అప్పట్లో [అంటే 1992 డిసెంబరు వరకూ] దేశంలో సిఐఏ ఏజంట్లే కుట్ర చేస్తున్నారనే అవగాహన మాది. నూరేళ్ళుగా [అంటే ఎప్పుడైతే చికాగో మత మహాసభలో స్వామీ వివేకానంద హిందుమత జౌన్నత్యం గురించి ప్రపంచానికి చాటాడో అప్పటి నుండి] మన దేశం మీదా, మన మతం మీదా, మన సంస్కృతి మీదా సిఐఏ కుట్ర చేస్తోంది అన్నది మా ప్రాధమిక అవగాహన. అదీ పీవీజీ కలగించిందే! సిఐఏ అమెరికాకి చెందిన నిఘా సంస్థ గనక సిఐఏ ఏజంట్లని ’తెల్లకాకులు’ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. ’వాళ్ళలో రామోజీరావు ప్రధాన ఏజంట్ అన్నమాట’ అనుకున్నాము.

అప్పటి వరకూ హిందూ ఎన్.రామ్ నీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామనాధ్ గోయంకాని ప్రొజెక్ట్ చేసారన్నది కూడా అర్ధమయింది.[ఇదీ ఒకరకంగా స్పైగా పట్టుబడటం కూడా స్పైయింగ్ లో ఒక భాగం లాంటిది. అప్పుడు అందరి దృష్టి ఈ ఎన్.రామ్ ల మీదా, గోయంకాల మీద ఉంటుంది కదా! అప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళు చక్కగా చాప క్రింద నీరుగా పని చేసుకోవచ్చు.] రామ్ జఠ్మలానీ లాంటి వాళ్ళనీ, భాజపా అగ్రనేత అద్వానీ లాంటి వాళ్ళని కూడా సిఐఏ ఏజంట్లుగా లెక్కవేసుకున్నాము. వాళ్ళని గురించి మాట్లాడుకునేటప్పుడు ’తెల్ల కాకులు’ అనే మాట్లాడుకునేవాళ్ళం.

అలాగే మన దేశం పట్ల నిబద్దత ఉన్నవాళ్ళని ’నల్ల కాకులు’ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. గూఢచర్యపు ప్రాధమిక అవగాహన చేసుకునే రోజుల్లో, మాకు అర్ధమైన విషయాలని, మరింతగా అవగాహన చేసుకునేందుకు, మాకు మేముగా ప్రయోగించుకున్న భాష అది. మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడు "ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి. వేసుకో రెండు వీరతాళ్ళు" అన్నట్లుగా నన్నమాట. అప్పట్లో అలాంటి చాలా వివరాలు నా డైరీలో వ్రాసుకున్నాను. [1996 తర్వాత నుండీ ఈనాడు అప్పుడప్పుడూ ఫలానా చోట తెల్లకాకులు కన్పించాయి అంటూ ఫోటో వేసి, బాక్సు కట్టి మరీ వార్తలు ప్రచురించుతూ ఉంటుంది. హర్మోన్ల లోపంతో అలాంటి విచిత్రాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్పారంటూ ముక్తాయింపులూ ఇస్తుంటుంది.

ఇప్పుడూ.... అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక సంధర్భాలలో ఈనాడు, ప్రకృతిలో తెల్లకాకులు కనబడటం గురించి ప్రత్యేకంగా వ్రాస్తుంటుంది. అలా మాకు గుర్తు చేయాలన్నది రామోజీరావు ప్రయత్నం. కాబట్టే సోనియాని విదేశీ అనవద్దని పదే పదే చెప్పబడుతుంటుంది. జెనిటిక్ సమస్యలు కొన్ని ఉంటాయని, అంత మాత్రం చేత ఆమెని తెలుపు కాదు నలుపూ అని చెప్పాలన్న ప్రయత్నం అన్నమాట. ఇటీవల రోశయ్య, సోనియాని విదేశీ మహిళ అనటం తొందరపాటు చర్య అన్నాడు. దాని మీద మేము "ఇంట్లో తినే తిండి ఇటాలియన్, మాట్లాడే భాష ఇటాలియన్, మనుమలకి పెట్టుకున్న పేర్లు అరేబియన్... ఇంక విదేశీయత గాక స్వదేశీయత ఎక్కడుందని" టపాకాయ పేల్చాము.]

1992 లో, ఆ విధంగా మా జాబితాలో, ఫలానా ఫలానా వారు తెల్లకాకులు అన్న విభజన ఉండేది. అప్పటి పీవీజీ మంత్రి వర్గ సహచరులందరినీ నల్ల కాకులనే అనుకునేవాళ్ళం. సోలంకీలు పట్టుబడినప్పుడు ’ఓహో ఇతడు తెలుపు’ అనుకునేవాళ్ళం. అయితే.... క్రమంగా మా జాబితాలో ఉన్న నల్లవాళ్ళందరూ [చాలామంది] తెల్ల వాళ్ళయి పోవటంతో బెదురుకున్నాం. అందరూ దేశ ద్రోహులే అయితే.... ఇక మనకి తోడుగా నిలిచే దేశభక్తులే లేరా?’ అనుకుని ’బేర్’ మన్నాం.

అప్పట్లో i.e. 1992 లో.... ఇప్పుడు వార్తాంశాలని, సంఘటనలనీ ఎంత సునిశితంగా పరిశీలిస్తున్నామో అంతగా పరిశీలించేవాళ్ళం. అప్పటి పీవీజీ మంత్రివర్గ సహచరులలో చాలామంది గురించి దేశభక్తులన్న పిక్చరే ఉండింది. అంటే నల్లకాకులూ అన్నమాట. తర్వాతే.... ’తెల్లకాకులు అంటే - శతృవుననే ముద్రవేసుకుని కీడు చేసే వాడు, నల్లకాకులు అంటే - మిత్రుణ్ణనే ముఖం పెట్టి మరీ నమ్మకద్రోహం చేసే వాళ్ళు’ అన్న అవగాహన కలిగింది.

ఆ లెక్కలో.... కోడల్ని కాదు కూతుర్ని అన్నంతగా ఇందిరాగాంధీని నమ్మించిన సోనియా, ఎంత కారు చీకటిని మించిన నలుపో అర్ధమయ్యింది. అప్పటి పీవీజీ మంత్రి వర్గ సహచరులలో చాలామంది [దాదాపు అందరూ] ఇప్పుడు యూపీఏ ప్రభుత్వ మంత్రులై ఉన్నారు. ఈ ఫక్తు నల్లకాకుల గురించీ, పీవీజీ ’అయోధ్య’ పుస్తకం చదివాక మరింత అవగాహన కలిగింది.

అయోధ్యలో 1992 డిసెంబరు 6 న బాబ్రీ మసీదు కూలగొట్టబడినప్పుడు అద్వానీల ఆశలు తీరి, నకిలీ కణికుల స్వప్నం ఫలించి, పరిస్థితి అటూ ఇటూ అయ్యి, దేశం ముక్కలూ చెక్కలూ అయితే.... ఆ దుష్కర్తీ, ఆ బాధ్యత మొత్తం పీవీజీ తలకు చుట్టేందుకూ, అలాగ్గాక ఆ సంక్షోభం నుండి దేశమూ, పీవీజీ ప్రభుత్వమూ బయటపడితే.... ఆ విజయం సమిష్టిది అనేందుకు, ఆనాటి ఆయన సహచర నల్లకాకులందరూ తహతహలాడుతూ ఎదురు చూసారన్నది అర్ధమయ్యింది.

అయితే 1992 నాటికి.... ’అప్పటికే దేశం ప్రమాదపు అంచుకు చేరిందనీ, దాదాపు పైస్థాయిల్లోనూ, కీలక పదవుల్లోనూ ఉన్న వారందరూ దేశద్రోహులేనని’ అంటే తట్టుకోగల ధైర్యం గానీ, జీర్ణించుకోగల దార్ధ్యత గానీ మాకు లేవు. [నిజానికి రష్యా(USSR) విషయంలో జరిగింది అదే! అన్ని స్థాయిల్లోనూ దేశద్రోహులే ఉన్నారు కాబట్టి చాలా మామూలుగా దేశం ముక్కచెక్కలయ్యింది. దేశంలో ఎవరికి అందినవి అందిన వారు అమ్ముకున్నారు. కొన్ని మిస్సెల్స్ కూడా మాయమయ్యాయి.]

దాంతో.... వీటన్నిటికీ బెదిరిపోయి "ఇదంతా మాకు అనవసరం. Being citizen, నా ధర్మం అనుకుని ఫిర్యాదు ఇచ్చాను. ఆ విధంగా నా పౌరధర్మం నేను పాటించాను. పాలకుడిగా మమ్మల్ని కాపాడటం పీవీజీ బాధ్యత. మమ్మల్నేమీ అద్దాల మేడలో ఉంఛాలని కోరుకోవటం లేదు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతక నిచ్చినా, ఇంతకంటే [గుడిసెలో ఉండటం కంటే] హాయిగా బ్రతుక గలం. పీవీజీ మాపట్ల తప్పు చేస్తున్నాడు. దేవుడు మా పక్షానే ఉన్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు" అనుకునే వాళ్ళం.

అలాంటి పరిస్థితుల్లో.... ఒకోసారి గీతా సాధనతో ధైర్యపడేవాళ్ళం. ఒకోసారి ’ఛస్తే పీడాపోతుంది’ అనుకునేవాళ్ళం. ఆ ప్రయత్నాల్లోనే ఓ రోజు ఆత్మహత్య కు ప్రయత్నించి, లోయలోకి దూకలేక తిరిగి వచ్చాము. మర్నాడు పాముకథ మా విద్యార్ధి చెప్పాడు. గత టపాలలో వాటి గురించి వ్రాసాను.

ఈ స్థితిలో ఉన్నాము గనకే, 1995 లో మండలిని కలిసినప్పుడు ’మిమ్మల్ని వేధిస్తోంది పీవీజీనే అని ఎందుకు అనుకుంటారు?’ అన్నట్లుగా "ఒకవేళ నేదురమల్లి జనార్ధన రెడ్డే ఇదంతా చేస్తున్నాడేమో" అని indirect గా రామోజీరావుని ఎత్తాడు గానీ, డైరెక్టుగా రామోజీరావు అంటూ అనలేదు. అంటే తట్టుకోగలమో లేదో అనే స్థితిలో ఉన్నాను. అప్పటికే ఓటమి, ఒంటరి తనంతో కృంగిపోయి ఉన్నాను. పళ్ళబిగువున నడుస్తున్నాను. అప్పటికి గర్భవతిగా నా బరువు 47 కిలోలు కూడా లేదు. ఇక సైకలాజికల్ వత్తిడి తట్టుకోలేక బ్రేక్ అనటం ఖాయం అన్నట్లు ఉండేది నా స్థితి.

అప్పటికే శ్రీశైలంలో, గుంటూరులో మాకు తెలిసిన కొందరికి ’రాజీవ్ గాంధీ హత్య గురించి మేము, రామోజీరావు మీద పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన దగ్గర నుండి, మా ఫ్యాక్టరీ కోల్పోవటం, మమ్మల్ని పీవీజీ వేధిస్తున్నాడని’ చెప్పాము. చెబితే ఏదో అవ్వాలని మా కసి, కోరిక! చాలామంది తీరిగ్గా విని "అదంతా వదిలెయ్యండి. రామోజీరావు, పీవీజీ కి మీరిచ్చిన ఫిర్యాదు.... అన్నీ మరిచిపోండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి" అనేవాళ్ళు. కొందరు మౌనంగా ఊర్కునే వారు. ఆ తర్వాతే అవని గడ్డ వెళ్ళి మండలిని మరోసారి, ఆఖరు సారి కలిసింది!

అప్పటికీ మేమూ మా జీవితాల్లో చాలా అసాధారణాలని గమనించే ఉన్నాము. వరుసగా అసాధారణ సంఘటనలు A,B,C,... ఇలా జరిగాయనుకొండి. [ఏ సంఘటనని అసాధారణంగా గుర్తించాలో, ఆ సంఘటనని గుర్తించేదాకా మళ్ళీ మళ్ళీ జరిగేది.] B జరిగాక చూసుకుంటే - అంతకు ముందు జరిగిన సంఘటన A... చాలా సాధారణమై పోతుంది. అప్పటికి అది పదే పదే మన జీవితాల్లో జరిగీ లేదా చుట్టుప్రక్కల వాళ్ళకీ జరిగి ఉంటుంది. మొదటి సారి మనకి జరిగినప్పుడే ఆ సంఘటన A, అసాధారణం. చాలాసార్లు జరిగిపోయాక సాధారణమే కదా! అలాగే C జరిగాక B erase అయిపోతుంది. అంటే C అనే అసాధారణం జరిగాక B, సాధారణం, నార్మలైజ్ అయిపోతుంది. ఇలాంటివి పరిశీలనకు వచ్చిన కలవరంలో ఉన్నాము.

ఇది మా జీవితాల్లోనే కాదు, మన దేశంలోనూ, ప్రపంచంలోనూ చూసిందే. ఒక ఉదాహరణ ఇస్తాను. 1991 లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు, ధనూ మానవబాంబు ప్రపంచానికి కొత్త. పక్కా అసాధారణం! దాదాపు అదే కేసు RDX ది కూడా! సిఐఏ దగ్గిర తప్ప వేరెవ్వరి దగ్గరా దొరకదనే పేరుంది. తర్వాత? ఇప్పుడు ఏ ఉగ్రవాద సంస్థ దగ్గరో కాదు, మామూలు క్రిమినల్స్ దగ్గర కూడా RDX దొరుకుతోంది.

మానవబాంబులూ, ఆత్మహుతి దాడులూ అంతే! 1991 లో రాజీవ్ గాంధీ నాటికి కొత్త. తర్వాత 1992 -1993 లో ప్రేమదాస మొదలు నేడు పాక్, ఆఫ్గన్ లలో డైలీ స్కోరు అది. నిన్నా మొన్నా మాస్కోలోనూ కనబడుతోంది కూడా. అలాగన్న మాట. రాజీవ్ గాంధీ హత్య నాటికి అది అసాధారణం. ఆ తర్వాత పదే పదే జరగటంతో అది సాధారణం అయిపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. నిజానికి పత్రికలు కూడా ఒక విషయాన్ని సాధారణం చేయాలంటే పదే పదే అదే ప్రచారం చేసి, ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యతని తగ్గించి వేస్తాయి. ఆ విధంగా ఆ వార్తాంశం సాధారణం అయిపోతుంది.

ఈ పరిశీలనతో మేము కూడా ఎంతో గందరగోళానికీ, అందోళనకీ గురయ్యాము. బోరింగ్ తో నీళ్ళు కొడుతున్నామనుకొండి. ఆ చప్పుడు మనం ఏమను కుంటే అలాగే ఉన్నట్లుంటుంది. రైల్లో వెళ్తున్నప్పుడు రైలు చప్పుడూ అంతే! దీని గురించి వ్రాస్తూ ’సత్యం గారిల్లు’ నవలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి నవ్విస్తాడు కూడా!

అది గుర్తు కొచ్చి మేము ’నిజంగా మనకే భ్రాంతి కలుగుతోందా?’ అని బెంగ పడిన రోజులూ ఉన్నాయి. అలా అనుకున్న క్షణం ఏదో ఒక అసాధారణం జరిగి ’ఇది నిజం’ అని చెప్పబడేది. అది మేము గుర్తించేదాకా పదే పదే జరిగేది. ఇలాంటి సంఘటనలు మొదటి సంవత్సరాలలో కొన్ని వందలు ఉండేవి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైనా సరే "అన్నీ మరిచిపోండి" అన్నారే గానీ.... ఎవరూ "మీరు భ్రమ పడుతున్నారు, అంతా మీ భ్రాంతి" అనలేదు, ఒక్క ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు తప్ప [పీవీజీ హయాంలో]!

ఆమె కూడా మరొకరు అన్నారంటూ "ఫలానా వాళ్ళు, ఆదిలక్ష్మికి.... ఫ్యాక్టరీ, ఆస్థీ పోయే సరికి పర్వెర్షన్ వచ్చింది. ఆ అమ్మాయి హెలూసినేషన్ లో ఉంది అన్నారే ఆది, నీ గురించి" అని చెప్పింది.

ఆ విధంగా.... "సాక్ష్యాధారాలు, దృష్టాంత పూరిత సంఘటనలతో నిరూపించకుండా, ఈ విషయం చెబితే.... అందరూ మనల్ని పిచ్చి వాళ్లనటం ఖాయం" అన్నది మా బుర్రలకి ప్రాధమికంగా ఇంకించబడింది. అందుకే ఆ తర్వాత, అంటే 2005 లో, రామోజీరావు ప్రమేయం మాకు అర్ధమైనా.... మన్మోహన్ సింగ్ కీ, రాష్ట్రపతి వంటి వారికి ఫిర్యాదులు పంపటమే గానీ.... చుట్టుప్రక్కల వారితో గానీ, స్నేహితులతో గానీ పెదవి విప్పే వాళ్ళం కాదు. తొలిసారిగా చెప్పింది బ్లాగులోనే!

2007 లో మేము ఢిల్లీకి పంపిన ఫిర్యాదులు తనకు ఫార్వార్డ్ అయ్యాయనీ సిబిసిఐడి, ఐజీ కృష్ణరాజ్ ఫోన్ లో చెప్పాక, అదే చెబుతూ శ్రీశైలం సిఐ అందరి దగ్గరా [మాతో సహా] స్టేట్ మెంట్లు తీసుకున్నాడు. ఆ డ్రామా అనంతరం మా గది కేటాయింపు రద్దు చేశారు.

ఆ సందర్భంగా మా విద్యార్ధుల తల్లిదండ్రులు సమావేశమై ఉండగా, మరో విద్యార్ధి తండ్రీ పోలీసు కానిస్టేబులూ అయిన వ్యక్తి "మా సీఐ ఈ మేడంకి మెంటల్ అనీ, అందరితో తగాదా పెట్టుకుంటుందనీ వ్రాసి పైకి పంపాడు" అంటూ ఒకవైపు చేప్తూ, మరో వైపు "ఆ రామోజీరావుగాడు ఉండవల్లి క్రింద కుక్కలెక్కపడి ఉన్నాడు" అన్నాడు. అంతే! వ్రాతపూర్వకంగా ఏదీ చెప్పబడలేదు. "ఇంతకీ ఆ ఎంక్వయిరీ మీరు ఏం చేశారు?" అని నేను సిఐని అడిగినప్పుడు "It's going on" అన్నాడు.

ఇక రకరకాలుగా, బ్లాగులో వ్యాఖ్యలతో సహా.... "మీకు మెంటల్ అంటాం" అనే భయం మాకు సృష్టించాలని రామోజీరావు సర్కస్ ఫీట్లు చేయటం బాగానే నిరూపించబడింది, బడుతోంది. నిజానికి ఆ బెదిరింపుతో మమ్మల్ని బ్లాగులో గూఢచర్యం గురించి, రామోజీరావు గురించి వ్రాయకుండా నిరోధించాలన్నదే అతడి పెనుగులాట. మేము చెప్పబోయే, ఇంత వరకూ ఎవరికి తెలియని, అసాధారణ విషయాలను చెప్పకుండా మాకు బ్రేక్ వేయాలనే ప్రయత్నమే ఇది!

అయితే 1995 నాటికి మాత్రం.... సాక్ష్యాలేం లేకుండా, అవగాహనా లేకుండా, ’మా కష్టాలన్నిటికీ కారణం పీవీజీ’ అని అందరికీ చెప్పాలని ప్రయత్నించాము. ఇక అలాగే... అదే మనః స్థితిలో మరికొంత కాలం గడిపితే, నిజంగానే బ్రేక్ డౌన్ అవటం ఖాయం! లెనిన్ నన్ను ఎంతో సంభాళించే ప్రయత్నం చేసేవాడు.

ఈ స్థితిలో ఉండగా అందరూ ఆ గొడవ నుండి బయటికి రమ్మన్నారు. అందరూ చెప్పటంలోనూ ఒకే శృతి ఉన్నా.... అదే హాయిగా తోచి అన్నీ మరిచిపోయాము.

ఒక రకంగా చెప్పాలంటే - 1992 నుండి 1995 వరకూ, మేము అవునన్నా కాదన్నా.... కొట్టి మరీ పిల్లాడికి అక్షరాలు నేర్పినట్లు.... పీవీజీ మాకు గూఢచర్య అవగాహన నేర్పాడు. అదే సమయంలో మరో మానసిక విన్యాసం కూడా మా మీద ప్రయోగించాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

hello,
tella kaakulu chali dESaalalO unTaayi. meeru ee sOdi eppuDu aaputaaru?

My friend turned Foe turned friend : Chandrashekhar
Dr. Subramanian Swamy

http://www.janataparty.org/articledetail.asp?rowid=15

Sonia abandons Rajiv memory. Pour quoi? -- Dr. Swamy
30/03/2010 23:48:50 PRESS RELEASE

The rejection by the Division Bench of the Madras High Court of S.Nalini, convict in Rajiv Gandhi's assassination case of being set free is a vindication of the dictum that the Constitution is above all, even above dynasties. India is thus is a nation of laws and not ruled by any family and its firmans.

Although it was on my Writ Petition that Nalini has lost, it is more important to remember that it is the martyrdom of Rajiv Gandhi which has won today, despite his immediate family abandoning him on the bogus reason of 'humanitarian' concerns. Godse and Satwant Singh were not shown any such mercy.

But the nation has a right to ask Ms.Sonia Gandhi why she abandoned the memory of Rajiv Gandhi for some obscure reason? What was the hidden reason?
SUBRMANIAN SWAMY

http://www.sanghparivar.org/blog/rkm/dr-subramanian-swamys-historic-speech-at-ny-on-freedom-of-speech

Lecture on Rama Sethu by Dr. Subramanian Swamy at USA

http://video.google.com/videoplay?docid=-4058137705893248345#

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu