ఫిబ్రవరి 4 న ప్రారంభించిన ఈ టపాల మాలిక ’ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?’ లో 300 తో మొదలు పెట్టి, వరుసగా సినిమాల ద్వారా నడిచిన గూఢచార పరిభాష గురించి టపాలు ప్రచురిస్తూ వచ్చాము. ఆ క్రమంలో ‘రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుని వేరెవరూ ప్రకటించేది లేదనీ, స్వయంగా రామోజీరావే ప్రకటించికోక తప్పదనీ, అదే అతడి ఆత్మహత్య సదృశ్యమనీ వ్రాసాను.

ఇది, అతడికి నెం.5 వర్గం చేత దాదాపు మూడేళ్ళ క్రితమే చెప్పబడింది. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా మా యుద్దం ముగిసిందో, 2007 జూలై నాటికే చెప్పబడింది. అయితే రామోజీరావు మాత్రం, అతడి ఈనాడు ద్వారా.... ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుని సోనియా ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆమె నెం.5 వర్గానికి చెందిన వ్యక్తి.

[అసలు 5 మరియు10 నెంబర్ల విషయాల్లో మీరు పొరపాటుపడుతున్నారు - అని చాలాసార్లు మాకు చెప్పజూసాడు లెండి. అమరావతి వంటి సైకో సినిమాలో హీరోయిన్ కి అన్నివస్తువులూ 10 కావాలన్న మోజు ఉంటుంది. ఆమె భర్త ఆమెని నీకీ పది పిచ్చేమిటే? అంటాడు. అలా... పెద్దగా ఫోకస్ కాని అంశాల నుండి కూడా మాకు under line చేయబడి మరీ చెప్పబడుతుంది. హాయ్ బుజ్జీల్లోనూ, బాల వినోదాల్లోనూ ‘5 తేడాలు’ గుర్తించండి లాగా!]

ఇక సోనియా నెం.5 వర్గపు వ్యక్తి కాబట్టి ఆమె ఈ కేసుని ప్రకటించాలంటే, దానికంటే ముందుగా మీతో సమన్వయం కావాలి. అందుచేత ముందుగా మీరు వెళ్ళి, ఆమెని కలిసి, మీకు తెలిసిన, మీకు అవగాహన ఉన్న విషయాలన్నీ చెప్పండి’ - ఈనాడు ద్వారా రామోజీరావు ఇది మాకు చెబుతూనే ఉన్నాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ కేసులో సోనియాని రామోజీరావుకు సహకుట్రదారుగా కాకుండా, అతడి వ్యతిరేకిగా, దేశభక్తురాలిగా అంగీకరించాలన్న ఒత్తిడి మా మీద ముమ్మరంగా చేసాడు, చేస్తూనే ఉన్నాడు. ఆ విషయంలో మేము భ్రాంతి పడుతున్నామని, మా చేత మమ్మల్నే నమ్మించే ప్రయత్నంలో ఎంత మాయాయుద్దం నడిపాడంటే - మా బ్లాగులో ఇటీవల "మీ దగ్గరున్నవి ఆధారాలు మాత్రమే. సాక్ష్యాలు కాదు" - అంటూ అందుకే ఇలా సాగుడు నడుస్తుందేమో ఆలోచించమని, ఓ అజ్ఞాత వ్యాఖ్య వ్రాసినట్లుగా.... దాన్నే ఈనాడు రకరకాలుగా చెబుతుందన్న మాట.

రెండు రోజుల క్రితం హాయ్ బుజ్జీలో ’కాకి - హంస’ కథ వ్రాస్తూ, కాకి హంసను ఛాలెంజ్ చేయటం, తర్వాత కాకి మబ్బుల్లోకి ఎగిరి చివరికి ఎగరలేక హంసను రక్షించమని కోరటం వ్రాసాడు. అనువర్తన ఏమిటంటే - ‘నువ్వు హంస లాంటి సోనియాని ఛాలెంజ్ చేస్తున్నావు. చివరికి ఎగర లేక, నువ్వే కాకిలా రక్షించమని, హంస లాంటి సోనియాని కోరతావు’ అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు.

ఈనాడు ప్రచురించిన మరో కథ: ఓ రాజుకి సత్యాన్ని చూపించటానికి, విదూషకుడు ఇలా చేస్తాడు. రాజుగారి కంకణాన్ని తీసుకొని, మొదట సభలోని ఓ బంట్రోతుని పిలిచి, ఫలానా శెట్టి దుకాణానికి వెళ్ళి ’దీన్ని ఎంత ధరకు కొంటాడో’ అడిగి రమ్మంటాడు. బంట్రోతు వెళ్ళి, తిరిగి వచ్చి 20వరహాలని చెబుతాడు. ఈ సారి కోశాధికారిని పంపిస్తాడు. అతడొచ్చి 50 వరహాలని చెబుతాడు. ఈ సారి దాన్ని సభలోని ఓ సామాన్య పౌరుడికిచ్చి పంపుతాడు.శెట్టి సామాన్యుడి చేతిలోని నగని లాక్కుని 10 వరహాలు చేతిలో పెట్టి పొమ్మంటాడు. ఇంకా గట్టిగా అడిగితే అసలు దొంగ సరుకు తెచ్చావనగలను అని, భటులని పిలవగలనని కసురు కుంటాడు. సామాన్యుడు వచ్చి అదే చెబుతాడు.

విదూషకుడు "చూశారా మహారాజా! ఒకే వస్తువు, ఒకే వ్యాపారి దగ్గర, అమ్మజూపిన వారిని బట్టి వేర్వేరు ధరలు పలికింది. ఏపనైనా చేసే వారిని బట్టి కూడా దాని విలువ ఉంటుంది" అంటాడు.

ఈ కథలోని అనువర్తన ఏమిటంటే - ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుని నీలాంటి సామాన్యులు బ్లాగ్లోకంలో చెబితే విలువ ఉండదు. ఎవరూ పట్టించుకోరు. అదే సోనియా స్థాయిలో చెబితే అంతర్జాతీయంగా అందరూ పట్టించుకుంటారు. అప్పుడు దానికి విలువ ఉంటుంది. కాబట్టి కేసు ప్రకటన కోసం సోనియాని ఆశ్రయించు. ఆమె మీ జట్టులోని వ్యక్తే!

ఆ విధంగా.... మా చేత ఆ అసత్యాన్ని నమ్మించగలిగితే... ప్రస్తుతానికి సోనియా, రామోజీరావుని కుట్రదారుడిగా ప్రకటిస్తుంది. ఈ కేసులో గూఢచర్యపరంగా సజీవంగా, సురక్షితంగా ఉంటుంది. తాత్కాలికంగా రామోజీరావు నిర్వీర్యుడౌతాడు. ఆ తర్వాత మెల్లిగా కేసుని నీరుగారుస్తుంది. గూఢచర్యపట్టు తిరిగి దక్కించుకోగలిగితే, మళ్ళీ పరిస్థితులన్నిటినీ తమకు అనుకూలంగా మార్చుకోవటం తేలికే! ఆ తర్వాత మామూలుగా రామోజీరావు తాలూకూ గూఢచర్యం పుంజుకుంటుంది. వీలైతే అసలు రామోజీరావుని కుట్రదారుడిగా ప్రకటించకుండానే గూఢచర్యబలం పుంజుకోవచ్చు. అందుకే ఈ సర్కస్ ఫీట్లన్నీ.

ఇందుకోసమే.... డిసెంబరు 9, 2009 న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ ప్రకటన అర్ధరాత్రి జారీ చేసింది కూడా! ’తెలంగాణా’.... తెలంగాణా నుండి ప్రధానమంత్రి అయిన పీవీజీకి సంబంధించిన వ్యవహారానికి అలియాస్ మరి! దీని గురించిన పూర్వాపరాలను మరో టపాలో వ్రాస్తాడు. ఇప్పటికి సోనియా అలియాస్ సానియా వ్యవహారం వివరిస్తాను.

రామోజీరావు, ఒక్క అక్షరాన్ని స్థాన భ్రంశం చెందించి సానియాని సోనియాకి అలియాస్ చేసినందునా, మీర్జా కుటుంబానికి చెందినందునా, కొరియర్ షిష్ లతో గూఢచార ఏజన్సీలకి లాబీయింగ్ కు సహాయ, సహకారాలు అందించినందునా, ఈ హైదరాబాద్ అమ్మాయి చాలా ప్రయోజనాలే పొందింది. ఆడినా ఆడక పోయినా, చివరికి ఓడిఫోయినా, ఆమె ఆటతీరుతోనూ, శ్రమతోనూ సంబంధం లేకుండా పైకి పాకిన రేటింగ్, అపరిమితమైన ఇమేజ్, మీడియా కవరేజ్.... టెన్నిస్ సంచలనం, టెన్నిస్ స్టార్ వంటి మీడియా ఇచ్చిన బిరుదులే కాక, ప్రభుత్వం ఇచ్చిన ఇనాములు, భూములు, పద్మశ్రీ ఇత్యాది బహుమతులూ దక్కాయి.

ఇటలీలో స్కూలు ఫైనలు దాటని సోనియాకి పోటీలు పడి డాక్టరేట్లు అందించిన విశ్వవిద్యాలయాలు, అదే బాటలో సానియాకూ డాక్టరేట్ ఇచ్చేసాయి. క్రీడాకారిణిగా కంటే ప్రచారకర్తగా ఈ అమ్మాయికి ఆదాయం మెండుగా దక్కింది. జీవీకే సంస్థల వంటివి ఉదారంగా సానియాకి ప్రాయోజితదారులయ్యాయి. హైదరాబాదు నుండి పాకిస్తాన్ కి ఉన్న లింకులు వయా దుబాయ్ ఉండటం ఇప్పుడు బయటపడింది. ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు పొందిన సానియా కథ, అనేక మలుపులతో, వివాదాలతో ముడిపడి, చివరికి ఆమె నిశ్చితార్ధం, ఆమె భర్త వివాహం కూడా సంచలనాలూ, వివాదాలూ అయ్యాయి.

కొన్ని నెలల క్రితం... ముందుగా హైదరాబాద్ యువకుడూ, చిన్ననాటి స్నేహితుడిగా చెప్పబడిన సోహ్రబ్ అనే వ్యక్తితో ఈమె చేసుకున్న నిశ్చితార్ధం రద్దు చేసుకోబడింది. ఆపైన భారత దేశానికి శతృ దేశమూ, అమాయకుల మీద బాంబుదాడులూ ఉగ్రవాదమూ నడిపే దేశమూ అయిన పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని, క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ ని వివాహ మాడనున్నట్లు ఈమె ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన నాలుగురోజులకే సదరు వరుడు ఆమె ఇంట ప్రత్యక్షమయ్యాడు. అతడి మొదటి భార్య ఆయేషాతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకే అతడు అంత ముందుగా హైదరాబాదు వచ్చాడని వార్తలొచ్చాయి.

దాన్నే ధృవపరుస్తూ, మహిళా క్రికెటర్ల మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని నేరారోపణలు ఎదుర్కొంటున్న చాముండేశ్వరీ నాధ్, సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జాతో సంప్రదింపులు చేస్తూ, కలిసి కారులో అక్కడికీ ఇక్కడికీ పోతూ వార్తల్లో దర్శనమిచ్చాడు. ఆ రాజీ యత్నాలన్నీ విఫలమయ్యాయి. వివాదం రోజుకో మలుపు తిరిగింది.

షోయబ్.... "అసలు అయేషా ఎవరు? ఆ అమ్మాయితో నాకసలు వివాహమే కాలేదు, విడాకులా? నిఖానామా మీద సంతకం నాదేనని నిరూపించండి చూద్దాం. నాకు మహా ఆపా మాత్రమే తెలుసు, అయినా ఎవరైనా అక్కకు తలాక్ చెబుతారా?" అన్నాడు. అసలు వాళ్ళదగ్గరున్న ఆధారాలు ఏమిటో బయటపెట్టమన్నాడు. ఆ విధంగా ఎదుటి వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాధారాలేమిటో తెలుసుకోవాలన్న తహతహ కనబరిచాడు. అసలు ఆమెని బయటకు రమ్మని సవాల్ విసిరాడు.

అటు సిద్దిఖీ కుటుంబం కూడా - తమ దగ్గరున్న సాక్ష్యాలేవీ ఒకేసారి బయటపెట్టలేదు. స్టెప్ బై స్టెప్ అన్నట్లుగా షోయబ్ మాలిక్ ని ఒక్కోమాటా కమిట్ కానిచ్చి, దానికి సంబంధించిన సాక్ష్యాన్ని బయటపడుతూ వచ్చారు. గమనించి చూస్తే.... ఆచితూచి ఆడబడిన గూఢచర్యపు విన్యాసం కనబడుతుంది.

సిద్దిఖీ కుటుంబంతో పోలిస్తే.... సానియా కుటుంబం, షోయబ్ కుటుంబాలకి ఉన్న నేపధ్యమూ, లాబీయింగూ బలమైనవి. అటువంటి చోట సిద్దిఖీ కుటుంబం దగ్గరున్న సాక్ష్యాలేమిటో.... పోలీసుల విచారణ నెపంతోనో, లాయర్లని లోబర్చుకునో, వాళ్ళ స్నేహితులకు ఎర వేసో, సులభంగానే తెలుసుకోగలరు. అయితే ఇప్పుడు అవేవీ సాధ్యం కాలేదు.

తరచి చూస్తే.... సానియా, షోయబ్ లను వ్యూహాత్మకంగా దెబ్బతీసే విధంగానే, సిద్దిఖీ కుటుంబమూ, షోయబ్ సవతి తమ్ముడి సాక్ష్యమూ నడిపించబడ్డాయి. అంటే సానియా, షోయబ్ లకు వెనకనున్న గూఢచార ఏజన్సీకి ప్రత్యర్ధి ఏజన్సీ ఒకటి [జాతర బొమ్మ - జంట పీత వంటిది] సిద్దిఖీ కుటుంబం వెనక పనిచేసింది.

’ఏమిటిది? అమ్మఒడి అందరి జీవితాలలోనూ గూఢచర్యాన్ని చూస్తోంది, లేదా చొప్పింస్తోందీ’ అనుకుంటారేమో! అందరి జీవితాలలో గూఢచర్యం ఇంత మోతాదులో ఉండదు గానీ, స్వయంకృషితో కాకుండా.... అడ్డదారిలో సెలబ్రిటీ అయిపోయేందుకు, గూఢచార ఏజన్సీలకు సహాయ పడటానికి ముందుకొచ్చి, అందులో చిక్కుకుపోయిన వ్యక్తుల జీవితాలు, చివరకు ఆ సుడిగుండంలోనే ఉండిపోతాయి. దుబాయ్, సౌదీలతో లింకులున్న సానియా, సిద్దిఖీ వంటి హైదరాబాదీ కుటుంబాలు, షోయబ్ ల వంటి పాకిస్తానీ కుటుంబాలు ఆ సుడిగుండంలోనివే!

ఇలాంటి వారికి నడిచినంతకాలం advantage నడుస్తుంది. నడవనప్పుడు Disadvantage నడుస్తుంది. అంతే!
ఇక వీరి వివాహ ప్రకరణంలోని వివిధ మలుపులు.....

దినపత్రికలలో వచ్చిన, తేదీల ప్రకారం వివరాలు:

30 మార్చి, 2010:
>>> ‘పదిరోజుల ముందు షోయబ్ తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి సానియా కుటుంబంతో నిశ్చితార్దం పెట్టుకుని వచ్చిందని’ జియో ఛానెల్ తెలిపింది.

04 ఏప్రియల్, 2010:
>>>తాజ్ రెసిడెన్సీ [హాలీడే ఇన్]లో తామిద్దరం రెండుసార్లు కలిసి ఉన్నామని, ఇందుకు తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయేషా తెలిపింది. ‘మేమిద్దరం హోటల్ లో ఒకేగదిలో కలిసి ఉన్నాం. దీన్ని నేను రుజువు చేస్తా’నన్నది. ఇద్దరు హోటల్ సిబ్బంది మాకు అల్పాహారంతో సహా సేవలు అందించారు అంటూ సిబ్బంది పేర్లు చెప్పటానికి నిరాకరించింది. ఇందుకు సాక్ష్యాధారాలున్నాయని చెప్పింది.

>>>షోయబ్ తండ్రి ఉన్నంతకాలం తననేమనేవాడు కాదని, తన మామ చనిపోగానే షోయబ్ మారిపోయాడని, తను లావుగా ఉన్నానని తనను వేధించటం ప్రారంభించాడని జియో ఛానెల్ కి తెలిపింది.

శుక్రవారం రాత్రి[02, మార్చి] షోయబ్ హైదరాబాద్ వచ్చాడు. శనివారం విలేఖరులకి తెలిసింది.

>>>నిజమేంటో నాకు, నా తల్లిదండ్రులకు తెలుసు. ప్రస్తుత సంఘటనలు చూసి నవ్వుకోవటం తప్ప చేయడానికేమి లేదు - అంటూ ట్విట్టర్ లో సానియా చెప్పింది.
అయేషా, మహా అనే స్నేహితురాలితో కలిసి షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళింది. అందగత్తె అయిన మహాను చూసి షోయబ్ మనసు పారేసుకున్నాడు.
మహా సౌదీలో టీచరని, పెళ్ళయిందని, ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని, ఆమె ఫోటోలు బయటపడితే ఆమె అల్లరిపాలవుతుందని షోయబ్ చెప్పాడు.

అదే రోజు, సౌదీలోని వర్గాలు చెప్పాయంటూ ఆంధ్రజ్యోతి పత్రిక వ్రాసిన వివరాలు:
>>>పెళ్ళి హైదరాబాద్ ఖాజీ చేయాలి గాని పాకిస్తాన్ ఖాజీ చేయటం ఏమిటని?
>>>వరుడు ఇచ్చే ‘మెహర్’ లక్షల్లో ఉంటుంది. అలాంటిది 500 పాకిస్తాన్ రూపాయలకు అంగీకరించడం ఏమిటి?
>>>పాక్, భారత్ జాతీయుల మధ్య వివాహాలు జరిగితే వధూవరుల్లో ఎవరో ఒకరు తమ దేశ రాయభార కార్యాలయాల్లో దాన్ని నమోదు చేసుకోవాలి. పాస్ పోర్టులో నమోదు చేస్తారు. [ఆ వివరాలు పత్రిక వ్రాయలేదు.]
>>> 7 సంవత్సరాలలో ఎక్కడా అయేషా తండ్రి సిద్దిఖీ విందు[వలీమా] జరపలేదు.

05 ఏప్రియల్, 2010:

>>>షోయబ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ "అయేషా గురించి నన్నడగ వద్దు. అది కోర్టులో ఉన్నందున మా లాయరే అన్ని విషయాలపై స్పందిస్తారు. సానియానే నా మొదటి భార్య. అయేషా వ్యవహారంలో నిజానిజాలు త్వరలో తెలుస్తాయి.

>>>మధ్యాహ్నం 3 గంటలకు షోయబ్ పత్రికలకు పంచిన పత్రంలో:[అంటే వ్రాతపూర్వకంగా కమిట్ అయ్యాడన్న మాట]
అయేషాతో నిఖా చెల్లదని అందుకు కారణాలు వివరించాడు.
2001 లో అయేషాతో ఫోన్ లో పరిచయం. ఫోన్ లోనే సాన్నిహిత్యం పెరిగింది. కలుసుకోవాలనుకున్నప్పుడల్లా ఫోటోలు పంపించేది. ఆ ఫోటోలు ఆమెవి కాదని నాకు తెలియదు.
2002లో ఆమెను చూడాలని పనిగట్టుకుని హైదరాబాద్ వచ్చాను. అర్జంటు పని అని సౌదీ వెళ్ళిందని చెప్పారు. మహా అపా, రీమాలు షికారు తిప్పారు. ఐదు రోజులు ఎదురు చూసాను.
ఆమె బలవంతమీద నిఖానామా మీద సంతకాలు పెట్టాను. అప్పటికి ఆమెను చూడలేదు.
2004లో మళ్ళీ హైదరాబాద్ వచ్చినా ఆమెను చూడలేదు.
[2005] సంవత్సరం తర్వాత పాక్ జట్టు హైదరాబాద్ వచ్చినప్పుడు సిద్దిఖీ విందు ఇచ్చాడు. అప్పుడు ఆమెను చూడలేదు.
2005లో సౌదీలో ఆమె బంధువు ద్వారా ఫోటోలు చూశా. ఆమె సౌదీలోని ఒక టీచర్ అని, మహా అపానే అయేషా అని షాక్ అయ్యాను. అప్పటి నుండే ఆమెతో మాట్లాడటం మానేశా.
2008లో మా లాయర్, సిద్దిఖీకి లీగల్ నోటిసులు పంపారు. ఇప్పుడు వాళ్ళు విడాకుల గురించి అడుగుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేసి నిఖా చేసారు. ముస్లిం చట్టం ప్రకారం వివాహం న్యాయమైనదైతేనే విడాకులు ఉంటాయి.

>>>అజహార్ దంపతులు తాజ్ రెసిడెన్సీలో అయేషాను చూసారని, అయేషా స్నేహితురాలు సౌదీ నుండి తెలిపారు.

06 ఏప్రియల్, 2010:

>>> ఈనాడు పత్రిక:
హైదరాబాద్ వచ్చిన కొన్ని గంటలలోనే పరిస్థితులన్నీ షోయబ్ కు ప్రతికూలంగా మారిపోయాయి అని వ్రాసింది.
>>>షోయబ్:
అయేషాతో తాను మూడు సంవత్సరాల క్రితం తాజ్ రెసిడెన్సీకి విందుకు వెళ్ళానని. ఆమె మహా అపా గానే తెలుసని. నిఖానామాపై సంతకం తనదేనని ఒప్పుకున్నాడు.
>>>ప్రతికూల పరిస్థితులు:
అజహార్ ను తాజ్ రెసిడెన్సీలో కలవటం, హడావుడి చేయటం, హైదరబాదు అల్లుడునని చెప్పుకోవటం.
>>>అజహార్:
హోటల్ లో చాలామందిని చూస్తుంటామని, తనకేం తెలియదని, సానియా వివాహానికి కూడా రానని తెలిపాడు. తన నియోజకవర్గంలో పనులున్నాయని చెప్పాడు.
>>>నిఖా జరిగినట్లేనా:
నిఖానామా తరువాత తొలికలయిక జరిగితేనే వివాహం అయినట్లని, వలీమా దీనికి సాక్ష్యం అని సాంప్రదాయం చెబుతుంది - అని ముస్లిం మత పెద్దలు చెప్పారు.
>>>తప్పుఒప్పుకో:
"షోయబ్, అయేషాను 14 సార్లు కలిసినట్లుగా సాక్ష్యాలు ఉన్నాయి. దుబాయ్ లో కొన్ని రోజులు కలిసున్నారు. అతడి కలయిక వలన గర్భం దాల్చిందని, అనివార్యకారణాల వల్ల అబార్షన్ అయ్యిందని వాటి వివరాలు పోలీసులకు అందచేసామని" సిద్దిఖీ కుటుంబ స్నేహితుడు డాక్టర్ బాబర్ వివరించాడు.
>>>అయేషా:
"3రోజులు తాజ్ లో గడిపామని తెలిపింది. తనకి గర్భస్రావం అయ్యిందని, డాక్టర్ ఫాతిమాని అడగమని చెప్పింది. ఒకసారి మహా అపా అని మరో సారి మహా ఖల[ఆంటీ] అని అంటున్నాడని, షోయబ్ అబద్దాలకోరు" అని చెప్పింది.
>>>పోలీసులు :
ఇద్దరిని విచారించారు. షోయబ్ పాస్ పోర్టుని, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు.
>>>మళ్ళీ సోయబ్:
సాయంత్రం నాలుగుగంటలకు సానియాతో, షోయబ్ మీడియాతో "ఆమె ఎవరో ఇప్పటికి తెలియదు. నాకు తెలిసింది మహా అపానే. పోలీసులకు ఉన్నదిఉన్నట్లు చెప్పాను. నా మీద మచ్చ చెరిగే వరకు దేశం విడిచిపెట్టిపోను. విచారణ నిమిత్తం పాస్ పోర్టు, సెల్ ఫోన్ తీసుకున్నారు. అయేషాతో హోటల్ లో నేను గడిపాననే వార్తల్లో నిజం లేదు. అబార్షన్ విషయం తేలాల్సింది కోర్టులోనే!
>>>సానియా:
"ముఖ్యంగా గౌరవనీయ కుటుంబాల నుండి వచ్చిన మాకు ఈ వివాదం మనస్తాపం కలిగిస్తోంది. మొదటి, రెండో పెళ్ళి లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం బాధగా అన్పిస్తోంది. అతడి గురించి అన్ని నిజాలూ తెలుసు. ఫోన్ పెళ్ళి చెల్లదని ముస్లిం మతపెద్దలే ధ్రువీకరించారు. కోర్టుకు వదిలెయ్యాలి!"

07 ఏప్రియల్ 2010:
>>>పోలీసులు:
క్రికెట్ బ్యాట్, మాన్ అఫ్ ది మ్యాచ్ ట్రోఫీ వంటి బహుమతులు అయేషాకు ఇచ్చాడు. వాటికి షోయబ్ సరియైన వివరాలు ఇవ్వాలి. షోయబ్ 8సార్లు[11సార్లు అని మరో పత్రిక] వచ్చాడని సమాచారం. షోయబ్ వీసాలో స్టాంపింగ్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఎక్కడ, ఎలా గడిపాడన్న వివరాలు పక్కాగా చూపాలి. అటు అయేషా ఫలానా సమయం, తేదీలలో విందు ఇచ్చామని, హోటల్ లో గడిపామని వివరాలు చెప్పింది. అతిధుల వివరాలు ఇచ్చింది. ఆరోజులలో షోయబ్ వీసాలో స్టాంపింగ్ పడుతుంది. హోటల్ లో గడిపినట్లు మరికొన్ని ఆధారాలున్నాయని తెలిపింది. పోలీసులు అయేషా, షోయబ్ ల వ్యక్తిగత వివరాలు అడిగారు.
>>>రతీఫ్ లతీఫ్ [షోయబ్ సహచర ఆటగాడు]:
"తన లాప్ టాప్ లో షోయబ్ ఛాటింగ్ చేసేవాడని, అప్పుడు తనకు చూపించిన అమ్మాయి ఫోటో, ఇప్పుడు టీవీలో చూపిస్తున్న అమ్మాయి ఫోటో ఒకటి కాదని తెలిపాడు. అవసరమైతే కోర్టుకి వచ్చి సాక్ష్యం చెబుతాను."
>>>సిద్దిఖీ:
"షోయబ్ ను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అక్కడి నుండి పేరున్న న్యాయవాదిని మన దేశానికి పంపిస్తోంది. కాని మన ప్రభుత్వం మమ్మల్ని అనుమానిస్తుంది. మా ఇంటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరి సాయం మాకు లభించడం లేదు. అన్యాయం, మోసం చేసిన వారేమో కోర్టులో గెలవాలని పావులు కదుపుతున్నారు."
>>>సానియా సోయబ్:
ఇద్దరు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, సానియా స్పాన్సర్ జీవీకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి కలిసారని, పెళ్ళి కార్డు ఇచ్చారని వార్త వ్రాయబడింది.
>>>కలకత్తా టిప్పుసుల్తాన్ మసీదు నుండి ఫత్వా:
షోయబ్ ను వెలివేయాలని, వివాహం జరిగిన తర్వాతే నిఖానామా వ్రాస్తారని చెప్పాడు.
>>>పాకిస్తాన్ నుండి షోయబ్ సవతి సోదరుడు తారిఖ్:
తాను స్వయంగా హాజరయ్యాననీ, 18 సంవత్సరాలకే తన సోదరుడు ఆయేషాను పెళ్ళి చేసుకున్నాడని, ఆ విషయం సానియాకి చెప్పి, తన అన్నను వివాహం చేసుకోవద్దని నచ్చ చెప్పాననీ చెప్పాడు. అయేషా, షోయబ్ ల వివాహానికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పాడు.

>>>ఆ రోజు సాయంత్రమే అయేషా:
షోయబ్ వీర్యంపడిన దుస్తులు ఇప్పటికీ ఉన్నాయని ఆమె పోలీసులకు తెలిపింది.[సాక్షి వార్త]

08 ఏప్రియల్, 2010:
>>>పోలీసులు:
డిఎన్ ఏ పరీక్షలకు సిద్దపడాల్సిన అవసరం ఉంటుందని షోయబ్ కు పోలీసులు సమాచారం ఇచ్చారని అందుకే షోయబ్ రాజీకి సిద్దపడ్డాడని వార్త. కలయిక వలన వీర్యం పడ్డ దుస్తులు ఉన్నాయని అయేషా సాక్ష్యం బయటపెట్టిందని ఆంధ్రజ్యోతి వ్రాసింది.
>>>షోయబ్ తలాక్:
మంత్రి అహదుల్లా, కాంగ్రెస్ నాయకుడు ఆబిద్ రసూల్ ఖాన్, ఒక పోలీసు ఉన్నతాధికారి, మత పెద్దలు మంగళవారం రాత్రంతా కూర్చుని ఇరుకుటుంబాలతో చర్చలు జరిపారు. "ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న విషయం మీద చర్చలు జరపలేదు. దేశం పరువు, మతం పరువు పోకుండా ఉండటం కోసం విడాకులిప్పించాం" అని రసూల్ చెప్పాడు. షోయబ్, సానియా కుటుంబసభ్యులు మీడియాకు ముఖం చాటేసారు. న్యాయం జరిగిందని సిద్దిఖీ, అతడి భార్య చెప్పారు.
>>> ఆహ్వాన పత్రికలో ఈ నెల 15న తాజ్ కృష్ణలో విందు అని మాత్రమే ముద్రించారని ఓ వార్తా సంస్థ తెలిపింది. అయేషా కేసులు ఉపసంహరించుకున్నది.
>>>గిల్గిత్- బాల్టిస్థాన్ [PMK] ముఖ్యమంత్రి:
హనీమూన్ కి సానియా షోయబ్ లను పాక్ అక్రమిత గిల్గిత్ రమ్మని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరాడు. ఆ విధంగానైనా కాశ్మీర్ విషయం మీద అంతర్జాతీయ ప్రచారం వస్తుందని, ఆ ప్రాంతం పాక్ దేనని చెప్పుకోవడానికి అస్కారం ఉంటుందని పాక్ ఎత్తుగడ.

10 ఏప్రియల్, 2010:
>>>బెట్టింగ్:
శుక్రవారం [09 ఏప్రియల్, 2010] పెళ్ళి అవుతుందా? అవ్వదా?
పెళ్ళి హైదరాబాద్ లోనా? దుబాయ్ లోనా?
హనీమూన్ భారత్ లోనా? పాకిస్తాన్ లోనా?
అయేషా వ్యవహారం బయటకు వచ్చినప్పుడు పెళ్ళి అవుతుందా? కాదా? అని బెట్టింగ్ లు నడిచాయి.
>>>13 నుండే పెళ్ళి తతంగం:
అనుకున్న తేదికే నిఖా అవుతుందని సానియా తండ్రి ఇమ్రాన్ స్పష్టం చేశాడు.
>>>భద్రతా కారణాల వలనే దుబాయ్ లో నివాసం:
ఒకరు ఇండియా తరుపున మరొకరు పాక్ తరుపున ఆడటం వలన భద్రతా కారణాల సమస్య వస్తాయని, అందువలన దుబాయ్ లో కాపురం పెడుతున్నారని మాట.
>>>వ్యాపార దృక్పోణంలో చూస్తే:
ముస్లిందేశాలలో సానియాకి క్రేజ్ ఉందని, తమ పిల్లలకు స్ఫూర్తి నిస్తుందని ఆ దేశవాసులు అనుకుంటున్నారు. దుబాయ్ లో మరీ ఎక్కువని తెలిపారు. టెన్నిస్ కే కాక మొత్తం క్రీడలకే సానియాని ప్రచారకర్తగా ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఆడటం కంటే ప్రచారకర్తగానే ఎక్కువ ఆదాయం ఉంటుంది. IPL తరహాలో దుబాయ్ లోనూ క్రికెట్ లీగ్ నిర్వహించాలని అనుకుంటున్నారు. అలా నిర్వహిస్తే షోయబ్ స్థానిక జట్టుకు సారధ్యం వహించే అవకాశం ఉంది.
>>>టైలరింగ్ లో కూడా 125 సంవత్సరాల చరిత్ర కలిగిన మగ్ధుమ్ బ్రదర్స్:
నిఖాలో వరుడు షోయబ్ మాలిక్ ధరించే షేర్వాణీ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ షేర్వాణీ ఖరీదు 45 వేల రూపాయలు. 125 ఏళ్ల చరిత్రగలిగిన 'మగ్దుమ్ బ్రదర్స్' ఈ షేర్వాణీని ప్రత్యేకంగా తయారుచేసింది. దీనికోసం 15 మంది పని చేశారట. వీటితోపాటు సానియా కుటుంబానికి ఇప్పటిదాకా కనీసం 32 డ్రెస్సులు డెలివరీ ఇచ్చామని మగ్దుమ్ షాపు యజమాని ఫయాజ్ తెలిపారు. [ఆంధ్రజ్యోతి వార్తాంశం]
11 ఏప్రియల్, 2010:
>>>సంబరాలే - సంబరాలు:
సానియా షోయబ్ లు వివాహాసంబరాలు చేసుకుంటున్నారు.
>>>తలాక్ నామాలో తండ్రిపేరు తప్పు వ్రాసాడని వివాదం - పాస్ పోర్టులో రెండు పేర్లు ఉన్నాయన్న వివరణతో వివాదం సద్ధుమణిగింది.

12 ఏప్రియల్, 2010:
>>>సానియా షోయబ్ లు ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఇది మత విశ్వాసాలకు విరుద్దమని, వాళ్ళ వివాహాన్ని ముస్లింలు బహిష్కరించాలని ఫత్వా జారి అయ్యిందని హడావుడి జరిగింది. తరువాత ఏమీ లేదన్న వివరణ వచ్చింది.

13 ఏప్రియల్, 2010:[12 తేదీనే వివాహం జరిగిపోయింది]
>>>ఫత్వాల జారీ భయం వల్ల వెంటనే వివాహం జరిపించారని ఒక మాట.
>>>భద్రతా కారణాల వలన వెంటనే వివాహం విషయం గుప్తంగా ఉంచామని సానియా కుటుంబం తెలిపింది.
>>>సాధారణంగా ముస్లింలు, గురు శుక్రవారాలలో రాత్రి నమాజ్ అయిపోయిన తరువాత వివాహాలు జరుపుతారు. అలాంటిది సోమవారం మధ్యాహ్నం నమాజ్ తరువాత సానియా షోయబ్ వివాహం జరిపించారు.

ఇక ఇందులో బహిర్గతమైనవి.....
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

చూడబోతే రామోజీ రావు నిద్ర లేచినప్పటి నుంచీ మిగతా వ్యాపారాల మాటెలా ఉన్నా, వాటన్నిటినీ పక్కన పెట్టి మిమ్మల్ని సంకేతాలతో ఏ విధంగా వేధించాలో ఆలోచించేలా ఉన్నాడే! చదివే వాళ్ళు నవ్వుకుంటారేమో అనైనా ఆలోచించరా మీరు?ఇప్పుడు సోనియాని కూడా లాగారు? ఇంతకీ మీరెవెరో రామోజీకి తెలుసా పాపం?

మొత్తానికి పిచ్చకామెడీ పంచుతున్నారు!

IPL???

త్వరలో నా పరిశీలనలో దేశ వ్యాప్తంగా నకిలీ కనిక వ్యవస్త వలన కెరియర్ పొందిన వ్యక్తులు/ఏజెంట్ ల పేర్లను రాస్తాను

రెండు రోజుల క్రితం ఈనాడు పేపర్ లో వచ్చిన "ఏక విద్యార్ధి పాఠశాల" మీ గురించేనా..?
అలానే ఈ రోజు రాసిన సంపాదకీయం "శోధించి సాధించాలి" - పద్ధెనిమిదేళ్ళ శ్రమ ఆఖరి క్షణాల్లో బూడిద పాలైంది.. (From 1992- Till today -18years)

తెర తీశారు అంటూ మొదటి పేజీ లో వచ్చిన వార్త..?!

I too feel like Anonymous1. I saw only anti US editorials or columns in Eenadu. but she is telling Ramoji is a CIA agent.

Madam with ur stories u can make a movie. Good creativity. if Sania knows about blog she will become mad.Dont say Sania is not having skill in Tennis. Say that she got more hype than what she is having, that is may be due her glamor.I don't understand what is 10 in ur story. I understood number 5 means Janpath5 Sonia's house. I saw some English movie long back in thta movie hero having some disease like this. suspecting that USSr spying on USA.

I too feel like Anonymous1. I saw only anti US editorials or columns in Eenadu. but she is telling Ramoji is a CIA agent.

Madam with ur stories u can make a movie. Good creativity. if Sania knows about blog she will become mad.Dont say Sania is not having skill in Tennis. Say that she got more hype than what she is having, that is may be due her glamor.I don't understand what is 10 in ur story. I understood number 5 means Janpath5 Sonia's house. I saw some English movie long back in thta movie hero having some disease like this. suspecting that USSr spying on USA.

మొదటి అజ్ఞాత: ఇది కాదు గానీ, ఇంకో మాట చెప్పండి. అవును గానీ మా టపాలకు దృష్టాంతంగా ఈనాడు రాతలు మేమే దగ్గరుండి వ్రాయిస్తున్నాం కదూ?

రెండో అజ్ఞాత గారు : IPL గురించి ఒకో సమాచారమూ బయటకి వస్తోంది కదా! వేచి చూద్దాం!నెనర్లు!

మూడో అజ్ఞాత గారు: ఆలస్యం ఎందుకు? ప్రారంభించండి. నెనర్లు!

5/6 అజ్ఞాత : ఇంతకీ సోనియా 10 జనపథ్ నుండి 5 జనపథ్ కి ఎప్పుడు మారిందండి?

Sorry for mentioning 5 Janpath as Sonia's house.I want to know about number 5.Could u plz tell about number 5.

మొదటి అజ్ఞాత:
మీ ప్రశ్నకు ఈనాడు రామోజీరావు జవాబు చెప్పాడు. మీకు, నాకు ఏక కాలంలో!

నేర నన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాడు నిందజెండు
ఊరుకున్నవాడె యుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ!

భావం:
ఈ లోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునే వాడు చాలా తెలివి గలవాడు. నాకు అన్నీ తెలుసునని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా బుద్దిమంతుడనిపించుకుంటాడు.

ఈ పద్యం, దాని భావం ‘హాయ్! బుజ్జీ!!’లో నిన్న[17 ఏప్రియల్ 2010] ఈనాడులో ప్రచురించారు.

నాకయితే : ‘నువ్వు అన్నీ చెప్తే ఈ అజ్ఞాత వంటి వాళ్ళు ఏమీ ఆలోచించకుండానే, గమనించకుండానే నిందలు వేస్తారు. కాబట్టి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండు’ అని.

మీకయితే: ‘ఈ గూఢచర్యపు ఆట నిజమే! నీకు ఓపికుంటే గమనించి చూసుకో’ అని!

నాలుగో అజ్ఞాత గారు :
రామోజీరావు కూడా రకరకాలుగా మాకు చెప్పజూస్తున్నది అదే! అన్నీ చెప్పేస్తున్నామని, ఆ విధంగా మేమే తెర తీసామని, 18 ఏళ్ళ శ్రమ వృధా అయ్యిందని కాబట్టి ఇప్పటికైనా మౌనంగా ఉండమని! ఈ రోజుటి[18 April, 2010] ఈనాడు సంపాదకీయ పేజీలోనే ’అమ్మభాషకు అంపశయ్య’ వంటి హెడ్డింగ్ ల సాక్షిగా! నాకు తెలియకడుగుతానూ, ఏ ప్రజలైతే దగా పడుతున్నారో, కుట్రలకు బలవుతున్నారో ఆ ప్రజలకి సత్యం తెలిస్తే నష్టం ఏమిటి?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu