పదిహేనేళ్ళ క్రితం ఆమె ఎవరో మాకు తెలియదు
మాయ తెర మాటున మంద్రంగా కదులుతున్నా
అబ్బాయో అమ్మాయో తెలియదు
అసలెలా ఉంటుందో తెలియదు.

పదిహేనేళ్ళ క్రితం
సరిగ్గా ఈ రోజు
నవ్వులన్నీ తెచ్చి కుప్పబోసినట్లుగా
వారసత్వానికీ వారధిగా
దేవుడు మాకు పంపిన గొప్పకానుక!

మా పాప ఫణి గీతా ప్రియదర్శిని!!

ఇంకా చెప్పాలంటే రెండు కోతులకి
ఒక కొబ్బరికాయ దొరికింది అనుకునేవాళ్ళం.

మా పాపకి జన్మదిన శుభాకాంక్షలతో....

23 comments:

మీ అమ్మాయికి శుభాశీస్సులు. మీ పట్టుదల, ధైర్యం, ఓపిక, తెలివితేటలు మీ అమ్మాయికి కూడా అబ్బి మంచి స్థాయికి వెళ్ళి సమాజసేవలో పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

మీ పాపకి నా శుభాకాంక్షలు కూడా అందజేయండి. ఆయురారోగ్యాలతో, చక్కటి విద్యా సంపదతో కలకాలం ఆనందంగా గడపాలని నా దీవెనలు.

Happy Birthday to Geeta Priya... May god give all aishwaryas to you....

Greetings from my side too

ఆదిలక్ష్మి గారూ !
గీతాప్రియకు జన్మదిన శుభాశీస్సులందించండి.

జీవని గారు: మేమూ అదే కోరుకుంటామండి, నెనర్లు!
జయ గారు: మీ దీవెనలు మా పాపకి అందించానండి :)
కృష్ణ గారు: మీ దీవెనలు ఫలించాలి.నెనర్లు!
మలక్ పేట రౌడి గారు: Thank from her side :)
SR Rao గారు: మీ శుభాశీస్సులు అందించానండి. నెనర్లు!

Happy Birthday to Geetha! May God bless you with lots of happiness and success!!

మీ అమ్మాయి గీతాప్రియకు జన్మదిన శుభాశీస్సులు.

ఆదిలక్ష్మి గారూ!
ఫణి గీతా ప్రియదర్శినికి నా శుభాకాంక్షలు కూడా అందజేయండి.

మీ పాపకు జన్మదినశుభాకాంక్షలూ, శుభాశీస్సులూనండీ.

శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.

మధురవాణి గారు: మా మధురవాణి ఇంకా శుభాకాంక్షలు చెప్పలేదేమిటి? ఇంకా చూడలేదా? అనుకున్నాను. అంతలో చెప్పారు. నెనర్లు!

అజ్ఞాత గారు: కృతజ్ఞతలండి!

ధరణీరాయ్ చౌదరి గారు: అందించానండి మీ శుభాకాంక్షలు మా పాపకి!నెనర్లు!

రాఘవ గారు: మా పాప తరుపున, మా తరుపున కృతజ్ఞతలు.

http://www.andhrabhoomi.net/sri-pottisriramulu/sfdf-851

వెన్నుపోటు పొడిచి వీధిన పడేశారు
నేదురుమల్లిపై పద్మనాభరెడ్డి ధ్వజం
April 4th, 2010

కోట, ఏప్రిల్ 3: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్‌గా తనయుడు రామ్‌కుమార్‌రెడ్డిని నియమించి తమను వీధిన పడేశారని ఎఐసిసి సభ్యులు, ఎన్‌బికెఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి ధ్వజమెత్తారు. కోట మండలం విద్యానగర్‌లోని ఎన్‌బికెఆర్ బిఇడి కళాశాలలో శనివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పేదలకు విద్యనందించాలన్న ఉద్దేశంతో తన పినతండ్రి దివంగత నేదురుమల్లి బాలక్రిష్ణారెడ్డితో కలసి 1935లో ఎన్‌బికెఆర్ విద్యాసంస్థలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆనాటి నుంచి విద్యాసంస్థల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానన్నారు. సంస్థలను అంచలంచలుగా అభివృద్ధి చేస్తుంటే చాటుమాటుగా దొంగ వ్యవహరం నడిపించి ఎన్‌జెఆర్ కళాశాలను స్వాధీనం చేసుకోవడం విచారకరమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల బాధ్యతలు కావాలని జనార్ధన్‌రెడ్డి తనను అడిగివుంటే తానే కళాశాలను అతనికి అప్పజెప్పి వుండేవాడినన్నారు. కళాశాల విషయమై జనార్ధన్‌రెడ్డితో చర్చిస్తే రామ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడమని సమాధానం చెప్పడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. చిన్నతనంలోనే తమ తల్లి మరణిస్తే జనార్ధన్‌రెడ్డిని తానే తల్లినై అన్నీ చూసుకున్నానని, దానికి కృతజ్ఞతగానే తనను వెన్నుపోటు పొడిచాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితకాలం ముగిసేవరకు తానే ఎన్‌బికెఆర్ విద్యాసంస్థలకు ఛైర్మన్‌నని అన్నారు. ఎన్‌జెఆర్ రాజకీయ, ఆర్ధిక అభివృద్ధికి తానేంతో కృషిచేశానని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నిర్వహించిన సమావేశాలకు, సభలకు తానే ఎంతో సొమ్మును ఖర్చుపెట్టానని, సొమ్ము తాను పెడితే జనార్ధన్‌రెడ్డి సోకులు చేసుకున్నాడని ఆయన ధ్వజమెత్తారు. తమ కళాశాలలో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా గూడూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన పనబాక క్రిష్ణయ్యను ఓడించి దళిత ద్రోహిగా మారాడని ఆయన ఆరోపించారు. ఐయస్‌టి కళాశాలలోని కరస్పాండెంట్ గది తాళాలు ఇవ్వమని పద్మనాభరెడ్డి అడుగగా సిబ్బంది నిరాకరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే ఆంధ్రాబ్యాంకు జనార్థన్‌రెడ్డి స్వంత బ్యాంకు కాదని, అతను చెప్పినట్లు వినాల్సిన పనిలేదంటూ బ్యాంకు మేనేజర్ ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు. ఆయన వెంట తనయుడు, వాకాడు ఎంపిటిసి సభ్యులు నేదురుమల్లి ఉదయశేఖర్ (రంజిన్) రెడ్డి ఉన్నారు.

గీతాప్రియకు జన్మదిన శుభాశీస్సులు.

చిన్నారి గీతమ్మకు ఒక చంద”మామ” నుంచి వెరైటీగా కొన్ని భారతీయ భాషల్లో -

"పుట్టినరోజు శుభాకాంక్షలు"

దీర్ఘాయుష్మాన్ భవ!
మనోవాంఛా ఫలసిధ్ధిరస్తు!!


ಹುಟ್ಟಿದ ಹಬ್ಬ ಶುಭಾಶಯಗಳು, ಆಶೀಸ್ಸುಗಳು!! - Kannada

लहान गीताला "वाढ दिवसाची शुभेच्छा" – Marathi

बेटी गीतको "जनम दिन पर बहुत बहुत शुभ कामनाए" - Hindi

بعٹع گعتا کہ سالگرھ مبارک - Urdu

அன்புள்ள கீதாவுக்கு "பொரந்தநால் வாழ்த்துகள்" - எங்கிருந்தாலும் வாழ்க!! – Tamil

ਜਨਮ ਦਿਨ ਦਿਯਨ ਵਧਯਯਾਨ!! – Punjabi

ગીતા, જન્મ દિન મુબારક – Gujarati

গীতা , সুবো জন্মদিন!! – Bangla (Bengali)

പിറന്നാള്‍ അസംസകള്‍ - Malayalam

from an anonymous admirer of your parents, and your uncle.

అజ్ఞాత గారు: నేదురమల్లి బాలకృష్ణరెడ్డి గారితో నాకున్న పరిచయం గురించి ఒక చిన్న టపాలో వ్రాస్తానండి. నెనర్లు!

చిలమకూరు విజయమోహన్ గారు: మా చిట్టితల్లి మీకు కృతజ్ఞతలు చెప్పమందండి. ఇప్పుడు పరీక్షల్లో బిజీగా ఉంది.

అజ్ఞాత చంద‘మామ’కి: మా కన్ని భాషలు రావండి. అన్ని భాషలకి కలిపి అమ్మభాషలో నెనర్లు!

P V NARASIMHA RAO
The great unmentionable http://www.indiatogether.org/2010/apr/rgh-rao.htm
Ramachandra Guha

మీ అమ్మాయికి శుభాశీస్సులు!!

Suresh Thotakura గారు: మీ అభిమానానికి నెనర్లుండి!

ఆదిలక్ష్మిగారు కొద్దిగా ఆలస్యం గా చూసాను

నా తరపున గీతా ప్రియదర్శిని కి జన్మదిన శుబాకాంక్షలు చెప్పండి !!

కొన్ని వ్యాఖ్యలు ఎగిరిపోయాయి. ఇదేలా సాధ్యం? ఎవరికయినా తెలిస్తే చెప్పగలరు.

ఫణి గీతా ప్రియదర్షిని కి జనమదిన శుభాకాంక్షలు .
best of luck in exams .

అజ్ఞాత గారు : పీవీజీ గురించి మంచి లింకు ఇచ్చారండి. కృతజ్ఞతలండి!

అజ్ఞాత గారు : ధన్యవాదాలండి!

మంచుపల్లకీ గారు: ఆలస్యంగానయినా శుభాకాంక్షలు చెప్పారు. నెనర్లండి!

మాలా కుమార్ గారు : ఆలస్యంగానైనా మా పాపని దీవించారు. అది చాలు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu