ఇకపోతే... చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా.... సువర్ణముఖిని అందుకున్నాడు.

పరిశీలిస్తే...

చంద్రబాబు... ఈ దేశం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చేసిన కర్మల ఫలం, అంటే - జనం పరంగా సువర్ణముఖిని కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అధికారంలో ఉన్న రోజుల్లో, అతడికి, కన్నూ మిన్నూ కాన రాలేదు. ‘హైటెక్ ముఖ్యమంత్రి’ అంటూ మీడియా ఇచ్చిన బిరుదు, ఇతడికి చాలా తల బిరుసునే ఇచ్చింది.

అవినీతిని సెంట్రలైజ్ చేయటమే కాదు, పార్టీలోకి కూడా కార్పోరేట్ సంస్కృతిని తెచ్చి పెట్టాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇతడికి ప్రజలంటే చులకన ఉండటమే కాదు, అప్పట్లో పార్టీ కార్యకర్తలంటే కూడా చులకనే ఉండేడి. [కాబట్టే... పదవి పోయి, పరిస్థితులు అడ్డం తిరిగాయని అర్దమైన తర్వాత... ‘నా మైండ్ సెట్ ను మార్చుకున్నాను. ఇక నుండి పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను" అంటూ నెత్తీనోరూ బాదుకున్నాడు.]

ఎంత చులకనంటే.... తాను అంతర్జాతీయ ఫేం ని అయిపోయాననుకున్నాడు. అమెరికా ప్రెసెడింట్లు తనకు కితాబులిచ్చే స్థాయి తనది! సత్యం రామలింగ రాజులూ, ఐటీ దిగ్గజాలూ, వివిధ దేశాల ప్రతినిధులూ - ఇలాంటి వాళ్ళతో తను వ్యవహరిస్తుంటాడు! సామాన్య ప్రజలూ, వాళ్ళ కడగళ్ళ వివరాలూ... ఎంత న్యూసెన్సు, ఎంత నాన్సెన్సూ!?

అందుకే... 2001లో అనుకుంటా! తమ గౌరవ వేతనాలు పెంచమంటూ, ఆందోళనకి దిగిన అంగన్ వాడీ కార్యకర్తలని, ఆడవాళ్ళని కూడా చూడకుండా, రోడ్డెక్కినందుకు లాఠీలతో కొట్టించాడు. ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి, పోలీసులు తన్నటం, ఉధృతంగా నీటి పంపులతోనూ, భాష్పవాయు ప్రయోగంతోనూ... వాళ్ళని చెల్లా చెదురూ చేయటమూ, అప్పట్లో టీవీ వార్తల్లో వీడియో క్లిప్పింగు చూసి నోరెళ్ళ బెట్టాను.

ఆడవాళ్ళని అలా కొట్టటం, అదీ బహిరంగంగా.... అప్పుడే తొలిసారిగా చూడటంతో, ఎంతగా విస్తుపోయానంటే... తేరుకోవటానికి కొంత సమయం పట్టింది.

అందునా వాళ్ళు అంగన్ వాడీ టీచర్లు! వాళ్ళ గౌరవవేతనాలేమీ వేల రూపాయలుండవు. అందునా అప్పట్లో మూడు వందలో, అయిదొందలో ఉండేది. ఇంకా బడిలో చేరే వయస్సు రాని, పసిపిల్లల ఆలనాపాలనా చూసేవాళ్ళు! తమ వేతనాన్ని మరికొంత పెంచమనీ, ఇంకొన్ని సౌకర్యాలు ఇమ్మని[వీలైతే తమ ఉద్యోగాలని పర్మినెంటు చెయ్యమని] రోడ్డెక్కి ఆందోళన చేపట్టినందుకు, వాళ్ళని చితక్కొట్టించాడు చంద్రబాబు! అప్పడతడికి ఏ‘సెంటిమెంటూ’ అనిపించలేదు.

బషీర్ బాగ్ కాల్పుల ఘటకైనా అంతే! పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటూ ఎర్రపార్టీల వాళ్ళు, జనాలని సమీకరించి ఆందోళన చేపడితే.... బ్రిటీషు వాళ్ళ స్థాయిలో కాల్పులు జరిపించాడు. వాళ్ళు కూడా... నిన్నటి తన బాబ్లీయాత్ర లాగే, శాంతియుతంగా, గాంధీ మార్గంలో ఆందోళన చేస్తున్న వాళ్ళే! అప్పుడూ చంద్రబాబుకి ఏ ‘సెంటిమెంటూ’ అన్పించలేదు.

"వాళ్ళూ గౌరవనీయులైన కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళేం టెర్రరిస్టులు కారు!" అనిపించలేదు చంద్రబాబుకి. ఇవి మచ్చుకి ఒకటి రెండు సంఘటనలే! తన హయాంలో ఎందరు అమాయకులు, ఎంత నిస్సహాయతకు, ఎంత పోలీసుల జులుంకు, ఎంతగా అధికారుల అవినీతికి బలయి, అసహయంగా కన్నీళ్ళు పెట్టుకున్నారో, ఇతడికి, అప్పట్లో అయితే, ఆలోచించే తీరిక లేదు. ఇప్పుడైతే కనీసం అవి గుర్తుకు కూడా ఉన్నట్లు లేవు.

"తనది కాకపోతే కాశీదాకా డేకమన్నాడట" అనే సామెతని, పెద్దలు, ఇలాంటి వాణ్ణి చూసే చెప్పి ఉంటారు.

అదే తమకైతే... నాలుగు రోజులకే... తమని మర్యాదగా డీల్ చెయ్యలేదని, కనీసం మనుష్యుల్లాగా కూడా చూడలేదని, అన్నం నీళ్ళు ఇవ్వలేదని.. ఎంత ఆక్రోశపడ్డాడో! కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు! మరి తాము రాజకీయ నాయకులు. తమవైతే ప్రాణాలు! ప్రజలవి? నిరర్దక జీవితాలు కాబోలు. తమకైతే మాన మర్యాదలు, మనోభావాలు? ప్రజలకైతే...? "సామాన్య ప్రజలకు కూడా మనోభావాలూ, మానమర్యాదలూ ఉండటమేమిటి? నాన్సెన్స్!" అనుకున్నాడు కాబోలు!

అతడొక్కడికే కాదు. డబ్బూ, అధికారం ఉన్నాయనుకునే రాజకీయ నాయకులూ, అధికారులూ... అందరిదీ దాదాపు ఇలాంటి ఆలోచనా సరళే! కాబట్టే... రాజకీయ పార్టీలలో గానీ, అధికార యంత్రాంగంలో గానీ ‘సేవా భావం’ కాగడా పెట్టి వెదికి చూసినా కనిపించడం లేదు.

ఈ విధంగా జనాల పట్ల తాను వ్యవహరించిన తీరునే, చంద్రబాబు బాబ్లీ యాత్రలో అనుభవించాడు.

అదొక్కటే కాదు, జనం పరంగా అతడి సువర్ణముఖి లో మరో కోణం ఏమిటంటే...

అప్పట్లో అతడికి జనం అంటే ‘nothing' అన్న భావం ఉండేది. అందునా మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారాని కొచ్చాక... 1999 లో, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, అతనికి జనం పట్ల మరింతగా ‘జాగ్రత్త’ పోయింది. ‘తొక్కలో జనం! గూఢచర్యం వెంట ఉండాలే గానీ, ఎన్నికలలో గెలవటానికి జనం అక్కర్లేదు" అనుకున్నాడు. [నిజానికి గూఢచర్యపు లోతు తెలిసిన రాజకీయ నాయకులు ఏ దశకి చేరతారో చంద్రబాబూ, అదే స్థితికి చేరాడు.]

కాబట్టే... ఇప్పుడు చంద్రబాబు, జనాలకి ‘Nothing' అయిపోయాడు. అతడికే కాదు, అతడి లాంటి చాలామందికి కూడా! కాబట్టే... ఇప్పుడు తమ రాజకీయ అవసరాలకి, బలం చూపెట్టుకోవాలన్నా, ధర్నాలు ర్యాలీలు బంద్ లూ సభలూ నిర్వహించాలన్నా.... డబ్బులిచ్చి జనాన్ని సమీకరించుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓట్లు వేయటానికి కూడా... ఎక్కువమంది విషయంలో... డబ్బులిచ్చి ఓట్లేయమని అడుక్కోవాల్సి వస్తోంది! ఇంతా చేసి డబ్బులిచ్చినా, పుచ్చుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారనే గ్యారంటీ లేని రాజకీయ వ్యాపారం చేయాల్సి వస్తోంది.

అయితే, ఆ విధంగా సభలకి జనాలని సమీకరించుకొని బలం చూపెట్టుకోక పోతే... రాజకీయంగా అదే పైకారణం [over leaf reason] అయిపోతుంది. జనంలో ‘ఫలానా వాళ్ళకి, వాళ్ళ పార్టీకి పట్టులేదు, ఆదరణ లేదు’ అన్న ప్రచారంతో మట్టి కలిసిపోతారు. దాంతో, జనాలని సమీకరించి సభలు నిర్వహించుకోక పోతే, అదే Disadvantage అవుతుంది.

అలాగని డబ్బులు ధారాపాతంగా ఖర్చు చేసి, జనాలని తెచ్చుకుని... రోడ్ షోలు, ధర్నాలు, సభలూ నిర్వహించినా.... అవి Advantage ఏం కావటం లేదు.

"ఇవ్వాళా రేపు, డబ్బు ఖర్చు బెడితే, జనాలని సమీకరిస్తే... సభలూ, యాత్రలూ జయప్రదం కావటం పెద్ద విషయ మేమీ కాదు. సభలకి వచ్చిన వాళ్లంతా ఓట్లేస్తారను కోలేం" అనే విమర్శలు బిగ్గరగానే విన్పించాయి. "చిరంజీవిని చూడటానికీ జనం వచ్చారు. అలాగని ప్రరాపా గెలచిందా? జూనియర్ ఎన్టీఆర్ ని చూడటానికీ జనం వచ్చారు. అలాగని తెదేపా 2009 ఎన్నికల్లో గెలిచిందా?" అంటూ దృష్టాంతాలు చూపేవాళ్ళూ ఉన్నారు.

‘జన సమీకరణ చేయకపోతే నష్టం. అలాగని చేస్తే లాభం లేదు!’... అనే ఈ పరిస్థితి, ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. అసలిలాంటి స్థితి వస్తుందని ఈ రాజకీయ నాయకులెప్పుడూ ఊహించి కూడా ఉండరు.

ఇక చంద్రబాబు విషయంలో మరో సువర్ణముఖ విన్యాసాన్ని పరిశీలించండి.

రామోజీరావు దర్శకత్వంలో, 1995 లో మామ ఎన్టీఆర్ ని, ‘లక్ష్మీ పార్వతి జోక్యం’ అనే పైకారణంతో [over leaf reason] వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి అయిపోయాడు.

‘నమ్మకద్రోహం చెయ్యగలిగే నైపుణ్యం[Talent] ఉండటమే తన గొప్పతనం, సామర్ద్యం’ అనుకున్నాడు. అది తన ‘లౌక్యం’, ‘తెలివితేటలు’ గట్రా! అదే పని, ఇప్పుడు మరాఠా పోలీసులు "బాబ్లీ చూపెడతాం రమ్మని’ నమ్మించి తీసికెళ్ళి అరెస్టు చేస్తే.... ఎంత అంగలారుస్తున్నాడో? ‘ద్రోహం అనీ, ఘోరం అనీ, నీచం అనీ’ అలిసిపోయే దాకా అరిచి తిట్టాడు. ‘తాను చేస్తే లౌక్యం, ఎదుటి వాడు చేస్తే మోసం!’ అనటం అంటే ఇదే కాబోలు!

అయితే ఇక్కడ ‘మెదళ్ళతో యుద్దం’లో ఓ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, చాలా మంది మీద ప్రయోగించిన తంత్రం ఈ ‘నమ్మక ద్రోహం’.

మన పురాణాలలో, మత విశ్వాసాలలో, పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంటుంది. ‘మాట ఇచ్చి తప్పడం మహా పాపం’ అనీ! దాని [విపర్యయ] మరో రూపమే నమ్మక ద్రోహం. మాట ఇవ్వడమంటేనే నమ్మించడం. ఇచ్చిన మాట తప్పడమంటే ద్రోహం చేయడమే! కాబట్టే "నమ్మక ద్రోహం చేస్తే పుట్టగతులుండవు" అంటారు!

మన స్వాతంత్ర పోరాట చరిత్రలో... కట్టబొమ్మన, ఝాన్సీరాణి ఇత్యాది చాలామంది యోధుల చరిత్రలో, బ్రిటీషు వాడి తరుపున పనిచేసిన నమ్మకద్రోహుల ప్రమేయం లేకపోతే, ఆయా యోధులు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు.

దరిమిలా, సినిమాలలో, సాహిత్యంలో, జోకుల రూపేణా "నీచుడా! నమ్మించి ద్రోహం చేస్తావా?" అంటే... విలన్ నవ్వుతూ "నమ్మకపోతే ద్రోహమెలా చెయ్యటం?" అనే జవాబులుండేవి.

ఆ విధంగా నమ్మకద్రోహమే ప్రధాన ఆయుధంగా... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులు, నెరపే గూఢచర్యం ఉంది. చివరికి ‘కోడల్ని కాదు, కూతుర్ని’ అన్నంతగా... ఇటలీ సోనియా ఇందిరాగాంధీని నమ్మించింది. ‘జీవిత భాగస్వామిని’ అంటూ రాజీవ్ గాంధీని నమ్మించింది.

అలాంటి చోట... అదే ‘నమ్మక ద్రోహాన్ని’ చంద్రబాబు రామోజీరావుకీ, వై.యస్. సోనియా+రామోజీరావు లకీ చూపించారు. గూఢచర్య గుట్టుమట్లు అందరికీ పంచడం ద్వారా చంద్రబాబు, గారెల వంట వంటి సందట్లో సడేమియా గూఢచర్యం నడపటం ద్వారా వై.యస్.!

ఆ లోతట్టు కారణాలతోనే, ఇప్పుడు ఇలా పైకి కనబడే రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి. అవి బాబ్లీ యాత్రలు కావచ్చు, ఓదార్పు యాత్రలు కావచ్చు. పేరేదైతేనేం? లేకపోతే, యాత్రలు జరుపుకోనివ్వటం వలన కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చే నష్టం ఏమిటి? యాత్రలు అడ్డుకోవటం ద్వారా వచ్చిన నష్టమే ఎక్కువ కదా?

ఆ విధంగా తాము జరిపించిన ‘నమ్మకద్రోహం’ రీత్యా, అదే సువర్ణముఖిని... సోనియా, రామోజీరావులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో కేవలం ‘సువర్ణముఖ’ మాత్రమే లేదు. మరో ఆసక్తికరమైన ఆకర్షణీయమైన అంశం ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

చంద్రబాబు ‘సువర్ణముఖి’ని రెండు రకాలుగా అనుభవిస్తున్నాడు.

ఒకటి - మాకు చేసిన కర్మల ఫలంగా!

మరొకటి - ఈ దేశానికి, రాష్ట్రప్రజలకి చేసిన కర్మల ఫలంగా!

వాటి గురించి వివరించే ముందు ఒక పోలిక చెబుతాను.

మనం ఒక చిన్న పిల్లవాడికి "నాయనా! ప్రతిరోజూ సూర్యుడు ఒక దిక్కునే ఉదయిస్తాడు. ఆ దిక్కుని తూర్పు అంటాం" అనో, లేక "నాయనా! ప్రతి రోజూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు" అనో, చెప్పామనుకోండి!

దాన్ని నమ్మడానికి ఆ పిల్లవాడు నాలుగు రోజులో, నలభై రోజులో సూర్యోదయాన్ని పరిశీలిస్తే చాలు, నిర్దారించుకోగలుగుతాడు. నమ్మకాన్ని స్థిర పరుచుకోగలుగు తాడు. ఎందుకంటే - అది చర్మ చక్షువులకి కనబడే దృశ్యం!

అదే ఒక వ్యక్తికి, "నాయనా! ధర్మోరక్షితి రక్షితః అంటారు పెద్దలు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది" అనో, లేక "నాయనా! మనం చేసుకున్న కర్మఫలం మనమే అనుభవిస్తాం. అంచేత సత్కర్మలే చెయ్యాలి" అనో, చెప్పామనుకొండి.

దాన్ని నమ్మడానికి, ఆ వ్యక్తి, నాలుగు రోజుల్లోనో, నలభై రోజుల్లోనో పరిశీలనలూ, నిర్దారణలూ చేసుకోలేడు. దాన్ని పరిశీలించడానికి ఒకోసారి జీవిత కాలం పడుతుంది. అదీగాక అది భౌతిక దృష్టికి స్పష్టపడటం అరుదుగా జరుగుతుంది. అంతశ్చక్షువులతో, జ్ఞాన దృష్టితో గ్రహించవలసి వస్తుంది.

వేల సంవత్సరాల క్రితం, ఈ గడ్డమీద జన్మనెత్తిన వారు, ఎక్కువగా ఈ నమ్మకాలని కలిగి ఉండేవాళ్ళు. ‘చేసుకున్న కర్మ అనుభవించక తీరదు!’ ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ వంటి పెద్దల మాటలు, సూక్తులు, తత్వాలు, ఇతిహాసాలు, మత విశ్వాసాలు, ప్రజలని ఈ విషయమై నిత్య జాగరూకులని చేసేవి.

నమ్మకాలు సడలిపోయి, సంస్కృతీ సంప్రదాయాలు మరిచిపోయి, ‘డబ్బూ అధికారాలతో ఏమైనా చేసేయ వచ్చు’ అనుకునే పదార్ద వాదం పెరిగిపోయాక.... సత్యాలను చూడగల కన్నూ, గ్రహించగల బుద్దీ చాలా మందిలో కరువయ్యాయి.

అయితే, ఒక్కసారి, మన మీద పరచుకున్న కృత్రిమ ప్రచారాల మాయ అనే తెరలని తొలగించి చూస్తే, ‘ఎవరైనా సరే, చేసుకున్న కర్మఫలం అనుభవించే తీరతారు’ అన్న సత్యం మన కళ్ళముందే ఉంది.


అలాంటి వాటిల్లో ఒకటి ‘చంద్రబాబు ని, అతని బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడవటం’.

ఇక మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి ని వివరించే ముందు....

‘హలో బ్రదర్’ సినిమాలోని రెండు హాస్య సన్నివేశాల్ని చెబుతాను.

నాగార్జున ద్విపాత్రిభినయం చేసిన ఆ సినిమాలోని తొలి సీన్లలో.... దొంగ అయిన నాగార్జున, అతడి అనుచరుడు & కమేడియన్ బ్రహ్మనందం జైలు నుండి పారిపోయి, పోలీసుల జీపుని చేజిక్కుంచుకొని, బ్యాంకు నుండి వస్తున్న గిరిబాబు క్యాష్ బ్యాగు కొట్టేసిన దొంగ [రమ్యకృష్ణ] వెంట బడతారు. జీపులో డ్యాష్ కొట్టి, క్రిందబడిన ఆ మోటర్ సైకిలిస్ట్ తో, నాగార్జున...

"ఏరా! పవిత్ర భారత దేశంలో పుట్టేసి, నెత్తిన హెల్మెట్ పెట్టేసి, దొంగతనం చేస్తావా?" అంటాడు.

వెంటనే బ్రహ్మానందం... "గుర్రంలా ఉన్నావ్! గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతకక, పిల్లిలా దొంగతనం చేస్తావా?" అంటాడు.

అంతలో ఆ ‘మోటార్ సైకిలిస్ట్ కమ్ దొంగా’ మగవాడు కాదనీ, ఆడ లేడీస్ అనీ అర్దమయ్యాక, వాళ్ళు పండించే హాస్యానికి మనం నవ్వుకుంటాం.

అయితే తదుపరి కథలో, ఈ సీన్ కి కొనసాగింపు ఉంటుంది. నాగార్జున, బ్రహ్మానందాలు, బంగారు నగల తాకట్టు దుకాణానికి వెళ్ళి, సేటు [జెన్ని] కి ఠోకరా ఇచ్చి, అతడి నగలు వీళ్ళు చేతుల్లోకి, వీళ్ళ కత్తి అతడి చేతిలోకి వచ్చేటట్లుగా ట్రాప్ చేస్తారు. "నాకీ నగలు నాకీ ఇవ్వండి" అనే సేటుని, ‘తమ నగలు కాజెయ్యాలని సేటు తమని కత్తితో బెదిరించాలని చూస్తున్నాడంటూ’ బనాయిస్తారు. న్యాయం చెప్పమని చుట్టూ ఉన్న వారి నడుగుతారు. ఇంతలో పోలీసు వేషంలో వచ్చిన హీరోయిన్ [రమ్యకృష్ణ]....

"నేను చెబుతాను. పవిత్ర భారత దేశంలో పుట్టీ, అమాయకుల జేబుల్లో బీడీలు పెట్టి, కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా!" అంటుంది. డైలాగ్ కొనసాగిస్తూ "నత్తల్లా ఉన్నారు. పీతల్లా పని చేసుకుని, బాతుల్లా బతకక, కోతుల్లా దొంగతనం చేస్తారా, రౌడీల్లారా!?" అంటుంది. అది విన్న బ్రహ్మానందం సాలోచనగా "ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే?" అంటాడు.

అప్పటికే తత్తర చూపులు చూస్తున్న నాగార్జున "విన్నట్లు కాదు, అన్నట్లుంది!" అంటాడు.

సరిగ్గా అదే పరిస్థితి... బాబ్లీ యాత్రలో చంద్రబాబుది!

ఏ విధంగా అంటే....

1995 సెప్టెంబరు లో చంద్రబాబు, మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి మేము మా బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాము.. మా నాన్న గారప్పటికి స్వర్గస్తులయ్యారు. అమ్మా చెల్లీ, తమ్ముళ్ళు [ఈ పోరాటం తమ వల్ల కాదని] హైదరాబాద్ వెళ్ళిపోయారు.

1992లో నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వం దిగిపోయి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం ఎక్కే సమయంలో మా ఫ్యాక్టరీ సీజ్ చేసిన APSFC అధికారులు, 1995 వరకూ తిరిగి చూడలేదు గానీ, మా అమ్మా, చెల్లీ,తమ్ముళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక, 1995 అక్టోబరులో వచ్చి, ఫ్యాక్టరీ ఖాళీ చెయ్యమన్నారు.

మేం మకాం నంబూరు పల్లెకు మార్చాము. అప్పటి వివరాలన్నీ నా గత టపాలు ‘పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే లేబుల్ లో ఉంచాను. 1995 ద్వితీయార్దంలో, నంబూరులోని మా ఇంటి క్రింది వాటాల వాళ్ళు, మమ్మల్ని మంచీనీళ్ళు పట్టుకోనిచ్చే వాళ్ళు కాదు. బావి నీళ్ళ మోటారు మీద నీళ్ళు పోసి, చీటికి మాటికి కాల్చేసేవాళ్ళు. మంచినీళ్ళు, కొళ్ళాయి వస్తున్నంత సేపూ వాళ్ళే పట్టుకునేవాళ్ళు. పైవాటాలో ఉండి నీళ్ళు మోసుకోవటం అంటే చాలా కష్టంగా ఉండేది.

దీనికి అదనంగా కరెంటు వేధింపులూ ఉండేవి గానీ, ప్రస్తుతానికి నీటి వేధింపు గురించి చెబుతాను. [ఈ నీళ్ళూ, కరెంటు వేధింపులు మా మీద 2007 దాకా ప్రయోగింపబడుతూ ఉన్నదే లెండి.] ఈ వేధింపుల నేపధ్యంలో 1997 మార్చిలో, నంబూరులో మా వారి మీద భౌతిక దాడి జరిగింది. మా వారి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. అందరూ చూస్తూ ఉన్నారే గానీ, ఒక్కరూ సాయం రాలేదు. కనీసం మాట సాయం కూడా!

మేము పోలీసు కేసు పెట్టడానికి వెళ్తే, పోలీసులు "ముందుగా వాళ్ళే మీ మీద కేసు పెట్టారు" అన్నారు.

అప్పట్లో రాజీవ్ త్రివేది అనే ఐపీఎస్ అధికారి, గుంటూరుకు ఎస్పీగా ఉండేవాడు. అతణ్ణి కలిసి ఫిర్యాదు చేస్తే "మీరు చదువుకున్నారు. వాళ్ళు ఇల్లిటిరేటెడ్. ఏమో! మీరే వాళ్ళ మీద కేసు బనాయిస్తున్నారేమో?" అన్నాడు. అక్కడ వ్యక్తుల [మాతో సహా] మోటివ్స్ గానీ, కెరీర్ & ప్రీవియస్ రికార్డు గానీ పట్టించుకోలేదు. ఇక అనవసరం అనుకొని, నంబూరు నుండి గుంటూరుకు మకాం మార్చుకున్నాము.

ఇదే మాటను, ఇదే ట్రిట్ మెంట్ నూ, మేము సూర్యాపేటలోనూ ఎదుర్కొన్నాము. ఆ వివరాలన్నీ నేను నా గత టపాలు [వ్యవస్థీకృత వేధింపు] లలో ఉంచినవే!

వెరసి నంబూరు గ్రామంలో ‘నీళ్ళు’ అన్న పైకారణం [over leaf reason]తో మా మీద భౌతిక దాడి చేయటం, బూతులు తిట్టటం, మా కంటే ముందే వాళ్ళే కేసులు పెట్టడం, మేము క్రిందే ఉంచిన ఇనప సామానులు దొంగతనం చేయటం గట్రాలు చేసారు. అంతేగాక మా విద్యార్ది తల్లిదండ్రులే గాక, ఊరి వాళ్ళు కూడా ఎవ్వరూ సహాయం చేయటానికి రాలేదు.

ఇలాగే, సూర్యాపేటలో... మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి! గతంలో ఆ ఊరిలో ఉన్న ఒక సంపన్నుడి ఇంటిలో పనిమనిషిగా ఉంటూ, తన స్త్రీత్వాన్ని ఎర వేసి, ఉచ్చు బిగించి, యాగీ [బ్లాక్ మెయిల్] చేసి ఆస్థి వ్రాయించుకున్న రికార్డు కలది. ఆమె భర్త అంతకు ముందు టైలరు. తర్వాత చికెన్ కొట్టు యజమానులయ్యారు, పెద్ద ఇల్లు కట్టారు.

ఇదంతా ఆ ఇంటిలో దిగక ముందు మాకు తెలియదు. ముందుగా మాట్లాడుకున్న నియమాలన్నిటినీ ఉల్లంఘించీ, ఆమే మమ్మల్ని... నీళ్ళు, కరెంటు గట్రా అన్ని విధాలుగా వేధించింది. ఉన్న ఫళంగా ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఊళ్ళో మరెవ్వరూ ఇల్లివ్వ మంటారు.

ఈ నేపధ్యంలో ఆమె మమ్మల్ని బండబూతులు తిట్టింది. పోలీసులు ఎంత రఫ్ డీల్ చేశారంటే, ఓ రోజు ఓ హోంగార్డు వచ్చి "ఎస్.ఐ.గారు పిలుచుకురమ్మన్నారు మిమ్మల్ని! ఏడీ నీ మొగుణ్ణి బయటకు పిలు!" అన్నాడు. ఎంసెట్ ర్యాంకుల అవకతవకలపై ఫిర్యాదు ఇచ్చినందుకు, మేము ఎదుర్కొన్న వ్యవస్థీకృత వేధింపు అది!

ఇంటికి తాళం వేయటం, పాల వాణ్ణి సైతం రానివ్వక పోవటం గట్రా వేధింపులతో బాటు, నిరంతరం బూతులు తిట్టేది. అద్దె తీసుకోవటానికి తిరస్కరించింది. పోలీసులతో "మేము గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాము. ఎంసెట్ మీద ఫిర్యాదు ఇచ్చిన లెక్చరర్ ని, ఇలా 420 లా డీల్ చేయటం సరికాదు" అని ఆక్రోశంతో వాదించాను.

మా ఇంటి ఓనరు "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కులేదు. ఏం చూసుకుని ఇంత పొగరు" అని మమ్మల్ని ఉద్దేశించి అనేది.

గుంటూరు ఎస్పీ రాజీవ్ త్రివేది లాగానే, నల్గొండ ఎఎస్పీ శివానంద రెడ్డి ఐపీఎస్, "మీరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చదువు రానివాళ్ళు. మీరే వాళ్ళని harass చేయటం లేదని గ్యారంటీ ఏమిటి?" అన్నాడు.

వెరసి ఎంసెట్ ర్యాంకుల ఫిక్సింగ్, ఇంటర్ పేపర్ లింకుల మీద ఫిర్యాదు చేసినందుకు ‘ఇల్లు ఖాళీ చేయటం’ అన్న పైకారణం [over leaf reason]తో పోలీసులు, అన్నిపార్టీల రాజకీయ నాయకులు, మా విద్యార్దుల తల్లిదండ్రులతో సహా సహాయం చేయకుండా, అందరూ కలిసి వ్యవస్థీకృతంగా వేధించారు.

సూర్యాపేట లో సాయం కోసం మేము అన్ని పార్టీ నాయకులు దగ్గరికి వెళ్ళాము. వేధింపు మరింత పెరగటమే గానీ, ఒక్కరూ పైకారణంగా ఉన్న ఇంటి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంటికి దాదాపు 47వేల రూపాయల కరెంట్ బిల్లు ఇచ్చారు. అదీ వేధింపు స్థాయి! సూర్యాపేట లోనే... ‘Increase of expenditure and Decrease of income' అన్న స్ట్రాటజీ మాకు చూపించబడింది.

వీటన్నింటిని తర్వాత, ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్ట బడితే, కొన్ని నెలలపాటు, ఆ పంచనా ఈ పంచనా ఉన్నాం. చంద్రబాబు నాయుడి కొడుకుతో స్నేహం చేస్తున్న మా తమ్ముడు, తన వంతు సాయంగా, నానల్ నగర్ లో ఒక రేకుల గది చూసాడు. అక్కడ కామన్ బాత్ రూం, కామన్ టాయ్ లెట్ ఉండేవి.

వీధి కార్పోరేషన్ బోరు పంపు దగ్గర నీళ్ళు పట్టుకునేటప్పుడు, ఆ పంపు ఎదురు ఇంటి అతను తాగి వచ్చి మావారితో కావాలని గొడవ పెట్టుకుని చొక్కా పట్టుకున్నాడు. మా తమ్ముడు డబ్బులు పంపుతుండగా గడిపేవాళ్ళం. చివరికి ఫోన్ కీ కూడా అందుబాటులో ఉండకుండా, డబ్బులు పంపలేదు. చివరికి పస్తులండవలసి వచ్చింది. మా తమ్ముడితో కట్ అయ్యింది. తరువాత వేరే స్నేహితుడి నుండి అప్పు తీసుకొని, చివరికి శ్రీశైలం చేరి స్కూల్ పెట్టుకున్నాం.

ఈ మొత్తం వ్యవస్థీకృత వేధింపు వెనక ఉన్నది.... రామోజీరావు, చంద్రబాబు నాయుడులే! చాలా వరకు ఫిర్యాదు చేసాము. కొన్నింటిని ఊరుకుండి పోయాము.

నంబూరు, సూర్యాపేట, హైదరాబాద్ నానల్ నగర్ లో, మేం పడిన వ్యవస్థీకృత వేధింపు... కొన్ని నెలలు, సంవత్సరాలు సాగితే... చంద్రబాబు బాబ్లీయాత్ర... అయిదు రోజులు సాగింది.

మమ్మల్ని మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటం అన్నదే టార్గెట్ గా... చంద్రబాబు, రామోజీరావులు వెనక నడిపించటాన్నే, మా కేసులో సాక్ష్యాధార పత్రాల సహితంగా, దృష్టాంత పూరితంగా నిరూపించాము. ఆ వివరాలన్నీ గత టపాలలో పొందుపరిచిన విషయం మీకు తెలిసిందే!

మేం కొన్ని నెలలు పాటు భరించిన వేధింపుని, బాబ్లీ [నీళ్ళు] అనే పైకారణంతో [over leaf reasonతో] అయిదు రోజులు భరించే సరికే చంద్రబాబు బేర్ మన్నాడు. అసలు మూడు రోజులకే కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

తమను పోలీసులు బూతులు తిట్టారనీ, తిండీ నీళ్ళు ఇవ్వలేదనీ, 70 మందికి ఒకే బాత్ రూమ్, టాయిలెట్ ఉండటంతో నరకం చూశామని, ఔరంగాబాద్ ప్రయాణం 8 గంటలలో మూత్ర విసర్జనకి కూడా బస్సులాపలేదని, రెండు చపాతీలు ఇచ్చారనీ, ఈడ్చుకు వెళ్ళారనీ, కోపం వచ్చిన పోలీసల్లా లాఠీలతో కుళ్ళబొడిచారని, తమ గొలుసులు, డబ్బు, సెల్ ఫోన్ లాక్కున్నారని.... కష్టాలన్నీ వెళ్ళబోసుకుని ఏడ్చాడు.

మేము అందుకున్న వ్యాఖ్యల్ని అతడూ అందుకున్నాడు. వీళ్ళని కొట్టి, ఆపైన మరాఠా పోలీసులే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చం నంబూరులో మా క్రింది వాటాల వాళ్ళు, తామే మా వారిని కొట్టి, మళ్ళీ ముందుగా తామే మా మీద కేసులు పెట్ట ప్రయత్నించినట్లుగానే....

"వాళ్ళే మమ్మల్ని కొట్టారు. తలలు గోడకేసి కొట్టబోయారు" అన్నారు మరాఠా పోలీసు అధికారులు.

"వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు" అని కూడా అన్నారు.

చంద్రబాబు కూడా... "అడిగే వాళ్ళు లేరు కదా అని, మమ్మల్ని అక్కడే చంపేయాలని కుట్ర పన్నారు" అన్నాడు.

"మేం గౌరవనీయమైన ప్రజా ప్రతినిధులం. మమ్మల్నింత అమర్యాదగా చూస్తారా?" అని దుఃఖ పడ్డాడు.

ఆ విధంగా... ఆ డైలాగులు [హలో బ్రదర్ సినిమాలో లాగా...] అతడికి విన్నట్లో, చదివినట్లో అన్పించక తప్పింది కాదు.

ఒక్క మాటలో చెప్పాలంటే - మాకు చేసిన ‘వేధింపు కర్మలలో’ కొన్నింటిని, చంద్రబాబు యధాతధంగా అనుభవించాడు.

నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, అంత నీచమైన స్థితి సంభవిస్తుందని ఎవ్వరూ ఊహించరు. ఎంత ప్రక్క రాష్ట్రపు పోలీసులైనా, ఐపీఎస్ అధికారుల కన్నా ఒక ‘భయం’ ఉంటుంది.

"ఏమో! ప్రక్క రాష్ట్రానికి ఒకప్పటి ముఖ్యమంత్రి. మళ్ళీ ముఖ్యమంత్రి అయినా, మనం డెప్యూటేషన్ మీద అక్కడికి పోయినా, ఎందుకొచ్చిన ఉపద్రవం!" అనుకుంటారు.

అదీగాక "ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి. ఒకవేళ మళ్ళీ పరిస్థితులు మారి ఇతడికి హవా నడిస్తే... అప్పుడు మనం రిస్క్ లో పడతాం" అనుకునైనా.... రాజకీయ నాయకుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ‘ఎంత రాజకీయ కారణాలైనా సరే, ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీద, ఆయా ఆపరేషన్లని నిర్వహిస్తోంది మనం!’ అనే జాగ్రత్త తీసుకుంటారు.

అలాంటిది, ఎలాంటి జంకూ గొంకూ గానీ, సందేహ భయాలు కానీ లేకుండా, మామూలు జేబు దొంగలకి చూపించినట్లుగా ధర్డ్ డిగ్రీ చంద్రబాబుకి చూపించటం ఎవ్వరూ ఊహించనైనా ఊహించనిది. అతడి మాటల్లోనే చెప్పాలంటే... "70 మంది మీదికి, దాదాపు మూడు నాలుగు వేల మంది పోలీసులు... తలుపులు విరగ్గొట్టి వచ్చారు. బస్సుల దగ్గరికి వచ్చేలోగా, దాదాపు 200 మీటర్ల దూరం, ఎవరికి కోపం వచ్చినా తన్నటమే" అనేంత స్థితి రాదు గాక రాదు.

చేసుకున్న కర్మ అనుభవించవలసి నందునే అంతటి అనూహ్య స్థితి వచ్చి ఎదురుగా కూర్చొంది. మాకు చేసిన కర్మలలో కొన్నిటి సువర్ణముఖి అతడు అందుకున్నాడు. ఒంటరి కావటంతో సహా! చంద్రబాబుని, అతడి బృందాన్ని కొట్టటాన్ని అన్నిపార్టీల నాయకులు, జాతీయ పార్టీ నాయకులు నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు.

ఇతడే కాదు, మమ్మల్ని వేధించిన వాళ్ళలో చాలామంది, తరువాత కాలంలో ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించటం’ జరిగింది. కాకపోతే ఆ విషయాలు మాకు చాలా కాలం తరువాత తెలిసేవి. ఎందుకంటే - వాళ్ళు వాళ్ళ సువర్ణముఖిలు అనుభవించే రోజుల్లో... మేము వేరే విషయాల్లో, సమస్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేవాళ్ళం. [అదీగాక మా జీవితంలో గూఢచర్యపు ప్రమేయాన్ని గుర్తించనందునా మేము కూడా మా సమస్యలు తప్ప, మిగిలినవేవి పట్టించుకునే వాళ్ళం కాదు.]

ఇక మా సమస్యలు ఆర్దిక పరమైనవి లేదా కెరీర్ పరమైనవి, లేదా ఆ స్థలం నుండి బయటకు వచ్చేయటం వంటివి అయి ఉండేవి. కొన్ని సంవత్సరాల తరువాత, నాటకీయంగా, ఆ ఊరిలోని వ్యక్తులు కలిసి, ఆయా సంఘటనలు మాకు తెలియజేసేవారు. మొత్తంగా ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించారు’ అన్న విషయం మా కర్ధమయ్యేది. [2005 తరువాత మా జీవితాల్లో గూఢచర్య ప్రమేయం అర్దమయ్యాక, ఈ విషయమై మరింత అవగాహన కలిగింది.]

చంద్రబాబు తన సువర్ణముఖి అనుభవించటం అన్నది, దాదాపు 14 సంవత్సరాల తరువాత, ఇప్పుడు స్పష్టంగా బయటకు కనిపించింది.

ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం చేయ దలుచు కున్నాను. మాకు చంద్రబాబు మీద ద్వేషం లేదు. అలాగని జాలి కూడా లేదు. మేం ఒకటే అనుకుంటాం. "మనం అతడి మీద ద్వేష పడినంత మాత్రానో, జాలీ పడినంత మాత్రానో, అతడి కర్మ అతడు అనుభవించక మానడు. మనమే ముందు జన్మలలో ఏదో దుష్కర్మలు చేసి ఉంటాం. ఈ జన్మలో ఇతడి నెపాన అనుభవించాం. అంతే! ఇదే గీత సాధన! ఇలా అనుకుంటే - జన్మజన్మలుండనీ లేకపోనీ, ఆ నమ్మకపు పునాది మీద మనం మాత్రం, మన భావోద్రేకాలని దాటగలం.

అప్పుడే... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు, ‘అయ్యో! వాళ్ళు సుఖంగానే ఉన్నారే’ అన్న దుగ్ధ మనల్ని బాధించదు. అదే విధంగా... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ‘హా! వాళ్ళు నానా చావూ ఛస్తున్నారు’ అన్న కచ్చ మనల్ని కాల్చదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా... ప్రశాంతంగా, హాయిగా ఉండగలం" - ఈ సాధనని మేం బాగానే నేర్చుకున్నాం. అదీ గీత మాకు చూపిన మార్గం, గురువు నేర్పిన పాఠం.

అంతే కాదు, ఆధునిక హేతు వాదుల సిద్దాంతం ప్రకారం, జన్మలు లేవనుకున్నా, ‘ఎవరి కర్మకు వారే కర్తలు’ అనుకుంటే, మనం మాత్రం సుఖంగా ఉంటాం. అలాగని ‘తప్పుచేసిన వాళ్ళకి, శిక్ష పడకూడదనీ’ అనుకోం - ఇదీ మా దృక్పధం.

ఇక ఈ వివరణని పక్కన బెడితే.... చంద్రబాబు ‘అనుభవించిన సువర్ణముఖి’ గూఢచర్యమే అయితే... దాన్ని నెం.5 వర్గం విధించాలి. గూఢచర్యాన్ని ఒప్పుకోకపోతే... భగవంతుడే ఆ శిక్షని విధించినట్లు ఒప్పుకోవాలి. నేనయితే రెండింటిని నమ్ముతాను. నెం.5 వర్గం ద్వారా భగవంతుడే ఆ శిక్షను విధించాడనుకుంటాను.

ఇకపోతే... చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా.... సువర్ణముఖిని అందుకున్నాడు.

పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~

మామూలుగా అందరిలాగే, చంద్రబాబు కూడా ‘రామోజీరావు కాంగ్రెస్ కి వ్యతిరేకం, తెదేపాకి అనుకూలం’ అనుకున్నాడు కొంతకాలం పాటు! వై.యస్. పాదయాత్రకు పూర్తి కవరేజి, అతడికి ఇమేజి ఇచ్చి సీఎం ని చేస్తున్నప్పుడు దుఃఖ పడ్డాడు. అంతకు ముందు సీటు దిగనని మొరాయించాడు. అలిపిరి దాడితో దెబ్బకు దిగి వచ్చాడు.

అయితే ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ వంటి రాజకీయ పైకారణాలతో, రామోజీరావు ‘ఓసారి తెదేపాని, మరోసారి కాంగ్రెస్ ని పైకెత్తటం [కుర్చీలాటలో లాగా] తెలిసిందే కదా’ అని సరిపెట్టుకున్నాడు. 1989 లో చెన్నారెడ్డి, 1990లో జనార్దన రెడ్డిల మాదిరిగా వై.యస్. కూడా అనుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళల్లో కొందరికి సీన్ ఇచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ కి మాత్రం రామోజీరావు వ్యతిరేకేనని నమ్మాడు.

2004 లో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఇందిరాగాంధీకి వ్యతిరేకి అయిన రామోజీరావు, సోనియాకీ, అంత స్థాయిలో వ్యతిరేకి కాకపోయినా... సంపూర్ణ అనుకూలుడని మాత్రం, ఊహించలేక పోయాడు. గూఢచర్య జ్ఞానాన్ని గ్రహించటంలో ఎంత నేర్పరికైనా, తన చుట్టూ కప్పబడే ఇనుప తెర, చూపించబడిన వర్ణ చిత్రాన్ని దాటి చూడటం అసాధ్యం కూడా!

మార్గదర్శి పేరిట ‘రాజ రామోజీ రావుల యుద్దం’ నడుస్తున్న రోజుల్లో కూడా ‘ఎందుకో ఇద్దరికీ ప్రస్తుతం చెడినట్లుంది’ అనుకున్నాడే గానీ, కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానమూ, రామోజీరావు, వై.యస్. కలిసి నాటకం ఆడుతున్నారనుకోలేదు. అనుమానం వచ్చినా ఎవరు తీర్చగలరు? అలాంటి చోట... వై.యస్. ఆడిన సందట్లో సడేమియా నాటకం, గారెల వంట గూఢచర్యం [చంద్రబాబు] ఎలా గ్రహించగలడు!

కాబట్టే, 2009 ఎన్నికలలో తనకి తప్పకుండా అవకాశం వస్తుందని ఆశపడ్డాడు. కాంగ్రెసేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు పెనుగులాడాడు. అదే డిస్ అడ్వాంటేజ్ అయ్యి, తెరాస కేసీఆర్, సీట్ల సర్ధుబాటు విషయంలో, పుణ్యకాలం కాస్తా కరిగించాడు. వెరసి, నెలకి రెండు వేల రూపాయలు నగదు బదిలీ పధకం చేపట్టినా, వైఫల్యం చెందక తప్పలేదు.

ఎన్నికల ప్రచార సరళిలో మీడియా వైఖరి, అతడి ఆశలకి ఆదిలోనే గండి కొట్టింది. కుటుంబాన్ని ఒక తాటి మీదకు తెచ్చుకున్నా ఫలితం లేక పోయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఈనాడు ఇచ్చిన కవరేజిలో ఆశలు రెప రెప లాడినా, త్వరలోనే నీరు గారి పోయాయి. ఫలితాలు జావ గారి పోయాయి.

ఆ గందర గోళంలో, పరిస్థితులను గూర్చిన అయోమయంలో అతడుండగానే, వై.యస్. దారుణ మరణాన్ని పొందాడు. తర్వాతే చంద్రబాబుకు పరిస్థితుల పట్ల ఓ స్పష్టత వచ్చింది. ‘వై.యస్. జగనూ, కాంగ్రెస్ అధిష్టానాల అంతర్లీన పోరు’ నేపధ్యంలో, రాజకీయ వర్గాల్లో లోతట్టున షికార్లు చేసే సమాచారం, అతడి అవగాహనకి మరింత బలాన్ని సమకూర్చింది. అప్పటికి... అతడికి, ‘రామోజీరావుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఉన్న సంబంధం’లోని నిగూఢ గాఢత బాగా అర్దమైంది.

ఈ నేపధ్యంలోనే, అతడు, తన గూఢచర్యపు అవగాహనని సమగ్రీకరించుకొని, తన పరిధిలోని వారికి పంపకం మొదలు పెట్టాడు. అప్పటి నుండీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల గురి చంద్రబాబు మీదికి తిరిగింది.

అప్పుడే - తోక ఝాడిస్తున్న జగనూ, చంద్రబాబూ వగైరా రాష్ట్ర రాజకీయ నాయకులే గాక, జాతీయ నాయకులకు కూడా ‘మధు కోడా’ దెబ్బలబ్బాయిగా చూపెట్టబడ్డాడు. ‘రాజకీయాల్లో అక్రమార్జన చేసి, దాచుకున్న నిల్వలన్నిటికీ కన్నాలు పెట్టీ, ఐటీ దాడులతో కొడతాను జాగ్రత్త!’ అన్న హెచ్చరిక అది. దెబ్బతో చిరంజీవి లాంటి రాజకీయ కమేడియన్లు, కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ మీద పడ్డారు. [చిరంజీవికైతే పైరసీ దెబ్బకూడా చూపెట్టారు. మగధీర సినిమా పైరసీ సీడి, సినిమా విడుదలకు ముందురోజే వచ్చేసింది.]

జగన్ కి కూడా... అధిష్టానంతో రాజీ పడి, సందుగొందుల్లో తిరిగినా, కొన్ని నెలల అనంతరమైనా రహదారి ఎక్కి, ఎదురు పోరాటం తప్పలేదు. రాజకీయంలోనూ, గూఢచర్య అవగాహన లోనూ, జగన్ కంటే చంద్రబాబుది సుదీర్ఘ అనుభవం. అందుచేత ఇతడు ‘సందుగొందుల్లోకి ప్రయాణించినా నిష్ఫలం’ అన్న సంగతి ముందే గ్రహించాడు. ‘ముందుకు పోవటమే బెటర్’ అనుకున్నాడు. అందుచేత, తన గూఢచర్య అవగాహనని అందరికీ పంచటం ఆపలేదు.

ఇదే సమయంలో తెలంగాణా రచ్చ మొదలైంది. అప్పుడు కూడా, కేసీఆర్, కాంగ్రెస్ మీద గాకుండా, తెదేపా మీదే గురిపెట్టుకు తిట్టటం, విమర్శించటం వంటివి చేశాడు.

‘గూఢచర్య సమాచార పంపిణీ’ అనే కార్యక్రమంలో, చంద్రబాబుకి సహకరిస్తున్నందున, తెదేపాలోని కొందరు నాయకుల మీద కూడా టార్గెట్ చేయబడింది.

ఇందులో భాగమే, నాగం జనార్దన రెడ్డికి ఓయూలో తన్నటం! కిరాయి రౌడీలే ఈ పని చేసారని, ఓయూ విద్యార్దుల ప్రమేయ మందులో లేదనీ తర్వాత వార్తలొచ్చాయి.[అది, మరో కోణంలో చంద్రబాబుకి హెచ్చరిక కూడా!] అంతగా భౌతిక దాడి జరిగినా... చంద్రబాబు గానీ, అతడి అనుచరులు గానీ, ‘లోతట్టు సమాచారాల సేకరణ, విశ్లేషణ, ఆపైన తమ గూఢచర్య అవగాహనల పంపకం’ చేయటం మానలేదు. [అది మరి వాళ్ళ ఎదుట ఉన్న ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీ! ‘చంపు లేదా ఛస్తావు, దెబ్బకొట్టు లేదా దెబ్బతింటావు’ అనే విధంగా, ఎదుట నిలబడిన, అనివార్య ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్ల వంటివి.]

ఇది ఎంతగా కొనసాగిందంటే - ఓయూలో నాగం జనార్దన రెడ్డిని స్పృహ తప్పేలా కొట్టినా సరే.... తదుపరి జరిగిన తెలంగాణా జేఎసీ సమావేశాలకి హాజరైన నాగం బృందం, తెరాస, తెలంగాణా కాంగ్రెస్ నాయకులని మాటలతో కెలికి, లోగుట్లు తెలుసుకు పోవటం ఆపలేదు. తర్వాత్తర్వాత, జేఏసీ మీటింగ్ లకి నాగం బృందం హాజరవ్వటం, అప్పటి వరకూ అందులో రెగ్యులర్ గా పాల్గొంటూ వస్తున్న తెరాస నాయకులు , మరి కొందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా,గైర్హాజరయ్యారు. ఆ జేఏసీని నీర్చుగార్చటం మొదలు పెట్టారు. ఆ తర్వాత, జేఏసీ లోంచి తెదేపా బయటకు ‘వచ్చింది.’

క్రమంగా ‘గూఢచర్య అవగాహనా పంపిణీ’ కార్యక్రమాన్ని, జాతీయ స్థాయిలో... లాలూ, పవార్, శరద్ యాదవ్ గట్రాలకి కూడా చంద్రబాబు విస్తరించాడు. తనకి తక్షణ ఫలితం రాకున్నా, ఎదిరి వర్గానికి [రామోజీరావు+సోనియాలకి] ఇరుకు సృష్టింపబడటం, పరిస్థితుల మీద మరింత అవగాహన కలగటం, తన అనుభవానికి తెలుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే... కాంగ్రెస్ అధిష్టానమూ, మీడియా రాజకీయమూ, చంద్రబాబుకి నయానా భయానా చాలానే చెప్పజూసింది. అధిష్టానం ‘ఐటీ దాడులనీ, సాధారణ నాకా బంధీలలో పట్టుబడ్డ నల్లడబ్బుల్నీ’ చూపించింది. ‘ఆ సమాచార పంపిణీ ఆపకపోతే డబ్బులన్నీ కరిగిస్తా!’ అన్న హెచ్చరిక అది.

మీడియా, చంద్రబాబుని వీలైనన్ని రకాలుగా ఏకాకిని చేసింది, ఇబ్బందుల పాలు చేసింది. ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు అతడి మీద పడ్డాయి. చదువరులకది సొల్లులాగా ఉంటుంది. కానీ, అనుభవించే చంద్రబాబుకి అది చాలా బాధ పెడుతుంది. ఎలాగంటే - పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారని ప్రచారం. దాన్ని ఎదుర్కొని, సరిదిద్దుకునే సరికి, చంద్రబాబుకు తల ప్రాణం తోకకి వస్తుంది. ‘హయ్మయ్య’ అనుకునేంత లో, కుటుంబంలోనే "ఇదిగో బాలకృష్ణ పార్టీని చేతిలోకి తీసుకోబోతున్నాడట" అనే వార్తాంశం షికారు మొదలు పెడుతుంది.

నిజానికి దీని వెనుక స్ట్రాటజీ ఏమిటంటే - ఒక దశలో బాలకృష్ణ తాను ‘సీఎం పదవికి నేను రెడీ’ అని ప్రకటించాడు కూడా! అంటే ఒక వేళ చంద్రబాబు కాల్షీటు ముగించినా, తదుపరి పగ్గాలు తాను చేపట్టి, చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న పనిని కొనసాగిస్తానన్న హెచ్చరిక, బాలకృష్ణ+చంద్రబాబులు, ఆ విధంగా బయటకు ఇచ్చారన్న మాట.

తరువాత చంద్రబాబు ‘ఇలాంటివి నాలుగు రోజులు ప్రచారంలో ఉండి ఆరిపోతాయి. వాటిని పట్టించుకోనక్కర లేదు’ అన్నాడు. ఆ తరువాత బాలకృష్ణ ‘తమ నాయకుడు చంద్రబాబేనని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని’ ప్రకటించటంతో, ఆ సమస్య మీడియాలో చల్లారింది. ఇలా ప్రకటించటం, నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ తమ గొంతు వినిపించటం కోసమే!

కాని, ఈ సంఘటనల కాలంలో మాత్రం, చంద్రబాబు బయట దొరికాడో, విలేఖర్లు ఈగల్లా ముసురుకుని, దోమల్లా కుట్టడం ప్రారంభించారు. చికాకు తప్పించుకునేందుకు బయటకు రాకపోతే, "చంద్రబాబు లోపల దాక్కున్నాడేం? బయటకు రాడెందుకని?" అంటూ కేసీఆర్ లూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలు నోరు చేసుకున్నారు. ఏం చేసినా డిజ్ అడ్వాంటేజే!

ఇలాంటి చికాకులనీ, ఇక్కట్లనీ తప్పించుకోవాలంటే... చాలా సహనం, సంయమనం అవసరం. ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగే దాకా, ఇలాంటి ‘పంటి క్రింద రాయి, చెవిలోని జోరిగ, చెప్పులోని రాయి, ఇంటిలోని పోరు’ చంద్రబాబుకి చుక్కలు చూపెట్టాయి. [అదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా అయితే ఎప్పుడూ బయటకు రాదు, విలేఖర్లకు దొరకదు. అయినా గానీ ఎవ్వరూ విమర్శించరు. అదే చిత్రం ఇక్కడ! కాని అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రతిచర్య వెనుక సోనియానే ఉంటుందని. గతంలో ఇందిరాగాంధీ కూడా చంద్రబాబుల్లాగే విలేఖరుల ‘ఈగా,దోమ’ సమస్యలు ఎదుర్కుంది.]

ఇక ఆ క్రమంలో... చంద్రబాబు, కుటుంబ సభ్యులకీ, బంధు కుటుంబాలకీ [పురంధరేశ్వరి, లక్ష్మీ పార్వతీలతో సహా] సమాచారాన్ని పారదర్శకంగా అందించి, ‘ఐకమత్యంగా ఉండకపోతే, ఏ పార్టీలో ఉన్నా మట్టి కలవటం ఖాయమనీ, రామోజీరావు ఎవరినైనా ఉపయోగించుకొని, ఆనక కూరలో కరివేపాకులా తీసి పారేస్తాడనీ’ సోదాహరణంగా తన జీవిత విశేషాలతో సహా వివరించాడు. దాంతో కొన్ని చికాకులు తగ్గాయి.

క్రమంగా బయట సమస్యలు పెరిగాయి. ప్రజలలో ఇమేజి తెచ్చుకోవాలంటే, మీడియా కవరేజి ఇస్తే సరిపోతుంది. లేనట్లయితే... సభలూ, ర్యాలీలు.... అంటూ ఏదో అలజడి చేయాలి. జనాన్ని సమీకరించటం దగ్గరి నుండి, సభా నిర్వహణల దాకా అన్ని ఖర్చుతో కూడుకున్నవే! ఇంతా చేసినా, మీడియా కవరేజి ఇవ్వకపోతే దండగే! కవరేజి ఇచ్చినా ‘శల్య సారధ్యం’ లాగా ఇస్తే వొరిగేదేం లేదు.

ఈ పరిస్థితుల్లో.... చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడిన ఎలుక లాంటిదే! కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అధికారం లేకపోతే ఆదాయం లేదు. వార్తల్లో, రాజకీయాల్లో లైవ్ గా ఉండకపోతే, కొన్నాళ్ళకి పార్టీ డెడ్ అయిపోతుంది. దాంతో ‘ఖర్చులు పెరగటం, ఆదాయం తరగటం’ అనే పెనం మీద ఉన్నట్లయ్యింది అతడి పరిస్థితి! [increase of Expendature, Decrease of Income అన్నది ఒక స్ట్రాటజీ!]

తాత్కాలిక రాజీలు పడినా, రాణించేదేమీ లేదన్నది జగన్ ఉదంతం నిరూపించింది. దాంతో ‘లోతట్టు సమాచార సేకరణ - విశ్లేషణ, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకున్న తన గూఢచర్య అవగాహన’ని పంపిణీ చేయటం ఆపలేదు సరికదా, మరింత పెంచాడు.

ఎన్ని బెదిరింపులు బెదిరించినా, 7కోట్లు నల్లడబ్బుని హుహ్ కాకీ అనిపించినా[7కోట్లు అన్నవి ఒక నెపం మాత్రమే], ఆగని చంద్రబాబుని "ఆగకపోతే ఎంతకైనా వెళ్తాం! కుళ్ళ బొడవ గలం! బూతులు తిట్టించి, కొట్టించగలం! ‘ఆ ఊ’ అన్నావంటే, పక్కా పైకారణాలు చూపెట్టి శాల్తీలని గల్లంతు చేయగలం! ఖబడ్డార్!!" అనటానికే, బాబ్లీ యాత్ర కెళ్ళిన బాబుని ‘చితక్కొట్టి, విమానంలో పడేసి పంపించటం’గా పరిణమించింది.

బాబు బాబ్లీ యాత్రకి వెళ్తానన్నప్పుడే... రోశయ్యా, అతడి మంత్రులూ, [ఎర్రపార్టీల వాళ్ళతో సహా] చంద్రబాబుకి వెళ్ళవద్దని హితవు చెప్పారు. అన్యాపదేశంగా, "వెనక్కి తగ్గు, లేకపోతే అవమాన పడతావు" అన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. [ఇదే హెచ్చరిక కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపడతానన్నప్పుడు, ప్రధానితో సహా, చాలామంది జాతీయ నాయకులు చెప్పారు.]

"ఎంతైనా రాజకీయ నాయకుణ్ణి. తొమ్మిదేళ్ళు రాష్ట్ర సీఎంగా ఉన్నవాణ్ణి! ఎంతగా ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందనుకున్నా, ఎంత చేస్తారులే!" అనుకున్నాడు. ‘చొక్కా పట్టుకు లాగటం, చింపి పాతరెయ్యటం, మెడపట్టుకు తోయటం, తిట్టి, తన్ని తగలెయ్యటం’ వంటివి ఊహించనైనా లేదు. అటు జగన్ శిబిరానికీ, లోలోన తోక ఝాడించాలనుకుంటున్న లాలూ గట్రాలకి, మాయవతిల దగ్గర నుండి చాలామందికీ, ఈ దెబ్బలబ్బాయిని ‘మహా’ కిరాతకంగా చూపెట్టారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు సోనియా, రామోజీరావులు.

"ఎంతకైనా తెగిస్తాం. మక్కెలిరగ్గొట్టటమే కాదు, కాల్పులు జరిపి, పైకారణాలు ప్రచారిస్తాం" అనేంత తీవ్రమైన హెచ్చరిక అది. [ఇందిరాగాంధీ ని హత్య చేసి ఆపరేషన్ బ్లూస్టార్ నీ, రాజీవ్ గాంధీని హత్య చేసి ఎల్టీటీఈనీ చూపించినట్లుగానే!]

చంద్రబాబుని, ముందుగా బాబ్లీ చూపిస్తాం రమ్మని తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐలో నిర్బధించారు. కటిక నేల మీద కూర్చోబెట్టటం, తిండీ నీళ్ళూ ఇవ్వకపోవటం, కరెంటు లేకుండా కూర్చోబెట్టటం, మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటమే లక్ష్యంగా సాగిన ప్రహసనం అది! ప్రాణ భయం కూడా సరిపడినంతగా పెట్టామనుకున్నాకే, విమానంలో కూలేసి వెనక్కి పంపారు. ఒంటరిని చేయ ప్రయత్నించటమూ మానసిక తంత్రమే!

క్రమంగా, బాబ్లీ యాత్రలో బాబు మీద దాడి తీవ్రత, పెంచుతూ పోయారు. ఒంటరిగా అయితే "నా చుట్టూ నా వాళ్ళుంటే ఇంత జరగక పోను!" అనే భావం చంద్రబాబుకి మిగలకుండా, బృందంతో సహా, అందునా ఆడవారిపై కూడా... అమర్యాద, జులుం చూపెట్టి వదిలారు. అంతేగాక, జాతీయ స్థాయిలో ఏ నాయకులు, చంద్రబాబు గురించి అగ్గగ్గలాడకపోవటం చూపెట్టం ద్వారా ‘నీకోసం ఎవరూ రారు సుమా!’ అన్నట్లుగా, మొత్తం తమ గ్రిప్ ని చూపించారు.

తెదేపా, రాష్ట్రంలో [19 జూలై] ఒక రోజు బంద్ చేయించారు. ఆ తర్వాతే చంద్రబాబునీ, అతడి బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడిచారు.

"నీ చుట్టూ ‘మందిబలం’ ఉన్నా ఏం లాభం లేదు. జనాలు వచ్చినా లాభం లేదు" అన్న దాన్ని, ఆ విధంగా అతడికి ఇంకించే ప్రయత్నం చేసారు. ఎన్ని రోజులని బందులకు పిలుపివ్వగలరు? ఓ ప్రక్క కోర్టులు ఊరుకోవు. మరో ప్రక్క, చీటికి మాటికి బందులంటే ప్రజలూ ఊరుకోరు. [ఇదే హెచ్చరిక వై.యస్. జగన్ కి, అతడి వర్గానికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది.]

ఆనాటి ఎన్టీఆర్ బర్తరఫ్ [నాదెండ్ల భాస్కర రావుతో] రోజుల్లోలా జనాలు ఉర్రూత లూగి, మద్దతుగా వచ్చేందుకు... మీడియా, ఆ విధంగా జనాలని ట్యూన్ చేయటం లేదు కదా! ఒక రోజు కూలీ ఇచ్చి జనాలని.... సభలకీ, ధర్నాలకీ, ర్యాలీలకీ సమకూర్చు కోవాలంటే, బాగా ఖర్చు అవుతుంది. ఎటూ ‘ఖర్చులు పెంచటం, ఆదాయానికి గండి కొట్టటం’ తమ మీద అమలు పరుస్తున్న తంత్రమేనయ్యే! మరి ఎలా తమని తాము రక్షించుకోవటం?

ఆ అగచాట్లే ఇప్పుడు చంద్రబాబువి!

అయితే.... రామోజీరావు దర్శకత్వంలో, కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన "బాబు బాబ్లీ యాత్ర కెళ్తే, కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టటం" లో మరో విభిన్న కోణం ఉంది.

అది చంద్రబాబు సువర్ణముఖి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజా సమస్యలు పట్టుకుని [ధరలు పెరిగాయనో, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనో, తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారనో/ పధకాల వర్తింపులో అన్యాయం జరుగుతుందనో, మరో xyz అనో... ] ధర్నాలు, రోడ్దు రోకోలు చేస్తుంటారు. [ఎక్కువగా ఎర్రపార్టీల వాళ్ళిలా చేస్తుంటారు. ఆ క్రమంలో కాసిన్ని తన్నులూ తింటుంటారు. తన్నులు తినటమే... పైకి ఎదగటానికి మార్గం అనుకునే సంస్కృతి ఎర్రపార్టీలలో ఉంది.] నిరాహార దీక్షలూ చేస్తుంటారు. [తెలంగాణా కోసం కేసీఆర్ చేసిన దొంగ దీక్షల్లాగా కూడా!] అలాంటప్పుడు, మామూలుగానే పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు.

అంతే గానీ... కుళ్ళ బొడవరు, చితక్కొట్టరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక కెరీర్ రికార్డు ఉంది. ఐటీ అభివృద్దితో జాతీయఖ్యాతి గడించిన వాడు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక వ్యక్తిగా వ్యవహరించిన వాడు. అలాంటి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.

అలాంటి చోట... తెదేపా నేతల్ని ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ నమ్మించి తీసికెళ్ళి [చంద్రబాబు ఇలాగే చెప్పుకున్నాడు మరి!], చెప్పులూడి పోయేదాక, దుస్తులు చిరిగి పోయే దాకా.... ఎలా కుళ్ళ బొడవ గలిగినట్లు?

పైగా ‘వాళ్ళ బాధలు చూడలేక, తామే విమాన ఖర్చులు భరించి, వెనక్కి రప్పించామని’ ముఖ్యమంత్రి రోశయ్య సెలవిచ్చాడు. వాళ్ళ బాధలు చూడలేనప్పుడు "నేరగాళ్ళ మీదే ధర్డ్ డిగ్రీ ఉపయోగించరు. అలాంటిది, మాతోటి ప్రజా ప్రతినిధులని అలా విరగ తన్నటం ఏమిటి?" అని మహారాష్ట్రని నిలదీయాలి గానీ, "ఏదో ఒక బండిలో ప్యాక్ చేసి పంపండి" అనటం ఏమిటి? ఖర్చులు భరించి... చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన తెదేపా నేతలందరికీ కలిపి ఒక విమానం ఎందుకు సిద్దం చేయించినట్లు?

‘ఔరంగబాద్ జైలుకి తీసికెళ్తున్నామని చెప్పి, ఎయిర్ పోర్టుకి తీసికెళ్ళారని’ చంద్రబాబు చెబుతున్నాడు. అంటే 20 జూలై, 2010, మంగళ వారం, ముందుగా రోశయ్య ప్రభుత్వం చెప్పినందునే, వాళ్ళని ధర్మాబాద్ నుండి ఔరంగాబాద్ కు తరలించి, విమానంలోకి ఎక్కించి పంపించారా? అంటే ‘వాళ్ళని తన్ని మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ కు పంపండి’ అని చెప్పాడా, రోశయ్య[అధిష్టానం]?

"కేసులు ఎత్తేసాం. వెళ్ళిపొండి" అన్నారు మరాఠా పోలీసులు. ఆ తర్వాత మరాఠా గృహమంత్రి పాటిల్ "అదేం లేదు. వాళ్ళ మీద కేసులు అలాగే ఉన్నాయి" అన్నాడు. [అసలుకే... కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పి, ఆస్తిపాస్తుల్ని అమ్మించటం, చాలా సులభమన్నది ఈ రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.]

దీన్నంతటినీ తెదేపా వాళ్ళు, కోర్టులో సవాలు చేయక పోవటం వింతే! నిజామాబాద్ నుండి ఓ నారాయణ ప్రజావ్యాజ్యం [పిల్] వేసాడు.

సాక్షి దిన పత్రిక, 22 జూలై, 2010, మొదటి పేజీలో చెప్పినట్లుగా, హైకోర్టు:

>>> అన్నీ తెలిసిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వెళ్ళారు?
అక్కడికి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా...
వారు చట్టాన్ని ధిక్కరించవచ్చా, శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చా?
మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల చర్యలు తీసుకోకూడదా!
శాంతి భద్రతల విధులను నిర్వర్తించవద్దని ప్రభుత్వాలను ఆదేశించగలమా?
రాష్ట్రం పరిధిలోని వ్యవహారంలో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది?
ఇటు వంటి వ్యాఖ్యాలను విచారించే ప్రసక్తే లేదు... పిటిషనర్ ను హాజరు పరచండి.

అన్నది. నిజానికి మొదట, ఆంధ్రా మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర, మరాఠా పోలీసులు కదా చంద్రబాబుని, అతని బృందాన్ని ‘బాబ్లీని చూపిస్తామని’ తమ వ్యానుల్లో తీసుకెళ్ళి, ఆ తరువాత మీరు అరెస్టు చేయబడ్డారని చెప్పింది? దీన్ని కదా కోర్టు మొదట విచారించాలి. అది తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడింది కోర్టు.

గతంలో కొన్ని వందల వేల పిల్స్, రకరకాల విషయాల గురించి, కోర్టుల్లో పడి ఉంటాయి. అప్పుడెప్పుడూ కూడా "నీకేం అవసరం? నువ్వెందుకు కేసు వేసావు? నీకేం అధికారం ఉంది? నీకెవరు అధికారం ఇచ్చారు? అసలు వాళ్ళకీ నీకూ సంబంధం ఏమిటి?" అని, కోర్టు, పిల్ వేసిన వాళ్ళని అడిగినట్లు వార్తలు లేవు. ఆ ‘పిల్స్’ ‘వేసేంత అవసరం ఉందా? లేదా?’ అన్నది చూడటం మాత్రమే కోర్టు చేసింది. అవి కూడా ఆప్రాధాన్య విషయాల మీదే ఎక్కువ!

చివరికి జంతు పరిరక్షణ కై వేయబడ్డ కేసుల్లో కూడా, "సదరు ప్రాణులు నీకు అధికారం ఇచ్చాయా?" అని కోర్టులు అనవు కదా? మీదు మిక్కిలి "ఇలాంటి పిల్ వేసినందుకు జరిమానా వేస్తాం. సోమవారం కోర్టుకు ఫిర్యాదుదారుణ్ణి హాజరు కమ్మనండి" అంటూ హుకుం జారీ చేసింది కూడా!

ఇది చూసాక... ఇక తెదేపా వాళ్ళు గానీ, చంద్రబాబు గానీ, వాళ్ళ తరుపున మరొకరు గానీ సుప్రీం కోర్టుతో సహా ఏ కోర్టుకీ వెళ్ళే ఆలోచన చేయరు, చేయించరు. అవినీతి నేరాలతో ఎందరో న్యాయమూర్తుల కేసులు బహిర్గతం అయ్యాక... కోర్టులు నీతికి నిలయాలనీ, న్యాయమూర్తులు నిజాయితీకి నిలువెత్తు రూపాలనీ, ఈ రాజకీయ నాయకులు నమ్మరు. మన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ విషయంలో, ఇది మాకు స్వానుభవం. దీని గురించి గత టపాలలో వ్రాసాను. ఆధార పత్రాలను స్కాన్ చేసి, మా ఆంగ్లబ్లాగు ‘Coups On World' లో ఉంచాను.

పైకి అనక పోయినా, న్యాయమూర్తుల పదవులకి సంబంధించిన బదిలీలూ, పదోన్నతలూ అన్నీ... కేంద్రప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నాక, [రాష్ట్రపతి భవనం రబ్బరు రహదారి, రాష్ట్రపతి రబ్బరు బొమ్మలే కదా!] కోర్టు తీర్పులూ, న్యాయమూర్తుల వ్యాఖ్యలూ, సామాన్యులకి అర్దం గాకపోయినా, చంద్రబాబు నాయుడి లాంటి ముదురు రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.

కాబట్టే ‘మెతుకు పట్టి చూస్తే తెలియదా అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి?’ అన్నట్లు, రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యను చూడగానే అర్ధమైంది, చంద్రబాబుకి, తనకి కోర్టు ద్వారం మూయబడిందని. గూఢచర్యపు వలయంలోకి ఇష్టపూర్తిగా దిగబడ్డాక, తనకి తెరచి ఉన్న ద్వారం తప్ప మిగిలిన వేవీ వర్కవుట్ కావు. అచ్చం గదిలో బంధించిబడిన పాముకి, తెరచి ఉన్న దారి తప్ప మరేదీ ఉండనట్లు!

కొన్నిరోజుల క్రితం... సానియా మీర్జా వరుడు సోయబ్ మాలిక్ Vs ఆయేషా సిద్దిఖీ కేసులో... షోయబ్ ‘సిద్దిఖీ మీద పరువు నష్టం దావా వేస్తాననీ, కోర్టు కెక్కుతాననీ’ బీరాలు పలికాడు. అదే సమయంలో కోర్టు, ఇలాంటి మరో కేసులో "ఇవాళ పెళ్ళి చేసుకోవటం - రేపు కాదనటం ఫ్యాషనై పోయింది" అని చురక వేసి వ్యాఖ్యానించింది. దెబ్బతో షోయబ్, తనకి కోర్టు ద్వారం ముసుకుపోయిందని అర్ధమై, ఆ దారి తొక్కలేదు. గూఢచర్యంలో ప్రవేశం ఉన్నవారికి, ఆ మాత్రం [సంకేత] భాష బాగానే అర్ధమౌతుంది.

ఇక చంద్రబాబునీ, అతడి బృందాన్నీ మరాఠా పోలీసులు కొట్టి తిట్టి పంపించేశాక కూడా అటు శివసేన నేత బాల్ థ్రాక్రే, ఇటు మహారాష్ట్ర గృహమంత్రి పాటిల్ కూడా బాగానే నోరు చేసుకున్నారు.

సరే, వాళ్ళు ప్రక్క రాష్ట్రపు వాళ్ళు! అందునా.... కొళాయిలో నీళ్ళ దగ్గర, ఇరుగుపొరుగులు, ఒకళ్ళు మరొకళ్ళని నీళ్ళు పట్టుకోనివ్వడం లేదనో, ఒకళ్ళ మరొకళ్ళకి నీళ్ళు రానివ్వడం లేదనో... తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాగే, దిగువ రాష్ట్రాల వాళ్ళు, ఎగువ రాష్ట్రాల వాళ్ళతో, తమ నీటి వనరులకి గండి కొడుతున్నారని వివాద పడతారు. కాబట్టి, ఎగువ రాష్ట్రమైన మరాఠా రాజకీయ నాయకులు, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులైన తెదేపా వాళ్ళని, తిట్టి కొట్టారనుకుందాం.

అప్పుడు మిగిలిన ఆంధ్రా నాయకులైనా బాబుకు గట్టిమద్దతుగా రావాలి కదా? ఎర్రపార్టీలు గానీ, తెరాస ప్రరాపాలు గానీ, కాంగ్రెస్ గానీ... ఒక్క పార్టీ రాలేదు, మచ్చుకి ఒక్క నాయకుడూ రాలేదు. కనీసం చంద్రబాబు బృందానికి "అరే! పాపం! ప్రక్క రాష్ట్రానికి పోయి, మనకు నీళ్ళ కోసం, తన్నులు తిని వచ్చారే" అనే సానుభూతి కూడా రాలేదు.

నిజానికి.... మీడియా తలుచుకుంటే అదేమంత విషయం కాదు. ఈ పాటికి చంద్రబాబు ‘ఆంధ్రా భగీరధుడు’ అయిపోయి ఉండేవాడు. అలాంటి సహకారాన్ని, మీడియా, బాబుకి ఇవ్వలేదు గాక ఇవ్వలేదు. చితక్కొట్టించుకున్న నాలుగు రోజులు కూడా, చిలవలూ పలువలూ, చంద్రబాబు అగచాట్ల గురించే చెప్పబడింది గానీ, బాబ్లీలో నీళ్ళ కోసం అతడి effort ని గానీ, వాళ్ళ [so called] పోరాటం గురించి గానీ, మీడియా చెప్పలేదు.

అదే మీడియా చెప్పదలుచుకుంటే... తాను పాజిటివ్ బాకా ఇవ్వదలుచుకుంటే... ఎలా ఉంటుందో -

1982-83ల్లో ఎన్టీఆర్ ని ఈనాడు ఆకాశానికి కెత్తేసిన నాడు మనకు తెలుసు. తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ పలికిన నాడు తెలుసు.

గతంలో, అంతదూరం ఎందుకులే అనుకుంటే, గత ఏడాది సెప్టెంబరులో, వై.యస్సార్ చనిపోయినప్పుడు, ఈనాడు అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినప్పుడు మనకు తెలుసు.

అదే విధంగా, గత ఏడాది డిసెంబరు 10న, [అంతకు ముందు కూడా] ‘బక్క మహత్ముడు’, ‘ముక్కు మనీషి’ కేసీఆర్ ని ‘తెలంగాణా గాంధీ’ని చేస్తూ ఈనాడు, పేపరంతా నింపినప్పుడు మనకు తెలుసు! [లేక పోతే లగడపాటి బదులు ఈనాడు పత్రికే ముందు చెప్పి ఉండేది TPN గురించి?]

ఈనాడు ట్రెండ్ ని అనుసరించి, అదే బాకాని భారీగా వాయించే కొన్ని మీడియా సంస్థల సహకారమూ మనకి తెలుసు. అధిష్టానపు ఆశీస్సులతో, రవి ప్రకాష్ ల వంటి మీడియా మెగా పర్సన్స్ చూపించే పెరఫార్మెన్సులూ మనకి తెలుసు.

వాటన్నిటితో సరిపోల్చి చూసినా, చంద్రబాబుకి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు. ఎందుకని?

ఎందుకంటే -

మీడియా నవాబు, ఈనాడు రామోజీరావుకీ, చంద్రబాబుకీ చెడింది గనక!

ఈనాడు రామోజీరావుకి చంద్రబాబు కంటే కూడా, కాంగ్రెస్ అధిష్టానం సోనియా నే ఆప్తురాలు గనక!

వివరంగా చెప్పాలంటే -

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు తరుపున, ప్రపంచపు అంచుల దాకా ‘లాబీయింగ్’, ‘కొరియర్ షిప్’ చేసి వచ్చేందుకు, శక్తి వంచన లేకుండా పనిచేసిన రోజుల్లో, చంద్రబాబుకి అది గూఢచర్యమని తెలుసు గానీ, మెదళ్ళతో యుద్దమని తెలియదు. ఓటమే స్ట్రాటజీ అయిన రీత్యా... నెం.5 వర్గపు బలమూ, పట్టు కూడా తెలియదు. అసలతడికి, అప్పటికి, రామోజీరావుకి సోనియా ఎంత ముఖ్యమైనదో కూడా తెలియదు.

అంచేత... రామోజీరావు పలకమన్నది పలికాడు. పెట్టమన్న పరుగు పెట్టాడు, మామకైనా వెన్నుపోటు పొడవమంటే, పొడిచాడు.

అయితే పెద్దలంటారు... ‘దుష్టుడితో చెలిమి ఎప్పటికైనా చేటే’ అని! అప్పట్లో ఇది మరిచిపోయాడు చంద్రబాబు. [తానూ దుష్టుడే గనక అది సహజమే కదా!] దుష్ట భాగస్వామ్యం నడిచినంత కాలం బాగానే నడుస్తుంది. చెడినాకే తెలుస్తుంది చేటెంతో! ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సంభవించిన సంకటం!

చంద్రబాబుకి, అప్పట్లో, రామోజీరావు గూఢచర్యపరంగా బలంగా కనిపించాడు. మామ ఎన్టీఆర్ కి అమెరికా వైట్ హౌస్ కి ఆహ్వానం ఇప్పించేంత బలంగా! అమెరికా అధ్యక్షుడు క్లింటన్ చేత, తన భుజాల మీద చేతులు వేయించి, తనకి కితాబు లిప్పించేంత బలంగా! ఇప్పుడు, దాదాపు ఆరేడేళ్ళు తిరిగే సరికి, పరిస్థితి తిరగబడి కన్పిస్తోంది.

మరో వైపు... నెం.5 వర్గం, మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని వారికి అనివార్యం చేస్తున్న ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు, ‘కన్నా?కాలా?’ స్ట్రాటజీ తో పడుతున్న కడగండ్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఒక దశలో పార్టీ మూత వేసుకుంటాను అనేంతగా చంద్రబాబు విసిగి వేసారి పోయాడు కూడా! అప్పటి పైకారణం వై.యస్.కి హవా నడవటం. [అఫ్ కోర్సు! అందులో వై.యస్. గారెల వంట గూఢచర్యం కూడా ఉందనుకొండి.]

ఇలాంటి నేపధ్యంలో.... డబ్బు పరంగా, కెరీర్ పరంగా, [పార్టీ కుటుంబ ఆస్తిగా పరిణమించటంతో] పార్టీ పరంగా కూడా, చెప్పుకోలేని బాధలు చంద్రబాబుకి చాలానే ఉన్నాయి.

ఇతడికి [చాలామందితో పోలిస్తే] గూఢచర్యాన్ని బాగానే ఆకళింపు చేసుకునే లక్షణం ఉంది. కాబట్టే, ఎన్టీఆర్ హయంలోనూ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంటే, ఈ చిన్నల్లుడికే హవా నడిచింది. వై.యస్. లో ఆ లక్షణం తక్కువ గనకే, 1992 ల దాకా కూడా, వై.యస్.ని రామోజీరావు అసలు ఎప్పుడూ తలకెత్తుకోలేదు. [ఇప్పుడు జగన్ కి సొంతబలం చూపించుకోవాలన్న లక్షణం, అతడి తండ్రి దగ్గర నుండి వచ్చిందే! కాబట్టే రామోజీరావు, వై.యస్.ని ఎప్పుడూ తలకెత్తుకోలేదు. అనివార్య అవసర పరిస్థితుల రీత్యా, 2003లో పాదయాత్రతో వై.యస్.ని తలకెత్తుకున్నాడు.]

ఆ విధంగా చంద్రబాబుకి, గూఢచర్యాన్ని ఆకళింపు చేసుకునే లక్షణం, సాపేక్షంగా ఎక్కువగా ఉండటంతో, ఇప్పుడు రామోజీరవుకి తిరగబడ్డ కథ కూడా, రిలేటివ్ గా అతడికే ఎక్కువ అవగాహన కలిగింది, కలుగుతోంది. ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ అంటూ... వేర్పాటు సమైక్య వాదాల నిప్పు బాగా రేగిన సమయానికి కాస్త ముందూ వెనకలుగా, చంద్రబాబు, తనకి తెలిసిన గూఢచర్యపు గుట్టుమట్లని, ముందుగా తన పార్టీ అగ్రనేతల దగ్గర నుండి ముఖ్యమైన వారని తాను భావించే ప్రాంతీయ, జాతీయ నాయకుల దాకా, అందరికీ పంచాడు. [ఇక్కడా, అతడి తన సహజ లక్షణం ‘వెన్నుపోటు’ను రామోజీరావుకి చూపించాడు.]

క్రమంగా ఇతరులకీ [స్ప్రెడ్ చేయటం] పంపకం చేయటం మొదలుపెట్టాడు. అదే ‘గుర్రు’ రామోజీరావుకీ, చంద్రబాబుకీ మధ్య ప్రారంభమైంది! కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానంని ప్రయోగించి, చంద్రబాబు మెడలు వంచే కార్యక్రమాన్ని, రామోజీరావు ఉపయోగించటం మొదలు పెట్టాడు. ఇది ప్రారంభమై కొన్ని నెలలు గడిచింది, పాకన బడి ఇప్పటికి పైకి కనబడుతోంది.

ఇందులో భాగమే... మొన్నామధ్య పోలీసులు క్యాజువల్ గా నాకాబందీ నిర్వహిస్తుంటే పట్టుబడ్డ 7 కోట్ల రూపాయలు నగదు కూడా! ‘ఇలాగే నీ నల్లడబ్బుని పట్టుకుంటాను సుమా’ అన్న బెదిరింపూ, కోడాల వంటి దెబ్బలబ్బాయిలని గుర్తుకు తేవటమూ, అందులో ఉన్నాయి.

గత టపాలలో చెప్పినట్లు... గూఢచారికి, గూఢచర్యానికి ‘బహిర్గతం కావటం’ మరణం వంటిది. లోతట్టున జరిగే current spying events గురించిన అవగాహనని, చంద్రబాబు తన పరిధిలో అందరికీ అంద చేస్తే... అది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలకు చాలా ‘ఇరుకు’ సృష్టిస్తుంది.

క్రమంగా చాలామంది [లాలూ ప్రసాద్ లు, శిబూ సోరెన్ లూ గట్రాలు చాలామంది] తోకఝాడిస్తారు. అందుకే కట్టడి చేయ ప్రయత్నం! ఈ విధంగా ‘గూఢచర్య గుట్టు మట్ల పంపిణీ’ వ్యవహారంలో, చంద్రబాబుకి హెచ్చరికగా.... అతడికి, చేదోడు వాదోడుగా ఉండే నాగం జనార్దన రెడ్డిని, తెలంగాణా వేర్పాటు వాదం పేరుతో, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, కిరాయి విద్యార్దులు[రౌడీలు] చితక్కొట్టారు. చంద్రబాబు బృందాన్ని మరాఠా పోలీసులు చితక్కొట్టారు.

కాబట్టే, చంద్రబాబుకి మీడియా సపోర్టు రాలేదు. జాతీయ పార్టీల నాయకులెవ్వరూ సపోర్టు రాలేదు. ఏదీ, అద్వానీ ఒక్క మాటయినా అన్నాడా? ఒకప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి, కేంద్రంలో చక్రం తిప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు గురించి, అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదేం? ఎర్రపార్టీల అగ్రనేతలూ గట్టిగా నోరు విప్పలేదేం? ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు చేత మద్దతు ఇప్పించటానికి కీలక పాత్ర వహించిన రామోజీరావు, ఇప్పుడు చంద్రబాబుకి జరిగిన అవమానానికి, జాతీయ స్థాయిలో నాయకుల చేత, పత్రికల చేత మద్దతు ఇప్పించేందుకు రామోజీరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి లాబీయింగ్ చేయలేదేం?

ఎందుకంటే - రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం ఇదే!

"ఇకనైనా నోరు మూసుకుని కూర్చో! గూఢచర్య స్థితిగతుల గురించి ఇతరులకి అవగాహన కలిగించటం మానెయ్" ఇదే హెచ్చరిక చంద్రబాబుకి పదే పదే ఇవ్వబడుతోంది.

ఈ నేపధ్యంలో.... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాకి, చంద్రబాబుకి మధ్య నడుస్తున్న సంకేత భాషనీ, సంబంధిత దృష్టాంతాలనీ పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~


దేహాన్ని తల్లిదండ్రులిచ్చారు.
దేవుడు జీవితాన్నిచ్చాడు.
‘జీవితం’ అంటే ఏమిటో పీవీజీ నేర్పాడు.
ఈ గురు పూర్ణిమ నాడు
మా ప్రియ తాత, పరమ గురువు,
శ్రీ పీవీ నరసింహారావు కు
ఈ ‘అమ్మఒడి’ లోని
అక్షరక్షరమూ
అణువణువూ
అంకితం!

వ్రాసింది మేమే అయినా.... వ్రాయగల జ్ఞానాన్నిచ్చింది పీవీజీ నే
సత్యాన్ని చూసింది మేమే అయినా... చూడగల చక్షువుల నిచ్చింది పీవీజీ నే
పోరాడింది మేమే అయినా... పోరాడగల స్థైర్యాన్నిచ్చింది పీవిజీ నే!
జీవితం పట్ల దృక్పధాన్నిచ్చిందీ పీవీజీ నే
జీవిత గమ్యాన్ని నిర్దేశింప జేసిందీ పీవీజీ నే
లక్ష్య సాధన మార్గంలోకి నడిపించిందీ పీవీజీ నే!

ఈ రోజు ‘అమ్మఒడి’లో మేమనే బొమ్మలున్నాయంటే,
వాటిని చెక్కిన శిల్పి పీవీజీ నే!

"ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృత పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుటయే నా ప్రతిజ్ఞ"

అని అప్రతిహతంగా ప్రకటించిన ఆ మేరునగధీర మేధావితో
మా గురు శిష్య సంబంధం
తాతా మనుమల బాంధవ్యమై,
అదే నిండు జీవితమైంది.

మొదట తెలియక పోయినా...
అమాయకంగా ఆగ్రహించినా...
ఆధిగమించలేక అహంకరించినా...

క్రమ పరిణాములో పరిణతి చెందగా చెందగా
కొంచెం కొంచెంగా తెలుస్తూ
తెలిమబ్బుల్లోంచి తొంగి చూసే సూర్యుడిలా
జ్ఞానం హృదయాన్ని వెలిగించగా
వెలుగు నిండగా
క్రమంగా అనుభవాని కొచ్చిన సత్యమిది.

"తన కెంతో బాగా తెలిసిన
తన జీవిత పర్యంతమూ తెలిసిన
ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని
అనేక జన్మల నుంచి తన జీవనానుభూతికి మాత్రమే తెలిసిన
తన మరో సగం"

మేమేననే ప్రేమ కురిపించిన
మా ప్రియ ‘తాత’ కి
గుండెలని దండగా మార్చి
అర్పించాలన్నా.... ఆశక్తులమే!

ఈ గురుపూర్ణిమ నాడు
కురుస్తున్న ఆ చల్లని వెన్నెలలా
ఆయన ప్రేమ,
మమ్మల్ని ఇప్పటికీ చేయి పట్టి నడిపిస్తున్నట్లే అన్పిస్తుంది.

ఇంతకంటే బాగా చెప్పలేని
నిస్సహాయతతో కూడిన అక్షర నీరాజనం ఇది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా చిన్న వివరణతో నా విశ్లేషణని ప్రారంభిస్తున్నాను.

వివరణ - ఈ టపాల మాలికలో నేను కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టాన దేవత సోనియాని విమర్శించానంటే అర్ధం - చంద్రబాబుని గానీ, వై.ఎస్. జగన్ ని గానీ సమర్దించానని కాదని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే - ‘ఏ రాయ అయినా ఒకటే పళ్ళుడగొట్టటానికి’ అని పెద్దలన్నట్లు, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా... ఒకటే! చేసేది స్వార్ద రాజకీయాలూ, ప్రజా దోపిడినే! - కాబట్టి! ఇక ఈ విశ్లేషణలలో జగన్ ఓదార్పు యాత్ర, బాబు బాబ్లీ యాత్ర నెపాన జరుగుతున్న వ్యవహారాలలో లోతట్టున జరుగుతున్న ‘అంశం’ లోని విభిన్న కోణాలని ఎత్తి చూపటమే నా ఉద్దేశం.

విశ్లేషణ:-

చంద్రబాబు బాబ్లీ యాత్రలో ఎన్నో కీలక ఘటనలూ, అసాధారణాలూ ఉన్నాయి. తెలంగాణాలో ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే కానివ్వండి, రాజకీయంగా ప్రయోజనం పొందాలను కునే కానివ్వండి, చంద్రబాబు, అనుచర బృందాన్ని వెంట బెట్టుకుని బాబ్లీ చూడబోయాడు. సరిహద్దుల్లోనే వాళ్ళని ‘రిసీవ్’ చేసుకున్న మరాఠా పోలీసులు ‘బాబ్లీ చూపెడతాం రండి!’ అంటూ తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గోనెపట్టాలేసి [ఈనాడు ఇలాగే వ్రాసింది మరి. ఫోటోలో చూస్తే పండగలూ, పేరంటాలలో పరిచే ఎర్రటి జంఖానా (తివాచీ లాంటిది) లా ఉంది.] ఆనక తీరిగ్గా ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అన్నారట.

ఆపైన కరెంటు ఇచ్చీ, తీసారట. దోమలు కుట్టి, నీళ్ళు నిప్పులూ లేకుండా, అమర్యాదకర వ్యవహారసరళితో పోలీసులు చంద్రబాబు బృందానికి చుక్కలు చూపారట! అయిదో రోజుకి అది పరాకాష్టకి చేరి లాఠీలతో చితక్కొట్టటం, కుళ్ళ బొడవటం, ఈడ్చుకెళ్ళటం, బూతులు తిట్టటం గట్రాలుగా పరిణమించాయి.

అసలు వద్దంటున్నా ‘ఎందుకు వెళ్ళినట్లు?’ అని హుంకరించే వారు కొందరు, ‘వెళ్ళకుండా ఉండాల్సింది కదా!’ అని ఊరడిస్తున్న వారు మరి కొందరు.

అసలెందుకు వెళ్ళవద్దన్నట్లు? బాబ్లీని వెళ్ళి చూస్తేనే ఏమవుతుంది? మరాఠా ప్రజలు భావోద్రేకాలకి గురవుతున్నారట. ఎందుకు? బాబ్లీ పరిరక్షణ సమితుల వెనక ఉన్నది అక్కడి రాజకీయ నాయకులే! ఇక్కడ తెలంగాణా, సీమాంధ్రా జేఏసీల కన్వీనర్లు ఎంతో, అక్కడి సమితుల కన్వీనర్లూ అంతే!

ఇవాళా రేపూ ఏ ఉద్యమాలైనా ప్రజల్లోంచి రావటం లేదు. డబ్బు ఖర్చుపెట్టి ఆయా నాయకులే జనాల్ని సమీకరించుకోవాల్సి వస్తోంది, మీడియా కవరేజిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. లేదా స్వంత మీడియా సంస్థలతో డప్పు వేసుకోవాల్సి వస్తోంది.

అలాంటి చోట.... బాబ్లీ పరిరక్షణ సమితులైనా ఇందుకు మినహాయింపేమీ కాదు. అలాగ్గాక, నిజంగా ప్రజలకే గనుక... తమ ప్రాంతం, రాష్ట్రం, దేశం పట్టినట్లయితే.... ఏ ప్రాంతంలోలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఈ రాజకీయ నాయకుల డ్రామాలు, ఆడుతున్న దోపిడి ఆటలు... సాగుతాయా?

ఈ నేపధ్యంలో పరిశీలించినా, బాబు బాబ్లీ సందర్శనని, ప్రమాదమని భావించి, శ్రమ తీసుకొని, పనీ పాటా వదిలేసుకు వచ్చి మరాఠాలు నిరోధించేది ఎంత? వెనుకనున్న ‘డ్రైవింగ్ ఫోర్సు’ ముందుకు నెట్టగా వచ్చి నిరోధించేది ఎంత? [ఇదే స్థితి నిన్నటి సాలూరు రగడది కూడా!]

సరే! మరాఠా ప్రజలే, స్వచ్ఛందంగా, బాబు బాబ్లీ యాత్రని వ్యతిరేకిస్తున్నారను కుందాం. అలాంటప్పుడు మన రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపి అదే సామరస్యంగా చెప్పవచ్చు. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిరాహార దీక్షే చేసేవాడో, లేదా ఇంటికెళ్ళి నిమ్మకాయ పులిహోరే తినేవాడో! మరాఠా ప్రభుత్వానికైతే మచ్చ అంటుకునేది కాదు కదా!

ధర్మాబాద్ ఐటిఐ లోనూ సామరస్యంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, మొత్తం మీడియాను ఆహ్వానించి, ప్రజల ఆగ్రహావేశాలను లైవ్ చూపించి, చంద్రబాబు నాయుడికి, అతని బృందానికి ఓపిగ్గా చెప్పవచ్చు. [ఇంత రచ్చకు బదులుగా అంత ఓపికా సహేతుకమే! అప్పటికి వినకపోతే బాబే expose అయ్యి ఉండేవాడు.] 9 ఏళ్ళు ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి, ఎంఎల్ ఏ లకీ, ఎంపీలకీ ప్రజాగ్రహన్ని, ప్రజల భావోద్రేకాలని పట్టించుకోవలసిన అవసరం గురించి మరింత ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

చెప్పినా బాబు వినలేదు అంటారు కొందరు. సరే! అదే నిజమైనా... అసలు ‘మహా కిరాతకం’ స్థాయిలో ‘మహా సామరస్యం’ నడిచిన దాఖలాలు కూడా లేవు కదా? మొదలే వాళ్ల న్యాయమూర్తి బెయిల్ తీసుకుని వెళ్ళండంటూ చెప్పటమే జరిగింది.

బాబు బాబ్లీ యాత్ర నేపధ్యంలో [22 జూలై, 2010], కొన్ని పత్రికలలో ప్రచురింపబడిన వార్తల్లో....

ఈ వార్త 22 జూలై, 2010 సాక్షి దినపత్రిక 9 వ పేజీలోనిది.

>>>మహారాష్ట్ర తీరుపై చంద్రబాబు ఆవేదన

మన పోలీసులు కాల్పులు జరిపితే... ఆ నెపంతో అందర్నీ ఫినిష్ చేసేవాళ్ళు.
ప్రాజెక్టు చూపిస్తామని మాయమాటలతో తీసుకెళ్ళి, తప్పుడు కేసులు పెట్టారు.
65 మందిని ఒకే గదిలో బంధించారు... నరక యాతన అనుభవించాం.
సరైన తిండి లేదు. నీళ్ళు లేవు, కటిక నేలపై దోమలతో సావాసం చేశాం.
ఆ రాత్రి నాలుగు వేల మంది పోలీసులు ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డారు.
పిడిగుద్దులు గుద్దారు.... లాఠీలతో, గన్నులతో కొట్టారు... బూట్లతో తన్నారు.
మహిళా ఎమ్యేల్యేలను సైతం ఈడ్చుకుంటూ వెళ్ళి బస్సులో పడేశారు.
సోనియా చెప్పిన తర్వాతే చవాన్ మాపై ఎక్కువ ప్రతాపం చూపారు.
స్పీకర్ కూడా స్పందించలేదు. ఉద్యోగాలు ఊడతాయనే అందరి భయం.
ఆసెంబ్లీ ఆవరణలో టీడీపీ నాయకుల ధర్నాలో చంద్రబాబు స్పష్టీకరణ.
~~~~~~

ఈ వార్త 22 జూలై, 2010 ఈనాడు దినపత్రిక 13 వ పేజీలోనిది.


~~~~~~
దీనికి ముందు రోజు అంటే 21జూలై, 2010న
>>>‘మరాఠా గాయం’... అంటూ సాక్షి పత్రిక, క్లుప్తంగా విషయం వివరించి.... ‘అతి స్పందన, అనాలోచన’ అంటూ సంపాదకీయం, ఒక పేజీ కేటాయించి వార్తలూ వ్రాసింది. చంద్రబాబు తమకి ప్రత్యర్ది వర్గం కాబట్టి, ‘వార్తల్ని వ్రాసాం’ అన్నట్లుగా వ్రాసింది. అది రాజకీయం!

‘సహ పడవ ప్రయాణీకులం’ అనే ముసుగు వేసుకుంటున్నాడేమో చంద్రబాబు! మామకే వెన్నుపోటు పొడిచిన మోసగాడితడు! ఎన్ని నటనలైనా చేస్తాడు, ఎన్ని నాటకాలైన వేస్తాడు. అదే జాగ్రత్త జగన్ ది! ఇది గూఢచర్యం!

దీని గురించిన స్పష్టత, మరికొన్ని వివరణల తర్వాత, ఈ టపాల మాలికలోనే వ్రాస్తాను.

>>>కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు :- 21 జూలై, 2010 ఈనాడు పత్రిక :

‘మహా కిరాతకం’
‘అశోక్ సర్కారు అమానుషం’ సంపాదకీయం.
‘అక్రమాలే పునాది బాబ్లీ’ అంటూ బాబ్లీపై పూర్తి కవరేజితో మూడవ పేజీ.
‘నరకం చూపించారు’ గట్రా వార్తలతో....
ఒక్క సంపాదకీయంలో తప్పితే.... ఏ వార్తల్లోనైనా, చంద్రబాబు పడిన అగచాట్లనీ, ఆపైన మహారాష్ట్ర, [కేంద్ర] కాంగ్రెస్ ల జులుంని గురించి వ్రాసారు. పైకి చూడటానికి... ‘కాంగ్రెస్ వ్యతిరేకి, తెదేపా అనుకూల పత్రిక ఇలాగ్గాక ఇంకెలా వ్రాస్తుంది?’ అన్పిస్తుంది.

అయితే... మొత్తం ఈనాడు చదివి తలపైకెత్తే సామాన్య పాఠకుడి బుర్రలోకి మాత్రం, ‘కాంగ్రెస్ బలం’ బలంగా చొచ్చుకెళ్తుంది. అదే విశేషం ఇక్కడ!

కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే, మాజీ ముఖ్యమంత్రికైనా, ప్రస్తుత ప్రజాప్రతినిధుల కైనా ఏ గతి పట్టిందో చూడమన్న ‘మానసిక యుద్ద తంత్రమే’ ఉందిక్కడ! అసెంబ్లీ స్పీకర్ గానీ, [పార్లమెంట్] లోకసభ స్పీకర్ గానీ, రాజ్యసభ స్పీకర్ గానీ ఎవరూ దాని మీద చర్యలు తీసుకోలేదు.

సాధారణ నేరగాళ్ళకు, కేడీ గాళ్లకు పోలీసులు చూపించే ధర్డ్ డిగ్రీ!
చట్టప్రకారం అయితే, ఎవరి పట్లా చూపకూడని ధర్డ్ డిగ్రీ!
పోలీసులు సైతం ఠాణాలో మాత్రమే చూపించి, పబ్లిక్ లో బుకాయించే ధర్డ్ డిగ్రీ!
వందల మంది మనుష్యుల్ని బాహాటంగా చంపిన పాక్ తీవ్రవాది కసబ్ పైన కూడా ఇంతగా చూపించని ధర్డ్ డిగ్రీ!

ఇది ఎంతగా మానసికంగా ‘బ్రేక్’ చేసే తంత్రమంటే - ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టాల్సిందిగా [ఈనాడు సంపాదకీయంలో] వత్తిడి చేసారట. ఎందుకోసమైనా సరే, [బెయిల్ అభ్యర్దన కోసమని కొందరు ప్రత్యేక వ్యక్తులు వాదిస్తుంటారు.] ఖాళీ బాండుపేపర్ల మీద సంతకాలు తీసుకుంటారా? అది చట్ట విరుద్దం కాదా?

అసలుకే రామోజీరావు తరుపున గూఢచర్యం కోసం, పెట్టుబడుల ఆహ్వానం పేరిట, ప్రపంచం అంచుల దాకా పరుగులెత్తి వచ్చిన వాడైన చంద్రబాబుని ఇలాంటి ‘కిరికిరీ’లు ఎంతగా భయభ్రాంతుణ్ణి చేస్తాయో, చంద్రబాబుకి మాత్రమే బాగా అర్ధమౌతుంది.

నిజానికి బాబ్లీ యాత్ర నేపధ్యంలో... చంద్రబాబు, మరాఠా కాంగ్రెస్, కేంద్ర కాంగ్రెస్, శివసేన లది రాజకీయమే.

అయితే, ఆ సంఘటనలు... ఇలాగ్గాక, ఇంకెలాగనైనా జరిగే అవకాశం ఉంది. అది సామరస్య చర్చలు కావచ్చు. ఆంధ్రా సరిహద్దు దాటనివ్వకుండా బాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవటం కావచ్చు. ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ వాహనాల్లో ఎక్కించుకు పోయినా, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గాక, ఎకా ఎకి ఏ కారాగారానికైనా తీసుకు పోవచ్చు. మరాఠా ప్రజా నాయకుల, ప్రజల... ధర్నాలకు, ఉద్రిక్తతతో కూడిన దాడులకు, ఐటీఐ ప్రాంగణం ఉన్నంత అందుబాటులో, జైలు గోడలూ ప్రాంగణమూ అందుబాటులో ఉండవు కదా?

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు మీద ఎంతగా గురిపెట్టబడిందో చూడండి.

‘కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు’ అంటూ 21 జూలై, 2010 ఈనాడు కవర్ చేసిన వార్తాంశంలో ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి.

>>> ‘అసలు మీ డిమాండ్లు ఏమిటి?’ అంటూ కొద్ది నిముషాల పాటు కొందరు కీలక నేతలను విమానాశ్రయంలోని ఓ గదిలో కూర్చొబెట్టి చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి, మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారనే బెంగతో.... తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్ళాలని, లేకపోతే వెళ్ళే ప్రసక్తిలేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయానశాఖ అధికారులను, పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చొబెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనానికి తీసుకెళ్ళాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు. విమానం ఎక్కే సమయంలో కూడా నేతలు, పోలీసులు ఎవరి పంతాన్ని వారు కొనసాగించడంతో... కొద్ది సేపు పోలీసులు, నేతలకు మధ్య విమానంలోనే పెనుగులాట జరిగింది. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ఆఫ్ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండి పోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాద్ కు బయలు దేరింది.
~~~~~
ఇదీ వార్త!

అందరినీ కలిపి ఒకే విమానంలో గాకుండా చంద్రబాబు ఒక్కడినే ఎందుకు మరో విమానంలోకి ఎక్కించినట్లు?

[ఈ రోజు అంటే 24 జూలై, 2010 "విమాన ఖర్చులు తమ ప్రభుత్వమే భరించగలదని మన రాష్ట్రప్రభుత్వం మరాఠా ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే, తెదేపా నేతలను జౌరంగా బాద్ నుండి హైదరాబాద్ కు విమానంలో తరలించారని వార్తలొచ్చాయి. అంటే చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన వారికి మరో విమానం ఏర్పాటు చేయమని రోశయ్య చెప్పాడా? చెబుతాడా? దీన్ని బట్టి తెలియటం లేదా ఈ వెనుక ఉన్నది అధిష్టానమేనని? ]

అప్పటికే ఔరంగాబాద్ లో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దారిలోనూ బాబు బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్ళు రువ్వబడ్డాయి.

"మన పోలీసులు [తమ గన్ మెన్స్] కాల్పులు జరిపితే... ఆ నెపంతో మమ్మల్ని అక్కడే ఫినిష్ చేసే వాళ్ళు."

"అడిగే వాళ్ళెవ్వరూ లేరని మమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నారు" అన్నాడు చంద్రబాబు.

అంతగా అతడికి ప్రాణ భయం పెట్టబడింది.

‘వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు’ అని ఎటూ నాందేడ్ ఎంపీ అంటూనే ఉన్నాడు. ఎటూ ‘వాళ్ళు అవునంటారు, మనం కాదంటాం, అంతే’ అనుకోవటం రాజకీయ నాయకులందరికీ [పార్టీలకతీతంగా] అలవాటే.

కాబట్టి "వాళ్ళ గన్ మెన్ ముందుగా కాల్పులు జరపటంతో, ఆత్మరక్షణ కై మేమూ కాల్పులు జరిపాం. అందులో చంద్రబాబుకి తూటా తగిలి మరణించాడు!?" అని... మరాఠా పోలీసుల్ని ‘పైబాసులు’ చెప్పమంటే చెబుతారు. తాను పైబాసుగా ఉన్నప్పుడు చెప్పమంటే, తన క్రింది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు గతంలో ఇలాంటివి ఎన్ని చెప్పలేదు?

విమానాశ్రయంలో నైనా... "మరాఠా ప్రజలు, శివసేన కార్యకర్తలూ, భావోద్రేకాలతో బాబు బృందాన్ని చుట్టిముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపుని చెదర గొట్టటానికి కాల్పులు జరిపాం. పొరబాటున తూటా తగిలి చంద్రబాబు ఫినిష్ అయిపోయాడు." అన్నా మాత్రం దిక్కేముంది? పాకిస్తాన్ లో మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో కేసు ఏమయ్యింది? భారత్ లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యకేసు లేమయ్యాయి?

తాను పైలోక ప్రయాణం చేసాక, ఎన్ని ధర్నాలు, ఎన్ని గగ్గోళ్ళు నడిస్తే మాత్రం ఏముంది?

"మరోసారి చంద్రబాబు వస్తాడను కోను" అన్నాడు మరాఠా హోంమంత్రి పాటిల్.

"బాబ్లీని చూడటానికి చంద్రబాబు ఒక్కరే రావచ్చని" సూచన చేసాడు నాందేడ్ ఎంపి. అంటే - "జరిగింది చాలా? ఇప్పటికైనా వెనక్కి తగ్గు" అని అంటూ "ఇంకా ముందుకే వెళతావా? ఒంటరిగా రా! అప్పుడు చూద్దువు గానీ!" అని.

ఈ సంకేత భాష ఎందుకంటారా?

యాత్ర పేరిట జగన్ అయినా, చంద్రబాబు అయినా.... ‘[తమకు వ్యతిరేకమైన పని] చేస్తాను’ అంటున్నారు. ‘వద్దు’ అంటున్నది కాంగ్రెస్ అధిష్టానం, నకిలీ కణిక వ్యవస్థ! అదే ఇక్కడ కీలకాంశం.

వివరంగా చెప్పాలంటే... ఇంకొన్ని కీలక ఘటనలు వివరించాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా భారతీయ ఇతిహాసమైన మహాభారతం నుండి ఒక సన్నివేశాన్ని వివరించి, ఆపైన ‘ఒకే అంశం’ ఏమిటో, దాని ‘విభిన్న కోణాలు’ ఏమిటో వివరిస్తాను.

ఇక మహాభారతంలోకి ప్రవేశిస్తే....

ఇది అరణ్య పర్వం లోని సంఘటన!

ద్వైత వనంలో అరణ్యవాసం చేస్తున్న, వనవాసక్లేశాలతో ఉన్న పాండవులకి, తమ భోగ భాగ్య దర్పాన్ని ప్రదర్శించి కుపితులను చేయాలనే అహంకార అతిశయాలతో, దుర్యోధనుడు, కర్ణ శకుని దుశ్శాసనులని, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని, ఘోష యాత్ర నిర్వహిస్తాడు.

మృగయావినోద విహారాల అనంతరం, సుందర సరోవరాన్ని చేరి, దాని అధిపతియైన చిత్రసేనుడనే గంధర్వునితో గొడవ పడతారు. గంధర్వులు, ఈ దుష్ట చతుష్టయాన్ని యుద్దంలో జయించి బంధించగా, ఆ వార్త విన్న పాండవులలో భీముడు...

"హా! కాగల కార్యము గంధర్వులు తీర్చారు" అంటాడు. భీమార్జున నకుల సహదేవులకు ‘కౌరవులకు తగిన శాస్త్రి జరిగిందన్న’ అభిప్రాయం ఉంటుంది. అయితే ధర్మరాజు, కౌరవులని గంధర్వుల చెర నుండి విడిపించాల్సిందిగా తమ్ములను ఆజ్ఞాపిస్తాడు. అందుకు ఇష్టపడని తమ్ములతో "మనలో మనం కలహించుకునేటప్పుడు... మనం అయిదుగురం, వాళ్ళు నూరు మంది. అయితే ఇతరులు మన మీదికి దండెత్తినప్పుడు మాత్రం, మనం నూటయిదుగురం అన్నదమ్ములం" అంటాడు.

అక్కడ ధర్మరాజు చూపిన విజ్ఞతలో.... వంశ గౌరవం పట్ల, పది మందిలో తమ కుటుంబ మర్యాద పట్ల జాగ్రత్త ఉంది. మనలో మనం ఎంత ఘర్షణ అయినా పడనీ! ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఐక్యతా, ఆత్మగౌరవం తప్పనిసరిగా పరిగణించాల్సిన అంశాలు.

ఇతిహాసాలనీ, సంస్కృతీ సంప్రదాయాలనీ, మంచీ మర్యాదలనీ... అన్నిటినీ మరిచిపోయాక, ఇలాంటి సంఘటనలే సంభవిస్తాయని నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర నిరూపించింది.

నా గత టపాలలో ఒకసారి వ్రాసినట్లుగా.... 1989లో ఒకసారి బెంగుళూరు వెళ్ళాను. [నా బ్యాటరీ తయారీ సంస్థ యంత్రపరికరాలను అక్కడి నుండే కొనుగోలు చేశాను.] అందుకు కొద్దికాలం ముందు, ఏదో రాజకీయ వ్యవహారం మీద, ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపాడు. దాన్ని ఉటంకిస్తూ బెంగుళూరులోని యంత్ర సామాగ్రి సరఫరాదారుడు, కొంత అవహేళనగా "అదేమిటి? మీ సీఎం ఎన్టీరామారావు రోడ్డు మీద పడుకున్నాడు?" అన్నాడు. అతడి నవ్వులో చాలా వ్యంగ్యం ఉంది.

చాలా అవమాన కరంగా అన్పించింది. ఇప్పుడంటే రాజకీయ నేతలు రోడ్డు మీద పడుకోవడం సాధారణమై పోయింది గానీ, అప్పట్లో ధర్నాలు మాత్రమే చేసేవాళ్ళు. మహా అయితే బైఠాయించేవాళ్ళు.

ఆ నేపధ్యంలో... ప్రక్క రాష్ట్రపు వారి పరిహాసం చాలా అవమానకరంగా తోచింది. దేశాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే - నాయకులు ఏం చేసినా, అది వారి వ్యక్తిగతంగా మిగలదు. జాతికి ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి జరిగిన అవమానం ప్రజలకి జరిగిన అవమానంగానే భావిస్తాం. వాళ్ళూ ఆ స్థాయిలోనే ప్రవర్తించాలని ఆశిస్తాం.

నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర విషయంలో కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత అసహ్యకరం. పార్టీలు ఏవైనా సరే, రాజకీయాలు ఏవైనా సరే, ఇది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం!

నిజానికి, కలిసికట్టుగా.... ప్రాజెక్టులు, మౌలిక వసతులు, నీటి వనరులు, ప్రకృతి సంపద వినిమయాలు సాధించుకోవలసిన చోట... పార్టీలు, ప్రజలు, చీలికలూ పీలికలూ అయ్యి, అనైక్యత కారణంగా దగా పడటం ఓ ప్రక్కన నడుస్తుండగా.... మరో ప్రక్క ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినందుకు "కుళ్ళ బొడిచి వెళ్ళ గొట్టటం" ఎందుకు?

ఈ విషయంలో ప్రక్కనున్న తమిళులు మన తెలుగు వాళ్ళ కంటే మెరుగ్గా వ్యవహరిస్తారు. వాళ్ళల్లో వాళ్ళకి, ఒకటికి నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉండనీ గాక! వాళ్ళల్లో వాళ్ళు అధికారం కోసం కాట్లాడుకోవచ్చు గాక! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అయితే, మరికొంత ఎక్కువ ఆత్మగౌరవంతోనూ, మరికొంత ఎక్కువ ఐకమత్యంతోనూ ప్రవరిస్తారు.

కాబట్టి మన కంటే ఎక్కువ ప్రాజెక్టులూ, పరిశ్రమలనీ, అభివృద్దినీ సాధించు కోగలిగారు. అయితే అదీ, మరికొంత అవధులు మీరి ‘తమిళ జాతీయ గీతం’ ఆలపిస్తామనే దగ్గరికి రావటం ప్రమాదకరం. ‘అన్నిట్లోంచి డిస్ అడ్వాంటేజ్ రావటం’ అనే ప్రక్రియకి ఇది మరొక ఉదాహరణన్న మాట!

ఇక తమిళుల మాట అటుంచితే.... ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకున్నాడని కన్నడిగులు అవహేళనగా అంటే, తెలుగు వారిగా నేనూ, మా నాన్న, అవమానం మాకే జరిగినట్లుగా అనుభూతించాము. మా పరిస్థితిలో ఎవరు ఉన్నా అలాగే అనుభూతిస్తారు. పరిస్థితులు అలాగే దారితీస్తాయి.

బాబ్లీ వ్యవహారంలో చంద్రబాబు బృందం ‘తన్నులు తినడం’ తెలుగు వాళ్ళగా మనకెంతో అవమానకరంగా ఉంటుందో, ‘రాష్ట్రానికొచ్చిన వాళ్ళని తన్ని పంపించడం’ సామాన్య మరాఠాలకు అంతే అవమానకరంగా అన్పిస్తుంది. ఇంటికొచ్చిన వాళ్ళని తన్ని పంపినంతగా! శివసేన గట్రా పార్టీలు సమీకరించిన కార్యకర్తలని మినహాయిస్తే సామాన్య మరాఠాలు అలాగే భావిస్తారు.

శివసేన కార్యకర్తలకి ఉద్యోగార్ధులని సైతం తన్ని పంపటం అలవాటే! అందుకోసమే డబ్బివ్వబడినప్పుడు, అలాగే చేసేందుకు వచ్చిన కిరాయితనం అది! డబ్బిస్తే ఇక్కడి తెరాస కార్యకర్తలూ, ఇతరులూ చూపించే కిరాయితనం కూడా అదే! అందుకే... ‘సంస్కృతీ ధర్మాలు మరిచిపోయిన పరిణామం ఇది’ అన్నాను.

ఇప్పుడు... ప్రక్క రాష్ట్రాల్లో, దేశాల్లో... ఎవరైనా సరే, ఏ తెలుగు వాడినైనా సరే, ‘మీ మాజీ ముఖ్యమంత్రినీ, [ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సీ. లని] ప్రక్కరాష్ట్రం వాళ్ళు కుళ్ళ బొడిచి వెళ్లగొట్టారట కదా!’ అంటే - ఎంత అవమానంగా ఉంటుంది?

సరే! కుళ్ళ బొడిచి వెళ్ల గొట్టటం మరాఠీలు పాటించే అతిధి మర్యాద, గృహస్థ ధర్మం అనుకుందాం. [నిజానికి దీన్ని మరాఠా ప్రజలకి అంటగట్టడం అనవసరం. అశోక్ చవాన్ ఆజ్ఞలు పోలీసులు పాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆజ్ఞను చవాన్ పాటించాడు. అంతే! ఇందులో ఉన్న అసలు కారణాలు, అంతర్గత పోరులని తర్వాత ముచ్చటిద్దాం.]

కనీసం వాళ్ళ ’మర్యాద లేని తనాన్ని’ తెలుగు వాళ్ళు తిప్పి కొట్టారు అన్పించుకున్నా కొంత గౌరవంగా ఉంటుంది. అలాంటి చోట, ప్రజలకు ప్రతినిధుల మని చెప్పుకునే రాజకీయ రాక్షసుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంది?

ఎర్రపార్టీల చికెన్ నారాయణ, రాఘవులు, రోజూ వారీ దిన చర్య అన్నంత యాంత్రికంగా, మీడియాకి ఒక ప్రకటన వదిలి గమ్మునుంటున్నారు. చంద్రబాబు గతంలో ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు. అతడు తప్పులే చెయ్యనీ, ఒప్పులే చేయనీ. కానీ అతడు, అతడి బృందం ప్రజాప్రతినిధులు. ప్రజా సమస్య మీదే ప్రక్క రాష్ట్రానికి వెళ్ళారు.

వాళ్ళ స్వంత పని మీద కాదు. వ్యక్తిగత విహారాలకీ కాదు. నదిపైన [అక్రమ కట్టడమో, కాదో,] బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడటానికి వెళ్ళారు. చూస్తే ఏమవుతుంది? ఎటూ వీళ్ళు నిర్మాణం ‘అక్రమం’ అంటారు. వాళ్ళు కాదు ‘సక్రమం’ అంటారు. వెరసి ఇరు పక్షాలూ కాస్సేపు మీడియాలో గోల చేసుకున్నాక, ‘విషయం కోర్టులో ఉంది ఆనక మాట్లాడుకుందాం’ అంటారు. ఆపాటి దానికి ఎందుకింత ‘కిరాతకం’ జరిగింది?

ఈ పాటి కిరాతకం గురించి, ఎందుకు ఎర్రపార్టీల జాతీయ నాయకత్వం కిమ్మనటం లేదు? రాష్ట్రస్థాయి నాయకుల రోజు వారీ మొక్కుబడి ప్రకటన తప్పితే... ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరీ, బర్డన్ గట్రాల కంఠాలు విన్పించటం లేదెందుకని?

ఒకప్పుడు.... 1984 లో ఆగస్టులో [తమ అంతర్నాటకాన్ని అతి సమర్ధంగా రక్తికట్టిస్తూ] రామ్ లాల్, నాదెండ్లలు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే... జాతీయ పార్టీల అగ్రనాయకులందరూ హైదరాబాద్ కు పరిగెత్తుకు వచ్చి ఇందిరాగాంధీని ఎండగట్టారే?



అలాంటిది... చంద్రబాబు నాయుడిని, ఇతర ప్రజా ప్రతినిధులనీ, ఆడా మగా అన్న తేడా కూడా లేకుండా కుళ్ళ బోడిచినా, క్రింద పడేసి ఈడ్చుకు పోయినా, తోసుకు పోయి బండ్లలో కూలేసినా, నీరు నిప్పులూ లేకుండా మాడ్చినా, బండబూతులూ తిట్టినా, డబ్బూ దస్కం నగా నట్రా లాక్కుని, సెల్ ఫోనులూ విరగ గొట్టినా.... "ఏమిటీ ఆరాచకం? ఇదేం ప్రజాస్వామ్యం?" అని ఒక్కరు గాక పోతే ఒక్కరూ, నేటి కాంగ్రెస్ అధిష్టానం అయిన ఇటలీ గాంధీని అడగ లేక పోతున్నారేం?

ఎన్టీఆర్ బర్తరఫ్ నాడు ఎర్ర పార్టీలూ, భాజపా తో సహా జాతీయ నాయకులందరూ, మీడియాతో కలిసి ఐక్యంగా అరిచారే? మరిప్పుడు మాట్లాడటం లేదేందుకు? ఆనాటి ఇందిరాగాంధీకి ఈనాటి ఇటలీ గాంధీకి ఏమిటి తేడా?

గత ఏభై ఏళ్ళుగా ఎప్పుడూ ఇలాంటిది చూడలేదంటున్నారు దేవెగౌడ, వెంకయ్య నాయుడూలు! ఎమర్జీన్సీలో కూడా ఇలాంటివి జరగలేదు. ఎమర్జన్సీని ‘మాయని మచ్చ’ అనీ, ‘చీకటి రోజులు’ అనీ, గొంతు చించుకునే మీడియా, జాతీయ పార్టీల అగ్రనాయకులూ, ఈ అప్రకటిత ఎమర్జీన్సీని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామికంగా తగల బెట్టడాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?

ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే! ప్రక్కనున్న మహారాష్ట్రలో ఉన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే! కేంద్రంలో ఉన్నదీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వమే! అందునా చంద్రబాబు బృందం బాబ్లీ యాత్ర చేపట్టాక... ఇటు రోశయ్య, అటు మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, ఒకేసారి ఢిల్లీ వెళ్ళారు. అధిష్టాన దేవతని కలిసి మాట్లాడి వచ్చారు. ఎవరి పైకారణాలు[over leaf reasons] వాళ్ళు చెప్పారు గాక, కలిసి కట్టుగా ఉమ్మడి వ్యూహం రచించుకుని, ఎవరి పాత్ర వాళ్ళు పోషించినట్లుగా, ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజా ప్రతినిధులని చితక బాదారు.

>>> "ఏరా మీకు నీళ్ళు కావాలా? నీళ్ళడిగితే తన్నులు తప్పవురా....? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటార్రా....? తన్నులు కావాలా? బస్సులెక్కుతారా?" అంటూ మరాఠీలో బండబూతులు తిడుతూ లాఠీలతో పైశాచికంగా దాడి చేశారు. - ఈనాడు వార్త.

కేవలం ఒక ప్రాజెక్టును చూస్తామంటే ఇంతగా తన్నాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళేం టెర్రరిస్టులా! బాంబు వేస్తారా? మహారాష్ట్ర కు వెళ్లటానికి పాస్ పోర్టు వీసాలక్కర్లేదని అందరికీ తెలిసిందే, అందరూ అంటున్నదే! అసలు బాబ్లీ ప్రాజెక్టుని చూసినంత మాత్రాన ఏమవుతుంది?

వీళ్ళ దృష్టి సోకి నంతనే అది తునాతునకలైపోదు కదా! అందులో ఉన్న అక్రమాలని కనిపెట్టి బయటపెడతారు అనటానికీ లేదు. అదే చంద్రబాబు లక్ష్యమైతే... అక్కడి విలేఖరుల/అధికారులని లోబరుచుకుంటే చాలు! ఎవరి నిజాయితీకైనా ఒక రేటుంది అనుకునే రోజుల్లో... బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అదీగాక, బాబ్లీ నిర్మాణం చేపట్టిన సోమా కంపెనీ లో ఒక తెదేపా నేత డైరెక్టర్ గా ఉన్నాడంటున్నారు. సదరు తెదేపా నేత కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ లో డైరెక్టరు, అతడికి దూరపు బంధువు. అలాంటి చోట బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అలాంటి చోట... చంద్రబాబు బృందం ప్రాజెక్టును చూస్తే చవాన్ కి పోయేదేమీ ఉండదు. చంద్రబాబుకు వచ్చేదీ ఉండదు. మరి అయినా, ఎందుకు, ఇంత అమానుష, అమర్యాద కాండ నడిచింది?

ఇందులో అసహ్యకరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - తెదేపా తప్ప, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ, రాజకీయ నాయకులందరూ, దీన్ని రాజకీయంగానే చూడటం, రాజకీయాలే మాట్లాడటం!

తెరాస, ప్రరాపాలు కాంగ్రెస్ అధిష్టానం జేబులో బొమ్మలు. పొరపాటు, కుర్చీ మహిళకి జేబులుండవు కదా! అందుచేత పర్సులో బొమ్మలు! నిజానికి ‘ఏమాత్రం స్త్రీత్వం కనబడని అధిష్టాన నాయకత్వం’ అన్న విషయాన్ని.... స్త్రీ పురుష బేధం లేకుండా ప్రజాప్రతినిధులని Man handle చేయటంతో నిరూపించుకున్నదీ ఇటలీ మహిళ!

అదేదో వ్యక్తిగత ద్వేషం ఉన్నంత భారీ పరిమాణంలో, గురి పెట్టుకుని నిర్వహించినట్లుగా, కుళ్ళ బొడవాల్సిన అవసరం చవాన్ కి గానీ, మరొకరికి గానీ ఎందుకుంటాయి? "మరి సోనియాకి అయినా ఎందుకుంటాయి?" అనుకుంటున్నారేమో! ఉంటాయి. ఎందుకుంటాయో ఈ టపాల మాలికలోనే వివరిస్తాను.

ఇక, తెరాస, ప్రరాపా ల ప్రలాపాలనీ, కాంగ్రెస్ పనికి మాలినతనాన్నీ, లజ్జా రాహిత్యాన్నీ పరిశీలిద్దాం.

ఉప ఎన్నికలలో లబ్ది పొందటానికి చంద్రబాబు ఇదంతా చేసాడు - తెరాస కేసీఆర్ వ్యాఖ్య!

నిజానికి ఇప్పుడు ఉపఎన్నికలలో జరుగుతున్న 12 స్థానాలు, ముందుగా కూడా తెదేపా వి కావు. అవి తెరాసావి, ఒకటి భాజపాది. ఇప్పుడు కొత్తగా పోయే సీట్లేవీ లేవు. అదీగాక, ఒకవేళ తొక్కలోవి ఆ 12 సీట్లు గెలిచినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదు. అవి గెలిస్తే ఇప్పటికిప్పుడు అధికారం రాదు. అందుకోసం ఇంతగా ‘తన్నులు’ తినాల్సిన అవసరం లేదు.

అదీగాక, ఈవీఎం లుండగా ఎన్నికల గెలుపు, ఈ రాజకీయ డ్రామాలతో సిద్దించదు. ‘తన్నులు తినాల్సి వస్తుందని చంద్రబాబు అనుకోలేదు’ అంటారేమో ఎవరైనా! ఇంతగా తన్నులు తినాల్సి వస్తుందను కోకపోయినా, లోతట్టున మరుగుతున్న వ్యవహారం రీత్యా, చంద్రబాబు అవగాహన చంద్రబాబుకి ఉంది.

అలాంటప్పుడు.... కేవలం ఉప ఎన్నికలలో 12 సీట్లు గెలవటం కోసం చంద్రబాబు ఇదంతా చేసాడన్న కేసీఆర్ వాదనకి విలువ లేదు. ఇక బాబ్లీలాగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు రాడు? అంటూ కేసీఆర్ పాయింట్ లేవనెత్తాడు. రాని దాని సంగతి ఎందుకు? వచ్చిన విషయంలో ఏపాటి వత్తాసు వచ్చారు కేసీఆర్, భాజపాలు చంద్రబాబుకి?

నష్టం, తెలంగాణాకి కావచ్చు, మరో జిల్లాలకి కావచ్చు, మొత్తంగా అది మన రాష్ట్ర సమస్య! తెలుగు వాళ్ళ గౌరవానికి సంబంధించిన సమస్య! మన వాళ్ళ పట్ల మహారాష్ట్ర పోలీసుల అమర్యాద, జులుంల గురించి వార్తలొచ్చాక కూడా, ఇదే కుతర్కం, ఇదే కుటిల రాజకీయాలు మాట్లాడటం ఎంత నీచం?

ఇటు గీతా రెడ్డిలు, ఇతర మంత్రులూ, అందరూ, ఎంత లజ్జా రాహిత్యాన్ని చూపించారంటే - ఎక్కడ అధిష్టానానికి తమ మీద కోపం వస్తుందో, దెబ్బకి తమ పదవులు, కెరీర్ లేచి పోతాయేమో అన్న భయాన్ని నిలువునా ప్రదర్శించారు. అసలుకే వాళ్ళ ఉద్దేశంలో అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచి పోతాయయ్యే మరి! దాదాపుగా యజమాని పాదాలను నాకుతున్న కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎంత నిస్సిగ్గుగా "ఛాయ్!" మన్నా తోకాడిస్తూ దగ్గర కొస్తాయో, అంతకన్నా ఎక్కువ లజ్జా రాహిత్యాన్నే చూపెట్టారు.

"మనలో మనం ఎంతగానైనా కలహించుకోవచ్చుగాక! ఇతరులు మన మీదికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే" అనే తెలుగు దనం కాదు గదా, కనీస పాటి ‘మనిషి తనం’ కూడా లేదు కాంగ్రెస్ లో!

ఇంకా ప్రజలే... వ్యక్తిగతంగా ఇళ్ళల్లో టీవీల ముందు కూర్చొనో, సామూహికంగా రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్ లు చేసో, దిష్టి బొమ్మల్ని తగలేసో... తమ ఆక్రోసాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తీ కరించారు. తమ ఆత్మ గౌరవాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

ప్రజలు కూడా కాంగ్రెస్ మంత్రుల్లాగే ఉంటే.... కాంగ్రెస్ అధిష్టానం "అవును. మీరంతా నా పాద దాసులు! కుక్కిన పేనుల్లా, చచ్చిన దోమల్లా పడుండండి" అని బహిరంగంగా హుంకరించినా ఆశ్చర్యం లేదు.

"పాక్ లో సైనిక ప్రభుత్వం తమని తాము ప్రకటించుకున్నప్పుడు, అక్కడి బేచారాలు ఏం చేయగలిగారు? ఇక్కడైనా అంతే!" అనుకోగలరు సోనియాలు, ఆమెని నడిపే గూఢచార ఏజన్సీలు!

నిజానికి... ఓదార్పు యాత్ర పేరిట వై.యస్. జగన్ శిబిరానికీ కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఒక అంతర్లీన పోరు నడుస్తోంది. ఆఫ్టరాల్ ఓదార్పు యాత్ర చేస్తే ఏమవుతుంది? చేసినా ఏమవలేదు కదా? మరి అధిష్టానం ఎందుకంతగా వద్దని పోరింది? ఆ పేరిట వాళ్ళ మధ్య నడిచిన సంకేత భాష వేరు. అంశం ఒకటే!

అలాగే... బాబ్లీ యాత్ర పేరిట చంద్రబాబుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య అంతర్లీన పోరు నడుస్తోంది. అంశం ఒకటే! ఇవి దాని విభిన్న కోణాలు, అంతే! రానున్న రోజుల్లో ఆ అంశం, దాని విభిన్న కోణాలు కూడా, మనకి ప్రస్ఫుటంగానూ, బహిరంగంగానూ దృగ్గోచరం అవుతాయి. వేచి చూడటం, జరుగుతున్న పరిమాణాలని నిశితంగా పరిశీలించటమే ప్రస్తుతం మనం చేయగలిగింది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఈ రోజు[16 July, 2010] సాక్షి పత్రికలో ప్రచురింపబడిన క్రింది వార్తాంశాన్ని ఓసారి పరిశీలించండి.

>>>ఇరాన్ శాస్త్రవేత్తకు రూ.23 కోట్ల సీఐఏ నజరానా
అమీరీ దేశద్రోహా? దేశభక్తుడా?
పరువూ, డబ్బూ పోగొట్టుకున్న సీఐఏ

అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు. గత వారంలో అమీరీ హఠాత్తుగా పాక్ ఎంబసీలో ఊడిపడి.... సీఐఏ తనను సౌదీ అరేబియా నుండి గత ఏడాది అమెరికాకు ఎత్తుకొచ్చిందని ప్రకటించాడు.

ఇరాన్ అణు రహస్యాల కోసం డబ్బు ఆశ చూపించిదన్నాడు. కానీ అణ్వస్త్ర రహస్యాలు తెలియనే తెలియవనీ అంటున్నాడు. ఏది ఏమైనా... అమీరీ అకౌంట్లలో లక్షలాది డాలర్లున్న మాట నిజం. అమీరీ, ఆ సొమ్ములోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోలేడనేది అంత కంటే నిజం. ఇరాన్ పై అమెరికా ఆంక్షలే అందుకు కారణం. బెడిసి కొట్టిన ఈ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న సీఐఏ, డబ్బన్నా దక్కించుకుందామంటే... అదీ పోయినట్లేనని తెలుస్తోంది.
~~~~~~~~~~~
ఇదీ వార్త!

ఒకప్పుడు గూఢచర్య వ్యవహారాలు రహస్యాలుగానే మిగిలిపోయేవి. అచ్చం ఇర్వింగ్ వ్యాలెస్ నవలల్లో లాగా! భూగోళం బ్రద్దలవబోయేంత పెను ప్రమాదాలు సంభవించి తృటిలో తప్పిపోయినా, చాపక్రింద నీరులా భూభాగం మెల్లిగా మునుగుతున్నా... అన్నీ రహస్యాలుగానే ఉండిపోయేవి.

ఇటీవలి కాలంలోనే రహస్యాలు రచ్చకెక్కుతున్నాయి. గుట్టుమట్లు గట్లు తెంచుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో పైవార్త ఒకటి.

ఇందులో ఎన్ని గమ్మత్తులు ఉన్నాయో చూడండి.

>>>అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇది ఇరాన్ చేసుకుంటున్న ప్రచారం.

>>>అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ఇది అమెరికా ప్రచారం.

ఇందులో ఏది నిజం? ఎలా తెలుసుకోవటం? మనం దగ్గరి కెళ్ళి చూసేందుకు, తెలుసుకునేందుకు ఏమీ ఉండదు. ఏ దుర్భిణి వేసీ నిజాన్ని చూడలేము. మరెలా?

మామూలుగానే అమెరికా అవునంటుంది. ఇరాన్ కాదంటుంది. లేదా ఇరాన్ ‘ఎస్’ అంటుంది. అమెరికా ‘నో’ అంటుంది. ఇప్పుడు మరో గమ్మత్తు పరిశీలించండి.

>>> అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు.

అమీరీ ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలు అమెరికాకి అమ్ముకున్నందుకే అతడి అకౌంట్ లో డబ్బొచ్చి పడిందా? అవన్నీ బయటికొస్తే తనకి ముప్పు వస్తుందని అమీరీ కొత్త కథ [తాను ‘హీరోయిక్’గా తప్పించుకొచ్చానని] అందంగా అల్లుతున్నాడా?

లేక అమీరీ ని ఇరికించేందుకు, సీఐఏ నే అమీరీ అకౌంట్ లో డబ్బు జమ చేసిందా? మరెవ్వరైనా ఆ పని చేశారా? ఎందుకు చేస్తారు? ఇంతా చేసి, ఈ డబ్బుని అమీరీ వాడుకోలేదు. అటు సీఐఏ కూడా ‘ఆ డబ్బుని’ పోగొట్టుకున్నట్లే! విషయం బైటకి పొక్కక డబ్బు వెనక్కి తీసుకోలేరు కదా ఎవరైనా!?

ఇంతకీ... ఎత్తుకుపోయింది అమెరికా సీఐఏ! ఎత్తుకెళ్ళింది ఇరాన్ అణు శాస్త్రవేత్తని! మరితడు హఠాత్తుగా, గతవారంలో, పాక్ ఎంబసీలో ఎలా తేలాడో? తనను సౌదీ నుండి అమెరికా ఎత్తుకెళ్ళిందన్న అమీరీ, మరే దేశపు ఎంబసీలోనో గాకుండా ‘పాక్ ఎంబసీ’లోనే ఎందుకు ఊడి పడ్డాడు? అమెరికా - ఇరాన్ ల మధ్య ‘పాక్’ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది?

అసలే, అమెరికా పాక్ కు, ఆర్దిక సాయాలు చేతులు నొప్పి పుట్టేదాకా చేస్తూనే ఉంది. అలాంటప్పుడు పాక్, తనను మళ్ళీ అమెరికాకు లోతట్టునే పట్టిస్తుందన్న భయం వేయలేదా ఈ శాస్త్రవేత్తకు!?

ఎవరం చెప్పగలం? వాళ్ళేవో చెబితే నోరెళ్ళ బెట్టి వినగలం తప్ప, నిజం ఎవరికి తెలుసు?

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పానంటే...

‘అమీరీ అకౌంట్ లో డబ్బు’ తో ముడిపడిన ఈ వ్యవహారం[స్ట్రాటజీ] లాంటిదే, మన దేశంలోనూ జరిగింది గనక!

వివరాల్లోకి వెళితే....

పీవీజీ హయాంలో, అవిశ్వాస తీర్మానం గట్టెక్కడానికి, తన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి, పీవీజీ తరుపున తనతో బేరసారాలు నడిచాయని జేఎంఎం నేత శిబూసోరన్ ఆరోపించాడు. జేఎంఎం ముడుపుల కేసుగా అది మీడియాలో మారుమ్రోగింది. అచ్చంగా అమీరీ లాగానే, శోరెన్ అకౌంట్ లో కూడా డబ్బు జమ అయ్యి కనబడింది. ఆ డబ్బు పీవీజీనే జమ చేసాడా?

"ఆయన కాదంటాడు, మనం ఔనంటాం. ఇంతే గదా?" అనుకున్నారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు సోనియాలు, రామోజీరావులు.

అయితే... అక్కడ డబ్బు అకౌంట్ లో ఉంది, ఇక్కడ ఆ డబ్బుతో తనకు అనుకూలంగా ఓటు వెయ్యాల్సిందని బేరాలు నడిచాయని శోరెన్ అన్నాడు. ఇంకేం? మీడియాకి కావలసినంత ‘రచ్చ’ దొరికింది. సరే! కోర్టులో ఆ కేసులు ఏళ్ళూ పూళ్ళూయ్యాక తేలాయి. అందుకోసం పీవీజీ ఇల్లు అమ్ముకున్నాడని వార్తలూ వచ్చాయి.

అయితే ఇందులో ఏది నిజమో కాలం నిరూపించింది కదా!

ఎలాగో వివరిస్తాను.

ఏ కారణంగానైతేనేం, శోరెన్ పీవీజీకి మద్దతిచ్చి, ఆయన మైనారిటీ ప్రభుత్వం అయిదేళ్ళు కొనసాగేందుకు దోహదపడ్డాడనుకుందాం!

నేటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకి పీవీజీ అంటే ఎంత కసీ, ద్వేషమో, పగా ప్రతీకారమో... మరణానంతరం ఆయన పార్దివ శరీరానికే కాదు, ఆరేళ్ళు గడిచినా ఆయన స్మృతికీ చేస్తున్న అవమానాలే సాక్షి!

పీవీజీకి సోరెన్ అనుకూలంగా ఓటేసాడు. అయిదేళ్ళు నిలబడేందుకు సహాయపడ్డాడు. పీవీజీ అయిదేళ్ళు అధికారంలో ఉండబట్టే గదా... ఇప్పుడిన్ని సువర్ణముఖిలు అనుభవించాల్సి వస్తుంది?

అలాంటప్పుడు... శిబూ సోరెన్ మీద, సోనియా గట్రాలకి ఎంత కోపం ఉండాలి? సోనియాకి పీవీజీ మీద ఉన్న కోపంలో, సగమన్నా, కనీసం అందులో పావు వంతన్నా ఉండాలి కదా!? ఆ కోపానికి శిబూ శోరెన్ ని చితక్కొట్టాలి కదా? మరెందుకు చంక నెత్తుకున్నారు?

అందునా.... జూలై 22, 2008 న పార్లమెంట్ సాక్షిగా ‘ఓటుకు నోటు’ తో అవిశ్వాసం గట్టెక్కడం అందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూసినా... ‘ఠాఠ్! అదంతా గిట్టనోళ్ళ కుట్ర’ అంటూ కిశోర్ చంద్రదేవ్... అన్నీ మాఫీ చేసేసినా...

శిబూ శోరెన్ మటుకూ ఢంకా భాజాయించి "అవిశ్వాస తీర్మానం విషయంలో, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర ప్రయోజనాలు సమకూరుస్తామని కాంగ్రెస్, అధినేత్రి మాట ఇచ్చారు. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటారా? లేదా!" అని మీడియా సాక్షిగా బహిరంగంగా అల్టిమేటం ఇచ్చాడు.

దెబ్బతో కాంగ్రెస్ అధిష్టానం, అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న మధుకోడాను దించి, శోరెన్ ని సీఎం ని చేసింది. [ఆ కోడానే తర్వాత హవాలా కేసు తాలూకూ అవకతవకల్లో దొరికాడు.]

ప్రభుత్వ మనుగడ కోసం పదవులిచ్చి ఓట్లు కొన్న అధినేత్రి, పైసలు మాత్రం ఇవ్వదా? ఇలాంటి ఈ శోరెన్ లు పదవులూ, పైసల కోసం, చెప్పమన్నట్లల్లా చెప్పడా? అతడి అకౌంట్ లో డబ్బు కన్పించేలా చెయ్యడం పెద్ద అసాధ్యమైన పనా?

ఇప్పుడు జార్ఖండ్ లో ఈ సోరెన్ తో పొత్తుపెట్టుకుని అంట కాగుతున్నది కాంగ్రెస్, భాజపాలే! ఎంత చక్కగా అన్నిపార్టీలూ, అందరూ రాజకీయ నాయకులూ, ఒకే శృతిలో నడుస్తున్నారని చెప్పుకున్నారో చూశారా? ఆ శృతే నకిలీ కణిక వ్యవస్థ!

ఇదీ... కాలం, నిజాన్ని నిరూపించే తీరు!

రెండు దశాబ్దాల క్రితం వరకూ గడపదాటని ఇల్లాలు, దశాబ్దం న్నర క్రితం నుండి నేటి వరకూ xyz సార్లు ప్రధాని పదవి త్యాగం చేసిన త్యాగశీలి, సోనియా అధికార దాహం ఎంతటి దంటే... అడ్డదారిలో అధికారం చేజిక్కించుకునేందుకు, రాజ్యాంగంలో లేని ప్రభుత్వ కుర్చీ వ్యక్తి పదవినీ, సీటునీ సృష్టించుకొని అధిష్టించేటంత!

ఈ నిజాన్నీ కాలమే నిరూపించింది మరి!

ఎప్పుడో 70 ఏళ్ళ క్రిందట ఇటలీ నియంత ముస్సోలినీ, తొలుత మీడియా వ్యక్తి . పిదప దేశాధినేత అయ్యాడు. అతడు బ్రిటన్ గూఢచారి అని ఇటీవల బయటపడింది. [ ఆ వార్త సాక్షి తప్ప మిగిలిన వాళ్ళు ప్రచురించ లేదు లెండి.] అదీ బ్రిటన్ గూఢచార సంస్థ MI 5 లు ప్రకటిస్తే బయటకు వచ్చింది.

ఇప్పుడు 23 కోట్ల రూపాయలతో అమీరీ కథ బయటికొచ్చింది. [మరీ ఇంత తక్కువ డబ్బా? మన దేశంలో అయితే చిన్నస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసిబి పట్టుకుంటే దొరుకుతున్నాయి.]

ఇందులో ఓ కొసమెరుపు ఏమిటంటే - ఇరాన్ అణు రహస్యాల కోసం అమెరికా తనకి డబ్బాశ చూపిందనీ, కానీ అణ్వస్త్ర రహస్యాలు అమ్మడానికి... తనకి అసలు ఎలాంటి రహస్యాలు తెలియనే తెలియవనీ అమీరీ అంటున్నాడు. అణ్వస్త్ర శాస్త్రవేత్తకి అసలు ఏ రహస్యాలూ తెలియవనడంలో రహస్యమేమిటో? నిజమేమిటో?

కాలం నిరూపిస్తే తెలియాల్సిందే!

అచ్చంగా అద్వానీ Vs జస్వంత్ సింగ్ ల ఆత్మకథల నేపధ్యంలో, 2001 నాటి కాందహార్ హైజాక్ రహస్యాలు బయటికొచ్చినట్లుగా నన్న మాట!

ఎందుకంటే... నిజం బహిర్గతం కావాలంటే - సంఘటనలన్నా జరగాలి. లేదా అందులో ప్రమేయమున్న వ్యక్తులు నోరన్నా విప్పాలి? [కలహమో, మరొకటో] ఏ కారణం చేతనైనా, వ్యక్తులకి మాత్రమే తెలిసిన రహస్య విషయాలు బయటపెడితే తెలియాల్సిందే!

అలాంటి నేపధ్యంలో... శోరెన్ వ్యవహారం ఒక్కటి చాలదా సోనియా నిబద్దత తెలియటానికి? అయినా ఇటలీ మహిళకి ఇండియా పట్ల నిబద్దత ఎలా ఉంటుంది? వింత గాకపోతే!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

మొన్నటి మా టపాకు వ్యాఖ్య వ్రాస్తూ, మిత్రులు ‘చంద-మామ’ గారు, ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన దిగువ వార్తని ప్రస్తావించారు. ‘చంద-మామ’ గారికి కృతజ్ఞతలతో ఈ టపా!

ముందుగా దిగువ వార్తని ఓ సారి పరిశీలించండి.

>>>ఇండియా గేట్

బిజెపి విభిన్న స్వరూపం
- ఎ. కృష్ణారావు

భారతీయ జనతా పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా ఉంటాయి. చాలా నిర్ణయాలను దాని సిద్ధాంతాలతో ముడిపెట్టలేం. ఇటీవల బిజెపి మద్దతుతో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం ఇలాంటి నిర్ణయాల్లో ఒకటి. న్యాయవాదిగా ఆయన సామర్థ్యాన్ని ఎవ రూ ప్రశ్నించలేరు. కాని బిజెపికి ఇప్పుడు 87 ఏళ్ల రాంజెఠ్మలానీతో ఏం అవసరం వచ్చిందా అన్న విషయం ఆలోచించా ల్సి ఉన్నది.

గుజరాత్‌లో గత 8 సంవత్సరాల క్రితం జరిగిన వేలాది మంది ఊచకోతకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన సమాన్లను సవాలు చేసే బాధ్యతను జెఠ్మలానీ తన భుజస్కంధాలపై వేసుకున్న తర్వాత బిజెపికి జెఠ్మలానీపై ప్రేమ కలిగి ఉంటుంది. విచిత్రమేమంటే ఆయన అంతకుముందు గుజరాత్ అల్లర్ల బాధితు ల తరఫున కేసులు వాదించారు. బా«ధితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాదులు ఎవరైనా ముందుకు రావల్సిందిగా సుప్రీంకోర్టు కోరినప్పుడు రాం జెఠ్మలానీ తనంతట తాను ముందుకు వచ్చారు.

ఒక ఎన్‌జిఓ తరఫున ఆయన గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. కాని అదే రాంజెఠ్మలానీ గత మార్చిలో మోడీ తరఫున వకా ల్తా తీసుకున్నారంటే ఆయనకూ బిజెపికి మధ్య ఏదో ఒక ఒప్పందం కుదిరిఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. తదనుగుణంగా రాంజెఠ్మలానీకి రాజ్యసభ నుంచి బిజెపి తరఫున సీటు వరించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా తన పార్టీ శాసన సభ్యులను జైపూర్‌లో అయిదు నక్షత్రాల హోటల్‌లో విడిది చేయించి వారికి అక్కడే సకల ఏర్పాట్లు చేయించి వారు మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా కాపాడుకున్నందువల్లనే రాంజెఠ్మలానీ విజయం సాధించగలిగారు.

పనిలో పనిగా ఈ ఎమ్మెల్యేలకు రాజనీతి సినిమా పైరేటెడ్ కాపీని తెప్పించి మరీ వినోదం కలిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్రమంగా చూసినందుకు వారిపై కేసు పెడతానని సినిమా దర్శకుడు ప్రకాశ్ ఝా హెచ్చరించారు.. అయనా వారికేం భయం ఉద్దండ పిండమైన న్యాయవాది రాంజెఠ్మలానీ బిజెపి పక్షంలోనే ఉన్నారు కదా.. ఏదో రకంగా వారిని ఆయన ఈ కేసు నుంచి తప్పించగల చతురుడు. నరేంద్ర మోడీనే కాదు, ఐపిఎల్ కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కూడా కాపాడేందుకు రంగంలోకి దిగిన రాంజెఠ్మలానీ గతంలో ఏ కేసులు వాదించారన్న విషయంలో, ఏ విధంగా తమ పట్ల ప్రవర్తించారన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు.

2004లో ఆయన అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికి వ్యతిరేకంగానే లక్నోనుంచి పోటీ చేశారన్న విషయం బిజెపికి తెలిసిందే కదా.. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకులను సమర్థిస్తూ ఆయన కోర్టుల్లో వాదించారన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియని కాదు కదా.. సంచలనాత్మకమైన మార్కెట్ కుంభకోణాలకు పాల్పడిన హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారిని, స్మగ్లర్లను, ముఠాకోర్లను.

అందరూ చూస్తుండగానే జెస్సికాలాల్ అనే మోడల్‌ను కాల్చి చంపిన మనుశర్మ అనే హంతకుడిని కాపాడేందుకు ప్రయత్నించింది కూడా ఆయనే నని బిజెపికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. అన్నిటికన్నా మించి పార్లమెంట్ దాడిలో నిందితుడైన పాకిస్తానీ టెర్రరిస్టు మహమ్మద్ అఫ్జల్‌ను ఉరితీయకూడదని కోర్టులో వాదించడమే కాక, పార్లమెంట్‌లో అప్జల్ ఉరి ని వ్యతిరేకించింది రాంజెఠ్మలానీయేనని భారతీయ జనతా పార్టీకి చెప్పే ప్రయత్నం చేయడం అమాయకత్వమే కదా..

అయినా భారతీయ జనతా పార్టీకి రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులకు అందలమెక్కించడం కొత్త కాదు. 15వేల మంది ప్రాణాలను బలిగొన్న యూనియన్ కార్బైడ్ కేసులో ఆ కంపెనీ తరఫున వాదించి వాయిదాల వాయిదాలు కోరి, ఆ కేసు 26 ఏళ్లు పట్టేందుకు కారణమైన మరో ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ కూడా బిజెపికి అంతరంగికుడే. భోపాల్‌లో కేసు విచారణ జరిగిన తొలి రోజుల్లో ఒక్క నారిమన్ మాత్రమే ఢిల్లీ నుంచి వెళ్లేలా చేసేందుకు యూనియన్ కార్బైడ్ కంపెనీ విమానం టిక్కెట్లనన్నీ తానే కొన్న సందర్భాలున్నాయని అప్పటి ప్రముఖ న్యాయవేత్త ఒకరు చెప్పా రు.

ఇటీవల నారిమన్ 'జ్ఞాపకాలు చెరిగిపోకముందే.. (బిఫోర్ మెమోరీ ఫేడ్స్ అవుట్)' అనే పుస్తకాన్ని రాశా రు. ఇందిరాగాంధీ హత్యకేసులో నిందితులను కాపాడేందుకు రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులు కేసు వాదించినప్పుడు తానెందుకు యూనియన్ కార్బైడ్ తరఫున వాదించకూడదని నారిమన్ ఈ పుస్తకంలో రాసుకున్నారు.

హత్యకేసులో నిందితులెవరో తేలేందుకు విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాని భోపాల్‌లో విషవాయువు లీకై 15వేలమంది మరణించిన దృశ్యాలు కళ్లముందున్నప్పుడు అందుకు కారణమైన ఆ కంపెనీ తరఫున వాదించి, కంపెనీ నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నించడం సరైనదేనా.. అది భారత ప్రజల తరఫున దుర్మార్గం కాదా.. అని ఎవరైనా ప్రశ్నించేందు కు ఆస్కారం ఉన్నది. అందునా నారిమన్ అంతకుముందు మానవ హక్కులకోసం పోరాడిన వారు.

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు. అలాంటి నారిమన్ యూనియన్ కార్బైడ్ ప్రలోభాలకు లొంగిపోవడం జీర్ణించుకోలేని విషయం కాదు. అందుకే బిజెపి ఆయనను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేయడం, పద్మభూషణ్ లాంటి బిరుదులు ఇవ్వడం జరిగిందంటే ఆ పార్టీ గురించి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. తనకు అప్పటి డిప్యూటీ ప్రధానమంత్రి అద్వానీ స్వయంగా ఫోన్ చేసి తనను రాజ్యసభకు నామినేట్ చేశారని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ కార్బైడ్ కేసులో సిబిఐ ఛార్జిషీటులో నిందితుడైన కేశవ్ చంద్ర మహేంద్రకు పద్మభూషణ్ అవార్డు వరించడం కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

న్యాయవాదులు ఏ కేసులోనైనా వాదించవచ్చు కనుక వారి వృత్తికీ ప్రవృత్తికీ ముడిపెట్టరాదని వాదించే బిజెపి నేత లు ఉండవచ్చు కాని రాంజెఠ్మలానీ ఉదంతం బిజెపిలో ఉన్న ఒక గందరగోళాన్ని, నిస్సహాయతను సూచిస్తుంది. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా పాలిస్తున్నప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, యూనియన్ కార్బైడ్ వంటి ఉదంతాలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని వ్యక్తం చేసినప్పటికీ బిజెపి దాన్ని గట్టిగా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నదంటే ఆ పార్టీ నైతికతయే ప్రశ్నార్థకంగా మారిందని భావించవలిసి ఉంటుంది.

దేశ ప్రజలకు సంబంధించి ఒక ఘోరమైన అన్యాయం గురించి వాస్తవాలు వెల్లడవుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రజలను ఉద్యమించేందుకు పురికొల్పలేని ఒక అసమర్థ దుస్థితిలో ఉన్నదని చెప్పవలిసి ఉంటుంది. తాజాగా బీహార్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీని ఒక విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టివేశాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ముఖ్యమంత్రితోనే ఢీకొనేందుకు బిజె పి పూనుకోవడం ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుంది.

నిజానికి ఇలాంటి కార్యవర్గ సమావేశాలు సంబంధాలు బలపడేందు కు దోహదం చేయాలి కాని కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ తప్పుకునే పరిస్థితికి సమావేశాలు దారి తీయడం ఆశ్చర్యకరం. ముందునుంచీ జనతాదళ్ (యు)కు చెందిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి నరేంద్ర మోడీ క రచాలనం చేస్తున్న పోస్టర్లు అంటించడం, మోడీ తమ పార్టీ మంత్రులను ఆకాశానికెత్తడం, కావాలంటే తెగతెంపులు చేసుకోవల్సిందిగా సీనియర్ బిజెపి నాయకుడు యశ్వంత్ సిన్హా సవా లు చేయడం, ముఖమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న యాత్రనుంచి తప్పుకోవాలని బిజెపి ఉప ముఖ్యమంత్రి సుశీల్ షిండే సహా మరికొందరు మంత్రులు నిర్ణయించడం, చివర కు క్యాబినెట్ సమావేశాల్నే బహిష్కరించాలని యోచించడం చిలికి చిలికి గాలివానగా మారింది.

చివరకు రాష్ట్రంలో వరద బాధితులకు నరేంద్ర మోడీ ప్రకటించిన నిధులను తిరస్కరించాలని నితీశ్ కుమార్ నిర్ణయించడంతో ఇక ఎన్‌డిఏతో జెడి(యు) తెగతెంపులు చేసుకోవడం తప్పదన్న అభిప్రాయాన్ని ఏర్పర్చింది. నిజానికి బిజెపితో సంబంధాలు కొనసాగించే విషయంలో జెడి(యు)కు ఎలాంటి అభ్యంతరం లేకున్నా నరేంద్ర మోడీ, వరుణ్ గాంధీ వంటి వివాదాస్పదమైన వ్యక్తుల విషయంలోనే నితీశ్ కుమార్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

గుజరాత్ అల్లర్లకు కారకుడైన మోడీతో స్నేహసంబంధాల వల్ల తన ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయం ఇందుకు కారణం కావచ్చు. కాని బిజెపి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకుం డా, బీహార్‌లో మోడీకి పెద్ద పీట వేయడం సహజంగానే నితీశ్‌కు కోపం తెప్పించి ఉంటుంది. బహుశా బిజెపి బుద్ధి పూర్వకంగానే బీహార్‌లో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి ఆయనకు ఎనలేని ప్రాధాన్యం కలిగించి ఉంటుంది.

వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న రీత్యా మోడీని ప్రచార రంగంలోకి దించేందుకు ఆ పార్టీ వ్యూహరచ న చేస్తున్నట్లు కనపడుతోంది. బీహార్‌లోనే కాదు మహారాష్ట్ర లో శివసేనతో కూడా బిజెపి సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటున్నాయి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఆ పార్టీతో తెగతెంపులుచేసుకున్న విషయం తెలిసిందే.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్ప ఏ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్న విషయం తెలిసినప్పటికీ బిజెపి ఒక్కో మిత్రపక్షాన్నీ వదులుకోవడం ఆశ్చర్యకరం. యుపిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సాధించేందేమీ లేదని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ బీహార్‌లో బిజెపి కార్యవర్గ సమావేశాల్లో అన్నారు. కాని ఈ ఏడాదిలో ప్రతిపక్షంగా, బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు బిజెపి ఏం చేసిందో ఆయనే చెప్పాలి. (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


దేశ విభజన నాడు పాక్ నుండి భారత్ కు వలస వచ్చి, ఆనక ప్రముఖులైపోయిన సమూహంలో - ఒకడు రాంజెఠ్మలానీ! భారతదేశానికి వ్యతిరేకంగా ఏ కేసునైనా వాదించటానికి ఎల్లవేళలా సిద్దంగా ఉంటాడీతడు. చిత్రమేమిటంటే - ఒకే కేసులో.... ఒకసారి వాది తరుపునా, మరికొంత కాలం తర్వాత ప్రతివాది తరుపునా కూడా వాదించగల ‘దిట్ట’. అది చట్టబద్దం కావచ్చేమో గానీ, వ్యక్తిగతంగా ఏ పాటి ‘నీతి వంతమో’ సదరు న్యాయవాదికే తెలియాలి.

గమ్మత్తు ఏమిటంటే - ఇందిర హంతకుల తరుపునా, పార్లమెంటుపై దాడి కేసులో ముద్దాయి ‘అఫ్జల్ గురు’ ల తరుపునా వాదించిన ఈ న్యాయవాది, ప్రతీకేసు లోనూ భారత్ కు వ్యతిరేకంగా వాదించేందుకే సిద్దపడే ఈ న్యాయవాది, తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

అతడి దృష్టిలో .... భారత్ కు వ్యతిరేకంగా, కుట్రదారులకు అనుకూలంగా, తాను చేసిన సేవలకు, తనకు ముట్ట చెప్పవలసిన ‘కూలీ’ అది! ఆ డిమాండునే తెరపైన ఎన్డీయేనీ, ఆ విధంగా తెరవెనుక.... ఎన్డీయే యూపీఏ లని ఆడించే గూఢచర్య వ్యవస్థ యైన నకిలీ కణిక వ్యవస్థనీ డిమాండ్ చేశాడు.

"నువ్వు చేసిన సేవలకు అంత ఖరీదు లేదులే! మహా అయితే ఇదిగో ఈ రాజ్యసభ సీటు ఇస్తాం" అని భాజపా ద్వారా ఆ ‘కూలీ’ అతడికి ఇచ్చింది నకిలీ కణిక వ్యవస్థ!

లేకపోతే, అంత అడ్దదిడ్డంగా భాజపా ప్రవర్తిస్తుందా? అంత నగ్నంగా, అంత పచ్చిగా, అంత బహిరంగంగా, విలువలు వదిలేసి నిలబడి కనబడుతుందా?

చేసిన కర్మను అనుభవింప చేసే సువర్ణముఖి ఎదురుగా ఉంటే...
‘కన్నా?కాలా?’ స్ట్రాటజీలో చిక్కుకొని తప్పని సరి పరిస్థితి అయితే....
‘ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్’ ని నిర్వహించడం తప్పని సరి అయితే....
భాజపా అయినా ఏం చేస్తుంది? సోనియా అయినా ఏం చేస్తుంది?

కాబట్టే - రాంజఠ్మలానీ లకు రాజ్యసభ టిక్కెట్లు వస్తాయి, నారిమన్ లకు పద్మ అవార్డులొస్తాయి. [ఈ రాంజెఠ్మలానీని 1992 ద్వితీయార్దంలో ఢిల్లీలో రోడ్డు మీద జనాలు బాహాబాహీ కొట్టారు. జనం మధ్యలో నలుగుతూ, కళ్ళద్దాలు పప్పుపప్పు కాగా, బిగ్గరగా రోదించిన రాంజఠ్మలానీ విజువల్ ని, అప్పట్లో డీడీ వార్తల్లో చూశాను.]

రాంజఠ్మలానీ చరిత్ర ఇదయితే, ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ చరిత్రని ఆంధ్రజ్యోతి వ్రాసింది. సదరు నారిమన్, యూనియన్ కార్బైయిడ్ కు ‘పరమతొత్తు’ గా పనిచేసాడు. [ఇలాంటి పనులు చేసినందుకు బహుమానంగా పద్మ అవార్డులు గట్రా తెచ్చుకున్నాడన్న మాట!]

ఇక ఈ ఎన్డీయే యూపీఏలు... పార్లమెంట్ లోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ అరుచుకునేటప్పుడు....

ఉదాహరణకి -
ఎన్డీయే వాళ్ళు గనక, అఫ్జల్ గురు గురించి ఎత్తేరనుకొండి! అప్పుడు యూపీఏ వాళ్ళు, "ఆ ‘ఆఫ్జల్ గురు’ తరుపున వాదించిన రాంజఠ్మలానీ ని మీరే కదా నెత్తి కెత్తుకొని రాజ్యసభకు పంపించారు? ఇంకా మీరూ మాట్లాడతారా?" అంటారు. ‘అవును కదా!’ అనుకుని, పాపం బిజేపీ, తన గొంతు క్రమంగా తగ్గించేస్తుంది.

అలాగే యూనియన్ కార్బైయిడ్ గురించి మాట్లాడితే.... "ఆ నారిమన్ ని మీరు నెత్తికెక్కించుకోలేదా? ఇంకేం మాట్లాడతారు?" [యూపీఏ కైతే యూనియన్ కార్బైయిడ్ పాపమంతా పీవీజీదే!] అంటారు. ‘అవును కదా!’ అని, ఎన్డీయే తమ వాదనా పటిమని తగ్గించుకుంటుంది.

మరో ఉదాహరణ చెప్పాలంటే.... ఇప్పుడు కర్నాటన చట్టసభలో, గాలి గనుల గొడవల్లో, ఒకరి నొకరు అరుచుకుంటూ, భాజపా కాంగ్రెస్ ని "ఇప్పుడు కర్ణాటక గవర్నరుగా ఉన్న హెచ్.ఆర్.భరద్వాజ, అప్పట్లో న్యాయమంత్రిగా ఉండి, భోపోర్సు కేసులో ద్రోహి ఖత్రోచికి ఎలాంటి సాయం చేశారో దేశమంతా తెలుసు. అలాంటిది తగుదునమ్మా అంటూ, గవర్నరుని అంటూ, ఓ తెగ గోల చేస్తున్నాడు!? ఇంకా ఏం చెప్పొచ్చారు?" అంటున్నారు, చూడండి! అలాగన్న మాట!

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి "రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారిపై వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి?" అంటూ సెలవిస్తున్నాడు. అసలు ప్రభుత్వ కుర్చీ వ్యక్తి అనే పదవి రాజ్యాంగంలో ఉందా? తమకి కావాలసినప్పుడు కావాల్సినట్లుగా వాడుకునేదే వాళ్ళ ‘రాజ్యాంగం’ కాబోలు!

ఇక ఇలాంటి ఎన్డీయేలనీ, యూపీఏలనీ ఏమనగలం? వీరా దేశాన్ని కాపాడేది?

ఇక్కడ ఓ పోలిక చెబుతాను.

మన పల్లెటూళ్ళల్లో, నాలుగు దారుల కూడళ్ళలో, ఆ వీధి కుక్కలు ఓ పది, ఈ వీధి కుక్కలు ఓ పది చేరి, ‘ఖయ్యి ఖయ్యి’ మని అరుచుకుంటూ ఉంటాయి. చెవులు చిల్లులు పడేలా మొరుగుతాయి. మనం అదిలించినా వాటికి పట్టదు. ఒక్కళ్ళుగా అదిలిస్తే కరిచినా కరిచేస్తాయి.

కాస్సేపలా ‘గ్యాంగ్ వార్’ నడిచాక, వేటి దారిన అవి పోతాయి. సరిగ్గా అలాగే, ఎన్నికల ప్రచార సభల్లోనూ, ఎన్నికయ్యాక అన్ని చట్టసభల్లోనూ, అన్ని పార్టీల వాళ్ళూ, చేస్తున్నది ఈ ‘గ్యాంగ్ వార్’ నాటకమే! అంతా అయిపోయాక, తమ జీత భత్యాలు పెంచుకోవటం వంటి, తమ స్వార్దప్రయోజనాలకు సంబంధించిన బిల్లుల్ని మాత్రం, చల్లగా ‘పాస్’ చేసుకుని చక్కా పోతుంటారు.

ఇంకా ఇది ప్రజాస్వామ్యమనీ,
వీళ్ళు ప్రజాప్రతినిధులనీ,
వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారనీ,
ఫలానా ఫలానా సిద్దాంతం ప్రకారం ఈ రాజకీయాలు నడుస్తున్నాయనీ,
ఫలానా ఫలానా సూత్రాల ప్రకారం ఈ పత్రికలు వ్రాస్తుంటాయి అనే వాళ్ళకు ‘జిందాబాద్’ చెబుతూ....
వాళ్ళకే నా ఈ టపాని అంకితం చేస్తున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ పోలిక!

ఎక్కువగా రాంగోపాల్ వర్మ వంటి దర్శకుల సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం!

ఉదాహరణకి కొందరు వ్యక్తులు ఓ గచ్చకాయ రంగు అంబాసిడర్ , మరో తెల్ల అంబాసిడర్ మీద ప్రయాణిస్తూ, ఒకరి నొకరు తరుముకుంటున్నారనుకొండి. విశాలమైన రహదారి పైన, ఇతర వాహనాల రాకపోకలున్నా, ఈ రెండు కార్ల ఛేజింగు దశ, దిశ స్పష్టంగానే కనబడతాయి. గచ్చకాయ రంగు అంబాసిడర్, తెల్ల అంబాసిడర్ ని తరుముతోందనుకుందాం.

ఇంతలో ఏ కారణం చేతనైనా, ఈ రెండు కార్లు, ప్రధాన రహదారి నుండి ప్రక్కకి మళ్ళి, సందుగొందుల్లోకి ప్రవేశించాయనుకొండి. అప్పుడు వాటి ప్రయాణపు దశ, దిశ స్పష్టంగా గోచరించవు. ఒకోసారి అసలు వేటి దారిన అవి ప్రయాణిస్తున్నట్లుగా కూడా అన్పిస్తుంది. ఎవరిని ఎవరు తరుము తున్నారో అర్దం కాదు.

మళ్ళీ ఆ రెండు కార్లు ప్రధాన రహదారి [Main Road] మీదికెక్కితే... అప్పుడు వాటి దశ, దిశ మళ్ళీ స్పష్టంగా గోచరిస్తాయి. అప్పుడు చూస్తే, ముందు ప్రయాణిస్తున్న దారిలోనే, అవి మరికొంత ముందు కెళ్ళి... వేగంగానో, మెల్లిగానో [చాలా సందర్భాల్లో వేగంగానే] ప్రయాణించటం తెలుస్తుంది. అంతే కాదు, మరింత స్పష్టంగా ఎవరు ఎవరిని తరుముతున్నారో తెలుస్తుంది.

ఇక ఈ పోలిక అనువర్తన ఏమిటంటే -

వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వారం తర్వాత ప్రారంభమైన జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానాల మధ్య నడుస్తున్న అంతర్లీన పోరు ఇలాంటిదే!

మధ్యలో... జగన్, అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ "అమ్మ చెప్పింది అమ్మకిమ్మని" అంటూ, పులివెందుల అసెంబ్లీకి వై.యస్. విజయలక్ష్మి చేత నామినేషన్ వేయించినా...

అలాగే, జగన్ అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ, వై.యస్. మరణానంతర సీఎల్పీ సమావేశపు మొక్కుబడిలో, రోశయ్యని నాయకుడిగా ప్రతిపాదించినా...

సమాంతరంగా, జగన్ అధిష్టానానికి అవిధేయత ప్రకటిస్తూ, సాక్షి పత్రికలో రోశయ్య ప్రభుత్వాన్ని విమర్శించినా ...

అవన్నీ సందుగొందుల్లో ప్రయాణాలే!

అదే విధంగా జగన్ విషయమై...

కాంగ్రెస్ అధిష్టానం తరుపున కేంద్రంలో వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ వంటి అధిష్టానపు అనుచరులు నాటకీయ సన్నివేశాలు నడిపినా...

అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, జయంతీ నటరాజన్ వంటి అధికార ప్రతినిధులు రకరకాల పత్రికా ప్రకటనలు గుప్పించినా....

రాష్ట్రంలో రోశయ్య, కేకే, డీఎస్, పాల్వాయి, వీహెచ్ ల వంటి వృద్దనేతలు వంతుల వారీగా ‘హల్ చల్’ నిర్వహిస్తూ రోజు కో ప్రకటన, వారానికో మాట పడంచినా....

పబ్లిక్ గా కనిపించకుండా జగన్ కు పార్టీలో పట్టును ఊడగొడుతూ, దెబ్బలు కొట్టినా...

అలాగే అధిష్టానం గాలి గనుల మీదకి ప్రభుత్వాధికారులని పంపినా...

అవన్నీ కూడా సందుగొందుల్లో ప్రయాణాలే!

తొమ్మిది నెలల తర్వాతయినా, ఎన్ని సందుగొందులలో తిరిగినా, ప్రధాన రహదారి మీద.... జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానం ల ఛేజింగ్... అదే దిశలోనూ, మరింత తీవ్ర దశలోనూ ఉంది.

గత టపాలోని ఈ క్రింది పేరా పరిశీలించండి.

[అధిష్టానం ముందున్న దారులు రెండు! ఒకటి, జగన్ శిబిరపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది జగన్ శిబిరాన్ని Over power చేయడం. మొదటిది చేస్తే, ఇక జగన్ శిబిరం అంతకంతకూ తమ పట్టుపెంచుకుంటూ పోతుంది. కోరికల జాబితానూ పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా నైనా తము, తమ స్ట్రాటజీ Expose అవుతాయి. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు, దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.

అలాగే జగన్ శిబిరం ముందున్న దారులు కూడా రెండే! ఒకటి, అధిష్టానపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది వాళ్ళ గుట్టు బయటపెట్టటం. మొదటిది చేస్తే, ఇక తమకు భవిష్యత్తు ఉండదు. క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం తమని మట్టి కలిపేస్తుంది. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానానికీ, జగన్ శిబిరానికీ మధ్య నడుస్తున్న అంతర్లీన పోరుఇదే!]

ఇప్పటికీ... అధిష్టానం, జగన్ శిబిరం, ఇద్దరిదీ రెండో మార్గాన్ని ఎంచుకున్న స్థితి!

ఈ నేపధ్యంలో, ఈ బ్లాగులో గత ఏడాది, వై.యస్.ఆర్. మృతి తర్వాత [10, అక్టోబరు, 06 నవంబరు లలో] వ్రాసిన నాలుగు టపాలలో, వీరి అంతర్లీన పోరు పూర్వ పరిస్థితులని విశదీకరించాను. మరోసారి పరిశీలించాలంటే....

1].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]


2].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 02 [పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!] [Nov.03, 2009]


3].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 03 [ఎవరు ఎవరికి దాసోహం అన్నారు?] [Nov.05, 2009]


4].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 04 [ఏకాంత భేటీ వరకూ…] [Nov.06, 2009]

ఇక ఇప్పుడు `ఈనాడు Vs సాక్షి పత్రికల నడుమ మీడియా పోరు'గా రూపాంతరం చెందిన, కాంగ్రెస్ అధిష్టానం Vs జగన్ శిబిరాల నడుమ సాగుతున్న అంతర్లీన పోరును విశ్లేషించాలంటే....

ముందుగా పైకారణం[over leaf reason] లోని కొన్ని వైరుధ్యాలను, విచిత్రాలనూ పరిశీలించాల్సి ఉంది. అవి నిజంగా ఆసక్తికరమైనవి, ఆశ్చర్యకరమైనవి కూడా!

ఆయా వైరుధ్యాలనీ, విచిత్రాలనీ పరిశీలించే ముందు, ఒక చిన్న వివరణ!

నేను ఈ టపాలలో, ఈనాడు రామోజీరావునీ, సోనియానీ విమర్శిస్తున్నానంటే అర్దం - సాక్షినీ, జగన్ నీ సమర్దిస్తున్నానని కాదు.

అధిష్టానపు అకృత్యాలని, అబద్దాలనీ ఎత్తి చూపుతున్నానంటే అర్ధం - జగన్ సచ్ఛీలుడనీ కాదు.

ఈ వ్యవహారంలో... సోనియా, రామోజీరావుల సంయుక్త హస్తాన్నీ, కుట్ర స్వరూపాన్నీ ఎత్తి చూపడమే నా ఉద్దేశం!

మరోమాట ఏమిటంటే - పోల్చి చూస్తే... ఈ దేశానికీ, దేశ ప్రజలకీ... మరణించిన వై.యస్.ఆర్, అతడి కుమారుడు జగన్, చంద్రబాబు నాయుడు ల వంటి రాష్ట్ర రాజకీయుల కంటే... సోనియా, రామోజీరావుల బృందమే పెద్ద శతృవులు!

ఎంతగా ప్రజాధనం దోచుకుతిన్నారన్నా... చంద్రబాబులూ, వై.యస్. జగన్ లూ దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టలేరు. పాక్ కి పాదాక్రాంతం కాలేరు.

అవకాశం వస్తే అందరూ రామోజీరావులే కావచ్చు గాక! ఆ అవకాశం... చంద్రబాబు నాయుడికీ, జగన్ లకీ రాక పోవటమే వాళ్ల అదృష్టం! అదృష్ట దురదృష్టాలు పూర్వ జన్మ సుకృత దుషృతాలని పెద్దలంటారు. ఏదేమైనా... అంతటి అవకాశం చంద్రబాబులకీ, జగన్ లకీ రాకపోవటమే ఇక్కడ ముఖ్యమైన అంశం!

ఒక వేళ చంద్రబాబు నాయుళ్ళూ, జగన్ లూ గనక... సోనియా, రామోజీరావుల స్థానంలో ఉండి ఉంటే,

సోనియా, రామోజీరావుల స్థాయిలో ఈ దేశానికి, సామాన్య ప్రజానీకానికీ, ధర్మానికీ హాని చేయగలుగుతుంటే,

అప్పుడు వాళ్ళే ప్రధమ శతృవులై ఉండేవాళ్ళు.

ఆయా వ్యక్తుల కుట్ర భాగస్వామ్యం వారిని ‘శతృవు’ అనే మెట్ల మీద, వారి వారి స్థానాల్లో నిలిపింది. అదే విధంగా వారి వారి సువర్ణముఖినీ అనుభవింప చేస్తుంది.

ఏతావాతా విషయమేమిటంటే - కాంగ్రెస్ అధిష్టానం సోనియాతో... చంద్రబాబులూ, జగన్ లూ వంటి రాష్ట్ర రాజకీయుల్ని పోల్చి చూస్తే... దేశానికి కీడు చెయ్యడంలో సోనియాదే ఫస్ట్ ర్యాంకు!

కాబట్టి, ఈ దేశానికి ప్రధమ శతృవు సోనియా, ఆమెకు అండదండా అయిన రామోజీరావులే! [రామోజీరావుకీ, సోనియాకీ మధ్య సంబంధ బాంధ్యావ్యాలేమిటో నా గత టపాలలో వివరించాను.]


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu