ముందుగా చిన్న పోలికతో నా విశ్లేషణ ప్రారంభిస్తాను.

పిల్లలకి తల్లిదండ్రులు జన్మనివ్వడమే కాకుండా, జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రేమని పంచుతారు. కంటికి రెప్పలా కాపాడుతారు. శిశువుగా ఉన్నప్పటి నుండీ పెద్దయ్యే వరకు, అన్నపానాలు సమకూరుస్తారు, విద్యా బుద్దులు నేర్పుతారు. జబ్బు చేస్తే పక్కనే ఉండి సేవలు చేసి, వైద్యం చేయించి, కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడతారు. పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ‘ఆ జబ్బు పిల్లలకి కాక తమకే వచ్చిందా?’ అన్నట్టు విలవిల్లాడతారు. పిల్లలకు దెబ్బ తగిలితే తాము ’అబ్బా’ అంటారు. కష్టంలో వెన్నంటి ఉంటారు, అభివృద్దిని చూసి ఆనందిస్తారు.

కాబట్టే పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, ఆరాధనా చూపుతారు. తల్లిదండ్రులు వెంట ఉంటే రక్షణగా భావిస్తారు. తల్లిదండ్రుల పట్ల మమకారం కలిగి ఉంటారు. మాతృభూమి మాతాపితల వంటిదే.

అయితే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పచ్చి స్వార్ధపరులు, వట్టి వ్యసనపరులు అనుకోండి? తమ సుఖం తాము చూసుకొంటూ, పిల్లల బాగోగులు పట్టించుకోని నిర్భాద్యులైతే, ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఏ పాటి ప్రేమాభిమానాలుంటాయి? రక్త సంబంధంతో వచ్చిన నామ మాత్రపు యాంత్రిక బంధం తప్ప, మమత పంచుకున్న మానసిక బంధం ధృఢపడదు.

కుటుంబంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత, పాత్ర ఎలాంటిదో.... దేశపౌరుల పట్ల ప్రభుత్వ బాధ్యతా, పాత్రా అలాంటివే?

ఇదే పోలికని మరో కోణంలోంచి చూస్తే - తల్లిదండ్రులు తమ స్వసుఖాన్ని త్యాగం చేసి, పిల్లల కోసం అహరహం శ్రమించి, వాళ్ళ అభివృద్ది కోసం పాటు పడితే.... పిల్లలు అదేమీ గుర్తించకుండా, చెప్పుడు మాటలు విని, తల్లిదండ్రులను తప్పుబడుతూ, ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నారనుకోండి! అప్పుడా తల్లిదండ్రులకి ఆవేదన, పిల్లలకి ఆయాసం మిగులుతాయి. మొత్తంగా అసత్యాల సుడిగుండంలో కుటుంబం కొట్టుమిట్టాడుతుంది.

దేశ స్వాతంత్ర్యానంతరం, దేశం పట్ల నిబద్దత గల ప్రభుత్వాలకీ, పౌరులకీ మధ్య ఈ స్థితి కొనసాగింది. 1996 నుండి ఇప్పటి వరకు ఉన్న స్థితి.... నిర్భాధ్యులైన, స్వార్ధపరులైన తల్లిదండ్రులకీ, ప్రేమరాహిత్యంతోనూ, అభద్రతతోనూ పెనుగులాడుతూ పెరుగుతున్న పిల్లలకీ మధ్య ఉన్న స్థితి!

గతంలో అంటే వెయ్యి ఏళ్ళకి పూర్వం, ఈ గడ్డమీదికి ఆఫ్ఘన్ ఇసుక పర్రల నుండి ముస్లింలనబడే ఎడారి దొంగలూ, యూరోపియన్లనబడే సముద్రపు దొంగలూ రాకముందూ, పురాణ కాలంలోనూ, ధర్మాశోకుడు, శ్రీకృష్ణ దేవరాయలు, చత్రపతి శివాజి, గుప్తులు, చాణిక్యులు, చోళుల వంటి.. ఒక్కమాటలో చెప్పాలంటే - ప్రజల పట్ల నిబద్దత గల, ప్రభుధర్మం పాటించాలనే ధృక్పధం గల ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ప్రభుత్వాలకీ ప్రజలకీ మధ్య ఉన్న సంబంధం.... ప్రేమ, బాధ్యతలు గల తల్లిదండ్రులకీ, గౌరవాభిమానాలు గల పిల్లలకీ మధ్యగల సంబంధం వంటిది.

ఇక ఇప్పుడు మన దేశంలో ప్రజల స్థితి.... తల్లిదండ్రులు గాలికి వదిలేస్తే అల్లాడుతున్న పిల్లల వంటిదే!

ఈ నేపధ్యంలో ఒక్కసారి "మాతృభూమిపై మమకారం ఎప్పుడు ఉంటుంది?" అన్న ప్రశ్న వేసుకుంటే......?

నా చిన్నప్పుడు - విద్యా, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. ప్రైవేటీకరించబడానికి ఎవరెన్ని ఎత్తులు వేసినా ఇందిరాగాంధీ అపర కాళిక అయి వాటన్నిటినీ చిత్తు చేసింది. ఆమె కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విద్యా వైద్యాలు ప్రైవేటీకరించనియ్యలేదు. ఎందుకంటే ఒకటి జ్ఞానం! రెండోది ప్రాణం!

నా చిన్నప్పుడు, విశాలమైన ప్రాంగణంలో, పెద్దపెద్ద చెట్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా పంతులమ్మలు ‘ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్పుకోవాలీ, ప్రైవేటు బడుళ్ళో క్లాసులు తీసుకోవాలీ’ అనే తొందర లేకుండా.... మా మీదే దృష్టి కేంద్రికరించి, మాకు విద్య నేర్పారు. ఆటల పోటీల దగ్గర నుండీ వ్యాస రచన వక్తృత్వ పోటీల దాకా.... పాటలు, నాటకాలు, ఏ కళారూపంలో పాల్గొనేందుకయినా ప్రభుత్వ ఖర్చే! సొంత ఖర్చులు పెట్టుకోవాలంటే ’వద్దు లేమ్మా!’ అనే ఆర్ధిక స్థితే మాది. అయిదో తరగతిలో ఉండగా, గుంటూరు నుండి విజయవాడకి పది రూపాయలతో ఎక్స్ కర్షన్ తీసుకువెళితే, అదో గొప్ప ఎగ్జైయిట్ మెంటు! బస్సు దిగి క్యూలో వెళ్ళి ప్రకాశం బ్యారేజీనీ, ఆకాశవాణినీ కళ్ళింతలు చేసుకుని చూసాము. గాంధీ కొండపైన గంతులు వేసాము.

అలాంటి చోట, వ్యాస రచన పోటీలో మొదటి స్థానంలో వచ్చినందుకు, నయా పైసా ఖర్చు లేకుండా, 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో, అప్పటికి చూడదగ్గ ప్రదేశాలుగా ప్రసిద్ది చెందిన అన్ని ప్రాంతాలనీ దర్శించాను. చివరికి క్షేమ సమాచారాలు తెలుపుతూ అమ్మానాన్నలకు వ్రాసే ఉత్తరం కోసం, పోస్ట్ కార్డు కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఒకో జిల్లానీ దాటుతూ.... పరిశ్రమలను, పర్యాటక స్థలాలనీ, పుణ్యక్షేత్రాలనీ.... అన్నిటినీ చూస్తూ బస్సులో వెళ్తుంటే, వెనక్కి పరిగెట్టే భూమిని చూస్తూ ‘ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది, ఈ ధరిత్రి నాది’ అనుకుంటే గుండెలు పొంగేవి.

చిన్ని చిన్ని కథలతో కబుర్లు చెబుతూ, రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవ రావు గారు, మా చేత దేశభక్తి గీతాలు పాడించినప్పుడు, రోమాంచిత భావోద్వేగాలతో ఒళ్ళు పులకలెత్తేది. ఐస్ క్రీం కొనిచ్చిన అమ్మ మీద పాపాయికి ప్రేమ పుట్టి, బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది. అలాంటిదే అప్పటి నా అనుభూతి కూడా! "ఈ దేశం నాది, ఈ ప్రభుత్వం నా బాగోగులు చూస్తుంది" అనుకుంటే - ఎంత రక్షణగా [Secured] అన్పిస్తుంది!?

పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు గాను, నాకు జాతీయ ఉపకార వేతనం వచ్చింది. ఆ డబ్బు అప్పట్లో మంచి మొత్తమే! మా నాన్న "నీ డబ్బూ, నీ ఇష్టం" అన్నాడు. మంచి పుస్తకాలు, ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నాను. అప్పటికి మా ఇంట్లో రేడియో చిన్నపాటి ట్రంకుపెట్టె అంత ఉండేది. నా ట్రాన్సిస్టర్ నేను ఎక్కడుంటే అక్కడ పెట్టుకునేదాన్ని! మేడపైనా, వంటగదిలో! ఎంత పిచ్చిగా వినే దాన్నంటే కార్మికుల కార్యక్రమాలతో సహా! ఆ చట్టాల సంఖ్యలన్నీ తెలిసిపోయాయి. ఆ జనరల్ నాలెడ్జితో వక్తృత్వ పోటీలకి గానీ, క్విజ్ పోటీలకి గానీ వెళ్తే, బహుమతి పొందిగానీ తిరిగి వచ్చే దాన్ని కాదు.

అలా ప్రభుత్వ సొత్తుతో చదువుకున్నప్పుడు కృతజ్ఞత ఉండటం సహజం కదా!

నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా మా నాన్నకి తొలిసారిగా గుండెపోటు వచ్చింది. సంక్రాంతికి అరిసెల పిండి కొడుతున్నాము. నొప్పితో వాలిపోతున్న నాన్నని, అమ్మ రిక్షా కట్టించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. మూడు రోజులు ఐసీయు లో ఉంచాక, నాన్న మాకు దక్కాడు. అప్పటికి ప్రైవేటు ఆసుపత్రులు ఇన్ని లేవు. ఉన్న వాటిల్లో వైద్యపు ఖరీదుని అందుకోగల ఆర్ధికస్థితి అప్పుడు మాకు లేదు. నాన్న వ్యాపారం అప్పుడు కొంత ఒడిదుడుకుల్లో ఉంది. అలాంటి స్థితిలో.... ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులూ, సిబ్బంది, మమ్మల్లేమీ లంచాలకై పీడించనూ లేదు, సేవలో అలక్ష్యమూ చూపలేదు.

ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి ముందునుండి ఎప్పుడు వెళ్తున్నా, ఆ భవనాలను చూసినా కృతజ్ఞతగా అన్పించేది. [అదే ఆసుపత్రిలో ఇప్పుడు మురికి, నాలుగో తరగతి ఉద్యోగుల దుర్భాషలూ, వైద్య వైద్యేతర సిబ్బంది లంచాల పీడింపు, ముక్కుకీ మనస్సుకీ కూడా దుర్గంధం వెదజల్లుతోంది.]

ఇది ఒక్క మా కుటుంబపు అనుభవమే కాదు. మా చిన్నమ్మ కూతురికి గుండెలో చిల్లు ఉండింది. నాకు ఏడెనిమిదేళ్ళప్పుడు ఆ బిడ్డ నెలల వయస్సుది. హఠాత్తుగా ఊపిరి సమస్యలు ఏర్పడి కళ్ళు తేలేసేది. మా చిన్నమ్మ అప్పటికప్పుడు బిడ్డని భుజన వేసుకుని రిక్షా ఎక్కేది. అప్పటికి ఆటోలింతగా లేవు.

ఆమె కేసుని చిన్నపిల్లల వార్డులో డాక్టరు ప్రత్యేకంగా చూసేవాడు. ఆపరేషన్ అవసరం లేకుండా, మందులతో తగ్గించేందుకు ప్రయోగపూర్వకంగా, వైద్య విద్యార్ధులకు డెమో గానూ కూడా పరిగణించేవాడు. అంత పసిబిడ్డకు ఆపరేషన్ క్లిష్టమైనది అన్నది మరో కారణం. అర్ధరాత్రి అపరాత్రి అయినా, ఏ స్థితిలో అయినా, ఆమెకు ప్రత్యేక పాసు వ్రాసి ఇచ్చారు. బిడ్దకు సమస్య తలెత్తగానే, తనకు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మనే వాడు. మా చిన్నమ్మ బిడ్దను తీసుకొని ఆసుపత్రి చేరేలోగా ఆయన అక్కడ సిద్దంగా ఉండేవాడు. మొత్తానికీ జబ్బు నయమైంది.

ఇలాంటి ఎన్నో సంఘటనలు! అప్పటి డాక్టర్లలో చాలామంది, ‘తమని ప్రభుత్వం చదివించింది’ అన్నట్లుగానే సేవాభావంతో ఉండేవాళ్ళు. ఒక్క విద్యార్ది డాక్టరుగా బయటికి రావాలంటే తలకు ఐదులక్షలు ఖర్చువుతుందని అప్పటి లెక్కలు ఉండేవి. అంత ఖర్చు చేసి ప్రభుత్వం చదివిస్తుంటే, పట్టభద్రులయ్యాక డాక్టర్లూ, ఇంజనీర్లు విదేశాలకు వెళ్ళిపోతున్నారనీ, మేధో వలసలపై చర్చలూ నడిచేవి. కొందరు వలసలు పోయినా, మరికొందరు ప్రభుత్వ సర్వీసుల్లో చేరి, ఎంతోకొంత నిజాయితీగానే ఉండేవాళ్ళు; సేవాభావంతోనే పనిచేసేవాళ్ళు. ఇంతగా లంచాల మారితనం, అట్టడుగు పేదవాణ్ణి పీడించే దశ దాకా రాలేదు.

అదే ఇప్పుడైతే.... విద్యా, వైద్యమూ రెండూ కాసులుపోసి కొనుక్కోవలసిందే! వైద్య విద్య అభ్యసించడానికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డొనేషన్ 4 లక్షలు తీసుకోవాల్సిన చోట, 40 నుండి 70 లక్షల దాకా డొనేషన్ కట్టి చదవాల్సి రావటం, ఆ వ్యాపారం మీదే ప్రైవేట్ వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలో సీట్లమ్ముకునేందుకు ముందుకు రావటం, అందుకు అనుమతులిచ్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా [MCI] ల అధినేతలు కేతన్ దేశాయ్ లు 2 కోట్లు రూపాయలు లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం.... నిన్న మొన్ననే సంచలన వార్తాగా చూశాం. సదరు కేతన్ దేశాయ్ ఇలా పట్టుబడటం తొలి అనుభవం కూడా కాదు. పట్టుకుంటే వేలకోట్లు అస్థులూ, కేజీల కొద్దీ బంగారమూ దొరికింది. ఆనక సిబిఐ వాళ్ళు అదంతా వదంతులే, అంత సొమ్ము దొరకలేదు, కొంత సొమ్ము దొరికింది అని కూడా అన్నారు లెండి!

అంత భారీగా వైద్య విద్యని అమ్మినప్పుడు, కొనుక్కున విద్యార్ధి వైద్యుడయ్యాక ఏం చేస్తాడు? రోగులంతా వాడికి నడుస్తున్న ఏటీఎంల్లా కన్పిస్తారు. అలాంటి వైద్యుడి స్కానింగ్ కళ్ళకి, రోగి ఒంట్లోని కిడ్నీలూ, ఇతర అవయవాలు డబ్బు కట్టల్లా కన్పిస్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా పొట్ట కోసి ఆపరేషన్ చేస్తే తప్ప, పెట్టిన పెట్టుబడికి వడ్డీ కూడా గిట్టదనిపిస్తుంది. "ఎన్ని ఆపరేషన్లు చేస్తే, ఎన్నిఅనవసర పరీక్షలు చేస్తే, ఎన్ని ఖరీదైన మందులు కొనిపిస్తే.... తాము లక్షల్లక్షలూ, కొండకచో కోటీ, కోటిన్నర పెట్టి చదివిన చదువుకు తగిన నిష్పత్తిలో లాభం సంపాదించగలం?" అన్పిస్తుంది.

మనిషి ప్రాణం, శరీరం, రోగం... అన్నీ డబ్బులోకి తర్జమా అయిపోతాయి. ఇదే పరిస్థితి మరింతగా కొనసాగితే....! ‘ఇందరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారేం ఖర్మ! ఏ బర్డ్స్ ప్లూనో, చికెన్ గునియానో, మరో అంటు రోగమో ప్రబలితే బాగుణ్ణు’ అన్పిస్తుంది. సమాజ హితవు కోరాల్సిన వైద్యుడూ, ’వైద్యో నారాయణో హరీ!’ అంటూ భగవంతుడి ప్రతిరూపంగా గౌరవింపబడిన మేధావి, చివరికి ప్రజాహితవు గాక విపర్యయాన్ని కోరుకునే స్థితికి పోతుంది. ఎవరిని ఏమనాలి? విద్య, వైద్యం, వైద్యవిద్య, అన్నింటినీ అమ్ముతున్న ప్రభుత్వాన్నా?

"ఇంత డబ్బు ఖర్చు పెట్టాం. ఎప్పటికి తిరిగి రాబట్టుకోవాలి?" అనుకునే వారినా?

ఒకప్పుడు విశాలమైన ప్రాంగణంలో, చెట్లతో నిండిన పరిసరాల్లో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో[అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాకపోతే చదువులు చెప్పే పంతుళ్ళల్లోనే చాలామందిలో నిబద్దత లేదు.] చదువుకుని పైకి వచ్చిన వారిలో, ఇప్పటికీ తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణం మీద సైతం ప్రేమ ఉంది. ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థల విద్యార్ధుల్లో, చదువుతున్న సమయాల్లో సైతం, ‘ఆ భావన ఉందా?’ అంటే సందేహమే! విద్యాసంవత్సరం చివరి రోజున పిల్లలు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేయటం, చేస్తారని యజమాన్యాలు ముందే జాగ్రత్త పడటం, చాలా ప్రైవేటు విద్యాసంస్థల్లో స్వయంగా చూసాను.

ఒక దుకాణంలో వస్తువులు నచ్చకపోతే మరో దుకాణానికి వెళ్తారు. సదరు కొనుగోలు దారునికి దుకాణం పట్ల, అవసరమే తప్ప అనుబంధం ఉండదు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఫీజులు కట్టి చదివిన విద్యార్ధులకీ, తమ విద్యా సంస్థలతో ఉండేవి అలాంటి అవసరమే, అనుబంధం కాదు! కళాశాలలో చివరి రోజు స్నేహితులతో వీడ్కొలు బాధ కలిగిస్తుందేమో గానీ, విద్యా సంస్థతో అనుబంధం అంకెల మధ్య కరిగిపోతుంది.

ఇక అలాంటి రూపాయిల వాసనలు వెదజల్లే వైద్య కళాశాలల్లో ఏపాటి మానవీయత మిగిలి ఉంటుంది చెప్పండి! అక్కడి నుండి బయటి కొచ్చే వైద్యులు కట్టే సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల్లో, అడుగుపెట్టిన క్షణం నుండి ’ఎంత ఖర్చువుతుందో’ అన్న భయమే మనస్సుని పీకుతుంది గానీ, భద్రతా భావం ఎక్కడి నుండి వస్తుంది?

కాబట్టే ’ఆరోగ్యశ్రీ’ పధకం అంతగా ప్రజలని ఆకర్షించింది. ప్రభుత్వ ఆసుపత్రులని భ్రష్టుపట్టించి, కార్పోరేట్ ఆసుపత్రుల వారికి ప్రజాధనం దోచి పెట్టటం అందులో మరో కోణం కావచ్చు గాక! జబ్బుతో, బెంగపడ్డ పేదవాడికి మాత్రం అ పధకం ధైర్యాన్నిచ్చింది. అమలులో ఎంత సఫలత ఉందో దైవానికెరుక! పధకం ప్రజలనాకర్షించటంలో ఉన్నది మాత్రం, అది మనిషి ‘ప్రాణం’ కావటమే!

ఖచ్చితంగా చెప్పాలంటే - ఇప్పటి ప్రభుత్వం, తాగి తందనాలాడుతూ, పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రుల్లానే ఉంది. తమ స్వసుఖం, తమ స్వార్ధం తాము చూసుకుంటూ, బాధ్యత లొదిలేసి, నిరంతరం పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ, వివాదాలు పడుతూ తల్లిదండ్రులుంటే - బిక్కముఖం వేసుకొని, బేలగా, బెంగగా బ్రతుకుతున్న పిల్లలాగే ఉన్నారు ప్రజలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు.

ఇలాంటి కుటుంబాల నుండి వచ్చే పిల్లలు కసబ్ లూ, డేవిడ్ కోల్మన్ హెడ్డీలే అవుతారు. నిన్న - పాక్ కసబ్, భారత్ పై ముట్టడి చేసి ఉండొచ్చు గానీ, ఈ రోజు పాక్ కసబ్ లు పాక్ లోనే బాంబులు పేలుస్తున్నారు. అది ఏ దేశానికైనా వర్తిస్తుంది, భారత్ తో సహా! [అసలుకే సినిమాల్లో హీరో దొంగతనం, దోపిడిలు చేయటం కూడా ఒక ఫ్యాషన్ గా చూపిస్తున్నారు మరి!]

ప్రేమ పంచని, బాధ్యతలు నెరవేర్చని తల్లిదండ్రులు పట్ల పిల్లలకీ, ప్రేమ ఉండదు. దేశమైనా, కుటుంబమైనా అంతే! ప్రభుత్వమంటేనే ఒక వ్యవస్థ! పిల్లలకి తల్లిదండ్రులంటే ఎంత నమ్మకం, గౌరవం ఉంటాయో.... ప్రభుత్వం పట్ల ప్రజలకీ అంత గౌరవం నమ్మకం ఉండాలి. అది ఉండాలంటే తల్లిదండ్రుల్లానే ప్రభుత్వమూ, ప్రజల పట్ల తన బాధ్యత నెరవేర్చాలి.

అది లేనప్పుడు ’మాతృభూమిపై మమకారం ఎందుకు ఉంటుంది?’ స్వామీ వివేకానంద మతం గురించి చెబుతూ, "మతం మనిషి మానసిక అవసరాలని తీర్చాలి. ముక్కుపచ్చలారని చిన్నారి దగ్గరికి వెళ్ళి, కంఠ శోష వచ్చే దాకా మతం గురించి ఉపన్యాసం చెబితే ’మతం నాకు అల్లం మురబ్బా తెచ్చి పెడుతుందా?’ అంటాడు. ముందుగా ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టు. తర్వాతే సిద్దాంతాలు చెప్పు" అంటారు. దేశభక్తి అయినా అంతే!

ఇంకా, ఇప్పటికీ.... ప్రపంచవ్యాప్తంగా

మనుష్యుల రక్తంలో ప్రేమాను బంధాలు ప్రవహిస్తున్నాయి గనుకా....

నరనరాలలో మంచిచెడుల విచక్షణ జ్ఞానం ఉన్నది గనుకా.....

కండరాలలో కట్టుబాట్లని తెంచుకోలేనితనం గట్టిపడి ఉన్నది గనుకా....

ప్రభుత్వాలు ఇంకా మనగలుగుతున్నాయి. ఇంతగా దోపిడి చేస్తున్నా, ఎక్కడి ప్రజలైనా ఇంకా సహిస్తూ, మంచికాలం వస్తుందని ఆశిస్తూ, వేచి చూస్తున్నారు.

ఎందుకంటే - ప్రభుత్వం అనే ముసుగుల మాటున కొనసాగుతున్న మోసాలు గురించిన సత్యం, ప్రజలకింకా పూర్తిగా అర్ధం కాలేదు గనుక! అది పూర్తిగా బహిర్గతమైతే ప్రభుత్వాధినేతలకి పతనం తప్పదు. సర్కోజీలకైనా, సోనియాలకైనా!

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పరిపాలన పేరుతో చేస్తోంది ప్రజాదోపిడినే అయినా, ఓర్చుకుంటూ వేచి చూస్తున్న సామాన్యుల మీద పీవీజీకీ, నెం.5 వర్గానికీ ఎంతో నమ్మకం!

సరిగ్గా ఈ అంశం మీదే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులకీ.... నెం.5 వర్గానికీ మధ్య మేధో యుద్దం నడుస్తోంది.

ఎలాగో వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాటకు చిన్న ఉదాహరణ చెబుతాను. ‘లవకుశ’ చిత్రం చాలామంది చూసి ఉంటారు. తెలుగు వారి గుండెల్లో సీతమ్మ తల్లిగా అంజలీ దేవిని ప్రతిష్ఠించిన, ఘంటసాల సంగీతంతో ఇంటింటా మారుమ్రోగిన రామకథా చిత్రం అది.

అందులో - శ్రీరాముడికి, తాగి వాగిన చాకలి వాడి నిందావాక్యం గురించి గూఢచారి భద్రుడు సమాచారం ఇచ్చాక, శ్రీరాముడు, లక్ష్మణ భరత శతృఘ్నులలో ఒకరిని రాజ్యభారం తీసుకోమనీ, తాను తన ప్రియసతి సీతతో కలిసి అరణ్యాలకు వెళ్తాననీ అంటాడు. వారెవ్వరూ ఒప్పుకోక పోవటంతో సీతని పరిత్యజించే నిర్ణయం తీసుకుంటాడు.

దానికి లక్ష్మణుడు "సీత పరమ పవిత్ర. అగ్నిలో దూకిన ఇల్లాలు. అటువంటి సాధ్విని సందేహించటమూ, పరిత్యజించటమూ పరమ కాఠిన్యం" అంటాడు. శ్రీరాముడు "సీత నా సొత్తు. ఆమెని నేను పరిత్యజించగలను. కానీ ఇక్ష్యాకుడూ, హరిశ్చంద్రుడూ మొదలైన వాళ్ళు సముపార్జించిన ఈ సూర్యవంశ గౌరవం నాది కాదు. దాన్ని పరిత్యజించేందుకు గానీ, కలుషితం చేసేందుకు గానీ, నాకు ఏ అధికారం లేదు" అంటాడు.

తరతరాలుగా తాతతండ్రులు సంపాదించిన యశోసంపదను భ్రష్ఠపరచలేక, తన వ్యక్తిగత సుఖ జీవితాన్ని వదులు కుంటాడు. సీతని అడవికి పంపిన రాముడు, మరో స్త్రీని గ్రహించి సంసార సుఖాన్ని, సంతానాన్ని పొందలేదు. అదీ శ్రీరాముడు తన పూర్వీకులకి ఇచ్చిన గౌరవం, తాను ఆచరించిన వారసత్వం!

అందుకే శ్రీరాముడు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా భారతీయులకి ఆదర్శం, ఆరాధ్య దైవం!

ఈ భారతీయ వారసత్వాన్నీ తానూ అందుకున్నాడు కాబట్టే.... పీవీజీ, మాతో పాటూ ఈ దేశపు సామాన్యులనీ తన వారసులుగా, నెం.5 వర్గపు సైనికులుగా ఎన్నుకున్నాడు.

అదెలాగో చెప్పేముందు, లోపలి మనిషి నుండి మరికొన్ని అంశాలను సృశిస్తాను.

ముందుగా... భూసంస్కరణల చట్టపు మూసాయిదా తయారు చేయటం అనే సందర్భాన్ని వివరిస్తూ.... ఆనంద్, తన డ్రాప్ట్ మన్ తో అన్నట్లుగా ఉన్న ఈ క్రింది సంభాషణలో
681వ పేజీలో
>>>`నాకీ స్ఫురణ ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో నాకే తెలియదు, తనకు కలలో జరిగిన సముజ్జ్వల సాక్షాత్కారానికి సంబంధిన జ్ఞాపకంలోకి జారిపోతూ ఆనంద్ అనుకున్నాడు. ‘దానికొక పేరు కూడా నాకు స్ఫురించింది. స్ఫురింప చేయబడిందనడం సబబు. ఆ పేరు ’శాసన పూర్వ జాగ్రత్త’. నా అంతట నాకీ ఆలోచన వచ్చి ఉండేది కాదు.... శాసన యుద్దంలో అనుసరించవలసిన ఇటువంటి వ్యూహంలో మనందరం సిద్దహస్తులం కాగలమనిపిస్తోంది!’

శాసనం అంటే చట్టం. చట్టపు యుద్దంలో "మనందరం సిద్దహస్తులం కాగలమనిపిస్తోంది" అన్నమాటలే, పీవీజీ తన పదవీకాలంలో "చట్టం తన పని తాను చేసుకుపోతుంది’గా అన్నాడు. అదే తర్వాత ప్రముఖంగా అందరి నోటా వినబడి సినిమాలలో కూడా ’హిట్ డైలాగ్’ అయిపోయింది. ఒకరకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టమో, ఆవే లోపాలను ఉపయోగించుకుని అందరినీ expose చేయడం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. మొత్తంగా.... ‘మనిషి దృక్పధంలో మార్పు రావాలి గానీ, కొత్తకొత్త చట్టాలు ఎన్ని తెచ్చుకుంటే ఏం లాభం?’ అన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం!

ఇక 685వ పేజీలో
భూసంస్కరణల చట్టం గురించి తప్పించుకునేందుకు దొంగ విడాకులు తీసుకున్న భూస్వామ్య దంపతులు, ఆనంద్ జారీ చేసిన ’శాసన పూర్వ జాగ్రత్త’ ఆర్డినెన్స్ కారణంగా, గ్రామాలలో సాంఘిక అమర్యాదకు గురవ్వటం, రకరకాల జోకులతో అపహాస్యానికి గురవ్వటం అనే పరిణామం సంభవించిన నేపధ్యంలో.... పీవీజీ క్రింది విధంగా వ్రాసాడు.

>>>ఈ పరిణామం, ఆనంద్ పై భూస్వామ్యవర్గంలో ఉన్న ద్వేషభావానికి మరింత పదును పెట్టింది. ప్రజల నుండి వచ్చిన అచంచలమైన మద్దతును దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఆ ఆర్డినెన్స్ అధికార పక్షానికి ఆత్మహత్యాసదృశమవుతుందని పత్రికలు చెప్పిన జోస్యానికి ఆస్కారమే కనిపించలేదు.

ఈ ఒక్క సందర్భంలోనే కాదు, చాలా చోట్ల, చాలా సార్లు, ఆనంద్ పైనా, అతడి లాగే ప్రజలకీ, దేశానికీ ఏదైనా మంచి చేయాలనుకునే వారి పైనా, పత్రికలు కత్తిగట్టినట్లు అసత్య సంచలనాలను ప్రయోగించడాన్ని ’లోపలి మనిషి’లో పీవీజీ ఉటంకించాడు. ఆ విధంగా ‘పత్రికలు సంచలన కథాంశాలు, విపరీత ప్రచారాలతో పనిచేయటం’ తన పరిశీలనలో ఉందన్నది స్పష్టంగానే చెప్పాడు. కలప దొంగ రవాణా సంచలనం దగ్గరి నుండి గోడల మీద అసభ్య వ్రాతల వార్తాంశాల దాకా! మీడియా విపరీత ప్రచారాలు బహిర్గతమై ఇప్పుడు మన కళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి కదా!

ఇంత పరిశీలనా, పరిశోధనా.... మీడియా పట్ల ఉంది కాబట్టే, ఇందిరాగాంధీ, పీవీజీలతో సహా, నాడు దేశం పట్ల నిబద్దతా దేశభక్తి గలవారు, దేశం మీద ప్రధాన కుట్రదారుగా మీడియాలోని వ్యక్తే ఉండి ఉండాలని శోధించారు. కాకపోతే జాతీయ పత్రికల నేపధ్యంలో అన్వేషించారు. స్థానిక పత్రికాధిపతిని అనే ముసుగేసుకుని, ఓ మూలన నక్కి ఉండే నకిలీ కణిక వ్యవస్థలోని రామోజీరావు మాయాజాలాన్ని ఊహించలేదు. కాబట్టే - వీపీ సింగ్, కరుణానిధి, అద్వానీ వంటి వారు, ఈ స్థానిక పత్రికాధిపతి చుట్టూ తరచూ తిరుగుతారు వంటి అంశాలతో కూడిన నా రిపోర్టు... పీవీజీకి ముఖ్యమైన ’క్లూ’ని ఇచ్చింది.

ఈ విధంగా మీడియా మాయాజాలాన్నే కాదు, పాకిస్తాన్ పట్ల అమెరికా, రష్యా, చైనాల పక్షపాత ధోరణిని, ప్యాటర్సన్ ట్యాంకుల సాక్షిగా, ఇండో - చైనా, ఇండో-పాక్ యుద్దవ్యూహల సాక్షిగా, వాటిపై అంతర్జాతీయ మీడియా ఆడిన నాటకాల సహితంగా, పీవీజీ తన ’లోపలి మనిషి’లో వివరించాడు.

’లోపలి మనిషి’ లో పీవీజీ, ఆనంద్ ద్వారా మరో ముఖ్యమైన అంశాల్ని కూడా ప్రస్తావించాడు. ఆనంద్ విద్యార్ది దశని వివరిస్తూ ’ప్రపంచం మీద తనదైన ముద్ర వేయాలనే’ తన సంకల్పాన్ని ఆవిష్కరించుకున్నాడు.

ప్రపంచం మీద తనదైన ముద్ర - ఒక ద్రష్ట మాత్రమే చేయగలిగింది. ఒక దార్శినికుడు మాత్రమే వేయగలిగింది. ప్రపంచానికి ఒక దిశను చూపించాలంటే అతడు సత్యదర్శియై ఉండాలి. అలాంటి సత్యాన్వేషి, సత్యదర్శి పీవీజీ.

ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతి పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ

అన్న ధీరోదాత్తుడు! అవును. తమోగుణంతో, అవగాహనా రాహిత్యంతో, అసత్యపు టెడారుల వెంట అలుపెరగకుండా పరుగెడుతున్న ప్రపంచాన్ని, రజోగుణం రగిల్చి, జ్ఞానపు కాంతిపుంజాలతో వెలిగించటమే.... పీవీజీ సమీకరించిన నెం.5 వర్గం ‘బహిర్గతాలు-సువర్ణముఖి’లతో నిర్వహించుకుంటూ వస్తోంది. కొద్ది సంవత్సరాల గతంలో ప్రారంభమై, వర్తమానంలో వేగమందుకొన్న ఈ ప్రక్రియ, సమీప భవిష్యత్తులో పూర్తై తీరుతుంది. ఈ నేపధ్యంలో, పీవీజీ సంకల్పాన్ని భగవంతుడు సిద్దింప చేసిందే కన్పిస్తుంది.

ఒక్క పీవీజీ కే కాదు, ఎవరికైనా భగవంతుడు ఆ అవకాశం ఇస్తాడు. సత్సంకల్పమో, దుస్సంకల్పమో - అది మనిషి విజ్ఞత. మన సంకల్పం ఏదైతే, దాన్నే భగవంతుడు సిద్దింప చేస్తాడు. కాక పోతే దుష్ట సంకల్పానికి దుష్పలితం, సత్సంకల్పానికి సత్ఫలితమూ వస్తాయి, అంతే! అందుకే.... నెం.5 వర్గానికైనా నకిలీకణిక వ్యవస్థ, నెం.10 వర్గానికైనా భగవంతుడి ఇచ్ఛానుసారమే సాగుతుంది అని గత టపాలలో వ్రాసాను.

నా స్వానుభవం: అప్పటికి డిగ్రీ చదువుతున్నాను. మా వీధిలో చిన్న టీ కొట్టు ఉండేది. తెల్లవారు ఝామున అయిదింటికే ఆ టీ కొట్టు యజమాని [చిన్నవాడే లెండి.] దుకాణం తెరిచేవాడు. మరుక్షణమే టేప్ రికార్డర్ పేద్ద చప్పుడుతో పెట్టేవాడు. అతడు క్రిస్టియన్! అతడికిష్టమైన భక్తి గీతాలు పెట్టేవాడు.

ఉదయాన్నే

"ఇన్నేళ్ళు మనము
ఉన్నాము ఇలలో
చల్లనీ దేవునీ నీడలో
గతించిపోయే కాలమూ
స్మరించు యేసు నామమూ
సంతోషించుడీ శుభోదయం’ అనే పాట వేసేవాడు.

అప్పుడే నిద్రలేచి, నిద్రకళ్ళతో తూర్పు దిక్కుకు నమస్కరించుకునే నాకు, ఒక్కసారిగా నీరవ నిస్పృహలు వచ్చేవి. పాట చక్కనిదే! సుశీల పాడిన పాట. కానీ, నాకు "అవును... ఇన్నేళ్ళు గడిచాయి....జీవితంలో సాధించింది ఏమీ లేదు" అన్పించేది. ఆ రోజంతా దిగులుగా ఉండేది. ఎప్పుడైనా ఆ పాటకు బదులు మరో పాట వినబడినప్పుడు నా అనుభూతులన్నీ మరోలా ఉండేవి. కొన్ని రోజులు నన్ను నేను పరిశీలించుకునే సరికి, నాకు విషయం బోధపడింది. మా నాన్నని "అతణ్ణి ఉదయాన్నే వేరే పాటలు పెట్టుకొమ్మని చెప్పండి. కాస్సేపయిన తర్వాత ఆ పాట పెట్టుకున్నా ఫర్వాలేదు. క్రైస్తవ గీతాలే మరేవైనా పెట్టుకొమ్మనండి" అని అడిగాను.

మా నాన్న అతడికి అదే చెప్పాడు. అతడూ నవ్వేసి సరేనన్నాడు. మర్నాటి నుండి ఉదయమే మరో క్యాసెట్ పెట్టుకున్నాడు.

అప్పుడే అనిపించేది - "జీవితంలో ఏదో సాధించాలి! పుట్టాం, ఏదో ఉద్యోగం, డబ్బు సంపాదించాం, బ్రతికాం! ఇదే కాదు జీవితం అంటే" అని. నా ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడనే అనుకుంటాను. ఎవరికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ శతృవు, నీ మనస్సే నీ మితృవు’ అంటుంది. మన సంకల్పాన్ని బట్టే మనం కాబట్టి, మన సంకల్పం మన మనస్సుని బట్టే ఉంటుంది కాబట్టి.

పీవీజీ సమీకరించిన నెం.5 వర్గపు పనితీరు కూడా ఈ కాన్సెప్ట్ మీదే ఆధారపడింది. రాజకీయ, కార్పోరేట్, సినిమా, గట్రా రంగాలలోని అగ్రనేతలు, సెలబ్రిటీల దగ్గరినుండి సామాన్యుల దాకా.... వారి వారి సంకల్పాలని బట్టే వారి జీవిత సంఘటనలు [సెలబ్రిటీలకీ, రాజకీయ నేతలకీ వారి ఆసైన్ మెంట్లు] నడుస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలు చెబుతాను.

1996 లో పీవీజీ ప్రధాని పదవి దిగిపోయిన నాటి నుండి ప్రధాని పదవి నధిష్టించిన వారిలో....

వాజ్ పేయి - ఈ బ్రహ్మచారి రాజకీయ నాయకుడు, యువకుడిగా ఉన్న రోజుల్లో కూడా.... కెరీర్ కోసం, ఇది రాజకీయ వ్యూహం అంటే ఏది చేసేందుకైనా సిద్దపడే వాడే! అయితే అదీ కొంత పరిధి మేఱకే! దేశ ద్రోహానికి ఒడిగట్టేంతటి వాడు కాదు. 1971 లో ఇండో పాక్ యుద్దానంతరం, బంగ్లా దేశ ఆవిర్భావ నేపధ్యంలో అతడు ఇందిరాగాంధీని ‘అపర చండిక’ అనేసాడు. అతడికి మొదటి నుండీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇందిరాగాంధీ పట్ల సానుకూలతేమీ లేదు. కానీ, దేశపు విజయాన్ని ఆనందించిన వాడు కాబట్టి, మాట తూలాడు. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి అద్వానీ తూగినంతగా వాజ్ పేయి తూగలేదు.

1992 తర్వాత.... 1996 నుండీ ఎకాయెకీ అద్వానీ అగ్రసీటులో ఉండటం ఎక్కువ ప్రమాదకరం అనుకున్న గూఢచర్య నేపధ్యంలో, వాజ్ పేయికి అంత ప్రాముఖ్యత ఇచ్చారే గానీ 1992 కు ముందరైతే, అద్వానీతో పోలిస్తే వాజ్ పేయికి ఎక్కువ సీన్ ఇవ్వబడలేదు. మీడియా సైతం ప్రచారం ఇవ్వలేదు.

అతడికి మాతృ దేశంమీద, భాజపాలోని ఇతర నాయకులతో పోలిస్తే ఎంతో కొంత ఎక్కువ ప్రేమాభిమానాలే ఉన్నాయి. కాబట్టే... 1800 కి.మీ. పొడవైన Golden Quadrilateral [స్వర్ణ చతుర్భుజి] నాలుగు లైన్ల జాతీయ రహదారి అతడి మానస పుత్రిక అయ్యింది. అద్వానీలకి అంతటి అవకాశం లేకపోయింది. అలాగే కాందహార్ వ్యవహారం వాజ్ పేయి మెడకి చుట్టలేక పోయారు.

వాజ్ పేయి... అతడి మతిలో ఏముందో అదే గతిలో పొందాడు. అతడి సంకల్పం సిద్ది అది!

అద్వానీ: పాకిస్తాన్ నుండి వచ్చిన, నకిలీ కణిక వ్యవస్థలోని ఈ కీలక వ్యక్తి, కాందహార్ సాక్షిగా, జిన్నా సాక్షిగా తానేమిటో నిరూపించబడ్డాడు కదా! జస్వంత్ సింగ్ మాటల, ఆత్మకథల సహితంగా! రామ మందిరం కోసం గొంతులు చించుకున్న అతడు, భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత రామమందిరం పట్ల తనకు ఎంత నిబద్దత ఉందో నిరూపించుకున్నాడు. అదే అతడి సంకల్పసిద్ది.

చంద్రబాబు నాయుడు: చంద్రబాబు సంకల్పం, ధృక్పధం - ‘ఏం చేసైనా సరే.... నమ్మించి ద్రోహం చేసైనా, వెన్నుపోటు పొడిచైనా సరే...అధికారమే పరమావధి’. ఆ సంకల్పమే సిద్దించింది అతడికి. మొత్తం అవినీతి సొమ్ములో తనదే సింహభాగం కావాలన్నదే అతడి ఆశ! ఆ విధంగానే అవినీతిని వ్యవస్థీకృతం చేసాడు. అతడు రామోజీరావు జేబులో బొమ్మ! రామోజీరావు కోసం ఏంచేయటానికైనా వెనకాడని వాడు. కాబట్టే అతడి తరుపున ప్రపంచం మొత్తం గూఢచర్యం కోసం తిరిగాడు. అతడికి తెలుసు తాను చేస్తున్నది దేశద్రోహమని!

వై.యస్. రాజశేఖర్ రెడ్డి: వై.యస్.కి రామోజీరావుపై ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పం! తనని ఉపయోగించి కొని, అవతల పెడుతున్నాడనే కసి, దుగ్ధ ఉన్నాయి. అవకాశం వస్తే ఒక ఆట ఆడుకోవాలనే సంకల్పం ఉంది. అదే ఫలించింది.

ఆయా వ్యక్తులకి గల సంకల్పాలని బట్టే వారి కర్మలూ [assignments] నడిచాయి. ఆ కర్మలే ఆయా వ్యక్తుల నిజస్వరూపాలని బహిర్గత పరిచాయి. వాటి ఫలితాలే సువర్ణముఖిలయ్యాయి.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన సినిమా ’బంపర్ ఆఫర్’ లో.... ధనమదంతో రెచ్చిపోతున్న హీరోయిన్ తండ్రిని దెబ్బతీసేందుకు, అతడి ఉద్యోగి ధర్మవరపు సుబ్రమణ్యంని హీరో కలుస్తాడు. యజమాని పుట్టి ముంచుతూ తనకు సాయం చేస్తే డబ్బులిస్తానంటాడు.

దానికా ఉద్యోగి - "పాతికేళ్ళుగా వాడి దగ్గర పనిచేస్తున్నాను. వాణ్ణి దివాళా తీయించి రోడ్డుకి లాగితే నేనే మీకు డబ్బులిస్తాను" అంటాడు. అదేమిటీ అని తెల్లబోయిన హీరో బృందానికి అతడు "ఫ్రస్టేషన్ బాబూ! ఫ్రస్టేషన్!" అంటూ ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న మంటని వెళ్ళగ్రక్కుతాడు.

సరిగ్గా ఇప్పుడు ఇదే.... గూఢచర్య నెట్ వర్క్ లో, ఏజంట్లకీ వాళ్ళ బాసులకీ మధ్య నడుస్తోంది. సహజంగానే క్రింది వాడికి తనపై వాడి మీద ఓ ఫ్రస్టేషన్ ఉంటుంది. ఇక తమకి నడుస్తున్న రోజుల్లో తమ పెర్వర్షన్లన్నింటినీ, అందరి మీదా ప్రయోగించిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తుల మీద, నెం.10 వర్గంలోని ఏజంట్లకి కడుపుమంట ఉంటుంది కదా! అయితే గూఢచర్య గ్రిప్ నకిలీ కణిక వ్యవస్థ కి ఉందనుకున్నన్ని రోజులూ సదరు కడుపుమంటని కడుపులోనే దాచుకున్నప్పటికీ...

బలవంతమైన సర్పం బలహీన పడిందనుకున్నప్పుడూ, చలి చీమలకి చిక్కి చావగలదని పించినప్పుడూ, తలో రాయి తనలాంటి వాళ్ళంతా వేస్తున్నప్పుడు తానూ ఒక రాయి విసరగలనన్న ఆత్మ విశ్వాసం కలిగినప్పుడూ.... సదరు ఏజంట్ల బాసు గుట్లు బయటపెట్టడం చేస్తారు. క్రమంగా అదే బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా పరిణమిస్తుంది. అలాంటి చలిచీమలని ప్రోది చెయ్యటమే నెం.5 వర్గం ఇప్పుడు చేస్తోంది.

ఇంతక్రితం నకిలీ కణిక వ్యవస్థ, ఎవరినీ ఎక్కువ కాలం తన ఏజంట్లని స్థిరంగా ఉండనిచ్చేది కాదు. కొంతకాలం పనిచేయించుకొని తరువాత క్రమంగా వాళ్ళని తెరమరుగు చేసేది. తమకి కావాలనుకున్నవాళ్ళ పనులు మాత్రం నడిచేటట్లు చూసేది. అదే ఇప్పుడైతే.... ఏజంట్లకి నిరంతరం ఫండ్స్ ప్లో చేయాల్సి వస్తోంది. లేదో.... ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అదే నకిలీ కణిక వ్యవస్థకి ప్రాణాంతకం అయ్యింది.

ఇక్కడ నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు.... కుడితే [మనిషి]చావాలన్న దుస్సంకల్పానికి ఫలితంగా కుట్టగానే తామే ఛస్తున్న చీమలతోనూ.... అదే సమయంలో తమ అనుచరుల చేత, సామాన్యుల చేతా చిక్కి, క్షణక్షణం ఛస్తున్న బలవంతమైన సర్పం తోనూ.... పోలిక కలిగి ఉన్నారు.

నిజానికి ‘యుద్దం అంటే శతృవుని చంపడం కాదు, ఓడించటం’ అన్నమాట గొప్పది. ఎందుకంటే - ఇన్ని పాపాలు చేసిన వాడు ఒక్క క్షణంలో చచ్చి ఊరుకుంటే అది ఖచ్చితమైన శిక్ష కానే కాదు. క్షణ క్షణం ఛస్తూ బ్రతికితేనే.... మరింకెవ్వరికీ ’తగుదునమ్మా’ అని గూఢచర్యంలో దూరి దుష్టపు పనులు చేసే ధైర్యం ఉండదు. అంతేగాక, అలా క్షణం క్షణం ఛస్తూ బ్రతికటమే, ప్రపంచాన్ని తమ కనుసన్నల్లో తిప్పుతున్నామన్న అహంకారికి తగిన శిక్ష! అదీ భగవంతుడిచ్చిన సంకల్ప సిద్దే!

ప్రపంచానికి తామేమిటో తెలియాలి. ప్రపంచాధినేతగా దృగ్గోచరం కావాలి అన్న సంకల్పానికి తగిన సిద్ది! ప్రపంచానికి తామేమిటో తెలుస్తున్నారు, ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకోవాలన్న వాళ్ళ దురాశా దృగ్గోచరం అవుతోంది. భవిష్యత్తులో మరింతగా, అట్టడుగు పామరుడికి కూడా అర్ధమయ్యేటంతగా ఇది పరిణిమిస్తుంది.

నిజానికి రెండేళ్ళ క్రితం వరకూ కూడా, నకిలీ కణిక వ్యవస్థ లోని కీలక వ్యక్తులు, తరతరాలుగా తము నిర్వహించుకు వస్తున్న అనువంశిక గూఢచర్యం గురించి ఎవ్వరికీ తెలియదనీ, ఎవరూ తెలుసుకోలేరనీ అనుకున్నారు. కాబట్టే.... ఒకవేళ రామోజీరావుని ప్రధాన కుట్రదారుగా ప్రకటించి, శిక్షించినా, అతడి నాశనంతో ఇది ఆగదనే ధీమా ప్రదర్శించారు.

‘ఒక్క విలన్ చచ్చిపోయినా, అతడి ఆత్మసైతం.... బ్రతికి ఉన్న మంచివాళ్ళ కంటే, చచ్చిపోయిన మంచివాళ్ళ అత్మల కంటే బలంగా ఉంటుంది’ - దీన్నే ఎన్నోసార్లు నకిలీ కణిక వ్యవస్థ, నెం.5 వర్గానికి చెప్పింది. అక్స్, 1920 దగ్గర నుండీ అరుంధతి దాకా ఎన్నో సినిమాలలో కూడా ఇదే చెప్పబడింది. ఎందుకంటే నకిలీ కణిక వ్యవస్థ తెలియనప్పుడు "రామోజీరావునో, అలాంటి ప్రధాన కుట్రదారులనో బహిర్గత పరిచి, శిక్షించి నాశనం చేసినా, వాళ్ళ తర్వాతి తరాలు దీనిని కొనసాగిస్తాయి గనుక, కొన్నేళ్ళు నిశ్శబ్ధంగా నడిచినా, మళ్ళీ బలం పుంజుకుని ప్రతీకారం సాధించగలం" అన్న ధీమా అది. అప్పుడు బ్రిటీషు సామ్రాజ్య వాదం, తరువాత సిఐఏ, ఇప్పుడు ఇస్లాం ఉగ్రవాదం మాదిరిగా!

"దుస్సంకల్పంతో మీరు తరతరాలుగా పనిచెయ్యగా లేనిది, ప్రపంచానికి, మానవత్వానికి మేలు కోసం సత్సంకల్పంతో మేము, తరతరాలుగా పనిచెయ్యలేమని ఎలా అనుకుంటున్నారు? మీది రక్త సంబంధమైతే మాది భావ సంబంధంతో కూడిన తరతరాల అనువంశీయమే" అన్న సమాధానాన్ని నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ కీ అందులోని కీలక వ్యక్తులకీ ఇచ్చింది.

ఈ సందర్భంలో మీకు ఓ చిన్న కథ గుర్తు చేస్తాను. మనం చిన్నప్పుడు విన్న కథ, కొసమెరుపు మార్పుతో....

అనగా... అనగా...

ఓ టోపిల వ్యాపారి. ఎండలో వెళ్తూ చెట్టుక్రింద నిద్రపోయాడు. నిద్రలేచి చూస్తే మూటలోని టోపీలన్నీ మాయం. తన నెత్తి మీది టోపీ మాత్రమే మిగిలింది. తలెత్తి చూస్తే చెట్టు మీద కోతులు. వాటి తలలపై టోపీలు. టోపీల వ్యాపారికి తన తాత చెప్పిన విషయం గుర్తొచ్చింది. తాతకి లాగే తనూ, తన నెత్తి మీద టోపి తీసి క్రిందకు విసరి కొట్టాడు. తాత అనుభవం మాదిరిగానే కోతులన్నీ తలల మీది టోపిలని నేలకి విసిరి కొడతాయని, ఏరుకొని మూటగట్టుకు పోవచ్చనీ అనుకున్నాడు. అలా ఆశపడుతూ నిలబడ్డాడు.

ఆశ్చర్యం! ఓ పిల్లకోతి ఛటాలున చెట్టు దిగి వచ్చి, టోపీల వాడు విసరి కొట్టిన టోపిని కూడా తీసుకొని, చెట్టెక్కి చప్పట్లు కొట్టింది. టోపీల వాడు వెర్రి ముఖం పెట్టాడు. అంతలో పిల్లకోతి ఓ చీటీ క్రిందికి విసిరింది. తీసి చూస్తే అందులో "తాత నీకే కాదు. మాకూ ఉన్నాడు" అని వ్రాసి ఉంది.

ఇదీ కథ!

ఈ కథ ఈనాడులోనే బాల వినోదంలో చాలా రోజుల క్రితం ప్రచురితమయ్యింది. అయితే దాని అంతరార్ధం పాపం నకిలీ కణిక అనువంశీయులకీ అప్పుడంతగా అర్ధమయి ఉండదు. ఇప్పుడు బాగానే అర్ధమవుతూ ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇక మున్నుడిలో రచయితగా పీవీజీ....
>>>ఈ సందర్భంలో కొన్ని ముఖ్యాంశాలు మనవి చేయాలనుకున్నాను. ఈ రచన ఆత్మ చరిత్ర కాదు. కాల్పనిక రచన వలె రచయిత స్వచ్ఛంద ఊహలను అనుసరించేదీ కాదు. ఇది కల్పనాయదార్ధాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి, కథాకారుడు, విమర్శకుడు - రచయిత ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విశిష్ట నేపధ్యంలో ఇదా, ఆదా, అనే మీమాంస రచనను పుట్టుకతోనే వెన్నాడుతూ ఉంది. దేశస్వాతంత్ర్యోద్యమంలో తుది ఘట్టం నుండి నేటి వరకు లోపలి మనిషిగా రాజకీయ సాంఘిక వికాసక్రమాన్ని సాధ్యమైనంత వ్యక్తి నిరపేక్షంగా పరిశీలించిన వాణ్ణి కనక ఈ రచనా సౌధం గట్టి నేలపై నిలుచుని ఉందనగలను. రాబోయే కాలంలో ఆఘాత విస్మయాలు కలిగించే అనేక సమస్యలను దేశం, ప్రపంచం, ఎదుర్కొనబోతున్నాయి. అందుకని ఈ రచనా వస్తువు అనంతంగా ఉంటుంది; అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది నిస్సందేహం. ఈ ఒరవడిలో ప్రారంభ ప్రయత్నాలలో ఆవిర్భవించినందుకు లోపలి మనిషి తన భాగ్యానికి సంతోషిస్తున్నాడు.

2005, అక్టోబరులో ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చాక, ఈ పుస్తకాన్ని తొలిసారిగా చదివాను. ఈ పేరాలో పీవీజీ వ్రాసిన తొలి వాక్యాలు అప్పుడెక్కువగా అర్ధమయ్యాయి. అయితే తొలి వాక్యాలతో పాటు ఈ పేరాలోని చివరి వాక్యాలు కూడా, అప్పటి కంటే ఇప్పుడు, ఇంకా బాగా అర్ధమయ్యాయి.

రాబోయే కాలం గా ఆయన చెప్పిన భవిష్యత్తు, ఇప్పటికి మనకు వర్తమానంతో ప్రారంభమై భవిష్యత్తులోనికి కొనసాగనుంది. ఆ ఆఘాత విస్మయాల రంగు రుచి వాసనా కొందరికి ఆశ్చర్యం, నమ్మకం కలిగిస్తే, కొందరికి నవ్వు కలిగిస్తోంది. ఎవరి విజ్జత వారిది కదా!

లోపలి మనిషి రచనా వస్తువు అనంతంగా ఉంటుందనీ,అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు కల్పిస్తుందనీ పీవీజీ అన్నాడు. అది నిస్సందేహమని కూడా అన్నాడు.

అవును, అది నిశ్చయంగా నిస్సందేహం!

ఎవరు ఎంతగా పెనుగులాడినా ఆపలేని సత్యావిష్కరణం!

>>>కావునా ఫలానా పాత్ర ఎవరు? రచయిత ఫలానా పాత్రలో తన ఆత్మచరిత్రను చొప్పించాడా? లాంటి ప్రశ్నలకు నేరుగా ప్రత్యుత్తరాలు ఈ రచనలో లభించవని రచయిత మనవి. పాత్రల పరికల్పనకు ఆధారభూతమైన అంశాలను ఉల్లేఖించి, అసలు చెప్పదలచిన విషయంపైకి పాఠకుల దృష్టిని మళ్ళించే ఉద్దేశంతోనే ఈ వివరణ వాక్యాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

లోపలి మనిషిలో పీవీజీ .... భారత దేశంలో.... "1960, 70లలో కేంద్రంలో అధికార పార్టీ[కాంగ్రెస్] సామాజిక మార్పు కోసం అనేక రంగాలలో అవలంబించనున్న విధానాలను, అమలు ప్రణాళికలను రూపొందించింది. అమలు చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉండింది. ఏ రాష్ట్రమైనా ఒకటే అనే ఉద్దేశంతో భారత దేశంలోని రాష్ట్రాలకు ప్రతీకగా అఫ్రోజాబాద్ ను ప్రస్తావించటం జరిగిందని" చెప్పాడు.

అలాగే రాష్ట్రంలో పదవుల కోసం కుమ్ములాడుకునే రాజకీయ నాయకులని, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మహేంద్రనాధ్, చౌదరి పాత్రలకు అలియాస్ చేసేసాడు. సీట్ ఎక్కేందుకు చేసే రాజకీయాలనీ, ఎక్కాక చేసే అక్రమాలనీ దృష్టితో ఉంచుకుంటే - ఎవరైనా ఒకటే! కాబట్టే..... ’ఎవరైనా ఒకటే - చౌదరి!’ అన్నట్లన్నమాట. అందుచేతే పాత్రల గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనన్నాడు.

ముఖ్యంగా లోపలి మనిషిలో నన్నాకర్షించిన పేజీలూ, పేరాలూ ఇవి....
675 వ పేజీలో:
>>>కామ్రేడ్ బెనర్జీ అలా మాట్లాడుతూనే ఉన్నాడు. అతడి గొంతు బిగ్గరగా, మరింత బిగ్గరగా వినిపిస్తోంది. అతడి స్వరం మరీమరీ నిందాపూరితంగా మారుతోంది. అతడి మాటలకు చెవియొగ్గడమే తను చేసిన తప్పు అనుకున్నాడు ఆనంద్. ఒకసారి వాళ్ళకు నిర్బంధ శ్రోతలుగా చిక్కిపోయామంటే, ఈ యువతీవ్రవాదులు ఓ పద్దతిలో మనమీద దాడి ప్రారంభిస్తారు. ఎంత సేపూ వ్యతిరేక ధోరణితోనూ, విధ్వంసదృష్టితోనూ ఉంటారు తప్ప ఇదీ ప్రత్యామ్నాయమంటూ ఒక్క సూచన కూడా చేయరు.... అయితే బెనర్జీని తప్పుపడుతున్నాడే కానీ, తనది ఒప్పని తనూ రుజువు చేసుకోలేకపోయాడని ఆనంద్ గ్రహించాడు. బెనర్జీ నిరంతరాయంగా, నిర్ధాక్షిణ్యంగా తన దాడిని కొనసాగించాడు.

676 వ పేజీలో:
>>>అయితే దేశమంత జల్లెడలోని కంతలను పూడ్చడానికి ప్రయత్నిస్తూ మీరు మీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారని నాకనిపిస్తోంది. ఇలా అంటున్నందుకు బాధగానే ఉంది, కానీ మీరు తప్పకుండా విఫలులౌతారు. తమ భూముల్ని.... తమ హోదాను గుంజుకునే ప్రయత్నం చేసినందుకు వాళ్ళు మిమ్మల్ని కచ్చితంగా శిక్షిస్తారు.... మీ నిజాయితీకి శాస్తిగా ఉరికంబమెక్కిస్తారు. తొందరపడండి ఆనంద్ జీ, మీ జీవితాన్ని కాపాడుకోవడానికి తొందరపడండి; అర్ధవంతమైనదేమైనా చేయండి. ఈ భూసంస్కరణల ప్రహసనంలా విఫలమయ్యేదైనా సరే, ఒక ద్రష్టకు తలతూగే పని ఏదైనా చేయండి. మీ బుద్ది కౌశల్యాన్ని ఎవరూ లెక్క చేసే వారుండరు. వాళ్ళు మిమ్మల్ని పక్కకి విసిరి కొట్టే లోపల, మీలోని నిజమైన మూర్తిని ధ్వంసం చేసి, మీరు మరెప్పటికీ లేవకుండా మీ మీదికి తప్పుడు ప్రజాభిప్రాయమనే వేట కుక్కల్ని ఉసిగొలిపే లోపల తప్పించుకోండి. మీ స్వప్నాలనూ, మీ స్వాప్నికతనూ రక్షించుకోండి! కదలండి, కదలండి! మూర్ఖులు కాకండి!’

కామ్రేడ్ బెనర్జీ ముఖతః తనకు వినిపించినట్లుగా ఆనంద్ [లోపలి మనిషి] ఇదంతా చెప్పాడు. ‘దేశమంత జల్లెడలోని కంతలను పూడ్చడానికి ప్రయత్నిస్తూ మీరు మీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారని నాకనిపిస్తోంది’.... ఇప్పటికీ రామోజీరావు, మా మీద, చాలాసార్లు, ‘కామ్రేడ్ బెనర్జీ వాదన’లనే ప్రయోగించాడు, ప్రయోగిస్తూనే ఉన్నాడు.

>>>చెవుల్ని హోరెత్తించే ఉద్బోధలకూ, ఆరోపణల జడివానకూ ఆనంద్ వణికిపోయాడు. తల బద్దలైపోతుందా అనిపించిందతనికి. మరుక్షణమే అంతా నిశ్శబ్ధం. తుపాను వెలసిన తరువాత అలముకున్న ప్రశాంత స్థితి.... సముద్రం, ముందెన్నడూ ఎటువంటి కల్లోలమూ ఎరుగదా అన్నంత నిశ్చలంగా మారిపోయింది. ఉదయభానుడి కిరణాలు సోకి తీరం ధగధగా మెరిసిపోతుంది. ఓ అందమైన బాలిక తన వైపు పరుగు పరుగున వస్తూ కనిపించింది. అతడు ముందుకు వంగి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతుల్లో ఆమె అతివేగంగా, నమ్మశక్యం కానట్టుగా, ఎంతో రమణీయంగా విప్పారుతున్నట్టనిపించింది. తన కళ్ళు భరించలేనంత దేదీప్యమానంగా వెలిగిపోతోంది.... హఠాత్తుగా అతడికి స్ఫురించింది.... ఆమె తన మరోసగం, తనకెంతో బాగా తెలిసిన, తన జీవిత పర్యంతము తెలిసిన, ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని అనేక జన్మల నుండి తన జీవనానుభూతికి మాత్రమే తెలిసిన తన మరోసగం!


అనంద్ రెప్పలు కిందికి వాల్చాడు. ఆ ప్రకాశాన్ని సూటిగా చూడగలగడం తనకు అసాధ్యమనిపించింది... అది ఒక భౌతిక రూపమో, రూపరహిత ఆకారమో అతడే తేల్చుకోలేకపోయాడు. దాని ఉనికి మాత్రం అతడి అనుభూతికి అందుతోంది. తన దేహాత్మలతోనే కాదు, వాటి కతీతమైన స్థితిలో కూడా అతడికది అనుభవంలోకి వస్తోంది.

తనెన్నడూ విని ఎరుగని మృదుమధురమైన ఓ దివ్యవాణి అతడికి వినిపించింది... దేవ లోకం నుండి తేలివస్తున్న హాయి గొలిపే ఒక జోల పాటలా, నిర్భయాన్నీ నిబ్బరాన్నీ కలిగించే అమ్మ నోటి పాటలా అది వినిపించింది. ’కలవరపడుతున్నావా?’ తేనే లొలికే స్వరంతో ప్రశ్నిస్తున్నట్లు వినిపించింది. ఏం చెప్పాలో అతడికి అర్ధం కాలేదు.

ఆ తర్వాత ఆమె తన చెవిలో గుసగుసలాడుతున్నట్టనిపించింది. ’మరీ అంత కలత పడి పోతావేం! అది చాలా చిన్నవిషయం.... ’ఎవరో స్పృశించిన అనుభూతి కలిగిందతనికి.... మళ్ళా అదే గొంతు వినిపించింది. ఎంతో క్లుప్తమైన, బిగువైన పరిష్కార సూత్రం తక్షణమే అతడి స్ఫురణలోకి వచ్చేసింది. ’అర్ధమైందా?’ కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తూ అడిగింది ఆ స్వరం. అవునవును, అర్ధమైంది.... ఎంత సరళమైన పరిష్కారం! భగవంతుడా! నిజంగా ఎంత సరళమైన తరుణోపాయం! కృతజ్ఞుణ్ణి, కృతజ్ఞుణ్ణి! కృతజ్ఞుణి!’ ప్రతీసారీ బిగ్గరగా మరింత బిగ్గరగా తన మరోసగంతో అన్నాడు. అంతలో హఠాత్తుగా కళ్లు తెరుచుకున్నాయి.

~~~~~

1992 జూన్ లో, నేను పీవీజీకి రామోజీరావు కార్యకలాపాల గురించి ఫిర్యాదు ఇచ్చేనాటికి పీవీజీ చుట్టూ.... పరిస్థితులూ, పీవీజీ సహచరులూ.... ప్రతీ ఒక్కటీ, ప్రతీ ఒక్కరూ, ఒక్కొక్క కామ్రేడ్ బెనర్జీ లాగే ఉన్నారు. చుట్టూ కమ్ముతున్న సమస్యలలో.... సమస్యల మూలకర్తా, సృష్టికర్తా ఎవరో తెలియకుండానే పోరాడుతున్న పీవీజీకి, రామోజీరావు గూఢచర్య అస్తిత్వం అర్ధం కాగానే, తన సుదీర్ఘ అనుభవానికీ, అన్వేషణకీ అది తిరుగులేని విధంగా ’ఫిట్’ అయ్యింది. ఇందిరాగాంధీతో సహా తాము, దశాబ్దాల పాటు పోరాడిన అనుభవానికీ, అవగాహనకీ, నూరు శాతం ‘confirm’ అయ్యింది.

అప్పటికి అచ్చం కామ్రేడ్ బెనర్జీ లాగే పరిస్థితులూ, వ్యక్తులూ కూడా, సర్వవైఫల్యాలకీ తనని బాధ్యుణ్ణి చేయ ప్రయత్నిస్తున్నదీ, దేశాన్ని అన్నివిధాలా కుప్పకూల్చి ఆ దుష్కర్తిని తన భుజాన ఉంచడానికి గూఢచర్యం ఎంతో బలంగా పనిచేస్తున్నదీ కూడా, పూర్తిగా స్పష్టపడింది. మరుక్షణం ఆ యోధుడు రెట్టించిన పటిమతో పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్దపడ్డాడు. అప్పటికి నేను సీల్డ్ కవర్ లో పెట్టి ఇచ్చిన ఫిర్యాదు, ఆయనకి తిరుగులేని పరిష్కారాన్ని చూపించినట్లయ్యింది.

1992 నాటికి పీవీజీకి 72 ఏళ్ళు. ఆయన మనుమరాలి వయస్సు నాది. అందుకే ’తాతా’ అని పిలుచుకునేదాన్ని, ఉటంకించుకునేదాన్ని. అంతగా ఆత్మీయత పెంచుకున్న పీవీజీ... నాకు సిరిసంపదలో, బిరుదు సత్కారాలో తవ్వి తలకెత్తకపోతే పోయే... కనీసం నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వటం లేదని, 1993 నుండి 1995 వరకూ ఆక్రోశించాను. నమ్మి ’తాతా’ అని ఆప్యాయంగా అనుకుంటే, నట్టేట ముంచుతున్నాడని తిట్టుకున్నాను. వ్యతిరేక భావనలతో ఊగిపోయాను.

అయితే 2005లో పీవీజీ ’లోపలి మనిషి’ చదివాక నాకు చాలా స్పష్టత వచ్చింది. ఆయన నన్ను ఎంత గౌరవించాడో, నాకు ఎంతగా కృతజ్ఞత చెప్పాడో అర్ధమైంది.

తన చేతులతో, తన శిక్షణలో విప్పారిన బాలికగా ఆ లోపలి మనిషి, నన్ను తన సగభాగంగా గుర్తించి గౌరవించాడని భావించాను. ఇంతకంటే మరింకేదీ నాకు గొప్ప గౌరవం అని నేను అనుకోను. ఈ దేశపు సామాన్యరాలిగా ’ఇచ్చట బుట్టిన జిగురు కొమ్మైనా చేవ’ అంటూ.... ఆ రోజున నేనిచ్చిన ఫిర్యాదు చాలా చిన్న సమాచారం మాత్రమే! సదరు రామోజీరావు తాలూకూ గూఢచర్యంగానీ, నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం గానీ ఎంత విస్తారమైనదో, లోతైనదో నాకేమీ తెలియదు.

ఏది ఏమైనా అతడు చేస్తోన్నది ‘ధర్మగ్లాని, దేశద్రోహం, పసిబిడ్డల పట్ల సైతం అమానుషం’ అనుకున్నానే తప్ప, అది గూఢచర్యంతో కూడుకున్నదని నాకు తెలియదు! [తెలిస్తే ఫిర్యాదు ఇచ్చి ఉండేదాన్ని కాదా?" అని కూడా అప్పుడప్పుడూ తర్కించుకుంటాము. ‘తెలిసినా వెనక్కి తగ్గి ఉండేదాన్ని కాదు’ అని ఖచ్చితంగా చెప్పగలను.]

అలాంటిది, చిన్న సమాచారాన్ని ఇచ్చినందుకు, ఆ లోపలి మనిషి.... సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ అమ్మాయిని ’తన కెంతో బాగా తెలిసిన, తన జీవిత పర్యంతమూ తెలిసిన, ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని అనేక జన్మల నుండి తన జీవానానుభూతికి మాత్రమే తెలిసిన తన మరోసగం’గా గుర్తించటం! ఇంతకంటే సఫలత, గౌరవం ఇంకేదీ లేదనుకుంటాను.

అందుకే, 1992లో ’రక్త సంబంధం కంటే భావ సంబంధం గొప్పది’అని మాకు చెప్పబడిందన్నది అర్ధమైంది. ఇంత గౌరవాన్నిచ్చిన ఆ ’లోపలి మనిషి’, కేవలం గౌరవంతో సరిపెట్టలేదు, తన కృతజ్ఞతగా.... జీవితకాలం పాటు తాను చేసిన సాధనని, సాధించిన జ్ఞానాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు. ఇంతకంటే విలువైన బహుమతి, కృతజ్ఞత మరింకేవీ ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే జ్ఞానం అంత పవిత్ర వస్తువు ఈ లోకంలో మరేదీ లేదంటుంది గీత. జ్ఞాని అంటే తానేననీ, జ్ఞానికీ తానూ, తనకి జ్ఞానీ కనబడక పోడనీ అంటుంది.
అంతే కాదు,

శ్లోకం:
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః
భావం:
తాత్వికులైన వారిని వినయంతో సేవించీ,ప్రార్దించీ - జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

శ్లోకం:
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విందతి
భావం:
జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. కర్మయోగి సిద్దిని పొందిన వాడు, కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు.

తత్త్వజ్ఞానం కలవారిని వినయంతో సేవించి, ప్రార్దించి తెలుసుకోవలసిన జ్ఞానాన్ని, కర్మయోగ సిద్దిని పొంది కాలక్రమాన తమయందే తెలుసుకోవలసిన జ్ఞానాన్ని, అనివార్య పోరాట మార్గాన నడిపించి, కర్మ యోగ సాధనతో... తన జీవిత పర్యంతపు సాధనతో, తానూ పొందిన జ్ఞానాని, అవగాహనని మాకు సంక్రమింప చేసాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది మాకు అయాచిత సంపద.

నేను చేసిన గోరంత మేలుకి, కొండంత కృతజ్ఞతగా.... గూఢచర్య జ్ఞానాన్ని, ఇతిహాసాలని జీవితానికి అనువర్తించుకోగల విజ్ఞతనీ, గీతని సాధన చేయగల మార్గాన్ని మాకు ధారాదత్తం చేసాడు. విశ్లేషణా శక్తిని పెంచాడు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని పరిచయం చేసాడు. జీవితాన్ని ఎలా చూడాలో తెలియ చెప్పాడు. మేం చేసింది తక్కువ. పొందింది ఎక్కువే!

నిజానికి పీవీజీకి తరువాతి తరంగా, ఆయన ప్రారంభించిన మెదళ్ళతో యుద్దం తాలూకూ ఆయన భావ వారసత్వాన్ని కొనసాగించటాన్ని అదృష్టంగా భావిస్తాను. పీవీజీ మాపట్ల గౌరవం, కృతజ్ఞతలే కాదు, నమ్మకాన్ని కూడా చూపించాడు. ఎంత నమ్మకం లేకపోతే.... మమ్మల్ని తమ out let గా రామోజీరావుకి చూపుతాడు? ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత వేధింపుకి గురైనా ’అవినీతిలో పొర్లాడం, అవినీతిపై పోరాటం ఆపం’ అనే నమ్మకం అది! యుద్దంలో సైన్యాధిపతి తన సైనికుడి మీద పెట్టుకునే నమ్మకం అది!

ఇది అర్ధమయ్యాకే, మెదళ్ళతో యుద్దాన్ని మేం ఆస్వాదించటం నేర్చుకున్నాం. పరిస్థితులు విషమించి, దారీ తెన్నూ కనబడనప్పుడూ, నిరాశా నిస్పృహలు ఆవరించినపుడూ, ఇది గుర్తు తెచ్చుకుని తిరిగి స్ఫూర్తి పొందుతుంటాము. ఆ నేపధ్యంలోనే "Do not under-estimate the strength and wisdom of our people" అన్న పీవీజీ డైలాగ్, మా చెవుల్లో నిశ్శబ్దంగా మార్మోగుతుంటుంది.

నిజానికి ఈ భావసంబంధం, దృక్పధ వారసత్వం, వారసత్వపు కొనసాగింపుపై నమ్మకం, ఆత్మీయ అనుబంధమూ.... కేవలం పీవీజీకీ మాకూ మధ్య మాత్రమే లేదు. తరతరాలుగా ఈ గడ్డమీద జన్మించిన మహానుభావులు, బాపూజీ, వివేకానందుడూ, చైతన్యుడూ, శంకరుడూ, గౌతమ బుద్దుడూ.... ఎందరి పేర్లని చెప్పగలను? ఆ మహాత్ములకీ, ‘ఈ దేశం, హిందూ మతం, సనాతన ధర్మం, ఈ భారతీయ సంస్కృతి నాది’ అనుకునే ప్రతీ వ్యక్తికీ, మధ్య ఉన్నదీ ఆ నమ్మకమూ, అనుబంధమే!

ఈ గడ్డపై పుట్టి, ‘ఈ సంస్కృతి, ఈ మతం నాది’ అనుకునే ప్రతీ హిందువూ.... శ్రీరాముడికీ, శ్రీకృష్ణుడికీ వారసుడే! కాబట్టే ఒకప్పుడు భారతీయులు వంశ గౌరవానికీ, కుటుంబ పరువు మర్యాదలకీ ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాళ్ళు. కళారూపాలన్నీ ఇతిహాసాల మీద ఆధారాపడి ఉన్నంత కాలమూ ఆ ప్రాముఖ్యానికీ, ఆ భావసంపదకీ నష్టం వాటిల్లలేదు. క్రీడలన్నిటికీ క్రికెట్ ఏకైక రూపాంతరమైనట్లుగా, ఎప్పుడైతే కళారూపాలన్నిటికీ సినిమా ఏకైక ప్రత్యమ్నాయామయ్యిందో.... ఆ తర్వాత మెల్లిగా... ‘యువతీ యువకుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులతో ఘర్షణ’ ల మీద ఆధారపడిన కధాంశాలతో... తరాల అంతరం పేరుతో... వంశ, కుటుంబ పరువు మర్యాదలకి తిలోదకాలు వదలటం ప్రారంభమయ్యింది.

తల్లిదండ్రులకీ, సోదరీ సోదరులకీ మధ్య ఉండేది ప్రేమకాదు, కేవలం యువతీ యువకుల మధ్య ఉండేదీ, పెళ్ళికి [లేదా శారీరక సంబంధానికి] దారి తీసేది మాత్రమే ప్రేమ అని చెప్పబడింది. నిష్టూరమైనా నిజమే చెప్పాల్సి వస్తే... కామమే ప్రేమగా వర్ణించబడింది. ఎంతగా అంటే - ప్రేమించలేదని యువతిపై యాసిడ్ చల్లిన ప్రేమోన్మాది అనేంతగా! అలాంటి వాడిని ప్రేమోన్మాది అనాలా, కామోన్మాది అనాలా? సరే, ఈ విషయాంతరం వదిలి, శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాట దగ్గరికి వస్తాను.

ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నిజానికి పీవీజీ మేధస్సుని మేము గ్రహించిందే చాలా తక్కువ. అందులోనూ కొంత మాత్రమే కాగితంమీద పెట్టగలిగాము. [అంటే బ్లాగులో అన్నమాట] ఆయన స్ట్రాటజీ... పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఎలా చూసినా ఫిట్ అవుతుంది. అందుకే ఆయనని గురించి మేము మురిపెంగా [గాయత్రీ మాత వరం పొందిన తెనాలి రామకృష్ణ కవి ని గుర్తు తెచ్చుకుంటూ] ‘వికటకవి’ అనుకుంటూ ఉంటాము. ‘వికటకవి’ ఎటునుండి ఎటు చదివినా ఒకేలాగా కన్పిస్తుంది.

1992 నుండీ ఇప్పటి వరకూ పీవీజీ, నెం.5 వర్గమూ.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల మీద ప్రయోగించింది ఇటువంటి ద్వంద్వ స్ట్రాటజీలనే! వికటకవి లా ఎటు నుండి చూసినా ఫిట్ అయ్యే స్ట్రాటజీలనే! కాబట్టే.... రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారికి, అవి తమ అరిషడ్వర్గాలకు సంతృప్తి కలిగించేటట్లుగా, ఆ విధమైన భాష్యాలు చెప్పుకోగలిగినట్లుగా తోచాయి. అందుచేతే.... నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, ఆయా సందర్భాలకు ఆయా ఆసైన్ మెంట్లను నిర్వహించారు. గతంలో జరిగిన అవే అసైన్ మెంట్లు, సంఘటనలు.... ఇప్పుడు చూస్తే తమ బహిర్గాతాలుగానూ, సువర్ణముఖిలు గానూ కనబడుతున్నాయి. అదే గూఢచర్యపు గమ్మత్తు! బొమ్మ తిప్పి చూస్తే గానీ అర్ధం కానట్లు!

మరో గణితపరమైన ఉదాహరణ చెప్పాలంటే - పరావలయాన్ని[parabola] పరిశీలించండి. Extremities లో పరావలయం పైని బిందు నిరూపకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే ధన ఋణ [+, -] గుర్తులు మారతాయి. సరిగ్గా అలాంటిదే పీవీజీ, సోనియాల మధ్య వ్యత్యాసం. కర్పూరం ఉప్పూ ఒకేలాగా కన్పించినట్లన్న మాట!

మరో ఉదాహరణ చెప్పాలంటే - ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడనుకొండి. వాడు అంతర్ముఖుడైన మహాజ్ఞాని కావచ్చు. మాట్లాడటం చేతగాక మౌనం పాటిస్తున్న మహామూర్ఖుడు కావచ్చు. సదరు మౌని మేధావో, మూర్ఖుడో తెలియాలంటే - కాలం గడిచి, వాళ్ళ చర్యలు బయటపడితే గానీ స్పష్టత రాదు.

పతాక దశలో ఉన్నప్పుడు.... సత్త్వగుణమూ, తామసమూ కూడా, ఇలాగే ఒకే తీరులో కన్పిస్తాయి. ’గీత’ సహాయంతోనే దాన్ని దాటగలం, వ్యత్యాసాన్ని గుర్తించగలం.

ఇప్పుడు మరోసారి - రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆటగాడి విన్యాసాన్ని ఉటంకిస్తాను.

A Vs C మరియు C Vs B బోర్డులలో A Vs C బోర్డు చిన్న పరిమాణం. దాని మీద నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు మాతో ఆడారు. ఆట ప్రారంభకులు వాళ్ళే! దేశం మీద గతంలో ఏయే స్ట్రాటజీలు ప్లే చేసారో, ఆవే మా మీద ప్రయోగించారు. కాకపోతే, ప్యాకింగ్ తేడానే గానీ లోపల సరుకు ఒకటే అన్నట్లు, అవే 10 స్ట్రాటజీలు! అదే ’అహం’ పై ఆటలు! ఆడది కుదరదు కాబట్టి ’ఆకలి’ ప్రయోగించటాలు!

ఇక, C Vs B బోర్డు పెద్ద పరిమాణం. దాని మీద నెం.10 వర్గంలోని ఏజంట్లతో, నెం.5 వర్గం ఆడుకుంది. ఆట ప్రారంభకులు నెం.5 వర్గమే. కాకపోతే, అది కూడా సదరు నెం.10 వర్గపు ఏజంట్లకు జాతర బొమ్మలైన ఇతర ఏజంట్లు [వాళ్ళు నెం.10 వర్గం లోని వారే!]ని ఉపయోగించి, ఆట ప్రారంభించింది. A Vs C బోర్డు మీద [అంటే చిన్న పరిమాణంలో] A మా మీద ప్రయోగించిన స్ట్రాటజీలనే, C Vs B బోర్డు మీద [అంటే పెద్ద పరిమాణంలో] నెం.5 వర్గం ప్రయోగించింది. కాబట్టే ఈ నకిలీ కణికుల స్ట్రాటజీలు మాకు అర్ధమయ్యాయి. లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థలో ఏం జరుగుతుందో ఎవరూ తెలుసుకోలేరు.

నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యం తెలియని చంద్రబాబులు, వై.యస్.లని నెం.10 వర్గీయులుగా పరిగణించవచ్చు. నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యం తెలిసిన అద్వానీ, సోనియాల వంటి వారు, నకిలీ కణిక వ్యవస్థలో కీలక ఏజంట్లు!

ఇక ఈ ఆట ఎలా ఉంటుందంటే - చిన్నపరిమాణపు బోర్డు మీద నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, పైముఖంగా పెట్టుకున్న వ్యక్తులతో మొదటగా తన ఆట ప్రారంభించాడు. సూర్యాపేటలో మా ఇంటి ఓనరు, త్రివేణి కాలేజీ యాజమాన్యం, స్థానిక పోలీసులు, హైదరాబాద్ నానల్ నగర్ లో మా ఇంటి ఓనరుతో సహా ఇరుగు పొరుగులు, శ్రీశైలంలో ఈవో, డిఈవో, వాళ్ళ వంటవాళ్ళు/అటెండర్లు గట్రాలు పైముఖంగా ఉన్న వాళ్ళన్న మాట! ప్రతీసారీ అంతే! అదే ‘వేధింపు’గా మేము ఫిర్యాదులకి ఎక్కించాము.

ఫిర్యాదు పెట్టకుండా సామరస్యం కోసం ప్రయత్నించినా ఫలించక పోవటం కూడా ఈ ఆటలో భాగమైంది. వేధింపుని ఎదుర్కొంటూనే మేము, పైముఖంగా మమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ మీద ఫిర్యాదు చేసేవాళ్ళం.

ఫిర్యాదు చేసే వరకూ.... ఓ వైపు వేధింపు ఆపేవాళ్ళు కాదు గానీ, మరో వైపు, అవినీతిలో వాటా పంచుకుందాం రమ్మనే ఆఫర్లు మాత్రం ఉండేవి. కొన్ని మాకు ఆ సమయంలో అసలు అర్ధం కూడా కాలేదు. జరిగిపోయిన సంఘటనలని తిరిగి గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆఫర్ అర్ధమయ్యేది. ఆ దృక్పధం, ఆ రకమైన ఆలోచన తీరు ఉంటే కదా, అది క్యాచ్ అయ్యేందుకు!? ఇలా ప్రతీ సందర్భంలోనూ రెండు దారులుండేవి. అలాంటి ఆఫర్ ని అందుకొని అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం. రెండో దారి అంటే - ఫిర్యాదు పెట్టటమే!

సూర్యాపేటలో ఎంసెట్ ర్యాంకుల మ్యాచ్ ఫిక్సింగ్ మీద ఫిర్యాదు పెట్టగానే... "ఆ గోల్ మాల్ అంతా మేం చూసుకుంటాం. మీరు కాలేజీ మెయిన్ టయిన్ చేస్తే చాలు. జాయింట్ వెంచర్ గా కాలేజీ నడుపుదాం రమ్మంటూ" మాకు వచ్చిన ఆఫర్ ఒక ఉదాహరణ అన్నమాట.

సరే, ఇక ఫిర్యాదు దారే ఎంచుకుంటే - పైముఖంగా ఉన్నవ్యక్తులూ మొత్తుకునే వాళ్ళు, తదుపరి దశలో మాపై వేధింపు సాంద్రతా పెరిగేది. క్రమంగా మేం ఎవరి మీద ఫిర్యాదు పెడతామో ఆ వ్యక్తులు Drop అయిపోయి, కొత్త వాళ్ళు తెరపైకి [అంటే వేధించేందుకు] వచ్చే వాళ్ళు, అంటే ముందరి వ్యక్తులు అవుట్ అయిపోయే వాళ్ళన్న మాట. ఇలా వ్యక్తులు Drop కావాల్సి వచ్చినప్పుడు - ఒక్కోసారి వాళ్ళే Drop అయిపోయేవాళ్ళు. ఒక్కోసారి మేమే ఇల్లు మారటం, ఊరు మారటం వంటివి జరిగేవి. ఆ విధంగా మమ్మల్నే Drive చేసారు.

సరిగ్గా ఇలాగే.... పెద్దపరిమాణంలో అంటే C Vs B బోర్డులోనూ, కొందరు ఏజంట్లు [వాళ్ళు కార్పోరేట్ వ్యాపారుల కావచ్చు, బ్యూరోక్రాట్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు] Drop అయిపోయేవారు. అంటే జారత బొమ్మల్లా నడిచిన ఈ వ్యవహారంలో, సదరు ఏజంట్ల అవకతవకలూ, కేసులూ లేదా చీకటి చరిత్రలూ, వారి గురించిన వివరాలూ, బహిరంగమై ఆ పావులు/ఏజంట్లు Expose అయిపోవటం జరుగుతుంది.

ఈ విధమైన Identicality నడిచేది. మామూలు చదరంగంలో అయితే A ఎత్తుగడని B మీద ప్రయోగించి, బదులుగా B ప్రయోగించిన ఎత్తుగడని తెచ్చి A మీద వేసే, C ఆటగాడు.... ఎక్కడో ఓ బోర్డు మీద ఓడితేనే మరో బోర్డు మీద గెలవగలడు. కానీ గూఢచర్యంలో అయితే.... తన గొంతు మీద తనే కాలు వేసుకు తొక్కుకోవటం వంటి ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు సాధ్యమైనట్లే.... రెండు బోర్డుల మీదా C గెలవటం కూడా సాధ్యమే! అదే గూఢచర్యంలో ఉండే గమ్మత్తు!

నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల ప్రమేయం, పైముఖంగా.... క్రింది స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల దాకా [చంద్రబాబు, వై.యస్.], ప్రధానమంత్రుల దాకా ఇన్ వాల్వ్ అయి ఉండటాన్ని, మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా నిరూపించాము. ఆ విధంగా చిన్న బోర్డు మీద మేము గెలిచాం.

అలాగే పెద్ద బోర్డు మీద నెం.5 వర్గమూ గెలిచింది. ఎవరికీ తెలియకుండా కీలక వ్యక్తుల వ్యక్తులకు మాత్రమే తెలిసిన నకిలీ కణిక వ్యవస్థని, పైముఖంగా..... నెం.10 వర్గాన్ని పెట్టుకుని నడుపుతున్న గూఢచర్యాన్ని, ఒకరి మీద ఒకరిని ప్రయోగించి, రెండు వ్యవస్థలనీ కుప్పకూల్చడం ద్వారా, నెం.5 వర్గం విజయం సాధించింది. అదే ఇంతగా.... 18 ఏళ్ళ క్రితం చెబితే ఎవరూ నమ్మని విషయాలు, మీడియా నిజరూపంతో సహా..... 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చెబితే, ఎవరికైనా అర్ధమయ్యేటంతగా బహిర్గతమయ్యాయి. నిరూపణా అయ్యాయి.

రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆటగాడు, రెండు చోట్లా ఏకకాలంలో గెలవటమే ఇక్కడి మేధస్సు! అది పీవీజీ గొప్పతనమే! వికటకవి మేధస్సు!

ఇక్కడ ఒక పోలిక చెబుతాను. నాణెం ఎగరెస్తే బొమ్మో, బొరుసో పడిందనుకొండి. నాణానికున్న ఒక ముఖమే కనబడుతుంది. రెండో ముఖం కనబడదు. అంటే సగం నిజమే తెలుస్తుందన్న మాట. రెండో సగం కనబడకుండానే ఉండిపోతుంది.

అదే నాణేం నిలబడితే!? ఒకే సమయంలో దాని రెండు ముఖాలూ కనబడతాయి. పూర్తి సత్యం ఆవిష్కరింపబడినట్లన్న మాట!

ఇప్పుడు జరిగిందదే! ఒక బోర్డు మీద గెలిచి, మరో బోర్డు మీద ఓడితే.... నాణెపు ఒక ముఖమే కనబడినట్లుండేది. రెండు బోర్డుల మీదా గెలవటమే సంపూర్ణంగా సత్యావిష్కరణం!

అదీ నకిలీ కణిక వ్యవస్థ, తరతరాలుగా చేస్తున్న గూఢచర్యానికి సంబంధించిన సంపూర్ణ సత్యావిష్కరణం!

ఎప్పటికైనా స్వీయ ప్రకటన చేసుకోక నకిలీ కణిక అనువంశీయులకి తప్పని సత్యావిష్కరణం!

ఎంత కాలం ఈ స్వీయ ప్రకటనలని వాయిదా వేసుకుంటే అంతకాలం.... ‘బహిర్గతాలు - సువర్ణముఖి’లతో, వాయిదా పద్దతిలో ప్రకటింపబడే సత్యావిష్కరణం! ఇది చిన్న చావు అన్నమాట.

తమకు తాముగా ప్రకటించుకుంటే పెద్దచావు! ‘కన్నా? కాలా?’ లో తాత్కాలికంగా కన్ను కాపాడుకున్నా, మళ్ళీ మళ్ళీ సంభవించే అలాంటి కీలక సందర్భాలలో చివరికి అన్ని కళ్ళూ, కాళ్ళూ కోల్ఫోక తప్పదు. అప్పటి వరకూ.... నెం.10 వర్గం తాలూకూ ఏజంట్లూ బహిర్గతమవుతూ కొంచెం కొంచెంగా నకిలీ కణిక వ్యవస్థ కూలుతూనే ఉంటుంది.

3 1/2 శతాబ్దాల తరబడి, ఇన్ని ద్వంద్వాలతో అల్లుకున్న నకిలీ కణికుల అనువంశీయ గూఢచర్యాన్ని, ఉల్లిపాయ పొరలు ఒలిచినట్లుగా ఒలిచి, ద్వంద్వాలన్నిటినీ తుత్తునియలు చేసి, లోపలి ’కోర్’ని ప్రదర్శించే విధంగా ఈ గూఢచర్య స్ట్రాటజీని రచించింది పీవీజీ అయితే.... 18 ఏళ్ళుగా, ఆయనతో పాటూ, ఆయన మరణానంతరం కూడా, అమలు చేసిందీ, చేస్తున్నదీ ఆయన సమీకరించిన నెం.5 వర్గం.

తన వెనక నడిచిన, తనని అనుసరించిన నెం.5 వర్గపు సభ్యుల మీదా, తన భావ వారసుల మీదా ఆయనకి అంత నమ్మకం! తాను ప్రారంభించిన ఈ పనిని, తన మరణానంతరం కూడా వాళ్ళు పూర్తి చేస్తారనీ, ఎప్పటికీ అధర్మానికి వడిగట్టరనీ నమ్మకం!

ఏ ప్రలోభాలకీ, భయాలకీ లొంగరని నమ్మకం!

తను నేర్పిన విద్యని తన శిష్యులు అంతగా సఫలీకృతం చేస్తారన్న నమ్మకం! దైవం మీద నమ్మకం! గీత మీద నమ్మకం! మానవత్వం మీదా, సత్యం మీదా నమ్మకం!

కాబట్టే, తరవాతి వారి మీద పని బాధ్యత, యుద్ద విజయపు బాధ్యత వదిలి పెట్టి, నిశ్చింతగా వెళ్ళిపోయిన స్థితప్రజ్ఞుడాయన! ఇందుకు దృష్టాంతంగా....పీవీజీ లోని ’లోపలి మనిషి’ని పరిశీలించండి.

ఈ గ్రంధ ప్రచురణ కర్త ధూపాటి విజయకుమార్....
>>>ఆ పుస్తకం చదువుతుంటే నాకు ఓ సుదీర్ఘమైన ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. ఆ అనుభూతి నన్ను బలోపేతం చేసేది గానూ, స్పూర్తినిచ్చేది గానూ, జ్ఞానదాయకంగానూ అనిపించింది.

స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ, సామాజిక చరిత్రలో ప్రయాణానికి బయలు దేరుతున్న మీకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."
అంటూ, అందంగా ప్రచురించి ఇచ్చిన ఈ గ్రంధపు అట్ట మీద, పీవీజీ ఫోటోతో పాటు ముద్రించిన మాటలు -

ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతిపుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుటయే నా ప్రతిజ్ఞ.

‘నిద్రలోనూ, చీకటిలోనూ ఉన్న ఈ జగత్తు జాగృతి పుంజంగా వెలిగేందుకే తన తపస్సనీ, వెలిగించటయే తన ప్రతిజ్ఞ’ అనీ చెప్పాడాయన. మన పెద్దలు, ‘గీత’ తామసాన్ని నిద్రగానూ, అజ్ఞానాన్ని చీకటిగానూ పోలుస్తారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఒక చిన్న ఉదాహరణ పరిశీలించండి.
26, ఏప్రియల్, 2010 ఈనాడు కర్నూలు ఎడిషన్, 7వ పేజీ, ‘మండుతున్న బీరు’ శీర్షిక:
ఇక అందులో వార్తాంశం, యధాతధంగా:
>>>బడి దగ్గర బ్రాందీ దుకాణం:

పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నేత ఆ పేరు వినగానే రెండు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఆ మహానుభావుడి జ్ఞాపకంగా ఆదోని పురపాలక సంఘం ప్రాధమికోన్నత పాఠశాలను ఎమ్మిగనూరు కూడలిలో ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలకు ఎదురుగానే బ్రాందీ దుకాణం తెరిచారు. ఆ పక్కనే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణం ఉన్నా... ఆ దుకాణదారుడికి ఉన్న రాజకీయ అండదండలు దృష్ట్యా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారు. పాఠశాలకు, మద్యం దుకాణానికి మధ్య ఉన్న దూరం 40 నుండి 50 అడుగులు లోపే. ఈ బడి పక్కనే 5 వ తరగతి నుండి 10 వ తరగతి చదివే విద్యార్ధినుల వసతి గృహం ఉంది. ఈ దుకాణం తొలిగించాలని గతంలో ఎన్ని విన్నపాలు వచ్చినా ట్రాఫిక్ నిబంధనలు సాకుగా చూపి ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి బడికి, గుడికి ప్రక్కనే ఉన్న ఈ మద్యం దుకాణాన్ని తొలగించాలని పురవాసులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సీఐ మల్లారెడ్డి దృష్టికి న్యూస్ టుడే తీసుకెళ్లగా బీరు ధర పెంపుపై ఫిర్యాదులు లేవన్నారు. అయినా తక్షణమే తనిఖీలు చేసి అధిక ధరలు అమ్మినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మిగనూరు కూడలిలో ఉన్న మద్యం దుకాణం బడి పక్కనే ఉందని ఫిర్యాదులు వచ్చిన మాట నిజమేనని, రహదారి మధ్యలో ఉండే డివైడర్, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం 130 అడుగుల దూరం వస్తోందని ఆయన పేర్కొనడం కొసమెరుపు.

రూల్స్ ప్రకారం, అంటే చట్టప్రకారం - బడికీ గుడికీ, అమ్మాయిల హాస్టలుకీ ఎదురుగా, 40 నుండి 50 అడుగుల దూరంలో ఉన్న మద్యం దుకాణం, రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ డివైడర్ కారణంగా 130 అడుగుల దూరంలో ఉన్నట్లన్న మాట. ఎందుకంటే ట్రాఫిక్ డివైడరు ఉన్నప్పుడు బైకు, కారు గట్రా వాహనాలేవైనా ‘యూ’ ఆకారపు టర్న్ తీసుకుని, బడి నుండి మద్యం దుకాణం చేరాలి. లేదా మద్యం దుకాణం నుండి బడి చేరాలి కాబట్టి. అయితే తాగుబోతూ లేదా పాదచారి.... యూటర్న్ తీసుకోకుండానే డివైడరు ఎక్కిదిగి, నేరుగా, రేడియల్ గా, బడీ గుడి దగ్గర నుండి మందు దుకాణానికీ, లేదా మందు దుకాణం నుండి బడికీ, గుడికీ, అమ్మాయిల హాస్టలు దగ్గరికీ వెళ్ళగలడు కదా!

అలాగే బడి కొచ్చే పిల్లల, గుడి కొచ్చే భక్తుల చూపులు కూడా, యూ టర్న్ తీసుకోకుండానే, డివైడర్ మీదుగా, నేరుగా, రెడియల్ గా, మందు దుకాణం దగ్గర మత్తుబాబుల చిందులు చూడగలవుగా! మత్తెక్కిన వారి స్పృహ లేని వాగుడూ, ఊగుడూ, వికారాలూ హాస్టల్ అమ్మాయిలనీ, బడి పిల్లలనీ, గుడి భక్తులనీ చేరగలవు కదా! డివైడర్ చుట్టూ తిరక్కుండానే... నేరుగా రేడియల్ గా!

కానీ చట్ట ప్రకారం అది 130 అడుగుల దూరం. కంటికి నేరుగా కన్పిస్తూ ఉన్నాసరే! చిత్త శుద్ది లేని ఉద్యోగులూ, అధికారులూ, రాజకీయ నాయకులూ, తమ స్వలాభం చూసుకుని, అదే దృష్టితో చట్టంలోని భాష మాత్రమే పట్టించుకున్నారు. దీన్నే ’రెడ్ టేపిజం’ అంటారు. చట్ట పరంగా, కేవలం భాషే చూస్తే.... అన్నీ సరిగ్గానే ఉన్నాయి. బడి, గుడి వసతి గృహంకి, 130 అడుగుల దూరంలో ఉంది మందుకొట్టు! చిత్త శుద్దితో చూస్తే.... ఆ చట్టంలోని భావం స్ఫురించి ఉండేది.

ఇది గల్లీ స్థాయి లోని రెడ్ టేపిజం.

ఇక కేంద్ర స్థాయిలో దీన్ని చూడాలంటే -

26 ఏప్రియల్, 2010 ఈనాడు, 1&2 వ పేజీలలోని వార్తాంశం. " అవినీతే ప్ర‘వృత్తి’! " శీర్షిక క్రింద....
>>>వైద్య విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, వైద్య విద్యార్హతల గుర్తింపు కోసం భారతీయ వైద్యమండలి[ఎంసీఐ] 1933లో ఏర్పాటైంది. వైద్య కళాశాలకు గుర్తింపు, కొత్త వాటికి అనుమతులు, వైద్యులకు శాశ్వత, తాత్కాలిక గుర్తింపు, ప్రజలకు వైద్య సేవలందేలా చూడటం మండలి ప్రధాన విధులు.

మండలిలో రాష్ట్రప్రభుత్వాలు సిఫార్సులపై కేంద్రం నామినేట్ చేసిన వారు 30 మంది, విశ్వవిద్యాలయాల ద్వారా ఎన్నికైన వారు 83 మంది, గుర్తింపు పొందిన వైద్యుల చేత ఎన్నికన వారు 22 మంది, లైసెన్సియేట్ గ్రూపు నుండి 7గురు, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వారు 8 మందితో కలిపి మొత్తం 150 మంది సభ్యులుంటారు. ఈ సభ్యులంతా కలిపి 10 మంది పాలకవర్గాన్ని, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. వీరు ఐదు సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారు. ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపు విషయంలో ప్రభుత్వపాత్ర ఏ మాత్రం లేక పోవడం కేతన్ దేశాయ్ కి వరంగా మారింది.

మెడికల్ కాలేజీ యాజమాన్యం, సీటును అధికారికంగా 4 లక్షల రూపాయలకు ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యాలు 40లక్షల నుండి 70 లక్షల దాకా విద్యార్ధుల నుండి గుంజూతున్నాయి. ఈ లెక్కన 12 కోట్ల నుండి 20 కోట్ల దాకా వారికి ఆదాయం వస్తోంది. దీంతో కళాశాలకు అనుమతికి ఏటా కోటి నుండి రెండు కోట్లు పెట్టడం వారికి కష్టంగా తోచడం లేదు.

సదరు ఎంసీఐ లో ప్రభుత్వాల సిఫార్సుల మేరకు, నామినేట్ డ్ గా, ఇతరత్రా, 150 మంది సభ్యుల నియమింపబడతారు. వారి నుండి అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నుకోబడతారు. అలాంటి అధ్యక్షుడే ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్థులు, వేల కేజీల బంగారం అక్రమార్జనగా కలిగి ఉన్న కేతన్ దేశాయ్! ఈ విధంగా సభ్యులైన వారి జీత భత్యాలు, గౌరవ వేతనాలు, ఇతర అలవెన్సులు ఏ మేరకు ఉంటాయో, ఎవరు చెల్లిస్తారో ఇంకా బయటకు రాలేదు గానీ, ప్రభుత్వ సిఫార్సుల మేరకు నియమింపబడిన వారికి ఆయా ఆర్ధిక ప్రయోజనాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది గదా!

ఇక వైద్య కళాశాలల మంజూరు, అజమాయిషీలపై పట్టుకలిగి, అపరిమిత ఆదాయ వనరులున్న ఈ పదవులకి, ప్రభుత్వ సిఫార్సులుకీ ఎన్ని అడ్డదారులుంటాయో అందరికీ తెలిసిందే.

వెరసి ఈ మండళ్ళు సర్వస్వతంత్రమైనవనీ, వాటిని ప్రభుత్వం ఏమీ చేయలేదనీ గౌరవనీయ అమాత్యశేఖరులు గులాం నబీ ఆజాద్ గారు సెలవిచ్చారు. కొసమెరుపు ఏమిటంటే ఆయన వ్యక్తిగత కార్యదర్శికి దీనితో సంబంధాలున్నట్లు ఆరోపణలొచ్చాయి.

ఇందులోనూ చట్టపరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్నీ ఒకే! చిత్తశుద్ది పరంగా అంతా కంతలే!

ఇదీ కేంద్రప్రభుత్వస్థాయిలో రెడ్ టేపిజం!

ఇదే రెడ్ టేపిజం అంతర్జాతీయ స్థాయిలో చూడండి.

పాక్ ఉగ్రవాదుల నిక్షేపం
ఉత్తర వజీరిస్థాన్‌కు పలాయనం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 23 : దక్షిణ వజీరిస్థాన్‌లో ఉగ్రవాదులను తుడిచిపెట్టేశామని పాకిస్థాన్ జబ్బలు చరుచుకుంటోంది. వాస్తవానికి అక్కడి పరిస్థితులు ఇం దుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లోనే నిక్షేపంగా ఉన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్టు.. వారు తమ స్థావరాలను మార్చి ప్రపంచాన్ని ఏమార్చారు.

పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో కొత్తగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్థాన్ సైన్యంతో గతంలో సంబంధాలు ఉన్న ఓ తిరుగుబాటు నేత రక్షణలో ఉగ్రవాదులు సురక్షిత ప్రాంతాల ను ఎంచుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన విలేఖరులు అందించిన సమాచారం మేరకు ఇది వెలుగులోకి వచ్చిం ది. స్థానికులు, మిలిటెంట్లు కూడా ఈ విషయాన్ని «ద్రువీకరిస్తున్నారు.

తమ కొత్త నెలవుల్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. వీరిలో అరబ్బులు ఉన్నారు. అదే విధంగా చెచెన్లు, ఉజ్బె క్ టెర్రరిస్టులు కూడా. మార్కెట్లు, రెస్టారెంట్లలో ఎటు చూసినా వారే! బల్లలపై ఆయుధాలు ఉంచి థిలాసాగా జిహాదీ సినిమాలు వీక్షిస్తారు. ఇంటర్నెట్ కేఫ్‌ల్లో వెబ్ సర్ఫింగ్‌లో మునిగిపోతారు. తనిఖీ ప్రాంతాలను దాటి ఇక్కడికి చేరుకోవడానికి వారు పెద్దగా కష్టపడిందేమీ లేదు.

పాక్ దళాలే వారిని స్వయంగా వదిలిపెడుతుండటంతో అసాల్ట్ రైఫిల్స్‌తోనూ, రాకెట్ లాంచర్లతోనూ కొత్త స్థావరాలకు చేరగలిగారు. దక్షిణ వజీరిస్థాన్‌లో టెర్రరిస్టులతో చె డుగుడు ఆడిన పాక్.. ఉత్తర ప్రాంతానికి వారిని అనుమతిస్తున్న విషయం ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం సైనిక చర్యలు తీసుకునే అవకాశం మాత్రం లేదు. గుల్‌బహదూర్, ఇతర తిరుగుబాటు నేతలతో చేసుకున్న ఒప్పందాలే దీనికి కారణం.

గత ఏడాది దక్షి ణ వజీరిస్థాన్‌లో పాక్ బలగాలు చెలరేగిపోయిన తరుణంలో.. తోటి టెర్రరిస్టులకు తాను ఎటువంటి సహాయమూ అందించబోనని బహదూర్ హామీ ఇచ్చాడు. ఇందుకు ప్రతిగా అతని రాజ్యం (ఉత్తర వజీరిస్థాన్)లో పాక్ సైన్యం వేలుపెట్టరాదు. స్థూ లంగా ఇదీ ఒప్పందం. ఇదే ఇప్పుడు పాక్‌కు ప్రతిబంధకమైంది.

తమ దేశ భద్రతకు టెర్రరిస్టులు ముప్పుగా పరిణమించారని భావిస్తున్న పాక్‌కు.. బహదూర్ సామ్రాజ్యంలో వారు పునరేకీకరణ కావడం మింగుడుపడటం లేదు. ఏదో ఒక రోజు తమ ప్రయోజనాలనూ నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే పాక్ వారికి వత్తాసు పలుకుతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

బహదూర్ నేతృత్వంలో పాకిస్థానీ తాలిబన్.. ఉత్తర ప్రాంతంలోని మీర్ అలీ పట్టణంలో ఏకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 'గిరిజన సంప్రదాయాలు, పద్ధతుల ప్రకారం దక్షిణ వజీరిస్థాన్ నుంచి వచ్చిన సోదరులకు మేం ఆతిథ్యం ఇచ్చి తీరాల్సిందే. ఒకరికి ఒకరు మద్ద తు ఇవ్వకతప్పదు' అని బహదూర్ సన్నిహిత సహచరుడొకరు చెప్పారు.



సదరు దక్షిణ వజీరిస్తాన్ లో, పాకిస్తాన్ తాలిబాన్లను తుడిచి పెట్టేసింది కాబట్టి, నియమ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కు అమెరికా సాయం చేయటానికి ఎలాంటి అడ్డంకులూ లేవు, పాకిస్తాన్ కు తాలిబాన్లతో లింకులూ లేవు. ఇక ఉత్తర వజీరిస్తాన్ బహదూర్ తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం, అతడి రాజ్యంలో తనిఖీలు చేయరాదు కాబట్టి, తాలిబాన్లకు అక్కడ సమస్య లేనట్లే! హోటళ్ళ టేబుళ్ళ మీద నిర్బయంగా ఆయుధాలు పెట్టి, జీహాద్ సినిమాలు చూస్తూ బాహాటంగా ఆనందిస్తున్న తాలిబాన్లు కళ్ళకు కనబడుతున్నా, కాగితాలకు కనబడదు. చిత్త శుద్ది లేని చట్టాలకు అన్నీ కరెక్టు గానే ఉన్నాయి మరి! పాకిస్తాన్ కు అర్జంటుగా చట్టపరంగా ఆర్దిక సాయం చేయటం కోసమే, పాకిస్తాన్ లో ఇప్పుడు ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుంది మరి! తీవ్రవాదమంతా డేవిడ్ కోల్మన్ హెడ్లీనే చేసాడు.

ఇదీ రెడ్ టేపిజమే! కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో!

గల్లీ నుండి ఢిల్లీ దాకా, అంతర్జాతీయ స్థాయి దాకా, ఒకటే శృతి. ఒకే రకపు పనితీరు! ఎలా సాధ్యం?అన్నిటా ఒకేతీరు ఉండాలంటే అన్నిటికీ అంతరాంతర సంబంధం ఉండాలి. అన్నిటినీ ఒకే వ్యవస్థ నడుపుతుండాలి. అవేవీ గుర్తుంచకుండా.....

అడ్మినిస్ట్రేషన్ లోని ఈ రెడ్ టేపిజాన్ని గ్రహించకుండా.... గుడ్డివాళ్ళు ఏనుగును తడిమినట్లుగా, రాజకీయ విశ్లేషణలూ, వ్యాఖ్యాలూ చేస్తూ, పాక్షిక సత్యాలని చూస్తూ, పాక్షిక అసత్యాలని మాట్లాడుతూ.... గడిపినంత కాలం, ఈ రెడ్ టేపిజం ఇలా నడుస్తూనే ఉంటుంది; మానవత్వాన్ని నలిపేస్తూనే ఉంటుంది. సూక్ష్మం నుండి స్థూలం దాకా ఒకే శృతిలో, ఒకే ఆకృతిలో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మేము 1993 నుండి 1995 వరకూ, శ్రీశైలం పాతాళ గంగ మెట్ల దారిలో నివసిస్తున్నప్పుడు....

అక్కడందరూ బెస్తలూ, గిరిజనులూ! చేపలు పట్టుకునీ, యాత్రికులని బుట్టీ మీద నదిలో షికారుకు తీసుకెళ్ళి, అడవిలో కట్టెలు కొట్టుకుని తెచ్చి అమ్ముకునీ జీవించే వాళ్ళు. వాళ్ళలో చాలామందికి అప్పటికి రైలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకీ కేబుల్ టీవీలూ, డీవీడీలు, సెల్ ఫోన్లూ చేతి కొఛ్చాయి లెండి. అప్పటికైతే శ్రీశైలం - సున్నిపెంట తప్ప, చాలామంది మరే ఊరూ పోలేదు.

ఓ సారి ‘గుడిసెలు పీకేయిస్తారట!’ అన్న పుకారు వదలి, హైదరాబాద్ లో జరిగే ఎర్రపార్టీ ర్యాలీకి అక్కడి జనాలని లారీలో తీసుకెళ్ళారు. అప్పుడు నగర రద్దీని చూసి చాలామంది భయపడ్డారనీ, బస్సులకి అడ్డదిడ్డంగా పరుగులెత్తి బెంబేలు పడ్డారనీ, తిరిగి వచ్చాక వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు ఎకసెక్కాలాడుకున్నారు. అంతగా వాళ్ళకి తమ బ్రతుకు, తమ చుట్టూ ఉన్న పాతాళ గంగ మెట్లు, శ్రీశైలం గుడితో మూడిపడిన తమ లోకం తప్ప, బయటి ప్రపంచం తెలీదు.

యాత్రికుల రద్దీ ఉండే పండుగలూ, కార్తీక మాసం వంటి రోజులలో వాళ్ళంతా ఉదయం నుండీ రాత్రి వరకూ బిజీగా ఉంటారు. యాత్రికులంతగా రాని ’అన్ సీజన్’ లో తీరిగ్గా, జీవితాన్ని ఆనందిస్తారు.

అలాంటి సమయంలో ఓ రోజు.... మేము అయ్యవారి[మల్లయ్య స్వామి] ఏకాంత సేవ దర్శనం చేసుకుని, రాత్రి పదిగంటలకు మా గుడిసె చేరాము. అప్పటికి గంగ మెట్ల మొదటిలో పాతాళీశ్వరాలయం ముందు చాలామంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అడవి నుండి వచ్చే చల్లని గాలి! మెట్ల మీది గుడిసెల్లో ఒకామె ఉండేది. దాదాపు 26 ఏళ్ళు వయస్సుంటుంది. ముగ్గురు పిల్లలు! వరుసగా అయిదేళ్ళ అమ్మాయిల నుండి ఏడాది వయస్సు పిల్లవాడు దాకా! భర్తా, చెల్లి కుటుంబంలోని మగవాళ్ళందరూ నిర్భాధ్యులు. ఈమె మెట్ల మీద బెస్తలకి సారా అమ్మేది.

శ్రీశైలంలో మద్యపానం నిషేధం. అధికారులూ, డబ్బులున్న ఉద్యోగులూ, వ్యాపారులూ సున్నిపెంట నుండి గానీ, బయటి నుంది గానీ రహస్యంగా ఖరీదైన మద్యం సేకరించి తాగేవాళ్ళు. మెట్ల మీది బెస్తలు దొంగసారా, నాటు సారా తాగేవాళ్ళు. ఈమె ఓసారి తుమ్మలబైలు నుండి రెండు చేతులా పదేసి లీటర్ల సారా క్యాన్లు మోస్తూ.... అర్ధరాత్రి అడవికి అడ్డం పడి వచ్చింది. తర్వాతి రెండు రోజులు ధూం ధాం గా వ్యాపారం చేసింది. ఎప్పుడైనా సరే..... వాసన పసిగట్టినట్లే వచ్చి, పోలీసులు మామూళ్ళ పట్టుకెళ్ళేవాళ్ళూ. మద్యమూ తాగిపోయే వాళ్ళు. మొదట్లో ఆమెని చూచి నాకు చాలా ఏహ్యత కలిగేది.

ఓ రోజు పిల్లల్ని వదిలేసి రెండురోజులు ఎక్కడికో పోయింది. ఓ రోజుటికి అన్నం వండి పెట్టి పోయిందట. రెండో రోజుకీ తల్లిరాక పోయేసరికి పిల్లలు ఆకలికి ఏడుస్తూ, పాతాళీశ్వరాలయంలో పడి ఉన్నారు. చిన్నమ్మ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఆవిడ తింగరిది. ఏడాది పిల్లాడు తల్లిపాలు తాగుతున్న వాడే! ఆకలికి జ్వరం వచ్చి పడున్నాడు. మా ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే ఆ పిల్లలకి పెట్టాను. పెద్దపిల్ల మా దగ్గర అక్షరాలు నేర్చుకున్న బుడ్డీనే! ఆ పిల్ల చెప్పిన వివరాలతో ఆ తల్లి మీద నాకు మరింత కోపం వచ్చింది. ఏం చేస్తాం? ఆ తల్లినీ, పిల్లల్నీ పరిశీలించే వాళ్ళం.

తరచి చూస్తే.... ముగ్గురు పిల్లలు, తింగరి చెల్లీ, తాగుబోతు భర్త, ఇతర కుటుంబసభ్యుల్ని పోషించడానికి ఆమె ఎంత రిస్కు తీసుకుంటుందో అర్ధమైంది. అర్ధరాత్రి, అడవికి అడ్డం పడి, రెండు చేతులా 20 లీటర్ల బరువు మోస్తూ, దాదాపు 12 కిలో మీటర్ల దూరం నడిచి సారా తెచ్చి అమ్మే వ్యాపారిణి! ఆమె లో మరో కోణం చూస్తే మాకు ఆశ్చర్యం వేసేది.

ఎందుకంటే సారా అమ్మిన తరువాత వారం రోజుల పాటు, ఆమె పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో! స్నానాలు చేయించి, బుగ్గన చుక్కలు పెట్టి.... ముస్తాబు చేస్తుంది. మెట్ల మీద అమ్మకానికి వచ్చే అరటి పళ్ళ దగ్గరి నుండి చిరుతిళ్ళన్నీ కొనిస్తుంది. చేతిలో డబ్బులై పోగానే మళ్ళీ బయలు దేరుతుంది.

అదే మనిషిని, ఓ వైపు చూస్తే - బూతులు మాట్లాడుతూ, సారా అమ్ముతూ, పిల్లల్ని గాలి కొదిలేసి.... మరోవైపు చూస్తే - ఆమెలోనూ అమ్మతనం ఉంది. ప్రేమా ఉంది, కన్నీళ్ళున్నాయి. కుటుంబం పట్ల బాధ్యత ఉంది. గొడవల్లో పడి, అన్న కాళ్ళు విరగ కొట్టించుకుంటే, సేవలు చేసేంత, తింగరి చెల్లెలిని సాకేంత రక్తసంబంధం ఉంది. అట్టడుగు పేదరికంలో.... కుటుంబ బాధ్యతల విషయంలో, శ్రమించడంలో, మహిళలే ఎక్కువగా exploit అవుతున్నారన్న విషయాన్ని అక్కడ తొలిసారిగా గమనించాము. హైదరాబాదు నానల్ నగర్ లో మరో సారి దాన్నే చూసాము.

ఈ సారా వ్యాపారిణి భర్త పరమ తాగుబోతు. సంవత్సరంలో పదినెలలు దేశం మీద పడి పోతాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. బుద్దిపుట్టినప్పుడు ఇంటి కొస్తాడు.

ఆ రోజు అయ్యవారి[మల్లయ్య స్వామి] ఏకాంత సేవ దర్శనం చేసుకుని మేము గుడిసె చేరేటప్పటికి - పాతాళీశ్వరాలయం దగ్గరున్న గుంపులో అతడూ ఉన్నాడు. బాగా తాగి వూగుతూ, వాగుతూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతడు గబుక్కున లేచి నిలుచున్నాడు. "ఏయ్! ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? సబల్ పూర్, జబల్ పూర్, గోరఖ్ పూర్, నాగ పూర్,ఖరగ్ పూర్, కాగజ్ పూర్, సిరిపూర్.... ఏం తెలుసు మీకు? హైదరాబాద్, సికిందరా బాద్, ఔరంగా బాద్, అహ్మాదాబాద్...." అంటూ ముందు పూర్ ల జాబితా చదివి, ఇక బాద్ ల జాబితా అందుకున్నాడు.

మత్తులో ఊగుతూ చెబుతున్న అతడి తీరూ, అతడు ఆపకుండా ఊళ్ళ పేర్లు వరుసగా చెబుతున్న వేగమూ చూస్తే.... అతడు ఆయా ఊళ్ళన్నీ చూసి ఉండాలనిపించింది మాకు. నమ్మశక్యం కానంత ఆశ్చర్యం వేసింది.

అయితే అతడు ఆ జాబితా చెబుతున్నంత సేపూ.... గంగ మెట్ల మీది ఆ బెస్తవాళ్ళు పగల బడి నవ్వుతున్నారు. వాళ్ళకి తాగుడు కొత్తకాదు, తాగిన వాడి వాగుడూ కొత్త కాదు. అది వాళ్ళకి నవ్వు కలిగించదు. అలాంటి వాటిని క్యాజువల్ గా తీసుకొని తమ పని తాము చేసుకుపోవడాన్ని వాళ్ళల్లో చాలాసార్లు చూసాము. అదీగాక "నాగపూర్, నారాయణ పూరు... అంట" అంటూ పగలబడి నవ్వుతున్నారు.

వాళ్ళ వైఖరి చూస్తే, ‘ఆ ఊళ్ళ పేర్లు కూడా ఎప్పుడూ విని ఉండలేదు. వాటి ఉనికి గురించి వాళ్ళకేమీ తెలియదు’ అన్నది స్పష్టపడుతూనే ఉంది. ఆ తాగిన వాడు దేశాల మీద పడి తిరుగుతాడని తెలిసినా సరే, అతడు ఈ ఊర్లు చూసి ఉండవచ్చు అన్న స్పృహ కూడా లేదు వాళ్ళకి!

మేము ఈ సంఘటనని విశ్లేషించుకుంటూ "మనిషికి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు.... అందులో.... ఏ కొంచెమైనా తమకి తెలిసింది ఉంటేనే.... ఆ కొత్త విషయం పట్ల ఆశ్చర్యమో, నమ్మశక్యంగాని తనమో లేక నమ్మకమో కలుగుతుందను కుంటా! అంబమ్మ భర్త అన్ని ఊళ్ళ పేర్లు చెబుతుంటే మనకి ఆశ్చర్యం వేసింది. ఆ గిరిజనులకి నవ్వు వచ్చింది. అసలు మన ఊహకైనా రాని విషయాన్ని, అది నిజమే అయినా సరే, ఎవరైనా చెబితే మనమైనా ఇలాగే నవ్వుతాం! బహుశః కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు ఇతరులూ ఇలాగే నవ్వి ఉంటారు" అనుకున్నాము.

ఏమైనా "ఏ విషయం పట్లేనా - వ్యక్తులు స్పందించే తీరు వాళ్ళ విజ్ఞాతని బట్టి, భావ స్వేచ్ఛనూ బట్టి ఉంటుంది" అని తీర్మానించుకున్నాము.

ఇప్పటికీ - "గంగ మెట్ల మీద ’నాగపూర్’ అంటే నవ్వారు" అని, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మహాభారతం, సభాపర్వం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో..... జూదంలో ద్రౌపదీ దేవిని ధర్మరాజు ఓడిపోయాక, దుర్యోధనుడు రాణీ వాసపు అంతఃపురంలో ఉన్న ద్రౌపదీ దేవిని, సభకు తోడ్కొని రమ్మని ప్రాతికామిని పంపుతాడు.

అంతటి అనుచిత కార్యానికి ఒణికిపోతూ, ప్రభు ఆజ్ఞను పాటిస్తూ అతడు వెళ్ళి ద్రౌపదికి రాజాజ్ఞ వినిపిస్తాడు. అప్పటికే సభలో నడుస్తున్న జూదం గురించీ, విపరీతాల గురించి వినీ ఉన్న ద్రౌపది, సభాప్రాంగణంలోనికి అడుగు పెట్టవలసి రావటమే అవమానంగా భావిస్తూ, అదే గొప్ప ఉపద్రవమనుకొంటుంది. దాన్ని నివారించేందుకు ఓ ప్రశ్నను సభకు పంపుతుంది.

"నా స్వామి .... నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని! అంటే - ముందుగా తనను తాను ఓడిపోయాక, ధర్మరాజు, నన్ను ఓడిపోయాడా? అలాగైతే ఆ ఫణం చెల్లదు. ధర్మరాజు కిక ద్రౌపదిని పందెం ఒడ్డే అర్హత ఉండదు. తనను ఓడాక ధర్మరాజు దుర్యోధనుడి బానిస! ధర్మరాజుతో పాటు ద్రౌపదీ దుర్యోధనుడికి బానిస కావచ్చుగాక! కానీ దుర్యోధనుడికి ధర్మరాజు ప్రత్యక్ష బానిస అయితే, ధర్మరాజుకి ఇల్లాలయిన ద్రౌపది దుర్యోధనుడికి పరోక్ష బానిస అవుతుంది. ద్రౌపది మాత్రం ధర్మరాజు అధీనంలో ఉన్నట్లే! అప్పుడు ఏ అజ్ఞనైనా ద్రౌపది పాటించాలంటే - అది దుర్యోధనుడైనా సరే, ధర్మరాజు చేత ద్రౌపదికి అజ్ఞాపింప చేయాల్సిందే!

అలాగ్గాక.... ధర్మరాజు, ముందు ద్రౌపదిని పందెం ఒడ్డి ఓడిపోయి, తర్వాత తనను తాను ఫణంగా పెట్టుకొని ఓడిపోయాడా? అలాగైతే అప్పుడు ద్రౌపది దుర్యోధనుడికి ప్రత్యక్ష బానిస. నేరుగా దుర్యోధనుడు ద్రౌపదిని ఏం చెయ్యమనైనా ఆజ్ఞాపింపవచ్చు.

ఈ ధర్మసందేహాన్ని ద్రౌపది సభకు పంపిస్తుంది. అందుకు కోపంతో భగ్గుమన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడికి ద్రౌపదిని జుట్టుపట్టి సభకు ఈడ్చుకు రమ్మని చెబుతాడు. అతడలాగే.... వదినను, అంతఃపుర మహిళని అవమానిస్తూ లాక్కొస్తాడు.

ఆమెను వివస్త్రను చేసి అవమానించాలని ప్రయత్నిస్తారు. సభలోకి రాగానే ద్రౌపది, తన ప్రశ్నను మళ్ళీ వినిపిస్తుంది. వికర్ణుడూ, యుయుత్సుడూ, అశ్వత్ధామ మొదలైన వాళ్ళు చర్చకు సిద్దమైనా.... అందరూ మౌనంగా చూస్తుంటారే తప్ప ద్రౌపదీదేవి కి జరిగే అవమానాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు. అంతటి సంకట స్థితిలో కూడా ఆమె, జరుగుతున్న అవమానాన్ని తనదైన పద్దతిలో నిలువరించేందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయమాన రక్షణకు, అదే ధర్మ సందేహాన్ని పదేపదే రెట్టిస్తుంది.

అప్పుడు భీష్ముడు "అమ్మాయీ! ధర్మం బహు సూక్ష్మమైనది. నీ భర్త యుధిష్థిరుడు ధర్మజ్ఞుడు. నీ సందేహాన్ని అతడు మాత్రమే తీర్చగలడు" అంటాడు.

సాభిప్రాయంగా ధర్మజుని వైపు చూసిన ద్రౌపది చూపుల నెదుర్కోలేక ధర్మరాజు తలదించుకుంటాడు. అందులో నిస్సహాయత ఉంది. క్షమనర్దిస్తున్న వేడుకోలు ఉంది. అప్పటికి.... భయ విహ్వలతతో, నిస్సహాయతతో కుప్పకూలిన ద్రౌపదీ దేవిని, ఆ అవమానం నుండి వాసుదేవుడు కాపాడినట్లు మనం భారతంలో చదువుతాము.

వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది లేవనెత్తిన ద్వంద్వం లేదా ధర్మ సందేహానికి సమాధానం అరణ్యపర్వంలో చెప్పబడుతుంది. అరణ్యవాసంలో ఉండగా.... ధర్మరాజు కీ - భీమార్జున నకుల సహదేవులుకీ, ధర్మరాజుకీ - ద్రౌపదీ దేవికీ మధ్య నడిచిన సంభాషణల్లో.... ద్రౌపది ‘మనిషికి అవసరమైనంత మేరకు క్రోధం, రజోగుణం ఉండాల్సిందేననీ, అలా లేకపోవటం దోషభూయిష్టమేననీ’ అంటుంది. ధర్మరాజు ‘అలాగని శాంత గుణాన్ని విడిచి పెట్టకూడ’దంటాడు. ఆ సందర్భంలో ద్రౌపది, నిర్మొహమాటంగా ధర్మరాజులోని లోపాలని ఎత్తి చూపుతుంది.

ధర్మరాజు ‘జూదానికీ, యుద్దానికీ పిలిచినప్పుడు క్షత్రియుడు వెనుకంజ వేయకూడదని’ అంటూనే ‘జూద క్రీడ వినోదం అనే పరిధిని దాటి వ్యసన పూరితంగా పరిణమించటం తప్పేనని’ పరోక్షంగా అంగీకరిస్తాడు. ద్యూత క్రీడలో తనను మించిన వారు లేరనే తన అతిశయించిన ఆత్మవిశ్వాసాన్ని తలుచుకొని ధర్మరాజు ఆత్మనిందకు పాల్పడకుండా, నివారిస్తూ.... భీమార్జున నకుల సహదేవులు.... శకుని మాయాద్యూతాన్ని పసిగట్టలేక పోయిన తామందరూ విధి వంచితులమంటారు.

ఆ విధంగా.... ఇంద్రప్రస్థ నగర నిర్మాణం నాడూ, రాజసూయ యాగ నిర్వహణ నాడూ, తాము ధర్మజుని అగ్రజ నాయకత్వాన్నీ, సమిష్టి విజయాన్ని అంగీకరించినట్లే.... నేడు సమిష్టిగా అపజయాన్ని పంచుకుంటారు.

నిజంగా భీముడు - ద్రౌపది - ధర్మరాజు ల సంవాదం, ధర్మ సమీక్ష భారతంలో కీలకమైనది. ఈ సన్నివేశం చివరిలో, కథలో ప్రవేశించిన వేద వ్యాసుడు, పాశుపతాస్త్రం సంపాదించమని పాండవులను ఆదేశిస్తాడు. ఆ విధంగా సభాపర్వంలో ద్రౌపది లేవనెత్తిన ధర్మ సందేహం, అరణ్యపర్వంలో పరిష్కరింపబడుతుంది. దేనినైనా కాలమే పరిష్కరిస్తుంది అన్నట్లు!

పీవీజీ మాపట్ల నిర్వహించిన గురుత్వం గురించిన మా ధర్మ సందేహాన్ని కూడా కాలమే తీర్చింది.

"ఇవ్వని గురుత్వాన్ని ఆయన ఎవరినడిగి పుచ్చుకున్నాడు?" అని తిట్టుకున్నాం. ఒక్కసారి గూఢచర్యం అనే ప్రవాహంలో దూకాక, ఇక దాన్ని తెలుసుకోక తప్పదు. లేకపోతే కేవలం ప్రాణభయమే ఉండదు. గౌరవగ్లాని, క్షణక్షణం మానసిక, కొండకచో శారీరక చిత్రహింసలుండినా ఆశ్చర్యం లేదు. వీటి నుండి రక్షింపబడాలంటే.... గూఢచర్య జ్ఞానమే రక్షణ కవచం. అందుకే పీవీజీ.... రెండుబోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆట వంటి గూఢచర్యపు ప్రక్రియని సృష్టించాడు.

మధ్యలో మా పోరాటం ఆపివేసినా ఆయనని జీవితకాలం తిట్టుకుంటూనే ఉండేవాళ్ళం. అలాగాక ఆత్మహత్య చేసుకుంటే ఇక ఏమీ అనుకోవటానికి లేదు. అందుకని కూడా ఆత్మహత్య చేసుకుంటామంటే బెదిరించి మరీ అలాంటి ఆలోచనలు రాకుండా నివారించాడు. తరువాత అనివార్యంగానైనా పోరాడాం కాబట్టే ఆయన మమ్మల్ని ఎలా రక్షించాడన్నది మాకు అర్ధం అయ్యింది. ఒక ఎరా వరకూ ఆయన చేసినది అధర్మంగా కనిపించినది, తరువాత ధర్మంగా అర్ధమైంది. కాబట్టే ధర్మం బహు సూక్ష్మమైనది.

ఇక "ఫిర్యాదు ఇవ్వటంతో పౌరులుగా మా బాధ్యత తీరింది. మమ్మల్ని, దేశాన్ని కూడా రక్షించటం, ప్రధానిగా ఉన్నందున పీవీజీకి తప్పని ప్రభుధర్మం" అనుకున్నాం.

ప్రజాస్వామ్యంలో ప్రభుధర్మం, పౌరధర్మం అంటూ విడిగా లేవనీ, ప్రజాధర్మమే ప్రభుధర్మమనీ అర్ధమైంది.

ఇక పీవీజీ స్థానే గురు పీఠాన్ని అధిష్టించాననే సోనియా, ఆమె పేరిట ఈనాడు రామోజీరావులు.... చెప్పే వాదనలో ఎన్ని లొసుగులున్నాయంటే.....

పీవీజీ.......1992 నుండి 1995 వరకూ కూడా.... ఎప్పుడూ ’మీకు తెలిసింది ఎవరికీ చెప్పవద్దన లేదు. నిరూపణ లేకుండా చెబితే ఎవరూ నమ్మరు’ అని మాత్రమే చెప్పాడు. అదీ మాకు కలిగించిన అవగాహనలో ఒక భాగమే. అంతే గానీ ‘ఇదంతా చెబితే మిమ్మల్ని పిచ్చివాళ్ళంటారు’ అనలేదు.

’మీకు పిచ్చి, xyz సిండ్రోమ్, ABCD డిజార్డర్’ అనేది నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలకవ్యక్తి రామోజీరావే! అంతే కాదు, 1996 నుండి 2005 వరకూ మేము ఏ విషయమూ పట్టించుకోలేదు, సరే! 2004 లో పీవీజీ మరణించాడు, 1996 నుండి 2004 వరకూ కూడా, ఎప్పుడూ.... మమ్మల్ని "మీకు తెలిసింది ఏమిటో వచ్చి నాకు చెప్పు" అనీ అనలేదు.

అసలు మాకు గూఢచర్య అవగాహన కల్గించిందే పీవీజీ అయినప్పుడు, మాకు తెలిసిందీ, ఆయనకీ తెలియనిదీ ఏముంటుంది? ఆయనని మేము కలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యమైతే, అలాగే Drive చేసి ఉండేవాళ్ళు కదా! మాకు తెలిసినా తెలియక పోయినా, అప్పటికి మాకు గ్రహింపు ఉన్నా లేకపోయినా, మా జీవితాలలో గూఢచర్య ప్రమేయం ఉన్నప్పుడు, ఆ విధంగా Drive చేయటం ఏమంత పెద్ద విషయం కాదు కదా!

అప్పటికి [1996 నుండి 2004 వరకూ] చంద్రబాబు నాయుడి చేత రామోజీరావు మమ్మల్ని చెడుగుడు ఆడుకున్నాడు. కాకపోతే, ఇవేవీ తెలియనందున మేము అదంతా ’విధి వ్రాత’ అనుకున్నాము.

ఆ విధంగా పీవీజీ "నా దగ్గరికి వచ్చి నీకేం తెలుసో చెప్పు" అనీ అనలేదు.
అప్పటికి ఆయన గురించి మాకు వ్యతిరేక భావనలు ఉన్నాయన్నా, వాటిని మార్చే ప్రయత్నమూ చెయ్యలేదు.
’దైవేచ్ఛ ప్రకారమే ఏవైనా జరుగుతాయనీ, కాలమే దేన్నైనా పరిష్కరిస్తుందనీ!’ అన్నట్లుగా....
’ఈ పనిని నేనే చేశాను’ అనీ అహంకారం గానీ,
’ఈ పని ఫలితంగా సత్కీర్తి అయినా, విజయమైనా నాకే చెందాలి’ అనే ఆసక్తిగానీ లేకుండా....
‘దైవేచ్ఛ ప్రకారం ప్రారంభమైన ఈ గూఢచర్య యుద్దం, [మెదళ్ళతో యుద్దం] దైవేచ్ఛ ప్రకారమే నడుస్తుంది, ముగుస్తుంది’
అనుకుంటూ కానరాని లోకాలకు తరలి పోయిన కర్మయోగి పీవీజీ!

అదే.... సోనియా అయితే ’నేను పీవీజీ స్థానే నీ గురువుని! కాబట్టి నీకు తెలిసిందంతా నా దగ్గరి కొచ్చి, చెప్పు’ అంటుంది. అన్నీ తామే నడుపుతున్నప్పుడు, తొక్కలోది మాకు తెలిసిందీ, తమకి తెలియనిదీ ఏముంటుంది?

అదేగాక.... ఒక వేళ, ఆమె దేశం మీద జరుగుతున్న కుట్రలో భాగస్వామి గాక దేశభక్తురాలే అనుకోండి, మేము ఆమెని పొరబాటుగా గుర్తిస్తున్నామనుకోండి! మరి మమ్మల్నెందుకు వేధించినట్లు? ధరల మోత, పన్నుల వాత దగ్గరి నుండి అన్నిటా ప్రజలనెందుకు దోచుకుంటున్నట్లు? ఎన్డీ తివారీ దగ్గరి నుండి నోటుకు ఓటు దాకా, అన్ని అవకతవకలనీ తొక్కిపట్టిందెందుకు? సెజ్ ల పేరుతో భూముల్ని, అభివృద్ది కోసం అంటూ ప్రభుత్వ కంపెనీలని అమ్మి ప్రజాధనం మాయం చేసిందెందుకు? కసబ్ ల దగ్గర నుండి అఫ్జల్ గురుల దాక, [నళినలని సహితం] కాచి కాపాడుతుందెందుకు?

అదే పీవీజీ అయితే, పాక్ తీవ్రవాదుల్ని పట్టి లోపలేస్తే, ఎన్డీయే.... కాందహార్ విమాన హైజాక్ అంటూ సదరు తీవ్రవాదుల్ని, దగ్గరుండి విమాన మెక్కించుకొని, సురక్షితంగా ఆఫ్ఘన్ లో దించి వచ్చింది. యూపీఏ అయితే, అఫ్ఝల్ గురులకి మరణ శిక్ష అమలు చేయకుండా వంకలు చెబుతూ, కాలం వెళ్ళ బుచ్చుతోంది. ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టేందుకు అన్నట్లు.... ఎన్డీయే అద్వానీ అయినా, యూపీఏ సోనియా అయినా ఒకటే!

సరే! ఇవన్నీ కాదు, పీవీజీ మాదిరే సోనియా అనుకుందాం. అలాంటప్పుడు.... ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు తో సహా, రామోజీరావు గూఢచర్యం నిలువునా బహిర్గతమైంది, అడ్మినిస్ట్రేషన్ పరంగానే గాక దృష్టాంత పూరితంగా కూడా నిరూపితమైంది.

"ఏదైతే అదే అయ్యింది? ఫలితం భగవంతుడిది. పనే మనది" అనుకొని.... ఫలాసక్తి రహితంగా, తనను ఎవరైనా కుట్రదారు అనుకోనీ, కుట్రకు ఎదురొడ్డి పోరాడింది అనుకోనీ, దుష్కర్తే రానీ లేక సత్కీర్తే రానీ అనుకొని, వ్యక్తిగతాన్ని వదిలేసి [ధర్మాచరణలో వ్యక్తిగత ప్రయోజనాలకి తావు లేదని మొన్న అంతర్యామిలో కూడా చెప్పారు మరి!].... అన్నిటినీ ప్రకటించేయవచ్చుగా!

సోనియా, తాను దేశభక్తురాలన్నదే నిజమైతే.... మానవతా మూర్తి అన్నదే నిజమైతే.... ఆమెని అర్ధం చేసుకోవటంలో మాతో సహా ఎవరైనా పొరపాటు పడిందే నిజమైతే.... ఆ నిజమే బయటకు వస్తుంది కదా! ఇక భయమెందుకు? పీవీజీ అయితే మరి అలాగే వెళ్ళిపోయాడు. తనకి సత్కీర్తే రానీ దుష్కర్తే మిగిలిపోనీ, విజయమే రానీ, అవేవీ తాను చూడకుండానే..... నిజమైన నిష్కామ కర్మయోగి యై నిష్ర్కమించాడు.

అవన్నీ వదిలేసి.... "నువ్వు మమ్మల్ని నమ్ము, శుభంకార్డు వేసుకుందాం" అనటం ఎందుకు? ’తొక్కలో మేము’ అని వదిలేసి వూరుకునేందుకు.... మరోవైపు నెం.5 వర్గం తమ గూఢచర్య కార్యకలాపాలని, క్రమంగా.... బహిర్గతపరుస్తోంది, కుప్పకూలిస్తోంది! తమ ఏజంట్లతో సహా తమనీ సువర్ణముఖి అనుభవింప చేస్తోంది. ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుతో సహా రామోజీరావు అనువంశీయ నకిలీ కణికుల గూఢచర్య వలయాన్ని ప్రకటించక పోతే.... నెం.5 వర్గం ఊరుకోదు. బహిర్గతాలు - సువర్ణముఖిలు అంతకంతకూ స్థాయి పెంచుతూ కొనసాగిస్తుంది.

అలాగని కేసు ప్రకటిస్తే.... తమకి మిగిలేదేం ఉండదు, గూఢచర్యపరంగా మరణం తప్పితే! ఈ ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ ని తప్పించుకునేందుకే... ఈ వత్తిడంతా! లేకపోతే ఈ బ్లాగుతో నష్టమేమిటి?

ఏ ప్రజలైతే దగా పడుతున్నారో, కుట్రలకు బలవుతున్నారో, ఆ ప్రజలకి నిజం తెలిస్తే.... కుట్రలకు వ్యతిరేకంగా....ఇందిరాగాంధీ, పీవీజీ ల్లాగే పోరాడుతున్నననే సోనియాకి నష్టం ఏమిటి? ప్రజలకి సత్యం తెలిస్తే పని మరింత సులువవుతుంది కదా! బదులుగా బ్లాగు వ్రాతలు మానమనీ, బ్లాగు డిలీట్ చెయ్యమనీ వత్తిడెందుకు? ఇదంతా అసత్యమే.... అయితే ఈ పాటికి సోనియా, రామోజీరావులు మా మీద న్యాయపరమైన చర్యలూ, పరువునష్టం దావాలూ అంటూ ఖయ్యి మనక పోయారా?

`మొత్తం issue సోనియాకి క్షుణ్ణంగా తెలుసు' అనడానికి 2007, ఏప్రియల్ 20న ఏఐసిసి జనరల్ సెక్రటరీగా దిగ్విజయ్ సింగ్ మాకు వ్రాసిన లేఖ నిరూపణ. coups on world లోని Documentary Evidence – Scanned Copies లో అవన్నీ పొందుపరిచాను.

అసలు ఇదంతా అసత్యమే అయితే,.... ఇంత నైపుణ్యంగా, ఇంత అభూత కల్పనని, ఇంత ఉత్కంఠపూరితంగా, ఆకర్షణీయమైన శైలిలో చెప్పగలుగుతున్నామని తామే అంటున్నప్పుడు.... ఆపాటి మాకు తెలియదా?

అలాంటి చోట.... ఇంత అభూత కల్పననీ, ఇంత ఉత్కంఠపూరితంగా, ఇంత ఆకర్షణీయమైన శైలిలో వ్రాసేటప్పుడు.... ఈ సోనియా, రామోజీరావు ల వంటి వ్యక్తుల పేర్లకు బదులుగా, ఏ సుబ్బారావు అప్పారావుల వంటి కల్పిత వ్యక్తుల పేర్లతోనైనా వ్రాస్తే.... మా ఈ రచనకు.... పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రాదా? వస్తాయన్న ‘ఆపాటి ఇంగిత జ్ఞానం’ మాకు లేదా? పేరున్న వాళ్ళతో పనిలేక తగవు పెట్టుకుంటామా? ‘కేసులు పెడతారు లేదా భౌతిక దాడులు, లేదా చంపటం లాంటివి చేస్తారు, ఎందుకని’ మా పాటికి మేము ఊరుకోమా? జీవితం మాది. మా జీవితం గురించి మేము ఇంకా ఎక్కువగా అలోచిస్తాము కదా!

ఇవన్నీ ఆలోచించకుండానే... మా బ్లాగులో ప్రయత్నపూర్వక అజ్ఞాతలు, కొందరు, వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. ఏ టపాలోనైనా సరే, కీలక విషయాన్ని, రామోజీరావుకి మరింత నొప్పికలిగే విషయాన్ని, తొలిసారిగా చెప్పటం ప్రారంభించిన రోజు, ఆ టపా వ్యాఖ్యలు మరింత దురుసుగా, కొండొకచో బూతులతో, తిట్లతో, ’నీకు పిచ్చి’ అంటునో, వ్యంగ్యాలతోనో ఉంటాయి. క్రమంగా తగ్గుతాయి. మళ్ళీ కొత్త విషయం మొదలు పెట్టగానే.... కొత్త చిందులూ, కొత్త వ్యాఖ్యలూ ప్రత్యక్షమౌతాయి.

నిజానికి పీవీజీ మేధస్సుని మేము గ్రహించిందే చాలా తక్కువ. అందులోనూ కొంత మాత్రమే కాగితంమీద పెట్టగలిగాము. [అంటే బ్లాగులో అన్నమాట] ఆయన స్ట్రాటజీ... పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఎలా చూసినా ఫిట్ అవుతుంది. అందుకే ఆయనని గురించి మేము మురిపెంగా [గాయత్రీ మాత వరం పొందిన తెనాలి రామకృష్ణ కవి ని గుర్తు తెచ్చుకుంటూ] ‘వికటకవి’ అనుకుంటూ ఉంటాము. ‘వికటకవి’ ఎటునుండి ఎటు చదివినా ఒకేలాగా కన్పిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

వాదనల మాయని ఎలా ప్రయోగిస్తారో స్పష్టంగా అర్ధం కావటానికి ఏప్రియల్ 20, 21,22 తేదీల ఈనాడు పేపరు చూపిస్తాను.

మాకు గూఢచర్య శిక్షణ ఇస్తూ సోనియా [అంటే నెం.5 వర్గపు ముసుగు వేసుకున్న సోనియా బృందం] కొన్ని చోట్ల పరిమితి దాటి నందున దాన్ని మేము వేధింపు అనుకున్నామట. అందుకోసం మాకు కోపం వచ్చి, అన్ని విషయాలూ ఇలా బ్లాగు ముఖతః బహిర్గతం చేసేస్తున్నామట. దాంతో అసలు లక్ష్యమే దెబ్బతింటుందట.

చిన్నప్పుడు పిల్లలకి హింట్స్ ఇచ్చి కథ లేదా వ్యాసం వ్రాయమంటారు. ఈనాడు ప్రతీరోజూ హెడ్డింగులతో ఇలా హింట్స్ ఇచ్చి.... విషయం పూర్తిపాఠం అర్ధం చేసుకోమంటుంది. మర్నాటికి దాని కొనసాగింపు [continuity] ని కూడా ఇస్తుంది.

ఇందుకు దృష్టాంతంగా.....ఈనాడు 20 ఏప్రియల్, 2010.....

అంతర్యామిలో:
>>>కోపాన్ని జయించాలి :
‘తన కోపమే తన శత్రువు’ అని నీతిజ్ఞులు ఊరకనే అనలేదు. కోపం వచ్చినప్పుడు నోరు జారుతుంది. ఒక్కోప్పుడు చెయ్యి ఆడుతుంది. మిత్రుణ్ణి కూడా శత్రువుని చేసేస్తుంది. సంయమనం పాటించగలిగితే పరమ శత్రువైనా కాలక్రమేణా ప్రాణమిత్రుడు కాగలుగుతాడు.

మహ్మమద్ ప్రవక్త అల్లుడు హజరత్ అలి దేవభక్తి కలవాడు. ధర్మ సంస్థాపన కోసం అనేక యుద్దాల్లో పాల్గొన్నాడు. ఒకసారి ఒక శత్రువును నిర్భందించాడు. ఖడ్గం దూసి అతని తల నరకపోయాడు. తనకెలాగూ చావు తప్పదనుకున్న ఆ వ్యక్తి కోపం కొద్దీ అలి ముఖాన ఉమ్మేశాడు. అలీ ఒక క్షణమాగి తన ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టేసుకొని అతణ్ని చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోసాగాడు.

ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. వెనకనే పరిగెత్తి అలిని ఆపి ’నన్ను చంపటానికి కత్తి నెత్తావు. నిన్ను అవమానించాలనే నీ ముఖాన ఉమ్మాను. కాని, నన్ను చంపకుండా వదిలి పెట్టి పోతున్నావు, ఎందుకని? నాకర్దం కావటం లేదు. దయుంచి చెప్పు’ అన్నాడతను.

’నువ్వు దైవదూషణ చేశావు. ఇస్లామును ఘోరంగా విమర్శించావు. మసీదుల్ని ధ్వంసం చేసావు. నువ్వు చేసిన ఘోరాలకు నీపై కోపంతో నిన్ను దండించాలని నీపై కత్తి నెత్తాను. నా ముఖాన నువ్వు ఉమ్మిన వెంటనే నాకు మరింత కోపం వచ్చింది. ఆ కోపానికీ ఈ కోపానికీ తేడా ఉంది. ఆ కోపంతో నిన్ను చంపితే ధర్మ సంస్థాపన జరిగేది. ఈ కోపానికి నిన్ను చంపితే నీపై వ్యక్తిగత కారణంగా ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యేది. ధర్మ సంస్థాపన చేసేటప్పుడు స్వప్రయోజనం చూసుకోకూడదు. ఇస్లాము ధర్మం సంయమనం పాటించమని ప్రవచిస్తోందే కాని, ప్రతీకారాన్ని ప్రోత్సహించదు’ అన్నాడు అలి.

అతను అలి పాదాలపై పడిపోయాడు. అంత వరకు దైవ దూషణ చేసిన అతనిలో ఏహ్యభావం కరిగిపోయి పరివర్తన కలిగింది. ఇస్లామును స్వీకరించిన అతను ఆ తరువాత ఒక మహోన్నత ఫకీరుగా పేరు పొందాడు.

అనేకమంది ధర్మబద్దులమని చెప్పుకొంటూ పైకి ప్రవచనాలు వల్లెవేస్తూ లోలోపల తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తపన పడుతుంటారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకోలేక కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే వారిలో సంయమనం నశిస్తుంది. అప్పుడు తమ ఆప్తుల్ని నిందించటానికైనా వెరవరు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ’నీ మంచి కోసమే చేశాను, చెప్పాను’ అని ప్రగల్భాలు పోతుంటారు. ఆత్మవంచనతో తాము చేయాల్సిన అసలు పనిని పూర్తిగా మరిచిపోతారు. దీనికి మూలం తమలో పేరుకున్న అహంకారం. అది తెచ్చిపెట్టే కోపం. ఈ ముప్పును అధిగమించగలిగిన అలి లాంటి వాళ్ళు ధన్యులు. ఎంతటి దైవద్రోహులనైనా సంస్కరించగల జ్ఞానులు.

[ఇస్లాం ప్రతీకారాన్ని ప్రోత్సహించదట! కానీ తాలిబాన్లు మాత్రం అల్లా సామ్రాజ్యం కోసం జీహాద్ చేస్తున్నామంటూ చేసేదంతా అదే!]

ఇంతకీ.... కోపాన్ని జయించాలంటూ మాకు చెప్తోంది ఏమిటంటే - ధర్మసంస్థాపన చేసేటప్పుడు స్వప్రయోజనాన్ని చూసుకోకూడదు. ఇక తొలి, చివరి పేరాలు మరీ ముఖ్యమనుకొండి! [ఇంతకీ స్వప్రయోజనం అంటే ఆకలి తీర్చుకోవటం, బ్రతకాలను కోవటం అన్నమాట.]

ఇక మిగిలిన హెడ్డింగులు....

>>>ప్రియమైన సైన్యం....[12 వ పేజీలో.....ప్రియమైన సైనికుల్లారా! ]

>>> ఇంట్లో సిసింద్రీలు.... ఇవీ జాగ్రత్తలు [వసుంధర.... ఇంట్లో ఉన్న సిసింద్రీలం మేమట. క్రింది హెడ్డింగులలో చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్న మాట.]

>>>విస్తరణ జూన్ లో [విస్త’రణం’ అని ఎక్కువగా వేస్తుంటాడు. దీనినే క్రమంగా విస్తరణగా మార్చేసాడు. రణం అంటే యుద్దమే! ’జూన్ లో కేసు ప్రకటిస్తాం లే!’ అని. గతంలో ఈ గడువు సంవత్సరాలుగా చెప్పబడేది. అంచేత బ్లాగులో వ్రాయటం ఆపేయ్! డిలీట్ చేయ్!]

>>>తెలంగాణా కావాలె [తప్పకుండా ’కేసు ప్రకటన కావాలి’ అని అర్ధం!]

>>>లోపాలుంటే చెప్పండి.... సరిదిద్దుకుంటా

>>>నాకు న్యాయం చేయండి. [పీవీజీ ఒక్కడేనా చేసింది, నేను ఏమీ చేయలేదా? నాకు[సోనియాకి] న్యాయం చేయండి అని అర్ధం.]

>>>మా పేర్లు చెప్పుకొని కబ్జాలు చేస్తున్నారు [మా పేరిట రామోజీరావు, అతడి అనుచరులూ చాలా చర్యలు చేస్తున్నారు. - ఇదంతా సోనియా పేరిట చెప్పబడింది.]

>>>సమిష్టి సమరం.... సాగాల్సిన సమయం [ఎడిటోరియల్ పేజీ : కలిసికట్టుగా యుద్దం చేయాల్సిన సమయం ఇది.]

>>>విధుల్లో అలక్ష్యం.... ఆపేదెలా?[మీకు పనిపట్ల అలక్ష్యం ఏర్పడింది. ఎలా మిమ్మల్ని ఆపటం?]
[ఈ హెడ్డింగ్ క్రిందే రెండు సమస్యల గురించీ కవిత గూడపాటి, అర్గనైజేషన్ల్ సైకాలజిస్ట్ తో చర్చించారు.]
ఒక సమస్య: మా విభాగంలో ఓ సహోద్యోగి ప్రవర్తన పని వాతావరణానికి ఆటంకంగా మారుతోంది. తనెప్పుడూ ఇతరుల గురించి విమర్శిస్తుంది. పని, వ్యక్తిగతం... ఏ విషయాలైనా సరే... ఇతరుల గురించి చెడుగా చెబుతుంటుంది. తనతో కాకుండా మరొకరితో మాట్లాడినా... కబుర్లు చెప్పినా సహించదు. గొడవలు సృష్టిస్తుంది. అబద్దాలను వాస్తవాలుగా నమ్మించడంలో తనను మించిన వారు లేరు. తన వల్ల ఏడాదిగా చాలా సమస్యలు ఎదుర్కొన్నా, ఇదే విషయాన్ని బాస్ దృష్టికి తీసుకెళ్ళినా.... ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

కవిత గారి జవాబు: ఆఫీసుల్లో గాసిప్ లు సాధారణమైనా... ఇలాంటి మనస్తత్వాలున్న వ్యక్తుల మధ్య పనిచేయడం ఇబ్బందే. ఒక్కరి వల్ల చుట్టూ ఉన్నవారు సమస్యలెదుర్కొంటారు. అయితే ఆమె ఒకరి గురించి ధైర్యంగా చెబుతోందంటే.... అందుకు కారణాలేంటి? ఇతరులకు తెలియని విషయాలు ఆమెకు తెలిసినప్పుడు.... ఆఫీసులో ఏం జరుగుతోందో.... ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం కనబరిచినప్పుడు... ఇలాంటి గాసిప్ లు చోటుచేసుకుంటాయి. దానికి తోడు... మిగిలిన సిబ్బందీ తమకు తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే.... ఇలాంటి సహోద్యోగులు... పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. చెప్పే విషయంలో వాస్తవం లేకపోయినా... అది పూర్తిగా నిజమంటూ నమ్మిస్తారు కూడా. ఇలాంటి వారితో వ్యవహరించాలంటే... ఒక్కటే మార్గం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రస్తావించడమే. అసంకల్పిత... అసందర్భ చర్చలతో మీరు సమయం వృధా చేసుకోవడానికి సిద్దంగా లేరని తెలియజేస్తే.... మీకు చెప్పడం మానేస్తుంది. ఏదైనా చెబుతున్నప్పుడు... అందులో నిజానిజాల్ని వెలికితీసేందుకు యత్నించండి. అంటే... ’మీరు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించండి. ఆఫీసులో ఏదైనా జరిగిందని చెబితే.... ఎప్పుడు? ఎలా? వంటి ప్రశ్నలు వేయడానికి వెనకాడకండి. మీరు, విభాగంలో పనిచేసే మిగిలిన సిబ్బందీ ఇదే ధోరణి కొనసాగిస్తే.... మీ అనాసక్తి ఆమెకు పూర్తిగా అర్ధమవుతుంది. ఇబ్బందికరమైన సమాచారం... గాసిప్స్... లాంటివి వినడానికి మీరు సిద్దంగా లేరనే విషయాన్ని మర్యాదపూర్వకంగానే తెలియజేసిన వారవుతారు. దీనికి మరో ప్రత్యామ్నాయమూ లేకపోలేదు. సహోద్యోగులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఇలాంటి గాసిప్ లు లేవనెత్తడం వల్ల కలిగే ఇబ్బందుల్ని విశ్లేషించండి. దాంతో మీ బృందంలో... ఎవరూ ఇలాంటి అవాస్తవిక విషయాలు తెలుసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదని చెప్పకనే చెప్పిన వారవుతారు.

[వెరసి దీనికి అర్ధం ఏమిటంటే:
ఇందులో చెప్పబడిన సహద్యోగి లక్షణాలన్నీ, ఇన్నాళ్ళుగా మాకు ఆపాదిస్తూ, మమ్మల్ని నిందిస్తూ చెబుతున్నవే. పని వాతావరణానికి ఆటంకం కల్గిస్తున్నామట. ఇతరుల్ని ఎప్పుడూ విమర్శిస్తున్నామట. అన్నిటినీ చెడుగా చెప్పేస్తున్నామట. అబద్దాలను వాస్తవాలుగా నమ్మించటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరట. మా మూలంగా ఏడాదిగా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందట.

అవును మరి! వాళ్ళ గూఢచర్యం గురించి.... తిరగబడ్డ కథను వివరించటం మొదలు పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. మా బ్లాగు మీద, కవిత గూడపాటి చెప్పిన పరిష్కారాలే అనుసరిస్తున్నాడు లెండి. ]

>>>గుర్తింపు పొందండిలా....[11పేజీలో.... కేసు ప్రకటిస్తే గుర్తింపు వస్తుంది కదా! కాబట్టి.... వాళ్ళు చెప్పినట్లు విని, మేము గుర్తింపు తెచ్చుకోవాలన్న మాట. బ్లాగులో వ్రాస్తే గుర్తింపు రాదు, రావడం లేదు కదా! అదే తాము ప్రకటిస్తే....?]

>>>41 వేలమందికి ’విమాన’ వేదన [13 పేజీ... విమానం టేకాఫ్, జూమ్, హెలికాప్టర్ రావటం, తెర తీయటం, తెలంగాణా.... ఇవన్నీ ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు ప్రకటనకు పర్యాయపదాలు[అలియాస్ లు]. కాబట్టి, ఇప్పుడు మా బ్లాగు వ్రాతల కారణంగా, కేసు ప్రకటనకు ఇబ్బంది, అందరికి వేదన కలిగిందన్న మాట.]

ఇక ఏప్రియల్ 21 వ తేదీ ఈనాడు....

మా టపా హెడ్డింగ్: తమకు రాని విద్య ఎవరికైనా నేర్పటమంటే కామెడీనే!
ఈనాడు విన్యాసాలు చూడండి.

>>>షాక్ కొట్టింది [గూఢచర్యాన్ని హైఓల్టేజ్ కరెంటు తో పోల్చుతూ 1992లో మాకు చెప్పారు. so... మా బ్లాగు వ్రాతలూ, డిలీట్ చేయని చేతలూ, తమకి గూఢచర్యంలో దెబ్బలు తగులుతున్నాయట.]

>>>కలిసి సాగితేనే అభివృద్ది [షరా మామూలే.]

>>>తప్పులు క్షమించేసాం [2 వ పేజీ... మీరు చేసిన తప్పులు [అంటే బ్లాగులో సోనియాని విమర్శిస్తూ వ్రాతలు వ్రాయడం] క్షమించేసాం, రమ్మని అని అర్ధం. కొద్ది రోజుల క్రితం మమ్మల్ని జట్టులో నుండి పీకేసాం అన్నారు లెండి.]

>>>ఆగని తల్లిబిడ్డల మరణాలు [3 పేజీ... మా వ్రాతల, చేతల మూలంగా, తల్లి [అంటే సోనియా], బిడ్డలు [అంటే మేము]... ఇద్దరికీ మరణం తప్పదని అర్ధం! అంటే చావులాంటి ఓటమి తప్పేట్లు లేదట.]

>>>నేర్చుకొనే నేర్పేదీ - నడతలో మార్పేదీ? [సంపాదకీయ పేజీ: నేర్చుకునే నేర్పు, నడతలో మార్పు కొన్ని రాష్ట్రాలకు లేదని వ్యాసంలో వ్రాసారు. హెడ్డింగు మాత్రం శ్లేషాలంకారంలో మేము నేర్చుకున్నదే మీకు నేర్పుతున్నాం. మీ నడతలోనే మార్పు లేదు అని.]

>>>ఆపద వేళల....[అంతర్యామి.... ఆపదవేళల్లో మిమ్మల్ని కాపాడింది దైవం! అంటే మేమే కదా, నెం.5 వర్గమే కదా అని.]

>>>నాపై దర్యాప్తు చేయించండి [శశిధరూర్ అన్న ఈ డైలాగు సోనియాకి అనువర్తించాలన్న మాట. నా గురించి మళ్ళీ ఆలోచించండి అని.]

>>>గురువుల సేవలపై ద్వంద్వవైఖరి [14 పేజీ... పీవీజీ, సోనియా ఇద్దరూ గురువులే అయినా, వాళ్ళ మధ్య మేం వ్యత్యాసం పాటిస్తున్నామట.]

ఇక అదే రోజు జిల్లా ఎడిషన్ లో సెంటర్ స్ప్రెడ్ సూక్తులలో:

>>>నువ్వేం చేసినా సంపూర్ణంగా... క్షుణ్ణంగా చెయ్యి.... లేదా చేయడానికి ఒప్పుకోకు- సాయి బాబా [చేస్తే పూర్తిగా మేం చెప్పినట్లు చెయ్యి. లేదా జట్టులోంచి తప్పుకో!]

>>>అదే పేజీలో ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని ఒక బాక్స్ ఐటమ్.

>>>మొదటిపేజీలో ’విడగొట్టి... చెడగొట్టొద్దు’ అనేది మొదటి హెడ్డింగ్.

>>>ఇక హాయ్ బుజ్జీలో అయితే,
వేమన పద్యం:
చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుద్దు లిట్లుండరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:
పెద్దలను అవహేళన చేస్తే హాని తప్పదు. పెద్దల్ని అవమానపరిచిన చంద్రునంతటి వాడికే శాపం వల్ల కళలు నశించాయి.

అదే పేజీలో, సోక్రటీసు సూక్తి: నిరాశావాది అవకాశంలో సైతం అపదల్నే చూస్తూ నిత్యం భయంతో జీవిస్తాడు. [వాళ్ళ కోచింగ్ కు తట్టుకోలేక, నిరాశతో ఇవన్నీ బద్దలు కొడుతున్నామని, మంచి అవకాశాలు ఉన్నాకూడా ఆపదల్నే చూస్తున్నామని.]

ఇక 22 ఏప్రియల్, 2010 తేదీ ఈనాడులో....

వాళ్ళూ ఏ గోల చేసినా మేము బ్లాగులో వ్రాసుకుంటూనే పోతున్నాము కాబట్టి...

>>>అదుపు చేయండి - లేదంటే దిగిపోండి...[1వ పేజీలో.... మీ వ్రాతల్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే జట్టులోంచి తప్పుకోండి. అని]

>>> ’ఈ చెత్త’ ఇంకెన్నాళ్ళు....![5 వ పేజీ... ఈ-నాడు రామోజీ రావు గురించి చెత్త ఇంకా ఎన్నాళ్ళు వ్రాస్తావు? అని.]

>>>నన్ను క్షమించండి. [11 పేజీలో... లోపలి వార్త తెదేపా అంతర్గత వ్యవహారం. పైన హెడ్డింగు మాత్రం సోనియా పేరిట చెప్పబడింది. ఒక వేళ నేను తప్పు చేస్తే క్షమించమని. లేనట్లయితే ‘చంద్రబాబుకి క్షమాపణ చెప్పిన నన్నపనేని’ అనో.... ‘కన్నీళ్ళు పెట్టుకున్న రాజకుమారి’ అనో... ఇలా ఆ వార్తాంశానికి ఏ హెడ్డింగ్ అయినా పెట్టగల అవకాశం ఉంది. అయినా ‘నన్ను క్షమించండి’ అంటూ ప్రధమ పురుషలో చెప్పబడింది.]

>>>ఇప్పుడు ఒక బొటన వేలే చాలదు మరి. [1వ పేజీ..Zen mobile Ad. - ‘ఇప్పుడు గెలుపు, సక్సెస్ తెచ్చుకోవాలంటే మీ ఒక్కరితోనే కాదు కాబట్టి, కలిసి రండి’ అని చెప్తున్నారు.]

ఇంకా ఇలాంటివే చాలా.... దాదాపు ప్రతీరోజూ.... అత్యధిక మోతాదులో హెడ్డింగులూ, కథలూ.... సూక్తులూ గట్రా!

ఈ విధంగా - చిన్నప్పుడు పిల్లలకి హింట్స్ ఇచ్చి కథ లేదా వ్యాసం వ్రాయమంటారు. ఈనాడు ప్రతీరోజూ హెడ్డింగులతో ఇలా హింట్స్ ఇచ్చి.... విషయం పూర్తిపాఠం అర్ధం చేసుకోమంటుంది. మర్నాటికి దాని కొనసాగింపు [continuity] ని కూడా ఇస్తుంది.

స్థూలంగా వాళ్ళు చెబుతున్న వాదనలలో ఎన్ని లొసుగులో! పీవీజీ మాకు గూఢచర్యం గురించి అవగాహన కల్గించిందీ, మానసిక యుద్దతంత్రాలని తట్టుకునే విధంగా శిక్షణ నిచ్చిందీ మూడేళ్ళే! [1992 నుండి 1995 వరకూ] అంతకంటే ఎక్కువగా.... 18 ఏళ్ళపాటు, లేక జీవిత కాలం పాటు శిక్షణ ఇవ్వటానికి... తొక్కలోది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలకవ్యక్తులు రామోజీరావు సోనియాల స్ట్రాటజీ ఏమంత క్లిష్టమని!?

వాళ్ళకి తెలిసిందే పది స్ట్రాటజీలు! అందులోనూ ప్రధానమైనవి రెండే... అహం రెచ్చగొట్టటం, లేదా అహాన్ని సంతృప్తి పరచటం. వీలైతే ఆడదాన్ని, వీలుగాకపోతే ‘ఆకలి’ని ప్రయోగించటం. గత టపాలలో చెప్పినట్లు, నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం రిమోట్ తో డివీడీని ఆపరేట్ చేయటం వంటిదైతే... నెం.5 వర్గపు గూఢచర్యం డీవీడీని తయారు చేయటం వంటిది.

ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అదీ మన ఇతిహాసాల నుండే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మరో ఆసక్తికర అంశం చెబుతాను.

1995 ద్వితీయార్ధం నాటికి మాకు పీవీజీ మీద పెద్దమోతాదులో వ్యతిరేక భావనలు ఉండేవి. మేం కాదన్నా మా వెంటబడి అవగాహన పేరుతో వేధిస్తున్నాడనుకొంటూ బాగా తిట్టుకున్నాము. ఇక అన్నీ మరిచిపోవాలనుకున్నాక, 2005 లో ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ గురించి మన్మోహన్ సింగ్, సోనియా, రాష్ట్రపతి APJ కలాంలకి ఫిర్యాదులు ఇచ్చాక కూడా, రాజకీయాల గురించి మేము ఎవరితోనూ ఏదీ చర్చించనందున.... ఈబ్లాగు తెరిచే వరకూ పీవీజీ పట్ల మా అభిప్రాయం ఏమిటో రామోజీరావు బృందానికి తెలియదు.

బ్లాగు తెరిచాకే తర తరాల తమ గూఢచర్యం గురించీ, రామోజీరావుకీ సోనియాకీ మధ్య గల గూఢచర్య కీలక అనుబంధం గురించీ, మాకు తెలుసని వాళ్ళకీ తెలిసింది. ఇలాంటివి ముందుగా తెలుసుకునేందుకే తమిళ కారన్ లనీ, ఖాసీం లనీ ప్రయోగించుకున్నది!

ఎందుకంటే - పీవీజీ, నెం.5 వర్గమూ మాకు ఏదో అవగాహన కలిగించారని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. పీవీజీ, నెం.5 వర్గమూ తమ out let గా మమ్మల్ని చూపెట్టారు కాబట్టి కూడా, రామోజీరావుకి సంబంధించి అది నిర్ధిష్ట ఘటన. [Definate Event]

2004 లో పీవీజీ మరణించే నాటికి భవిష్యత్తులో ఇలాంటి స్థితి వస్తుందని ఊహకైనా లేదయ్యె! మేమిదంతా గ్రహించగలమని గానీ, అసలు ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని పెట్టగలమని గానీ, మీదు మిక్కిలి అది దృష్టాంతపూరితంగా నిరూపితమౌతుందని గానీ, దేశంమీదా మానవత్వం మీదా అన్ని రంగాల్లో కుట్రలకు మూలాధారాలతో సహా తాము నిరూపింపబడతామని గానీ, కలలో కూడా అనుకోలేదు!

అందుకే.... పీవీజీ పార్థివ శరీరం మీద సైతం తమ అక్కసు తీర్చుకున్నారు. అలాంటి చోట, తమ అనువంశీయ గూఢచర్యంతో సహా మేము బ్లాగులో టపాలు ప్రచురించే కొద్దీ.... రకరకాల వాదనలు [ఈనాడు ద్వారా] తమ సంకేత భాషతో వినిపించారు. వాటికి జవాబులుగా మేమూ టపాలలో, టపాకాయలలో వ్రాసాము. ఇక రామోజీరావు, సోనియా బృందం వినిపించిన రకరకాల వాదనలలో.... రెండు రకాల వాదనలకు పునాదులు సమాంతరంగా వేసుకుంటూ పోయారు. ఒక వేళ పీవీజీ పట్ల అనుకూల భావనలు ఉంటే ఒక వాదన, వ్యతిరేక భావనలు ఉంటే మరొక వాదన!

ఒక వాదన - పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కుయినవాడే! నమ్మి అతణ్ణి ప్రధానమంత్రిని చేస్తే అతడు బాబ్రీ మసీదుని కూలగొట్టనిచ్చాడు. మిమ్మల్ని గుడిసెలో పెట్టి వేధించాడు. దేశానికీ కీడు చేసాడు. అందుకే అతడిని పార్టీ నుండి వెళ్ళగొట్టాను. పీవీజీ, చంద్రబాబూ, రామోజీరావు.... అంతా ఒకటే జట్టు! నా భర్తనీ, అత్తనీ, మరిదినీ కూడా చంపించిన రామోజీరావుతో పీవీజీ ఎప్పుడో జట్టు కట్టిన వాడే. పైకి అలా కనిపించేవాడు కాదు, అంతే! - ఇదీ సోనియా వాదన.

1996 తర్వాత, 1998 లో పీవీజీని పార్టీ నుండి వెళ్ళగొట్టేటప్పుడూ, 2004 లో ఆయన మరణించాక పార్దివ శరీరాన్ని సైతం అవమానించినప్పుడూ, తమ అరిషడ్వర్గాలను తీర్చుకుంటూ నిర్వహించిన సంఘటనలకి, తర్వాతి రోజులలో.... గతాన్ని మార్చలేరు గనక,... అవసరాన్ని బట్టి రకరకాల భాష్యాలు చెప్పారు. అలాంటి భాష్యాలలో ఇదీ ఒకటి.

పీవీజీ మీద మా అభిప్రాయం ఏమిటో తెలియక ముందు.... 1995 నాటి వ్యతిరేక భావనే ఉండి ఉంటుందనుకొని.... 2005, అక్టోబరులో మేము తొలిసారిగా, [1992 లో పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదుకు కొనసాగింపుగా] ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని మన్మోహన్ సింగ్ కి ఇచ్చాక..... 2006 సంవత్సరంలో ఇది మాకు చెప్పబడింది.

ఈ ఎరా లోనే సోనియా కుమారుడు రాహుల్ "తమ కుటుంబంలోని వారు 1992 డిసెంబరు నాటికి అధికారంలో ఉండి ఉంటే బాబ్రీమసీదు కూలి ఉండేది కాదనీ పునఃపునః ఉద్ఘాటించాడు. ఈ విధంగా.... ఈనాడు హెడ్డింగులతో, బాక్సు కట్టిన వార్తాంశాలతో నడిపిన సంకేత భాషలో సోనియా తరుపున ఈ వాదనంతా మాకు వినిపింపబడింది. ఆ విన్యాసాలన్నీ మాకు అర్ధం అయినా.... మా స్పందనని మేము బయటికి తెలియ నివ్వలేదు.

2007లో శ్రీశైలం నుండి నంద్యాలకి మకాం మార్చిన తరువాత.... ఒకరోజు, మా కుటుంబమిత్రుడు ఖాసీం "పీవీ నరసింహారావు నాకు నచ్చడు సార్! అతడు కావాలనే బాబ్రీ మసీదుని కూలగొట్టనిచ్చాడు" అన్నాడు. మా స్పందన కోసం అతడు ఆతృతగా వేచి ఉండటం, అతడి దేహ భాషతో మాకు అర్ధం అవుతూనే ఉంది. అప్పటికే అతడు మా సునిశిత పరిశీలనలో ఉన్నందున.... ఒక క్షణం మౌనంగా ఉండి, సంభాషణ మరో వైపుకి మళ్ళించాము.

[గమ్మత్తు ఏమిటంటే - అతడు గానీ, అతడి పిల్లలు గానీ రంజాన్, బక్రీదు లాంటి పండగలప్పుడు తప్ప ఇక ఏ రోజూ మసీదు కెళ్ళరు. అతడి భార్య అయితే దీపావళి లక్ష్మీపూజ దగ్గరి నుండి పేరంటాలన్నింటికి వెళ్తుంది. శ్రీశైలం అమ్మవారికి టెంకాయలు కూడా కొడుతుంది. మమ్మల్నయితే, హిందూ పండగలను వాళ్ళింట్లో చేసుకుందామని పిలిచేవారు. మేము నవ్వి ఊరుకునేవాళ్ళం.]

నేనూ మా వారూ విశ్లేషించుకునేటప్పుడు మాత్రం, ఈనాడు సంకేత భాషతో సహా.... అన్ని వార్తలనీ, సంఘటనలనీ సమీక్షించుకునే వాళ్ళం. మొత్తంగా, సోనియా ఈనాడు రామోజీరావుకి ఎంత విలువైన వ్యక్తో మాకు బాగా అర్దం అయింది. అంతే కాదు ఖాసీం కూడా వాళ్ళకి విలువైన వ్యక్తే! 2007 క్రిస్ మస్ రోజున మేం ఖాసీంతో స్నేహానికి కటాఫ్ చెప్పాము. తరువాత రెండు రోజులకి దానిని పక్కాగా నిర్ధారించాము.

ఆ తరువాత ఈనాడు రామోజీరావు, నెం.5 ముఖం పెట్టి, స్నేహాలు వదులుకోకూడదనీ, ఒక ’సారీ’, చిన్న చిన్న కానుకలతో చిరునవ్వులతో తెంచుకున్న స్నేహాలను పునరుద్దించుకోవాలనీ.... సూక్తులతో, వసుంధర శీర్షికలతో బుజ్జగించాడు.

"ఇలాగైతే మిమ్మల్ని జట్టులోంచి తొలిగిస్తాం. మాకు మీ కంటే కూడా వాళ్ళే [ఖాసీం కుటుంబం అన్నమాట] ముఖ్యం!" అంటూ హెడ్డింగులతో, బాక్సు వార్తాంశాలతో బెదిరించాడు కూడా. ’మాకు విధేయత తగ్గిందనీ, గురు ధిక్కారం చేస్తున్నాం’ అనీ గద్దించాడు.

మొత్తానికీ ప్రతిరోజు పేపర్ తో మంచి కామెడీ పంచేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా.... 2008 నవంబరు 2న మేము ’అమ్మఒడి’ బ్లాగు తెరిచాము. అప్పటికే తమిళ్ కారన్ లని ప్రయోగించి, మేము ఆంగ్లంలో వ్రాస్తున్న ’coup on epics' గురించి తెలుసుకున్నాడు. ఆ విన్యాసాల గురించి ముందటి టపాలలో వ్రాసాను.

2008, డిసెంబరు 20 - 22 లలో coups on world [cow] అనే ఆంగ్ల బ్లాగుని, అన్నీ టపాలూ ఒకేసారి ప్రచురించి, ఏకమొత్తంగా విడుదల చేసాము. మా ఆంగ్ల బ్లాగు cow లో పీవీజీ గురించి మా అభిప్రాయాన్ని, అనువంశీయ నకిలీ కణికుల ప్రపంచవ్యాప్త గూఢచర్యాన్ని, అందులో సోనియా కీలక భాగస్వామ్యాన్ని కూడా వివరంగా వ్రాసాము. వివిధ రంగాల మీద నకిలీ కణికుల కుట్రని వివరించాము. అమ్మఒడిలో రాజకీయ రంగం మీద నకిలీ కణికుల కుట్రని తెలుగులోకి అనువదించి ప్రచురిస్తూ పోయాము.

ఇక `ఇంత అవగాహన మాకు ఉందని' తెలిసాక, రామోజీరావు ఈనాడు సంకేత భాషలో తమ వాదనని మార్చేసాడు. అదీ సోనియా పేరిట! అంటే అతడి ఉద్దేశంలో నెం.5 వర్గం పేరిట అన్నమాట. ఎందుకంటే - పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కయి పోయాడంటే, ఇంత అవగాహన ఉన్న మేము ఎంతగా నవ్వుకొని ఉంటామో అర్ధమైంది కాబట్టి.

ఇదంతా తర్కించుకొనేటప్పుడు మేము "సరే! ఒకవేళ పీవీజీ కూడా రామోజీరావుతో కుమ్మక్కు అయి పోయాడే అనుకుందాం. అలాంటప్పుడు ఈ సోనియా, ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసునీ, రామోజీరావు గూఢచర్యాన్నీ ప్రకటించి, మరణించిన పీవీజీని ఎటూ శిక్షించలేదు కాబట్టి, బ్రతికున్న రామోజీరావుకి తగిన శిక్ష వేయవచ్చు కదా?" అనుకునే వాళ్ళం.

"మరి నళినిని గారాబం చేయటం, మనల్ని వేధించటం ఎందుకు? స్కూలును ఊడగొట్టటం ఎందుకు?" అనీ తర్కించుకునేవాళ్ళం. అదీగాక, 2005 అక్టోబరులో ఢిల్లీ వెళ్ళి తిరిగి వస్తూ పీవీజీ ’లోపలి మనిషి’ కొన్నాము. పూర్తిగా చదివాక, సత్యాసత్యాలని గ్రహించగల విశ్లేషణా శక్తి మాలో మరింత పదును తేలిందన వచ్చు.

ఇక రామోజీరావు సోనియా పేరిట చేసిన కొత్త వాదన ఏమిటంటే -
పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కు అయిన వ్యక్తి అనే విషయం మీద గమ్మున ఉండి, కొత్తగా చెప్పిన వాదన ఇది - "పీవీజీనే ఇదంతా ప్రారంభించాడు. మీరిచ్చిన ఫిర్యాదు మీద పరిశోధన, గూఢచర్య పరమైన యుద్దమూ అన్నీ....! అలాగే ఆయన మీకు గూఢచర్య అవగాహన కలిగిస్తూ శిక్షణ ఇచ్చాడు కదా! దాన్నే మేమూ [అంటే సోనియా బృందం అన్నమాట.] కొనసాగిస్తున్నాం".

ఈ వాదనకి ప్రాతిపదికగా.... 2004 డిసెంబరులో పీవీజీ మరణించినప్పుడు.... ఆయన పోయే ముందు, ఈ పనినంతా విభజించి తన అనుచరులకీ, సహచరులకీ పంచాడనీ.... ఆ ప్రకారం మన్మోహన్ సింగ్ తో సహా 1992 నాటి పీవీజీ మంత్రి వర్గ సహచరులంతా ఎవరి పనివాళ్ళు చేస్తూ పోతున్నారనీ.... చెప్పబడింది. దీని గురించి గత టపాలలో కూడా వ్రాసాను.

శరీరం చచ్చుబడిన కుమారుడికి ’మెర్సీ కిల్లింగ్’ ని అనుమతించాల్సిందిగా కోర్టుకి అర్జీ పెట్టుకున్న ఓ తల్లి వార్తని ప్రముఖం చేస్తూ, ఈనాడు ఇదంతా చెప్పింది. తన కుమారుడి శరీర భాగాలను పంచటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ తల్లి అర్ధించింది. అప్పటికి [అంటే 2004 నాటికి] పీవీజీ పట్ల మా ప్రతికూల భావనలు మారాయో లేదో తెలియదు గనక, ముందు జాగ్రత్తగా.... పీవీజీ తన మరణానికి ముందు పని పంపకం చేసాడని ఈనాడు ద్వారా రామోజీరావు చెప్పాడు.

కీడెంచి మేలెంచమంటారు పెద్దలు. సాధారణ ప్రజలు దీన్ని ఎంత పట్టించుకుంటారో గానీ, గూఢచార ఏజంట్ మాత్రం ప్రతీ విషయంలోనూ దీన్ని గుర్తుంచుకోవాల్సిందే! అయితే ప్రపంచాన్నంతా చిటికెన వేలు మీద తిప్పుతున్నామను కున్న నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులు, గతంలో దీన్ని మరిచి పోయినా, 1992 తర్వాత క్రమంగా మళ్ళీ వంట పట్టించుకోవాల్సి వచ్చింది.

కొన్ని ముఖ్యమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ’కీడెంచి మేలెంచడాన్ని’ పాటించాడు. అదే పీవీజీ మరణించినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా.... ఇలా.... పీవీజీ తన మరణానికి ముందు ‘తనకు నమ్మకస్తులైన అనుచరులకి ఈ పనిని విభజించి అప్పగించాడు’ అనేందుకు తగినట్లుగా వార్తాంశాల్ని ప్రచురించుకోవటం!

అప్పుడే కాదు, ఇప్పటికీ రామోజీరావు ఇదే పద్దతి పాటిస్తాడు. ఈనాడు వ్రాతల్లో, హెడ్డింగులలో, వార్తాంశాలలో.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు ముఖంతో కొన్ని, నెం.5 వర్గం ముఖంతో కొన్ని, వ్రాస్తుంటాడు. నెం.10 వర్గం చెబుతోంది అనుకుంటే.... భయపడు, నెం.5 వర్గం చెబుతోంది అనుకుంటే.... ‘సోనియానే నెం.5 వర్గం’ అని భ్రమలో పడు - ఇదే మాకు చెప్పజూసేది.

ఈ విధంగా..... ‘పీవీజీ ప్రారంభించిన కోచింగ్ నే మేమూ కొనసాగిస్తూన్నాం’ - అంటూ, సోనియా ప్రతినిధిగా ఈనాడు రామోజీరావు ప్రజెంట్ చేసే వాదన ఇది.

ఇందులో ఉన్న లొసుగుల్ని గురించీ, గతంలో చెప్పిన వాదనల్ని గురించీ మాట్లాడకుండా.... ఈ కొత్త వాదనని పదే పదే అదే అనటం చేసారు, చేస్తున్నారు. పదే పదే అదే అదే అంటే - కొన్నిరోజులకైనా మనకు విసుగన్నా వస్తుంది లేదా మనమీద మనకే అనుమానం అన్నా వస్తుంది. ఒక వేళ మనమే పొరపాటు పడుతున్నామేమో అనుకోవాలన్నదే ఈ స్ట్రాటజీ!

ఇక.... ’ఇది జీవిత కాలపు కోచింగ్’ అన్నమాట. ఈ రకపు వాదనతో జీవితకాలం పాటు వేధించవచ్చు. తమ అరిషడ్వర్గాలు తీర్చుకోవచ్చు. తామేం చేసినా చెల్లిపోతుంది. సర్వరోగ నివారిణిలా అన్నిటికీ ఇదే సమాధానం! దాంతో అటెండర్లూ స్వీపర్లూ దగ్గరి నుండి సీఎంల దాకా మమ్మల్ని పైముఖంగా వేధించిన అందరూ మాకు కోచ్ లు అయిపోయారు.

3]. ఇక ఇప్పుడు.... ఓటమి స్ట్రాటజీ తో సహా, చాలా విషయాలు మేము బ్లాగులో వ్రాసాక....

తానూ [అంటే సోనియా] మాకు శిక్షణ ఇస్తూ, కొన్నిసార్లు పరిమితులు దాటేసిందట. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, ఆమె జట్టులో చేరిపోవటం లేదా ఆమెని మా జట్టులో కలుపుకోవటం చేయాలట. అంటే 'శుభం కార్డు' వెయ్యాలన్న మాట. "సోనియా, రామోజీరావు కుట్రలో కీలక భాగస్వామి కాదు. ఈ దేశానికి గొప్ప భక్తురాలు" అనాలన్న మాట. అందుకోసం బ్లాగు డిలీట్ చేసి, ఇంకా మాకు తెలిసిన విషయాలన్నీ ఆమెకు చెప్పాలన్న మాట - ఇదే ఈ వాదనల మాయ.

నిజంగా ఇన్ని రకరకాల వాదనలు ఎలాంటి వంటే - రామలక్ష్మణుల మీద ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్దంలాంటివి. అశోక వనంలోని సీతాదేవి దగ్గరికి, రాముడి ఖండిత శిరస్సుని, కృత్రిమంగా ఇంద్రజాల మాయతో సృష్టించి తెచ్చి, సీతమ్మని బెదిరించ, భ్రమపెట్ట చూసిన రావణుడి రాక్షస మాయ వంటిది. గూఢచర్య యుద్దమే మెదళ్ళతో యుద్దమైన చోట, మానసిక తంత్రాలే అస్త్రశస్త్రాలు.

కాబట్టే ’మీకు పిచ్చి’ అని, పదే పదే అంటూ.... టపాలు వ్రాయటానికి మాకు బెరకు పుట్టించాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ వ్యాఖ్యలు ఇచ్చే అజ్ఞాతల దగ్గర ‘నేను నీ బాస్ ని చెప్తున్నాను, నువ్వు అనుసరించు’ అన్నట్లు....అహంకారం, అసహనం, క్రోధం వంటి అరిషడ్వర్గాలన్ని కనిపిస్తుంటాయి.

ఇంత వాదనల మాయని ఎలా ప్రయోగిస్తాడో స్పష్టంగా అర్ధం కావటానికి ఏప్రియల్ ఈనాడు పేపర్లలో చూపిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu