ఈ టపాలో కొన్ని విషయాలు ఇంతకు ముందు మీరు నా గతటపాలలో చదివినవే. అయినా మరో కోణం లోంచి దానిని పరిశీలించవలసి ఉన్నందున వ్రాస్తున్నాను.
ఇది ఎలాంటిదంటే - క్రికెట్ ఆటలో బ్యాట్స్ మన్ అవుట్ అయినప్పుడూ, బంతి స్టంపులకి తగిలినప్పుడూ, లేదా ఫీల్డింగ్ చేసే ఆటగాడు బంతిని క్యాచ్ పట్టినప్పుడూ అదే షాట్ ని రకరకాల కోణాలలో చూపుతారు చూడండి. అలాంటిదన్న మాట. అదే షాట్ ని వేర్వేరు కెమెరాలతో, వేర్వేరు కోణాలలో చిత్రీకరించి చూపుతారు. ఆట మజాని మరింతగా ప్రేక్షకులు ఆస్వాదించేందుకు క్రికెట్ వ్యాపార సంస్థ అలా చేస్తుంది.
అలాగే, గూఢచర్యం క్లిష్టమైనదైనందున పాఠకులు మరింతగా అవగాహన చేసుకునేందుకు, మేము అవే సంఘటనలని వేర్వేరు కోణాలలో, వేర్వేరు వర్గాల దృష్ట్యా, వేర్వేరు తర్కాల లేదా concepts దృష్ట్యా మరో సారి - మరో విశ్లేషణతో చెప్పాల్సి వస్తోంది.
ఇది దృష్టిలో పెట్టుకుని నా టపాని పరిశీలించగలరు.
~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~
1992 నుండి మా జీవితాల్లో మూడు దశలుగా గడిచిన ఈ 18 ఏళ్ళనీ నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ అందులో కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాల దృష్ట్యా చూస్తే.... 1996 లో పీవీజీ ప్రధానిపదవి దిగిపోగానే మా వారి మీద భౌతిక దాడి జరిగింది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తి రామోజీరావు తొలి ఆయుధమూ ఆలోచనా ఇదే! ఎవరి మీదనైనా దౌర్జన్యం, దమన కాండ, హింస, హత్య - ఇదే అతడి దృక్పధం. రిమోట్ కంట్రోలుతో డివీడీని ఆపరేట్ చేయటం వంటి అతడి మార్కు గూఢచర్యంలో ముఖ్యమైన బటన్స్ అవే!
అయితే తరువాత జరిగిన కట్టడికి వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు! దీన్ని గురించిన మరింత వివరణ తరువాత ఇస్తాను. ఇక భౌతిక దాడి కుదరక పోయే సరికి మా మీద ఎక్కడికక్కడ ఆర్దిక మూలాలు నలపటం, మానసిక తంత్రాలు ప్రయోగించటం ప్రారంభించాడు. అదే ఎంసెట్ 2000 అవకతవకల మీద మేం ఫిర్యాదు పెట్టిన అనంతరం మాపైన జరిగిన వ్యవస్థీకృత వేధింపు! ఇల్లూ వాకిలీ ఊడగొట్టి, బ్రతుకు బస్టాండు పాలు చేశాడు.
అలా చెయ్యటంలో ’అప్పటికే [అంటే 1992 నుండి 1995 - 96 దాకా] పీవీజీ మాకేదో అవగాహన కలిగించాడు. అదేంటో తెలుసుకోవాలన్నది’ రామోజీరావు టార్గెట్. అది ఫలించలేదు. అప్పటికి మాకే ఏదీ తెలియదు. అసలేదీ ఆలోచించే దశలోనూ లేము.
ఇక 2004 తర్వాత వై.యస్. రాష్ట్రంలోనూ, సోనియా కేంద్రంలోనూ అధికారం లోకి వచ్చారు. రాగానే మాకు శ్రీశైలంలో గది అలాట్ చేయబడింది. స్కూలు స్థిరపడింది. అంతకు ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న అద్వానీ పరోక్షంగా మమ్మల్ని వేధించారనీ, తాము ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అధికారంలోకి వచ్చి మమ్మల్ని[దేశాన్ని కూడా] కాపాడుతున్నామనీ, కాబట్టి వై.యస్.నీ, సోనియా మన్మోహన్ లనీ నమ్మి, మాకు పీవీజీ అవగాహన కలిగించిన గూఢచర్య విశేషాలన్నీ చెప్పమని ఒత్తిడి మొదలైంది.
[మొన్నటి ఎన్నికలప్పుడు కూడా ’చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తాడని, ఇంతకు ముందులాగే మమ్మల్ని భయంకరంగా వేధిస్తాడని, ఇప్పటికైనా వెళ్ళి మాకు తెలిసింది చెబితే వాళ్ళకి అడ్డుకట్ట వేయవచ్చని’ చెప్పబడింది. ఐతే అదేదీ లేకుండానే.... రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ, కాంగ్రెస్ EVMల సాయంతో అధికారంలోకి వచ్చింది. భ్రమపరిచే మాయా యుద్దం ఇలా ఉంటుంది.]
ఇందులో రామోజీరావు స్ట్రాటజీనే ప్రముఖంగా కన్పిస్తుంది. ’అందితే జుట్టు అందకపోతే కాళ్ళు’ అన్న సామెత లాగా!
ముందు వేధించటం, తర్వాత బుజ్జగించ ప్రయత్నించటం!
ముందు భయపెట్టటం తర్వాత ప్రలోభపెట్టటానికీ, భ్రాంతి పరచటానికీ ప్రయత్నించటం!
అహం మీద కొట్టటం లేదా అహాన్ని తృప్తిపరచటం!
నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, రామోజీరావుల స్ట్రాటజీకి ఆధారమే అవతల వాడి అహంకారం అయినందునే.... గూఢచర్య అవగాహన కలిగిస్తోన్న రోజుల్లోనే పీవీజీ మాకు ఏ మాత్రం అహం పొడచూపినా.... దాన్ని సరిచేసాడు. ఆ తర్వాత కూడా, అనివార్యంగా గీతా సాధన చేసేటట్లు నడిపాడు. కాబట్టే ప్రతి శ్లోకానికి అవగాహనా సంఘటనలని మేము వ్రాయగలిగాము. స్వానుభవం మరి! 1995 నుండి 2005 వరకూ.... ఏది మర్చిపోయినా ’గీతా సాధన’, దైవభక్తి, ఇతిహాసాల నుండి స్ఫూర్తి పొందటం మాత్రం.... మేము మరిచిపోలేదు, మరిచిపోనివ్వలేదు.
అయితే - తమకు తెలిసిన పది స్ట్రాటజీలకే ’గూఢచర్య మర్మాలన్నీ కరతలామలకాలనీ, శతాబ్దాలుగా నిర్మించుకున్న ప్రపంచ పరివ్యాప్త గూఢచర్య వలయాన్ని ఎవరూ కనుగొన లేరనీ, కనుగొనలేని చోట దాన్ని అర్ధం చేసుకోవటం, ఛేదించటం అసంభవమనీ’ అనుకునే నకిలీ కణిక అనువంశీయులకీ, రామోజీరావులకి.....
నమ్మక ద్రోహం చేయటమే మూల మంత్రంగా గూఢచర్యం నడిపే వారికి.....
ఆడది ఆకలి ప్రయోగించి, అహం మీద ఆడి, రిమోట్ కంట్రోలుతో డీవీడిని ఆపరేట్ చేయటాన్నే అద్భుత నైపుణ్యంగా తలచి, తానో వ్యక్తి కాదు వ్యవస్థననుకునే దురహంకారికి.... పీవీజీకి తెలిసింది చాలా తక్కువ అనీ, ఇక మాకు తెలిసింది మరింత తక్కువ అని ఓ చులకన! అయితే వాస్తవంలో తగులుతున్న ఎదురు దెబ్బలని కాచుకోవాల్సిన అవసరంతో మా చుట్టూ తిరగక తప్పలేదు. అదే.... పీవీజీ తన మేధస్సుతో, మా చుట్టూ నిర్మించిన ’మ్యాజిక్ సర్కిల్’. ఇదే పదాన్ని 2005 నుండి వరసగా మన్మోహన్ సింగ్ కి రామోజీరావు గూఢచర్యం మీద ఇచ్చిన ఫిర్యాదులలో పేర్కొన్నాను.
ఈ మ్యాజిక్ సర్కిల్, మమ్మల్ని వేధించగలుగుతున్న రామోజీరావుని మా ప్రాణాలు తీయలేకుండా నిలువరిస్తోంది. ఈ మ్యాజిక్ సర్కిల్ తోనే.... మా ప్రాణాల్ని రామోజీరావు బారి నుండి రక్షించగల నెం.5 వర్గం, మాపై అతడి వేధింపుని కొనసాగనిస్తోంది. ఈ మ్యాజిక్ సర్కిలే రామోజీరావు వేధింపుల నుండి కేసును నిర్మింపజేసి, పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదుకి అడ్మినిస్ట్రేషన్ సాక్ష్యాలని సంపాదించి పెట్టింది. ఈ మ్యాజిక్ సర్కిలే రామోజీరావు గూఢచర్య తంత్రాలనీ, అతడి నిజస్వరూపాన్ని బహిర్గతం చేసింది, చేస్తోంది. అతణ్ణి, అతడి ఏజంట్లనీ, అతడి గూఢచర్య అస్థిత్వాన్నీ నిరూపించింది, నిరూపిస్తోంది. ఈ మ్యాజిక్ సర్కిల్ లో ఉన్నదీ ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసమే!’
ఈ మ్యాజిక్ సర్కిల్ ని పీవీజీ మా చుట్టూ, మన దేశం చుట్టూ ఎలా నిర్మించాడో.... ఆ విధంగా మమ్మల్ని, మన దేశాన్ని కూడా ఎలా రక్షించాడో వివరిస్తాను. ఆర్దికమాంద్యపు కోరల్లో పడి అగ్రదేశం అమెరికాతో సహా అన్ని దేశాలూ సతమతం అవుతున్నా, మన్మోహన్ సోనియాలు దేశాన్ని కార్పోరేట్ కంపెనీలకు ఎంతగా దోచిపెడుతున్నా, దేశీయ ప్రభుత్వ కంపెనీలని తెగనమ్మిపారేస్తున్నా, సెజ్ ల పేరుతో భూమి బదలాయింపులు చేసి స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు నిల్వల పాతర్లు వేసినా.... ఇంకా ఇండియా మిగిలి ఉండటమే అందుకు నిదర్శనం.
మేము ప్రాణాలతో ఉండటం మరో నిదర్శనం. ఇన్ని వ్రాస్తున్నా.... పరోక్షంగా పత్రికా వార్తలతో, అజ్ఞాత వ్యాఖ్యాలతో బ్లాగు వ్రాయటం ఆపమనటమే గానీ.... మరే విధమైన ప్రతిఘటనా, అంతరాయమూ కలిగించ లేకపోవటం ప్రత్యక్ష నిదర్శనం. ఈ బ్లాగు ప్రారంభించిన రోజు నుండి మా మనీ బ్యాలెన్స్ సున్నానే. అయినా గానీ ఈ ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంది.
ఇంత అద్భుతమైన మ్యాజిక్ సర్కిల్ ని పీవీజీ ఎలా నిర్మించాడో చెప్పాలంటే మరో సారి 1992 దగ్గరికి వెళ్ళాలి.
1992 జూన్ 5 న పీవీజీకి ఫిర్యాదు ఇచ్చాక ఆగస్టులో తిరిగి గుంటూరు కు వచ్చాను. ఆగస్టు 9 న అప్పటికి క్విట్ ఇండియా ఉద్యమం[1942] జరిగి 50 ఏళ్ళయిన సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా మాట్లాడుతూ.... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా పొల్గొన్న , ప్రత్యక్ష ప్రసారం అయిన, ఓ కార్యక్రమంలో.... పీవీజీ "Do not under estimate the strength and wisdom of our people" అన్నారు.
కేవలం అయిదారు వ్యాకాలు మాత్రమే ఉన్న ఆయన ఉపన్యాసంలో, ప్రారంభ ముగింపు వాక్యాలు పోను under line గా అన్నది ఈ ఒక్క వాక్యమే కావటంతోనూ, ఆ వాక్యాన్ని ఆయన ఒత్తిపలికిన తీరు ప్రత్యేకంగా ఉండటంతోనూ, అది మాకు బాగా గుర్తుండిపోయింది. ఆశ్చర్యమూ వేసింది. అప్పటికి అది మాకెంతో స్ఫూర్తిగా అన్పించింది. ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం’ విశ్లేషించటానికి మాకు అది చాలా ఉపయోగపడింది.
అయితే మరో ప్రక్క, అక్టోబరు 9 న నేదురమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయి కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో నా ఫ్యాక్టరీని నిబంధనలేవీ పాటించకుండానే సీజ్ చేశారు. ఇలాంటి ఎదురుదెబ్బలతో అయోమయానికీ, ఆందోళనకీ గురై, మండలి వెంకట కృష్ణారావు ని కలిసాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు పీవీజీని కలిసి మాట్లాడతానన్న మండలి, తర్వాత కలిసినప్పుడు "పీవీజీని కలిశాను గానీ, నీ విషయం మాట్లాడటానికి వీలు కాలేదమ్మా" అన్నాడు.
ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ కీ జాయింట్ డైరెక్టరుగా పనిచేసి రిటైర్ అయిన బుడ్డిగ సుబ్బరాయన్ నీ కలిశాను. వాళ్ళు నిర్వహించిన ఏపీ దర్శన్ టూరులో గుంటూరు నుండి పాల్గొన్నాను మరి! అప్పటి నుండి ఉన్న పరిచయమే నాటి విద్యాశాఖా మంత్రి మండలి వెంకట కృష్ణారావుతో.
సుబ్బరాయన్ కి, అప్పటి మా పరిశీలనలు కొన్ని చెప్పాను. అప్పట్లో మా చుట్టు జరిగిన అసాధారణాలలో కొన్నిటిని పట్టుకున్నాము. దాన్ని ప్రస్తావిస్తూ సుబ్బరాయన్ నాతో "ఒకోసారి ’స్పై’గా పట్టుబడటం కూడా ’స్పయింగ్’లో ఓ భాగం" అన్నాడు. ఈయనని నేను గురువుగా గౌరవించేదాన్ని. అంచేత ఆయన చెప్పినది నాకు హింట్ గా తోచింది. మరింత పరిశీలనా దృష్టి పెరిగింది. అప్పటికే ఆయన ’సురభి’ పేరుతో బాలల పెద్దబాలశిక్ష వ్రాసాడు. అలాంటి ఆయన రచనాలు నాకు తెలుసు. ’నాయకత్వ లక్షణాలు’ అనే పుస్తకాన్ని ఆయన నాకు బహుమతిగా ఇచ్చాడు. చూస్తే అది ఆయన వ్రాసిందే!
ఆయన ఓ పుస్తకం వ్రాసే ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు నుండి మాలాంటి శిష్యులతో చర్చించటం జరిగేది. అలాంటిది దాని గురించి నాకు ఏ సమాచారమూ లేకపోవటంతో చాలా థ్రిల్ అయ్యాను. ఆ పుస్తకంలో ఆయన ఇచ్చిన ఉదాహరణలు నాకు నచ్చలేదు. ’ధైర్యానికి నిదర్శనంగా హారీ ట్రూమన్ జపాన్ మీద అణుబాంబు వేసే నిర్ణయాన్ని తీసుకోవటం’ అనటం వంటివి.
అయితే దాదాపు ఇరవై చెప్పగా ఆ నాయకత్వ లక్షణాలు ఏ మనిషికైనా ఎంతో ఉపయోగపడేవిగా తోచింది. ఉదాహరణకి - జీవితంలో రాణించాలనుకునేవాడు భావ ప్రసార శక్తి ఎక్కువగా కలిగి ఉండాలి. అంటే ఇతరులకి అర్ధమయ్యేలాగా చెప్పగలిగే నైపుణ్యం, ఇతరులు చెప్పింది అర్ధం చేసుకోగల నైపుణ్యం ఉండాలి.
మరొకటి - వ్యక్తి పరిస్థితులని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. సాధ్యం కాకపోతే తాను పరిస్థితులకి అనుకూలంగా మారిపోయి, క్రమంగా పరిస్థితులని తనకి అనుకూలంగా మలుచుకోవాలి.
ఇలాంటి అంశాలు నాకు బాగా నచ్చాయి. ’ఎవరి జీవితానికి వాళ్ళం నాయకులమే కాబట్టి, ఆ నైపుణ్యాలు, లక్షణాలు పెంపొందించుకోవటానికి, ప్రయత్నించాలి’ అనుకున్నాను. తర్వాత శ్రీశైలంలో స్పోకెన్ ఇంగ్లీషు కోసం వచ్చిన విద్యార్ధులకి కూడా దాన్ని వివరించి నేర్పేప్రయత్నం చేశాము. ఈ పుస్తకం శ్రీశైలంలోని మా గుడిసెలో, నా డైరీతోపాటుగా ఉండిపోయింది. దానిపై వ్రాసుకున్న నోట్సుతో సహా!
ఇక అప్పటి సుబ్బరాయన్ చెప్పిన ’స్పైగా పట్టుబడటం కూడా స్పయింగ్ లో ఓ భాగం’ అన్న సూత్రాన్ని రకరకాలుగా అనువర్తించే ప్రయత్నం చేసే వాళ్ళం!
ఇలా జరుగుతున్న వాటిని అర్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగానే డిసెంబరు వచ్చేసింది. బాబ్రీ కూలిన రోజున టీవీ ముందు నుండి కదలను కూడా లేదు. అప్పటి ప్రసారాలని రెప్పవాల్చకుండా చూశాను. ఆ రోజులలో.... ఈనాడు, ఇండియా టుడే పక్షపత్రికలో గూఢచర్యం గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు ప్రచురింపబడుతూ ఉండేవి. అన్నిటినీ చదవటమే మా పనిగా ఉండేది.
అంతలో హఠాత్తుగా.... 1992, నాకు గుర్తుండి క్రిస్మస్ రోజు నుండి, మాకు పేపరు వేసే అతను పేపరు వేయటం మానేసాడు. అప్పటికి నేను అతనికి పేపరు డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది. అందుకోసం కూడా రాలేదు. పిలుస్తున్నా, వేగంగా సైకిల్ తొక్కుకుంటూ, తలత్రిప్పి చూడకుండా వెళ్ళిపోయేవాడు. ఉదయాన్నే వార్తాపత్రికలు చూడకబోతే నిశ్చింతగా ఉండేది కాదు. చివరికి ఫ్యాక్టరీ వెనకనున్న టీ హోటల్ కి వెళ్ళి మా తమ్ముడూ, లెనిన్ పేపరు చూసి వచ్చి చెప్పేవాళ్ళు. ఓ వారం పదిరోజుల గడిచే సరికీ హోటల్ లోనూ పేపరు లేకుండా పోయింది.
ఇంతలో మా ఇంట్లోనూ సమస్యలు మొదలయ్యాయి. ఫలితంగా కట్టు బట్టలతో ఇల్లు వదిలాను. స్నేహితులెవరూ సాయం చేయని స్థితిలో శ్రీశైలం చేరి, పెళ్ళి చేసుకుని, గుడిసెలో జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాను. ఆ వివరాలు గత టపాలలో వ్రాసాను.
గుడిసెలో ఉండగానూ కఠోర పరిస్థితులని ఎదుర్కొన్నాము. అదంతా పీవీజీనే చేస్తున్నాడని అనుకున్నాము. అప్పటి మా మనఃస్థితి రకరకాల వత్తిళ్ళతో నిండి ఉండేది. ఓ పరిమితి వరకూ గూఢచర్య అవగాహన చేసుకోవడం బాగానే అన్పించేది. అది మరీ నొప్పిగా అన్పించినపుడు "ఠాఠ్! అతడెవ్వరూ నా జీవితాన్ని ఇలా చేయటానికి?" అంటూ పీవీజీని తిట్టుకునే వాళ్ళం. మరీ ముఖ్యంగా అహం మీద దెబ్బతగిలినప్పుడూ, ఆశ నిరాశలకి గురి చెయ్యబడినప్పుడూ! 2005 తర్వాత గానీ - ’అప్పుడు కార్చిన చెమట, ఇప్పుడు రుధిరం కార్చకుండా కాపాడిందన్నది’ అర్ధం కాలేదు.
నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల మానసిక తంత్రాలన్నీ అహం మీదా, అరిషడ్వర్గాల మీదా ఆధారపడి ఉంటాయి గనకే, అది మాకు తప్పని సాధన అయ్యిందన్నది అర్ధమయ్యింది. లేనట్లయితే అహం రెచ్చగొట్టినప్పుడు క్రోధానికీ, ఆపైన ఆశా నిరాశలతో అలసటకీ, అహాన్ని తృప్తి పరచినప్పుడు ప్రలోభానికో భ్రమకో గురై , ఈ పాటికి ఎప్పుడో రాలిపోయి ఉండేవాళ్ళమన్నది తర్వాత్తర్వాత బాగా అర్ధమయ్యింది. అసలా సాధనకే రామోజీరావు మా మీద ప్రయోగించిన మానసిక తంత్రాలు అర్ధమయ్యాయి అనటం సబబుగా ఉంటుంది.
అయితే అప్పుడింతగా అవగాహన లేనందున, అక్షరాలు నేర్చుకునే విద్యార్ధికి అవెందుకు అవసరమో తెలియక నేర్చుకోవటానికి ఎలా మొరాయిస్తాడో, మేమూ అలాగే మొరాయించాము. విద్యార్ధికి లాగే దెబ్బలూ తిన్నాము. కాకపోతే పరోక్ష దెబ్బలు.
మనుష్యుల మధ్య అనుబంధంలో కూడా డొల్లఎంత, రూపాయి ఎంతగా మనసుల మధ్య బీటలు తెస్తుందో, గెలుపోటములని బట్టి మనిషి ఎలా తూకం వేయబడతాడో కూడా నేర్చుకున్నాము. 1992 నాటికే నేను ’గీత’ చేత బట్టుకుని నడిచేదాన్ని. అది మరింతగా ధృఢ పడింది.
అనుబంధాల విషయంలో ’గీత’ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ఏడ్చాను. ముఖ్యంగా తోబుట్టువులూ, ప్రాణమిత్రుల నుండీ చేదుని అందుకున్నప్పుడు..... !
ఆ సందర్భంలో.... "సరస్సు అడుగున బురద ఉంటుందనీ, అందరికీ తెలుసు. కానీ అందరిలాగే నేనూ పైనున్న తేటనీరే చూస్తాను. కదిలే అలల్ని, నీటి గలగలల్నీ, తేలే ఆకుల్ని, ప్రతిఫలించే మబ్బుల్నీ, సూర్యాచంద్రుల నీడల్ని చూసి ఆనందిస్తాను. అనుబంధాలు అంతే! ఓ పరిమితి దాటితే సరస్సులోని స్వచ్ఛమైన నీటి అడుగున బురద ఉన్నట్లే, అనుబంధాల అడుగున కూడా మాధుర్యం ఇగిరిపోయి చేదు మిగలవచ్చు. కానీ పనిమాలా అది చూడాల్సిన పని నాకేమిటి?" అనుకొని ఎంతగా ఆక్రోశ పడ్డానో! ఎంతగా పీవీజీని తిట్టుకున్నానో!
ఒకే పడవ ప్రయాణీకులమై, ఈ విషయంలో మామధ్య [నేను, మా వారు లెనిన్] బంధం మరింత ధృఢపడింది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
'నకిలీ కణిక వ్యవస్థ' అంటే ఏమిటండి?
ఒకవేళ ఈ పదాలని నిషేధిస్తే , మీరు వ్యాసం రాయగలరా? :D
I remember movie called Pothuraju. Actor is Kamal hasan. in that lead actress name is Adi Lakshmi and she has an Ox called bheemudu... I thought there might be some resemblance name yadla adilakshmi... and also they kill the actress cruelly... may be this one was created to scare you... released on 09/17/2004
'గీత ' గురించి కొద్దిగా విపులంగా మీ శైలిలొ ఒక శీర్షిక రాయగలరు.
-శ్రీరాం
కృష్ణ గారు : ఆ సినిమా చూశానండి. కాకపోతే అప్పుట్లో నాకు ఆ దృష్టి లేదు. ఇప్పుడు ఆ సినిమానే గుర్తు లేదు. నెనర్లు!
శ్రీరాం గారు: గతంలో కొన్ని టపాలు, టపాలలో ఉదహరించాను. నెనర్లు!
Post a Comment