1992 లో, పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన తొలి రోజుల్లోనే, లెనిన్ కు తన స్నేహితుడొకరు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. అదేమిటంటే -

A మరియు B అనే ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళున్నారు. వాళ్ళకు ఆట వచ్చు. C అనే వాడికి చదరంగపు ఆట రాదు. అయినా A,Bలతో ఆడి గెలవాలన్నది C లక్ష్యం. దాంతో రెండు చోట్లా ఆటకు తలపడతాడు. ముందుగా A దగ్గరి కొస్తాడు. చదరంగపు బల్లమీద, A ఒక ఎత్తు వేస్తాడు. వెంటనే C, B దగ్గరున్న బోర్డు మీద అదే ఎత్తుగడ వేస్తాడు. అంటే A బోర్డు మీద, A ఏ పావుని ఎలా కదిపాడో అలాగే B బోర్డు మీద C కదిపాడన్న మాట. A తో ఆటలో... ఆట ప్రారంభకుడు A అయితే, Bతో ఆటలో.... ప్రారంభకుడు C అన్నమాట.

సరే! C వేసిన తొలి ఎత్తుకు ప్రతిగా B ఒక ఎత్తువేస్తాడు కదా, అదే ఎత్తుగడని తెచ్చి C, A మీద ప్రయోగిస్తాడన్న మాట. దానిమీద A మరో ఎత్తువేస్తాడు కదా! అది తీసికెళ్ళి B మీద ప్రయోగించటం, B వేసిన ఎత్తుగడని తెచ్చి A మీద ప్రయోగించటం - ఇదీ C ఆడే ఆట. ఆ విధంగా ఆడుతూ చివరికి రెండు బోర్డుల మీదా గెలిచాడు - ఇదీ లెనిన్ కి తన మిత్రుడు చెప్పినది.

అయితే ఇందులో ఓ లొసుగు ఉంది. A,Bలతో ఆడే ఆటలో C కి ఆటరాదు. A వేసిన ఎత్తు B మీద ప్రయోగించటం, B వేసినది తెచ్చి A మీద ప్రయోగించటం చేశాడు. A తో ఆటలో తను రెండవ ఎత్తు వేసిన ఆటగాడు. B తో ఆటలో తొలి ఎత్తు వేసిన ఆటగాడు.

అలాంటప్పుడు A తో ఆటలో ఓడిపోతేనే B తో ఆటలో గెలవగలడు. లేదా Bతో ఓడిపోతే A మీద గెలవగలడు. ఎక్కడో ఓ చోట ఓడిపోతేనే రెండో చోట గెలవగలడు. అంతే కానీ, రెండు బోర్డుల మీదా C గెలవటం అసాధ్యం కదా? ఎందుకంటే A లేదా B ల మీద గెలవటానికి తనకి [Cకి] ఆటరాదు. మరో మాటలో చెప్పాలంటే Cని మైనస్ చేస్తే A మరియు B లు ఆటలో ప్రత్యక్షంగా తలపడినట్లే.

ఈ లొసుగునే.... "ఏదో ఒక బోర్డు మీదే C గెలవగలడు కానీ రెండు చోట్లా ఎలా గెలవగలడు?" అని లెనిన్ తన మిత్రుణ్ణి ప్రశ్నించగానే, అతడికి ఆ లాజిక్ వెంటనే ఆర్ధం కాలేదు. లెనిన్ వివరించాక అతడూ తికమకపడి "ఏమో! ఇప్పుడు నాకూ గందరగోళంగా ఉంది" అనేసాడు. లెనిన్ నాకిది చెప్పినప్పుడు ఎంతో గమ్మత్తుగా, ఆసక్తిగా అన్పించింది.

శ్రీశైలంలో గుడిసెలో ఉంటున్న రోజుల్లోనూ దీన్ని అర్ధం చేసుకునేందుకూ, విశ్లేషించుకోవటానికి, అనువర్తించుకోవటానికి బాగా ప్రయత్నించాము. తోచినట్లు ఆలోచించే వాళ్ళం. రకరకాలుగానూ ఆలోచించేవాళ్ళం. ఏదీ సంతృప్తి కలిగించేది కాదు. 1995 వరకూ ఎన్నోసార్లు ఈ ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం’ గురించి ఆలోచించినా.... సరియైన విశ్లేషణా, అనువర్తనా చేయలేకపోయాము.

ఏదీ మాకు పెద్దగా అవగాహన లేని రోజులవి. ఎందుకంటే - అప్పటికి మా దృష్టిలో భారత దేశపు నేలమీద భారత ప్రభుత్వం కంటే, ప్రధానమంత్రి కంటే ఎవరూ బలవంతులు కాదు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల గురించీ, వాటి శక్తి గురించీ అస్సలు అవగాహన లేదు. వాటి అస్తిత్వం గురించిన ఊహ కూడా లేదు. అందుచేత మా జీవితంలో జరిగే అన్ని చర్యలకీ పీవీజీనే బాధ్యుడు అనుకునేవాళ్ళం.

కాబట్టే - "పీవీజీ దేశానికి మేలు చేస్తున్నాడు? మరి నాకేందుకు కీడు చేస్తున్నాడు? పౌరధర్మంగా నేను ఫిర్యాదు ఇచ్చాను. ప్రభుధర్మంగా పీవీజీ మమ్మల్ని కాపాడాలి. బదులుగా ఈ వేధింపు ఏమిటి? దీనికి భగవంతుడు కూడా క్షమించడు. పీవీజీ ధర్మపరుడే కావచ్చు గాక! మా పట్ల మాత్రం అధర్మం పాటిస్తున్నాడు. [అసలు దేశంపట్ల కూడా అధర్మం పాటించే వాడే అయితే దీనంతటి బదులు దేశాన్ని ఎప్పుడో బద్ నామ్ చేసి ఉండేవాడు. అంతేగాక ఇలా వేధించటం కంటే మా తలకాయలు లేపేసి ఉండేవాడు కదా? అందుచేత దేశం పట్ల పీవీజీ నిబద్దుడే అన్నది మా అభిప్రాయం.] కాబట్టి దేవుడు మా పక్షానే ఉన్నాడు, ఉంటాడు. పీవీజీ తప్పు చేస్తున్నాడు" అని తెగ ఆక్రోశ పడేవాళ్ళం. తర్వాత ఈ మధ్య వచ్చిన అనేక సినిమాలలో "తప్పు చేస్తున్నావ్?" అనే డైలాగ్ తప్పని సరిగా ఉండటం చూశాం.

గూఢచర్యం మీద అవగాహన కలిగిస్తున్నాడన్న అభిప్రాయానికి వచ్చినప్పుడూ అదే తిట్టుకున్నాము. "ఇవ్వని గురుత్వాన్ని ఎవరు పుచ్చుకొమ్మన్నారు" అనుకుని మరీ తిట్టుకున్నాము. మా దగ్గర అణుస్థాయిలో అహంకారం కన్పించినా, ఆ అహంకారం మీద కొట్టి మరీ, సరి చేసినప్పుడు "ఈ ప్రపంచంలో మాకు మాత్రమే అహంకారం ఉందా? ఎంతమందికి లేదు! అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష?" అని ఆక్రోశించాము. [తరువాత గాని దాని తాలూకూ మంచి ఫలితాలు మాకు తెలిసి రాలేదు. జ్ఞానము, దంతము వచ్చేటప్పుడు బాధపెడతాయని ఒకచోట చదివాను. నిజమే, అజ్ఞానము పోయేటప్పుడు చాలా దుఃఖం వస్తుంది.]

అయితే, 2005 తర్వాత.... మా జీవితాలలో రామోజీరావు ప్రమేయమూ, గూఢచర్యపు ఆస్తిత్వమూ అర్ధమయ్యాక చాలా విషయాలు పునశ్చరణా, పునఃపరిశీలనా చేశాము. అప్పుడు వెనుదిరిగి చూసుకుంటే మా జీవితాలలో రామోజీరావు తాలూకూ నెం.10 వర్గమూ, పీవీజీ తాలూకూ నెం.5 వర్గమూ రెండూ కన్పించాయి.

అయినా కూడా ’రెండు బోర్డుల మీదా ఒకే ఆటగాడి విన్యాసం’ గురించి విశ్లేషించటానికి, అనువర్తించటానికి చాలా రోజులు, చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. అది అర్ధమయ్యాక మాత్రం ఎంత ధ్రిల్ గా అన్పించిందంటే - యుద్దపు అసలు మజా, మెదళ్ళతో యుద్దంలోని మర్మమూ బాగా అనుభవంలోకి వచ్చాయి. పీవీజీ మేధస్సు అద్భుతంగా కన్పించింది. వివరంగా చెబుతాను. అయితే దీనికి ముందు మరికొన్ని వివరాలు చెప్పాలి.

ఈ లేబుల్ లోని గత టపాలలో 1992 నుండి గూఢచర్య అంకాలని నాలుగు దశలుగా విభజించి వివరించాను. అదే మా జీవితాలలో అయితే దాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

మొదట దశ: 1992 లో పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుండి 1995 లో మేము ఫ్యాక్టరీ ఖాళీ చేసేవరకూ.
రెండో దశ: 1995 లో ఫ్యాక్టరీ కోల్పోయినప్పటి నుండి 2005 లో రామోజీరావు మీద మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు ఇచ్చేవరకూ.
మూడో దశ: 2005 నుండి ఇప్పటి వరకూ.

ఇక తొలి దశలో.....
అప్పటికి మేము అవునన్నా కాదన్నా గూఢచర్యపు తొలిపాఠాలు నేర్చుకోక తప్పలేదు. ఆ రోజుల్లోనే, 1995 ఫిబ్రవరిలో మండలి వెంకట కృష్ణారావుని కలిస్తే.... "ఒక వేళ నేదురమల్లి జనార్ధన రెడ్డే ఇదంతా చేస్తున్నాడేమో?" అంటూ మాకు హింట్ చేయ ప్రయత్నించాడు. అప్పటికి మాకది స్ఫురించలేదు. నేదురమల్లినీ, కరుణానిధినీ, వీపీ సింగ్ నీ, రామోజీరావు నీ కలిపి దుష్టచతుష్టయంగా పోలుస్తూ, పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదులో వ్రాసాను. కాబట్టి నేదురమల్లిని గుర్తు చేస్తూ.... మండలి, రామోజీరావు బృందం యొక్క ప్రమేయాన్ని under line చేయ ప్రయత్నించాడన్నది 2005 తర్వాత పునరాలోచనతో అర్ధమయ్యింది.

అప్పట్లో కసిగా, అందరికీ చెబితే నన్నా ఈ వేధింపు ఆగుతూందేమోనని.... శ్రీశైలంలో కొందరికీ, ఫ్యాక్టరీ నడుపుతున్నప్పటి పాత మిత్రులు కొందరికీ చెప్పాము. ’వాటన్నింటిని ఆలోచించటం మాని వేయ్యండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి’ అని అందరూ సలహాలిచ్చారు. [చిత్రంగా శ్రీశైలంలో ఎవరెవరికి చెప్పామో వారందరికీ, తర్వాత హవా నడిచింది. లక్షల్లో ఆదాయము వచ్చింది. అంతే పరిమాణంలో అవకతవకల్లో దొరకడాలూ, కేసులూ, కాన్సర్లు వచ్చాయి.]

అందరూ ఒకే సలహా ఇవ్వటంలోనూ ఓ శృతీ లయా అర్ధమయ్యాయి. అయినా ఐబి అధికారిని కలిసాము. అతడు విధివ్రాతని నమ్మమన్నాడు. ఇక అన్నీ మర్చిపోవాలనే నిర్ణయానికి బలంగా వచ్చాము. గుర్తుంచుకొని ఆలోచించటం కంటే అన్నీ మరిచిపోయి బ్రతకటం హాయి అనిపించింది. నిజానికి అందరూ ఒకే మాట - "రామోజీరావు, పీవీజీకి ఫిర్యాదు అన్నీ మరిచిపొండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి" అన్నారు.

మొత్తంగా ఒకే సమయంలో అందరూ ఒకే విధంగా చెప్పటం - అందులోనూ ఓ శృతీ లయా ఉన్నప్పటికీ - మాకూ అదంతా మరిచిపోవటమే సుఖంగా అన్పించింది.

రెండో దశ:
ఆ విధంగా రెండో దశ 1995 లో ఫ్యాక్టరీ ఖాళీ చేయటంతో ప్రారంభమైంది. 2005 అక్టోబరు లో, శ్రీశైలంలో ఉండగా, రామోజీరావు మీద మన్మోహన్ సింగ్ కి ఫిర్యాదు చేసే వరకూ ఈ దశ కొనసాగింది. దాదాపు పదేళ్ళ పాటు [1995 నుండి 2005 వరకూ] ఏవీ ఆలోచించలేదు. మా కెరీర్ - మా పాప - దైవభక్తి. ఇదే మా లోకం! ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గుర్తు చేయబోయినా.... మేము మూగ చెముడూ గుడ్డివాళ్ళాలా ఉండేవాళ్ళం.

’మనస్సులో కూడా అనుకోకూడదు’ - అని నిర్ణయించుకున్నాక అస్సలు దాన్ని తలచనే లేదు. 2001 లో ఎంసెట్ అవకతవకల మీదా, వ్యవస్థీకృత వేధింపు మీదా నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశాక, కొందరు మర్మగర్భంగా మాట్లాడినా మాకది ఎక్కలేదు. అప్పటికి ఎదురుగా ఉన్న సూర్యాపేట కాలేజీ వాళ్ళనే వేధింపుదారులుగా చూశాము.

అదే మాకు తేలికగా అన్పించింది. తిన్న దెబ్బలకి.... 1992 గురించి గానీ, రామోజీరావు గురించి గానీ ఆలోచించటానికి మనస్సు మొరాయించింది.ప్రతి సమస్యకూ ఉన్న పైకారణాన్నే చూస్తూ, వాటికి తగిన పరిష్కరాన్నే చేయటానికి ప్రయత్నించాము. కాబట్టి కూడా చాలా ఎదురు దెబ్బలు తినవలసి వచ్చింది. కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోయాము కూడా! ఆ విధంగా రెండో దశ నడిచింది.

అయితే 2005 లో వేధింపు పరాకాష్టకు చేరి, మానసికతంత్రాలు మా పాప మీదికీ, మా భవిష్యత్తు మీదికీ వచ్చేసరికి, ఇక అనివార్యంగా రామోజీరావు గురించి పునరాలోచన చేశాము. అప్పుడే మన్మోహన్ సింగ్ కి, రామోజీరావు మీద ఫిర్యాదు చేశాము. ఆ విధంగా రెండో దశ ముగిసి మూడో దశ ప్రారంభమైంది.

మూడో దశ :
2005 నుండి ఇప్పటి వరకూ నడుస్తోన్న దశ ఇది. 2005 లో ప్రారంభమైన ఫిర్యాదుల పరంపర, 2007 చివరి వరకూ కొనసాగింది. వాటి వివరాలు, పీవీజీ - రామోజీరావు - మా కథ లోనూ, మరికొన్ని గత టపాలలోనూ వ్రాసాను. పత్రాలతో సహా సాక్ష్యాలు Coups On Worldలో ఉంచాను. వివిధ రంగాల మీద నకిలీ కణికుల కుట్ర గురించి కూడా అందులో పొందుపరిచాను. 2007 చివరి మాసాల నుండి 2008 జూలై దాకా.... నేను వ్రాయటం - మా పాప ఫెయిర్ చేయటం మా వారు టైపు చేయటం ప్రతీరోజూ అదే దినచర్యగా చేశాము.

2008 నవంబరు 2 న ’అమ్మఒడి’ బ్లాగు తెరిచాము. డిసెంబరు 20 - 22 లలో Coups On World[మేము cow అని పిలుచుకుంటాము] ను ఒకేసారి విడుదల చేశాము. అందులో 1992 వరకూ నకిలీ కణికులు ప్రపంచం మీద, భారత దేశం మీద నిర్వహించిన కుట్రల గురించీ వ్రాసాము.

వాటిల్లోంచి.... ’భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర’ అనే లేబుల్ క్రింద, రాజకీయరంగంపై కుట్రని తెలుగులోకి అనువదించాను. 2009 మే నుండి నకిలీ కణిక అనువంశీయుల తిరగబడ్డ కథని వివరించటం ప్రారంభించాను. అది తెలుగులో మాత్రమే వ్రాసాను, వ్రాస్తున్నాను.

ఇక ఈ మూడో దశలోనే.... 1992 నుండి దేశంలోనూ, మా జీవితాల్లోనూ జరిగిన, ప్రతీ సంఘటననీ, ప్రతీ అంశాన్నీ పరిశీలించటం, విశ్లేషించటం చేశాము. 2005లో వెనుదిరిగి చూస్తే మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయమూ కనబడింది. అతణ్ణి కట్టడి చేసే మరో బృందపు ప్రమేయమూ కనబడింది. రామోజీరావు బృందాన్ని నకిలీ కణిక వ్యవస్థగానూ, నెం.10 వర్గంగానూ వివరించాను. అతణ్ణి కట్టడి చేసే బృందాన్నే పీవీజీ సమీకరించిన నెం.5 వర్గంగా వివరించాను. ఎందుకంటే ఈ వేధింపు లోనూ ఓ శృతీ, లయా ఉన్నాయి కనుక. అదే ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం’ తాలూకూ వైచిత్రి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మున్నా సినిమా:
ఇది నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, రామోజీరావులతో సంభాషించిన చిత్రం. అర్ధం చేసుకోగల వారికి, ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య విశేషాల గురించి అవగాహన కలిగించగల చిత్రం కూడా!

ఇందులో ఖాఖా పాత్ర నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకీ, రామోజీరావుకీ ప్రతీక! ఖాఖా పరమ స్వార్ధ పరుడు. మనుష్యుల్నీ, నమ్మకాల్నీ అమ్ముకునేవాడని మున్నా అంటాడు. మున్నా.... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో, తమ మాతృదేశాల పట్ల భక్తీ, ప్రేమా, నిబద్దత గల వారికి ప్రతీక! మున్నాకి తల్లి మీద ప్రేమ, చెల్ల్లి మీద ప్రేమ. అలాగే వారికీ తల్లిలాంటి తమ దేశం పట్ల, సోదరుల వంటి తమ ప్రజల పట్ల ప్రేమ!

అలాంటి వారికే పీవీజీ, నకిలీ కణిక అనువంశీయుల నెట్ వర్క్ నీ, పనితీరునీ, స్వార్ధాన్ని expose చేసింది! తన చెల్లి చావుని కూడా ఉపయోగించుకున్న ఖాఖాని, తన తల్లిని వ్యభిచార గృహానికి అమ్మబోయిన ఖాఖాని.... నిస్సహాయంగా క్రోధంగా.... మున్నా చూసినట్లు వాళ్ళూ చూసారు. వాళ్ళే పీవీజీ చేత నెం.5 వర్గంగా సమీకరించబడ్డారు.

ఖాఖాని ఎదిరించిన వాళ్ళు, శ్రీనివాస రావుల్లాగా, ఆత్మల వంటినాటకాలు తెలియక బలైపోయారు. ఇక ఖాఖా రెండవభార్య, ఆమె కుమార్తె! వీళ్ళు ఖాఖాకి నిర్భంధంగా నిస్సహాయంగా లొంగి ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే మున్నా బలపడి కనబడ్డాడో, అప్పుడు అతడితో చేరిపోయారు. ఆ విధంగా నెం.5 వర్గం విస్తరించింది. ఖాఖా రెండవభార్య కొడుకు రాహుల్, ఖాఖా బుద్దులన్నిటినీ పుణికిపుచ్చుకున్నా, ఖాఖా అంత ముదరలేదు. నకిలీ కణిక వ్యవస్థలో, నకిలీ కణిక అనువంశీయులకి కీలక ఏజంట్లయిన నెం.10 వర్గానికి ఈ రాహుల్ పాత్ర ప్రతీక!

అందుకే, మున్నాచేతిలో.... ఖాఖాకి లాగే ఇతడికీ ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంటే వస్తుంది, చూడండి! హీరోయిన్ తో పెళ్ళి విషయంలో, మున్నా ప్రయోగించిన చెంచా వేణుమాధవ్ కారణంగా, రాహుల్ తనంతట తానే ’ఈ పెళ్ళి నాకు వద్దు’ అంటాడు. దానికి ముందు మున్నా చేతిలో చావుదెబ్బలు తింటాడు. మున్నా రాహుల్ ని సామాన్య విద్యార్ధి చేత కూడా తన్నిస్తాడు. సామాన్యుడిలో ఆ రోషం రగిల్చి మరీ తన్నిస్తాడు.

మున్నా, ఖాఖాకి అల్టీమేటమ్ ఇస్తాడు. "ఇక నుండి బ్రతకడానికి భయపడాలి నువ్వు. నువ్వు నమ్ముకున్న నీవాళ్ళు. నీ డబ్బూ, నీ రాజకీయం.... అన్నీ.... అన్నీ పోయాయి. చివరికి నీ గన్ను కూడా నీకు హాండిచ్చింది. ఇంతకంటే చావు సుఖం అనుకోవాల్సిందే నువ్వు" అన్న అల్టీమేటమ్! ఆత్మ హత్యా సదృశ్య అసైన్ మెంట్ల లాగే ఖాఖా కూడా, మున్నా ఇచ్చిన బుల్లెట్ తో కణత మీద కాల్చుకు చనిపోతాడు. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, రామోజీరావుకీ, అతడి సోదరీ తుల్య సోనియాకీ ప్రస్తుతం ఎదురుగా ఉన్న స్థితి ఇదే! కాకపోతే పిస్తోలు తో భౌతిక మరణం కాదు. గూఢచర్యపరమైన ఆత్మహత్య!

ఖాఖా - ఆత్మల నాటకమే రామోజీరావు, వై.యస్. కలిసి ఆడిన నాటకం. కాకపోతే అందులో వై.యస్. మరింతగా గారెల వంట వంటి స్వంత గూఢచర్యం నడిపాడు. అర్ధాంతర మరణమూ పొందాడు. ఆ వివరాలు గత టపాలలో వై.యస్. మరణం వెనక అసలు కథలో వ్రాసాను.

మన రాష్ట్రంలో రాజ రామోజీలే కాదు, మన ప్రక్క వీధి నుండి ప్రపంచపు మూలదాకా ఇదే అమలు చేయబడుతుందన్నది చరిత్ర నిరూపించింది. శాస్త్రీజీ ప్రధానిగా ఉండగా జరిగిన ఇండో - పాక్ యుద్దం దీనికి చక్కని ఉదాహరణ. అప్పటికి ప్రపంచంలో....

పైకి అమెరికా రష్యాలు పరస్పర వ్యతిరేక శిబిరాలు. ప్రతీ విషయంలోనూ పోటీ పడుతూ ప్రచ్ఛన్న యుద్దం నడిపిస్తున్న రెండుధృవాలు. అలాంటిది.... ఇండో - పాక్ యుద్దంలో పాకిస్తాన్ కి బాసటగా అమెరికా నిలిచింది. అయినా రష్యా మనకి వత్తాసు పలకలేదు సరికదా, సరిగ్గా పాక్ ఓడిపోయి, ప్యాటర్సన్ యుద్దట్యాంకులు నవ్వులపాలైన తరుణంలో, మధ్యవర్తిత్వం చేస్తామంటూ పరుగెత్తుకు వచ్చింది. తమ వ్యతిరేక శిబిరమైన అమెరికా అనుయాయి పాక్ ని, తటస్థ అలీన వర్గపు భారత్ ఓడించినప్పుడు.... ఎంచక్కా ఆనందిస్తూ ’కాగల కార్యమూ గంధర్వులు తీర్చిరి’ అన్నట్లుండాలి కదా? మరెందుకు, ఎవరి కోసం సంధి రాయబారాలు నడిపి, చర్చలకు పిలిచింది? ఆ చర్చలకు వెళ్ళినప్పుడే శాస్త్రీజీ ’గుండెపోటు’[?] తో మరణించాడు. అదో పైకారణం, అంతే!

పైకి కొట్టుకునే అమెరికా రష్యాలు, కీలక సమయాల్లో మాత్రం అంతర్గత సహకారం ఎందుకు ఇచ్చుకున్నాయి? ఎందుకంటే - రెండు శిబిరాలనీ నడిపింది ఒకటే గూఢచార వ్యవస్థ గనక! సిఐఏ, కెజీబీల వెనక ఉన్నది నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గమే గనక!

ఈ విధంగా సినిమాల భాష నడిచింది. పరిశీలిస్తే.... ఇది సామాన్యులకు కూడా అర్ధమయ్యేంత సులువైన భాషే!

ఈ చిత్రంలో కొసమెరుపులాంటి ఓ సత్యం ఏమిటంటే - హోం మినిస్టర్ [చలపతిరావు]తో పోలీసు కమీషనర్ అన్నట్లు "ఖాఖా అంటే ప్రజలకి భయం. మున్నా అంటే ప్రజలకి ధైర్యం".

అవును! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అంటే ప్రజలు భయపడాలన్నదే రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం, సల్పిన కృషి!

నెం.5 వర్గపు లక్ష్యం ప్రజలలో ధైర్యమూ, రజమూ రగులుకోవాలన్నది!

కుడితే చావాలన్న చీమ, కుట్టగానే తాను ఛస్తున్నట్లుగా.... ప్రజలని భయపెట్టాలనుకున్న నకిలీ కణిక అనువంశీయులు, ఇప్పుడు పరిస్థితులకి భయపడుతున్నారు. పరిస్థితుల్ని సంభాళించుకునేందుకు నానా ఫీట్లు చేస్తున్నారు.

ఇక నెం.5 వర్గాన్ని చూసి ప్రజలు ధైర్యపడాల్సి ఉంది!

ఇప్పుడు మీకు నవ్వుకునేందుకు ఓ తమాషా చెబుతాను. మేము సినిమాల గురించి చెబుతామని మార్చి02 న ఓ వ్యాఖ్యకు జవాబుగా వ్రాసాము. అప్పటి నుండి ఈనాడు, రామోజీరావుల ఫీట్లు మొదలు. మార్చి17 న సినిమా గురించి మొదలు పెట్టాము. మార్చి 19 వ తేదీన ’సినిమాల ఊసెందుకు’ అంటూ సినిమాల గురించి వ్రాయవద్దని ఘోల్లుమన్నాడు. అదీ సినిమా పేజీలో!

మరొక ముఖ్యమైన విషయం చెప్పేందుకు మళ్ళీ ’మున్నా’ సినిమా దగ్గరికి వస్తాను.

ఆ సినిమాలో రాజకీయ నాయకుడు శ్రీనివాసరావు పాత్ర విశిష్టమైనది. ఇతడు పార్టీకీ, అధికారానికీ గాక, ప్రజల పట్ల నిబద్దుడు. నిజాయితీగా ప్రజల బాగు కోసం పోరాడిన వాడు.

ఖాఖాతో శ్రీనివాస రావు "ఇంటికి పిలిచి ఇడ్లీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు. కానీ నన్ను చంపలేవు. నాకూ నీకూ పడదని అందరికీ తెలుసు. నన్ను చంపితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ ఫ్యాక్టరీ మూయించనిదే నేను ఊరుకోను" అంటాడు. అంత వరకూ మాత్రమే కుట్రని, గూఢచర్యాన్ని ఊహించగలిగాడు. ఆత్మకూడా దుష్టుడే కాబట్టి అతడు ఇస్తానన్న మద్దతుని ఛీత్కరించాడు. అయితే ఆత్మ ఖాఖాకి అనుంగు బంటు అని ఊహించక, అతడు రమ్మన్న చోటికి పోయి అనూహ్యంగా ఖాఖా చేతిలో మరణిస్తాడు.

1992 ముందర, ఏ దేశానికి ఆ దేశంలో, ప్రపంచం మొత్తాన్ని నడుపుతోంది ఒకే ఒక గూఢచర్య వలయమనీ, మూడున్నర శతాబ్ధాలుగా దాన్ని నిర్వహిస్తోంది నకిలీ కణిక వంశమనీ తెలియక, ఎక్కడి కక్కడ, ఎప్పటి కప్పుడు, మరింకేవో పైకారణాలని చూస్తూ, విభజించి పాలించే తంత్రలతో సతమతమైన, ఓడిపోయిన, బలైపోయిన రాజకీయ నాయకులకు ఈ శ్రీనివాసరావు పాత్ర ప్రతీక!

ఉదాహరణకి మన దేశాన్ని తీసుకుంటే - శరీరం తునాతుకలై మానవబాంబు దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న రాజీవ్ గాంధీకి సమ్మోహనకరమైన చిరునవ్వు తప్ప, గూఢచర్యపు లోతెంతో తెలియదు. గూఢచర్యంలో అతడు పసిబిడ్డవంటి వాడే! తమ నట్టింట కొత్త కోడలిగా, తన నడిజీవితంలో ఇష్టసతిగా అడుగుపెట్టిన సోనియా.... ఎంత నటనా వైదుష్యమూ, గూఢచర్య చాతుర్యమూ కలిగి ఉందో ఊహకైనా తెలియని వాడు.

జీవిత పర్యంతమూ శతృవు ఎక్కడి నుండి కుట్రలు పన్నుతున్నాడో తెలియకపోయినా, ఒడ్డిపోరాడిన ఇందిరాగాంధీ అపర చండిక.

ఇందిరాగాంధీ.... 30 బుల్లెట్లు శరీరాన్ని తూట్లు పొడవగా అందులో 23 శరీరంలో నుండి అవతలికి దూసుకెళ్ళాయి. 7 లోపలే ఉండిఫోయాయి. రాజీవ్ గాంధీ, ముఖ్యంగా ఇందిరాగాంధీ లు శ్రీనివాస రావు పాత్రకీ ప్రతీకే! ఆమెకీ శ్రీనివాస రావులాగే నకిలీ కణిక గూఢచర్యం కొంతే తెలుసు. ఆ ఆన్వేషణలోనే జీవితాంతం పోరాడింది.

మున్నా చిత్రంలో శ్రీనివాసరావు ’ఖాఖా ఆత్మల వైరం’ అనే నాటకాన్ని గుర్తించలేక వాళ్ల చేతిలో బలయిపోతాడు. అక్కడ దొరికిన ఒక్క బుల్లెట్! దాంతో మున్నా ఖాఖాని కొన్ని గంటల పాటు పోలీసు లాకప్ లో కూర్చొబెడతాడు. అక్కడ ప్రారంభమైన మున్నా సవాల్.... ఖాఖా పతనం!

సినిమా చివరిలో మున్నా ఇచ్చిన ’ఒక్క బుల్లెట్’తోనే ఖాఖా, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటాడు. అందులో ఉన్న వైచిత్రి ఏమిటంటే - మున్నా ఖాఖాకి ఇంకించేది - ’నాకు గా నేను నిన్ను చంపను. నిన్ను చంపటం నా టార్గెట్ కాదు. నిన్ను బ్రతక నివ్వకపోవటమే నా లక్ష్యం. ఇంతకంటే చావు సుఖం అన్పించాలి నీకు. అప్పటి వరకూ నీ ప్రతి పనికీ అడ్డం వస్తాను. నీ కళ్ళముందే నీ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాను’ అని.

అదే నెం.5 వర్గం, నకిలీ కణిక వ్వవస్థ అనువంశీయులకీ, ముఖ్యంగా రామోజీరావుకీ ఇచ్చిన అల్టిమేటమ్! తొలి నుండీ తుది వరకూ ఇచ్చిన, ఇస్తున్న ఏకైక హెచ్చరిక! - "మాకుగా మేము నిన్ను చంపము. గూఢచర్యపరంగా నిన్ను పతనావస్థకు తీసుకుపోతాము. నీ కళ్ళముందే నీ సామ్రాజ్యాన్ని కూలుస్తాము. నీ చేతుల్తోనే నీ నెట్ వర్క్ ని తుత్తునియలు చేస్తాను. నిన్ను, నీ నిజస్వరూపాన్ని, నీ కీలక ఏజంట్ల లోగుట్టుల్నీ అన్నిటినీ బహిర్గతం చేస్తాము. చేసిన కర్మలని అనుభవింప చేస్తాము. [అంటే సువర్ణముఖి అన్నమాట.] ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లతో నీకు, ఇంతకంటే చావు సుఖం అన్పించాలి. తనివి తీరా ఆ సుఖాన్ని అనుభవించు. నీ అంతట నువ్వే, నీ చావుని నువ్వే నిర్ణయించుకో. లేదా ఈ బహిర్గతాలూ, సువర్ణముఖిలూ కొనసాగుతూనే ఉంటాయి" అన్నదే ఆ హెచ్చరిక.

ఇక మున్నా సినిమాకీ, రామోజీరావుకీ ఉన్న గాఢమైన పోలిక ఏమిటంటే - శ్రీనివాసరావు హత్యలో దొరికిన బుల్లెట్ తో మున్నా కేసు పెట్టాడు. చివరిలో ఖాఖా చచ్చేదీ, మున్నా ఇచ్చిన బుల్లెట్ తోనే!

1992 లో..... అంతకు సంవత్స్రరం క్రితం నిర్వహించిన రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి నేను పీవీజీకి పిర్యాదు ఇచ్చాను. అప్పుడు ప్రారంభమైన అసలు కథ, యదార్ధ కథ ఇది! ఆ ఫిర్యాదు, మున్నా సినిమాలోని బుల్లెట్ కి ప్రతీక! రాజీవ్ హత్య కేసుతోనే అన్నీ ప్రకటింపబడాలి. నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గంలో కీలక వ్యక్తులైన రామోజీరావు, సోనియాల, స్వీయ ఆత్మహత్యా సదృశ్య గూఢచర్య మరణం దానితోనే!

"ఈ కేసు, ఇందులోని సత్యాలు అందరికీ తెలియాలంటే - అంటే డిక్లేర్ చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి కదా? కాబట్టే నువ్వు మన్మోహన్ ని నమ్ము, సోనియాని నమ్ము, వై.యస్.ని నమ్ము" - అన్న ఊదర మాకు పెట్టేందుకు ’ఈ కేసుని ప్రకటించటం’ అనే ఆశనే పెట్ట చూపాడు రామోజీరావు. అదే అరుంధతిలో చెప్పబడింది. అప్పటికి మేము బ్లాగు తెరవలేదు గనక.... సోనియా, మన్మోహన్ ల గురించి మా అభిప్రాయం, అవగాహన ఎంతో రామోజీరావుకి తెలియదు మరి! ఇక నకిలీ కణిక అనువంశీయు గూఢచర్యం గురించి మాకేమిటి, పీవీజీకే తెలియదనుకున్నాడు.

’ఆ కేసు మరెవ్వరో కాదు. స్వయంగా మీరే ప్రకటించుకోక తప్పదు. అప్పటి దాకా బహిర్గతాలూ, సువర్ణముఖిలూ నీకూ, నీ సోదరతుల్య సోనియాకీ తప్పదన్నదే’ 2007 లోనే మున్నా సినిమా ద్వారా నెం.5 వర్గం, రామోజీరావుకి ఇచ్చిన హెచ్చరిక! ఇక సినిమాలకు సంబంధించిన మరో అంశాన్ని ప్రస్తావించి ఈ టపా ముగిస్తాను.

అరుంధతి సినిమాతో సహా, వేల సినిమాలలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ప్రజలకి ఇంకించింది ఏమిటంటే - చెడ్డవారికే బలమెక్కువ అని. చివరికి మరణించాక కూడా చెడ్డవాడి ఆత్మలకే శక్తిక్కెవ, మంచి వారి ఆత్మల కన్నా! అరుంధతిలోనే కాదు, అక్స్ లాంటి వేలాది సినిమాల్లోనూ చూపబడింది అదే!

చెడ్డవాడి ఆత్మలకే అంత శక్తి ఉంటే.... మంచివారికి, వారి ఆత్మలకి మరెంత శక్తి ఉండాలి? భగవంతుడు మంచికి తోడుంటాడే గాని చెడుకి కాదే?

దేశంకోసం పోరాడిన వారి ఆత్మలకీ, స్వాతంత్రంకోసం పోరాడిన మహాత్ములకీ, మానవత్వం కోసం పోరాడిన పుణ్యాత్ములకీ ఉండే ఆత్మబలం అంతులేనిది. అది సాక్షాత్తూ దైవబలమే! ఇందుకు నా జీవితం నుండే ఉదాహరణ ఇస్తాను.

1992, మే లో ఢిల్లీకి వెళ్ళాను. వెంట నా చిన్న తమ్ముడున్నాడు. పీవీజీకి రామోజీరావు గురించి, రాజీవ్ హత్యలో అతడి హస్తం గురించీ ఫిర్యాదు ఇవ్వాలన్నది నా టార్గెట్. అప్పటికే కడప వెళ్ళి వై.యస్.ని ఈ విషయంలో సాయం అడగటమూ, అతడు సాక్ష్యాలుంటే తెమ్మనటమూ అయిపోయింది. పీవీజీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు సాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, అప్పటి అఖిల భారత మహిళా కాంగ్రెస్ కన్వీనరూ అయిన కుముద్ బెన్ జోషి ని కలిసాను. మరోసారి ఇలాంటి విషయాలు తీసుకుని తన దగ్గరికి రావద్దని తెగేసి చెప్పేసిందామె.

ఆ రోజు కొంత నిరాశకీ, నిరుత్సాహానికీ గురయ్యాను. మరికొంత బెరుకూ పడ్డాను. గీత తెరిస్తే ’హతోవా ప్రాప్యతే స్వర్గం’ అనే శ్లోకమే కళ్ళముందు నిలిచింది. అయినా ఫిర్యాదు వ్రాసేందుకు ధైర్యం చాల లేదు. చాలా గుంజాటన పడ్డాను. చివరికి స్థైర్యం కూడగట్టుకునేందుకు, నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు ఇందిరాగాంధీ మోమోరియల్ [నెం.1 సఫ్థర్ జంగ్ రోడ్] కు వెళ్ళాను. సెక్యూరిటీ గార్డుల చేతిలో హత్యకు గురయ్యే ముందు, భువనేశ్వర్ లో ఆమె ఉపన్యాసంలోని మాటలు మంద్రస్థాయిలో విన్పిస్తున్నాయి. ఈ దేశపు మట్టికి మరింత బలం చేకూర్చేందుకు, ఆమె కార్చిన రక్తపు చుక్కలు అక్కడ ఘనీభవించిన స్పటికాలై ఉన్నాయి. బుల్లెట్ల వానకు రంధ్రాలు పడిన చీర కళ్ళముందు కదలాడింది.

అక్కడే చాలా సేపు గడిపాను. అదో రకమైన ధైర్యం, తెగువ నాలో ప్రవేశించాయి. [అప్పటి నా భావ సంచలనాన్ని ఇప్పుడు కాగితం మీద పెట్టడం కష్టమే! కొంత భాగం అప్పటి నా డైరీలో వ్రాసుకున్నాను.] మా నాన్న చెప్పిన "కాకిలా కలకాలం బ్రతకటం కంటే హంసలా అరఘడియ బ్రతికినా చాలు. ముందుకే వెళ్ళమ్మా!" అన్న మాట గుర్తుకొచ్చింది. ఎలా బ్రతికినా చచ్చే నాడు ఛస్తాం. దేశం కోసం చావటం కంటే గొప్పచావు ఏముందనిపించింది.

ఇందిరాగాంధీ చివరి ఊపిరి విడిచిన చోటు నాలో ఎక్కడలేని తెగింపునీ, ధైర్యాన్నీ నింపింది. అంతే! నేను బసచేసిన పహార్ గంజ్ లోని హోటల్ గదికి తిరిగివచ్చాను. రాత్రంతా కూర్చొని ఫిర్యాదు వ్రాసి, ఫెయిర్ చేసి కవరులో పెట్టి సీల్ చేసాను. నేరుగా పీవీజీ ఇల్లు చేరాను. ఆరోజు ఆలస్యం కావటంతో మర్నాడు ఫిర్యాదుని పీవీజీ కార్యదర్శికి అందచేసాను. ఇందిరాగాంధీ నేలకొరికింది 1984 లో. నేను రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి ఫిర్యాదు ఇచ్చింది 1992 లో. దాదాపు 8 ఏళ్ళ తర్వాత!

కానీ ఆమె ఆత్మశక్తి నాకు బలాన్నిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. మంచి వారి ఆత్మబలం అది! ఎంతో చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి, దేశపు మట్టికి బలాన్నిచ్చిన ఎందరో భగత్ సింగ్ ల ఆత్మ బలం నన్ను నడిపించింది.

అప్పటికి తెలిసింది రాజీవ్ గాంధీ హత్య గురించి మాత్రమే! నకిలీ కణిక అనువంశీయుల కుట్రలకి బలయ్యింది ఎందరో? ఒక ఇందిరాగాంధీ, ఒక మహాత్మగాంధీ.... అప్పటికి గుండెపోటు అనే పైకారణాన్ని నమ్మించినా కుట్రలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఒక శాస్త్రీజీ.... చైనా దురాక్రమణతో వెన్నుపోటుకూ, నమ్మకద్రోహానికీ గురయ్యామన్న యదార్ధం తెలుసుకొని, కలలు కరిగిన కృంగుబాటుతో మానసిక మరణానికి చేరువైన ఒక నెహ్రు - మత ఘర్షణల పేరిట, రిజర్వేషన్ రచ్చలతో ఎందరు ఎన్ని రకాలుగా ఉసురు కోల్పోయారో.... ఆ ఆత్మల బలమే ఈ రోజు నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా అద్వానీలని, ఆయువు పట్టులపై కొడుతోంది.

ఇది ఆగని యుద్దం.
ఓటమి లేని యుద్దం.
ఎందుకంటే గెలిచే వరకూ కొనసాగే యుద్దం కనుక!

మరణించినా మహాత్ముల భావప్రసార శక్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇప్పటికీ వివేకానందుడి ఉపన్యాసం చదివినా, బాపూజీ ఆత్మకథ చదివినా.... వారి నుండి మనకి భావపు శక్తి, స్ఫూర్తి ప్రసారం కావడం నిజం!

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మేం నంబూరు పల్లెలో ఉండగా.... అప్పటికి మా పాపకి దాదాపు రెండు సంవత్సరాలుంటాయోమో! మాటలన్నా సరిగ్గా రావు. టివీలో రాజమకుటం సినిమాలోనే అనుకుంటా, శ్రీశ్రీ వ్రాయగా ఘంటసాల పాడిన

"మరో ప్రపంచం... మరో ప్రపంచం... మరో ప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.
పదండి ముందుకు పదండి తోసుకు" అనే పాట వచ్చింది.

మా గదిలో మంచంకి దగ్గరలో ఓ మూల టేబుల్ పైన టీవీపెట్టి ఉంది. మా పాప ముఖం వెలిగిపోతుండగా.... టీవీ వైపుకు మంచం మీదే ముందుకెళ్ళిపోతూ

’మరో ప్రపంచంపిలితింది. పదంది ముందుతూ పదంది తోసుతూ’
అంటూ పాడుతోంది. దాదాపు టీవీలోకి వెళ్ళిపోవాలన్నంత వ్యగ్రంగా! నేనయితే అదిరిపడ్డాను. ఎప్పుడో అప్పటికి నాలుగు దశాబ్దాల క్రితపు పాట.

శ్రీశ్రీ హృదయంలోని ఆర్తి, ఆశ.
ఘంటసాల కంఠంలోని తీవ్రత.
ఆ పాటకు కట్టిన రాగంలో లోంచి తొణికే రౌద్రరసం!

రెండేళ్ళు నిండని పసికూనని, భాష, భావాల గూర్చి ఏదీ తెలియని చిన్ని బుడ్డీని....ఏదో అవ్యక్త అనుబంధం కట్టిలాగినట్లు ఆకర్షతమవ్వటం... గీత చెప్పినట్లు ’జీవుడు వాసనలు మోసుకువస్తాడేమో!’ శతాబ్దాలు గడిచినా.... మహాత్ముల శక్తి వన్నెతగ్గనిదని కళ్ళెదుట చూశాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాలలో చెప్పినట్లు సినిమాల ద్వారా నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం మధ్య సంభాషణ నడుస్తుంది. నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకీ నెం.5 వర్గానికీ మధ్య మరింత స్పష్టమైన భాష నడుస్తుంది. రామోజీరావు మాతో కూడా, సినిమాల ద్వారా ప్రత్యేకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడు.

కొన్నిటి గురించి గత రెండు టపాలలో వివరించాను. అలాంటి సినిమా భాష చాలానే ఉన్నా.... మరి రెండు సినిమాలతో ఈ అంశం ముగిస్తాను. వాటిలో ఒకటి అరుంధతి, మరొకటి మున్నా.

అరుంధతి సినిమా:
కథ విషయానికి వస్తే - గద్వాల మహా సంస్థానపు రాజుకి ఇద్దరు కూతుళ్ళు భార్గవి, అరుంధతి. పెద్దామె మెతక, చిన్నామె సమర్ధురాలు. రాజు గారి చెల్లెలు అత్తిల్లు వదిలి ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. రాజు గారికి మాయ మాటలు చెప్పి, జాతకాలంటూ నమ్మించి భార్గవిని తన కొడుకు పశుపతికిచ్చి పెళ్ళి చేయిస్తుంది. వీడు పరమ నీచుడు. మకార మక్కువ గలవాడు. ఊళ్ళో కనపడ్డ పిల్లనల్లా ఎత్తుకుపోతున్నా , ప్రజలు ఏడుస్తూ ఊర్కుంటారు. రాజుగారు కూతురి కోసం సహిస్తూంటాడు.

ఇలాంటి ఈ సంస్థానంలో అందరూ హాయిగా ఉండేవారని పనిమనిషి చంద్రమ్మ[ముసలి బొమ్మాళి] చెబుతుంది. ఓ రోజు పశుపతి బాగా తాగి ఊగుతూ వచ్చి, అరుంధతికి నాట్యం నేర్పడానికి దూరప్రాంతం నుండి వచ్చిన అంధ నాట్యాచారిణిని బలాత్కరించి చంపేస్తాడు. నిస్సహాయంగా భార్గవి ఉరిపోసుకు చచ్చిపోతుంది. అప్పటి వరకూ ఆమె కోసం సహించిన వారు కావటంతో ప్రజలూ, రాజు అందరూ ఆగ్రహిస్తారు. రౌద్రంతో అరుంధతి పశుపతినీ, వాడి తల్లినీ శిక్షిస్తుంది. పశుపతిని గుర్రానికి కట్టి ఈడ్చి పారేయిస్తుంది.

వాడు ఆఘోరాల చేత రక్షింపబడి క్షుద్రవిద్యలు నేర్చుకుని తిరిగి వస్తాడు. వాణ్ణి చంపడానికి గోళ్ళుపెంచిన సాధువులు అనేక రూల్సు అండ్ రెగ్యులేషన్స్ చెబుతారు. వాటన్నిటి ప్రకారం అరుంధతి[సీనియర్] పశుపతిని నట్టింట సజీవంగా సమాధి చేస్తుంది. రాజ భవంతి ఖాళీ చేసి కొత్తది కట్టించుకుంటారు. సమాధిలోంచి కూడా పశుపతి ఆత్మ, సంస్థాన ప్రజల్ని ఈతి బాధలతో, అంటురోగాలతో, కరువు కాటకాలతో బాధిస్తాడు. జేజెమ్మ అవతారమైన అరుంధతి[సీనియర్] కి దైవ సహాయం లభించదు. ఎన్నో తీర్ధాలూ, క్షేత్రాలూ తిరిగి చివరికి సాధువుల సలహా మేరకు ఆత్మత్యాగం చేస్తుంది.

అత్యంత దారుణమైన చావుని,... మరుజన్మకు కూడా తనకి ప్రతీకారం గుర్తుండేంత దారుణమైన చావుని వరిస్తుంది. తలపైన టెంకాయలు కొట్టించుకుని రుధిర ధారలు స్రవిస్తుండగా మరణిస్తుంది. ఆమె ఎముకలతో ఒక బాకు, ఆమె మంగళ సూత్రాల వంటి నగల బంగారంతో పిడినీ తయారు చేసి, అఘోరాని చంపే నియమ నిష్ఠల ప్రకారం ఆ సాధువులు ఆయుధాన్ని దాచి పెడతారు. మూడు జన్మల తర్వాత అదే వంశంలో పుడతాననీ, అలా పుట్టిన ఆడపిల్లకీ తన పేరు పెట్టమనీ చనిపోయిన జేజెమ్మ , ఇదంతా వ్రాసి తన బొమ్మగా చిత్రిస్తుంది.

మూడు తరాల తర్వాత పుట్టిన చిన్న అరుంధతి పెళ్ళితో ప్రారంభమైన సినిమా కథలో, ఇదంతా ప్లాష్ బ్యాక్ గా చెప్పబడుతుంది. గద్వాలకు వచ్చిన అరుంధతి [జూనియర్] పైన ప్రతీకారం తీర్చుకునేందుకు పశుపతి ఆత్మ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో పశుపతి తల్లి ఆత్మ వాడికి సాయపడుతుంది. పెద్ద అరుంధతి పెద్దకుమారుడి ఆత్మ దాన్ని నిరోధించలేక నిస్సహాయమౌతుంది.

ఇక్కడి నుండి కొని విచిత్రాలు జరిగాక, చిన్న అరుంధతి అన్వర్ అనే మంత్రాల సాయిబు సాయం తీసుకుని, పశుపతి ఆత్మని నాశనం చేస్తుంది.

స్థూలంగా ఇదీ కథ.

ప్రత్యేకాంశాలు:
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పబడింది దుష్టాత్మలకీ, పుణ్యాత్మాల కంటే ఎక్కువ శక్తి ఉండటం! పశుపతి ఆత్మని నాశనం చేసే లోపల, చిన్న అరుంధతి భయ విహ్వలయై కెవ్వుకెవ్వున అరుస్తుంటుంది. పెద్ద అరుంధతి [జేజెమ్మ] పశుపతిని చీల్చి చెండాడితే, చిన్న అరుంధతి, జేజెమ్మ తనని పూనిన సమయంలో మాత్రమే "నువ్వు నన్నేం చేయలేవురా?" అని హుంకరిస్తుంది గానీ, మిగిలిన సమయాల్లో భూత వైద్యుడు అన్వర్ సాయం కోసం అరుస్తూ, పరుగెడుతూ, కాబోయే భర్త రాహుల్ ను కాపాడుకునేందుకు అన్వర్ గదిలోని విభూతి[?]ని బకెట్లు లోంచి దోసిళ్ళతో తీసి గడపలో పోస్తూ, భయోత్పాతంలో ఉంటుంది.

తాను జేజెమ్మను కాననీ, తనకంత శక్తి లేదనీ ఆక్రోశిస్తుంది. చివరికి అన్వర్, పనిమనిషి చంద్రమ్మ ధైర్యం చెప్పగా, పశుపతిపై దాడికి కత్తిపడుతుంది.

ఇక పశుపతి అఘోరా ఆత్మకే కాదు, వారి తల్లి దెయ్యానికున్నంత శక్తి కూడా, పెద్ద అరుంధతి ఆత్మకు లేనట్లే ఉంటుంది. ఆమె మరుజన్మలోని చిన్న అరుంధతి యొక్క భయం దీన్నే చెబుతుంది. అఘోరా చేతిలో మరణించిన రాజు గారి ఆత్మకి గానీ, వాడి ఆకృత్యాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భార్గవి ఆత్మకి గానీ, ఎవరికీ శక్తి ఉండదు. బ్రతికున్నప్పుడే కాదు, చచ్చిపోయాక కూడా దుష్టులకే శక్తి ఎక్కువన్నది చెప్పడమే ఆ సినిమాలో దర్శక కథకుల ప్రధాన ఉద్దేశంలా ఉంటుంది.

చిట్టచివరికి చంద్రమ్మ కూడా అఘోరా చేతిలో చచ్చిపోయాక, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా, నానా కష్టాల అనంతరం, చిన్న అరుంధతి అన్వర్ విసిరిన పెద్ద జేజెమ్మ అస్థికల ఆయుధాన్ని తన రక్తంతో తడిపి అఘోరాని సంహరించటం ఇందులో విశేషం. చిన్న అరుంధతి మిగతా కుటుంబసభ్యుల పాత్ర నామామాత్రమే గాక, ఏ సహాయం చేయరు.

ఇందులో ప్రత్యేక పాత్ర అన్వర్ ది. ’మన భగవద్గీత’ అనే ఈ ముస్లిం మంత్రవైద్యుడు.... భగవంతుడు అనే భావాన్ని చూపించలేమని చెప్పడానికి లైవ్ డెమోగా, నొప్పి అనే భావాన్ని చూపించమంటాడు. అది చక్కని తర్కమే! అయితే దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్నీ నమ్మాల్సిందేనంటాడు. ఇది కుతర్కం! దేవుడికి సమాంతర శక్తిగా దెయ్యాన్ని హిందూయేతర మతాలు నమ్ముతాయి కానీ, హిందూ మతం దాన్ని ప్రతిపాదించదు. గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం ఏవి మంచిలక్షణాలో దైవీ స్వభావాలో, ఏవి చెడ్డలక్షణాలో రాక్షస స్వభావాలో చెబుతుంది. గీత త్రిగుణాత్మకంగా మానవ మనస్తత్వాన్ని వివరిస్తుంది. అంతేతప్ప దయ్యాన్ని ప్రతిపాదించదు.

దైత్యాదైత్యులు కశ్యప ప్రజాపతి దితి, అదితి బిడ్డలే! సవతి బిడ్డలైన వారిలో ఆయాలక్షణాలుండటమే విషయం. వైకుంఠ ద్వార పాలకులు అతి కౄర రాక్షస జన్మలెత్తడాన్ని భాగవతం ప్రతిపాదిస్తుంది. అదీ చేసిన ’కర్మ’ [సనక సనందాది మునులను అవమానించిన కర్మ] ఫలితాన్ని అనుభవించటమే. అంతే తప్ప దేవుడి కంటే బలమైన దెయ్యాలుండటం కాదు.

అలాంటి చోట, పశుపతి అఘోరా శక్తిని నాశనం చేయటానికి పెద్ద జేజెమ్మ ప్రాణాలర్పించి అస్థికలతో ఆయుధం చేయిస్తే, దాన్నీ తన రక్తంతో అభిషేకించి గానీ చిన్న జేజెమ్మ , పశుపతిని నాశనం చేయలేదనటం... ఎంతగా విలన్ ని బలవంతుడిని చేయటమో!

ఇక అన్వర్, చిన్న జేజెమ్మని ఓ సారి భవంతిలో కాపాడేస్తాడు. ఆపైన ఆయుధాన్ని తెచ్చి అందిస్తాడు. అతణ్ణి తన జట్టులో చిన్న జేజెమ్మ చేర్చుకోవటంతో ఇదంతా సాధ్యపడుతుంది. అన్వర్, చంద్రమ్మ, చిన్న జేజెమ్మ కలిసి, పెద్ద జేజెమ్మ బొమ్మలోని వివరాలు చదువుతుండగా అది తగలబడిపోతుంది.

"బ్రతకాలన్న ఆశ నీకు కలిగించాలి. బ్రతికేందుకు అవకాశం ఉందని నీకు తెలియాలి. అందుకోసం నువ్వు పరుగులెత్తి చావాలి. అందుకే ఇక్కడి దాకా చదవనిచ్చాను" అంటూ పశుపతి ఆత్మ కర్కశంగా నవ్వుతుంది. మొత్తంగా బ్రతకాలంటే భయం వేయాలన్నది అక్కడ విషయం. [ఇదే విషయం మున్నా సినిమాలో మున్నా ఖాఖాకీ, జల్సా సినిమాలో సంజయ్ సాహుకి విలన్ ముకేష్ ఋషి చెబుతారు. ఇదే జల్సాలో తరువాత హీరో కూడా అదే విషయం విలన్ కి చెబుతాడు, ప్రాక్టికల్ గా చేసి చూపుతాడు.]


ఈ సినిమాకి అనువర్తన ఆసక్తికరమైనది. అది బాగా అర్ధం కావాలంటే అనువర్తన కంటే ముందుగా ’అరుంధతి’ సినిమా కథకి వెనక నున్న కథనీ, ఆ నేపధ్య పరిస్థితులనీ వివరించాల్సి ఉంది.

అరుంధతి కథ వెనకనున్న కథ:
అరుంధతి సినిమా 2009 సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, కొద్దిరోజులు వాయిదాపడి, కథలో చిత్రీకరణలో కొన్ని మార్పుచేర్పులు చేయబడి విడుదలయ్యింది. మేము 2008 నవంబరులో ’అమ్మఒడి’ బ్లాగు ప్రారంభించి మీడియా మాయాజాలాన్ని వివరిస్తూ.... క్రమంగా డిసెంబరు తొలివారంలో నకిలీ కణికుడి గురించి పరిచయ టపాలు వ్రాసాము. కణిక నీతి గురించీ, విభజించి పాలించే కూటనీతి గురించీ అప్పుడే వివరించాము. డిసెంబరు 20 - 22 లలో మా ఆంగ్ల బ్లాగు Coups On World ప్రచురించాము. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ స్ట్రాటజీలని, వివిధ రంగాలపై వాళ్ళ కుట్రలనీ, మా కేసునీ, సాక్ష్యాధార పత్రాలతో సహా అందులో ఉంచాము.

అప్పటి వరకూ రాజకీయ రంగంపై మా అవగాహన గురించిగానీ, సోనియా బృందం గురించి మా అభిప్రాయం గానీ, మొత్తంగా మా అవగాహన ఎంత అన్న విషయం.... ఏవీ రామోజీరావుకి తెలియదు.అవి నమ్మకంగా తెలుసుకునేందుకు మా కుటుంబమిత్రుడు ఖాసీంని ప్రయోగించాడు.

ఈ సినిమాలో [అఘోరా] పశుపతి రామోజీరావుకి ప్రతీక అయితే, సీనియర్ అరుంధతి [జేజెమ్మ] పీవీజీకి ప్రతీక! ఇక చిన్న జేజెమ్మ అంటే జూనియర్ అరుంధతికి మేమే ప్రతీకలమన్న మాట.

1992 నుండి తాను పదవి దిగిపోయే వరకూ - ఖచ్చితంగా చెప్పాలంటే 1995 లో మేము ఫ్యాక్టరీ ఖాళీ చేసే వరకూ పీవీజీ మాకు గూఢచర్యం గురించి ప్రాధమిక అవగాహన కల్గించాడన్నది రామోజీరావుకి రూఢిగా తెలుసు. అది తెలుసుకునేందుకే మా తమ్ముళ్ళని నారా లోకేష్ స్నేహం పైకారణంగా చంద్రబాబునాయుడు చేరదీసాడు. నా డైరీ సేకరించి మరికొంత తెలుసుకున్నారు.

1995 నుండి 2005 వరకూ మేము ఏవీ ఆలోచించలేదు, పట్టించుకోలేదు. కనీసం టీవీ, పత్రికల ద్వారా వార్తలు కూడా పట్టించుకుని చూసేవాళ్ళం కాదు. అయితే దాని గురించి రామోజీరావు కి స్పష్టత లేదు. మొత్తంగా పీవీజీ, నెం.5 వర్గం మాకు ఏదో అవగాహన కలిగించారని, అది నిరంతరం నడిచిందనీ, నడుస్తోందనీ వాళ్ళ అనుమానం. అందుకే మమ్మల్ని వేధించి మరీ శోధించారు.

ఈ స్థితిలో.... రామోజీరావు, నెం.5 వర్గపు మాస్క్ వేసుకుని ’అరుంధతి’ ద్వారా మాకు స్ఫురింప చేయదలచింది ఏమిటంటే - పీవీజీ తాను పదవిలో ఉండగా అఘోరా పశుపతి వంటి రామోజీరావుని గూఢచర్యపరంగా సజీవ సమాధి చేసినంతపని చేసాడు. అంటే పూర్తిగా నిర్వీర్యం చేసాడు. అయితే చెడ్డవాడికి శక్తి ఎక్కువ గనుక, రామోజీరావు మళ్ళీ గూఢచర్య బలం పుంజుకుని ప్రజలని బాధలు పెడుతున్నాడు. దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అప్పట్లో పీవీజీ మీకు అవగాహన కలిగించిన విషయాల వంటివి జేజెమ్మ అస్థికలతో చేసిన ఆయుధానికి ప్రతీక. ఇంకా అలాంటి రహస్యాలు ఆయన నిగూఢంగా ఉంచాడు.

ఈ అన్వర్ లాంటి వాడే మా కుటుంబ మిత్రుడు ఖాసీం. కాబట్టి అతణ్ణి మా జట్టులో కలుపుకుని, మాకు తెలిసిన విషయాలన్నీ అతడితో పంచుకుని, అతడి సాయం తీసుకుంటే గాని మేము ఈ బాధల నుండి రక్షింపబడలేము - ఇదీ మాకు చెప్పదలుచుకున్నది.

ఇక్కడో విశేషం ఏమిటంటే - 2007 లో శ్రీశైలం నుండి నంద్యాల చేరాక, దాదాపు అరునెలలు పాటు ఖాసీంని, అతడి కుటుంబాన్ని పరిశీలించుకున్నాకే 2007 డిసెంబరు ఆఖరి రోజుల్లో వాళ్లతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నాము. దాంతో 2008లో తరచుగా ఈనాడు వసుంధర, మాకు స్నేహాలను పోగొట్టుకోవద్దనీ, పూర్వ స్నేహితులని పునరుద్దరించు కొమ్మనీ చెబుతుండేది. ఆ వివరాల గురించి గతటపాలలో వ్రాసాను. మేము అదేదీ పట్టించుకోకుండా మా పని మేము చేసుకుపోతుండే వాళ్ళం.

అరుంధతి సినిమా 2009 సంక్రాంతికి విడుదల కానుండగా, 2008 డిసెంబరులో మేము coups on world ని విడుదల చేసాము. ఈ సినిమాని చేయాల్సినంతగా మీడియా హోరెత్తించ లేదు. Coups On World లో మేం కనబరిచిన గూఢచర్య, రాజకీయ అవగాహనకి ఖాసీంని నమ్మమని చెప్పటం... తమకి కూడా తెలివితక్కువగా, నాసిగా అన్పించటంతో మీడియా హోరు తగ్గింది. నందులు వచ్చాయిలెండి.

’ఇంత వరకూ ఏ మేలూ చేయలేదు గనుకా, రామోజీరావు మీది కేసుని చేపట్టలేదు గనకా.... సోనియానీ, మన్మోహన్ సింగ్ నీ, వై.యస్.నీ నమ్మకపోతే నమ్మక పోయావు, కనీసం ఖాసీం నన్నా నమ్మండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చిన వాడు. మీ జట్టుకు చెందిన వాడు కాకపోతే మీకు ఎందుకు ఆశ్రయం ఇచ్చి సాయం చేస్తాడు? కాబట్టి ఇతణ్ణి నమ్మండి. నమ్మి అన్ని విషయాలు అతడితో పంచుకొని చర్చించండి. అప్పుడు అతడు మీకు మరింతగా సాయం చేయగలుగుతాడు. మీకు మరింత అవగాహన కలగాలంటే మీకున్న అవగాహనని అతడితో పంచుకోవాలి మరి’ - ఇదీ చెప్పబడింది!

2006 నవంబరులో ఖాసీం భార్యకు శ్రీశైలం ప్రాజెక్ట్ [సున్నిపెంట] నుండి నంద్యాలకు బదిలీ అయ్యింది. అదీ సందిగ్ధా అసందిగ్ధాల నడుమ సంవత్సరం పాటు నలిగి చివరికి బదిలీ ఖరారయ్యింది. అప్పట్లో ఓ రోజు మేం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆరోజు ఈనాడు హాయ్ బుజ్జీలో పర్యావరణ సమతుల్యత గురించో, పులుల గురించో గాని ఒక వ్యాసం వచ్చింది. పులి బొమ్మ రంగుల్లో ముద్రించిన ఆ వ్యాసపు శీర్షిక ’నేనుంటే మీకే లాభం!’ అని.

దాన్నే ఖాసీం ఎత్తి చూపిస్తూ, "చూడమ్మాయ్! ’నేనుంటే మీకే లాభం అట’. ఈ వ్యాసం చాలా బాగా వ్రాసారు కదూ!" అన్నాడు. మేమూ అలాగే అనుకున్నాము. ’ఆ ఊరిలో మాకు సహాయం చేసేవాళ్ళల్లో ఒకరు బదిలీ అవుతున్నారే ’ అన్న ఆలోచన తప్ప మరేది లేదు. మాకు జరుగుతున్నది మంచా చెడా అన్న ఆలోచన తప్ప, ఇంకేం ఆలోచించలేదు. తరువాత ఆరునెలలకు మేమే శ్రీశైలం నుండి నంద్యాలకు వచ్చాము.

అప్పటికి రామోజీరావు మాతో మాట్లాడతాడని గానీ, అందులోనూ నెం.5 వర్గపు ముసుగు వేసుకుని మాట్లాడతాడని గానీ, మాకు స్పృహ లేదు. ఖాసీంతో స్నేహం తెగతెంపులు చేసుకున్నాకే దాని మీద మరింత అవగాహన వచ్చింది. అందునా అతడి స్నేహాన్ని పునరుద్దించుకోవాలని, ఈనాడు రామోజీరావు విన్యాసాలు చేయటం చూశాక మరింతగా తెలిసి వచ్చింది.

ఆ తర్వాతే ’ఆరునెలలు పరిశీలన’ని మరింతగా విశ్లేషించుకున్నాము. 2007 లో నంద్యాలకు చేరాక, వెంటనే ఏ వృత్తి చేపట్టాలా అన్నది తేల్చుకోలేకపోయాము. ఓ ప్రక్క - ’మరో వృత్తి వెదుక్కున్నా, ఉద్యోగం చూసుకున్నా, మహా అయితే మరో రెండు మూడేళ్ళు! మళ్ళీ ఊడగొట్టడం ఖాయం. ఇలా ఎన్నాళ్ళని, ఎన్ని ఊళ్ళని మారతాం? తాడో పేడో తేల్చుకోవాల్సిందే’ అనే ఆలోచనా చేసాము. ఇవేవీ మేము ఎవరితోనూ చర్చించలేదు. ఖాసీంతో కూడా! వాళ్ళతో సహా ఎవరెంతగా ప్రత్యక్ష, పరోక్ష వత్తిడి చేసినా!

అలాంటి సమయంలో ఖాసీం, అతడి కుటుంబంతో సహా " గోవా వెళ్ధాం" లేదా అక్కడికి వెళ్థాం. ఇక్కడికి వెళ్థాం అనేవాడు. ఏతావాతా మా దగ్గరున్న డబ్బునిల్వలు కరిగించే ప్రయత్నం చేసేవాళ్ళు అతడూ, అతడి భార్య! ఓ ప్రక్క ’అవసరమైతే ఓ నెల ముందే చెప్పండి, డబ్బు సర్ధుతాం’ అనేవాళ్ళు. మరో ప్రక్క మమ్మల్నే చేబదులు అడిగేవాళ్ళు. చాలాసార్లు..... జాలీగా గడపటం అన్నప్పుడల్లా "ఉండండి భయ్యా! మళ్ళీ బండి పట్టాల మీదికి ఎక్కించాలి. స్కూలు పోయింది కదా? మళ్ళీ ఏదైనా ఆదాయ వనరు వెతుక్కునే వరకూ No Trips" అన్నా , ఆ క్షణం ఊర్కునే వాళ్ళు. మళ్ళీ ’గోవా వెళ్థాం’ అంటూ మొదలు పెట్టేవాళ్ళు.

ఎంత పొదుపుగా ఉన్నా, మరో ఆదాయ మార్గం లేనప్పుడు డబ్బునిల్వలు కరిగి పోవటం ఎంత సేపు? అటువంటి పరిస్థితులలో 2008 మధ్య కల్లా మళ్ళీ మేం సూర్యాపేట నాటి భయోత్పాత స్థితికి తరమ బడటం ఖాయం.

అప్పుడు "చూశావా? ఇదంతా రామోజీరావు బలం! అతడి గూఢచర్యం బలమైనది. పీవీజీ పోరాడి పోరాడి ఓడిపోయి మరణించాడు. అయితే అప్పుడేదో మీకు అవగాహన కలిగించాడు కదా! అలాగే మరికొన్ని విషయాలు నిగూఢంగా ఉంచాడు. మీరు ఖాసింని [వీలు కుదిరితే ఖాసీం స్థానంలో వై.యస్.నీ, ఇంకా వీలు కుదిరితే సోనియాని ఉంచాలన్నది రామోజీరావు ప్రధానలక్ష్యం!] జట్టులో కలుపుకుని పనిచేస్తే, అతడికి అన్ని విషయాలు చెబితే.... ఇదంతా పరిష్కరించ వచ్చు- మాకు ఈ ఊదర పెట్టటమే ఆరుంధతి చిత్రంతో మా పరంగా ఆశించిన ప్రయోజనం.

అయితే 2008 మార్చిలోనే మేం ఏదో వ్రాస్తున్నామన్న విషయం రామోజీరావుకి నిర్ధారణ అయ్యింది. దాంతో ఖాసీంతో స్నేహాన్ని పునరుద్దించాలనే వేగం పెరిగిపోయింది. అది మాకు మరింత స్పష్టత నిచ్చింది. మరో రకంగా చెప్పాలంటే - రామోజీరావు వ్రాతలు, మా చుట్టు ప్రక్కల జరిగే అతడి పరోక్ష ప్రమేయపు చర్యల తోనే మాకు చాలా విషయాలు అవగాహనకి వచ్చాయి.

ఇక.... అప్పుడప్పుడూ హాస్యం కోసం ఇలాంటి హారర్ చిత్రం చూస్తుంటాము. ఏమైనా, ఈ సినిమాలో దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల కంటే మెచ్చదగినది డబ్బింగ్ కళాకారుల ప్రతిభ. ’వదల బొమ్మాళీ నిన్నొదల’ అంటూ పశుపతికీ, "నువ్వు నన్నేం చెయ్యలేవురా!" అంటూ అరుంధతికీ డబ్బింగ్ చెప్పిన వారిది మాత్రం చెప్పుకోదగిన నైపుణ్యం.

ఇక ఈ ’వదల బొమ్మాళీ నిన్నొదల’ ఎంతగా హిట్టయిపోయిందో అంతగా అందరూ ఉపయోగించేయడం జరిగింది. మేమూ ఈ డైలాగుతో బోలెడు జోకులు పేల్చుకు నవ్వుకుంటుంటాము.

ఇక మున్నా సినిమా:

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాలలో చెప్పిన సినిమాల కోవకి చెందినదే లగాన్ సినిమా:

బ్రిటీషు వాడికీ భారతీయ గ్రామీణులకీ మధ్య నడిచిన క్రికెట్ పందెం కథ. ఆటలో గెలుపు ఓటములు గ్రామీణుల స్వేచ్ఛాస్వాతంత్రాలకి ముడిపడి ఉంటాయి. వాళ్ళకి అది అసలే మాత్రమూ పరిచయం లేని ఆట! నైపుణ్యాలూ లేవు, పరికరాలూ లేవు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే, ఆడి గెలుస్తారు.

అనువర్తన:
అమెరికా సిఐఏ కీ, బ్రిటీషు వంటి ధనిక దేశాలకీ వ్యతిరేకంగా గూఢచర్యపు ఆటలో గెలువాలంటే మనకున్న వనరులు తక్కువ. కాబట్టి ఉన్నవాటితోనే పోరాడాలి. అందుకే నీకు ఆకలి బాధలు తప్పవు. ఓ ప్రక్క ఇల్లూ వాకిలీ ఊడగొడుతూ, ఉద్యోగ ఉపాధులకి గండి కొడుతూ.... మరో ప్రక్క మాకు చెప్పబడిన కథలివి!

ఇలాంటి కాకమ్మ కథలతో మాకు బాగా అర్ధమయ్యిందేమిటంటే - తమకి ఇష్టమైన వాటికి ఇష్టమైన భాష్యాలూ, విశ్లేషణలూ.... నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు రామోజీ, సోనియాలు చెప్పుకుంటారు అని! తమ అరిషడ్వర్గాలు తీర్చుకోవడం కోసం ఏ కథలైనా చెబుతారు అని! ఎంత చెత్తకైనా, చెడ్డ విషయానికైనా ధనాత్మక శీర్షిక [పాజిటివ్ కాప్షన్] పెట్టుకుంటారు.

వాళ్ళ ఈ లక్షణమే - తొలి రోజుల్లో..... విశ్లేషణా కేంద్రాల నుండి వచ్చిన సూచనలకి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ, అసైన్ మెంట్లకి భాష్యాలు చెప్పుకునేటప్పుడూ - కామ క్రోధాలూ, లోభ మోహలూ, మద మాత్సర్యాలతో కూడిన వాళ్ళ ఈ స్వభావమే - పర్యవసానంలో వాళ్ళని నిరూపించింది. బహిర్గత పరిచింది. సువర్ణముఖిలు అనుభవించేందుకు దారి తీసింది. అలాంటి అరిషడ్వర్గాలతోనే, మా మీద అక్కసు, క్రోధమూ తీర్చుకునేందుకు ’పరిమితవనరుల వంటి కథలు’ చెబితే సరిపోతుందనుకున్నారు.

పరిమిత వనరులతో పోరాడాలి కాబట్టి మేం ఆకలి బాధలు పడాలి, తాము మాత్రం పుట్టిన రోజు విహార యాత్రలకై విదేశాలకీ, విలక్షణ దీవులకీ వెళ్తారు. అచ్చంగా తాము ఏసీల్లోనూ, ప్రత్యేక విమానాల్లోనూ తిరుగుతూ, ఎం.ఎల్.ఏ., ఎంపీల జీత భత్యాలు విపరీతంగా పెంచుకుంటూ, ప్రజలని మాత్రం ’త్యాగాలకు సిద్దంకండి’ అని చెప్పినట్లే! [ఇది బాగా అర్ధం కావాలంటే - రెండు చదరంగపు బోర్డుల మీద, ఇద్దరు ఆటగాళ్ళతో ఒకేసారి ఆడే మూడో ఆటగాడి కథ చెప్పాలి. అది మరో టపాలో!]

"ఏదో ఒకటి! పదే పదే చెప్పి నమ్మించగలిగితే సరి! అంతగా అయితే దొరికినప్పుడు దొర్లించేయవచ్చు" అనుకుంటారు. పీవీజీ మరణించినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సైతం అవమానించేటప్పుడు, భవిష్యత్తులో ఇంతగా బహిర్గతమై, కేసులతో నిరూపించబడి, ఇరుకున పడతామని ఊహించలేదు.

మొదటిసారి లగాన్ చూసేటప్పటికి ఇదంతా మాకు దృష్టిలో కూడా లేనందున విధివ్రాత అనుకుంటూ గడుపుతున్నాము. 2005 తర్వాత పునారాలోచనలో ఉండగా మరోసారి ’లగాన్’ under line చేయబడి అర్ధమయ్యింది. ఏమైనా చక్కని సంగీతం, స్ర్కిప్టూ గల మనోహరమైన సినిమా లగాన్!

ప్రత్యేకాంశాలు:
ఆ తర్వాత గమనిస్తే.... ఒక ’ఎరా’లో తెలుగు, హిందీ సినిమా రంగాల్లో [బహుశః మిగిలిన భాషల్లో కూడా] దేశభక్తి తెగ పెరిగిపోయింది. దేశభక్తితో కూడిన కథలు [ఇటీవలి వెంకటేష్ సుభాష్ చంద్రబోసు, 1942 A Love Story ఇత్యాది చాలా సినిమాలు] పెరిగాయి. కనీసం సినిమాలో జెండా సీనో, హీరో లేదా హీరోయిన్ల దేశభక్తిని ప్రతిబింబించే సీనో ఒక్కటన్న ఉండటం ఆ ’ఎరా’లో పరిపాటి అయ్యింది. ఉదాః ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, మహేష్ బాబు ’బాబీ’ గట్రాలు. విజయశాంతి తో ఆమె తమ్ముణ్ణి తాలిబాన్లు బ్రెయిన్ వాష్ చేసేసి దేశద్రోహిగా మార్ఛేసిన సినిమా వంటివి.

మరో ముఖ్యమైన సినిమా ఖడ్గం:
ప్రజాదృక్పధాన్ని అంచనా వేసుకునేందుకు నిర్మించబడే ఇలాంటి సినిమాలలో, ఖడ్గం మరికొంత ప్రత్యేకమైనది. దానికున్న ఇతర ప్రయోజనాల్లో ఒకటి, మా మీద దాన్ని ప్రయోగించటం. కథ అందరికీ తెలిసిందే! దేశ ద్రోహనికి ఒడిగట్టిన పాతబస్తీ ముస్లింలు కొందరైతే, దేశం కోసం త్యాగం చేయటానికి సిద్దపడే ముస్లింలు మరి కొందరు. అద్బుతమైన గ్రాఫిక్స్ తో, జాతీయ జెండా చార్మినార్ ను చుట్టేయటం చిత్రీకరించబడిన స్ఫూర్తిదాయకమైన చిత్రం ఇది!

అనువర్తన: ఈ సినిమాతో మాకు చెప్పిందేమీ లేదు. కానీ మా నుండి చెప్పించుకో ప్రయత్నించింది చాలా ఉంది. రెండోసారి శ్రీశైలం చేరిన కొత్తల్లో.... అప్పటికి మేమింకా టీవీ కొనలేదు. మా పూర్వవిద్యార్ధి తన సీడీప్లేయర్ లో ఈ సినిమా చూపించాడు. భారతీయ ముస్లింలపై మా అభిప్రాయం చెప్పమని తెగ ఒత్తిడి చేశాడు. మా పూర్వ విద్యార్ధే కాకుండా, మరికొందరు కూడా దానిని under line చేసారు. అప్పటికి మాకు ఏ ధ్యాసా లేదు. కాని విచిత్రంగా ఆ ’ఎరా’లో మాకు ఏ స్నేహితుడూ సాయం చేయలేదు. చివరికి సాయం చేసిన వ్యక్తిగా ’ఖాసిం’ మాత్రమే మిగిలిపోయాడు. అయితే 2005 తర్వాత, 2007లో అన్నిటినీ విశ్లేషించుకునేటప్పుడు, ఇది మాకు చాలా ప్రాధాన్యతతో కనబడింది.

ఎందుకంటే - 1999 లో మేము ఫ్యాక్టరీలో ఉండగానే, [మా వివాహానికి ముందే] గూఢచర్యం గురించిన ప్రాధమిక అవగాహన చేసుకుంటున్న రోజుల్లో - అప్పటి గృహమంత్రి ఎస్.బి.చవాన్ ’పత్రికాధిపతుల్లో సిఐఏ ఏజంట్లున్నారు’ అని ప్రకటించాడు. ఆ నేపధ్యంలో ’ఈ రోజో రేపో రామోజీరావు అరెస్ట్’ అనటం కుదరదని అర్ధమయ్యింది. అప్పటి రోజుల్లోనే సెప్టెంబరు 11, 1893 లో చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాసం గురించీ, తదనంతర పరిణామాల్లో..... నూరేళ్ళుగా భారత దేశం మీద, హిందూమతం, సంస్కృతుల మీదా కుట్రజరుగుతోందన్న అవగాహన కలిగింది. ఆ విషయాలన్నీ నా డైరీలో వ్రాసుకున్నాను.

కాబట్టి భారతీయ ముస్లింల పట్ల మా అభిప్రాయం ఏమిటి అనే విషయమై అంత ఆరాటపడటం మాకు అర్ధమయ్యింది. ’1992 తర్వాత మాకు ఆ విషయమై పెరిగిన అవగాహన ఏమిటో తెలుసుకోవాలన్నది’ వాళ్ళ తపన. ఈ విషయం అర్ధమయ్యాకే మేము అటువైపు మరింతగా దృష్టి సారించాము.

అప్పటికే ఆస్థినీ, అయిన వాళ్ళనీ పోగొట్టుకున్నందున, భగవద్గీత మీదా, దేవుడి మీదా పూర్తిగా ఆధారపడేవాళ్ళం. ఆ రీత్యా భారత రామాయణ భాగవతాలు చదవటం, భక్తి సినిమాలు చూడటం చేసేవాళ్ళం. గీత ఆచరణ అన్నది కష్టాల కడలిలో మాకున్న ఏకైక పడవ. రామ కోటి కూడా కొన్నాళ్ళు వ్రాసాము.

అందుచేత ’ఖడ్గం’ విషయం అర్ధమయ్యాక, భారత భాగవత రామాయణాది ఇతిహాసాలని మరింత లోతుగా పరిశీలించటానికీ, గూఢచర్య దృష్టితో అవగాహన చేసుకోవటానికీ ప్రయత్నించాము. ఆ ప్రయత్నంలో మా అవగాహన మరింతగా పెరిగిపోయింది.

’కథ’ సినిమా:
ఈ కోవలో ఇటీవల వచ్చిన, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ’కథ’ సినిమా విలక్షణమైనది. ఎందుకంటే - ఈ సినిమా ద్వారా రామోజీరావు మాకు ఏదీ చెప్పేప్రయత్నం చెయ్యలేదు, మా చేత ఏదీ చెప్పించుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. ఈ సినిమా ద్వారా నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ జవాబిచ్చింది. మరోమాట చెప్పాలంటే లగేరహో మున్నాభాయ్[శంకర్ దాదా జిందాబాద్] ల వంటి వాటికి జవాబిచ్చింది.

300 సినిమా ఏ విధంగా మీడియా ద్వారా ప్రచారింపబడలేదో, అలాగే ’కథ’ సినిమా కూడా ప్రచారింపబడలేదు. అంతే కాదు, మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 2500 ధియేటర్లలో, 1500 ధియేటర్లకు పైగా రామోజీరావు, అతడి అనుచరులైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు గట్రాల చేతిలో ఉన్నాయని ఓ మాట ఇటీవల బయటికి వచ్చింది. అంతగా భౌతికపట్టు బిగించినందునే.... చాలా చిత్రాలు, నాణ్యతతో పని లేకుండా, అయిదురోజుల్లో ధియేటర్ల నుండి అంతర్ధాన మౌతూ ఉంటే, మరికొన్ని చిత్రాలు నాసిగా ఉన్నా ’నాన్ స్టాప్’ లాగా విజయవంతమైన 5 వ వారంల దాకా ప్రదర్శింపబడ్డాయి.

అలాంటి చోట.... తమ స్ట్రాటజీని బహిర్గతం చేసే సినిమాలు ఆడకపోవటం వింత కాదు కదా!

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే:
జార్ఖండ్ లో ప్రిన్స్ పల్ గా పనిచేసే ఓ ప్రొఫెసరు, కళాశాల ఎన్నికలలో రాజకీయ హింసని అడ్డుకున్నందుకు కుటుంబంతో సహా బలయిపోతాడు. అమ్మానాన్న, తోబుట్టువులు కళ్ళముందే హింసించబడి మరణించడంతో, ఆ ప్రొఫెసర్ కుమార్తె చిత్ర మానసికంగా కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఆమె ఎంతగా మొత్తుకున్నా, పోలీసులు ఆ కేసుని రోడ్డు ప్రమాదంగా చెప్పి మూసేస్తారు.

ఒంటరిగా మిగిలి, ఏడాదిపాటు పిచ్చాసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన చిత్ర, అరకులోని ఓ చిన్నపిల్లల బడిలో ఉపాధ్యాయునిగా చేరుతుంది. అక్కడికి సినిమా ఏర్పాట్లకై వచ్చి ఉన్న బృందంలోని దర్శకుడితో పరిచయం, స్నేహం, ప్రేమగా పరిణమిస్తుంది. అప్రయత్నంగా ఆమె ఒక హత్యని చూస్తుంది. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది.

అప్పటికే ఆమె కొన్ని ఫోబియాలతో బాధపడటం, మందులు వాడుతుండటం చూసే ప్రేక్షకులకి ’కథ’ సినిమా కథ, ఉత్కంఠపూరితంగా ఉంటుంది. ఆమె భ్రాంతి పడిందో, నిజంగా హత్య జరిగిందో ప్రేక్షకులకి చివరికి గానీ అర్ధం కాదు. ఆమె పనిచేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ కొడుకు, పోలీసు కానిస్టేబుల్ రాజు.... ఇలా ఎవరినైనా అనుమానించగలిగేలా ఉంటుంది కథలోని ఉత్కంఠ, సస్పెన్సు!

ఆమె పిచ్చిదనే వార్త ఒకటి ఊర్లో బాగా ప్రచారంలోకి వస్తుంది. తగ్గట్టుగానే చాలా చర్యలు జరుగుతాయి. ఫ్రిజ్జ్ లో ఉండాల్సిన పళ్ళు, కూరగాయలు చెప్పుల స్టాండ్ పై, చెప్పులు ఫ్రిజ్జ్ లో ఉండటం గట్రా. మల్లెపువ్వులు కనకాంబరాలుగా మారిపోవటం! పూలమ్మే ముసలామె అబద్దం చెప్పిందో, చిత్రే భ్రాంతి పడిందో అర్ధం కాదు.

అయితే ఆమె ఆత్మశక్తి గొప్పది. తాను జీవితంలో పరమ చేదునీ, భీభత్సాన్నీ చూసి ఉండవచ్చుగాక! అయితే తాను ’హత్య’ని చూశానని ఆమె బలంగా నమ్ముతుంది. హీరో అతడి స్నేహితులు ఆమెకి సహాయం చేయ ప్రయత్నిస్తారు. హతురాలి బొమ్మగీసి, Trace out చేసే ప్రయత్నం చేస్తారు. చివరికి హంతకుడు పోలీసు అధికారేనన్నది తెలుస్తుంది.

అప్పటికే అతడు కేసుని, తనక్రింది పోలీసు కానిస్టేబుల్ పైకి తోసి, అతణ్ణి చంపి, కేసు మూసేస్తాడు. తన అక్రమ సంతానమైన కూతుర్ని చంపేసిన సదరు పోలీసు అధికారి, ఈ కేసు నుండి బయట పడేందుకు చిత్రని పిచ్చిదానిగా చిత్రించటం, అది అందరి చేతా నమ్మించటమే గాక, అందుకోసం హీరో స్నేహితులలో ఒకణ్ణి చంపేస్తాడు, మరొకణ్ణి గాయపరుస్తాడు. ఒక దశలో.... చివరికి చిత్ర కూడా తానే ఆ పిచ్చి పనులన్నీ చేస్తున్నానేమో ననుకునేంతగా అయోమయానికి గురవుతుంది.

నగల దుకాణపు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీతో సహా పట్టుబడిన పోలీసు అధికారి, చిత్రనీ, హీరోని బెదిరిస్తాడు. అప్పటికి చిత్ర, తను ఎన్ని ఒత్తిడులకి గురైనా, సత్యాన్ని తర్కాన్ని సరిగ్గానే విశ్లేషించుకుంటుంది. నేరుగా వచ్చి అతడి చెంప చెళ్ళుమనిపించి హీరోని, సీడీని తీసుకుని వెళ్ళిపోతుంది. నేరం బయటపడి, అప్పటి వరకూ పోలీసు అధికారిగా గౌరవ మర్యాదలతో, హోదాతో బ్రతుకుతున్న సదరు పోలీసు అధికారి, నిస్సహాయంగా తన పిస్తోలుతో కణత మీద కాల్చుకుని తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు.

స్థూలంగా ఇదీ ’కథ’ సినిమా కథ!

అనువర్తన:
నువ్వు ఎన్ని భ్రాంతులకు గురిచేసినా, భ్రాంతి పరచాలని ప్రయత్నించినా వీళ్ళని [అంటే మమ్మల్ని] ఏమీ చెయ్యలేవు. నీ చరిత్ర బయటకు రాకుండా ఆపనూ లేవు. నీ ఆత్మహత్యా సదృశ్యమైన అసైన్ మెంట్లతోనే.... నీ మీడియాకీ, నీ వ్యక్తిగత గౌరవమర్యాదలకీ, హోదాకీ సమాధి కట్టుకుంటావు - ఈ హెచ్చరిక.... నెం.5 వర్గం, స్పష్టంగా నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ అందులో కీలక వ్యక్తి రామోజీరావుకీ ఇచ్చింది.

’అతడి కథ ఇదీ’ అని చెబితే, చెప్పిన వాళ్ళకి మెదడులో కెమికల్ గడబిడ, పిచ్చీ, హెలూసినేషన్ గట్రా బిరుదులు ఇస్తానన్న రామోజీరావుకి, అది జవాబన్నమాట.

గమనించి చూడండి: 2006లో మేము, ఐబి అధికారి తో మాట్లాడిన పదిరోజులకి మార్గదర్శి కేసు బయటకి వచ్చింది. అది మొదలు రామోజీరావు వ్యక్తిగత ప్రతిష్ఠ మసక బారటం మొదలైంది. ఆ తర్వాత మా బ్లాగు ప్రారంభించిన తర్వాత మరింత వేగంగా.... ప్రపంచవ్యాప్తంగా మీడియా, నకిలీ కణిక వ్వవస్థా, నెం.10 వర్గంలో కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ ఇతర రాజకీయ నాయకుల ప్రతిష్ట మరింత దిగజారింది. కార్పోరేట్ దిగ్గజాల, ఆర్ధిక వేత్తల దోపిడి సిద్దాంతాలు, డొల్ల సమీక్షలు బహిరంగ మయ్యాయి. వాటికి తగ్గట్లుగానే దృష్టాంతపూరితమైన సంఘటనలతో, వాళ్ళపైన నమ్మకం చాలా వేగంగా సడలిపోయింది.

మా బ్లాగు వలన కాదు ఇదంతా జరిగింది అనటం లేదు. సంఘటనాత్మకంగా నెం.5 వర్గం, నెం.10 వర్గపు కుహనా విలువలని కుప్పకూల్చింది. వాటినే దృష్టాంతపూరితంగా మేము వ్రాయటం జరిగింది. అంతే!

ప్రత్యేకాంశాలు:
ఈ సినిమాలో నాయికా నాయకుల సంభాషణలో.... చిత్ర, తనకి నచ్చిన సినిమా ’ఆది’ అంటుంది. ప్రేమ కథాచిత్రమైన గీతాంజలి నచ్చకుండా, ’ఫ్యాక్షన్ సినిమా ’ఆది’ నచ్చిందనీ, 20 సార్లు ఆ సినిమా చూసాననీ’ అనే చిత్రని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు కృష్ణ. సినిమా చివరిలో.... ’సీడీ ఇచ్చేసి తన హత్యానేరం గురించి నోరు మూసుకుని కూర్చొమని’ బెదిరించిన పోలీసు అధికారి, హీరో మీద దాడి చేస్తుండగా, హీరోయిన్ సీడీ తీసుకుని పోలీసు స్టేషన్ కి వెళ్ళాలని పరుగెడుతుంది. అంతలో తర్కం స్ఫురించి వెనుదిరిగి వచ్చి పోలీసు అధికారి చెంపచెళ్ళుమనిపిస్తుంది. ఆ విషయం ప్రస్తావిస్తూ కృష్ణ [హీరో] "అవును! అతడు మనల్ని చంపడని నీకెలా అన్పించింది?" అని అడుగుతాడు.

చిత్ర "తెలియని తనాన్నే భయం అంటారని అర్ధమైంది. కానిస్టేబుల్ రాజు ఆ అమ్మాయిని హత్య చేసాడనీ, ఆ విషయం గుర్తించినందుకు రఘని చంపాడనీ, శివని గాయపరచాడనీ, నన్ను చంపబోతుండగా తాను కానిస్టేబుల్ రాజుని షూట్ చేసానని వ్రాసి కేసు ఫైలు క్లోజ్ చేసాడు. మరి ఇప్పుడు మనిద్దరినీ చంపి, ఏం సంజాయిషీ ఇచ్చుకుంటాడు?" అంటుంది. నిజంగా ’తెలియని తనమే భయం. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ విషయంలోనైనా అంతే. అందుకే అంటారేమో ’Knowledge is Power’ అని.

ఇక చిత్రని గురించి కృష్ణ "నువ్వే ఒక ’ఆది’ అయిపోయావు" అంటాడు.

నా పేరు ఆదిలక్ష్మి. నా మిత్రులు కొందరు, ముఖ్యంగా నా ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు, నన్ను ’ఆది’ అనే పిలిచే వాళ్ళు. ’కథ’ సినిమాతో ’లగేరహో మున్నాభాయ్ [శంకర్ దాదా జిందాబాద్] లకి సమాధానంగా ’ఆది’ under line చేయబడింది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే - సినిమా ప్రారంభంలోనే చిత్ర కుటుంబాన్ని చంపిన విద్యార్ధి గుండాలని, పోలీసులు మారుతి వ్యాన్ లో బాంబుపెట్టి పేల్చేసే దృశ్యం చూపబడుతుంది. చిత్ర ఎంత చెప్పిన, వినిపించుకోకుండా హత్యాకాండని రోడ్డు ప్రమాదంగా పోలీసులు మూసి వేసిన అడ్మినిస్టేషన్ తాలూకూ రెడ్ టేపిజానికి జవాబుగా.... ఆమె తండ్రి [ప్రొఫెసర్] విద్యార్ధి అయిన మరో పోలీసు అధికారి, తన బృందంతో, అదే రెడ్ టేపిజాన్ని అడ్డం పెట్టుకుని ఈ వ్యాన్ ని పేల్చివేస్తాడు. "ప్రొఫెసర్ గారికి సంఘ విద్రోహులైన విద్యార్ధులే కాదు, మాలాంటి విద్యార్ధులూ ఉన్నారు" అనే డైలాగ్ చెప్పబడే ఈ సన్నివేశానికి మిగిలిన కథతో ఏ సంబంధమూ ఉండదు.

ఇప్పుడు కాదు గానీ 2006, 2007 లలో, ఈనాడు వసుంధరలో, తరుచుగా.... పనిఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి మనస్తత్వ నిపుణుల పేరిట కొన్ని సూచనలు వచ్చేవి. వాటిల్లో - కోపం వస్తే ఒంటరిగా గదిలో తలుపులు వేసుకొని గట్టిగా అరిచెయ్యాలనీ, లేదా పేపర్ మీద వ్రాసేయాలనీ చెప్పబడేది. ఇంతటితో ఆగితే సరే!

కానీ.... ఒత్తిడి తగ్గించుకునేందుకు, ఆదివారపు సెలవులనీ పండగ ప్రత్యేక దినాలనీ గడిపేటప్పుడు 35 - 40 ఏళ్ళ మహిళలైనా తమ కూతుళ్ళతో కలిసి నాట్యం చెయ్యాలనీ, రెండుజడలు వేసుకుంటే ఉత్సాహంగా అన్పిస్తుందనీ, ఎవరో ఏదో అనుకుంటారని సంకోచపడ వద్దనీ సూచనలు వచ్చేవి.

’నిజంగా మనస్తత్వ నిపుణులు అలా చెబుతారా?’ అన్పించేది. అలాంటి చిట్కాలు పాటిస్తే ఒత్తిడి ఏమాత్రం మాయమౌతుందో తెలీదు గానీ, అలా ప్రవర్తించిన వాళ్ళని చుట్టుప్రక్కల వాళ్ళు పిచ్చివాళ్ళనటం మాత్రం ఖాయం అనుకునేవాళ్ళం. కథ సినిమాలో నాయిక చిత్రని పిచ్చిదానిగా చిత్రించటానికి హంతుకుడైన పోలీసు అధికారి పన్నిన పన్నాగాలు చూసినప్పుడు, మాకు ఈనాడు వ్రాతలు మరింత బాగా గుర్తుకూ వచ్చాయి, అర్ధమూ అయ్యాయి.

ఇన్ని ప్రత్యేకాంశాలు ఉన్నాయి కాబట్టే, ఈ సినిమా మీడియా ప్రచారాన్ని పొందలేదు. హిట్టయ్యిందో లేదో నాకు తెలియదు. మరేదో సినిమా సీడీ తెస్తే అందులో ఈ చిత్రమూ ఉండటంతో ’కథ’ చూడటం సంభవించింది. ఇక్కడ మరో గమ్మత్తు వివరణార్హం. కథ వంటి సినిమాలే గాక, గతటపాలో చెప్పిన సిక్కు కుర్రాడు క్రికెట్ మ్యాచ్ గెలిపించే సినిమా, బిపాసాబసు మానసిక భ్రాంతుల సినిమాల వంటివి.... మీడియా ప్రచారం లేకపోయినా, హిట్టయినా గాకపోయినా, డీడీలో శుక్ర శని వారాల్లో ప్రసారం కావడం రీత్యా మేము చూడటం జరిగింది. సిక్కు కుర్రాడి సినిమా అయితే క్లైమాక్స్ కు ముందు టీవీ ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. తర్వాత క్లైమాక్స్ ఏం జరిగిందో వేరొకరిని కనుక్కొని నవ్వుకున్నాము.

ఎందుకంటే - ఆ సినిమా నిర్మించే నాటికీ, డీడీలో ప్రసారం చేసేనాటికీ మధ్యలో మేము బ్లాగులో చాలా విషయాలే చెప్పేసాము మరి! ఆ సినిమాలోనేమో "మన్మోహన్ సింగే మనల్ని గెలిపించే.... మన టీమ్ సభ్యుడు" అని చెప్పబడింది. కాబట్టే ఇలాంటి సినిమాలని నెం.10 వర్గం గమ్మున దాచి పెట్టుకుంది. మీడియా ప్రచారపు హోరేదీ తగలకుండా! అయితే అలాంటివి ప్రత్యేకంగా డీడీలో ప్రసారం కావటంతో మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. నవ్వుకున్నాము కూడా!

ఇలా సినిమాల ద్వారా మాట్లాడటం విషయంలో ’అరుంధతి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నాట్యం నేర్పమని గురువు దగ్గరికి వెళ్ళామనుకొండి. గురువేం చేస్తాడు? ముందుగా తాను నృత్యం చేసి చూపిస్తాడు. తర్వాత మన చేత చేయించి మనకి నేర్పిస్తాడు.

చిత్రలేఖనం నేర్పమని వెళ్ళినా అంతే! గురువు ముందుగా తాను బొమ్మవేసి చూపిస్తాడు. ఆ తర్వాత మన చేత వేయింపించి నేర్పిస్తాడు.

బాల్యంలో ఓనమాలు నేర్చడానికి బడికి వెళ్ళినప్పుడు కూడా, గురువు ముందుగా తాను వ్రాసి చూపిస్తాడు. ఆపైన మన చేయిపట్టి అక్షరాలను దిద్దించి నేర్పిస్తాడు.

సాక్షాత్తూ భగవంతుడు చేసిందీ ఇదే! మిగిలిన మతాల విషయం నేనిక్కడ మాట్లాడటం లేదుగానీ, హిందూ మతంలో అయితే అంతే! శ్రీరాముడు స్వయంగా తాను ధర్మాన్ని ఆచరించి, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాచరణకై పోరాడాల్సిందేనని ఆచరించి చూపాడు. కష్టంలోనూ స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో, కష్టాలెదురైనాయని భయపడో బెంగపడో అధర్మంతో రాజీపడకుండా ఉండటం ఎలాగో ఆచరించి చూపాడు.

ఇక శ్రీకృష్ణుడు సుఖంలో స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో ఆచరించి చూపించాడు. కష్టంలో కన్నా సుఖంలో సంయమనం పాటించడం మరింత కష్టం. అహం కాటు వేసే ప్రమాదం మరింత ఎక్కువ. అలాంటి చోట, సుఖంలో స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో చేసి చూపిస్తూ, అర్జునుడికి కష్టంలో సంయమనంతో ఉండటాన్ని, ధర్మమార్గం తప్పకుండా పోరాడటాన్నీ , ఆచరింపించి నేర్పిస్తాడు.

అచ్చంగా గురువు లాగానే! అందుకే ఆయన గీతా చార్యుడు, లోకాచార్యుడు.

శ్రీరాముడూ, శ్రీకృష్ణుడు తాము గురువులై మనకు నేర్పింది ఇదే!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు![నిన్న పబ్లిష్ చేయవలసిన టపా,రెండు రోజులుగా నెట్ పనిచేయని కారణంగా ఈ రోజు పబ్లిష్ చేస్తున్నాము.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఏ సినిమాల ద్వారా అయితే మాతోనూ, నెం.5 వర్గంతోనూ రామోజీరావు భాషించాడో, టూకీగా ఆ సినిమాల కథనీ, వాటి అనువర్తననీ, కొన్ని ప్రత్యేకమైన అంశాలనీ వివరిస్తాను.

ముందుగా.....

లగేరహో మున్నాభాయ్ [లేదా] శంకర్ దాదా జిందాబాద్ :
తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ గా నిర్మించబడిన ఈ సినిమాలో హీరో, తాను ప్రేమించిన పిల్లని ఇంప్రెస్ చేయటం కోసం, గ్రంధాలయానికి వెళ్ళి ఏకబిగిన మూడురోజుల పాటు రేయింబవళ్ళు గాంధీజీ పుస్తకాలు చదివేస్తాడు. ఆ ఏకాగ్రతకీ, వ్యగ్రతకీ అతడికి బాపూజీ కనబడి తనని గైడ్ చేస్తున్నట్లుగా ఊహించేసుకుంటాడు. దాంతో ఎవరెవరి సమస్యలనో తెగ పరిష్కరించేస్తాడు. మెదడులో కెమికల్ గడబిడ ఎలియాస్ వైద్య పరిభాషలో పొడవాటి జబ్బు [xyz సిండ్రోమ్ లేదా ABCD డిజార్డర్] గా నిపుణులు తేల్చి చెబుతారు. చివర్లో హీరోయిన్ అతడి ప్రేమని అంగీకరించడంతో సినిమా సుఖాంతం అవుతుంది.

అనువర్తన:
రామోజీరావు మాతో పత్రికాముఖంగా, టీవీ వార్తల ద్వారా, నడిపే భాష గురించి మేము ఎప్పుడైనా వెల్లడి చేస్తే.... ’తనతో బాపూజీ మాట్లాడుతున్నట్లుగా ఊహించుకునే మున్నాభాయ్ కి లాగా మీకు కూడా మానసిక రుగ్మత ఉందంటాను. తస్మాత్ జాగ్రత్త!’ అన్న హెచ్చరిక మాకు ఇవ్వబడింది.

ప్రత్యేకాంశాలు:
౧. హిందీలోనూ, తెలుగులోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ concept జనాలలో అట్టడుగు దాకా వెళ్ళటం తమకు భద్రతరీత్యా అవసరం గనక.... అది మామూలుగా హిట్ చేయబడింది. అందుకోసమే ఆ కథకి అగ్రనటులు, సాంకేతిక నిపుణులు గట్రా హంగులన్నీ సమకూర్చబడ్డాయి. మొత్తంగా ఈ సినిమాని ప్రధానితో సహా అందరూ ప్రత్యేకంగా చూసి మరీ మెచ్చుకుని దానిని హిట్ చేసారు.

౨. అయితే ఆ కథలో కొన్ని చమక్కులు ఉన్నాయి. దందాగిరీ చేసుకునే ఓ రౌడీ, చదువు సంధ్యలంతగా రానివాడు, ఒక్కసారిగా గ్రంధాలయానికి పోయి ఏకబిగిన సిద్దాంతపరమైన గ్రంధాలు ఎడాపెడా చదివి పారేయటం పూర్తిగా అసాధ్యం. అతడికి అలవాటైన జీవన శైలికి.... ఏకధాటిగా కూర్చుని, ఏకాగ్రంగా, నిరంతరాయంగా చదవటం కూడా కష్టమే! మనం పిల్లలకి పఠనాసక్తి [readability] నేర్పాలంటేనే ముందుగా చిన్న చిన్న కథలతో ప్రారంభించి ఎన్నో తంటాలు పడాలి. ఎంతగా ప్రేమ కోసం పరితపించి ప్రయత్నించాడనుకున్నా ఎకాఎకీ బాపూతో సంభాషించేంతగా ఇన్ వాల్వ్ కావటం అసంభవం. ఏకబిగిన చదివి ఆ గ్రంధాల్లోని విషయాలు గ్రహింపులోకి తెచ్చుకోవటమూ అసంభవమే!

౩. పైగా ఆ గ్రంధాల్లోని విషయాలన్ని ఔపోసన పట్టేసి, వాటినే బాపూ చెప్పినట్లుగా ఊహించుకుంటాడు. తను చదివినవి, తనకి పుస్తకాల నుండి తెలిసినవీ తప్ప, మిగిలిన వాటి గురించి బాపూజీ చెప్పినట్లుగా ఊహించలేకపోతాడు.

౪. ఇంత తార్కికంగా పైస్థాయిలో వారు ఊహించగలరేమో గానీ, సామాన్య ప్రేక్షకుడు, దిగువ స్థాయి ప్రేక్షకుడు మాత్రం ఊహించలేడు. కాని ఇలాంటి వార్తలు వస్తే మాత్రం.... చర్చించటానికి, "అదేరా శంకర్ దాదా జిందాబాద్ లో చిరంజీవికి కెమికల్ గడబిడ వచ్చింది చూడు. అలాగన్న మాట" అనటానికి రెడీగా వాళ్ళ బుర్రలలో ఈ సినిమా ద్వారా బీజాలు నాటారు.

౫. ఈ సినిమా నిర్మించి, విడుదల చేసి, హిట్ చేసుకునే నాటికి - మేము రామోజీరావు భాష గురించి చెప్పేటప్పుడు - కేవలం భాషని గురించే చెప్పమనీ, దానితో పాటు దృష్టాంతంగా, సంఘటనలు బహిర్గతమౌతాయనీ, సువర్ణముఖిలు అనుభవించటం సమాంతరంగా నడుస్తోందనీ - వాటిన్నిటి సహితంగా మేము రామోజీరావు భాష గురించి చెబుతామని వాళ్ళు అనుకోలేదు. నెం.5 వర్గపు పనితీరుతో.... పిసినారి ధనయ్యలాగా..... ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్లతో..... బహిర్గతమూ, సువర్ణముఖి అనుభవిస్తున్నామనే స్పృహ.... అప్పటికి రామోజీరావు, నెం.10 వర్గానికి అంతగా లేదు.

నన్హ్నే ఫ్రం జైసల్మీర్ :
ఇందులో జై సల్మీర్ కు చెందిన బాలుడు కధానాయకుడు. తండ్రి చనిపోవటంతో అమ్మ, అక్క ఉన్న కుటుంబాన్ని పోషించటానికి, తమ ఒంటెని అలంకరించి యాత్రికులని సవారి తిప్పుతుంటాడు. అతడికి హిందీ నటుడు బాబి డియోల్ అంటే వల్లమాలిన అభిమానం. దాంతో ఆ హీరో తనని కలిసినట్లు, తన ఇంటికి వచ్చినట్లు, తనతో ఎంతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. చదువు పట్ల ఆసక్తి లేని ఆ కుర్రాడు, తన దోస్తు బాబీ డియోల్ సలహా ఇచ్చినట్లు భ్రమించి రాత్రి బడితో చదువునేరుస్తాడు. చివరికి ఎంతో బాధ్యతా యుతుడై అక్క పెళ్ళి జరిపిస్తాడు. అప్పుల వాళ్ళు పట్టుకుపోయిన ఒంటెని, తాను బాబీ డియోల్ పెళ్ళికి వెళ్ళేందుకు దాచుకున్న సొమ్ముతో విడిపించి తల్లిని ఆనందపరుస్తాడు. అవన్నీ దోస్తు బాబీ డియోల్ ఇచ్చిన సలహాలుగా ఊహించుకునే!

అనువర్తన:
ఇదీ లగేరహో మున్నాభాయ్ వంటిదే! అలాంటివే కార్టూన్ మిక్స్ డ్ సినిమా ’మై ఫ్రండ్ గణేశా!’ ’భూత నాధ్’ గట్రాలు.

బిపాసాబసు, జాన్ అబ్రహంలు నటించిన మరో సినిమా: [పేరు గుర్తు లేదు]
ఇందులో హీరోయిన్, యాంటి టెర్రరిజం స్క్వాడ్ అనే గుంపుని ఊహించుకుని, ఆ గుంపు నాయకుడినీ ఊహించుకుని, అతడితో ప్రేమలో పడుతుంది. ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మార్చుకునే హీరో, ప్రేమా త్యాగాలతో హీరోయిన్ కి పిచ్చి కుదురుతుంది.

అనువర్తన:
డిటో టు లగేరహో మున్నాభాయ్. పదే పదే అదే చెప్పటం, మన బుర్రకి ఇంకేదాకా ప్రయత్నించటం వాళ్ళ బాణీ కదా! నల్లమేక నలుగురు దొంగలు లాగా!

మరో సినిమా పోకిరి :
దీని గురించి గత టపాలలో సూచించాను. కథ అందరికీ తెలిసిందే! పోలీసు అధికారి అయిన కృష్ణమనోహర్, మాఫియా మూకల నడుమ ’పండు గాడ’యి పోయి, పోలీసు చేతిలో వెతల పాలైన హీరోయిన్ ని కాపాడేసి, దేశాన్ని కొంత మేరకు కాపాడేస్తాడు.

అనువర్తన:
1992 లో నేను పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన తరువాతి రోజుల్లో అప్పటి గృహమంత్రి చవాన్ పత్రికాధిపతులలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని ప్రకటించడం గట్రాలతో నాకున్న ప్రాధమిక అవగాహనని అప్పట్లో డైరీలో వ్రాసుకున్నాను.[తరువాత అది పోయింది లెండి.] పోకిరి చిత్రం 2006 ద్వితీయార్ధంలో వచ్చింది. ’అప్పటికి రామోజీరావు గురించి మాకున్న అవగాహన అతడు సిఐఏ ప్రధాన ఏజంటు అని మాత్రమే’ అని రామోజీరావు, నెం.10 వర్గాల అభిప్రాయం. అంతే తప్ప నకిలీ కణిక అనువంశీయుల గురించీ, 350 ఏళ్ళ కుట్ర గురించీ.... మాకు కాదు గదా, పీవీజీ కి సైతం తెలియదని వాళ్ళ నమ్మకం.

కాబట్టి పోకిరి సినిమాతో మాకు చెప్పజూసిందేమిటంటే - మగ పోకిరి లాగా వై.యస్., ఆడపోకిరి లాగా సోనియా, సీఐఏ ఏజంట్లయిన రామోజీరావు, చంద్రబాబు నాయుడుల చేత వేధించబడిన, బడుతున్న మమ్మల్ని [సిఐ పశుపతి చేతుల్లో వేధింపబడుతున్న హీరోయిన్ శృతికి మాదిరిగానన్న మాట.] ఆమాంతం రక్షించేస్తున్నారన్న మాట! కాబట్టే 2000 - 2001 లో ఎంసెట్ ఫిర్యాదుల అనంతరం, ఇల్లూ వాకిలి ఊడగొట్టి, సూర్యాపేట నుండి వెళ్ళగొడితే, బ్రతుకు బస్టాండై, ఆ పంచనా ఈ పంచనా నానా బాధలూ పడుతుండగా.... ఎట్టకేలకు తాము కొంత పట్టు సాధించి.... కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం సంపాదించి - దాంతో శ్రీశైలంలో మేము స్కూలు పెట్టుకోగలిగేట్లూ, కూడూ గూడూ లోటు లేకుండా ఉండేటట్లూ చూస్తున్నారన్న మాట.

ప్రత్యేకాంశాలు:

౧. మేము సూర్యాపేటలో పొగొట్టుకున్న టీవీ ఫ్రిజ్జూ వాషింగ్ మిషన్ గట్రా ఫర్నిచర్ ని శ్రీశైలంలో బడి తెరిచాక ఒక్క సంవత్సరంలో వాయిదా పద్దతిలో కొనగలిగాము. నిజానికి మేమందుకు సాహసించలేకపోయాము. సూర్యాపేటలో తిన్న దెబ్బకి, భవిష్యత్తు మీద భరోసా లేక, వెనకా ముందాడుతుంటే 2004 మార్చి, ఏప్రియల్ లో మా విద్యార్ధి తల్లిదండ్రులు, తాము పూచికత్తుగా ఉండి, ఒక్కసారే మా చేత టీవీ ఫ్రిజ్జ్ వంటివి వాయిదా పద్దతి మీద కొనిపించారు. గ్యాస్ కనెక్షన్ కూడా ఆగమేఘాల మీద ఇప్పించబడింది. దాన్నే under line చేస్తూ "మేము ఏళ్ళ తరబడి పైస పైసా కూడబెట్టి ఈ పర్నిచరంతా సమకూర్చితే మీరు ఇలా[అలవోకగా].... కొనేయగలిగారు సార్!" అన్నారు. అప్పటికి అది పట్టించుకోకపోయినా 2005 తర్వాత అన్నీ బాగానే ఫిట్ అయ్యాయి.

నిజానికి ఇక్కడ స్ట్రాటజీ ఏమిటంటే - ముందు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మమ్మల్ని వేధించగలిగినంత వేధించింది. తరువాత ప్రభుత్వంలోకి వచ్చిన వై.యస్. కొందరి చేత, భవిష్యత్తు గురించి మేం ఏమనుకుంటున్నామో అడిగి తెలుసుకుని, మేం ఏం కోరితే అది చేసాడు.

ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి మాటలలో మా విద్యార్ధి తాలూకూ బంధువలతో "మాకు ఓ గొప్పగా డబ్బు సంపాదించాలి అని ఏం లేదండి. కొంచెం డబ్బు కావాలి, అలాగా వీళ్ళు చదువు చెబితే పిల్లలకి చదువు వస్తుంది అని మాకు, మా స్కూలుకి పేరు రావాలి. ఊళ్ళో మంచి టీచర్లుగా గుర్తింపు కావాలి. అంతకంటే పెద్దగా మేం ఏం కోరుకోవటం లేదు" అన్నాము. సంవత్సరం తిరిగే సరికల్లా మేం కోరుకున్నవే కాదు, వాటికి రెట్టింపు మంచి జరిగింది. ఆ విధంగా ఉంటుంది గూఢచర్యం ఒకవ్యక్తి మీద గురి పెడితే! అదే ఊరిలో అదే వ్యక్తిని సంవత్సరం తిరిగే సరికల్లా పూర్తి విపర్యయం కూడా, సహజ సిద్దంగా జరిపించగలరు.

ఆ విధంగా ముందు చంద్రబాబు చేసిన నెగిటివ్ ని, తరువాత వచ్చిన వై.యస్. కొంచెం పాజిటివ్ తో చెరిపేసి మాకు దేవుడవ్వాలని వాళ్ళ కోరిక. అప్పటికి అది పట్టించుకోకపోయినా 2007 తర్వాత [అంటే శ్రీశైలంలో మా గది రద్దు చేయబడి, నంద్యాల చేరాక] మాకు బాగా విశదమయింది.

౨. నిజానికి ఇలాంటి సినిమాలన్నీ కేవలం మా కోసమే తీయబడినాయని నేను చెప్పటం లేదు. 1992 కు ముందర - కె.విశ్వనాధ్ ’శంకరాభరణం’ వంటి సినిమాలని నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ తీయనిస్తుంది. కొండకచో తామే స్క్రిప్టు ఇప్పించి తీయిస్తుంది. ఎందుకంటే - అలాంటి సినిమాలతో ఇంకా ప్రజల్లో తమ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల, లేదా మతం పట్ల లేదా వారసత్వ విలువలూ, కళల పట్ల ఎంత ఆదరణ ఉందో, తామింక ఎంతగా ధ్వంసం చేయవలసి ఉందో లెక్కలు కట్టుకోవటానికి!

అలాంటివే 1992 తర్వాత తీయబడిన మరి కొన్ని సినిమాలు! [లగాన్, ఖడ్గం, పోకిరి, భారతీయుడు, ఠాగూర్ మొదలైనవి]. అయితే 1992 తర్వాత ఇలాంటి సినిమాలతో, అటు నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, ఇటు నెం.5 వర్గమూ కూడా, ప్రజా దృక్పధంలో మార్పు గురించి ఎవరి అంచనా వాళ్ళు వేసుకున్నారు. ఎందుకంటే - సామాన్య ప్రజలుగా మనం మీడియా ప్రచారించిన దాన్ని హిట్లనీ లేదా ఫట్లనీ అనుకుంటాము. అదే గూఢచార ఏజన్సీలైతే ఏవి నిజంగా హిట్/ఫట్, ఏవి ఫట్టయినా హిట్టని లేదా హిట్టయినా ఫట్టనీ ప్రచారింపబడ్డాయి, ఏవి డబ్బు ఖర్చుపెట్టి, స్ట్రాటజీలు అమలుపరిచీ హిట్టు ఫట్టులు చేయబడ్డాయి గట్రా వివరాలన్నిటితో విశ్లేషించుకుంటారు.

అది ప్రధాన ప్రయోజనం అయితే - అవే సినిమాలనుపయోగించి రెండు ఏజన్సీలు ఒకరితో మరొకరు సంభాషించుకుంటారు. అలాగే మాతో సంభాషించటానికీ [భయపెట్టటం లేదా భ్రాంతి పరచటానికి] రామోజీరావు ప్రయత్నిస్తుంటాడు. వాటికి సమాధానం నెం.5 వర్గం కూడా సినిమాల ద్వారానే చెప్తుంది. ఉదాహరణ ’కథ’ చిత్రం.

ఇలాంటిదే మరో సినిమా [పేరు గుర్తులేదు]:
ఈ హిందీ చిత్రానిది స్కూలు పిల్లల క్రికెట్ మ్యాచ్ కి సంబంధించిన కథ. పేద పిల్లలు. గొప్ప కోచ్, తగినన్ని వనరులూ లేని పిల్లలు. మరో జట్టు ధనికుల పిల్లలు. వాళ్ళ స్కూలూ, కోచ్ అందరూ ఉన్నవాళ్ళే[ధనికులు]! బోలెడు వనరులు ఉన్నా, ఆటలో గెలుపుకి బోలెడు కుట్రలూ కుతంత్రలూ చేస్తారు. అయినా గానీ పేదపిల్లల జట్టుని, చివరిలో ఓ సిక్కు కుర్రాడు ఎంతో కష్టపడి గెలిపిస్తాడు.

అనువర్తన:
’పీవీజీ ప్రత్యేకించి నియమించుకున్న ఈ సిక్కు ఆర్ధికవేత్త మన్మోహన్ సింగే భారతదేశాన్ని గెలిపించేవాడు’ అవి మాకు చెప్పే ప్రయత్నం అది! ఈ సినిమా ఎప్పుడు నిర్మించబడిందో తెలియదు గానీ, 2009 లో డిడిలో ప్రసారం చేయబడింది. హైలెట్ ఫోకస్ చేయబడలేదు. అప్పటికే మేము బ్లాగులో మన్మోహన్ సింగ్ ఇండో పాక్ యుద్దానంతరం, ఇందిరాగాంధీ.... బడ్జెట్ లో రక్షణ వ్యయం కోసం భారీ కేటాయింపులు చేసి, సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించినందుకు అలకలు పోయాడనీ, అంత వెన్నెముక ఇందిరాగాంధీ పట్లే చూపిన సదరు ఆర్ధికవేత్త ఇప్పుడు సోనియా చేతిలో కీలు బొమ్మై కూర్చున్నాడనీ, టపాకాయలతో సహా వ్రాసాము.

పాకిస్తాన్ నుండి దేశవిభజన సమయంలో వలస వచ్చిన వాడన్నదీ.... అతడి బాల్య స్నేహితుడు భారత్ సందర్శనకు రావటంతో వెలుగులోకి వచ్చింది. [అద్వానీ, కులదీప్ నయ్యర్ ల వంటి వారు కూడా అటునుండి ఇటుకు వలస వచ్చిన వాళ్ళే] ఏ కారణాలు ఉన్నాయో గానీ, ఆ సినిమా గురించి పెద్దగా ప్రచారం [మాకు తెలిసి] లేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత మూడు టపాలలో 300 సినిమా గురించిన విశ్లేషణ వ్రాసాను. ఇప్పుడు.... ఆ సినిమా నేపధ్యంలో నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గాలకీ మధ్య నడిచిన భాషనీ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థానిక భాషల్లోకి అనువదింపబడిన రీత్యా, సామాన్య ప్రేక్షకులపైన ఆ సినిమా ప్రభావాన్ని గురించీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను.

ఈ చిత్రంలో స్పార్టాకు చెందిన లియోనైడర్స్, అతడి 300 మంది యోధులు.... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పని చేస్తున్న, తమ మాతృ దేశాల పట్ల నిబద్దత, మానవీయ విలువల పట్ల నమ్మకమూ గల నెం.5 వర్గానికి ప్రతీకలు.

అప్పటి వరకూ.... జెక్సీస్ ఇచ్చిన లంచాలకూ, కెరీర్ ఆశలకూ లొంగిన మత పెద్దలూ, మంత్రి పుంగవులూ తమని మభ్యపెట్టటంతో, వాళ్ళ అసత్య ప్రచారాన్ని నమ్మిన స్పార్టన్లు.... ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకి ప్రతీకలు! గూఢచర్య కుట్రలేవీ తెలియక... మత పెద్దల మాటల వంటి మీడియా వార్తల్ని నమ్ముతూ, రాజకీయ కార్పోరేట్ కంపెనీల బ్యూరాక్రాట్ల మాయా జాలాలని దాటలేక పోయిన వారు! బయటికొస్తున్న రకరకాల ప్రచారాలకీ, సంచలనాలకీ కార్యకారణ సంబంధాలు తెలియక అయోమయానికి గురైన వారు!

జెక్సీస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణాలతో సహా, రెడ్ హాండెడ్ గా పట్టుబడిన మంత్రి తెరాస్ వంటి వారి అవినీతి బహిర్గతం కావటంతో నిర్ఘాంతపోయిన వారు! యుద్దరంగం నుండి వచ్చిన ప్రత్యక్ష యోధుడు ఇచ్చిన సమాచారంలోని సత్యాన్ని గ్రహించి స్ఫూర్తి పొందిన వారు! తమ స్వాతంత్రాన్ని, మానవత్వాన్నీ, ధర్మాన్నీ, దేశాన్ని రక్షించుకునేందుకు అలస్యంగానైనా స్వయంగా యుద్దరంగానికి కదిలేందుకు సిద్దపడిన వాళ్ళు!

ఏనాటి కైనా ప్రపంచ పౌరుల గమ్యం ఇదే!

ఇక జెక్సీస్ బానిసలు, దూతలు, రహస్య గూఢచారాలు.... వీళ్ళు, ప్రపంచవ్యాప్తంగా నెం.10 వర్గంలోని ఏజంట్లకు ప్రతీకలు! జెక్సీస్.... సాక్షాత్తూ నకిలీ కణిక అనువంశీయులకి ప్రతీక!

జెక్సీస్ కీ లియోనైడర్స్ కీ మధ్య నడిచిన సంభాషణలూ, జెక్సీస్ దూతలకీ స్పార్టా యోధులకీ మధ్య నడిచిన సంభాషణలూ.... నకిలీ కణిక అనువంశీయులు, నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్యనడిచిన భాషకు మచ్చుతునకలు. గత టపాలలో వాటి గురించి వివరించాను.

ఈ సినిమా ముఖతః ఇంత స్ట్రాటజీ ఉంది కాబట్టే.... 300 సినిమా గురించి మీడియా ఏ కవరేజ్ ఇవ్వలేదు. దాదాపుగా గమ్మునుంది. అదే స్లమ్ డాగ్ మిలియనీర్, 2012 లాంటి సినిమాలకైతే, ఆస్కార్ రావటానికి ముందుగానే, అందుకు పునాదులు వేస్తున్నట్లుగా విరగ ప్రచారం చేసేసింది. అంతే కాదు, 300 సినిమాకి పేరడీగా Meet the Sportans పేరుతో మరో సినిమా నిర్మించబడిందట. అది స్టార్ టీవీ ల వంటి వాటిల్లో ప్రసారమూ చేయబడిందట. దాన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు, నెం.10 వర్గానికి 300 సినిమా మీదా, నెం.5 వర్గం మీదా ఎంత అక్కసు ఉందో!

దీన్నే చిన్న పరిమాణంలో చెబుతాను. ఆ మధ్య లండన్ లో ఓ మహిళ తన చదువు కోసమూ, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన తన ఆర్దిక అవసరాలు కోసమూ, వేశ్యావృత్తి నెరపానంటూ, తన ఆత్మ కధని తన బ్లాగు ద్వారా వెలువరించింది. అది మీడియా ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. చివరికి మన తెలుగు బ్లాగ్లోకంలో కూడా దాని మీద సమీక్షలు, విమర్శలూ వచ్చాయి.

ఓ స్త్రీ వేశ్య నయ్యానంటూ ఆత్మకథ వ్రాస్తే.... దానికి వచ్చిన పాటి ప్రచారంలో వెయ్యో వంతు కూడా.... ఓ కుటుంబం - అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆత్మకథకు, అమ్మఒడికి రాలేదు చూడండి, అలాగన్న మాట. ఎందుకంటే ఆ మీడియాని, నెం.10 వర్గాన్ని అమ్మఒడి బహిర్గతం చేస్తుంది కాబట్టి. మరో మాటలో చెప్పాలంటే అది చెడు - ఇది మంచి కాబట్టి! అలాగే 300 యోధులు సినిమా, స్వేచ్ఛ కోసం పోరాటానికి చెందినది కాబట్టే, మీడియా దానికి ప్రచారం కల్పించలేదు. దేశభక్తియుతమైన సినిమాకు మీడియా ప్రచారం కల్పించకపోవటాన్నే, నెం.5 వర్గం expose చేసింది.

ఇది ఎలాంటిదంటే - అచ్చంగా, తన [అమితాబ్ బచ్చన్] అభిమాన నటుణ్ణీ చూడటానికి మానవ వ్యర్ధపు గుంతలోంచి దుమికిన స్లమ్ డాగ్ కథకీ, సినిమాకి వచ్చినంత ప్రచారమూ, అవార్డాలూ.... దేశ స్వాతంత్రం కోసం పోరాడిన 300 మంది యోధులు కథకీ సినిమాకీ రానట్లుగానే!

ఈ రకపు విన్యాసాలతో రామోజీరావు/నెం.10 వర్గం, మాకు చెప్ప వచ్చేదేమంటే - "చూశావా? ఎంత కష్టపడి ఎన్ని నిజాలు వ్రాస్తే మాత్రం లాభం ఏమిటి? అదే మాకు లొంగిపోతే? మేం ఎవరినైనా ఎంత పాపులర్ చేస్తామో చూడు. డబ్బుకు డబ్బూ, పేరుకు పేరు, ఏది కావాలన్నా ఇవ్వగల వాళ్ళం మేము" అని!

దీన్నే ముఖం మార్చి, మాకు చెప్ప వచ్చేదేమంటే - "చూశావా? నువ్వు ఎంత కష్టపడి ఎన్నినిజాలు వ్రాస్తే మాత్రం లాభం ఏమిటి? నువ్వు చెప్పవలసిన వేదిక ఇది కాదు. బ్లాగును డిలీట్ చెయ్యి. సోనియా నెం.10 వర్గం అని నువ్వు పొరబడుతున్నావు. నెం.5 వర్గంలోని సోనియా దగ్గరికి వెళ్ళి నీకు తెలిసిన అన్నివిషయాలు చెప్పు. లేదా ఒక సీడీకి మొత్తం విషయాలు ఎక్కించి పంపు! అప్పుడు నీ సమస్యలన్నీ తీరతాయి. అంతే గాని ఇక్కడ చెబితే మాత్రం ఉపయోగమేముంది? ఈ బ్లాగ్లోకం ఏం చెయ్యగలదు?" అని!

ఇక ఈ 300 సినిమా, మాకు ఎలా under line అయ్యిందంటే - మేము మామూలుగా సినిమాలు బాగానే చూస్తాము. కాకపోతే ధియేటర్ కి వెళ్ళేది తక్కువగానూ, సీడీలు సేకరించి ఎక్కువగానూ చూస్తుంటాం. మా పాపకి ఆమె మాష్టారొకాయన, తోటి సహాధ్యాయులు, స్నేహితులూ చెవినిల్లు కట్టుకొని 2012 సినిమా చూడమని గోలపెట్టారు. [ఈ సంవత్సరం పదవ తరగతి మా పాపని స్థానిక స్కూలులో చేర్పించాము.]

"ఆ! శతకోటి గ్రాఫిక్స్ సినిమాలలో ఇదీ ఒకటి! మన వాళ్ళు గ్రాఫిక్స్ ని భక్తి రసం చూపటానికి ఉపయోగిస్తే, పాశ్చాత్యులు దాన్ని భీభత్స రసాన్ని చూపటానికి ఉపయోగిస్తారు. అంతే కదా!" అని మేం పట్టించుకోలేదు. అయితే 2012 గురించిన సిఫార్సులు అంత కంతకూ ఎక్కువయ్యేసరికి ఓ ఆదివారం సీడీ సేకరించాము. అందులో 2012 తో పాటు 300 సినిమా ఉంది. అదీ తెలుగు డబ్బింగ్ తో! 2012 మాకు మామూలుగా నచ్చలేదు. 300 చూసి మజా వచ్చింది.

మేం సినిమా చూసాక ఆ విషయం ఎవరితోనూ చర్చించకపోయినా, ఫలానా 2012 సినిమా చూడమన్న సిఫార్సులు మాత్రం ఆగిపోయాయి. ఇలాంటివి మనసుకి పట్టినప్పుడు కూడా విషయం మరింత విశదపడుతుంది.

అయితే ఈ అంశం అక్కడితో అయిపోలేదు. అసలు ఆసక్తికరం ఇక్కడే ప్రారంభమైంది. ఎలాగంటే - మర్నాటి నుండీ ఈనాడు రామోజీరావు మాతో పత్రికాముఖంగా నడిపిన నిరంతర [వార్త] భాష స్రవంతి తో! సూటిగా చెబుతాను.

300 సినిమాలో చూపించినట్లు జెక్సీస్ [నకిలీ కణిక అనువంశీయులు] అతడి అనుచరులూ, బానిసలూ.... మన దేశం మీద కుట్రదారులే అనుకో! లియోనైడర్స్ లాగా పీవీజీ వాళ్ళ మీద పోరాడి ఓడి అసువులు బాసాడు[అట. అప్పటికి మేమింకా ఓటమి స్ట్రాటజీ గురించి మాకున్న అవగాహనని బ్లాగులో వ్రాయలేదులెండి.] ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ, బలపరుస్తూ, అందుకోసం వ్యూహాత్మకంగా, ఢిల్లీ జనపధ్ 10 రాణి సోనియా, అవినీతి పరులతో లాలూచీ పడిందట. [లేడీ పోకిరి అన్నమాట!] అవినీతిపరులని నమ్మించేందుకు తామూ కొంత మేరకు అవినీతికి పాల్పడుతుందట. ఆ విధంగా అవినీతి పరులని కూడా కలుపుకు పోయి, పోరాటానికి సాయం అందించేందుకు ప్రయత్నిస్తోందట. అందుకోసమే, ప్రస్తుతం దేశంలో, తాత్కాలికంగా అవినీతి పెచ్చరిల్లి కన్పిస్తోందట.

ఇక్కడ అవినీతిగా నేను చెబుతోంది ఆమె ఆర్ధిక రాజకీయ అవినీతుల గురించి మాత్రమే. అంతే గాని లియోనైడర్స్ భార్య రాణికి లాగా శారీరక అనైతికత గురించి ఎంతమాత్రం కాదు.

ఇంత అతుకుల బొంత కధాకథనాలని మాకు చెప్పబోవటం, ఒక్కరోజు ఈనాడుని చూసీ, ఒక్క వార్త శీర్షికని చూసి చెప్పటం లేదు సుమా! నిన్నటి పత్రిక ప్రధాన పేజీలో ’ఒట్టు మేమంతా మీ జట్టు’ వంటి వందలాది [వేలాది కావచ్చు కూడా] అంశాల సహితంగా చెబుతున్నాను. అదొక అనుశృత వార్తా స్రవంతి.

మచ్చుకి కొన్ని:

సూక్తి: అవేశాన్ని తగ్గించుకుని, ఊహాలోకంలో విహరించడం మానివేసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ విజయం సాధించగలుగుతాడు. - జెరమైకోలియర్

చిలక జోస్యం కథ: క్లుప్తంగా ఈ కథ. ఈ కథలో ఒకవ్యక్తికి ’నువ్వు రాజు’వవుతావు అని చిలక జోస్యం చెబుతుంది. అస్తి నిలబెట్టుకోవటానికి ప్రయత్నించకుండా, కలలు కంటూ ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. గ్రామాలు పట్టి పోతాడు. ఒకరోజు గుడి దగ్గర ఓ వృద్ద దంపతులు "నాయనా నువ్వు అచ్చం మా అబ్బాయిలా ఉన్నావు. మా అబ్బాయి చనిపోయాడు. నీలో మా అబ్బాయిని చూసుకుంటాము. నువ్వు మాతోనే ఉండు" అంటారు. ఆ సోమరి సరేనంటాడు. తీరా వాళ్ళ ఇంటికెళ్ళెసరికి అది ఒక గుడిసె. వాళ్ళిద్దరు అడుక్కునే వాళ్ళు. ఆ వృద్దదంపతులిద్దరు "నాయనా! మన ముగ్గురం మూడు వీధులకి వెళ్ళి అడుక్కుంటే రోజులు హాయిగా గడిచిపోతాయి. మా అబ్బాయి పేరు రాజు. కాబట్టి ఈ రోజు నుండి నిన్ను ’రాజు’ అని పిలుస్తాము" అంటారు. ఆ విధంగా ఆ సోమరి రాజు అయిపోయాడు.

అనువర్తన: మమ్మల్ని ఆ సోమరితో పోలుస్తూ, ’ఏ ఉద్యోగం చేయకుండా, ఇలా బ్లాగు వ్రాస్తూ ఉంటే ఏదో గొప్పవాళ్ళు అవుతారనుకున్నారా? చివరికి అడుక్కు తినాలి సుమా’ అని హెచ్చరిక అన్నమాట.
~~~~~~~

వేమన పద్యం: మంచివో చెడ్డవో తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక ఇతరులను దూషించడం తగదు. అలా చేసే వాడు వ్యర్ధుడు. [మా లోపాలు గమనించుకోకుండా సోనియా బృందపు లోపాలు ఎంచుతున్నామట.]
~~~~~~~~

సూక్తి: పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు. ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయకు - మహాత్మ గాంధీ.
[ఇది ఓ మిత్రుడు అప్పుగా డబ్బు పంపిన రోజులలో, ఈనాడు చెప్పిన సూక్తి.]
~~~~~~~~

వేమన పద్యం: తొందరపాటుతో చేసిన ఏ పనీ సత్ఫలితాన్ని ఇవ్వదు. పచ్చికాయను తెచ్చి మగ్గపెడితే పండవుతుందా?

ఆషాఢభూతి కథ: కథలో శిష్యుడిలా మేం మొదట నమ్మకంగా ఉండి అన్ని విషయాలు గ్రహించి, ఇప్పుడు వాటన్నింటిని బహిర్గతం చేస్తూ నెం.5 వర్గం పనికి ఆటంకం కల్గిస్తున్నామట.

వేమన పద్యం: జ్ఞానం లేని ఎద్దుకు ఒక ఏడాది చెపితే మన మనసు తెలుసుకుని నడుచుకుంటుంది. అయితే మూర్ఖుడైన వాడికి ముప్ఫై ఏళ్ళు చెప్పినా మనం చెప్పినట్లు నడుచుకోలేడు.

సూక్తి: నీకు లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్న దాన్ని ప్రతిభావంతంగా తీర్చుదిద్దుకోవటమే పాజిటివ్ ధింకింగ్. - జిడ్డు కృష్ణమూర్తి.

వేమన పద్యం: ఓడ నీళ్ళపై తిన్నగా సాగిపోతుంది. నేలపైన బారెడు కూడా నడవలేదు. స్థానం తప్పితే ఎంత నేర్పరి అయినా ఎందుకూ కొరగాడు. [బ్లాగులో చెప్పటం సరికాదు.]

వేమన పద్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల కన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది. [ఏవేవో బ్లాగులో వ్రాసేస్తున్నామట.]
~~~~~~~

సూక్తి: ప్రేమ ఉన్నచోటే శాంతి నెలకొంటుంది. - మదర్ ధెరెసా.

సూక్తి: శారీరకంగానే కాదు ఎదుటి వారిని మాటలతో బాధించిన అది హింసే అవుతుంది -మహాత్మాగాంధీ.

వేమన పద్యం: కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష. [సోనియా మీద కోపం కొద్దీ వ్రాస్తున్నామట.]
~~~~~~

సూక్తి: ఒకరిపై పెత్తనం చెలాయించడం కాదు, తోటి వారికి సేవ చేయడం నేర్చుకో - రామకృష్ణ పరమహంస.

సూక్తి: పరస్పర విశ్వాసం, పరస్పర సహాయం ద్వారా గొప్పపనులు, గొప్ప పరిశోధనలు జరిగాయి.

వేమన పద్యం: ఉప్పు, కర్ఫూరం రెండూ తెల్లగా ఒకే రీతిగా ఉన్నట్లు కనిపిస్తాయి. వాటి రుచులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా పురుషులంతా ఒకే విధంగా కనిపించినప్పటికీ గుణాల్ని బట్టి పుణ్యాత్ములెవరో, చెడ్డవారెవరో గ్రహించవచ్చు. [సోనియానే అన్నీ నడుపుతున్నప్పుడు సామాన్యులమైన మేము ఆమెకి చెప్పేదేముంటుంది. ఆమె నెం.5 వర్గం తరుపునే పని చేస్తున్నట్లయితే రామోజీరావుపై చర్య తీసుకుంటే సరిపోతుంది కదా అని మేము బ్లాగులో వ్రాసిన నేపధ్యంలో వచ్చిన సూక్తులు ఇవి. ]
~~~~~~~

ఈ నేపధ్యంలో మాకు ఎప్పుడూ చెప్పేది అదే - ’సోనియా నెం.5 లో వ్యక్తి. లేదా నువ్వు నెం.5 వర్గాన్ని, నెం.10 వర్గమనీ, పదిని అయిదనీ పొరబాటు పడుతున్నావు. కాబట్టి సోనియాని నమ్ము. నమ్మి, బ్లాగు డిలీట్ చేసి ఢిల్లీ వెళ్ళు. వెళ్ళి, ఇప్పటి వరకూ బ్లాగులో చెప్పినవే గాక ఇంకా నీకు ఏమేమి తెలుసో, అవన్నీ చెప్పెయ్!’ - ఇదే ఒత్తిడి.

అందరికీ తెలియకుండా తమకి మాత్రమే తెలిస్తే - అది తమకు ఉపయోగం. అందరితో పాటు తమకీ తెలిస్తే ఏంప్రయోజనం? అందుకే బ్లాగు డిలిట్ చెయ్యమన్న ఒత్తిడి. ఎంతగా అంటే - దాదాపు మూడేళ్ళుగా మా ఆర్దిక మూలాలు నలిపి వేసేంత! కష్టపడి ఉద్యోగం వెదుకున్నంత సమయంలో పదో వంతు చాలు ఊడగొట్టడానికి! మరో ప్రయత్నం పలించనివ్వని ఒత్తిడి చేయడానికి!

ఉద్యోగం ఊడగొట్టాక చెప్పె భాష్యం ఏమిటంటే, "నేను 5 వర్గం తరుపున చెప్తున్నా.... నువ్వు ఉద్యోగం చెయ్యడం కాదు. ముందు బ్లాగు డిలీట్ చెయ్యి. సోనియాకి విషయం చెప్పు! నీ సమస్యలన్ని పరిష్కారమవుతాయి" అని. వై.యస్. బ్రతికున్నరోజుల్లో వై.యస్.కయినా చెప్పు అంటూ డిడి లో వై.యస్. కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ చెప్పును చూపించేవాడు. [చెప్పు అంటే tell అని అర్ధమన్న మాట. వై.యస్. చనిపోయినప్పుడు ఆ కాలు తెగి పడిపోయింది. బాక్స్ కట్టి ఫోటో వేసి మరీ చూపబడింది.]

ఓ ఉదాహరణ చెబుతాను. బ్లాగు ప్రారంభించిన తొలిరోజులోనే కొందరు అజ్ఞాతలు "నిజ జీవిత సమస్యలు తీరడానికి బ్లాగు వ్రాయటం ఎంత వరకూ ఉపయోగపడుతుంది?" అంటూ ప్రశ్నలు గుప్పించారు. ’దేని ప్రయోజనం దానికి ఉంటుంది లెమ్మని’ జవాబిచ్చాను. సింగపూర్ ట్రావెల్స్ ఏజన్సీ ఒకటి [WU Travels] మా బ్లాగుకి తమంత తామే వచ్చి వాణిజ్య ప్రకటన ఇచ్చింది. దాదాపు నాలుగు నెలలు గడిచినా దాన్నుండి మాకు ఎర్ర ఏగానీ రాలేదు. డబ్బులు రాకపోవటం కంటే, క్లిక్ కి వచ్చే డబ్బులెంత అన్న వివరాలు కూడా సరిగా ఇవ్వలేదు. ఆ విధంగా ఈ బ్లాగు నుండి నీకు దమ్మిడి రాదు అని మా బుర్రలకి బాగా ఇంకించే ప్రయత్నం చేయబడింది.

అలా ఆర్ధికంగా అన్నివైపుల నుండి వత్తిడి చేస్తూ, ఆ సమస్యలన్ని తీరాలంటే సోనియా గాంధీని కలిసి చెప్పటమే పరిష్కారమని ఉవాచ! అంతేకాదు, మా అమ్మఒడి బ్లాగుకు పట్టుమని వందక్లిక్కులు కూడా రావు. మేం మూసివేసినప్పుడు ఏ నెంబరు ఉంటుందో, తిరిగి మళ్ళీ మేం బ్లాగు తెరిచినప్పుడు అదే నెంబరు ఉంటుంది. దాంతో మాకు చెప్పేదేమంటే - "చూశావా? ఇంత కష్టపడి వ్రాసినా ఎవరికీ పట్టటం లేదు. ఎందుకీ వృధాశ్రమ? మాతో రాజీ పడు" అని.

ఒకోసారి "చూశావా? ఏ ఫలితమూ రావటం లేదు. ఎందుకంటే ఇది వ్యూహం కాదు. నువ్వు ఇలా వ్రాయటం ఆపేసి, బ్లాగు డిలీట్ చేసి పది జనపధ్ కి వెళ్ళు. వెళ్ళి అన్నీ చెప్పెయ్. అప్పుడు వ్యూహాత్మకంగా పోరాడవచ్చు" - ఇది మరో వెర్షన్ అన్నమాట.

’సోనియా దేశం కోసమే పనిచేస్తుంటే, అన్నీ తామే అయి నడుపుతున్నట్లే కదా? అలాంటి ఆమెకి, అందునా ప్రభుత్వాన్ని తిరుగులేని అధినాయకత్వంతో నడుపుతున్న ప్రభావశీల మహిళకి మేం చెప్పేది, చెప్పగలిగేది ఏమిటి? ఆమెకి తెలియనిది ఏమిటి?’.... ఇది జవాబు లేని ప్రశ్న!

సోనియా నెం.5 వర్గం తరుపున పనిచేస్తున్నట్లయితే పీవీజీ మీద పీకల దాకా కోపం ఎందుకు? - ఈ ప్రశ్నకూ జవాబుండదు.

ఇంతే కాక మేం ఎవరినయినా అప్పు అడిగామనుకోండి. అప్పుడు, ఈనాడు నిరంతర వార్తా స్రవంతిలో చెప్పబడే విషయం ఏమిటంటే - చూశావా? నువ్వు పోరాడాటానికి డబ్బులు అవసరం కదా? అలాగే అంతర్జాతీయంగా సోనియా పోరాడానికయినా కూడా డబ్బు చాలా అవసరం. కాబట్టి అవినీతి చేయకతప్పటం లేదు" - ఇది వినపింపబడేది. [వై.యస్. బ్రతికున్న రోజుల్లో అతడి అవినీతిని సమర్దిస్తూ కూడా ఇదే చెప్పబడేది.] ఇలా వాళ్ల అవినీతి సమర్ధన కోసం కూడా మా ఆర్దిక మూలాలు నలపబడేవి.

స్థూలంగా చెప్పాలంటే - ఈనాడు మాతో రెండు రకాలుగా మాట్లాడుతుంది.

1]. మేం నెం.10 వర్గమే అనుకో! చూశావా ఎంత బలవంతులమో! మమ్మల్ని కాదని ఎవరూ బ్రతకలేరు. కాబట్టి మాతో రాజీపడండి. మమ్మల్ని చూసి భయపడండి.

2]. లేదూ మేం నెం.5 వర్గం అనుకో! అయితే సోనియాని నమ్ము. వెళ్ళి నీకు తెలిసినందంతా చెప్పు. నువ్వు చేస్తున్నది వ్యూహాత్మకం కాదు. అందుకే మీకు ఉద్యోగం రానివ్వటం లేదు, ఉపాధి నడవనివ్వటం లేదు. డబ్బు అందనివ్వటం లేదు. వచ్చి మాతో చేతులు కలుపు. అప్పుడన్నీ సర్ధుకుంటాయి.

మొదటి వాదనకి భయపడినా, రెండవ వాదనని నమ్మి దగా పడినా.... తమకి ఫర్వాలేదు.

తొక్కలో మేము - భయపడినా, భ్రాంతిపడినా వాళ్ళకి ఒనగూడే ప్రయోజనమేముంది అంటారేమో!? పాతికేళ్ళ క్రితం భారతదేశమ్మీద కుట్ర జరుగుతోందని ఇందిరాగాంధీ అంటే - "తొక్కలో ఇండియా! పేద దేశం. ఏముందని, ఏమి దోచుకోవాలని ఇండియా మీద కుట్రలు చేయడానికి?" అన్నారు. అదే ఇప్పుడైతే.... ఇండియాలో దోచుకునేందుకు మానవ వనరులూ, భూగర్భ వనరులూ, విశాలమైన మార్కెట్టు వనరులూ.... శాతాబ్దాలుగా దోచుకుపోయినా కూడా ఇంకా ఎంత దోచుకోవటానికి మిగిలి ఉందో అర్ధమయ్యింది. అదీ, విదేశీ సంస్థలకి సరళీకృత ఆర్ధిక విధానాలతో తలుపులు తెరిచాక మరింతగా అర్ధమవుతోంది.

అలాగే తొక్కలో మేము! అసలు మొదటగా రాజీపడితేనో, భ్రాంతి పడితేనో కదా అర్ధమయ్యేది మాకు.... దాంతో వాళ్ళకి ఏం ఒరుగుతుందో?

నిజం చెప్పాలంటే - పై విధంగా రెండు రకాల భాషలనీ చూశాకే మాకు అసలు నెం.5 వర్గపు అస్తిత్వమూ, పనితీరూ స్పష్టంగా అర్ధమయ్యాయి. నెం.10 వర్గం నుండే నెం.5 వర్గం నడిపించే ఆత్మహత్యసదృశ్య అసైన్ మెంట్లూ, బహిర్గతాలూ, సువర్ణముఖిలూ కూడా అర్ధమయ్యాయి. అచ్చంగా మాయలోడు సినిమాలో రాజేంద్రప్రసాద్, డాక్టర్ మొహంలో నుండి కనిపించినట్లన్న మాట. ఇది ఇతరులు under line చేస్తేనే మాకు అర్దమయ్యింది. ఆ విధంగా ఏ విషయమయినా అర్ధం కాకపోతే దృశ్య రూపంలో చూపించబడుతుంది. ఈ విషయాలలో మేము నిమిత్తమాత్రులమే. మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి.

మరో చిన్న ఉదాహరణ చెబుతాను. ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెత్ కావటంతో ప్రమాదంపాలైన వ్యక్తి అవయవాలని ఇతరులకి అమర్చటం గురించి వార్తలు తరుచుగా వస్తుంటాయి. కొందరు స్వచ్ఛందంగా తమ మరణానంతరం తమ అవయవాలని దానం చేయటం గురించీ చదువుతుంటాము. ఇటీవల మరణించిన జ్యోతిబసు ఇలాంటిదానాలు చేసినట్లన్న మాట.

2004 డిసెంబరులో పీవీజీ మరణించినప్పుడు కూడా, చాలాకాలంగా కోమాలో ఉన్న ఒక యువకుడి తల్లి, తన కుమారుడికి మెర్సీ కిల్లింగ్ ని అనుమతించాలనీ, అతడి అవయవాలని దానం చేయటానికీ అనుమంతిచాలనీ కోర్టుని అర్ధించింది. కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇంతలో ఆ యువకుడు మరణించాడు. అతడి తల్లి దుఃఖంతో ఆ యువకుడి అవయవాలని [వీలైనన్ని] అవసరార్ధులకి దానం చేసింది. అప్పుడదంతా మేము చాలా యధాలాపంగా చదివాము. ఎందుకంటే అప్పటికి మేం మా జీవితాల్లో రామోజీరావునీ అతడి గూఢచర్యాన్ని గుర్తించలేదు గనక!

అయితే ఆ తర్వాత, ముఖ్యంగా 2007 లో మేం శ్రీశైలం నుండి నంద్యాల చేరాక.... పీవీజీ మరణిస్తూ, తను అప్పటి వరకూ నిర్వహించిన పనులన్నీ విభజించి తన అనుచరులకి [వై.యస్., సోనియాతో సహా] అప్పగించాడనీ, అందుచేత మాకు తెలిసిన విషయాలేవో ఢిల్లీ వెళ్ళి జనపధ్ 10 అధినేత్రికి చెప్పాలనీ.... మాకు పదేపదే అర్ధమయ్యేంత వరకూ చెప్పబడింది, బడుతూనే ఉంది. ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే - ఒక దానిపై ఒకటి ఆధారపడిన పళ్ళ చక్రాల యంత్రంలో ఒక చక్రం తిరిగితే మరొకటి తిరగటం, దాంతో ఇంకొకటి - మరొకటి! ఇలా కదిలే వలయాల బొమ్మలతో సహా వార్తలు ప్రచురించి మరీ చెప్పబడుతుంది. గడియారంలో ఉండే పళ్ళచక్రాల వంటివి.

నల్లమేక నలుగురు దొంగలు కథలో నాలుగుసార్లు గాకపోతే నలభైసార్లు, అప్పటికీ కుదరకపోతే నాలుగువేల సార్లు చెప్పినట్లన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ధర్బల కంకణం చేతబూని ఊబిలోకి బాటసారిని ఆహ్వానించే పంచతంత్రంలోని వృద్ద వ్యాఘ్రం మాదిరిగా!

అయితే ’అయోధ్య’లో పీవీజీ స్పష్టంగానే తన అనుచర సభ్యుల గురించి వ్రాసారు. ’లోపలి మనిషి’లో మరింత స్పష్టంగా చెప్పారు.

ఇది మీకు మరింత స్పష్టంగా అర్ధం కావాలంటే మరి కొన్ని విషయాలు, సినిమాలు చెప్పాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

’అన్నీ తనకి నడుస్తున్నాయి’ అనుకుంటే - తాను దేవుళ్ళకే దేవుణ్ణీ, రాజులకే రాజునీ అనుకునే జెక్సీస్ కి ’తనకి నడవటం లేదు’ అనిపిస్తే తగని భయం. అతడి అసలు నైజం పిరికితనమే! కాబట్టే కుట్రలకి తెగబడతాడు. స్పార్టా అధినేత లియోనైడర్స్ తన సేనకు ముందుండి యుద్దాన్ని నడిపిస్తే - జెక్సీస్ తన బానిసల వెనక ఉండి కొరడాలతో బాది వాళ్ళని ముందుకి ఉరికిస్తాడు.

కుట్రలు తాము పన్నుతూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ తాము ప్రధాన కుట్రదారులై ఉండి, పైకి మాత్రం తాను స్థానిక పత్రికాధిపతిని అన్న ముసుగు వేసుకుని, దేశంలో ప్రధాన ఏజంటుగా ఏ హిందూ ఎన్.రామ్ నో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాధ్ గోయంకా నో ప్రాజెక్ట్ చేస్తూ నకిలీ కణిక అనువంశీయులు నడిపిన కుట్రాజకీయం ఇదే!

తనకన్నీ నడుస్తున్నాయనుకుంటే తన అధిపత్యాన్ని అతిగా ప్రదర్శించుకునే జెక్సీస్, తన భారీ రధాన్ని బానిసల చేత లాగిస్తూ, తాను పాదం నేలపై పెట్టాలనుకుంటే ముందుగా తన బానిసల వీపుల మీద అడుగులు వేస్తూ దిగుతాడు. ప్రపంచానికి తీరిగ్గా ప్రదర్శించుకుందామనుకున్నా, గూఢచర్యంలో నకిలీ కణిక అనువంశీయులు ఇంత అధిపత్యాన్నీ ప్రదర్శించుకున్నారు.

తనని ఎదిరించిన వాళ్ళ కంకాళాలని మిగిలిన వాళ్ళకి ప్రదర్శించి భయపెట్టాలనుకునే జెక్సీస్ నైజాన్నే , నకిలీ కణిక అనువంశీయులు గూఢచర్యంలో తమ ఏజంట్ల మీద ప్రదర్శించారు. తమని కాదంటే ఎంతటి సెలబ్రిటీలైనా, దేశాధినేతలైనా, దేశాలైనా.... మట్టిగొట్టుకుపోవటాన్ని ప్రదర్శిస్తూ, దాన్నే తమ చెంచాల చేత కీర్తింపించుకుంటూ, నకిలీ కణిక అనువంశీయులు, తామో వ్యక్తి కాదు వ్యవస్థ నంటూ నడిపింది ఇదే!

ఎంతగా బాకా ఊదించుకుంటారంటే - జెక్సీస్ అనుచరుడు గనక ’మా మహారాజు దృష్టిసోకినా, కాలుపెట్టినా ఆ చోటు వారికే స్వంతం’ అన్నట్లుగానే! దీన్నే ఒకప్పుడు బ్రిటీషు ముఖతః ప్రదర్శించారు. తర్వాత కెజీబి, సిఐఏ ల పేరిట ప్రదర్శించారు. ఇప్పుడు ముస్లిం ఉగ్రవాద సంస్థల పేరిట ప్రదర్శిస్తున్నారు. అదే బిన్ లాడెన్ Vs బిల్ గేట్స్ ల ర్యాంకుల రూపంలో కనబడింది. అన్నీ సవ్యంగా నడిచి ఉంటే, తాము ప్రపంచధినేతలుగా ప్రకటించుకుని పట్టాభిషిక్తులైన ఉత్తర క్షణం.... ప్రపంచమంతా ఏక కంఠంతో తమని కీర్తించేటట్లుగా డిజైన్ చేసుకున్నారు. దాన్నే ట్రయల్ గా హిట్లర్ నాటి నుండి, పెద్దపులి ప్రభాకరన్ లు, బిన్ లాడెన్ ల ద్వారా ప్రయోగాత్మకంగా ప్రయోగించుకు చూసుకున్నారు.

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోనే కాదు, చరిత్రకు అందిన శ్రీకృష్ణదేవరాయల వారి యుద్దాలతో సహా భారతదేశీయ యుద్దాలలో రాత్రివేళ యుద్ద విరామం ఉంటుంది. ఆయుధహీనులపై, నిద్రిస్తున్న వారిపై దాడి చేయరాదు గట్రా నియమాలుంటాయి. అవేవీ లేని కుట్రపూరిత యుద్దాలు జెక్సీస్ చేస్తాడు. రాక్షస ఖడ్గమృగాలూ, మదగజాలు ఫలించ లేదంటే వినూత్న విస్ఫుటనాల వంటివి. నకిలీ కణిక అనువంశీయులు గూఢచర్యంతో మేళవించి.... దేశాల మీదా, ప్రజా సమాజాల మీదా ప్రయోగించేది ఇలాంటి తంత్రాలనే! హఠాత్తుగా రగిలే ఉద్యమాలు, పేలే వరుస బాంబులూ, రకరకాల సంచలనాలూ ఇలాంటివే!

అదే కాదు, ప్రత్యక్ష యుద్దంలో విరామ సమయాలుంటాయి. అలసట తీర్చుకోనిచ్చే పరిమితులుంటాయి. జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయులకి అలాంటివేవీ ఉండవు. ఎటూ తామూ వెనకనో, చాటునో నక్కి, తమ బానిసలనే కదా పంపుతారు!? అందుచేత, అలసట తీర్చుకునే విరామావేవీ పాటించకుండా, ఎదిరి పక్షం మీదకి జట్టు తర్వాత జట్టుని పంపుతూనే ఉంటారు. ముసలి వాడి చేతిలోని మేకని, ముసలి వాడి చేతే వదిలి పెట్టించి దోచుకోవటానికి, నలుగురు దొంగలు చాలకపోతే నలభైమంది వచ్చినట్లుగానన్న మాట!

లియోనైడర్స్ నాయకత్వంలో 300యోధుల సేన తనకిచ్చిన ప్రతిఘటనకే ’తాను దేవుణ్ణని విర్రవీగే జేక్సీస్ గగన తలంలో, కాదూ తాను సామాన్యుణ్ణే ననే కరిమబ్బు కమ్ముకుంది!’ అంతే కాదు, ఆ సినిమా తుది సీన్లలో ఒకటైన యుద్ద చరమ దశలో, లియోనైడర్స్ నిజంగా తనముందు మోకాలి దండ వేస్తున్నాడను కొని, ఆ క్షణం కోసం జెక్సీస్ ఎంతగా ఎదురు చూసాడో నన్నట్లు, హర్షాతి రేకంతో రెండు చేతులూ పైకెత్తి ఆనందించబోతాడు. అంతలోనే దాడి చేయమన్న ఆదేశాన్ని తన యోధులకిచ్చిన లియోనైడర్స్ ని చూసి ఖంగుతింటాడు, జెక్సీస్. అతడా విభ్రాంతి నుండి తేరుకునేలోగానే లియోనైడర్స్ విసిరిన ఈటె అతడి చెంప చీల్చుకు పోతుంది. ఆ రక్తాన్ని అరచేతిలోకి తీసి చూసుకున్న జెక్సీస్ ఎంత భయభ్రాంతుడవుతాడో!?

అప్పుడు తిన్న దెబ్బతాలూకూ భయం... సంవత్సరం పాటు అతడు స్పార్టన్లని తలుచుకుని గజగజలాడుతూనే ఉంటాడు. ఆ పిరికితనమే అతడి అసలి నైజం. చరిత్రలో జగ్గజ్జేత కావాలని కలలు కన్న అలెగ్జాండర్, జెక్సీస్ గట్రాలకి, The Great అనేబిరుదు కట్టబెట్టి ప్రచారించే మీడియాకి, అసలు సిసలు అధిపతులైన నకిలీ కణిక అనువంశీయుల అసలు నైజమూ ఆ పిరికి తనమే!

అంతేకాదు, జెక్సీస్ లియోనైడర్స్ తో ’నీ విరోధులైన ఎధీనియన్లని నీ ముందు మోకాలి దండ వేయిస్తాను. నీవు నా ముందు మోకాలి దండ వేయి’ అంటాడు. ఎధీనియన్లకీ ఇదే చెప్తూ వాళ్ళ విరోధులెవరినో చూపి ఉంటాడు కదా! ఒకసారి తనముందు మోకాలి దండ వేసాక, ఇక తాను ఎవరి ముందు మోకాలి దండ వేయమంటే వాళ్ళ ముందు వేయాల్సిందే! బానిసకి ఇష్టాఇష్టాలేముంటాయి? అదే విభజించి పాలించే సూత్రం! చరిత్రలో జెక్సీస్ దీన్ని ఎంతగా ప్రయోగించగలిగాడో కానీ, ఈ చిత్రంలో ఆ పాత్ర ద్వారా ప్రతిబింబించబడిన నకిలీ కణిక అనువంశీయులు మాత్రం, మహాభారతంలోని కణికుడి కూటనీతిని అంటే విభజించి - పాలించే తంత్రాన్ని బాగా వంటబట్టించు కున్నారు.

యుద్ద చివరి ఘట్టంలో జెక్సీస్ అనుచరుడు, లియోనైడర్స్ తో మాట్లాడేటప్పుడు "నీ దేశ స్వాతంత్రం కోసం కదా పోరాడావు. అది నీకు దక్కినట్లే! నీ పోరాట పటిమకి ముగ్దుడై నిన్ను మెచ్చుకోవటానికి స్వయంగా వచ్చారు మా మహారాజు జెక్సీస్! నీవు నీ పదవి కోసమే కదా పోరాడావు? ఇక ఈ గ్రీకు సామ్రాజ్యానికి నీవే ఏకైక దళపతివి" అంటాడు. గూనివాణ్ణి చూపిస్తూ "ఇతణ్ణి నువ్వు అవమానించినా, ఇతడు నీ గురించి మా మహారాజు దగ్గర మంచిగానే చెప్పాడు" అంటాడు. "నువ్వు మోకాలి దండవేయ వలసింది ఒక్కరి ముందే! అదే మా మహారాజు జెక్సీస్" అంటూ ’బరిసె క్రిందపారెయ్’ అని పదేపదే హెచ్చరిస్తాడు.

బానిస మరొకణ్ణి బానిస కమ్మంటూ బలవంత పెట్టటం! ఒక్క లియోనైడర్స్ మీదే కాదు, అవినీతికి వ్యతిరేకంగా, తమకి వ్యతిరేకంగా పోరాడే వారందరి మీదా.... నకిలీ కణిక అనువంశీయులు ప్రయోగించే తంత్రం ఇది. మొదలుకే వాళ్ళకి తెలిసింది పదే తంత్రాలు. వాటిల్లోదే ఇది కూడాను.

గూనివాణ్ణి చూస్తూ లియోనైడర్స్ "ఎంగిలి మెతుకులు మాకు రుచించవు. ఆ భోగం నీవే అనుభవించు" అంటాడు. నిజంగా ఊహించ చేతనవ్వాలే గానీ.... డబ్బుకీ, కెరీర్ కీ ఆశపడి మాతృభూమికి, స్వంత మతానికీ, స్వంత సంస్కృతికీ, స్వంత భార్య/భర్త కీ దోహం చేసేవారు తింటోంది ఆ ఎంగిలి కూటినే. వాళ్ళ కక్కుర్తి అంతటిది. ఊహించచేతనైతే కడుపులో దేవినట్లనిపించే అసహ్యపు తిండి అది!

ఇక ఈ చిత్రంలోని గూనివాడు ఆత్మద్రోహికి ప్రతీక! వాడు లియోనైడర్స్ తో తాను మాతృదేశ రక్షణ కి పోరాడాలనుకుంటున్నట్లు చెబుతాడు. స్పార్టా మహారాజు లియోనైడర్స్ తో అది చెప్పేందుకు అవకాశాన్ని కూడా ’దక్షిణం వైపున్న కొండ దారి తనకు తెలుసు!’ అన్న విషయాన్ని విశదం చేస్తూ, దాదాపు బేరం పెడుతున్నట్లుగా చెబుతూ పొందుతాడు. స్పార్టాల యుద్దరీతి - యోధులందరూ తమ డాలుని తొడ నుండి మెడ వరకూ పట్టుకుని, ఒక బలమైన గోడ లాగా దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని ఏర్పరుచుకొని, పోరాడతారు. అందులో ఏ ఒక్కరు బలహీనులైనా ఆ గోడ నిష్ప్రయోజనమై పోతుంది. అది వాస్తవం. అప్పుడు విజయం లభించదు. అక్కడ ఐకమత్యమే బలం. ఏ ఒక్కరూ శతృవుకి సందివ్వకూడని భౌతిక యుద్దరీతితో పాటు మానసిక యుద్దరీతి కూడా అదే!

అలాంటి చోట, సత్యాన్ని చెప్పాడే గాని లియోనైడర్స్ గూనివాడి అంగ వైకల్యాన్ని ఎత్తి చూపలేదు. నిజంగా గూనివాడికి మాతృదేశం పట్ల భక్తీ నిబద్దతా ఉంటే, లియోనైడర్స్ చెప్పినట్లుగా యుద్దంలో గాయపడిన యోధులకి సేవ చేయటానికి, వైద్యం నీరు అందించటానికీ ప్రయత్నించి ఉండేవాడు. దేశ రక్షణ కై సాగే యుద్దంలో తనకి చేతనైనది తను చెయ్యాలను కునే వాడు. తనని అవమానించారనే వంకపెట్టుకుని, అహంకారానికి పోయి, దేశద్రోహానికి ఒడిగడుతూ శతృవు పంచన చేరేవాడు కాదు.

’తనకున్న అర్హత, సామర్ధ్యమూ ఎంతో గ్రహించుకుని, ఆ అర్హతకు తగిన పదవి పొందటం, అందుకు సంతృప్తి చెందటం’ అన్నది వ్యక్తి విచక్షణనిబట్టి ఉంటుంది. గూనివాడి అర్హత యోధుడి పదవికి తగదు. యుద్దంలో గాయపడిన వారికి వైద్యమూ, నీళ్ళు అందించే పనికి, పదవికి తగి ఉంటుంది. వాడి ఆశ, భోగభాగ్యాలూ సుందరాంగులతో సరసాలూ దగ్గరుంది మరి!

అందుకే అలవోకగా శతృవుతో కుమ్మక్కు అయ్యాడు. అందుకు ఓ వాదన నిర్మించుకున్నాడు. అంతే! దాన్నే తెలివిగా చెబుతున్నానన్నట్లుగా జెక్సీస్ "నీ పరిస్థితి తెలిసీ నిన్ను నిటారుగా నిలబడమన్నాడు లియోనైడర్స్!" అంటూ గూనివాడి అహాన్ని మరింత రెచ్చగొడతాడు. తన ఐశ్వర్యాన్ని, నగ్న సుందరీ మణులనీ చూపెట్టి గూనివాణ్ణి మరింత ఉన్మత్తుణ్ణి చేస్తాడు. వాడు కోరినట్లే "అవన్నీ నీకు ప్రసాదిస్తాను. బదులుగా దక్షిణం వైపు కొండ దారి ఉంది కదా? దాన్ని నాకు తెలియజేయి" అంటాడు జెక్సీస్. "అవన్నీ నీకు ప్రసాదిస్తాను" అనేటప్పుడు ’నేనే దేవుణ్ణి’ అనే దర్పమే ఉంటుంది అతడి దగ్గర.

సుందరాంగులని, వారి కామ చేష్టల ప్రదర్శనలని చూసి వెర్రెత్తి పోయిన గూనివాడు, తన గూని శరీరంతో ఏ మాత్రం ఆనందించగలడో వాడికే తెలియాలి. అందుకే వైకల్యాలున్న బిడ్డలని పురిటిలోనే చంపాలనుకున్నారేమో స్పార్టన్లు! బహుశః మానసిక వైకల్యాలని తెరమీద, సామాన్య ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేటట్లూ చూపటం కష్టం కాబట్టి, గూనివంటి శారీరక అంగ వైకల్యాన్ని ఎంచుకున్నాడేమో దర్శకుడు!?

శారీరక అంగవైకల్యం నిర్ధయార్హం కాదు గానీ, స్వార్ధంతో కూడిన మనో వికారం నిశ్చయంగా క్షమార్హం కాదు. ఒక జాతి ధృఢమైనదిగా రూపొందాలంటే కొన్ని పరిమితులు, పరిస్థితులూ, నిర్దిష్టంగా నిర్ధ్వంద్వంగా నిర్ధయగా పాటించి తీరాల్సిందే.

నిజానికి ఈ విషయంలోనూ గీత స్పష్టంగా మార్గదర్శకత్వం చూపుతుంది. సమాజంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. పుట్టుకతోనే అందరూ సాత్వికులై, స్వార్ధరహితులై ఉండరు. అందుకు జన్మజన్మల సాధన అవసరం. అందుకే గీత

శ్లోకం:
సక్తాః కర్మ ణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత
కుర్యా ద్విద్వాం స్తథా2సక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్

భావం:
కాబట్టి, ఓ భారతీయుడా! అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోక సంగ్రహణానికై - చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి.

శ్లోకం:
న బుద్దిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్
జోషయ్ త్సర్వకర్మాణి విద్వా యుక్త స్పమాచరన్

భావం:
జ్ఞానియైన వాడు కర్మాసక్తుల యొక్క బుద్దిని చలింపజేయకుండగా - తాను కర్మాచరణ చేస్తూ, వారి చేత చేయించాలి.

అజ్ఞానులు ఫలాసక్తితో పనులు చేస్తే, జ్ఞానులు ఫలాసక్తి రహితంగా పనులు నిర్వహించి, ’యద్యదాచరతి శ్రేష్థః’ వలె ఇతరులకి ఆదర్శంగా నిలవాలంటుంది. మంచిపనులు చేసేవాడు, కర్మయోగి, ఎన్నడూ భ్రష్ఠుడు కాడని, జన్మజన్మాంతర సాధన తో ఉత్తముడవుతాడనీ ఆత్మసంయమ యోగంలో స్పష్టంగా చెబుతుంది.

మళ్ళీ 300 సినిమా దగ్గరికి వస్తే - ఇందులో మంత్రి తెరాస్ పాత్ర. లంచానికీ, పదవికీ అశపడిన వాడు. శతృవు ఇచ్చిన బంగారానికి ఆశపడి, తనలాంటి మరికొందరు శతృదేశ ఏజంట్లని దేశంలో తయారు చేస్తాడు. ’లియోనైడర్స్ జెక్సీస్ ని గెలిచి ప్రాణాలతో తిరిగి రాలేడు. ఒక వేళ వచ్చినా అతణ్ణి ఖైదు చేస్తా’నంటాడు. అసలు రాజుకు సైనిక సాయం అందనీయకుండా ఆదినుండీ అడ్డుకుంటాడు.

లియోనైడర్స్ రాణి పాత్ర, ఈ చిత్రంలో ప్రత్యేకమైనది. ఆ పాత్రకి ప్రతీకనీ, అందుకు గల సారూప్యతనీ తదుపరి టపాలో వ్రాస్తాను. ఈ రాణి పాత్ర, యుద్దరంగంలో పోరాడుతున్న మహారాజు లియోనైడర్స్ కి సాయంగా స్పార్టా సేనను పంపేటందుకూ, అందుకోసం రాజసభ ఏర్పాటు చేసి తాను మాట్లాడేటందుకూ ప్రయత్నిస్తుంది. అందుకు సహకరించని మంత్రి తెరాస్ కు లంచంగా, అతడు కోరినట్లు శారీరక సుఖం ఇస్తుంది.

ఆ విధంగా అవినీతిని ఆశ్రయించి, నీతికి విజయాన్ని, అధర్మానికి పాల్పడి ధర్మ విజయాన్ని ఎలా సంప్రాప్తింప చేసుకో వచ్చనుకుందో మరి! అయితే ఏ క్షణమైతే ఆమె ఆ స్టెప్ తీసుకుందో, అప్పటి నుండీ యుద్దరంగంలో లియోనైడర్స్ సేన అపజయం పాలవ్వటం ప్రారంభమౌతుంది. గూనివాడి ద్రోహంతో జెక్సీస్ సేనలు దక్షిణం వైపున్న కొండ దారి ద్వారా స్పార్టన్లని చుట్టుముడతారు. అప్పటి వరకూ వారితో కలిసి పోరాడుతున్న టేక్సాస్ తదితరులు యుద్దరంగం వదిలి వెళ్ళి పోతారు. ఆ యుద్దంలో అదే చివరి ఘట్టమై లియోనైడర్స్ తన యోధులతో సహా వీరమరణం పొందుతాడు.

ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతితో కుమ్మక్కు అయ్యాక, నీతి మిగిలి ఉండదు. అధర్మానికి పాల్పడ్డాక స్థైర్యధైర్యాలుండవు. లియోనైడర్స్ రాణి వంటి వారు ఆయా దేశాల్లో తమకి తెలియకుండానే, జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయులకి తోడ్పడుతుంటారు. తమ దేశ ప్రయోజనాలని ఆశించీ, ఇలాగైతేనే అభివృద్ది సాధ్యం అనే నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గాల ప్రచారాన్ని నమ్మీ, ఏదో వీళ్ళని డబ్బు సంపాదించుకోనిస్తే మన పనికి అడ్డం రారు అనుకునీ నకిలీ కణిక ఏజంట్లతో చేతులు కలుపుతుంటారు. సాపేక్షంగా చూస్తే, ఇలాంటి వాళ్ళకి తమ మాతృ దేశాల పట్ల నిబద్దత, నకిలీ కణిక ఏజంట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.

ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే - లియోనైడర్స్ రాణి రాజసభలో, లియోనైడర్స్ 300 మంది యోధులతో కలిసి జెక్సీస్ సేనలతో పోరాడుతున్న విషయాన్ని వివరించి, స్పార్టా సైన్యాన్ని పంపాలని ప్రతిపాదించినప్పుడు, మంత్రి తెరాస్ రాణినైతిక వర్తన గురించీ, రాణి గురించీ నీచంగా మాట్లాడతాడు. తర్వాత ఆమె అతణ్ణి కత్తితో పొడిచి చంపేస్తుంది. నేలకూలిన అతడి శవం నుండి జెక్సీస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణాలు జలజలా రాలతాయి.

ఆ విధంగా అతడి అవినీతి బహిర్గతం[expose] అయ్యాకనే స్పార్టా ప్రజల్లో స్ఫూర్తి రగులుతుంది. ద్రోహిని గుర్తించి, సత్యాన్ని గ్రహిస్తారు.

యుద్దరంగం నుండి లియోనైడర్స్ మెడలో దండనీ, సమాచారాన్ని తెచ్చిన యోధుడు [చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయిన వాడు. అయినా తాను యుద్దానికి వెరవననీ, మరో కన్నుందనీ, దేవుడందుకే మనిషికి రెండుకళ్ళు ఇచ్చాడనీ అనేంత ధీరుడు.] ’ఆనాడు మహారాజు లియోనైడర్స్ తమ విజయవార్త అందించమన్నాడు. అది విజయమెలాగవుతుందో అప్పుడు తనకి అర్ధం కాలేదనీ, ఇప్పుడర్ధం అయ్యిందనీ’ - యుద్దానికి కదిలిన పదివేల మంది స్పార్టన్ వీరులని చూస్తూ అంటాడు.

మాతృదేశం కోసం పోరాడిన యోధుల ఆత్మలు సైతం, తము చేసిన యుద్దంలోని నిజాయితీ సహితంగా ఎంతటి జడులనైనా, ఎంతటి తామసులనైనా ఏదొకనాడు కదిలించ గలవనే విశ్వాసం అతడిది. స్పార్టన్లతో అదే చెబుతూ.... యుద్దరంగంలో లియోనైడర్స్, అతడి యోధులు చిందించిన రక్తాన్ని, చేసిన త్యాగాన్ని గుర్తించమంటాడు. "ఆయన మీ నుండి పొగడ్తలనీ, కీర్తి గానాలని కోరలేదు. ఆయన మీనుండి కోరుకుంది కొన్ని జ్ఞాపకాలని మాత్రమే" అంటాడు. తన వెనక కదిలిన స్పార్టన్ల సేనని చూసి ’ఆనాడు 300 యోధులతో లియోనైడర్స్ కొట్టినదెబ్బకి సంవత్సర కాలంగా గజగజ వణుకుతూ కూర్చొన్న జెక్సీస్ ఓటమి నిశ్చయం’ అన్న విశ్వాసాన్ని ప్రకటిస్తాడు.

ఆ విశ్వాసం యుద్దభూమిలో చిందించిన రక్తం నుండీ, చూపించిన ధైర్యం నుండీ వచ్చింది. స్వాతంత్ర సమరంలో చూపిన శౌర్యం నుండి వచ్చింది. ఇంకా ఇది భౌతిక స్వాతంత్రమే. దీన్ని దాటి ఆత్మ స్వాతంత్రాన్ని పొందమంటాయి ఉపనిషత్తులు. దీన్నే వివేకానంద స్వామి Freedom of Soul గా ప్రతీ మనిషి సాధించవలసిందిగా చెప్పారు. ఆయన చెప్పి దాదాపు నూరేళ్ళయ్యింది. ఈ నూరేళ్ళల్లో నాటి మానవ స్వాతంత్రం గమనం ముందుకు గాక మరింతగా వెనక్కి పోయింది. నాటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు కూడా, నేటి యువజనులకి ఎంత వరకూ తెలుసన్నది ప్రశ్నార్ధకమే!

300 సినిమా మీది నా విశ్లేషణ ముగించే ముందు మరొక్క విషయం ప్రస్తావిస్తాను. జెక్సీస్ తో యుద్దపు చివరి ఘట్టంలో లియోనైడర్స్, అతడి యోధులు అమిత శౌర్యంతో, వెనుదీయక పోరాడతారు. మోకాలి దండ వేసినట్లుగా నేలకు వంగిన లియోనైడర్స్, తన మాతృభూమిని స్పృశిస్తూ, ఆ మట్టి వాసనని ఆఘ్రాణిస్తూ, తన ప్రియసఖిని ప్రేమానుబంధాలనీ గుర్తుకు తెచ్చుకుంటాడు. తాను లొంగి పోయానేమోనని పొంగి పోతూ చూస్తున్న జెక్సీస్ ను విభ్రాంతికి గురిచేస్తూ, దాడి చేయమన్న ఆదేశాన్ని తన యోధులకిస్తాడు. అందుకోసమే కాచుకున్నట్లున్న స్వార్టా యోధుడు ఎగిరి, లియోనైడర్స్ వీపు మీదగా, అప్పటి వరకూ జెక్సీస్ ని తెగ పొగుడుతూ, జెక్సీస్ తరుపున బేరాలాడిన అతడి బానిసని తెగనరుకుతాడు. అదీ వారి మధ్య ఉన్న కో ఆర్డినేషన్, పరస్పర అవగాహన! మహారాజు లియోనైడర్స్ జెక్సీస్ కి లొంగిపోయి మోకాలి దండ వేయలేదని వారికి ముందే తెలుసు.

[ఆ దృశ్యం అచ్చం చందమామ బాలల పత్రికలో బొమ్మ ఉన్నట్లే ఉంటుంది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు, pause చేసి చూస్తే అచ్చం చందమామలో వర్ణ చిత్రాల్లా ఉంటాయి. జెక్సీస్ దూతల్ని పాతాళ బావిలోకి తోసినప్పుడూ, సముద్రంలో జెక్సీస్ నౌకలు మునుగుతున్నప్పుడూ మదగజాలు మృత్యులోయలోకి జారుతున్నప్పుడు.... ఇలా!]

మొత్తంగా... ’మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా?’ అనిపించేటట్లుగా ప్రతీ దృశ్యమూ, ప్రతీ అంశమూ ఈ సినిమాలో చిత్రించబడ్డాయి.

స్పార్టా యోధుడు జెక్సీస్ బాకా ఊదే బానిసని చంపిన మరుక్షణం, భీకర యుద్దం మళ్ళీ ప్రారంభమౌతుంది. లియోనైడర్స్ విసిరిన ఈటెతో పొంగిన జెక్సీస్ భయాన్ని ఇంతకు ముందే వివరించాను. యుద్దంలో గాయాల పాలై, దాదాపు మరణపు అంచుకు వచ్చినప్పుడు కూడా, లియోనైడర్స్ జెక్సీస్ పంపిన భారీ కాయుణ్ణి కంట్లో కత్తిదించి చంపుతాడు.

ఆ క్షణం నేలపైకి వాలుతున్న లియోనైడర్స్ తో, స్పార్టా యోధుడు "మహారాజా! మీతో కలిసి మరణించడం నాకు సంతోషం" అంటాడు. అతడి కళ్ళల్లో అదే మెరుపు. మాతృదేశం కోసం చేసిన యుద్దంలో మరణిస్తున్నాననే తృప్తితో కూడిన మెరుపు. కాని ఆ క్షణంలో కూడా లియోనైడర్స్ ఆశావహ ఆలోచన విధానమూ, జీవితం పట్ల అనురక్తి,ఎంతగా ఉంటాయంటే - శరీరం గాయాలైన బాధతో కూడా "నీతో కలిసి జీవించడం నాకు సంతోషం" అంటాడు.

అవును! జీవితం జీవించడానికే! మరణించడానికి కాదు. మరణం అనివార్యం కావచ్చు. కానీ మృత్యువు సంభవించే వరకూ, నిండూనూరేళ్ళు శాంతీ సంతోషాలతో, జీవించడమే జీవితానికి అర్ధం. అయితే బానిసలా కాదు, స్వేచ్ఛా స్వాతంత్రాలనే ఊపిరిగా పీలుస్తూ.... సుఖాలూ సంపదలూ తగినంతగా కలిగి ఉండి... శాంతీ సంతోషాలు కొదవ లేకుండా ఉండే జీవితాన్ని ఆస్వాదించాలి. అందుకే భారతీయులు వసుధైక కుటుంబాన్ని స్వప్నించారు. ప్రాచీన కాలం నుండీ విశ్వమానవ ప్రేమని కాంక్షించారు. అందుకోసమే అన్వేషించారు, పోరాడారు, పోరాడుతున్నారు. ఒకప్పుడు విల్లూకత్తులతో, మరొకప్పుడు సత్యాహింసలతో, ఇప్పుడు మెదళ్ళతో!

ఒకసారి కేనోపనిషత్తుకీ, ప్రశ్నపనిషత్తుకీ, ముండకోపనిషత్తుకీ శాంతి మంత్రాన్ని పరికించండి.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్ష భిర్య జత్రాః
స్థిరైరంగై స్తుష్టువాగ్ం సస్తనూభిర్ వ్యశేమ దేవహితం యదాముః

భావం:
ఓం. ఓ దేవతలారా! మా చెవులు శుభాన్నే వినుగాక. యజ్ఞకోవిదుమైన మేము మా కళ్లతో శుభాన్నే చూచెదం గాక. మీ స్తోత్రాలను గానం చేసే మేము, పూర్తి ఆరోగ్యం బలాలతో మాకు నియమితమైన ఆయుష్కాలాన్ని గడిపెదం గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇంతకన్నా కోరదగినది ఇంకేముంటుంది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

300 సినిమాలో - పారశీక రాజైన జెక్సీస్ దూత, స్పార్టన్ ల దగ్గరికి ఓ చిన్నపాటి రథం మీద వస్తాడు. దాన్ని లాగుతున్న బానిసల్ని "ఇంతేనా మీ వేగం? ఇంకా వేగంగా లాగండి" అంటూ కొరడాతో బాదుతూ స్పార్టన్ల ని సమీపిస్తాడు. ఎంతో అతిశయంగా "రాజులకే రాజు. దేవుళ్ళకే దేవుడు. జగజ్జేతగా అవతరించనున్న రాజాధిరాజు జెక్సీస్ కు రహస్య గూఢచారినన్న గర్వంతో చెబుతున్నాను. స్పార్టన్స్! ఆయుధాలు క్రిందపారేసి మా మహారాజును శరణు కోరండి" అంటూ హుంకరిస్తాడు. ఏదో కొందరిని గెలిచినంత మాత్రాన అపారమైన జెక్సీస్ సేనలని గెలవగలమను కోవద్దంటూ, హితవు చెబుతున్నట్లుగా చెబుతాడు. అపారమైన తమ సేన నీళ్ళు తాగితే జీవనదులు ఎండిపోతాయనీ, నడిస్తే ఆ పద ఘట్టనల క్రింద దేశాలే నామ రుపాల్లేకుండా పోతాయనీ గర్వపడుతూ, అలాంటి తమ సేనని ఆపడానికి స్పార్టన్లు నిర్మించిన అడ్డగోడ ఏ మాత్రమూ నిలవ లేదనీ అంటాడు.

స్పార్టన్ యోధుడు దానికి స్పందిస్తూ ’తమ పూర్వీకులు తమ దేశ స్వాతంత్రం కాపాడటానికి నిర్మించిన ఆ గోడకి, మరింత బలం చేకూర్చటానికి తాము, యుద్దంలో పోరాడ లేక మరణించిన జెక్సీస్ బానిసల శవాలను ఉపయోగిస్తున్నామనీ’ అంటాడు. రెచ్చిపోయి, కారుకూతల కూస్తూ కొరడా ఝుళిపించిన జెక్సీస్ గూఢచారి చేతిని నరికి "మచ్చుకి నీ చేతిని నరికాను. పోయి నీ రాజుకి చెప్పుకో"మంటాడు స్పార్టన్ యోధుడు.

చెయ్యి నరకబడిన నొప్పి, క్రోధాలతో కుప్పకూలిన జెక్సీస్ గూఢచారి "నేను కాదు బానిసని! మీ దేశపు పౌరులు, స్త్రీలూ, పిల్లలూ బానిసలౌతారు. కానీ మీరు కారు. ఎందుకంటే మీరు ఈ రోజు రాత్రిలోగా మరణించబోతున్నారు" అంటాడు. పోరాడలేక కుప్పకూలినప్పుడు కలిగే నిస్సహాయలో నుండి ఉబికి వచ్చే వదరుబోతుతనం అది. ఓడిపోతున్నప్పుడు ఉపయోగించే వాచాలత!

దానికి అంతే దీటుగా.... స్పార్టన్ వీరుడు చిరునవ్వు నవ్వుతూ "అందుకు మేమెన్నడూ సిద్దమే!" అంటాడు. కళ్ళెం జీనులకి లొంగని, అసలా బానిసత్వాన్నే ఎరగని, అడవి గుర్రం.... జూలు విదిల్చినట్లుగా ఉంటుంది అతడి దేహభాష!

స్వేచ్ఛా ప్రియత్వం, స్వాతంత్ర కాంక్ష, స్వాభిమానంలతో వచ్చే శక్తి అది!

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. బానిసత్వానికీ, స్వేచ్ఛాస్వాతంత్రాలకీ ఉన్న వ్యత్యాసం ఎలాంటి దంటే - ఒక కార్పోరేట్ విద్యా సంస్థలో టీచర్ ఉన్నాడనుకొండి. తనకి ఇష్టం ఉన్న లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, అవసరం ఉన్నా డ్యూటీకి వెళ్ళక తప్పదు. కష్టించి పనిచేసే అతడు సోమరి కాడు. కానీ ఏ రోజన్నా, ఏ కారణంగానైనా ఓ రోజు డ్యూటీకి వెళ్ళ బుద్ది గాకపోతే, యాదృచ్చంగా సెలవు తీసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వంద లెక్కలు వేసుకోవాలి. ఎన్ని సెలవులు పెట్టుకున్నామో, ఎన్ని మిగిలి ఉన్నాయో, సెలవు కారణంగా ఏం చెప్పాలో, ఏ కారణం చెబితే రిస్క్ ఉండదో.... ఇలా!

అదే.... చిన్నదో పెద్దదో స్వంత వ్యాపారం, వ్యవసాయం చేసుకునే వాడు ఇన్నిలెక్కలు వేసుకోనక్కరలేదు. ఉద్యోగి, వ్యాపారి - ఇద్దరూ శ్రమించే వాళ్ళే, బాధ్యతాయుతులే! ఉత్తి పుణ్యానికి పని ఎగ్గొట్టే రకాలు కాదు. అయినా వ్యక్తిగత స్వేచ్చానుసారం ప్రవర్తించాలనుకుంటే ఉద్యోగికి అది కష్టసాధ్యం, స్వంత ఉపాధిదారుకి అది పెద్ద విషయం కాదు.

ఇక స్వంత ఉపాధి దారుకి కూడా పరిస్థితులు మూసుకు పోయి, ఇష్టం లేకున్నా, ఎదుటి వారికి తైరు కొట్టటం దగ్గర నుండీ సవాలక్ష పనులు చేయవలసి రావటం అంటే - మొత్తంగా సమాజమే బానిస వ్యవస్థగా మారిపోయినట్లే! దీన్నే మనం ’హిపోక్రసీ’గా ఇంగ్లీషులో చెప్పుకుంటాం.

ఇదే వెయ్యేళ్ళక్రితం.... భారతదేశపు పల్లెల్లో వ్యవసాయాది కుల వృత్తులన్నీ, ఆయా వ్యక్తులు, తమకి ఇష్టమైన పద్దతుల్లో, తమకి అనువైన వేళల్లో, తమకి తామే బాసులూ తమకి తామే అనుయాయూలూ అయ్యి పనిచేసుకు పొట్టపోసుకుంటే - సమాజం స్వేచ్చా స్వాతంత్రాలతో ఉన్నట్లన్నమాట. అధికారంలో రాజరికం ఉన్నా, ప్రజాస్వామ్యం ఉన్నా, దోపిడిని బట్టే, సమాజంలో బానిసత్వం Vs స్వాతంత్రాల పరిస్థితి ఉంటుంది.

అదే జెక్సీస్ సేనకీ లియోనెడస్ యోధులకీ అద్దంపడుతుంది. జెక్సీస్ సేనలు కొరడా దెబ్బలు తింటూ యుద్దానికి సిద్దపడితే, లియోనైడర్స్ యోధులు స్వచ్ఛందంగా....’దేశ స్వాతంత్రం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా మేం సిద్దం’ అంటూ యుద్దానికి సిద్దపడతారు. జెక్సీస్ బానిసలు అపారమైన సేన అయితే స్పార్టా యోధులు 300 మంది. వాళ్లతోనే యుద్దానికి సిద్దపడి, శతృవుని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. చివరికి స్పార్టాన్ దేశపు గూనివాడు జెక్సీస్ దగ్గర కెళ్తాడు. స్పార్టాన్స్ యోధులను ఎదుర్కొవటానికి వెనుక దారి గురించి చెప్పి ఆ గూనివాడు వెన్నుపోటు పొడుస్తాడు. ఆ విధంగా, జెక్సీస్ వెన్నుపోటుదారుడిని చెంతకు చేర్చుకుంటేనే ఆ పాటి చిన్నవిజయం అయినా వస్తుంది.

చివరకు స్పార్టన్స్, సంవత్సరం తర్వాత పదివేల మంది సేనలతో 30,000 జెక్సీస్ బానిస సేనను తేలిగా ఎదుర్కొగలమన్న ఆత్మవిశ్వాసంతో కదనరంగానికి కదులుతారు. అంటే స్పార్టాన్ 300 మంది యోధులను చంపిన తర్వాత కూడా, జెక్సీస్ బానిస సేన, స్పార్టా మీదకి వెళ్ళటానికి సంవత్సర కాలం పట్టింది. ఆ విధంగా కూడా జెక్సీస్ కు, అతడి బానిస సేనకు, స్పార్టన్స్ అంటే ఎంత భయమో తెలుస్తుంది. అదీ ’శతృవును భయపెట్టటం’ అంటే!

ఇక జెక్సీస్ సేనలు ఎంతగా బానిసలంటే - కొరడా దెబ్బలకి భయపడి వెనుక నున్న వాళ్ళ ముందుకు తోస్తుంటే, యుద్దరంగంలో శతృవుకెదురుగా ఉన్న ముందటి వరసలోని వాళ్ళు ’ఒద్దు’ అంటూ గగ్గోలు పెడుతుంటారు. మరో సన్నివేశంలో... భూకంపమే వస్తోందా అన్పించినంతగా అపారమైన జెక్సీస్ సేనలు దాడి చేసినప్పుడు, స్పార్టన్లు తమ కత్తీ డాలులతో స్పందించిన తీరు, పోరాడిన వైనం, రజోగుణస్పోరకమై అద్భుతంగా ఉంటుంది. "స్పార్టన్స్! దాడి చేయండి" అనేటప్పుడు లియోనైడర్స్ గొంతు నాళాలు ఉబ్బుతుండగా, గర్జించే సింహంలాగా, ఉరిమే మబ్బులాగా, ఆ స్వరం ప్రేక్షకులని కూడా రోమాంచిత రజస్సులోకి తీసుకు పోతుంది.

మీదపడిన శతృమూకల్ని వెనక్కి తోస్తూ "ఒక్కరినీ విడిచి పెట్టకండి. వెనక్కి తొయ్యండి" అంటూ స్పార్టన్లు, ఒకరి కొకరు హెచ్చరించుకుంటూ యుద్దం చేస్తుండగా.... జెక్సీస్ బానిస సేనల్ని వెనక్కి తోస్తూ స్పార్టన్లు! వాళ్ల కాళ్ళక్రింద పొరలుగా రేగుతూ ఇసుకా, మట్టి!

ఆ దృశ్యం లో ఉన్న భావపు విలువల్ని నా కలం కంటే, సియాచిన్ లో దేశ సరిహద్దులకి కావలి కాస్తూ, పహారా తిరుగుతున్న సైనికుడి పదఘట్టన మరింత బాగా విడమరిచి చెప్పగలదు. మంచుని సైతం గడ్డకట్టించే కర్తవ్య దీక్ష అది! కార్గిల్ లో, దేశపు ఎల్లలు దాటి పాకిస్తాన్ ముష్కరులు దేశంలోకి చొచ్చుకు రాకుండా నిరోధిస్తూ, శతృమూకల్ని వెనక్కి తోస్తూ పోరాడిన సైనికుడి ఊపిరి, కారిన రుధిరం మరింత విశదంగా చెప్పగలదు. దేశ భూభాగపు రక్షణకి భుజానికెత్తుకున్న ఆయుధం అది!

అప్పుడే కాదు, జెక్సీస్ సేనల గురించి "వారికి దాహం వేస్తున్నట్లుంది" అంటాడు స్పార్టా యోధుడు. "అయితే వాళ్ళకి సహాయం చేద్దాం" అంటాడు లియోనైడర్స్. స్పార్టన్ యోధులు వాళ్ళని మృత్యులోయలోకి తోసేస్తారు. మరోసారి లియోనైడర్స్ శతృసైనికుణ్ణి చూపుతూ దళపతితో "వాడు కొనఊపిరితో ఊగుతున్నాడు" అంటే, దళపతి వాణ్ణి బరిసెతో గుచ్చి "ఇక ఊగడు" అంటాడు. యుద్దక్రీడ అది. అంతగా యుద్దాన్ని, ఇష్టంగా ఆస్వాదించాలంటే ఆ యోధులకి అంత కంటే ఎక్కువగా మాతృదేశం పట్ల ప్రేమ, స్వాతంత్రం పట్ల మక్కువా ఉండాలి.

అచ్చంగా.... ముంబాయి ముట్టడిలో పాక్ తీవ్రవాదులని మట్టుబెట్టడానికి వెళ్ళిన కమెండోలు, ఆపరేషన్ పూర్తయి, ఢిల్లీ తిరిగి వెళ్ళాక.... "సార్! మేం వచ్చేసాం" అంటూ తమ పై అధికారికి నవ్వుతూ రిపోర్టు ఇచ్చినట్లుగా!

ఇంకా.... ఒక చెవి తెగిన కమెండో, అది తమ పైఅధికారికి చూపిస్తూ.... "సార్! ఇక నా భార్య నా చెవి మెలి వెయ్యలేనందుకు సంతోషిస్తున్నా!" అంటే, మరో కమెండో "మిత్రమా రెండవ చెవి ఉన్నది జాగ్రత్త సుమా!" అని చతురోక్తి విసిరేంతగా!

ఇలాంటి మరో సన్నివేశమే - యుద్దరంగంలో దళపతీ, అతడి కుమారుల సంవాదాలు. శతృవుని దునుమాడి "చూశావా నా సత్తా" అని పుత్రుడంటే "నీకీ విద్య నేర్పింది నేనేగా?" అంటాడు తండ్రి. "నువ్వేనాడు ఒప్పుకున్నావ్ గనక" అని పరిహాసాలాడుకుంటూ, ప్రాణాపాయమైన రణాన్ని అనురక్తితో ఆస్వాదించే క్రీడగా పోరాడటం! ఎన్నడూ తనని మెచ్చని తండ్రి! "మనం సాధించాం" అంటూ మెచ్చినందుకు ఆనందంగా చూస్తున్న కుమారుడు! అదే ఆఖరి క్షణమై, తండ్రి జాగ్రత్త చెబుతుండగానే తల ఉత్తరించబడి, పెనువృక్షం నేలకూలినట్లుగా కుప్పకూలిపోగా... ఆ దృశ్యం చూసిన తండ్రి కళ్ళల్లో బాధ, ఆక్రోశం, దుఃఖం! ఆ సన్నివేశంలో దళపతి పాత్రధారి చూపిన నటన, కళ్ళల్లో పలికించిన భాష సజీవమైనవి.

"పుత్రవియోగంతో చింతిస్తున్నావా?" అన్న లియో నైడర్స్ ప్రశ్నకు "చింతా? ప్రతీకారం తప్ప వేరే ఆలోచనేదీ లేదు" అంటాడు. "మాతృదేశ రక్షణకై ప్రాణాలర్పించాడు నా కుమారుడు. ఆ క్షణం కోసమే నేనూ ఎదురు చూస్తున్నాను" అంటాడు. రక్తి పిపాసిలా శతృవులని చీల్చి చెండాడతాడు. ’ఆ రోజూ స్పార్టన్ల విజయానికి చెందినదే, అయినా శశ్మాన నిశ్శబ్దం’ అంటాడు వ్యాఖ్యాత!

"మా పయనం.... దేశం కోసం, స్వాతంత్రం కోసం, సహజీవనం కోసం" అంటూ బయలుదేరి, స్వచ్ఛందంగా నిర్ద్వంద్వంగా పోరాడి, ఒక మహోన్నత లక్ష్యం కోసం కొడుకు ప్రాణాలర్పిస్తే... ఆ వ్యధ, క్షోభ ఎలా ఉంటాయో, అయినా వెనుకడుగు వేయని దీక్ష ఎలా ఉంటుందో.... సందీప్ లని పోగొట్టుకున్న ఉన్ని కృష్ణన్ లని అడిగితే తెలుస్తుంది.

"నాకు మరో కొడుకు ఉంటే, అతణ్ణి పంపడానికీ సిద్దమే" అనే వీర జవానుల తల్లిదండ్రుల నడిగితే తెలుస్తుంది. అశోక చక్రలూ, పరమ వీర చక్రలూ వంటి ఆవార్డుల కోసం సైనికుల ప్రాణాలర్పించరు. దేశ గౌరవం కోసం, భూమి కోసం ప్రాణాలర్పిస్తారు. తాము పోయాక అచ్యుతానన్ లూ, మన్మోహన్ లూ, సోనియాలూ ఇచ్చే అవార్డులు, కితాబులు వారికి లెక్కకాదు. యుద్దభూమిలో అవేవీ గుర్తుకూ రావు!

ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. గత నెలలో రాష్ట్ర రాజధాని నగరంలో వైమానిక దళానికి చెందిన కార్యక్రమాలు కొన్ని జరిగాయి. ఆ సందర్భంగా ప్రసారమైన డిడి కార్యక్రమంలో, వైమానిక దళ అధికారి [ఆయన పేరు స్పష్టంగా ప్రసారం చేయలేదు. డిడి కార్యక్రమాలలో గుర్ర్ ర్ ర్ అంటుంది కదా!] తమ గురించి చెబుతూ "జీతపు స్కేలు, సౌఖ్యాలు - ఇలాంటి ఆలోచనలుంటే ఈ రంగంలోకి రావద్దు. సాహసం, ధ్రిల్, దేశం కోసం పనిచేయటంలో ఆనందం - ఇలాంటి ఆలోచనలున్న వాళ్ళకి ఇది చక్కని జీవితం" అన్నాడు. ఆ ముఖంలో ఎంతో దీప్తి, తృప్తి!

అవును. మనం జీవించేది ఆనందం కోసం. ఇష్టమైన తిండి తింటే, ఒక విజయం సాధిస్తే.. ఒక వస్తువు సంపాదిస్తే.... ఆనందం!

"ఈమె నా భార్య. వీళ్ళు నా పిల్లలు" అనుకుని వాళ్ళని సంరక్షించడం గృహస్తుగా ఆనందం.

అలాంటి చోట "ఇది నా దేశం" అనుకుని మాతృభూమి రక్షణ కోసం పోరాడటం సైనికుడికి ఆనందం.

"ఇది నా దేశం. ఇది నా మతం. ఇది నా సంస్కృతి" అనుకునే స్థితికి ప్రతి పౌరుడు ప్రయాణిస్తే... అప్పుడు ఆ దేశం స్వర్గధామం, సురక్షితం! దాన్నే స్పార్టన్లు చూపించారు. స్పార్టన్ల మీద మత పెద్దలు, మంత్రి, అతడి అనుయాయూలూ కుట్రలు చేయక పోలేదు. జెక్సీస్ దూతలతో లాలూచీ పడిన స్వార్టా మంత్రి తెరాస్, మత పెద్దలకీ జెక్సీస్ దూతలకీ నడుమ మధ్యవర్తిగా వ్యవహారించాడు.

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ఇలాగే పనిచేస్తుంది. ఒక వ్యక్తినీ, ఒక గుంపునీ ప్రభావపరచాలంటే, వాళ్ళ కంటే పైవాణ్ణి ముందుగా లోబరుచుకుని, అతణ్ణే మధ్యవర్తిగా నియోగిస్తుంది. అందుకోసమే నీచులనీ, అవినీతిపరులనీ పైకి తీసికెళ్ళి అధికారంలో కూర్చోబెడుతుంది. అంటే ఓ ఉద్యోగిని ప్రభావపరచాలంటే, సామదాన భేద దండాలలో ఏది ఉపయోగించి ప్రభావ పరిచినా, అందుకు పైఅధికారి ప్రమేయమూ, మధ్యవర్తిత్వమూ జోడింపబడుతుంది.

నిజానికి 300 యోధులు సినిమాలో స్పార్టన్లుగా వ్యవహరించబడింది, కేవలం స్పార్టాకి సంబంధించి మాత్రమే కాదు. స్వేచ్ఛని కోరే ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది. కార్పోరేటు బానిసత్వంతో పాటు, ఏ బానిసత్వాన్నైనా వ్యతిరేకించే, దోపిడిని ప్రతిఘటించే.... ప్రతి దేశానికీ స్పార్టా ప్రతీక! పాకిస్తాన్ లో ప్రస్తుత ఐఎస్ ఐ కీ, మాజీ సైనికాధికారులకీ, తాలిబాన్లకీ వ్యతిరేకంగా ప్రతిఘటించ అభిలషించే పాకిస్తానీయులు స్వల్ప సంఖ్యలోనే ఉండొచ్చు గాక, పాకిస్తాన్ గడ్డ పట్ల నిబద్దత గల ఆ స్వల్ప సంఖ్యలోని పాకిస్తానీలతో సహా, ఏ దేశమైనా స్పార్టాకి ప్రతిరూపమే! ఒక్కమాటలో చెప్పాలంటే - ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశం నుండీ నెం.5 వర్గంలో పని చేస్తున్న వాళ్ళు స్పార్టన్ యోధులకి ఆత్మస్వరూపులే!

ఈ సినిమాలో మరొక రసవత్తరమైన గొప్ప సన్నివేశం - జెక్సీస్, లియోనైడర్స్ ల సంభాషణ!

జెక్సీస్... పారశీక దేశపు రాజు. ఒకప్పుడు పారశీక మని పిలవబడిన ప్రాంతం ఇప్పుడు టర్కీగా, ఇరాన్ గా పిలవబడుతుంది. టర్కీ ఒకప్పుడు ముస్లింల సామ్రాజ్యం. [వీళ్ళని పార్శీలంటారు. టాటాలు పార్శీ వాళ్ళే. బ్రిటీషు హయాంలో, అంతకు మునుపు ఢిల్లీ మొగలాయిల హయాంలో చాలామంది పార్శీలు భారతకు వలస వచ్చి స్థిరపడ్డారు.]

ఇక జెక్సీస్ పాత్రధారి ఆహార్యమూ[అంటే వేషధారణ] దేహ భాష, స్త్రీపురుషులకు మధ్యస్తంగా నపుంసకుడిని గుర్తుకు తెస్తున్నట్లుగా ఉంటుంది. లియోనైడర్స్, జెక్సీస్ లు.... వేషధారణలో పూర్తి వ్యతిరేక బిందువుల్లా ఉంటారు. ముక్కుకు ముక్కెర, తల నుండి చెవిదాక అలంకరించుకున్న రకరకాల గొలుసులు, కంఠాభరణాలూ, హస్తాభరణాలతో, కంటికి కాటుకా గట్రాలతో జెక్సీస్ భారతదేశం లోని గ్రామీణ అనాగరిక మహిళలా ఉంటాడు. [మా ఊళ్ళో గడ్డికోసుకు వచ్చే మహిళల్లో చాలామందికి ఇవే ముఖకవళికలు ఉన్నాయి. వాళ్ళెవరికైనా ముఖాన్ని అతడికిలాగే అలంకరిస్తే తేడా ఉండదు.] దీన్నే ధృవీకరిస్తూ లియోనైడర్స్ "నేను మగవాళ్లతో మాత్రమే చేతులు కలుపుతాను" అంటాడు.

స్త్రీ అయినా, పురుషుడయినా ధైర్యంగా యుద్దం చేయటం వీరత్వం అన్పించుకుంటుంది. భయాన్ని, ప్రలోభాలనీ ఉపయోగిస్తూ, లంచాలిచ్చి ఇతర దేశాల్లో వ్యక్తుల్ని లోబరుచుకుంటూ కుట్రలు పన్నటం నపుంసకత్వమే! శారీరకంగా కాదు, ఇది ఖచ్చితంగా మానసిక నపుంసకత్వం.

ఇక, అసలు జెక్సీస్ ని చూడగానే లియోనైడర్స్ "నా ఊహే గాని నిజమయితే నీ పేరే జెక్సీస్" అంటాడు. జెక్సీస్ లియోనైడర్స్ మీద భయ ప్రలోభాలని ఒకేసారి ప్రయోగిస్తూ... "నన్ను ఎదురించడం చిన్న సైన్యంతో నీకు సాధ్యం కాదు. నాకు సామంతుడివైతే నీకు సకల భోగాలూ అనుగ్రహిస్తాను. నన్ను కాదన్న వాళ్ళు ఇప్పటికే మట్టిగొట్టుకుపోయారు. అలాంటి వాళ్ళ కంకాళాలతోనే ఈ రధం నిర్మించబడింది" అంటూ తన భారీ రధాన్ని చూపుతాడు.

లియోనైడర్స్ అలవోకగా నవ్వుతూ "నన్ను కంకాళాలు భయపెట్టలేవు" అంటాడు. చావుని లెక్కచేయని వీరుణ్ణి, చచ్చిన వాడి కపాలం ఏ పాటి భయపెడుతుంది? మనిషికి తన ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఉద్యోగం, సంపద,..... ఏదీ! అలాంటి ప్రాణాన్ని ఫణంగా పెట్టిన వాడు మరిక ఏం పోతుందని భయపడతాడు? ’జాతస్యః ధృవో మృత్యుః’ అనుకుంటే ’హతోవా ప్రాప్య సే స్వర్గం’ అనుకుంటే.... ప్రతి పౌరుడూ, ప్రతివ్యక్తీ ఒక లియోనైడర్సే!

ఈ సమాధానికి ఛర్రుమన్న జెక్సీస్ "నన్నెదిరించి పోరాడిన వాళ్ళు లేరు. నా సేనకి ఎవరూ ఎదురు నిలబడలేరు. ఆపైన నీ దేశంలోని ఆడవారి పరిస్థితి ఆలోచించు" అంటాడు. లియోనైడర్స్ "మా దేశపు ఆడవాళ్ళు సంగతి ఇప్పుడెందుకులే! నీ దగ్గరున్న బానిసల కంటే వారికి వీరం ఎక్కువ" అంటాడు. ఈ దృశ్యం చూస్తూ, డైలాగ్ వింటున్నప్పుడు.... రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీభాయి, ఇందిరాగాంధీ వంటి భారతీయ యోధులు గుర్తుకు వచ్చారు. వీరందరికీ మూలశక్తి, మహిషాసుర మర్ధని, ఆ ఆదిపరాశక్తి కళ్ళముందు కదలాడింది. లియోనైడర్స్ అంతటితో ఆగడు. "నీ దగ్గరున్న వారు బానిసలు! యోధులు కాదు. నీ కొరడా దెబ్బలకి భయపడి వాళ్ళు యుద్దానికి వచ్చారు" అంటూ వాస్తవాన్ని ఎత్తి చూపుతాడు.

దాంతో వాదన మార్చి జెక్సీస్, ఈ సారి "ఈ సమస్త గ్రీకులకీ నిన్ను సామంత రాజుని చేస్తాను. నీ విరోధులయిన ఎధీనియన్లని నీ ముందు మోకాలి దండ వేయిస్తాను. నీకు సకల సంపదలూ ఇస్తాను. నువ్వు నాముందు మోకాలి దండవెయ్యి" అంటాడు.

ఇక్కడ అచ్చంగా కనబడేది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల పనితీరే! ఆద్యంతమూ, ప్రతీ సీన్ లోనూ, కథలోని ప్రతి అంశంలోనూ ఈ సారూప్యత అనుశృతంగా ఉంది. జెక్సీస్ ముందు భయపెట్ట ప్రయత్నించాడు. సాధ్యం కానప్పుడు ప్రలోభపెట్ట ప్రయత్నించాడు. చివరికి 300 సినిమాలోని యుద్దపు చివరి సీన్ లో కూడా, గూనివాడి సహితంగా జెక్సీస్ దూత చెప్పేది కూడా ఇదే. వీలైతే భయపెట్టడం, కుదరకపోతే ఆశపెట్టటం.

ఎప్పుడైనా వాళ్ళ తీరు అదే! ముందు భయపెడతారు. ఎదుటివాడు భయపడలేదనుకొండి. తర్వాత ప్రలోభపెడతారు. ఆశకు పడిన వాణ్ణి మెల్లిగా బానిసని చేసుకుంటారు. తర్వాత కొరడాదెబ్బలూ మామూలే, పీక కత్తిరించడాలూ మామూలే!

చిన్న ఉదాహరణ చెప్పాలంటే - గత కొన్నేళ్ళల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థ గుంటూరులో మిగిలిన చిన్న చిన్న విద్యాసంస్థల్ని సంలీనం చేసుకుంది. సురేష్ కోచింగ్ సెంటర్, విజ్ డం గట్రా..... వాళ్ళ విద్యాసంస్థల్ని టేకోవర్ చేస్తున్నప్పుడు సదరు సురేష్ లకీ, ఎంకేఆర్ లకీ స్వాగతం చేబుతూ, ’ఈనాటి నుండి మా అపూర్వ ఫ్యాక్టల్టీలో ఈ గౌరవనీయులు కూడా చేరుతున్నారంటూ’ అర్ధపేజీ/పూర్తిపేజీ ప్రకటలిచ్చిన శ్రీ చైతన్య బీఎస్ రావు, నెలలు తిరిగేటప్పటికి ’శతకోటి లెక్చరర్లలో మీరో బోడిలెక్చరర్’ అన్న డీల్ చూపటమూ, కోరలు పీకి కూర్చోబెట్టటమూ మామూలే! కాకపోతే ఇది కెరీర్ పరంగా కోరలు పీకటమన్న మాట.

అచ్చంగా ఇలాగే.... జెక్సీస్, ఇప్పుడు కొరడాలతో కొడుతున్న బానిసలనైనా, ఒకప్పటి రాజులనైనా, ఇప్పుడు ఓటమి వార్త తెచ్చినందుకు పీక కోసి, మరణాన్ని ప్రసాదించిన వాళ్ళనైనా.... లొంగ దీసుకునే రోజు ఇప్పుడు లియోనైడర్స్ కి ఇచ్చిన ఆఫరే ఇచ్చి ఉంటాడు కదా! మొదట సామంతు వంటాడు, ఆపైన నువ్వు ఓ దళపతి వంటాడు, ఆ తర్వాత నా కాలి క్రింద పీట వంటాడు. చరిత్రలో చూసుకున్నాకూడా కనిపించేది ఇదే! ఒకప్పుడు బ్రిటన్, నాజీజంతో హిట్లర్, కమ్యూనిజంతో రష్యా, కాపిటలిజంతో ఆమెరికా, ఎలక్ట్రానిక్స్ లో జపాన్, ఇప్పుడు చైనా! తాలిబానిజంతో ముస్లింలు! ముందు అకాశానికెత్తడం తరువాత ఎత్తి కుదేయటం.

అందుకే నెం.5 వర్గం ఓటమి స్ట్రాటజీని ఎంచుకున్నది. అందుకే, ప్రజలలో తామసం నశించి, రజోగుణం రగలటం తప్ప మరో మార్గాంతరం లేదన్నదీ! ఉన్నవి రెండో దారులు - పోరాటం లేదా బానిసత్వం. మరో మాటలో చెప్పాలంటే అవినీతిపై పోరాటం లేదా అవినీతిలో పొర్లాడటం.

పోరాడతావా కార్గిల్ కి రా! పొర్లాడతావా కార్చిచ్చులోకి పో! బానిసత్వం కార్చిచ్చు వంటిదేనన్న విషయం బానిస సంకెళ్ళు తగిలించుకున్నాక ఖచ్చితంగా అర్ధమైతీరుతుంది. ఇక ఇక్కడ కార్గిల్ దేశ సరిహద్దుల్లో లేదు, ప్రతిమనిషి నడి జీవితంలో ఉంది.

ఎంత కాలం ఓర్చుకుంటూ, రాజీపడుతూ, పోరాటానికి భయపడుతూ బ్రతుకుతారు ఎవరైనా....? తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఉపముఖ్యమంత్రి అయిన స్టాలిన్ దంపతుల పెళ్ళిరోజు కానుకగా, తమిళ భక్తులు వెయ్యిరూపాయల నోట్లతో కోటి రూపాయల విలువైన దండవేయటంతో ప్రారంభమై.... యూపీ మాయావతి మెడలో దండ పదిహేనో ఇరవయ్యో కోట్లయి కూర్చొంది.

ఓ ప్రక్క, ప్రజలు పదిరూపాయలు, ఓ స్టీల్ పళ్ళెం, గ్లాసూ, ఓ లడ్డూ, ఓ చేతి రూమాలుతో వస్తుదానం, అన్నదానం చేస్తామని, ఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిగారు ప్రకటిస్తే, సదరు స్వామి ఆశ్రమంలో పదివేల మంది గుమిగూడి, తొక్కిసలాటలో 71 మంది ప్రాణాలు కోల్పోయేంత గర్భదారిద్ర్యం తాండవిల్లుతుండగా....

మరోప్రక్క, దోచుకునేందుకు బడా కాంట్రాక్టులూ, ఉన్నతోద్యోగ పదవులూ, లాభసాటి పోర్టుపోలియోలు, పదవులూ దక్కిన మాయావతి భక్తులు, తమ అభిమానాన్ని భారీ కరెన్సీ దండలుగా బాహాటంగా సమర్పిస్తున్నారు. వీళ్ళంతా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తుల బానిసలే! బాస్ కి కాళ్ళుపట్టి, క్రింది వాళ్ళ చేత కాళ్ళుపట్టించుకునే బానిసలు!

ఇప్పటికీ నిట్టూర్పులు విడుస్తూ "ఏం చేస్తాం? ఎవరూ ఈ దేశాన్ని కాపాడలేరు" అని ఆక్రోశిస్తూ.....! చూద్దాం, తామసపు హద్దులు ఎంత లోతుగా విస్తరించాయో! ఇక ఈ విషయం ఆపి, జెక్సీస్ లియోనైడర్స్ ల సంవాదం దగ్గరికి తిరిగి వస్తాను.

జెక్సీస్ ప్రతిపాదనకి లియోనైడర్స్ "అద్భుతమైన ప్రతిపాదన. నాకు తెలిసి ఎంత మూర్ఖుడు కూడా దానిని కాదనడు. కాని సమస్య ఏమిటంటే నీ బానిసల్ని హతమార్చి హతమార్చి నా తొడ నరాలు బెణికాయి. అంచేత మోకాలి దండ వేయమన్నావు చూడు, అది కుదరని పని" అంటాడు. "ఈ యుద్దం ముగిసే లోగా నువ్వు రక్తం చిందించడం తధ్యం" అని హెచ్చరిస్తాడు. చిత్రం చివరిలో యుద్దరంగంలో లియోనైడర్స్ విసిరిన ఈటె కుడి చెంపని చీల్చుకు పోగా, చిందిన రక్తాన్ని చేత చూసుకుని, జెక్సీస్ ఎంతగా భయభ్రాంతుడవుతాడో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు చిత్రదర్శకుడు.

పరిశీలించి చూస్తే, జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయుల నైజం 70 MM లో కన్పిస్తుంది. ఎలాగంటే….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu