ముందుగా భారతీయ ఇతిహాసమైన మహాభారతం నుండి ఒక సన్నివేశాన్ని వివరించి, ఆపైన ‘ఒకే అంశం’ ఏమిటో, దాని ‘విభిన్న కోణాలు’ ఏమిటో వివరిస్తాను.

ఇక మహాభారతంలోకి ప్రవేశిస్తే....

ఇది అరణ్య పర్వం లోని సంఘటన!

ద్వైత వనంలో అరణ్యవాసం చేస్తున్న, వనవాసక్లేశాలతో ఉన్న పాండవులకి, తమ భోగ భాగ్య దర్పాన్ని ప్రదర్శించి కుపితులను చేయాలనే అహంకార అతిశయాలతో, దుర్యోధనుడు, కర్ణ శకుని దుశ్శాసనులని, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని, ఘోష యాత్ర నిర్వహిస్తాడు.

మృగయావినోద విహారాల అనంతరం, సుందర సరోవరాన్ని చేరి, దాని అధిపతియైన చిత్రసేనుడనే గంధర్వునితో గొడవ పడతారు. గంధర్వులు, ఈ దుష్ట చతుష్టయాన్ని యుద్దంలో జయించి బంధించగా, ఆ వార్త విన్న పాండవులలో భీముడు...

"హా! కాగల కార్యము గంధర్వులు తీర్చారు" అంటాడు. భీమార్జున నకుల సహదేవులకు ‘కౌరవులకు తగిన శాస్త్రి జరిగిందన్న’ అభిప్రాయం ఉంటుంది. అయితే ధర్మరాజు, కౌరవులని గంధర్వుల చెర నుండి విడిపించాల్సిందిగా తమ్ములను ఆజ్ఞాపిస్తాడు. అందుకు ఇష్టపడని తమ్ములతో "మనలో మనం కలహించుకునేటప్పుడు... మనం అయిదుగురం, వాళ్ళు నూరు మంది. అయితే ఇతరులు మన మీదికి దండెత్తినప్పుడు మాత్రం, మనం నూటయిదుగురం అన్నదమ్ములం" అంటాడు.

అక్కడ ధర్మరాజు చూపిన విజ్ఞతలో.... వంశ గౌరవం పట్ల, పది మందిలో తమ కుటుంబ మర్యాద పట్ల జాగ్రత్త ఉంది. మనలో మనం ఎంత ఘర్షణ అయినా పడనీ! ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఐక్యతా, ఆత్మగౌరవం తప్పనిసరిగా పరిగణించాల్సిన అంశాలు.

ఇతిహాసాలనీ, సంస్కృతీ సంప్రదాయాలనీ, మంచీ మర్యాదలనీ... అన్నిటినీ మరిచిపోయాక, ఇలాంటి సంఘటనలే సంభవిస్తాయని నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర నిరూపించింది.

నా గత టపాలలో ఒకసారి వ్రాసినట్లుగా.... 1989లో ఒకసారి బెంగుళూరు వెళ్ళాను. [నా బ్యాటరీ తయారీ సంస్థ యంత్రపరికరాలను అక్కడి నుండే కొనుగోలు చేశాను.] అందుకు కొద్దికాలం ముందు, ఏదో రాజకీయ వ్యవహారం మీద, ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపాడు. దాన్ని ఉటంకిస్తూ బెంగుళూరులోని యంత్ర సామాగ్రి సరఫరాదారుడు, కొంత అవహేళనగా "అదేమిటి? మీ సీఎం ఎన్టీరామారావు రోడ్డు మీద పడుకున్నాడు?" అన్నాడు. అతడి నవ్వులో చాలా వ్యంగ్యం ఉంది.

చాలా అవమాన కరంగా అన్పించింది. ఇప్పుడంటే రాజకీయ నేతలు రోడ్డు మీద పడుకోవడం సాధారణమై పోయింది గానీ, అప్పట్లో ధర్నాలు మాత్రమే చేసేవాళ్ళు. మహా అయితే బైఠాయించేవాళ్ళు.

ఆ నేపధ్యంలో... ప్రక్క రాష్ట్రపు వారి పరిహాసం చాలా అవమానకరంగా తోచింది. దేశాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే - నాయకులు ఏం చేసినా, అది వారి వ్యక్తిగతంగా మిగలదు. జాతికి ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి జరిగిన అవమానం ప్రజలకి జరిగిన అవమానంగానే భావిస్తాం. వాళ్ళూ ఆ స్థాయిలోనే ప్రవర్తించాలని ఆశిస్తాం.

నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర విషయంలో కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత అసహ్యకరం. పార్టీలు ఏవైనా సరే, రాజకీయాలు ఏవైనా సరే, ఇది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం!

నిజానికి, కలిసికట్టుగా.... ప్రాజెక్టులు, మౌలిక వసతులు, నీటి వనరులు, ప్రకృతి సంపద వినిమయాలు సాధించుకోవలసిన చోట... పార్టీలు, ప్రజలు, చీలికలూ పీలికలూ అయ్యి, అనైక్యత కారణంగా దగా పడటం ఓ ప్రక్కన నడుస్తుండగా.... మరో ప్రక్క ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినందుకు "కుళ్ళ బొడిచి వెళ్ళ గొట్టటం" ఎందుకు?

ఈ విషయంలో ప్రక్కనున్న తమిళులు మన తెలుగు వాళ్ళ కంటే మెరుగ్గా వ్యవహరిస్తారు. వాళ్ళల్లో వాళ్ళకి, ఒకటికి నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉండనీ గాక! వాళ్ళల్లో వాళ్ళు అధికారం కోసం కాట్లాడుకోవచ్చు గాక! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అయితే, మరికొంత ఎక్కువ ఆత్మగౌరవంతోనూ, మరికొంత ఎక్కువ ఐకమత్యంతోనూ ప్రవరిస్తారు.

కాబట్టి మన కంటే ఎక్కువ ప్రాజెక్టులూ, పరిశ్రమలనీ, అభివృద్దినీ సాధించు కోగలిగారు. అయితే అదీ, మరికొంత అవధులు మీరి ‘తమిళ జాతీయ గీతం’ ఆలపిస్తామనే దగ్గరికి రావటం ప్రమాదకరం. ‘అన్నిట్లోంచి డిస్ అడ్వాంటేజ్ రావటం’ అనే ప్రక్రియకి ఇది మరొక ఉదాహరణన్న మాట!

ఇక తమిళుల మాట అటుంచితే.... ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకున్నాడని కన్నడిగులు అవహేళనగా అంటే, తెలుగు వారిగా నేనూ, మా నాన్న, అవమానం మాకే జరిగినట్లుగా అనుభూతించాము. మా పరిస్థితిలో ఎవరు ఉన్నా అలాగే అనుభూతిస్తారు. పరిస్థితులు అలాగే దారితీస్తాయి.

బాబ్లీ వ్యవహారంలో చంద్రబాబు బృందం ‘తన్నులు తినడం’ తెలుగు వాళ్ళగా మనకెంతో అవమానకరంగా ఉంటుందో, ‘రాష్ట్రానికొచ్చిన వాళ్ళని తన్ని పంపించడం’ సామాన్య మరాఠాలకు అంతే అవమానకరంగా అన్పిస్తుంది. ఇంటికొచ్చిన వాళ్ళని తన్ని పంపినంతగా! శివసేన గట్రా పార్టీలు సమీకరించిన కార్యకర్తలని మినహాయిస్తే సామాన్య మరాఠాలు అలాగే భావిస్తారు.

శివసేన కార్యకర్తలకి ఉద్యోగార్ధులని సైతం తన్ని పంపటం అలవాటే! అందుకోసమే డబ్బివ్వబడినప్పుడు, అలాగే చేసేందుకు వచ్చిన కిరాయితనం అది! డబ్బిస్తే ఇక్కడి తెరాస కార్యకర్తలూ, ఇతరులూ చూపించే కిరాయితనం కూడా అదే! అందుకే... ‘సంస్కృతీ ధర్మాలు మరిచిపోయిన పరిణామం ఇది’ అన్నాను.

ఇప్పుడు... ప్రక్క రాష్ట్రాల్లో, దేశాల్లో... ఎవరైనా సరే, ఏ తెలుగు వాడినైనా సరే, ‘మీ మాజీ ముఖ్యమంత్రినీ, [ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సీ. లని] ప్రక్కరాష్ట్రం వాళ్ళు కుళ్ళ బొడిచి వెళ్లగొట్టారట కదా!’ అంటే - ఎంత అవమానంగా ఉంటుంది?

సరే! కుళ్ళ బొడిచి వెళ్ల గొట్టటం మరాఠీలు పాటించే అతిధి మర్యాద, గృహస్థ ధర్మం అనుకుందాం. [నిజానికి దీన్ని మరాఠా ప్రజలకి అంటగట్టడం అనవసరం. అశోక్ చవాన్ ఆజ్ఞలు పోలీసులు పాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆజ్ఞను చవాన్ పాటించాడు. అంతే! ఇందులో ఉన్న అసలు కారణాలు, అంతర్గత పోరులని తర్వాత ముచ్చటిద్దాం.]

కనీసం వాళ్ళ ’మర్యాద లేని తనాన్ని’ తెలుగు వాళ్ళు తిప్పి కొట్టారు అన్పించుకున్నా కొంత గౌరవంగా ఉంటుంది. అలాంటి చోట, ప్రజలకు ప్రతినిధుల మని చెప్పుకునే రాజకీయ రాక్షసుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంది?

ఎర్రపార్టీల చికెన్ నారాయణ, రాఘవులు, రోజూ వారీ దిన చర్య అన్నంత యాంత్రికంగా, మీడియాకి ఒక ప్రకటన వదిలి గమ్మునుంటున్నారు. చంద్రబాబు గతంలో ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు. అతడు తప్పులే చెయ్యనీ, ఒప్పులే చేయనీ. కానీ అతడు, అతడి బృందం ప్రజాప్రతినిధులు. ప్రజా సమస్య మీదే ప్రక్క రాష్ట్రానికి వెళ్ళారు.

వాళ్ళ స్వంత పని మీద కాదు. వ్యక్తిగత విహారాలకీ కాదు. నదిపైన [అక్రమ కట్టడమో, కాదో,] బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడటానికి వెళ్ళారు. చూస్తే ఏమవుతుంది? ఎటూ వీళ్ళు నిర్మాణం ‘అక్రమం’ అంటారు. వాళ్ళు కాదు ‘సక్రమం’ అంటారు. వెరసి ఇరు పక్షాలూ కాస్సేపు మీడియాలో గోల చేసుకున్నాక, ‘విషయం కోర్టులో ఉంది ఆనక మాట్లాడుకుందాం’ అంటారు. ఆపాటి దానికి ఎందుకింత ‘కిరాతకం’ జరిగింది?

ఈ పాటి కిరాతకం గురించి, ఎందుకు ఎర్రపార్టీల జాతీయ నాయకత్వం కిమ్మనటం లేదు? రాష్ట్రస్థాయి నాయకుల రోజు వారీ మొక్కుబడి ప్రకటన తప్పితే... ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరీ, బర్డన్ గట్రాల కంఠాలు విన్పించటం లేదెందుకని?

ఒకప్పుడు.... 1984 లో ఆగస్టులో [తమ అంతర్నాటకాన్ని అతి సమర్ధంగా రక్తికట్టిస్తూ] రామ్ లాల్, నాదెండ్లలు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే... జాతీయ పార్టీల అగ్రనాయకులందరూ హైదరాబాద్ కు పరిగెత్తుకు వచ్చి ఇందిరాగాంధీని ఎండగట్టారే?



అలాంటిది... చంద్రబాబు నాయుడిని, ఇతర ప్రజా ప్రతినిధులనీ, ఆడా మగా అన్న తేడా కూడా లేకుండా కుళ్ళ బోడిచినా, క్రింద పడేసి ఈడ్చుకు పోయినా, తోసుకు పోయి బండ్లలో కూలేసినా, నీరు నిప్పులూ లేకుండా మాడ్చినా, బండబూతులూ తిట్టినా, డబ్బూ దస్కం నగా నట్రా లాక్కుని, సెల్ ఫోనులూ విరగ గొట్టినా.... "ఏమిటీ ఆరాచకం? ఇదేం ప్రజాస్వామ్యం?" అని ఒక్కరు గాక పోతే ఒక్కరూ, నేటి కాంగ్రెస్ అధిష్టానం అయిన ఇటలీ గాంధీని అడగ లేక పోతున్నారేం?

ఎన్టీఆర్ బర్తరఫ్ నాడు ఎర్ర పార్టీలూ, భాజపా తో సహా జాతీయ నాయకులందరూ, మీడియాతో కలిసి ఐక్యంగా అరిచారే? మరిప్పుడు మాట్లాడటం లేదేందుకు? ఆనాటి ఇందిరాగాంధీకి ఈనాటి ఇటలీ గాంధీకి ఏమిటి తేడా?

గత ఏభై ఏళ్ళుగా ఎప్పుడూ ఇలాంటిది చూడలేదంటున్నారు దేవెగౌడ, వెంకయ్య నాయుడూలు! ఎమర్జీన్సీలో కూడా ఇలాంటివి జరగలేదు. ఎమర్జన్సీని ‘మాయని మచ్చ’ అనీ, ‘చీకటి రోజులు’ అనీ, గొంతు చించుకునే మీడియా, జాతీయ పార్టీల అగ్రనాయకులూ, ఈ అప్రకటిత ఎమర్జీన్సీని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామికంగా తగల బెట్టడాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?

ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే! ప్రక్కనున్న మహారాష్ట్రలో ఉన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే! కేంద్రంలో ఉన్నదీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వమే! అందునా చంద్రబాబు బృందం బాబ్లీ యాత్ర చేపట్టాక... ఇటు రోశయ్య, అటు మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, ఒకేసారి ఢిల్లీ వెళ్ళారు. అధిష్టాన దేవతని కలిసి మాట్లాడి వచ్చారు. ఎవరి పైకారణాలు[over leaf reasons] వాళ్ళు చెప్పారు గాక, కలిసి కట్టుగా ఉమ్మడి వ్యూహం రచించుకుని, ఎవరి పాత్ర వాళ్ళు పోషించినట్లుగా, ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజా ప్రతినిధులని చితక బాదారు.

>>> "ఏరా మీకు నీళ్ళు కావాలా? నీళ్ళడిగితే తన్నులు తప్పవురా....? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటార్రా....? తన్నులు కావాలా? బస్సులెక్కుతారా?" అంటూ మరాఠీలో బండబూతులు తిడుతూ లాఠీలతో పైశాచికంగా దాడి చేశారు. - ఈనాడు వార్త.

కేవలం ఒక ప్రాజెక్టును చూస్తామంటే ఇంతగా తన్నాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళేం టెర్రరిస్టులా! బాంబు వేస్తారా? మహారాష్ట్ర కు వెళ్లటానికి పాస్ పోర్టు వీసాలక్కర్లేదని అందరికీ తెలిసిందే, అందరూ అంటున్నదే! అసలు బాబ్లీ ప్రాజెక్టుని చూసినంత మాత్రాన ఏమవుతుంది?

వీళ్ళ దృష్టి సోకి నంతనే అది తునాతునకలైపోదు కదా! అందులో ఉన్న అక్రమాలని కనిపెట్టి బయటపెడతారు అనటానికీ లేదు. అదే చంద్రబాబు లక్ష్యమైతే... అక్కడి విలేఖరుల/అధికారులని లోబరుచుకుంటే చాలు! ఎవరి నిజాయితీకైనా ఒక రేటుంది అనుకునే రోజుల్లో... బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అదీగాక, బాబ్లీ నిర్మాణం చేపట్టిన సోమా కంపెనీ లో ఒక తెదేపా నేత డైరెక్టర్ గా ఉన్నాడంటున్నారు. సదరు తెదేపా నేత కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ లో డైరెక్టరు, అతడికి దూరపు బంధువు. అలాంటి చోట బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అలాంటి చోట... చంద్రబాబు బృందం ప్రాజెక్టును చూస్తే చవాన్ కి పోయేదేమీ ఉండదు. చంద్రబాబుకు వచ్చేదీ ఉండదు. మరి అయినా, ఎందుకు, ఇంత అమానుష, అమర్యాద కాండ నడిచింది?

ఇందులో అసహ్యకరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - తెదేపా తప్ప, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ, రాజకీయ నాయకులందరూ, దీన్ని రాజకీయంగానే చూడటం, రాజకీయాలే మాట్లాడటం!

తెరాస, ప్రరాపాలు కాంగ్రెస్ అధిష్టానం జేబులో బొమ్మలు. పొరపాటు, కుర్చీ మహిళకి జేబులుండవు కదా! అందుచేత పర్సులో బొమ్మలు! నిజానికి ‘ఏమాత్రం స్త్రీత్వం కనబడని అధిష్టాన నాయకత్వం’ అన్న విషయాన్ని.... స్త్రీ పురుష బేధం లేకుండా ప్రజాప్రతినిధులని Man handle చేయటంతో నిరూపించుకున్నదీ ఇటలీ మహిళ!

అదేదో వ్యక్తిగత ద్వేషం ఉన్నంత భారీ పరిమాణంలో, గురి పెట్టుకుని నిర్వహించినట్లుగా, కుళ్ళ బొడవాల్సిన అవసరం చవాన్ కి గానీ, మరొకరికి గానీ ఎందుకుంటాయి? "మరి సోనియాకి అయినా ఎందుకుంటాయి?" అనుకుంటున్నారేమో! ఉంటాయి. ఎందుకుంటాయో ఈ టపాల మాలికలోనే వివరిస్తాను.

ఇక, తెరాస, ప్రరాపా ల ప్రలాపాలనీ, కాంగ్రెస్ పనికి మాలినతనాన్నీ, లజ్జా రాహిత్యాన్నీ పరిశీలిద్దాం.

ఉప ఎన్నికలలో లబ్ది పొందటానికి చంద్రబాబు ఇదంతా చేసాడు - తెరాస కేసీఆర్ వ్యాఖ్య!

నిజానికి ఇప్పుడు ఉపఎన్నికలలో జరుగుతున్న 12 స్థానాలు, ముందుగా కూడా తెదేపా వి కావు. అవి తెరాసావి, ఒకటి భాజపాది. ఇప్పుడు కొత్తగా పోయే సీట్లేవీ లేవు. అదీగాక, ఒకవేళ తొక్కలోవి ఆ 12 సీట్లు గెలిచినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదు. అవి గెలిస్తే ఇప్పటికిప్పుడు అధికారం రాదు. అందుకోసం ఇంతగా ‘తన్నులు’ తినాల్సిన అవసరం లేదు.

అదీగాక, ఈవీఎం లుండగా ఎన్నికల గెలుపు, ఈ రాజకీయ డ్రామాలతో సిద్దించదు. ‘తన్నులు తినాల్సి వస్తుందని చంద్రబాబు అనుకోలేదు’ అంటారేమో ఎవరైనా! ఇంతగా తన్నులు తినాల్సి వస్తుందను కోకపోయినా, లోతట్టున మరుగుతున్న వ్యవహారం రీత్యా, చంద్రబాబు అవగాహన చంద్రబాబుకి ఉంది.

అలాంటప్పుడు.... కేవలం ఉప ఎన్నికలలో 12 సీట్లు గెలవటం కోసం చంద్రబాబు ఇదంతా చేసాడన్న కేసీఆర్ వాదనకి విలువ లేదు. ఇక బాబ్లీలాగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు రాడు? అంటూ కేసీఆర్ పాయింట్ లేవనెత్తాడు. రాని దాని సంగతి ఎందుకు? వచ్చిన విషయంలో ఏపాటి వత్తాసు వచ్చారు కేసీఆర్, భాజపాలు చంద్రబాబుకి?

నష్టం, తెలంగాణాకి కావచ్చు, మరో జిల్లాలకి కావచ్చు, మొత్తంగా అది మన రాష్ట్ర సమస్య! తెలుగు వాళ్ళ గౌరవానికి సంబంధించిన సమస్య! మన వాళ్ళ పట్ల మహారాష్ట్ర పోలీసుల అమర్యాద, జులుంల గురించి వార్తలొచ్చాక కూడా, ఇదే కుతర్కం, ఇదే కుటిల రాజకీయాలు మాట్లాడటం ఎంత నీచం?

ఇటు గీతా రెడ్డిలు, ఇతర మంత్రులూ, అందరూ, ఎంత లజ్జా రాహిత్యాన్ని చూపించారంటే - ఎక్కడ అధిష్టానానికి తమ మీద కోపం వస్తుందో, దెబ్బకి తమ పదవులు, కెరీర్ లేచి పోతాయేమో అన్న భయాన్ని నిలువునా ప్రదర్శించారు. అసలుకే వాళ్ళ ఉద్దేశంలో అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచి పోతాయయ్యే మరి! దాదాపుగా యజమాని పాదాలను నాకుతున్న కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎంత నిస్సిగ్గుగా "ఛాయ్!" మన్నా తోకాడిస్తూ దగ్గర కొస్తాయో, అంతకన్నా ఎక్కువ లజ్జా రాహిత్యాన్నే చూపెట్టారు.

"మనలో మనం ఎంతగానైనా కలహించుకోవచ్చుగాక! ఇతరులు మన మీదికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే" అనే తెలుగు దనం కాదు గదా, కనీస పాటి ‘మనిషి తనం’ కూడా లేదు కాంగ్రెస్ లో!

ఇంకా ప్రజలే... వ్యక్తిగతంగా ఇళ్ళల్లో టీవీల ముందు కూర్చొనో, సామూహికంగా రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్ లు చేసో, దిష్టి బొమ్మల్ని తగలేసో... తమ ఆక్రోసాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తీ కరించారు. తమ ఆత్మ గౌరవాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

ప్రజలు కూడా కాంగ్రెస్ మంత్రుల్లాగే ఉంటే.... కాంగ్రెస్ అధిష్టానం "అవును. మీరంతా నా పాద దాసులు! కుక్కిన పేనుల్లా, చచ్చిన దోమల్లా పడుండండి" అని బహిరంగంగా హుంకరించినా ఆశ్చర్యం లేదు.

"పాక్ లో సైనిక ప్రభుత్వం తమని తాము ప్రకటించుకున్నప్పుడు, అక్కడి బేచారాలు ఏం చేయగలిగారు? ఇక్కడైనా అంతే!" అనుకోగలరు సోనియాలు, ఆమెని నడిపే గూఢచార ఏజన్సీలు!

నిజానికి... ఓదార్పు యాత్ర పేరిట వై.యస్. జగన్ శిబిరానికీ కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఒక అంతర్లీన పోరు నడుస్తోంది. ఆఫ్టరాల్ ఓదార్పు యాత్ర చేస్తే ఏమవుతుంది? చేసినా ఏమవలేదు కదా? మరి అధిష్టానం ఎందుకంతగా వద్దని పోరింది? ఆ పేరిట వాళ్ళ మధ్య నడిచిన సంకేత భాష వేరు. అంశం ఒకటే!

అలాగే... బాబ్లీ యాత్ర పేరిట చంద్రబాబుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య అంతర్లీన పోరు నడుస్తోంది. అంశం ఒకటే! ఇవి దాని విభిన్న కోణాలు, అంతే! రానున్న రోజుల్లో ఆ అంశం, దాని విభిన్న కోణాలు కూడా, మనకి ప్రస్ఫుటంగానూ, బహిరంగంగానూ దృగ్గోచరం అవుతాయి. వేచి చూడటం, జరుగుతున్న పరిమాణాలని నిశితంగా పరిశీలించటమే ప్రస్తుతం మనం చేయగలిగింది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

12 comments:

well said

1. With this Telangana people may end KCR's false carrier.

2. It looks like Sonia leading India towards Balkanization

3. At one more time this incident show how dangerous is Congress (headed by foreign elements) for the country and majority people

4. This incident shows Telugu people has no shame. They send most MP's (for Congress Party) to center get little for the state.

5. Some Caste's in the state may be celebrating now. Those Castes are behind Congress traditionally.

6. This show's that there is no safety for Indian Citizens in states like Maharastra and Kashmir and North East.

7. What you think, what should be the response from Andhra People (in short term and in long term)

8. Can we avoid the trap set by Sonia to divide majority people into small waring groups? Read the history for India during 17th, 18th centuries. Marathas, Rajputs, Sikhs, Mysore and Tamils. Desperate waring groups helped British control and rule India.

తెలుగు వాడి ఆత్మగౌరవం లాంటి మాటలు అవసరం లేదనుకొంట .బాబ్లి గొడవ ఇప్పుడెందుకు గుర్తుకోచ్చిందో బాబు గారు చెప్పగలరా ?
బాబ్లి సాంకేతికంగా అలమట్టి కంటే నష్టం చేస్తుందా ? ప్రతి సంవత్సరం కృష్ణా ,గోదావరి నదుల్లో నీరు ఎంతవుంటుంది ?
రాజకీయ నాయకులకి ఈ విషయాలు తెలుసు కాబట్టే అవసరానికి వీటిని వాడుకొంటున్నారు ?
తెలుగు జాతి ,ఆత్మగౌరవం ,లాంటి వి ఎ ఒక్క పేదవాడి ఆకలి తీర్చ గలదా ?
తమిళ వారిది దురభిమానం కావచ్చు .రాజకీయులు చేసే విన్యాసాలకు మీడియా ప్రాధాన్యత ఇస్తే
ఇవ్వవచ్చు కాని సమస్య పరిష్కారానికి వీళ్ళు చేసేది ఏమి లేదని ప్రజలు ఎప్పుడో గ్రహించారు
జలయజ్ఞం లో అవినీతి గురించి రాజకీయ నాయకులూ ఆలోచిస్తారు కాని ప్రజలు అవి ఎప్పుడు పూర్తిచేస్తారా అని
మాత్రమె చోస్తారు .చంద్రబాబు యాత్ర చేసి దెబ్బలు తింటే ప్రాజెక్ట్ ఆగిపోతుందని అనుకోనేంత పిచివాళ్ళు కారు
ప్రజలు .నమ్మకం పోయాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాజెక్ట్ ఆగదని అలమట్టి విషయంలోనే తేలింది
తొందరగా మనం కూడా ప్రాజెక్ట్ లు కడితే పోతుంది .అవినీతి అన్నిట్లో ఉంది .ఆమాటకొస్తే మద్యం ఎక్కువగా
అమ్మించి ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యం విషయంలో అవినీతిమయమైనప్పుడు ఎంత త్వరగా వనరులు కల్పించ్కొంటే
అంత మంచిది .
శ్రీనివాస్

రోడ్ పై పడుకోవటం మొండి వారు చేసె పని.. కొంచెం చవక బారు గా అనిపిస్తుంది.. ఇన్నాళ్ళూ లేని యాత్ర.... బాబు కి ఆ 12 సీట్లు రాక పోతే ఏం పోతుంది అన్నారు కదా... ఈ పని చెసి ఉండక పోయి ఉంటే రాను రాను తెలంగాణ లో తెలుగు దేశం ఉండేది కాదు... ఏమీ జరగబోదు అన్నట్ట్లే చెప్పారు... మొదటి సారి ఆందోళన కి మీ మద్దతు కాదు అనిపిస్తుంది.. బయట వాళ్ళు ఇలా చేశారు ...మన వాళ్ళు పట్టించుకోలేదు అనేది మీ ఆవేదన లా ఉంది... పర్మిషన్ లేకుండా వివాదాల్లో ఉన్న ప్రాజెక్ట్ ని చూసొస్తాం అంటూ వెళ్ళడం...అదీ బస్సు లో... ముందె అందరికీ టాం టాం చేసి..వెళ్ళటం... ఏ మాత్రం సమాచారం ఉన్నా పోలీసులు తమ పని తాము చేయాలి... అనేది వారి ప్రథమ కర్తవ్యం... వీళ్ళ టాం టాం... తెలిసి వాళ్ళు అరెష్ట్ చేయరా ? ....9 ఏళ్ళు ముఖ్య మంత్రి గా పని చేసిన వ్యక్తి... పర్మిషన్ లేకుండా వెళ్ళి ... ఎదైతే అది అయ్యింది అన్నట్ట్లు "రోడ్ పై పడుకోవటం" లా చేయటం చవక బారు తనం కాదా ?

>>దాదాపుగా యజమాని పాదాలను నాకుతున్న కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో, >>ఎంత నిస్సిగ్గుగా "ఛాయ్!" మన్నా తోకాడిస్తూ దగ్గర కొస్తాయో, >>అంతకన్నా ఎక్కువ లజ్జా రాహిత్యాన్నే చూపెట్టారు.

కుక్కలని అవమానిస్తున్నారు. వాటికి విశ్వాసం ఉంది. వీళ్ళు అసలు క్రిమికీటకాదులకన్నా ఘోరం.

Comments by ...

తొందరగా మనం కూడా ప్రాజెక్ట్ లు కడితే పోతుంది. శ్రీనివాస్

Answer: Maharastra and Karnataka are trying to stop water flow into Andhra Pradesh. Did it make any sense to say "తొందరగా మనం కూడా ప్రాజెక్ట్ లు కడితే పోతుంది". If there is no water, what you do by constructing projects? It is pure idiocy. Stop living in fools paradise.


Krishna said... July 21, 2010 7:44 PM పర్మిషన్ లేకుండా వివాదాల్లో ఉన్న ప్రాజెక్ట్ ని చూసొస్తాం అంటూ వెళ్ళడం...
Answer: What kind of permission are you talking about? Openly and publicly group of people want to inspect a public works project. Any citizen of India can freely move any where in India. If there are any local zone restrictions (construction related), they should prevent them to go near the site. But mercilessly beating MLA's and MP's is not acceptable. They are not street Rowdies or Goondas. Are you justifying the actions by Maharastra government? Your self induced biases towards Babu are evident.

బహుశ, మధ్యంతర ఎన్నికలకు సూచన కావచ్చు! ప్రాంతాల/రాష్త్రాల మధ్య చిచ్చులు కావచ్చు! రాజకీయ శక్తుల/గ్రూపుల మార్పులు కావచ్చు! ప్రజల ఫొకస్ మార్చడం కావచ్చు! ఆత్మగౌరవానికి టెస్ట్ కావచ్చు!

దెబ్బలు తిన్న వారు ఆసుపత్రికి పోకుండా టీవీ ల ముందుకు రావడం ఏమిటో? ధాకరే, మాటలు ఎంతవరకు నిజమో? చవాన్ (ఆంధ్రా) ప్రయాణం విరమించు కొవడం ఏమిటో? ఏ 'పుట్ట'లొ ఏ ముందొ? కాలమే చెప్పాలి. 'సత్యం తప్పక తెలుస్తుంది' అని నమ్ముతునాను .

ఆదిలక్ష్మి గారు, నా ఆలొచనా/పరిశీలనా పరిధిని పెంచుతునారు. ధన్యవాదాలు.

http://meeandarikosam.blogspot.com/2010/07/250000.html

Good one!
Srinivas / Krisna, you showed your face!!
--Raja

నీళ్ళు లేకుండా ప్రాజెక్ట్ లు ఎందుకు ? దండగ అని మీ అభిప్రాయం కావచ్చు .కాని ఇతర రాష్ట్రాలు కట్టిన ,లేక కట్టబోయే ప్రాజెక్ట్ ఆపే శక్తి ఎవరికుంది ?
సుప్రీం కోర్టు కి అంత పవర్ ఉందా ?నిజంగా ఆపగలద ?నీళ్ళ వాటాల్లో కొలిచినట్టుగా క్లియర్ గా ఎక్కడా వ్రాసుకోలేదు ? జాతీయ భావన పోయాక
ప్రాంతీయ భావన పెరిగాక ప్రాజెక్ట్లు ఆపడం ఎవరి తరము కాదు .కనీసం వరదలు వచ్చినప్పుడైనా దిగువన ఉన్న మనం నీళ్ళని సక్రమంగా వాడుకోవచ్చేమో ?
మన రాష్ట్రం లో అన్ని ప్రాజెక్ట్ లు అన్ని సంవత్సరాల్లో నిండుతున్నాయ ?
డబ్బు రైతుల కోసం ఖర్చ్ పెట్టాల్సి వచ్చే సరికి దండగ గా ప్రతి ఒక్కడికి అనిపిస్తోంది ?
గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న డబ్బులో ఎంత వనరులు సృష్టిమ్చుకోవాలో అంత చేసుకోవాలి గాని ,మనం వేరే స్టేట్ వాళ్ళని ఏమి చెయ్యలేము .
మనం ఎంత గొడవ చేసిన రాష్ట్ర అభివృద్ది మినహా మనల్ని కాపాడేది ఏదీ లేదు .వ్యవసాయం అభివృద్ది కాకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు అనుమానమే
వేరే వాళ్ళని మనం అడిగినా మానుకోరని తెలిసి ఏమీ చెయ్యకుండా కూర్చునే బదులు తొందరగా వనరులు సమకూర్చుకొనడం మంచిదని నా అభిప్రాయం
మనం ఎవరో ఇతరులకి తెలియనప్పుడు సహజంగా విమర్శలు వస్తాయి .వాటిని పట్టించుకోనని సవినయంగా తెలుపుతున్నాను
శ్రీనివాస్

శ్రీనివాస్: Your explanation has some logic in it. You have to further improve it.

Irrigation/Water projects and related problems/solutions are not what you think in your mind alone, but they are complex and needs rational solutions. Expert advise is called for in those matters.

It is not simply to say "తొందరగా మనం కూడా ప్రాజెక్ట్ లు కడితే పోతుంది".

What do you mean by "తొందరగా" in that sentence. Don't you think that is childish?


Do you know that irrigation/water projects take 10-50 years in this country because of 1) lack of funds, 2) Political & Bureaucratic corruption, 3) other reasons

వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu