రామోజీరావు ఈనాడు ద్వారా మాతో మాట్లాడే శతృమితృల భాష గురించి మరికొంత స్పష్టత ఇవ్వడానికి - ఈ భాషకి ఓనమాల దగ్గరి నుండీ చెబుతాను.

1992 లో పీవీజీకి ‘రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య’ గురించిన ఫిర్యాదు ఇచ్చాక, రేపో మాపో దీని గురించి ప్రకటింపబడుతుంది అని ఎదురు చూస్తూ గడిపాము. ఆరునెలలు [దాదాపు బాబ్రీ మసీదు కూలే వరకూ] ఎదురు చూసాము.

ఎవరినైనా దండించాలనుకున్నప్పుడు "నీ పెళ్ళి చేస్తాను చూడు" అనటం జనాంతిక వాక్యం. దాన్నే అనుకరిస్తూ చట్టాన్ని పెళ్ళికొడుకు గానూ, రామోజీరావు లాంటి సిఐఏ ఏజంట్లని [అప్పటికి మా అవగాహన అంతే!] పెళ్ళి కూతురు గానూ అభివర్ణిస్తూ "మా పెళ్ళి కొడుకుకి ఎంతో మంది పెళ్ళి కూతుళ్ళున్నారు మరి! ఏర్పాట్లు చేయాలంటే ఆ పాటి సమయం పట్టదూ" అన్నాను. దీన్ని నా డైరీలో వ్రాసాను. మా అమ్మ వాళ్ళతోనూ ఇదే సంభాషించాను!

అలాగే రామోజీరావు కుట్రలని [రాజీవ్ హత్యతో సహా] ప్రకటించటాన్ని తెర తీయటం, తెర లేపటంగా ఉటంకించే దాన్ని. ఇక పెళ్ళి, తెర అనే వాటి మీద రామోజీరావు భాషా విన్యాసాలు లెక్కకు మిక్కిలి. మచ్చుకు కొన్ని....


‘పెళ్ళి కళ’ అంటూ వసుంధరలో, సంపాదకీయాలలో హోరెత్తిస్తూంటాడు. మొదట్లో ఇలాంటి పదాలను ప్రత్యేకంగా, ఆకట్టుకునేట్లుగా, చూడగానే ఆకర్షించేలా బాక్సుల్లో వ్రాస్తూ..... ‘బాక్సులు ప్రత్యేకం’ అంటూ పదే పదే బాక్సుల్లో వ్రాసాడు. అప్పట్లో నేను పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదు సీల్డ్ కవర్ లో పెట్టి, పైన ’This is not my personal. This is very confidential matter. Others should not open this except P.M.' అని బాక్సు కట్టి వ్రాసాను. దాని గురించి తర్వాత PMRలో, Cover పైన అన్ని వివరాలు వ్రాయాల్సిన అవసరం లేదనీ 'For the P.M. eye only' అని వ్రాస్తే సరిపోతుందనీ చెప్పారు.

ఇదంతా డైరీలో వ్రాసుకున్నాను. ‘కవర్ పైన బాక్సుకట్టి మరీ వ్రాసాను’ అని ఇంట్లో వాళ్ళతో అనేదాన్ని. తర్వాత కాలంలో, అదే బాక్సుని రిఫర్ చేయటంతో సహజంగానే ఆ వార్తాంశాలు మా దృష్టిని ఆకర్షించాయి. క్రమంగా ఓ శృతీ లయా అర్ధమయ్యాయి. మా దగ్గర ఉన్న పరిస్థితులకి అతికే విధంగా, తాను చెప్పదలుచుకున్న దానిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి - ఒక సమయంలో వాణిజ్య ప్రకటనల కాప్షన్స్ రూపంలో, ఒక సమయంలో వార్తాంశాల హెడ్డింగుల రూపంలో చెబుతూ ఉంటాడు. ఒకోసారి పూర్తిగా.... వసుంధర, చదువు, సుఖీభవ.... ఇలా ప్రత్యేక పేజీలలోని అన్ని వార్తాంశాల శీర్షికలని కలుపుకు చదివితే అర్ధమైపోతుంది.

అక్షరాలు మొదట నేర్పించాక పిల్లలకి గుణింతాలు, వత్తులు నేర్పి, పదాలు వాక్యాలు నేర్పినట్లుగా! భాషని అలాగే కదా నేర్పుతాం? అభివృద్ది కూడా అలాగే చేస్తాం.

మరో పోలిక చెప్పాలంటే - మన వీధిలో ఎన్నో కార్లు వచ్చిపోతున్నా, మన కారు చప్పుడు మనం గుర్తుపడతాం. అన్ని మారుతీ లే అయినా, మన మారుతి చప్పుడు మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. అలాగన్న మాట. మా దగ్గర అప్పటికి నడుస్తున్న పరిస్థితులని బట్టి, ఆ చప్పుడు లోని ప్రత్యేకత అర్ధం అవుతుంది. దీన్నే గత టపాలలో - ‘పైన ఓ సున్నా క్రింద ఓ సున్నా ఉంటే, ఇతరులకి అవి విడివిడిగా ఉన్న రెండు సున్నాల లాగా కన్పిస్తాయి. రెండుసున్నాల మధ్య అతుకు[connection] కన్పించిన వాళ్ళకి, అవి రెండుసున్నాలు కాదు, ఎనిమిది అని అర్ధమౌతుంది’ అని వ్రాసాను.

మరో సినిమా పోలిక చెబుతాను. ’ఐతే’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ దుబాయ్ వెళ్ళటానికి ఎయిర్ పోర్టుకి వెళతాడు. అప్పటికే అతణ్ణి పట్టుకోవటానికి ఐబి అధికారులు వలపన్నీ, పొంచి ఉంటారు. ఎయిర్ పోర్టులొ కస్టమ్స్ ఉద్యోగి, ఇర్ఫాన్ ఖాన్ పాస్ పోర్ట్ తదితర అనుమతి పత్రాలను చెక్ చేసి తిరిగి ఇచ్చేస్తూ, ఒక్కక్షణం వాటిని గట్టిగా పట్టుకుని [వెనక్కి లాగినట్లుగా] మళ్ళీ ఇచ్చేస్తాడు. అంతే! ఇర్ఫాన్ ఖాన్ కి విషయం అర్ధమైపోతుంది. వెనుదిరిగి వెళ్ళిపోతాడు. [ఆ సందర్భంలో అధికారులకీ అతడి బృందానికీ మధ్య జరిగిన కాల్పుల్లో ఇర్ఫాన్ ఖాన్ తమ్ముడు చనిపోతాడు.]

ఈ విధమైన సంకేత భాషని అభివృద్ది చేసుకున్నప్పుడు - అది ఎవరి మధ్యనైనా భావ ప్రసారాన్ని నిర్వహిస్తుంది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ గతంలో తమ ఏజంట్ల మధ్య ఇలాంటి భాషనే నడిపేది. దాని వ్యాకరణ సూత్రాలు ఇతరులకి అర్ధం కాని జడపదార్ధంగా ఉండాలి. అర్ధం పర్ధం కాని వివాదాలుగానూ, మాట్లాడటం చేత కాదేమో ఫలానా వారికి అన్నంత రబ్బిష్ గానూ ఇతరులకి అన్పిస్తాయి కానీ, వాళ్ళల్లో వాళ్ళకవి చక్కగా సమాచారాన్ని అందిస్తాయి. [ఇప్పుడు కేసీఆర్, ఒకప్పుడు రాం జఠ్మలానీ, సుబ్రమణ్యం స్వామి వంటివారు ఇలాంటి వాటిని నిర్వహించేవాళ్ళు.]

అదే విధమైన భాషని మాతో, రామోజీరావు ఈనాడు ద్వారా, [1992 నుండి 1995 లో పీవీజీ నిర్వహించినట్లుగా] శతృమితృభాషగా నిర్వహించాడు, నిర్వహిస్తున్నాడు. మొదట్లో మాకు పెద్దగా అర్ధం కాలేదు. నిరంతర పరిశీలన, విశ్లేషణలతో తర్వాత్తర్వాత బాగానే అర్ధమయ్యాయి.

అదే ’పెళ్ళి కళ’, పెళ్ళికి సంబంధించిన మాటలు! చంద్రబాబు హయాంలో, మేం ఎంసెట్ ఫిర్యాదులు పెట్టిన తరువాత, వ్యవస్థీకృత నేరాల నిరోధానికి ఓ చట్టం తెచ్చారు. దాని short form ‘కోకా’ గా ఉటంకించారు. ఇక దాని పైన ఎన్ని భాషా విన్యాసాలు చేశారో! వై.యస్. ముఖ్యమంత్రి కాగానే మేము మా 7 వ తరగతి విద్యార్ధికి మార్కుల విషయంలో జరిగిన అన్యాయాన్ని గురించి ఫిర్యాదులో, ఎంసెట్ ఫిర్యాదు, ఆపైన వ్యవస్థీకృత వేధింపు గురించి వ్రాసాము. అప్పటి నుండీ వై.యస్. 7వ నెంబరుకు అలియాస్ అయ్యాడు. అది మేం సరిగా గుర్తించమేమో అని.... ధోనికీ, వై.యస్.కీ పుట్టిన రోజులు 7వ తేదీ, 7వ నెల కావడాన్ని అండర్ లైన్ చేసారు. మొదట అర్ధం గాకపోయినా 2005 తర్వాత అర్ధమయ్యింది.

ఇక ’కోకా’ చట్టాన్ని వై.యస్. ఎత్తేసాడు. మళ్ళీ ఇదిగో అదిగో అమల్లోకి తెస్తామన్నాడంటూ వార్తలూ ఈనాడు ప్రత్యేకంగా వ్రాసింది. అదే రోజుల్లో ఇక పెళ్ళి చీరలు [కోక అంటే చీర అనే అర్ధముంది] గురించి వసుంధర ప్రత్యేకాలు వస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో ఇదిగో పెళ్ళిళ్ళు సీజన్ వచ్చేసింది. అదిగో ఆ రోజు పెళ్ళి అంటూ వ్రాసింది. నిన్నటి రోజున [ఏప్రియల్ 11న] పెళ్ళి కళ అంటూ సంపాదకీయం వ్రాసినట్లుగా! నిజానికి ఒక పదానికి నానార్దాలు లేదా అలియాస్ లు ఎందుకంటే - ఆయా సీజన్ లలో వచ్చే ఆయా విషయాలని, పైకారణాల [over leaf reasons ] ద్వారా తాము మాట్లాడటానికి! అంటే పెళ్ళిళ్ళ సీజన్ లో పెళ్ళళ్ళ నెపంతో మాట్లాడవచ్చు. అలాగన్న మాట.

మొన్నీమధ్య ‘వరుడు’ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ ఈనాడు సినిమా పేజీలో ’వధువుని చూపించేది తెర మీదే’ అని హెడ్డింగ్ పెట్టి వ్రాసారు. అంటే ’తెర తీయబోతున్నాము [అంటే రామోజీరావు - రాజీవ్ హత్య కేసు డిక్లేర్ చేయబోతున్నాము]’ అని చెప్పటమన్న మాట.

ఇక ఈ నేపధ్యంలో ఓ సారి ఈనాడు లో, ’ఈ పెళ్ళికూతురికి 150 ఏళ్ళు’ అంటూ రైలు ఇంజన్ [బొగ్గింజన్] బొమ్మ వేసి వ్రాయబడింది. ఆ సందర్భానికి మిగిలిన అంశాలతోనూ, మిగిలిన వార్తల హెడ్డింగులతోనూ కలుపుకుంటే.... దేశం మీద కుట్రలు చేస్తున్న [పెళ్ళి కూతుళ్ళు] వయస్సు 100 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళు అని! అంటే చికాగో మత మహా సభ నాటి నుండి [100 ఏళ్ళుగా]కాదు సిఐఏ మన మీద కుట్రలు చేస్తోంది, అంతకు ముందు బ్రిటీషు కాలం నాటి నుండే అని! బ్రిటీషు కూడా అందులో భాగస్వామి అని చెప్పబడింది.

మరో స్పష్టమైన ఉదాహరణ చెబుతాను. 2006 లో[నాకు గుర్తుండి] ఓ రంజాన్ నాడు.... ఆ రోజు మధ్యాహ్నం మా కుటుంబమిత్రుడు ఖాసీం ఇంటికి పండుగ విందుకు వెళ్ళవలసి ఉంది. అదే రోజు ఈనాడులో ’ఈ రోజు సిఎం ఇంట్లో విందు’ అని హెడ్డింగుతో ఓ వార్త వ్రాయబడింది. అందులో సీఎం వై.యస్. ఇస్తోన్న విందు గురించి వ్రాయబడి ఉంది. ఆ రోజు ఉదయం, మా విద్యార్ధి ’దివాకర్ రెడ్డి’ అనే పిల్లవాడి తండ్రి రాజశేఖర్ రెడ్డి, మమ్మల్ని హఠాత్తుగా వాళ్ళింట్లో భోజనానికి పిలిచాడు.

మేం ఖాసీం ఇంట్లో విందు గురించి చెప్పినా.... బాగా వత్తిడి చేసి, ‘తన భార్య ఏదో పూజ చేసుకుందనీ, కొంతమందిని మాత్రమే భోజనానికి పిలిచామనీ, మాకు భోజనం పెట్టి గానీ ఉపవాసం విరమించదనీ, కాబట్టి తప్పకుండా రావాల్సిందేనని’ పట్టుబట్టాడు. మేం ఖాసీంకు ఫోన్ చేసి ‘మరోలా అనుకోవద్దనీ, రాత్రి భోజనానికి వస్తామనీ’ చెప్పి రాజశేఖర్ రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్ళాము. అక్కడ ఈనాడు మాకు కనబడేటట్లుగా కుర్చీమీద ‘ఈ రోజు సిఎం ఇంట్లో విందు’ ఉన్నపేజీ పైన ఉండేటట్లు మడత పెట్టి ఉంది. రాత్రికి ఖాసీం ఇంట్లో భోజనం చేసి అర్ధరాత్రి ఇల్లు చేరాము. పేపరు మాకు బాగానే ఫిట్ అయ్యింది. ఈ రోజు నుండీ ముఖ్యమంత్రి వై.యస్.కీ, ఈ విద్యార్ధి తండ్రిని అలియాస్ అనుకోవాలన్న మాట.

2007 లో మాకు గది కేటాయింపు రద్దు అయ్యాక కూడా, ఊళ్ళో ఇంకెవ్వరూ మాకు ఇల్లు ఇప్పించే పనిలో సాయం చేయలేదు. కానీ ఈ రాజశేఖర్ రెడ్డి, సత్రాల్లో శ్రీశైలంలోని రెవిన్యూభూమిలో గల శ్రీగిరి కాలనీలో మా స్కూలుకు, ఇంటికి వసతి వెదికేందుకు కష్టపడ్డాడు. ఆ కృతజ్ఞతతో మేము అతడి పిల్ల వాణ్ణి నంద్యాలలోని మా ఇంట్లో అట్టిపెట్టుకుని సంవత్సరం పాటు చదువు చెప్పాము. [అందులోనూ మాకు Dis advantage వచ్చిందనుకొండి, అది వేరే విషయం.]

అప్పట్లోనే శ్రీశైలం ఎంఎల్ ఏ ఏరాసు ప్రతాప్ రెడ్డి గురించి "ఇతడు సీఎం అంతటి వాడండి. సీఎం రాజశేఖర్ రెడ్డి = ఏరాసు ప్రతాప్ రెడ్డి! సీఎం కీ ఏరాసు కీ తేడానే లేదు" అంటూ మాకు ఊదర పెట్టబడింది. అతడు మరో అలియాస్ అన్నమాట. "మా ఫిర్యాదుల్లో సీఎం నే claim చేసాము. ఇక ఇప్పుడు ఎం.ఎల్.ఏ.ని approach అయి ఏమడుగుతాం లెండి వదిలెయ్యండి" అన్నా, ఏరాసుని కలిసే వరకూ మా విద్యార్ధి తండ్రి రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలంలోని అతడి మిత్రుడూ ఊరుకోలేదు.

"సరే! మరో 1500 రూపాయలు దండుగ. కానీయ్!" అనుకొని, ఆత్మకూరు వెళ్ళి అతణ్ణి కలిసాము. అదీ మేము గది ఖాళీ చేయటానికి ఉన్న గడువు [మే 8] కి నాలుగైదు రోజుల ముందర. మేము సిద్దపడిన తర్వాత సాగదీయబడి ఆ రోజు కి ముడిపడింది. తర్వాతి రోజు AICC కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నుండి మాకు లేఖ అందింది. శ్రీశైలం వచ్చిన ఏరాసు ప్రతాప్ రెడ్డికి దాన్ని చూపించాము. ఆ రోజు [మే 6 న], శ్రీశైలం ఈవో తో మీటింగ్ కెళ్తున్నానని అప్పుడు మాట్లాడతానని చెప్పాడు.

తర్వాత ఏమయ్యిందో తెలియదు గానీ, విపరీతమైన జ్వరంతో ఏరాసు ప్రతాప రెడ్డి ఇంటికెళ్ళి పోయాడని చెప్పారు. ఆ జ్వరం అతడిని నెలరోజుల పాటు అపోలో ఆసుపత్రి పాలు చేసిందనీ విన్నాను. మా ఇంట్లో మేం జోకులూ వేసుకున్నాము. "అంత భయంకరమైన విషయం ఈవో ఏం చెప్పాడబ్బా ఏరాసు అంత దడుచుకోవటానికి" అని. అదంతా గత టపాలలో వ్రాసాము.

ఇందులో మమ్మల్ని అర్ధం చేసుకొమ్మన్నది ఏమంటే - మా గది నిలబెట్టటానికి వై.యస్, సోనియా తెగ కష్టపడుతున్నారనీ, పాపం రామోజీరావు శక్తి ముందు నిలబడ లేక పోతున్నారనీ, కాబట్టి మేం వాళ్ళని నెగిటివ్ గా అనుకోవద్దని!

ఈ విధమైన వ్యక్తుల అలియాస్ లు ఎలాగంటే -

"రెండు బోర్డుల చదరంగం ఆటలో A Vs C & C Vs B బోర్డులు ఎప్పుడు చూసినా Identicalగా ఉంటాయి కదా! అంటే పెద్దపరిమాణం [దేశపు స్థానంలో] ఎలా ఉంటే, చిన్నపరిమాణం [మా చుట్టూ] అలాగే ఉంటుంది. కాబట్టి, దేశ నాయకులు ఫలానా వారికి, మీ చుట్టుప్రక్కల ఉన్న ఫలానా వ్యక్తి అలియాస్ అనుకో. [ఈ విషయమై - "వీలు కుదిరితే ప్రక్కింటి వ్యక్తిని ప్రధానమంత్రి అనుకొని, ఇరుగింటామెని సోనియా అనుకొని, వాళ్ళు మీ జట్టే అనుకొని మీకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పెయ్ అనగలరు" అనుకొని మేము జోకులు వేసుకుంటూ ఉంటాము.]

వాళ్ళేం చేసినా మీకు అవగాహన కలిగిస్తున్నారనుకో. అనుకొని ఆ వేధింపునంతా భరించు. ఫిర్యాదు చేయకు. [పీవీజీ హయంలో, 1992 నుండి 1995 వరకూ అయితే, ఏం జరిగినా ఎవరి మీదా పిర్యాదు ఇవ్వలేదు. ఇప్పుడైతే ఫిర్యాదులు ఇస్తావేమిటి? నువ్వు తప్పు చేస్తున్నావ్!" ఇదే పదేపదే మాకు చెప్పబడిన డైలాగ్! 2000 లలో ఎంసెట్ ఫిర్యాదు నాటి నుండీ, 2007 లో మున్నా సినిమా దాకా! ఎన్నో సినిమాలలో ఇదే డైలాగ్ ప్రత్యేకంగా పలకబడటం జరిగింది.]

ఈ విధంగా.... ఈ వేధింపు నంతటినీ మాకు పీవీజీ కలిగించిన అవగాహనకి కొనసాగింపు అనుకుంటే - ఇక మేం ఫిర్యాదులు పెట్టేది లేదు. తమకు ఇబ్బందులూ ఉండవు. మేం బ్రేక్ అవ్వకపోతే, జీవిత కాలం పాటు ఇది ‘అవగాహనా కార్యక్రమం’ గా ఎంచక్కా నడిచిపోతుంది. ఈ వంకన ఎంచక్కా తమ కసి తీర్చుకోవచ్చు. తమ అరిషడ్వర్గాలు తీర్చుకోవటానికి ఇది చాలా చక్కగా పనికి వచ్చే వ్యూహం అనుకున్నారు.

ఈ విధంగా.... సోనియా, పీవీజీ స్థానంలోకి వచ్చి, మాకు ’కోచ్’ అవతారం ఎత్తిందన్న మాట. లగాన్ లో అరగొర వనరులతో బ్రిటిన్ జట్టుపై క్రికెట్ గెలిచిన అమీర్ ఖాన్ జట్టుకి, ఓ విదేశీ వనిత శిక్షణ ఇస్తూ, సాయంగా నిలబడీ గెలిపిస్తుంది చూడండి. అలాగన్న మాట! ఈ నేపధ్యంలో - ఓ వైపు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు, మాకు ఈ కాకమ్మ కథలు చెప్పుతుండగా.... మరో వైపు ’భారత క్రికెట్, హాకీ జట్టుకు విదేశీ కోచ్ అవసరమా? కాదా?’ అన్న విషయం సంచలనాంశమై నడిచింది.

గమ్మత్తేమిటంటే - అప్పటికి మాకు అసలు ఏదీ పట్టనందున అందరిలాగే మేమూ విదేశీ కోచ్ వివాదాన్ని ఓ వార్తగా చదివాము! 2005 తర్వాత పునఃసమీక్షతోనే, దాని వెనక నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులకీ, నెం.5 వర్గానికీ, మధ్య సంభాషణ ఆ రూపంలోనూ జరిగిందన్న విషయం మాకు అర్ధం కాలేదు. పీవీజీ హయాంలో నాటి రక్షణమంత్రి శరద్ పవార్ ను రామోజీరావుకు అనుకూలుడిగా నా డైరీలో వ్రాసుకున్నాను. అతడు 1998లో సోనియాని విదేశీ వ్యక్తి అని వ్యతిరేకించి కాంగ్రెస్ నుండి చీలిపోయి ఎన్.సి.పి. పార్టీ పెట్టుకున్నాడు. ఆ విధంగా కూడా సోనియా నిజాయితీని under line చేసారన్న మాట.

రామోజీరావు అనుకూలుడు సోనియాని వ్యతిరేకించటం అంటే సోనియా రామోజీరావుకి వ్యతిరేకం అనుకోవాలి కదా! సదరు శరద్ పవార్, ఏ విదేశీ వ్యక్తిని వ్యతిరేకిస్తూ స్వంత పార్టీ పెట్టుకున్నాడో అదే విదేశీ వ్యక్తితో పొత్తుపెట్టుకోవటం, తర్వాతి రోజుల్లో నడిచిన ’రాజకీయ నాటకాల బహిర్గతం!’

అదే కాదు, ఈ ఇటలీ సోనియాని మేం విదేశీయత కారణంగా అంగీకరించటం లేదనీ, ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయిపోయిన రోజుల్లో మాది సంకుచిత జాతీయవాదమనీ కూడా చెప్పజూసారు. దాని మీద మేం టపాకాయలూ పేల్చాము, టపాలలోనూ వ్రాసాము. తరువాత నుండి - జాతివైరం మరిచి జంతువులే, మరో జాతి జంతువుల కూనలకి పాలు ఇస్తూ, సాకుతూ ఉంటే [కోతులు కుక్క పిల్లలకూ, కుక్కలు పందిపిల్లలకూ, మేకలు కుక్కలకూ, కుక్కలు పిల్లులకూ... ఇలా కర్నూలు సిటి ఎడిషన్ లో], మేము మాత్రం విదేశీయత కారణంగా, ప్రపంచమంతా ప్రభావశీలిగా మెచ్చుకున్న సోనియాని, మాతృసమానురాలిగా ఒప్పుకోవటం లేదని, అది తప్పనీ చెప్పబడుతుంది.

అసలు ఆ ఇటలీ మహాతల్లికి కన్నబిడ్డల మీదా మమకారం లేదు, కట్టుకున్న వాడి మీదా మమకారంలేదు. కట్టుకున్న వాణ్ణి చంపిన కుట్రలో భాగస్వామి అయిన నళినికి క్షమాభిక్ష పెట్టే విశాల హృదయం! ఆ కుట్రదారుల మీద ఫిర్యాదు ఇచ్చినందుకు మమ్మల్ని వేధించిన అతి విశాల హృదయం కూడా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu