వాదనల మాయని ఎలా ప్రయోగిస్తారో స్పష్టంగా అర్ధం కావటానికి ఏప్రియల్ 20, 21,22 తేదీల ఈనాడు పేపరు చూపిస్తాను.

మాకు గూఢచర్య శిక్షణ ఇస్తూ సోనియా [అంటే నెం.5 వర్గపు ముసుగు వేసుకున్న సోనియా బృందం] కొన్ని చోట్ల పరిమితి దాటి నందున దాన్ని మేము వేధింపు అనుకున్నామట. అందుకోసం మాకు కోపం వచ్చి, అన్ని విషయాలూ ఇలా బ్లాగు ముఖతః బహిర్గతం చేసేస్తున్నామట. దాంతో అసలు లక్ష్యమే దెబ్బతింటుందట.

చిన్నప్పుడు పిల్లలకి హింట్స్ ఇచ్చి కథ లేదా వ్యాసం వ్రాయమంటారు. ఈనాడు ప్రతీరోజూ హెడ్డింగులతో ఇలా హింట్స్ ఇచ్చి.... విషయం పూర్తిపాఠం అర్ధం చేసుకోమంటుంది. మర్నాటికి దాని కొనసాగింపు [continuity] ని కూడా ఇస్తుంది.

ఇందుకు దృష్టాంతంగా.....ఈనాడు 20 ఏప్రియల్, 2010.....

అంతర్యామిలో:
>>>కోపాన్ని జయించాలి :
‘తన కోపమే తన శత్రువు’ అని నీతిజ్ఞులు ఊరకనే అనలేదు. కోపం వచ్చినప్పుడు నోరు జారుతుంది. ఒక్కోప్పుడు చెయ్యి ఆడుతుంది. మిత్రుణ్ణి కూడా శత్రువుని చేసేస్తుంది. సంయమనం పాటించగలిగితే పరమ శత్రువైనా కాలక్రమేణా ప్రాణమిత్రుడు కాగలుగుతాడు.

మహ్మమద్ ప్రవక్త అల్లుడు హజరత్ అలి దేవభక్తి కలవాడు. ధర్మ సంస్థాపన కోసం అనేక యుద్దాల్లో పాల్గొన్నాడు. ఒకసారి ఒక శత్రువును నిర్భందించాడు. ఖడ్గం దూసి అతని తల నరకపోయాడు. తనకెలాగూ చావు తప్పదనుకున్న ఆ వ్యక్తి కోపం కొద్దీ అలి ముఖాన ఉమ్మేశాడు. అలీ ఒక క్షణమాగి తన ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టేసుకొని అతణ్ని చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోసాగాడు.

ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. వెనకనే పరిగెత్తి అలిని ఆపి ’నన్ను చంపటానికి కత్తి నెత్తావు. నిన్ను అవమానించాలనే నీ ముఖాన ఉమ్మాను. కాని, నన్ను చంపకుండా వదిలి పెట్టి పోతున్నావు, ఎందుకని? నాకర్దం కావటం లేదు. దయుంచి చెప్పు’ అన్నాడతను.

’నువ్వు దైవదూషణ చేశావు. ఇస్లామును ఘోరంగా విమర్శించావు. మసీదుల్ని ధ్వంసం చేసావు. నువ్వు చేసిన ఘోరాలకు నీపై కోపంతో నిన్ను దండించాలని నీపై కత్తి నెత్తాను. నా ముఖాన నువ్వు ఉమ్మిన వెంటనే నాకు మరింత కోపం వచ్చింది. ఆ కోపానికీ ఈ కోపానికీ తేడా ఉంది. ఆ కోపంతో నిన్ను చంపితే ధర్మ సంస్థాపన జరిగేది. ఈ కోపానికి నిన్ను చంపితే నీపై వ్యక్తిగత కారణంగా ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యేది. ధర్మ సంస్థాపన చేసేటప్పుడు స్వప్రయోజనం చూసుకోకూడదు. ఇస్లాము ధర్మం సంయమనం పాటించమని ప్రవచిస్తోందే కాని, ప్రతీకారాన్ని ప్రోత్సహించదు’ అన్నాడు అలి.

అతను అలి పాదాలపై పడిపోయాడు. అంత వరకు దైవ దూషణ చేసిన అతనిలో ఏహ్యభావం కరిగిపోయి పరివర్తన కలిగింది. ఇస్లామును స్వీకరించిన అతను ఆ తరువాత ఒక మహోన్నత ఫకీరుగా పేరు పొందాడు.

అనేకమంది ధర్మబద్దులమని చెప్పుకొంటూ పైకి ప్రవచనాలు వల్లెవేస్తూ లోలోపల తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తపన పడుతుంటారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకోలేక కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే వారిలో సంయమనం నశిస్తుంది. అప్పుడు తమ ఆప్తుల్ని నిందించటానికైనా వెరవరు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ’నీ మంచి కోసమే చేశాను, చెప్పాను’ అని ప్రగల్భాలు పోతుంటారు. ఆత్మవంచనతో తాము చేయాల్సిన అసలు పనిని పూర్తిగా మరిచిపోతారు. దీనికి మూలం తమలో పేరుకున్న అహంకారం. అది తెచ్చిపెట్టే కోపం. ఈ ముప్పును అధిగమించగలిగిన అలి లాంటి వాళ్ళు ధన్యులు. ఎంతటి దైవద్రోహులనైనా సంస్కరించగల జ్ఞానులు.

[ఇస్లాం ప్రతీకారాన్ని ప్రోత్సహించదట! కానీ తాలిబాన్లు మాత్రం అల్లా సామ్రాజ్యం కోసం జీహాద్ చేస్తున్నామంటూ చేసేదంతా అదే!]

ఇంతకీ.... కోపాన్ని జయించాలంటూ మాకు చెప్తోంది ఏమిటంటే - ధర్మసంస్థాపన చేసేటప్పుడు స్వప్రయోజనాన్ని చూసుకోకూడదు. ఇక తొలి, చివరి పేరాలు మరీ ముఖ్యమనుకొండి! [ఇంతకీ స్వప్రయోజనం అంటే ఆకలి తీర్చుకోవటం, బ్రతకాలను కోవటం అన్నమాట.]

ఇక మిగిలిన హెడ్డింగులు....

>>>ప్రియమైన సైన్యం....[12 వ పేజీలో.....ప్రియమైన సైనికుల్లారా! ]

>>> ఇంట్లో సిసింద్రీలు.... ఇవీ జాగ్రత్తలు [వసుంధర.... ఇంట్లో ఉన్న సిసింద్రీలం మేమట. క్రింది హెడ్డింగులలో చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్న మాట.]

>>>విస్తరణ జూన్ లో [విస్త’రణం’ అని ఎక్కువగా వేస్తుంటాడు. దీనినే క్రమంగా విస్తరణగా మార్చేసాడు. రణం అంటే యుద్దమే! ’జూన్ లో కేసు ప్రకటిస్తాం లే!’ అని. గతంలో ఈ గడువు సంవత్సరాలుగా చెప్పబడేది. అంచేత బ్లాగులో వ్రాయటం ఆపేయ్! డిలీట్ చేయ్!]

>>>తెలంగాణా కావాలె [తప్పకుండా ’కేసు ప్రకటన కావాలి’ అని అర్ధం!]

>>>లోపాలుంటే చెప్పండి.... సరిదిద్దుకుంటా

>>>నాకు న్యాయం చేయండి. [పీవీజీ ఒక్కడేనా చేసింది, నేను ఏమీ చేయలేదా? నాకు[సోనియాకి] న్యాయం చేయండి అని అర్ధం.]

>>>మా పేర్లు చెప్పుకొని కబ్జాలు చేస్తున్నారు [మా పేరిట రామోజీరావు, అతడి అనుచరులూ చాలా చర్యలు చేస్తున్నారు. - ఇదంతా సోనియా పేరిట చెప్పబడింది.]

>>>సమిష్టి సమరం.... సాగాల్సిన సమయం [ఎడిటోరియల్ పేజీ : కలిసికట్టుగా యుద్దం చేయాల్సిన సమయం ఇది.]

>>>విధుల్లో అలక్ష్యం.... ఆపేదెలా?[మీకు పనిపట్ల అలక్ష్యం ఏర్పడింది. ఎలా మిమ్మల్ని ఆపటం?]
[ఈ హెడ్డింగ్ క్రిందే రెండు సమస్యల గురించీ కవిత గూడపాటి, అర్గనైజేషన్ల్ సైకాలజిస్ట్ తో చర్చించారు.]
ఒక సమస్య: మా విభాగంలో ఓ సహోద్యోగి ప్రవర్తన పని వాతావరణానికి ఆటంకంగా మారుతోంది. తనెప్పుడూ ఇతరుల గురించి విమర్శిస్తుంది. పని, వ్యక్తిగతం... ఏ విషయాలైనా సరే... ఇతరుల గురించి చెడుగా చెబుతుంటుంది. తనతో కాకుండా మరొకరితో మాట్లాడినా... కబుర్లు చెప్పినా సహించదు. గొడవలు సృష్టిస్తుంది. అబద్దాలను వాస్తవాలుగా నమ్మించడంలో తనను మించిన వారు లేరు. తన వల్ల ఏడాదిగా చాలా సమస్యలు ఎదుర్కొన్నా, ఇదే విషయాన్ని బాస్ దృష్టికి తీసుకెళ్ళినా.... ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

కవిత గారి జవాబు: ఆఫీసుల్లో గాసిప్ లు సాధారణమైనా... ఇలాంటి మనస్తత్వాలున్న వ్యక్తుల మధ్య పనిచేయడం ఇబ్బందే. ఒక్కరి వల్ల చుట్టూ ఉన్నవారు సమస్యలెదుర్కొంటారు. అయితే ఆమె ఒకరి గురించి ధైర్యంగా చెబుతోందంటే.... అందుకు కారణాలేంటి? ఇతరులకు తెలియని విషయాలు ఆమెకు తెలిసినప్పుడు.... ఆఫీసులో ఏం జరుగుతోందో.... ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం కనబరిచినప్పుడు... ఇలాంటి గాసిప్ లు చోటుచేసుకుంటాయి. దానికి తోడు... మిగిలిన సిబ్బందీ తమకు తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే.... ఇలాంటి సహోద్యోగులు... పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. చెప్పే విషయంలో వాస్తవం లేకపోయినా... అది పూర్తిగా నిజమంటూ నమ్మిస్తారు కూడా. ఇలాంటి వారితో వ్యవహరించాలంటే... ఒక్కటే మార్గం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రస్తావించడమే. అసంకల్పిత... అసందర్భ చర్చలతో మీరు సమయం వృధా చేసుకోవడానికి సిద్దంగా లేరని తెలియజేస్తే.... మీకు చెప్పడం మానేస్తుంది. ఏదైనా చెబుతున్నప్పుడు... అందులో నిజానిజాల్ని వెలికితీసేందుకు యత్నించండి. అంటే... ’మీరు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించండి. ఆఫీసులో ఏదైనా జరిగిందని చెబితే.... ఎప్పుడు? ఎలా? వంటి ప్రశ్నలు వేయడానికి వెనకాడకండి. మీరు, విభాగంలో పనిచేసే మిగిలిన సిబ్బందీ ఇదే ధోరణి కొనసాగిస్తే.... మీ అనాసక్తి ఆమెకు పూర్తిగా అర్ధమవుతుంది. ఇబ్బందికరమైన సమాచారం... గాసిప్స్... లాంటివి వినడానికి మీరు సిద్దంగా లేరనే విషయాన్ని మర్యాదపూర్వకంగానే తెలియజేసిన వారవుతారు. దీనికి మరో ప్రత్యామ్నాయమూ లేకపోలేదు. సహోద్యోగులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఇలాంటి గాసిప్ లు లేవనెత్తడం వల్ల కలిగే ఇబ్బందుల్ని విశ్లేషించండి. దాంతో మీ బృందంలో... ఎవరూ ఇలాంటి అవాస్తవిక విషయాలు తెలుసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదని చెప్పకనే చెప్పిన వారవుతారు.

[వెరసి దీనికి అర్ధం ఏమిటంటే:
ఇందులో చెప్పబడిన సహద్యోగి లక్షణాలన్నీ, ఇన్నాళ్ళుగా మాకు ఆపాదిస్తూ, మమ్మల్ని నిందిస్తూ చెబుతున్నవే. పని వాతావరణానికి ఆటంకం కల్గిస్తున్నామట. ఇతరుల్ని ఎప్పుడూ విమర్శిస్తున్నామట. అన్నిటినీ చెడుగా చెప్పేస్తున్నామట. అబద్దాలను వాస్తవాలుగా నమ్మించటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరట. మా మూలంగా ఏడాదిగా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందట.

అవును మరి! వాళ్ళ గూఢచర్యం గురించి.... తిరగబడ్డ కథను వివరించటం మొదలు పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. మా బ్లాగు మీద, కవిత గూడపాటి చెప్పిన పరిష్కారాలే అనుసరిస్తున్నాడు లెండి. ]

>>>గుర్తింపు పొందండిలా....[11పేజీలో.... కేసు ప్రకటిస్తే గుర్తింపు వస్తుంది కదా! కాబట్టి.... వాళ్ళు చెప్పినట్లు విని, మేము గుర్తింపు తెచ్చుకోవాలన్న మాట. బ్లాగులో వ్రాస్తే గుర్తింపు రాదు, రావడం లేదు కదా! అదే తాము ప్రకటిస్తే....?]

>>>41 వేలమందికి ’విమాన’ వేదన [13 పేజీ... విమానం టేకాఫ్, జూమ్, హెలికాప్టర్ రావటం, తెర తీయటం, తెలంగాణా.... ఇవన్నీ ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు ప్రకటనకు పర్యాయపదాలు[అలియాస్ లు]. కాబట్టి, ఇప్పుడు మా బ్లాగు వ్రాతల కారణంగా, కేసు ప్రకటనకు ఇబ్బంది, అందరికి వేదన కలిగిందన్న మాట.]

ఇక ఏప్రియల్ 21 వ తేదీ ఈనాడు....

మా టపా హెడ్డింగ్: తమకు రాని విద్య ఎవరికైనా నేర్పటమంటే కామెడీనే!
ఈనాడు విన్యాసాలు చూడండి.

>>>షాక్ కొట్టింది [గూఢచర్యాన్ని హైఓల్టేజ్ కరెంటు తో పోల్చుతూ 1992లో మాకు చెప్పారు. so... మా బ్లాగు వ్రాతలూ, డిలీట్ చేయని చేతలూ, తమకి గూఢచర్యంలో దెబ్బలు తగులుతున్నాయట.]

>>>కలిసి సాగితేనే అభివృద్ది [షరా మామూలే.]

>>>తప్పులు క్షమించేసాం [2 వ పేజీ... మీరు చేసిన తప్పులు [అంటే బ్లాగులో సోనియాని విమర్శిస్తూ వ్రాతలు వ్రాయడం] క్షమించేసాం, రమ్మని అని అర్ధం. కొద్ది రోజుల క్రితం మమ్మల్ని జట్టులో నుండి పీకేసాం అన్నారు లెండి.]

>>>ఆగని తల్లిబిడ్డల మరణాలు [3 పేజీ... మా వ్రాతల, చేతల మూలంగా, తల్లి [అంటే సోనియా], బిడ్డలు [అంటే మేము]... ఇద్దరికీ మరణం తప్పదని అర్ధం! అంటే చావులాంటి ఓటమి తప్పేట్లు లేదట.]

>>>నేర్చుకొనే నేర్పేదీ - నడతలో మార్పేదీ? [సంపాదకీయ పేజీ: నేర్చుకునే నేర్పు, నడతలో మార్పు కొన్ని రాష్ట్రాలకు లేదని వ్యాసంలో వ్రాసారు. హెడ్డింగు మాత్రం శ్లేషాలంకారంలో మేము నేర్చుకున్నదే మీకు నేర్పుతున్నాం. మీ నడతలోనే మార్పు లేదు అని.]

>>>ఆపద వేళల....[అంతర్యామి.... ఆపదవేళల్లో మిమ్మల్ని కాపాడింది దైవం! అంటే మేమే కదా, నెం.5 వర్గమే కదా అని.]

>>>నాపై దర్యాప్తు చేయించండి [శశిధరూర్ అన్న ఈ డైలాగు సోనియాకి అనువర్తించాలన్న మాట. నా గురించి మళ్ళీ ఆలోచించండి అని.]

>>>గురువుల సేవలపై ద్వంద్వవైఖరి [14 పేజీ... పీవీజీ, సోనియా ఇద్దరూ గురువులే అయినా, వాళ్ళ మధ్య మేం వ్యత్యాసం పాటిస్తున్నామట.]

ఇక అదే రోజు జిల్లా ఎడిషన్ లో సెంటర్ స్ప్రెడ్ సూక్తులలో:

>>>నువ్వేం చేసినా సంపూర్ణంగా... క్షుణ్ణంగా చెయ్యి.... లేదా చేయడానికి ఒప్పుకోకు- సాయి బాబా [చేస్తే పూర్తిగా మేం చెప్పినట్లు చెయ్యి. లేదా జట్టులోంచి తప్పుకో!]

>>>అదే పేజీలో ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని ఒక బాక్స్ ఐటమ్.

>>>మొదటిపేజీలో ’విడగొట్టి... చెడగొట్టొద్దు’ అనేది మొదటి హెడ్డింగ్.

>>>ఇక హాయ్ బుజ్జీలో అయితే,
వేమన పద్యం:
చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుద్దు లిట్లుండరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:
పెద్దలను అవహేళన చేస్తే హాని తప్పదు. పెద్దల్ని అవమానపరిచిన చంద్రునంతటి వాడికే శాపం వల్ల కళలు నశించాయి.

అదే పేజీలో, సోక్రటీసు సూక్తి: నిరాశావాది అవకాశంలో సైతం అపదల్నే చూస్తూ నిత్యం భయంతో జీవిస్తాడు. [వాళ్ళ కోచింగ్ కు తట్టుకోలేక, నిరాశతో ఇవన్నీ బద్దలు కొడుతున్నామని, మంచి అవకాశాలు ఉన్నాకూడా ఆపదల్నే చూస్తున్నామని.]

ఇక 22 ఏప్రియల్, 2010 తేదీ ఈనాడులో....

వాళ్ళూ ఏ గోల చేసినా మేము బ్లాగులో వ్రాసుకుంటూనే పోతున్నాము కాబట్టి...

>>>అదుపు చేయండి - లేదంటే దిగిపోండి...[1వ పేజీలో.... మీ వ్రాతల్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే జట్టులోంచి తప్పుకోండి. అని]

>>> ’ఈ చెత్త’ ఇంకెన్నాళ్ళు....![5 వ పేజీ... ఈ-నాడు రామోజీ రావు గురించి చెత్త ఇంకా ఎన్నాళ్ళు వ్రాస్తావు? అని.]

>>>నన్ను క్షమించండి. [11 పేజీలో... లోపలి వార్త తెదేపా అంతర్గత వ్యవహారం. పైన హెడ్డింగు మాత్రం సోనియా పేరిట చెప్పబడింది. ఒక వేళ నేను తప్పు చేస్తే క్షమించమని. లేనట్లయితే ‘చంద్రబాబుకి క్షమాపణ చెప్పిన నన్నపనేని’ అనో.... ‘కన్నీళ్ళు పెట్టుకున్న రాజకుమారి’ అనో... ఇలా ఆ వార్తాంశానికి ఏ హెడ్డింగ్ అయినా పెట్టగల అవకాశం ఉంది. అయినా ‘నన్ను క్షమించండి’ అంటూ ప్రధమ పురుషలో చెప్పబడింది.]

>>>ఇప్పుడు ఒక బొటన వేలే చాలదు మరి. [1వ పేజీ..Zen mobile Ad. - ‘ఇప్పుడు గెలుపు, సక్సెస్ తెచ్చుకోవాలంటే మీ ఒక్కరితోనే కాదు కాబట్టి, కలిసి రండి’ అని చెప్తున్నారు.]

ఇంకా ఇలాంటివే చాలా.... దాదాపు ప్రతీరోజూ.... అత్యధిక మోతాదులో హెడ్డింగులూ, కథలూ.... సూక్తులూ గట్రా!

ఈ విధంగా - చిన్నప్పుడు పిల్లలకి హింట్స్ ఇచ్చి కథ లేదా వ్యాసం వ్రాయమంటారు. ఈనాడు ప్రతీరోజూ హెడ్డింగులతో ఇలా హింట్స్ ఇచ్చి.... విషయం పూర్తిపాఠం అర్ధం చేసుకోమంటుంది. మర్నాటికి దాని కొనసాగింపు [continuity] ని కూడా ఇస్తుంది.

స్థూలంగా వాళ్ళు చెబుతున్న వాదనలలో ఎన్ని లొసుగులో! పీవీజీ మాకు గూఢచర్యం గురించి అవగాహన కల్గించిందీ, మానసిక యుద్దతంత్రాలని తట్టుకునే విధంగా శిక్షణ నిచ్చిందీ మూడేళ్ళే! [1992 నుండి 1995 వరకూ] అంతకంటే ఎక్కువగా.... 18 ఏళ్ళపాటు, లేక జీవిత కాలం పాటు శిక్షణ ఇవ్వటానికి... తొక్కలోది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలకవ్యక్తులు రామోజీరావు సోనియాల స్ట్రాటజీ ఏమంత క్లిష్టమని!?

వాళ్ళకి తెలిసిందే పది స్ట్రాటజీలు! అందులోనూ ప్రధానమైనవి రెండే... అహం రెచ్చగొట్టటం, లేదా అహాన్ని సంతృప్తి పరచటం. వీలైతే ఆడదాన్ని, వీలుగాకపోతే ‘ఆకలి’ని ప్రయోగించటం. గత టపాలలో చెప్పినట్లు, నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం రిమోట్ తో డివీడీని ఆపరేట్ చేయటం వంటిదైతే... నెం.5 వర్గపు గూఢచర్యం డీవీడీని తయారు చేయటం వంటిది.

ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అదీ మన ఇతిహాసాల నుండే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

..

చెప్పనియ్యండి ఇలా ఎన్ని రోజులయినా ..., మనకు కాసింత కామెడి కావలి కదా.
చివరికి వీళ్ళకి కథ సినేమలోల్లగానే సువర్ణముఖి అనుభవిస్తారు.

మీకేమి భయంలేదు, అయిన నిండా మునిగినవానికి చలి ఏమివేస్తుంది.

అమ్మా .. LBS అనేది నాపేరేనమ్మా ..
లక్కావఝుల భమిడిరామ శాస్త్రి
నా మాటల్ని ఆలకించండమ్మా ,, నేను ఎవడ్నీ కానమ్మా, నాకు ఎవరితోనూ సంబంధం లేదమ్మా, పురోహితం చేసుకునే పేద బ్రాహ్మడ్ని, అందరిహితం కోరే వాడ్ని.
మీ బ్లాగు చదువుకుని నవ్వుకుంటున్నారమ్మా అంతా? రామోజీకి వేరే పనీ పాటాలేకుండా ఈనాడు లో మీమీద భాషనలు రాయడానికా ఆయన వెయ్యికోట్ల వ్యాపార సామ్రాజ్యం అలా వృద్ధిచెందింది. ఆయన మిమ్మల్ని పట్టించుకోడమా, పాపం ఆయనే చచ్చే కష్టాల్లో వున్నాడు-మార్గదర్శి, తెలంగాణా, భూఅక్రమణ విషయాల్లో. తల్లి వద్దమ్మా, పాపం గీతమ్మ నిచూస్తే జాలిగా వుందమ్మా, నాకు ఆవయసు కూతురుంటే నేను ఎలా వుండేవాణ్ణో అల్లాగే మీరుండాలి అని కోరుతున్నా. మీరు చెప్పినట్లు, అమ్మ టొబు కుర్చీలో కూర్చోపెత్తి రోరుముద్దలు పెట్టినప్పడినుండీ, రెండు పుల్కాలతో కడుపునింపినప్పడి నుండీ, ఇంక మనం పస్తులుండక్కర్లేదు అన్నరొజు నుండీ మీరు తన గురించి రాసినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఏం పాపం చేసిందమ్మా మీకుంటుంబం చల్లగా వుండాలి అనే నాకోరిక తల్లీ, మీరు రాసినట్లు మీరు తలుపులేసుకోగానే నవ్వుటు జోకులేసుకుంటూ అనుభవించే ఆ ఆననందం, ఈ రామోజీ రావు ని జీవితంలోంచి తొలగిస్తే ఇంకా అద్భుతం గా వుంటుందమ్మా ..
మీకెప్పుడు కష్టం వచ్చినా మా ఝఝవరం రండి, మాఇంట్లో వుండండి. మా వూళ్ళొ నం 10 లూ వుండరు, నం 5లూ వుండరు. మంచి వాతవరణం, మంచి మనుషులు, స్వచ్చమైన గాలి. మంచిగా పప్పు నెయ్యి వేసి బోజనం పెట్తగలను. మీలాంటి వాళ్ళ అవసరం మా వూరికి చాల వుంది. మీరు రాజకీయ విస్లేషణ చేయండి. చిన స్కూలు పెట్టుకోండి. మా రామాలయంలో మీచేత ప్రతీరోజూ గీతాపారాయణం చేయించగల పలుకుబడుంది నాకు. అలోచించండమ్మా..

నావెనుక కూడా రామోజీరవున్నాడనుకునేదీ లేనిదీ మీ మీ విఙ్ఞతకే వదిలేస్తున్నాను.

LBS నేనూ గారితో ఏకీభవిస్తున్నాను. మీ వ్రాతలు చూసి నవ్వుకునేవాడిలో నేను కూడా ఒకడిని. ఇంకా చాలామంది నవ్వుకుంటున్నారు. LBS గారు చెప్పినట్లుగా మీరు భ్రమల్లోంచి వాస్తవం లోకి వస్తే బావుంటుంది. మీ విశ్లేషణా శక్తిని మంచి విషయాలకి ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను.

LBS గారూ
ఈసారి నేను ఇండియా కి వచ్చినప్పుడు ప్రశాంతంగా కొన్ని రోజులు మీ పల్లెలో, మీ ఇంట్లో వుంటూ మీరు చెప్పినట్లుగా గడపాలని వుంది. మీ ఆదరణ, మంచితనం మీ వ్యాఖ్యలతో తెలుస్తోంది. నాస్తికుడిని అయిన నాకే మీ సహృదయం చూస్తూవుంటే కొద్దిరోజులు మీతో కలిసి రామ భక్తుడిని కావాలనిపిస్తోంది. మీ ఝఝవరం ఎక్కడ వుంటుంది?

అమ్మవోడిగారు, చూస్తుంటే మీకు బ్లోగోకంలో కూడా భలే మంచి కోచులు తయరుఅవుతున్నారు. ఇవి చూస్తున్న మాకు భలే నవ్వులు వస్తున్నాయి. జాగ్రతగావుండండి.

అయ్యా శరత్కాలం గారు, మీరు ఎక్కడండి ఉండేది. కేవలం ఒక్క LBS గారి వ్యాఖ్య్కే కే అలా పడిపోయరెంటి అసలు. పైగా నాస్తికుడు వెంటనే రామ భక్తుడు అయిపోవాలని ... అయ్యబాబోయి .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu