దేహాన్ని తల్లిదండ్రులిచ్చారు.
దేవుడు జీవితాన్నిచ్చాడు.
‘జీవితం’ అంటే ఏమిటో పీవీజీ నేర్పాడు.
ఈ గురు పూర్ణిమ నాడు
మా ప్రియ తాత, పరమ గురువు,
శ్రీ పీవీ నరసింహారావు కు
ఈ ‘అమ్మఒడి’ లోని
అక్షరక్షరమూ
అణువణువూ
అంకితం!
వ్రాసింది మేమే అయినా.... వ్రాయగల జ్ఞానాన్నిచ్చింది పీవీజీ నే
సత్యాన్ని చూసింది మేమే అయినా... చూడగల చక్షువుల నిచ్చింది పీవీజీ నే
పోరాడింది మేమే అయినా... పోరాడగల స్థైర్యాన్నిచ్చింది పీవిజీ నే!
జీవితం పట్ల దృక్పధాన్నిచ్చిందీ పీవీజీ నే
జీవిత గమ్యాన్ని నిర్దేశింప జేసిందీ పీవీజీ నే
లక్ష్య సాధన మార్గంలోకి నడిపించిందీ పీవీజీ నే!
ఈ రోజు ‘అమ్మఒడి’లో మేమనే బొమ్మలున్నాయంటే,
వాటిని చెక్కిన శిల్పి పీవీజీ నే!
"ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృత పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుటయే నా ప్రతిజ్ఞ"
అని అప్రతిహతంగా ప్రకటించిన ఆ మేరునగధీర మేధావితో
మా గురు శిష్య సంబంధం
తాతా మనుమల బాంధవ్యమై,
అదే నిండు జీవితమైంది.
మొదట తెలియక పోయినా...
అమాయకంగా ఆగ్రహించినా...
ఆధిగమించలేక అహంకరించినా...
క్రమ పరిణాములో పరిణతి చెందగా చెందగా
కొంచెం కొంచెంగా తెలుస్తూ
తెలిమబ్బుల్లోంచి తొంగి చూసే సూర్యుడిలా
జ్ఞానం హృదయాన్ని వెలిగించగా
వెలుగు నిండగా
క్రమంగా అనుభవాని కొచ్చిన సత్యమిది.
"తన కెంతో బాగా తెలిసిన
తన జీవిత పర్యంతమూ తెలిసిన
ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని
అనేక జన్మల నుంచి తన జీవనానుభూతికి మాత్రమే తెలిసిన
తన మరో సగం"
మేమేననే ప్రేమ కురిపించిన
మా ప్రియ ‘తాత’ కి
గుండెలని దండగా మార్చి
అర్పించాలన్నా.... ఆశక్తులమే!
ఈ గురుపూర్ణిమ నాడు
కురుస్తున్న ఆ చల్లని వెన్నెలలా
ఆయన ప్రేమ,
మమ్మల్ని ఇప్పటికీ చేయి పట్టి నడిపిస్తున్నట్లే అన్పిస్తుంది.
ఇంతకంటే బాగా చెప్పలేని
నిస్సహాయతతో కూడిన అక్షర నీరాజనం ఇది!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
12 comments:
ఈ దేశానికి చెందిన ప్రధాన మంత్రులో అందరికన్నా విశిష్టమైన వారు పీవీగారు. ఎంతోమంది గొప్పలు చెప్పి మోత మోగించుకున్న వారికన్నా ఆయన మహాత్ముడు, మహానుభావుడు. మీ నివాళితో బాటూ నా హృదయపూర్వక నమస్కారాలు కూడా ఆ వదాన్యుడికి.
మీరు చెప్పింది సత్యం. మనకు ఎంతో మంది గురువులు ఉన్నా పి.వి. గారు వారిలో ప్రత్యెకమైన వారు. మనిషి/ప్రజల జీవితం అన్ని రకాలు గా ప్రభావితం చేసేది ప్రభుత్వం దాని పాలన. దానిని ఇంతో సమర్ధ వంతం గా ఒక యోగిలా నిర్వహించారు. ఇక్కడ ఎందుకు పి.వి. గారిని యోగి పోల్చానంటె మనకు చాలా యోగులు వివిధ రకాల బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాని రాజకీయ రంగం నుండి వచ్చిన అది అధికార రాజకీయ పక్షం నుండి వచ్చిన అతి కొద్ది నిస్వార్ధ నాయకులలో పి.వి.గారు ఒకరు. ఆయన నిర్వహించిన పదవులకు ఆయానకు జరిగిన అవమానాలకు మరొకరైతె డిప్రెషన్ లో పడి బాలెన్స్ కోల్పోయెవారు. ఆయన ప్రతి పదవిని ఎంతో నిష్కామంగా నిర్వహించటం వలననే ఆయనకి అంత బాలేన్స్ వచ్చింది. ద్వందాలవన మనకు పార్టిలు చీలచటం లాంటివి తప్పుగా కనిస్పిస్తే ఆందులో పి.వి.గారు వ్యక్తిగతం గా బావుకున్నది ఎమీ లేదు. ఆ రోజులలో దేశ హితం కోరి ఆయన అలా చేయవలసి వచ్చింది. ఆయన మీద పెట్టిన కేసులు ఎంత పేలవమైన వో ఒకసారి చదివితె అర్థమౌతుంది. పి.వి. మాట వినకుండా స్వంత నిర్నయాలని(ప్రధాని పదవి కి ప్రయత్నించటం చేయటం లాంటివి ) తీసుకొన్న తరువాత అధ్యక్ష్యుడైన సీతారాం కేసరి కొన్నాళకు పి.వి. దగ్గరకు వచ్చ క్షమాపణలు అడగటంలో ఆయన గొప్పతనం తెలుస్తుంది. ఎన్ని అవమానాలు జరిగిన ఒక్కడే మౌనం గా భరిస్తూ (ఇతరులతో పంచుకోవటానికి ఆయనకి భర్య కూడ లేదు) అన్నిటిని తట్టుకొని హుందా గా జీవితం నుంచి నిష్క్రమించాడు. మనము రోజు చూస్తున్నాము కదా అధికారం దూరం కావటం జస్వంత్ వర్సెస్ అద్వాని ఉదంతాలని, జగన్ యాత్ర లాంటివి. పిచ్చెక్కి రోజుకక స్టెట్మెంట్ ఇస్తూ కొట్టుకున్నారు.
కాని పి.వి.గారు బెంగుళురు లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం లో ఎకనామి రిఫాంస్ దిశ గురించి ఒక పేపర్ సమర్పించారు.అది ప్రధాని పదవి పోయిన తరువాత. ఆయనని కలవటానికి డిల్లి లో ఒక సారి నెల్లూరుకి చెందిన జమీన్ రైత్ పత్రికకు డొలేంద్ర ప్రాసాద్ వెళ్ళితె చలికాలం లో ఒక హీటర్ పెట్టు కొని చాలా పుస్తకాలు ముందుంచుకొని అప్పుడె మొదటిసారి ఎంపికైన ఒక యువ యం.పి. కి పార్లమెంట్ లో ఇచ్చె స్పీచ్ ని రాస్తున్నాడని, అంత పెద్ద పదవి లోఉండి ఎమి సంపాదిచుకోక పోయినా ఆయన మీద ఇన్ని అవినితి ఆరోపణలు రావటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని మరొకరు ఆ పదవిలో ఉంటె వారి సంపాదన ఊహించలేం అనిరాశారు. అంతే కాక ఆయన పిల్లలు ఎవరైనా హైదరాబద్ నుంచి వస్తె మొదటి ప్రశ్న ఎప్పుడు వెళ్లా లనుకుంట్టునావ్ అని అడిగెవారని. పిల్లలు తనతో కలసి ఉండటం తనకు ఇష్టం ఉండేది కాదని కారణం వారి పేరు అడ్డ పెట్టుకొని అవినితి ఆరోపణలు వాస్తాయని పి.యం. గా ఉన్నని రోజులు పిల్లల్ను దూరం గా ఉంచేవాడని రాసారు.
---------------------------------
మనకు ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్ర సమయంలో ఉన్నా దానిని స్పిరిట్ ని చివరి వరకు కొనసాగించిన పి.వి. లాంటి వారు అరుదు. కళ్ళు తెరచి చూస్తె పి.వి. గారు ఒక నిజమైన గొప్ప దేశ భక్తి కలవాడు.
Sri Ram
నిజం గా ఆయన మీకు తాత వరస అవుతారా? అందరిలానే అన్నారా?
నిజం గా ఆయన మీ తాత అయితే, మీకన్నా ధన్యులెవరూ వుండరు.
చాలా సంతోషం!
Great Person, Humble character and true leader.
excellent.." vande guru para paramparam, vande 'P.V.Ji' vande namo na maha." excellent. pvji one of the best guru and best pm than any contemporarey guru and pms. he learns PRARBDAKARMA to public in his manner.no doubt he was correct person to "guru".one more time my pranams to him.
రవి గారు: మీ భావాన్ని మాతో పంచుకున్నందుకు సంతోషంగా ఉందండి. నెనర్లు!
శ్రీరామ్ గారు: మా టపాకి కొనసాగింపుగా నిండుదనాన్ని తెచ్చారు. నెనర్లు!
కృష్ణశ్రీ గారు: పీవీజీతో మా సంబంధం అనుబంధం గురించి ‘పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే టపాల మాలికలో[లేబుల్ లో], ‘ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?’ అనే టపాల మాలికలోని కొన్ని టపాలలో వివరంగా వ్రాసానండి. ఆయనతో మాది రక్త సంబంధం కన్నా గొప్పదైన భావసంబంధం! :)
అజ్ఞాత గారు: వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లండి!
rameshsssbd Garu: Well Said, Thank You.
మొదటి అజ్ఞాత గారు: ఆ వ్యక్తి[పీవీజీ కాదు] ఎలాంటిదైనా, అలాంటి తిట్లు తిట్టక పోవటం బాగుంటుంది. మీ ఆగ్రహం నాకర్ధమైంది. నెనర్లు!
మీ గురుభక్తి ప్రశంసనీయం.
'గురు పూర్ణిమ' శుభాకాంక్షలు.
కొత్త పాళీ గారు: కృతజ్ఞతలండి! :)
సత్యేంద్ర గారు: ధన్యవాదాలు! మీకు కూడా శుభాకాంక్షలు!
జె ఎం ఎం ముడుపులు కేసు, యూరియా కుంభకోణం , చంద్రస్వామి ఆరోపణలు ఉన్న పీ వీ కు మీకు మద్య ఉన్న భావ సంబందం భేష్
Post a Comment