సాయంత్రం అయిదు గంటలయ్యింది. బుజ్జిగాడు బడి నుండి పరుగెత్తుకు వచ్చాడు. రాగానే పుస్తకాల సంచి ప్రక్కన పడేసి, అమ్మని చుట్టేసాడు.

తల్లి మెడ చుట్టూ చేతులేసి వేలాడుతూ "అమ్మా! ఆకలేస్తోందే!" అన్నాడు.

అమ్మ నవ్వుతూ "టిఫిన్ చేసే ఉంచాను లేరా? వెళ్ళి పుస్తకాల సంచి గూట్లో పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకు రా!" అంది.

బుజ్జిగాడు రివ్వున పరుగెత్తాడు. వాడు సిద్దమై వచ్చేసరికి అమ్మ పేట్లులో ఉప్మా తెచ్చి పెట్టింది. హుషారుగా వచ్చిన బుజ్జిగాడికి, ఉప్మా చూడగానే ఉసూరు మనిపించింది. "ఇదేమిటి? స్వీటు చెయ్యలేదా?" అన్నాడు.

"ఈ రోజు తీరిక దొరకలేదురా? రేపు చేస్తానులే!" అంది అమ్మ అనునయంగా.

"నిన్నా ఇదే చెప్పావు?" బుంగమూతి పెట్టాడు బుజ్జిగాడు.

"కుదర లేదు నాన్నా! రేపు తప్పకుండా చేస్తాను" అమ్మ నచ్చ చెప్పుతున్నట్లుగా అంది.

"నాకేం వద్దు పో! రోజూ ఇలాగే చెపుతున్నావు" అలిగి అవతలికి వెళ్ళిపోయాడు బుజ్జిగాడు.

అమ్మకీ విసుగేసింది. "రేపు చేస్తానంటే వినవేం? తింటే తిను! లేకపోతే పో!" అంది కోపంగా.

బుజ్జిగాడికి ఏడుపొచ్చేసింది. వెళ్ళి మంచమ్మీద బోర్లాపడుకున్నాడు. కాస్సేపు వెక్కివెక్కి ఏడ్చాడు. అలాగే నిద్రపోయాడు.

కాస్సేపటికి బుజ్జిగాడి నేస్తాలొచ్చారు. ఆడుకుందాం రమ్మన్నారు. ‘సర్లే ’ అనుకొని బుజ్జిగాడు వాళ్ళతో కలిసి బయలుదేరాడు. అంతా కలిసి ఊరి బయట తోటవైపు వెళ్ళారు. అంతా చెట్ల క్రింద ఆడుకుంటున్నారు. బుజ్జిగాడు ఒక్కడే తోటలో, ఓ వైపు మెట్లదారి వెంట వెళ్ళాడు.

ఆశ్చర్యం! వాడికో ఇల్లు కనబడింది.

ఇంటి ముందు ప్రహరీ అంతా బిస్కట్లతో కట్టారు. గోడలన్నీ మైసూర్ పాక్ లతో కట్టారు. కిటికీలు చూస్తే జాంగ్రీలు! నీటి గొట్టాల్లాగా జిలేబీలున్నాయి! పంపు తిప్పుతే పాయసం పడుతోంది! ఇంటి పైకప్పు గా ఖాజాలు పేర్చి ఉన్నాయి. తెల్లటి పాలకోవాలతో ఎంచక్కని మంచం పేర్చి ఉంది! కజ్జి కాయలు దిండ్లయి పోయాయి. పెద్ద అరిసె క్రింద జంతికల పుల్లలతో డైనింగ్ టేబుల్ అమర్చి ఉంది. బర్ఫీలతో టేబుల్ చుట్టూ కుర్చీలున్నాయి.

బుజ్జిగాడికి సంతోషంతో కేకలు వెయ్యాలనిపించింది. గుండెల్నిండా మిఠాయిల తీపి వాసన పీల్చుకున్నాడు. స్నేహితులందర్నీ పిలిచి ఆనందంగా మిఠాయిలు తిందామని, గొంతెత్తి పిలవబోయాడు.

"బుజ్జీ! నాన్నా బుజ్జీ! లేవరా?" ఎవరో భుజం పట్టుకుని ఊపుతుంటే కళ్ళు తెరిచాడు బుజ్జిగాడు.

ఎదురుగా అమ్మ నవ్వుతూ ఉంది. అమ్మ చేతిలో రవ్వాకేసరి ప్లేటు! నెయ్యి, జీడిపప్పులూ వేసి తియ్యటి వాసన వేస్తోంది.

"అమ్మా!" బుజ్జిగాడు ఒక్క ఉదుటున లేచి అమ్మను కౌగిలించుకున్నాడు.

అమ్మ బుజ్జిగాడి జుట్టు నిమిరి "తిను నాన్నా" అంది!

తియ్యటి రవ్వాకేసరి తింటూ బుజ్జిగాడు, తన కలనంతా వివరించి చెప్పాడు.

అప్పటికే ఇంటి కొచ్చిన నాన్న కూడా, బుజ్జిగాడి కల విని పకపకా నవ్వాడు.

గతంలో బుజ్జాయిలోనో, బొమ్మరిల్లులోనో చదివిన కథ ఇది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కలల సిద్దాంతాలూ, ప్రశ్నోపనిషత్తులో కలల మీద చర్చలూ బుజ్జిగాడికి తెలియవు. అంతఃశ్చేతనకీ, కలలకీ మధ్య ఉన్న సంబంధం గురించి.... ఫ్రాయిడ్ కన్నా పిప్పిలాద మహర్షి చర్చ, నాకు మరింత అర్ధవంతంగా కన్పించింది. కలల గురించిన చర్చ మన వేదవేదాంగ వాంజ్ఞ్మయంలో చాలానే ఉంది.

సందిగ్ధ అసందిగ్ధాల మధ్య స్థితి ‘పొరపాటు’ అంటాడు ఫ్రాయిడ్. ఒక విషయం గురించి నిర్దిష్టంగా ఓ అభిప్రాయానికి లేదా నిర్ణయానికి రానప్పుడు, అలవోకగా.... మన మాటల్లో, చేతల్లో పొరబాట్లు దొర్లుతాయట. ఉదాహరణకి.... ఒక ప్రదేశానికి లేదా కార్యక్రమానికి వెళ్ళాలో వద్దో, ఇంకా నిర్దిష్టంగా నిర్ణయించుకోలేదనుకొండి. అలాంటి సమయంలో సదరు ప్రదేశానికి/కార్యక్రమానికి వస్తావా? అని ఎవరైనా మనల్ని అడిగారనుకొండి. తడబాటుతో కూడిన సమాధానమో లేదా పొరబాటు సమాధానమో చెబుతామట!

అలాగే అంతఃశ్చేతన లో అప్పటికే ముద్రవేసుకున్న విషయాలు కలలో ప్రతిఫలిస్తాయట. అయితే ఒకే కల పదేపదే రావటం, ఒకే కల నిద్ర మేల్కొన్నప్పుడు అంతరాయం పొంది, మళ్ళీ నిద్రించినప్పుడు కొనసాగటం [అంటే కల సీరియల్ అన్నమాట]... ఇలాంటి విన్యాసాల గురించి, ఎంతో ఆసక్తికరమైన చర్చలు.... ఇటు మన వేదాంగాలు అంటే ఉపనిషత్తులలోనూ, అటు పాశ్చాత్యుల రచనలలోనూ ఉన్నాయి.

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అన్న మాటను ప్రక్కన బెడితే, ఎన్నో ఆధునిక శాస్త్ర సిద్దాంతాలకు, శాస్త్రీయ ఆవిష్కరణలకు.... మూలాలు, ఆలోచనా బీజాలు [Thought Provoking] మాత్రం, మన సంస్కృత వాంజ్ఞ్మయంలోనూ, వేద వేదాంగాల్లోనూ, పంచమ వేదమైన గీతలోనూ ఉన్నాయి. ఒకవేళ వాటికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం సంస్కృతంలో ఉన్నదేమో తెలీదు.

ఎందుకంటే మన భారతదేశం ఎన్నో వేలసార్లు దోపిడికి గురయ్యింది. చాలా పుస్తకాలు జర్మనీ వంటి దేశాలకు చేరాయి. వాటి ఊసు కూడా ఎక్కడ చెప్పబడలేదు. చరిత్ర వక్రీకరించబడింది. జర్మనీలో సంస్కృత యూనివర్సీటీ కూడా ఉన్నది. చాలామంది జర్మన్లు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నదాన్ని మరుగు పరచి, నాశనం చేసి కొత్తగా దాన్నే శాస్త్రీయంగా [సైంటిఫిక్] ఆవిష్కరించటం ఎన్నోసార్లు, ఎన్నో రంగాలలో జరిగింది.

ఈ నేపధ్యంలో... సాధనతొ అందుకోవలసిన వాటిని కన్నెతైనా చూడకుండానే స్టేట్ మెంట్లిచ్చే వాళ్ళకి, దండేసి దండం పెట్టటం తప్ప, మరేం చెయ్యలేం.

వాళ్ళ ప్రచార బానిసత్వానికి వాళ్ళని వదిలేస్తే.... మన పిప్పిలాద మహర్షి, శ్వేతాశ్వతర మహర్షి వంటి వారు, మనకిచ్చిన విజ్ఞాన సంపద కంటే, పాశ్చాత్యుల ఆధునిక సిద్దాంతాలకు ఎక్కువ ప్రచారం రావటం మాత్రం, భారతీయత మీద సుదీర్ఘ కాలంగా జరుగుతున్న కుట్రలో భాగమే. ప్రశ్నోపనిషత్తులో ‘కల’ గురించిన చర్చ మరోటపాలో కొనసాగిద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పోరేటిజంని, మరింత స్పష్టంగా అర్ధం చేసుకునేందుకు మరో పోలిక చెబుతాను. గతంలో ఒక టపాలో చెప్పిన పోలికకు దగ్గరగా అన్పించినా, మరింత స్పష్టమైన పోలిక! ఎలాగంటే -

భావవాదం మానవజాతికి తల్లివంటిది. కుటుంబంలో తల్లి, అందరి గురించీ శ్రద్ద తీసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ఆహారం, ఆహార్యం, ఆరోగ్యం గురించి ప్రత్యేకించి శ్రద్ద తీసుకుంటుంది. అందరికీ, వారి అభిరుచులూ, ఇష్టాఇష్టాలని దృష్టిలో ఉంచుకొని, ఆయా అవసరాలు సమకూరుస్తుంది. వండి వార్చి వడ్డిస్తుంది. పిల్లలు... అన్ని విషయాలూ నేర్చుకుంటూ పెరిగి పెద్దయ్యేలా కృషి చేస్తుంది.

అలాగే పదార్ధ వాదం మానవజాతికి తండ్రి వంటిది. తండ్రి, కుటుంబ భద్రత గురించి, పరువు మర్యాదల గురించి శ్రద్ద తీసుకుంటాడు. కుటుంబం శక్తివంతంగా, ధృడంగా ఉండేటట్లూ, ఆర్దికంగా బలంగా ఉండేటట్లు పాటుపడతాడు. ఆహారాది అవసరాలు తీరేందుకు కావలసిన వనరులన్నీ సమకూరుస్తాడు. పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి, సమాజంలో ఒక స్థాయికి చేరేలా కృషి చేస్తాడు.

అయితే కార్పోరేటిజం మానవ జాతి పట్ల వేశ్యాగృహ నిర్వాహకుల వంటిది. సమాజంలో కుటుంబం పట్ల తల్లిదండ్రులిద్దరూ బాధ్యత, బంధమూ కలిగి ఉంటారు. కుటుంబ శ్రేయస్సు, వృద్దీ కోసం పాటుపడతారు. కానీ వేశ్యాగృహ నిర్వాహకులకు మాత్రం, తమ చెప్పుచేతల్లో ఉన్న వేశ్యల పట్ల గానీ, తమ గృహనికొచ్చే విటుల[కష్టమర్ల] పట్ల గానీ, ఏ concern ఉండదు. వాళ్ళ శ్రేయస్సూ పట్టదు, ఆరోగ్యమూ పట్టదు. కేవలం తమ రాబడి మాత్రమే వాళ్ళకి ముఖ్యం! వాళ్ళకి ఏ నీతి నియమాలూ ఉండవు, దయా దాక్షిణ్యాలూ ఉండవు. తమ వ్యాపారమే తమకు ముఖ్యం. సరిగ్గా కార్పోరేటిజం ఇలాంటిదే!

ప్రాచీన భారత దేశంలో కూడా వర్తకులు ఉండేవాళ్ళు. ‘వర్తక శ్రేష్ఠి’, శెట్టిగార్లుగా పిలవబడే ఈ వర్గం, వాణిజ్యానికి సంబంధించి, కొన్ని నీతినియమాలతో వ్యవహారించేవాళ్ళు. వితరణశీలురుగా పేరెన్నిక గలవాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ప్రాచీన భారతం అంటే నా అర్ధం, ఈ గడ్డ మీదకి గజనీ మహమ్మదూ, ఘోరీ మహమ్మదూ, అల్లా ఉద్దీన్ వంటి ఎడారి దొంగలు ప్రవేశించి దోపిడులు చేయకముందు. ఆ దోపిడి సంపద పరంగానే కాదు, భావపరంగా కూడా!

ఇక రామాయణంలోనూ, భారతంలో నారద నీతి ప్రస్తావన లోనూ, వర్తక వర్గం గురించి స్పష్టమైన వివరణలున్నాయి. భట్టి విక్రమార్కుల కథల వంటి జానపద, చారిత్రకా, సంస్కృత సాహిత్యంలోనూ, వర్తక శ్రేష్ఠుల నిజాయితీ, నిబద్దతల గురించిన ప్రస్తావనలున్నాయి. గుప్తుల కాలంలో వర్తకులు, సముద్ర వ్యాపారం చేయటమే గాక, రాజుకి సైతం అప్పులూ, సలహాలూ ఇవ్వగల స్థితిలో ఉన్నారనడానికి ఆధారాలున్నాయి.

రైతులు పొలంలో పంట పండించటానికి పెట్టుబడి పెడతారు. పంటలు పండించేందుకు శారీరకంగా శ్రమిస్తారు. దానికనుగుణంగా వాళ్ళు లాభాలు పొంది తీరాలి. అది ధర్మం! ఏ రంగంలోనైనా కూలీలు శరీరశ్రమ పెట్టుబడిగా కష్టపడతారు. అందుకనుగుణంగా వాళ్ళు భత్యాలు పొందాలి. అది ధర్మమే! వైద్యులూ, ఉపాధ్యాయులూ, న్యాయవాదులూ, ఉద్యోగులూ.... శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. వారి సేవలకనుగుణంగా వాళ్ళు రాబడి పొందాలి. ఇదీ ధర్మమే!

అదే విధంగా.... వాణిజ్య సంస్థలు కూడా, వస్తు ఉత్పత్తికీ, విక్రయాలకీ, సేవల రంగంలో పెట్టుబడి పెడతారు. శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. దానికి తగినంతగా వాళ్ళు లాభాలు పొందితే అది ధర్మం. అంతేగానీ 100% లాభాలు పొందాలనుకోవటం, పెట్టుబడికి పదింతలు లాభాలు పొందేందుకు వ్యూహాలు పన్నటం, దగాలు చేయటం అధర్మం. పరమ నీచం!

ప్రాచీన కాలంలో వర్తకులు సమాజానికి కట్టుబడి, లోబడి ప్రవర్తించేవాళ్ళు. నలుగురూ తమ గురించి చెడుగా అనుకోకూడదన్న భయమూ, దైవం శిక్షిస్తాడనే భయమూ భక్తీ ఉండేవి. [ఇప్పటి కార్పోరేట్ల వంటి నాస్తిక ప్రబుద్దులూ కొందరుండేవాళ్ళనుకొండి. ధనబలంతో దైవాన్నే ధిక్కరించిన అలాంటి వాళ్ళనే మనం రాక్షసులనే వాళ్ళం. ఇంకొందరిది కుహనా భక్తివాదం.]

రాజ శాసనాల కంటే.... సంస్కృతి, మతం ఏర్పరచిన నీతి నియామలే.... ఎక్కువగా వర్తక వర్గాలనీ, ప్రజలనీ కూడా నియంత్రించేవి. స్వయం సిద్దంగానే వర్తకులు, తమ లాభాలలో కొంత భాగాన్ని సమజ శ్రేయస్సుకీ, వితరణలకీ వెచ్చించే వాళ్ళు. పేదలకు దానధర్మాలు చేయటం ‘పుణ్యసంపాదన’ అనుకొని చేసేవాళ్ళు. ‘తమ రాబడిలో ఇంత వాటా కేటాయించి, పుణ్యాకార్యాలు చేయాలన్నట్లుగా’ వ్యవహరించటం కద్దు!

కాబట్టే ఎడారి దొంగలూ, సముద్రపు దొంగలూ ఈ గడ్డ మీదికి రాకముందు, ఎంతో కొంత మెరుగైన ప్రశాంతతో, సమన్వయ సామరస్యాలతో, నాటి ప్రజలు బ్రతికారు. ఇది చరిత్ర కారులు సైతం ఉల్లేఖించిన సత్యం!

ఈ నేపధ్యంలో ఆహ్లాదకరమైన కథ ఒకటి ఇప్పుడు చదవండి. ఇది నేను, చాలా సంవత్సరాల క్రితం ‘చందమామ’ లో చదివాను.

అనగా అనగా....

ఒక రేవు పట్టణంలో, మాణిక్య శెట్టి అనే పేరొందిన వర్తకుడుండేవాడు. అతడు ఎంతో ధనవంతుడో అంత దయగలవాడు.

ఒకనాడతని దగ్గరికి, పదిహేనేళ్ళ కుర్రవాడొకడు వచ్చాడు. మాణిక్య శెట్టికి నమస్కరించి ఆ కుర్రాడు "అయ్యా! నా పేరు కరుణాకర శెట్టి. నా తండ్రి నా చిన్నతనంలోనే గతించాడు. నా తల్లి వృద్దురాలు. ఇప్పటికే నా కోసం శ్రమపడుతూ ఉంది. ఆమెకా శ్రమ తగ్గించాలని నా కోరిక. నా దగ్గర రెండు వెండి నాణాలున్నాయి.

మిమ్మల్ని అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది. అయినా పరిస్థితుల ప్రాబల్యం వల్ల మిమ్మల్ని అడిగేందుకు సాహసిస్తున్నాను. ఈ సారి మీరు, వర్తకం రీత్యా ఇతర సీమలకు వెళ్ళినప్పుడు, ఈ రెండు వెండి నాణాలతో నా కోసం ఏదైనా ఆకర్షణీయమైన, పనికి వచ్చే వస్తువుని కొనితెండి. దానితో నేను ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ చేసి, నా తల్లిని పోషించుకుంటాను. దయ చేసి నాకీ సహాయం చెయ్యండి" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుడి పట్ల చాలా కరుణ కలిగింది. అతడి వంక దయగా చూస్తూ "అబ్బాయి! నీకు పని ఇస్తాను. నాతో పాటు వర్తక పర్యటనకు వచ్చి , నా పనుల్లో సహకరించు. నీవు కోరినంత జీతం ఇస్తాను" అన్నాడు.

కరుణాకరుడు వినయంగా "అయ్యా! మీ దయకు కృతజ్ఞుణ్ణి. అయితే నన్ను క్షమించండి. నా తల్లి వృద్దురాలు. పైగా జబ్బుతో ఉన్నది. నేనామెకు దగ్గరుండి పరిచర్యలు చేయాలి. ఆమెని ఒంటరిగా వదిలి రాలేను. అందుకే నా కోసం ఏదైనా కొనితెమ్మని, మిమ్మల్ని అర్ధించవలసి వచ్చింది" అన్నాడు.

అతడి మాట తీరుకు మాణిక్య శెట్టి ముగ్దుడైనాడు. అతడి అర్దింపుని మన్నించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే, మాణిక్య శెట్టి వర్తక పర్యటనకై ఓడ మీద బయలుదేరాడు. వాణిజ్యానికి సంబంధించిన హడావుడిలో మునిగిపోయాడు. తిరుగుప్రయాణ సమయంలో, అతడికి కరుణాకరుడి అర్దింపు గుర్తుకు వచ్చింది.

అతడు వస్తు విక్రయ బజారులలో, కరుణాకరుడిచ్చిన రెండు వెండి నాణాలతో ఏదైనా కొందామని చూశాడు. రెండు వెండినాణాలకు కొనదగిన ఆకర్షణీయమైన వస్తువులేవీ అతడికి కనిపించలేదు. అతడికి కరుణాకరుడిని తలుచుకొని జాలి అన్పించింది. అంతలో అతడికి కొన్ని కోతులు అమ్మకానికి కనిపించాయి. కరుణాకరుడికి ఇవ్వడానికి కోతి తగినదని మాణిక్య శెట్టి కి తోచింది. కోతికి కరుణాకరుడు కొన్ని విచిత్ర విన్యాసాలు గానీ, చెట్టెక్కి కొబ్బరికాయలు కోయటం వంటి విద్యలు గానీ నేర్పి, డబ్బు సంపాదించు కోగలడని భావించి, అతడు కోతిని కొందామనుకున్నాడు.

అయితే కోతులమ్మేవాడు, ఎంత బేరం చేసినప్పటికీ, రెండువెండి నాణాలకి, నిద్రకి జోగుతున్న ఓ ముసలి కోతిని తప్ప, చురుకుగా ఉన్న కోతులని ఇవ్వనే ఇవ్వనన్నాడు. చేసేదేం లేక, మాణిక్య శెట్టి ఆ ముసలి కోతినే కొని, ఓడలో ఓ మూలన కట్టేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఎప్పుడు చూసినా, ఆ కోతి గమ్మున కునికిపాట్లు పడుతూ ఉండింది. పెట్టింది తిని మూలన పడుకునేది. ఇక దాన్ని కట్టేయటం కూడా అనవసరం అని, పనివాళ్ళు దాన్ని కట్టేయటం మానేసారు.

మాణిక్య శెట్టి ఆ కోతిని చూసి కొంత నిరుత్సాహ పడ్డాడు. ఇలా ఉండగా ఆ ప్రయాణంలో, వాళ్ళ ఓడ ముత్యాల దీవిని చేరింది. అక్కడ తీరంలో మంచి ముత్యాలు దొరుకుతాయని ప్రసిద్ది.

దేశదేశాల నుండి వచ్చిన వ్యాపారులు, అక్కడి జాలర్లకు, ఈతగాళ్ళకు డబ్బిచ్చి, ముత్యపు చిప్పలు ఏరుకురమ్మని సముద్రంలోకి పంపటంలో తలమునకలయ్యారు. ముత్యాల దీవిని ఓడ చేరిన క్షణంలో, అప్పటి దాకా నిద్రకు జోగుతున్నట్లు మూలన పడుకున్న కోతిలో చెప్పలేనంత చలనం వచ్చింది. ఒక్కసారిగా సముద్రంలోకి దూకి, క్షణాల్లో లోతులకి వెళ్ళి, చేతుల నిండా ముత్యపు చిప్పలతో తిరిగి వచ్చింది. వాటిని ఓడలో ఓ మూలన ఉంచి, తిరిగి ఉత్సాహంగా సముద్రంలోకి దూకింది.

అలా కొద్దిసమయంలోనే ఆ కోతి, చాలా ముత్యపు చిప్పల్నే ఏరుకొచ్చింది. బాడుగకు వచ్చిన గజ ఈతగాళ్ళ కంటే చాలానే పోగేసింది. అది చూసి మాణిక్య శెట్టి, ఆ కోతికి ముత్యపు చిప్పలని ఏరటంలో శిక్షణ ఇవ్వబడిందని అర్దం చేసుకున్నాడు. ‘అది ఎలాగో కోతులమ్మే వాణ్ణి చేరి ఉంటుంది. అందుకే అదెప్పుడూ నిరుత్సాహంగా, ఓ మూలన కూర్చునేది. ఎప్పుడైతే తనకు అలవాటైన, తర్ఫీదు ఇచ్చిన పని కనబడిందో, అప్పుడు ఉత్సాహంగా పనిలోకి ఉరికింది’ అనుకున్నాడు.

మాణిక్య శెట్టికి సంతోషం కలిగింది. అయితే అతడు ఆకోతిని గానీ, అది పోగేసిన ముత్యపు చిప్పల్ని గానీ, తన స్వంతం చేసుకోవాలనుకోలేదు. అప్పటికే కోతి చాలా ముత్యపు చిప్పల్ని తెచ్చి కుప్పబోసింది.

తర్వాత వాళ్ళు తమ పట్టణానికి తిరిగి వచ్చారు. వాళ్ళ రాక గురించి తెలుసుకున్న కరుణాకరుడు, మాణిక్య శెట్టిని కలుసుకున్నాడు. మాణిక్యశెట్టి "అబ్బాయి! నువ్వు అదృష్టవంతుడివి. నువ్విచ్చిన రెండు వెండి నాణాలతో ఏ వస్తువూ లభించలేదు. దాంతో నేను నీ కోసం ఓ కోతిని కొన్నాను. అయితే అది నీ అదృష్టం కొద్దీ, ముత్యపు చిప్పల్ని సేకరించటంలో శిక్షణ నివ్వబడ్డ కోతి అయ్యింది. మేము తిరుగు మార్గంలో ముత్యాల దీవిని చేరాము. నీ కోతి, చాలా ముత్యపు చిప్పల్ని ఏరుకొచ్చింది. ఇదిగో నీ కోతి, అది వెదికి తెచ్చిన ముత్యపు చిప్పలు! వీటిని తీసుకుని వ్యాపారం చేసుకో!" అంటూ కోతినీ, ముత్యపు చిప్పల్నీ అప్ప చెప్పాడు.

కరుణాకరుడు ఇది విని ఎంతో సంతోషించాడు. కోతినీ, ముత్యపు చిప్పల కుప్పనీ చూసి, ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత "అయ్యా! మీరు నాపట్ల ఎంతో దయ చూపించారు. మీరీ కోతిని నా డబ్బుతోనే కొని ఉండవచ్చుగాక! కానీ దానిని కొనాలని నిర్ణయించింది మీరే! కాబట్టి ఇది మీ అదృష్టం కూడా అయి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ దాచి, కోతినీ, అది తెచ్చిన ముత్యాలనీ మీ దగ్గరే ఉంచుకొని, నాకు మరేదైనా ఇచ్చినా, మిమ్మల్ని అభ్యంతరం పెట్టే వారెవ్వరూ లేరు. కేవలం మీ నిజాయితీ వల్లనే నా కిదంతా దక్కింది. కాబట్టి ఈ ముత్యాలలో సగం మీరు తీసుకొండి. మిగిలిన వాటితో నేను వ్యాపారం చేసుకుంటాను" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుని చూస్తే ఎంతో ముచ్చట కలిగింది. చిన్నవాడే అయినా... అతడి విశ్లేషణా, ఆలోచనా ధోరణి, నిజాయితీ ఎంతగానో నచ్చాయి. మాణిక్య శెట్టి బాగా ఆలోచించాడు. అతడికి ఒక్కగానొక్క కుమార్తె. కరుణాకరుడిని, అతడి తల్లిని చేరదీసి, తన ఇంట్లోనే ఉంచుకొని, కరుణాకరుడికి విద్యాబుద్దులు నేర్పించాడు. దాంతో పాటు వ్యాపార మెళకువలు కూడా! కరుణాకరుడిని ఆ విధంగా ప్రోత్సాహించి పెంచి, తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేశాడు.

తదుపరి కాలంలో కరుణాకరుడు మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. మాణిక్య శెట్టి మనుమలతో అడుకుంటూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడిపాడు.

ఇదీ కథ!

ఈ కథ రచయిత లేదా రచయిత్రి పేరు నాకు గుర్తులేదు. ఎవరైతేనేం? ఈ కథ ఒక భారతీయుడిది. ఒక ఆశావాదిది. ఒక భావవాదిది. ఈ కథలో రచయిత/రచయిత్రి, వర్తకులలో మంచితనం, కరుణ, నిజాయితీ ఉండాలని కాంక్షించారు. అదీ భారతీయ తత్త్వం! అనాదిగా భారతీయులు.... మంచి గురించి ఆలోచించారు, మంచి గురించి కలలు కన్నారు, మంచి గురించి కాంక్షించారు. ఎవరూ కలుషితం చేయకపోతే, ప్రాధమికంగా మనిషి మంచివాడే. ఏ దేశీయులైనా మంచినే కోరతారు. మంచిగానే ఉండాలనుకుంటారు.

అయితే, తరాల తరబడి, శతాబ్దాలుగా, నకిలీ కణిక అనువంశీయులూ, వాళ్ళ అనుచరులూ సహచరులూ.... ప్రచారిస్తూ ‘మంచి గురించి ఆలోచించటం, కలలు కనటం, ఆశించటం’ వంటి భావవాదం.... అవాస్తవిక దృక్పధం అని ప్రజలకి నూరి పోసారు. దాంతో మరింతగా మానవసంబంధాలు దెబ్బతిన్నాయి, దెబ్బతింటున్నాయి. మానవీయ విలువలదీ అదే స్థితి!

తమ గూఢచర్య వ్యూహాలతో, మంచి కోసం ప్రయత్నించే వారి జీవితాలని విఫలం చేసి మరీ, తమ ప్రచారాన్ని మరింత పెంచి, పదే పదే అదే ప్రచారంతో ‘నల్లమేక నలుగురు దొంగలు’ కథలో లాగా.... ప్రజల్ని ‘భావవాదం చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అవి వినటానికే బాగుంటాయి. ఆచరించటానికి కాదు’ అంటూ నమ్మించారు, నమ్మించ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచితనం అంటేనే మానసిక రుగ్మత మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

తమ వ్యాపారాభివృద్ది కోసం కార్ఫోరేట్ సంస్థలు, దేశభక్తి వంటి ప్రజల మనోభావాల మీదే కాదు, మానసిక బంధాల మీద, ఇతర భావోద్రేకాల మీద కూడా స్ట్రాటజీలు, పుకార్లు ప్రయోగిస్తారు.

ఉండీ ఉండీ హఠాత్తుగా ఓ ప్రచారం ఊపందుకుంటుంది. ‘అందరూ ఇలా అనుకుంటున్నారు’ అని ఎవరికి వాళ్ళే అంటారు. అలాగే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఆ ‘అనుకోవడాలు’ ఎలాంటి వంటే... ఫలానా బొమ్మ లేదా ఫలానా వస్తువు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తోందని - ఇలాగన్న మాట. మనీ ప్లాంట్ పెంచితే, ఆ మొక్క పెరిగినట్లుగా సంపాదన పెరుగుతుందని, ఓ అర్ధ శతాబ్దం క్రితం వచ్చిన ప్రచారంతో, ఆకుపచ్చని పెద్ద ఆకులతో కూడిన ‘లత’ ఇంటింటా ప్రాకింది. ఇలాంటి వాటిలో అప్పుడెంత వ్యాపారం జరిగిందో తెలీదు గానీ, ఇంటి ముంగిట పచ్చదనం కాబట్టి నష్టం లేదు.

అయితే ఇలాంటిదే.... ఫలానా బొమ్మ లేదా xyz వస్తువు - అంటే, ఇక ఆ బొమ్మ లేదా వస్తు విక్రయాలు ఎంత ఊపందుకుంటాయో ఊహించండి. పోనీ, అలాగని ఆ బొమ్మ ఏదో, మన కొండపల్లి బొమ్మో, నిర్మల్ బొమ్మో ఉండదు. పక్కాగా ప్లాస్టిక్ బొమ్మో లేదా కార్పోరేట్ కంపెనీ ఉత్పత్తి చేసే బొమ్మో అయి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియంలో గోల్డ్ ఫిష కూడా అలాంటిదే! vada ఫోన్ వాణిజ్యప్రకటనలో ఉన్న కుక్క జాతికి అమాంతం డిమాండ్ పెరగలేదూ, అలాగన్న మాట.

అలాంటి చోట, సదరు బొమ్మ లేదా వస్తువు ఉత్పత్తి తక్కువ చేసారనుకొండి. ఇక లభ్యత తక్కువైనప్పుడు సంభవించే డిమాండు ఎంతగా ఉంటుందో? అమ్మకాలు నల్ల బజారుకి వెళ్ళినా ఆశ్చర్యం ఉండదు.

మరో విషయం... చిన్నప్పుడు గుడ్డ ముక్కలతో మేం బొమ్మలు కుట్టుకుని, నల్లదారాలతో జుట్టుకుట్టేవాళ్ళం. అలాంటిదే అందంగా ఉన్న ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ గురించి. దాని కుటుంబసభ్యులూ, బాయ్ ఫ్రెండ్సూ, ఇల్లూ ఫర్నిచర్! పిల్లల్లో ఎంత ప్రచారమో, ఎంత మోజో! ఏటా ఇన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందనీ, ప్రపంచవ్యాప్తంగా సెకనుకి ఇన్ని బార్బీబొమ్మలు అమ్ముడౌతున్నాయనీ మీడియా చేసే ప్రచారాలు... ఇలాంటివే!

క్రమం తప్పకుండా, ఎవరూ గమనించని నిర్ణీత కాల వ్యవధులలో... వివాహిత అన్నా చెల్లెళ్ళు, లేదా అక్కా తమ్ముళ్ళ గురించి ఒక పుకారు/ప్రచారం వస్తుంటుంది. అదేమిటంటే - పెళ్ళయిన అక్కలు తమ తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళు తమ అన్నల్ని పిలిచి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టాలనీ, బదులుగా అన్నలూ చెల్లెళ్ళకు, శక్తి కొద్దీ బహుమతులతో పాటు కొత్త చీర పెట్టాలనీ, లేకపోతే ఇరువురుకీ అరిష్టం అనీ! ఎందుకలాగా అంటే - "ఏమో ఈసారి నక్షత్రాలు అలా వచ్చాయట" అనే అరగొర సమాధానం వస్తుంది. ఎవరికీ ఏదీ ఇదమిద్దంగా తెలియని స్థితి!

"సరే! పోనీలే! పెట్టేది మన తోడబుట్టిన వాళ్ళకే గదా! ఈ పేరుతో నన్నా బంధాలు గట్టిపడతాయి" అనుకుంటాము మనం. ఖర్చు నిభాయించుకోగలిగిన వాళ్ళకి బాధ లేదు. అప్పటికే ఆర్దికంగా అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళకి, తప్పని సరి కావటంతో, ఇది ఆర్దిక భారమే!

అలాంటి చోట బంధాలు గట్టిపడటం కన్నా.... అసంతృప్తితో మాటల ఈటెలు రేగటం కూడా, అక్కడక్కడా జరగటం పరిపాటే! ఇదంతా ప్రక్కన బెడితే... ఈ పుకార్లతో, చందన బొమ్మన వంటి కార్పోరేట్ వస్త్రదుకాణాలకి పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది. చిన్న దుకాణాల వారికి అమ్మకాలు పెరిగాయన్నా కూడా, అంతిమంగా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం నడిచేది, కార్పోరేట్ టెక్స్ టైల్స్ సంస్థలు రిలయల్స్ లూ గట్రాలకే గదా?

ఇలాంటి ఉదాహరణలు కొకొల్లలు. ఎవరి కన్నూ పడకుండానే, అందరి మీదా అనవసర భారాలు పెంచుతూ, చాపక్రింద నీరులా ఆక్రమించి, జీవితాలు తడిచి మోపెడవుతాయి.

ఇక తమ వ్యాపారాభివృద్ది కోసం ప్రజలలో పెంచే వ్యసనాలకు తక్కువేం లేదు.

వెనకటికి మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవిత్వానికనర్హం’ అన్నాడు. కార్పోరేట్ కంపెనీలు ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటారు. అలాంటి వాటిల్లో జూదం, మద్యం వంటి వ్యసనాలది పెద్ద వాటా!

అసలు ప్రజలు వ్యసన పూరితులౌతున్నారంటేనే, సమాజం పతన దిశలో ఉందని అర్దం! మద్యపు అమ్మకాలు ఎక్కువైనాయంటే - ప్రజలపై వత్తిడి ఎక్కువ ఉందని సామాజిక శాస్త్రవేత్తలంటారు.

ఈ నేపధ్యంలో ... బెట్టింగ్ వ్యాపారం గురించి పరిశీలిద్దాం. క్రికెట్ లో ఈ వ్యాపారం మరింత పరిమాణంలో నడుస్తుంది. ఇటీవల సునంద పుష్కర్, శశిధరూర్ Vs లలిత్ మోడి వివాదాలతో మరోసారి హోరెత్తిన క్రికెట్ బెట్టింగ్ వ్యాపారంలో.... పాకిస్తాన్, ఐఎస్.ఐ.లు నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీం, చేయితిరిగిన వాడన్న దుర్గంధం వెల్లువెత్తింది. అసలా ఐఎస్ ఐ, పాకిస్తాన్ లే.... నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వ్యవస్థ నిలబెట్టగా, సీన్ ఇవ్వగా, నిలబడిన బొమ్మలు!

పోతే... క్రికెట్ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించి పందేలు కట్టటమే బెట్టింగ్ వ్యాపారం. ఫలానా జట్టు గెలుపు లేదా ఓటమి అవకాశాలు ఇలా ఉన్నాయంటూ.... పుకార్లూ, ప్రచారాలూ, మీడియాలో సొల్లు విశ్లేషణలతో, బ్రహ్మడంగా జరిపించుకోగల వ్యాపారం బెట్టింగ్! ప్రజల్లో పందాలు కట్టే ఆసక్తినీ, ఉత్కంఠనీ రేపే విధంగా, మ్యాచ్ ఫిక్సింగ్ లతో రసకందాయంగా క్రికెట్ నాటకాన్ని నడిపించవచ్చు. వ్యక్తిగత స్కోర్ల మీద సైతం ఇదే దర్శకత్వం, మరింత వైవిధ్యభరితంగా సంఘటనలని జరిపించగలదు. ‘ఈ మ్యాచ్ లో లేదా సీరిస్ లో, ఫలానా ఆటగాడు ఫలానా రికార్డు చేరగలడా? లేదా?’ అన్న ఉత్కంఠ లేపితే చాలు, ఎంత వ్యాపారమో!

ఇక చిట్టచివర ఏ జట్టు గెలిస్తే.... అప్పటి వరకూ కట్టబడిన పందాలలో తమకి లాభమో, ఆ ప్రకారం గెలుపోటములు, క్రీడా మైదానంలో గాక, కంప్యూటర్ ముందు నిర్ణయించుకుంటారు.

ఈ బెట్టింగ్ వ్యాపారం క్రికెట్టు వంటి ఆటలతోనే గాకుండా, సెలబ్రిటీల జీవిత సంఘటనల మీద కూడా నడుస్తోందంటే - వ్యాపారంలోని అమానుషత్వం అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి ‘సానియా మీర్జా వివాహం జరుగుతుందా? లేదా?’ వంటివి.

ఆ బెట్టింగ్ నిర్వాహకుల లాభనష్టాలని బట్టి, సదరు సెలబ్రిటీల జీవన పరిణామాలున్నా ఆశ్చర్యపోవలసింది లేదు. అదృష్టవశాత్తూ అంతటి స్థితి ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చు.

వ్యసనాలలో, ఈ బెట్టింగు వ్యసనం లాంటివి మరికొన్ని ఉన్నాయి. పాన్ పరాగ్, సిగరెట్, శీతల పానీయాలు, మత్తు పానీయాలు. చివరికి సెల్ మోడల్స్ ని మార్చడం కూడా! అశ్లీల చిత్రాల్ని చూడటం, మాదక ద్రవ్యాల వాడటం మరింత తీవ్రమైనవి. మీడియా వాటికిచ్చే కవరేజ్, వాటిని మరింత పాపులర్ చేయటానికే తప్ప, నిర్మూలించటానికి అన్నట్లు ఉండదు.

శీర్షికలు మాత్రం, సమాజంలో నెలకొన్న ఈ స్థితి పట్ల మీడియా విచారం వెలిబుచ్చుతున్నట్లే ఉంటుంది. 1992 కు ముందరైతే చాలా సినిమాలలో... స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్ధులంతా, బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాలు వాడుతున్నారన్నట్లే చూపబడేవి. అవి ఎలా దొరుకుతాయో, ఎలాంటి నెట్ వర్క్ వాటి అమ్మకాల వెనక ఉంటుందో, అందులో లాభాలెలా ఉంటాయో, ఆ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించవచ్చో.... ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివాదాలు.... సదరు సినిమాలలో, మీడియా ప్రచారంలో ఉండేవి.

సినిమా అంతా ‘హింస, శృంగారాలు’ చూపించి, చివరలో ముక్తసరిగా, మొక్కుబడిగా ‘ఇదంతా తప్పు’ అంటూ ఓ నీతి వాక్యం జోడించినట్లుగా ఇదంతా ఉండేది. ‘ఆయా మాదక ద్రవ్యాలు వాడితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఓ సారి ప్రయత్నం చేద్దామా’ అని కుతుహలం రేపేటట్లుగానే ఉండేది చిత్రీకరణ!

1992లో, ఢిల్లీలో రోడ్డు ప్రక్కన కూర్చున్న యువకుడు, కాగితం మీద వేసుకున్న మాదకద్రవ్యాన్ని, మరో కాగితపు గొట్టంతో పీల్చడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాను. దాన్ని ‘హంటింగ్’ అంటారని అప్పటికే సినిమాలలో చూసి ఉన్నాను.

ఇదంతా ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసే మీడియా, అలాంటి మాదకద్రవ్య స్మగ్లింగ్ నీ, వినిమయాన్నీ నిరోధించటానికి ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏం చెయ్యాలో చెప్పేది కాదు. ప్రజలు ఆ దుష్టపరిణామాలకి ఎలా స్పందించాలో చెప్పేది కాదు. పిల్లలు వాటి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అన్న దానిమీద, అప్పుడప్పుడూ మాత్రం, నిపుణుల కౌన్సిలింగ్ లు వేసేది.

ఇంకా ఇప్పుడు ఆ విషయమై మీడియా దూకుడు కొంత తగ్గింది. అప్పట్లో అయితే.... ఒక దశలో, ఆనాటి పెద్దలు, యుక్తవయస్సులో ఉన్న తమ పిల్లల్ని విద్యాసంస్థలకి[ఢిల్లీ, ముంబై లాంటి చోట], యూనివర్సీటీలకి పంపటానికి కూడా సందేహించారు. ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ మీడియా ఈ విషయంలో పాజిటివ్ ముఖం పెట్టుకుని నెగిటివ్ రోల్ పోషించింది.

అచ్చంగా ఇప్పుడు.... నేరాలు-ఘోరాలు, క్రైం రిపోర్ట్, క్రైం స్టోరీ గట్రా శీర్షకలతో, సమాజంలో జరిగిన నిజ జీవిత నేరాలని, ఉద్రేకభరితంగా ప్రజెంట్ చేస్తుంది చూడండి. సరిగ్గా అదే స్ట్రాటజీ అప్పుడూ ప్రయోగించింది.

ఇదే స్ట్రాటజీ.... చందనం, కలప స్మగ్లర్ వీరప్పన్ విషయంలోనూ పాటించారు. విషయాంతరమే అయినా, ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్రసావనార్హమే! కలప దొంగ వీరప్పన్ కౄరుడు, నీచుడు! ఎందరో అమాయకుల్ని, పోలీసుల్ని చంపాడు. దేశ ద్రోహి, నేరగాడు!

అలాంటి వాడి గురించి మీడియా ఎన్ని విశేషాలు వ్రాసేదో! అతడికి కోతి రక్తమంటే ఇష్టమనీ, పచ్చినెత్తురు తాగుతాడనీ! చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మూడీ ఫెలో అనీ, మొండి వాడనీ! ఎవరికీ చిక్కని చాకచక్యం అతడి సొంతమనీ! నిజానికి, అడవి నుండి అతడు పంపే సరకు, బయట కొనే నాగరిక నేరగాడెవడో ఉండి ఉండాలి కదా!?

వీరప్పన్ అడవిలో ఉండే రాక్షసుడైతే, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న రాక్షసులు. అలాంతి రాక్షసులెవరి సహాయసహకారాలో లేకుండా వీరప్పన్, తన దొంగ వ్యాపారం ఎలా చేసేవాడు? సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని ఎలా ఆనందించే వాడు? అడవిలో పచ్చినెత్తురు తాగేవాడికి అంత డబ్బు సంపాదించినా ఒకటే, సంపాదించక పోయినా ఒకటే కదా!

స్టార్ హోటల్ లో చైనీస్ దగ్గరి నుండి అన్నిదేశాల వంటకాలు రుచి చూస్తూ జీవితాన్ని ఆనందించనపుడు, ఊరికే ఎందుకు డబ్బు సంపాదిస్తాడు? అందునా నేరాలు చేసి మరీ? అలాంటప్పుడు బయట నుండి వ్యాపార, అధికార, రాజకీయ వర్గాల నుండి వీరప్పన్ లాంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు ఉండి ఉండాలి.

నిజానికి వీరప్పన్ లే కాదు, చాలామంది అటువంటి అజ్ఞాత జీవితం గడిపే నేరగాళ్ళు, టెర్రరిస్టులూ.... ప్రచ్ఛన్న నామాలతో, ప్రచ్ఛన్న వేషాలతో, సీమాంతరాల్లో పంచతారల అతిధిగృహ సత్కారంలో ఆనందిస్తారని, తర్వాతి రోజుల్లో [1992 తర్వాత] వెల్లడి అయ్యింది. అలాంటి నేరగాడే కత్తుల సమ్మయ్య అనేవాడు, విమానం ఎక్కబోతూ, బాంబు హెచ్చరికతో జరిగిన తోపులాటలో మరణించటంతో ఈ విషయం దృష్టాంతపూరితం అయ్యింది. చందానగర్ హోటల్ గదిలో బాంబు పేలి గాయపడ్డ మొద్దు శీను వ్యవహారంతో అలాంటివి మామూలైపోయాయి.

ఇలాంటి నేపధ్యం వెనక నుంచుకొని కూడా, మీడియా, అడవి దొంగ వీరప్పన్ గురించి ఎంతో ఉద్వేగ పూరితంగా వ్రాసేది. సదరు వీరప్పన్ ని, నక్కీరన్ పత్రిక గోపాలన్ తప్ప మరెవ్వరూ కలుసుకోలేక పోయేవాళ్ళు. అతడి ఉనికి తెలిసినా, గోపాలన్, వీరప్పన్ పట్లే నిబద్దతతో ఉండేవాడు తప్పితే, ఆ నేరగాడి చిరునామా ప్రభుత్వానికి చెప్పేవాడు కాదు.

‘చెబితే ఈసారి వీరప్పన్ తనకి కూడా ఇంటర్యూ ఇవ్వడట. దాంతో అసలే సమాచారమూ తెలియకుండా పోయే ప్రమాదం ఉందట!’ ఎంత చక్కని పైకారణమో![over leaf reason]

ఇలాంటి సొల్లు కారణాలు చెబుతూ మీడియా, ఎంతో చక్కగా తన బాధ్యతలు విస్మరించింది. హక్కుల్ని మాత్రం ఎలుగెత్తి అరిచి సాధించుకునేది. ఎటూ వేదకాలంలో మునుల్ని గౌరవించినట్లు, ప్రజలు మీడియాని గౌరవిస్తారు, నమ్ముతారు. స్వాతంత్ర సమర సమయంలో కూడా, మీడియా ఒక పవిత్ర బాధ్యతని ఎంతో బలంగా, నిజాయితీగా నెరవేర్చింది. అందుకే ప్రజలు మీడియాని నిస్సందేహంగా నమ్ముతారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ, మీడియా ముసుగు వేసుకున్నది!

ఇక వీరప్పన్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి, తమ వ్యాపారం కోసం వ్యసనాలు పెంచే కుట్ర దగ్గరికి తిరిగి వస్తే.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదకద్రవ్య వ్యాపారం నిర్వహిస్తుంది. ఆఫ్ఘన్, పాకిస్తాన్ లలోని పేదరైతులకి, ఒకప్పుడు, దాదాపు 100% పంట పాపీ పంటే! ప్రపంచవ్యాప్తంగా దాన్ని మార్కెట్ చేసిపెట్టిన మాఫియా, నకిలీ కణిక వ్యవస్థకి అనుబంధ అనుచర వ్యవస్థే!

మాదక ద్రవ్య వ్యసనంతో మనిషి జీవితం, ఎంత దుఃఖ భాజనమౌతుందో వాళ్ళకి అనవసరం. సమాజం ఎంత భ్రష్టమౌతుందో అంతకంటే అనవసరం! ఇందులో వ్యాపార మొక్కటే విషయం కాదు. తత్ఫలితంగా ప్రజలు వ్యసన పూరితులే కాదు, తమో గుణపూరితులూ అవుతారు. అదే అసలు లక్ష్యం నకిలీ కణిక వ్యవస్థకి!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తమోగుణంతో నిస్తేజ పరిస్తే.... ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా ఉన్న నకిలీ కణిక అనువంశీయులు, భవిష్యత్తులో కింగ్ లు కాగలరు. ప్రస్తుతానికి కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్ప. ఎందుకంటే కింగ్ లు, అంటే - దేశాధ్యక్షులూ, ప్రధానమంత్రులూ గట్రా పదవులు, తాత్కాలికమైనవి, తక్కువ కాలవ్యవధి గలవి.

కాబట్టే - పరిస్థితులన్నీ సమకూడాక, తామే శాశ్వత కింగ్ లైతే.... క్రీస్తు పూర్వం నుండి అలెగ్జాండర్ ది గ్రేట్[?] లు కలలు కనీ, సార్ధకం చేసుకోలేక పోయిన దాన్ని, తాము సాక్షాత్కారింప చేసుకోగలరు. బ్రిటీషు వాడు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఆ కలను సాక్షాత్కారింపచేసుకున్నాడు.

ఇక్కడో గమ్మత్తు ఏమిటంటే - అలెగ్జాండర్, అతడి తండ్రికి ఉంపుడు గత్తె కొడుకే. నకిలీ కణిక అనువంశీయులకు తొలితరం వ్యక్తీ వేశ్యాపుత్రుడే! అందుకేనేమో, నకిలీ కణికులకి, అలెగ్జాండర్ పట్ల విపరీత ప్రచారం ఇచ్చేంత అమిత ప్రేమ!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మరో మెగా మోజు - క్రికెట్!

క్రికెట్ మోజులో నడిపించే వ్యాపారానికి అంతనేదే లేదు. ఆటగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లై, కాలి బూట్ల దగ్గరి నుండి నెత్తి మీద టోపీల దాకా అమ్మి పెడతారు. బట్టలూ, వాచీలూ, కూల్ డ్రింక్ లూ, హెల్త్ డ్రింకులూ, జాం లూ, చెత్తలూ చెదారాలు!

అమ్మానాన్న చెప్పినా, గురువు చెప్పినా వినని పిల్లలు, టీవీలో క్రికెటర్లు చెప్పారంటే వేదవాక్కులా పాటించేటంతటి ‘కిక్కు’ క్రికెట్ ది! "మా వాడు, ఫలానా ఆటగాడంటే పడి చచ్చిపోతాడు" అంటూ తల్లిదండ్రులే గొప్పగా, కళ్ళార్పుతూ చెప్పేచోట పిల్లల మోజులు మరింత పెరగవా మరి!?

మోడళ్ళుగా క్రికెటర్ల వాణిజ్య ప్రకటనలతో జరిగే వస్తు విక్రయాలు తెర మీద వ్యాపారమైతే, మ్యాచ్ ఫిక్సింగులూ బెట్టింగులూ తెర వెనక వ్యాపారం!

క్రికెట్ పండగ, క్రికెట్ సంరంభం, క్రికెట్ సందడి, క్రికెట్ సంగ్రామం, క్రికెట్ యుద్దం.. క్రికెట్ xyz... నిరంతరాయంగా హోరుమనిపించే ప్రచారం! రెండు సంవత్సరాల పిల్లాడి దగ్గరి నుండి, పండుముసలి దాకా, అధికుల్లో కనబడే మోహం ఇది!

క్రికెట్ ఆట, ఆటగా ఉంటే పర్లేదు. వ్యసనంగా మారి.... ఎన్ని పనిగంటలూ, ఎంత మానవశక్తి వృధా అవుతోందో ఊహకందదు. మా వెనక వీధిలో పిల్లవాణ్ణి, క్రికెట్ ఆడకుండా నిరోధించలేక, సంవత్సరానికి 50 వేల రూపాయలు కట్టుకొని హాస్టలులో చేర్చి చదివించుకుంటున్నారు, ఆ పిల్లాడి తల్లిదండ్రులు. తమకు భారమైనా సరే!

బెట్టింగులూ, మ్యాచ్ ఫిక్సింగులతోనే గాక, క్రికెట్ మోజులతో.... ఆహార పదార్ధాల దగ్గర నుండీ, ఆహార్య విహారాల దాకా, ఎన్నివేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో? కాబట్టే.... రాజకీయ నాయకుల బంధు మిత్ర సపరివార సమేతంగా క్రికెట్ ఫ్రాంఛైసీల వేలం పాటలలో సన్నాయి రాగాలు పాడారు. సినీ తారలూ, కార్పోరేట్ అధినేతలూ పోటీలు పడి మరీ [వేలం] పాటలు పాడారు.

ఒకప్పుడు సంతలో బానిసల్ని , పశువుల మాదిరిగా వేలం వేసేవారట. అది అనాగరికం అన్నారు. అవే నోళ్ళు ఇప్పుడు, క్రికెట్ తారల వేలాన్ని , వేలం వెర్రిగా మరీ ప్రచారించారు. ఇది నవనాగరికం కాబోలు! బహుశః నాటి బానిసలు బండచాకిరి చేసేవాళ్లు. నేటి క్రికెట్ తారలు అలాంటివేం చేయరు గనక ఇవే వేలంపాటలు గాకుండా పోయాయోమో!

[నాకో పెద్ద అనుమానం. తరచి చూస్తే ప్రచార పటాటోపమే తప్పితే, క్రికెట్ తారల బ్రతుకులు కూడా, నాటి బానిస బ్రతుకులకీ, పంజరంలో చిలకల బ్రతుకులకీ తీసిపోవేమో! ఖచ్చితంగా తెలియదనుకొండి, అనుమానం మాత్రమే! కాకపోతే బానిసలకి స్వంత సంపదలుండవు, వీళ్ళకి సంపదలుంటాయి. అంతే తేడా!]

ఇక క్రికెట్ మ్యాచ్ లున్న రోజుల్లో, అవి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న రోజులలో.... పాఠశాలలో, కళాశాలల్లో, కార్యాలయాలలో హాజరు చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్టు ప్రాంతాలలో కూడా, జనం గుంపులూ దుకాణాలలో టీవీల దగ్గర చేరి, క్రికెట్ చూస్తూ, స్కోరు గురించి చర్చస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగులూ చేసుకుని, ఆటని ఆడటం గాకుండా, నటిస్తారని తెలిసినా కూడా! అదీ మీడియా రేపగల మోజుల బలం!

అందరూ అంతగా తన్మయం చెంది, టీవీలో క్రికెట్ చూసే వేళ, దొంగలు పడి సర్వమూ దోచుకుపోయినా దిక్కుండదేమో నన్పిస్తుంది. 2002 లో, హైదరాబాద్ నగర కార్పోరేషన్ ఎన్నికల వేళ, జూబ్లీ హిల్స్ వంటి ధనిక కాలనీలో, పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండింది. కారణం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం!

ఈ విషయమై ఓ టీవీ ఛానెల్ వారు, ఓ విద్యావంతురాలైన ధనిక మహిళని ఇంటర్యూ చేస్తే, ఆవిడ అతిశయంగా "ఈ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందండి. ఏం చేయమంటారు? ఓటూ, క్రికెట్టూ రెండూ ముఖ్యమే! అయినా మ్యాచ్ వదులుకొని, పోలింగ్ బూత్ కి వెళ్ళలేక పోయాం" అంది. [ఇలాంటి వాళ్ళ ఓట్లకీ, ఓటు అమ్ముకునే దిగువస్థాయి వాళ్ల ఓట్లకీ విలువేం ఉందిలే అనుకొని, సోనియా ఈవిఎం లని Tamper చేసేసుకోవటం మొదలెట్టేసినట్లుంది.]

నిజానికి ఇతర ఆటలకి గానీ, ఆటగాళ్ళకి గానీ, ఇంత మోజు సృష్టింపబడలేదు. నిజానికి క్రికెట్టు ఆటలో, జుట్టు సభ్యుల మధ్య కో ఆర్డినేషన్ గానీ, నైపుణ్యాల స్థాయి గానీ, మరికొన్ని ఆటలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకి, దేశవాళీ ఆట అయిన ‘కబడ్డీ’ని తీసుకుంటే.... క్రికెట్ కి లాగా బ్యాటు, బంతి, పాడ్స్, హెల్మెట్టూ గట్రా సామాగ్రి అవసరం లేదు. పిచ్ గట్రాలూ అక్కర్లేదు. పదిమంది కలిస్తే ఎక్కడైనా ఆడుకోవచ్చు. పైగా, జట్టుగా ఎదుటి ఆటగాణ్ణి ఓడించటం, పట్టుకోవటం... ఒక జీవశక్తిలా అన్పిస్తుంది. ఎంత సేపు దమ్ముపట్టగలరో అన్నదే ఈ ఆటలో ఆటగాడికి బలం!

పెద్దలు ‘ధైర్యం’కి పర్యాయపదంగా ‘దమ్ములుండటం’ అనే పదాన్ని వాడతారు. గుండెల్లో దమ్ము అంటే - ఎక్కువ గాలిని పీల్చి, ఎక్కువ సేపు మళ్ళీ గాలి పీల్చకుండా నిబ్బరించుకోగలగటం! దమ్మెక్కువ సేపు పట్టగల వాళ్ళు, పెద్దయ్యాక మరింత ధైర్యవంతులుగా, అలసట లేకుండా పనిచేయగల పనిమంతులుగా ఉంటారట.

[ఇందులో నిజమెంతో నాకు తెలియదు గానీ..చిన్నప్పుడు మా స్కూలు కబడ్డీ టీం కు నేనే కెప్టెన్ ని. ఎక్కువ సేపు కూత పెట్టగలననీ, ఎదుటి జుట్టు సభ్యులు మన బరిలోకి వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకొని ‘ఔట్’ చేయగలననీ, మా పీఈటీ పంతులమ్మ నాకు జట్టు నాయకత్వం కట్టబెట్టింది. అర్బన్ వాళ్లతో బాగానే ఆడేం గానీ, రూరల్ పిల్లలతో ఓడిపోయాం!]

కబడ్డీ ఒక్కటే కాదు, పుట్ బాల్, త్రోబాల్ వంటి ఆటలకు కూడా, పెద్దగా వస్తుసామాగ్రి అవసరం లేదు. రెండు జట్లలోని ఆటగాళ్ళందరికీ, ఆడే అవకాశం, వ్యాయామం లభిస్తాయి.

క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఆ క్షణం ఆడుతున్న వాళ్ళు తప్ప, మిగిలిన వాళ్ళు డ్రెస్సింగ్ రూంలో కూర్చొ గలరు. చాలాసార్లు.... ఫిల్డింగ్ చేయాల్సిన ఆటగాళ్ళు, బంతి మీద గాక ప్రేక్షకులకి ఆటోగ్రాఫులూ, అభివాదాలు చేయటం మీదే శ్రద్ద కనబరచారనే విమర్శలు, ఇటీవల బాగానే వినబడ్డాయి.

కబడ్డీ, ఫుట్ బాల్ గట్రా ఆటల్లో అలాంటివేం కుదరవు. అందరూ, ఆట ఆడుతున్నంత సేపూ చెమటోడ్ఛాల్సిందే! క్రికెటేతర ఆటలలో కూడా ‘మజా’ ‘కిక్కు’ ఉన్నా కూడా, కేవలం క్రికెట్టు ఆటకే అంత మోజు ఎందుకొచ్చిందీ అంటే - క్రికెట్ లో వ్యక్తిగత రికార్డులు సృష్టించటం తేలిక. ఆ వ్యక్తిగతం ద్వారా చాలా వ్యాపారం చేయెచ్చు. మిగతా ఆటలలో వ్యక్తిగత రికార్డులను క్రికెట్ లో ఉన్నన్ని రకాలుగా సృష్టించలేరు. మిగతా ఆటలలో టీమ్ గా పనిచేయాలి. ఫలితం కూడా దాదాపుగా మొత్తం టీమ్ కే దక్కుతుంది. అదే క్రికెట్ లో అయితే వ్యక్తిగత రికార్డు సంపాదిస్తే చాలు, మ్యాచ్ ఓడినా, గెలిచినా ఒకటే!

అంతేగాక.... అన్ని ఆటలకి మోజులు సృష్టిస్తే, నియంత్రించటం శ్రమతో కూడుకున్న విషయం! అదే ఒకే ఆటకి మోజులు సృష్టిస్తే, అంతా మోనోపలే! అప్పుడు బెట్టింగూ, మ్యాచ్ ఫిక్సింగూ, కప్పం వసూళ్ళు లేదా కమీషన్లు... అన్నీ సులభం! అందుకే, ఆటలలోనూ కొన్నిటికే మోజులు! ఆటగాళ్ళల్లోనూ కొందరే సెలబ్రిటీలు! ఇప్పుడు మీడియా ఏకంగా క్రికెట్ భారత్ లో ఒక మతం అని, సచిన్ క్రికెట్ దేవుడని కూడా కీర్తిస్తోంది.

[మనిషికి విచక్షణని నేర్పేది, మంచి చెడు తెలియజెప్పేది మతం. ఏ మతం అయినా సరే! అలాంటి చోట క్రికెట్ ఏ విధంగా మతం అయ్యిందో ప్రచారించే మీడియాకే తెలియాలి.]

సెలబ్రిటీలు కదిలినా మెదిలినా దగ్గినా తుమ్మినా వార్తే! మిగిలిన ఆటగాళ్ళు చెమటోడ్చి గెలిచినా, కనీస గుర్తింపు కూడా లేనట్లు, వేస్తే ఓ మూల అప్రాధాన్య వార్త లేస్తారు, లేకపోతే అదీ లేదు! అదే సెలబ్రీటిలకైతే, చెప్పుకోదగిన విజయాలేం లేకపోతే... వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నా ప్రచురించి, ప్రజల మెమరీలో లైవ్ గా ఉంచుతారు.

ఫలానా సెలబ్రిటీకి ఫలానా కూరంటే ఇష్టమనో, ఫలానా నగలు కొన్నదనో, ఫలానా బ్రాండ్ బైకో, కారో కొన్నారంటూ....!

ఇక ఇలాంటి మోజుల్ని కొనసాగించటానికి, మరికొన్ని వైవిధ్యభరితమైన ఉపాయలున్నాయి. ఫలానా క్రికెట్ తారకీ, ఫలానా సినిమా తారకీ మధ్య ప్రేమాయణమో, శృంగారమో నడుస్తోందనీ, ఫలానా రెస్టారెంట్లో కనబడ్డారనీ మీడియా వ్రాస్తుంది, కోడై కూస్తుంది. ఆపైన విమర్శలూ, ప్రతివిమర్శలూ కూడా వేడి వార్తలౌతాయి లెండి!

ఇలాంటివే వాళ్ళ ముద్దుపేర్లు కూడా! ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్, దాదా గంగూలీ, ధనాధన్ ధోనీ లేదా జార్ఖండ్ డైనమైట్ ధోనీ, ముషారఫ్ మెచ్చిన క్రాఫ్ ధోనీ... ఇలా! అదేదో యూనివర్శిటీలు ప్రదానం చేసిన డాక్టరేట్లో, ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీలో అన్నట్లుగా! యూనివర్శిటీ డాక్టరేట్లూ గట్రా కూడా పైరవీలతో వచ్చేస్తాయి లెండి, సానియా మీర్జాకి డాక్టరేట్ ఇచ్చినట్లు.

ఇంతకీ... 2007-08 ల్లో ‘పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ మెచ్చిన జులపాల జుట్టు ధోని’ అంటూ ప్రచారం జరిగింది! అంతలో ఏమయ్యిందో, హఠాత్తుగా ధోనీ, పొడుగాటి జులపాల జుట్టుని కాస్తా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. ఇలా.... ఎప్పుడు ఆయా క్రీడాతారల గురించి ప్రస్తావించినా, ముందుగా ఈ మీడియా ప్రసాదిత బిరుదులని తప్పకుండా తగిలిస్తారన్నమాట. ‘టెన్నిస్ సంచలనం సానియా మీర్జా’ లాగా!

ఇవి చాలక, సంచలనాల కోసం తారలతో, క్రీడా తారల ప్రేమాయణ ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. మీడియాలో వ్రాయబడే ఈ సొల్లుతో.... పత్రికలూ టీవీలూ, ఏ విధంగా ప్రజా సేవ చేస్తున్నట్లో మీడియా నవాబులకే తెలియాలి. డీడీ సహితం, రాష్ట్ర జాతీయ వార్తలు కూడా ఎత్తేసి, క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

పైపెచ్చు ప్రైవేటు క్రికెట్ వ్యాపార సంస్థ అయిన బిసిసిఐ ని, అదేదో ప్రభుత్వ సంస్థ అన్నట్లుగా ఉంటుంది మీడియా కవరేజి! టీం ఇండియా అంటూ , అక్కడికి ఆ క్రికెట్ ఆటగాళ్ళ జట్టు.... ప్రభుత్వం తరుపునా, అధికారిక ప్రాతినిధ్యంతో ఆడుతున్నట్లుగా పిక్చర్ ఇవ్వబడుతుంది. ఒలింపిక్స్ లోనో, ఏషియాడ్ లోనో భారత క్రీడాకారులు ఆడినట్లుగా!

నిజానికి.... క్రికెట్ మ్యాచ్ లన్నీ బిసిసిఐ, ఐసిసి, ఐపిఎల్ వంటి ప్రైవేటు నిర్వాహకుల సంస్థలు నిర్వహించేవే! ఇప్పుడంటే సునంద పుష్కర్, శశిధరూర్, లలిత్ మోడీల పాపమా అని, వివాదాలు రచ్చకెక్కి, అవన్నీ ప్రైవేటు వ్యవహారాలని బయటపడింది గానీ, అంతకు క్రితం చాలామందికి, బిసిసిఐ అంటే ప్రభుత్వ పరమైనదే అనుకునేవాళ్ళు ఇప్పటికీ ఈ విషయమై ఎంతమందికి స్పష్టత ఉందో అనుమానమే!

బిసిసిఐ, ఐపిఎల్ గట్రాలు.... ప్రైవేటువైతే నేమిటీ, ప్రభుత్వపరమైనవైతే ఏమిటి అంటారేమో? రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ పరమైనవైతే లాభాలు ప్రజలవౌతాయి. ప్రైవేటువైతే.... భావోద్వేగాలు ప్రజలవి, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులవీ అవుతాయి. ఆటగాళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటారు గానీ, వ్యక్తిగత ఆస్తులే సమకూర్చుకుంటారు.

అయితే భారత జట్టు అంటూ, ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రాతినిధ్యం ఉన్నట్లుగా, మీడియా ప్రచారించడం వల్ల కూడా, దాదాపు ప్రజలందరూ పిల్లా పాపా, యువకులూ, వ్యక్తులతో సహా, భావోద్వేగాలకు గురి అవుతారు. మరో మాటలో చెప్పాలంటే వ్యాపారాభివృద్ది కోసం, తాము సృష్టించిన మోజులకు.... దేశాభిమానం, దేశభక్తిని అదనపు మద్దతుగా, ఆకర్షణగా అద్దుతున్నారు.

దేశాభిమానపు పరిమళం అద్దకపోయినా, క్రికెట్ క్రేజ్ ఉండవచ్చుగాక! అయితే ఇంత పరిమాణంలో ఉండదు. ప్రజలకు సహజంగా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని, వ్యాపార వనరుగా మార్చుకోవటమే ఇది.

మీడియా చేయదలుచుకుంటే... ఇదే విధంగా, ప్రజలకి తమ మాతృదేశం మీద ఉండే ప్రేమని, దేశాభివృద్దికి తోడ్పడే విధంగా కూడా, యువతలో ట్రెండ్ సృష్టించగలదు. కానీ చేయదు. తమ వ్యాపారం కోసం మాత్రం, ప్రజల మనోభావాలని ప్రభావితం చేస్తుంది. దేశభక్తి మాత్రమే కాదు, మానవ బాంధవ్యాలను కూడా!

అదెలాగంటే......

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే నేటి కార్పోరేటిజం! ఎలాగంటే - పార్టీల కతీతంగా నేతలంతా క్యూకట్టి మరీ, ఎకరా రూపాయకీ, వందరూపాయలకీ బడా బాబులకి కట్టబెట్టిన సెజ్ లని పరికించండి. దేశాభివృద్ది పేరుతో భూమిని సెజ్ ల కిచ్చారు. సదరు సెజ్ లలో, భారత రాజ్యాంగం అంగీకరించిన కార్మిక చట్టాలేవీ చెల్లవు.

సెజ్ యాజమాన్యపు ఇచ్ఛానుసారం పనిగంటలూ, కార్మిక వేతనాలూ ఉంటాయి. అంతేకాదు ఆయా సెజ్ లలో ఉత్పత్తి అయిన సరుకు ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ కి పంపబడితే, కొత్త నిర్వచనాల ప్రకారం ‘ఎగుమతి’ చేసినట్లేనట! కనీసం సరుకు విదేశాలకి ఎగుమతి చేయబడితే, విదేశీ మారక ద్రవ్యం వంటి దేశ ప్రయోజనాలన్నా నెరవేరతాయి.

మరో వైపు సెజ్ లకి భూమితో సహా మౌలిక వసతులూ, ముడి సరకులూ కూడా చౌకగా కట్టబెడతున్నారు. శ్రమ దోపిడి చేసుకునేందుకు ఈ ప్రత్యేక ఆర్దికమండళ్ళు[Special Economic Zone] కి, తమవైన ప్రత్యేక చట్టాలతో కూడిన రాజ్యాంగం ఉన్నట్లే! ఎంత కన్నాలతో కూడినది అయినా, భారత రాజ్యాంగం, సెజ్ లలో వర్తిందట మరి! ఎటూ ఈ సెజ్ లలో తయారయిన వస్తువుల విక్రయ ధర, ఆయా యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయి కదా! మరింత సమాచారం కోసం ‘కడలి తరంగం’ బ్లాగులో చూడగలరు.

ఇది ప్యాకింగ్ మారిన బ్రిటీష్ నాటి వ్యాపార దోపిడి గాక మరేమిటి? విచిత్రం ఏమిటంటే - ఈ సెజ్ లతో కార్మికుల బ్రతుకులను మరింత దిగజార్చింది కమ్యూనిస్ట్ దేశమైన చైనా! సెజ్ ల తాలూకూ సంపూర్ణదోపిడి కూడా, ఇప్పటికే చైనాలో పూర్తిస్థాయిలో నడుస్తోంది. ఇది చెప్పటం లేదా.... ఏ ఇజమైనా నిజం కాదని, దగాకు మరో రూపమేనని!

అన్నిటి వెనకా ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ గనకే.... ఏ దేశమైనా, ఏ ఇజమైనా.... ఇదే నడుస్తోంది!

ఇక సెజ్ ల విషయాన్ని ప్రక్కన బెడితే...

కార్పోరేట్ వ్యాపారం కోసం సృష్టించే మరికొన్ని మోజుల్ని పరిశీలిద్దాం!

మీడియా ముకుమ్మడిగా ఎత్తుకుందంటే దేన్నైనా హిట్ చెయ్యగలదు. అచ్చం డిజైనర్ చీరలు, దుస్తులూ, చెప్పులూ లాగా! ఒక్కసారిగా అన్ని పత్రికలూ హోరెత్తిస్తే, ఎటు చూసినా డిజైనర్ వస్త్రాలే అయిపోయాయి చూడండి, అలాగన్న మాట! ఇక ఈ మోజుల దృక్పధాన్ని, ఎంతగా ప్రజలలో ప్రవేశ పెడతారంటే -

కొన్ని సబ్బులకి, మాయిశ్చరైజర్లకీ టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనలని గమనించండి. ఓ చిన్నారి, మరో చిన్నారి దృష్టి నుండి, తాము వాడుతున్న సబ్బుని దాచేసి, తర్వాత తల్లి దగ్గరికి పరుగెట్టుకెళ్ళి "మమ్మీ! నువ్వు కూడా రాహుల్ వాళ్ళ మమ్మీలా మారిపో మమ్మీ!" అంటుంది. కాబట్టి ఫలానా సబ్బు లేదా షాంపూ లేదా మరో సౌందర్య ఉత్పత్తి వాడమని మారాం చేస్తుందన్న మాట!

ఇది విదేశాలలో [మన దేశంలో కూడా] ఎంత దూరం పోయిందంటే - పిల్లలు మన ఇంట్లో కార్పోరేట్ కంపెనీల ప్రతినిధుల్లా పనిచేస్తున్నారని నిపుణులు ప్రకటించారు. వస్తువు ఎలాంటిదైనా, అది తమకు సంబంధించనదైనా కాకపోయినా, చిన్నారులు, ఫలానా బ్రాండు వస్తువులే కొనాలని తల్లిదండ్రులని డిమాండ్ చేస్తున్నారట. ఫలానా కంపెనీ కారు లేదా మొబైల్ లేదా కంప్యూటర్ గట్రా కొనాలని.

టీవీ యాడ్స్ ప్రభావమూ, సహధ్యాయులతో పోటి మనస్తత్వమూ ఇందుకు కారణాలట. దాంతో కార్పోరేట్ కంపెనీలు, ఇప్పుడు తమ అమ్మకాల కోసం, పిల్లల మీద దృష్టి కేంద్రీకరించేయనీ, తమ వాణిజ్య ప్రకటనలన్నీ పిల్లల మనస్తత్వం మీదే గురిపెడుతున్నాయనీ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2008, జనవరి ఒకటో తేదీన ‘మన ఇంట్లో ఇతరుల ఏజంట్లు’ శీర్షికన ఈనాడులో పూర్తి వివరాలతో ఇదంతా ప్రచురితమైంది కూడా!

ఇక ఇలాంటి వ్యాపారంలో ఏపాటి విచక్షణ ఉంటుంది? బాల్య చాపల్యమే వ్యాపార ముడి సరుకు కావటమే కదా ఇది!? ఇదేదీ కార్పోరేటిజంకి పట్టదు. కావాల్సింది వ్యాపారాభివృద్ది మాత్రమే! దాని మూలంగా సమాజంలో, ఏ విధమైన శారీరక మానసిక రుగ్మతలు పెరిగినా వాళ్ళకి అనవసరం. "అవన్నీ ఆలోచిస్తే సంపాదించలేరు. ఫలానా కంపెనీ ఈ రకపు వ్యాపారం చేయక పోతే మరొకరు చేస్తారు" అంటూ కొంతమంది, సదరు కార్పోరేట్ సంస్థల్ని వెనకేసుకు రావటం కూడా కద్దు.

విషయం ఏమిటంటే - ఆ ఫలానా వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఈ విమర్శకు పాత్రులు. అంటే - ఈ రకపు వ్యాపారం రిలయన్స్ చేస్తే రిలయన్స్ నీ, మరో xyz కంపెనీ చేస్తే ఆ కంపెనీని ఉద్దేశించిన విమర్శ తప్ప, ఈ విశ్లేషణలో, నా వ్యక్తిగత అభిమానమో, అసహ్యమో.... ఏ కంపెనీ పట్లా లేవని గమనించగలరు.

ఇక ఇలా సృష్టించబడే మరో రకపు ట్రెండ్ లను గమనించండి. ప్రజా దృక్పధంలో ప్రవేశపెట్టే ట్రెండ్ లు.... ఫలానా వస్తువు[సెల్లో, బైకో] లేదా ఫలానా బ్రాండు వస్తువో కలిగి ఉండటం [పరువుకి] ప్రిస్టేజ్ కి సంబంధించినది. ఫలాన వస్తువు లేకపోవటం పరువు తక్కువ, కొండొకచో అవమానం కూడా." పదే పదే అదే ప్రచార వ్యూహంతో, ఇలాంటి కుహనా భావనలు సమాజంలోకి చొప్పించబడ్డాయి. దాంతో అధికశాతం ప్రజలు.... వస్తువునీ, వస్తువినిమయాన్ని ఆస్వాదించటం మరిచిపోయారు. వస్తువు కలిగి ఉండటం మీదే వాళ్ళ శ్రద్దంతా!

ఖరీదైన విలాస వస్తువులు ఇంట ఉండి, ఆనందించే తీరిక లేకుండా, క్షణం ఇంట ఉండలేనట్లుగా పరుగులెత్తే జీవితంలో మిగిలేదేమిటి? నీతా అంబానీ, 26 అంతస్థుల విలాస నివాసభవనం కలిగి ఉండినా, కారులో కునుకు తీయాల్సిన బ్రతుకు గడిపినట్లే! కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు తీరా ఆత్మీయులతో కబుర్లు... ఇవేవీ లేని జీవితంలో, సంపద ఉండీ ఉద్దరించేదేముంది?

ఇలా....‘వస్తువుని కలిగి ఉండటమే ప్రతిష్ఠకు నిదర్శనం’ అనే భ్రమలు పెరిగి.... సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేక పోయినపుడు, అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేకపూరితులై యువకులూ.... నిరాశానిస్పృహలకీ, ఆత్మన్యూనతకీ గురికావటం కూడా జరుగుతోంది. తాము కోరిన సెల్ ఫోన్ తండ్రి కొననందుకు, బైక్ కొననందుకు ఆత్మహత్యలు చేసుకున్న పదేళ్ళ పిల్లల నుండి, ఇరవై ఏళ్ళ యువకుల గురించి, ఎన్నో వార్తలు అప్రధాన్య అంశాలుగా వెళ్ళిపోతుంటాయి.

భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని, కేవలం వస్తువులూ, ద్రవ్యమూ, డబ్బే ఆనందదాయకమనుకొని, ఎండమావుల వెంట పరుగు పెడుతున్న పరిణామ ఫలితం ఇది!

జీవితంలో ఆకలి కేకలు వేసే వేళ, అనుభూతులకి విలువ లేదు.

అలాగే అనుభూతించని చోట సంపద సమకూడినా వ్యర్ధమే!

జీవితంలో పగలూ రాత్రి ఎంతో.... అనుభూతులూ అనుబంధాలూ, సిరిసంపదలూ అంతే!

భావవాదమూ, పదార్ధ వాదమూ రెండూ తగినంత పరిమితిలో ఉన్నప్పుడే మనిషి జీవితం సుఖదాయక మౌతుంది.

దాన్నే గీత
‘యుక్తాహార విహారస్య’ అంటుంది.

ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించగలిగే వాళ్ళు ఒకప్పుడు! ఇప్పుడది.... నకిలీ కణికుల గూఢచర్య వ్యూహాల కారణంగా, పదేపదే అదే ప్రచారం హోరులో మరుగున పడింది.

ఎప్పుడైతే ప్రజలు.... సత్యమూ, నిజాయితీ, జ్ఞానమూ, విలువలూ, క్రమశిక్షణతో కూడిన జీవనసరళే, జీవితానికి అంతిమ గమ్యమని గుర్తిస్తారో.... అప్పుడు సమాజంలోని ఈ చెడు అంతరిస్తుంది.

ఎందుకంటే - ‘మంచిగా బ్రతకటం, ధర్మం పాటించడం, సత్యం పలకడం అంటేనే మట్టి గొట్టుకు పోవడం’ అని నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించింది. గూఢచర్య బలంతో దృష్టాంతపూరితం చేసింది. నీతి నిజాయితీలతో బ్రతక ప్రయత్నించిన వాడు, ఉన్నది ఊడగొట్టుకుని, దారిద్ర్యపు బారిన పడటాన్ని సంఘటనాత్మకం చేసి, మీడియా ద్వారా మరింత ఫోకస్ చేసి ప్రజలని ప్రభావపరిచింది. "ఇవాళా రేపూ చెడుకే రోజులు!" అంటూ చెవినిల్లు కట్టుకు చెప్పి మరీ, ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచింది.

నకిలీ కణికులు తరాల తరబడి, శతాబ్దాల తరబడి, మానవ జాతి మీద ప్రయోగించిన కుట్రలో ‘ప్రజా దృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్నది ప్రధాన అంశం!

అందుకోసం మోజులు సృష్టించటం, భ్రమలు కల్పించటం, ఏదైనా చేసారు, చేస్తున్నారు. మరికొన్ని ఉదాహరణలు....!

కార్పోరేట్ కంపెనీల వ్యాపారం కోసం సృష్టించబడిన ‘వాలంటైన్స్ డే’ ఇలాంటి వాటిల్లో ఒకటి! టీవీల్లో, పత్రికల్లో వార్తాంశాలుగా, ప్రత్యేక శీర్షికలుగా హోరెత్తించి చేసుకునే వ్యాపారాలు కోట్లలోనే! పూలబొకేలు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు, మిఠాయిలు, కేకులూ, చాక్లెట్లూ... చల్లగా వజ్రపు టుంగరాలు, నగా నట్రాల వంటి గిప్టులూ!

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోజులలో, ఎందరు అమాయక లేత వయస్సు బాలబాలికలు నలిగిపోతున్నారో, ఈ వ్యాపారులకి అనవసరం! ఏటికేడాది మీడియా మళ్ళీ మళ్ళీ హోరెత్తిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఇన్ని కోట్ల గులాబీలు అమ్ముడయ్యాయనీ, ఇన్ని టన్నుల చాక్లెట్లు హాంఫట్ అయ్యాయనీ, తెగ ఊరించి వ్రాసేస్తుంది. "ఆ ‘దినం’ జరుపుకోక నువ్వే నష్టపోయావు. అందరూ తెగ బావుకున్నారు" అన్నట్లు పాఠకులకి/ప్రేక్షకులకి, ఎవరికి వాళ్లకి ‘తలంటు’ పోసేస్తుంది.

ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా వ్యాపార సంస్థలకి పట్టదు. ఎందుకంటే - ప్రభుత్వం స్పందించి ఆటంకపరిస్తే తప్ప, విమర్శల వల్ల తమకొచ్చే నష్టం ఏదీ లేదు. పార్టీలకతీతంగా ప్రభుత్వాలూ, మీడియా సంస్థలూ, తమ జేబులో బొమ్మలే అయినప్పుడు, తమ కొచ్చే కష్టమూ, నష్టమూ ఏముంది? ఎటూ గూఢచర్యమిళితమై, మీడియా అధినేతలూ, ప్రభుత్వాధినేతలూ, కార్పోరేట్ అధినేతలూ... ఈ వ్యాపారంలో ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకుంటున్నారు కదా? ఇంత విస్తారమైనది ఈ ఆర్దికపరమైన కుట్ర!

ఇలాంటి తాజా ఉదాహరణ అక్షయ తృతీయ! ఈ పండగ గురించి గానీ, ఆ రోజు బంగారం కొనే సెంటిమెంటు గురించి గానీ, ఎప్పుడూ ఎక్కడా చదివి ఉండలేదు, విని ఉండలేదు. ఇటీవల కాలంలో కార్పోరేట్ బంగారు నగల షోరూంలు వచ్చాక, అక్షయ తృతీయ గురించి అనూహ్య ప్రచారం వచ్చింది. ‘అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే, లక్ష్మీ దేవికి మన మీద అనుగ్రహం కలిగి మన ఇంటికి వస్తుంది’- అనే నమ్మకం, ప్రజల్లో కలిగి తెగ కొనేస్తున్నారంటుంది మీడియా! అమ్మకాలు నడిచాయంటాయి వర్తక సంస్థలు!

ఒకప్పుడు, ప్రజల ముఖ్యంగా హిందువుల గుడ్డి ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి గర్జించిన హేతువాద సంఘాలు, జన విజ్ఞాన వేదికలూ, ఈ కొత్త నమ్మకాల గురించి ఎందుకు కిమ్మనరో వాళ్లకే తెలియాలి.

ఇలాంటి మెగా మోజు మరొకటి ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని అనుచర వర్గంగా, సిఐఏ ఐఎస్ ఐ వంటి ఆయా దేశాల నిఘా సంస్థల్ని సహచర వర్గంగా.... కలిగి ఉన్న, తరతరాలుగా గూఢచర్యం నెఱుపుతున్న నకిలీ కణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగిస్తున్నది, ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బుగా మారుస్తున్న దోపిడినే!

ఈ గూఢచర్యాన్నే.... పాలనా యంత్రాంగంలో రెడ్ టేపిజం అనీ, పాలక వర్గంలో రాజకీయమనీ, అధికార వర్గంలో అవినీతి అనీ, వ్యాపార వర్గాల్లో కార్పోరేటిజమ్ అనీ, మాఫియా అనీ, మతోన్మాదమనీ, రకరకాల నేపధ్యాలలో రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అన్నిటిలో ఉన్నవి అవే పది స్ట్రాటజీలు! నకిలీ కణిక అనువంశీయులకు తెలిసింది అంతే!

అయితే.... ఈ గూఢచర్యంతో మిళితమైన వ్యాపారం, కార్ఫోరేటిజం లతో ‘పేదలు మరింత పేదవాళ్ళవ్వటం, ధనికులు మరింత ధనికులవ్వటం’ అన్నది మాత్రం అనులోమాను పాతంలో పెరుగుతూ పోతోంది. కూలీ, తోపుడు బళ్ళమీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళల్లో, చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే - ఇంటి యజమాని తాగుడు వ్యసనపూరితుడైతే ఇక ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశమే ఉండదు. తల్లీ పిల్లల రెక్కల కష్టం, బ్రతుకు గడవటానికే సరిపోతుంది. అలాంటి కుటుంబాల నుండి పిల్లలు చదువుకొని పైకి రావటం, ఆర్దిక స్థాయి పెరగటం అంటే - అసాధ్యం కాదు గానీ, కష్ట సాధ్యం!

ఇక ఇంటి యజమాని వ్యసనపరుడు కాకపోయినా కూడా.... వయస్సు, శరీర ధృఢత్వం ఉన్నన్ని సంవత్సరాలూ బాగా కష్టపడతాడు. అయితే వరసగా పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతుంటాడు. ఒకసారి అనారోగ్యం బారినపడ్డారా, ఇక ఆ కుటుంబపు స్థితి తలక్రిందులై పోతుంది.

నంబూరు పల్లెలో ఉన్నప్పుడూ, హైదరాబాద్ నానల్ నగర్ లో ఉన్నప్పుడూ కూడా .... ఇలా, సంవత్సరాల పాటు ఒంటి చేత్తో కుటుంబాన్ని పోషించే ప్రయత్నంలో కూలీ పనులతో కాయకష్టం చేస్తూ, దానికి తగినంతగా ఆహారపు అండలేక, ఎముకలు గుల్లయి పోగా, అనారోగ్యం పాలైన వాళ్ళని చూశాను.

ఇవేవీ అవగాహన లేని ఆ కుటుంబాల వాళ్ళు, "మా ఇంటాయనకి ఆరోగ్యం బావున్నప్పుడు మాకు ఏ లోటూ ఉండేది కాదక్కా! ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగుండక, పనికిపోవట్లా! ఎక్కళ్ళేని డబ్బు ఆసుపత్రులకే చాలట్లా" అని వాపోయిన మహిళల్నీ, వాళ్ళ జీవన స్థితిగతుల్నీ దగ్గరి నుండి పరిశీలించాను.

కుటుంబం పట్ల బాధ్యత తోనూ, కుటుంబ సభ్యుల మీద ప్రేమతోనూ, వాళ్ల అభివృద్ది కోసం అహర్నిశలూ కష్టపడుతూ, దానికి తగినంత పోషణ లేక కృశించిన పేద గృహస్థులని స్వయంగా చూశాను. ఆర్దికంగా కొంత పైస్థాయికి ఎదిగిన మధ్యతరగతి వాళ్లు కూడా, ఆ స్థితికి చేరటానికి.... కుటుంబ జీవితాన్ని, కనీస విశ్రాంతి వినోదాలని త్యాగం చేయటం పరిశీలించాను. అందరిదీ ఇదే స్థితి అనను గానీ, ఎక్కువమందిది ఇదే స్థితి అని చెప్పగలను.

ఇక ప్రభుత్వమే ఈ కుట్రలో భాగస్వామియై ప్రజలని దోపిడికి గురి చేస్తోందనటానికి గతంలోనూ, ఇప్పుడూ దృష్టాంతాలు కొకొల్లలుగా ఉన్నాయి.

ఒక ఉదాహరణ చూడండి. 1980 వ దశకంలో... అప్పట్లో ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హఠాత్తుగా అతడికి ఓ రోజు తెల్లవారు ఝామున [అతడి మాటల్లో బ్రహ్మ ముహుర్తం!] ఓ బ్రహ్మండమైన ‘ఐడియా’ వచ్చింది. దాంతో అతడు రాష్ట్రంలోని ద్విచక్ర వాహన దారులంతా శిరస్త్రాణం [హెల్మెట్] ధరించాలంటూ ఆర్డరు వేసేసాడు. ఆ బ్రహ్మముహుర్తంలో అతడికి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి గురించి తట్టిందట, ప్రజల క్షేమ శ్రేయస్సుల మీద శ్రద్దతో సదరు జీవో వేసేసాడు.

ప్రజల మీద అతడికున్న శ్రద్దా సక్తుల సంగతేమో గానీ, ఇక్కడ బహు గమ్మతైన విషయం ఒకటుంది. అతడికి ఒకానొక బ్రహ్మముహుర్తంలో ఇలాంటి ఆలోచన వస్తుందన్న విషయం, కేవలం స్టడ్స్ హెల్మెట్ తయారీ కంపెనీ మాత్రమే పసిగట్టగలిగింది!? దాంతో ఎన్టీఆర్ నిర్ణయం తర్వాత, మార్కెట్ లో వెల్లువెత్తిన డిమాండ్ ని, స్టడ్స్ కంపెనీ మాత్రమే అందిపుచ్చుకోగలిగింది. అందునా హెల్మెట్ ధారణకి నిర్దిష్ట గడువు నిర్ణయించి, ఆ తేదీ దాటితే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో హెల్మెట్లకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. బ్లాకులో అమ్మకాలు కూడా జరిగాయి.

ఇతర కంపెనీలు ఈ పరిణామానికి సిద్దపడి లేక పోవటంతో, పెద్దగా మార్కెట్ ని దక్కించుకోలేకపోయాయి. హడావుడిగా సరుకు దించినా, స్టడ్స్ కి ఇచ్చిన పోటీ తక్కువే! ఎన్టీఆర్ అనే రాజకీయ నటుడికి ‘సీన్’ ఇచ్చిన దర్శకుడు రామోజీరావుతో, స్టడ్స్ కంపెనీ లాలూచీ పడితే చాలు. బ్రహ్మముహుర్తంలో ‘ఐడియాలు’ వస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి.

ఇప్పుడున్న ఈ పాటి అవగాహన కూడా ఆరోజు ప్రజలకి లేదు. మీడియాని బాగా నమ్మేవాళ్ళు. ఇంతగా మీడియా నిజరూపం అప్పుడు బహిర్గత పడలేదు. దాంతో ఎవరూ అనుమానించలేదు గానీ, ఒక్క కలం పోటుతో, భారీ మొత్తంతో స్టడ్స్ కంపెనీ నుండి ఎన్టీఆర్ కీ, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, ధన ప్రవాహం నడిచింది.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను. ఎన్టీఆర్ పుట్టుకతో నటుడు. రాజకీయుడు కాదు. కాబట్టే అప్పుడప్పుడూ.... ఈ రాజకీయ దర్శకుడూ, నకిలీ కణిక అనువంశీయ గూఢచార వ్యవస్థలో కీలక వ్యక్తీ అయిన, రామోజీరావు పట్ల అవిధేయత కూడా చూపేవాడు. అలాంటప్పుడు.... రామోజీరావు, ఎన్టీఆర్ ని నాలుగు పీకి కూర్చోబెట్టేవాడు. కాకపోతే అవి భౌతిక దెబ్బలు గాక, స్ట్రాటజీ పరమైన దెబ్బలై ఉండేవి.

అలాంటిదే - ఓ సారి ఎన్టీఆర్ కు చెందిన రామకృష్ణా స్టూడియోలో మెటడోర్ వ్యానులో బస్తాల్లో డబ్బు కట్టలు దొరికటం! అప్పట్లో ఓ రోజు ఉదయాన్నే ఈనాడు తెరిస్తే... పేపర్లో పెద్దచ్చరాల్లో ప్రచురింపబడిన వార్త ఇది! ‘శివాజీ’ సినిమాలోనూ, ‘బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లోనూ చూసినట్లు ఏ ట్రిక్కులు ప్లే చేసారో గానీ, భారీ మొత్తంలో డబ్బు బయటపడి, ఫోటోలతో సహా పేపరుకెక్కింది. అచ్చం ఇప్పుడు హరిబాబు & చంద్రబాబుల ఏడుకోట్ల మాదిరిగానే, అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ డబ్బు తనది కాదన్నాడు.

‘పైకి నవ్వుతూ నాది కాదని, ఇంటికెళ్ళి ఏడ్చుకుని ఉంటాడని’ అప్పట్లో జోకులు కూడా పేలాయి. అసలుకే ఎన్టీఆర్, ఒకో కొడుకుకీ కనీసం 200 కోట్ల ఆస్థి కట్టబెట్టాలని కంకణం కట్టుకున్నాడని అప్పట్లో ఓ ప్రచారం ఉండేది.

స్టడ్స్ కంపెనీలతో లాలూచీలు అది నిజమేనని చెప్పకనే చెప్పాయి. అలాంటి అవినితేదీ లేనట్లయితే...కేవలం ముఖ్యమంత్రిగా వాహన చోదకుల క్షేమమే లక్ష్యమై ఉంటే - శిరస్రాణధారణకు రెండువారాల గడువులుండవు. [మరో వారం పొడిగించారు లెండి.] రెండో మూడో నెలలు గడువిచ్చినట్లయితే స్టడ్స్ కి మాత్రమే వ్యాపారం పండేది కాదు. అంతేగాక ఆరునెలలు తిరగక ముందే, సదరు జీవో అమలు అటకెక్కి పోయేది కాదు. కాబట్టి ఎన్టీఆర్ ప్రభుత్వ శ్రద్ద, శిరస్త్రాణాలు కొనిపించటం మీద మాత్రమే అన్నది, ఆ విధంగా నిరూపించబడింది.

ఇక ఈ విషయం వదిలేసి మళ్ళీ కార్పోరేట్ వ్యాపార దోపిడి దగ్గరికి తిరిగి వద్దాం. అయోడైడ్ సాల్ట్! అయోడిన్ లోపం వలన ధైరాయిడ్ సమస్యలు వస్తాయి కాబట్టి, ఉప్పులో అయోడిన్ కలిపి అమ్మాలని, అన్ అయోడైడ్ ఉప్పు అమ్మరాదని ప్రభుత్వం ‘రూల్’ పాస్ చేసింది. అప్పుటి వరకూ ఉప్పు పండించే రైతుల వ్యాపారవకాశాలు స్వేచ్ఛగా ఉండేవి. ఉప్పు అమ్ముకుని సాధారణ కుటుంబాలేన్నో బ్రతికేవి. దెబ్బతో ఉప్పు రైతుల మార్కెట్ అవకాశాలు కేవలం కార్ఫోరేట్ కంపెనీలకి పరిమితమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఉప్పు పొలాలు కార్పోరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయోమో! బండి మీద పోసుకుని ఉప్పమ్మ వచ్చే వారి ఉపాధి అవకాశాలు పోయాయి.

కార్ఫోరేట్ కంపెనీలు అన్నపూర్ణా[బిర్లా కుటుంబాలు], టాటా, కెప్టెన్ కుక్, ప్రియ గట్రాలు మార్కెట్లోకి వచ్చాయి. దైనందిన ఆహారంలో ఉప్పు తప్పనిసరి గనక, వ్యాపారం భారీ మొత్తంతో ఉంటుంది. చౌకధరల దుకాణాలలో ఇదే అయోడైడ్ ఉప్పు కిలో నాలుగైదు రూపాయలకు అమ్మేవారు. ఇప్పుడు అదీ అమ్మటం లేదు.

ఒకప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం, ఉప్పు మీద పన్ను వేసినందుకు, బాపూ నాయకత్వంలో ప్రజలు గర్జించారు. ప్రభుత్వాన్ని గడగడలాడించారు. పిడికెడు ఉప్పు స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుందంటే నవ్విన బ్రిటీష్ వాళ్ళు, దండి సత్యాగ్రహానికి కదలిన దండుని చూసి దడుచుకున్నారు.

దండి యాత్ర స్వాతంత్ర సమర చరిత్రలోనే అపూర్వమైనది, స్ఫూర్తిదాయకమైనది. అలాంటి భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం కంటే హేయంగా ఉన్నాయి. ఆనాటి భారతీయులతో పోలిస్తే ఈనాటి భారతీయులు, దోపిడిని మామూలుగా ఒప్పుకునేంత తామసంతో ఉన్నారు. దానికి తోడు, కార్ఫోరేట్ కంపెనీలు, తమ వాణిజ్య ప్రకటనలతో ప్రజలకు ఎన్ని మాయా మోహాలు, మోజులు కల్పిస్తాయంటే - సదరు కార్ఫోరేట్ ఉప్పులు తింటే పిల్లలకి జ్ఞాపకశక్తి అమాంతం పెరిగిపోతుందనీ, ఠక్కున ఐఏఎస్ అధికారులై పోతారనీ అన్నంతగా!

దీనికి కొసమెరుపు ఏమిటంటే - రెండేళ్ళ క్రితం అమెరికా లో, నిపుణుల బృందం - అయోడిన్ ఉప్పు వాడకానికీ, గతంలో చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలకీ సంబంధం లేదని తేల్చారు. పైగా తమ వ్యాపారం కోసం శాస్త్రవేత్తలనీ, ప్రభుత్వాలనీ కూడా, ఈ రకమైన ఆరోగ్య నివేదికలు ఇవ్వాల్సిందిగా, ప్రకటించాల్సిందిగా కార్ఫోరేట్ కంపెనీలు ప్రభావపరచాయని ముక్తాయించారు. ఆ జాబితాలో అయోడైడ్ ఉప్పుతో పాటు మరికొన్ని అంశాలూ ఉన్నాయి.

ఇదీ.... కార్ఫోరేటిజం నిర్వహించే వ్యవస్థీకృత దోపిడి! ఏది సత్యమో ప్రజలకి అర్ధం కానివ్వని దోపిడి! పిల్లల్ని కాపాడాల్సిన తల్లిదండ్రులే పసివాళ్ళని దోపిడి చేస్తే, వాళ్ళకి దిక్కెవరూ ఉండరు, దైవం తప్ప! అలాగే ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్ళని దగా చేస్తే, ప్రజలకీ దిక్కుండదు. మద్యపు వ్యాపారంలో తలమునకలుగా మునిగి, ఆదాయం కోసం ఏదారైనా తొక్కే ప్రభుత్వాన్ని చూశాక.... ఇది మన మేలు కోరే ప్రభుత్వం అనే భరోసాని కోల్పోయాక.... అది చెప్పే నివేదికలని, ఇచ్చే ప్రకటనలని, జారీ చేసే ఆదేశాలని, ఏమని నమ్మగలం?

కార్ఫోరేట్ కంపెనీలతో కుమ్మక్కై, భూగర్భ సంపదని దోచి పెడుతున్న ప్రభుత్వాధినేతలు, అదే కార్పోరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎలాంటి చట్టాలనైనా చేస్తారు. అదే ఇప్పుడు చూస్తున్నాం!

ఇక ప్రభుత్వ సహకారం సంగతి ప్రక్కన బెడితే....కార్పోరేట్ వ్యాపారంలోని మరికొన్ని కోణాలని చూద్దాం!

తమ వ్యాపారం కోసం కార్పోరేట్ కంపెనీలు ప్రజలలో ఎన్ని మోజులు పుట్టిస్తాయో, వాటిని మీడియా ఎంత ఇతోధికంగా [పెయిడ్ ఆర్టికల్స్ సాక్షిగా] ప్రచారిస్తుందో ఇప్పుడు మనందరం చూస్తున్నదే!

ఆరునెలల వయస్సులో పిల్లలకి అన్నప్రాశన చెయ్యటం మన సాంప్రదాయం. అప్పటి నుండీ పిల్లలకి ఘనాహారం ఇస్తుంటాము. ఒకప్పుడు గుజ్జన గుళ్ళు పేరుతో [ఈ పేరుతో చిన్నారుల ఆట కూడా ఉందని విన్నాను.] బియ్యమూ, కందిపప్పు, పొట్టు తీసిన పెసర పప్పు వేరువేరుగా దోరగా వేయించి, సన్నని రవ్వ చేసి, జీలకర్రా ఉప్పు కలిపి ఉడికించి, నెయ్యితో కలిపి మెత్తగా చేసి, పిల్లలకి తినిపిస్తారు. ఒకోసారి జీలకర్రా ఉప్పు బదులుగా, పాలూ చక్కెరా కలిపి తినిపిస్తారు. మొదట్లో తిరస్కరించినా, పిల్లలు తర్వాత ఇష్టంగా తింటారు. క్రమంగా గుజ్జన గుళ్ళులో, వేయించిన లేక ఉడికించిన కూరగాయ ముక్కల్ని [వంకాయ, బీరకాయ టమాటో గట్రాలు] కలుపుతూ, సంవత్సరం తిరిగే సరికల్లా పిల్లలకి అన్నీ అలవాటు చేస్తారు.

ఇలా ఘనాహారానికి అలవాటు పడిన పిల్లలు, పెద్దయ్యాక కూరలు తినటానికి మారాం చెయ్యరు. ఇది మా పాపతో నాకు స్వానుభవం. మా ఇంట్లో నా చిన్నప్పటి నుండీ, మా చిన్నమ్మల పిల్లలతో చూసిన అనుభవం కూడా!

ఇక ఈ గుజ్జన గుళ్ళు స్థానే, కార్పోరేట్ కంపెనీలు ఫారెక్సులూ, సెరిలాక్ లూ ప్రవేశపెట్టాయి. ముద్దులు మూటగట్టే బొద్దుపాపాయిల నవ్వులతో, ఆకర్షణీయమైన వారి వాణిజ్య ప్రకటనలు ఏ తల్లిదండ్రులనైనా ఊరిస్తాయి. అయితే, ఆయా ఘనాహారాలతో, తర్వాత సంవత్సరాల్లో, పిల్లలు ఊబకాయం [ఓబేసిటి]తో బాధపడటం, చాలామందిలో సంభవిస్తొందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ నిజాలు, ప్రచార హోరులో సామాన్య ప్రజలకు వినబడను కూడా వినబడవు. అంతంత మాత్రపు అదాయం కలవాళ్ళు కూడా, ఫారెక్సుల వెంటపడటం నేను పరిశీలించిన అంశమే!

ఓ ఉదాహరణ చెబుతాను. శ్రీశైలంలో మా క్రింది అంతస్థులో ఓ సెక్యూరిటి గార్డు కుటుంబం ఉండేది. తర్వాత రోజుల్లో వాళ్ళు మమ్మల్ని వేధించినా, తొలిరోజుల్లో సంబంధాలు బాగానే ఉండేవి. ఓ రోజు గుడికి వెళ్ళి వస్తుండగా, వాళ్ళ అబ్బాయి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆరేడు నెలలుంటాయి.

"అయ్యో! చిన్నబాబు ఎందుకలా ఏడుస్తున్నాడు?" అంటూ సానుభూతిగా అడిగాము.

"షల్లాక్ అయిపోయింది సార్! షాపులో అడిగితే లేదన్నాడు. ఇప్పుడు సరుకులోడ్ వస్తే ఇస్తానన్నాడు. తేడానికి పోతున్నా" అన్నాడు.

మాకేమీ అర్ధం కాలేదు. షల్లాక్ అంటే - రెక్సిన్ ను అతకడానికి వండ్రగి వాళ్లు ఉపయోగించే ఓ రకమైన జిగురు! వివరాలడిగితే తెలిసిందేమిటంటే పిల్లవాడు ‘సెరి లాక్’ కోసం ఏడుస్తున్నాడు.

ఉత్పత్తి పేరు పలకటమే రానివాడికి, ప్రయోజనాలేం తెలుస్తాయి? కానీ టీవీలో, అందమైన పిల్లల, చురుకైన నవ్వుల, వాణిజ్య ప్రకటన మాత్రం ఆకర్శిస్తుంది. అది వాడితే తమ పిల్లలూ.... అంత అందంగా, చురుగ్గా పెరుగుతారని ఆశ! అదీ నట్టింట టీవీ పుట్టించే మోజుల ప్రభావం!

అలాంటిదే ప్రామ్, వాకర్ వంటి వస్తువుల వాడకం కూడా! వాకర్ లతో పిల్లలకి పసితనంలోనే, మెదడులో నమోదు కావాల్సిన, గురుత్వాకర్షక అనుభవాలు దూరం కావటం గురించి, గతటపాలలో వ్రాసాను. ఇక ప్రామ్! సినిమాలలో, టీవీలలో చూస్తే... ప్రామ్ లో కూర్చొని దిక్కులు చూసే పాపాయి ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇంకా చిన్నపసిగుడ్డయితే... గుప్పిళ్ళు మూసుకుని, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి సాక్స్ వేసుకుని ప్రామ్ లో నిద్రించే చిన్నారి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తల్లిదండ్రులు కబుర్లు చెప్పుకుంటూ ప్రామ్ తీసుకు వెళ్ళటం చూస్తే చాలా బాగుంటుంది. మోజు పడి కొనుక్కోవాలనిపిస్తుంది.

అయితే, తల్లి చేతుల్లో, తల్లి గుండెలకు దగ్గరగా ఎత్తుకోబడ్డ బిడ్డలో భద్రతా భావం ఉంటుంది. అలాంటి వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ధైర్యగుణం చూపుతారు. అదే ప్రామ్ లో షికార్లు తిరిగిన పిల్లల్లో ఈ లక్షణం తక్కువ. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకునే విషయం.

ఈ విధంగా కార్పోరేట్ కంపెనీలు, మీడియా మద్దతు [పెయిడ్ న్యూస్ లాంటి ఆర్టికల్స్]తో సృష్టిస్తున్న మోజుల సుడిగాలితో ‘వ్యాపారం’ చేస్తున్నారు అనుకుంటాము. కానీ అది పైకారణం[over leaf reason] మాత్రమే!

వ్యాపారం మాటున.. తల్లిగర్భంలో పిండంగా రూపుదిద్దుకునే టప్పుడు మందుల రూపంలో,
శిశువుగా తల్లి పొత్తిళ్లల్లోకి చేరేటప్పటికి బేబీ ప్రాడక్ట్ రూపంలో,
అడుగులేసే నాటికి వస్తువులతో,
‘అ ఆ’ లు నేర్చేనాటికి కార్పోరేట్ చదువులతో,
మనిషి మనుగడలోని ప్రతిదశలో తామసాన్ని పెంచిపోషించి, సత్వరజోగుణాల్ని నాశనం చేసే ప్రక్రియ నడుస్తోంది.
ఇది గూఢచర్యం.
ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ కార్పోరేటిజం ముసుగు మాటున నిర్వహిస్తున్న గూఢచర్యం.

కాబట్టే... సామాజిక శాస్త్రవేత్తలు గానీ, మానసిక విశ్లేషకులు గానీ, మనో విజ్ఞానవేత్తలు గానీ, ప్రభుత్వాలు గానీ, సర్వే సంస్థలు గానీ... ఏవీ ఈ విషయాన్ని ఫోకస్ చేయవు.

ఎందుకంటె - సత్త్వ గుణం ఆలోచన రేపుతుంది.
రజోగుణం తిరుగుబాటు చేయిస్తుంది.
అదే తమోగుణమైతే... చెప్పుచేతల్లో చెప్పినట్లు పడుండేటట్లు చేస్తుంది.
అందుకే నకిలీ కణిక వ్యవస్థ అన్ని రంగాల ద్వారా నిర్వహిస్తున్న ఈ కుట్రలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యప్రజల మీద గురిపెట్టింది ‘తమో గుణ పూరితుల్ని చేయటమే!’

అప్పుడే ఇబ్బడిముబ్బడిగా శ్రామిక చీమలు దొరుకుతాయి మరి!

గమనించి చూడండి. ఆనాడు బ్రిటీష్ వాళ్ళు, మన దేశం నుండి ముడి సరుకు చౌకగా తీసుకుని [అదీ బలవంతాన], సామాన్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుని ఉత్పత్తిగా మార్చి, తిరిగి ఆ సరుకుని సామాన్య వినియోగదారులకి తము చెప్పిన అధిక ధరకు అమ్మేవాళ్ళు.

అదే ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న వ్యాపారమైనా! ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కార్పోరేటిజమ్ అంటేనే వ్యాపార దోపిడి! మరి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

‘రిలయన్స్’ కార్పోరేట్ సంస్థ.... పళ్ళు, కూరగాయలు, వంటింటి సరుకులూ అమ్మే వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రిలయన్సే కాదు, మోర్ గట్రాలు కూడా! నిజానికి... ఉప్పులూ పప్పులూ, తోటకూర కట్టలూ అమ్మడానికి కోటీశ్వరులైన కార్పోరేట్లు కావాలా?

అవి చిన్న పెట్టుబడిదారులు పెట్టగల వ్యాపారాలు. వాటిల్లోకి కూడా కార్పోరేట్ దిగ్గజాలు అడుగుపెట్టటం అంటే - చిన్న వారి వ్యాపారావకాశాలని, ఉపాధి అవకాశాలని దెబ్బ కొట్టటమే! దీన్ని కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వం చేతులు ముడుచుకుని, మద్యం వ్యాపారం చేతుల నిండా చేసుకుంటూ కూర్చొంది.


ఇక..... ఈ కార్ఫోరేట్ మదుపుటేనుగులు[దిగ్గజాలంటే అవే మరి!] ఈ చిల్లర సరుకుల వ్యాపారంలోకి రాక ముందు వరకూ... గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా రిటైల్ గా పళ్ళు, కూరగాయలూ అమ్మే నెట్ వర్క్ ఉండింది. తాజా పళ్ళు, కూరగాయలని తోపుడు బళ్ళ మీద, గంపల లోనూ పెట్టుకుని, తల మీదో సైకిలు మీదో మోస్తూ, మన ఇళ్ళ దగ్గరి కొచ్చి, చిన్న వ్యాపారులు అమ్ముతుంటారు.

వీళ్ళు చిన్న, పేద వ్యాపారులు. కార్ఫోరేట్ స్ట్రాటజీలతో పోటీ పడగల వారు కాదు.

కార్పోరేట్ రిలయన్స్ ఫ్రెష్ లూ, మోర్ లూ గట్రాలు.... మొదట్లో ఈ గంపల వ్యాపారుల కంటే తక్కువ ధరకు, ఆకర్షణీయమైన ప్యాకింగులలో పళ్ళు, కూరగాయలని వినియోగదారులకి అమ్ముతారు. ఏసీలోనూ, ఫ్రిజ్ లోనూ ఉంచి, మరింత తాజా పళ్ళనే అమ్మగలరు.

సహజంగానే వినియోగదారులు కార్పోరేట్ ఫ్రెష్ ల వైపూ, సూపర్ మార్కెట్లు వైపూ ఆకర్షితమౌతారు. అన్నిరకాల వస్తువులూ ఒకే చోట, వైవిధ్య భరితంగా, తాజాగా, తక్కువ ధరకు దొరకటం - తప్పకుండా వినియోగదారులని ఆకర్షిస్తుంది. పైగా.... కొంతకాలం పాటు లాభాలని వదులుకొని లేదా నష్టాలు భరించి అయినా, కార్పోరేట్ సంస్థలు, తమ ఉత్పత్తిని చౌకగా ఆఫర్ చేస్తాయి.

అచ్చంగా ఈస్టిండియా కంపెనీ ఉచితంగా టీ ఇచ్చినట్లు... ఇదంతా కూడా, వ్యాపార పెట్టుబడిలో భాగంగానే, సదరు కార్పోరేట్ కంపెనీలు భావిస్తాయి. ఇలా కొంతకాలం గడిచే సరికి.... పోటీ తట్టుకోలేని గంపల మీద పళ్ళూ, కూరగాయలూ అమ్మవచ్చే చిన్న వ్యాపారులు కనుమరుగైపోతారు.

వాళ్ళంతా మరింత పేదలౌతారు. కూలీలూ గానూ, కొండకచో సూపర్ మార్కెట్లలో స్వీపర్లు గానూ రూపాంతరం చెందుతారు. రెండు చేతులా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తూ ఆదాయపు పన్ను కట్టేంత ఆర్జనాపరుల గాక పోవచ్చుగాక, కానీ పెద్దగా చదువుకోని ఈ గంపల మీద పళ్ళమ్మే వారు గౌరవనీయంగా, స్వేచ్ఛగా బ్రతుకుతున్న వ్యాపారులు! ఆ స్థితి నుండి కూలీలుగా, పనివాళ్ళుగా మారడం - ఆత్మాభిమానం రీత్యానే కాదు, ఆర్దిక రీత్యా కూడా దారుణమే!

ఒకసారి ఆయా ఊళ్ళల్లో, కాలనీలలో, గంపల మీద అమ్మవచ్చే వ్యాపారుల నెట్ వర్క్ అదృశ్యమయ్యాక.... ఇక అప్పుడు ఈ కార్పోరేట్ కంపెనీలు తమ వస్తు విక్రయ ధరలని అమాంతం పెంచుకుంటాయి. ఇన్నాళ్ళు వేచి ఉన్న సమయానికి వడ్డితో సహా, పెట్టుబడినీ, లాభాన్ని తిరిగి రాబట్టు కుంటాయి. సూపర్ మార్కెట్లకీ, మన వీధి చివరల్లో కనబడే చిల్లర అంగళ్ళకీ మధ్య ఉన్నది కూడా ఇదే స్థితి! ఇక ప్రత్యామ్నాయం లేని స్థితికి వినియోగదారుడు నెట్టబడ్డాక, అసలైన దోపిడి అప్పుడు మొదలౌతుంది. ఇప్పటికే కొన్ని మెట్రో పాలిటన్ నగరాలలో ఈ స్థితి అనుభవంలోకి వచ్చింది.

దీన్నంతటిని నియంత్రించగల ప్రభుత్వం, ఎత్తి చూపించగల మీడియా.... ఎంచక్కా కార్పోరేట్ కంపెనీలకే వత్తాసు పలుకుతూ, అదే అభివృద్ది అంటాయి. మోనోపలి వ్యాపారుల ఆస్తులనీ, ఆదాయాలని చూపించి.... ఆర్దిక గణాంకాలూ, అంచనాలూ, సర్వేలూ అంటూ గ్రాపులూ, బార్ డయాగ్రం లూ చూపిస్తారు. ఇదే స్థితీ, సంబంధమూ.... అన్ని కార్ఫోరేట్ కంపెనీలకూ, వస్తు విక్రయాలకూ, సేవల విక్రయాలకూ వర్తిస్తుంది.

ఇది చాలక రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు మంగలి షాపులు కూడా పెట్టి, క్షౌర వ్యాపారంలోకి కూడా దిగుతారట. అందుకు తన వంతు సహకారంగా, ఇప్పటికే ప్రభుత్వం, మంగలి దుకాణాలలో కుర్చీకి ఇంతని పన్ను వడ్డించి, మంగలి వాళ్ళ నడ్డి విరిచింది. ఇప్పటికే.... ఉదయాన్నే మంగలి పొది చంకలో పెట్టుకుని, ఇంటికొచ్చి క్షౌరం చేసి వెళ్ళే సేవలు అంతర్దానమైపోయాయి. మా చిన్నప్పుడు చూసిన దృశ్యమిది.

ఇక ఇప్పుడు వీధి చివర మంగలి దుకాణాలు కూడా కనుమరుగవ్వనున్నాయి. ఆ తర్వాత.... ‘ఇలా ఫోన్ చేస్తే చాలు! అలా కారులో లేదా రిలయన్స్ వ్యానులో వచ్చి, క్షౌరం చేసి వెళ్ళే, సూటూ బూటూతో రిలయన్స్ యూనిఫామ్ వేసుకున్న బార్బార్’ గురించిన టీవీ యాడ్స్ త్వరలో చూడనున్నామన్న మాట!

అమలులో ఉన్న నెట్ వర్క్ నీ, ఉన్న స్థితినీ నాశనం చేసి.... తిరిగి దాన్నే గొప్పగా చెబుతూ వ్యాపారం చేయటం - కార్పోరేట్ లకి బాగా వచ్చిన విద్య. అచ్చంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని ధ్వంసం చేసి, ఇప్పుడు దాన్నే గొప్పగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటూ అమ్ముతున్నట్లు!

ఇక అప్పుడు భారతీయ సామాన్యులకి ఉన్న మార్గాంతరాలూ రెండే.
ఒకటి: రిలయన్స్ వంటి కార్పోరేట్ మంగలి[బార్బర్] వాడి చేత, గడ్డం తలలతో పాటు, జేబునీ క్షౌరం చేయించుకోవటం!
రెండు: ఆది మానవుడి [బార్బేరియన్]లాగా పొడవాటి గడ్డంతో, జుట్టుతో తిరగటం!!

ఇప్పటికే డ్రెస్ డిజైనర్ల పేరిట టైలర్లూ, హెయిర్ స్టైలిస్ట్ ల పేరిట మంగలి వాళ్ళూ, సెలబ్రిటీలని కస్టమర్లుగా కలిగి ఉండి, వినియోగదారులకి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మీడియా గొప్పగా ప్రచారం చేస్తోంది.

ఉన్న అవకాశాలు తొలగించి, అవసరాలు సృష్టించి వ్యాపారం చేసే ‘కార్పోరేట్’ల రాజ్యంలో... మామూలు టైలర్ల, మంగళ్ళ, చాకళ్ల సేవలకు కూడా అలాంటి మోజులు పుడితే.... ఇక ఇటు సామాన్యులు, అటు ఆయా సేవలందించే వృత్తిదారుల జీవితాలు కూడా, దారుణమైన దోపిడి వైపుకు దూసుకెళ్లటం ఖాయం. స్వేచ్ఛావ్యాపారులైన టైలర్లూ, మంగళ్ళూ, చాకళ్ళూ కార్పోరేట్ సంస్థల ఉద్యోగులైతే శ్రమదోపిడికి గురవుతారు. కార్పోరేట్ out let తప్ప గత్యంతరం లేకపోతే, సామాన్య వినియోగదారులు ధరల దోపిడికి గురవుతారు. రెండువైపుల నుండీ లాభాలు ఆర్దించగలిగేది కార్పోరేట్ కంపెనీలే అవుతాయి.

‘ఈ విధమైన నెట్ వర్క్ ని ఎంత బలంగా తయారు చేస్తే, అంతగా తమకు కప్పం కట్టించుకోవచ్చు’ గనక, నకిలీ కణిక వ్యవస్థ, తన గూఢచర్య వలయాన్ని వినియోగిస్తోంది. కాబట్టే - ప్రభుత్వాలు, మీడియా ఇతోధికంగా ఇందుకోసం పాటుపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాలు, ఈ విధమైన ప్రజా దోపిడికి ప్రాతిపదికలై పోయాయి, విద్యారంగం లాగా!

ఇలాంటి దోపిడే వ్యాపారం గనక.... రిలయన్స్ ముఖేష్ అంబానీలు, వేల కోట్ల రూపాయలతో 26 అంతస్థుల విలాసమైన నివాస భవనాన్ని కడుతున్నాడు. లక్ష్మీ మిట్టల్ లు లండన్ లో అత్యంత ఖరీదైన కాలనీలో అత్యంత విలువైన భవనాన్ని కొని అంతకంటే విలాసవంతంగా మెరుగులు దిద్దాడు. ‘ఇన్ని స్విమ్మింగ్ పుల్ లతో, ఇన్ని ఎస్క్ లేటర్లతో, ఇన్ని వేల కోట్లతో, ముఖేష్ అంబానీ ఇల్లు కడుతున్నాడంటూ’ ఈనాడు వంటి పత్రికలు వార్తాంశాలు వ్రాసాయి. తన ఇంటి పైభాగంలో హెలీపాడ్ నిర్మించుకొని, నేరుగా హెలికాప్టర్లతో తన కార్యాలయానికి చేరాలని కలలుగన్న ముఖేష్ కి, ముంబైలోని నేవీ అధికారులు ‘నో’ చెప్పారంటూ బాక్సు కట్టి మరీ వ్రాసేసారు.

ఆయా ధనికుల పట్ల ఈర్ష్యతోనో, అక్కసుతోనో ఇదంతా నేను వ్రాయటం లేదు. ప్రత్యక్షంగా కార్పోరేట్ మోసాలకు గురై అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఇవి. కష్టపడి డబ్బు సంపాదించిన వాడు, దాన్ని ఆనందించకూడదని నేను ఆనటం లేదు. వేలమంది పాదచారులు నడుస్తూ కష్టపడుతుంటే ధనికులు కారుల్లో వెళ్లటం తప్పని నేను అనను. [అయితే అది ధర్మబద్దంగా సంపాదించిందా, చట్టబద్దంగా సంపాదించిందా? ప్రభుత్వమే ఈ కార్పోరేట్ల దోపిడికి అనుకూలంగా చట్టాలు సవరించి, కొత్తగా చట్టాలు చేసి మరీ వీలుకల్పిస్తున్న చోట, వీళ్ళ వ్యాపారాలు, సంపాదనలూ ఏపాటి ధర్మబద్దం, ఏపాటి న్యాయబద్దం?]

అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అంటాను. "వరదొచ్చి ఓ ప్రక్క జనం అల్లాడుతుంటే, తిండి లేక పస్తులుంటే, నువ్వు పరమాన్నం తింటావా?" అంటే - ఈ ప్రపంచంలో ప్రతీరోజూ ఎక్కడో చోట.... వరదలో, కరువులో, భూకంపాలో, సునామీలో వస్తూనే ఉంటాయి. ఇక ఆ లెక్కన ఏ రోజూ, ఎవరూ, పరమాన్నం తినకూడదు. అలాంటి కుహనా భావవాదాన్ని [psudo idealism] ని నేను ప్రతిపాదించటం లేదు.

అయితే.... స్వార్దం, నిస్వార్ధం పాటించటంలో కూడా పరిమితులు ఉంటాయంటున్నాను. "ఈ దేశంలో, ఇందరు ఆకలితో, కూడు గూడు లేక అల్లాడుతుంటే.... హద్దులు లేనట్లుగా దొచుకుంటూ, అంత విలాసవంతమైన జీవితం గడపటం లో మానవత్వపు చిరునామా ఎక్కడ?" అనుకుంటాను. ఎంతగా హద్దులు లేకపోవటం అంటే ... ఆరుగురున్న కుటుంబానికి వేల కోట్ల రూపాయలతో 26 అంతస్థుల నివాస భవనం ఉండేంత! భార్యకు పడక గదులూ, వంట గదులున్న విలాసవంతమైన నౌకలూ, విమానాలూ కానుకలుగా ఇచ్చేంత!

అందునా ప్రభుత్వ సాయంతో, మీడియా సహకారంతో, అధికారుల అండదండలతో.... చమురు గ్యాస్ నిక్షేపాల వంటి ప్రకృతి వనరులని, గనులని కొల్ల గొడుతూ! ఇనుపగనులు గాలి సోదరుల గుత్తసొత్తు, చమురు అంబానీల అబ్బసొత్తూ అయిపోవటానికి.... ఈ దేశం గాలి సోదరులదీ, అంబానీ సోదరులదీ మాత్రమే అయిపోయిందా?

‘ఈ గడ్డ ఎవరి సొత్తు?’ అని ఆనాడు తెల్లతోలు వాళ్ళని నిలదీయగలిగారు గానీ, ఈనాడు నల్లతోలు కప్పుకున్న కార్పోరేటిజంని కళ్ళప్పగించి చూస్తున్నారు ప్రజలు! నిలదీసే నాయకత్వం ప్రతి గుండెలోనూ పుట్టాలి.

నాయకుడు ఆకాశం నుండి ఊడిపడడు. ప్రజా చైతన్యమే నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతీ మనిషిలో తామసం నశించి, రజోగుణం రగిలితే, కార్పోరేటిజం... ఆ కార్చిచ్చులో కాలి బూడిదవుతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇప్పుడు ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న మస్కిటో రిపెల్లెంట్ల వ్యాపారానికి, 30-35 సంవత్సరాల క్రితమే పునాదులు వేయబడ్డాయి. గత టపాలలో చెప్పిందే అయినా మరోసారి అది ప్రస్తావనార్హమే!

1975-80 లలో దేశంలో ఓ ప్రచారం హోరున ప్రాకింది. చైనీయులకి కప్పకాళ్ళతో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టమనీ, ఆరీత్యా మన దేశం నుండి చైనాకి కప్ప కాళ్ళు రహస్యంగా రవాణా అవుతున్నాయనీ! ఇలాంటి పుకార్లు పాకాయంటూ మీడియా, ఈ విషయానికి పరోక్ష ప్రచారం ఇచ్చింది. క్రమంగా ప్రత్యక్ష ప్రచారానికి దిగింది. [ఈ మధ్యకాలంలో ఆవేవో పాములు లక్షన్నర ధర పలికాయంటూ ఒక ప్రచారం వస్తోంది చూడండి, అలాగన్న మాట. ఆ ప్రచారపు ఆశతో జనాలు కనబడిన పాములనల్లా పట్టి చంపి అమ్మాలనుకుంటారు. వెరసి పాముల సంఖ్య తగ్గుతుంది.]

అడపాదడపా కప్పకాళ్ళలోడుతో ఉన్న లారీలు దేశంలో అక్కడా ఇక్కడా పట్టుబడ్డాయనే వార్తలు ప్రచురింపబడ్డాయి. కోల్ కతా[అప్పట్లో కలకత్తా]నుండి రోడ్డుమార్గం ద్వారా మియన్మార్ [అప్పట్లో బర్మా], బంగ్లా దేశ్ ల మీదుగా, చైనాకు కప్పకాళ్ళ దొంగరవాణా చేయబడుతున్నాయనే వార్తలు/పుకార్లు ప్రచారింపబడ్డాయి.

కమీషన్ పద్దతి తో కప్పకాళ్ళని కొనుగోలు చేసేందుకు ఏజంట్లు పల్లెలని అప్రోచ్ అవుతున్నారనీ, ఇదంతా చట్ట విరుద్దం గనకా, అడ్రసు గట్రాలు పైకి పొక్కకుండా పని చక్కబెట్టుకుంటున్నారనీ, కాబట్టి కమీషన్ ఏజంట్ల కోసం వెదకనవసరం లేకుండా వాళ్ళే గ్రామీణులని కలుసుకుంటున్నారనీ.... ఇలా రకరకాల ప్రచారాలు!

ఈ ప్రచారానికి హంగులద్దుతూ ‘ఎక్కడో ఎవరో’ ఇలాంటి వ్యాపారాలతో బాగా సంపాదించారనే వార్తలూ వినబడ్డాయి. నిజానికి దీని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలూకూ గూఢచర్యమే! కాబట్టే అలాంటి అసత్య వార్తలకు మీడియా ఇతోధికంగా ప్రచారం ఇచ్చింది. వార్తాంశాల శీర్షికలు ఎలా ఉన్నా... లోపల మాత్రం ‘ఇదంతా నిజమే సుమా! కప్పకాళ్ళని సేకరిస్తే ఒక్క దెబ్బతో పెద్ద మొత్తంలో డబ్బు కళ్ళ చూడవచ్చేమో’ అనిపించేలా వ్రాయబడ్డాయి. దానికి తోడు, కప్పకాళ్ళ లోడుతో పట్టుబడ్డ లారీల వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి.

ఎవరు ఎవరికి రవాణా చేస్తున్నారో వివరాలు తెలియలేదంటూ ముక్తాయించబడ్డాయి. వీటికి మరింత బలం చేకూర్చేందుకు, నాలుగైదు లారీలను అలాంటి లోడులతో నింపి, పట్టుబడించే సంఘటనలని నిర్వహించగల గూఢచర్య సామర్ధ్యం గురించి గానీ, స్ట్రాటజీల గురించి గానీ, సామాన్యులకి అవగాహన ఉండదు కదా! ఆనాటి ప్రభుత్వానికీ, నిఘా సంస్థలకీ ఆత్మరక్షణకే అధిక సమయం సరిపోయేది. గూఢచర్య పరంగా బలహీన స్థితే కాదు, అయోమయ స్థితి కూడాను. దాంతో మీడియా మద్దతుతో నిర్వహింపబడిన ఈ స్ట్రాటజీ వెనక గల కుట్ర, గుట్టు చప్పుడు గాకుండా నడిపింపబడింది.

ఆనాటికి మీడియాని కుట్రలో భాగస్వామ్యంగా ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఊహించగలిగినా, నిరూపించలేని నిస్సహాయత కూడా ఉండేది. కాబట్టి యధేచ్ఛగానే, మీడియా ఈ కప్పకాళ్ళ ప్రచారాన్ని నిర్వహించింది. ఆనాటి పత్రికల ప్రచారాన్ని పరిశీలించినా, జ్ఞాపకం తెచ్చుకున్నా లేదా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నా ఈ విషయం మీకు మరింత స్పష్టపడగలదు.

ఇక, ఇంత పకడ్బందీగా ప్రచారాలు నడిచాక... కొంతమంది గ్రామీణులు దురాశతోనూ, వేరెవ్వరో తెగ డబ్బు సంపాదించారన్న భ్రమతోనూ, కాల్వల్లోనూ, మురుగు గుంటలలోనూ బ్రతికే కప్పల్ని వెదికి వేటాడి చంపారు. నగరాలు, పట్టణాల్లో కప్పల బెకబెక కర్ణకఠోరంగా ఉందన్న ఏహ్యత... ఒక దశలో అదో ట్రెండ్ గా మారింది. ఫలితంగా మురుగు నీటి గుంటల్లో రసాయనాలు కలిపి మరీ కప్పల్ని చంపారు.

పల్లెల్లో గ్రామీణుల కప్ప కాళ్ళ వ్యాపారం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు గానీ, ఈ ప్రచారల ఒరవడి అంతా చల్లారాక.... కొన్నేళ్ళు గడిచే సరికి కప్పల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వర్షం కురిసిన రాత్రుల్లో కప్పల సంగీతం మూగబోయింది. అది గమనించక ముందే, దోమల బెడద పెరిగిపోయింది. దోమలకు ప్రకృతి సహజ శతృవులైన కప్పలు అంతరించటంతో, మురికి నీటిపై దోమల లార్వాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

ఇంకేముంది? తిరిగి చూసేసరికి ఆల్ అవుట్, జెట్, టార్టాయిస్,కాస్పెర్.... గట్రా పేర్లతో మస్కిటో రిపెల్లెంట్లు మార్కెట్లో వెల్లువెత్తాయి.

పరిశీలించి చూస్తే... చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళి, ఆరుబయట మంచాలు వేసుకుని, చుక్కల్నీ చంద్రుణ్ణీ మబ్బుల సయ్యాటల్ని చూస్తూ, కబుర్లు చెప్పటం, అమ్మమ్మ తాతాయ్యల దగ్గర కథలు చెప్పించుకుంటూ నిద్రపోవటం.... ఇప్పుడు కష్ట సాధ్యం. అప్పుడు దోమల బెడద అంతగా ఉండేది కాదు. హాయిగా ఆరుబయట నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు? ఒక్క నిముషమైనా దోమల చేత ఇంజక్షన్లు పొడిపించుకోకుండా బయట గడపలేం!

ఇదేమాట మనం అంటే.... కుట్ర మద్దతుదారులూ, లేదా కుట్రదారుల చేత నియోగింపబడిన వాళ్ళు.... సుత్తి సిద్దాంతాలు చెబుతారు. "చెత్త పెరిగి దోమలు పెరిగాయనీ, దోమలకు రోగనిరోధక శక్తి పెరిగి పోతోందనీ, అందుకు సామాజిక శాస్త్రం ప్రకారం xyz కారణమనీ, లేదా xyz సిద్దాంతరీత్యా అంతేననీ!"

నిజానికి గత కాలంలోనూ మురికి గుంటలున్నాయి. పల్లెల్లో ఇళ్ళ ప్రక్కనే నైదిబ్బలూ, పశువుల పాకలూ కూడా ఉండేవి. అయినా ఇప్పటితో పోలిస్తే అప్పుడే దోమలు తక్కువ ఉండటమే ఇక్కడ వ్యాపార రహస్యం!

ఎందుకంటే - ఇప్పుడు కార్పోరేట్ వ్యాపారంలో గూఢచర్యం మిళితమైంది మరి! కాబట్టే... భవిష్యత్తులో అమలు జరపబోయే వ్యాపార వ్యూహాలకి పునాదుల వంటి కార్యాచరణ, దానికి మూడు నాలుగు దశాబ్దాల క్రితమే ఆచరణలోకి వస్తుంది. అంత ముందుగానే ప్రణాళికలు రచింపబడతాయి! ఇదే కార్పోరేటిజం!

నిజానికి ఈ కార్పోరేటిజం కి ఆద్యులు యూరోపియనులే! దానిలో యూరోపియనల నిర్ధయి కి, అమానుషత్వానికీ, గూఢచర్యాన్ని మిళితం చేసింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థ! వివరంగా చెప్పాలంటే... ఒకప్పుడు యూరోపియనులు చేసే వ్యాపార దోపిడి పచ్చిగా ఉండేది. బహిరంగపడుతూ ఉండేది కూడా! నకిలీ కణిక వ్యవస్థ దానికి గూఢచర్యాన్ని జోడించాక, వ్యాపార దోపిడిలో ద్వంద్వాలు సృష్టించబడ్డాయి. దాంతో దోపిడికి పైకారణాలు [over leaf reasons] ఏర్పడ్డాయి.

దీనికి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

భారత దేశంలో ఈస్టిండియా కంపెనీతో సహా విదేశీ కంపెనీలు, వ్యాపారం కోసం భారత దేశం రావటం గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. 1498లో వాస్కోడగామా అనే పోర్చుగీసు నావికుడు, కేరళలోని కళ్ళి కోటని చేరటంతో, భారత దేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. అతడి వెనకే ఇతరులూ వచ్చారు. అప్పట్లో కొందరు యూరోపియనులే, ఈ నావికుల మీద జోకులు వేసేవాళ్ళు. నావికులని, ఆయా దేశాల రాజులు ఆర్దిక సాయం చేసి, కొత్త దీవులనీ, దేశాలకి మార్గాలనీ కనిపెట్టెందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు... సదరు నావికుల గురించి "సముద్రపు దొంగల గుంపులు దోపిడికి బయలు దేరాయి" అనే వాళ్ళు.

ఆ ‘ఎరా’లో యూరోపియనులు ఏ ప్రాంతానికి వెళ్ళినా[ఆస్ట్రేలియా, ఆఫ్రికా గట్రా] ఆయా దేశాలలో అంటురోగాలు, కొత్త జబ్బులు స్థానికులలో ప్రబలాయట. దాంతో స్థానికులలో అధికులు దుర్బలయ్యేవాళ్ళు. మరి కొందరు మరణించే వాళ్ళు. దాంతో పెద్దగా ప్రతిఘటన లేకుండానే, ఆ ప్రాంతాన్ని ఈ యూరప్ కంపెనీల వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక రకంగా చోటు ఖాళీ చేయించటం వంటిది. [ఆ పనిని ఇప్పుడు టెర్రరిజంతో చేస్తున్నారు. కాశ్మీరు, పాకిస్తాన్, ఆఫ్గాన్ లో లాగా!]

దానికి తోడు, అప్పట్లో ఆయా దేశాలలోని స్థానికుల దగ్గర ఆయుధాలు కత్తి డాలు, బాణాల వంటివే. యూరోపియన్ వ్యాపార దొంగల దగ్గర తుపాకులూ, మందుగుండూ ఉన్నాయి.

అప్పట్లో అయితే స్థానికులలో అంటురోగాలు ప్రబలటానికి కారణాలు, పాపం అప్పటి ప్రజలకి తెలియదు గానీ, ఆనాటి యూరోపియన్ కంపెనీల అమానుషత్వం తెలిసిన మనం ఆ కారణాలని ఊహించగలం కదా! ఆనాటి యూరోపియన్ కంపెనీల వారసులే నేటి కార్పోరేట్ కంపెనీలు! నిజానికి ఇప్పటికి అమెరికా వంటి దేశాలలో కార్పోరేట్ దిగ్గజాల మూలాలు ఇంగ్లండులో ఉన్నాయి. ఎన్నో కంపెనీల వేళ్ళు లండన్ లోనే కూరుకున్నాయి.

ఇంత నలుపు తమ క్రింద ఉంచుకుని, గురివింద గింజల వంటి ఈ యూరోపియన్ దేశాలు, ఇప్పుడు మానవ హక్కులంటూ గర్జించటం ఎంత హాస్యాస్పదం!?

సరే! ఇలా అంటు రోగాలు సృష్టించీ, ఆయుధాలు ప్రయోగించీ... వలస రాజ్యాలు స్థాపించారు. వాళ్ళు చేసిన వ్యాపార నిర్వాకం ఎంత మోసపూరితమంటే.... అప్పట్లో మన దేశంలో రైతులు, పొద్దునే చద్దన్నంలో పెరుగు వేసుకుని ఊరగాయో, ఉల్లిపాయో నంజుకుని తినేసి, పొలం బాట పట్టేవాళ్ళు. అంత కఠోరశ్రమకి పెరుగన్నం అయితేనే నిలదొక్కు కోగలరు మరి!

అలా పొలాలకి వెళ్ళే రైతులకి, కూడళ్ళలో నిలబడి, గ్రామీణులకి విచిత్రంగా కనిపించే వేష భాషలతో యూరోపియన్ వ్యాపారులు ‘టీ’ ఆఫర్ చేసే వారట. చాలా రోజులు రైతులు స్పందించకపోయినా, ప్రతీరోజూ చూస్తే ఓ కుతుహలం వస్తుంది కదా! పదే పదే అదే ప్రచారం అన్న స్ట్రాటజీ అది! దానికే నకిలీ కణిక వ్యవస్థ మరింత మెరుగులు దిద్దింది.

కుతూహలం కొద్దీ కొన్నాళ్ళకి, కొందరు రైతులు టీ రుచి చూడటానికి ముందుకు వచ్చారు. ఎటూ ఉచితమే కదా! నాలుగు రోజులు వరసగా తాగితే, యాంత్రికంగా మరోసారి తాగాలనిపించటం టీ కాఫీలకి సహజం. లేకుంటే తలనొప్పి రావటం కద్దు. అందునా దానికి కొంచెం నల్లమందును కూడా తగిలిస్తే... ఇక వినియోగదారుడు కాస్తా వ్యసనపరుడు కావటం ఖాయం. టీ, కాఫీ, చాక్ లెట్, శీతల పానీయాలని మార్కెట్టలో ప్రవేశపెట్టిన తొలినాళ్ళలో, నల్లమందు కలిపారని, ఆయా సమయల్లో వదంతులు[?] వినబడటం, ఒకోసారి నిర్దారణ కావటమూ కూడా జరిగాయి.

ఏమైతేనేం... మెల్లిగా జనాలు అలవాటు పడ్డాక, ఉచితాలు ఎత్తివేయబడి ‘వెల’ అడగటం ప్రారంభమౌతుంది. ఉచితంగ పంపిణీ చేయటం అన్నది కూడా పెట్టుబడిలో ఓ భాగంగా లెక్కలేసుకుని, తమ ఉత్పత్తిని విక్రయించటమే ఇక్కడ స్ట్రాటజీ!

ముందు ఉచితం.
క్రమంగా అలవాటు!
ఆపైన వ్యసనం!!
ఇదే కార్పోరేట్ సూత్రం!!!

ఒక చమత్కారాన్ని చెప్పి ఈ టపా ముగిస్తాను.

గుబ్బిలాల గుంపుని ఇంగ్లీషులో ‘కాలనీ’ అంటారట.
బ్రిటీష్ వాళ్ల వలస రాజ్యాలని కూడా కాలనీలనే అంటారు. ఔచిత్య ప్రయోగం అంటే ఇదేనేమో!

చిలుకల సముహన్ని ‘కంపెనీ’ అంటారట. ఒకప్పుడు వేశ్యా గృహన్ని ‘కంపెనీ’ అనేవాళ్ళు. ఇప్పుడూ అదే పేరు!
కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని కూడా కంపెనీలనే అనటం చమత్కారమే!

కోతుల గుంపుని ‘ట్రూప్’ అంటారట.
నాట్య కళాకారుల గుంపుని డాన్స్ ట్రూప్ అనీ, నాటక బృందాన్ని డ్రామా ట్రూప్ అనే అనటం ఆ కళాకారులని గౌరవించటమా, వెక్కిరించటమా!
ఇంగ్లీషు వాళ్లకే తెలియాలి.

గుడ్లగూబల గుంపుని ‘పార్లమెంట్’ అంటారట.
ఇది మాత్రం బహుచక్కని పేరే!
ప్రజాస్వామ్యం సాక్షిగా... ఏ దేశంలోనైనా ప్రస్తుతం పార్లమెంటులలో ఉన్నది గుడ్ల గూబలే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

తమ అనుయాయూలైన కార్పోరేట్ కంపెనీలకు, ఇబ్బడిముబ్బడిగా వ్యాపారావకాశాలు ఇచ్చేటందుకు, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయం సృష్టించే కృత్రిమ వస్తు కొఱత గురించి పరిశీలిస్తే...

గత టపాలో వివరించిన, సిమెంట్ తయారీదారుల సిండికేట్ ఒక ఉదాహరణ! ప్రయత్నపూర్వకంగా, ఉమ్మడిగా, ఉత్పత్తి తగ్గించి, మార్కెట్టులో కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సహజంగానే లభ్యత తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా! ఇక నల్లబజారు విక్రయాలకి హద్దుండదు. సంబంధిత శాఖ అధికారులూ, మంత్రులూ, ఇతర రాజకీయ నాయకులందరూ ప్రేక్షక మాత్రులే!

తెర వెనక ఎంతగా లంచాలు గుమ్మరించారో గానీ, తెర మీద, సిమెంట్ సిండికేట్, సాక్షాత్తూ ప్రభుత్వాన్ని... సిమెంట్ ధర పెంచుకోవటానికి అనుమతించటంతో పాటు, తమ ఇతర కోరికలు అంగీకరించకపోతే, ఉత్పత్తి ఆపి వేస్తామని బాహాటంగా బెదిరింపు [అల్టిమేటమ్] ఇచ్చారు. ఇదంతా 2008లో వార్తాపత్రికల ప్రధాన శీర్షికల సాక్షిగా జరిగిందే!

రాష్ట్రంలో ఉల్లి వ్యాపారుల వ్యవహారం మరో ఉదాహరణ! రైతుల నుండి ఉల్లి పంటని కోనే కమీషన్ వ్యాపారులు వీళ్ళు. అక్రమంగా ఉల్లి నిల్వలు చేసి మార్కెట్టులో కొరత సృష్టించారు. తర్వాత చేసేది ఉల్లి ధర అమాంతం పెంచటమే! అంతా ఏకఛత్రాధిపత్యమే![Monopoly] ఇది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.

ఎనిమిది తొమ్మిదేళ్ళ క్రితం, అంటే 2001, 2002 లలో, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు, మీడియా తొలిపేజీ వార్తలుగా ఈ విషయం ప్రకటింపబడింది. కర్నూలుకు చెందిన కేవలం ఆరుగురు ఉల్లి కమీషన్ [ఉల్లి] వ్యాపారులు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి మార్కెట్ ని నియంత్రిస్తున్నారని, ఈనాడు పెద్ద అక్షరాలలో వ్రాసింది కూడా! అప్పట్లో ఉల్లిధర చాలా ఎక్కువగా ఉండింది.

యధాప్రకారం, ప్రభుత్వం[నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు] సదరు కమీషన్ వ్యాపారులని గానీ, వాళ్ళ వ్యాపారాన్ని గానీ నియంత్రించ లేదు. నియంత్రించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. మీడియా కూడా, వార్తలు వ్రాసిందే తప్ప, ప్రభుత్వం ఆ దిశలో పనిచేసేటట్లుగా ఒత్తిడి చెయ్యలేదు.

కేవలం, సదరు ఉల్లి వ్యాపారుల గురించి ప్రొజెక్ట్ మాత్రమే చేసింది. ఆ వార్తల్లో... `ఉల్లి అక్రమ వ్యాపారం, దందా' ఎలా నడుస్తుందో, కేవలం ఆరుగురితో కూడిన ఉల్లి సిండికేట్ ఎంత శక్తివంతమైనదో, వాళ్ల ముందు ప్రభుత్వం ఎంత ఆశక్తమైనదో, వాళ్ళ లంచగొండి వ్యాపారం ఎంత బలమైనదో, చదువరుల బుర్రలకి ఇంకేంత చక్కగా వ్రాయబడింది.

ఆ విధంగా... జయప్రదంగా, వ్యూహాత్మకంగా... చెడు బలమైనదనీ, సమాజంలో చెడే ఉందనీ, చెడ్డవాడే బాగుపడగలుగుతున్నాడనీ, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదనీ, మంత్రులూ అధికారులూ కూడా లంచాలతో మునిగి తేలుతూ ఏదీ పట్టించుకోవటం లేదనీ, ప్రజలకి ఇంకించే ప్రయత్నం కొనసాగించబడింది.

‘కాబట్టి ఇవాళ్ళా రేపూ అవినీతిదే రాజ్యం, డబ్బు సంపాదనే లక్ష్యం! డబ్బున్న వాడు ఏంచేసినా చెల్లుతుంది. అక్రమాలు బయటపడినా ప్రమాదం ఏమీ లేదు, పైగా పేపర్లో పడి పరపతి పెరుగుతుంది’ అన్నట్లు పరిస్థితి తయారయ్యింది.

ఈ విధంగా ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచే ఏ అవకాశాన్నీ మీడియా వదులుకోదు కదా?

మరో ఉదాహరణ రైతులకి విత్తనాల పంపిణీ! ఇవన్నీ పీరియాడికల్ గా సంభవించే వ్యవహారాలన్న మాట. ప్రతీ సంవత్సరం తిరిగి తిరిగీ సంభవిస్తూనే ఉంటాయి. కార్పోరేట్, ప్రైవేట్ విత్తన కంపెనీలు, వీలయినంత గరిష్ఠ స్థాయిలో రైతులను దగా చేస్తూనే ఉన్నాయి.

విత్తన కంపెనీల వాణిజ్య ప్రకటనలు రైతులని ఆకర్షిస్తాయి. వాళ్ళ ప్రచార క్యాంపెయిన్లు రైతులని ఆకర్షిస్తాయి. కానీ వాళ్ళ విత్తనాలు మాత్రం రైతులని కుప్పకూలుస్తాయి. ఒకోసారి విత్తనాలు మొలకెత్తవు. ఒకోసారి మొలకలొస్తాయి, మొక్కలు బలంగా, ఏపుగా పెరుగుతాయి, కానీ కాయవు. గొడ్డుమోతు మొక్కల్లా పొలం నిండా నిలబడతాయి. ప్రభుత్వం, మీడియా పాత్రలు ఇందులో కూడా యధాతధం!

ఈ కార్పోరేట్ విత్తన కంపెనీలు రాక ముందు, ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయటం మొదలు పెట్టక ముందు, పూర్వకాలం రైతులు ఏం చేసే వాళ్ళో ఈనాటి యువరైతులకి, నడి వయస్సు రైతులకీ, తెలియను కూడా తెలియదు. తరం నుండి తరానికి సంక్రమించాల్సిన వారసత్వ వాస్తవ విజ్ఞానధార, వ్యవహార జ్ఞానధార, ఎప్పుడో రెండు తరాల క్రితమే సన్నగిల్లింది. క్రమంగా అంతరించింది. ఇన్ స్టంట్ పుడ్ లాంటి ఇన్ స్టంట్ వ్యవహారాలకి అలవాటుపడ్డారు, పడుతున్నారు.

మొదట్లో ‘మన రైతులది మూర్ఖత్వమనీ, పాతరాతి యుగపు వ్యవసాయమనీ, ఆధునిక పద్దతులు తెలియవనీ, కాబట్టే దిగుబడి ఎక్కువగా సాధించలేక పోతున్నారనీ’ ఊదర బెట్టబడింది. ‘వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, ఆధునిక వ్యవసాయ జ్ఞానం పాటించాలి’ అంటూ హోరెత్తించబడింది. మొదట్లో కొందరు శాస్త్రవేత్తలు నిజాయితీగా రైతు శ్రేయస్సు కోరి పని చేసారు.

తర్వత్తర్వాత, లంచగొండులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వరదలా ప్రవేశించటంతో, ఆ ఒరవడిలో ఈ నిజాయితీ పరులు ఎప్పుడో గల్లంతయి పోయారు. ఇప్పుడు అక్కడక్కడా మిగిలి ఉన్నారు. ఇదే స్థితి ఏ ప్రభుత్వ యంత్రంగానిదైనా.

ఇక ఈ స్థితి వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు..... క్రమంగా ఉన్న స్థితిని ధ్వంసం చేయవచ్చు. ఆధునిక వ్యవసాయ జ్ఞానాన్ని టాంపర్ చేస్తే సరి! మొత్తంగా దేశంలో... వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు, వాస్తవిక జ్ఞానం పులుసులో కలిసిపోతుంది. అదే జరిగింది.

చిన్న ఉదాహరణ గమనించండి. సామాజిక అడవుల పేరిట, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం, సరుగుడు చెట్లు పెంచబడ్డాయి. వాటితో పాటు సుబాబుల్ కూడా! ముఖ్యంగా సర్వి చెట్లు/యూకలిప్టస్ చెట్లు! ఎవరైనా ధనవంతులు, ఊరు చివర భూములు కొన్నప్పుడు కూడా.... ఊరు పెరిగి వాటికి ధర పెరిగే వరకూ వేచి ఉండాల్సి వచ్చినప్పుడు... అవి దురాక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు, సామాజిక అడవులు అంటూ సర్వి, యూకలిప్టస్ గట్రా చెట్లు పెంచారు. [వాచ్ మెన్ లని నియమించుకుని భూముల్ని కాపాడుకోవటం ఖర్చుతో కూడుకున్నది.] అందుమూలంగా చాలా లాభాలుంటాయంటూ దూరదర్శన్, ఆకాశవాణి వ్యవసాయదారుల కార్యక్రమాలలో కూడా చెప్పబడింది.

అయితే.... సర్వి చెట్లు, యూకలిప్టస్ చెట్లతో కలప, ఔషధ ప్రయోజలుండవచ్చుగాక, కానీ, వాటి మూలంగా భూగర్భ నీటి నిల్యలు పడిపోతాయనీ, ఈ దుష్పరిణామం ఇటీవలే గుర్తించబడిందనీ 1992 లో డీడీ వార్తల్లో చూశాను. అవి మేము గూఢచర్యం గురించి ‘అ ఆ’ లు తెలుసుకుంటున్న రోజులు.

సదరు ఊరి చివరి బీడు భూముల్లో సర్వి, యూకలిప్టస్ ల బదులు మరేవైనా చెట్లు పెంచుకోవచ్చు. అదీ భూగర్భ జనవనరులని దెబ్బతీయని చెట్లని! సామాజిక అడవుల పేరుతో... సర్వి, యూకలిప్టస్ చెట్లని పెంచితే వచ్చే ‘సత్ర్పయోజనాలు, దుష్పయోజనాలని’ పరిశీలిస్తే... వచ్చే లాభం [కలప, ఔషధ తయారీ] తక్కువ, పోయే నష్టం ఎక్కువ! భూగర్భ జలాలు అడుగంటితే, దశాబ్దాల తర్వాత వచ్చేది దారుణ క్షామమే!

ఇప్పుడు గమనించి చూడండి. ఒకప్పుడు బస్సులో ప్రయాణిస్తూ, కిటికీ నుండి చూస్తుంటే, చాలా చోట్ల సరుగుడు, యూకలిప్టస్ చెట్లతో నిండిన స్థలాలు కన్పించేవి. ఇప్పుడవి నామమాత్రంగా కనిపిస్తాయి.

ఈ విషయంలో... గతంలో ప్రభుత్వమే ప్రజలకి, రైతులకి... ‘బీడు నేలల్లో ఖాళీ భూముల్లో సరుగుడు, యూకలిప్టస్, సూబాబుల్ పెంచమంటూ’ సలహాలిచ్చే విధంగా... మొత్తం జాతినే Misguide చేయటం... నకిలీ కణికుల కుట్రలో భాగమే! అదే స్థితి కొనసాగి ఉంటే, ఇప్పటి కంటే తీవ్రమైన నీటి యెద్దడిని, ఈ పాటికే అనుభవిస్తూ ఉండేవాళ్ళం.

ఇలాంటి చాలా విషయాల్లో, నకిలీ కణికులు అప్పటి వరకూ [1992 వరకూ] ప్రజల దృష్టికి రాకుండానే నెరవేర్చుకుంటూ వెళ్ళిన కుట్ర కోణాలని, అదే విధంగా పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం, ప్రజల దృష్టికి రాకుండానే ఛేదించుకుంటూ నడిపిస్తున్నారు.

వాస్తవిక వ్యవహార జ్ఞానం, తరం నుండి తరానికి సంక్రమించ వలసిన అనుభవ సారం, అనుశృతంగా నడవకుండా, ధ్వంసం చేయటమే పరమావధిగా.... నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. ఇందుకు మరో ఉదాహరణ పరిశీలించండి.

ఇటీవల వృద్ద రైతులు ఒకరు చెప్పగా వార్తపత్రికలో ఓ మూల అప్రాధాన్యా వార్తగా వచ్చిన అంశం ఇది. ఆ వృద్ద రైతులు, వ్యవసాయంలో దిట్టలు, జ్ఞానులు. క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి.

[>>>రైతుల మేథస్సుకు భద్రత
సాగు మెలకువల రక్షణకు సాఫ్ట్‌వేర్‌
ఐఐటీ, బయో డై వర్సిటీ బోర్డు సంకల్పం
కోచి, అక్టోబర్‌ 6:

'ముంగారు మొలక' అంటే తెలుసా? మీకే కాదు... నేటితరం రైతుల్లో చాలామందికి తెలియకపోవచ్చు! వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? విత్తనాలు ఎప్పుడు వేయాలి? ఇలాంటి విషయాలపై ముందే అంచనాకు వచ్చేందుకు పాతకాలం రైతులు చేసే ప్రయోగమిది.

సరిగ్గా ఉగాది రోజున పూచే ఈ మొలకకు వచ్చే పువ్వుల సంఖ్యను బట్టి, రైతులు వర్షాకాలంపై అంచనాకు వస్తారు. అంటే.. సీజన్‌ ప్రారంభానికి మూడు నెలల ముందే, వానలపై రైతులు అవగాహన పెంచుకుంటారు. ఇది పాతతరం రైతులకు మాత్రమే తెలిసిన కిటుకు.

ఇలాంటి సంప్రదాయ సాగు విజ్ఞానం మన రాష్ట్ర రైతుల్లో అపారం. ఇలాంటి మెలకువలను భద్రపరిచి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు, ఇతరులు కాపీ కొట్టకుండా పేటెంట్‌ సాధించేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రత్యేకం.

ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సాగులో పాటించే మెలకువలను ఆయా రైతులతోనే చెప్పిస్తారు. ఈ వివరాలతో ఆడియో - వీడియో టేపులు తయారు చేస్తారు. వీటిని ఆంగ్లంలోకి అనువదిస్తారు.

అంతర్జాతీయ మేథోసంపత్తి హక్కుల సంస్థ వెబ్‌సైట్‌కు అప్‌లింక్‌ చేసి... పేటెంట్‌ పొందుతారని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు కార్యదర్శి బీజీ రమణ మూర్తి తెలిపారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం రోజునే ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కేరళలోని కొచ్చిలో ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడాడుతూ "ముంగారు మొలకపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా పరిశోధనలు సాగిస్తోంది.

ఈ మొలక సరిగ్గా ఉగాదిరోజే పూస్తుందని రుజువైంది. గ్రామ పంచాయతీల స్థాయిలో 12వేలు, మండలాల స్థాయిలో 1100, జిల్లాల స్థాయిలో 28 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను నియమించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం'' అని వివరించారు. బహుళ జాతి కంపెనీల దాడి నుంచి సాంప్రదాయ సాగు పద్ధతులను కాపాడేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ]

ముంగారు మొలక నాటటం ద్వారా, మూడు నెలల ముందే ఆ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకోవటం లెక్క కట్టగలరు. ఒకప్పుడు ఇలాంటి వాటినే, ‘అదంతా ట్రాష్!’ అనీ ‘మూఢనమ్మకం’ అనీ ఆనాటి ఆధునిక శాస్త్రం అన్నది. చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలూ అదే అన్నారు.

నాలుగు దశాబ్దాల గడిచే సరికి, రైతు, రెంటికీ చెడ్డ రేవడైనాడు. తరాల నుండి సంక్రమించిన అనుభవ జ్ఞానమూ శూన్యమైంది. ఆధునిక వ్యవసాయ శాస్త్రం, ఆర్దిక శాస్త్రంతో కలిసి... మన్మోహన్ సింగ్ లూ, ఆహ్లు వాలియాలూ, చిదంబరాలు, ప్రణబ్ ల వంటి ఆర్దిక మేధావుల సాక్షిగా... రైతు బ్రతుకునే శూన్యం చేసింది.

ముంగారు మొలక ముడుచుకుపోయింది. బంగారు పంటలు పాటల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ మాత్రమే మిగిలిపోయాయి.

కొసమెరుపు ఏమిటంటే - పైన ఉటంకించిన అనుభవజ్ఞానాన్నీ, ముంగారు మొలకకూ శాస్త్రీయత ఉందనీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించటమూ!

ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపి ‘వ్యాపారం కోసం కృత్రిమంగా వస్తు కొరతలని సృష్టించటం’ దగ్గరికి తిరిగి వస్తాను.

గతంలో జరిగిన ఒక సంఘటన.

అవి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులు! హఠాత్తుగా పిల్లలు పాలపొడి డబ్బాలకు కరువొచ్చింది. పాలడబ్బాలు... నెస్లే వంటి కార్పోరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసేవి! హఠాత్తుగా, ఒక్కసారిగా, మీడియా ఈ విషయమై గగ్గోలు మొదలెట్టింది. వేడి వ్యాఖ్య ఏమిటంటే - "ఒక మహిళ పరిపాలిస్తున్న దేశంలో, పసిబిడ్డ తల్లులకు పిల్లల పాలపొడి డబ్బాలకు కూడా కరువొచ్చింది" అన్నది!

నా చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పట్లో పెద్దలు మాట్లాడుకోవటం విన్నాను. మా నాన్న, ఇతరులతో చర్చిస్తూ "ఏమిటీ పాల డబ్బాల గోల? వేల ఏళ్ళుగా ఈ దేశంలో తల్లులు లేరా, పిల్లలు లేరా? తల్లిపాలకి ఏం లోటువచ్చిందని డబ్బాపాల గోల? సీసాతో పాలు పట్టేందుకైనా ఆవుల్లేవా, గేదేల్లేవా?" అంటూనూ, "అందం చెడుతుందని ఆడవాళ్ళు పిల్లలకు పాలివ్వడం మానేసారట. ఇదేం ఘోర కలి?" అంటూనూ అనుకోవటం విన్నాను.

అయితే ఈ తర్కాన్ని గానీ, సందేహాల్ని గానీ, డబ్బాపాల మోజుల గురించి గానీ, మీడియా మాట్లాడలేదు. మీడియాతో సహా ప్రతిపక్ష నాయకులు, కొందరు అధికార పక్ష నాయకులు కూడా, ఈ పాల డబ్బాల కొరత గురించి తగినంతగా గోల చేసారు. కొద్ది రోజుల తర్వాత ఇది పత్రికల ప్రధాన శీర్షికల నుండి ప్రక్కకి వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులూ గమ్మున ఉండిపోయారు.

ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. బాలింతలకు వాడే మందులలో, తల్లిపాలు[Brest Milk] తగ్గేటట్లుగా మందుల కాంబినేషన్ ఉన్న మందులను వాడిస్తే చాలు! బాలింతలు అనివార్యంగా పిల్లలకు డబ్బా పాలనే వాడతారు. ఆ కంపెనీలకి ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం. ఆ పాల డబ్బాల ఉత్పత్తిని తగ్గిస్తే చాలు, పిల్లలకి పాల బాధలే కదా! ఈ వ్యాపార సూత్రం, కుట్రకోణం ఆనాటి ప్రజలకు తెలియదు. ఎందుకంటే - అంతంటి మోసాన్ని ఊహించాలంటేనే తప్పు చేస్తున్నామనే భావన ఉండేది. అన్నింటిలోనూ ఉండేది ‘మంచే’ అనుకోవాలనుకునే తత్త్వం!

నిజానికి స్వాతంత్ర సమరపు రోజులలోనూ, అంతకు ముందూ కూడా.... నకిలీ కణిక వ్యవస్థ, మనదేశం మీద పనిచేస్తూనే ఉంది. అయితే బ్రిటీషు వాళ్ళ వెనక దాక్కుంది! స్వాతంత్ర సమరం నాడు, స్వతంత్రం వచ్చాక... దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో ఎక్కువమంది నిస్వార్ధపరులూ, దేశభక్తులూ ఉండటంతో... నకిలీ కణిక వ్యవస్థ యొక్క వ్యవహార సరళి, కుట్రతీరు కొంత తక్కువ వేగంతో ఉండేవి. మెల్లిగా నిజాయితీ పరులని తరిమేసారు.

ముఖ్యంగా ‘కోడలి’ నంటూ సోనియా ప్రధానమంత్రి ఇంట పాగా వేసాక, నమ్మకం పోగు చేసుకున్నాక... కుట్ర వేగం అన్యూహంగా పెరిగింది. ఇక ఇప్పుడు ఈ ఇటలీ మహిళ ప్రభుత్వ చోదక శక్తిగా అవతరించాక, కుట్ర వేగం అత్యధిక మవ్వటమే కాదు, బాహాటంగా కూడా పరిణమించింది. అప్పుడు పరోక్షం, ఇప్పుడు ప్రత్యక్షం. అంతే వ్యత్యాసం!

ఈ కుట్రలో భాగమే... పాల డబ్బాల కొరతల వంటివి. ఇవే కాదు, కొత్తగా అవసరాలు కూడా సృష్టిస్తారు. గత దశాబ్దాలలో... ‘చైనాలో గిరాకీ ఉందంటూ’ పల్లెల్లో పట్టణాల్లో కప్పల్ని హతమారిస్తే... ఇప్పుడు వేల కోట్ల రూపాయల కొద్దీ మస్కీటో రిపల్లెంట్ల వ్యాపారం నడుస్తోంది. దీని గురించి గత టపాలలో వివరించాను.

ఇక ఇప్పుడు చూడండి... All Out ఇక నుండి దోమల్ని తరమటం కోసమే కాదు, ఈగల్ని తరమటానికి కూడా పనికి వస్తుందట. ఇక కాచుకోండి! ఇబ్బడిముబ్బడిగా దోమలు పెరిగినట్లు, రోజు రోజుకీ దోమల ఇమ్యూనిటీ పెరిగి పోయినట్లు... ఇక నుండీ ఈగలు పెరుగుతాయి. ఇప్పటి దాకా రాత్రుళ్ళు మాత్రమే వాడబడుతున్న All Out వంటివి, ఇక నుండి పగలూ రాత్రీ వాడాలి కాబోలు! ఈగలూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వాటికీ [ఇమ్యూనిటీ] రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతకంతకూ శక్తివంతమైన, ప్రభావ శీలమైన రిపల్లెంట్లు, మార్కెట్టులోకి వస్తాయి. అలాగే అలర్జీలు, అంతు తెలియని రోగాలు వస్తాయి.

‘ఈగా? మజాకా?’ - అనుకోవాల్సిందే మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కొన్ని దశాబ్దాల క్రితం.... ఆయుధ తయారీ సంస్థలు, దేశాల మధ్య యుద్దాలు సృష్టించి, యుధ్ధభయాలను పుట్టించి ఆయుధాల వ్యాపారం చేసుకునేవన్నది ప్రకటిత సత్యం. దాని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యమే!

అదే నెట్ వర్క్ .... ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా, రోగాలనీ, కృత్రిమ వస్తు కొరతలనీ, మోజులనీ, పర్యావరణ అసమతుల్యతనీ సృష్టించి సరికొత్త వ్యాపారాలు చేస్తోంది. ఎందులోనైనా అదే స్ట్రాటజీ! అదే కుట్ర! అదే గూఢచర్యం! నారద నీతికి విపర్యయం, కణిక నీతికి పర్యాయం!

ముందుగా రోగాల గురించి పరిశీలిద్దాం!

వైద్యరంగంలో నకిలీ కణికుల కుట్ర గురించి నా ఆంగ్ల బ్లాగు Coups on World లో Coup on Medicines and Medical Field అనే శీర్షిక క్రింద వివరించాను. ఇప్పుడు కేవలం నకిలీ కణిక వ్యవస్థ, కార్పోరేట్ కంపెనీల ద్వారా సమాజంలోకి ప్రవేశపెడుతున్న రుగ్మతలూ, ఇతర దుష్పరిణామాల గురించి వివరిస్తాను.

ఉదాహరణకి మార్కెట్టులో లభించే పళ్ళని తీసుకోండి. ఈ రోజు, అరెటిపళ్ళ మొదలు అన్నిరకాల ఫలాలు ‘కార్భైడ్’ అని పిలవ బడే రసాయన పదార్ధంతో కృత్రిమంగా మగ్గ వేస్తున్నారు. [Acetilene Gas ని ఉత్పత్తి చేసేందుకు బ్యాటరీ తయారీ రంగంలో ఈ కెమికల్ ని ఉపయోగిస్తారు.] ఒకప్పుడు వరిగడ్డి పరచిన గదిలో పళ్ళని, వారం పైగా నిల్వ ఉంచితే పళ్ళు మాగేవి. అందుకోసం ‘గదుల’ అద్దె ఎక్కువ అవుతుంది.

అదే..... రసాయనం ఉపయోగిస్తే, నాలుగు గంటలలో ఒకే గదిలో ఎన్నో ఫళ్ళు మాగపెట్టవచ్చు. రసాయనంతో ఆకర్షణీయమైన రంగులో పండినట్లుగా అవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ పళ్ళని మాగేసి మార్కెట్టుకి పంపించేయవచ్చు. అవి తింటే దాదాపు నూటికి 80 మందికి అలర్జీలొస్తాయి. [ఉప్పునీటిలో కొన్ని నిముషాలు నానబెట్టి, ఆపైన కడిగి తింటే, కొంత వరకూ ఆ రసాయన దుష్పలితాన్ని అరికట్టవచ్చు.]

ఇప్పుడు మార్కెట్ లో లభించే పనస వంటి పళ్ళు తప్ప దాదాపు అన్నిరకాల పళ్ళు కార్భైడ్ తో, చక్కని రంగు సంతరించుకొని, వినియోగ దారులని ఆకర్షిస్తున్నవే! ఇలా పండించినవి త్వరగా కుళ్ళుతాయి. కార్భైడ్ తో మగ్గబెట్టిన పళ్ళని ఫ్రిజ్ లో పెట్టి చూడండి. పసుపు రంగులో మెరుస్తూ నోరూరించే మామిడిపళ్ళు కూడా, ఆకుపచ్చని కాయలుగా [అక్కడక్కడా పసుపు మచ్చలుంటాయి లెండి] మారిపోతాయి.

ఏ పళ్ళైనా, కార్బైడ్ తో మాగ పెట్టినవి తింటే.... కడుపునొప్పి, అలర్జీలు, ముఖంపైన చిన్న చిన్న గుల్లలు లేవటం వంటి బాధలు తప్పవు. దాంతో ఔషధాల[మందుల] వాడకమూ తప్పదు.

ఇలాంటి పళ్ళే కాదు, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్ధాలు కూడా ఔషధ వ్యాపారాన్ని ఇతోధికంగా పెంచేవే! ఔషధాలలోనూ నకిలీ వి, నాణ్యత లేనివి, సైడ్ ఎఫెక్టులు కలిగించేవి ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. కొత్త రోగాలు, రకరకాల రోగాలకు.. మందులు వాడతాం. వాటితో మరికొన్ని కొత్త బాధలు పుడతాయి. మళ్ళీ మందులు. మళ్ళీ కొత్త రోగాలు. ఇలా ఇదో చక్రం. ఒక దాని వెంట ఒకటి అనుసరించే వలయం. కావలసినంత వ్యాపారం.

నిజానికి ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న ఔషధాలలో అధిక శాతం విదేశాలలో నిషేధింపబడినవే! దుష్పలితాలినిస్తున్నాయనీ, రోగ నివారణ కంటే వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఉన్నాయనీ నిర్దారింపబడినవే! చట్ట రీత్యా ఇబ్బందులు రాకుండా, చాక చక్యంగా, మూల పదార్ధాల కాంబినేషన్ ని మార్చి, పేర్లు మార్చి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వం కిమ్మనదు సరికదా, కార్పోరేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకి, తమ ఔషధాలను విక్రయించుకునేందుకు తగినంత సహాయ సహకారలందిస్తుంది. మీడియా సరేసరి!

మైదా పిండికి రంగు రుచి వాసనలద్ది మందుబిళ్ళలంటూ, ఐదు పైసల ఖరీదు చెయ్యని వాటిని, మూడు రూపాయల యాభైపైసలకు అమ్ముతూ, విజయవాడ ఫార్మాస్యూటికల్స్ పట్టుబడినా.... నాలుగు రోజుల హడావుడీ తప్ప అన్నీ మామూలై పోయాయి. ఆ మందు ఖరీదు విషయంలో రోగి పడే దగా కంటే, మందులు వాడుతున్నామంటూ, రోగం తగ్గుతుందని ఆశపడుతూ, నమ్మకంతో వేచి చూస్తూ పడే దగా... ప్రాణాంతకమైనది. అయినా మీడియా గానీ, ప్రభుత్వం గానీ కిమ్మనదు.

పైగా... ఆయుర్వేదం, ప్రకృతి సహజ పదార్ధాలతో చికిత్స, గట్రాలని ఒకప్పుడు మీడియా బాగానే విమర్శించింది. వెక్కిరించింది. చెట్టు బెరళ్ళూ, వేళ్ళూ నూరుకు తాగుతారనీ, ఆకులు నములు తారనీ... గట్రా చెణుకులు ఆ ఔషధాల మీదా, ఔషధాలని వినియోగించే వారి మీదా వేసింది.

ఆయుర్వేదం గురించి పాజిటివ్ చెబుతున్నట్లు శీర్షికలున్నా, లోపల మాత్రం సదరు ఔషధాల వాసన, రుచి భరించటం కష్టం అనీ, జబ్బు తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందనీ, పధ్యాలుండవలసి ఉంటుందనీ బాగా చెప్పబడింది. ఎంత బాగా అంటే - మనసుకి ఎక్కేటంతగా! క్రమంగా ఆయుర్వేద వైద్యం సమాజంలో బాగానే అంతరించింది.

మళ్ళీ ఈ ఒకటిన్నర దశాబ్దంలోనే, ఆయుర్వేద వైద్యం వాడకం గురించి బాగా వినబడుతోంది. గతంలో అయితే, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో ప్రభుత్వ వైద్యులు హాయిగా పనేం లేకుండా తీరికగా జీతాలు తీసుకునే వాళ్ళు. [శ్రీశైలంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది.]

ఇప్పుడు అవే ఆయుర్వేద ఔషధాలు, సౌందర్యోత్పత్తులూ, ఆయుర్వేద సబ్బులూ, కార్పోరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. కలబంద కాస్తా అలోవెరా అయిపోతే కావాల్సినంత వ్యాపారం! కలబంద మొక్క వ్యాపారానికి పనికి రాకూడదనీ, కలబందకు ఆదరణ రాకూడదనీ నేను ఆనటం లేదు.

అదే కలబంద పొలం గట్ల మీద, తుప్పల్లో ఉన్నప్పుడు, దానికి ఏ గుర్తింపూ లేదు. ఎప్పుడైతే మీడియా దాన్ని అలోవెరా గా, అద్భుత సౌందర్య ఆరోగ్యదాయిని గా ప్రొజెక్ట్ చేసిందో, ఆ తర్వాత ఊపందుకున్న వాడకం, ఆపైన కార్పోరేట్ ల ప్రవేశం గురించి పరిశీలించమంటున్నాను. వాటి మధ్య కార్యకారణ సంబంధం చూడమంటున్నాను.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం నాటికి... క్రమంగా వంటింటి వైద్యం కూడా మూలబడింది. వంటింటి దినుసులతో జలుబూ, జ్వరం, చిన్నపాటి ఆరోగ్య ఇబ్బందులకి చేసే వైద్యం గురించిన పరిజ్ఞానం... క్రమంగా ఆనాటి వృద్దులకి పరిమితమై, అంతరించే దిశలో ఉండింది.

అదృష్టవశాత్తూ మళ్ళీ ఈ మధ్య కాలంలో, ఈ ఒకటిన్నర దశాబ్దాలలో.... వారపత్రికలలో, వార్తా పత్రిక మహిళల పేజీలలో మళ్ళీ చిట్కా వైద్యాలు దర్శనమిచ్చి, మళ్ళీ ఆ వారసత్వ వాస్తవిక జ్ఞానం సజీవ దిశ వైపుకు ప్రయాణిస్తోంది.

ఈ నేపధ్యంలో.... ఆసుపత్రులు కూడా ‘కార్పోరేట్’ అయిపోవటం అందరూ ఆహ్వానించిన, ఆనందించిన పరిణామం. ఆ ‘కార్పోరేట్’ ముసుగు మాటున ఉన్న అమానుష వ్యాపారం తెలియని అమాయకత్వంతో, మొదట్లో కార్పోరేట్ ఆసుపత్రులని చాలామంది ఆహ్వానించారు. వాటి రాకని ఆనందించారు.

కార్పోరేట్ ఆసుపత్రి వ్యాపార దోపిడి అనుభవంలోకి వచ్చాక గానీ.... తళతళలాడే కార్పోరేట్ ఆసుపత్రి భవనాలు, ఫెళఫెళ్ళాడే ఆసుపత్రి సిబ్బంది యూనిఫారంల లాగే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయో, డాక్టర్లూ రిసెప్షనిస్టులూ నర్సులూ గట్రా సిబ్బంది నవ్వు ఎంత రమణీయంగా ఉంటుందో, అంతే నిర్ధాక్షిణ్య వ్యాపారం నడుస్తుందని అర్ధం కాలేదు.

ఈ విషయమై ప్రజలకి అవగాహన కలిగించటానికి బదులు, ప్రజల అవగాహనని కూడా ఏమారుస్తూ, ప్రభుత్వం.... ‘ఆరోగ్యశ్రీ’ లంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి, పేదలకి కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాధనం కార్పోరేట్ ఆసుపత్రులకు ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వటం, సిబ్బందిని నియమించటం, నిధులు మంజూరు చెయ్యటం ఎంచక్కా మరిచిపోతోంది, పోయింది.

నాయకులలో లేని సేవా తత్పరత, సిబ్బందికి ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు ఉచితంగా, భరోసాతో పొందిన పెద్దాసుపత్రి సేవలు ఇప్పుడు గత చరిత్ర అయిపోయాయి. జలుబూ, జ్వరం లాంటి చిన్న జబ్బుల దగ్గరి నుండి గుండెజబ్బుల దాకా, ఉచిత వైద్యం మా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మా చిన్నప్పుడు లభించటం నాకు ప్రత్యక్షంగా తెలుసు!

ఇవేవీ మాట్లాడకుండా.... మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ఇతర అధికారులూ ఆరోగ్యశ్రీ కార్డు పేరిట భారీ ప్రకటనలు గుప్పించి మరీ, కార్పోరేట్ ఆసుపత్రులకు ప్రతినిధుల్లా పనిచేసారు. [వై.యస్. మరణం తర్వాత టీవీ ప్రకటనల ఉధృతి కాస్త తగ్గింది లెండి.]

ఇక మీడియా ముసుగు వేసుకున్న కుట్రదారులు, జన బాహుళ్యంలో చిన్నపాటి జబ్బులకు కూడా ‘స్పెషలైజేషన్ చేసిన డాక్టరు చేతే వైద్యం చేయించుకోవటం మంచిది’ అనే భావాన్ని బలంగా ప్రవేశపెట్టారు. ఎంతో వ్యూహాత్మకంగా, సుదీర్ఘ కాలంగా, చాపక్రింద నీరులా పనిచేసి మరీ, ప్రజాదృక్పధాన్ని ప్రభావపరిచారు.

వైద్యం అన్నది ప్రాణాలకూ, శారీరక బాధకూ సంబంధించినది కావటంతో ఎవరూ రిస్క్ తీసుకోరు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, గూఢచర్యాన్ని మిళితం చేసి అమలు చేసిన ఈ కుట్రలో, క్రమంగా MBBS డాక్టరు అర్దడాక్టరు గా మిగిలిపోయాడు. దాంతో M.S., MD వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ , స్పెషలైజేషన్ చేయటం వైద్యవిద్యార్ధులకి అనివార్యమైంది.

ఇక ఊహించండి, కార్పోరేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యకు ఎంత డిమాండ్ ఉంటుందో! అడ్డదారులలో ప్రవేశాలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఈ రోజు[15 జూన్, 2010] ఈనాడులో వచ్చిన గంగాధర్ రెడ్డి వార్తాంశమే దీనికి చక్కని ఉదాహరణ.

అంత ఖర్చుపెట్టి చదువుకు వచ్చిన తర్వాత సదరు వైద్య విద్యార్ధులు, ఎంత లేసి ఖరీదైన వైద్యం చేస్తే, తమ పెట్టుబడి తిరిగి పొందేట్లు? ఇక లాభాల సంగతేమిటి?

పరిశీలించండి. ప్రభుత్వాధికారంలో ఉన్న రాజకీయులూ, బ్యూరాక్రాట్లు, మీడియా ఎంతో అంతర్గత సహాయ సహకారాలతో, ప్రజలని మరింతగా దోపిడి చేయటానికి తగినట్లుగా చట్టాలు మారుస్తుంటారు, కొత్త చట్టాలు, జీవోలు తెస్తుంటారు. ప్రజా దోపిడిని నియంత్రించేందుకు ఉద్దేశించిన చట్టాల అమలును ప్రయత్నపూర్వకంగా నీరుగారుస్తుంటారు.

రెడ్ టేపిజం, లంచగొండితనం, అవినీతి, పైకారణాలుగా[over leaf reasonsగా] చెప్పబడుతూ, పెంచి పోషించబడుతుంటాయి. అంతర్గత కారణం ఒక్కటే!
గూఢచర్యం!
అది కుట్ర!
భారతదేశం మీద కుట్ర!
మానవత మీద కుట్ర!
కుట్రదారులు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ గట్రాలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

తాగుడు వ్యసనపు విన్యాసం ఒకదాన్ని, ఈ ఆదివారం పూట సరదాగా చదువుతారని....

ఇది నా బాల్యస్నేహితురాలు చెప్పిన వాస్తవ సంఘటన. వైద్యులైన నా మిత్రురాలు, ఆమె భర్త, ఖమ్మం జిల్లా మంధని దగ్గర పనిచేసేవాళ్ళు.

విశాఖ స్టీల్ ఫ్లాంటు కనుకుంటా, అక్కడి నుండి ఇనుప ఖనిజం వెళ్ళేది. ఒకసారి, నెల ఒకటో తారీఖున, అందరికీ జీతాలు వచ్చాయి. ఆ నెలలో కొత్తనోట్లు పంపిణీ చేయబడ్డాయట. వాళ్ళ కాంపౌండర్ కూడా జీతం తీసుకున్నాడు. అప్పటికి అతడికి ప్రభుత్వం ఇస్తున్న జీతం మూడు వేలు. 30 వంద నోట్లు. ఫెళ ఫెళ్ళాడుతున్నాయి.

ఆ రోజు అతడి భార్య ఊళ్ళో లేదట. ఓ వందపెట్టి ఈ కాంపౌండర్ పూటుగా తాగేసాడు. ఇంటికెళ్ళి, పక్కనే కట్టేసి ఉన్న గేదె ప్రక్కన కూర్చుని, మత్తులో ఊగుతూ, జేబులో నుండి ఒకో వంద నోటు తీసి గేదెకి ప్రేమగా తినిపించేసాడు. "తినమ్మా తిను! నా బంగారు తల్లీ, తిను! నా బుజ్జి కన్నా, తిను!" అంటూ.... ఒకో నోటు దాని నోటి కందించాడట.

గేదె కూడా, పచ్చగడ్డి వదిలేసి ఇతడందించిన పచ్చనోట్లని పరపరలాడించేసింది. ‘అందరూ ఈ నోట్ల కోసమే కదా అన్ని తంటాలు పడుతున్నారు, చూద్దాం ఇవెంత రుచిగా ఉంటాయో?’ అనుకుందో, ‘అందరూ గడ్డికరుస్తారు అంటారు కదా, నేను నోట్లు కరుస్తాను!’ అనుకుందో, ‘ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడు కదా’ అనుకుందో గాని, ఎంచక్కా తినేసింది.

చుట్టుప్రక్కల వాళ్ళు చూసేసరికే చివరి నోట్లు తినిపిస్తున్నాడట. వాళ్ళు ‘వద్దురా’ అని పక్కకి లాగబోతే, బండబూతులు తిట్టి వీరంగం చేసాడట. మర్నాడు ఉదయం, ఊరి నుండి ఇంటి కొచ్చిన అతడి భార్య నెత్తీ నోరు బాదుకుని ఏడ్చి, అతణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట.

మత్తు దిగాక అతడూ, నెల జీతం మొత్తం గేదెకి తినిపించినందుకు బావురుమన్నాడట. దాదాపు రెండు దశాబ్దాల క్రితపు సంఘటన ఇది. అప్పటికి మూడు వేలంటే - నెలంతా ఓ సగటు మానవుడి ఇల్లు హాయిగా గడిచిపోయేంత మొత్తమే.

ఏడుపు తగ్గాక, పోయి, గేదెని నాలుగు బాదాడట. చుట్టుప్రక్కల వాళ్ళు "రాత్రి తాగిన మత్తులో దాన్ని బ్రతిమాలి నోట్లు తినిపించి, ఇప్పుడు చావబాదితే ఏం లాభం? గేదె చచ్చిందంటే మరింత నష్టం!" అనేసరికి చతికిలబడ్డాడు.

నెలంతా దాని పేడ ఎత్తుతూ... ఏడుస్తూ.... తిట్టుకుంటూ....!

తర్వాత నుండి, జీతం అతడి భార్య చేతికి ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పింది నా స్నేహితురాలు.

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తుంటుంది.

కొసమెరుపేమిటంటే : ‘అంత బాధపడ్డాడు, గేదెని తిట్టాడు, తన్నాడు గానీ, తన తాగుడు వల్లనే కదా అని మద్యాన్ని గానీ, ఆ అలవాటును గానీ, తనని తాను గానీ తిట్టుకోలేదు’ అని నా స్నేహితురాలు అన్నది. నిజమే! వ్యసనపరులయితే ఇంతేనేమో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఏదైనా ఒక కార్పోరేట్ కంపెనీ తాలూకూ ఉత్పత్తి, మార్కెట్లోకి ప్రవేశపెట్టబడినప్పుడు, సదరు కార్పోరేట్ కంపెనీల మధ్య ఉన్న నెట్ వర్క్ రీత్యా నడిచే, పరస్పర సహాయ సహకారాలని గమనిస్తే.... తెలుగులో మన పెద్దలు చెప్పిన ‘దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్న’ సామెత చక్కగా సరి పోలుతుంది.

ఇప్పటికే, కంటికి కనిపిస్తూ, దందాగిరి చేసే నేరస్తులూ, రియల్ ఎస్టేట్ మాఫియా గట్రలు, వాళ్ళల్లో వాళ్ళు ప్రదేశాలని పంచుకోవటం, ‘మీటింగు’లు పెట్టుకుని అగ్రిమెంట్లు సెటిల్ మెంట్లూ చేసుకోవటం, బెదిరించి భయపెట్టి చావగొట్టి ప్రజల నుండి పైసలు వసూలు చేసుకోవటం, చూస్తూనే ఉన్నాము. చివరికి ముష్టి ఎత్తుకునే బిచ్చగాళ్ళు కూడా, కాలనీలని పంచుకుంటారని విని ఉన్నాము. అసలు ముష్టి వాళ్ళని కూడా నియంత్రిస్తూ, వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకోవటం వంటి చర్యలకు పాల్పడే నేరవ్యవస్థ ఉందని కూడా వినబడుతుంది.

కార్పోరేట్ కంపెనీల తెరచాటున ఉంది కూడా అదే మాఫియా! మామూలు నేరగాళ్ళు కత్తులూ, తుపాకులూ పట్టుకు తిరిగితే... కార్పోరేట్ కంపెనీల అధినేతలూ, సీఈవో వంటి అధికారులూ, సూట్లేసుకు తిరుగుతారు.

పరిశీలించి చూస్తే.... వేల, లక్షల కోట్ల రూపాయల టర్నోవరు కలిగిన కార్పోరేట్ కంపెనీలు, ఒక నెట్ వర్క్ కలిగి ఉండటం ఎలా సాధ్యం? అందునా కొన్ని నియమాలని అనుసరించే నెట్ వర్క్, అత్యంత శక్తివంతమైన నెట్ వర్క్? ఎవరికి వారే అయితే, ఎప్పుడో ఒకప్పుడైనా, నియమాలని అతిక్రమించరా? వివాదాలు వెల్లువెత్తవా? ఒక బలమైన వ్యవస్థ లేదా వ్యక్తి దీన్నింతటినీ నియంత్రిస్తే [Control చేస్తే] తప్ప, ఇది సాధ్యం కాదు.

అలా నియంత్రించే వ్యవస్థనే ‘నకిలీ కణిక వ్యవస్థ’ అని పిలిచాను. వ్యక్తిని ‘నకిలీ కణిక అనువంశీయుడని’ చెప్పాను. ఈ కార్పోరేట్ దిగ్గజాలతో కూడిన వలయాన్నే ‘నెం.10 వర్గం’గా చెప్పాను.

ఇంత బలమైన గూఢచర్య వ్యవస్థ దీనివెనక లేకపోయినట్లయితే - ఒక కొత్త ఉత్పత్తి మార్కెట్టులోకి ప్రవేశించినప్పుడు, మిగిలిన పోటీ ఉత్పత్తిదారులు పోటీ ఇవ్వకుండా, తమ ఉత్పత్తుల అలభ్యతతో సహకరిస్తూ, తమ నెట్ వర్క్ నియమాలని తాము పాటిస్తుండ వచ్చుగాక, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?

ఈ పరిస్థితులనీ, దోపిడినీ ప్రభుత్వం ఎందుకు నియంత్రిచటం లేదు? అసలా ప్రయత్నమే ఎందుకు చేయటం లేదు? ఏ వస్తువు గురించైనా సరే డిమాండ్ - సప్లై స్థితిని పరిశీలిస్తూ, నియంత్రించాలి కదా?

ఒకప్పుడు ప్రభుత్వాలు, మార్కెట్టులో ఇలాంటి అసాధారణాలని గుర్తించేవి. ఛేదించేందుకు ప్రయత్నించేవి. అందుకే ఇందిరాగాంధీ నకిలీ కణికుల అనువంశీయులకి అంతగా బద్ద శత్రువయ్యింది. సాక్షాత్తూ రామోజీరావే, ఈ విషయం స్వయంగా వప్పుకుంటూ.... తాను [నాటి] కాంగ్రెస్ కి వ్యతిరేకినని, లిఖిత పూర్వకంగా చెప్పుకున్నాడు. కాకపోతే ‘ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలు, వారసుల్ని ప్రజల నెత్తిన రుద్దటాలు నచ్చక, పోరాడానన్న’ పైకారణాన్ని [over leaf reason] చూపెట్టాడు.

మరి ఇప్పుడు, ఈ ఇటలీ మహిళ గురించైతే.... అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ వ్రాస్తాడు... అది నియంతృత్వ పోకడ కాదు కాబోలు! ఇక ఆమె వారసుడు రాహుల్ గురించైతే ‘సొట్టబుగ్గల అందగాడనీ, అమ్మాయిల కలల రాకుమారుడనీ’ బూస్టప్ వ్రాస్తుంటాడు.

అంత పరిమాణంలో, రామోజీరావుకి, ఇందిరాగాంధీ పట్ల శతృత్వం ఎందుకంటే - పేదలని ధనికులు పీడించకుండా, వ్యాపార దోపిడి చేయకుండా ఉండేందుకు, నాడు ఆమె బ్యాంకుల్ని జాతీయం చేయటం ఒక కారణం. ఆనాడు ధనికుల ప్రధాన వ్యాపారం.... వడ్డీ వ్యాపారమే! ఇప్పుడూ అదే లెండి.

ఇక ఇందిరాగాంధీ హయాంలో.... బ్యాంకుల్ని జాతీయం చేసి పేదలకి ఋణ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తే,
ఈ ఇటలీ మహిళ హయాంలో.... బ్యాంకులే [ప్రభుత్వ, ప్రైవేట్] కాదు, సూక్ష్మ ఋణాలు ఇచ్చే సంస్థలు కూడా ‘రికవరీ అధికారుల’ పేరుతో గూండాలని నియమించుకుని మరీ, దందాగిరీ చెలాయిస్తున్నారు. దెబ్బతో పేదలు బ్యాంకులో ఋణాల మాట ఎప్పుడో మరిచిపోయారు. అదే బ్యాంకులు, కార్పోరేట్ కంపెనీల ఋణాలని, తిరిగిరాని ఖాతాల క్రింద రద్దు చేస్తున్నాయి.

ఈ విషయం ప్రక్కన బెడితే.... ప్రభుత్వం... కార్పోరేట్ కంపెనీలు [ఉత్పత్తి దారులు] కుమ్మకై, ప్రజలని దోచుకోకుండా, నల్ల బజారు విక్రయాలు నడవకుండా, డిమాండు - సప్లై పద్దతిని నియంత్రించాలి. ఆ పని ప్రస్తుత ప్రభుత్వం నూటికి నూరు శాతం చేయటం లేదు.

ఆహార నియంత్రణాధికారి [Food Controlar], Drug Controlar, Health Inspector, ఏ ఒక్కరూ, ప్రత్యక్ష కార్యరంగంలో పని చెయ్యటం లేదు. అధికారులూ, ఉద్యోగులూ, డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. జీత భత్యాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులూ అన్నీ నడుస్తాయి. పని మాత్రం జరగదు.

ఉదాహరణలు చూడండి....

సిమెంటు కంపెనీలు కుమ్మకై, కృత్రిమ కొరత సృష్టించి, ధర పెంచి, నల్ల బజారు అమ్మకాలు సైతం నిర్వహించినా, ప్రభుత్వం సినిమా చూస్తున్నట్లు చూసింది, చూస్తోంది. సిమెంట్ కంపెనీల వాళ్ళు చేసే మరో దోపిడి చెప్పమంటారా?

కుమ్మకై ధర బాగా పెంచుకుంటారు. దాంతో మధ్యతరగతి జనాలు.... స్వంత ఇంటి కలనీ, ఆకాంక్షనీ వదులుకొని గమ్మునున్నారనుకొండి. సిమెంటు అమ్మకాలు బాగా పడిపోతాయి. ఇక లాభం లేదనుకున్నప్పుడు, సిమెంటు కంపెనీ యజమానుల సిండికేట్, లోపాయకారిగా నిర్ణయాలు తీసుకుని ధర అమాంతం, ఆకర్షణీయంగా ఉండేటట్లుగా తగ్గిస్తాయి. అదే సమయంలో ఇసుకా, ఇనుము రేట్లు కూడా కొంచెం తగ్గుతాయి.

రూపాయి రూపాయి కూడబెట్టి, ఓ బెత్తెడు జాగా కొనుక్కుని, అద్దె ఇళ్ళ వెతలతో విసిగిపోయి, స్వంత ఇల్లు కట్టుకోవాలని గంపెడాశ పెట్టుకున్న సామాన్య ప్రజలు.... ఆశతోనూ, మళ్ళీ ధరలు పెరుగుతాయోమోనన్న ఆతృతతోనూ, లోన్లు తీసుకునీ, పొదుపు చేసి దాచుకున్న సొమ్ము బయటకు తీసి గృహనిర్మాణాలు చేపడతారు.

సిమెంట్ అమ్మకాలు ఊపందుకుంటాయి. దాంతో తమ అంచనాలకు తగినంతగా వ్యాపారం పెరిగాక, అప్పుడు కలిసికట్టుగా, అందరూ కలిసి సిమెంటు ధరలు పెంచేస్తారు. తదనుగుణంగా ఇసుకా, ఇనుమూ, పెయింట్లు అన్నిటి ధరలూ పెరుగుతాయి. ఆ విధమైన సంకేత భాష.... ఆయా ఉత్పత్తిదారుల, వ్యాపార వేత్తల మధ్య ఉంటుంది.

ఇక నిర్మాణపు పనులు చేపట్టిన సామాన్య ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది. సగంలో నిర్మాణం ఆపలేరు. ఆశ ఊరుకోదు. ఏదో తంటాలు పడి పూర్తి చేయమంటుంది. అంతేగాక, సగంలో నిర్మాణం వదిలేస్తే నష్టం వస్తుంది. అప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఎటూ గాకుండా పోతుంది. సగంలో ఆగిన నిర్మాణం, త్వరగా శిధిలం అవుతుందన్న భయమూ ఉంటుంది.

ఇప్పుడు ఆపితే మళ్ళీ పునఃప్రారంభించలేమనీ, పూర్తి చెయ్యలేమనీ నిరాశ ఆవరిస్తుంది. అది వాస్తవం కూడాను! దాంతో మరింతగా అప్పులు చేసి, ఉన్న బంగారం తనఖా పెట్టి లేదా అమ్మి, నిర్మాణం పూర్తి చేస్తారు.

చాలాసార్లు ‘ఇంతవుతుందని మొదలు పెడితే రెట్టింపు ఖర్చయ్యింది. దాంతో పరిస్థితంతా తలక్రిందులయ్యింది. ఖర్చు అంచనాలకు మించిపోయింది’ అంటూ ఎంతోమంది నిట్టూర్చడం మనకి తెలిసిందే! చాలామందికి ఇదే స్వానుభవం కూడాను!

ఇది చాలా చాకచాక్యంగా జరుగుతున్న దోపిడి. పైకారణాలుగా "ఫలానా అందుకు సిమెంటు రేటు పెరిగింది. అంతర్జాతీయంగా ఫలానా సంఘటన జరగటంతో ఇలా అయ్యింది" అంటూ సొల్లు కబుర్లు మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రీ చెబుతారు.

ఇది ఒక్క సిమెంటు విషయంలోనే కాదు.... బియ్యం పప్పు మిల్లర్ల దగ్గరి నుండి, ఎన్నో వస్తువుల విషయంలో ఇలాంటి దోపిడీనే జరుగుతోంది.

ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకి.... కృత్రిమ కొరతల సృష్టి, కృత్రిమ డిమాండ్ సృష్టి, నల్ల బజారు అమ్మకాలు, వక్రమార్గాల ద్వారా పెంచుకునే అమ్మకాలు చెయ్యటం అంటే - ‘ప్రజలని చట్టబద్దంగా మోసం చెయ్యటం’ అని తెలియదా? వాటాలు పుచ్చుకుని, చట్టాలు చేసి మరీ, వ్యాపార దోపిడికి సహకరిస్తున్న ప్రభుత్వానికి.... స్వయంగా తామే వ్యాపారం చేస్తున్న ప్రభుత్వానికి.... తెలియదనుకుంటే, మనకి లోకజ్ఞానం తెలియదన్న మాటే!

మరి ఇదంతా మీడియాకి తెలియదా? మరైనా ప్రజలని కాపాడేందుకు గానీ, ప్రజల తరుపున పోరాడేందుకు గానీ, ప్రభుత్వాన్ని అధికారులని [చివరి దాకా] నిలదీసేందుకు గానీ, ఎందుకు ప్రయత్నించదు? ఒక రోజు వార్త వ్రాసేసి చేతులు దులుపు కుంటే సరిపోతుందా? అదేమంటే - సమస్యని ఎత్తి చూపటంలో తమ బాధ్యత తీరినట్లే నన్న కొత్త భాష్యాలు, మీడియా చెబుతోంది.

అలాగైతే... స్వాతంత్ర్య సమరం రోజుల్లో ఆనాటి పత్రికలు ‘స్వాతంత్ర్యం లేకపోవటంలోనే మనకిన్ని బాధలు!’ అంటూ సమస్యనెత్తి చూపి, ఊరికే ఉన్నాయా? ప్రజలకి అవగాహన కలిగించి, వారిలో పోరాట స్ఫూర్తి కలిగించి, స్వాతంత్ర సిద్ది జరిగే వరకూ, సమస్య పరిష్కరింపబడే వరకూ, ప్రజల కోసం పని చేసాయి కదా?

అవేవీ చేయవు గానీ, ఈనాటి మీడియా... ‘పత్రికాస్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛ’ అంటూ హక్కుల కోసం అరుస్తుంది. భాద్యతలు గుర్తుండవు గానీ, హక్కులు మాత్రం గుర్తుంటాయి. ఇంకా ఈ రెండేళ్ళ నుండి, మీడియా నవాబు రామోజీరావు, అంతగా అరవటం లేదు గానీ, గతంలో అయితే.... ‘బ్లాక్ బిల్లు, పత్రికాస్వేచ్ఛకు చిల్లు’ అంటూ గొంతు చించుకునే వాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu