1996 లో పీవీజీ ఎన్నికలలో ఓడిపోయే ముందు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులకి, పీవీజీ బృందపు చిరునామా [out let]గా మా గురించిన వివరాలు అందాయి. పీవీజీ బృందం అంటే నెం.5 వర్గం అన్నమాట. అయితే ఈ వర్గం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుందని అప్పటికి నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావులు అనుకోలేదు. గత టపాలలో ఈ వివరాలు వ్రాసాను.

అప్పటికి మేము ’పీవీజీ, ఆయనకి రామోజీరావు గురించి ఇచ్చిన ఫిర్యాదు’ గట్రాలన్నీ మరిచిపోవాలనే నిర్ణయానికి వచ్చి కొన్ని నెలలయ్యింది. రామోజీరావుకి మా గురించి తెలిసిన వెంటనే, మా గురించిన సమగ్ర సమాచారం సేకరించ ప్రయత్నంచటం సహజం కదా! అది గూఢచర్యం, అతడు గూఢచార ఏజన్సీకి కీలక వ్యక్తి మరి! ఆ సమగ్ర సమాచారంలో భాగంగా మాకు చెప్పబడిన ’రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే ఆటగాడి విన్యాసమూ’ రామోజీరావుకు తెలిసింది.

ముందుగా అతడు దాని పట్ల స్పందించిన తీరు....

ఎటూ నకిలీ కణిక అనువంశీయులకి వచ్చింది రిమోట్ కంట్రోలుతో డీవీడీని ఆపరేట్ చేయటం వంటి గూఢచర్యమే. తెలిసింది పది స్ట్రాటజీల వంటివే! అందులోనూ అహాన్ని రెచ్చగొట్టటం లేదా అహాన్ని తృప్తి పరచటం వంటివే ప్రధానమైనవి. భయపెట్టటం లేదా ప్రలోభ పెట్టటం. నమ్మించి ద్రోహం చెయ్యటం. ఆడది - ఆకలి ప్రయోగించటం.

కాబట్టే పెద్ద పరిమాణంలో [i.e. దేశపు స్థాయిలో, గతం వర్తమానాలలో] ఏ స్ట్రాటజీలు ప్రయోగించారో అవే, చిన్న పరిమాణంలో మా మీదా రామోజీరావు ప్రయోగించాడు. అంతకంటే ఎక్కువ తంత్రాలూ, వ్యూహాలూ తెలియవు కూడా! తర తరాలుగా బలపడటంతో, ఎవరికీ తెలియనందున ఎదురులేక పోవటంతో కలిగిన అహంకారానికి, నకిలీ కణిక ప్రస్తుత అనువంశీయులకి తమకి తెలిసిందే గూఢచర్యం అనుకోవటం తప్పితే, తెలిసింది ఏమీలేదు. రిమోట్ కంట్రోలుతో డీవీడీ ని ఆపరేట్ చేయటమే గూఢచర్యం కాదు గదా! డివీడీ ని ఎసెంబుల్ చేయటం అసలైన విద్య అవుతుంది.

గూఢచర్య విద్యలే కాదు, ఏ విద్యకైనా మూలాలు భారతీయ హిందూ ఇతిహాసాల్లోనూ, వేద వాంగ్మయంలోనూ, సంస్కృత ఉపనిషత్తులలోనూ నిక్షిప్తమై ఉండగా..... అరిషడ్వర్గాలతో, మనో వికారాలతో, పెర్వర్షన్లు పెచ్చరిల్లగా, భూగోళాన్ని చిటికెన వేలి మీద నడిపిస్తున్నామను కొనే వారికి పీవీజీ ఒక అల్ప జీవిలా కనిపించాడు.

కాబట్టే 1992 లో మాకు చెప్పబడిన రెండు బోర్డుల ఆటలో A,B లకి ఆట వచ్చు. C కి రాదు అంటే ఆ ’C' ని పీవీజీ గానూ, మమ్మల్ని గానూ ఊహించాడు. మాకు గూఢచర్యపు ఆటరాదు. నిజమే! కానీ పీవీజీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడటం రాదు అనుకున్నాడు. అలా అనుకోవటమే పీవీజీకీ, నెం.5 వర్గానికీ కూడా కావలసింది. అందుకే ఆ సమాచారం వ్యూహాత్మకంగా అతడికి ’లీక్’ చెయ్యబడింది. ఈ మాత్రం నకిలీ కణిక వ్యవస్థ ఊహించలేదా అని అనుమానం రావచ్చు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను.

ఒక వృత్తపరిధి మీద A,C అనే ఇద్దరు పరుగు పెడుతున్నారనుకొండి. కొంత సమయం పరుగు పెట్టిన తరువాత ఇద్దరి మధ్య దూరం సరి సమానంగా ఉందనుకొండి. అప్పుడు A, C వెనక పరుగుపెడుతున్నాడో తెలియదు. C,A వెనక పరుగుపెడుతున్నాడో తెలియదు. ఇది కూడా అలాంటిదే! తాము అవతలి వాళ్ళ ఎత్తును కనుక్కున్నామో తెలియదు, లేక అవతలి వాళ్ళే కావాలని లీక్ చేసారో తెలియదు.

ఇక, రామోజీరావు ఈ ’రెండు బోర్డుల చదరంగపు ఆట’ గురించి మా అవగాహన ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసాడు. అయితే అప్పటికే మేం అన్ని వదిలేసి మా ’బ్రతుకు’ అన్న దగ్గరున చోట - అతడి వెదుకులాట, 1996 నుండి 2005 వరకూ అలా అలా సాగుతూనే ఉండింది. అప్పట్లో మేము అవేవీ పట్టించుకోలేదు గానీ, 2005 తర్వాత అన్నిటినీ పునః సమీక్షించుకున్నప్పుడు.... రామోజీరావు, ఈనాడు వ్రాతల్తో.... 1992 నుండి 1995 వరకూ పీవీజీ ఎలాగైతే రామోజీరావు ముఖము [శతృవు పాత్రా], తన ముఖమూ [నెం.5 వర్గంల మితృడి పాత్రా] పెట్టాడో... అలాగే రెండుభాషలూ మాట్లాడటం అర్ధమయ్యింది.

అప్పటికైతే [అంటే 1995 నుండి 2005 వరకూ] మాత్రం రామోజీరావు.... మా చుట్టూ వెదుకుతూనే ఉన్నాడు. తాను, ఈనాడు వార్తాంశాల రూపంలో, వార్తాంశాల శీర్షికల రూపంలో, శతృమితృల భాషలు రెండూ మాట్లాడటం, మా స్పందన, అవగాహన ఏమిటో పరిశీలించటం! మేము మా గొడవల్లో మేముండే వాళ్ళం. ఎప్పటికప్పుడు వేధింపులకి పైకారణాలే [over leaf reasons] చూసేవాళ్ళం. చేతనైనట్లు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించే వాళ్ళం.

మరో విధంగా చెప్పాలంటే - ఏమీ లేని చోట నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావు తెగ వెదికారు. ఆ విధంగా 1992 కు ముందర భారత నిఘా ఏజన్సీలని, నిబద్దత గల దేశ నాయకులనీ ఎలాగైతే ఏమీ లేని చోట ఏదో ఉందనే అనుమానం పుట్టించి, వెదికింపించి వినోదించారో... సరిగ్గా అదే సువర్ణముఖిని, రామోజీరావు, 1996 నుండి 2005 దాకా మా విషయంలో అనుభవించాడు.

మేము ఎవరితోనూ రాజకీయచర్చలు, గట్రాల గురించి మాట్లాడే వాళ్ళం కాదు గనుక, తాము ఏమీ లేని చోట వెదుకుతున్నామన్న స్పృహ కూడా లేకుండా వెదికారు. దీనికి ప్రాతిపదిక ఏమిటంటే -

1992 లో మాకు చెప్పబడిన రెండుబోర్డుల చదరంగపు ఆటని అర్ధం చేసుకునే ప్రయత్నంలో [1992 నుండి 1995 వరకూ] మేము రకరకాల విశ్లేషణలు చేసుకున్నాము. అందులో భాగంగా - పీవీజీ మీద, దేశపు పరిమాణంలో సీఐఏ [అప్పటికి అదే మనదేశం పాలిట విలన్ అనీ, రామోజీరావు సీఐఏ ప్రధాన ఏజంట్ అనీ మా ఉద్దేశం.] ఏయే స్ట్రాటజీలు ప్రయోగిస్తోందో, వాటిని పీవీజీ తెచ్చి మన మీద వేస్తున్నాడేమో! అంటే A Vs C బోర్డు పెద్దపరిమాణంలో ఉంటే C Vs B బోర్డులాగా చిన్నపరిమాణంలో మనం ఉన్నామేమో! ఆ విధంగా అక్కడేం జరుగుతోందో ఇక్కడ మనకి అవగాహన కల్పిస్తుండవచ్చు. కాకపోతే దేశానికి మంచి చేసే వ్యక్తి మనకెందుకు కీడు చేస్తాడు? కీడు చేసే వాడే అయితే చంపేస్తాడు గానీ ఇదంతా ఎందుకు? - ఇదీ అప్పటి మా విశ్లేషణ. [కాని సంతృప్తిగా అన్పించేది కాదు.]

దీన్ని ఆసరాగా తీసుకుని, రామోజీరావు మా మీద తన వ్యూహం ప్రారంభించాడు. ఇక మాకు ఎన్ని కథలు చెప్పాడంటే - దీనిని భాషగా దిద్దటానికి ప్రయత్నించాడు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక పదాలను సృష్టించుకున్నాడు. నానార్ధాలు, వ్యాకరణం, నామాంతరాలు[అలియాస్ లు], ఇంకా చాలా సృష్టించాడు. వాటితో నిరంతర వార్తా స్రవంతి నడిపేవాడు.

A Vs C మరియు C Vs B బోర్డుల మీద, A ఎత్తుగడని B మీదా, B ఎత్తుగడని A మీదా ప్రయోగించే C ఆటని 8 గా అభివర్ణించాడు. ఇంగ్లీషు అక్షరం S కి, కుడి ఎడమలుగా తిరగదిప్పిన S ని నిలువుగా అతికిస్తే 8 ఏర్పడుతుంది కదా! A, Bలతో C ఆటతీరుని, అది రేఖాచిత్రంగా ప్రతిబింబిస్తుందన్న మాట.

రామోజీరావు మమ్మల్ని వేధిస్తున్న కీలక సమయాల్లో - ఎవరి వెనకైతే తను దాగి మమ్మల్ని వేధిస్తున్నాడో వాళ్ళ మీద మేము ఫిర్యాదులు పెట్టవద్దనీ, ఎందుకంటే ఇదంతా స్ట్రాటజీ అనీ, మాకు అవగాహన కలిగించటానికి తాను పెద్ద పరిమాణపు వ్యవహారాలనీ,స్ట్రాటజీలనీ ఇక్కడ మా మీద ప్రయోగిస్తున్నాననీ చెప్పడానికీ, "వేధింపుకి ఎదురు తిరిగి పోరాడకు! స్ట్రాటజీ ఇది అనుకుని భరించు. ఫిర్యాదులు పెట్టకు" అని చెప్పేటందుకు - 8 ప్రముఖంగా వ్రాస్తూ....శీర్షికలలో, వార్తాంశాలో, పేద్ద వాణిజ్య ప్రకటనలో వ్రాస్తాడు. అప్పుడు ఫిర్యాదులు! ఇప్పుడైతే బ్లాగు టపాలు వ్రాయవద్దంటూ ’8’ గుర్తు చేస్తుంటాడు.

శ్రీశైలంలో 2007 లో సిబిసిఐడి ఐజీ కృష్ణరాజ్ దగ్గరి నుండి, మేము రాష్ట్రపతీ, ప్రధానమంత్రి, సోనియాలకి రామోజీరావు మీద పెట్టిన ఫిర్యాదులు తనకి Forward అయ్యాయంటూ స్టేట్ మెంట్లు తీసుకునేటప్పుడు, శ్రీశైలం సిఐ మార్చి 8 తారీఖున మా స్టేట్ మెంట్లు వ్రాయించుకున్నాడు.

ఆ రోజు ’ఎనిమిదినే ఎందుకు’ అంటూ ఈనాడు బాక్సు ఐటమ్ వ్రాసింది. వార్తాంశానికి శీర్షికకి పొంతన లేకుండా! అలాగే శ్రీశైలం ఈవో మా గది కేటాయింపు రద్దు చేసినప్పుడు, గడువు ఇమ్మని కోరగా... ఇచ్చిన సమయానికి ఆఖరు తేదీ మే 8. వెరసి 2007, మే 8 న మేము శ్రీశైలం వదలి రావాల్సి వచ్చింది.

ఇప్పటికీ 8 అంకెతో బాక్సులు కట్టి ఈనాడు వార్తలూ, ప్రకటనలూ వ్రాస్తుంటుంది. గత పదిరోజులలోనూ వ్రాసింది. ఏప్రియల్ 8 వ తేదిన తొలిపేజీలో SBI ప్రకటన దీనికి తాజా ఉదాహరణ. ఆ ప్రకటన అబద్దమని గానీ, SBI కారులోన్లు 8% వడ్డీతో ఇవ్వడం లేదని గానీ నేను అనటం లేదు. ఆ విషయాన్ని అలా ప్రజంట్ చేయటంలో ఓ ప్రత్యేక ప్రయోజనం ఉందంటున్నాను.

ఆ వాణిజ్య ప్రకటనలో 8 అంకెకు క్రింద ’వడ్డీ రేటు యొక్క అవరోధాలు ఇక తొలిగిపోయాయి!’ అని వ్రాయబడి ఉంది. మిగిలిన శీర్షికలతో కలగలిపి చదువుకుంటే దానికి ప్రత్యేక అర్దం ఉంటుంది. ఒకే విధంగా ఉన్న రెండు బోర్డుల వ్యవహారంలో ఉన్న అవరోధాలు ఇక తొలిగిపోయాయని, కాబట్టి మరొక్కసారి ఢిల్లీకి వెళ్ళి సోనియాని కలవాలని చెప్పబడింది.

ఏప్రియల్ నాలుగు[4]న ఈ అంకె ఎంత ఖరీదో.... అనే హెడ్డింగ్ క్రింద ఎనిమిది[8] బొమ్మ వేసి వేలం గురించి వ్రాయబడింది. అంటే ఐడెంటికల్ గా ఉండే చదరంగము బోర్డుల కాన్సెప్టు ఎంత ముఖ్యమైనదో గమనించమని ఆ ప్రకారం నడుచుకోమని పై సొల్లు వార్త ద్వారా చెప్పబడింది.

ఎందుకంటే....8, కారు, 7, డాక్టరు, తెలంగాణా ఇలాంటి ఎన్నో పదాలని ప్రత్యేక అర్ధంతోనూ, కొందరు వ్యక్తులకి నామాంతర పదాలు [ఎలియాస్ లు] గానూ రామోజీరావు వాడుతుంటాడు. వివరంగా చెబుతాను.

ముందుగా నామాంతర పదాల గురించి చెబుతాను.

వై.యస్. బ్రతికున్నరోజుల్లో: వై.యస్. జన్మించిన నెల 7వ నెల. అలాగే పియం మన్మోహన్ సింగ్ చిరునామా కూడా 7, రేస్ కోర్సు రోడ్డు. ఇద్దరిలో కామన్ గా ఉన్నది 7 కాబట్టి తాను చెప్పదలచుకున్నప్పుడు ఆ పేర్లకి బదులుగా 7 నెంబరుని వాడతాడు. అలాగే వీళ్ళకి ఎలియాస్ గా ఒకోసారి ధోని ని కూడా వాడతాడు. ధోని జన్మదినం 7వ నెల,7 వ తేదీనే! తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఆ వ్యక్తుల పేరిట పలికిస్తూ చెప్తాడు. మేము శ్రీశైలం నుండి ఇంటి సామాగ్రి తెచ్చుకున్నది కూడా 7వ నెల, 7 వ తేదీనే!

మేము ముందుగానే వెళ్ళాము గానీ లారీ మాత్రం తీరిగ్గా ఆ రోజే వచ్చి ఇంటి సామాగ్రి నంద్యాలకి చేర్చింది. అంటే అర్ధం ఏమిటంటే "మేమే నీ సామాను దగ్గరుండి నంద్యాలకి పంపించాము. ఇది స్ట్రాటజీ! నువ్వు ఇది గుర్తించు" అని చెప్పటం! "అదే చంద్రబాబు నాయుడైతే మీ ఇంటి సామాగ్రి కూడా ఊడగొట్టి మిమ్మల్నీ ప్లాట్ ఫామ్ పాలు చేసాడు. ఆ వ్యత్యాసం గుర్తించు" అని చెప్పటం!

అలాగే డాక్టర్ వై.యస్., డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎప్పుడయినా ఏవిషయాన్నాయినా చెప్పదలుచుకున్నప్పుడు డాక్టర్ గారి సలహాలు అనో, లేదా ఏదో ఒక ప్రముఖ డాక్టర్ చేత చెప్పిస్తూ ఆ వ్యాఖ్యలని అండర్ లైన్ చేస్తూ, అప్పటి ఆ [మా]సందర్భానికి తగిన సలహాలు చెప్తాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

okka mukka kuda artham kalEdu

ఒక్క ముక్క చదివితే అంతే! అన్ని టపాలు చదివితే అర్ధం అవుతుందండి. ఇవి ఒకదానికొకటి లింక్ ఉన్న టపాలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu