పీవీజీ, నెం.5 వర్గమూ.... 1992 చివరిలో నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్య వలయాన్ని నిర్దారించుకున్న తర్వాత, అందులోని కీలక వ్యక్తులకీ, ముఖ్యంగా రామోజీరావుకీ ఇచ్చిన హెచ్చరిక.... "మీరెవ్వరో, ఎక్కడి నుండి, ఎలా కుట్రలు చేస్తున్నారో మాకు తెలియక ముందు మీ ఆటలు సాగాయి. ఇక మీ వేళ్ళతో మీ కళ్ళే పొడిపిస్తాము. మీ చేతులతో మీ నెట్ వర్క్ ని కూల్పిస్తాము" అన్నది. అయితే ఇది ఆ హెచ్చరికలోని సగభాగం మాత్రమే!
మిగిలిన సగ భాగం ఏమిటంటే - "ఎవరో, ఎందుకోసం, ఎక్కడి నుండి దెబ్బతీస్తున్నారో తెలియకుండా చేస్తే అది కుట్ర. చెప్పి తంతే అది యుద్దం. ఇప్పటి వరకూ మీరెవ్వరో తెలియకుండా.... ఆడదాన్ని ఉపయోగించడం, నమ్మించి ద్రోహం చేయటం వంటి కుట్రలతో మీరు మమ్మల్ని దెబ్బతీసారు. మీరు చేసింది కుట్ర. మేము కుట్రలు చేయం. మాది యుద్దం. మిమ్మల్ని మీచేతే చంపిస్తాము. ఈ పుట్టిన నేల కోసం, మానవత్వం కోసం, ధర్మం కోసం పనిచేస్తాము. ఇక మా అవుట్ లెట్... ఇదిగో, ఈ సామాన్యులే!
మీకు సామాన్య ప్రజలు పట్ల, వారి మనోభావాల పట్ల, వారి ప్రాణాల పట్ల నిర్లక్ష్యం. వారు మీ దృష్టిలో.... మీ కోసం పనిచేసే శ్రామిక చీమల వంటి వారు. మీరు ఎలా ఆడిస్తే అలా ఆడతారని, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరని మీ నమ్మకం. కాబట్టి.... ఆ సామాన్యుల చేతే మీ మొత్తం వ్యవస్థని, మీ స్ట్రాటజీలని బట్టబయలు చేస్తాం. ఎవరైతే నీ గురించిన ఫిర్యాదు మాకు ఇచ్చారో, ఆమే మా చిరునామా!
అంతే కాదు. ఆమెతో మేం ప్రత్యక్ష సమాచార సంబంధాలు పెట్టుకోము. వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుంటే నువ్వు మమ్మల్ని పట్టుకోవచ్చు.ఆమెకు నీ గురించి, నీ వ్యవస్థ గురించి, నీ స్ట్రాటజీల గురించి అవగాహన కలిగిస్తాము. మొత్తంగా నిన్ను బహిర్గతం చేస్తాము. గూఢచర్యాన్ని గూఢచర్యంతోనే ఛేదిస్తాం! చేతనైతే నువ్వు వాళ్ళని లోబర్చుకో! నువ్వు వాళ్ళ మీద ఏది ప్రయోగిస్తే.... అది నీ మీదా, నీ వ్యవస్థ మీదా మేం ప్రయోగిస్తాం. నిన్నూ, నీ గూఢచర్య నెట్ వర్క్ నీ అంతిమంగా నిరూపించేదీ మాత్రం ఖాయం. వీళ్ళే కాదు, వీళ్ళలాంటి సామాన్య ప్రజల చేతనే మిమ్మల్ని నిర్వీర్యం చేసేదీ ఖాయం. సామాన్య ప్రజలలో రజోగుణం రగిల్చేది ఖాయం. ఇక కాచుకో!"
ఈ సగ భాగపు హెచ్చరిక, నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, 1996 ఎన్నికలలో పీవీజీ ఓడిపోయే ముందు ఇవ్వబడింది. మొదటి సగ భాగపు హెచ్చరిక 1993 ప్రారంభంలోనే [రెండోదశ ప్రారంభంలో] ’దొరికిపోయావ్’ తో పాటూ ఇవ్వబడితే, ఈ రెండో సగభాగపు హెచ్చరిక 1996 ఎన్నికలలో, పీవీజీ ఓడిపోయే ముందు ఇవ్వబడింది.
దీనికి నిదర్శనంగానే పీవీజీ 1992 లో పార్లమెంట్ భవనం నుండి ప్రత్యక్ష ప్రసారంలో “Do not under estimate the strength and wisdom of our people" అన్నాడు. ఎందుకంటే పదవి దిగిపోయాక పీవీజీ కూడా సామాన్యుడే! ఈ దేశపు ప్రతి సామాన్యుడూ ఎంతో, ఆయనా అంతే! ఆధిపత్యం, బలం.... నైతికత, జ్ఞానం లతో రావాల్సిందే గానీ, పదవులతో రావు మరి!
ఈ హెచ్చరికని నెం.5 వర్గం అమలు చేసిన తీరూ, దాన్నుండి సాధించిన ప్రయోజనాలూ.... పీవీజీ సునిశిత మేధస్సుకు అద్భుత తార్కాణాలు. మెదళ్ళతో యుద్దంలోని ఈ విన్యాసాలు.... పరమ ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ముందు మా పరంగా చెబుతాను. తర్వాత ప్రజల కోణంలో చెబుతాను.
1996 లో ఈ హెచ్చరిక పీవీజీ రామోజీరావుకి ఇచ్చేటప్పటికే, ఆ ఆటని పీవీజీ ప్రారంభించేసాడు. మరో మాటలో చెప్పాలంటే - పీవీజీనే మా పట్ల శతృవు ముఖం [పాత్ర], మిత్రుడి ముఖం[పాత్ర] రెండూ తనే పోషించాడు. అంటే నకిలీ కణిక అనువంశీయుల పాత్ర [శతృవు పాత్ర], పీవీజీ పాత్ర [మిత్రుడి పాత్ర] తనే పోషించాడు. దాదాపు నాలుగేళ్ళ పాటు... 1992 నుండి 1996 వరకూ! వివరంగా చెబుతాను.
ఆ సమయంలో మాకు గూఢచర్యం గురించి ప్రాధమిక అవగాహన నేర్పాడు. బలాలు ధృఢపరిచాడు. బలహీనతలు నివారించాడు. గూఢచర్యం ఎంత విస్తారమైనదో, ఎంత లోతైనదో, ఎంత కౄరమైనదో అర్ధం చేసాడు. వ్యక్తిగత జీవితం, నమ్మకాలు, అనుభూతులు, జ్ఞాపకాలు.... ఇలాంటి ఏ పరిమితులూ దానికి పట్టవు. ’గూఢచర్య గ్రిప్ ఉండటమే విషయం’ అన్న అవగాహనా కల్గించాడు.
ఆ అవగాహన ఎలాంటి దంటే - గత టపాలలో చెప్పినట్లుగా.... తలుపులు మూసి ఉన్న గదిలో ఉంచిన పాము, మనం ఏ తలుపు తెరిస్తే అందులోంచే బయటకు పోవలసి ఉంటుంది. అలాగే చదరంగపు ఆటలోనూ.... ఒక ఆటగాడు ప్రత్యర్ధి పావుల్ని దిగ్భంధం చేస్తే, ఏదో ఒక అవకాశమే మిగిలిస్తే, సదరు ప్రత్యర్ధి ఆ ఒక్క అవకాశాన్నే ఉపయోగించుకోవాలి. అంటే - ఏ పావుని ఎలా కదపగల అవకాశం ఉందో అలా తప్ప, మరో ఎత్తుగడ వేయలేడు. ఆ విధంగా ఎదుటి ఆటగాడి ఆటని కూడా మనమే ఆడటం అన్నమాట.
ఇదే, గూఢచర్యపు పట్టు ఎక్కువ ఉన్న వర్గం, ఎదిరి వర్గానికి కల్పించే స్థితి! 1992 కు ముందర, మన దేశం పట్ల నిబద్దత గల వ్యక్తులకీ, ఇందిరాగాంధీ, శాస్త్రీజీ వంటి నాయకులకీ ఈ స్థితిని పదే పదే కల్పించగలిగింది నకిలీ కణిక వ్యవస్థ![ఏ మాత్రం రాజకీయ అనుభవం, గూఢచర్య అవగాహన లేని రాజీవ్ గాంధీని ఇంకా తేలికగా ఆడించారు లెండి.]
ఒకోసారి తమ ఏజంట్ల చేతే ఎత్తుగడలు వేయించి, వాటిని ఎదుటి వారి నెత్తికి చుట్టటంతోనూ, ఎదుటి వారి ఆటని తామే ఆడవచ్చు. అందరికీ బాగా గుర్తుండే ఉదాహరణ చెప్పాలంటే - 1984 ఆగస్టు సంక్షోభం! రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా నాదెండ్ల భాస్కర రావు, నాటి గవర్నర్ రామ్ లాల్ కలిసి కూలదోసారు. మొత్తం ప్రకరణనీ, ఇందిరాగాంధీ అప్రజాస్వామిక పద్దతిగా, ఆమె తలకి చుట్టారు. అలాగన్న మాట! దీని తాలూకూ సువర్ణముఖి ని నకిలీ కణిక అనువంశీయులూ రామోజీరావూ, ఇప్పుడు చాలా సార్లు, చాలా విషయాల్లో అనుభవిస్తూ ఉన్నారు.
ఈ రకపు ఆటనే, పీవీజీ మా విషయంలో 1992 నుండి 1996 వరకూ ఆడాడు. నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా లాగా తానే వేధించాడు. నెం.5 వర్గం లాగా తానే క్లిష్ట సమయాల్లో ఆదుకుని రక్షించాడు. ఆ విధంగా చదరంగపు బోర్డు మీద, ఇద్దరి ఆటగాళ్ళలాగే ఆడేసాడు. [యుద్దపు రీతి గురించి మాకు అవగాహనా కల్పించాడు.]
ఈ విధంగా ఒక ఒరవడి ముందే ప్రారంభించాడు. 1996లో, రామోజీరావుకి - తాను పీవీజీకి ఎలా పట్టుబడ్డాడో, ఎవరు ఆ వివరాలు అందించారో గట్రా రహస్యాలు, తొలిసారిగా తెలియ చేయబడ్డాయి.
అప్పుడే నా గురించీ, నా కుటుంబం గురించీ రామోజీరావుకి వివరాలు అందాయి. ఇది నిజానికి ’spy గా పట్టుబడటం కూడా spying లో ఓ భాగం వంటిది’ అనే స్ట్రాటజీనే! అయితే.... రామోజీరావుకి మాత్రం, తాను చాలా కష్టపడి, చెమటోడ్చి, చాలా తెలివీ నైపుణ్యాలని ఉపయోగించి, మరికాస్తా ఎక్కువ డబ్బు వెచ్చించి, వివరాలు సేకరించిన భావం మిగల్చబడింది. అదీ గూఢచర్యంలోని ఒక విన్యాసమే! ఎన్నోసార్లు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు, భారత దేశం పట్ల నిబద్దత గల వారి మీద గతంలో ప్రయోగించినదే! అయితే తన దాకా వస్తే గానీ లోతెంతో తెలియదు గదా!
ఈ నేపధ్యంలోనే నా డైరీ రామోజీరావు వర్గీయులకి దొరికింది. [దొరికించబడింది] పీవీజీ ఓడిపోయాడు. మా అమ్మాసోదరులు హైదరాబాదు చేరారు. వాళ్ళని ట్రాప్ చేసి సేకరించిన సమాచారమూ, నా డైరీలోని సమాచారమూ సరిపోలాయి. దానికి, అప్పటి దాకా.... ముఖ్యంగా 1992 జూన్ నుండి 1993 మార్చి దాకా.... టీవీ,పత్రికల వార్తాంశాలూ సరిపోలాయి. నా స్నేహితుల నుండి, మా కుటుంబ బంధుమిత్రుల నుండీ, లెనిన్ బంధుమిత్రుల నుండీ మరింత సమాచారం సేకరించుకున్నాక, అవి ట్రయాంగులేట్ అయ్యాయి. అప్పుడు ’రెండు బోర్డుల మీదా ఒకేసారి ఆడే చదరంగపు ఆటగాడి విన్యాసం’ వంటి ఆసక్తికర అంశాలూ తెలిసాయి. దాంతో రామోజీరావుకి విషయం నిర్ధారణ అయ్యింది.
దానికి తోడు పీవీజీ విధించిన అప్రకటిత నియమాలూ రామోజీరావుకి విషయాన్ని ధృఢంగా నిర్ధారణ చేశాయి.
ఎవరైతే నీ మీద ఫిర్యాదు ఇచ్చారో, ఆ వ్యక్తుల వీళ్ళే! వీళ్ళు [అంటే మేము] ఈ దేశపు సామాన్యులకి ప్రతీకలు. ఈ సామాన్యుల చేత, వీళ్ళలాంటి సామాన్యుల చేత, నిన్నూ నీ గూఢచర్య వ్యవస్థనీ తుత్తునియలు కొట్టిస్తాము.
మేముగా ఈ సామాన్యులకి ఏ సాయమూ చేయము. ఒక్క రూపాయి డబ్బుగానీ... ఏదీ...! ఈ సామాన్యులకి మరో సామాన్యులు గానీ, మరెవ్వరు గానీ.... ఎవరైనా సరే.... ఆయా వ్యక్తుల సంకల్పాన్నీ, ఇష్టాఇష్టాలనీ బట్టి చేయూత నివ్వాల్సిందే! అంతే తప్ప, మాకుగా మేము ప్రత్యక్షంగా ఏ సంబంధాలూ పెట్టుకోము. [ఈ నియమం విషయంలో రామోజీరావు సర్కస్ ఫీట్లను, తర్వాత టపాలలో దృష్టాంత పూరితంగా వివరిస్తాను.]
వీళ్ళమీద నీకు తెలిసిన ఏ వ్యూహాలైనా, ఏ స్ట్రాటజీలైనా ప్రయోగించుకో! ఈ దేశం మీద, ఈ దేశపు పౌరుల మీదా, ఇప్పటి వరకూ నువ్వూ, నీ బృందమూ, గూఢచర్య వలయమూ ప్రయోగించుకు వస్తున్న ఏ వ్యూహాలనైనా.... ఏ స్ట్రాటజీలనైనా! మేము ఈ కుట్రల గురించిన అవగాహననీ, సత్యాన్నీ వీళ్ళకి తెలియ చేస్తాము. వీళ్ళ ద్వారా అందరికీ ఆ అవగాహన కలిగిస్తాము. వీళ్ళు గనక నీ స్ట్రాటజీలని అవగాహన చేసుకుని పోరాటం పెంచారో, మాతో ఆటలో సాంద్రత పెరుగుతుంది. విడియో గేమ్ లలో గనక ఒక దశ దాటితే, ఆట లెవెల్ పెరిగినట్లు!
మా అవుట్ లెట్ ఇది కాబట్టి, మా మీద ప్రయోగించుకునే స్ట్రాటజీలు, వ్యూహాలు.... అన్నిటినీ వీళ్ళ మీదా ప్రయోగించుకోవచ్చు. వీళ్ళ మీద నువ్వు ప్రయోగించినవన్నీ , నీ మీదా నీ వ్యవస్థ మీదా నీ ఏజంట్ల మీదా, మేం ప్రయోగిస్తాం.
ఇవీ స్థూలంగా నియమాలు.
ఈ నియమాలేవీ నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకీ, రామోజీరావుకీ.... పీవీజీ గానీ, అప్పటికే కొంత బలపడిన నెం.5 వర్గం గానీ ప్రత్యక్షంగా చెప్పలేదు. కుస్తీపోటిలో ఉన్నవాడు గోదా దాటి ప్రక్కకి వెళ్తే, మళ్ళీ తెచ్చి లోపల వేసినట్లుగా.... పరిధి దాటినప్పుడల్లా పిల్లాడిని రెండు పీకి మరీ హద్దులు నేర్పినట్లుగా.... గూఢచర్య పరిభాషతో, నకిలీ కణిక వ్యవస్థకీ రామోజీరావుకీ ఇంకించారు. నియమాలు తప్పినప్పుడల్లా గూఢచర్య దెబ్బలు కొట్టి మరీ!
నిజానికి ఇలాంటి నియమాలతొ కూడిన హెచ్చరికని.... పీవీజీ, నెం.5 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ ఇవ్వటంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల అస్తిత్వాన్నీ, పని తీరునీ, మేమిచ్చిన ఫిర్యాదుకి సంబంధించిన సాక్ష్యాధారాలతో, సంఘటనలతో సహా నిరూపించటం! అందుకు తగినంత సమయం gain చేసుకున్నారు.
ఇక్కడ ఓ ఉదాహరణ ఇస్తాను. మన ఇంట్లో ఒక ఎలుక తిరుగుతుందనుకొండి. మన పనుల్లో మనం ఉన్నప్పుడు దొంగచాటుగా కలుగులోంచి బయటికొచ్చిన ఎలుక, ఇల్లంతా మురికి చేయటం, పునాదులు తవ్వటం, ఆహార పదార్ధాలని పాడుచేయటం, దుస్తులు కొరికి చింపటం వంటి అకృత్యాలు చేస్తున్నదనుకొండి. కొట్టబోతే కలుగులో దూరుతుంది. అప్పుడేం చేస్తాం?
ఓ ఎలుక బోను తెస్తాం. అందులో ఓ పకోడీ ముక్క తగిలిస్తాం. అలా ఓ ప్రక్కన బెట్టేస్తాం. పకోడీ ముక్క కోసం ఆశపడిన ఎలుక బోనులో పడుతుంది. అప్పుడు దాన్ని వీధిలోకి తెచ్చి, అంటే బహిర్గతం చేసి కొట్టి చంపుతాం. వదిలేస్తే మళ్ళా ఇంట్లో చొరబడుతుంది మరి!
దీన్ని అనువర్తన చేస్తే - మమ్మల్నే అలాంటి పకోడి ముక్కగా.... పీవీజీ, నెం.5వర్గమూ ఉపయోగించారు. నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల వంటి ఎలుకలని బోనులో బంధించి మరీ బహిర్గతం చేస్తున్నారు. మా కేసులోని సాక్ష్యాధార పత్రాలూ, మా విషయంలోనూ, దేశం విషయం లోనూ దృష్టాంతపూరిత సంఘటనలూ.... ఎలుకల బోను వంటివే! ఈ రోజు రాజకీయ నాయకుల గురించి గానీ, మీడియా గురించి గానీ, ప్రభుత్వాధికారుల గురించి గానీ, కోర్టుల గురించి గానీ.... మంచి అన్నది ఎక్కడా మిగలలేదు. ఆ నాలుగు వ్యవస్థలు ఎంతగా అవినీతిమయం అయ్యాయో మనందరికి బాగా తెలుసు.
ఈ విధంగా ’ప్రయాణం’ సినిమాలో లాగా 18 ఏళ్ళలో.... 3 ½ శతాబ్దాల నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయాన్ని నెం.5 వర్గం బహిర్గత పరిచింది, పరుస్తోంది. అసలు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులనీ నిరూపించటానికి తీసుకున్న స్ట్రాటజీనే ’రెండుబోర్డుల మీదా ఒకేసారి ఆడే ఆటగాడి విన్యాసం!’ అందులో మా కేసూ ఓ అంశం!
ఎలుకని బోనులో బంధించడానికి ఉపయోగించే పకోడి ముక్కతో మమ్మల్ని ఎందుకు పోల్చానంటే - ఎలుకకి ఇంట్లో ఇంకెక్కడా ఆహారం దొరక్క పోతే, బోనులో ఉన్న పకోడీ ముక్క కోసం తప్పకుండా బోనులోకి వస్తుంది. పట్టుబడుతుంది.
ఇక మేము పకోడి ముక్క ఎలాగంటే - జీవికి ప్రాణవాయువు ఎంతో గూఢచర్యానికి సమాచారం అంత! రాజకీయుల, కార్పోరేట్ల దగ్గరి నుండి నిఘా ఏజన్సీల దాకా.... కీలక సమాచారాన్ని ఖరీదు పెట్టి కొనుక్కుంటారు. అందుకే ఇంత అవినీతి చేసి కోట్లు సంపాదించేది. ఉద్యోగి ప్రమోషన్ కోసం డబ్బు ఖర్చు పెట్టినట్లు, వ్యాపారి కాంట్రాక్టులకు డబ్బు చెల్లించినట్లు, రాజకీయ నాయకులు పదవులను కొనుక్కున్నట్లు!
నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులకీ, నెం.5 వర్గం గురించిన సమాచారం కావాలి. అది మరింక ఎక్కడా దొరకదు. ఎందుకంటే - నెం.5 వర్గంలోని ఎవరూ ఎక్కడా ఆచూకీ దొరకదు గనుక! [అచ్చం గతంలో ఇందిరాగాంధీ విదేశీహస్తం కోసం వెదికినట్లు!] నెం.5 వర్గం, వారి పనితీరు గురించిన అవగాహన, సమాచారమూ మా దగ్గర దొరుకుతుందన్న ఆశతో రామోజీరావు మా చుట్టూ తిరిగాడు. అందుకోసం వేధించాడు. మమ్మల్ని బ్రేక్ చేస్తే నెం.5 వర్గం ప్రత్యక్షంగా వచ్చి సాయం చేస్తుందేమోనని ఆశ కొద్దీ కూడా వేధించాడు. కుటుంబమిత్రుల వంటి వారిని ప్రయోగించాడు. ఇప్పుడు బ్లాగులో వెలువరిస్తున్న సమాచారం వంటిది, వేరెవ్వరికీ తెలియకుండా, తమకి మాత్రమే తెలియటం వారికి ప్రయోజనకరం.
ఒక ఉదాహరణ చెబుతాను. గూఢచర్యం విస్తారమైనది గనుక, ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా.... ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో వార్తలు, సమాచారమూ వస్తుంటుంది. వాటిల్లో.... వేటితో ఏవి సంబంధం కలిగి ఉన్నవో, ఏవేవీ ఒకే శృతీ లయలో ఉన్నాయో, వేటికి ఏవి పైకారణాలో[over leaf reasons].... తెలియాలంటే - వాటి ’కీ’ తెలియాలి. చెల్లాచెదురుగా ఎన్నో పూసలు పడి ఉన్నాయనుకొండి. వాటిలో ఏయే పూసల్లో నుండి ఒక దారం ఉందో తెలిస్తే, అప్పుడు అక్కడ ఉన్న పూసల దండ తెలుస్తుంది.
మరింత స్పష్టమైన పోలిక చెబుతాను. మనం పార్కుకి వెళ్ళామనుకొండి. చెట్టు కొమ్మలో, ఆకుల గుబురులో ఓ పిట్ట కూర్చొని ఉంది. యధాలాపంగా మనం చూసాం. మన ప్రక్కనున్న వారికి "అదిగో ఆ పిట్ట చూడు. ఎంత బాగుందో" అంటూ చూపబోతాం. వాళ్ళకది కంటికి ఆనదు. "ఎక్కడ? కనబడటం లేదు" అంటారు. మనం "అదిగో నా వేలుకు సూటిగా చూడు" అంటాం. ఉహు! వాళ్ళకది దృష్టికి ఆనదు. మనం "అదిగో! అక్కడ ఫలానా చెట్టు కొమ్మ ఉందా? ఆ ప్రక్కనే ఎర్రటి పువ్వుంది. ఆ ప్రక్కగా.... కొంచెం లోపలికి. పిట్ట ప్రక్కనే పండిన ఆకు ఉంది. కనబడిందా?" అంటూ గైడ్ చేస్తాం. అప్పటికి మనం ఇచ్చిన క్లూలని అనుసరిస్తూ.... వాళ్ళు పిట్టని చూడగలగుతారు. ఒకసారి చూడగలిగితే తర్వాత స్పష్టంగానే కన్పిస్తుంది. వాళ్ళు మరొకరికీ చూపగలుగుతారు. సరిగ్గా అలాగన్న మాట!
మొదట పీవీజీ, నెం. 5 వర్గమూ మాకు అవగాహన కలిగిస్తున్నప్పుడు మేము క్లూలని అనుసరిస్తూ పిట్టని చూడ, ప్రయత్నిచాము. [కాకపోతే చాలా క్లూలు, స్వయంగా రామోజీరావు, తన పత్రిక ద్వారా, తన అరిషడ్వర్గాలతో కూడిన చర్యల ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు మా బ్లాగులో కొందరు అజ్ఞాతల వ్యాఖ్యల మాదిరిగా నన్నమాట.] క్రమంగా గూఢచర్య దృష్టీ, సత్యాన్ని గ్రహించే దృక్పధమూ ఏర్పడ్డాక స్పష్టత వచ్చింది. ఈ బ్లాగులో చెప్పగా, చాలామందికీ ఈ ’గూఢచర్యపు పిట్ట అలియాస్ బోనులో పడ్డ ఎలుకా’ కనబడుతున్నట్లే!
కాబట్టి.... గూఢచారికి, గూఢచార ఏజన్సీకీ [అంటే నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ] నెం.5 వర్గం గురించిన సమాచారం, మనిషికి ఆక్సిజన్ అంతగా అవసరం. కాబట్టి పకోడీ ముక్క కోసం బోనులో చిక్కిన ఎలుక లాగానే, అతడూ అతడి వ్యవస్థా కూడా పట్టుబడ్డారు. ఇందుకోసమే, పీవీజీ నెం.5 వర్గమూ ఈ ప్రక్రియని నిర్వహించారు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
మీ బ్లాగులో కామెంట్లు రాసే వారి మీద కూడా అరాస్మెంట్ ప్రారంభమైనట్టు వినికిడి . కామెంటేటర్ల Internet connections పనిచేయకుండా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆర్ధిక ఇబ్బందులు కలిగిస్తున్నారు. నా మీద కుడా గూఢచర్య దాడి ప్రారంభమైంది
అజ్ఞాత గారు : భయపడి కామెంటారా? భయపెట్టాలని కామెంటారా?
రెండూ కాదు ... Information ఇవ్వాలని కామెంటాను
Post a Comment