యంగా, తరాల తరబడి నాటక కళని అనుశృతంగా తమ భావి తరాలకు అందిస్తూ వస్తూన్నాయి. అలాగే కొన్ని ఆయుర్వేదవైద్య కుటుంబాలూ, ప్రకృతి వైద్యఙ్ఞానం గల కుటుంబాలూ, సంగీతఙ్ఞులూ, కవి గాయక పండిత కుటుంబాలు తరతరాలుగా తమ కళనీ, ఙ్ఞానాన్ని, నైపుణ్యాలని తమ భావి తరాలకు సంక్రమింపజేస్తూ వాటిని సజీవంగా చైతన్యంగా ఉంచుతున్నాయి.

అంతెందుకూ?

సాక్షాత్తు మన వేద వాఙ్మయమే కొన్ని వేల సంవత్సరాల పాటు తరం నుండి తరానికి మౌఖికంగానే బదలాయింపబడ్డాయి. అందుకే వాటిని అపౌరుషేయాలనీ పిలుస్తారు. చాలాకాలం తర్వాత గాని ఆ ఙ్ఞాన సంపద గ్రంధస్ధం కాలేదు.

ఈ కోణంలో తార్కికంగా ఆలోచిస్తే బ్రిటిషు వారికి జనరల్ డూప్లే పేరిట చెప్పబడిన [మన కణిక నీతి] విభజించు - పాలించు అన్న స్ట్రాటజీ విజయం వెనుకా గూఢచార ఙ్ఞానం కలిగిన వంశమో, లేక కొన్ని కుటుంబాలో ఉండే అవకాశం లేదా? [అదే కణిక నీతి ఈనాడు విభజించి - ప్రచారించు అన్న స్ట్రాటజీ తో ప్రపంచాన్ని శాసిస్తోంది] వాస్తవానికి మన భారత, రామాయణాలు నిగూఢ గూఢచర్యాన్ని కధాత్మకంగా, కళాత్మకంగా వివరించాయి. ఒక్క కణిక నీతి లోనే కాదు, నారద మహాముని ధర్మరాజుకి చేసిన రాజ్యపాలనా మార్గనిర్ధేశంలోనూ, ధృతరాష్ట్రుణ్ణి విదురుడు మందలిస్తూ చెప్పిన విదురనీతి లోనూ ఎంతో గూఢచార ఙ్ఞానం ఉంది. ఇక చాణక్య మంత్రి, తిమ్మరుసు మంత్రి లాంటి వారి మేధో సంపత్తి గురించీ, వారి గూఢచర్య ఙ్ఞానం గురించి మనకు చరిత్ర పాఠాలుగా చెబుతుంది.

అటువంటప్పడు ఏ సురభి కుటుంబాల్లాగో, ఆయుర్వేదవైద్యపు వంశాల్లాగో తరతరాలుగా, తరం నుండి తరానికి సంక్రమిస్తూ, ఆచరింపబడుతూ కొన్ని కుటుంబాలు గూఢచర్య ఙ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కలిగి ఉండకూడదా?

గూఢచర్యమంటేనే ‘నిగూఢమైనది, పైకి వ్యక్తం కానిది’ అని అర్ధం.

అలాంటప్పడు అది ఏరోజైనా కాలం మూడి బయటికొచ్చినప్పడు కదా తెలుస్తుంది?

సునామీ వచ్చాక కదా మనందరికీ తెలిసింది సముద్రగర్భంలో భూకంపం సంభవించిందనీ, అదే ఈసునామీ ని సృష్టించిందనీ.

మళ్ళీ చరిత్రలోకి వద్దాం.

క్రీ.శ. 1498 లో యూరపు నుండి ఇంగ్లాండు, డచ్చి గట్రా దేశాల వ్యాపార సంస్ధలు[నిజం చెప్పాలంటే దోపిడి దొంగలు] భారతదేశానికి వచ్చేనాటికే వారిదగ్గర తుపాకి మందు అన్న టెక్నాలిజీ ఉంది. అప్పటికి మనవారింకా కత్తీ, డాలు, విల్లుంబులూ, ఈటెల దగ్గరే ఉన్నారు. అయినా గాని ఆ అప్రాచ్యులు[అంటే పశ్చిమ దేశాల వాళ్ళన్న మాట. దాన్నే మన పెద్దలు తిట్టుగా వాడారు] ఇండియా మీద పట్టు సాధించ లేకపోయారు. ఈ స్ధితి దాదాపు 270 సంవత్సరాల పైగానే సాగింది. క్రీ.శ. 1800 తర్వాత చాలా వేగంగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతం దాకా యావద్దేశం వారి ఏలుబడి లోకి వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలంటే దక్కను ప్రాంతంలోని నిజాము ఏలుబడిలోని హైదరా బాదు సంస్ధానం దగ్గర నుండీ ఈ పట్టు మొదలైంది.

అంటే దాదాపు ఈ సమయంలోనే, ఈ ప్రాంతం నుండే బ్రిటిషు వారి టెక్నాలజీ [తుపాకి మందు, తుపాకిల్లాంటి ఆయుధాలు]కి భారతదేశంలోని గూఢచర్యమేధస్సు లేదా కణిక నీతి చెప్పగల మేధస్సు తోడైంది.

అప్పటి నుండే బ్రిటిషు వారి జైత్రయాత్ర ప్రారంభమైంది.

అది ఇండియాతో ఆగలేదు.

రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని తామే గర్వంగా ప్రకటించుకోగలిగినంత సువిశాల బ్రిటిషు సామ్రాజ్యం భూగోళమంతా విస్తరించింది.

ఇక్కడో సునిశిత అంశాన్ని పరిశీలించండి.

క్రీ.శ. 1857 లో తొలి భారత స్వాతంత్ర సమరం జరిగింది. ఝాన్సీలక్ష్మీ బాయి, తాంతియా తోపే, నానా సాహెబ్ లాంటి వీరుల్ని ఈ సందర్భంలో మనం స్మరించుకొంటాం. అంతకంటే లోతుగా ఆలోచించం. నిజానికి 1800 లసంవత్సరంలో నిజాం ప్రభుత్వం నుండి రాయల సీమ జిల్లాల దత్తత పొందిన బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత ఏదో ఓ కారణం బనాయించి ప్రతి చిన్నరాజ్యాన్ని, పాలె గాళ్ళని కణిక నీతి ప్రయోగించి కబళించింది.

కేవలం 57 సంవత్సరాల్లో ఈ బ్రిటిషు కంపెనీలు బలీయమైనాయి. అంతకు ముందు వ్యాపారం కోసం, పట్టుకోసం తోటి యూరోపియన్ కంపెనీలతో పోటీ పడటం లోనే వాళ్ళ బ్రతుకు 270 ఏళ్ళుపాటు తెల్లారింది.

అప్పడు సరిగ్గా జరిగిందది.

అదే 1857 సైనిక తిరుగుబాటు.

అదే బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంటికి పంపించి, బ్రిటిషు విక్టోరియా రాణిని ఇండియాకి రప్పించింది.

ఇది యుద్ధంతో సాధించ బడలేదు.

గూఢచార తంత్రంతో అంటే కణిక నీతితో సాధించబడింది.

సైనిక విప్లవానికి ముఖ్యకారణమేమిటి?

సైనికులకు ఇవ్వబడిన కొత్త రకం తూటాలను[కాట్ రిడ్జ్ లను] నోటితో తెరవవలసి ఉంటుంది. వాటికి ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపి పూత పూయబడినదని ఒక పుకారు సైనికుల్లో ప్రచారమయ్యింది.

సైనికుల్లోనికి హిందువులకు ఆవు పవిత్రజంతువు. ఆకొవ్వు నోట తాకరు.

సైనికుల్లోని ముస్లింలకు పంది అసహ్యజంతువు. ఆకొవ్వును వాళ్ళు నోటతాకరు.

ఫలితం - సైనికుల్లో అసంతృప్తి.

ఇది సైనిక తిరుగుబాటుకూ, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిష్ర్కమణకూ, బ్రిటిషు రాణి పాలన ఇండియాలో ప్రారంభం కావడానికి వెనకున్న ముఖ్యకారణాల్లో ఒకటి.

దీని వెనుక టెక్నాలజీ ఉందా? కణికుడిలాంటి కుటిల నీతి మేధస్సు ఉందా?

ఈ మేధో వంశమో, కుటుంబమో ఏదైతే ఉందో దాన్ని ఇక నుంచి రచనా సౌలభ్యం కోసం, పాఠకులకు బాగా అర్దమవ్వడం కోసం నకిలీ కణికుడు అని పిలుస్తాను.

ఇక నకిలీ కణికుని మేధస్సు బ్రిటిషు బకింగ్ హోం ప్యాలస్ ని అంటే రాచ కుటుంబాన్ని ప్రపంచ హీరో చేసింది.

కొన్ని దశబ్దాల తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషు రాచ కుటుంబం స్దానం లోకి అమెరికా, రష్యా లోచ్చాయి. అమెరికా నిఘా సంస్ధ సి.ఐ.ఏ., రష్యా నిఘా సంస్ధ కె.జి.బి., వాటి పోటా పోటీ గూఢచార సామర్ధ్యాల గురించి మనం ఎన్నో నవలల్ని ఉత్సుకతతో చదివాం. [ఇర్వింగ్ వాలెస్ సెవెంత్ సీక్రెట్,ది సెకండ్ లేడీ, ది మిరాకిల్, ది ఆల్ మైటీ ల్లాంటి బొచ్చెడు నవలలు. మచ్చుకి కొన్ని చెప్పాను] ఆ ధీమ్ తో వచ్చిన ఎన్నో సినిమాలని కళ్లు విప్పార్చుకు చూశాం. ధ్రిల్ అయిపోయాం. 1920 లనుండి ప్రారంభమైన రష్యా ప్రస్ధానం, 1990 తో పతనమై, అంతటితో కె.జి.బి. ఉత్ధాన పతనాలు పూర్తయ్యాయి. ఆపైన అమెరికా సి.ఐ.ఏ. దే అగ్రస్ధానం. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సి.ఐ.ఏ. కి తెలుస్తుందన్న విశ్లేషణని మనం పత్రికల్నిండా చదివాం. 2001, సెప్టెంబరు 11 న అమెరికా డబ్యూ.టి.సి. పైన ముస్లిం ఉగ్రవాదుల దాడి నాటిదాకా అదే పరిస్థితి.

ఇప్పడు ఆ స్ధానంలో ఉగ్రవాదం, పెట్రో డాలర్లు తెరమీదకి వచ్చాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మతోన్మాదం చౌకగా ఉగ్రవాదుల్ని తయారుచేయడానికి పనికిరావడం.

ఆవిధంగా ఇస్లాం మతం కూడా ఈ కుట్రలో ఓ సమిధగామారి దగా పడుతోంది.

ఇంగ్లాండు, తర్వాత రష్యా, అమెరికాలు ఏదేశమైనా కానివ్వండి - ఓ కామన్ స్ట్రాటజీ ఏమిటంటే, ఏదేశమైనా ప్రపంచాధిపత్యం కోల్పోయే ముందు ఆర్ధికంగా చితికిపోతుంది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఇంగ్లాండు, 1990 లో పెరిస్త్రోయికా తర్వాత రష్యా, నేడు అదే బాటలో సబ్ ప్రైమ్ తర్వాత అమెరికా.

ఈ నేపధ్యంలో గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిటిషు వారికి ఇండియాలో పట్టుదొరికాక అంటే క్రీ.శ.1800 లతర్వాత ప్రపంచమంతా విస్తరించడం, 1947 లో ఇండియా నుండి వైదొలిగాక క్రమంగా వారిదేశానికే పరిమితమవ్వడం. ఎంతగా వారి స్ధితి కుదింప బడిందంటే సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై ఉగ్రవాదుల దాడి తర్వాత అమెరికా ప్రెసిడెంట్ జార్జివాకర్ బుష్ ఆఫ్గాన్ మీదా యుద్దం చేస్తున్నప్పుడు, ఆనాటి బ్రిటిషు ప్రధాని టోని బ్లెయిర్ తాను సాక్షాత్తు అమెరికా విదేశాంగ మంత్రేమో అన్న లెవెల్లో తెగ తిరిగేసాడనీ, ఇది పుల్లయ్యవ్వారం లాగా ఉందని పత్రికలు [ఈనాడుతో సహా] ఎడిటోరియల్సూ, సబ్ ఎడిటోరియల్సూ వ్రాయగా మనమంతా చదివాం. అంతగా కుదింపబడిందన్న మాట.

ఈ వాస్తవం మనకి చెప్పెదేంటంటే ప్రపంచం మీద పట్టు బ్రిటిషుకో, రష్యాకో, అమెరికాకో, ఈరోజు ఉగ్రవాద సంస్ధలకో లేదు. వారి దగ్గర టెక్నాలజీ ఉన్నా సరే! ఆ టెక్నాలజీ ఆయుధమైనా సరే లేక ఇంటర్ నెట్ ఙ్ఞానమైనా సరే!

దానికి కుటిలనీతి వంటి కణిక నీతి - అంటే గూఢచార నైపుణ్యం, ఙ్ఞానం ఉంటేనే ఇది సాధ్యం.

ఈ రోజు ఇంటర్నెట్, అందులో వెబ్ సైట్లూ, బ్లాగులూ లాంటి వేదిక కన్పిస్తోంది. కనుక ప్రజల ఆవేశాలు, ఆక్రోశాలూ మనకి తెలుస్తున్నాయి. 20 ఏళ్ళ క్రితం మనమంతా అనుభవించింది నాముందటి టపా ’ముంబాయి ముట్టడి - తొక్కిపడుతున్న లొసుగులు’ లో చెప్పినట్లుగా ఎన్నో సందేహలు.

ఎంతో ఆవేదన! ఎందుకిలా జరుగుతోందన్న ఆవేదన!

ఇలా జరగకూడదన్న ఆక్రోశం!

ఏం చేయాలన్న ఆలోచన!

ఏమి చెయ్యలేని నిస్సహాయత!

ఇదంతా నాలాగే మీలో చాలా మంది అనుభవించారని నేను ఖచ్చితంగా చెప్పగలను.

ఇప్పడు ఇరవై ఏళ్ళయువకుల్లో ఉన్న ఆవేశం, ఆక్రోశం ఆరోజు అంటే 20 ఏళ్ళ క్రితం నాదగ్గరా ఉండింది. ఆ ఆవేశం, ఆక్రోశం,
ఆలోచన 16 ఏళ్ళ నుండి అంటే 1992 నుండీ ప్రతీవార్తనీ, ప్రతీ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి దారి తీసింది.

ఆ సత్యాన్వేషణలో నేను తెలుసుకున్నవే నేనిప్పుడు మీముందు పెడుతున్నాను.

దేనికోసం మీరిప్పడు వెదుకుతున్నారో, ఏ సమస్యల్ని చూస్తూన్నారో, ఏ పరిష్కారం కోసం తపిస్తూన్నారో, దాన్ని నేను 16 ఏళ్ళ క్రితం నుండీ వెదకీ, చూసి, తపించీ తెలుసుకున్నాను.

దాన్నే మీకిప్పుడు సహేతుకంగా,[అంటే లాజికల్ గా], సాక్ష్యాధార సహితంగా, దృష్టాంత పూరితంగా [అంటే సర్కమ్ స్టాన్షియల్ గా] మీముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.

ఇప్పుడు నేను చెబుతున్న విషయాలన్నీ మీకు తెలిసినవే.

మీరు నాలాగే పత్రికల్లో, టీవిల్లో తెలుసుకున్నావే.

కాని దేనికి దాన్ని చూస్తే నేలమీద అక్కడొక్కటీ, ఇక్కడొక్కటీగా పడున్నా పూసల్లాంటివి.

వాటిమధ్య ఓ దారం అంతస్సూత్రంగా దాగుందని తెలిసినప్పుడు కదా మనకు అక్కడున్నది దండనీ, విడివిడిగా పడున్న పూసలు కాదనీ తెలిసేది?

దండని, విడి పూసలుగా భ్రమింపజేసేందుకే మనమీద ‘విభజించి – ప్రచారించు’ అనే కణిక నీతి ప్రయోగింపబడుతోంది. ‘నల్లమేక - నలుగురు దొంగలు’ కథలాగా ‘పదేపదే అదే ప్రచారం’ అన్న తంత్రం ప్రయోగింపబడుతోంది.

దాన్నే మీడియా మాయాజాలం అన్నా టపాల మాలికలో చర్చిస్తున్నాను. నిజానికి ఒక పెద్దకుట్రలో అది ఒక చిన్నకుట్ర.

ఈ కుట్ర దశాబ్ధాలుగా కాదు శతాబ్దాలుగా నడుస్తోంది.

వ్యక్తిగా మన జీవితంలో పది సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం చాలా ఎక్కువ కాలం.

అదే ఒక దేశానికి ’దశాబ్దం’ అంటే చాలా స్వల్పం.

మన జీవితాల్లో రెండు మూడు దశాబ్దాల కాలం, ఒక దేశ చరిత్రలో రెండు మూడు శతాబ్దాల కాలంకి సరి సమానం. పరిణామాలకైనా, పర్యవసానాలకైనా.

అందుచేత, మన జీవితాల్లో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న తీవ్రమైన కుట్రనీ, మన దేశమ్మీద రెండు శతాబ్దాలుగా జరుగుతున్న సుదీర్ఘ కుట్రనీ సోదాహరణంగా, దృష్టాంత పూరితంగా వివరించాలంటే మరిన్ని టపాలు అవసరం. ఈ టపాల మాలిక పూర్తయ్యేలోగా మీ సందేహాలన్నింటినీ సవివరంగా తీర్చగలనని ఆశిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu