ఈరోజు మాబ్లాగు తొలిపుట్టినరోజు.
సంవత్సరం క్రితం సరిగ్గా ఇదేరోజున ఈ బ్లాగు ప్రారంభించాము. పరిచయ టపా తర్వాత, మా తొలి టపా ఈ చిన్నికథ. మరో సారి సరదాగా……ఆనాటి వ్యాఖ్యలతో సహా…..
బ్లాగరుల ఇళ్ళల్లోని బాలలోకానికి నా చిన్ని తొలికానుక.
తిక్క చేప – పిచ్చి పిట్ట
అనగా అనగా ఒక ఊరు.
ఆ ఊరిలో ఓ కొలను
కొలను గట్టున ఓ చెట్టు.
కొలనులో ఓ చేప.
చెట్టు మీద ఓ పిట్ట.
ఓ రోజు చేప వొడ్డుకొచ్చింది.
దానికి పిట్ట కనబడింది.
“ఏయ్ పిట్ట!” పిల్చింది చేప.
“ఎందుకూ పిలిచావు?” అంది పిట్ట.
“ఆడుకుందామా?” అంది చేప కళ్లు ఆర్పుతూ.
“ఏమాటా?” అంది పిట్ట తోక ఊపుతూ.
“దాక్కొనే ఆట” అంది చేప.
“సరే దాక్కో” అంది పిట్ట.
“నువ్వూదాక్కో” అంది చేప.
జర్రున నీళ్ళల్లో మునిగింది చేప.
తుర్రున చెట్టు కొమ్మల్లోకి ఎగిరింది పిట్ట.
నీళ్ళల్లో చేప చాలాసేపు దాక్కుంది. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి ఈదింది. బండలమాటున, నీచు చాటున నక్కింది. ఎంతసేపు దాక్కున్నా పిట్టరాలేదు.
“ఓస్! పిచ్చిపిట్ట! నన్ను కనుక్కోలేకపోయింది” గొప్పగా అనుకుంది చేప.
చెట్టుకొమ్మల్లో పిట్ట చాలాసేపు దాక్కొంది. ఒక కొమ్మ గుబురులోంచి ఇంకో చిక్కగా ఉన్న మరో కొమ్మగుబురులోకి ఎగిరింది. ఎంతసేపు దాక్కున్నా చేప జాడ లేదు. తొంగి తొంగీ కొలను వైపు చూసింది.
"ఓస్! తిక్కచేప! నన్ను అసలు కనిపెట్టలేకపోయింది” అనుకుంది పిట్ట.
పాపం! చేప నీళ్ళల్లో, పిట్ట కొమ్మల్లో ఇప్పటికీ అలాగే దాక్కుని ఉండిపోయాయి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments:
telugu kurradu said...
హెల్లొ,సార్, మీ చిన్ని కథ చాలా బాగుంది.నాకు చాలా నచ్చింది.మీరు ఈ కథ ను ఎక్కడి నుండి సీకరించారు.
November 4, 2008 10:51 PM
~~~~~~~
రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...
బాగుందండి మీ కధ,మరిన్ని కధలు మీరు బాలలోకానికి అందివ్వాలని కోరుకుంటూ...
November 5, 2008 12:42 AM
~~~~~~~
Sadhu.Sree vaishnavi said...
అమ్మ ఒడి పేరు బాగుంది. తిక్కచేప -పిచ్చిపిట్ట కధ చాలా బాగుంది. నాకైతే బలే నచ్చింది .తెలుసా !!!!!!!!!!!!!!!!!!!
November 7, 2008 3:38 PM
~~~~~~~
AMMA ODI said...
తెలుగు కుర్రాడు: నా చిన్ని కథ మీకు నచ్చినందుకు సంతోషం. ఈ కథ అచ్చంగా నా స్వంతం అండీ.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ధన్యవాదాలు.
సాధు శ్రీ వైష్ణవి:నా చిన్ని కథ మీకు అంతగా నచ్చినందుకు చాలా సంతోషమండీ!
November 8, 2008 1:06 AM
~~~~~~~~
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
31 comments:
చల్లని అమ్మ ఒడిలో పరుండి హాయిగా కథలు వింటూ కలకాలం అలాగే ఉండి్పోవాలని కోరుకుంటూ మీ అబ్బాయి.
మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు
మీకు , లెనిన్ గారికి " మీ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు "
అలాగే మీరు వెచ్చించిన మీ సమయానికి దన్యవాదాలు , మీ ఓపికకు జొహర్లు .. నేను తప్పనిసరిగా చదివే, చదివించే బ్లాగుల్లొ మీది ఒకటి..
ఆదిలక్ష్మి గారు,
మొదట మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
చివరగా, మీఓపికకి హాట్సాఫ్
పుట్టినరోజు శుభాకాంక్షలు :)
మీ బ్లాగు తొలి పుట్టినరోజు సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు.
అమ్మఒడికి జన్మదిన శుభాకాంక్షలు.ఈ లింకు కూడా చూడండి
http://chiruspandana.blogspot.com/2009/11/blog-post.html
అన్నట్టు నా బ్లాగు కూడా గత సంవత్సరం ఈరోజే మొదలైంది.యాదృచ్చికమా లేక దైవసంకల్పమా?
Many more birthdays to come. March on! :)
అభినందనలు.
మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
ggg
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు..మీకు అభినందనలు..
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను తప్పకుండా రోజు వచ్చి చూసే బ్లాగ్ ల లో మీది ఒకటి. ధన్య వాదాలండి ఎంతో శ్రమ కోర్చి మా అందరికోసం ఎన్నో విషయాలందిస్తున్నందుకు.
మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకు౦టున్నాను.
ఆదిలక్ష్మి గారు, మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
చిలమకూరు విజయమోహన్ గారు,
వయస్సుతో నిమిత్తం లేని మాతృత్వపు మాధుర్యం.
అది ఆస్వాదిస్తే మాత్రమే అర్ధమయ్యే ఆనందం.
మీలాంటి పిల్లల్ని ఇచ్చినందుకు బ్లాగ్లోకానికి మా కృతజ్ఞతలు.
*****
జీవని గారు,
నెనర్లండి.
*****
మంచుపల్లకీ గారు,
మీరు చదవటమే గాక చదివిస్తున్నందుకు కృతజ్ఞతలు.
*****
పానీపూరి123 గారు,
మేము పొడవాటి టపాలు వ్రాస్తున్నాము నిజమే. మా ఓపిక సంగతి సరే, చదువుతున్న మీ ఓపికకూ కూడా జేజేలు.
*****
నేస్తం గారు,
కృతజ్ఞతలండి.
*****
వేదుల బాలకృష్ణ గారు,
చాలారోజుల తర్వాత వ్యాఖ్య వ్రాసారు. నెనర్లు!
*****
ప్రియమైన తమ్ముడు రామిరెడ్డి,
మొత్తం నా బ్లాగుని చిన్నకవితలో చెప్పావు. ఇంతచక్కని నెనరుని మనసారా ఆస్వాదిస్తున్నాను. 1992 లో నేనో సూక్తి చదివాను. ’రక్తసంబంధం కంటే భావసంబంధం గొప్పదని!’ ఇంతకంటే ఏం చెప్పను?
నీబ్లాగుకి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మనిద్దరి బ్లాగులు ఒకేరోజు ప్రారంభించబడటం ఖచ్చితంగా యాదృచ్చికం కాదు. దైవ సంకల్పమే!
*****
యోగి,
నెనర్లు నాయనా!
*****
రవి గారు,
కృతజ్ఞతలండి.
*****
శివరంజని గారు,
నెనర్లండి!
*****
జ్యోతి గారు,
కృతజ్ఞతలండి!
*****
సురేష్ తోటకూర గారు,
నెనర్లండి!
*****
భావన గారు,
మీరు ఓపికగా చదువుతున్నారు కదండి. నెనర్లు!
*****
సుభద్ర గారు,
మరిన్ని నెనర్లు!:)
****
సునీత గారు,
కృతజ్ఞతలండి!
అమ్మఒడి కి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆదిలక్ష్మి గారికి అభినందనలు.
అభినందనలు.
வணக்கம்,
இனிய போரந்தனால் நல்வால்துகள்.
ఆది లక్ష్మి గారికి నమస్కారం,
మీ బ్లాగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ కథలు ఎప్పుడూ ఉండేవే! మీ బ్లాగుకి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు .
ఎప్పుడూ మీ బ్లాగే ఒక ప్రత్యేకం. చదవకుండా ఉండలేము. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
Wish you happy birthday to your blog... I want blog should continue forever...........
puttina rooju subhakankshalu andi.. :)
katha bagundi..
అలాగా!? శుభమ్. తెలియలేదు సుమండీ! మీరు ఈ బ్లాగ్లోకంలో ఎప్పణ్ణించో ఉన్నట్టే ఉంది! శుభాభినందనలు, అభివందనములు.
SRరావు గారు,
ధన్యవాదాలండి.
****
శివ బండారు గారు,
నెనర్లు!
****
తమిళన్ గారు,
ఎనక్ తమిళ్ కొంజం కొంజం తెరియున్. రొంబ సంతోషమ్! వణక్కమ్!
****
కన్నాగారు,
అంత భరోసా ఏమిటండీ! నెనర్లు!
****
మాలాకుమార్ గారు,
నెనర్లండి.
****
జయ గారు,
మీ అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
****
అజ్ఞాత గారు,
నెనర్లు! మీ అభిమానానికి ధన్యవాదాలు.
****
శశాంక్,
నెనర్లు. అమ్మని అండీ అంటున్నారేం?ఆయ్ :)
****
రాఘవ గారు,
అది మీ అభిమానమండి. సంతోషంగా ఉంది. నెనర్లు!
మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలండి.
నాని[రాధిక] గారు,
నెనర్లండి!
hmmm,
I am late to function...
ok, let be late than never..
mI blaaaguki vaarshikOtsava sdhubhaakaMkshalu.
Post a Comment