మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయాన్ని మేం అసలు వూహించని రోజుల్లో, మాకెదురైన కష్టనష్టాలని, మాపై వేధింపుగా మేం గుర్తించలేదు. విధి అనీ, నుదిటివ్రాత అనీ అనుకున్నాము. దాన్నుండి దాటటానికి ‘గీత’నే ఆధారంగా తీసుకున్నాము. అదీగాక, 1992 కు ముందర, బ్యాటరీ తయారీ సంస్థ నడుపుతున్న రోజుల్లో సైతం, నాకు ’గీత’ మీద ఆధారపడటం అలవాటే.

ఆ క్రమంలో గీత మాకు అర్ధమైన తీరు ఏమిటంటే –

గీతలో, భగవంతుడు, కర్తవ్యవిముఖుడై చతికిలబడిన అర్జునుణ్ణి, పలురకాలుగా కర్మోనుఖుణ్ణి చేస్తాడే గానీ ’నేను చెబుతున్నాను. ఇలా చెయ్యి’ అనడు. చెయ్యి పట్టుకు లేపి నిలబెట్టడు.
అర్జునుడు

శ్లోకం:
గురూ నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే
హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్

భావం:
మహానుభావులూ, వృద్ధులూ అయిన భీష్మద్రోణాదులను చంపేకంటే భిక్షాటన చేయడం మేలు. కాగా, అర్ధకామముల కోసం, గురువులను చంపి, ఆ రక్తపు తిండినీ, హత్యాభోగాలనూ నేనెలా అనుభవించగలను?

అంటూ దుఃఖంతోనూ

శ్లోకం:
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ యదివానో జయేయుః
యానేవ హత్వా న జిజీవిషామ స్తే౨ వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః

భావం:
యుద్దమే చేసినా, మనం గెలుస్తామో, వాళ్ళే గెలుస్తారో! ప్చ్….. ఎవరిని చంపుకోవడం వలన, మనకు జీవించాలనే కోరికే నశించిపోతుందో – అటువంటి ధార్తరాష్ట్రులే కదా యెదటి పక్షంలో ఉన్నది!

అంటూ సంశయంలోనూ, పడిపోయి సాక్షాత్తు తానే

శ్లోకం:
కార్పణ్య దోషోప హత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః
యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భావం:
ఈ రాజ్యలోభ, బంధులోభాలతో, దెబ్బతినిన నా మనస్సు , ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. నిన్నడుగుతున్నాను. నేను నీ శిష్యుణ్ణి. నా కేది మంచిదో అది నువ్వే చెప్పు.

అని అడిగినా, శ్రీకృష్ణుడు…..అన్నీ చెప్పి

శ్లోకం:
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా
విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు

భావం:
అతి రహస్యమైన జ్ఞానాన్నంతటినీ నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ యిష్టం వచ్చినట్లు చెయ్యి.

అని చెబుతాడు.

చివరగా నరుడు తన ’యధేచ్ఛ’ని ఉపయోగించి నిర్ణయించుకోవాలన్న మాట, మంచి చేయాలో, చెడు చేయాలో! అధర్మం వైపు ఉండాలో, స్వధర్మం నిర్వహించాలో కూడా, ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చన్న మాట!

ఇంతగా….. “మంచి వైపుంటావో, చెడువైపుంటావో [తటస్థం లేదు] నీవే నిర్ణయించుకో”, అనే శ్రీకృష్ణుడు, ’సకర్మ’ ఏదో, ఎంత నిర్భయంగా ప్రతీవ్యక్తి తన స్వధర్మమైన ఆ ’సకర్మ’ని ఆచరించ వచ్చో, విడమర్చి చెప్పాడు. అర్ణునుడికి చెప్పిన ప్రతిమాట…. ప్రతీవ్యక్తికీ చెప్పినట్లే! ప్రతీవ్యక్తీ తన జీవితానికి అర్జునుడే. ప్రతీవ్యక్తికీ తన జీవితకాలంలో, గీతలో అర్జునుడికి వచ్చిన ధర్మసందేహాలు వస్తాయి. కాకపోతే మనకి అవగాహన లేక పట్టించుకోం. అంతే!

తటస్థంగా ఉండటం అన్న కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే తటస్థంగా ఉండటం అంటే ఒకరకంగా చెడును ప్రోత్సాహించటమే.
ఇక, భయంకర విషాదంతో
శ్లోకం:
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగై ర్జీవితేన వా

భావం:
నేను విజయాన్ని కోరటం లేదు. రాజ్యాన్ని గానీ, సుఖాన్ని గానీ కోరటం లేదు. [బంధువలందర్నీ చంపుకున్నాక] రాజ్యమెందుకు? భోగమెందుకు? అసలీ జీవితం యెందుకు?

అని కూలబడిన అర్జునుడికి…. శ్రీకృష్ణుడు

1]. యుద్ధం చేయకపోతే నిన్ను పిరికి వాడంటారు. అపకీర్తి కలుగుతుంది. పరిహాసం పాలు అవుతావు అంటూ ఉన్న పరిస్థితిని వివరిస్తాడు. చూడండి,

శ్లోకం:
అథచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తత స్స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి

భావం:
ధర్మబద్దమైన యీ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే యశో ధర్మభ్రష్ఠుడవూ, పాపివీ, అవుతావు.

శ్లోకం:
ఆకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే2వ్యయాం
సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే

భావం:
నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమాన ధనులకి అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా.

శ్లోకం:
భయాద్రణా దుపరతం మంస్యన్తే త్వాంమహారథాః
యేషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్

భావం:
ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే, ఇంతవరకూ నిన్ను గౌరవిస్తున్న సాటి క్షత్రియులంతా నిన్నో పిరికివాడిగానూ, చులకన గానూ చూస్తారు.

శ్లోకం:
అవాచ్య వాదాంశ్చ బహూ స్వదిష్యన్తి తవాహితాః
నిందంత స్తవ సామర్ధ్యం తతో దుఃఖతరం ను కిమ్

భావం:
నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలంటారు. అంతకన్న దుఃఖ భూయిష్టమైనది వేరే యింకేం ఉంటుంది?

2]. యుద్ధం చేస్తే గెలుపోటముల పట్ల సంశయపడిన అర్జునుడి లో రణోత్సాహాన్ని, రజోగుణాన్ని ఎలా ప్రేరేపించాడో చూడండి.

శ్లోకం:
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః

భావం:
అర్జునా! యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. గెలిస్తే యీ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక, యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడవై, లే!

3]. అంతేకాదు. యుద్ధం చేస్తే వచ్చే ఫలితం గురించిన సంశయం నీకు అవసరం లేదు. సమబుద్ది కలిగిఉండు అని స్పష్టంగా చెప్పాడు.

శ్లోకం:
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగో స్త్వ కర్మణి

భావం:
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగాని, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు.

శ్లోకం:
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

భావం:
లాభాలాభాల పట్ల మోహరహితుడవై, యోగబద్దుడవై, కార్యసిద్ధి కల్గినా, కలుగకున్నా సమబుద్ధి గల్గి నియతమైన కర్మలను ఆచరించు.

4]. “ఇక బంధుప్రీతితో దుఃఖిస్తున్నావు కదూ! ఈయుద్ధంలో నీవు చంపకున్నా బ్రతుక గలవారు ఇందెవ్వరూ లేరు” అని సత్యాన్ని కళ్ళ ముందు నిలబెడతాడు.

శ్లోకం:
కాలో౨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే౨పి త్వాం న భవిష్యంతి సర్వే యే౨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః

భావం:
ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప, మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవడు కూడా మిగలడమనేది అసంభవం.

5]. నీవు నిమిత్తమాత్రుడివి. కాబట్టి నీ పని నువ్వు చెయ్యి అని చెబుతాడు.

శ్లోకం:
తస్మాత్త్వముతిష్ఠ యశో లభస్వజిత్వాశత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్ఠాః యుధ్యస్వ జేతా౨సి రణే సపత్నాన్

భావం:
కాబట్టి, అర్జునా! లే! యుద్ధానికి సిద్దంకా! శత్రుసంహారం చేసి ఆఖండ భూమండలాన్నీ అనుభవించు. వీళ్ళంతా నా చేత పూర్వమే చంపబడ్డట్టుగా భావించి – నీవు నిమిత్త మాత్రుడిగా యుద్ధం చేసి కీర్తినార్జించు.

శ్లోకం:
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథా న్యానపి యోధవీరాన్
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్టాః
యుధ్యస్వ జేతా సి రణే సపత్నాన్

భావం:

ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదివీరులందర్నీ నేను పూర్వమే చంపివేశాను. నాచేత చచ్చినవారినే నువ్విప్పుడు చంపబోతున్నావు. ఆధైర్యం మాని, యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.

6]. నీవు చూసేది శరీరాన్ని. అది ఛస్తూ మళ్ళీ పడుతూ ఉంటుంది. అశాశ్వతమైన దాన్ని గురించి దుఃఖించటం అనవసరం. నువ్వు ఏడ్చినా….. నవ్వినా…… దానితో నిమిత్తం లేకుండా, ఈ శరీరాలు, నశించే రోజున నశిస్తాయి. ఆత్మ శాశ్వతమైనది. దాన్ని గురించీ నువ్వు దుఃఖించనవసరం లేదు. నువ్వు ఏడ్చినా…. నవ్వినా, దానితో నిమిత్తం లేకుండా, ఆత్మ, నిత్యమూ శాశ్వతమూ అయి ఉంటుంది. ఏ విధంగా చూసినా నీ దుఃఖం అర్ధరహితం. కాబట్టి దుఃఖం విడిచి పెట్టి యుద్ధం చెయ్యి అంటాడు.

శ్లోకం:
అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః
అనాశినో౨ప్రయేయస్య తస్మా ద్యుధ్యస్వభారత

భావం:
అర్జునా! ధరింపబడిన దేహాలు నశిస్తాయేగాని, ధరించిన జీవుడు [ఆత్మ] మాత్రం నిత్యమైనదీ సత్యమైనదీననీ తెల్సుకుని, దుఃఖాన్ని మాని యుద్ధం చెయ్యి.

శ్లోకం:
న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్య శ్శాశ్వతో2యం పురాణో న హస్యతే హస్యమానే శరీరె

భావం:
ఆత్మపుట్టేది గాని, చనిపోయేది గానీ కాదు. అలాగని ఒక్కప్పుడు ఉండేదీ, మరొక్కప్పుడు ఉండనిదీ కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉండేది. నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించినా – ఆత్మ నశించదు.

7]. అలాగ్గాక, ఆత్మకూడా శాశ్వతం కాదు అంటావేమో! అంటే ఈ జన్మ తప్ప, జన్మజన్మలున్నాయని నమ్మనంటావేమో! అలాంటప్పుడు కూడా నువ్వు దుఃఖించనవసరం లేదు. ఎందుకంటే ఆత్మ ఆశాశ్వతమైనదైనా పుట్టిన ప్రతీప్రాణీ గిట్టక తప్పదు కదా!

శ్లోకం:
అథ చైసం నిత్యజాతం నిత్య వా మన్యసే మృతం
తథాపి త్వం మహాబాహో నెపం శోచితు మర్హసి

భావం:
ఒకవేళ, నువ్వీ ఆత్మను శరీరం వలెనో యెప్పుడూ పుడుతూ పోతూ ఉండే దానిగా భావిస్తావేమో! అప్పుడు కూడా నువ్వు దీనిని గురించి దుఃఖపడవలసిందేమీ లేదు.

శ్లోకం:
జాతస్య హి ధ్రువో మృత్యు ర్ర్ధువం జన్మ మృతస్యచ
తస్మా దపరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి

భావం:
పుట్టినది గిట్టక తప్పదు. మరణించినది మరలా పుట్టకా తప్పదు. తప్పించ శక్యం గాని చావు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించడం అనవసరం.

8]. అంతేకాదు, ప్రతీవ్యక్తి తన ధర్మాన్ని తను ఆచరించాలి అంటాడు.

శ్లోకం:
శ్రేయా స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వధర్మే విధనం శ్రేయః పరధర్మో భయావహః

భావం:
ఎంతో నైపుణ్యంగా ఆచరించే పరధర్మం కన్న, గుణరహితంగా చేసినప్పటికీ స్వధర్మమే మేలు, స్వధర్మనిర్వహణార్ధం సమసి పోయినా మంచిదే గాని, ఆమరణాంత భయావహమైన పరధర్మానుష్ఠానం మాత్రం తగదు.

ఈ విధంగా…. ’అధర్మం వైపు నిలబడటం’ తాత్కాలికంగా సుఖవంతంగా కనపడటం, మన హ్రస్వదృష్టి కారణాంగానే తప్ప, నిజంగా అది సుఖవంతమైనది కాదు. అది ఆమరణాంత భయవహమైన పరధర్మం మాత్రమే! – అని స్పష్టంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.
9]. ప్రతిమనిషికి ఏదో ఒక పని చేయక తప్పదు. [అలాంటప్పుడు ఆ చేసే పని ఏదో, మంచి పనే చేయటం మేలు గదా!]

శ్లోకం:
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః

భావం:
కాబట్టి, నువ్వు నీకు నియమితమైన కర్మలను ఆచరించు. ఎందుకంటే – యే పనీ చేయకపోవడం వల్ల – దేహయాత్ర కూడా అత్యంత దుర్భరంగా పరిణమిస్తుంది.

10]. అందువల్ల నీ పని నువ్వు చెయ్యి అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో.

శ్లోకం:
తస్మా దసక్త స్పతతం కార్యం కర్మ సమాచర
అసక్తో హ్యాచర కర్మ పరమాప్నోతి పూరుషః

భావం:
అందువలన అర్జునా! నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మల నాచరించు. ఆపేక్షా రహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది.

11]. అంతేకాదు, అర్జునుడికి చెప్పిన ఈ ’మాట’ని, తాను ఆచరించాకే చెబుతున్నానని కూడా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.

శ్లోకం:
న మే పార్ధాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

భావం:
పార్ధా! నాకు యీ మూడు లోకాలలోనూ కూడా ’చేయవలసినవి’ అనేది యేదీ లేదు. నాకు చెందనిదీ, నాచే ఆశించబడేదీ లేదు. అయినప్పటికీ నేను యెప్పుడూ కర్మలనాచరిస్తూనే ఉన్నాను.

ఎందుకంటే ఇతరులు తనని ఆదర్శంగా తీసుకుంటే లోకానికి మేలు కలగాలి గానీ కీడు కలగకూడదు కదా! అందుకు

శ్లోకం:
యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే

భావం:
[ఎందుకంటే] ఉత్తములు ఆచరించిన కర్మలనే యితరులు ప్రమాణంగా స్వీకరిస్తారు. లోకమంతా వాళ్ళని ఆనుసరించే కర్మలనాచరిస్తుంది.

శ్లోకం:
యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్య తంద్రితః
మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్ధ సర్వశః

భావం:
అర్జునా! నేనే గనక కర్మలు విడిచి పెడితే, లోకులందరూ కూడా నన్నే అనుసరిస్తారు.

శ్లోకం:
ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహం
సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః

భావం:
నేనే గనక కర్మలు జేయడం మానివేస్తే, లోక వ్యవహారాలన్నీ శిధిలమౌతాయి. తద్వారా సంకరము, కర్మభ్రష్ఠతా కల్గుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను.

తనకి ఏదీ పొందవలసిన అవసరం లేదు. తనకి దేనికీ లోటు లేదు. అయినా తన పనిని తాను చేస్తోంది ఇందుకే అంటాడు; శ్రీకృష్ణభగవానుడు. అందుకే ఆయన భగవంతుడు.

12]. కాబట్టి అజ్ఞానులు కర్మ ఫలాపేక్షక కర్మలు ఆచరిస్తున్నట్లే – నువ్వు ఫలాపేక్ష లేకుండా కర్మలాచరించు అని చెబుతాడు.

శ్లోకం:
సక్తాః కర్మ ణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత
కుర్యా ద్విద్వాం స్తథా౨సక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్

భావం:
కాబట్టి, ఓ భారతీయుడా! అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, జ్ఞానులు కూడా ఫలాపేక్షరహితంగా లోకసంగ్రహణానికై – చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి.

శ్లోకం:
న బుద్ధి భేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్
జోషయే త్సర్వకర్మాణి విద్వా యుక్త స్సమాచరన్

భావం:
జ్ఞానియైన వాడు కర్మాసక్తులయొక్క బుద్ధిని చలింపజేయకుండగా – తాను కర్మాచరణ చేస్తూ, వారి చేత చేయించాలి.

13]. కాబట్టి ఫలితాన్నీ, కర్తతృహంకారాన్ని వదిలి నీపనిని నీవు చెయ్యి! – అని స్పష్టంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.

శ్లోకం:
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా౨ ధ్యాత్మచేతసా
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః

భావం:
సమస్తమైన కర్మలనూ నాకే సమర్పించు. కోరికలూ, అహంకారమూ వదిలెయ్. దుఃఖాన్ని మాను. వివేకవంతుడివై – యుద్ధం చెయ్యి.

శ్లోకం:
యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః

భావం:
ఎవడు ఫలాపేక్షారహితుడో, కర్త్వత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో, వాడే పండితుడు.

పండితుడవై, నీ స్వధర్మమైన కర్మని నువ్వు ఆచరించు.

ఏ మనిషికైనా తనదైన స్వధర్మం – తనకూ ఇతరులకీ కూడా మేలుచేసే ’మంచి’ అవుతుందే తప్ప, ప్రస్తుతానికి తనకి మేలు గానూ ఇతరులకి కీడు గానూ ఉండి, కాలం గడిచాక గమనిస్తే, తనకూ ఇతరులకీ కూడా కీడే కలిగించే ’చెడు’ అవ్వదు కదా!

ఇదీ గీత మనల్ని ప్రేరేపించే తీరు! స్పూర్తి పరిచే తీరు!
దీనిని మేము, జీవితంలో ఎదురైన సంఘటనల నుండి అనుభవపూర్వకంగా నేర్చుకున్నాము.

ప్రతీమనిషికి, జీవితంలో ప్రతి మలుపు దగ్గరా, దేవుడు రెండు దారులు పెడతాడు. ఒకటి మంచి, రెండు చెడు. లేదా ఒకటి ధర్మం, రెండోది అధర్మం. [ఒకో సారి ఈ అధర్మాన్నే లౌక్యం అని కూడా అంటారు] ఏ దారిలో వెళ్ళట మనేది ఎవరికి వారూ నిర్ణయించుకోవచ్చు.

శ్రీకృష్ణుడు పలురకాలుగా అర్జునుడికి జ్ఞానాన్ని, కర్తవ్యాన్ని బోధించాక యధేచ్ఛగా నిర్ణయం తీసుకోమంటాడు.

ఇలాంటి రెండు దారుల కూడలిలో అందరిలాగే మేమూ చాలా సార్లూ నిలబడ్డాము.
ఒక ఉదాహరణ చెబుతాను....

2000 లో ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం పైన మేం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు ఇచ్చాము. అప్పటికి మేం ప్రైవేటుగా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మా జీవితాల్లో సుదీర్ఘ కాలంగా రామోజీరావు వేధింపు ఉండటం నిజం. అది మాకు కొన్నేళ్ళుపాటు తెలియలేదు. 2005 లో మేం దాన్ని గుర్తించగలిగాము. భూమికి ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ చెప్పటానికి ముందూ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. న్యూటన్ చెప్పాకే దాన్ని మనం గుర్తించాం. మన గుర్తింపుతో నిమిత్తం లేకుండా….. దానికి ముందూ వెనుకా కూడా భూమికి ఆకర్షణ శక్తి ఉంది.

పోలిక పెద్దదే అయినా మా విషయంలోనూ ఇదే సత్యం. రామోజీరావు మాపైన ప్రయోగిస్తున్న వేధింపుని మేం 2005 లో గుర్తించాము గాక, అయితే దానికి ముందూ వెనుకా కూడా వేధింపు ఉన్నదే సత్యం! ఆ వేధింపు నుండి మమ్మల్ని మేం కాపాడుకునే క్రమంలోనూ, మా ఎదురు పోరాటంలోనూ మేం చాలా విషయాలే నేర్చుకున్నాము.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేధింపు మేం ’భగవద్గీత’ని మరింతగా ఆచరించే అవకాశాన్ని మాకిచ్చింది. ఎందుకంటే – మొదట్లో ఎవరు వేధిస్తున్నారో తెలీదు. ఎందుకు వేధిస్తున్నారొ తెలియదు. ఈ నేపధ్యంలో, జరుగుతున్న అన్నిటిని మా విధిగానూ, నుదిటివ్రాతగానూ భావించాము. కనుక ఆ కష్టాలని దాటేందుకు మరింతగా భగవంతుడి మీదా, ’గీత’ మీద ఆధారపడ్డాము. దాంతో మరింతగా ఆధ్యాత్మిక దృష్టి అలవడింది. దాంతో మేం మరిన్ని విషయాలు నేర్చుకున్నాము.

ఇక 2005 లో మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం అర్ధమయ్యాక, అప్పటికే మాకు అలవడిన అధ్యాత్మికత, భారత రామాయాణాలని, గూఢచర్యపు దృక్పధంతో చూసే దృష్టి నిచ్చింది. కథలనీ, ఉపనిషత్తులనీ, భారత భాగవత రామాయణాలనీ, జీవితానికీ అనువర్తించుకునే ఆలోచనా ధోరణినీ ఇచ్చింది. మరో మాటలో చెప్పాలంటే భగవద్గీత మా సాధన. భారత రామాయణాది భారతీయ ఇతిహాసాలు, ఉపనిషత్తులు మా పరికరాలు. జీవితంలోని అనుభవాలే మాకు పాఠాలు. వాటి నుండి మేం నేర్చుకున్న, తెలుసుకున్న జ్ఞానాన్నీ, మా పరిశోధననీ ఈ బ్లాగు ద్వారా మీ ముందు పెట్టాము, పెడుతున్నాము.

నిజానికి మా మీద రామోజీరావు వేధింపులో కేవలం 10% మాత్రమే మేం ఫిర్యాదులకి ఎక్కించి ఉంటాము. వీలయినంతగా సహించుకుని, ఇక సహించటం సాధ్యంకాని పరిస్థితి వచ్చాకే ఫిర్యాదుకు ఉపక్రమించే వాళ్ళం. అలా ఫిర్యాదులకి ఎక్కించిన వాటిల్లో కూడా, కొన్నింటిని మాత్రమే ఈ బ్లాగులో వివరించాను.

మా మీద రామోజీరావు వేధింపులో చాలా సంఘటనలు ఫిర్యాదులకి ఎక్కించలేనివి, ఎవరికీ చెప్పుకోలేనివి. ఎవరికైనా చెబితే నమ్మలేనివి కొన్ని. చెబితే ’సిల్లీ’గా అన్పించేవికొన్ని. చెప్పటానికి కూడా ’ఎంబారాసింగ్’ గా అన్పించేవి కొన్ని. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మా మీద నడిచిన వేధింపులో చాలా అంశాలు, లోతుగా పరిశీలిస్తే…. మనదేశం విషయంలోనూ జరిగినవే. అంటే మేం ఎలాంటి వేధింపులకి గురయ్యామో, తరచి చూస్తే….. గతంలో, మనదేశం, మనదేశం పట్ల నిబద్దత గల ప్రభుత్వాలు, దేశభక్తులైన నాయకులూ కూడా గురయ్యినవే! అంటే ఒకేరకపు స్ట్రాటజీ అన్నమాట. ఒక వ్యక్తిమీద, ఒక వ్యవస్థ మీద, ఒక దేశం మీద ఒకే రకపు స్ట్రాటజీని ప్యాకింగ్ మార్చి ప్రయోగించటంగా చెప్పుకోవచ్చు.

మొదట్లో ఈ సారూప్యత చూసి మాకు వింత గొలిపింది. తర్వాత పరిశీలించి చూస్తే అర్ధమయ్యింది ఏమిటంటే – పదే పదే అదే ప్రచారం చేయటమే నకిలీ కణికుల స్ట్రాటజీ అయినట్లు, పదేపదే అదే పది స్ట్రాటజీలే ప్రయోగించటం కూడా నకిలీ కణికులకు అలవాటు. అది వ్యక్తులమీదనైనా అంతే, దేశాల మీదనైనా అంతే. అంతకంటే ఎక్కువ స్ట్రాటజీలు కూడా నకిలీ కణికుల అనువంశీయులకి తెలియదు.

ఇక ఈ పది స్ట్రాటజీలని నిశితంగా పరిశీలిస్తే…. అహం రెచ్చగొట్టటం లేదా అహాన్ని తృప్తిపరచటం, ఆడది – ఆకలి లాగా రెండే ఉంటాయి కూడా! ప్యాకింగు రంగురంగుల్లో ఉన్నా లోపలి సరుకు ఒకటే అయినట్లు, చూడటానికి రకరకాలుగా కనబడినా…. నకిలీ కణికుల స్ట్రాటజీలు పదే. అంతకంటే ఎక్కువ గూఢచర్యం కూడా వీళ్ళకి తెలియదు.

గతంలో అంటే 1992 కు ముందర ఇలాంటి గూఢచర్య వలయం, వంశమూ ఉండే అవకాశాన్నే ఎవరూ గుర్తించనందునా, నమ్మక ద్రోహం మీద ఆధారపడిన, ’ఆడది – ఆకలి ’ తో కూడిన గూఢచర్యం వాళ్ళకి ఫలించింది, అంతే! కాబట్టే, మెదళ్ళతో యుద్ధం చెయ్యటం ప్రారంభించిన నెం.5 వర్గంతో పోరాడవలసి వస్తే, సువర్ణముఖి అనుభవిస్తూ మరీ బహిర్గతమౌతోంది. గూఢచర్యం బహిర్గత మవ్వటం అంటేనే మరణశయ్య ఎక్కటం వంటిది.

ఇక మాపైన రామోజీరావు వేధింపులో మాకెదురైన అనుభవాలని, వాటి నుండి మేం నేర్చుకున్న పాఠాలని వివరిస్తాను. పరిశీలించి చూస్తే మనదేశాన్ని, హిందూ మతాన్నీ, భారతీయుల సంస్కృతినీ కూడా ఇలాగే బాధించటమూ, నాశనం చేయటమూ కూడా స్పష్టంగానే కనబడుతుంది. అదీ వివరిస్తాను. దాని పర్యవసానంగా నకిలీ కణిక వ్యవస్థ లోనూ, నెం.10 వర్గంలోనూ, కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీలతో సహా, వాళ్ళకి సహకరించి వాళ్ళ అనుచరులు [ఏజంట్లు] అనుభవించిన, అనుభవిస్తున్న సువర్ణముఖిని సైతం వివరిస్తాను. దృష్టాంత పూరితంగా వివరిస్తాను.

ముందుగా…..
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

శ్రీశైలంలోని మా ఇంటి ఎలాట్ మెంట్ ను రద్దు చేసినందున, కొన్ని ప్రయత్నాల తర్వాత 2007, మే 8 వ తేదీన మా ఇంటి నుండి బయటికి రావలసివచ్చింది.[సామాను అక్కడే ఉంచి, బయటకు వచ్చాము.] మే 5, 2007న దిగ్విజయ్ సింగ్ నుండి మాకు ఒక లేఖ వచ్చింది. రామోజీరావు చేత వేధింపబడుతున్నామనీ మేము సోనియాగాంధీకి వ్రాసిన లేఖ తనకు బదలాయించిందని, వాటిని తను నోట్ చేసుకున్నానని వ్రాసాడు. ఆ లేఖ తీసుకుని, 2007, మే 17 న ఢిల్లీలో అక్బర్ రోడ్ లోని ఏఐసిసి భవనానికి వెళ్ళి దిగ్విజయ్ సింగ్ ని కలిసాము. అతడు వై.యస్. కు మా సమస్య పరిష్కరించమని రికమండ్ చేస్తూ లేఖ వ్రాసి, మా చేతికే ఇచ్చాడు. మేం దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన లేఖ తీసుకుని, తిన్నగా, అప్పటికే ఢిల్లీ వచ్చి ఏపి భవన్ లో బస చేసిన అప్పటి సీ.ఎం. వై.యస్.ని కలిసాము. పావుగంటపాటు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి, సమస్య విన్న వై.యస్., "కేసు సంగతి తర్వాతమ్మా! ముందు ఉండటానికి రూం కావాలి కదా! దాని సంగతి ముందు చూద్దాం” అంటూ మరో వినతిపత్రం వ్రాసి ఇమ్మని అప్పటికప్పుడు వ్రాయించుకుని తీసుకున్నాడు. [అదో non-sense & red-tapistic administration అన్నది మాకు practical గా, తర్వాత అర్ధమయ్యింది]

తిరిగి మేం బసచేసిన పహార్ గంజ్ లోని హోటల్ కి వెళ్ళిపోయాము. నంద్యాల/గుంటూరు చేరాలంటే తిరుగురైలు టికెట్లు దాదాపు వారం తర్వాత గానీ దొరకలేదు. తత్కాల్ లో కూడా! అదే ఢిల్లీ వెళ్ళేటప్పుడు విజయవాడ నుండి తత్కాల్ లో ఒకరోజులో టిక్కెట్లు దొరికాయి. సరే, ఇటు నుండి అటు కంటే, అటు నుండి ఇటుకి రద్దీ ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాము. అయితే, రెండుమూడు రోజుల తర్వాత, మేం అక్కడ ఉండగానే…… శ్రీశైలం నుండి మా విద్యార్ధుల తండ్రీ, పోలీసు కానిస్టేబులూ అయిన వ్యక్తి, ఫోన్ చేసి దేవస్థానపు ఈఓ మా గదిని పంచనామా చేయనున్నారనీ, వెంటనే ఏదో ఒకటి చెయ్యమనీ చెప్పాడు. అదీ ఒకటి రెండు సార్లు. ఇదే సమాచారం మరో పేరెంటు కూడా చెప్పాడు. పంచనామా అంటే మా గదిలోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి తీసి బయట పారేస్తారని కూడా ఈ పోలీసు కానిస్టేబులూ అంతకు ముందు చెప్పాడు.

దీనికి ముందు ఇంకోసారి…… 2006, డిసెంబరు 16 [నాకు గుర్తుండి అదే తేదీ] న వై.యస్. శ్రీశైలం వచ్చాడు. మా ఇంటికి [చల్లా వెంకయ్య సత్రం మొదటి అంతస్తు] వినబడేంత, కనబడేంత దూరంలో, చెంచులక్ష్మీ గిరిజన మ్యూజియం వెనక అతడి బహిరంగ సభ జరుగుతోంది. ఆ సమయంలో మా సత్రంలో క్రింది అంతస్థులోని సెక్యూరిటీ గార్డు భార్య నన్ను బండబూతులు గంటపాటు ఏకధాటిగా, ఆకారణంగా తిట్టింది.

దాంతో కోపం వచ్చి అయినా వై.యస్.ని మేం కలవాలి. అప్పటికే ఎందుకు వేధిస్తున్నారో మాకు అర్ధమై ఉంటుందనీ, అంచేత మాదగ్గర ఏవేనా రహస్యాలుంటే చెబుతామని వాళ్ళ అంచనా. అలా జరిపించాలన్నది, మమ్మల్ని అలా డ్రైవ్ చెయ్యాలన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే మామీద వత్తిడి కలగచేయటం, సమస్యలు సృష్టించటం.

2006 డిసెంబరులో జరిగిన ఈ సంఘటనకీ, 2007 మేలో ఢిల్లీలో జరిగిన పైన వివరించిన సంఘటనకీ, సారూప్యత కనబడటంతో మాకు విషయం బాగానే అర్ధమయ్యింది. [అవే పది స్ట్రాటజీలు!] అప్పటికి మేం 2005 నుండి ప్రధానికి, సోనియాకీ, రాష్ట్రపతికి ఫిర్యాదులు పంపుతున్నా ఎవరూ స్పందించలేదు. అది తనకు Endorse చేయబడిందని దిగ్విజయ్ సింగ్ మాకు వ్రాసిన లేఖ అందింది.

దాన్ని ఆధారం చేసుకునే మేం 2007 మే 17న ఢిల్లీ చేరి, ఏఐసిసి కి వెళ్ళి అతణ్ణి కలిసాం. అక్కడి నుండి అతడిచ్చిన సిఫార్సు లేఖతో అప్పటి సీ.ఎం. వై.యస్.కి కలిసేందుకు హైదరాబాద్ రానవసరం లేకపోయింది. ఎందుకంటే ఆరోజు ’యాదృచ్చికంగా’ అతడూ ఢిల్లీకి వచ్చి ఏపి భవన్ లో ఉన్నాడు. మేం ఏఐసిసి భవనం నుండి నేరుగా ఏపిభవన్ వెళ్ళి అతణ్ణి కలిసాం. అతడు వెంటనే కేసును పరిష్కరించక పోయినా, ముందుగా మా గది కాన్సిల్ ని రికాల్ చేస్తానన్నాడు. ఆ పైన తిరుగుటిక్కెట్లు దొరక్క ఢిల్లీలోనే ఉండిపోయినప్పుడు ఫోన్లలో మా గది పంచనామా పేరిట వస్తువులు బయటకు గిరాటు వేస్తారనీ, ఏదో ఒకటి చేయమని ఒత్తిడి!

అప్పుడు మాకు ఉండే ఏకైక ప్రత్యామ్నాయం ఏమిటి? సోనియాని కలవటమే. అయితే…... ఈ పైపైకారణాలతో, రామోజీరావు వేధిస్తున్నాడంటూ ఎవరిని కలిసినా ఏమీ ప్రయోజనం ఉండదని అప్పటికే మాకు అర్ధం చేసారు. ‘ఇవి గాని ఇంకేమైనా సమాచారం లేదా జ్ఞానం’ మాకు ఉంటే దాన్ని నేరుగా సోనియాకి చెప్తే ప్రయోజనం ఉంటుంది. అప్పుడు ఈ వేధింపు నుండి రక్షణా ఉంటుంది. సౌకర్యవంతమైన బ్రతుకు ఉంటుంది. ఇది మాకు బాగా అర్ధం చేసారు. నిజానికి మేం ఎవరితో, ఎప్పుడు రాజకీయ చర్చలు చేయలేదు. సాధారణ చర్చలు మాత్రమే! మొదటి సారిగా రాజకీయ విషయాలు వ్రాయటం ఈ బ్లాగులోనే.

నిజానికి మా దగ్గర గండికోట రహస్యాలేవీ లేవు. ఒకవేళ మా చుట్టూ పీవీజీ గానీ ఏదైనా మ్యాజిక్ సర్కిల్ సృష్టించి ఉంటే…. దానికి మా బాధ్యత గానీ, ప్రమేయం గానీ ఏవీ లేవని కూడా అంతకు క్రితమే అంటే 2005, 2007 లలో ప్రధానికి, సోనియాకీ, రాష్ట్రపతికి పెట్టిన ఫిర్యాదు లేఖలలోనే వ్రాసి ఉన్నాము. వాటిని మీరు Coups on World అనే మా ఆంగ్ల బ్లాగులోని Ref. No. 1 to 27 లలో చూడగలరు. ఆ విధంగా “మా దగ్గర రహస్యాలేవీ లేవన్నా” మా వెంట బడటం మాత్రం మానలేదు. అదీ మాకు అర్ధమయ్యేటంతగా వెంట బడి వేధించటం అన్నమాట.

సోనియాని కలిసి, ఉన్న రహస్యాలు చెప్పు. లేదా వై.యస్.కి చెప్పు! ఎందుకంటే వై.యస్. రామోజీని మార్గదర్శి నెపాన కోర్టుగుమ్మాలు ఎక్కించి దించుతున్నాడు కదా! సోనియా, వై.యస్.కి పూర్తి మద్దతు ఇస్తుంది కాబట్టి, ఆ కుర్చీ వ్యక్తి కూడా దేశప్రయోజనాలని కాపాడేవ్యక్తే. వాళ్ళిద్దరూ రామోజీరావుకి వ్యతిరేకంగా, అతడి ఏజన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి నీదగ్గరున్న రహస్యాలు చెప్పు – ఇదీ ఒత్తిడి.

మాకు ఎంత తిక్క లేచేదంటే – నిజంగా వాళ్ళిద్దరూ రామోజీరావుకు వ్యతిరేకంగా, అతడి ఏజన్సీకి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలు కోసం పోరాడుతున్నట్లయితే, అంత పై పదవుల్లో ఉన్నవారికి తెలియనిదీ, తొక్కలోది మేం ఇవ్వగలదీ అయిన సమాచారం ఏముంటుంది? మేం After all సామాన్యులం. మాకు తెలిసిన విషయాలేవో, ప్రారంభం తెలిసిన వారికి ఎవరికైనా, జరుగుతున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మేం చెబితే బ్లాగు చదువరులకి అర్ధమైనట్లు….. ఎవరికైనా, పరిశీలిస్తే జరిగేది అర్ధమౌతుంది. ఇక మమ్మల్నెందుకు వేధించటం? ఇది ఇప్పటికీ మాకు అర్ధం కాని ప్రశ్నే!

పోనీ ఫిర్యాదు చేసినందుకు వేధిస్తున్నారనుకున్నా, మొదట నా తమ్ముళ్ళని చంద్రబాబు దరిచేర్చుకున్నప్పుడు మేం వారిని కలిసే అంత వరకూ వాళ్ళకి హవా నడిచింది. మేం వాళ్ళతో కట్ చేసుకున్న తరువాత క్రమంగా వాళ్ళ హవా తగ్గిపోయి, ఆర్ధికంగా కూడా ఇప్పుడు సామాన్య జీవితాలే! అలాగని చంద్రబాబు పూర్తిగా వదిలేయలేదు. సంబంధాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని వేధించి, దరి చేర్చుకుంటే వాళ్ళకి వచ్చే లాభం ఏమిటి?

ఇదంతా ఏమీ లేదనేటట్లయితే, ఒక చిన్న రూమ్ విషయమై, ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ నుండి సిఫార్స్ లేఖ, సి.ఎం. అధికారం కంటే శ్రీశైలంలోని ఒక ఈవో ఎలా బలవంతుడు అయ్యాడు?

ఇక ఈ ఒత్తిడికి మేం లొంగనందున, మా మీద – ఆదాయానికి గండి కొట్టటం, ఖర్చులు పెరిగేలా చేయటం అన్న స్ట్రాటజీ ప్రయోగింపబడుతోంది. చివరికి ఆకలి దాకా తెస్తోంది. అయితే ఇది మాకు తొలి అనుభవం కాదు. గతంలో చాలాసార్లు తెలిసిందే! ప్రస్తుతం కూడా అదే స్థితి. ఉద్యోగప్రయత్నాలు, స్వంత వెంచర్ ప్రయత్నాలూ ఏవీ ఫలించని స్థితి.

ఇక్కడ ఓ విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందు చెప్పిందే అయినా మరోసారి చెబుతున్నాను. నేను ఈ బ్లాగుని ఏదో ప్రయోజనం ఆశించి వ్రాయటం లేదు. నిజం అందరికీ తెలియాలని వ్రాస్తున్నాను. అంతేగాని ఆత్మకథ చెప్పి ఆర్ధిక సాయం అడగటానికి వ్రాయటం లేదు.

ఎందుకంటే – హరికథ చెప్పి డబ్బులడగటం గౌరవప్రదం. ఆత్మకథ చెప్పి డబ్బులడగటం నీచం. దానికీ….. బస్టాండు లోనూ, రైల్వే స్టేషన్ లోనూ డబ్బులు పోయాయని చెప్పి సాయం అడగటానికీ, మా దృష్టిలో తేడా లేదు.

నా దృష్టిలో….. యుద్ధంలో శతృవుని మనకి చేతనైన దెబ్బ మనం కొట్టినప్పుడు, వాడికి చేతనైన దెబ్బ వాడూ మనల్ని కొడతాడు కదా! ఇదీ అంతే! నకిలీ కణిక వ్యవస్థ గురించీ, నెం.10 వర్గం గురించీ, అందులోని కీలక వ్యక్తుల కార్యకలాపాల గురించీ వ్రాస్తున్నాము. గూఢచారులకి వారి నిగూఢ పనితీరు ప్రాణం అయినప్పుడు, దాన్నిలా బహిరంగపరచటం అంటే చావుదెబ్బ తీయటం వంటిదే! అలాంటప్పుడు ఆర్ధికంగా మేం కార్నర్ అయ్యేస్థితికి లాగటం వాళ్ళు చేస్తారు. ‘ఇది యుద్ధం, అంతే!’ అనుకుంటాము.

కాబట్టే…..
ఏదైతే సత్యమని నమ్మి నడుస్తున్నామో ఆ సత్యాన్ని,
ఏదైతే ధర్మమని నమ్మి ఆచరించామో, ఆచరిస్తున్నామో ఆ ధర్మాన్ని,
ఏ భగవద్గీతనైతే నమ్మి సాధన చేస్తున్నామో ఆ గీతని, నిగ్గు పెట్టుకోదలుచుకునే మేమూ చూస్తున్నాము.

పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చేటప్పుడు ‘ధర్మోరక్షితి రక్షిత:’ అని వ్రాసాను. దాన్నే మనసా వాచా కర్మేణా విశ్వసించాను. ఆ రోజు గీత తెరిస్తే…. ‘హతోవా ప్రాప్యతే స్వర్గం’ అన్న శ్లోకం చదివాను. “ఛస్తే స్వర్గం, గెలిస్తే…. ఇక లేనిదేమిటి?" అనుకున్నాను. 1992 లో రామోజీరావు మీద ఫిర్యాదు చేయకముందు కూడా భగవద్గీతే నన్ను చాలాసార్లు రక్షించింది. గీతను, భగవంతుడిని నమ్మి చెడినది లేదని గీతే ఎన్నోసార్లు నాకు చూపించింది. ఎన్నో వేల సంవత్సరాల నుండీ మన పూర్వీకులు ఇదే బాటన నడిచారు.

అయితే…. ఇక్కడ, నాణెం ఎగరెస్తే…. బొమ్మ బొరుసూ గాకుండా, నాణెం నిలబడటంలాగా, పరిస్థితి అటు చావు ఇటు గెలుపూ కానిదీ….. 17 ఏళ్ళుగా శతృవుకి, మాకు మధ్య కొనసాగుతున్నదీ అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే….. యుద్ధంలో….. ’Instant result’ లాగా…… వెంటనే విజయమో, వీరస్వర్గమో వస్తుందనుకున్నాను. ఏదైనా సుదీర్ఘ యుద్ధం తర్వాతే వస్తుందన్నది అనుభవంతో నేర్చుకున్నాము.

ఇప్పుడు, ఈ స్థితిలో…… పరిస్థితి ఆకలి దాకా, పస్తుదాకా వచ్చినప్పుడు కూడా మా దృక్పధం ఇదే! ఏ స్థితిలోనయినా మా అభిప్రాయంలో మార్పులేదు. ‘చూద్దాం, దేవుడేం చేస్తాడో ’ అనుకుంటాము.

ఇక….. వారం క్రితం ఓ మిత్రుడిని కొంతమొత్తం డబ్బు అప్పు అడిగాం. వెంటనే స్పందించిన అతడు 20, నవంబరు శుక్రవారం, తన బ్యాంకు నుండి డబ్బుని నేను ఇచ్చిన బ్యాంకు ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా మొయిల్ ఇచ్చాడు. ఐదు రోజులు గడిచినా అది ఇంకా మా ఎకౌంట్ కి చేరలేదు. మా మిత్రుడు మొయిల్ కి గానీ, ఫోన్ కి గానీ స్పందించటం లేదు. అతడికేమైనా ఇబ్బంది కలిగిందేమో తెలియదు.

ఏది ఏమైనా ఎటువైపు నుండీ దమ్మిడీ రాని ఈ స్థితిలో……
మొన్నటి [Nov. 24, 2009] ఈనాడు పతాక శీర్షిక గమనించండి.
>>>కట్టబట్టే తంత్రం….. డబ్బుపట్టే మంత్రం….. సాక్షికి సమార్పయామి
మామూలుగా చూడటానికి, ఈనాడు వై.ఎస్. అవినీతిని ఎండగట్టినట్లే ఉంటుంది. అది ఒక కోణం…. మరో కోణం ఏమిటంటే, నీకు డబ్బు రావాలంటే ’ వెళ్ళి సాక్షికి నీ దగ్గరున్న సమాచారం సమర్పించుకో ’. గమనించి చూడండి! ఈ వార్తకు వేసిన క్యారికేచర్ లో జగన్, ఇతరులు కూర్చొని యజ్ఞం చేస్తున్నట్లు, హోమగుండంలో నెయ్యి వేస్తున్నట్లు ఉంది. అగ్ని సైతం ‘సాక్షి’ అన్న ఆకృతిలో ఉంది. మామూలుగా అయితే, ఈనాడు వ్యంగ్యంగా బొమ్మవేయదల్చుకుంటే అది మరోలా ఉంటుంది. ఫైళ్ళు, ప్రభుత్వ లైసెన్సులు వేస్తుంటే, అవినీతి సొమ్ము, అతడి అన్ని వ్యాపారసంస్థలుగా బయటకు వస్తున్నట్లుగానూ లేదా మరో రకంగానూ ఉంటుంది. పవిత్రయజ్ఞం చేస్తున్నట్లుగా మాత్రం ఉండదు. 17 ఏళ్ళుగా నడుస్తున్న ఈ యుద్దాన్ని మేం యజ్ఞంగా పోల్చుకోవటం మా మిత్రులలో కొందరికి తెలుసు.

అలాగే కర్నూలు సిటి ఎడిషన్ లో మధ్యపేజీలో సూక్తి చూడండి. ’ఎవరి పని వారు చేయకపోవటం వల్లే ఏ దేశమైనా వెనకబడుతుంది’. కాబట్టి మీపని మీరు చేయండి. రామోజీరావుకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్న గతించిన వై.యస్. కుమారుడు జగన్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరేముందో, ఇంకా మీకు ఏమేమి తెలుసో చెప్పండి. అలాగ్గాకుండా మీకు తెలిసిందంతా బ్లాగులో వ్రాస్తే దేశం వెనకబడిపోతుంది [!?] అదనంగా ఈ రోజుటి హాయ్ బుజ్జిలో పద్యాల వంటివి కూడా వస్తాయన్నమాట.

ఏ పద్యమంటే
>>>
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాత కన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!
అర్ధం:
ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కాని రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల కన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.

మరో విషయం ఏమిటంటే – మేం ఎప్పుడూ కూడా, ఎవరితోనూ, ఏ రాజకీయ చర్చలూ చేసేవాళ్ళం కాదు. 1992 నుండి 2008 లో ఈ బ్లాగు తెరిచే వరకూ కూడా, ఎవరైనా మాతో సమకాలీన రాజకీయాలు గురించి మాట్లాడినా మేం పెద్దగా స్పందించే వాళ్ళం కాదు. అయితే వసుంధరలో వ్యాసాలని, పిల్లల పెంపకం గురించో, బ్యూటీ, వంట చిట్కాల గురించో, ఎవరైనా చర్చిస్తే నేనూ ఆసక్తిగా మాట్లాడేదాన్ని. సహజంగా ఆధ్యాత్మికత ఉండటంతో ఆధ్యాత్మికం, అంతర్యామి వంటి శీర్షికలు ఏ పత్రికలలో కనబడినా చదివే వాళ్ళం. వాటి మీద కొద్దిగా మాట్లాడేవాళ్ళం.

మా విద్యార్ధుల తల్లిదండ్రులతో వసుంధర, చదువు, సుఖీభవ వంటి శీర్షికల గురించీ, అంతర్యామి గురించి వాటిల్లో ఏవైనా మంచి విషయాలు అనిపించినవి చదవమనీ, పరిశీలించమనీ చెప్పెవాళ్ళం. పిల్లల్ని ‘హాయ్ బుజ్జీ’ చదివించమని ప్రోత్సాహించేవాళ్ళం. మాకు, అప్పటికి మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం గురించి ఆలోచనే లేనందున, ఇదంతా యధాలాపంగా చేసేవాళ్ళం.

అయితే గతటపాలలో వివరించిన మా కుటుంబం మిత్రుడు ఖాసీం – గ్యాస్ సిలిండర్లు – స్నేహాల పునరుద్దరణ వంటి సంఘటనలు చాలానే జరగటంతో, ఆ విధంగా రామోజీరావు మాతో ఏం చెప్పదలుచుకున్నాడో మాకు అర్ధం అవ్వటం ప్రారంభించి చాలా ఏళ్ళు అయ్యింది. ఉదాహరణకి మీకు ఖాసీం Vs గ్యాస్ సిలిండర్ల గురించి చెప్పాను.

మరో ఉదాహరణగా నిన్నటి ఈనాడు పేపరులోని అంతర్యామిని పరిశీలించండి.

ఈ నెల [నవంబరు 2009] 18 వ తేదీన మా మిత్రుణ్ణి అప్పు అడగే ముందు వరకూ కూడా….. సొంత వెంచర్ ఎంసెట్ & స్పోకెన్ ఇంగ్లీషు ట్యూషన్ సెంటరు పెట్టాము. కరపత్రాల ఖర్చు దండగ తప్పితే, ఒక్క ఎంక్వయిరీ కూడా రాలేదు. అది ఇంకా బాలారిష్టాల దశలోనే ఉంది. 18 వ తేదీన మిత్రుణ్ణి అప్పు అడిగే ముందురోజు కూడా స్థానిక కాలేజీలో ప్రయత్నం చేసాము.

అలాంటిది అంతర్యామిలో పైవ్యాసం చదివాక మాకు అర్ధమయ్యేది ఏమిటంటే – ’అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్నట్లు – చెయ్యబోతే పని దొరకదు. అప్పు తీసుకోవటం తప్పుంటూ ’అంతర్యాము’లు చెబుతాయి. అంటే గదిలో బంధించబడిన పాముకి అన్ని తలుపులూ మూసి, ఏ ద్వారం తెరచి ఉంచబడిందో అటునుండి మాత్రమే పాము బయటకు రాగలిగేటట్లు, మాకు కూడా తెరచి ఉంచబడిన ద్వారం ఏమిటంటే, సాక్షి దగ్గరకీ, జగన్ దగ్గరికీ వెళ్ళి, వాళ్ళు ఆశిస్తున్నదేమిటో చెప్పటం. లేదా ఢిల్లీ వెళ్ళి సోనియాకి చెప్పటం.

నిజానికి మేం బ్లాగు తెరవక ముందు [తెలుగులో ‘అమ్మఒడి’, ఇంగ్లీషులో Coups On World], మాకున్న అవగాహన ఎంతో రామోజీరావుకి తెలియదు. అందుచేత అప్పట్లో అతడు మాట్లాడే తీరు ఇప్పటికి భిన్నంగా, చెప్పాలంటే కొంచెం తక్కువస్థాయిలో ఉండేది. అప్పట్లో మా అవగాహన స్థాయి ఎంతని అతడనుకున్నాడో ఆ స్థాయిలో అన్నమాట….. ఇప్పుడు బ్లాగు తెరిచాక, అందులో మా టపాలు చూశాక దాన్ని బట్టి అతడి భాష తీరు ఉందన్నమాట.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. మనం పైన, క్రింద రెండుసున్నాలని చూశామనుకొండి. పై సున్న వరకే చూసే వాళ్ళకి అది సున్న లాగే కనబడుతుంది. క్రింది సున్నాకి కనెక్షన్ కూడా కలిపి చూడగల వాళ్ళకీ, లేదా క్రింది సున్నాకీ, పై సున్నాకీ కనెక్షన్ ఎవరికైతే కనబడుతుందో వాళ్ళకి మొత్తం ‘8’ No. కనబడుతుంది. లేని వాళ్ళకి రెండు వేరువేరు సున్నాలుగా కనబడుతాయి. ఈనాడులో వచ్చే శీర్షికలో, వార్తాంశాల గురించి విశేషాలూ, వసుంధర టిప్స్, ఫోటోలూ అందరికీ మామూలుగా కనబడతాయి. అప్పటికి నడుస్తున్న రాజకీయ సాంఘీక సంఘటనలకి అనుగుణంగా ఉన్నట్లు కన్పిస్తాయి. సున్నాలు మాత్రమే కనబడినట్లు!

అదే మాకైతే….. మా చుట్టూ సంఘటనలూ, అప్పటికి మా దగ్గర ఉన్న పరిస్థితి, గతంలో జరిగిన సంఘటనల మాలిక….. వీటన్నిటికీ అనుసంధానమై, రామోజీరావు మాకు ఏం చెబుతున్నాడో అర్ధమౌతుంది. అది సామదాన బేధ దండోపాయాలైనా, మోసగించే ప్రయత్నాలైనా, ప్రలోభాలైనా లేక హెచ్చరికలైనా! మరో విశేషం ఏమిటంటే మేం అంతకు ముందు ఎవరితోనైనా అన్నమాటలు పేపర్లో కనబడతాయి. ఇప్పుడైతే అది మేం బ్లాగులో వ్రాసిన మాటలై ఉంటున్నాయి లెండి.

కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. 2003 లో, మా పాప శ్రీశైలంలో ఉన్నప్పుడు దేవస్థానం అడిటోరియంలో, స్కూలు వార్షికోత్సవం సందర్భంలో ఓ నాటకం వేసింది. దాంట్లో ఆ పాత్ర ఊతపదం ’ఆవునా, నిజమా అండి!’ అన్నది. ఆ తరువాత ’ఆవునా!’ అనే టైటిల్ తో సినిమా వచ్చింది. దానిని మా మిత్రుడు under line కూడా చేసాడు.

మేం గతసంవత్సరం, 2008 నవంబరులో ‘అమ్మఒడి’ బ్లాగుని తెరిచాం. తర్వాత చాలా సందర్భాల్లో ఈనాడులో కర్నూలు ఎడిషన్ లోనూ, ప్రధాన ఎడిషన్ లోనూ కూడా ’అమ్మఒడి’ అనే పదం పదే పదే ప్రయోగింపబడింది. చివరికి గణేశ్ నిమజ్జనానికి కూడా ‘అమ్మఒడి చేరిన గణపతి’ అంటూ.

తాజా ఉదాహరణ చెబుతాను. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఒకదశలో నడిచిన అంతర్గత పోరు గురించి వ్రాస్తూ….. రామోజీరావు, అతడి సోదర తుల్య సోనియా ‘అద్దాల మేడ’లో ఉన్నారని వ్రాసాను. నిన్నటి సాక్షిలో రామోజీ, చంద్రబాబులని సయామీ కవలలుగా చిత్రిస్తూ వేసిన కార్టూన్లతో కూడిన వార్తలో ‘మాది రాచబాట మాది అద్దాలమేడ’ అన్న వార్త శీర్షిక వచ్చింది. సాక్షి, ఈనాడులు పైకి కొట్టుకుంటున్నట్లు నటించినా, [రాజ రామోజీల యుద్ధం లాగా] అంతర్గతంగా అందరూ ఒకటేనన్నది నిజం. ఆ రకంగా కూడా సాక్షిని డీల్ చెయ్యమని చెబుతున్నాడన్న మాట.

మరో ఉదాహరణ చెప్పాలంటే, నవంబరు 14, 2009 తేదీన టీవీ 9, సిఇవో రవిప్రకాష్ గురించి టపాకాయ పేలుస్తూ, మేము ‘బార్టర్ సిస్టం ఇంకా అమలులోనే ఉన్నట్లుందని’ వ్రాసాము. Nov. 19, 09 వ తేదీన చంద్రబాబు, ‘వై.యస్. బార్టర్ పద్దతిని మళ్ళీ తీసుకొచ్చాడని’ అన్నాడు. అది ఈనాడులో 20 వ తేదీన ప్రచురింపబడింది. ‘అద్దాల మేడ, బార్టర్ పద్దతి’ వంటి మాటలకి నాకు పేటెంటు హక్కు ఉందని గానీ, లేదా ఆయా పదాలు జన బాహుళ్యంలో వాడుకలో లేనివని గానీ, నేను అనటం లేదు. అయితే ఒకటికి పది మాటలు మేం ఇతరులతో అనటం గానీ, బ్లాగులో వ్రాయటం గానీ చేసిన తర్వాత, ఈనాడు వ్రాయటం, రామోజీ అనుచరులు పలకటంలో ఒక శృతీ లయా ఉన్నాయని అంటున్నాను. అది కూడా పది సంఘటనలు పరిశీలించి అనటం లేదు. కొన్ని వేల సంఘటనలు పరిశీలించి అంటున్నాను.

ఇలా ఈనాడు రామోజీరావు మాతో మాట్లాడే తీరుని బట్టే, అతడి అనుచర శిబిరాల మధ్య అంతర్లీన భాషని కూడా అర్ధం చేసుకోగలిగాము. అదే మీకు చెప్పాము. మీకు చెప్పటానికి ముందు, చెప్పిన తరువాత ఆయా విషయాలు దృష్టాంతాలుగా ఆవిష్కరించబడినవి. గమనించండి.

ఇదంతా ఎవరు జరిపిస్తున్నారు?
ఇలా చూసినా మేము చదరంగం పటంలో పావులమే కదా?
నిమిత్తమాత్రులమే కదా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఒక సూచన. ఈ టపాలో వ్రాసిన అంశాలు ఒక సంఘటనతో నిర్దారణకు వచ్చినవి కావు. కొన్ని వందల సంఘటనలు పరిశీలించి, నిర్దారించుకున్న తరువాతే వ్రాస్తున్నాను.

శ్రీశైలంలో ఉండగా 2003 లో దేవస్థానం వారి గ్యాస్ ఏజన్సీ నుండి మాకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది. అది ఇచ్చేటప్పుడే, అక్కడి నుండి బయటకి బదిలీ చేయబడదు అని చెప్పి ఇచ్చారు. ఇతర ఉద్యోగులకి బదిలీ అవుతుందట గానీ ప్రైవేటు వ్యక్తులకి అలా బదిలీ కాదన్నారు. శ్రీశైలం నుండి బయటకి వెళ్ళే ఉద్దేశం లేదు గనక మేం, ’ఫర్వాలేదు’ అనుకున్నాము. ఇక 2007 లో మా గది కాన్సిల్ చేశాక, మేం శ్రీశైలం నుండి నంద్యాలకు మకాం మార్చేటప్పుడు, అప్పటికే దేవస్థానపు ఉపకార్యనిర్వహిణాధికారి + ఇతర ఉద్యోగులతో అన్నిగొడవలు జరిగాక, ఇక గ్యాస్ కనెక్షన్ బదిలీ గురించి అడగటం కూడా దండగ అనుకున్నాము. సిలిండర్లు, అక్కడ ఇచ్చి డిపాజిట్ వెనక్కి తీసుకుందామన్నా, దేవస్థానంతో లావాదేవీలు కాబట్టి రెడ్ టేపిజంతో తిప్పుకుంటారని తెలుసు. అంతేకాక సిలిండర్లు విలువైనవి, అలభ్యమైనవి. అందుచేత సిలిండర్లు వెంట తెచ్చుకున్నాము. తెలిసిన వాళ్ళ దగ్గర గ్యాస్ తెచ్చుకుంటే పనినడుస్తుంది కదా అన్నది మా అభిప్రాయం. కనెక్షన్ కొనుక్కుంటే సిలిండర్లు అదనంగా ఉపయోగపడతాయి కదా!

2007 లో, నంద్యాలలో ఇల్లు అద్దెకు తీసుకునే లోపల, మా కుటుంబమిత్రుడు ఖాసీం [భయ్యా అని పిలిచేదాన్ని] ఇంట్లో ఉన్నాము. అప్పట్లో, ఓ రోజు సున్నిపెంట గ్యాస్ డీలర్ ఖాసీం ఇంటికి వచ్చాడు. అతణ్ణి ఖాసిం గ్యాస్ కనెక్షన్ల గురించి అడిగాడు. అతడు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పాడు. మా కోసం తీసుకోమని ఖాసీంని అడిగాము. అప్పుడు మా దగ్గర డబ్బు ఉన్నందున వెంటనే తీసుకుందామని వత్తిడి చేశాము. ఇవాళా రేపూ అంటు వాయిదా వేసాడే గానీ ఆరునెలలైనా తీసుకోలేదు. ఎప్పుడు అడిగినా “ఇప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? ఎప్పుడు సిలిండర్ అయిపోతే అప్పుడు మా ఇంటి నుండి తెచ్చేసుకొండి” అనేవాడు.

అప్పటికే అతణ్ణి పరిశీలిస్తున్నాము. శ్రీశైలంలో ఉండగా ఎవరితో ఏం మాట్లాడామో పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. అలాగే మాకు ఎదురయ్యే అనుభవాలని కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు. అదీగాక, స్కూలులో మా బిజీ షెడ్యూలురీత్యా అంతగా తీరిక కూడా ఉండేది కాదు. అయితే ఆరునెలలు ఏకధాటిగా, అప్పటికి మిగిలిన ఏకైక స్నేహితులు ఖాసీం కుటుంబాన్ని పరిశీలించటంతో, వాళ్ళు మానుండి సమాచారాన్ని సేకరించటమే గాక, మోటివ్స్ తెలుసుకోవటం, డబ్బు ఖర్చు పెట్టించాలన్న మోటివ్ వంటి చాలాపనులతో పాటు, తమ మీద ఆధారపడేటట్లు చేసుకోవటం కూడా చేస్తున్నారని అర్ధమైంది. ఆ వివరాలలో కొన్నిటిని మీరు గతటపాలలో చదివి ఉన్నారు.

ఈ నేపధ్యంలో 2007 డిసెంబరు ఆఖరి వారంలో ఖాసీం కుటుంబంతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నాము. ఆ ’ఎరా’లో దాదాపు వారానికి రెండుసార్లయినా, ఈనాడు ప్రధాన పేజీలో [లేదా లోపలి పేజీలోనైనా] పెద్దపెద్ద అక్షరాలతో గ్యాస్ సిలిండర్లు అక్రమ, వాణిజ్య అవసరాల కోసం వాడటాన్ని అరికట్టడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పధకాలు అమలులోకి తెస్తుందన్న వార్తలొచ్చాయి. నెంబర్లు వేయటం, తనిఖీలు నిర్వహించటం, కొత్తకనెక్షన్లు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపి వేయటం….. గట్రా. ఇక మా నంద్యాల, కర్నూలు జిల్లా ఎడిషన్ లో అయితే, అది దాదాపుగా రోజు విడిచి రోజు ప్రధాన వార్త అయిపోయింది. నంద్యాల స్థానిక ఆర్డివో ఇంటింటా తనిఖీ కూడా నిర్వహించనున్నారని వార్తలొచ్చాయి. అక్రమ సిలిండర్లని పట్టుకుని సీజ్ చేయటం కూడా జరిగింది.

ఏదేమైనా గ్యాస్ వినియోగదారులు అయోమయానికి గురవ్వడాన్ని గురించి కూడా ప్రధానంగా వార్తలొచ్చాయి. అదే సమయంలో, దాదాపు సంవత్సరంపాటు, ఈనాడు ‘వసుంధర’లో వ్యక్తిత్వ వికాస నిపుణులూ, మామూలు ఫీచర్ రచయితలూ, తరచుగా, స్నేహితులతో ఎలా మెలగాలి, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కోపంతోనో, ఆవేశంతోనో స్నేహితులతో దెబ్బలాడితే వాళ్ళ స్నేహన్ని ఎలా పునరుద్దించుకోవాలి….. మొదలైన వివరాల గురించి ’టిప్స్’ చెబుతూ ఫీచర్స్ వచ్చేవి. ఒకప్పుడు ఎంతో స్నేహంగా మెలిగి, ఏ కారణంగానైనా అంతరాయం ఏర్పడితే, తిరిగి ఆ స్నేహితులకి చిరునవ్వుతో ఓ ’సారీ’ చెప్పేయాలని, లేదా ఓ పూల గుచ్ఛమో ఓ మిఠాయి డబ్బానో ’సారీ’ తో జోడించి పంపాలని, లేదా వాళ్ళు ఎదురైనప్పుడు ఓ చిరునవ్వు నవ్వాలనీ….. అలా చేస్తే మళ్ళీ మనం వాళ్ళ స్నేహాన్ని స్వాగతిస్తూన్నామని వాళ్ళకు అర్ధమౌతుందనీ, దాంతో వాళ్ళు ఎంతో ఇష్టంగా మనతో మళ్ళీ స్నేహం చేస్తారనీ, స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడని ఆస్థి అనీ….. ఇలాగన్న మాట.

నాటకీయంగా…. అలాంటి వార్తాంశాలూ, శీర్షికలూ ఈనాడులో వచ్చిన రోజున, మేము ఏదైనా పని మీద బయటకి వెళ్ళగానే, మా మాజీ కుటుంబ మిత్రుడు ఖాసీం, మేం చిరునవ్వు నవ్వితే వెంటనే స్పందించడానికి అందుబాటులో ఉండేవాడు. నిజం చెప్పాలంటే, ఈనాడు వ్రాతలకీ, మా మాజీ కుటుంబ మిత్రుడి ప్రవర్తనకీ ఉన్న లంకె చూసాకే, మాకు, ఖాసీం అనబడే మా మాజీ మిత్రుడు, రామోజీరావుకీ చాలా విలువైన వాడన్న విషయం అర్ధమయ్యింది. అంతేకాదు, అతడు ఈనాడు విలేఖరి కూడా! ఇక్కడ ఒక కిటుకు ఏమిటంటే అతడు, రామోజీరావు గురించి మాత్రం మాట్లాడే వాడు కాదు. మా ఇష్టాఇష్టాలు, భవిష్యత్తు ఆలోచనలు గట్రా మాత్రం మాట్లాడే వాడు. ఆ కోణంలో పరిశీలించాకే ఖాసీం మాతో చేసిన స్నేహంలోని విశేషాలన్నీ మాకు స్పష్టపడ్డాయి. ఆ విధంగా కూడా గూఢచర్యపు పనితీరు మీద బాగా అవగాహన వచ్చింది. అలాగే ఈనాడు మాతో సంభాషించడమూ అర్ధమయ్యింది.

ఇదెలాగంటే – మనం రోడ్ మీద వెళ్తున్నామనుకొండి. దానిలో మనదృష్టిని ఆకర్షిస్తూ వ్యక్తిగానీ, బొమ్మగానీ మరో ఆంశం గానీ ఉందను కొండి. ప్రక్కనున్న వ్యక్తి దానిని దీక్షగా చూస్తున్నాడనుకొండి. మనం ఓ రోజు పట్టించుకోం. ప్రతీసారి జరిగినా ఓ పదిసార్లు పట్టించుకోం. అదే ఏకంగా పదుల సంఖ్యలో జరిగిందనుకొండి. అనివార్యంగా అది మనం పట్టించుకుంటాం. అప్పుడు ఆ విషయం మనకు అర్ధమౌతుంది గదా! అలాగన్న మాట.

నిజానికి ఈనాడు రామోజీరావు మాతో ఇలా మాట్లాడం ఒక్క పేపరు తోనే కాదు, వ్యక్తుల రూపంలో కూడా ఉంటుంది. సూర్యాపేటలోని మా ఇంటి ఓనరు “నువ్వు చదువుకున్నావు గానీ, తెలివిలేదు. కేసులు పెట్టుకుంటారా, అట్లా కాదు ఇట్లా అని మాట్లాడుకోవాలి కాని…..” [దీని గురించి గత టపాలలో వ్రాసాను] అన్నప్పుడు కూడా మాకు అర్ధం కాలేదు. అప్పటికి మేం స్థానిక కాలేజీ వాళ్ళే ఆమె వెనక, స్థానిక పోలీసు అధికారుల వెనకా ఉన్నారనుకున్నాం.

2005 తర్వాతే మాకివన్నీ బాగా అర్ధమయ్యాయి. 2006 లో ది హిందూ ఎన్.రామ్ ఈనాడు తొలిపేజీలో వై.యస్.ని ఉద్దేశించి, మార్గదర్శి వివాదాల నేపధ్యంలో, "“రామోజీరావు మంచివ్యక్తి. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఏమైనా కావలసి ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు. రామోజీరావు అర్ధం చేసుకుంటారు. అంతేగానీ ఇలా వేధించటం సరికాదు. సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఇదికాదు” అన్నాడు. ఇది చదివిన రోజున మేం ఆశ్చర్యపోయాము. ‘వై.యస్.కి ఉద్దేశించే ఎన్.రామ్ అంటున్నట్లయితే, ఆ సందేశాన్ని గుట్టు చప్పుడు కాకుండా, స్వయంగా కలిసి గానీ, దూతల ద్వారా గానీ చెప్పుకుంటారు గానీ పత్రికా ముఖంగా చెప్పుకోరు కదా?’ అనుకున్నాము. అయితే ఇదే విషయాన్ని మా చుట్టూ ఉండే వారిలో ఎవరో under line చేసారు. ఆ తర్వాత రోజుల్లో…. ’స్వయంగా కలవలేని వారికెవరికో చెప్పుకుంటున్నారన్న మాట’ అనుకున్నాము.

అయితే…. ఈనాడు రామోజీరావు, వై.యస్. [అతడు బ్రతికి ఉన్న రోజుల్లో లెండి] దూరదర్శన్ వార్తల్లోనూ మాకేం చెప్పదలుచుకున్నారో తర్వాత్తర్వాత మాకు బాగా అవగాహన వచ్చింది.

ఎలాగంటే….. వై.యస్. మంత్రులతోనో, ఉన్నతాధికారులతోనో, సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు టీవీ కెమెరా ప్రత్యేకంగా అతడి నల్లని చెప్పులని క్లోజప్ లో చూపేది. [మాకు దూరదర్శన్ మాత్రమే వస్తుంది. దాన్ని రిఫర్ చేస్తున్నాను] ఒకోసారి బహిరంగ సభల్లో, వేదిక మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చెప్పు ఊపుతుండే వాడు. ఓసారి అతడి ప్రక్కన కూర్చున్న మరో రాజకీయనాయకుడు, వంగి, వై.యస్.కి ఏదో చెబుతుండగా, ఇతడు వేసుకున్న కాలు మీద కాలు, సదరు రాజకీయ నాయకుడి ముఖం మీదికి వచ్చింది. అయినా వై.యస్. చెప్పు ఊపటం మానకపోగా విశాలంగా, చిరునవ్వు నవ్వుతున్నాడు. అది మాకు చాలా odd గా అన్పించింది. చిత్రమేమిటంటే ఆ ఫోటోలు తర్వాత ఈనాడులో ప్రచురింపబడేవి.

ఇలాంటి విజువల్స్ పదేపదే చూడగా, హఠాత్తుగా ఓరోజు ఫ్లాష్ అయ్యిందేమిటంటే, చెప్పులు చూపించి ’చెప్పు చెప్పు’[tell me] అంటున్నారని! అప్పటికి మేం ముమ్మరంగా బ్లాగింగ్ చేస్తున్నాం. మొదట్లో అంత స్పష్టంగా అర్ధం కాకపోయినా…. క్రమంగా, ’వాళ్ళ’intuition మాకు అర్ధమయ్యింది. మరోమాటలో చెప్పాలంటే అది మాకు అర్ధమయ్యేదాకా continue చెయ్యబడుతుంది. Repeat చెయ్యబడుతుంది.

మరి మాకు అర్ధమయ్యిందో లేదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మాకు ప్రక్కనున్న వారు దానిమీద మాట్లాడితే మన అభిప్రాయం చెబుతాం. ఆ విధంగా అది మాకు under line చేయబడుతుంది. అంతేగాక మా అభిప్రాయం కూడా తమకి తెలుస్తుంది. దాన్ని బట్టి తరువాత కంటిన్యూ చేయవలసిన విషయాలు ఉంటాయి. ఇలాంటివి చేయటానికి పొరుగు వాళ్ళో , ఖాసీం లాంటి స్నేహితులో, రామోజీరావుకు ఉపయోగపడతారు.

మరో విధంగా చెప్పాలంటే….. ఒక గదిలో పాము ఉందనుకుందాం. అది బయటికి పోవటానికి దారి వెతుక్కుంటుంది. ఏ దారీ లేదనుకొండి. మనం ఏ తలుపు తెరిస్తే అటునుండే బయటకి పోతుంది. అలాగే…. మా ఉద్యోగ ప్రయత్నాలో, మా ఉపాధి ప్రయత్నాలో ‘అడ్డం గొట్టటం’ ద్వారా దారులన్ని మూసివేస్తారు. వాళ్ళు తెరచిన ద్వారం నుండి మాత్రమే బయటికి రావాలి. లేదా ఆకలితో ఉండాల్సిందే. ఈ విధంగా ఆకలి తంత్రం ఉపయోగిస్తారు. ఈ విధంగా ఒక మనిషిని పరోక్షంగా, తమకి అనుకూలమైనట్లు నడపవచ్చు.

నిజానికి ఈ రకపు భాష మాకు అర్ధమయ్యాకే, అదే ‘కీ’ తో లేదా ‘పాస్ వర్డ్’ తో…. వై.యస్.కీ, ఈనాడు రామోజీరావుకీ మధ్య నడిచిన రాజరామోజీల యుద్ధ నాటకాన్ని విశ్లేషించగలిగాము. ఇప్పుడు నడుస్తున్న, ఈనాడు – సాక్షిల పరస్పర ఆరోపణల యుద్ధాన్ని పరిశీలించగలుగుతున్నాము.

ఇలా ’చెప్పు చెప్పు’ అంటు చెప్పు చూపిన వై.యస్., ఏ కాలి చెప్పు చూపిస్తూ ఆ సంకేతాన్నిచ్చాడో, సరిగ్గా అదే కాలు, సెప్టెంబరు 2, 2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తెగి, చెట్టుదుంగపై పడింది. ఆ ఫోటో ఈనాడు, వార్త పత్రికలలో బాక్సుకట్టి ప్రచురించాయి.

ఈ సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. 2000 సంవత్సరం ద్వితీయార్ధంలో….. అప్పటికి మేం ఎంసెట్ కుంభకోణం మీద చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు ఇచ్చి ఉన్నాము. ఓరోజు ఈనాడులో, ప్రధాన పేజీ పతాక శీర్షికలో, నెహ్రు జువాజికల్ పార్కులో ’సాకీ’ అనే చిరుతపులికి, బ్రతికి ఉండగానే తోలు వలవబడిందన్న వార్త వచ్చింది. అది రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాదాపు 10 రోజుల పాటు ఈనాడు, ఆ వార్త మీద రకరకాల శీర్షికలతో, అనేక విశేషాలు వ్రాసింది. అచ్చం మొన్న వై.యస్. మరణించినప్పుడు అనేక రకాలుగా అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినట్లన్న మాట!

నిజానికి అప్పటికి మాకు, మా జీవితాల్లో గూఢచర్యం నిండి ఉందనీ తెలీదు. రామోజీరావు ప్రమేయాన్నే ఊహించలేని చోట నెం.10 వర్గాన్ని గానీ, నెం.5 వర్గాన్ని గానీ ఏం ఊహించగలం? మెదళ్ళతో యుద్ధం గురించి ఇంకేం ఊహించగలం? అయితే, అప్పటికి మాత్రం విపరీతమైన ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే – జూలో క్యూరేటర్ నివాసభవనం ఉంటుంది. ఎన్నో అరుదైన జంతువులని ఉంచుతారు గనక, జూ చుట్టూ ఎత్తైన గోడ, దానిపైన సెక్యూరిటీ టవర్సు ఉన్నాయి. రాత్రిపూట సైతం గస్తీ ఉంటుంది. పైగా పులి గాండ్రింపు దాదాపు 5 మైళ్ళు వినిపిస్తుంది. అటువంటిది, బ్రతికి ఉండగా పులి చర్మం వలుస్తుంటే, అది చూసి మిగిలిన పులులూ అరుస్తుంటే లోపలే నివసించే క్యూరేటర్ కి గానీ, సెక్యూరిటీ గార్డులకి గానీ దృష్టికి రాదా? అందునా అంత భీభత్సాన్ని చూసిన మిగిలిన పులులు, బెంగతో కొన్ని రోజులపాటు ఆహారం స్వీకరించలేదని కూడా, ఈనాడు ఆ తర్వాత వారంరోజుల లోపల వ్రాసింది.

అంత సంచలనం కలిగించిన ఆ వార్త, తర్వాత రోజుల్లో చాలా మామూలుగా మాసిపోయింది. ఏ ఎంక్వయిరీ లేదు. ఏ నిజమూ వెలుగులోకి రాలేదు. ఎవరు ’సాకీ’కి తోలు వలిచారో, ఎందుకు వలిచారో…. ఏదీ ఎవరికీ తెలీదు. చాలా మామూలుగా….. దేశ ప్రధానుల హత్యలు ఎంత సంచలనం కలిగించినా ఎంతో మామూలుగా ఆరిపోయినట్లు….. ఇదీ అలాగే అయిపోయింది. అప్పట్లో అది మాకసలు అర్ధం కాలేదు గానీ, తర్వాతి కాలంలో మాకు అర్ధం చేసింది ఏమిటంటే – పులి మనదేశ జాతీయ జంతువు. బ్రతికి ఉండగానే దాని చర్మం వలిచినట్లు – మాకో , దేశభక్తి కలిగిన మాలాంటి వారికో, ఈనాడు రామోజీరావు, చంద్రబాబూ ’తాట వొలుస్తామని’ హెచ్చరిక అన్నమాట. అప్పటికి నెం.5 వర్గం మాకు తెలియదు గానీ, అందులోని వారికెవరికో కూడా [పీవీజీతో సహా] ఇలాంటి హెచ్చరికలు ఇచ్చి ఉంటారని తర్వాత అనుకున్నాము.

దాని ’సువర్ణముఖి’ అన్నట్లు, పాపం, తమ గూఢచర్యపు పైకారణాలు [over leaf reasons] అన్నీ నిష్ఫలం అయిపోయి, వారి అసలు రూపాలు బయటపడుతున్నాయి. నోరులేని మృగాలని, పశుపక్షుల్నీ, ప్రకృతినీ వెతల పాలు చేస్తున్నందుకే…. వాళ్ళు మనిషికి శతృవులు కాదు, మానవత్వానికే శతృవులన్నాను.

ఇక “బ్లాగు డిలీట్ చేయ్. ఢిల్లీ వెళ్ళి సోనియాని కలిసి, మీ దగ్గర ఇంకా ఏమేమి సమాచారం ఉందో అదంతా చెప్పెయ్!” అన్న వత్తిడి మామీద ఎలా తెస్తారో చెప్పాలంటే – ఓ సంఘటన వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

దేశాల మీదే కాదు, వ్యక్తుల మీదైనా నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే ఆకలి తంత్రం ఒకటే! పైకి వైవిధ్యమున్న ప్యాకింగు ఉన్నా, లోపలి సరుకు అదే ఉంటుంది.

ఇటీవల మా బ్లాగులో వ్యాఖ్య వ్రాస్తూ రాఘవ గారూ,
>>>కామినీ-కాంచనాలు అని కదా అంటారు, మీరు కామినీ-క్షుత్తులు అన్నారేమిటి? బొత్తిగా ఆకలివఱకూ తీసుకువస్తారా? అలా చేస్తే మిగతావాళ్లు చూస్తూ ఊరకుంటారా?

అన్నారు. ’చుట్టూ ఉన్నవారు చూస్తూ ఊరుకుంటారా?’ మామూలు పరిస్థితుల్లో అయితే ఆపాటి మానవత్వం అందరిలో ఉంటుంది. కానీ గూఢచర్యం గురిపెట్టిన వ్యక్తుల చుట్టూ అయితే ఇలాంటి అసాధారణ స్థితులు అనివార్యంగా ఉంటాయి.

ఎక్కడిదాకో ఎందుకు? ఈ దేశపు ప్రధాని ఇందిరాగాంధీ, ఎమర్జన్సీ అనంతర ఎన్నికలలో తనూ, తన చిన్నకుమారుడు సంజయ్ గాంధీ ఓటమి పాలయ్యాక, వ్యక్తిగత, కుటుంబ ఖర్చుల కోసం స్నేహితురాలిని 50,000/- రూ. అప్పుగా అడిగిందని సదరు స్నేహితురాలు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈమె ఇందిరాగాంధీ జీవితాన్ని గురించి పుస్తకం కూడా వ్రాసింది. పేరు గుర్తులేనందున క్షమించాలి. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. [1992 జూన్ తరువాత, 1992 డిసెంబరు లోపల, ‘ఇండియా టుడే’ తెలుగు పక్షపత్రికలో ఆ ఇంటర్వ్యూ వచ్చింది.]

ఓ దేశ ప్రధానికి, ఒకప్పటి ప్రధాని కుమార్తెకి, గతంలో అత్యంత ధనికుల జాబితా కెక్కిన కుటుంబంలోని వ్యక్తికి ఇలాంటి స్థితిని ఊహించగలమా? ఇందిరాగాంధీ చుట్టు ఉన్నవారు చూస్తూ ఊరుకుంటారా అంటే తెలిస్తే ఎవరు ఊరుకోరు. కాని అప్పటికే ఆమె చుట్టూ ఎవరిని నమ్మని స్థితికి వచ్చింది. ఆమెకి, ఆమె అనుచర గణానికి మధ్య రకరకాల కాంప్లెక్స్ లు సృష్టించబడినవి. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యం, తాము గురిపెట్టిన వారి చుట్టూ అంత దుర్భేద్యమైన కనబడని ఇనపతెరని నిర్మిస్తుంది. అప్పటికీ సాయంగా నిలిచిన వారిపై సామదానభేద దండోపాయాలనీ ప్రయోగిస్తుంది.

మా ఉదాహరణే తీసుకుంటే, 2001 లో సూర్యాపేటలోని మా ఇంటి నుండి కట్టుబట్టలతో రోడ్డుమీదికి వెళ్ళగొట్టబడ్డాక, నానా వెతలు పడ్డాము. స్నేహితుల పంచన తలదాచుకున్నాము. ఎన్నాళ్ళని స్నేహితులు ఆదుకుంటారు? చివరికి ఆత్మాభిమానం గాయపడినా, సహాయం కోసం నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి చంద్రబాబునాయుడు వాళ్ళని చేరదీయటంతో మస్తు హవా నడుస్తోంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరిలో గల, వాళ్ళ కార్ డెకార్స్ కు, ప్రముఖ రాజకీయనాయకుల దగ్గర నుండి సినిమా తారల వరకూ చాలామంది వచ్చేవాళ్ళు. తెదేపా నాయకులూ, చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ తో బాటు, కాంగ్రెస్ నాయకుల వరకు! నా పెద్దతమ్ముడు చాలామంది బంధువులకీ, చిన్ననాటి మిత్రులకీ కూడా ఉద్యోగాలూ, ఇతర ఉపాధి సౌకర్యాలూ, వసతి సౌకర్యాలూ చూపెట్టాడు. బంధువుల పిల్లలను కూడా తన ఇంటి దగ్గరలో ఇళ్ళు చూసి, వాళ్ళ మంచి చెడ్డలు చూసాడు.

అయితే మాకు మాత్రం, నానల్ నగర్ లో చిన్నరేకుల గదిని అద్దెకు చూసాడు. మాకు పెద్దగా సాయం చేయలేక చేతులెత్తేసాడు. అప్పటికి ఆరెళ్ళ మా పాపతో సహా రెండు రోజుల పాటు పస్తులున్నా…. తల్లీ, తోబుట్టువులూ, బంధుమిత్రులూ, అందరూ చూస్తూ ఊరుకున్నారు. ఒక్కసారి కూడా నానల్ నగర్ లోని మా ఇంటికి వచ్చి చూడలేదు కూడా! స్కూటర్ ఉండి, సామాను లేకుండా, చిన్నపాపతో, ఆ ఏరియాకి తగని మనిషులు వచ్చి అద్దెకు ఉంటే, ఎవరూ చూడటానికి రావటం లేదంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. ఇదేదో లేచిపోయి వచ్చిన బాపతు అని అనుకోరా? అప్పుడు ఎంత చులకన ఉంటుంది? మేము ఆ స్థితికి ఎందుకు వచ్చామో చుట్టుప్రక్కల వాళ్ళకి చెప్పలేము. అలాగని వాళ్ళ చూపులని తప్పించుకోలేము.

బంధుమిత్రులే కాదు, బాల్య స్నేహితులు సైతం, "అందుకే తలవంచుకు పోవాలి. ఇవాళా రేపూ ఎవర్నీ ఎదురించకూడదు. ఎంసెట్ కుంభకోణం కాకపోతే సవాలక్ష అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. కాలమే అలా మారిపోయింది. ఈ అవినీతిని ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి రాజీ పడండి” అని సలహా లిచ్చేవారు. అప్పటికి నా దృష్టిలో ఎంసెట్ మీద ఫిర్యాదు చేసాను కాబట్టి సూర్యాపేట నుండి తరమ బడ్డానన్న భావన ఉండేది. “ఊరు దాటి వచ్చాము కదా! ఇంతకీ ఎవరితో రాజీపడాలి? జీవితం తిరిగి ప్రారంభించాటానికే ప్రయత్నిస్తున్నాము కదా!” అని అడిగితే ఇక అంతే! ’నువ్వే అర్ధం చేసుకో!’ అన్నట్లు తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళు.

అప్పట్లో మా జీవితంలో గూఢచర్యం నిండిపోయిందని గానీ, లేదా గూఢచర్యపు సుడిగుండంలో మా జీవితాలెప్పుడో పడిపోయాయని గానీ గుర్తించనందున, ఈ మాటలేవీ మాకు అర్ధమయ్యేవి కావు. ఎంసెట్ కుంభకోణంపైన ఫిర్యాదు ఇచ్చినందుకు మామీద వ్యవస్థీకృత వేధింపు నడుస్తోందనీ, దీన్నుండి రక్షించమనీ, చంద్రబాబు నాయుడిని సమతాబ్లాకులో 2001 మార్చి 20 న కలిసి అడిగితే, మహాక్రోధంతో గెడ్డం పైకెత్తి “ఎందుకు? ఎందుకు వేధిస్తారు?" అనేసి వెళ్ళిపోయినప్పుడు మా పరిస్థితి అయోమయమే!

అలాంటి ’అసాధారణాలన్నీ’ తరువాత గానీ మా బుర్రకి వెలగలేదు. ఇవి ఒక్క అనుభవంతో చెప్పటం లేదు. ఇలాంటివి చాలా చాలా అనుభవాల తరువాత చెబుతున్నాను. ఆ వివరాలన్నీ మీరు పీవీజీ – రామోజీరావు – మా కథ లేబుల్ లోనూ, భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర గురించిన టపాల మాలికలోనూ చదివి ఉన్నారు.

కాబట్టి స్వానుభవంతో మేము చెప్పేదేమిటంటే – దేశాలని , వ్యవస్థలనీ, జాతులనే కాదు, నకిలీ కణిక వ్యవస్థ తము గురిగా ఎంచుకున్న వ్యక్తులపై కూడా ’ఆకలి’ తంత్రం ప్రయోగిస్తుంది. పస్తులు దాకా తెస్తుంది. సోమాలియాలో ఆకలి చావులు తెచ్చినట్లు!

మీకు ఓ ఆసక్తికరమైన అంశం చెప్పాలి. ఇద్దరు ఆటగాళ్ళు చదరంగం ఆడుతున్నారనుకోండి. బోర్డుపైన పావులు నిమిత్తమాత్రులే! దీన్నే ఆధ్యాత్మిక దృష్టితో చూసి మన పెద్దలు “మనమంతా భగవంతుడి చేతిలో పావులం. నిమిత్తమాత్రులం” అంటారు. గతటపాలలో చెప్పిన ’వదలని ఎలుగుబంటి’ కథలాగా 1992 లో ఎప్పుడైతే రామోజీరావు కుట్రల మీద [అప్పటికి రాజీవ్ గాంధీ హత్య, మత ఘర్షణలు, హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు…. వరకే నాకు తెలుసు] పీవీజీకి ఫిర్యాదు ఇచ్చానో, అప్పుడే నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. నా జీవితమే కాదు, నా కుటుంబసభ్యుల జీవితాలు సైతం. కట్టుకున్నందుకు నాభర్తా, కడుపున పుట్టినందుకు నాబిడ్డా కూడా ఇందుకు అతీతులు కాలేదు. కాకపోతే ’మన జీవితం మన చేతుల్లో లేదు. మనం నిమిత్తమాత్రులం’ అన్న స్పృహ మాత్రం 2005 తరువాత కాలంలో కలిగింది. నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ మధ్య జరుగుతున్న ఈపోరులో నిజంగా మేం నిమిత్తమాత్రులమే!

ప్రపంచవ్యాప్తంగా, శతాబ్దాల తరబడి పాతుకుపోయిన నకిలీ కణిక వ్యవస్థనీ, దాని బలంతో వేళ్ళూనుకున్న నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తుల్నీ బహిరంగపరుస్తోన్న, చేసిన కర్మని [సువర్ణముఖిని] అనుభవింపచేస్తున్న నెం.5 వర్గం, మమ్మల్ని కాపాడదా అంటే కాపాడుతుంది. కాపాడుతుందా అంటే కాపాడటం లేదు.

వివరంగా చెప్పాలంటే మేం ప్రాణాలతో మిగిలి ఉన్నామంటే అందుకు కారణం నెం.5 వర్గమే. మేం వేధింపబడుతున్నామంటే అందుకు కారణం నెం. 10 వర్గమే! మా ప్రాణాల్ని కాపాడగలుగుతున్న నెం.5 వర్గం, మమ్మల్ని వేధింపు నుండి కాపాడటం లేదు. మమ్మల్ని వేధించగలుగుతున్న నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి మామీద ఉన్న క్రోధం, ప్రతీకారాలరీత్యా, మా ప్రాణాలు తీయటమూ లేదు. ఆ విధంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతున్న చదరంగపు ఆటలో మేం పావులం, నిమిత్తమాత్రులం. కొన్ని సంఘటనలు సోదాహరణంగా వివరిస్తాను. దానికి ముందు మరికొన్ని విషయాలు చెప్పాలి.

1992 లో పీవీజీ కి, రామోజీరావు మీద ఫిర్యాదు ఇచ్చేటప్పుడే, ఒకవేళ తేడా వస్తే ప్రాణాలకు హామీలేదని తెలుసు. ఒకవేళ విజయం వస్తే బాధే లేదు అనుకున్నాం. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు, నాణెం ఎగరేస్తే బొమ్మకాదు, బొరుసు కాదు నాణెం నిలబడటం అన్న సంభావ్యత జరిగింది. అదేంటంటే, వేధింపు లేదా సుదీర్ఘ యుద్దం.

అయితే, 1995 తర్వాత 2005 వరకూ, మేం ఇంకే విషయాలు ఆలోచించలేదు. మా బ్రతుకు, మా కెరీర్, మాపాప, దైవభక్తి! ఇదే లోకం. మా జీవితాల్లో జరిగేవన్నీ జ్ఞాపకం ఉండటం సహజంగా భగవంతుడిచ్చిన జ్ఞాపక శక్తి చలువ. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఏం జరిగాయో, జరుగుతుండేవో మాకేం పట్టేది కాదు. వార్తాపత్రికలు చదవటం, టీవీ వార్తలు చూడటం చాలా యధాలాపంగా చేసేవాళ్ళం. కాలేజీలో పని ఒత్తిడి కారణంగా నేనైతే అసలు పేపరే సరిగా చూసేదాన్ని కాదు. 2005 తర్వాతే మళ్ళీ అన్నీ పునఃపరిశీలించటం ప్రారంభించాము.

ఈ నేపధ్యంలో ’అసలు రామోజీరావుకైనా మమ్మల్ని వేధించాల్సిన అవసరం ఏమిటి?’ అని తెగ ఆలోచించాము. పీవీజీకి ఫిర్యాదు ఇచ్చామన్న కసీ,కోపం, ప్రతీకారేచ్ఛ అనుకుందామన్నా, మేం ఫిర్యాదు ఇవ్వటం వలన అతడికొచ్చిన నష్టం కానీ, కష్టంకానీ అప్పటికి మాకేం కన్పించలేదు. ఇంకా RFC, అనేక భాషల్లో ఛానెళ్ళూ గట్రాలతో, అతడి వ్యాపారం మూడుపువ్వులూ ఆరు కాయలుగా ఉండటమే అందరికీ తెలుసు. అందరికీ తెలిసినట్లే మాకూ తెలుసు. అదీగాక కసీ, కోపం, ప్రతీకారేచ్ఛ అయితే ఒక్కబిగిన పీక పిసికేయటం చాలా సులభం! ఇలా వేధింపు అవసరం లేదు.

దాంతో, వెనక్కి మా జీవితాలని కూడా పునఃపరిశీలించుకున్నాం. నిజానికీ అప్పటి నుండీ ఇప్పటికీ, మమ్మల్ని ఎందుకు వేధిస్తారో రామోజీరావుకీ, అతడి సోదరీతుల్య సోనియాకీ, అతడి అనుచరగణాలైన చంద్రబాబు, వై.యస్. [అతడు ఇప్పుడు లేడులెండి] వంటి వారికే తెలియాలి.

మమ్మల్ని వేధించి శోధించి తెలుసుకోవలసిన రహస్యాలేవీ మా దగ్గరలేవు. 2008, జనవరి 17 వ తేదీన ప్రధానికి మేం వ్రాసిన లేఖలో ఇదే వ్రాసాము. దాని తాలూకూ జిరాక్స్ కాపీని తీసుకుని, [లేకపోతే నమ్మమేమో నని] సిబిసిఐడి నుండి జోసెఫ్ అన్న అధికారి, నంద్యాలలోని మా ఇంటికి వచ్చినప్పుడూ అతడికి కూడా చెప్పాము. 2007లో మార్చిలో స్టేట్ మెంట్లు ప్రహాసనం నడిపినప్పుడు [ఆ తదుపరి శ్రీశైలంలోని మా గది, accommodation కాన్సిల్ చేశారు] శ్రీశైలం సిఐకీ చెప్పాము.

"ఎలా బ్రతికినా, పోయే రోజున పోతాం. ఒకసారి కాదు, వందసార్లు ఇదే చేయటానికైనా మేం సిద్దం” అని చెప్పాను. “అసలు రామోజీరావు మీద ఎందుకు… ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు?" అని రెట్టించాడు శ్రీశైలం. సి.ఐ. “తప్పా తప్పా?" అని నేనూ అన్నిసార్లు రెట్టించి అడిగాను. సిబిసిఐడి అధికారి జోసెఫ్ మాత్రం, చాలా కూల్ గా ప్రధాని అపాయింట్ మెంట్ ఎందుకు అడుగుతున్నామని అడిగాడు. “నా రిపోర్ట్ తో మీకు మేలు జరగాలని కోరుకుంటానమ్మా! ఆపైన పైవాళ్ళ ఇష్టం” అనేసి వెళ్ళిపోయాడు.

నిజానికి ఈ బ్లాగు ప్రారంభించినప్పుడు కూడా, మేం ఒకకోణంలో ఇంతే అనుకున్నాము. “మన దగ్గర ఏదో రహస్యాలున్నాయనుకుని కదా వేధిస్తున్నారు? మనకి తెలిసినవి ఏవో అందరికీ తెలిసినవే! అందరూ చదివినట్లే మనమూ వార్తాపత్రికలు చదువుతాం. అందరూ చూసినట్లే టీవీ వార్తలు చూస్తాం. కాకపోతే ప్రారంభం తెలుసుకాబట్టి, ఆయా ఘటనల కార్యకారణ సంబంధం మనకి తెలుస్తుంది. అది అందరికీ చెబుదాం. విషయం తెలిస్తే, ఆ దృష్టితో చూస్తే, చాలామందికి విషయం అర్ధమవుతుంది. కనీసం దీనితో నన్నా రామోజీరావుకి ఉబలాటం తీరిపోతుంది” అనుకున్నాము. అదే నా బ్లాగులోనూ ఓ టపాలో వ్రాసాను.

గతంలో మా మీద “నీ దగ్గరున్న సమాచారం ఏమిటో చెప్పు” అన్న ఒత్తిడి నడిచేది. బ్లాగు ప్రారంభించిన నాటి నుండి, బ్లాగు డిలీట్ చేయమన్న ఒత్తిడి కూడా నడుస్తోంది.

"బ్లాగు డిలిట్ చెయ్! ఢిల్లీ వచ్చి సోనియాను కలిసి, ఇంకా నీకు ఏమేం సమాచారం తెలుసో అదంతా చెప్పెయ్!” ఇదే ఒత్తిడి. వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లో “అతడికి చెప్పినా ఫర్లేదు” అనే ఒత్తిడి నడిచేది. ఇది మాకెలా అర్ధమైందో లేక ఇది మాకెలా అర్ధం చేశారో వివరంగా, దృష్టాంతాపూరితంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మొదట ఒక విషయం పరిశీలిద్దాం.

చిన్నప్పటి నుండీ…. సామాన్య శాస్త్రంలోనూ, [ఒకోసారి ఆంగ్ల వాచక పుస్తకాల్లో కూడా], అప్పుడప్పుడూ పత్రికల్లో వ్యాసాలు రూపంలోనూ, మనం చాలా సార్లే చీమల పుట్ట గురించీ, చీమల జీవన విధానం గురించీ చదివి ఉన్నాం.

మనకి శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం, సదరు శాస్త్రవేత్తలు చెప్పారని పత్రికలూ, పాఠాలూ చెప్పిన దాని ప్రకారం - చీమల పుట్టలో, [తేనెటీగల తుట్టెలో కూడా] ఒక రాణీ చీమ/ఈగ ఉంటుంది, గుడ్లు పెట్టేది ఇదే! పెట్టిన గుడ్ల నుండి లార్వాలు, వాటి నుండి కొన్ని మగచీమలు, కొన్ని రాణి చీమలు పుడతాయి. మిగిలిన లార్వాలన్నిటి నుండీ శ్రామిక చీమలు/ఈగలు పుడతాయి. జట్లు జట్లుగా పనిచేసి ఈ శ్రామిక చీమలు అనువైన వాతావరణ పరిస్థితుల్లో ఆహారాన్ని సేకరించి, పుట్టలో/తేనెతుట్టెలో నిల్వచేస్తాయి. పుట్టల్ని/తుట్టెల్ని నిర్మిస్తాయి. విపత్కర పరిస్థితులు వస్తే లార్వాలని, గుడ్లని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తాయి. పుట్టనీ, రాణిచీమనీ రక్షిస్తాయి. సకల సౌకర్యాలూ [ఆహారంతో సహా] సమకూరుస్తాయి. మగ చీమల్ని కూడా పోషిస్తాయి. రాణి చీమకి సంతాన సఫలత కలిగాక, రాణి చీమ ఆజ్ఞ ప్రకారం మగచీమల్ని చంపేస్తాయి. మళ్ళీ రాణిచీమ పెట్టిన గుడ్లని వర్గీకరించి, రాణి లార్వాలని, మగ లార్వాలని, శ్రామిక లార్వాలని వేర్వేరు విభాగాల్లో ఉంచి, వాటికి తగిన విధంగా సంరక్షణా, పోషణా చూస్తాయి.

రాణిలార్వాలు ఎక్కువ ఉంటే అప్పటికే పుట్టని ఏలుతున్న రాణి చీమ వాటిని చంపేస్తుంది. ఎప్పుడన్నా ఏదైనా రాణి లార్వాతప్పించుకుని చీమగా పరిణామం చెందితే, అదికొన్ని శ్రామిక చీమలని దండుగా చేసుకుని, మొదటి రాణిచీమని చంపేయ ప్రయత్నిస్తుంది. ఇక పెద్ద యుద్దమే! ఒకోసారి మొదటి [ముసలి] చీమని చంపేసి, కొత్త చీమరాణి అయిపోతుంది. ఒకోసారి కొత్త రాణి చీమ, కొన్ని శ్రామిక చీమల్ని, కొన్ని మగ లార్వాలు లేదా చీమల్ని తీసుకుని, వేరుకుంపటి పెట్టేస్తుంది. అంటే మరో కొత్త పుట్ట లేదా తేనె తుట్టె నిర్మిస్తుందన్న మాట.

పుట్ట లోపల…. శ్రామిక చీమలకి, మగ చీమలకీ వేర్వేరు బారెక్సులూ, చనిపోయిన చీమలకీ బరియల్ బ్యారెక్సులూ ఉంటాయని కూడా చిన్నప్పుడు ఇంగ్లీషు పాఠంలో చదువుకున్నాను. కొన్ని రకాల చీమలు వ్యవసాయం కూడా చేస్తాయని [?] ఓ వ్యాసంలో చదివాను. ఇదంతా మనం చదువుకున్నదే!

ఏమయినా…. చీమల క్రమశిక్షణాయుతంగా, వేసవిలో, వర్షాలు లేనప్పుడూ….. బారులు తీరి, ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటూ, ఆహారం సంపాదించడం చూస్తే, నిబద్దతతో శ్రమించే సైనికుల్లాగే ఉంటాయి.

ఇక చీమల పుట్ట/తేనె తూగల తుట్టె గురించి…. ‘శాస్త్రవేత్తలు చెప్పారని పత్రికలూ, పాఠాలూ చెప్పిన దానిప్రకారం’…... అని ఎందుకన్నానంటే……

ప్రశ్నోపనిషత్తులోని రెండవ ప్రశ్న గురించిన ప్రస్తావనలో….

తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ మా మోహమాపద్యథ అహమేవై తత్పంచధాత్మానం ప్రవిభజ్యై తద్బాణ మవష్టభ్య విధారయా మీతిః తే౨శ్రద్దధానా బభూవుః

భావం:
అప్పుడు శ్రేష్టతమమైన ప్రాణం ఇలా అన్నది: “భ్రమలో పడకండి. నన్ను‘నేనే’ ఐదు భాగాలుగా చేసుకుని ఈ శరీరాన్ని ధరించి భరిస్తాను”. కాని వారు [పంచేద్రియాలు] ఆ మాటలు విశ్వసించలేదు.

సో౨భిమానా దూర్ధ్యముత్ర్కమత ఇవ; తస్మిన్నుత్ర్కామ త్యథేతరే సర్వ ఏవోత్ర్కామంతే, తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవప్రాతిష్ఠంతే! తద్యథా మక్షికా మధుకర రాజాన ముత్ర్కామంతం సర్వా ఏవోత్ర్కామంతే, తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంత, ఏనం వాజ్మనశ్చక్షుః శ్రోత్రంచ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి!!

భావం:
ప్రాణం అభిమానపడి, శరీరం నుండి నిష్ర్కమించడానికి సిద్దపడగానే, మిగిలిన అందరి పనీ కూడా నిష్ర్కమించినట్లే ఐంది. ప్రాణం స్థిరపడగానే మళ్ళీ అందరూ కదుటపడ్డారు. తేనెతుట్టెలోని రాజు ఈగ వెళ్ళిపోగానే అన్ని ఈగలూ వెళ్ళిపోయినట్లు, అది తుట్టెలోకి రాగానే అన్ని ఈగలూ స్థిరపడినట్లు, వాక్కు మనస్సు కళ్ళు చెవులూ మొదలైనవన్నీ అలాగే చేశాయి. సంతోషపడి ప్రాణాన్ని స్తుతించాయి.
[వివరణ: ఇక్కడ మనస్సు కూడా ప్రాణం మీద ఆధారపడిన వాటిలో చేర్చబడినదన్న విషయం గమనించాలి. అంటే మానసిక వ్యాపారాలు కూడా శరీరమూ ఇంద్రియాల ద్వారా పనిచేసే శక్తియొక్క ప్రకటరూపాలే.]

ఉపనిషత్తులో రాజుఈగ అని ఉంది. చీమల పుట్టలో/ తేనె తుట్టెలో, రాణిచీమ/ఈగల అధిపత్యమే ఉంటుందో, లేక రాజు చీమ/ఈగల ఆధిపత్యమే ఉంటుందో మనకైతే తెలియదు. జీవ శాస్త్రవేత్తలకే తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు శాస్త్రీయవిషయాల పేరిట కూడా నిజాలని అబద్ధాలు గానూ, అబద్ధాలని నిజాలు గానూ నమ్మించటం కూడా కొన్నిసార్లు జరిగింది.

ఇక ఉపనిషత్తు కథని ప్రక్కన బెడితే ‘చీమలు పుట్ట Concept’ లో మాత్రం ఒక రాణిచీమ, కొన్ని మగచీమలు, చాలా ఎక్కువ శ్రామిక చీమలూ ఉంటాయి.

2]. ఇప్పుడు మరో విషయం పరిశీలిద్దాం:

1980 లలో ‘రోషనార’ అనే నవల బాగా పేరుపొందింది. ఆమె ఔరంగజేబుకు సోదరి. అతడి వెనక మేధస్సు, చోదక శక్తిగా రోషనార పేరుపడింది.[?] ఆ నవలలో, ఢిల్లీ మొగలు చక్రవర్తులు, తమ రాణీవాసాలకి కాపలా కాయవలసిన సైనికులని, హిజ్రాలుగా మార్చటం గురించిన ప్రస్తావన ఉంటుంది.

మనపల్లెల్లో గిత్తలని ’బుడ్డకొట్టటం’ అన్న ప్రక్రియతో ఎద్దులుగా మారుస్తారు. అప్పటిదాకా ప్లేబాయ్ లాగా ఉండే గిత్త కాస్తా, సీరియస్ గా పనిచేసుకుపోయే ఎద్దుగా మారిపోతుందన్న మాట. ఇక గిత్త, ’ఆవు’ గురించిగానీ, ’సంసారం’ గురించిగానీ మర్చిపోతుందన్న మాట.

సరిగ్గా అలాగే!

మొగలు అంతఃపురాల కాపలాకి హిజ్రాలని ఉపయోగించే వారనీ, అందుకు శరీర ధార్డ్యుతగల యువసైనికులకని హిజ్రాలుగా మార్చేవారనీ మరికొన్ని పుస్తకాల్లో కూడా చదివాను. దీనిపైన లోతైన పరిశోధన ’ఏది నిజం’ బ్లాగరు చెప్పగలరేమో! ఇక్కడ కన్పిస్తోందీ శ్రామిక చీమలతో కూడిన చీమల పుట్ట వంటి ఆలోచనా, ఆచరణే!

3]. ఇప్పుడు మరో విషయం పరిశీలించండి:
ఇప్పుడు మనదేశంలో మంత్రిపుంగవులూ, కార్పోరేట్ వృత్తివికాస నిపుణులూ, వ్యాపార కంపెనీల సీఈఓ లూ, ఎంతో విశాలమైన చిరునవ్వుల్ని సమ్మోహనంగా విసురుతూ, చాలా ’కూల్’గా ’30 దాటేవరకూ పెళ్ళిళ్ళు చేసుకోవద్దనీ, 40 దాటే వరకూ పిల్లల్ని కనవద్దనీ’ చెబుతున్నారు. అచ్చం దొడ్డుబియ్యం తినమనీ, ఉపవాసాలు చెయ్యమనీ [పైగా అది ఆరోగ్యానికి మంచిదని కూడా సెలవిస్తున్నారు] చెప్పినట్లే!

ఇది…. ఇప్పుడు, మనదేశ వర్తమానం. అయితే, ఇది…. జపాన్ వంటి దేశాలకి గతం అన్నమాట. అక్కడి వాళ్ళు, ఇప్పటికే, ఈ ‘శ్రామిక చీమ’తనానికి అలవాటు పడిపోయారు. కాబట్టే…. పెళ్ళి, సంసారం, పిల్లల మీద ఆసక్తి తగ్గి, రోజుకు ఆరేడు గంటలు, ఇంటినుండి పనిచేసే ప్రాంతానికి ప్రయాణాలు చేస్తూ, ప్రయాణాల్లోనే నిద్రానిప్పులూ కానిచ్చేస్తూ, బ్రతికి ఉన్న యంత్రాల్లా పనిచేస్తూ, ‘వర్కు హాలిక్’ అన్న బిరుదుల్ని మోసుకుంటూ జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వంధ్యత్వం కూడా ఇందుకు మరోపార్శమే!

ఇక్కడ మరో గమ్మత్తు కూడా ఉంది. కొన్నిదేశాల్లో జనాభా విపరీతంగా పెరగటం! దాంతో ఆహార ఆవాసాది జీవన ప్రమాణాల్లో పోటీపెరిగి, మరిన్ని శ్రామిక చీమలు దొరుకుతాయన్న మాట. ఈ విషయంలో చైనా మనకంటే కొంచెం ముందుంది. కొన్ని మతాల[ఇస్లాం] ప్రజల జనాభా విపరీతంగా పెరగటం, దీనికి భిన్నమైన తంత్రం. దాని గురించి తర్వాత వివరిస్తాను.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మనస్తత్వం పెంచటం వెనుక ఉన్నది కూడా ఈ తంత్రమే! వ్యవసాయం, చిన్నపరిశ్రమల రంగం, విద్యారంగం – ఈ మూడింటినీ ధ్వంసం చేస్తే…. రైతులుగా, చిన్నవ్యాపారులుగా స్వతంత్రంగా బ్రతికే అవకాశాలు తగ్గిపోతాయి. విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తే, పర్యవసానంగా విద్యార్హతలు లేకుండాపోతాయి. [ఇప్పుడు ఆ దారిలోనే ఉంది.] ఆ వంకతో శ్రమదోపిడి చేయటం చాలా సులభం. నిజానికి చదివే చదువులకీ, చేసే ఉద్యోగ బాధ్యతలకీ ఉండే సంబంధం [చాలామంది విషయంలో] తక్కువే! అయినా ’విద్యార్హత చాలదు’ అన్న వంక శ్రమదోపిడి కి చక్కని సోపానం!

ఇప్పటి జపాన్, చైనాల వర్తమానం, భారత్ వంటి దేశాల భవిష్యత్తు! ఇక్కడ కన్పిస్తోంది కూడా శ్రామిక చీమలతో కూడిన చీమలపుట్ట ఆలోచనే! కాకపోతే…. కొంచెం సుదీర్ఘకాలం పాటు, అంటే రెండు మూడు దశాబ్ధాలపాటు, మెల్లిగా పరిణమిస్తూ….. చివరికి ఏ ఒక్కరూ తప్పించుకోలేనంతగా ఉచ్చు బిగించగల ఆచరణ!

కాబట్టే, చూడండి! ప్రజలలో ఎదురుతిరిగే మనస్తత్వాన్ని నలిపివేసే విధంగానే సినిమాల్లోనూ, కథల్లోనూ, ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ లోనూ, మీడియా ప్రచారంలోనూ అంశాలుంటాయి. మాఫియా లేదా ఫ్యాక్షన్ నేత లేదా విలన్ ల హింసాప్రవృత్తిని భయానకంగా చిత్రించబడంలోనూ, ప్రజాదృక్పధంలో భయాన్ని ప్రవేశపెట్టటమే ఉద్దేశంగా ఉంటుంది. ఇవి చాలక అఘోరాలూ, మంత్రతంత్రలూ ఉండనే ఉంటాయి.

అంతేకాదు, అన్నపూర్ణ ఉప్పుల దగ్గర నుండి ఎన్నో వాణిజ్యప్రకటనల్లో, ‘ఫలానా వస్తువు వాడితే ఉన్నతాధికారి అవుతారు’ అన్న ప్రచారం ఉంటుంది. ఫలానా వస్తువు వాడితే పెద్ద పారిశ్రామికవేత్త అవుతారు అన్న ప్రచారం ఉండదు. ఉద్యోగం సంపాదించటమే జీవిత సాఫల్యం అన్నంతగా ఈ ప్రచారం నడుస్తుంది. విజేత అంటే గ్రూప్ 1 లేదా సివిల్స్ టాపర్సే! ‘ఉద్యోగమే పరమావధి’ అన్నమాట.

దీనికి మరో కోణం: చీమల పుట్టలో శ్రామిక చీమల దండుకు కమాండర్ లు కావాలి కదా? అలాంటి స్థానాల్లో, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాల్లో, తమ తమ ఏజంట్లని దేశాధినేతలు గానో, కొన్నిదేశాల్లో సుల్తాన్ లు గానో, పాకిస్తాన్ వంటి దేశాల్లో సైనిక నేతలు గానో, బలంగా వేళ్ళూనుకునేలా చేసింది నకిలీ కణిక వ్యవస్థ. ఇక కార్పోరేట్ కంపెనీ అధినేతలూ ఇలాంటి వారే! ఈ కార్పోరేట్ కంపెనీలకూ, ప్రభుత్వాలకూ లాబీయింగ్ చేయటానికి కన్సల్టెంట్ ఏజన్సీలు మరికొన్ని.

వీళ్ళు 7వ నిజాం నవాబు హయాంలో ఖాసీం రజ్వీ వంటి వాళ్ళన్నమాట. రజ్వీ కనపడేటట్లు కత్తులూ, తుపాకులూ వంటి ఆయుధాలు పట్టాడు. వీళ్ళు, రాజకీయ వ్యాపార విధానాల వంటి ఆయుధాలు పడతారు. [ఉదాహరణకి, అణుఒప్పందం. భారత్, కొన్నిదేశాలతో చేసుకుందని తెలుసుకదా! దానికి లాబీయింగ్ చేసిపెట్టింది మరో కన్సల్టెంట్ కంపెనీ! దానికి ప్రభుత్వం అధికారంగా కొంత ముట్టచెప్పింది. అనధికారంగా ఎంత ముట్టజెప్పిందో? అణుఒప్పంద కంపెనీల నుండి ఆ అనధికార సొమ్ము + తన సొంతలాభం కలిపి ప్రభుత్వంలోని వ్యక్తులు వసూలు చేసుకుంటారు. ఈ లావాదేవీలు కోసం ప్రభుత్వం, “దేశానికి అణుఒప్పందం చాలా చాలా అవసరం” అంటుంది. ఇలాంటివే చాలా ఉదాహరణలు ఉన్నాయి.]

ఇక రాజకీయనాయకులని ’అన్నా’ అని పిలుస్తూ, చెప్పినపని చేసే సహచరులుంటారు. కార్పోరేట్ అధినేతలకు, టేబుల్ ముందు ఫ్యాను క్రింద కూర్చొని పనిచేసే శ్రామిక చీమలతో పాటు, అవసరమనుకుంటే ఎవరి మీదనైనా దాడులు చేయగల భుజబలం ఉన్న ఉద్యోగులూ ఉంటారు. ఇప్పుడు గనుల యజమానుల దగ్గరా, కార్పోరేట్ కాలేజీల యజమానుల దగ్గరా ఉన్నట్లన్నమాట. ఇక దావూద్ ఇబ్రహీం ల అనుచరుల వంటి స్మగ్లింగ్ మాఫియా, హవాలా మాఫియాల సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ రంగంలో ఉన్న అన్నలకైనా, క్రింది స్థాయిలో ’హింసాత్మక చర్యలు’ చేసిపెట్టే దళాలన్న మాట. వీళ్ళు రజ్వీ అధ్వర్యంలో పనిచేసిన రజాకార్ల వంటివాళ్ళు.

వెరసి…. ప్రపంచాన్ని చీమల పుట్టగానూ, సామాన్య జనాన్ని శ్రామిక చీమలు గానూ మార్చే ప్రక్రియే, చాపక్రింద నీరులా, చల్లగా మెల్లగా పనిచేస్తోంది. యూరప్ లో పారిశ్రామిక విప్లవం తర్వాత నడిచిన శ్రమ దోపిడికి మరింత మెరుగులు అద్ది, అప్పుడు చెలరేగిన ప్రజావిప్లవాలు పునరావృతం కాకుండా కావలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకుని, విప్లవాలకు దారితీసిన పరిస్థితులలోని లోటు పాట్లని సరిచేసి…. మరింత పకడ్బందీగా…..మరింత ప్రణాళికా బద్దంగా…. మరింత వ్యవస్థీకృతంగా!

ఇక్కడ కూడా మన ఇతిహాసాలకు సరిగ్గా శీర్షాసనమే! మనకు మన ఇతిహాసాలు, “యజమానిగా బ్రతుకు, శారీరిక స్వాతంత్రమే కాదు, ఆత్మ స్వాతంత్రము పొందమని చెప్తాయి. దానిని సాధన చేయమని చెప్తాయి. కాని నకిలీ కణిక వ్యవస్థకు అనుచరులైన ఈ ప్రభుత్వాలు, ‘బానిసలాగా ఉద్యోగం చేసుకొండి. జీవిత సాఫల్యం పొందండి’ అనే ప్రచారిస్తాయి.

ఈ చీమల పుట్ట వ్యూహంతో…. తరాల తరబడి, శతాబ్ధాల పాటు పనిచేసిన నకిలీ కణిక వ్యవస్థ…. ‘ప్రపంచాధిపత్యం’ అనే తమ చిరకాల వాంఛని సిద్ధించుకోవాలనుకున్న కుట్రలో…. ఆవిష్కృతమైన భగవంతుడి లీలని వివరించి తీరాల్సిందే.

దాని గురించి చెప్పేముందు, మన చిన్నప్పుడు చెప్పుకున్న చిన్న కథని వివరిస్తాను.

అనగా అనగా…..

ఓ చీమ! దానికి భగవంతుడి సృష్టిమీద ఒళ్ళుమండిపోయింది. సృష్టిలో అన్ని జంతువులకీ ఎన్నో శక్తి సామర్ధ్యాలు ఇచ్చిన భగవంతుడు, తనకి చాలా అన్యాయం చేశాడని, దానికి చాలా ఆక్రోశం కలిగింది. పులిని చూస్తే అందరికీ భయం. సింహం అడవికీ రాజు. ఏనుగు భారీ జంతువు…..ఇలా దేని ప్రాధాన్యత, ప్రత్యేకత దానికుంది. తనకే ఏ గౌరవమూ లేదు. అందరికీ తనంటే చులకనే!

దాంతో క్రుద్ద్రత పొందిన చీమ, దేవుడి గురించి ఘోరతపస్సు చేసింది. దాని ఉగ్రతపస్సుకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

చీమ ఆక్రోశంతో తన బాధంత చెప్పుకొని, కసిగా, "దేవుడా! నేను కుట్టగానే చావాలి!” అంది. దేవుడు చిరునవ్వు నవ్వాడు. “తధాస్తు” అన్నాడు.

అప్పటి నుండి చీమకుట్టగానే మనం నలిపేస్తాం. దెబ్బకి చీమ ఛస్తుంది.

ఇదీ కథ!

నిజానికి ఈ కథలో ’తను కుట్టగానే మనిషి చావాలి’ అన్నది చీమ వాంఛ. జంతువులన్నిటి మీదా మనిషి అధిపత్యం వహిస్తున్నాడు గనుక, తాను మనిషిని కుట్టగానే మనిషి చచ్చినట్లయితే, అన్ని జంతువులని భయపెడుతున్న మనిషి తనకి భయపడతాడు. అన్ని జంతువుల మీదా ఆధిపత్యం కలిగిన మనిషి మీద తనకి ఆధిపత్యం ఉంటుంది. ఇదీ దాని ఆలోచన. భగవంతుడు తనకి ఇచ్చిన మంచిలక్షణాలని అది పట్టించుకోలేదు. తనకిచ్చిన క్రమశిక్షణాపూరిత శ్రమజీవనం, వాతావరణం పరిస్థితులని బట్టి జాగ్రత్తగా బ్రతికే ఒద్దికతనం తన ప్రత్యేకతగా అది గుర్తించలేదు. తనకి ఇవ్వని లక్షణాల పట్ల కినుక వహించింది. అదీ వ్యతిరేక ఆలోచనా ధోరణి.

అందుకే ’తను కుట్టగానే చావాలి’ అంది. తన క్రోధంలో ’మనిషిని’ అన్నమాట మరిచిపోయింది. సాక్షాత్తూ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోగల ఉగ్రతపస్సు ఆచరించినా, ఈర్ష్య క్రోధం వంటి అరిషడ్యర్గాలని దాటలేకపోయింది. ఉగ్రతపస్సు చేయగల శ్రమించేతత్త్వం ఉన్నా ప్రయోజనం పొందలేకపోయింది. దేవుడందుకే చిరునవ్వు నవ్వాడు. “తధాస్తు” అన్నాడు.

ఈ కథలో చీమ వంటి వాడే తొలితరం నకిలీ కణికుడు. వేశ్యాపుత్రుడైనందున, గౌరవగ్లానితో బ్రతుకు ఈడ్చినందునా, తనలో కలిగిన వ్యతిరేక భావనలని తరతరాలకి నూరిపోశాడు. వారిద్వారా సమాజంలోకి మరిన్ని రెట్లుగా ప్రవేశపెట్టాడు.

ఏనాటికైనా ప్రపంచ సామ్రాట్టుగా establish కావాలనుకున్నాడు. ఆ కాంక్షని తరతరాలకు సంక్రమింప చేశాడు. కాబట్టే, అతడి తరంలో, తానీషా ’రామోజీ’ కల దర్శకత్వంతో మొదలైన గూఢచర్యాన్ని, పకడ్బందీ వలయంగా, ప్రపంచమంతా అల్లే విధంగా, నకిలీ కణికుల అనువంశీయులు తయారయ్యారు.

ఏడెనిమిది తరాల తర్వాత, దాదాపు 350 సంవత్సరాల తర్వాత…. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లుగా, ‘ప్రపంచ సామ్రాట్టు’గా Expose or Establish కావడం గాకుండా, ‘ప్రపంచ కుట్రదారులు’గా Expose or Establish అవ్వటమే భగవంతుడి లీల! Expose మాత్రం అవుతున్నారు, కాకపోతే తీరే వేరు! ప్రపంచాధినేతలుగా కాదు, ప్రపంచం మీదే కుట్రదారులుగా బహిర్గతం అవుతున్నారు.

అచ్చం…. తను కుట్టగానే మనిషి చావాలను కున్న చీమ, కుట్టగానే తానే చచ్చినట్లుగా!

అందుకేనేమో, పెద్దలు, “మతిలో ఎంతో గతిలో అంత!” అనీ, "చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!” అనీ అంటారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇప్పటికే సినిమారంగం దగ్గరి నుండి ఏరంగంలోనైనా – ’నీ ప్రతిభని నేను మార్కెటింగ్ చేసుకుంటాను. నీకు కొంత పడేస్తాను. నోర్మూసుకుని Obey అవ్వు!’ ఇదే హుకుం! ఇది ఎంత బలమైన నెట్ వర్క్ అయ్యిందంటే, చివరికి సత్తుబేడలని కూడా చెల్లించేటంత! అలాగ్గాక “నా ప్రతిభ నాకు తెలుసు! నన్ను నేను ఋజువు చేసుకోగలను. నాకు నేనుగా రాణించగలను” అన్నా కుదరదు. అప్పుడు ఇంటి కెళ్ళాల్సిందే! ఇంకా కుదరక పోతే ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే!

దాంతో ప్రతిభ ఉన్న వాళ్ళయినా సరే, గాడ్ ఫాదర్ లకీ [అంటే నకిలీ కణికుడి ఏజంట్లకి] మోకరిల్లిక తప్పని స్థితి నెలకొంది. చివరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం….ప్రతిభతోనూ, శక్తిసామర్ధ్యాలతోనూ సంబంధం లేకుండా, ’లాబీయింగ్’ పేరిట అంగలార్చవలసి వస్తోంది.


"ఇదంతా నాకొద్దులే! పోనీ మామూలుగానైనా బ్రతికేస్తాను” అనుకున్నా కుదరదు. “నీకంటూ ప్రతిభ ఉన్నాక అది నకిలీ కణికులకి పైసలు సంపాదించి పెట్టాలి. ప్రయోజనాలు సమకూర్చి పెట్టాలి. అందుకు నువ్వు ఒప్పకోకపోతే నటి సావిత్రిలాగా కోమాలో కూడా కృశించి మరణించాల్సి వస్తుంది. లేదా ఆత్మహత్యే గతి!” ఈ హెచ్చరిక పరోక్షంగా సదరు వ్యక్తులకు చెప్పబడుతుంది.

ప్రతిభంటూ ఉన్నాక ఎవరికైనా గుర్తింపు కావాలన్న కోరిక ఉంటుంది. పైగా మీడియా ప్రచారం ఊరిస్తుంది. కాబట్టి ఎవరైనా తమ ప్రతిభని ప్రదర్శించుకుని మేలైన జీవితాన్ని పొందాలనే ప్రయత్నం ప్రారంభిస్తారు. తద్వారా నకిలీ కణికుల కళ్ళబడతారు.

ఇది తొలితరం నకిలీ కణికుడి బుర్రలోంచి పుట్టిందే అని ఎందుకు అన్నానంటే ‘కంచెర్ల గోపన్న Vs తానీషా’ కాలం నాడే దీనికి బీజం పడింది గనుక!

కంచెర్ల గోపన్న శ్రీరామదాసుడై రామమందిర నిర్మాణం కోసం, తన భక్తి గీతాలతో ప్రజల ఆత్మలను తట్టి, విరాళాలు అడిగితే ప్రజలు ఉవ్వెత్తున స్పందించారు గనుక, ఆ ప్రజా సమ్మోహన శక్తిని, శ్రీరాముడి కోసం గాక, నవాబు ఖజానా నింపడానికి ఉపయోగించమన్న నిర్భంధం, గోపన్నని 12 ఏళ్ళపాటు చెరసాలలో బంధించి, చిత్రహింసలతో పాటు, ఆకలికి గురి చేయటం గురించి గత టపాలలో మీరు చదివిందే! ఆకలికి కూడా లొంగని రామదాసులు అరుదుగా ఉంటారు గానీ, అందరూ అలా ఉండలేరు గదా? కాబట్టి తమపని తేలికగానే అయిపోతుంది.


నిజానికి అప్పటి వరకూ తమ దేశ భద్రత కొరకూ, శతృదేశాల, పొరుగుదేశాల గుట్లూ, లోటుపాట్లు తెలుసుకోవటం కొరకూ రాజులు ఉపయోగించిన గూఢచర్యం, ప్రభుత్వాలు తమ ప్రజల మీదే ఉపయోగించటానికి నాందీ ప్రస్తావనలు వేసింది తొలితరం నకిలీ కణికుడే. తానీషా ’రామోజీ’కలకు దర్శకుడు అతడే!


శ్రీరాముడి మీదా, శీలవంతుల మీదా తొలితరం నకిలీ కణికుడికి ఉన్న ఓర్వలేనితనపు మనోవికారమే తానీషా కలలోకి ప్రవేశపెట్టబడ్డ శ్రీరాముడు తన పేరుని ’రామోజీ’గా చెప్పుకోవటం అన్న స్ర్కిప్టుని రచించింది.

అదే పేరు ‘ఈనాడు రామోజీరావు’కి, అతడి సాధారణ రైతు తల్లిదండ్రులు పెట్టటం నిజంగా ఆశ్చర్యకరమే!

ఈ విధంగా మనిషి ఆకలి మీద ఆడుకోవటం లేదా స్త్రీని అడ్డం పెట్టుకోవటం నకిలీ కణికుల ప్రధాన స్ట్రాటజీలు! పైకి ఎన్నిరకాలుగా కనబడినా స్థూలంగా చూస్తే ఇంతే! ఆడది – ఆకలి. లేదా ఆహం తృప్తి పరచటం/అహాన్ని రెచ్చగొట్టటం. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మమూ అరిషడ్వర్గాలని జయించమనీ, అహాన్ని త్వజించమనీ చెబుతాయి. నకిలీ కణికుల స్ట్రాటజీ దీనికి విపర్యయం. ఏ విధంగా విదురనీతి, నారద నీతిలకి విపర్యయమే నకిలీ కణిక స్ట్రాటజీనో, అదే విధంగానన్నమాట.

అంతేకాదు, హిందూమతం, సనాతన ధర్మం సాటి మనిషికే కాదు, సాటిప్రాణి ఆకలిని కూడా పరిగణిస్తుంది. ఆన్నార్తికి ఆకలి తీర్చటం కంటే పరమధర్మం మరొకటి లేదంటుంది. బిక్షుకులని సైతం దైవ స్వరూపంగా, వారికి దానం చేయటం దైవకార్యంగా భావిస్తుంది. ఏకాదశి ఉపవాసం తర్వాత అతిధులకు భోజనం పెట్టి ద్వాదశి పారణ చేయటం ఆచారం. ప్రతీరోజూ కనీసం ఇందరికి భోజనం పెట్టాక గానీ తాము భుజించక పోవటం గృహస్తు ఆచారంగా ఉండటం ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉండేది.

అతిధి ఆభ్యాగతులకే కాదు, సమాజంలో తమ తోటి బ్రతుకుతున్న, తమకు ఉపయోగపడుతున్న ఇతర ప్రాణుల ఆకలినీ అలాగే గుర్తించేవారు. దాశరధి రంగాచార్య గారు తన జీవన వేదంలో చెప్పినట్లుగా, గ్రామీణులు తము తింటూ ఓ రెండు ముద్దలు తమ వెంట పొలందాకా తోడు వచ్చే కుక్కలకీ, ఓ గుప్పెడు కోళ్ళకీ విసరటం అలవోకగా, అనాలోచితంగా చేసేపని. తినబోయే ముందు కాకికి ఓ ముద్ద అన్నం పెట్టటం చాలామంది ఆచరిస్తూ ఉంటారు. కోర్ల పౌర్ణమి పేరుతో కుక్కలకి కుడుములు పెట్టటం, కనుమ పేరుతో పాడిపశువుల్ని పూజించటం అందరికీ తెలిసినవే!

అంతేకాదు, మా చిన్నప్పటి దాకా కూడా, పల్లెల్లో బిక్షకి వచ్చే జంగమ దేవరని సాక్షాత్తూ పరమశివుని అవతారంగా భావించి, బియ్యం అతడి జోలెలో వేసి విభూతిని పిల్లల నుదుట పెట్టింపించటం భక్తిగా చేసేవాళ్ళు. బుడబుడకల వారితోనూ ఇదే విధంగా ప్రవర్తించే వాళ్ళు. గంగిరెద్దుల వాళ్ళనీ, దాసరి వాళ్ళనీ శుభసూచకంగానూ, వారిపట్ల అనుచితంగా ప్రవర్తించటం భగవదపచారంగానూ భావించేవాళ్ళు. సోదమ్మి సాక్షాత్తూ వెంకటేశ్వరుని దూతే! పుణ్యం అన్న concept తో అయినా అక్కడ పరిగణింపబడుతోంది మాత్రం ఎదుటివారి ఆకలే! ఎదుటి వ్యక్తిని గౌరవించటం.

అలాంటి కులవృత్తుల గురించి అవమానం, లజ్జ అన్న భావన లేవీ ఉండేవి కావు. ధనికులుగానీ దరిద్రులు గానీ, ధర్మబద్దంగా వివాహితులైన తల్లిదండ్రుల కడుపున పుట్టిన జన్మ లజ్జాపూరితమైనది ఎందుకవుతుంది? అదే ఇప్పుడు సినీనటుల పుత్రపుత్రికా రత్నాలు, రాజకీయ నాయకుల వారసులు తల్లిదండ్రుల వృత్తిలోకీ వస్తే అది గౌరవప్రదమయ్యింది. మరి ఒకనాడు పల్లెల్లో ఉన్న చేతివృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ ’అవమానం’ పేరుతో ఎలా కకావికలు చేసినట్లు? ఫలాన వృత్తిని పాటించే కుటుంబంలో పుట్టటం అవమానకరమా? అక్రమ సంతానం అయితే తప్ప, వివాహిత అయిన ఓ తల్లికడుపున పుట్టటం అవమానకరం ఎందుకవుతుంది? ఆ తల్లిదండ్రులు ఏ వృత్తిని పాటించనీయండి, లేక ఏ వర్గంగా పిలవబడనీయండి, అది అవమానం ఎందుకయ్యింది? దీనిపై పూర్తి వివరాలని Coup on Indian life style, Coup on Hindu Religion లో వ్రాసాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

అయితే కులవృత్తి అవమానకరమంటూ వ్యతిరేక భావనలని ఈ 50 సంవత్సరాలలో, సమాజంలోకి చొప్పించిందీ నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ గూఢచర్య తంత్రమే! విభజించి పాలించమన్న కణిక నీతినే ఇక్కడా ప్రయోగించాను. వెరసి ఇందులోనూ ఉన్నది అహాపు తృప్తి లేదా అహాన్ని రెచ్చగొట్టటమే! అదే మూసపద్దతి! మా విద్యార్ధి దాక్కున్నే పది చోట్లు లాగానే! [ఈ ప్రక్రియని మేం ముద్దుగా ’జగదీష్ చిన్నకొడుకులాగా!’ అని పిలుచుకునే వాళ్ళం]

ఇక ఈ విషయాంతరం వదిలేసి మళ్ళీ నకిలీ కణికుల స్ట్రాటజీలే మూలాలైన ఆడది – ఆకలి లోని రెండో అంశం ’ఆకలి’ దగ్గరికి వద్దాం.

’ఆకలి’ అనే ఈ ప్రక్రియని, విన్యాసాన్ని నకిలీ కణికులు వ్యక్తుల మీదే కాదు, దేశాల మీద కూడా ప్రయోగిస్తారని ఇంతకు ముందే వ్రాసాను. ఉదాహరణకి మనదేశాన్ని తీసుకొండి!

రాజకీయలబ్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల పేరిట, జనాకర్షక పధకాల సాకుతోనూ, వ్యవసాయరంగాన్ని నాశనం చేస్తునూ, దేశపు ఆర్ధికస్థోమతని కుదిస్తూ పోయారు. 1989 ఎన్నికల్లో 10 వేల రూపాయల లోపు ఋణాలని రద్దు చేస్తామన్న ఎన్నికల హామీతో వీపీ సింగ్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆనక అప్పలన్నీ దేశవ్యాప్తంగా మాఫీ చేసింది. తదుపరి పరిణామాలలో పదవిలోకి వచ్చిన చంద్రశేఖర్ [తర్వాత సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి గత ఏడాదిలో మరణించాడు. వీపీ సింగు దీ ఇదే కథ] ప్రపంచ విఫణిలో బంగారాన్ని తనఖా పెట్టాడు. తర్వాత పదవిలోకి వచ్చిన పీవీజీ అనావార్యమైన స్థితిలో సరళీకృత ఆర్ధిక విధానాలకి తెరదీసాడు. అప్పటికీ సరళీ కృత విధానాల వేగం కంటే దశే తనకి ప్రధానమని పీవీజీ తెగేసి చెప్పాడు. [I’m not particular about the speed of Economical Reforms; I’m particular its Phase – Interview with Vivek Dube on DD in Sep. or Oct. 1992]


తర్వాత జరిగిన గూఢచర్యంతో కలగలసిన రాజకీయపు పోరులో, మెదళ్ళతో నడిచిన యుద్ధంలోని ఎత్తుపైఎత్తులలో, పీవీజీ 1996 తర్వాత పక్కకి తప్పించబడ్డాడు. తర్వాత గద్దెనెక్కిన అన్ని ప్రభుత్వాలూ [దేవెగౌడ నుండి మన్మోహన్ సింగ్ వరకూ] నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ అనుకూలమైనవేనని ఇప్పటికే దృష్టాంతపూరితంగా నిరూపితమైనదే కదా! ఈ విధమైన నకిలీ కణికుల అనుచర వర్గంలోని సభ్యులతో కూడిన ప్రభుత్వాలు, పార్టీలకి అతీతంగా….. దేశాన్ని, చట్టాలని, కార్పోరేట్ కంపెనీలకీ, రాజకీయ వ్యాపారవేత్తలకీ అనుకూలంగా చక్కదిద్దటం, సెజ్ ల పేరుతో దేశాన్ని అన్యాక్రాంతం చెయ్యటమూ మనం రోజూ చూస్తున్నదే! ఏ ప్రజా వ్యతిరేక చట్టాల గురించి, రూల్స్ గురించి అయినా మాట్లాడాల్సి వస్తే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, సదరు చట్టాల గురించి గతప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని చెప్తుంది.

విత్తనాలు, పురుగు మందుల కంపెనీలతో రైతుల ఖర్చులను పెంచారు. రైతుల ఉత్పత్తులకు, దళారి వ్యవస్థతో ధర లేకుండా వారిని పీల్చి పిప్పి చేసారు. ఇక్కడ ప్రయోగింపబడిన స్ట్రాటజీ ‘Increasing of Expenditure, decreasing of income.’ దానితో రైతులు కుదేలయిపోయారు.

తరువాత దశలో, పచ్చని పొలాలని సైతం, రైతుల్ని లాఠీలతో తన్నీ, తుపాకి గుళ్ళతో చెదరగొట్టి లాక్కొవటమూ, వ్యవసాయరంగాన్ని దుంపనాశనం చేసి, రైతుల్ని ఆత్మహత్యల దగ్గరికి తరిమిగొట్టి చావగొట్టటమూ చూస్తున్నదే! ఇన్నీ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఆహార భద్రతకి ముప్పు రాబోతుందంటూ గోల మొదలు పెడుతున్నారు. ఆహార భద్రతకి ముప్పు వాటిల్లాక, ఆకలి బారిన పడేది సామాన్య, మధ్యతరగతి ప్రజలే. ఇప్పటికే బియ్యం 40/ - రూ., పప్పు 80/- రూ. లతో ’దిశ’ అటువైపే ఉంది.

ఇక సెజ్ ల పేరుతో రైతుల్ని కుదేలు చేయటంలో ’ఆకలి’ కోణమే గాక, మరో ప్రధానాంశమూ ఉంది. అదేమిటంటే ఇంకా ఎంతో కొంతైనా భారతీయ ఆత్మ మిగిలి ఉందంటే అది పల్లెల్లోనే ఉంది. నగరపు కాగితాల తళతళలలో, ఆంగ్లమాధ్యమపు బానిసత్వపు చదువులలో, భారతీయ ఆత్మ, భావవాదపు ఆర్ధ్రత, ఉంటే గింటే, అతికొద్దీమందిలో కొడగట్టే దీపమై తపతపలాడుతోంది.

ఎందుకిలా అంటున్నానంటే – మీరే గమనించి చూడండి. పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు ఓమంత్రి/ఎం.పి./ఎం.ఎల్.ఏ. దగ్గరికి వెళ్ళినా లేదా సదరు నాయకుడే ప్రజల దగ్గరికి వచ్చినా, ప్రజల్లో నాయకుల పట్ల ఓ విధేయత ఉంటుంది. మనస్సులో “వీడుత్త దొంగ!” అన్న భావన ఉన్నా, పైకి మాత్రం…. మన్ననా, మర్యాదా తగ్గవు. అందులో వినయం ఎంత ఉంటుందో, అంతే మోతాదులో “ఎందుకొచ్చిన గొడవ! వీడితో పెట్టుకుంటే ఎక్కడో చోట విసిగిస్తాడు” అన్న రాజీధోరణి కూడా ఉంటుంది. దీనికే ‘లౌక్యం’ అని పేరుపెట్టుకుంటారు. కాబట్టే పట్టణాల్లో, నగరాల్లోనూ ప్రజలు రాజకీయ నాయకులనీ, ఉన్నతాధికారులనీ నిలదీయటం తక్కువ.

అదే గ్రామీణులు, పల్లెప్రజలూ, ఆంగ్ల చదువులు రాని ఓటర్లూ, నిర్మొహమాటంగా రాజకీయ నాయకులని పట్టుకుని దులిపేస్తారు. ఇదే మొన్న కర్నూలు వరదల సమయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. పంచలింగాలలో, కర్నూలు బస్తీలో ముఖ్యమంత్రిని సహనం కోల్పోయోలా చేసి ’నిజంగా రోషయ్యే’ అన్పించేలా చేసింది. ఈ ఒక్క సంఘటనే కాదు, చాలాసార్లు గ్రామీణులే రాజకీయనాయకుల్ని అవినీతి గురించో, మరొక విషయం గురించో నిలదీయగలుగుతుంటారు.

నిజానికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కూడా ఈ కారణంగానే, గ్రామాలపై, రైతులపై, ’మెడమీద కత్తి’ సెజ్ ల రూపంలో పెట్టింది. ఎందుకంటే కార్పోరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలి. ఆకలికి అల్లాడి అయినా రైతులు కూలీలుగా మారాలి. అందుకు ఏ పేరైనా పెడతారు. సెజ్ లంటారు. లేదా సామూహిక వ్యవసాయం లేదా సహకార వ్యవసాయం అంటారు. ఏ పేరైనా ఒకటే! ఇంకా ఇప్పుడు ’ఆహార భద్రతకు ముప్పు ఏర్పడటానికి కారణం చిన్నకమతాలే’ అని కూడా సెలవిస్తున్నారు.

ఎందుకంతగా గ్రామాలపై గురిపెట్టటం అంటే – భారతీయ ఆత్మ ఇంకా అక్కడ ఎంతో కొంత సజీవంగా ఉండటమే కారణం.

అంతేగాక, చిన్న తరహా పరిశ్రమలకు భవిష్యత్తులేకుండా చేసారు. పట్టణ పరిధిలో దాదాపుగా అందరిని ఉద్యోగపరిధిలోకి తెచ్చారు. చిన్న వ్యాపారాలకి గురిపెట్టటం ప్రారంభమైనది. అలాగే గ్రామీణులను కూడా ఉద్యోగపరిధిలోకి తీసుకు వస్తే మొత్తంగా కార్పోరేట్ రంగం చేతిలోకి అందరి జీవితాలు తరలించబడతాయి. అప్పుడు అందరి ‘ఆకలి’ తమ చేతిలో ఉంటుంది. పర్యవసానం, దేశాన్ని పూర్తిగా తమ అదుపాజ్ఞాలలో ఉంచవచ్చు. అమెరికా తదితర దేశాలలో కార్పోరేట్ కంపెనీలు ప్రభుత్వాలని నియంత్రించటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అంబానీలు ప్రభుత్వాలని తమకు అనుకూలంగా మార్చుకోవటం మనం చూసాం! రాష్ట్రాలలో గాలి జనార్ధన రెడ్డి లాంటి వాళ్ళు నియంత్రించటం నిన్న కర్ణాటకలో చూసాం.

ఆకలి మంత్రంతో దేశాలని ’గ్రిప్’ చేశాక, ఇప్పుడు పాకిస్తాన్ లో లాగా ఉగ్రవాదులను తయారు చేయవచ్చు. ఆఫ్గాన్ లో లాగా గంజాయి లాంటి మత్తుమందుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారుచేసుకోవచ్చు. కొలంబియా లాగా మాఫియా కేంద్రాలను తయారు చేసుకోవచ్చు. సోమాలియా లలో, ఆకలి బాధతో చనిపోయిన వాళ్ళు పోగా చోటు ఖాళీ అయ్యింది. అలాంటి దేశాలని సముద్రపు దొంగలుగా మార్చుకోవచ్చు. నౌకలు పట్టుకుని Ransome లు రాబట్టుకోవచ్చు. జపాన్ లలోని ప్రజలని పనిబానిసలు [work holic] గా మార్చి, నిరంతర ఉత్పత్తులు సాధించుకోవచ్చు. జీవితంలో పిల్లాపాపల్ని కనేంత ఆసక్తి కూడా లేనంతగా యాంత్రిక పనిబానిసలు 24x7 పాటు పనిచేస్తారు కదా!

ఇంత లోతుగానూ, సుదీర్ఘ కాలంగానూ గూఢచర్య తంత్రలు ప్రయోగింపబడతాయి. ఈ ’ఆకలి’ స్ట్రాటజీకి ఆధారభూతమైన చీమల పుట్ట Concept గురించి తర్వాతి టపాలలో వ్రాస్తాను. దేశాల మీద అయితే ఆకలి స్ట్రాటజీ ఇలా ప్రయోగింపబడుతుంది.

వ్యక్తుల మీద …….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ చిన్న సంఘటన వివరిస్తాను.

శ్రీశైలంలో ఉండగా మా పాఠశాలలో ఓ విద్యార్ధి ఉండేవాడు. వాడికి బుద్దిమాంద్యం ఉంది. మూడునాలుగేళ్ళు వచ్చేవరకూ దుస్తుల్లోనే మలమూత్ర విసర్జన చేసుకునేంత బుద్దిమాంద్యం! దాదాపు ఏడేళ్ళ వయస్సులో నర్సరీలో చేరాడు. ఆ పిల్లవాడిని బుద్దిమాంద్యుల బడిలో చేర్చడానికి వాడి తల్లిదండ్రులకు నామోషీ! తమ పిల్లవాడికి మాటా నడకా అన్నీ ఆలస్యంగా వచ్చాయి తప్ప, తెలివైన వాడేననీ వాళ్ళ నమ్మకం. వాళ్ళ పెద్దబాబు మా దగ్గర చదవటంతో వీడికీ సీటు ఇవ్వక తప్పలేదు. వారంలో ఒకరోజో, రెండురోజులో బడి సమయం అయ్యేసరికి ఈ పిల్లవాడు కాస్తా ఎక్కడో నక్కేవాడు. తల్లిదండ్రులు వెదుకుతున్నంతలోనే బడి సమయం కాస్తా అయిపోయేది.

వారంలో ఒకటో, రెండో రోజులు వీడు బడి ఎగ్గొట్టే వాడు. ఈ విషయం చెబుతూ వాడి తల్లిదండ్రులు “మా వాడు అలా కనిపిస్తాడే గానీ తెలివి తేటల కేం తక్కువ లేదండి!” అనేవాళ్ళు. నిజానికి పరిశీలించే చూస్తే, ఆ పిల్లవాడు బడి సమయానికి దాక్కునే చోట్లు మహా అయితే ఓ పది ఉండేవి. అంతకంటే కొత్త చోట్లు గానీ, కొత్త పద్దతులు గానీ వాడికి తెలియవు. దానికే వాడి తల్లిదండ్రులు కళ్ళు తిప్పుతూ చెప్పుకునేవాళ్ళు. వాళ్ళంటే అమాయక తల్లిదండ్రులు! తమ బిడ్డ మానసిక అవకరం పట్ల బాధాతప్తులు! కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని గానీ, ఆ పిల్లవాణ్ణి గానీ జాలిగా చూడటం తప్ప, ఎవ్వరమూ ఏమీ అనే వాళ్ళంకాదు.

తరచి చూస్తే….. నకిలీ కణిక వ్యవస్థ ప్రపంచం మీద [దేశాల దగ్గరి నుండి వ్యక్తుల వరకూ] ప్రయోగించే స్ట్రాటజీలు కూడా ఇలాగే పరిమితమైనవి. పైపైన పరిశీలిస్తే వైవిధ్యమున్నట్లు కన్పించినా, తరచి చూస్తే అవే పదిరకాలు !

మరో ఉదాహరణ చెబుతాను. కార్పోరేట్ వ్యాపారరంగంలో ఏ కంపెనీ, ఏ వస్తువుని తయారు చేసి అమ్మినా…. పైపైన ప్యాకింగుల్లోనూ, బ్రాండ్ పేరుల్లోనూ, ఆకారాల్లోనూ వైవిధ్యమే తప్ప, ఆ ప్యాకింగులోపలి అసలు సరుకులో మార్పేమీ ఉండదు చూడండి, అలాగన్న మాట! ఆముదంలోనో లేదా ఆలివ్ నూనెలోనో కాసిన్ని నీళ్ళు, మరికొన్ని పరిమళ పూరిత రసాయనాలు కలిపి XYZ లేదా ABCD మాయిశ్చరైజర్లు అంటూ వందరకాల ఉత్పత్తులు అమ్మినట్లన్న మాట.

నకిలీ కణికుడి స్ట్రాటజీలో ఓ పదిరకాలు ఉంటాయి. అయితే వాటిలో ప్రధానమైనవి రెండే.
ఒకటి ఆడది. రెండు ఆకలి. ఎలాగో వివరిస్తాను.

ముందు మరికొన్ని స్ట్రాటజీలు వివరిస్తాను. తము లక్ష్యంగా ఎంచుకున్న జాతిమీదనైనా, దేశం మీదనైనా చివరికి వ్యక్తులూ, కుటుంబాల మీదనైనా, నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే స్ట్రాటజీ…. అహాన్ని తృప్తి పరచటం లేదా అహాన్ని రెచ్చగొట్టటం! అందుకు ప్రాతిపదికగా తీసుకునేది అరిషడ్వర్గాలనే! అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే! అహంకారం లేదా అహం – దీనికి మరో పేరే మదం. జర్మనీలో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టినా, అమెరికాని ప్రపంచానికి అగ్రదేశం అన్న బిరుదిచ్చి నిలబెట్టినా, ఈ స్ట్రాటజీలలో అంతర్గతంగా ఉన్నది అహాన్ని తృప్తి పరచటమే! ఇది ఫలించకపోతే ‘అహాన్ని రెచ్చగొట్టటం’ ప్రయోగిస్తారు. దేశాల మీదే కాదు, వ్యక్తుల మీద నైనా ఇంతే!

ఒకటి ఆడది:
ఇక తము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల మీదికైతే – సదరు వ్యక్తులు అరిషడ్వర్గాలకీ త్వరగా లొంగిపోయే రకాలైతే వారిపై నకిలీ కణికులు వారిపై ఆవే ప్రయోగిస్తారు. అనైతికతతో మరి కొంతమందిని లొంగదీస్తారు. తము ఎవరిని లొంగదీయాలనుకుంటారో, అలాంటి వారిపైకి, ప్రియులు/ప్రియురాళ్ళని ప్రయోగిస్తారు. సదరు వ్యక్తులు ఆ అనైతికతకీ, అక్రమ సంబంధాలకీ ప్రభావితమైతే ఇక సమస్య లేదు. తమకి కావలసినట్లు నడిపించుకోవచ్చు.

భారత తొలిప్రధాని నెహ్రు మీదకి లేడీ బాటన్ ఈ విధంగానే ప్రయోగింపబడిందని అంటారు. ఈ నేపధ్యంలోనే మొన్నామధ్య బాటన్ మనవరాలు, ఆనాటి లేడీ బాటన్, నెహ్రుల మధ్య నడిచిన లేఖల్ని/బంధాన్ని ప్రస్తావిస్తూ, తానో గ్రంధాన్ని రచించానని ప్రకటించింది. సాధారణ వార్తగా సామాన్యులకి పత్రికల్లో, మీడియాలో ప్రకటింపబడే వార్త ఇంతే! అయితే దీని వెనుక, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, వాళ్ళతో గూఢచర్య యుద్దాన్ని నడుపుతున్న నెం.5 వర్గానికీ మధ్య నడిచిన సంకేత భాష చాలానే ఉంది.

నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా గట్రాలనీ, వాళ్ళ ప్రవర్తనా సరళినీ బహిర్గతపరచటమూ, సువర్ణముఖి అనుభవింపచేయటమూ మానకపోతే, గతించిన నాయకుల వ్యక్తిగత జీవితాల్లో మచ్చలేవైనా ఉంటే వాటిని మేం బహిరంగపరుస్తాం అన్న హెచ్చరిక నెం.5 వర్గానికి అలా ఇచ్చారన్నమాట. అయితే అందుకు నెం.5 వర్గం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. “ఊఁ కానీయ్! ఎవరైనా మాకు ఒక్కటే! ఏది సత్యమో అదే వెలికి వస్తుందనుకుంటాం. అభిమాన నాయకులనుకునో, దేశపు పరువు ప్రతిష్టలనుకునో మీ బ్లాక్ మొయిలింగ్ కి లొంగేదే లేదు. మెదళ్ళతో యుద్దాన్ని ఆపేదీ లేదు” అన్న సమాధానాన్ని నెం.5 వర్గం నుండి విన్నారు. అదీ మాటల్లో కాదు, ’బహిర్గత పరచటం, సువర్ణముఖీ అనుభవింపచేయటం’ వంటి చేతల్ని ఆపకపోవటం ద్వారా! దాంతో ఇక ఆ వార్త అలాగే గమ్మున పక్కకెళ్ళిపోయిందన్న మాట. లేకపోతే జస్వంత్ సింగ్ పుస్తకం రేపినంతటి కంటే ఎక్కువ సంచలనమే బాటన్ మనవరాలి పుస్తకమూ రేపి ఉండేది.

నిజానికి ఇటు వ్యక్తుల మీదకి ప్రియుడు/ప్రియురాళ్ళు ప్రయోగించటం, ఫలించకపోతే – అంటే సదరు వ్యక్తులు అనైతికతని పాల్పడే వ్యక్తులు కాదనుకొండి. కుటుంబగౌరవం, వ్యక్తిగత నైతిక విలువలూ గట్రా ఉన్నవాళ్ళనుకొండి. అప్పుడు ’పెళ్ళి’ అనే వల విసరబడుతుంది.

ఇక్కడ కొన్ని విన్యాసాలని చూద్దాం. యూరప్ చరిత్రలోనే శతాబ్ధాల కీర్తిగల ఇంగ్లండు రాజకుటుంబంలోకి ’ప్రేమపెళ్ళి’ పేరుతో మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన అందగత్తె డయానా అడుగుపెట్టింది. మీడియా ఇచ్చిన ఇమేజి ఆ యువరాణిని మరింత మెరిపించింది. తర్వాత ఆవిడ నడవడిక గురించిన ఉదంతాలూ, వార్తలూ ఎంతగా రాజకుటుంబపు పరువు మర్యాదల్ని మంట గలిపాయంటే – చివరికి బకింగ్ హోం పాలెస్ లోని కాపలా పనివాళ్ళు సైతం, ఒక్కనాడూ ఆమె ముఖం దగ్గర నుండి చూసిన పాపాన పోని అనామకులు సైతం, ఆమెతో తమకు లైంగిక సంబంధాలున్నాయని ప్రకటనలిచ్చేసారు.

ఇలాంటి సంచలనాలలో, ఉన్న నిజాలు ఎన్నో తెలియదు గానీ, ఎన్నో కొన్ని నిజాలున్నాయన్నది మాత్రం నిజం. దాన్నే నిరూపిస్తూ డయానా, తన భర్త యువరాజు ఛార్లెస్ కు విడాకులిచ్చి, ప్రియుడితో ప్రయాణిస్తుండగా మీడియా కంటబడి, మీడియా చేతా వెంటాడపడి రోడ్డు ప్రమాదంలో మరణించింది.

డయానా మరణాన్ని ప్రక్కన బెడితే….అంతకు ముందుజరిగిన అన్ని సంఘటనలలోనూ, ఎక్కువగా నష్టపోయింది ఇంగ్లండు రాజకుటుంబమే. పరువుమర్యాదా ధేమ్స్ నదిలో కలిసాయి.[ప్రపంచానికి చేసిన ద్రోహంతో పోలిస్తే ఈ సువర్ణముఖి ఆ రాజకుటుంబం అనుభవించవలసిందేనకుకోండి.] రాచకుటుంబంతో పోలిస్తే డయానా కుటుంబానికి ఏ పేరు ప్రఖ్యాతులూ లేవు. ఏది వచ్చినా [దుష్కీర్తీ కానివ్వండి, సత్కీర్తీ కానివ్వండి, డబ్బు కానివ్వండి] యువరాజుతో వివాహమయ్యాకే! ఈ నేపధ్యంలో….. రాజకుటుంబం ఎన్నిసార్లు, ఎన్ని వ్యవహారాల్లో ఎంత నష్టపోయిందో, ఎంత వెనక్కి తగ్గిందో ఎవరికి తెలుసు? డయానా వంటి సుందరీమణులతో ప్రపంచవ్యాప్తంగా చాలాపనులే చక్కబెట్టగలిగింది నకిలీ కణిక వ్యవస్థ!

ఇలాంటిదే, మనరాష్ట్రంలో మరో ఉదాహరణ – లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ ని డిస్ కార్డ్ చేయటానికి నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ప్రయోగించిన అస్త్రం లక్ష్మీపార్వతి. హరికథా కథకురాలైన ఈ వీరగంధం లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ తో వివాహంతో పోయిందేమీ లేదు. ఇంకాపైన ఇమేజ్, ఆస్థి వచ్చిచేరాయి. ఎన్టీఆర్ తో పోల్చుకుంటే ఆమెకు పేరు ప్రఖ్యాతులేవీ లేవు గనుక! ఈ ఇద్దరి ద్వితీయ వివాహంతోనూ, తదుపరి పార్టీ, కుటుంబ వివాదాలతోనూ, పోయింది ఎన్టీఆర్ కుటుంబపు పరువు మర్యాదలూ + ఆస్థులే! ఈమెని ఉపయోగించి కావలసిన విధంగా రాజకీయాల్ని, రామోజీరావు నడిపించుకోగలగటం గురించి మీరు నా గత టపాలలో చదివి ఉన్నారు.

ఇలాంటి ‘స్త్రీ అస్త్రాలకు’ తరగనన్ని ఉదాహరణలున్నాయి. కాన్షీరాంని ప్రక్కకు తోసేసిన మాయావతి మరో సజీవ తర్కాణం. కాన్షీరాం బ్రతికి ఉండగానే అతడు స్థాపించిన బి.ఎస్.పి. కాస్తా మాయావతి హస్తగతమైంది. అతడి తల్లీ చెల్లి కోర్టుకెక్కి ఘోల్లుమనాల్సి వచ్చింది.

ఇలా అక్రమ సంబంధాలకి లొంగే వాళ్ళతో నకిలీ కణిక వ్యవస్థ తేలిగ్గానే తమకి కావలసిన విధంగా నడిపించుకోగలదు. ఎటొచ్చీ, ఇలాంటి అనైతికతకి లొంగని రకాలతోనే వీళ్ళకు ఇబ్బంది. ఇక అలాంటి వ్యక్తుల మీదికి ఏకంగా ’పెళ్ళి’ మిష విసురుతారు. నిజానికి ఈ స్ట్రాటజీ చరిత్రలో చాణిక్యుడు ఉపయోగించిన విషకన్య వంటిదే! కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషకన్యలే గాక విషయువకులూ ఉండటం కద్దు.

ఇందుకోసం, బాల్యం నుండీ శిక్షణ ఇవ్వబడ్డ,[ఒక్కమాటలో చెప్పాలంటే Born Spy అన్నమాట] ఏజంట్లు ఉంటారు. ఇప్పడు 16, 17 ఏళ్ళ మానవబాంబులకు మూడు నాలుగేళ్ళ ప్రాయం నుండే శిక్షణ ఇస్తున్నారు చూడండి, అలా! పసితనం నుండీ…. జీవితంలో నటించటం, నేర్పుగా సమాచారం చేరవేయటం, ఎదుటి వ్యక్తికి [అంటే జీవిత భాగస్వామి], అతడు/ఆమె కుటుంబసభ్యులకి అనుమానం రాకుండా పరిస్థితుల్ని ప్రభావపరచటం, వారి మోటివ్స్ తెలుసుకోవటం, తదనుగుణంగా వ్యూహరచన చేయటం, వారి అభిప్రాయాలని ప్రభావపరచటం గట్రాగట్రా కార్యకలాపాలు నిర్వహించేందుకు తగినంతగా శిక్షణ నిస్తారన్నమాట. ఇందిరాగాంధీ కుటుంబలోనికి ప్రవేశపెట్టబడ్డ సోనియా ఇలాంటి వ్యక్తే! జన్మతః కవిగాయకుల లాగా ఇలాంటి వారు జన్మతః గూఢచార నిపుణులు!

ఇలాంటివి కుదరనప్పుడు నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే మరో స్ట్రాటజీ ఏమిటంటే – తము గురిపెట్టిన కుటుంబంలోని ఎవరో ఒకరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం. కాస్ట్రోల సోదరి జువాలిత్ క్యాస్ట్రో మాదిరిగా నన్నమాట!

స్ట్రాటజీ ఏదైనా గానీ, అందులో ప్రధానమైనది ’స్త్రీని ఉపయోగించుకోవటం!’ వీలయితే అక్రమ సంబంధం లేకపోతే పెళ్ళితో సక్రమ సంబంధం! పోకిరి చిత్రంలో పండు గాడన్నట్లు ’ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి’ నకిలీ కణికులకి సిగ్గు అనిపించదు. ఎందుకంటే – తొలితరం నకిలీ కణికుడు వేశ్యపుత్రుడు. లజ్జారాహిత్యం నుండే జన్మించిన వాడు. లజ్జా రాహిత్యాన్ని, సిగ్గు లేనితనాన్ని ఒక బలమైన లక్షణంగా పుణికి పుచ్చుకుని తరతరాలకి, అంతిమంగా సమాజంలోకి బలంగా ప్రవేశపెట్టిన వాడు.

స్త్రీగా, వేశ్యగా, దాసీగా తన తల్లి ’ఉపయోగపడటం’ లో నుండి కలిగిన మనోవికారం, తొలితరం నకిలీ కణికుడిలో ఎంత జుగుప్సాపూరిత భావనలని పెంచిందంటే – అతడికి నీతిగా, శీలవతిగా మెలిగే స్త్రీలంటే కంపరం, భరింపలేనితనం! అది ఒక్క స్త్రీ పట్లే కాదు, నీతిగా, శీలవంతుడిగా ఉండే పురుషుడి పట్ల అయినా ఇతడికి భరించలేనంత అసూయ, క్రోధం!

కనుకనే – సీత తప్ప మరో స్త్రీని ఎరుగని ఏకపత్నీవ్రతుడు రాముడన్నా, శ్రీరాముడు తప్ప మరో పురుషుణ్ణి తలచనైనా తలచని సీతమ్మ తల్లి అన్నా, తొలితరం నకిలీ కణికుడికి చెప్పలేనంత ద్వేషం. దాన్నే తరతరాలకీ, ముస్లింలకీ, సమాజానికీ ఇంజక్ట్ చేసాడు. కాబట్టే…. ఎంతగా హిందూమతాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడో, అంత ప్రయత్నమూ రామాయణం మీద చేసాడు. రామాయణం మీద విషప్రచారం ఒక ఎత్తు, మిగిలిన భారత భాగవతాలపైనా, వేద వేదాంగాలపైనా, పురాణ గాధలపైనా చేసిన విషప్రచారం మొత్తం ఒక ఎత్తు! రామాయణ విష వృక్షమే దానికి నిలువెత్తు ఉదాహరణ! భారతంలోనికీ, భాగవతంలోనికి ఎన్నో ప్రక్షిప్తాలు జోడించినా భారత విష వృక్షాలు రచింపబడలేదు, అలాంటి రచయితలూ రచయిత్రులకు రంగనాయకమ్మలకు నడిచినట్లు బ్రహ్మరధం నడవలేదు.

అలాంటివి తొలితరం నకిలీ కణికుడి మూలాలు. స్త్రీని గౌరవించని, గౌరవించలేని మనోవికారం ఈ వంశీయులది. కాబట్టే ఎవరు అనైతికతకి పెద్దపీటమేస్తారో, లైంగికంగా అక్రమ సంబంధాల పట్ల ఎవరికి లాలస ఎక్కువో, అలాంటి వారికే నకిలీ కణిక వ్యవస్థ ఆర్ధికంగా, కెరియర్ పరంగా, వృత్తి విజయాల పరంగా సఫలతని సమకూర్చింది. వాళ్ళనే పైకి తెచ్చింది. అలాగని పైకి వచ్చిన అందరికి ఇదే బలహీనత అనికాదు. అలాంటి కేటాగిరిలో కొందరు కరుణానిధి, నేదురమల్లి జనార్ధన రెడ్డి గట్రాగట్రాలు! నిన్నటి కర్నాటక రాజకీయాల్లో గనుల మాఫియాగా పేరుపెట్టబడిన గాలిసోదరులు పైకారణంగా చూపించింది కూడా ముఖ్యమంత్రి యడ్యూరప్పకి సన్నిహితురాలైన మంత్రిగా శోభా కరంద్లాజేనే! ఆమె అన్నిటిలో అతిజోక్యం చేసుకుంటుందన్నది పైకి చెప్పిన ఆరోపణ!

నిజానికి నకిలీ కణిక వ్యవస్థ, లైంగిక అక్రమ సంబంధాలకి, అనైతికతకి లొంగేవాడినే ఎక్కువగా ఎంచుకోవటానికి మరికొన్ని కారణాలున్నాయి. అటువంటి సంబంధాలకు లొంగేవారికి తమ జీవిత సహచరి/సహచరుడి పట్ల నిబద్దత ఉండదు. కుటుంబం పట్ల నిబద్దత లేదంటే, అంతగా స్వార్ధపరులన్న మాటే. అలాంటి వారు స్వసుఖం కోసం, స్వప్రయోజనం కోసం ఏం చేయాటానికైనా సిద్దపడతారు. ఇది ఒక ప్రయోజనం.

అలాంటి వారిని మరింత విషయలాలసలోకి దించి, ఆ రహస్యాలన్నిటినీ గుప్పిటిలో పెట్టుకుంటే ఇక చచ్చినట్లు పడుంటారు. అప్పడిక వాళ్ళని ఖర్చుతక్కువతో ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇది మరో ప్రయోజనం.

ఇక ఇలాంటి అనైతికతకి అంతగా సిద్దపడని వారున్నారనుకోండి. వాళ్ళపైన ఎంత ఒత్తిడి సృష్టిస్తారంటే ‘మానసిక ఒంటరితనాన్ని’ ప్రయోగిస్తారు. అలాంటి ఎడారిలో, ఒయాసిస్సులా, తమ భావాలని అర్ధం చేసుకునే ఒకే ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలుగా ’ఒకరు’ తారసపడతారు. భావ సారూప్యతా, సహ అనుభూతి గాఢమైనాక, అది నెమ్మదిగా ధృడమైన అక్రమ సంబంధంగా లేదా స్నేహ సంబంధంగా మారుతుంది.

ఇలాంటి అవకాశం కూడా లేకపోతే ఇక అప్పుడు ’పెళ్ళి’ అన్నదే ప్రయోగింపబడుతుంది. అదీ కుదరనప్పుడు ఆ కుటుంబానికి ఆప్తమిత్రులూ, కుటుంబ మిత్రులూ, సోదర సోదరీతుల్యులూ ప్రయోగింపబడతారు.

ఈ విధంగా నకిలీ కణికులు ప్రయోగించే స్ట్రాటజీలో ప్రధాన అంశం, అస్త్రం స్త్రీయే!

ఇక రెండోది ఆకలి!
తము లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తి లేదా జాతి లేదా దేశం మీద, నకిలీ కణికులు ప్రయోగించే స్ట్రాటజీ –
ముందుగా వారి ఆర్ధిక మూలాలని దెబ్బగొట్టటం! ఆదాయానికి గండి కొట్టటం, ఖర్చులు పెరిగి పోయేటట్లు చేయటం, క్రమంగా ఆస్థులూ, ఆర్ధిక నిల్వలూ కరిగించటం – పర్యవసానంగా అప్పలలోనికి, ఆ తర్వాత దారిద్ర్యంలోనికి నెట్టటం. అంతిమంగా ఆకలికి గురి చెయ్యటం.

ఎంతగా నీతికో, నమ్మిన విలువలకో కట్టుబడి, నకిలీ కణికుల ఒత్తిడికి తలొగ్గని వారైనా, చివరికి ఆకలికి తాళలేక అయినా లొంగిపోక తప్పని స్థితి కలిగిస్తారు. లేదా మృత్యువు ఒడికి చేరాలి.

వ్యక్తుల దగ్గరి నుండీ దేశాల దాకా ఇదే తంత్రం అమలు చేయబడుతుంది. వ్యక్తులు మృత్యువుకైనా సిద్దపడతారేమో గానీ దేశానికి దేశాలే సిద్దపడలేవు గదా? ఉదాహరణకు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను, ఆకలి దగ్గరికి తీసుకొచ్చింది నకిలీ కణిక వ్యవస్థ!

నకిలీ కణిక వ్యవస్థ ఏ దేశం మీద పట్టుబిగించ దలుచుకుంటే ఆ దేశం మీద –
ముందు వాళ్ళకి బాగా సాగనిచ్చి, ఆ దేశానికి బాగా ఇమేజినిచ్చి, వాళ్ళ అహాన్ని బాగా తృప్తిపరచి, తర్వాత ఒక్కసారిగా ఆర్ధిక ఇబ్బందులలోనికి నెట్టి అహాం మీద దెబ్బతీస్తుంది. అప్పటి వరకూ అతిశయపు శిఖరం మీద ఉన్నవారికి ఆత్మన్యూనత ఆఖాతంలోకి జారిపోవటం చాలా సహజం అవుతుంది. బ్రిటన్, రష్యా దేశాల మీద ఇదే ప్రయోగించింది. రెండవ ప్రపంచయుద్ధం బ్రిటన్ ప్రాభవం కుప్పకూలటానికి పైకారణం[over leaf reason] అయితే, అసలు సోషలిజం కుప్పకూలటమే, పెరిస్త్రోయికా పేరుతో USSR చిన్నాభిన్నమైపోవడానికి పైకారణమయ్యింది. [over leaf reason]

లేదా ముందు నుండే ఆర్ధికంగా బలపడనివ్వకుండా ఉండటం! ఎక్కువగా – మానసిక స్థైర్యమూ, వృత్తిగత ప్రతిభా, వ్యక్తిగత సామర్ధ్యాలూ ఎక్కువగా ఉన్న వ్యక్తుల మీదా, అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశాల మీదా, నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే తంత్రం ఇది. భారతదేశం మీద తొలితరం నకిలీ కణికుడి కాలం నుండి [దాదాపు 350 సంవత్సరాలుగా] ఇదే ప్రయోగింపబడుతోంది. అఫ్ఘనిస్తాన్ నుండి ఎడారి దొంగలైన ముస్లింలూ, యూరపు నుండి సముద్రపు దొంగలైన తెల్లవాళ్ళు భారతదేశంలోకి రావటానికి ముందు, దేశాన్ని దోచుకుని పోకముందు, భారతదేశం సర్వసంపదలతో తులతూగుతుండేది. విద్యాసంస్కృతాలతో అలరారుతుండేది. జ్ఞాన జ్యోతులతో వెలుగులు ప్రసరిస్తూ ఉండేది.

అలాంటి ప్రకృతి సహజ వనరలూ, సారవంతమైన భూమినీ, భావవాద మూలాలున్న జాతినీ, కలిగి ఉన్న భారతదేశాన్ని, దోచిదోచి పీల్చి పిప్పిచేసి, చివరికి అప్పలు పాలు చేయటంలో నడిచింది ఈ తంత్రమే! ముస్లిం రాజుల దోపిడి నుండీ క్రమంగా యూరోపియనుల దోపిడిలోకి పరిణమించాక, నకిలీ కణిక వ్యవస్థ అందులో అంతర్గతంగా ఎలా పనిచేసిందో గతటపాలలో వివరించాను. నిజానికి ఇదీ తొలితరం నకిలీ కణికుడి బుర్రలో నుండి పుట్టిందే! అప్పటి నుండీ ఇప్పటి దాకా తరతరాలుగా నకిలీ కణిక వ్యవస్థ అమలు చేస్తున్నదే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

[తరువాయి భాగం…..]
నవంబరు 13 వ తేదీన గాలి జనార్ధన రెడ్డి, చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ…..

>>>చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నప్పుడే 2002 లో APMDC చేతిలో ఉన్న 392 ఎకరాల మాంగనీసు లీజును ఒకగంటలో మూడు ఉత్తర్వులతో ఎస్.కె.సర్వాగి అనే వ్యక్తికి కేవలం మూడు లక్షల రూపాయలకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇనుము ఇప్పుడు టన్ను వెయ్యిపలుకుతోందని చెప్పారు. అప్పుడు, ఇప్పుడూ మాంగనీసు టన్ను రూ.40 వేలు ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇలాగే అబద్దాలు ప్రచారం చేస్తుంటే…. నీ బండారాలు బయటకు తీస్తానని హెచ్చరించారు. “2002 లో నువ్వు లీజు బదిలీ చేసినప్పుడు ఐరన్ ఓర్ కు మార్కెట్ లేదు. తరువాత మార్కెట్ పెరిగింది. గత అయిదేళ్ళులో మా కంపెనీ టర్నోవరు ఆరువేల కోట్లరూపాయలు అయ్యింది. నాకు మైనింగ్ లీజు ఇచ్చింది 2002 లో……ఇదే దగుల్భాజీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు” అన్నారు.

>>>రామోజీరావుకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ఐమాక్స్ థియేటర్ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడరు?

>>>బాబూ…..నీ అక్రమ ఆస్థులను కాపాడుకోవడానికే సీఎం రమేష్ ను పోలిట్ బ్యూరో లోకి తీసుకున్నారా?మధుకాన్ నామా నాగేశ్వరరావు ఆక్రమాలను కప్పిపుచ్చుడానికే పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి కట్టబెట్టారా?

>>>రామోజీరావు దివాళాతీసి టోపి పెట్టే సమయంలో నిమేష్ కంపానీకి రూ.100 షేరును రూ.5 లక్షలకు ఇచ్చారు. అవి నీ డబ్బులు కావా?

వెరసి చంద్రబాబు హయాంలోనే గాలిసోదరులకి గనుల లైసెన్సు ఇచ్చారు. దాంతోపాటు ఇప్పటికీ గుట్టుచప్పుడు చెయ్యనీ మరెవ్వరికో మాంగనీసు గనులనీ [392 ఎకరాలని కేవలం మూడు లక్షల రూపాయలకట]లీజుకి ఇచ్చారు. నామా నాగేశ్వరరావు కు పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి కట్టబెట్టినప్పుడు పార్టీలో అసంతృప్తి సెగలు వచ్చాయి. అయినా సరే, చంద్రబాబునాయుడు వాటిని లెక్కచేయకుండా నాగేశ్వరరావునే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించాడు.

చంద్రబాబునాయుడు ఎవరి చేతిలో బొమ్మో అందరికీ తెలిసిన విషయమే. ఇంతేకాదు ఇక్కడ మరోవిషయం చెప్పాలి. వై.యస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబునాయుడిపై ఇలాగే అవినీతి ఆరోపణలు చేసాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అవినీతిపై విచారణ చేయలేదమని ప్రశ్నించగా ’చర్యతీసుకోవటానికి సాంకేతిక రుజువులు లేవు’ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత వై.యస్. కూడా అవినీతి సొమ్ము కూడబెట్టాడు. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ అవినీతి సొమ్మునూ వెలికితీయరు. తమకి అవసరం అయితే, మధు కోడా మీద చర్యతీసుకోవటానికి అన్నిరకాల సాంకేతిక రుజువులు లభ్యమౌతాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడైనా, వై.యస్. అయినా, రామోజీరావు చేతిలో బొమ్మలే అని అర్ధమవుతుంది కదా!

అసలు గనులూ, భూగర్భ సంపదలూ, ప్రకృతి సహజ వనరులు ఎవరబ్బసొమ్ము? గనులు ఎవరి సొత్తని ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం అప్పగించింది? కేజీ బేసిన్ లోని సహజ వాయునిక్షేపాలని అంబానీలకీ[ముఖేష్ అంబానికీ], ఇనుపఖనిజాలని గాలిసోదరులకి, ఇంకా ఇలాంటివే మరెందరు అనుచరులకో ఎలా అప్పగించినట్లు? చిన్నప్పుడు గనులు, ఇతర ఖనిజ సంపదలు, జాతీయ సొత్తని పాఠాల్లో చదువుకున్నాం. చిన్నపిల్లలకి పాఠాలుగానూ చెప్పాము.

1992 కు పూర్వమైతే ఇలా ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత ఆస్థులుగా గనులు ఉండటం గానీ, వాటి నుండి వందలూ వేల కోట్ల సొమ్ము ఆర్జించటం గానీ, దానిపైన వివాదాలు గానీ, ప్రభుత్వానికీ కూలదోయగలిగేంత గనుల మాఫియాల గురించి గానీ వినలేదు, చదవలేదు. ఇప్పుడు చూస్తే…. చాపక్రింద నీరులా, నిశ్శబ్దంగా ఎప్పుడు ఇలాంటి అనుకూల చట్టాలు తెచ్చుకున్నారో? లేక చట్టానికి సవరణలు చేసుకున్నారో? కాపీ/పేస్టు రాజ్యాంగంలోకి, గుట్టుచప్పుడు గాకుండా, మరెన్నీ పేస్టులు చేసేసుకున్నారో?

రాష్ట్రాల్లో, కేంద్రంలో, ఏపార్టీ అధికారంలో ఉన్నాసరే…. ఇలా ప్రజలు సొత్తునీ, దేశపు ప్రకృతి వనరులనీ కొల్లగొట్టటం అనే ప్రక్రియలో మాత్రం 1996 నుండీ అంతరాయం లేదు. ఇది చెప్పటం లేదూ, పార్టీలకి అతీతంగా దేశంలోని అవినీతిని అర్గనైజ్ చేస్తోంది ఒకే వ్యవస్థ అనీ?

నిజానికి, గాలిజనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయకుల పరస్పర ఆరోపణలుతోనే, ఎవరి హయాంలో ఎవరెవరికి, ఎంతెంత అనుకూలంగా, ఎంతెంత చౌకగా లీజులిచ్చారో తెలిసింది. ఆ విధంగా, అనుభవిస్తున్నాననుకోకుండానే రాజు అనుభవించిన శని ప్రభావం లాగా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల అవినీతి అనుశృతంగా బహిర్గతమౌతోంది.

మరో విషయం గమనించండి. మూడేళ్ళక్రితం తెదేపాతప్ప, ఎర్రపార్టీలు, భాజపా వాళ్ళు కలిసి, గాలిసోదరులు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో ప్రయాణించి మరీ, ఓబుళాపురంలో అక్రమాలేవీ లేవని కితాబులిచ్చారట. అప్పటికి లోక్ సత్తా, ప్రజారాజ్యం పుట్టలేదు లెండి. ఎర్రపార్టీ వాళ్ళకి అప్పట్లో కేంద్రప్రభుత్వం యూపిఏ తో భాగస్వామ్యం ఉంది. అప్పటికి యూపిఏ కి మద్దతు ఇస్తున్నారు. దాంతో అన్నీ బాగానే ఉన్నట్లనిపించాయి. ఇప్పుడు తెదేపాతో కలిసి గావుకేకలు వేస్తున్నారు. భాజపా వాళ్ళకి సంబంధించి అప్పడు, ఇప్పుడు గాలిసోదరులు కర్ణాటకలో తమపార్టీకి ప్రాణవాయువు!

నిజానికి విడివిడిగానూ, జమిలి గానూ, అందరూ అందరే! తమకి అనుకూలమైనప్పుడు గమ్మున ఉండటం, తమకి అననుకూలమైనప్పుడు గావుకేక లెయ్యటం!

స్థూలంగానూ, రాజకీయంగానూ చూస్తే అంతే!
అయితే సూక్ష్మంగానూ, గూఢచర్యపరంగానూ చూస్తే ఇందులో ఇంకా చాలా ఉంది.
మన ఊళ్ళల్లో ఉదయాన్నే భవన నిర్మాణ కూలీలంతా కొన్ని నిర్ధుష్ట సెంటర్లలో గుమ్మి గూడతారు. ఆయా ముఠాల మేస్త్రీలు పని ఒప్పుకున్నాక, కూలీలకి పనులు అప్పజెప్పుతారు. సదరు కూలీలు, మేస్త్రీ చెప్పిన చోటుకు పోయి, చెప్పిన పని చేసి, సాయంత్రానికి కూలీ పుచ్చుకుని ఇంటికి పోతారు.

ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తోంది అదే! తమ తమ అధిష్టానాలూ, లేదా తమతమ అధినాయకులూ చెప్పిన చోటుకు పోయి, చెప్పిన Assignment నిర్వహించి, ఇచ్చిన కూలీపుచ్చుకుంటున్నారు. [అది కెరియర్ కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారావకాశాలు కావచ్చు, లేదా పూర్వం చేసిన అవకతవకలు బయటపెట్టకుండా ఉండటం కావచ్చు, మధుకోడాను పట్టుకున్నట్లుగా పట్టుకోకుండా ఉండటం కావచ్చు, ఆదాయపన్ను అధికారుల దాడులు చేయకుండా ఉండటం కావచ్చు…… ఇలాంటివే మరికొన్ని కావచ్చు.]

ఇక ఈ గాలి సోదరుల విషయంలో మరో వైచిత్రిని చూడండి. గాలిసోదరుల పార్టీ భాజపా. సోదరులిద్దరూ కర్ణాటకలో భాజపా మంత్రులూ. అక్కడి ముఖ్యమంత్రి యడ్యూరప్పతో ఏవో తగవులు పడ్డారు.[వాటాలు పంచుకోవటంలో దొంగలు గొడవలు పడ్డట్లన్న మాట. అలాగ్గాక, రాజకీయాల్లో గొడవలు పడే వారిలో, కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు ఉండే అవకాశం ఎక్కడుంది? రాజకీయాలతో సహా అన్నిరంగాల్లో మంచి వాళ్ళెప్పుడో అణగదొక్కపడ్డారయ్యె! ఎక్కడైనా ఒకరూ అరా మిగిలినా, నిశ్చయంగా వాళ్ళయితే పైస్థాయి దాకా, అంటే మంత్రులూ, ముఖ్యమంత్రుల స్థాయి దాకా ఎదగలేరు. వార్డు కౌన్సిలర్ టిక్కెట్లు, డివిజన్ కార్పోరేటర్ టిక్కెట్లు కూడా లక్షల్లో పలుకుతున్న తరుణంలో రాజకీయాల్లో మంచివాళ్ళుండటం కల్ల.]

సదరు యడ్యూరప్ప సన్నిహితురాలైన మహిళామంత్రి కారణంగా గొడవలు ప్రారంభమై చిలికి చిలికి గాలివాన అయ్యాయి. సరే! పైకారణం[over leaf reason] ఏమైనా కానివ్వండి. యడ్యూరప్ప వర్గమూ, గాలిసోదరుల వర్గమూ వివాదాలు పడిన మాట యధార్ధం. వివాదం భాజపా అధిష్టానం దాకాపోయింది. ప్రస్తుతానికి రాజీసూత్రం అమలయ్యిందన్నది ప్రచారం.

"నమ్ముకున్న వాళ్ళని మధ్యలో విడిచిపెట్టటం, వాళ్ళకి అన్యాయం చేయటం నీచం. అలా చేస్తే దేవుడు కూడా క్షమించడు. బాధతో ఉన్నాను” అంటూ యడ్యూరప్ప పదేపదే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గద్గదిక స్వరంతో ప్రకటనలు ఇచ్చాడు. ఆ విధంగా రాజీసూత్రం పట్ల తన అయిష్టతనీ, నిస్సహాయతనీ స్పష్టంగానే ప్రకటించాడు. అదీ తన దాకా వస్తే యడ్యూరప్పకు దేవుడు గుర్తుకొచ్చాడు. అన్యాయం చేయటం నీచంలాంటి విషయాలు గుర్తుకొచ్చాయి. మరి నమ్మి ఆసీట్లో కూర్చొబెట్టిన ప్రజల విషయంలో, యడ్యూరప్పకు ఇవన్నీ గుర్తుకురాలేదు కాబోలు?

అలాగే, అధిష్టానం ఎందుకు గాలిసోదరులకి మాత్రమే ప్రాధాన్యత నిచ్చి యడ్యూరప్ప మెడలు వంచినట్లు? గాలి గనుల డబ్బుకు లొంగిపోయిందా? అలాగంటే భాజపా అధిష్టానం, అద్వానీకి కూడా, డబ్బే ముఖ్యం అనే కదా? అలాగ్గాక ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలంటే గెలవలేమన్న భయమా? [పార్టీకి సరైన దిశనిర్దేశం చేయలేనప్పుడు తప్పుకోమని ఆర్.ఆర్.ఎస్. నుండి పార్టీలోని అనుచరులు దాకా చెబుతున్నారు కదా! మరి ఎందుకు అద్వానీని ఎవ్వరు తొలిగించలేకపోతున్నారు.]

అంతేగాక, ఏ కారణం పైకి చెప్పినా సరే, అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితులు సానుకూలం చేయటమే అజెండా గా, భాజపా అధిష్టానం పనిచేస్తోన్నది నిజం. ఆ కారణంగానే అధినాయకత్వానికి ఇతర నాయకులకీ మధ్య, నాయకులకీ క్రింది కేడర్ కీ మధ్య, అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. అన్నిరాష్ట్రాల ఎన్నికలలో భాజపా అనామకంగా కాంగ్రెస్ చేతిలో ఓడిపోతోంది. అదే ఉపఎన్నికలలో అయితే, కనీసం సగం స్థానాలన్నా గెలుస్తోంది. [ఆ గెలుపుని మాత్రం అద్వానీ ఖాతాలో వేస్తున్నారు.] ఆ ద్వంద్వాన్ని దాటలేని, ప్రశ్నించలేని క్రింది కేడర్, నోరు మూయవలసి వస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములు చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి ద్వంద్వాలు సృష్టించటం సాధ్యమే కదా!

ఏమైనా గనుల సొమ్ముతో బలిసిపోయిన గాలి వర్గాన్ని నిరోధించటం చేతగాక, భాజపా అధిష్టానం, అద్వానీ చేతులెత్తేసాడు.

మరోవైపు గాలిజనార్ధన రెడ్డి గనులపై విచారణకు వై.యస్. అడ్డుపడ్డాడని వార్త. కేంద్రానికి, కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి, గనుల ఘనచరిత్ర, గాలిసోదరుల స్వంత హెలికాప్టర్లు కలిగిన డబ్బుసత్తా తెలిసిందే కదా! మరి అప్పుడెందుకు ఊరుకుంది? వై.ఎస్.నుండి వాటాలు అందినందుకా? వై.ఎస్.తో మరింకేవో అవసరాలు కూడా ఉన్నందుకా? ఇప్పుడెందుకు గొడవ రేగుతోంది? కర్ణాటక ఎన్నికలలో గాలిసోదరులని విమర్శించిన సోనియా, ఇప్పుడు గాలిసోదరులని అణిచి వేయవచ్చుగా మరి? నిజానికి గొడవ రేగినంత మాత్రాన వాళ్ళకి ముంచుకుపోయేది ఏమీ లేదు. గొడవ రేగినంత సహజంగానే మళ్ళీ చల్లారి పోగలదు గనుక!

నిజం చెప్పాలంటే ఈ గోలంతటిలో మీడియా, రాజకీయ నాయకులూ, ’ప్రజలకి ఏదీ అర్ధం కాకుండా చెయ్యటం’ అనే ప్రక్రియని నిర్వహిస్తున్నారు. కాబట్టే మీడియా అంతా పోలోమంటూ ఏదో ఒక సంచలనాన్ని పట్టుకుని నానా హడావుడీ చేస్తోంది. ఒకటై పోగానే మరో ఆంశాన్ని వెదుక్కుంటోంది. విరుద్ద కథనాలని ప్రచారిస్తోంది.

ఇలా ప్రచారిస్తోన్న మీడియాకి, సంస్థలకి అతీతంగా ఓ శృతి ఉంది. ఏదో ఒక అంశాన్ని ఎవరో ఒకరు తీసుకోవటం మిగతా అందరూ దాని మీద విపరీతంగా ఫోకస్ చేయటం. ఆ హైసరబజ్జా తర్వాత మళ్ళీ మరో అంశం. మనదేశంలో మాత్రమే కాదు. దాదాపు అన్నిదేశాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఇదే శృతి ఉంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నకిలీ కణిక వ్యవస్థా, నెం. 10 వర్గాల స్ట్రాటజీనే స్పష్టమౌతోంది.

దానాదీనా ఏవి పుకార్లో, ఏవి నిజాలో ఎవరికి తెలియకుండాపోతోంది. స్వయంగా వార్తలూ, నిజాలూ ప్రచారించాల్సిన మీడియా పనిగట్టుకుని పుకార్లు ప్రచారిస్తుంటే….పాపం సామాన్యులం…..ఏవి నిజాలో ఏవి పుకార్లో ఎలా తెలుసుకోగలం? మనకి మన బ్రతుకుపోరాటంతోనే సమయం గడిచిపోతుంది.

అయితే వీటన్నిటిలో మనకి స్పష్టంగా కనిపిస్తున్నదేమిటంటే…..గాలిసోదరులు భాజపా అయినా, జగన్ శిబిరం కాంగ్రెస్ అయినా ఒకటే వర్గం. అలాగే అద్వానీ… భాజపా అధిష్టానం అయినా, సోనియా… కాంగ్రెస్ అధిష్టానం అయినా ఒకటే వర్గం. మీడియా మొత్తం ఒకటే వర్గం. అందరికీ అంతర్లీన సంబంధమూ ఉంది. అన్నిటికీ అంతర్లీన శృతీ ఉంది. అందుకే – ఏది జరిగినా, జరగకపోయినా అనుశృతంగా మాత్రం, రాజకీయాల్లోని, రాజకీయ నాయకుల్లోని అవినీతే బహిర్గత మౌతోంది. అవసరార్ధం దెబ్బలబ్బాయి మధుకోడా ప్రకటింపబడ్డాడు. ఇంకా బయటపడాల్సిన మధుకోడాలే సోనియాలైనా, అద్వానీలైనా చంద్రబాబులైనా, జగన్ లైనా! ఇవేవీ లేకుండా, వీరెవరూ గాకుండా, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు జమపడవు కదా!

కాబట్టే….

శనిపట్టిన రాజు, తన బదులుగా మరొకరిని Focus చేస్తూ…. ప్రచారంతో ప్రజలని నమ్మిస్తూ….. తాను అడవిలో దాక్కుని శనిపట్టలేదని సంబరపడ్డా…… రాజ్యభోగాలు వదలి కొండగుహలో దాక్కోవటమే శని ప్రభావం అయినట్లుగా…..

ఏ కారణంతో, ఏ స్ట్రాటజీ ప్రయోగించినా, అంతిమంగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దోచుకుంటున్న నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు, వారి అనుంగు అనుచరులు అవినీతే బహిర్గతమౌతోంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu