మరో ఆసక్తికర అంశం చెబుతాను.

1995 ద్వితీయార్ధం నాటికి మాకు పీవీజీ మీద పెద్దమోతాదులో వ్యతిరేక భావనలు ఉండేవి. మేం కాదన్నా మా వెంటబడి అవగాహన పేరుతో వేధిస్తున్నాడనుకొంటూ బాగా తిట్టుకున్నాము. ఇక అన్నీ మరిచిపోవాలనుకున్నాక, 2005 లో ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ గురించి మన్మోహన్ సింగ్, సోనియా, రాష్ట్రపతి APJ కలాంలకి ఫిర్యాదులు ఇచ్చాక కూడా, రాజకీయాల గురించి మేము ఎవరితోనూ ఏదీ చర్చించనందున.... ఈబ్లాగు తెరిచే వరకూ పీవీజీ పట్ల మా అభిప్రాయం ఏమిటో రామోజీరావు బృందానికి తెలియదు.

బ్లాగు తెరిచాకే తర తరాల తమ గూఢచర్యం గురించీ, రామోజీరావుకీ సోనియాకీ మధ్య గల గూఢచర్య కీలక అనుబంధం గురించీ, మాకు తెలుసని వాళ్ళకీ తెలిసింది. ఇలాంటివి ముందుగా తెలుసుకునేందుకే తమిళ కారన్ లనీ, ఖాసీం లనీ ప్రయోగించుకున్నది!

ఎందుకంటే - పీవీజీ, నెం.5 వర్గమూ మాకు ఏదో అవగాహన కలిగించారని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. పీవీజీ, నెం.5 వర్గమూ తమ out let గా మమ్మల్ని చూపెట్టారు కాబట్టి కూడా, రామోజీరావుకి సంబంధించి అది నిర్ధిష్ట ఘటన. [Definate Event]

2004 లో పీవీజీ మరణించే నాటికి భవిష్యత్తులో ఇలాంటి స్థితి వస్తుందని ఊహకైనా లేదయ్యె! మేమిదంతా గ్రహించగలమని గానీ, అసలు ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని పెట్టగలమని గానీ, మీదు మిక్కిలి అది దృష్టాంతపూరితంగా నిరూపితమౌతుందని గానీ, దేశంమీదా మానవత్వం మీదా అన్ని రంగాల్లో కుట్రలకు మూలాధారాలతో సహా తాము నిరూపింపబడతామని గానీ, కలలో కూడా అనుకోలేదు!

అందుకే.... పీవీజీ పార్థివ శరీరం మీద సైతం తమ అక్కసు తీర్చుకున్నారు. అలాంటి చోట, తమ అనువంశీయ గూఢచర్యంతో సహా మేము బ్లాగులో టపాలు ప్రచురించే కొద్దీ.... రకరకాల వాదనలు [ఈనాడు ద్వారా] తమ సంకేత భాషతో వినిపించారు. వాటికి జవాబులుగా మేమూ టపాలలో, టపాకాయలలో వ్రాసాము. ఇక రామోజీరావు, సోనియా బృందం వినిపించిన రకరకాల వాదనలలో.... రెండు రకాల వాదనలకు పునాదులు సమాంతరంగా వేసుకుంటూ పోయారు. ఒక వేళ పీవీజీ పట్ల అనుకూల భావనలు ఉంటే ఒక వాదన, వ్యతిరేక భావనలు ఉంటే మరొక వాదన!

ఒక వాదన - పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కుయినవాడే! నమ్మి అతణ్ణి ప్రధానమంత్రిని చేస్తే అతడు బాబ్రీ మసీదుని కూలగొట్టనిచ్చాడు. మిమ్మల్ని గుడిసెలో పెట్టి వేధించాడు. దేశానికీ కీడు చేసాడు. అందుకే అతడిని పార్టీ నుండి వెళ్ళగొట్టాను. పీవీజీ, చంద్రబాబూ, రామోజీరావు.... అంతా ఒకటే జట్టు! నా భర్తనీ, అత్తనీ, మరిదినీ కూడా చంపించిన రామోజీరావుతో పీవీజీ ఎప్పుడో జట్టు కట్టిన వాడే. పైకి అలా కనిపించేవాడు కాదు, అంతే! - ఇదీ సోనియా వాదన.

1996 తర్వాత, 1998 లో పీవీజీని పార్టీ నుండి వెళ్ళగొట్టేటప్పుడూ, 2004 లో ఆయన మరణించాక పార్దివ శరీరాన్ని సైతం అవమానించినప్పుడూ, తమ అరిషడ్వర్గాలను తీర్చుకుంటూ నిర్వహించిన సంఘటనలకి, తర్వాతి రోజులలో.... గతాన్ని మార్చలేరు గనక,... అవసరాన్ని బట్టి రకరకాల భాష్యాలు చెప్పారు. అలాంటి భాష్యాలలో ఇదీ ఒకటి.

పీవీజీ మీద మా అభిప్రాయం ఏమిటో తెలియక ముందు.... 1995 నాటి వ్యతిరేక భావనే ఉండి ఉంటుందనుకొని.... 2005, అక్టోబరులో మేము తొలిసారిగా, [1992 లో పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదుకు కొనసాగింపుగా] ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని మన్మోహన్ సింగ్ కి ఇచ్చాక..... 2006 సంవత్సరంలో ఇది మాకు చెప్పబడింది.

ఈ ఎరా లోనే సోనియా కుమారుడు రాహుల్ "తమ కుటుంబంలోని వారు 1992 డిసెంబరు నాటికి అధికారంలో ఉండి ఉంటే బాబ్రీమసీదు కూలి ఉండేది కాదనీ పునఃపునః ఉద్ఘాటించాడు. ఈ విధంగా.... ఈనాడు హెడ్డింగులతో, బాక్సు కట్టిన వార్తాంశాలతో నడిపిన సంకేత భాషలో సోనియా తరుపున ఈ వాదనంతా మాకు వినిపింపబడింది. ఆ విన్యాసాలన్నీ మాకు అర్ధం అయినా.... మా స్పందనని మేము బయటికి తెలియ నివ్వలేదు.

2007లో శ్రీశైలం నుండి నంద్యాలకి మకాం మార్చిన తరువాత.... ఒకరోజు, మా కుటుంబమిత్రుడు ఖాసీం "పీవీ నరసింహారావు నాకు నచ్చడు సార్! అతడు కావాలనే బాబ్రీ మసీదుని కూలగొట్టనిచ్చాడు" అన్నాడు. మా స్పందన కోసం అతడు ఆతృతగా వేచి ఉండటం, అతడి దేహ భాషతో మాకు అర్ధం అవుతూనే ఉంది. అప్పటికే అతడు మా సునిశిత పరిశీలనలో ఉన్నందున.... ఒక క్షణం మౌనంగా ఉండి, సంభాషణ మరో వైపుకి మళ్ళించాము.

[గమ్మత్తు ఏమిటంటే - అతడు గానీ, అతడి పిల్లలు గానీ రంజాన్, బక్రీదు లాంటి పండగలప్పుడు తప్ప ఇక ఏ రోజూ మసీదు కెళ్ళరు. అతడి భార్య అయితే దీపావళి లక్ష్మీపూజ దగ్గరి నుండి పేరంటాలన్నింటికి వెళ్తుంది. శ్రీశైలం అమ్మవారికి టెంకాయలు కూడా కొడుతుంది. మమ్మల్నయితే, హిందూ పండగలను వాళ్ళింట్లో చేసుకుందామని పిలిచేవారు. మేము నవ్వి ఊరుకునేవాళ్ళం.]

నేనూ మా వారూ విశ్లేషించుకునేటప్పుడు మాత్రం, ఈనాడు సంకేత భాషతో సహా.... అన్ని వార్తలనీ, సంఘటనలనీ సమీక్షించుకునే వాళ్ళం. మొత్తంగా, సోనియా ఈనాడు రామోజీరావుకి ఎంత విలువైన వ్యక్తో మాకు బాగా అర్దం అయింది. అంతే కాదు ఖాసీం కూడా వాళ్ళకి విలువైన వ్యక్తే! 2007 క్రిస్ మస్ రోజున మేం ఖాసీంతో స్నేహానికి కటాఫ్ చెప్పాము. తరువాత రెండు రోజులకి దానిని పక్కాగా నిర్ధారించాము.

ఆ తరువాత ఈనాడు రామోజీరావు, నెం.5 ముఖం పెట్టి, స్నేహాలు వదులుకోకూడదనీ, ఒక ’సారీ’, చిన్న చిన్న కానుకలతో చిరునవ్వులతో తెంచుకున్న స్నేహాలను పునరుద్దించుకోవాలనీ.... సూక్తులతో, వసుంధర శీర్షికలతో బుజ్జగించాడు.

"ఇలాగైతే మిమ్మల్ని జట్టులోంచి తొలిగిస్తాం. మాకు మీ కంటే కూడా వాళ్ళే [ఖాసీం కుటుంబం అన్నమాట] ముఖ్యం!" అంటూ హెడ్డింగులతో, బాక్సు వార్తాంశాలతో బెదిరించాడు కూడా. ’మాకు విధేయత తగ్గిందనీ, గురు ధిక్కారం చేస్తున్నాం’ అనీ గద్దించాడు.

మొత్తానికీ ప్రతిరోజు పేపర్ తో మంచి కామెడీ పంచేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా.... 2008 నవంబరు 2న మేము ’అమ్మఒడి’ బ్లాగు తెరిచాము. అప్పటికే తమిళ్ కారన్ లని ప్రయోగించి, మేము ఆంగ్లంలో వ్రాస్తున్న ’coup on epics' గురించి తెలుసుకున్నాడు. ఆ విన్యాసాల గురించి ముందటి టపాలలో వ్రాసాను.

2008, డిసెంబరు 20 - 22 లలో coups on world [cow] అనే ఆంగ్ల బ్లాగుని, అన్నీ టపాలూ ఒకేసారి ప్రచురించి, ఏకమొత్తంగా విడుదల చేసాము. మా ఆంగ్ల బ్లాగు cow లో పీవీజీ గురించి మా అభిప్రాయాన్ని, అనువంశీయ నకిలీ కణికుల ప్రపంచవ్యాప్త గూఢచర్యాన్ని, అందులో సోనియా కీలక భాగస్వామ్యాన్ని కూడా వివరంగా వ్రాసాము. వివిధ రంగాల మీద నకిలీ కణికుల కుట్రని వివరించాము. అమ్మఒడిలో రాజకీయ రంగం మీద నకిలీ కణికుల కుట్రని తెలుగులోకి అనువదించి ప్రచురిస్తూ పోయాము.

ఇక `ఇంత అవగాహన మాకు ఉందని' తెలిసాక, రామోజీరావు ఈనాడు సంకేత భాషలో తమ వాదనని మార్చేసాడు. అదీ సోనియా పేరిట! అంటే అతడి ఉద్దేశంలో నెం.5 వర్గం పేరిట అన్నమాట. ఎందుకంటే - పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కయి పోయాడంటే, ఇంత అవగాహన ఉన్న మేము ఎంతగా నవ్వుకొని ఉంటామో అర్ధమైంది కాబట్టి.

ఇదంతా తర్కించుకొనేటప్పుడు మేము "సరే! ఒకవేళ పీవీజీ కూడా రామోజీరావుతో కుమ్మక్కు అయి పోయాడే అనుకుందాం. అలాంటప్పుడు ఈ సోనియా, ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసునీ, రామోజీరావు గూఢచర్యాన్నీ ప్రకటించి, మరణించిన పీవీజీని ఎటూ శిక్షించలేదు కాబట్టి, బ్రతికున్న రామోజీరావుకి తగిన శిక్ష వేయవచ్చు కదా?" అనుకునే వాళ్ళం.

"మరి నళినిని గారాబం చేయటం, మనల్ని వేధించటం ఎందుకు? స్కూలును ఊడగొట్టటం ఎందుకు?" అనీ తర్కించుకునేవాళ్ళం. అదీగాక, 2005 అక్టోబరులో ఢిల్లీ వెళ్ళి తిరిగి వస్తూ పీవీజీ ’లోపలి మనిషి’ కొన్నాము. పూర్తిగా చదివాక, సత్యాసత్యాలని గ్రహించగల విశ్లేషణా శక్తి మాలో మరింత పదును తేలిందన వచ్చు.

ఇక రామోజీరావు సోనియా పేరిట చేసిన కొత్త వాదన ఏమిటంటే -
పీవీజీ రామోజీరావుతో కుమ్మక్కు అయిన వ్యక్తి అనే విషయం మీద గమ్మున ఉండి, కొత్తగా చెప్పిన వాదన ఇది - "పీవీజీనే ఇదంతా ప్రారంభించాడు. మీరిచ్చిన ఫిర్యాదు మీద పరిశోధన, గూఢచర్య పరమైన యుద్దమూ అన్నీ....! అలాగే ఆయన మీకు గూఢచర్య అవగాహన కలిగిస్తూ శిక్షణ ఇచ్చాడు కదా! దాన్నే మేమూ [అంటే సోనియా బృందం అన్నమాట.] కొనసాగిస్తున్నాం".

ఈ వాదనకి ప్రాతిపదికగా.... 2004 డిసెంబరులో పీవీజీ మరణించినప్పుడు.... ఆయన పోయే ముందు, ఈ పనినంతా విభజించి తన అనుచరులకీ, సహచరులకీ పంచాడనీ.... ఆ ప్రకారం మన్మోహన్ సింగ్ తో సహా 1992 నాటి పీవీజీ మంత్రి వర్గ సహచరులంతా ఎవరి పనివాళ్ళు చేస్తూ పోతున్నారనీ.... చెప్పబడింది. దీని గురించి గత టపాలలో కూడా వ్రాసాను.

శరీరం చచ్చుబడిన కుమారుడికి ’మెర్సీ కిల్లింగ్’ ని అనుమతించాల్సిందిగా కోర్టుకి అర్జీ పెట్టుకున్న ఓ తల్లి వార్తని ప్రముఖం చేస్తూ, ఈనాడు ఇదంతా చెప్పింది. తన కుమారుడి శరీర భాగాలను పంచటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ తల్లి అర్ధించింది. అప్పటికి [అంటే 2004 నాటికి] పీవీజీ పట్ల మా ప్రతికూల భావనలు మారాయో లేదో తెలియదు గనక, ముందు జాగ్రత్తగా.... పీవీజీ తన మరణానికి ముందు పని పంపకం చేసాడని ఈనాడు ద్వారా రామోజీరావు చెప్పాడు.

కీడెంచి మేలెంచమంటారు పెద్దలు. సాధారణ ప్రజలు దీన్ని ఎంత పట్టించుకుంటారో గానీ, గూఢచార ఏజంట్ మాత్రం ప్రతీ విషయంలోనూ దీన్ని గుర్తుంచుకోవాల్సిందే! అయితే ప్రపంచాన్నంతా చిటికెన వేలు మీద తిప్పుతున్నామను కున్న నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులు, గతంలో దీన్ని మరిచి పోయినా, 1992 తర్వాత క్రమంగా మళ్ళీ వంట పట్టించుకోవాల్సి వచ్చింది.

కొన్ని ముఖ్యమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ’కీడెంచి మేలెంచడాన్ని’ పాటించాడు. అదే పీవీజీ మరణించినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా.... ఇలా.... పీవీజీ తన మరణానికి ముందు ‘తనకు నమ్మకస్తులైన అనుచరులకి ఈ పనిని విభజించి అప్పగించాడు’ అనేందుకు తగినట్లుగా వార్తాంశాల్ని ప్రచురించుకోవటం!

అప్పుడే కాదు, ఇప్పటికీ రామోజీరావు ఇదే పద్దతి పాటిస్తాడు. ఈనాడు వ్రాతల్లో, హెడ్డింగులలో, వార్తాంశాలలో.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు ముఖంతో కొన్ని, నెం.5 వర్గం ముఖంతో కొన్ని, వ్రాస్తుంటాడు. నెం.10 వర్గం చెబుతోంది అనుకుంటే.... భయపడు, నెం.5 వర్గం చెబుతోంది అనుకుంటే.... ‘సోనియానే నెం.5 వర్గం’ అని భ్రమలో పడు - ఇదే మాకు చెప్పజూసేది.

ఈ విధంగా..... ‘పీవీజీ ప్రారంభించిన కోచింగ్ నే మేమూ కొనసాగిస్తూన్నాం’ - అంటూ, సోనియా ప్రతినిధిగా ఈనాడు రామోజీరావు ప్రజెంట్ చేసే వాదన ఇది.

ఇందులో ఉన్న లొసుగుల్ని గురించీ, గతంలో చెప్పిన వాదనల్ని గురించీ మాట్లాడకుండా.... ఈ కొత్త వాదనని పదే పదే అదే అనటం చేసారు, చేస్తున్నారు. పదే పదే అదే అదే అంటే - కొన్నిరోజులకైనా మనకు విసుగన్నా వస్తుంది లేదా మనమీద మనకే అనుమానం అన్నా వస్తుంది. ఒక వేళ మనమే పొరపాటు పడుతున్నామేమో అనుకోవాలన్నదే ఈ స్ట్రాటజీ!

ఇక.... ’ఇది జీవిత కాలపు కోచింగ్’ అన్నమాట. ఈ రకపు వాదనతో జీవితకాలం పాటు వేధించవచ్చు. తమ అరిషడ్వర్గాలు తీర్చుకోవచ్చు. తామేం చేసినా చెల్లిపోతుంది. సర్వరోగ నివారిణిలా అన్నిటికీ ఇదే సమాధానం! దాంతో అటెండర్లూ స్వీపర్లూ దగ్గరి నుండి సీఎంల దాకా మమ్మల్ని పైముఖంగా వేధించిన అందరూ మాకు కోచ్ లు అయిపోయారు.

3]. ఇక ఇప్పుడు.... ఓటమి స్ట్రాటజీ తో సహా, చాలా విషయాలు మేము బ్లాగులో వ్రాసాక....

తానూ [అంటే సోనియా] మాకు శిక్షణ ఇస్తూ, కొన్నిసార్లు పరిమితులు దాటేసిందట. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, ఆమె జట్టులో చేరిపోవటం లేదా ఆమెని మా జట్టులో కలుపుకోవటం చేయాలట. అంటే 'శుభం కార్డు' వెయ్యాలన్న మాట. "సోనియా, రామోజీరావు కుట్రలో కీలక భాగస్వామి కాదు. ఈ దేశానికి గొప్ప భక్తురాలు" అనాలన్న మాట. అందుకోసం బ్లాగు డిలీట్ చేసి, ఇంకా మాకు తెలిసిన విషయాలన్నీ ఆమెకు చెప్పాలన్న మాట - ఇదే ఈ వాదనల మాయ.

నిజంగా ఇన్ని రకరకాల వాదనలు ఎలాంటి వంటే - రామలక్ష్మణుల మీద ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్దంలాంటివి. అశోక వనంలోని సీతాదేవి దగ్గరికి, రాముడి ఖండిత శిరస్సుని, కృత్రిమంగా ఇంద్రజాల మాయతో సృష్టించి తెచ్చి, సీతమ్మని బెదిరించ, భ్రమపెట్ట చూసిన రావణుడి రాక్షస మాయ వంటిది. గూఢచర్య యుద్దమే మెదళ్ళతో యుద్దమైన చోట, మానసిక తంత్రాలే అస్త్రశస్త్రాలు.

కాబట్టే ’మీకు పిచ్చి’ అని, పదే పదే అంటూ.... టపాలు వ్రాయటానికి మాకు బెరకు పుట్టించాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ వ్యాఖ్యలు ఇచ్చే అజ్ఞాతల దగ్గర ‘నేను నీ బాస్ ని చెప్తున్నాను, నువ్వు అనుసరించు’ అన్నట్లు....అహంకారం, అసహనం, క్రోధం వంటి అరిషడ్వర్గాలన్ని కనిపిస్తుంటాయి.

ఇంత వాదనల మాయని ఎలా ప్రయోగిస్తాడో స్పష్టంగా అర్ధం కావటానికి ఏప్రియల్ ఈనాడు పేపర్లలో చూపిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=485278&Categoryid=1&subcatid=32

Amma:

here are 2 more links.

http://www.ndtv.com/news/world/us-denies-role-in-benazir-bhuttos-assassination-20577.php

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?CatId=485354&Categoryid=1&subCatId=32

అమ్మా! మీ బ్లాగు ని ఏదో ఒకానొక క్షణంలో మొదలుపెట్టి కడ దాకా చదివేసాను. నిజంగా మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే భయమేస్తోంది. అంతా విది వంచితం.
అంతే కానీ రామోజీరావు ఆల్లాంటి మనిషి కాడమ్మ, నేను గూడచారినీ కాదు ఎవడికీ నాకు సంబంధం లేదు.
ఇంకనైనా వదిలేయండమ్మ, ఎవరిని సాధించడానికి రాస్తున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు అనుభవిస్తారు. మనకెందుకు ఈ కష్టం ఇంక, గుంటూరు నుండీ, స్రీసైలం నుండీ, హైదరాబాదు నుండీ, నంద్యాల జీవితంలో చాలా చూసారు, ఇంక చాలు. ఇవన్నీ ఆపఏయంది. కంపుటర్ కొన్నిరోజులు ఆపేయండి, కొన్ని రోజులు మంచిగా ఒక ప్రసాంతమైన ప్రదేసానికి వెళ్ళిరండి. మీ ఆలోచనలని సృజనాత్మకతని గీథ మీద మీకున్న అవగాహనని మంచి విషయాలు రాయడానికి వుపయోగించండి. గీథమ్మ కూడా ఎదుగుతోంది కదా, తనకీ ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న మంచి విషయాలు తెలుసుకునే హక్కుంది కదా, తన జీవితాన్ని కూడా ఇలా బ్లాగులు రాస్తూ, ఎంద్కుమ్మా ఇది. ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలున్నాయి, కళ్ళు తెరిచిచూడండి. ప్లీజ్,

అజ్ఞాత గారు,చంద-మామ గారు: లింక్ లు పంపినందుకు కృతజ్ఞతలండి.

ఎవరండి ఈ LBS గారు, మీ ఉచిత సలహాలు మీ వద్దనే పెట్టుకోండి. మీరు ఇలా చెప్పిన ప్రతిసారి జవాబు ఇవిదంగానే ఉంటాది . ఓకే . వెళ్లి మీ రామోజీరావు గాడికిచెప్పండి.

LBS గారు: ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారనుకొని మీరే గమ్మునుంటే సరిపోతుంది కదా! ఇలా ఇతరుల పేర్లు ఉపయోగించి సలహాలివ్వడం ఎందుకండి?

అజ్ఞాత గారు: మీరిచ్చిన మద్దతుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu