నిజానికి నేను 1992 కు ముందరా భగవంతుణ్ణీ, గీతనీ నమ్మి నడిచే దాన్ని. గీత తెరిచి, ఎదురుగా ఉన్న శ్లోకాన్ని బట్టి, blunt గా నిర్ణయాలు తీసుకున్న రోజులున్నాయి. ఆ నిర్ణయాల వలన ఎప్పుడూ మంచే జరిగింది. అదే లక్షణంతో, 1992 నుండి 1995 వరకూ, పీవీజీ మాకు గూఢచర్య అవగాహన కలిగిస్తున్న రోజుల్లో, పీవీజీతో సైతం ’భగవంతుడు మాతోనే ఉన్నాడనీ, పీవీజీ నే తప్పు చేస్తున్నాడనీ’ వ్యతిరేకించేవాళ్ళం. ఇక 1995 నుండి 2005 వరకూ అన్నీ మరిచి పోయి మా బ్రతుకు మాది అనుకునే రోజుల్లోనూ మాకు దైవమే అండ.

2005 తర్వాత మా జీవితాల్లో గూఢచర్య ప్రమేయం అర్ధమయ్యాక, మేము దైవం మీద మరింతగా ఆధార పడటం జరిగింది.

కాకపోతే ’గీత’ తెరిచి కనబడిన శ్లోకాన్ని గుడ్డిగా ఆచరించడం మానేసాము. ఎందుకంటే దాన్ని కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులని ప్రభావపరిచి, మనమో నిర్ణయానికి వచ్చేలాగా ’మాయ’ చేయగల అవకాశం గూఢచర్యంలో ఉందన్నది అర్ధమైంది.

ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. రెండేళ్ళ క్రితం ‘ఈనాడు’పత్రిక.... ’రాగాల ఇంట మూగబోయిన గొంతులు’ అంటూ ఓ వార్త వ్రాసింది. అందులో అన్నమయ్య వారసులు.... అయిదు, ఆరు తరాలకు చెందిన వారు జన్మతః మూగ బధిరులనీ, తితిదే లో అటెండరు స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ దారిద్ర్యంతో బాధపడుతున్నారనీ వ్రాసారు. అంతే తప్ప, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన రోజులలో మిరాశీ దారుల హక్కులనీ, ఆస్థులనీ ఊడగొట్టి, అలాంటి వారందరి ఆర్ధిక మూలాలు నలిపేశారని గానీ, హక్కుల్నీ ఆస్థుల్నీ కాపాడుకునేందుకు కోర్టుకెళ్ళి మిగిలిన ఆస్థుల కూడా పోగొట్టుకొని వాళ్ళు మరింత పేద వాళ్లయ్యారని గానీ వ్రాయలేదు. ఎందుకు వ్రాస్తుంది, ఎన్టీఆర్ ల వంటి ప్రభుత్వాల వెనకా, కోర్టుల వెనకా, నకిలీ నణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు లే కదా ఉన్నది?

స్వాతంత్ర సమర యోదుల వారసుల మీదా, అన్నమయ్య వంటి భావవాదులా భక్తులా వారసుల మీదా, గురిపెట్టి మరీ వెతలు పెట్టిందీ, భ్రష్టు పట్టించిందీ కూడా నకిలీ కణీక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులే! ఈ గూఢచార అనువంశీయులు తర తరాలుగా ఈ పనులని నిర్వహించుకు వచ్చారు.

తల్లిదండ్రులూ పెద్దలూ, చేసిన పాపపుణ్యాల ఫలితాలు తరతరాలకి సంక్రమిస్తాయని హిందువులు నమ్మకం. మనం మంచి చేస్తే అది మన భావితరాలని కాచి కాపాడుతుందనీ, పాపం చేస్తే అది శాపమై తగులుతుందనీ నమ్ముతాం. అలాంటి చోట అన్నమయ్య వంటి మహానుభావుల, భక్తాగ్రేసరుల సంతతి దుస్థితి గురించి విన్నప్పుడు ఏమని పిస్తుంది? భగవంతుడి గురించీ, పాప పుణ్యాల గురించీ నమ్మకాల పునాదులు కదులుతాయి. ‘దేవుడే ఉంటే ఇలా జరుగుతుందా?’ అన్పిస్తుంది. అన్యాయాలు పెచ్చరిల్లటం, అవినీతి పరులకే అన్ని అవకాశాలు రావటం, పదే పదే చూసినా అదే భావం కలుగుతుంది.

నిజానికి ఆధునిక రసాయనాలతో స్లోపాయిజన్ చేసినా, గర్భస్త శిశువుల మీద సైతం ప్రయోగించినా, తాము లక్ష్యంగా ఎంచుకున్న కుటుంబాలలో ఇలాంటి మూగ బధిర శిశు జననాలని నియంత్రించవచ్చు. క్లోనింగ్ శిశువులనే సృష్టించగలిగిన చోట అది అసాధ్యం కాదు గదా! కానీ ఇవేవీ పెద్దగా ఆలోచించనప్పుడు, స్ఫురణకు రానప్పుడూ, ఆయా విషయాల గురించి ప్రచారిస్తే.... భగవంతుడి మీద నమ్మకాలు కూడా ఒడిదుడుకులకు గురవుతాయి. ప్రభావ పరచబడతాయి.

‘అలాంటప్పుడు ’గీత’ తెరిచి కనబడిన శ్లోకాన్ని మనస్సుకి స్ఫురించినట్లుగా ఆచరించటాన్ని కూడా... ఇతరులు తమకి అనుకూలంగా మలుచుకోవచ్చు. గూఢచర్యంతో చుట్టూ పరిస్థితులని ప్రభావపరిచి, ఒక పధకం ప్రకారం సమాచారం చేరవేస్తే.... అది సాధ్యమే. అందు చేత కూడా, గీత శ్లోకాలని గుడ్డిగా అచరించడం మానేసాము.

ఇప్పటికీ.... ‘నెం.5 వర్గం, మమ్మల్ని ప్రాణాపాయం నుండి కాపాడుతుంది, వేధింపుని మాత్రం వదిలేసి ఊరుకుంటుంది’ అనుకున్నా.... ‘నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలు మమ్మల్ని వేధించగలుగుతూ, ప్రాణాలు మాత్రం తీయలేకున్నా’.... మేము ఇవేవీ పట్టించుకోము. అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అనుకుంటాము.

"ఒకప్పుడు నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకీ హవా నడిచిందన్నా.... అదీ దైవేచ్ఛ ప్రకారమే జరిగింది. ఇప్పుడు వాళ్ళకి పరిస్థితి తిరగబడి, నెం.5 వర్గానికి గూఢచర్య పట్టు, ప్రపంచ పరిస్థితులపై ఆధిపత్యమూ కలిగిందన్నా.... అదీ దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది" అనుకుంటాము.

ఇలా అనుకోవటమే మాకు ఇష్టంగా, భద్రతగా అన్పిస్తుంది. ఎందుకంటే - గూఢచర్యం కంటే భగవంతుడు అతీతుడూ, శక్తివంతుడు. ఆయన కనుసన్న లేకుండా ఏదీ జరగదు. "నా మూలంగా ఇది జరిగింది. ఇది నేను చేసిందే" అని ఎవరైనా అనుకుంటే అది వారి అజ్ఞానము, అహంకారమే అంటారు పెద్దలు. గీత కూడా మనకి అదే చెబుతుంది. ఇదే మాకు నచ్చుతుంది. అందుకే ఇష్టంగా అన్పిస్తుంది.

ఇక భద్రంగా ఎందుకు అన్పిస్తుందంటే - నెం.5 వర్గమైనా మనుష్యుల సమూహమే. గూఢచర్య జ్ఞానమూ, నైపుణ్యమూ ఉండవచ్చు గాక! సాంకేతిక సామర్ధ్యం ఉండవచ్చుగాక. మానవీయ విలువలూ, ధర్మాచరణ కలిగిన వ్యక్తులతో నిండి ఉండవచ్చుగాక. కానీ వాళ్ళూ మనుష్యులే! కాబట్టి వాళ్ళు ఎల్లవేళలా మనల్ని కాపాడతారనీ, మన చుట్టూ జరిగే ప్రతీ విషయాన్నీ గమనిస్తారనీ, నియంత్రిస్తారనీ అనుకోగలమా?

అదే భగవంతుడైతే.... ఆయనకి అసాధ్యమన్నది లేదు. ఆయన చూడలేనిది, వినలేనిదీ, గమనించలేనిదీ, నియంత్రించలేనిదీ లేదు. మనుష్యులు పొరబాటు పడతారేమో కానీ, దేవుడు పడడు కదా! మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, సత్య దర్శనం చేయించగలిగేది భగవంతుడు మాత్రమే! "మన కర్మని బట్టి, మన ఆలోచనలని బట్టి, భగవంతుడు మనకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు" అనుకుంటే.... ’మనం చేసుకున్న ధర్మమే మనల్ని కాపాడుతుంది’ అనుకుంటే.... ఆ అనుభూతి భద్రంగా [Secured]గా అన్పిస్తుంది.

అందుచేత మా జీవితాలలో గూఢచర్య ప్రమేయమూ, రెండు వర్గాల [నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, నెం.5 వర్గం] అస్థిత్వమూ తెలిసాక.... మాకు అప్పటి వరకూ ఉన్న ’భగవంతుడిపై నమ్మకం’ మరింత ధృడ పడింది. మరో మాటలో చెప్పాలంటే 1992 నుండి 1995 వరకూ మాలో ఈ ధృక్పధాన్ని, పీవీజీ తన శిక్షణతో మరింత ధృఢతరం చేసాడు. [గూఢచర్య అవగాహన కల్పించే శిక్షణతో!]

ఈ రకమైన భక్తి ధృక్పధంతో, మేము ఎప్పుడూ దైవం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఏ విషయంలోనైనా, ఏ సమస్య వచ్చినా....
ఎవరైనా "ఎలా మరి? ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాను?" అంటే....
"చూద్దాం! పైన దేవుడున్నాడు. క్రింద మన మున్నాము" అనో,
"దేవుడేం చేస్తే అది. చూద్దాం ఏం జరుగుతుందో" అనో,
"మన చేతుల్లో ఏముందండీ! అంతా దైవేచ్ఛ" అనో అనే వాళ్ళం.
"సమస్య పరిష్కారానికి మనకు చేతనైన చర్యలు తీసుకున్నా, ఫలితం భగవంతు ఇవ్వాల్సిందే" అనే వాళ్ళం. అలా గీతా సాధన లో మాకు చేతనైనట్లుగా నడిచేవాళ్ళం!

అయితే మేము ‘నెం.5 వర్గాన్నీ, పీవీజీ’ని దేవుడిగా ఉటంకిస్తూన్నామేమో అనే అనుమానం రామోజీరావుది. అందుకే వై.యస్. ’నేనే దేవుణ్ణి’ అనే స్థాయిలో "నా మనసే మహా శివుడు" అనేసాడు. ‘అందుకే రుద్రకొండ పైన వీరభద్రుడి విలయతాండవం చూసాడు’ అనుకుంటూ ఉంటాము.

వై.యస్. ’నేనే దేవుణ్ణి’ అనే పైత్యం ఎంత దూరం పోయిందంటే - ఈనాడులో మహాశివరాత్రికి వేసుకున్న ఫుల్ పేజీ ప్రకటనే కాదు, [వీటి గురించి గత టపాలలో, టపాకాయలలో వ్రాసాను.] ఆరోగ్యశ్రీ మీద టీవీ [డిడిలో] ఒక వాణిజ్య ప్రకటన వచ్చేది. కార్పోరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకొని ఓ ముసలి జంట బయటకి వస్తూ ఉంటుంది. "ప్రాణ గండం తప్పింది. అంతా ఆ దేవుడి చలువ" అంటూ వృద్దుడు, దేవుడికి చేతులెత్తి దండం పెడతాడు.

అంతలో వృద్దురాలు "దేవుడు అక్కడ లేడయ్యా. ఇదిగో ఇక్కడున్నాడు" అంటూ వై.యస్. నిలువెత్తూ కటౌట్ చూపుతుంది. ఇక ఆ కటౌట్ క్లోజప్ లోకి రాగా, బ్యాక్ గ్రౌండ్ లో ’జింగిల్’ విన్పిస్తుంది. ఇలాంటి యాడ్స్ చూసి, ’నేనే దేవుణ్ణి’ అనే అతడి అహంకారం చూసి, మేమైతే నిజంగా నివ్వెర పోయేవాళ్ళం.

అంతటి అహంకారానికేనేమో, భగవంతుడు వై.యస్.కి ’ఇక చేసింది చాల్లే’ అన్నట్లు దారుణమైన మరణాన్ని ఇచ్చాడు.

1992 లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాతి రోజులలో, పీవీజీ పట్ల నాకు మానసికంగా చాలా ఆత్మీయతా, అనుబంధమూ ఉండేవి. ’తాత’ అని రిఫర్ చేసుకునేదాన్ని. ఫిర్యాదు ఇచ్చిన తొలి రోజులలో, చిప్పిల్లే సంతోషం ఆయన ముఖంలో ఉండేది. డిసెంబరు 6 తేదీన మాత్రమే ఆయన దగ్గర ఆందోళన కనిపించింది. మళ్ళీ తరువాత రోజుల్లో ఆయన ముఖంలో ఏ ఆందోళనలు లేవు. ఏఐసిసి, ఇతర సమావేశాల్లో, ఆయన నవ్వుతూ ఏదైనా మాట్లాడిన విజువల్ టీవీ న్యూస్ లో వస్తే నాకు సంతోషంగా ఉండేది. ఆయన నవ్వు గురించి నా డైరీలో ప్రత్యేకంగా వ్రాసుకున్నాను.

‘అందుకేనేమో’ అన్నట్లు వై.యస్. బ్రతికి ఉన్నరోజుల్లో విరగ నవ్వేవాడని ఇతరులూ, చంద్రబాబూ తెగ గోల పెట్టి under line చేసారు. చంద్రబాబు అయితే ’నాగ భూషణం’నవ్వు అని కామెంటు కూడా చేసాడు. వీటన్నిటికీ జవాబుగా వై.యస్. వరుస చిరునవ్వులూ, విరగ నవ్వులూ కురిపించేవాడు. ఈ మొత్తం వ్యవహారానికి మీడియా, ఇతోధికంగా ఈనాడు, నిరంతరాయంగా కవరేజీ ఇచ్చింది.

ఇది పతాక దశలో నడుస్తుండగా, వై.యస్. హెలికాప్టర్ ప్రమాదంలో "చెప్పు చెప్పు" [Tell me] అంటూ ‘చెప్పు చూపిన కాలు’ తెగిపడినంతగా తునాతునకలై మరణించాడు.

ఇక, 1992 నుండి 1995 వరకూ మేము అవునన్నా, కాదన్నా పీవీజీ మాకు గూఢచర్య అవగాహన కలిగించాడు. మా దృక్పధాన్ని సరి చేసాడు. బలహీనతలని తొలగించి, బలాలని ధృఢ పరిచాడు.

ఒక్కసారిగా, సమాజంలో దాదాపు అట్టడుగు స్థాయికి, గుడిసెలో నివసించే స్థాయికి లాక్కుపోబడ్డాము. కరెంటు లేదు, కిరసనాయిలు దీపం పెట్టుకునే వాళ్ళం. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన వీధి కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకునే వాళ్ళం. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి, వంట చేసుకునే వాళ్ళం. ఓ వైపు నిరంతరం పంచాక్షరీ మంత్రం వినిపిస్తుంటే, మరో వైపు బండ బూతులు వినిపించేవి. పాతాళ గంగ మెట్ల మీద బిచ్చగాళ్ళు, బెస్తవాళ్ళు... వాళ్ళ మధ్య లావాదేవీలు, ఒకోసారీ తాగి కొట్టుకునేవారు. మొదట్లో భయంతో, జుగుప్సతో వణికిపోయే దాన్ని. మెల్లిగా అలవాటు పడ్డాం. పరిశీలించడం నేర్చుకున్నాం.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్త నుండి గుడిసె స్థాయికి పడిపోవడం.... ఇక అంతకంటే దిగువ స్థాయి ’స్లమ్ ఏరియా’ ఏముంటుంది? ఎక్కడి స్లమ్ ఏరియా అయినా ఒకటే! మనుష్యులు మారవచ్చు కానీ, వారి మధ్య సంబంధాలు, సామాజిక పరిస్థితులూ మారవు.

దీన్నే అనుకరిస్తూ.... 1996 నుండి, అంటే నంబూరు పల్లెలో ఉన్నప్పటి నుండి, 2007 లో శ్రీశైలం వదలి వచ్చే వరకూ, రామోజీరావు, సోనియాలు మమ్మల్ని వేధించిన తీరులో, అవే నీటి కష్టాలు, కరెంటు కష్టాలు! ఏ ఊరిలో, ఏ ఇంటిలో ఉన్నా.... నీళ్ళూ, కరెంటుల కష్టాలు తప్పలేదు.

2001 లో సూర్యాపేటలోని మా ఇల్లూ వాకిలి ఊడగొట్టి హైదరాబాదు నానల్ నగర్ బస్తీ ఉండవలసి వచ్చేటంతగా పరిస్థితులు కల్పించబడ్డాయి. అప్పుడే కాదు, నంబూరులోనూ, శ్రీశైలం చల్లా వెంకయ్య సత్రంలోనూ కూడా మా చుట్టూ స్లం ఏరియాలో ఉండే తక్కువ స్థాయి జనాలే ఎక్కువగా చేరారు. మేము స్లం ఏరియాలో నివసిస్తే సరి.... లేకపోతే మా చుట్టూ అలాంటి తక్కువస్థాయి వ్యక్తులు చేరతారు. నంద్యాల వచ్చాకే ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. పూర్తిగా కాదులెండి.

ఇలాంటి స్థితిగతులు మా చుట్టూ కల్పించడంలో రామోజీరావు బృందం చాలా జాగ్రత్త తీసుకునేది. మా అవగాహన పెరగకూడదనే పెను ప్రయత్నం అందులో ఉండేది. చుట్టూ తక్కువ స్థాయి మనుషులు [మరో మాటలో చెప్పాలంటే అలగా జనం] ఉంటే, మనల్ని ఆ స్థాయికి లాగే ప్రయత్నం చేస్తారు. నిరంతరం పోట్లాటలతో బావిలో కప్పల్లా మనల్ని అక్కడక్కడే త్రిప్పవచ్చు. నీళ్ళ దగ్గరా, కరెంటు దగ్గరా కోట్లాటలు పెట్టుకోవచ్చు.

శ్రీశైలంలో చల్లా వెంకయ్య సత్రం లోకి మేము చేరే వరకూ అదెంతో డీసెంట్ గా ఉండేది. చూడటానికి కూడా చాలా బాగుండేది. మేము అక్కడి గదిలోకి చేరాక, ఇక క్రింది అంతస్తులో అందరూ నాల్గవ తరగతి ఉద్యోగులకీ, అదీ కాంట్రాక్ట్ ఉద్యోగులకీ గదులు కేటాయింపబడ్డాయి. అటెండర్లూ, స్వీపర్లూ, తోటమాలిలూ ఇలా! ఒక స్వీపర్లు జంట అయితే ప్రతీరోజూ తాగి కొట్టుకునేవాళ్ళు. ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి మరి ఇలాంటి వాళ్ళు గదులలో చేరారు.

అలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నేను పారిశ్రామిక వేత్తగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరికి ఎవరు దగ్గర, ప్రభుత్వంలో ఏమీ జరుగుతుంది గట్రా విషయాలు [పత్రికలలో రానివి] చాలా తెలిసేవి. అలాగాక, క్రింది స్థాయి వాళ్ళ మధ్య ఉంటే, వాళ్ళతో సమస్యల మధ్యన ఉంటే ఇంకేం ఆలోచించటానికీ వీలుండదు. అందుకే రామోజీరావు, ఎప్పుడూ మా చుట్టూ స్లమ్ వాళ్ళనే ఉంచేవాడు. ఎప్పుడూ మా స్థాయి పెరగకుండా జాగ్రత్త పడేవాడు.

పీవీజీ హయంలోనే గుడిసెలో బ్రతికి రాటు దేలినందున, నానల్ నగర్ లో అయినా, శ్రీశైలపు వెంకయ్య సత్రంలో నైనా, మేము, తక్కువ స్థాయి వ్యక్తులతో వివాదాలు ఎదుర్కొన్నప్పుడు, బాగానే నిభాయించుకోగలిగాము.

ఏ విషయం మీదనైనా మా అవగాహన పెరగకుండా ఉండేందుకూ, జీవితం మీద యాష్ట కలిగించేందుకూ రామోజీరావు - సోనియా బృందం ఇలాంటి పరిస్థితులు మా చుట్టూ కల్పిస్తూ.... మరో వైపూ పీవీజీ కూడా 1993 నుండి 1995 వరకూ మిమ్మల్ని గుడిసె జీవనంలో ఉంచాడు కదా అని పోల్చబడింది. అంటే పీవీజీ ఇచ్చినది శిక్షణ అయితే... సోనియా ఇచ్చినదీ శిక్షణే అనుకోవాలన్నమాట. ’వేధింపు అనుకుని కేసులు పెట్టకూడదు’ అన్నమాట. ప్రతీసారీ, ప్రతి సంఘటనలో, 1992 నుండి 1995 వరకూ పీవీజీ హయంలో మా జీవితంలో నడిచిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి.

ప్రతీసారీ, పైకారణంగా [over leaf reason] ఎవరైతే మమ్మల్ని వేధించారో వాళ్ళ మీద మేము ఫిర్యాదు పెట్టినప్పుడల్లా, వాళ్ళూ మొత్తుకునేవాళ్ళు. తరువాత మాపై వేధింపు లోనూ సాంద్రత పెరిగేది. "ఫిర్యాదు పెడితే ఏడుస్తారు. అలాంటప్పుడు వేధించకుండా ఉండొచ్చు కదా?" అనే సందేహం మాకు తీరేది కాదు. అవసరం ఏమీ లేకుండానే, ప్రయత్నపూర్వకంగా తగవు పెట్టుకోవడం, వేధించడం! పోనీ అవి మేము ఫిర్యాదు పెట్టకుండా ఊరుకుంటే... అంతకంతకూ అది పెరిగిపోయి, ఫిర్యాదు పెట్టక తప్పని స్థితి వచ్చేది. ఇక 2001లో సూర్యాపేటలో త్రివేణి కాలేజితోనూ, మా ఇంటి యజమానురాలితోనూ సామరస్యంగా సమస్య పరిష్కరించుకునే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

’సామరస్యం కోసం ప్రయత్నిస్తే మరింత రెచ్చిపోతారు. ఫిర్యాదు పెడితే ఏడుస్తారు’ - ఈ పజిల్ అప్పట్లో మాకు అస్సలు అర్ధమయ్యేది కాదు. ఇప్పుడు టపాలు ప్రచురించే కొద్దీ గూఢచర్యపు ఆటలో స్థాయి [level] పెరిగినట్లు, అప్పట్లో ఫిర్యాదులు పెట్టే కొద్దీ level పెరిగేదని ఇప్పుడు బాగానే అర్ధమయ్యింది. అందుకే అప్పట్లో ఫిర్యాదులు పెట్టవద్దనీ, ఇప్పుడు బ్లాగు టపాలు పెట్టవద్దనీ ఈనాడు గోల పెట్టింది, పెడుతూనే ఉంది.

ఇక పీవీజీ మాకు గూఢచర్య అవగాహన కలిగించేందుకు ఇచ్చిన శిక్షణను పురస్కరించుకుని.... సోనియా, బ్రతికి ఉండగా వై.యస్.లతో కలిసి, తామూ అదే కొనసాగిస్తున్నామంటూ రామోజీరావు, నెం.5 వర్గపు ముఖం పెట్టి చేసిన విన్యాసాలకూ, ఈనాడు పెట్టిన హెడ్డింగులకూ కొదవే లేదు.

అందుకే నేత చీరలు కట్టినంత మాత్రాన ఇటలీ సోనియాలు ఇందిరాగాంధీలు కాలేరు. పంచె కట్టినంత మాత్రాన వై.యస్.లు పీవీజీలు కాలేరు అని మా గత టపాలలో వ్రాసాము.

నిజానికి 2004, డిసెంబరులో పీవీజీ మరణించినప్పుడు నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు, భవిష్యత్తులో తమకి ఇన్ని అగచాట్లు వస్తాయని అనుకోలేదు. పీవీజీ మరణంతో గూఢచర్య పట్టు తిరిగి తమకు లభించ నున్నదనుకొని తాత్కాలికంగా చెలరేగిపోయాడు. ఇక చూస్కో నా తడఖా అన్నట్టన్న మాట. [దీని గురించి గత టపాలలో వ్రాసాను.] తరువాతే పీవీజీ మరణించినా తమకు గూఢచర్యపు పట్టు దొరకలేదన్నది అర్ధమయ్యింది.

ఇక - పీవీజీ హయాంలోనూ, సోనియా హయాంలోనూ మా జీవితాల్లో ఒకే రకమైన సంఘటనలు జరిగాయి. అవే కరెంటు, నీటి కష్టాలు. అందరూ వెలివేసినట్లుగా అవే ఒంటరి ప్రయాణం కష్టాలు [బ్లాగులోకంలోకి వచ్చాకే మనలాంటి వాళ్ళు చాలామందీ ఉన్నారు అన్న భావన కలిగింది. అంతక్రితం వరకూ ‘అందరూ ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు. మీరే నా దేశం, నా ధర్మం, తొక్క అంటూ మట్టికొట్టుకుపోతున్నారు’ అని చెప్పబడేది. కావాలనే చుట్టూ స్వార్దపు ప్రవర్తనలు విపరీతంగా చూపబడేవి.]

ఆ విధంగా పీవీజీ సోనియాల హయాంలలో ఒకే రకమైన సంఘటనలు జరిగినా వాటి నుండి నడిచిన భావ ప్రసారంలో చాలా వ్యత్యాసం ఉంది. కర్పూరానికి, ఉప్పుకి ఉన్నంత వ్యత్యాసం! నిజానికీ, అబద్దానికీ ఉన్నంత వ్యత్యాసం! భగవద్గీత సాయంతో మాత్రమే తెలుసుకో గలిగిన వ్యత్యాసం!

ఇక్కడ మీకో ఉదాహరణ చెపుతాను. ఇటీవల వచ్చిన ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో, హీరోయిన్ ప్రేమ కోసం పల్లెటూరిలో పాలేరు పనికి సిద్దపడిన హీరో సిద్దార్ధ దగ్గరికి, అతడి తండ్రి ప్రకాష్ రాజ్ లండన్ నుండి వస్తాడు. అతడితో సిద్దార్ద స్నేహితుడు సునీల్ ఉంటాడు. అప్పుడు జరిగే సంభాషణలో.... తండ్రి కొడుకుతో "నీకు ప్రేమ పిచ్చిపట్టిందిరా" అంటాడు. దానికి కొడుకు "నీకు డబ్బు పిచ్చి పట్టింది అని నేనెప్పుడైనా అన్నానా నాన్నా" అంటాడు. దానికి సునిల్, హీరోని మెచ్చుకున్నట్లుగా "ఏం చెప్పావురా!" అంటాడు. ఒళ్ళు మండిన ప్రకాష్ రాజ్ "ఇందులో నీకు ఏం అర్ధమయ్యిందిరా" అంటే, "అందుకే ’ఏం చెప్పావురా?’ అన్నానంకుల్" అంటాడు సునిల్.

రెండు డైలాగులూ, భాషగా చూస్తే ఒకటే! పలికిన తీరుని బట్టి మొదటి సారి, ‘ఏం చెప్పావురా’ అంటే.... మెచ్చుకున్నట్లుగానూ, రెండవ సారి ‘ఏం చెప్పావురా’ అంటే... ఏం చెప్పావో అర్ధంగాక అడిగాను అన్నట్లు ఉంటుంది. అదీ భావ ప్రసారపు తీరు!

భాష తీరు, చర్యల తీరు, దేహ భాష తీరు కూడా, ఒకే లాగా ఉన్నా - ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం.... వారి హృదయ సంకల్పాన్ని [intuition] బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే భాష తీరుని, ప్రవర్తన తీరుని, దేహ భాషని కూడా ఒకరు మరొకరిని అనుకరించవచ్చు, ఒకరు మరొకరిలా నటించవచ్చు. కానీ హృదయసంకల్పాన్ని దాచలేరు, లేని దాన్ని ప్రసారించలేరు. అది హృదయం నుండి హృదయాలు గ్రహించగలిగినది. వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాలని వెలిగించినట్లుగా!

తమలో లేని స్థితిప్రజ్ఞతనీ, సత్యసంధతనీ, ధర్మా చరణనీ, అరిషడ్వర్గరాహిత్యాన్ని.... తాము మరెవరికైనా నేర్పగలరంటే - అంత కంటే కామెడీ ఏముంటుంది?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అమ్మా, నాకొక సందేహం. మీరు వేధింపబడే రోజుల్లో మీ తల్లి తండ్రులు, అత్తగారి వైపు నుండి మీకు సాయం అందలేదా? అక్కాచెల్లెల్లు అన్నతమ్ములు మీకు ఎలాంటి చేయూత నివ్వలేదా?
నిజంగా మీరు అనుభవించిన కష్టాలు ఎవరికీ ఎదురవకూడనివి. జీవితమంతా వెంటాడే వేధించే అనుభవాలతో నిండితే అదెంతో నరకం. అలాంటివి తట్టుకుని మీరు దైర్యంగా ఇలా రాస్తుంన్నదుకు అభినందనాలు.

అజ్ఞాత గారు: ముందుగా వాళ్ళను మానుండి విడదీసే తరువాత వేధింపు మొదలైందండి. వీటి గురించి ’పీవీజీ - రామోజీరావు - మా కథ’ లేబుల్ లోనూ, ’రామోజీరావు, మాపై వేధింపు - వాటి నుండి మేము నేర్చుకున్న పాఠాలు’ అనే లేబుల్ లోనూ వ్రాసామండి. మీ అభినందనలకు నెనర్లు!

రాజశేఖర్ రెడ్డి దారుణమయిన చావు చచ్చడా? అతను 8 నిముషాల్లొ మరణించాడు.మీరె అనుమానంతొ ప్రతి రొజు మరణిస్తున్నారు.భగ్వద్గీత బుక్ తెరిచి ఎది కనిపిస్తే అదే చెస్తాను అన్నప్పుడె తెలుస్తుంది మీకు ఎదో మానసిక జబ్బు ఉంది అని.

indrathinks: ఛ! నిజమా?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu