నేను ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చేనాటికి టన్ను 16,000/-Rs. ఉన్న సీసం (మా ఫ్యాక్టరీకి ప్రధాన ముడి పదార్దం అదే!), అంతర్జాతీయంగా 35,000/- Rs. లకు పెరిగింది. దాంతో వర్కింగ్ కాపిటల్ లో లోటు భారీగా వచ్చింది.

అయితే బ్యాంక్ ఆ లోటును భర్తీ చేయటానికి నిరాకరించింది. ఎందుకంటే - జామీనుగా చూపిన ఆస్తుల విలువ అంత లేదు కాబట్టి. నా ఫ్యాక్టరీకి సేకరించిన యంత్రసామాగ్రి సామర్ధ్యం... నేను టన్ను 16,000/-Rs.ల విలువ ఉన్నప్పుడు, నెలకు ఎన్ని టన్నులు అవసరంగా ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చానో... అంత!

నెలల పర్యంతం ఆలస్యం మూలంగా, పెరిగిన ముడి సరుకు ధరలరీత్యా, అంతలో సగంతో యంత్రాలు నడపవలసి వచ్చింది. దాంతో అన్నీ తల్లక్రిందులే! ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. తొలిరోజుల్లోనే బాగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇక ఉద్యోగ వర్గంతో కూడా చాలాసార్లు బాగా ఇబ్బందిపడ్డాను.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా, నా కెరీర్‌లో ప్రభుత్యోద్యోగుల్లో నిజాయితీపరులని తక్కువ సంఖ్యలో, అవినీతి పరులని అసంఖ్యాకంగా చూశాను.

ఓ సారి... ఏపీఎస్‌ఎఫ్‌సీ వాళ్ళు, తమ బ్రాంచి మేనేజర్ లిమిట్‌ని తగ్గించారు. దాంతో నాఫైలు హెడ్‌ఆఫీసుకి బదిలీ అయ్యింది. దాన్ని వాళ్ళు కొరియర్‌లో హైదరాబాదుకు పంపారు. పార్టీ చేతికి (అంటే మా చేతికి) ఇవ్వకూడదు కదా!

అయితే, హెడ్‌ఆఫీసులో నా ఫైలు గల్లంతయ్యింది. అందుకోసం గుంటూరు నుండి మూడుసార్లు హైదరాబాద్‌కి తిరగాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా ఏ జోన్ క్రిందికి వస్తుందో, ఆ జోన్ అధికారిగా సత్యనారాయణ అని, ఒక నడివయస్సు వ్యక్తి ఉండేవాడు. అతడికి లక్షకు ఇంత శాతం చొప్పున ‘లంచం’ ముందుగా ముడితేనే, ఫైలు అతడి టేబుల్ దాటేది.

అదొక్కటే ఇతడితో చికాకు కాదు. ఇతడి క్యాబిన్‌కు వెళ్ళిన ఏ మహిళనైనా, (అతడి క్రింది స్థాయి ఉద్యోగినులని కూడా) అకలి చూపులు చూసేవాడు. ఎంత ఛీదర వేస్తుందంటే... అప్పటి క్రోధం ఇప్పుడు మాటల్లో చెప్పలేను కూడా! చివరికి అతణ్ణి, మా ఊళ్ళోని ఛార్టెడ్ అకౌంటెంట్ చేత డీల్ చేయించి, నా పని పూర్తి చేసుకున్నాను.

ఇక ఈ అధికారి దగ్గరికి వెళ్ళవలసి ఉన్న నా ఫైలు (అది గుంటూరు నుండి కోరియర్‌లో పంపబడిన ఫైలు) ఎక్కడ గల్లంతయ్యిందో ఆచూకీ దొరకలేదు. ఆ నేపధ్యంలో, వారానికి ఓ సారి చొప్పున, హైదరాబాదు చుట్టూ తిరిగాను. శ్రమా, డబ్బూ కంటే కాలం వృధా అవ్వటం పరిశ్రమకి పెద్ద దెబ్బె! ఈ విషయం ప్రభుత్యోద్యోగులకి బాగా తెలుసు కూడా!

చివరికి ఇన్‌వార్డ్ సెక్షన్ అధికారిని కలిసి, సమస్య వివరించి, సాయం చెయ్యమని అర్ధించాను. ఇతడి పేరు మదన గోపాల స్వామి. ఆఫీసుకి పాత బజాజ్ స్కూటర్ మీద వస్తాడు. కానీ నిజాయితీ పరుడన్న పేరున్న వ్యక్తి. అతడు అటెండరుని పిలిచి "మూడు వారాలుగా ఫైలు ఆచూకీ తెలియటం లేదా?" అంటూ కేకలేసి, తక్షణం వెదకమన్నాడు.

ఆయన లేచి, ఇన్‌వార్డ్ క్లర్క్‌కి హెచ్చరిక చేస్తూ, ఫైల్ లొకెట్ చెయ్యమని ఆదేశించాడు. క్షణంలో ఆఫీసులో కదలిక వచ్చింది. ఫోన్లు మోగాయి. నానా గడబిడ తర్వాత, నాఫైలు కొరియర్ ఆఫీసులోనే ఉండిపోయిందంటూ ప్రకటించారు. ఏం చేసారో ఏమోగానీ, నా ఫైలు బయటపడింది.

స్టాంపు వేసి, పై సెక్షన్‌కి నా ఫైలు తీసుకెళ్తూ అటెండరు "అదేంటి మేడమ్, యెకాయెకి వెళ్ళి సారుకి కంప్లయింట్ చేశారు. ఆయనసలే స్ట్రిక్ట్. తేడావస్తే చాలా కష్టం!" అంటూ మొత్తుకున్నాడు. చివరికి ‘టీ మామూలు’ కూడా తీసుకోకుండా ఫైలు తీసుకెళ్ళి, పైఫ్లోరులోని జోనల్ అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్‌కి చేర్చాడు.

ఒక్క క్షణం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత చాలాసార్లు పరిశీలించాను. పాత బజాజ్ స్కూటర్ మీద వచ్చే ఇన్వార్డ్ సెక్షన్ అధికారికి ఉన్న గౌరవం, మారుతికారులో వచ్చే జోనల్ అసిస్టెంట్ మేనేజర్‌కు ఉండేది కాదు. అతడి అటెండరు కూడా అతడి మీద జోకులు వేయటమే కాదు, మంచినీళ్ళు టీ గట్రాలు సర్వ్ చేయమనప్పుడు కూడా, కొంత నిర్లక్ష్యమూ, అమర్యాదా కలగలిపి, సర్వ్ చేసేవాడు. అటెండరే కాదు, అతడి మహిళా పీఏ, టైపిస్టులు కూడా... అతణ్ణి గురించి అమర్యాదగా, అసహ్యించు కుంటూ మాట్లాడటం నాకు తెలుసు.

‘బహుశః "అవన్నీ పట్టించుకుంటే సంపాదించు కోలేం" అనుకుంటాడేమో, సదరు మానవుడు!’ అనుకునేదాన్ని!

ఇలా బ్యాంకులూ, ఎస్.ఎఫ్.సీ, రెవిన్యూ డిపార్డ్‌మెంట్లే కాదు, అప్పట్లో ఏపీఎస్‌ఇబీ పేరుతో ఉండిన విద్యుత్ శాఖ పని తీరు కూడా మరింత ఘోరంగా ఉండేది. వాళ్ళ వేధింపు, దోపిడి మరింత భయంకరం! లాలూచీ పడితే దొంగ కరెంట్ వాడుకోనిస్తారు. కానీ దాదాపు ప్రభుత్వాన్ని ఎంత మోసం చెయ్యవచ్చో... అందులో సగం వాళ్ళు గుంజుతుంటారు.

అది ఫ్యాక్టరీల విషయంలోనే కాదు, గృహవసరాల విషయంలోనూ ఇంతే అవినీతి, అక్రమాలు! అప్పుడే కాదు, ఇప్పుడు కూడా! ట్రాన్స్‌కో లో లైన్‌మెన్, హెల్పర్ స్థాయి వాళ్ళు కూడా, తమ పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణల్లో ఇంటెన్సివ్ కేర్‌ల్లో పెట్టి చదివించగలరు. అంటే సంవత్సరానికి దాదాపు ఒక్కరి చదువుకే లక్ష ఖర్చుపెట్టగలరన్న మాట. అప్పట్లో నలభై, యాభైవేల రూపాయలు ఖర్చయ్యేది.

ఇలాంటివన్నీ చూసి అప్పట్లో... అంటే 1992కు ముందర లేదా 1992 వరకూ, ఉద్యోగుల్లో 10% మంది మాత్రమే నిజాయితీ పరులుండి ఉంటారు అనుకునే దాన్ని! ఇప్పుడు చూస్తే 1% లేదా 2% మంది ఉంటారేమో అన్పిస్తుంది. లంచంగా పైసలు చెల్లించినా, పని నడవక పోవటం... మరింత పెరిగిపోయినట్లుంది. అంతగా అహంకారం, అరిషడ్వర్గాలు, అన్నివర్గాల(అధిక సంఖ్యలో) ఉద్యోగుల్లో, అధికారుల్లో పెరిగిపోయ్యాయి.

డబ్బుతో పాటు, అహం సంతృప్తి, ఇతరత్రా కోరికల సంతృప్తి కూడా తప్పనిసరి అవటం గురించి ఇటీవల చాలా విన్నాను. కాబట్టే - రాజకీయ నాయకుల దగ్గర నుండి... అధికార, ఉద్యోగ వర్గాల దాకా... డబ్బుతో పాటు, మందుపార్టీలు, మగువల పార్టీలు కూడా నడుస్తున్నాయి.

నైతికత మరింత దిగజారాక పరిణామం ఇదే అవుతుంది కదా! అప్పట్లోనే, అప్పటి సీఎం నేదురమల్లి జనార్దన రెడ్డి ఆఫీసులో ఇవి నేను దగ్గరగా పరిశీలించాను. ఇప్పటికి పరిస్థితి మరింత దిగజారిందో కూడా స్పష్టమే! అప్పట్లో ఆపాటి అవినీతిని చూసే "ఇలాగైతే భారతదేశం కుప్పకూలిపోతుంది" అనుకునేదాన్ని.

ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకు ఫిక్సింగు, ఇంటర్ పేపర్ లీకు గట్రా అవినీతి చూసి అదురుకున్నాను. ఇప్పుడిక లక్షల కోట్లలో ఆక్రమాల మాట విన్నాక, గతంలోవన్నీ చాలా చిన్నగా కనబడుతున్నాయి. పెద్దగీత ముందు చిన్నగీత, చిన్నగా ఉండటం సహజమే కదా!

అయితే ఒక విషయం మాత్రం సుస్పష్టం! లంచగొండితనం, రెడ్‌టేపిజం వగైరా పదాలన్నీ... కేవలం పైకారణాలు మాత్రమే! మానవతా విలువల్ని నాశనం చేసేందుకు ప్రయోగిస్తున్న పైకారణాలు ఇవన్నీ! అదే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యూహాలు, కుట్రే ప్రధాన కారణం! [వ్యాపార వాణిజ్య రంగాలతో సహా అన్నిరంగాలలో... టాపర్ల అధిపత్యానికి, మోనోపలీకి తొడుక్కుంటున్న పైదుస్తులు ఈ అవినీతి తొడుగులు.]

ఎందుకంటే... లోతుగా పరిశీలించి చూస్తే... చివరికి అవినీతితో కొంత వరకూ రాజీపడి... తమ వ్యాపార, ఉద్యోగ, ఇతర స్వంత అవసరాల నిమిత్తం ఎవరైనా లంచంగా డబ్బు ఇచ్చేందుకు సిద్దపడినా... వాళ్ళు పొందే సఫలత తక్కువగా ఉండటం, ఎక్చేంజ్ ఆఫర్‌గా డబ్బుతోపాటు ‘మందూ విందూ పొందూ’ అమర్చేందుకు సిద్దపడిన వాళ్ళే ఎక్కువగా సఫలీకృతులవ్వటం యదార్ధమై గోచరిస్తుంది.

ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. భారతీయత మీద కుట్రని అర్ధం చేసుకోవటానికి ఇది చాలనుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే - ఇది భారతీయుల మీద, భారతీయతల మీదే కాదు, మానవజాతి మీద, మానవీయత మీద కుట్ర! ఎందుకంటే - దాదాపు 3 1/2 శతాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న ఈ కుట్రదారులు i.e. నకిలీ కణిక అనువంశీయుల మూలాలు, అక్కడి నుండే ప్రారంభమయ్యాయి గనక!

నిశితంగా పరిశీలించి చూస్తే, నకిలీ కణిక అనువంశీయులకి ‘మంచి, సత్యం, ధర్మం’ - ఇలాంటి వంటే వెగటు. అత్మాభిమానం అంటే అమిత అసహ్యం. లజ్జాహీనత పట్ల వాళ్ళకి తగని ప్రీతి. లజ్జాహీనతని పాజిటివ్ లక్షణంగా ప్రచారించేంత ప్రీతి!

ఇక్కడ మీకో చిన్న కథ వివరిస్తాను.

సముద్ర తీరంలో ఉన్న ఒక మత్సకారుల పల్లెలో... మగవాళ్ళు సముద్రం మీదకి చేపల వేటకి వెళ్తే, వాళ్ళు తెచ్చిన చేపల్ని మహిళలు ప్రక్కనే ఉన్న పట్నంలో అమ్ముకొచ్చే వాళ్ళు.

ఓ రోజు... పల్లె నుండి పదిమంది మహిళలు చేపలు బుట్టల్లో పెట్టుకుని ఎప్పట్లానే పట్నం వెళ్ళారు. చేపలమ్ముకొని తిరిగి వస్తుండగా జోరు వాన పట్టుకుంది. వర్షం, చీకటి! పల్లె చేరటం కష్టమనిపించింది. అప్పటికి వాళ్ళు పట్నం శివార్లు చేరారు.

‘ఏం చేద్దామా?’ అని చుట్టూ చూసేసరికి... ప్రక్కనే పూల వ్యాపారి ఇల్లు కనిపించింది. తలుపు తట్టి ఆ రాత్రికి ఆశ్రయం అడిగారు. పూల వ్యాపారి, వాళ్ల చేపల బుట్టలు వసారాలో పెట్టుకుని, పూల గంపలుంచిన గదిలో నిద్రపొమ్మన్నాడు.

అది పెద్దగదే! కాకపోతే... గదంతా మల్లె, చేమంతి, జాజూలూ గులాబీల గంపలతో నిండి ఉంది. వాటి మధ్య జాగా చేసుకుని, మత్సకారుల మహిళలు నిద్రకుపక్రమించారు. గదంతా పూల పరిమళం మత్తెక్కిస్తోంది. మరెవరైనా అయితే పరవశించి పోయేవాళ్ళు.

పాపం! ఈ చేపల వాళ్ళకి మాత్రం నిద్రపట్టటం లేదు. అటూ ఇటూ పొసిగారు. చివరికి లేచి, తమ చేపల గంపలు తెచ్చుకుని, ముఖం మీద బోర్లించుకున్నారు. క్షణంలో గురకలు పెట్టేంత నిద్రలోకి జారుకున్నారు. అది వాళ్ళ జీవనశైలి, వాళ్ళ దృక్పధం.

సుగంధాలు విరజిమ్మే పూలు వాళ్ళకి వెగటు కలిగించాయి. తమకి అలవాటైన చేపల వాసనే వాళ్ళకి సౌకర్యవంతంగా కన్పించింది.

నకిలీ కణిక అనువంశీయులదీ అదే పరిస్థితి! వేశ్వావంశ సంజాతులైనందున... స్త్రీ గౌరవంగా బ్రతకటం వాళ్ళకి ఇచ్చగించదు. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, ఈనాడు రామోజీరావు అత్యంత కీలకమైన వ్యక్తి మరి!

మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. గత వారంలో మాజీ సినీనటి అమల జన్మదినం ఉండింది. ఆ సందర్భంగా ఈటీవీలో, అమల నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రం ప్రసారం చేయబడుతుందని ఈనాడు వ్రాసింది. సదరు నటి, వివాహానికి పూర్వం, మరో నటుడు చిరంజీవితో నటించిన సినిమా అది! ఏదో... ఆమె పెళ్ళిచేసుకుని, సినిమాలు వదిలేసి, సంసారపక్షంగా హాయిగా ఉంది. ‘బ్లూ క్రాస్’ అంటూ జంతువులకి వైద్యం గట్రా చేయిస్తూ, తనకు చేతనైనట్లుగా మంచిపనులు చేసే ప్రయత్నం చేస్తోంది.

ఎంత ఆమె పుట్టిన రోజుకైనా, సినిమా వెయ్యదలుచుకుంటే, అమల తన భర్త నాగార్జునతో నటించిన ‘నిర్ణయం’, ‘శివ’... మరొకటో వేయవచ్చు కదా! ఉహు! కుదరదు. గౌరవంగా బ్రతకాలనుకున్నా సరే, స్త్రీని అలా వదిలేయటం నకిలీ కణిక అనువంశీయులకి సుతరామూ గిట్టదు.

కాబట్టే... రాముడు తప్ప మరో పురుషుణ్ణి యెరగని సీతన్నా, సీత తప్ప మరో స్త్రీ తెలియని రాముడన్నా, మొత్తంగా రామాయణం అన్నా... నకిలీ కణికులకి విషవృక్ష ప్రచారమంత విద్వేషం! కాబట్టే - భారతీయుల జీవితం నుండి రామాయణంను విడదీయటానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇక మళ్ళీ, ఆర్దిక వాణిజ్య రంగాల ద్వారా భారతీయత మీద కుట్ర విషయానికి వస్తే...

ఇప్పటి స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ద్రవ్యోల్పణపు లెక్కలు పరిశీలిస్తే, ఎన్నో విచిత్ర తర్క వితర్కాలు, గజిబిజి గందరగోళాలు, కార్యకారణ సంబంధాల పట్ల సామాన్యులకే కాదు చదువుకున్న వాళ్ళకి కూడా అర్ధం కానంత మాయా మర్మాలూ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మాయాజాలం గురించి మరోసారి మాట్లాడుకుందాం!

ద్రవ్యోల్పణపు రేటు చూస్తే... ఇదెంత బూటకమో ఒక పట్టాన అర్ధం కాదు. కొన్ని వస్తువుల ధరవరల్లో మార్పుని అనుసరించి ద్రవ్యోల్బణపు రేటుని లెక్కగడతారు. కాబట్టే - ద్రవ్యోల్పణపు రేటుతో నిమిత్తం లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉంటాయి. గతంలో, లెక్కలో ఈ మతలబుల గురించి ఏమాత్రం బయటికి రానిచ్చేవాళ్ళు కాదు.

ద్రవ్యోల్పణం తగ్గితే ధరలు తగ్గుతాయనీ, పెరిగితే, పెరుగుతాయనీ మీడియా ప్రచారించేది. ఇటీవల కాలంలో అలాంటి ఆర్దిక సిద్ధాంతాలలోని లొసుగులు బయటపడ్డాయి. వాటిని ఆర్దిక మంత్రులు ఒప్పుకోవటం జరిగింది.

మన ఆర్దికవేత మన్మోహన్ సింగ్ సీటెక్కాకే దాని లీలలు మరింతగా బయటపడుతూ వచ్చాయి. ఏవో కొన్ని వస్తువుల ధరలని మాత్రమే పరిగణలోకి తీసుకున్నప్పుడు, ద్రవ్యోల్పణంతో నిమిత్తం లేకుండా నిత్యవసరాల ధరలు పెరగటం లేదా తరగటం (తరగటం కలలోని మాటనుకొండి!) సహజమే కదా?

ఇటీవల, మరికొన్ని వస్తువులని కూడా ద్రవ్యోల్పణ లెక్కింపు జాబితాలోకి చేర్చారు. ఇక మన్మోహన్ సింగ్ గారి+వారి మంత్రవర్గ బృందపు వారి లెక్కలన్నీ, కంతలమయమేనన్నట్లు... క్రితం సంవత్సరంలో "నెగిటివ్ ద్రవ్యోల్పణంలోకి దేశం ఆర్దిక వ్యవస్థ వెళ్ళనుంది. వెళ్తే ప్రజలకేం నష్టం లేదు, ఇంకా లాభమే. ధరలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగమే దెబ్బతింటుంది." అంటూ సెలవిచ్చాడు, మన ఒబామా గురువు మన్మోహన్ సింగ్!

ద్రవ్యోల్బణం సున్నాకి చేరింది, ఋణాత్మకమూ అయ్యింది. ఎప్పటిలాగే ప్రజలే డప్పయి పోయారు. ధరలు పెరిగి దిమ్మదిరిగింది. యధావిధిగా పారిశ్రామిక వేత్తలు బాగానే ఉన్నారు. కులాసాగా మరికొన్ని రంగాలలోకి ప్రవేశాన్ని ప్రకటించారు. చివరికి గిరిజనులు సేకరించి అమ్ముకునే ‘వట్టివేళ్ళు, సుగంధ వేళ్ళు’ లాంటి వాటిని వదలనంత విస్తరణ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

రేపు (సెప్టెంబరు 25వ తేదీ) ఉండ్రాళ్ళ తద్దె! చిన్నప్పుడు ఈ పండుగ కోసం ఎంత ఎదురు చూసే వాళ్ళమో!

ఎందుకంటే....

ముందురోజే అమ్మ, మా అక్కచెల్లెళ్ళందరికీ గోరింటాకు పెట్టేది. పండుగ రోజు తెల్లవారు ఝామునే మమ్మల్ని లేపి తలంటి స్నానం చేయించేది. అప్పటికే తాను ఇల్లు శుభ్రంచేసి వంట చేసేది. కొంచెం పెద్దయ్యాక మేమూ సాయం చేసేవాళ్ళం. తర్వాత సూర్యోదయం అయ్యేలోపునే విస్తరి వేసి అన్నం పెట్టేది.

గోంగూర పప్పు తప్పనిసరి. ఎందుకో తెలీదు. అడిగితే ఆచారమంది. గోంగూర పప్పుతో బాటు వేపుడు కూర, ఆవకాయ, వడియాలు, గడ్డపెరుగు! విస్తట్లో తినటం మహామజాగా ఉండేది. చింపేసుకుంటారు అంటూ పిల్లలకు ఎక్కువగా కంచాల్లోనే అన్నం వడ్డేంచేవాళ్ళు. పెళ్ళిళ్ళలో విస్తరి భోజనం అంతా హడావుడే!

అంచేత తీరిగ్గా విస్తట్లో భోజనం మరీ నచ్చేది. ఆపైన అమ్మ, మా అందరికీ తాంబూలం ఇచ్చేది. నాకు ఎర్రగా పండిందంటే నాకు పండిందంటూ వాదులాడుకుంటూ ఆనందించేవాళ్ళం. అందునా పిల్లలకి తమలపాకులు తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. "నాలుక మందపడి పోతుంది, చదువు రాదు, ఆకులు వక్కా చిన్నపిల్లలు వేసుకోకూడదు" అనేవాళ్ళు.

ఎప్పుడన్నా... ఆజీర్తితో ఏ కడుపు నొప్పో వచ్చినప్పుడు తప్ప, తమల పాకులు పిల్లల కివ్వరు. దాంతో ఉండ్రాళ్ళ తద్దె రోజున అవన్నీ స్పెషల్ అన్నమాట.

ఇక అప్పటి నుండి సాయంత్రం చంద్రోదయమయ్యే వరకూ పచ్చిగంగ ముట్టకూడదు అనేది అమ్మ. తస్సాచెక్కా! సరిగ్గా ఆ రోజే చీటికి మాటికి దాహం వేసేది. మామూలుగా ఆటల్లో, చదువుల్లో పడితే, మంచినీళ్ళు తాగటం కూడా మరిచిపోయే వాళ్ళం. ఆ రోజు మాత్రం ఒకటే దాహమేస్తుంది. వంటింటి చుట్టే తిరిగే వాళ్ళం. అమ్మ కాళ్ళిరగ్గొడతాననేది.

వద్దని చెప్పే వాళ్ళెవరూ లేకపోతే టాంసాయర్‌కి ఈత కూడా బోరు కొడుతుంది కదా! బహుశః అలాంటి టాంసాయర్... ప్రతి మనిషిలోనూ కొంచెంగానో, ఎక్కువగానో ఉంటాడనుకుంటా!

సరే... ఎట్లాగో సాయంత్రం దాకా గడిపేస్తే, చంద్రోదయమయ్యాక అమ్మ మమ్మల్నందర్నీ పూజకి కూర్చోబెట్టేది. పసుపుతో గౌరీదేవి బొమ్మ చేసి, తమలపాకులో పెట్టి పూజ చేయించేది. గారెలు, బూరెలు, కుడుములు, ఉండ్రాళ్ళు చేసేది. ఉండ్రాళ్ళ పిండితో గురుగులు చేసి ఆవిరిలో ఉడికించేది. అందులో ఆవునెయ్యి వేసి దీపాలు వెలిగించేది.

ఓ ప్రక్క అప్పాల వాసన నోరూరిస్తుంటే పూజమీద మనస్సు నిలిచేది కాదు. వ్రతం (అంటే పూజ) అయిపోయి, చేతికి పసుపు దారంతో కంకణం కట్టుకునే వరకూ ఆగక తప్పదు. పూజ చివరిలో... అమ్మ, ఒక్కొక్కరికి ఒక్కో వెలుగుతున్న దీపం ఇచ్చి, దీపం ఊది ఆర్పకుండా, నోట్లో బెట్టేసుకుని తినాలని ఆర్డరు వేసేది.

గురుగునిండా నేతితో తియ్యటి దీపం నోరూరించేది. తినాలంటే అంగిలి కాలుతోందని భయం వేసేది. అమ్మ చూడదులే అనుకొని నోటితో దీపం ఊది ఆర్పేసి నోట బెట్టుకున్నామో, వీపు పగలడం ఖాయం! కనీసం తిట్లయినా పడతాయి.

అందుకని దీపాన్ని కళ్ళకద్దుకున్నట్లుగా నటిస్తూ, ముక్కుదగ్గర పెట్టుకుని, ఊపిరి కది కొండెక్కుతుండగా, గుటుక్కున నోట్లో పెట్టేసుకునేవాళ్ళం.

ఆ తర్వాత మళ్ళీ విస్తట్లో భోజనం! ఇక అర్ధరాత్రి అయ్యే వరకూ వీధిలో ఆటలే ఆటలు! ఆ రోజు అధికారికంగా ఆటలకి అనుమతి వచ్చేసేది. తదియ వెన్నెలే అయినా, పౌర్ణమి తర్వాత కాబట్టి బాగానే ఉండేది. వెన్నెల్లో... వెన్నెల కుప్పలు, దాగుడుమూతలు, ఒప్పుల కుప్పలు... ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో! అన్నిట్లోకి వెన్నెల కుప్పులు నాకు బాగా ఇష్టంగా ఉండేది.

పంటలేసుకుని, దొంగ అయిన వాళ్ళ దోసిట్లో ఇసుకపోసి, ఓ పుల్ల గుచ్చేవాళ్ళం! ఆ తర్వాత ఒకరు (వీళ్ళని తల్లి అంటారు.)దొంగ కళ్ళు మూసి, నడిపించేవాళ్ళు. ముందు హద్దులు నిర్ణయించబడిన వీధిలోనే నడిపించాలి. అయితే వంకర టింకరగా నడిపిస్తూ, ఎటు తీసుకెళ్తున్నారో అర్ధం కానిచ్చే వాళ్ళు కాదు. అడ్డదిడ్డంగా తిప్పి, ఎక్కడో ఓచోట, ఇసుక కుప్పగా పారబోయించేవాళ్ళు.

మళ్ళీ తిప్పితిప్పి, ముందటి చోటుకి తెచ్చి వదిలేస్తారు. మనం, మనకుప్ప ఎక్కడ పారబోయించారో వెదికి పట్టుకుని, ఆ పుల్లని తెచ్చి చూపాలన్న మాట. ఇదీ ఆట! పుల్లతెస్తే మరోసారి పంటలేసి మరో దొంగని ఎన్నుకుంటారు. లేకపోతే మళ్ళీ మనమే దొంగ!

ఎవరి పుల్ల వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుండేటట్లు... ఒక్కొక్కరు ఒక్కో రకంవి తెచ్చేవాళ్ళం. కొబ్బరి చీపురుపుల్ల, కుంచె చీపురు పుల్ల, ఐస్‌క్రీం పుల్ల, అగ్గిపుల్ల... ఇలా! ఒక్కోసారి, మన పుల్లలకి మనకిష్టమైన రంగుదారాన్ని ఓ ప్రక్క చుట్టుకోవచ్చు.

ఈ ఆటలో గెలవటానికి, చిన్న చిన్న ట్రిక్కులు పాటించేవాళ్ళం. ‘ఎవరింటి ప్రహరి దగ్గర సన్నజాజి చెట్టుంది?, ఎక్కడ ఏ వాసనలొస్తాయి?’ అని. అది ఆటలో తల్లికీ తెలుసు కాబట్టి, అలా వాసనలేవీ రాని చోటికి తీసికెళ్ళి, ఇసుక పారబోయించేది. దారిలో ఎగుడుదిగుళ్ళు గుర్తు పెట్టుకోవటం ఒకోసారి గెలుపునిచ్చేది.

ఏమైనా... ఆటలో తల్లి, మనల్ని గజిబిజిగా తిప్పేయటంతో, కళ్ళు మూసుకుని కూడా... స్థలాన్ని అంచనా వేయటానికి నానా తంటాలు పడే వాళ్ళం. మన దోస్తులు మనకి సాయం చేయటానికి కళ్ళతో సైగలు చేయటం, ఆ పరిసరాల్లో వెదుకుతున్నప్పుడు ముక్కూమూతీ గీరుకుంటూ సంకేతాలివ్వటం చేసేవాళ్ళు. (ఇవన్నీ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ భాషలాగా చెప్పి పెట్టుకునే వాళ్ళం లెండి.)

ఒకోసారి, మనకి దోస్తుల్లాగా సైగలు చేస్తున్నట్లు నటిస్తూ, మన ప్రత్యర్ధి (అంటే ఆటలో తల్లి)కి సాయం చేసేవాళ్ళు. అంటే మనల్ని తప్పు దారి పట్టించడం అన్నమాట. ఆ మీదట మన స్నేహితులతో సమీకరణాలన్నీ మారిపోయేవి.

మరువారంలో కొత్తకొత్త దెబ్బలాటలు పుట్టుకొచ్చేవి. మళ్ళీ మామూలుగానే చల్లారేవి లెండి. ముక్కుల గిల్లి ఆటలో కూడా ఇంతే! మన ముక్కు గిల్లటానికి వచ్చేవాళ్ల కాలి పట్టీల చప్పుడు గుర్తించటం, ఎవరు ఏ పౌడరు వేసుకున్నారో దాని పరిమళం గుర్తు పట్టటం, తల్లో పువ్వుల వాసనని గుర్తు పెట్టుకోవటం గట్రా చిట్కాలతో ఆటల్లో గెలిచేవాళ్ళం.

హోరాహోరీ గెలుపుకోసం తంటాలు పడేవాళ్ళం. అర్ధరాత్రి దాకా హాయిగా ఆడుకునే వాళ్ళం. ఆ రోజు అమ్మానాన్న ఎవ్వరు ఏమీ అనరు. మామూలు రోజుల్లో అయితే... "ఇక చాలు ఆటలు వచ్చి పండుకోండి!" అని ఆర్డరు వేసేస్తారు కదా!

ఇన్ని ప్రత్యేకతలున్న ఉండ్రాళ్ళ తద్దె మజా వచ్చే పండుగే కాదా మరి!? మరునాడు గౌరీదేవి (పసుపు ముద్ద)ని తులసి మొక్క దగ్గర ఉంచి, నీళ్ళు పోసి కరిగించేయటంతో పండుగ వ్రతం పూర్తవుతుంది.

ఇంతకీ ఎందుకీ వ్రతం అంటే అమ్మ చెప్పిన జవాబు "మనసెరిగిన మంచివాడు భర్తగా రావాలని పెళ్ళికాని ఆడపిల్లలు, భర్త శ్రేయస్సు కోరుతూ పెళ్ళయిన వాళ్ళు, ఈ నోము నోచుకుంటారు" అని చెప్పింది. ఈ పండుగ నమ్మకం నా విషయంలో అయితే నిజమే అయ్యింది మరి! :)

ఇలాంటి పండుగల నేపధ్యాన్ని ‘ఆడవాళ్ళని వంటింటికి పరిమితం చెయ్యటం’ అనే స్త్రీవాదుల సిద్ధాంతాలతో గాకుండా, జీవితపు వైవిధ్యం దృష్టితో చూస్తే, మేం చాలా ఆనందించాం. ఇప్పుడు మా అమ్మాయికీ ఈ సాంప్రదాయన్నంతా అందిస్తున్నాననుకొండి. కాకపోతే వెన్నెల కుప్పల ఆటలు మాత్రం లేవు. వీధిలోని దోస్తులెవరూ రాదు కదా! మేమే కాసేపు బయట వెన్నెలని ఆనందించి ఊరుకుంటాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మొన్నెప్పుడో హోంగార్డులు తమ హక్కుల సాధనకై ఆందోళన చేస్తూ సెక్రటేరియట్‌కు వెళ్ళారు. పోలీసులు వాళ్ళని చితకబాదారు. ఎన్నోసార్లు, తమలాగే అంగన్ వాడీ టీచర్లు, నిరుద్యోగులూ, విద్యార్దులూ... ఇతర వర్గాలు, తమ తమ డిమాండ్లకై ఆందోళనలు చేస్తున్నప్పుడూ, పోలీసులతో కలిసి హోంగార్డులు, ఆ ఆందోళన కారులని చితకబాదారు.

అదే హోంగార్డులని, అదే పోలీసులు ఇప్పుడు ఉతికి పారేసారు. మర్నాడు మామూలుగా పోలీస్ స్టేషన్లకి డ్యూటికీ పోక తప్పదు హోంగార్డులకైనా, పోలీసుల కైనా! అలా కలుసుకున్నప్పుడు, లాఠీగాయాలని చూపిస్తూ... హోంగార్డులు ఏడుపు గొంతుతో "ఏంటిసార్! హోంగార్డులమని కూడా చూడకుండా ఇలా విరక్కొట్టారు?" అంటారు. అనేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ, ఆక్రోశం, నిస్సహాయత ఉంటాయి. వాటిని కప్పెస్తూ కన్నీటి పొర కరుగుతుంటుంది.

సానుభూతిగా భుజం తడుతూ పోలీసులు "ఏం చెయ్యమర్రా! మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? పైనుండి ఆర్డర్లు! డ్యూటీ తప్పదు కదా! రేపొక వేళ మేమెందుకైనా మీలాగే ఆందోళనకి దిగితే, మా స్థానంలో మీరుంటే... పై బాస్‌లు మీకు ఆర్డరిస్తే, మీరూ మమ్మల్ని ఇలాగే చితక బాదేస్తారు. ఏం చేస్తాం భాయ్! అదంతా మనస్సులో పెట్టుకోకు" అంటారు. అనేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ, జాలి ఉంటాయి.

అవును! పైబాసుల ఆర్డర్! డ్యూటీ!

డ్యూటీ అనే మాటకి ‘విధ్యుక్త కర్తవ్యం’ అనే సమానార్ధకం ఉంది.

విధ్యుక్త కర్తవ్యం అంటే ‘తాను చెయ్యవలసిన పని, తన ధర్మం’ అంటుంది సనాతన సంస్కృతి.

అయితే ఇక్కడ, డ్యూటీ అలియాస్ విధ్యుక్త కర్తవ్యం, ఎంత విపర్యాయార్ధంలో ఉపయోగింపబడుతోంది చూడండి.

తనదైన కర్తవ్య నిర్వహణ కోసం, సర్వాన్ని త్వజించటం... స్వయంగా ఆచరించి చూపారు పురాణ పురుషులు, చారిత్రక పురుషులు.

అలాంటి చోట, పోలీసులు Vs హోంగార్డుల వ్యవహారంలో డ్యూటీ అంటే... కేవలం పై బాసుల ఆజ్ఞలు పాటించమే అయిపోయింది.

పై బాసుల ఆజ్ఞల ప్రకారం...

ఆందోళన చేపట్టిన ఇతరులని పోలీసులతో కలిసి హోంగార్డులు కొడతారు.

ఆందోళన చేపడితే, హోంగార్డులని పోలీసులు కొడతారు.

అదే ఆందోళనని పోలీసులు చేపడితే, కొండకచో హూంగార్డులూ కొడతారు.

వ్యక్తుల మధ్యగానీ, వర్గాల మధ్యగానీ ‘విభజించు పాలించటం’కి ఇదో మచ్చు తునక!

అంతా ‘పై బాసు/బాసిని’ ల గొప్పదనం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ పోలికతో నా విశ్లేషణని ప్రారంభిస్తాను.

ఒక తరగతి గదిలో విద్యార్ధులు, రెండు జట్లుగా విడిపోయి, గోలగోలగా తిట్టుకుంటున్నారు. ‘నువ్వెంతంటే నువ్వెంత?’ అనుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. అందులో ఓ జట్టు... టీచర్‌నీ తమ గొడవలోకి లాగింది. ‘ఎదురు జట్టు లీడర్ ని చితక బాదుతానని’ టీచర్ తనకు చెప్పిందంటే, తనకు చెప్పిందనీ... ఈ జట్టులోని కొందరంటున్నారు. సాక్షాత్తూ టీచరే ‘తనకి చెప్పిందంటే తనకి చెప్పిందని’ మరికొందరంటున్నారు. అదేం లేదనీ, టీచర్ తమకే సపోర్ట్ అనీ రెండో జట్టు అంటున్నది.

ఏతావాతా.... తరగతి గది కాస్తా, చేపల మార్కెట్టయి కూర్చుంది.

అప్పుడు ఏం జరుగుతుంది?

టీచర్ గనక నికార్సైనదీ, నిజాయితీ గలదీ అయితే....

రెండు జట్లనీ దండించి, (అవసరమైతే నాలుగు పీకైనా సరే) తరగతి మొత్తాన్ని క్రమశిక్షణలో పెడుతుంది. ఎవరిది తప్పో, ఎంత తప్పో, ఎవరిది ఒప్పో విచారించి, మొత్తం గొడవనీ పరిష్కరిస్తుంది. అంతేనా!? తననీ వివాదంలోకి లాగినందుకు, వాళ్ళని ప్రత్యేకంగా విచారించి, మొత్తం విషయాన్ని స్పష్టపరుస్తుంది.

అలాగ్గాక... ఒకవేళ టీచర్‌కి గనుక, ఆ గొడవలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, ప్రమేయాలూ ఉంటే...?

అప్పుడేం జరుగుతుంది?

టీచర్ చూస్తూ కూర్చుంటుంది. అవసరమైనప్పుడు, అవసరమైన వాళ్ళని... లోతట్టునో, బాహాటంగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తుంది.

ఈ పోలికని మన రాష్ట్ర కాంగ్రెస్‌‍కి అన్వయిస్తే.... సీనియర్లు, తెలంగాణా కాంగ్రెస్ వాదుల్లో కొందరు, వై.యస్. వ్యతిరేకులు గట్రా... అంతా కలిసి ఒక జట్టు, జగన్ వర్గం రెండో జట్టు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా... టీచర్ స్థానంలో ఉండి, ఏం చేస్తోంది? మొదటి తరహా టీచర్ అయి ఉంటే, నిజాయితీగా, ఈపాటికి తరగతిని(అంటే రాష్ట్ర కాంగ్రెస్ ని) క్రమశిక్షణలో పెట్టేది. రాష్ట్రంలో పార్టీ పలచన అవకుండా ఉండటం కోసమైనా చేసుండేది! అలాంటిదేం జరగక పోగా, రెండో తరహా టీచర్‌లాగే... తరగతిని చేపల మార్కెట్టులా ఎందుకు అనుమతిస్తోంది? అందునా అధిష్టానానికి అన్నీ తెలిసీ!

ఈ ప్రశ్నకి లోతుగా సమాధానం వెదకాల్సిందే!

జగన్ వ్యతిరేకులు.... ... మధు యాష్కీ, కాకా, వీ.హెచ్, కేకే, పురంధేశ్వరి, డీఎల్, జేసీ, సర్వేసత్యనారాయణ,... గట్రా నాయకులూ, నాయకురాండ్రు... ఒక్కొక్కరూ ఒకోసారి, హల్ చల్ (విడివిడిగా, గ్రూపులుగా) నిర్వహిస్తూనే ఉన్నారు.

"ఓదార్పు యాత్ర చేపట్ట వద్దని, అధినేత్రి సోనియా నాకు స్పష్టంగా చెప్పింది" అని ఒకరంటే...
"వై.యస్. డబ్బు సంపాదించుకుంటున్నాడని తెలిసినా ఊరుకున్నా! అతడు పార్టీకి చేసిన సేవలు చూసే రెండోసారీ ముఖ్యమంత్రిని చేశా"నన్నదని మరొకరన్నారని వార్తలు వచ్చాయి.

దాని మీదట జగన్ వర్గం నుండి బాజిరెడ్డిలు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అమరనాధ్ రెడ్డిలు, తరచుగా అంబటి రాంబాబులు, కొండా సురేఖలూ, మురళిలు "అధినేత్రి సోనియాని అంటారా?" అంటూ రెడ్ టేపిస్టిక్ ఒబీడియన్స్ చూపెట్టారు. డీఎల్ రవీంద్రారెడ్డి "దేవుడు విధించే ఏ శిక్షకైనా జగన్ అర్హుడే అని అధ్యక్షురాలన్నది" అంటూ ప్రెస్ మీటిచ్చాడని వార్తాపత్రికల కథనం. "ఆ విధంగా తెదేపా నేత చంద్రబాబు నాయుడికి అస్త్రాన్నిచ్చినట్లయ్యింది. అధ్యక్షురాలుకి స్వయంగా/బహిరంగ లేఖ రాస్తాం" అని జగన్ వర్గీయులన్నారు.

"పది జన్‌పథ్‌లో దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా, అని చెప్పుకునే సీనియర్ ఒకరు, బయటికొచ్చి ప్రెస్ ఎదుట, అవాకులూ చవాకులూ చెబుతున్నాడు" అంటూ మరొకరు విరుచుకు పడ్డారు.

ఇన్ని జరుగుతున్నా... అధ్యక్షురాలి ప్రమేయం గురించి డీఎల్, కేకే, పురంధేశ్వరి వంటి దాస దాసీలు, ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా... అధినేత్రి ఎందుకు కిమ్మనటం లేదు?

తరగతిలో టీచర్ గనక... గల్లంతు చేస్తున్న పిల్లల్ని ఉద్దేశించి "ఛస్! నోరు ముయ్యండి. బుద్ధిగా పనిచేసుకోండి" అని అందరికీ బుద్ధి గరిపినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీని ఎందుకు పద్దతిలో పెట్టుకోవటం లేదు?

మరోప్రక్క... బయ్యారం గనులని ఓ రోజు, సండూరు, సరస్వతి అని ఒకరోజు, ఎరువుల మిక్సర్ ప్లాంట్ అని ఒకరోజు, పదుల ఎకరాలలో విలాసవంతమైన నివాస భవనాలకి వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులంటూ ఒకరోజు... విపరీతంగా అక్రమార్జన చేసారు వై.యస్., అతడి కుమారుడు జగన్ అంటూ, అతడి శతృ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, రోజుకో సంచలనం బయటికి తీస్తున్నాయి. బదులుగా జగన్ పత్రికా, ఎదురు దాడి చేస్తోంది!

అసలింతకీ ఏం జరుగుతోంది?

ఓ సారి, గత ఏడాది ఇవే రోజులు గుర్తుకు తెచ్చుకుంటే....

వై.యస్. ఆకస్మిక మరణం తర్వాత, నానా మెలికలు తిరిగిన, జగన్ శిబిరం Vs అధిష్టానాల మధ్య అంతర్లీన పోరు కు.. పర్యవసానాలే ఇప్పటి పరిస్థితులు.

నాలుగు గోడల మధ్య... అధిష్టానం జగన్ కి దాసోహం అంటే, బహిరంగంగా... జగన్ అధిష్టానానికి మాటలలో నాటకీయ విధేయతని, చేతలలో ఓదార్పు యాత్ర పేరిట తతంగాన్ని సా....గ తీస్తూ అవిధేయతను చూపిస్తున్నాడు. దానినే తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంగా... అధిష్టానం... వై.యస్. వ్యతిరేక వర్గీయులని, హాల్‌చల్‌లకి ఉపయోగించుకుంటోంది.

ఎందుకంటే...

ఇక్కడ మరో పోలిక చెబుతాను.

ఇద్దరు ప్రత్యర్ధులున్నారనుకొండి. ఇద్దరూ హోరాహోరీగా, ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఇద్దరి దగ్గరా తుపాకులున్నాయి. అయితే మొదటి వాడి దగ్గర నాలుగైదు తూటాలే ఉంటే, రెండోవాడి దగ్గర నాలుగొందల తూటాలున్నాయి. అప్పుడు మొదటి వాడేం చేస్తాడు?

అవగాహనా, అనుభవం లేనివాడైతే... బండగా పోరాడి, ఉన్న నాలుగు గుళ్ళు కూడా ఖర్చుపెట్టుకుని, ఆనక తానూ ఖర్చయిపోతాడు.

అదే అనుభవమూ, అవగాహనా ఉన్నవాడైతే? రెండో వాడి దగ్గర తన కన్నా ఎక్కువ గుళ్ళే ఉన్నా, తనకున్నంత అనుభవమూ అవగాహనా లేవని తెలిసిన వాడైతే...?

అప్పుడు తాత్కాలికంగా ప్రత్యర్దితో సంధి చేసుకుంటాడు. (గత ఏడాది అక్టోబరు మాసాంతంలో అచ్చంగా అధిష్టానం జగన్ తో నాలుగ్గోడల మధ్య మాట్లాడుకున్నట్లు!) కొంత కాలం ఓపికగా ఎదురు చూస్తాడు. ఏదో నెపాన... ఎదుటి వాడి దగ్గరున్న తుపాకీ తూటాలు వృధా అయ్యే విధంగా, ప్రణాళికలు వేసి అమలు చేస్తాడు. ఎదుటి వాడి దగ్గర తూటాలు ఎంతగా తగ్గితే, తమకంతగా రక్షణ, ప్రయోజనం ఉంటాయి.

సరిగ్గా ఇదే... జగన్ కీ, సోనియా+రామోజీరావులకీ మధ్య జరుగుతోంది.

వై.యస్. పదవిలో ఉండగా, అపారంగా ఆస్థులు కూడబెట్టాడు. గూఢచర్యపు వ్యవహారాలు నడిపేందుకు తగినంత అనుపానులు తెలుసుకుని, గారెల వంటా వండాడు. తమ అవసరాల కొద్దీ, తమ కారణాల రీత్యా కొంతా, తము దాన్ని మరో దృష్టితో చూసి కొంతా... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలు... దీన్నంతా నడవనిచ్చారు.

ఆ వ్యవహారం తాలూకూ గుట్టుమట్లు+ఆర్దిక లావాదేవీలు, ఇప్పుడు జగన్ చేతిలో గుళ్ళయి కూర్చున్నాయి. కాబట్టి - జగన్ దగ్గరున్న గుళ్ళు ఖర్చయ్యే వరకూ ఇది ఇలా సా...గుతుందన్న మాట!

తండ్రి సంపాదించిన లక్ష(?) కోట్లలో ఓదార్పు యాత్రకెంత ఖర్చవుతుంది? మృతుల ఒకో కుటుంబాన్ని తలా లక్షపెట్టి ఓదార్చినా... 600 మందికి 6 కోట్లు. యాత్రల నిర్వహణకి ఖర్చయిందన్నా తిప్పికొడితే పదుల కోట్లే! కానీ ఎంఎల్ఏలనీ, ఎంపీలనీ వెంట నిలబెట్టుకోవాలన్నా... బయటి కొస్తున్న సరస్వతి, భారతి ల వంటి కంతలు పూడ్చుకోవాలన్నా... గనుల మీదో, ప్రాజెక్టుల మీదో ఐటీ దాడులని నియంత్రించుకోవాలన్నా... డబ్బు ధారాపాతంగా ఖర్చుపెట్టక తప్పదు. అధికారం ఉంటే ఇవన్నీ ఆదా అవుతాయి + అదనపు దోపిడీ చేసుకోవచ్చు!

ఎవరికైనా అది "నీవు నేర్పిన విద్యయే గదా నీరాజాక్ష" వంటిదే మరి!


ఈ గూఢచర్య క్రీడ ఎంత జటిలమైనదంటే... ఇందులో అవగాహన, అనుభవం ఉన్నవాడు... రెండోవాడు తన మీద జరుగుతున్న వ్యవహారంలో తనకి నష్టమేమిటో గ్రహించే లోగానే.... పరిస్థితిని తనకి అనుకూలంగా చక్కపెట్టేసుకుంటాడు.

అదే స్థితి అధిష్టానానిదీ, జగన్‌దీ!

కాకపోతే జగన్‌కి తండ్రి ఇచ్చిపోయిన అపార సంపదలో, వేల కోట్లలో... ప్రస్తుతం ఖర్చువుతున్న పదులు లేదా వందల కోట్లు ఎంత? ఇప్పుడు పెడుతున్న ఖర్చు పెద్దగా కంటికి ఆనక పోతుండవచ్చుగాక....!

అయితే, ఇది ఇలాగే కొనసా...గితే, ఏదో ఒక నాటికి భారం కాక తప్పదు.

ఈ లోపున అధిష్టానానికి మాత్రం... వై.యస్. వర్ధంతికి పార్టీ తరుపున లక్ష రూపాయలిచ్చి ఓదార్చ నున్నట్లుగా, మరికొన్ని మెట్లు క్రిందికి దిగి, బహిరంగంగా ‘వ్యక్తిగత ఇమేజ్‌కి డామేజ్ తెచ్చుకునే ప్రమాదం’ మరో ప్రక్క సిద్ధంగా ఉంది. కాకపోతే గ్రిప్ సంపాదించిన తరువాత మీడియా ఊదరతో అవన్నీ తుడిచేయొచ్చు అన్నది వాళ్ళ ధీమా!

ఇంతకీ జగన్ ఓదార్పు యాత్ర ఈటీవీ సీరియల్ లాగా సా...గుతోంది ఎందుకంటే......



ఓ ప్రక్క ఈ సాగుడు నడుస్తుండగా, మరో ప్రక్క... అసలు వై.యస్. ఏయే సాక్ష్యాలు సేకరించి పెట్టుకున్నాడు, తమ గుట్టుమట్ల గురించి ఏయే వివరాలు తీసి పెట్టుకున్నాడు, మొత్తంగా జగన్ దగ్గర ఉన్న తమ రహస్యాలు, వాటికి సంబంధించిన సమాచారాలు ఏమేమిటి? ఇవన్నీ కూపీల్లాగ బడతాయి.

అందుకే తడవకో వివాదం సృష్టించబడుతోంది. గతంలో, అంటే వై.యస్. బ్రతికి ఉన్నప్పుడు, బయటపెట్టిన అవకతవకలకే మరికొన్ని కొత్త వాటిని కలిపి... ఈనాడు, ఆంధ్రజ్యోతి (జగన్ భాషలో అయితే ఎల్లో పత్రికలు) వార్తలు వ్రాస్తున్నాయి.(ఆ విధంగా కాంగ్రెస్ అధిష్టానానికి చక్కగా సహకరిస్తున్నాయి. లేకపోతే మొత్తంగా కాంగ్రెస్‌నే దుయ్యబట్టి, పరిస్థితిని తెదేపాకు అనుకూలపరిచేవి.) దాన్నే ఉటంకిస్తూ సాక్షి "పాడిందే పాటరా పాచిపళ్ళ ఈనాడు.." అంటూ సెటైర్లు వేస్తోంది.

అయితే... పత్రికా యుద్ధం... తెలంగాణా సీనియర్లు+జూనియర్లు Vs. జగన్ వర్గం, ఇంకా వై.యస్.వ్యతిరేక కాంగ్రెస్ వర్గం Vs. జగన్ వర్గం, తెదేపా+ఈనాడు, ఆంధ్రజ్యోతి Vs. జగన్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం పేరిట నడుస్తున సాగుడులో... కొందరు జగన్‌కి ‘శ్రేయోభిలాషులం’ అంటూ... సానుభూతి+మిత్రవచనాలు పలుకుతూ సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తుంటారు.

మరి కొందరు అతణ్ణి రెచ్చగొడుతూ ప్రకటనలిస్తారు. పత్రికలు యధాశక్తి ప్రచారం గావిస్తాయి. వాటి గురించి చర్చిస్తూ జగన్‌తో చర్చలు సాగిస్తారు కొందరు. దానా దీనా... ఆ ప్రయత్నాల ద్వారా అసలతడి దగ్గర ఉన్నదేమిటో తెలుసుకుంటే... ఆపైన తదనుగుణంగా, పరిస్థితులని తమకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అతడి దగ్గరున్న వాదనలకి ప్రతివాదనలు నిర్మించుకోవచ్చు.

సాగదీసి, కాలం గడిచిన తర్వాత కాబట్టి... ‘తండ్రి చనిపోయి, కెరీర్ కనబడక, నిరాశ చెంది, జగన్... ఫ్రస్టేషన్ కొద్దీ ఏవేవో బనాయిస్తున్నాడన’వచ్చు. అతడికి మతి స్థిమితం తప్పిందన్నా అనవచ్చు. మనిషిని ఎక్కువగా అసహనాన్ని గురి చేసేది ఈ మాటే. ఈ విధంగా పరిస్థితులని తమకి అనుకూలంగా మలుచుకోవచ్చు.

ఇదొక ప్రధాన ప్రయోజనం! మరో ప్రక్క... ఎటూ ‘ఖర్చులు పెంచటం, ఆదాయానికి గండి కొట్టటం’ వంటి వ్యూహాలతో జగన్ కోరలు పీకవచ్చు. (ఎటూ తండ్రి కట్టబెట్టిన అక్రమాస్తులతో వచ్చిన కోరలే కదా అవి?) కోరలు పీకిం తర్వాత పాముతో ఎన్ని ఆటలైనా ఆడించవచ్చు.

అందుకే... ఓదార్పు యాత్ర, అంతూ దరీ దొరకని ‘ఈటీవీ సీరియల్‌ ’ లాగా... అలా సాగిపోతూనే ఉంది!

ఇప్పుడు జగన్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని ఇలా సాగదీస్తూ అధిష్టానపు గుట్టు బయట పెట్టకుండానే, బయటపెడతానని బెదిరిస్తూ, తన కోర్కెలు నెరవేర్చుకోవటం లేదా అధిష్టానపు గుట్టు బయటపెట్టటం!

ఓసారి తెదేపా నేతలు ఆరోపించారు... "వై.యస్., గులాంనబీ ఆజాద్‌ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు, అతడికి అందమైన అమ్మాయిలని ఎరగా వేసి, పరిస్థితులని తనకి సానుకూలం చేసుకున్నాడు" అని! ఆ మధ్య, రాజ్‌భవన్‌లో రసిక క్రీడలు సవరించి వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయిన అప్పటి గవర్నర్, నారాయణ్‌దత్ తివారీ ఉదంతం రచ్చకెక్కింది. అదే మాదిరిగా... వై.యస్. ఎవరికి ఏ అవసరాలు(డబ్బు+గట్రా) తీర్చినప్పుడు, ఏ సాక్ష్యాలు సేకరించి ఉంచుకున్నాడో! అసలుకే ’సాక్షి’ అంటూ మీడియా సంస్థ పెట్టుకున్న, గారెల వంట మాస్టార్ మరి! అలాంటివి ఏవి బయట పెట్టినా... అది అధిష్టానానికి ప్రమాదమే.

అయితే... అది, అధిష్టానంతో పాటు, జగన్‌కూ ప్రమాదమే! ఎందుకంటే - అధిష్టానపు గుట్టు బయటపెట్టటం అంటే, అందులో తండ్రి నిర్వాకమూ ఉంది. కాబట్టి, అది ‘తండ్రి చేసింది చెప్పటం, తిన్నది కక్కటం’ అవుతుంది. కనుక, ఇది తక్షణ ప్రమాదం. ఇది ‘కన్ను’ పోగొట్టు కోవటం వంటిది.

లేదంటే... గండిపడిన చెఱువు లోంచి నీళ్ళు జారిపోయినట్లు, డబ్బు జారిపోతుంది. ఆనక అధిష్టానపు జుట్టు చేతిలో ఉన్నా, చెయ్యగలిగిందేమీ ఉండదు. ఇది దీర్ఘకాల ప్రమాదం. కనుక ఇది ‘కాలు’ పోగొట్టుకోవటం వంటిది. ఏదో ఒకటి కోల్పోక తప్పదు.

అదే విధంగా... అధిష్టానం ఎదుటా రెండు అవకాశాలున్నాయి. ఒకటి జగన్ మీద వేటు వేసేసి, ముఖాముఖి పోరుకి సిద్ధపడటం. అప్పుడతడు తమ గుట్లు బయట పెట్టక మానడు. అది ‘కన్ను’ పోగొట్టుకోవటం వంటిది.

లేదంటే... పరిస్థితిని సాగదీసి, క్రమంగా జగన్‌ని లొంగదీసుకోవటం లేదా నిర్వీర్యం చేయటం. ఈ లోపు తన వ్యక్తిగత ప్రతిష్ఠ మంట గలవటం, ఒకో మెట్టు క్రిందికి దిగి చులకన కావటం తప్పదు. ఇది ‘కాలు’ పోగొట్టుకోవటం వంటిది.

ఇద్దరిలో... ఎవరు, ఏ కాలు లేదా కన్ను ఎంచుకుంటారో... వేచి చూడాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇది ఓ కల్పిత కథ.

సమకాలీన రాజకీయాలని, సినీమాయలనీ పరిశీలించాక స్ఫురించిన వ్యంగ్య కథ!

ఇక కథలోకి!

దాదాపు అర్ధ శతాబ్దం క్రితం...

అప్పటికి ఉమ్మడి మదరాసు రాష్ట్రం పేరిట ఆంధ్రులు, తమిళులు కలిసే ఉన్నారు.

మెరీనా బీచ్... సాయంత్రం ఆరుగంటలు... నిరుద్యోగి ఆర్ముగం, మిత్రుడు షణ్ముగంతో కలిసి, బఠాణీలు తింటూ బాతాఖానీ కొడుతున్నాడు. ‘దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరిక లేదు’ అన్నట్లు తిని తిరుగుతున్నాడు - అంటూ, ఇంట్లో తల్లిదండ్రీ పెడుతున్న చీవాట్లు, భార్యామణి ఈసడింపులూ, తనలాగే నిరుద్యోగి అయిన మిత్రుడితో చెప్పుకొని నిట్టురుస్తున్నాడు.

వాళ్ళ పక్కనే...

ఓ బిచ్చగాడు... అప్పుడే వచ్చి, తోటి బిచ్చగాడి ప్రక్కనే బిచాణా పరిచాడు. అప్పటికే ప్రక్క బిచ్చగాడు పరిచిన చిల్లుల దుప్పటి మీద చిల్లర నాణాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

"అబ్బో! ఇయ్యాళ నా కంటే పెందరాడే వచ్చేసావే! ఇప్పటికే బాగా సంపాదించినట్టున్నావ్?" అన్నాడు రెండోవాడు మొదటి బిచ్చగాడితో!

"సంపాదనా, నా బొందా?" చిరాగ్గా అన్నాడు ముందొచ్చిన బిచ్చగాడు.

"మరి, నీ దుప్పటి మీద చాలా చిల్లరుందే?" ఆరా తీసాడు తర్వాతొచ్చిన వాడు.

"ఖాళీ దుప్పటి చూస్తే ఎవరూ బిచ్చం వేయర్రా? అందుకని, నేనే ఓ నాలుగు రూపాయల చిల్లర చిమ్మాను. అది చూస్తే... ‘అరే! చాలా మందే దానం చేసారు. మనమూ చెయ్యక పోతే ఏం బాగుంటుంది’ అని, దారినపోయే వాళ్ళు నాలుగు పావలా లేస్తారు" అన్నాడు మొదటి వాడు వ్యాపార రహస్యం చెబుతున్నట్లుగా!

"అవున్నిజమే! నేనూ గమనించాను. ఖాళీ దుప్పటి చూస్తే అందరూ అలాగే పోతారు. అదే దానిమీద నాలుగైదు నాణాలుంటే... వాళ్ళూ ఓ నాణెం వేస్తారు. అట్టాగే నలుగురు ఏదైనా ఓ చోట కొంటూ ఉంటే, అందరూ అక్కడికే ఎగబడతారు. ఎందుకట్లాగా?" అడిగాడు రెండోవాడు.

"అదంతేరా! మనుష్యులది అదో మూక మనస్తత్వం!" అన్నాడు మొదటి వాడు.

బఠాణీలు తినటం మానేసి, నోరు తెరుచుకుని ఇదంతా చూసాడు ఆర్ముగం!

అంతే!

"మనుష్యుల మాస్ మనస్తత్వం!" హిస్టీరియక్ గా అరిచాడు.

"ఏమిటి?" ఉలిక్కిపడి అడిగాడు షణ్ముగం.

"మనం ఇక ఉద్యోగాల కోసం వెతకొద్దు. మనమే కొత్త వ్యాపారం పెడదాం" ఉత్సాహంగా మిత్రుడితో చెప్పాడు ఆర్ముగం.

"వ్యాపారమా? పెట్టుబడేది?"

"పెట్టుబడి అక్కర్లేని వ్యాపారం. మనుష్యుల్లో మాస్ మనస్తత్వమే మన పెట్టుబడి"

"మాస్ మనస్తత్వమా? అదేమిటి?"

"మూక మనస్తత్వాన్నే మాస్ మనస్తత్వం అనొచ్చు. ఒకడేదైనా చేస్తే, పదిమందీ అదే చేయటమే మాస్ సైకాలజీ! చెబుతాగా అన్నీ! ఇక మన వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలే!" భరోసాగా చెప్పాడు ఆర్ముగం.

తర్వాత మిత్రులిద్దరూ చర్చించుకుని కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. దాని పేరు "ఈవెంట్ మానేజ్ మెంట్". మొదట్లో దీనికి రకరకాల పేర్లుండేవి. ‘ఎక్సట్రా ఆర్టిస్ట్ ల సప్లయర్స్’ వగైరాలన్న మాట.

ఇంతకీ ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళ వృత్తిలో కొన్ని సంఘటనలు పరికిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ఒక సంఘటన: స్థలం - మదరాసు టీ నగర్. సమయం - ఉదయం 11గంటలు.
సందర్భం: ప్రముఖ వ్యాపారి మరణించాడు, శవయాత్ర జరుగుతోంది.

వ్యాపారి ధనవంతుడు. కుటుంబసభ్యులు డబ్బుకు అలవాటు పడి ఖరీదుగా బ్రతుకు తున్నవాళ్ళు. తమ కుటుంబసభ్యుడు మరణించాడన్నా, కుమిలి కుమిలి ఏడవటం అంటే మరీ చీప్ గా అనిపించింది. అలాగని ఎవరూ ఏడవక పోతే, మరణించిన తమ వాడి పట్ల తమకు ప్రేమలేదనుకుంటారు చూసేవాళ్ళు. అప్పుడే వాళ్ళకి ఆర్ముగం-షణ్ముగం & కో. గురించి తెలిసింది.

వెంటనే ఈవెంట్ మానేజ్ మెంట్ కు కాంట్రాక్టు ఇచ్చేసారు.

ఆ ప్రకారం వాళ్ళ కంపెనీ నుండి... గుండెలు బాదుకు ఏడ్చేందుకు కొందరు ఆర్టిస్టులు ఏర్పాటు చేయబడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా.... సదరు ఆర్టిస్టులంతా చాలా సహజ వేషధారణలో వచ్చారు. సహజంగా గుండెలవిసి పోయేలా ఏడ్చారు. సహజ నటన, నిజంగానే పండింది.

వచ్చిన వాళ్ళంతా... ఎవరికి వాళ్ళే, ఈ ఏడుస్తున్న వాళ్ళని చూసి చలించి పోయారు. అప్రయత్నంగా వాళ్ళకీ కన్నీళ్ళు వచ్చాయి. కర్చిఫ్ లతో వొత్తుకున్నారు. మరణించిన వాళ్ళ ఆర్దిక స్థాయిని బట్టి, ఈ ఏడ్చేవాళ్ళ వేషభాషలుండటంతో అంతా సహజంగా ఉండేది.

తరాత్తర్వాత అలాంటి ఈవెంట్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి ఆర్ముగం-షణ్ముగం & కో.కి!

క్రమంగా దాన్లో స్పెషల్ ఫీచర్లు చేర్చారు. శవయాత్రకు మధ్యలో వచ్చి చేరి ‘ఏడ్చేవాళ్ళు.’ కారులో ఆగి, శవం మీద పడి ఏడ్చేవాళ్ళు! ‘తమకెన్నో సహాయాలు చేసాడే, అంతటి మహానుభావుడు పోయాడా’ అని ఆక్రోశించే వాళ్ళు!.... ఇలా!

కొన్నాళ్ళకి అది బహిరంగమై పోయింది. దాంతో విషయం పాతబడిపోయింది. ఈ లోపున ఈవెంట్ మానేజి మెంట్ ఆర్గనైజర్లు మరింత మంది పుట్టుకొచ్చారు.

పెళ్ళి పేరంటాలకీ ఆర్గనైజ్ చేయటం మొదలు పెట్టారు.

పెళ్ళిళ్ళలో... పెళ్ళి కూతుర్ని రాజకుమార్తెలా అలంకరించి, పై అంతస్థు నుండి క్రింది అంతస్తులోని పెళ్ళి మండపం దగ్గరికి, సౌండ్&లైట్ షోతో, నెమలిలా అలంకరించిన వాహనం (లిప్టులాంటిది) లో ఉంచి క్రిందికి దించటం లాంటి అద్భుతాలు జోడించారు. అమ్మాయి గురించీ, అబ్బాయి గురించీ, వాళ్ళ కుటుంబ గొప్పదనాల గురించి, అతిధుల మధ్యలో అతిధుల్లాగే కూర్చొని గొప్పలు ప్రచారించే ‘కళాకారులు’ కూడా ఏర్పాటు చేయబడ్డారు. ఇదంతా తెలియని వాళ్ళు నిజమేననుకున్నారు, తెలిసిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు.

ఈవెంట్ మానేజిమెంట్ మరికొంత విస్తరించింది.

పార్టీలు, శుభకార్యాలలో... ఎందరు అతిధులు వస్తారు, ఏయే మర్యాదలు చేయాలి, ఏయే పానీయాలు, తినుబండారాలు సమకూర్చాలి.... ఇలాంటి వాటితో బాటు, రాజకీయ కార్యక్రమాలు కూడా జాబితాలోకి చేరాయి.

ఇదెలా గంటే...

ఓ రాజకీయ నాయకుడు ర్యాలీనో, పాదయాత్రో, నిరాహార దీక్షో మొదలెడతాడు. అందులోకి మరికొన్ని ఆకర్షణలు ప్రవేశపెట్టబడతాయి.

ఉదాహరణకి...

ఓ ఈవెంట్ మానేజర్స్ దగ్గరికి ఓ రాజకీయ నాయకుడి చెంచా వచ్చాడు.

ఈవెంట్ మానేజ్ మెంట్ : చెప్పండి.

రా. చెంచా: వచ్చేనెలలో మా పార్టీ అధ్యక్షురాలు మా జిల్లాకొస్తుంది. మా అన్న (ఫలానా రాజకీయ నాయకుడు) ఆ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపించాలనుకుంటున్నాడు. అమ్మగారి దృష్టిలో పడాలి. అందునా రానున్న ఎలక్షన్లలో అన్నకి ఎం.పీ. టిక్కెట్టు, అన్న భార్యకి ఎం.ఎల్.ఏ. టిక్కెట్టు, బామ్మర్దికి మునిసిపాలిటీ ఛైర్మన్ టిక్కెట్టు కావాలి! అందుకని, ఎంత ఖర్చైనా ఫర్లేదు కనుక్కొని రమ్మన్నాడు!

ఈ. మానేజ్ మెంట్ : ఇలాంటి వాటికి మా దగ్గర చాలా రకాల ఆఫర్లున్నాయండి. ఎటొచ్చీ... దేనికైనా, జనాలని మీరే సమీకరించు కోవాలి. అయితే ఎన్ని వేలు లేదా లక్షలు మందిని సమీకరిస్తున్నారో చెబితే, అందుకు తగినంత నిష్పత్తిలో మేం ఆర్టిస్టులని సమకూరుస్తాం.

రా. చెంచా: ఆర్టిస్టులంటే....?

ఈ. మానేజ్ మెంట్: కౌగలించుకుని ఆశీర్వదించే అవ్వ వయస్సు ముసలి ఆర్టిస్టులనీ,
హారతిచ్చి ఆహ్వానించే అక్క వయస్సు మహిళా ఆర్టిస్టులనీ,
తల మీద చెయ్యివెయ్యటం, బుగ్గ చిదమటం లాంటివి చేసే పెద్ద తరహా ఫీమెల్ ఆర్టిస్టులనీ,
నడుం మీద చెయ్యేసి డాన్సు చెయ్యడానికి పిలిచి, కలిసి డాన్సు చేసే ఉత్సాహవంతుల్నీ...
మజ్జిగ తాగించి మూతి తుడిచే పెద్దమ్మలనీ,
నుదిట కుంకుమ దిద్దే చెల్లెమ్మలనీ,
జాంకాయలో, మామిడి కాయలో పట్టుకుని పరుగెత్తుకొచ్చే అన్నలనీ,
కాళ్ళ మీద పడి కోర్కెలు చెప్పుకునే తమ్ముళ్ళనీ...
పిల్లలకి పేర్లు పెట్టమనీ అడిగే ఆదర్శ జంటలనీ...
ఇలాగన్న మాట!
ఎటూ... ఇలాంటివి కొందరు చేస్తుండేసరికి, మూక మనస్తత్వం రీత్యా, మీరు పోగేసిన జనంలోంచి కూడా కొందరు, పూనకం వచ్చినట్లుగా... కౌగలించుకోవటం, హారతులివ్వటం, ఆశీస్సులు చెప్పటం, పళ్ళు తినిపించటం గట్రాలు చేసేస్తారు. అంతా సహజంగా వస్తుంది. ఇవిగాక సీజన్ బట్టి ఏర్పాట్లుంటాయి.

రా. చెంచా: సీజన్ ని బట్టా? అదేమిటి?

ఈ. మానేజ్ మెంట్: వేసవి కాలమైతే కాళ్ళుబొబ్బలెక్కించుకొని మీ నాయకుడిని/రాలిని చూడవచ్చేవాళ్ళు. ఎండలో కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, పడిపోయినా పట్టువదలక ప్రియతమ లీడర్ కోసం వేచి ఉండేవాళ్ళు.... ఇలా!
వానాకాలమైతే గొడుగులు పట్టేవాళ్ళు పడిశం పట్టి తుమ్ముతున్నా లెక్కచేయక ఏడ్చేవాళ్ళు... ఇలా!
చలికాలమైతే గజగజా వణుకుతూ వచ్చే ముసలి వాళ్ళు, పసిపిల్లలకి మఫ్లర్లు తొడిగి తెచ్చేవాళ్ళు... ఇలా!
ఏ కాలమైనా పూలు చల్లేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళు మామూలే! మీకు ఏయే ఏర్పాట్లు, ఎంతెంత రేంజ్ లో కావాలంటే - దాన్ని బట్టి మా ఫీజు ఉంటుంది.

రా. చెంచా: ఇంత తతంగం ఉంటుందా?

ఈ.మానేజ్ మెంట్: ఇంకా ఉంది! ఇవ్వాళ్ళా రేపూ ఎవరి మీడియా వాళ్ళదైపోయి, ఎవరి బాకాలు వాళ్ళూదు కుంటున్నారు. కాబట్టి జనాలు ఏదీ నమ్మకుండా పోతున్నారు. అంచేత, మీరు సమీకరించిన మందిలో చేరిపోయి, నమ్మకంగా, మీ నాయకుడు/రాలు ‘మాకింత మేలు చేశారంటే’, ‘మాకు తెలిసిన వాళ్ళకి మరింత మేలు చేశారంటూ’ ఓరల్ పబ్లిసిటి ఇస్తాం. కాకపోతే దానికీ ఖర్చవుతుంది. అన్ని ఏర్పాట్లూ కావాలంటే అందులో రాయితీ ఇస్తాం. ఇంతకీ ప్రెస్ కవరేజ్ ఏర్పాట్లు మీవా, మావా? దాన్ని బట్టి రేటు మారుతుంది. ప్రెస్ కవరేజ్ ఎంత ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంత ప్రచారం మీ నాయకుడికి ఉంటుంది మరి!

ఏం చెప్పాలో తెలియక బుర్ర గోక్కున్నాడు రాజకీయ నాయకుడి చెంచా!

ఆనక మెల్లిగా, "మా అన్నని కనుక్కొని మళ్ళీ కలుస్తా!" అనేసి పోయాడు.

చిద్విలాసంగా నవ్వుకున్నారు ఆర్ముగం - షణ్ముగం & కో ల వారసుల వంటి ఈవెంట్ మానేజర్స్!

"మొత్తానికీ మీడియా కవరేజికి... ఈవెంట్స్ జోడిస్తే చాలు! మనుషుల్లో మూక మనస్తత్వం ఉన్నంత కాలం, మన వ్యాపారానికి ఢోకా లేదు" అన్నాడు షణ్ముగానికి వారసుడి వంటి ఈవెంట్ మానేజింగ్ పార్టనర్!

జవాబుగా ఓ చిరునవ్వు నవ్వి, టేబుల్ సొరుగులోంచి ఓ ఫోటో బయటికి తీసాడు, ఆర్ముగానికి వారసుడి వంటి మరో పార్టనర్!

ఆ ఫోటోలో... ఓ బిచ్చగాడు, తన ముందు పరుచుకున్న చిల్లుల దుప్పటి మీద, చిల్లర నాణాలు చల్లుతున్నాడు.

ఇద్దరూ భక్తిగా ఫోటోకి దణ్ణం పెట్టుకున్నారు.

~~~~~~~


వినాయక చవితి పండుగ నాడు, మీ ఇంటిలోని చిన్నారులకో చిరు కానుక!

ఓసారి....

వినాయకుడు కైలాసంలో ఉండగా, సకల దేవతలూ తరలి వచ్చి "విఘ్ననాయకా! బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, వరాలని పొందిన అనలాసురుడు, అందరినీ దహించి వేస్తూ, సర్వలోకాలనీ బాధిస్తున్నాడు. వర గర్వంతో సాధుజనులని హింసిస్తున్నాడు. మునుపిలాంటి ఆపదలు సంభవించినప్పుడు అందరినీ ఆదుకున్నవాడవు! ఇప్పుడూ నీవే లోకాల్ని రక్షించాలి!" అని వేడుకున్నాడు.

విఘ్నేశ్వరుడు దేవతలకు అభయమిస్తూ "నేనిప్పుడే ఆ అనలా సురుణ్ణి హతమార్చేందుకు బయలు దేరుతున్నాను. మీరిక నిశ్చితంగా ఉండండి" అన్నాడు.

దేవతలంతా స్థిమితపడి స్వస్థలాలకు మరలారు.

విఘ్నాధిపతి తన సేనలతో అనలాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. వర గర్వంతో చెలరేగిపోతున్న అనలాసురుడు, గణపతి సేనలను కూడా దహించసాగాడు. తన కెదురైన ఎవరినైనా దహించగల వరాన్ని పొందిన వాడు మరి!

ఎంత సేపు యుద్ధం చేసినా అనలాసురుణ్ణి హతమార్చలేకపోవటంతో, గణనాధుడికి ఆగ్రహం అవధులు దాటింది. అమాంతం అనలాసురుణ్ణి తొండంతో చుట్టి గుటుక్కున మింగేసాడు.

ఏకదంతుని ఉదరంలోకి చేరిన అనలాసురుడు, కడుపులోనే ఆయన్ని దహించసాగాడు. బొజ్జలో బాధతో గణపయ్య చిందులు వేయటం ప్రారంభించాడు.

విషయం తెలిసి దేవతలంతా సమావేశమయ్యారు. లోకాలకు అనలాసురుడి పీడ విరగడయ్యింది కానీ, దేవగణనాధుని లోపల దహిస్తున్నాడే రాక్షసుడు? ఏం చెయ్యాలి?

గంగాజలం తెచ్చి విఘ్నేశ్వరుణ్ణి నిలువెల్లా అభిషేకిద్దామన్నారొకరు.

"భేష్! అప్పుడు కడుపులోని అగ్గి చల్లారి, శాంత పడతాడు వినాయకుడు" అన్నారు మరొకరు.

దేవతలంతా గంగాజలం తెచ్చి ధారపాతంగా గణపతి శిరస్సు పైపోసి అభిషేకించారు. బాధ తగ్గకపోగా తాపం పెరిగిపోయింది. మంచుకొండల్లో నివసించే వినాయకుడి తల మీద, మంచు ముద్దలను పెట్టారు. ఉహూ! మంట తగ్గితేనా?

చంద్రుణ్ణి, తన చల్లదనాన్నంతా శివపుత్రుడిపై గుమ్మరించ మన్నారు. ప్చ్! అదీ లాభం లేకపోయింది.

కడుపులో అగ్గి వంటి బాధకి విఘ్నేశ్వరుడు విసుక్కుంటూ "మీ ప్రయత్నాలతో నా బాధ తగ్గకపోగా, రెట్టింపవుతోంది" అన్నాడు.

ఇంతలో ఓ ముని... గుప్పెడు దూర్వాగ్రాసాన్ని తెచ్చి విఘ్నేశ్వర స్వామి తలమీద ఉంచాడు.

మరుక్షణం... ఉదరంలోని మంట ఉపశమించి, ఉపశాంతి కలిగింది ఉండ్రాళ్ళ ప్రియునికి!

ఆదరంగా చూస్తూ "ఆహా! ఎంత చల్లగా హాయిగా ఉంది" అన్నాడు. అందరూ ఎంతో ఆనందించారు.

వినాయకుడు "ఇక నుండీ నా అనుగ్రహం పొందాలనుకునే నా భక్తులంతా, నన్ను దూర్వాగ్రాసాంతో పూజింతురు గాక! రెండు దూర్వార పత్రాల్ని శిరస్సున ధరింతురు గాక!" అన్నాడు.

నాటి నుండి... గణేశ చతుర్ది నాడు పత్రిలో భాగంగా.... దూర్వార పత్రాలతో దేవుణ్ణి పూజించటం పరిపాటి అయ్యింది.

ఈ కథ ‘శ్రీరామకృష్ణ మిషన్’ వారి ‘బాలల కథామంజరి’ లోనిది. అందులో దూర్వార పత్రాలు శిరస్సున ధరించిన వినాయకుడి రూపం నాకు చాలా ఇష్టం. అందుకే అదీ ప్రచురించాను.

అసలు వినాయకుడి రూపమే అపురూపం!

‘అందం కాదు, గుణమే ప్రధానం’ అనడానికి... కైలాస పర్వతమంత ప్రతిరూపం విఘ్నేశ్వర స్వామి!

ఇక ఆయన వాహనం... ఎలుక, అనింద్యుడు. ఎంత చక్కని పేరు కదూ! ఎన్నడూ నిందింపబడని వాడు. ఏనుగు భారీ జంతువు. ఏనుగు శిరస్సు గల కొండొక గుజ్జ రూపునికి, ఎలుక వాహనం! అందులోనే ఎంత ద్వంద్వం నిండి నిబిడీ కృతమై ఉందో!

అలాంటి నవ్వుపుట్టించే రూపంతో ఉండి, ఎంత తెలివీ, సమయస్ఫూర్తి చూపుతాడో! ముల్లోకాలూ తిరిగి పుణ్యతీర్దాలన్నీ సేవించి రావటం కంటే కూడా, జన్మనిచ్చిన జననీ జనకులకు పూర్ణ ప్రదక్షిణలు గొప్పవనేంత!

భారతం రచించిన వ్యాస భగవానునికి లేఖనం చేసేటంత!

"ఘంటమాగకుండా చెబితేనే వ్రాస్తా"నన్నాడట... వ్యాసుడితో విఘ్నేశ్వరుడు.

"సరే కానివ్వు! కానీ నేను చెప్పింది అర్ధమయ్యాకే నీవు వ్రాయి" అన్నాడట వ్యాసుడు.

చమతార్కమే కాదు, పోటాపోటీగా.... మాటకి మాట!

ఆ విధంగా... బాహ్యరూపం కంటే గుణశీలాలు, ప్రతిభాపాటవాలు ఎక్కువని చెప్పే గణపయ్య!

ఆయన పూజలోనూ అదే సందేశం! ప్రకృతిలో ప్రతి మొక్కా మోడూ, చెట్టు చేమా... దేని గొప్పతనం దానిదే నన్నట్లు, పత్రిలో ఎన్నిరకాలో! పల్లేరు, జిల్లేడూ... మనమెప్పుడూ పట్టించుకోని, ఎన్నో మొక్కలూ, ఆకులూ, పూలూ!

అసలు హిందూ మతంలోనే ఆ విశిష్టత ఉంది. అందుకే అది ఒక మతం కాదు, ‘జీవన విధానం’ అనబడింది.

హిందువులు ప్రతి చెట్టు చేమకీ మొక్కుతారని ఒకప్పుడు చాలా ఈసడింపులు ఉండేవి. ఈ విషయమై విదేశీయులు మనల్ని చూసి నవ్వు తున్నారని మీడియా అనేది. రంగనాయకమ్మలూ, హేటు వాదులూ అవునవునంటూ సాక్ష్యం చెప్పేవాళ్ళు.

అయినా... ఏం, మొక్కితే తప్పేంటి? ప్రకృతిలో ప్రతీ ప్రాణీ గొప్పవే! మనిషి ఒక్కడే గొప్పవాడనటం అహంకారమే! దేని ప్రాశస్తం దానిదే!

"ప్రతీ ప్రాణిలో నన్నూ, నాలో సకల ప్రాణుల్నీ చూడు!" అంటాడు గీతాచార్యుడు. దాన్ని ఆచరణలో చూపుతుంది హిందూ జీవన విధానం. అది జీవ వైవిధ్యానికి రక్షా కవచం!

ఉదాహరణకి... తులసి విష్ణువుకి ప్రీతికరమైనది. మారేడు మల్లయ్యకి, స్వర్ణ గన్నేరు లక్ష్మీదేవికి, బిళ్ళగన్నేరు భ్రమరాంబ తల్లికి. దూర్వారం వినాయకుడికి. వేపచెట్టు లక్ష్మీపార్వతుల రూపం అన్నంతగా పూజిస్తాం.

ఇటీవల సంపుటి పక్షపత్రిక ( e-మేగజైన్ లో) వట సావిత్రీ వ్రతం గురించి చదివాను. నాకెంత నచ్చిందో! భర్త... తనకూ, తన కుటుంబానికీ వట వృక్షమై నీడనివ్వాలని ఇల్లాళ్ళు చేసే వ్రతం అది. పూర్వం సావిత్రి దేవి, ఆ వ్రతం ఆచరించాకే, యుముణ్ణి సంవాదంలో గెలిచి పతిప్రాణాలు దక్కించు కొందట!

‘భర్త కుటుంబానికి వటవృక్షం వంటివాడు.’ ఎంత బాగుందీ భావన? నిజమే! కుటుంబానికి తండ్రి వటవృక్షమైతే, తల్లి ఆ తరు మూలమే! తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా, పిల్లలు గూడు చెదిరిన పిట్టలే!

ఇలాంటి భావాలు బలపడ్డాక, చూస్తూ చూస్తూ మర్రిచెట్టునే కాదు, ఏ చెట్టునైనా కొట్టేయగలరా? ఒక్క మర్రిచెట్టు కొట్టేస్తే, వేల పక్షులు ఆశ్రయం కోల్పోతాయి. అలాంటి చోట... ఇలాంటి భావనలు, పర్యావరణ శ్రేయో కారకాలే కదా?

జంతువుల పట్ల హిందువుల విశ్వాసాలూ, ప్రాముఖ్యతలూ అలాంటివే! వినాయకుడి వాహనం ఎలుక. కుమార స్వామికి వాహనం నెమలి. మల్లయ్య స్వామికి నంది (ఎద్దు). అమ్మవారికి సింహం, లక్ష్మీదేవికి గజవాహనం, పూజితం. విష్ణువు గరుడ ధ్వజుడు. బ్రహ్మా సరస్వతులు హంస వాహనులు! వృషభం వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఆవు లక్ష్మీ అవతారం. శునకాలలో సైతం... మగదాన్ని భైరవ స్వరూపం అంటూ శివుని గానూ, ఆడదానిని గౌరీ సమానంగా భావిస్తారు. ఇక నాగులు.... శివుడు నాగాభరణుడు, విష్ణువు నాగ శయనుడు. వినాయకుడికి నాగు నడుమున ధరించిన ఆభరణం.

పంది, చేప, తాబేలు దశవతారాల్లోనివి. శుకుడు చిలక ముఖంగల యోగి. ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో! ప్రకృతిలో ప్రతి ప్రాణికీ ప్రాధాన్యత నిస్తూ... సహజీవన శైలిని ఇంకించే జీవన విధానం అది!

అలాంటప్పుడు... ప్రతిప్రాణిని, ప్రతి చెట్టు పుట్టనీ కొలిస్తే తప్పేమిటో? మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పట్లా భక్తీ, గౌరవం, కలిగి ఉండటం తప్పెలా అవుతుంది?

మా చిన్నప్పుడు, మా అమ్మ, కొత్త తిరగలి కొనుక్కువచ్చినా, రోలు, చేట, ఏది తెచ్చినా... ఉండ్రాళ్ళు వండి నైవేద్యంగా పెట్టి మరీ పూజ చేసిన తర్వాతే వాడేది. "ఎందుకలా?" అనడిగితే... తిరగలి, రోలు ధాన్యలక్ష్మి స్వరూపాలని, కొత్తగా తెచ్చినప్పుడు పూజ చేయటమంటే, నిత్యం ధాన్యాన్ని పిండి చెయ్యమని అడగటమేననీ చెప్పింది.

అలా భక్తి శ్రద్దలతో వస్తు వినియోగం, మనిషిని క్రమ శిక్షణా పూరితుణ్ణి చేస్తుంది. నిరంహంకారిని చేస్తుంది. ఉపయోగించే ప్రతీసారి భక్తిశ్రద్దలు కలిగి ఉండటాన్ని వదిలేసి, సంవత్సరాని కోసారి ‘దినాలు’ (తల్లిదినం, తండ్రి దినాల్లాగా, plant Day లూ, గట్రాలు) చేస్తే పర్యావరణ ప్రయోజనం ఏం ఉంటుంది?

హిందూ జీవన విధానం ‘పండు కోసుకునే ముందు చెట్టుకి నమస్కరించి కోసుకొ’మ్మంటుంది. చివరికి, పొలంలో పంట కోసే ముందు కూడా, వ్యవసాయ క్షేత్రానికి పసుపు కుంకాలతో పూజ చేసి, ‘పొలి’ పేరుతో అన్నపు బలిని పొలమంతా చల్లాక, కోతలు నిర్వహించే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కోత యంత్రాలతో రైతులవి మరిచిపోయారేమో తెలియదు గానీ, పరస్పర సహకారాన్ని ప్రబోధించిన మత విశ్వాసాలూ, జీవన విధానాలూ అవి!

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

కొన్ని నెలలుగా, మీడియా ప్రచారిస్తున్న వార్తాంశాల్లో ఎక్కువభాగం ‘తెలిసిందీ’, ‘సమాచారం’ అంటూ వ్రాస్తున్నవే! ఎక్కడా వాస్తవం గానీ, విశ్వసనీయత గానీ గోచరమవ్వటం లేదు. వార్తల్లో ఎక్కువభాగం... ‘ఆకుకు అందకుండా పోకకు పొందకుండా’ అన్న చందాన ఉన్నవే.

ఉదాహరణకి. దిగువ వార్త చూడండి!

>>>
దేవుడు విధించే ఏ శిక్షకైనా జగన్‌ అర్హుడే
అతను జీవితాంతం కాంగ్రెస్‌కు రుణపడి ఉండాలి
వైఎస్‌ డబ్బు సంపాదించుకున్నా.. ఏమీ అనలేదు
పార్టీకి సేవ చేసినందునే రెండోసారీ సీఎంను చేశాం
రోశయ్యపై మాకు నమ్మకం ఉంది
తనను కలిసిన నేతలతో సోనియా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ-న్యూస్‌టుడే

అధిష్ఠానాన్ని బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్మోహనరెడ్డి ఓదార్పుయాత్ర చేయడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలతో మాట్లాడుతూ... ''దేవుడు విధించే ఎలాంటి శిక్షకైనా జగన్‌ అర్హుడే'' (జగన్‌ డిజర్వ్‌డ్‌ ఎనీ పనిష్‌మెంట్‌ బై గాడ్‌) అంటూ కటువుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు ఉప్పల శారదలు సోనియాగాంధీని వేర్వేరుగా కలిశారు. అతని వ్యవహారంలో పార్టీ అధిష్ఠానం వూగిసలాట ప్రదర్శిస్తోందన్న వాదనను సోనియా ఖండించినట్లు సమాచారం. మీకూ, మీడియాకూ వూగిసలాట ఉందేమోకాని, తమకు ఎలాంటి సంశయాలులేవని, ఈ విషయంలో తాము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నామంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

డబ్బు సంపాదించుకున్నారు

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా డబ్బు (మింటెడ్‌ మనీ) సంపాదించుకున్నారని తెలిసీ కూడా ఆయన పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగించామని, ఆ సమయంలో ఆయన అపరిమితమైన అధికారాన్ని చెలాయించారంటూ సోనియా ప్రస్తావించినట్లు సమాచారం. వైఎస్‌తోపాటు ఆయన కొడుకుగా జగన్‌ కూడా అపరిమితమైన అధికారాన్ని చెలాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని అధినేత్రి అన్నట్లు తెలిసింది. వైఎస్‌ కుటుంబానికి తాము ఇచ్చిన చేయూతను చూసి జగన్‌ జీవితాంతం కాంగ్రెస్‌కు రుణపడి ఉండాలని ఆమె ఆవేదనతో కూడిన స్వరంతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. జగన్‌ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ రాష్ట్ర నాయకులు చెప్పినప్పుడు ''డబ్బుంది కదా పార్టీ పెడతారు. చూద్దాం'' అని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పుడు పీసీసీ అధ్యక్షులను ముఖ్యమంత్రిని చేయడం కాంగ్రెస్‌లో సంప్రదాయంగా వస్తున్నప్పటికీ దాన్ని కాదని 2004లో వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేశామని పేర్కొన్నట్లు తెలిసింది. సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో... జగన్‌ పని అయిపోయినట్లేనా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీలోని కాంగ్రెస్‌ ముఖ్యులు. పార్టీకి విశ్వాసపాత్రంగా ఉంటూ రాష్ట్రంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చేరవేస్తున్న నాయకులు జగన్‌ పని అయిపోయినట్లేనని కరాఖండిగా చెబుతున్నారు.

ఆ పనిలోనే ఉన్నాం

మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి గురువారం సాయంత్రం సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని ఆయన సోనియా ముందు వివరించే ప్రయత్నం చేశారు. గత అయిదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, వాటిని సరిదిద్దాలని కోరినప్పుడు ''మేం అదే పనిలో ఉన్నాం'' అంటూ ఆమె స్పందించినట్లు డీఎల్‌ చెప్పారు. ఎమ్మార్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అధినేత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి సోనియాకు తనకంటే ఎక్కువగా తెలుసన్న విషయం ఆమెతో మాట్లాడిన తర్వాత అర్థమైందన్నారు. రాజకీయాంశాలు, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు, ఎమ్మార్‌ కుంభకోణాల గురించి చెప్పినప్పుడు ఆమె అన్నీ తనకు తెలుసని పేర్కొన్నట్లు తెలిపారు. జగన్‌ ఓదార్పు యాత్ర గురించి అధిష్ఠానానికి ఇది వరకే పూర్తిగా తెలుసు కాబట్టి తానేమీ ఆ విషయం గురించి చెప్పలేదన్నారు. జలయజ్ఞంపైనా ఆయన సోనియాకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు జాతీయ మహిళా కాంగ్రెస్‌ కోశాధికారి ఉప్పల శారద గురువారం ఉదయం సోనియాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు శారద విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన్ను మారుస్తారని వస్తున్న ఊహాగానాలను సోనియా దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆమె పూర్తిగా రోశయ్యకు మద్దతుగా మాట్లాడారని శారద చెప్పారు. ''రోశయ్య పాలనపైన మాకేమీ అయోమయంలేదు. ఆయన మంచి పాలనాదక్షుడు. ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉంది. రోశయ్య సీనియర్‌నేత... రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి'' అని సోనియా అన్నట్లు శారద పేర్కొన్నారు.

~~~~~~~~~~~
ఈ వార్తలోనూ, అంశంలోనూ ఎక్కడా స్పష్టత లేదు. ‘తెలిసింది, సమాచారం తప్పితే!’

అసలింతకీ... రాష్ట్రంలో, ప్రజల జీవితాల్లో... ‘జగన్ ఓదార్పు యాత్ర, అధిష్టానపు స్పందన’ తప్పితే సమస్యలే లేవన్నట్లు - మీడియా కవరేజ్ లో సింహభాగం ఉంటోంది.

కొన్ని నెలలుగా... ఇదిగో జగన్ ఓదార్పు యాత్ర పేరిట ధిక్కారం, అదిగో రేపో ఎల్లుండో అధిష్టానం చర్య తీసుకోబోంది - ఇదే సొదతో తెల్లారుతోంది.

తొక్కలోది ఒక ఎంపీ! చర్య తీసుకుంటే ఎంత? తీసుకోకపోతే ఎంత? ఆఫ్టరాల్ ఒక్క ఎంపీ మీద చర్య తీసుకోవటానికి అధిష్టానానికి ఇన్ని నెలలు పడితే (దాదాపు సంవత్సరం కాలం) ఇక అధిష్టానానికున్న పట్టు ఎంతని?

మరో వైపు చూస్తే... జగన్ ఓదార్పు యాత్రకి కూడా అంతూ దరీ లేనట్లుంది. తనని ముఖ్యమంత్రిని చేసేదాక, లేదా జీవితకాలం పాటు ఓదార్పుయాత్రలు నిర్వహించేందుకు పైకారణాలు సిద్దం చేసుకుంటున్నట్లుగా...

తొలియాత్ర: తండ్రి ఆకస్మిక మరణానికి దిగులు చెంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలని ఓదార్చుతున్నాడు.

రెండోసారి యాత్ర: తండ్రి వర్ధంతులూ, జయంతులూ సరిగ్గా నిర్వహించలేదని గుండెపగిలి, దిగులు చెంది, చనిపోయిన/పోతున్న వాళ్ళని ఓదార్చాలి.

మూడో యాత్ర: తన ఓదార్పు యాత్రల్ని వై.యస్. విగ్రహాలని అడ్డుకుంటున్నందుకు చనిపోయిన/పోతున్న వాళ్ళని ఓదార్చాలి.

నాలుగో యాత్ర: మహానేత (ఎటూ స్వంత మీడియా ఉంది కదాని, తమకి తామే తగిలించేసుకున్నారు బిరుదులు!) కుమారుడు యువనేత జగన్ ని సీఎం ని చేయనందుకు చనిపోయిన/పోతున్న వారిని ఓదార్చటం!

తొలి యాత్ర ముగియటానికి దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ కాలమే పడుతుంది. అలాంటిది మిగతా యాత్రలు పూర్తి కావటానికి ఎంత సమయం కావాలో!? కాబట్టి ఇది ఇప్పుడప్పుడే తెమిలే యాత్ర కాదు.

దాంతో మీడియా కూడా... తమ కాటాలో ఓ ప్రక్క జగన్నీ, మరో ప్రక్క అధిష్టానాన్నీ ఉంచి... వార్తలు వ్రాసుకోవచ్చు.

ఇంతా చేసి ‘ఓదార్పు వంకతో జగన్ ధిక్కారం - అధిష్టానం చర్యా తీసుకుంటారా, లేదా?’ తప్ప, ఇతరత్రా సమస్యలే లేవు కాబోలు!

ఇంత డ్రామా ఎందుకు నడుస్తున్నట్లు? ‘తెలిసిందీ, సమాచారం’ ల మాదిరి వార్తలతో, మీడియా ఇంత కామెడీ ఎందుకు చేస్తున్నట్లు?

అందునా అధిష్టానం మహారాజ్ఞి నోరు విప్పదు. అంతా దాసదాసీ జనులే అంటారు. మరికొన్నిటిని ఏఐసీసీ ముఖ్యనేత ఒకరు, లేదా xyz ఒకరు అంటారు. (అలాగనే వ్రాస్తాయి పత్రికలు!) ఉదాహరణకి మొన్న కేకే, నిన్న పురంధేశ్వరి, ఈ రోజు డీఎల్ గట్రా ల హల్ చల్ ల మాదిరిగా నన్న మాట!

ఎందుకింత జాగ్రత్తగా ‘తెలిసింది, సమాచారం’ పేరిట అస్పష్ట వార్తలు వ్రాయటం అంటే - ఒక వేళ అయ్యొచ్చి పైయ్యొస్తే... ‘అంతా మీడియా సృష్టి’ అనొచ్చు. లేదా ‘దాసదాసీ జనాల వ్యక్తిగత అభిప్రాయాలు’ అనొచ్చు. లేదా ‘వాళ్ళ అవగాహన లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ లేదా సోనియా మాటల్ని వక్రీకరించారు’ అనొచ్చు.

ఆ విధంగా... సోనియాని మీడియా... కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకోసం తన విశ్వసనీయతనైనా వదులు కుంటుంది. (పత్రికల వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎలాగూ ‘గజని’లన్న అభిప్రాయం మరి!)

ఒక్క మాటలో చెప్పాలంటే - సోనియా ‘కన్ను’ అయితే, మీడియా విశ్వసనీయత ‘కాలు’ అన్నమాట! ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీలో ఇప్పుడు మీడియా విశ్వసనీయతే వదులుకోబడింది. మరి అంత విలువైన వ్యక్తి... ఈ ప్రభుత్వ కుర్చీ వ్యక్తి! అంతగా సోనియా, మీడియా లు సయామీ కవలలు. కాబట్టే - కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడకుండా, అధిష్టానం తరుపున మీడియానే అన్నీ ప్రచారిస్తోంది.

సరే! ఇంతకీ ఇంతగా ఓదార్పు గోలేమిటి? అసలేం జరుగుతోంది? ఇంత రచ్చ, ప్రజల సమస్యల్ని హైజాక్ (హైసర బజ్జా) చెయ్యటానికికే కాదు, ప్రజలతో సహా మంత్రుల మీదా, ఎంఎల్ఏ ల మీదా, ఎంపీల మీదా మానసిక యుధ్దా తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఓ వైపు జగన్, మరో వైపు అధిష్టానాన్ని నిలబెట్టి, ఎవరెటు నిలబడతారో తేల్చుకొమ్మన్నట్లు వత్తిడి సృష్టింపబడుతోంది. అందులో ఎవరి గోల, బాధా వాళ్ళది!

అందునా ఇప్పుడు వృద్ధ రోశయ్య అనారోగ్యం! ఆ పైకారణంతో సీఎం సీటు ఖాళీ అయితే రేసులో ఎవరెవరున్నారు? ఉంటారు? పోయే సీట్లేవరివి? వచ్చే బెర్తులెవరివి? పదవి ఉన్న వారికి పోతుందన్న భయం, లేని వారికి వస్తుందన్న ఆశ! దానితో మారే రాజకీయ సమీకరణాలెన్నో!?

ఇన్నిటి మధ్యా, అధిష్టానం తీరిగ్గా‘ వై.యస్. డబ్బు సంపాదించుకున్నా... ఏమీ అనలేదు. పార్టీకి సేవ చేసినందునే రెండోసారి సీఎంని చేశాం’ అన్నదట. [అని తెలిసింది, సమాచారం మరి!] అతడు డబ్బు మెక్కుతున్నాడని [మెంటింగ్ మనీ] అని తెలిసీ ఎందుకు ఊరుకుందట!? వాట విదిల్చినందుకా?

ప్రజల తరుపున ఉన్నామనే మీడియా, సోనియాని ఈ ప్రశ్న చచ్చినా వెయ్యదు! ఉన్నది ఉన్నట్లుగా వ్రాస్తున్నాననే మీడియా, ఈ విధంగా ‘తెలిసింది, సమాచారం’ వార్తాంశాలు ఎందుకు వ్రాస్తున్నట్లో?

వై.యస్., డబ్బు సంపాదించుకున్నా ఊరుకున్న సోనియా, వై.యస్. చనిపోయిన రోజున స్వయంగా, డీడీ వార్తల్లోని వీడియో క్లిప్పింగ్ సాక్షిగా, స్వంత నోటితో [ఇది ఖచ్చితంగా తెలిసింది, సమాచారం కాదు. నిక్కచ్చిగా నిజం.] వై.యస్. దార్శనికుడు, మార్గదర్శి అంది. అంతే కాదు ‘నన్ను నమ్మండి మేడమ్. ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యత నాది’ అన్నాడు - అంటూ దగ్గుత్తిక తో, దుఃఖాశ్రువులతో చెప్పింది.

ఆ రోజుకి తెలియదా డబ్బూ సంపాదించుకుంటున్నాడని? నిజానికి ఈ ప్రశ్న పత్రికలు వేయాలి. వేయవు. మనం వేద్దామన్నా, సదరు వ్యాఖ్య అధిష్టానం చేసిందో లేదో మనకి తెలియదు. పాపం, మీడియాకి కూడా తెలియకే... ‘తెలిసిందీ, సమాచారం’ అంటోంది!

ఇందులో కొసమెరుపు ఏమిటంటే - ‘జగన్ మీద అదిగో చర్య, ఇదిగో చర్య’ అంటూ ఆ రెండు పత్రికలు, వై.యస్. వ్యతిరేక వర్గీయులు గగ్గోలు చేస్తుండగా... అధిష్టానం మాత్రం ఓ మెట్టు దిగొచ్చి... ఓదార్పుకు తోడ్పాటుగా, పార్టీ తరుపున తామూ, మరణించిన వారి కుటుంబాలకు తలా లక్ష ఇస్తానంది. ఆ ప్రకటనతో జగన్ వర్గీయులకి మరికొంత ఊపిరి పోసింది.

రేపు మరో మెట్టు దిగొచ్చి, అనారోగ్య వృద్ధ ముఖ్యమంత్రిని దింపేసి, వై.యస్.వారసుణ్ణి సీఎంని చేస్తుందేమోనన్న భయం వై.యస్. వ్యతిరేక వర్గీయులకు భయం పట్టుకుంది. ఒక వేళ సీఎం ని చేసినా ఆశ్చర్యం లేదు. ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉందో, ఎవరి అవసరం ఎవరికి ఉందో ఎవరికీ తెలియదు, ఎవరికీ సమాచారం లేదు మరి!

అందునా తాజాగా "దేవుడు శిక్షించే ఏ శిక్షకైనా జగన్ అర్హుడే" అని సోనియా అన్నదనీ... తెలిసిందీ, సమాచారం! దేవుడే శిక్షించేటట్లయితే అధిష్టానాలెందుకు, క్రమశిక్షణా కమిటీలెందుకూ, చట్టాలెందుకూ, సీవీసీ లెందుకూ?

ఈ మొత్తం వ్యవహారం లో... పార్లమెంట్ భవనంలో సబ్బంహరి, సర్వేసత్యానారాణల వంటి వారు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ ‘కందకి లేని దురదలతో కత్తి పీటల్లా’ గోక్కుంటారు. మధ్యలో "రాజీవ్ గాంధీని హత్య చేసిన వాళ్ళనే క్షమించింది సోనియా" అని ఒకరంటే - "అంటే దానర్ధం జగన్ రాజీవే హత్య చేయించాడనా?" అని మరొకరు హుంకరిస్తారు. రాజీవ్ హత్య గురించి పరోక్షంగా ఎత్తబడేసరికే, సోనియా ఒక మెట్టు దిగొచ్చి ‘ఓదార్పుకు తోడ్పాటుగా పార్టీ తరుపున, తామూ, మరణించిన వారి కుటుంబాలకు తలా లక్ష ఇస్తానంది’ అని నాలాంటి వారంటారు! :)

మొత్తం నాటకం మాత్రం సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా కంటే రసవత్తరంగా సాగుతోంది. కాకపోతే ముగింపే తేలకుండా ఉంది.

"ఇదేదీ కాదు, ఇది రెండు పత్రికాధిపతుల మధ్య యుద్ధమే, వాళ్ళ స్వలాభం కోసమే ఇదంతా" అని అనేటట్లయితే... మరి డబ్బులు పెట్టి ఆ పత్రికలు కొనుక్కుంటున్న ప్రజల సంగతేమిటి? పత్రికల దృష్టిలో ప్రజలు వెంగళప్పలా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

పారిశ్రామికవేత్తగా నా కెరీర్ లో, మరికొందరు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారులని చూశాను.

మరో సంఘటన...

నా బ్యాటరీలకి బ్రాండ్ నేమ్ రిజిస్ట్రర్ చేయించాలని, ఓసారి చెన్నై(అప్పట్లో మద్రాసు)లోని ఆఫీసుకు వెళ్ళాను. అప్పుడు నేను, రామనాధపురం జిల్లా, కారైక్కుడి లోని సిక్రి(CECRI) లో బ్యాటరీ తయారీలో స్వల్పకాల శిక్షణ ముగించుకొని వస్తున్నాను. వెంట మా నాన్న ఉన్నారు.

నేను వాళ్ళ ఆఫీసుకి వెళ్ళేసరికి, ఉదయం పదకొండు గంటలౌతుంది. సంబంధిత అధికారి ఎవరో తెలుసుకొని, కలుసుకున్నాను. నా ఫ్యాక్టరీ గురించి, నా గురించి పరిచయం చేసుకొని, వివరాలన్నీ చెప్పి, నా ఉత్పత్తి ఎంబ్లెం డిజైన్లు చూపించాను. బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించుకోవాలని వచ్చానని, నన్ను గైడ్ చెయ్యమనీ అడిగాను.

నేను చెప్పిందంతా విన్న ఆ అధికారి, మేం తెలుగు వాళ్ళ మని తెలియటంతో, తమిళ యాసతో తెలుగులో మాట్లాడుతూ "చూడండమ్మా! జనరల్ గా మా ఆఫీస్ కి, డైరెక్టుగా ఇండస్ట్రియలిస్ట్ లెవరూ రారు. ప్రొడక్ట్స్ ని బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసేందుకు లైజాన్స్ ఉంటారు. వారి ద్వారానే మమ్మల్ని సంప్రదిస్తారు. అదంతా ఫార్మాలిటీస్ ప్రకారం జరుగుతుంది. ఒకో ఎంబ్లెమ్, బ్రాండ్ నేమ్ రిజిస్టర్ కి కొంత సొమ్ము ఇక్కడ ఖర్చువుతుంది.

కానీ, నాకు మీ ఉత్సాహం చూస్తే ముచ్చట వేస్తోంది. నాకు మీ అంత కూతురుంది. మా అమ్మాయి కూడా మీలా డైనమిక్ గా, Enthusiastic గా ఉండాలనుకుంటాను. మా అమ్మాయికి, మీ గురించి తప్పకుండా చెబుతాను. మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి నేను తప్పకుండా సాయం చేస్తాను. మీరు ఈ సొమ్ము చలానా కట్టి తెండి. ఇదిగో ఈ అప్లికేషన్ ఫాం ఇలా ఫిలప్ చెయ్యాలి" అంటూ అప్పటికప్పుడే అన్నీ పూర్తి చేయించారు.

బ్యాంక్ చలానా కట్టి, దరఖాస్తు నింపి ఫైల్ చేసాను. (ఒకో బ్రాండ్ నేమ్ కు 600/- Rs. ఫీజు ఉండింది. అది లైజాన్స్ ద్వారా అయితే, పదివేలకు తక్కువ కాదని తర్వాత నాకు తెలిసింది.)

ఆ అధికారి ఎంతో సాదరంగా "రిజిస్ట్రేషన్ సర్టిఫీకేట్లు మీకు పోస్టులో పంపుతానమ్మా! వెళ్ళిరండి." అని చెప్పాడు. నేనెంతగా ఆశ్చర్యపోయానో, అంత ఆనందపడ్డాను. ఆయన కెంతో కృతజ్ఞతలు తెల్పుకున్నాను. తమిళ పేరవ్వటం ఇప్పటి దాకా గుర్తుంచుకోలేక పోయాను. కొన్ని నెలల తర్వాత... పైసా ఖర్చు లేకుండా, నా ప్రొడక్ట్ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫీకేట్లు, తపాలాలో అందుకున్నాను.

ఆ విధంగా అప్పట్లో కొందరు ప్రభుత్వాధికారులు నుండే కాదు, నా స్నేహితుల నుండి కూడా, ఎంతో సహాయ సహకారాలు, అందుకున్నాను. ఎంతో నేస్తాన్ని ఆస్వాదించాను.

నా చిన్ననాటి మిత్రులు, అందులో బాలల అకాడమీ నిర్వహించిన ఏపీ దర్శన్ సహాధ్యాయులు, నా కెరీర్ లో నాకు ఎంత గానో సాయం చేసేందుకు ప్రయత్నించే వాళ్ళు. నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, వాళ్ళ సలహాలు కోరేదాన్ని. అప్పట్లో వాళ్ళంతా నా ఆప్తమిత్రులు! హైదరాబాదు వెళ్తే, రోజుల తరబడి నా మిత్రుల ఇళ్ళల్లోనే బస చేసేదాన్ని.

ఏ కష్టం వచ్చినా, నిర్మొహమాటంగా అడిగేదాన్ని! తమకి తెలిసిన సమాచారం చెప్పేవాళ్ళు. తమ బంధుమిత్రులలో ఎవరి ద్వారానైనా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకుంటే, ఎంత ప్రయాస తీసుకునేందుకైనా వెనుకాడే వాళ్ళు కాదు. అప్పటి మైత్రిని నేనెంత ఆనందించానంటే - ఎంతో ధీమాగా ‘నాకు ఆత్మబంధువులున్నారనీ, ఈ రోజు "నేస్తం! నాకు నీ తల కావాలి" అంటే... మరునాడు పోస్టులో నాకు పార్సెల్ వస్తుందనీ’ అనేదాన్ని, అనుకునేదాన్ని!

కొంత అతిశయోక్తి అలంకారం ఉండవచ్చేమో గానీ, అంత అరమరికలు లేని స్నేహం, ఆనాడు నేను పొందానని ఇప్పటికీ ఘంటా పధంగా చెప్పగలను. వారిలో ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం తోనే, ఇండియన్ బ్యాంకులో ఉన్నతాధికారులతో నేను సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఢిల్లీ ఫైనాన్స్ షియల్ ఎఫయిర్స్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న కె.జే.రెడ్డి అనే సీనియర్ ఐఎఎస్ అధికారిని కలిసి, నా సమస్యని పరిష్కరించుకోగలిగాను. సమాచార మొక్కటే కాదు, ఏ సహాయం చేసేందుకైనా సిద్దపడేవాళ్ళు.

వారిలో మరో మిత్రుడు తన తండ్రి నడిగి, నాకు డబ్బు అప్పుగా ఇప్పించాడు. అప్పట్లో అది అధిక మొత్తం. వ్యాపార అవకాశాలనీ నా ఉత్పత్తికి చూసి పెట్టేవాడు.

అలాంటి బాల్య మిత్రులు, 1992 తర్వాత ఎంత తేడా చూపించారంటే.... అది నాకు ఒక పట్టాన జీర్ణం కాలేదు కూడా! దాదాపు నా మిత్రులూ మిత్రురాళ్ళంతా నాకు, 1992 తర్వాత చుక్కలు చూపించారు.

అప్పట్లో అయితే అందరూ నన్నో చెత్తబుట్టలో పారేసారనిపించింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఓటమి, ఒంటరితనం ఎంత బాధించాయో! నా బాల్య మిత్రులలో కొందరు... 1992 తర్వాత, ముఖ్యంగా 1999-2001ల్లో చాలా చేదు చూపించారు.

అలాంటి ఢక్కా మొక్కీలతో - జీవితంలో పగలు రాత్రి, వెలుగూ చీకటుల్లాగే... సుఖాలూ కష్టాలూ ఉంటాయని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను.

ఎంతో ప్రియతములనిపించిన స్నేహితులు, నేను గీచిన గీత దాటని తమ్ముళ్ళు, ఏది చెబితే అది సుగ్రీవాజ్ఞలా పాటించే తోబుట్టువులు - అందరికీ... ఓ దశలో నేను, అంటరాని దాన్నయి పోయాను. ఒకప్పుడు ప్రాణం పంచేంత అనుబంధాలు - తిరిగి చూసుకుంటే ఏముంది? చేదు నిజాలు!

కాబట్టి కూడా ‘గీత’ బాగా అర్ధమయ్యింది. ఏది జరిగినా ‘ఈనాటికి ఇది జరిగింది’ అనుకోవటం అలవాటయ్యింది. ఏదీ శాశ్వతం కాదని కూడా అవగతమయ్యింది.

ఒకప్పుడు సత్కారాలు, మరొకప్పుడు తిరస్కారాలు! ఈ రోజు ప్రశంసలు, రేపు విమర్శలు, ఆ మర్నాడు మెచ్చుకోళ్ళు కావచ్చు. ఏదైనా ఒకటే!

"నీవు ఏమి తీసుకున్నావో అది ఇక్కడే తీసుకున్నావు
ఏమి ఇచ్చావో అదీ ఇక్కడే ఇచ్చావు.
నీదైన ఏ వస్తువు పోయిందని
దుఃఖిస్తున్నావు?
ఈ రోజు ఏది నీదో, అది నిన్న ఎవరిదో మరెవరిదో,
రేపు ఎవరిదో, ఇంకెవరిదో అయిపోతుంది.
పరివర్తన లోక ధర్మం."
అనే గీతాసారం నసాళానికి ఇంకింది.

ఇక ఈ వేదాంతం విడిచిపెట్టి... మళ్ళీ బ్యాటరీ ఫ్యాక్టరీ నడపటంలో నా అనుభవాల దగ్గరికొస్తాను.

వాస్తవానికి, నేను APSFC వారి బహిరంగ వేలంలో, ఐస్ ఫ్యాక్టరీ ని కొని, బ్యాటరీ తయారీ సంస్థగా మార్చుకున్నాను. వేలం, ఆబిడ్స్ దగ్గర చిరాగ్-అలీ లేన్ లో ఉన్న APSFC ప్రధాన కార్యాలయంలో జరిగింది. నేను, మానాన్న గారు హాజరయ్యాం. పెద్దగా పోటీ ఏదీ లేదు. టెండర్ నేనే దక్కించుకున్నాను.

అప్పట్లో APSFC కి RK గోయల్ లేక AK గోయల్ (ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు.) అనే IAS అధికారి MD గా ఉన్నాడు. నేను నా బ్యాటరీ ఫ్యాక్టరీకి ఋణం ఇచ్చేటట్లయితే ఐస్ ఫ్యాక్టరీ కొంటానన్నాను. ఆయన ‘Why not. It is Welcom!’ అన్నాడు.

అప్పట్లో నాదెంత అనుభవ రాహిత్యమంటే, ఆ నోటి మాట(oral commitment) ని, నోటు మాట (written commitment) గా తీసుకోలేదు. తీరా నా ప్రాజెక్ట్ రిపోర్టు... బ్రాంచి ఆఫీసు నుండి హెడ్ ఆఫీసుకి వెళ్ళే సరికి, అక్కడ ఎం.డీ. కాస్తా వేరెవరో ఉన్నారు.

దానా దీనా, నా బ్యాటరీ ఫ్యాక్టరీకి ఋణ సదుపాయం వచ్చేసరికి ఆరునెలల కాలం గడిచిపోయింది. అప్పటికి దువ్వూరి సుబ్బారావు గారు ఎం.డి.గా రావటంతో, ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించటంతో సీడ్ కాపిటల్ తో సహా నా లోన్ అప్రూవ్ అయ్యింది. ఆ వివరాలు నా గత టపాలలో వ్రాసాను.

అయితే APSFC లో నేను కొందరు అధికారుల నుండి ప్రోత్సాహం పొందితే, చాలామంది నుండి... చికాకుని, ఇబ్బందుల్నీ ఎదుర్కున్నాను.

ఇదే పరిస్థితి ఇండియన్ బ్యాంకులో కూడా!

ఇండియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయం విజయవాడ బందరు రోడ్డులో ఉండేది. ఓ రోజు నేను అక్కడికి వెళ్ళి, ఫీల్డ్ ఆఫీసర్ ను కలిసి పరిచయం చేసుకున్నాను. అప్పటికే నా ఫైలు బ్రాంచి ఆఫీసు ద్వారా వారికి పంపబడింది. తర్వాత రీజనల్ మేనేజర్ ని కలిసాను. ఈ ఇద్దరికీ మధ్య మరో సీటుందిట. ఆ సీటులో అధికారి పేరు భారవి.

ఆ రోజతడు సెలవులో ఉన్నాడు. అతడి సీటు R.M. కాబిన్ కు ప్రక్కనే ఉంది. నేనది P.A. to R.M. seat అనుకున్నాను.

మళ్ళీసారి వెళ్ళినప్పుడు అతడు సీటులో ఉన్నాడు గానీ, నేను RM ని కలిసి వచ్చేసాను. అతడి సీట్ గురించి గానీ, అతడి గురించి గానీ, మాలాంటి పరిశ్రమల ఫైల్స్ విషయంలో అతడి ప్రమేయం గురించి గానీ, నాకు తెలియదు. ఆ సాయంత్రం నాకు మరో మిత్రుల ద్వారా తెలియటంతో, మర్నాడు ప్రత్యేకం అందుకే వెళ్ళి, అతణ్ణి కలిసి, పొరపాటున నిన్న అతణ్ణి కలవలేక పోయానని చెప్పి, నా ఫైల్ గురించి రిక్వెస్ట్ చేసాను.

వేరేవాళ్ళ చేత చెప్పించాను. పైసలు కావాలసి ఉంటే చెల్లిస్తానని కూడా చెప్పించాను. అయినా... మొదటే తన కివ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదన్న కినుకతో, అతడు నా ఫైలుని తన టేబుల్ సొరుగులో పెట్టేసుకుని, ఫైలు కనబడటం లేదంటూ... నెలరోజులు తిప్పుకున్నాడు. ఆ నెలరోజుల్లోనూ, అప్పటికే నేను ఐస్ ఫ్యాక్టరీని స్వాధీనంలోకి తీసుకున్నందున, కొంత యంత్ర సామాగ్రినీ సమకూర్చుకున్నందున, రోజుకి దాదాపు 800/- రూ. వడ్డీ లెక్కకట్టుకోవలసి వచ్చేది.

దాంతో ఒక్క రోజు వృధా అయినా, నాకు ప్రాణం గిలగిల లాడినట్లుండేది. అవతల ఆ అధికారి, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని రెడ్ టేపిస్టుక్ గా "ఫైలు కనబడటం లేదు, ఈ రోజు బిజీగా ఉన్నాను. రేపు రండి." అనేవాడు.

అక్కడ లంచంగా పైసలూ పనిచేయని పరిస్థితి. అధికారిననే అహం పనిచేస్తున్న పరిస్థితి! నిస్సహాయంగా, నెలరోజులు వృధా చేసుకున్నాను. ఫైలు అతడి దగ్గరే ఉందని రూఢిగా తెలుసు. మనమే బలవంతంగా అతడి సొరుగు లాగి ఫైలు బయటికి తీయలేం కదా!

పోనీ, పై అధికారి అయిన RMకి చెబుదామంటే, ఆ తర్వాత ప్రతీ పనీ ఇతడి టేబుల్ పై నుండే వెళ్ళాలి.

అలాంటి కర్కశత్వంలో, వాళ్ళల్లో తమ ఉద్యోగ ధర్మం నాకు ఏ కోశానా కన్పించేది కాదు. ‘ఆదిలోనే అంత దెబ్బ తింటే, ఏ ఫ్యాక్టరీ అయినా బ్రతికి బట్ట గడుతుందా?’ అనే కొద్దిపాటి ఆలోచన గానీ, concern గానీ వాళ్ళకుండేది కాదు.

ఈ లోపున... నేను ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చేనాటికి టన్ను 16,000/-Rs. ఉన్న సీసం (మా ఫ్యాక్టరీకి ప్రధాన ముడి పదార్దం అదే!), అంతర్జాతీయంగా 35,000/- Rs. లకు పెరిగింది. దాంతో వర్కింగ్ కాపిటల్ లో లోటు భారీగా వచ్చింది.

ఇక....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

ప్రపంచవ్యాప్తంగా, రాజకీయ రంగంతో సహా, అన్ని రంగాలలో... ఒక సంకేత భాష, గుప్తమైన భాష, ఖచ్చితంగా చెప్పాలంటే గూఢచార భాష/సంకేత భాష నడిచింది, నడుస్తోంది. చివరికి క్రికెట్ వంటి... డబ్బు, మోజులతో ముడిపడిన క్రీడలలో కూడా!

ఉదాహరణకి... 31 ఆగస్టు, 2010 ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో, చివరి పేజీ(14) లో, పెద్దచ్ఛరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎవరికైనా అది తేటతెల్లమౌతుంది.

>>>ఇక్కడ ‘ఫిక్సింగ్’ చేయబడును:

>>> క్రికెట్ స్టేడియంలో మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి అదే పనిగా కళ్లద్దాలు తీస్తూ... నెత్తిమీద చేయి పెట్టుకుంటూ, రకరకాల భంగిమల్లో ఫోజులిస్తున్నాడా... అయితే అనుమానించండి. అతడు బుకీ కావచ్చు. లేకుంటే అతడు నియమించిన ఏజెంటైనా అవ్వొచ్చు. అతడిచ్చే సంకేతాలు మ్యాచ్ గమనాన్నీ మార్చేయెచ్చు.

>>>బుకీ మజర్ చెప్పాడు. పాకిస్తాన్ ఆటగాళ్ళు పాటించారు. అమిర్ నోబాల్ లు వేశాడు. ఆరో బంతికంటే ఆరోబంతికే. మూడో బంతికంటే మూడో బంతికే! ఎంత పకడ్బందీగా బెట్టింగ్ మాఫియా, ఫిక్సింగ్ కు పాల్పడుతుందనేదానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ ఫిక్సింగనేది జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్ళతో అయ్యేపని కాదు. కనీసం ఆరేడుగురు కలిస్తేనే సాధ్యం. అందుకే పాకిస్థాన్ జట్టునే ఎక్కువగా బెట్టింగ్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటుంది. కేవలం ఆటగాళ్ళే కాదు. ఇందులో కోచ్ లు, జట్టు మేనేజర్లదీ కీలక పాత్ర. ఒక్కసారి వీరందరూ బెట్టింగ్ మాఫియాతో కలిసిన తర్వాత కొంతకాలం శిక్షణ ఉంటుంది. ఇందులో ఏజెంట్లు... ఆటగాళ్లకు సంకేతాలు నేర్పుతారు. ఎప్పుడు నోబాల్ వేయాలి.. ఎప్పుడు బైస్ ను వదలాలి... వైడెప్పుడు... ఇలా ప్రతి అంశానికి ఓ సంకేతం ఉంటుంది.

>>>పాగా డ్రెస్సింగ్ రూం దగ్గరే: బుకీకి సంబంధించిన ఏజెంట్, సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్ దగ్గరగా కూర్చుంటారు. అక్కడి నుంచే మైదానంలోని ఆటగాళ్ళకు సంకేతాలిస్తాడు. తాను ఏ రంగు దుస్తులను ధరిస్తాడో ముందుగానే చెబుతాడు. దీంతో అతడిని ఆటగాళ్ళు గుర్తించడం సులభమవుతుంది. ఏజెంట్ ఇచ్చే సంకేతాలు చిత్రంగా ఉంటాయి. నెత్తిమీద చేతులు పెట్టుకుంటే వైడనో... కళ్ళద్దాలు తీస్తే నోబాలనో... చేతులు కట్టుకుంటే క్యాచ్ లు వదిలేయమనో... ఇలా రకరకాలు సంకేతాలుంటాయి. ఎర్రటోపి పెట్టుకుంటే పోలీసులు నిఘా ఉంది జాగ్రత్త సుమా... అన్న హెచ్చరిక ఆటగాళ్లకు వెళుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జట్టు మేనేజర్ పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో మొబైల్ ఫోన్లు నిషిద్ధం. మేనేజర్ కు మాత్రం అనుమతి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ మేనేజర్ మొబైల్ కే, కోడ్ భాషలో బుకీలు సందేశాలు పంపుతారు.

>>>అంతా ప్రణాళిక ప్రకారం: ఫిక్సింగ్ అంశంలో బెట్టింగ్ మాఫియా తీసుకునే అతి పెద్ద జాగ్రత్తేంటంటే - ఎక్కడా సమాచారలోపం లేకుండా చూసుకోవడం. సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే - ఏమాత్రం తేడా వచ్చిన నష్టం కోట్లలో ఉంటుంది. అరో బంతికి నోబాలంటే ఆ బంతికి నోబాల్ పడాల్సిందే. ఏ ఆటగాడు ఏం చేయాలనే విషయం మ్యాచ్ కు ముందు రోజు రాత్రి లేదా ఉదయం స్పష్టంగా నిర్ణయమైపోతుంది. ఏమైనా మార్పులు చేర్పులుంటే డ్రింక్స్ సమయంలో ఆటగాళ్ళకు గానీ... మైదానంలోని బుకీ ఏజెంటు గానీ... ఇతర బుకీలకు అమ్ముకునే అవకాశముంది. అలాంటి అనుమానమేదైనా తలెత్తితే... వెంటనే జట్టు మేనేజర్ ను బుకీలు అప్రమత్తం చేస్తారు. ఈ మ్యాచ్ వరకు ఎలాంటి బెట్టింగ్ లుండవనే సందేశం మేనేజర్ కు వెళ్ళిపోతుంది. ఆటగాళ్ళకు డబ్బు అందివ్వడంలో మాత్రం బుకీలు తు.చ. తప్పరు. ఆటగాళ్ళకు తాము బస చేసే హోటల్ లో సేఫ్ లు తీసుకుంటారు. ఈ సేఫ్ లలోనే బుకీలు సదరు ఆటగాడి వాటా సొమ్మును ఉంచుతారు. ఆ రోజు తాము చెప్పినట్లు చేసినట్లయితే సేఫ్ లోని సొమ్ము అలానే ఉంటుంది. పొరపాటు జరిగి తాము నష్టపోతే మాత్రం ఆటగాడి సొమ్మును బుకీలు వెనక్కి తీసుకుంటారు.
~~~~~~~
ఇదీ వార్తాంశం!
అదీ భాష!

బుకీకి సంబంధించిన ఏజెంటు వేసుకునే దుస్తుల రంగు దగ్గరి నుండీ... అతడు బుర్ర గోక్కోవటం, చెవినులుముకోవటం గట్రాలు కూడా సంకేత భాషలో అంశాలే!

ఎందుకైనా మంచిదని... ముక్కు చీదుకోవటం, తుమ్మటం, దగ్గటం వంటివి సంకేతాలుగా పెట్టుకోరేమో లెండి!

ఇలాంటి భాష ఉంటుందని సాధారణ క్రికెట్ ప్రేక్షకులే కాదు, ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు పత్రికలే వ్రాసాయి కాబట్టి, కొందరైనా నమ్ముతారేమో!

నిజానికి ఎవరు నమ్మినా, నమ్మకపోయినా... అలాంటి సంకేత భాష, రాజకీయ రంగంతో సహా, అన్నిరంగాలలో ఉన్నమాట వాస్తవం.

ఆయా రంగాలలో, ఆయా ప్రముఖుల మధ్య, సెలబ్రిటీలతో సహా ఆయా సంబంధికుల వలయం మధ్య, అలవోకగా పని నడిచిపోయేందుకు, అవగాహన సహాయ సహకారాలు కొనసాగేటందుకు... నడిచే గుప్త భాష ఇది! మరో మాటగా చెప్పాలంటే గూఢచార భాష!!

దీన్ని, అన్నిటి కంటే ఎక్కువగా... పత్రికల వంటి మీడియా సంస్థలు, మరింత ఎక్కువగా ఉపయోగిస్తాయి. అది ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితం నుండీ ఆచరణలో ఉంది.

ఎమర్జన్సీ కాలంలో దీన్ని చేధించాలన్న పెను ప్రయత్నం, ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిందని, అద్వానీ తన ఆత్మ కథలో కూడా వ్రాసాడు. విదేశీ హస్తాన్ని వెదికే ప్రయత్నంలోని ప్రయాస అది. మచ్చుకి - అద్వానీ ఆత్మకథ ‘నాదేశం - నా జీవితం’- 227 పేజీలోని ఉదంతం చదవండి.
~~~~~~
>>>ప్రతి వార్తా పత్రిక, వార్తా ఏజెన్సీలో ప్రభుత్వం నియమించిన ఒక సెన్సార్ అధికారి వారి కార్యాలయంలోనే కూర్చొనేవాడు. చేతిలో ఎర్ర పెన్సిల్ తో ఆయన ప్రతి వార్తనూ, సంపాదకీయాన్ని, ప్రత్యేక రచనలను పరిశీలించేవారు. కొన్నిసార్లు, ప్రకటనల వెనుక కూడా అంతర్గత సందేశం ఏదైనా ఉందేమోనని పరిశీలించే వాడు.
~~~~~
ఇంతేకాదు, ఈ సంకేత భాష ఇంతకంటే పురాతనమైనదే! ఈస్టిండియా కంపెనీకి సింధ్ ను, రక్తపు మడుగులో ముంచి, బహుమతిగా ఇచ్చిన నేపియర్ కూడా, ఇలాంటి సంకేత భాషని ఉపయోగించటం గురించి అద్వానీ ఉటంకింపును పరిశీలించండి. (దీనిపై గతంలో టపాకాయ కూడా పేల్చాము.)

పెక్కావి: నా వద్ద సింధ్ ఉన్నది - అద్వానీ ఆత్మకథ నుండి!

>>>1843లో బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ సర్ ఛార్లెస్ జేమ్స్ నెపియర్ (1782-1853), సింధ్ ను ఆక్రమించి, తూర్పు ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు. సింధ్ అమీర్ల సంపద గురించి ప్రపంచానికి అప్పటికే తెలియడమే ఈ దాడికి కారణం. నేపియర్ సైన్యం, సింధ్ సంపదను హస్తగతం చేసుకోవడానికి, నెత్తురుటేర్లే పారించవలసి వచ్చింది.

>>>స్కూలులో నేను(అద్వానీ) ద్వితీయ భాషగా లాటిన్ ను తీసుకున్నాను. దాని వల్ల నాకు, నేపియర్ తో సంబంధం ఉన్న, బహుళ ప్రచారం గల ఒక శ్లేషను అర్ధం చేసుకునేందుకు వీలు కలిగింది. ఆయన అమీర్లను ఓడించిన తర్వాత, లండన్ లో ఉన్న తన యజమానులకు ‘పెక్కావి’... అనే ఒకే ఒక పదాన్ని, టెలిగ్రామ్ లో పంపారు. లాటిన్ లో దాని అర్ధం - ‘నేను పాపం చేశాను’(ఐ హావ్ సిన్న్ డ్) అని. కాగా ఆయన అసలు ఉద్దేశం - ‘నా వద్ద సింధ్ ఉన్నది’... అని (ఐ హావ్ సింధ్). - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ నెం.12]
~~~~~

>>>బెంగుళూర్ లో ఉండగా నేను (అద్వానీ) దేశమంతటా 40 జైళ్ళకు పైగా ఉన్న రాజకీయ ఖైదీలతో నిరంతర సంబంధాలు పెట్టుకునేవాడిని. వారి నుండి తరచూ కోడ్ భాషలో ఉత్తరాలు వచ్చేవి. జనవరి 7న నాకు ఈ క్రింది సందేశంతో ఒక టెలిగ్రాం అందింది.

‘ఉమ్మడి కుటుంబంలో ప్రముఖ సభ్యులందరూ కట్టబోయే కొత్త ఇంటి కోసం చర్చిస్తున్నారు. ఇవ్వాళ నేను తాతయ్యను చూసేందుకు వెళ్తున్నాను’- మధుబాల అద్వానీ.

ఆ టెలీగ్రాం మధు దండావతే నుండి వచ్చిందని నాకు తెలుసు. అందులోని నిగూఢ సందేశం నాకు అర్ధమైంది. తన విడుదల తరువాత ఆయన వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సహచరులను కలుసుకొని కొత్త రాజకీయపార్టీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఆయన ఈ విషయంపై మార్గదర్శకత్వం కోసం జయప్రకాశ్ నారాయణ్ ను కలుసుకునేందుకు పాట్నా బయలుదేరి వెళ్తున్నారు.

16 జనవరిలో నా డైరీలో ఇలా రాసుకున్నాను. ‘మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ లోక్ సభ ఎన్నికలు జరగవచ్చునని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పార్లమెంట్ వచ్చే సమావేశాల మొదటి రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. సరిగ్గా రెండు రోజుల తరువాత 1976 జనవరి 18న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్ సభ రద్దును ప్రకటించారు.’ - అద్వానీ ఆత్మకథ నుండి,పేజీ నెం. 216, 217.

~~~~~~~~
అప్పుడే కాదు, ఇప్పుడూ... గూఢచర్యాన్ని నిర్వహించే నకిలీ కణిక వ్యవస్థ, అందులో కీలక వ్యక్తి రామోజీరావుల లాంటి వాళ్ళు ఉపయోగించేది ఇలాంటి సంకేత భాషే!

తమకు తెలియవు కాబట్టి అది అసంభవం అనే మేధావులని ఉద్దేశించి నేనిది వ్రాయటం లేదు. ఎవరైతే సత్యాసత్యాలని వివేచిస్తారో, వాళ్ల కోసం మాత్రమే వ్రాసాను. అదే విషయం నా గతటపాలలోనూ స్పష్టంగానే చెప్పాను.

నమ్మని వాళ్ళు దీన్ని యధేచ్చగా నిర్లక్ష్యం చేయవచ్చు! ఆపై ఎవరి విజ్ఞత వారిది కదా!
~~~~~
ఇక ఇందులో మరికొన్ని విన్యాసాల్ని చూడండి.

తమ దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, తమ ఆటగాళ్ళపై కుట్ర జరిగి ఉంటుందని పాక్ మంత్రి ఒకరు కొత్తరాగం అందుకున్నాడట. అసలన్ని దేశాల మీదా కుట్రలు చేసే పాకిస్తాన్ మీదే కుట్ర జరగటం!? భారత్ పై ముంబై ముట్టడులు, అమెరికాపై డబ్యూటీసీ పై దాడులు చేసిన లాడెన్ వంటి ఆల్ ఖైదా నేతల్ని, తాలిబాన్లని, దావూద్ ఇబ్రహీం వంటి డాన్ లనీ కడుపులో పెట్టుకు కాపాడే పాకిస్తాన్! అలాంటి పాకిస్తాన్ మీద మరెవ్వరో కుట్ర పన్నటం!

దీన్నే అంటారేమో మొగుణ్ణి తన్ని మొగసాల కెక్కి ఏడ్వటం అని! ఇంకా స్పాట్ ఫిక్సింగ్ లో గంటకో కన్నం, కన్నానికో పాము బయటికి వస్తుండగా... అంగలారుస్తున్నాడు పాక్ మంత్రి!

"వీడియోలున్నాయి కదా?" - అంటే... "అవి కృత్రిమ సృష్టి" అంటారు.
"ఫోన్ సంభాషణల టేపులు వినిపిస్తే" - "అవి మిమిక్రీ" అంటారు.
"ఫోటోలు దొరికాయిగా?" అంటే - "అవి మార్ఫింగ్" అంటారు.
"డబ్బులు దొరికాయిగా?" అంటే - "కావాలని ఎవరో డబ్బు అక్కడ పెట్టి కేసుల్లో ఇరికించారు" అంటారు. ప్రస్తుతానికి పాక్ ఆటగాడు మాత్రం ఆ డబ్బు తన చెల్లికి వివాహ షాపింగ్ కోసం తెచ్చానని చెప్తున్నాడు.
"ప్రత్యక్ష సాక్షులున్నారు కదా!" అంటే - "వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారు" అంటారు.

లైవ్ డెమోగా సదరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడే పట్టుకున్నా..... ‘మీరు ఔనంటారు, మేం కాదంటాం. అంతే గదా?’ అన్నట్లు... మొండిగా, అడ్డంగా వాదిస్తే... ఓ పనయిపోతుంది మరి! (ఈ రకపు వాదనలు, పైస్థాయిలోనే కాదు జన బాహుళ్యంలో కూడా బాగా ఇంకిపోయాయి.)

ఆనక... అంతర్జాయంగా... మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు... అందరూ మౌనం పాటించి, ఎటూ విషయాన్ని చల్లబరుస్తారు గదా?

అలా చూసినా... ఎవరు దీన్నంతా నడిపిస్తున్నారు?

బుకీలే కాదు, క్రికెటర్లు కూడా మాఫియా బెదిరింపులకి భయపడి ఫిక్సింగ్ కి అంగీకరిస్తున్నారంటూ కొత్త వాదన బయటికొచ్చిందీ.(సాక్షి - 01 సెప్టెంబరు, 2010)

మాఫియా ఇదంతా నడిపిస్తొంటే, మరి మాఫియాని ఎవరు నడిపిస్తున్నట్లు?

ఇంకో తమాషా ఏమంటే...

సాక్షి 01సెప్టెంబరు, 2010 వార్తాంశం పరిశీలించండి.

>>>బెట్టింగ్ ను చట్టబద్దం చేయండి: ఢిల్లీ కోర్టు

>>>న్యూఢిల్లీ: క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్లో విరివిగా కొనసాగుతున్న బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలంటూ ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఈ అనైతిక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించింది. ఇలా సంపాదించిన మొత్తం ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరాకు ఉపయోగపడుతోందని అందోళన వెలిబుచ్చింది. బెట్టింగ్ ను ప్రభుత్వం ఆమోదిస్తే ఈ డబ్బు అనేక ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేష్ శర్మ చెప్పారు. మీడియా కథనాల ప్రకారం గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లతో రూ.20వేల కోట్లు చేతులు మారాయని అన్నారు.
~~~~~~~~~

ఇప్పటికే....

"సంపూర్ణ మద్యనిషేధం వంటి వాటిని నిర్వహించటంలో ప్రభుత్వమూ, పోలీసులు విఫలమయ్యారు. నాటు సారా, దొంగ సారాలని నిరోధించలేకపోయారు. దాంతో కల్తీ సారా తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం, xyz కోట్ల రూపాయల విలువైన దొంగ సారా వ్యాపారం నడుస్తోందట.

కాబట్టి - ప్రభుత్వమే అబ్కారీ విధానాన్ని చేపట్టి, మద్యం తయారు చేసి, అమ్మకాలు చేపడితే... కనీసం ఆ డబ్బు ప్రజా ప్రయోజనాల కన్నా ఉపయోగపడుతుంది. ప్రజల ఆరోగ్యము రక్షితంగా ఉంటుంది" - అనే వాదనతో, ప్రభుత్వ సారా వ్యాపారం ప్రారంభమైంది. అదే ప్రభుత్వం, ఇప్పుడు, మద్యం వ్యాపార ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

ఇప్పుడు ఈ వాదనతో జూదరితనమూ చట్టబద్దం అవుతుంది. ఇంకెందుకు? పనిలో పనిగా... పేకాట, గోళీ కాయలు, కోడిపందాలు, గొర్రెల పందాలు, నిమ్మ, బత్తాయి విసరటం పందాలు గట్రాలన్నీ చట్టబద్దం చేస్తే సరి!

ఏతావాతా....

కోర్టుల సహకారంతో... న్యాయబద్దంగా,
ప్రభుత్వ సహకారంతో... చట్టబద్దంగా,
మీడియా సహకారంతో... ప్రజాస్వామ్య బద్దంగా,[ఆ పందాలని సెలబ్రిటీ హోదాలకి పెంచాలి కదా!]
ప్రజలని... జూదరులనీ, తాగుబోతులనీ, సర్వవిధాలా వ్యసన పరులనీ చేస్తే సరి!

తము ఎన్ని దోపిడిలైనా చేస్కోవచ్చు. ఎంత అడ్డగోలుగానైనా సంపాదించుకోవచ్చు.
ప్రజలెటూ మద్యపు మత్తులోనో...
జూదపు కిక్కులోనో...
ఊగుతూ, తూగుతూ, తాము ప్రచారించిన సొల్లుని వొర్లుతూ ఉంటారు.
ఇక తమనెవ్వరూ ప్రశ్నించరు, నిలదీయరు. ఎంత భద్రత!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మొన్నటి [30 ఆగస్టు, 2010] ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో చివరి పేజీ(14) లో పెద్దచ్చరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

‘82 మ్యాచ్ లు ఫిక్స్’ ‘బెయిల్ పై మజర్ (బుకీ) విడుదల’ ‘అవును.... ఆసిఫ్ అలాంటి వాడే’ ‘మెరుపులు... అంతలోనే మరకలు’ ‘బుకీల సంపాదన 145 కోట్ల రూపాయలు’ ‘ఇక్కడ ‘ఫిక్సింగ్’ చేయబడును’ - అనే ఉపశీర్షికలతో... దాదాపు పూర్తి పేజీలో కవర్ చేయబడిన ఆ వార్తాంశంలో, ఆసక్తికరమైన విషయాలున్నాయి.

>>> క్రికెట్ ఆడే దేశాలెన్ని ఉన్నా... మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు పాకిస్థాన్. ఎక్కడ ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసినా బయటికొచ్చే పేర్లు పాక్ క్రికెటర్లవే. సహజ సిద్ద క్రికెట్ ప్రతిభకు నెలవైన ఆ దేశంలో ఫిక్సింగ్ జాడ్యం ఇంతలా విస్తరించడానికి కారణమేంటి? మిగిలిన దేశాల క్రికెటర్లు ఆటను నమ్ముకుంటుంటే... పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్ పైనే ఎందుకు మోజు పడుతున్నారు? అక్కడి క్రికెటర్లను ఆట కంటే ఆకర్షిస్తున్నదేంటి? పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నా... నిషేధాలు ఎదుర్కొంటున్నా, వారిలో ఎందుకు మార్పు రావట్లేదు? అసలీ పాపం మొత్తం ఆటగాళ్లదేనా? అందులో బోర్డు పాత్ర ఏమీ లేదా?

>>> ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో ‘మ్యాచ్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైనందుకు మహ్మద్ అమిర్ అందుకున్న మొత్తం దాదాపుగా రూ.3 లక్షలు. అతనికి జీతం కింద పాక్ బోర్డు ఇచ్చేది దాదాపు రూ.లక్ష. 2008 ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఏడాదికి రూ.3.8 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఇషాంత్ శర్మ... తొలి సీజన్ లో వేసిన ఒక్కో బంతికి అందుకున్న మొత్తం రూ.2 లక్షలు. పాక్ ఆటగాళ్ళు మిగిలిన క్రికెటర్లకు భిన్నమైన ఆదాయ మార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారో అర్ధం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. గత రెండు మూడు దశాబ్దాలుగా పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ళలో ఎక్కువ మంది నేపధ్యం పేదరికమే.

>>>కేవలం సహజ సిద్దమైన ప్రతిభతో జాతీయ జట్టుకు ఎంపికవుతున్న అక్కడి ఆటగాళ్ళకు చదువు, తెలివితేటలు, లౌక్యం... మిగిలిన దేశాల క్రికెటర్లతో పోలిస్తే తక్కువే. పేదరికం నుంచి వచ్చిన వారందరికీ తొలి లక్ష్యం డబ్బు సంపాదించడం. దేశంలో క్రికెట్ మ్యాచ్ లు లేక నష్టాల్లో కూరుకుపోయిన పీసీబీ, మ్యాచ్ ఫీజులు మినహా మరేం చెల్లించే స్థితిలో లేదు. ఇక స్పాన్సర్ షిప్ఫుల సంగతి సరేసరి. ఈ స్థితిలో ఒక్క నోబాల్ వేస్తే 10 లక్షలిస్తాం. ఒక్క క్యాచ్ వదిలేస్తే 50 లక్షలిస్తాం. ఈ మ్యాచ్ లో త్వరగా ఔటైతే కోట్లిస్తాం అంటూ బూకీలు పాక్ క్రికెటర్లకు తేలిగ్గా లొంగదీసుకుంటున్నారు. బాగా ఆడి మ్యాచ్ గెలిస్తే వచ్చే ఆదాయానికి ఎన్నో రేట్లు బుకీలు ఇస్తుండటంతో ఆటగాళ్ళు ఫిక్సింగ్ కు తలూపుతున్నారు.

>>>మరోవైపు ఎంత అద్భుతంగా ఆడినా జట్టులో చోటు గ్యారంటీ అన్న ధీమా లేకపోవడం కూడా పాక్ క్రికెటర్లు ఆత్యాశకు పోవడానికి ఓ కారణమే. ఉన్న కొద్ది రోజుల్లో వీలైనంత సంపాదించుకుందామన్న ఉద్దేశంలో వారు ప్రక్క దారి పడుతున్నారు. ఈ దారులు నచ్చని ఆటగాళ్ళు జట్టులో ఇమడలేక కౌంటీలకో, వేరే ప్రైవేట్ లీగ్ లకో వెళ్ళిపోతున్నారు.
~~~~~~

ఎంతో గొప్పగా ఈనాడు క్రీడా విభాగం వ్రాసిన ఈ వార్తాంశంలో......

పాక్ ఆటగాళ్ళు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారని తేల్చి పారేశారు! అందుకు పేదరికమే కారణమని నిర్ధారించేసారు!!
పాక్ బోర్డు చూస్తూ ఊరుకుంటోందన్న మాట.

ఆట ఆడటం కంటే అలవోకగా ఔటైతే కోటిస్తాం అని బుకీలు ఆటగాళ్ళకి బేరం పెడితే...
సర్లెమ్మని ఆటగాళ్ళు అలాగే చేసి, ఒక్క దెబ్బతో కోట్లు సంపాదించుకుంటుంటే.........
పాక్ క్రికెట్ బోర్డు సభ్యులు నోరు తెరుచుకుని చూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చుంటారా?
కోచ్ లూ, మేనేజర్లూ కూడా మేచ్ ఫీక్సింగులకీ, బాల్ టాంపరింగ్ కీ [పెట్రోలియం జెల్లీలు పూసి] పాల్పడుతున్నారట.

ఇదంతా సరే గానీ, ప్రపంచ వ్యాప్తంగా పాక్ ఆటగాళ్ళు, పాక్ జట్టు కోచ్ లూ, మేనేజర్లూ మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారా? వీళ్ళు మాత్రమే బుకీలకి లొంగి పోతున్నారా?

క్రికెట్ బెట్టింగ్ వ్యాపారపు విస్తారత గురించి వెల్లడైన నేపధ్యంలో చూస్తే... క్రికెట్ ఎంత లాభసాటి వ్యాపారమో! అందుకే కదా మీడియా ఎలుగెత్తి, "క్రికెట్ ఒక మతం. సచిన్ క్రికెట్ దేవుడు. ధోనీ ఇంద్రుడు. మరో xyz ప్రవక్త!" గట్రా ప్రఖ్యాతి ప్రచారిస్తుంటుంది![దాదాపు రెండు నెలల క్రితం అమ్మఒడి టపా:
క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12]


అలాంటి చోట... ఒక ఆట గెలవాలన్నా, ఓడాలన్నా కేవలం పాక్ జట్టు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడితే సరిపోతుందా? ఒక్క చేత్తో చప్పట్లు సాధ్యమైనట్లు.... కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే... పేదరికం కొద్దీ, కేవలం ఒక ఆటకి మూడు లక్షల రూపాయల వంటి తక్కువ ఆదాయం ఉండటంతో ఫిక్సింగ్ కి పాల్పడి, గెలుపు ఓటములను నియంత్రించగలుగుతున్నారా? అంత ప్రతిభావంతులా? ఎదుటి జట్టు ప్రమేయమేమీ లేకుండానే, తమ ఆటని తమ ఫిక్సింగ్ ప్రకారం.... గెలిపించటమో లేక ఓడించటమో చేయగలిగేంత ప్రతిభావంతులా?

పాక్ ఆటగాళ్ళు... నోబాల్ కో, బంతి క్యాచ్ పట్టకుండా జార విడవటానికో, సిక్సర్లు ఫోర్లూ ఎదుటి బ్యాట్స్ మన్ కొట్టే విధంగా బంతులు విసరటానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం!

లేక

పాక్ ఆటగాళ్ళు... విరగ సిక్సర్లూ, ఫోర్లూ కొట్టడానికి, నాటవుట్ గా నిలబడటానికీ ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం. లేదా డక్ అవుట్ కావటానికో, నామ మాత్రపు పరుగుల తర్వాత తేలిగ్గా అవుట్ అయిపోవడానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం.

మరి ప్రత్యర్ది జట్టు ఏం చేస్తుంది? నోట్లో వేలేసుకుని కూర్చుంటుందా? రెండు జట్లు ఆడే ఆటలో, ఒక జట్టు మాత్రమే అ ఆట మొత్తాన్నీ ఎలా నియంత్రించగలదు?

అలాంటి చోట... పాకిస్తాన్ ఆటగాళ్ళు, కోచ్ లూ, మేనేజర్లూ తప్ప, ప్రపంచంలో మిగిలిన దేశాలలో క్రికెట్ ఆడే జట్లన్నీ పరమనీతి పరులన్నట్లు.... మీడియా భలే స్టంట్ చేస్తోందేం!?

అందునా భారతీయ బుకీలు బయటపడ్డాక కూడా!

ఇటీవలే ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ దుర్గంధం ముక్కుపుటాలు ఆదర గొట్టాక కూడా....!

ప్రక్కనున్న పాకిస్తాన్ ఆటగాళ్ళు అడ్డదారిలో కోట్లు సంపాదిస్తుంటే... భారతీయ క్రికెటర్లు మాత్రం మడిగట్టుకు కూర్చున్నట్లున్నారు. మొత్తానికీ ఆవులు చేలో మేస్తుంటే దూడలు మాత్రం బుద్దిగా గట్టునే మేస్తున్నాయన్న మాట?

మరి భారతీయ బుకీలు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగులు చేస్తున్నట్లు? మీడియా... మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ లుగా, డైనమెట్లుగా నిలబెట్టిన క్రికెట్ దేవుళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఇంకేమైనా ఉందా? [ముంబై ముట్టడితో సహా పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్ మీద దాడి చేసినప్పుడు పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడని క్రికెట్ దేవుళ్ళు ఈ ఆటగాళ్ళు!]

మీడియా వీర భక్తులకి అగ్రహావేశాలు ఏ స్థాయిలో వస్తాయంటే... అలాగన్న వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటంత! ఏం చేస్తాం? వాళ్ళ విజ్ఞతకీ జాలిపడి, వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సిందే మరి!

ఇకపోతే... ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - అదేదో పాక్ క్రికెటర్లు కి డబ్బులు తక్కువై [వాళ్ళ బోర్డు ఆటకి లక్ష మాత్రమే ఇస్తుందట వాళ్ళకి!] ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారట.

మరి దేశంలో... రాజకీయ నాయకుల మొదలు, బోలెడు మంది ఉన్నతాధికారుల వరకూ, అందరికీ జీతాలు/ఆదాయాలు తక్కువై అవకతవకలకు పాల్పడుతున్నారా?

ఇవాళా రేపూ ఒక్క చిన్న స్థాయి అవినీతి ప్రభుత్యోద్యోగి మీద ఏసీబీ దాడి జరిగినా కోట్లలో అక్రమాస్థులు బయటపడు తున్నాయి. అలాంటి చోట, పాపం భారతీయ క్రికెటర్లు ‘తమకు సంతృప్తిగా రెమ్యూనరేషన్లు వస్తున్నాయి కదా’ అని ఫిక్సింగ్ కి పాల్పడటం లేదు కాబోలు!

మరి ఐపీఎల్ ఎలా బయటికి పొక్కినట్లు? బుకీలు ఎవరితో బేరాలు కుదుర్చుకుంటున్నట్లు? ఆటగాళ్ళు వాళ్ళకి సహకరించకపోతే అసలు బుకీలు ఎలా తయారౌతారు? దీన్నంతటినీ ‘తిమ్మిని బమ్మిని’ చేసి... మీడియా, క్రికెట్ సంస్థలూ, రాజకీయ నాయకులూ ఐపీఎల్ ఫిక్సింగ్ రచ్చని చల్లార్చే సారు. దాంతో అంతా నిశ్శబ్ధమే!

అసలు అన్నిటి కంటే అత్యంత ఆసక్తి కరమైన విషయం మరి కొన్ని ఉన్నాయి. టపా దిగువన గల వార్తాంశాలు పరిశీలించండి.

సవివరంగా, పార్లమెంట్ సాక్షిగా, ప్రముఖ రాజకీయ నాయకుల వ్యాఖ్యానాల సహితంగా రచ్చకెక్కిన ఈ బెట్టింగ్, ఫిక్సింగ్ ల విషయంలో ఎంత డబ్బు ఏ విధంగా ప్రయాణిస్తుందో కూడా వివరంగా వెల్లడయిన తరువాత కూడా..... అదంతా మామూలుగా ప్రక్కన పెట్టేసి, అదేదో ఇప్పుడే కొత్తగా కనుక్కున్నట్లు అంతా పాక్ క్రికెటర్లే చేసారు అనేస్తే ఓ పనైపోతుంది. గతంలో ఐపీఎల్ పాపం విషయంలో కూడా లలిత్ మోడీ, శశీధరూర్ అనబడే రెండు బలి గొర్రెలు తాత్కాలికంగా తెరమరుగైనాయి.

ఈ మొత్తం వ్యవహారాలని పరిశీలిస్తే తెలియటం లేదా... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు (క్రికెట్ ఉదాహరణలో అయితే ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, దుబాయ్ గట్రాలు) కలిసికట్టుగా, ఒకే లక్ష్యంతో, ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నాయని?

కలిసి కట్టుగా... ఐపీఎల్ ఫిక్సింగూ, బెట్టింగ్ రచ్చని చల్లార్చారు. ఇప్పుడు తాజాగా, పరమ కొత్తగా, పాకిస్తాన్ ఆటగాళ్ళే అంతా చేసారంటూ కొత్త రచ్చ మొదలెట్టారు. నాలుగు రోజులు పోతే ఇదీ చల్లారుస్తారు?

ఆ చల్లార్చడంలోనే... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు... ఒకే శృతిలో పనిచేస్తున్నాయన్నది తిరుగులేకుండా నిరూపితమౌతోంది.

కాకపోతే... సత్యాన్ని చూడగల కన్ను, నిజాన్ని ఒప్పుకోగల దన్ను ఉండాలి. అంతే!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~~~
వార్తాంశాలు:

24/4/10
>>>
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: నెల రోజులుగా జేబులు ఖాళీ చేసుకుని, చదువులు గాలికొదిలి, కళ్లింతింత చేసుకుని మనం చూసిన హోరాహోరీ పోరాటాలన్నీ ఉత్తుత్తి లాలూచీ పోటీలేనని తేలిపోయింది. ఏ మ్యాచ్‌లోనూ రెండు ప్రత్యర్థి టీములు బరిలోకి దిగిందే లేదని, ఆడింది ఒక్క టీమేనని తేలిపోయింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ బెట్టింగ్‌ మాఫియా కోట్లాది క్రికెట్‌ ప్రేమికులతో ఆడిన దొంగాటే నని, ప్రతి మ్యాచ్‌ ముందుగానే ఫిక్సయిపోయిందని ఐటీ అధికారుల దర్యాప్తులో తేలిపోయింది. ‘ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణం తారస్థాయికి చేరింది అంటూ అది ఓ నివేదికను తయారు చేసింది.


ఆ నివేదిక, మనం విని తట్టుకోలేని మరో నిజాన్ని బట్టబయలు చేసింది. మనం ఆరాధించే క్రికెట్‌ ఇలవేలుపులే మనల్ని వంచించారని ఆ నివేదిక తేల్చేసింది. క్రికెట్‌ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు, మాఫియా గ్యాంగులేకాదు, మన క్రికెట్‌ వీరులే కోట్లాది క్రికెట్‌ ప్రేమికులను చిత్తుచిత్తుగా ఓడించేశారని తేలిపోయింది.

ఇంతటి విషాదంలోనూ మిగిలిన ఒకే ఒక్క ఊరట....సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌లు మాత్రం మనల్ని మోసగించ లేదు. ఐపీఎల్‌ పాపపంకిలం ఏ మాత్రం అంటని వారుగా ఆ ముగ్గురికీ ఐటీ నివేదిక క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ పంకిలాన్ని 'సాక్షి మొట్టమొదట బైటపెట్టిన సంగతి తెల్సిందే. ఇపుడు ఐటీ నివేదిక 'సాక్షి వరుస కథనాలను నిజం చేసింది.

క్రికెట్‌ వీరులు ఆడిన దొంగాట: మ్యాచ్‌ఫిక్సింగ్‌ల క్రీడలో ప్రముఖ భారత వీరులతో పాటు ఒక టీంకు కెప్టెన్సీ వహించిన విదేశీ యోధుడూ ఉన్నాడని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దొంగాటలో సీనియర్లే ముందుండి జూనియర్‌లకు మార్గదర్శకత్వం వహించారు. కాదంటే బెదిరించి భయపెట్టి మరీ దారికి తెచ్చారు. అటూ ఇటూ రెండు జట్లలోనూ కాసులకు కక్కుర్తిపడి ఫిక్స్‌ అయిపోయిన క్రీడాకారులే. ఇక అడ్డేముంది. ముందస్తు పథకం ప్రకారం ఒక బౌలర్‌ ఇటు నుంచి చెత్త ఓవర్లు వేస్తాడు. అటు నుంచి మరో ఫిక్స్‌ అయిన బ్యాట్స్‌మెన్‌ ఉతికి ఆరేస్తాడు.

మరో ఆటగాడు స్కూలు పిల్లలు పట్టుకోగల క్యాచ్‌లు జార విడుస్తాడు. ఈ దొంగాటతో మ్యాచ్‌ 'అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. గెలుస్తుందనుకుంటున్న టీం ఓడిపోతుంది. ఓడిపోతుందనుకున్న టీం గెలుస్తుంది. మాఫియా యోధులకు ఏ మ్యాచ్‌ ఎప్పుడు ఎలాటి మలుపు తిరుగుతుందో ముందే తెలుసు కాబట్టి కోట్లకు కోట్లు గడించేస్తారు.

అందరూ దొంగలే: ఐపీఎల్‌ దర్యాప్తులో పాల్గొంటున్న అధికారులు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కటొక్కటిగా ఐపీఎల్‌ మహా పాప పంకిలంలోని లింకులు బయటపడి పోతున్నాయి. వాటి మూలా లు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఐపీఎల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ చీకటి సామ్రాజ్యపు ప్రధాన కార్యాలయంగా బయటపడ్డ మారిషస్‌లోని వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ (డబ్ల్యూఎస్‌జీ) అధిపతి వేణూనాయర్‌... అవిశ్రాం తంగా పనిచేస్తున్నఐటీ-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలముందు మహా సంతోషకరమైన నిజాన్ని వెలిగక్కాడు. సోనీ కంపెనీకి చెందిన మల్టీ స్క్రీన్‌ మీడియాకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌), ఐపీఎల్‌కు ప్రసారహక్కుల ఒప్పం దం కుదిర్చినందుకుగాను... తమకు రూ.125 కోట్లు లంచంగా (కాదు కాదు, సహాయక ఫీజు అనాలి) అందిందన్న నిజాన్ని వెలిగక్కాడు.

అధికారులు ఆ తీగ పట్టుకుని సాగితే, అది బ్రిటన్‌కు చెందిన వర్జిన్‌ ఐలాం డ్స్‌కు చేర్చింది. ఐపీఎల్‌ పాపపు డబ్బు తమకు చేరే మార్గాలెన్నో ఉన్నాయని, వాటిలో రాజకీయ సంబంధాలూ భాగమేనని వేణూనాయర్‌ బయటపెట్టాడు.

పాపిష్టి డబ్బు ప్రవహించే మార్గం: మారిషస్‌లోని డబ్ల్యూఎస్‌జీకి, ఎమ్‌ఎస్‌జీ సమర్పించుకున్న రూ.125 కోట్లు... పన్ను ఎగవేత దారుల స్వర్గధామం వర్జిన్‌ ఐల్యాండ్స్‌కు చేరాయి. అదీ కూడా డబ్ల్యూఎస్‌జీ వ్యవస్థాపకుడుగా చెబుతున్న సీమస్‌ ఓ బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. అదీ సూటిగా జరిగింది కాదు. పలు దొంతర్ల లావాదేవీలతో సింగపూర్‌ మీదుగా, చివరికి 'పార్క్‌ హౌస్‌ హోల్డింగ్‌అనే సంస్థ పేరిట బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. ఇది ఐపీఎల్‌ ఛాంపియన్‌కోసమే ఏర్పాటు చేసిన ఓ పకడ్బందీ మార్గం.

ఐపీఎల్‌కు సంబంధించిన రకరకాల హక్కుల ఒప్పందాల ద్వారా ఆర్జించిన పాపపు సొమ్మునంతటినీ విదేశాలకు తరలించి....అక్కడి నుంచి తిరిగి భారత్‌లోకే తెచ్చి, వివిధ వ్యాపార సంస్థల ద్వారా దర్జాగా ఐపీఎల్‌ నిర్వహణలో పెట్టుబడులు పెట్టుకునే మార్గమిది. ఎమ్‌ఎస్‌మ్‌, మోడీ సంస్థకు లంచాలు చెల్లించి 2017 వరకు అధికారిక ప్రసార హక్కులను సంపాదించింది. దీనికోసం అది ఐపీఎల్‌కు దాదాపు రూ 8,200 కోట్లు చెల్లిస్తుంది. డబ్ల్యూఎస్‌జీ వేసిన ఈ దొంగదారిలో సోనీ భారతదేశానికి చెందిన హక్కులను, భారత్‌లోనే కొని చిల్లిగవ్వ కూడా పన్నులుగా చెల్లించ లేదు. సోనీ, ఇలా రూ.240 కోట్లు పన్ను ఎగ్గొట్టిందని అంచ నా. టీవీ ప్రసార హక్కుల డిస్కౌంట్‌ విలువలో మరో 7.5 శాతం (480కోట్లు) కూడా అది డబ్ల్యూస్‌జీకి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.

Pasted from: http: uni.medhas.org="" unicode.php5?file="http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=486929%26Categoryid=1%26subCatId=32"

మోడి అల్లుడి సైట్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులు కట్టాలని తహతహలాడిపోతూ, దారి తెలియక సతమతమయ్యే వారికో శుభవార్త. అలాంటి వాళ్ల కోసం ఆన్‌లైన్‌ సౌకర్యం ఉంది. 'కాయ్‌ రాజా కాయ్‌' అంటూ క్రికె ట్‌.కాం అనే వెబ్‌సైట్‌ ఆహ్వానం పలుకుతోంది. ఆ సైట్లో ఏ చీకూ చింతా లేకుండా ఐపీఎల్‌ జూదం....అదే బెట్టింగ్‌ ఆన్‌లైన్లో ఆడేసుకోవచ్చు.

ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించింది మరెవరో కాదు.... గ్లోబల్‌ క్రికెట్‌ వెంచర్స్‌(జీసీవీ). ఐపీఎల్‌కు ఈ సంస్థ అధికారిక డిజిటల్‌ మీడియా పార్ట్‌నర్‌! ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సెట్‌ను అదే నడుపుతుంది, ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఇమేజింగ్‌ హక్కులన్నీ దానివే. జీసీవీ ఎవరిదనుకున్నారు? ఐపీల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ సవతి అల్లుడు గౌరవ్‌ బర్మన్‌ది! బర్మన్‌ ప్రమోట్‌ చేసిన ఎలిఫెంట్‌ క్యాపిటల్‌ అనే సంస్థ గత నవంబర్‌లో జీసీవీలో కోటి డాలర్లు (రూ. 45కోట్లు) షేర్‌లుగా పెట్టుబడి పెట్టింది.

కాయ్‌రాజా కాయ్‌: క్రికెట్‌.కాం, మొదటి సెమీఫైనల్‌లో ముంబై గెలుస్తుందని పందెం కాస్తే 8 కి 11 ఇస్తానని చెప్పింది (8 రూపాయలు కాస్తే 11 రూపాయలు ఇస్తారు). బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌కు విజయావకాశాలు ఎక్కువని దాని అంచనా. అందుకే 11కు 10 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇక గురువారం జరగనున్న మరో సెమీ ఫైనల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌కు 1 - 1, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 8-11 ఇవ్వజూపుతున్నారు.

ఐపీఎల్‌ను రద్దు చేయండి: ఠాక్రే
ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను రద్దుచేసి క్రికెట్‌ను కాపాడాలని శివసేన అధినేత బాల్‌ ఠాక్రే డిమాండ్‌ చే శారు. క్రికెట్‌లాంటి మంచి ఆటను ఐపీఎల్‌ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఐపీఎల్‌ అవకతవకలపై ఆదాయం పన్ను శాఖ ఆరు నెలల కిందటే నివేదిక ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ అన్నారు.


Pasted from:
18/4
మాఫియా కనుసన్నల్లో ఐపీఎల్‌!
రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌..భారత ఉపఖండాన్ని ఏటా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌...
ఈ సీజన్‌లో 'చీకట్లో' చేతులు మారుతున్న మొత్తం రూ.లక్ష కోట్లు
విజయవాడలాంటి నగరాలకు పాకిన
క్రికెట్‌ బెట్టింగ్‌.... ఆస్తులు ఒడ్డేస్తున్న కోస్తా
ముంబైపై రూపాయికి 70 పైసలు,
పంజాబ్‌పై రూపాయకి రూ.25

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి:

రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌.. ఐపీఎల్‌! కొచ్చి ఐపీఎల్‌ టీమ్‌కు దూరంగా ఉండాలంటూ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌ బెదిరింపు అంతర్జాతీయ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులు పంపిందా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ... దావూద్‌ ముఠా ఐపీఎల్‌పై 'ప్రత్యేక ఆసక్తి'ని కనబరుస్తున్నదనడంలో మాత్రం సందేహం లేదు. భారత ఉపఖండాన్ని ఏ టా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌... బాలీవుడ్‌ తార లు, మోడల్స్‌, నేతలు, బిజినెస్‌ టైకూన్లతో కళకళలాడిపోయే, నరాలు తెగేంత ఉత్కంఠను రేపే క్రీడా వేడుక. నిర్వాహకులకు, ఆటగాళ్లకు కూడా కనకవర్షం కురిపించే ఈ భారీ వే డుక సందర్భంగా సాగే 'తెరచాటు వ్యాపారం' విలువ దా దాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరి దావూద్‌భాయ్‌కి 'ప్రత్యేక ఆసక్తి' కలగక మానుతుందా?

బెట్టింగ్‌ పడగ నీడలో క్రికెట్‌

ఒకరోజు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో అంతర్జాతీయ బెట్టింగ్‌(పందేలు కాసే జూదం)లో భారత ఉపఖండం ప్రముఖ స్థానంలోకి వచ్చింది. యాభై ఓవర్లలో ఫలితం తేలిపోయే పొట్టిక్రికెట్‌, కోట్ల రూపాయల జూదానికి వేదికగా మారింది. మాఫియా జోక్యంతో అది, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లుగా వికృత రూపం ధరించింది. ఒకప్పుడు, 50 ఓవర్ల చాంపియన్‌ షిప్‌లో 400 కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరిగేదని అంచనా. ప్రతి ఓవర్‌కీ, ఆ మాటకొస్తే బంతి బంతికీ ఆట తీరు మారిపోయే 20 ఓవర్ల క్రికెట్‌తో బెట్టింగ్‌ తారస్థాయికి చేరింది. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఐపీఎల్‌ బెట్టింగ్‌ మార్కెట్లో.... ఈ సీజన్‌లో 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల 'వ్యాపారం' జరగవచ్చని ఒక మాజీ బుకీ (పందేలు స్వీకరించే ఏజెంటు) 'సాక్షి'తో చెప్పాడు. సాక్షాత్తు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటే ఈ భారీ నిధుల గురించి ఆరా తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో మాఫియాగ్యాంగులు, ప్రముఖ రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, సెలిబ్రిటీల ప్రమేయం ఉందని తెలుస్తోంది.

ఒకప్పుడు దుబాయ్‌, కరాచీ, ముంబై, ఢిల్లీల వంటి ప్రధాన నగరాలలోనే బెట్టింగ్‌ సాగేది. ఇప్పుడది నాగపూర్‌, భోపాల్‌, లాహోర్‌, కౌలాలంపూర్‌ల మీదుగా విజయవాడ వంటి చిన్న నగరాలకు కూడా విస్తరించింది. విజయవాడలో ని బెట్టింగ్‌ ముఠాలకు రాజస్థాన్‌ సిండికేట్లతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఆస్తులను ఒడ్డడం కోస్తా బెట్టింగ్‌ ప్రత్యేకత .

ఎవరు, ఎలా, ఎక్కడ ఆడతారు?

'పెద్దపెద్ద నగరాలలోని సిండికేట్లు తమ తమ బెట్టింగ్‌ ఏజెం ట్లద్వారా, పంటర్లద్వారా ఉపఖండం అంతటా వేలాది ప్రాం తాల్లో ఈ 'వ్యాపారం' సాగిస్తాయి. చట్టవిరుద్ధంగా సాగే ఈ రహస్య జూద క్రీడలో మోసానికి తావులేదని ఒక ప్రము ఖ బుకీ చెప్పాడు. 'అనుక్షణం 'భాయ్‌' కన్నేసి ఉంచుతాడు. మోసాన్ని సహించడు. ఎవరైనా మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటే వెంటనే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. మేం మాట్లాడేది కోట్ల గురించి, ఆషామాషీ కాదు. 24 గ ంటల్లోగానే, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలలోగానే గెలుచుకున్నవారికి డబ్బు ముడుతుంది' అని చెప్పాడు.

'టాస్‌ నుంచే బెట్టింగ్‌ మొదలుపెడ్తాం. టాస్‌ మీద బెట్టింగ్‌ రూ. 1. అంటే, రూపాయికి రెండు రూపాయల చొప్పున చెల్లిస్తారు. బంతి బంతికీ, ప్రతి బౌండరీకి, సిక్సర్‌కీ, మొత్తం బౌండరీలు, సిక్సర్లకూ కూడా బెట్టింగ్‌ ఉంటుం ది. మొత్తం స్కోర్‌ల మీద ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపరు' అని చెప్పాడు ముంబైకి చెందిన ఒక బుకీ. 'ప్రస్తుతం ముంబై, ఆటలో ముందుంది. 20 రోజుల క్రితం దానిపై రూపాయికి రూ. 2.30 ఇచ్చారు. ఇప్పుడది 70పైసలకు పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరుపై రూ 2.20, చెన్నైపై రూ. 1.30, ఢిల్లీపై రూ 3.00 పంజాబ్‌పై రూ.25 ఇవ్వజూపుతున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌భాయ్‌ (పేరు మార్చాం). రోజుకు దాదాపు రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ చేతులు మారుతుందని ముంబై-పుణె-అహ్మదాబాద్‌ బెల్ట్‌లోని పంటర్ల అంచనా. క్రితంసారి డెక్కన్‌ చార్జర్స్‌ గెలుపొందినప్పుడు దాదాపు రూ. 2,000 కోట్లు చేతులు మారాయని ముంబైకి చెందిన ఒక పంటర్‌ చెప్పాడు.

డిపాజిట్‌ సెషన్‌: 'డిపాజిట్‌ సెషన్‌' బెట్టింగ్‌లో కొత్త ఆవిష్కరణ. రూ. 20 లక్షలు పంటర్‌ దగ్గర డిపాజిట్‌ చేసి, తొమ్మిది ఓవర్లపాటు ఒ క్కో బంతికీ జూదమాడవచ్చు. అ డబ్బంతా ఒక్కరిదే కానక్కర్లేదు. 'సంపన్న కుటుంబాల యువతీయువకులు చిన్న బృందాలుగా ఇలా ఆడడానికి ఇష్టపడుతున్నారు. తమ గదుల్లోనే కూచుని పంటర్ల ద్వారానూ ఆడతారు, తమలో తాము కూడా పందేలు కాసుకుంటారు. ఈ డిపాజిట్‌ సెషన్‌ యువతలో బాగా పాప్యులర్‌' అన్నాడా పంటర్‌. ఒకప్పుడు ఈ బెట్టింగ్‌ అంతా ఫోన్ల మీద సాగేది. క్షణ క్షణానికి నంబర్లు మారుస్తూ పంటర్లు బెట్టింగ్‌లు స్వీకరించేవారు.

ఇప్పుడు ఉపగ్రహ సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సదుపాయాలు అందులోకి రావడంతో, ఈ ముఠాలను పట్టుకోవడం ఆధికారులకు మరింత కష్టంగా మారింది. 'మాఫియా ప్రపంచం ఇప్పుడు ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతోందనడంలో సందేహం లేదు. ఒక టీంను చేజిక్కించుకోవ డం అనేది ఏమంత ముఖ్యం కాదు. తెరచాటున జరిగే బె ట్టింగ్‌ వ్యాపారమే ప్రధానం. సినిమా రంగంలో జరిగిందే ఇక్కడా జరుగుతోంది. మాఫియా ఇక్క డా జోక్యం చేసుకుంటోంది' అన్నాడు ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు సాగించిన ఒక మాజీ బుకీ.
Pasted from: http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=481680%26Categoryid=1%26subCatId=32
~~~~~~~~~~~~~~~

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu