1992 లో పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చే వరకూ నా జీవితం వేరు. ప్రేమాభిమానాలతో చుట్టుకున్న కన్నవాళ్ళు తోబట్టువులు, ఆత్మీయులు, బంధుమిత్రులూ అన్నీ ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులున్నా.... సమాజంలో గుర్తింపు ఉంది. మహిళా పారిశ్రామిక వేత్తగా నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిపించుకున్నాను. నా acadamic career record గురించి మండలి కృష్ణారావు ద్వారా విని, నన్ను ఇంటర్యూ చేసి, ప్రారంభోత్సవానికి ఒప్పుకొంది. ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా తదుపరి గవర్నర్ కృష్ణకాంత్ నుండి బహుమతి అందుకున్నాను. అది టీవీలో ప్రసారమైనప్పుడు ఎంతో సంతోషపడ్డాను. అప్పుడప్పుడూ నా గురించి పత్రికలలో రావటం, ఒక హోదా, గుర్తింపు ఉండేవి.
బ్యాటరీ తయారీలో, గ్యాస్ వెల్డింగ్ దగ్గరి నుండి అసెంబ్లింగ్ దాకా అన్ని పనులూ నేర్చి ఉన్నాను. నా తమ్ముళ్ళిద్దరూ అన్ని విషయాలలో నాకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. APSRTC లో బ్యాటరీ Trail order అడగటానికి వెళ్ళినప్పుడు.... అప్పటికి హెచ్.జె.దొర RTC కి MD గా ఉండేవారు. ఆయనని కలిసి, నా సంస్థ గురించి ఉత్పత్తి గురించి చెబుతూ, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తాలూకూ ఫోటో ఆల్బంలోని ఫోటోలు చూపించాను.
ఆయన నవ్వుతూ "మీ బ్యాటరీ గురించి చెబుతూ గవర్నర్ ఫోటోలు చూపిస్తున్నారు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు" అన్నాడు. నేనూ చిరునవ్వుతోనే "నా కంటే నా బ్యాటరీలు బాగా మాట్లాడగలవు సర్![I think my batteies can speak will than myself sir]" అన్నాను. ఆయనెంతగా ఇంప్రెస్ అయ్యాడంటే, అప్పటికప్పుడు 100 బ్యాటరీలకు order ఇచ్చేసారు. అంతటి ప్రోత్సాహం, నేను అప్పట్లో ఉన్నతాధికారుల నుండి అందుకున్నాను.
అప్పుడే కాదు. APSFC లో కూడా! ఖాయిలాపడిన ఐస్ ఫ్యాక్టరీని బహిరంగ వేలంలో కొని బ్యాటరీ ఫ్యాక్టరీగా మార్చుకున్నాను. యండమూరి ’డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’లో హీరో గాంధీ పదిపైసలు పెట్టుబడితో కెరీర్ ప్రారంభిస్తే, నేను అది కూడా లేకుండా ప్రారంభించానని జోకులు వేసేదాన్ని. అంతగా... నా పెట్టుబడి ఏమీ లేకుండానే, బంధుమిత్రుల నుండి ఋణాలు తీసుకొని, పాతఫ్యాక్టరీని కొనటం ద్వారా వచ్చిన Advantage నుండి, బ్యాంకుల్లో ఋణాలు తీసుకొని అప్పట్లోనే [1989 లో] 45 లక్షల రూపాయల విలువైన ఫ్యాక్టరీ స్థాపించాను. ఇది నా స్వంత డబ్బాకొట్టుకోవటానికి వ్రాయటం లేదు. అప్పట్లో ప్రభుత్వాధికారుల నుండి సహాయప్రోత్సాహాలు అందుకున్నందుకే, ఇదంతా చేయగలిగానని చెప్పడానికి వ్రాస్తున్నాను.
APSFC లో అప్పట్లో దువ్వూరి సుబ్బారావు [ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు గవర్నర్] MDగా ఉండేవాళ్ళు. నా ఫైలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.... నేను 2 లక్షల సీడ్ కాపిటల్ లోన్ కు అప్లై చేసాను. దానికి 5 ఏళ్ళ మారిటోరియం ఉంది. 50% సబ్సిడీ ఉంది. సుబ్బారావు గారు నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తిరగేస్తూ... "ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు తయారు చేసారమ్మా?" అని అడిగారు. సీఏని అడిగితే పదివేలు అడిగినందున ప్రాజెక్ట్ రిపోర్ట్ నేనే తయారు చేసుకున్నాను. EDP [Enterpreneership Development Programe] లో మాకు PR ఎలా చేయాలో నేర్పారు.
మొత్తంగా అన్నీనేనే work చేసుకున్నాను, Typing సహా! బోటనీ రికార్డులాగా, పైన పువ్వుల బొమ్మలు అతికించి మరీ, అందంగా Present చేసాను. "నేనే తయారు చేసుకున్నాను సర్!" అన్నాను. అప్పటికి ఆయన నా Biodata చూస్తున్నారు. ’సైన్స్ అమ్మాయి ప్రొజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటమా’ అనుకున్నాడేమో దాదాపు 40నిముషాలు ఇంటర్యూ చేసారు. రకరకాలుగా అడిగారు. Break even point దగ్గరి నుండి Market Potential దాకా, Funds Flow దగ్గరి నుండి Sales criteria దాకా... అన్నీ!
నేనే తయారు చేసుకున్నందున అన్ని ప్రశ్నలకీ కమాండ్ తో జవాబిచ్చాను. మామూలుగా, ఎంత పెద్ద పార్టీ అయినా, SFC MD స్థాయిలోని IAS అధికారి పదినిముషాల కంటే ఇంటర్యూ ఇవ్వరు. అలాంటిది ఏకబిగిన 40 నిముషాలు మేము [నేను, నా తమ్ముడు] కాబిన్ లోనే ఉండే సరికి, బయటకొచ్చేసరికి స్టాఫ్ దగ్గర నుండి విజటర్స్ దాకా అందరూ అబ్బురంగా చూసారు.
అంతసేపు ఇంటర్యూ తర్వాత, ప్రొజెక్ట్ రిపోర్ట్ నేనే తయారు చేసానన్న నమ్మకం కలిగింది కాబోలు, ఎంతో మెచ్చుకొని, అప్పటికప్పుడు రెండులక్షల లోన్ శాంక్షన్ చేసారు. ఆ రోజెంత సంతోషించానో! APSFC head office లోని ఇతర ఉద్యోగులు కూడా నన్ను అభినందించారు.
మళ్ళీ 1991 లో, ASRTU [All India State Road Transports Undertaking] లో, నా బ్యాటరీ సంస్థ తాలూకూ టెండరు వేయటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు.... పని మీద కృషి భవన్ కో, నార్త్ బ్లాక్ కో[సరిగా గుర్తులేదు] వెళ్ళాను. అప్పుడు దువ్వూరి సుబ్బారావు గారు ఆర్ధిక శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వెళ్తుంటే ఆయన క్యాబిన్ కనిపించింది. నేను హైదరాబాద్ నుండి వచ్చానని, ఆయనని కలవాలని, విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. పర్పస్ ఆఫ్ విజిట్ పర్సనల్ అని చెప్పాను. తెలుగు వాళ్ళం కాబట్టి వెంటనే అనుమతి లభించింది.
ఆయన్ని కలిసి, 1989 లో నా ఫ్యాక్టరీ కి సీడ్ కాపిటల్ శాంక్షన్ చేసిన విషయం గుర్తు చేసి, మరోసారి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆయన నేను చెప్పిందంతా విని, తలూపి "ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు?" అని అడిగాడు. అంటే అంత పనిమాలా వచ్చి కలిసారంటే, ఏదో సహాయం కోసం అయి ఉంటుంది అని ఆయన ఉద్దేశం. నేను "నాకేం అవసరం లేదు సర్! అప్పుడు మీరు నాకు సీడ్ కాపిటల్ శాంక్షన్ చేసి encourage చేశారు. ఇప్పుడు నా యూనిట్ బాగానే నడుస్తోంది. ఇక్కడ ASRTU లో టెండర్ వేయటానికి వచ్చాను. మీరిక్కడన్నారని తెలిసి, ఒకసారి కనబడి, కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాను అంతే!" అన్నాను.
ఆయన ఎంతో సంతోషంగా - "డ్యూటీలో భాగంగా ఎన్నో చేస్తుంటామమ్మా! గుర్తించుకొని వచ్చి Thanks చెబుతున్నావు" అంటూ, నన్ను ఎంత ఆప్యాయంగా ట్రీట్ చేసారంటే, క్యాబిన్ బయటికొచ్చి వీడ్కొలు ఇచ్చాడు. వెంటనే అక్కడి సెక్యూరిటీ, ఇతర సిబ్బంది మమ్మల్ని [నేనూ, నా తమ్ముడు] ముందటి కంటే చాలా గౌరవంగా డీల్ చేసారు. అంతగా ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు, Good deal పొందేదాన్ని.
అలాంటిది..... 1992 తర్వాత, నా ప్రమేయం లేకుండానే అందరికీ శత్రువునయ్యాను. ఎంతో ఆత్మీయులనుకొన్న స్నేహితులు, బాల్యమిత్రులు సైతం, ఏ కారణం లేకుండానే ద్వేషం గుమ్మరిస్తూ మాట్లాడటమే కాకుండా ముఖమ్మీద తలుపులు వేసారు. ఒక్కసారిగా.... ఓటమి, ఒంటరితనం, నిలువ నీడలేని నిస్సహాయత! ఆ స్థితిలోనే ’దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు’ అనుకుంటూ శ్రీశైలం చేరాను. వెంట... వద్దన్నా, విడిచిపెట్టి పొమ్మని ఏడ్చినా, నన్ను వదలని లెనిన్!
తానే నా తోడూ నీడై, పెళ్ళి చేసుకుని పాతాళ గంగ మెట్ల మీద గుడిసెలో మళ్ళీ జీవితాన్ని ప్రారంభించాము. ఎందుకన్ని ఎదురు దెబ్బలు తగులు తున్నాయో తెలియదు. పీవీజీకి ఫిర్యాదు ఇవ్వటంతోనే జీవితం పెనుమార్పులకి గురయ్యిందన్నది మాత్రం అనుభవంరీత్యా బాగానే అర్ధమయ్యింది. దేశానికి మంచి జరుగుతున్నది అర్ధమయ్యేది. అప్పటి రోజుల్లోనే, ఈనాడులో, సిఐఏ ఏజంట్లుగా ఎలాంటి వాళ్ళని, ఎలా రిక్రూట్ చేసుకుంటుంది గట్రా వార్తలు ప్రచురింపబడేవి. అంటే, ఒకరకంగా మేము ఫిర్యాదు ఇచ్చిన విషయం గురించిన follow up తెలిసేది. మరి మా బ్రతుకులెందుకు ఇలా?... అన్నది అర్ధమయ్యేది కాదు. పోనీ పగ వాళ్ళయితే ప్రాణాలే తీస్తారు కదా అన్న సందేహం వదిలేది కాదు.
అయితే మా చుట్టూ, మా జీవితాల్లో జరుగుతున్న సంఘటనలకి ఒక శృతీ లయ, కన్పించేవి. అర్ధమయ్యీ కానట్లుండేది. గుడిసె లో నివాసం ఏర్పరుచుకోగానే రేషన్ కార్డ్ సిఐ రికమెండ్ చేస్తే, ఇంటికే కార్డు వచ్చింది. 20 kgల బియ్యం, కావలసినన్ని గోధుమలు వచ్చేవి. ఆ రేషన్ బియ్యం, గోధుమలు ఎంతో నాణ్యతతో ఉండేవి. ఎప్పటికప్పుడు ఆదాయం మాత్ర్రం ఏడు ఎనిమిది వందలు దాటేది కాదు. ఒక విద్యార్ది చేరితే మరో పాత విద్యార్ధి మానేసేవాడు. చివరికి... విద్యాబోధన మానేసుకున్నాము.
ఒకసారి వేధింపు తీవ్రంగా ఉన్నప్పుడు... అప్పటికి ఏడునెలలు గర్భవతిని. అప్పుటికి లెనిన్ ఓ నెలగా శ్రీశైలం ప్రాజెక్ట్ లో కంట్రాక్టర్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఉదయం ఏడుగంటలకి వెళ్తే రాత్రి 9 గంటలకి వచ్చేవాడు. ఈ ఒంటరితనానికి మరింత కృంగి పోయాను. పగలంతా ఇంటి దగ్గరే... సాయంత్రానికి గుడికి బయలుదేరేదాన్ని. తన కోసం ఎదురు చూస్తూ అమ్మవారి గుడి మెట్ల మీద కూర్చునేదాన్ని.
ఓ సారి గుడికి వెళ్లే ముందు మా పూర్వ విద్యార్ధి ఇంటికి వెళ్ళాను. నాకు గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం. నేను వెళ్ళేసరికి ఒక బేసిన్ నిండా వంకాయలు, కారం కూరి, దారం చుట్టి, వేయించడానికి సిద్దంగా ఉన్నాయి. ఆ వారంలో మరింతగా నేను ఎక్కడికి వెళ్ళినా తీపి తినుబండారాలు, నా కిష్టమైన పదార్ధాలు ప్రదర్శితమౌతూ ఉన్నాయి. అవి జరిపింపబడుతున్నాయన్న స్పృహ నాకు అప్పుడు తెలియదు. సహజంగానే అవి చూసినప్పుడు తినాలన్నా కోరిక కలిగేది. నాకు జిహ్వ చాపల్యం ఎక్కువ.[పాజిటివ్ కాప్షన్ అయితే రుచులు బాగా ఆస్వాదిస్తాను.] అందునా గర్భంతో ఉన్నందున గుత్తివంకాయలు తినాలని మరింతగా అన్పించింది.
అంతలో, ఆ తరువాత రోజుల్లో మా వారి ఉద్యోగం పోయింది. ఒక్కసారిగా ఎంత నిరాశా నిస్పృహలు ఆవరించాయంటే - ఆత్మహత్య చేసుకుందామని లోయ దాకా వెళ్ళాము. ఎంత ఏడ్చానంటే... ఏడ్చి ఏడ్చి వాంతి చేసుకుంటే గొంతునుండి రక్తం పడింది. తీరా చావాలంటే.... అడుగు ముందుకు పడలేదు. కడుపులో బిడ్డమీద అంతులేని ప్రేమ! నిజానికి నేను మొండిదాన్ని. మావారు నాకంటే మొండి. నా మొండితనం బ్రతికే వరకే! చావుకి తెగించాలంటే వెనకాడాను. తనైతే...."చావైనా బ్రతుకైనా నీతోనే! నువ్వు చనిపోదామంటే చావటానికి రెడీ! బ్రతుకుదామంటే బ్రతకడానికి రెడీ!" అన్నాడు. చావుకి తను సిద్దంగానే ఉన్నాడు. నాకే చచ్చే ధైర్యం లేకపోయింది. గుండె బరువు తీరే దాకా ఏడ్చి ఏడ్చి, మళ్ళీ కొండ ఎక్కి గుడిసెకి తిరిగి వచ్చాము.
మర్నాడు మా స్పోకెన్ ఇంగ్లీషు పూర్వవిద్యార్ధి [RMP Doctor], మాతో "మేడం! మీకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతాను. సున్నిపెంటలో, నిన్న ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని పాము పుట్టలో చెయ్యి పెట్టిందట. లోపలున్న పాము ఈ పిల్లని కాటు వెయ్యలేదు గానీ, ఆ పిల్ల వేలుని ఇలా కరిచి పట్టుకుందట మేడం! ఆ అమ్మాయి చెయ్యి బయటకు తీస్తే మోజేతి వరకూ చుట్టుకుని ఉంది. కోరలు గుచ్చకుండా ఆ పిల్ల వేలిని పట్టుకుంది తెలుసా!" అంటూ చెప్పాడు.
ఒక్కక్షణం! "ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటే... లోయలోకి దూకబోయి ఉంటే.... ఎవరైనా చూసి ఆపటమో గట్రా జరిగి ఉండేదేమో! చావకపోగా అల్లరి పాలయ్యే వాళ్ళం" అనిపించింది. తర్వాత ఇది కావాలని మాకు వినిపింపబడ్డ మాట అన్పించింది. "నువ్వు గాని ఆత్మహత్య చేసుకుందామనుకుంటే.... చావలేవు గానీ అల్లరి పాలవుతావు" అని హెచ్చరిస్తూన్నట్లపించింది. సున్నిపెంటలో ’అమ్మాయి - పాము ల ప్రమాదం’ గురించి తెలిసిన వాళ్ళని చాలామందిని అడిగాము. అందరూ "అవునా? మాకు తెలియదే!" అనేసారు. మా విద్యార్ధిని ’నీకెవరు చెప్పారు?’ అని నిలదీద్దామంటే, ఆ తర్వాత ఓ నాలుగు రోజులు అతడు దొరకనే లేదు.
ఇలాంటి చాలా సంఘటనలో... అప్పటికి పీవీజీనే ఇదంతా చేస్తున్నాడనుకున్నాము. కాకపోతే దేశానికి మేలు చేస్తున్నందున మమ్మల్ని వేధించాల్సిన అవసరం ఆయనకి లేదనీ అన్పించేది. మరి ఇదంతా ఎందుకు? అన్న ప్రశ్న మాత్రం నిరంతరం మమ్మల్ని వేధించేది. ఆ ప్రశ్నకు జవాబు దొరికేది కాదు. అప్పటికప్పుడు ఏదో కారణ చెప్పుకున్నా, అది తర్కానికి నిలబడేది కాదు. మరో కారణం వెదికేవాళ్ళం.
ఈ నేపధ్యంలో పీవీజీని భయంకరంగా తిట్టుకున్నాము. "పౌరధర్మం ప్రకారం నేను ఫిర్యాదు ఇచ్చాను. రాజధర్మం ప్రకారం ఆయన మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని మా తీరున వదిలేసినా బ్రహ్మండంగా బ్రతకగలం. అదీ చేయకపోగా వేధించటమా? భగవంతుడు క్షమించడు. దేవుడు నావైపే!" అనుకునేవాళ్ళం. భగవద్గీత ఎప్పుడు తెరిచిన, భగవంతుడు మాతోనే ఉన్నాడు అన్పించేది.
ఇక మా వారి ఉద్యోగం కూడా ఊడాక, ఆవని గడ్డ బయలు దేరాము. మండలి వెంకట కృష్ణారావుని కలిసి వివరాలు అడగాలన్నది మా అభిప్రాయం. అప్పటి సంఘటనల గురించి ’మా కథ’లో వివరించాను. అవనిగడ్డలో మండలి "ఒక వేళ నేదురుమల్లి జనార్ధన రెడ్డే మిమ్మల్ని వేధిసున్నాడేమో?" అన్నాడు. "అతడికంత సీన్ ఉంటే అతడి నియోజక వర్గంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఉండేవాడు" అని లెనిన్ అన్నాడు.
అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు మేము. పీవీజీకి ఇచ్చిన మా ఫిర్యాదులో నేను ’ఈనాడు రామోజీరావు, అతడికి సహాయ సహకారాలు అందించినందున తమిళనాడు సీఎం కరుణానిధి, మాజీ ప్రధాని వీపీ సింగ్, నాటి ఆంధ్రా సీఎం నేదురుమల్లి లని కలిపి దుష్టచతుష్టయంగా’ పేర్కొన్నాను. ’బహుశః నేదురుమల్లి అంటూ రామోజీరావు గురించి హింట్ చేయబోయినాడేమో మండలి’ అని 2005 తర్వాత అనుకున్నాము. అప్పటికైతే ఇదంతా పెద్దగా అర్ధం కాలేదు. మా దృష్టిలో భారత ప్రభుత్వం కంటే భారత గడ్డ పైన ఎవరూ బలవంతులు కారు.
ఆ తదుపరి పరిణామాలలో మా పాప పుట్టాక, మేం శ్రీశైలం వదలి ఫ్యాక్టరీ చేరాము. ఫ్యాక్టరీ ఖాళీ చేసినపుడు, మాకు తారసపడిన ప్రతీ ఒక్కరూ "1992, పీవీజీ కి ఇచ్చిన ఫిర్యాదు, రామోజీరావు - అవన్నీ మరిచి పొండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి" అని సలహా ఇచ్చారు. చివరికి ఐబి అధికారి కూడా ’Belive your fate' అన్నాడు. అందరూ ఒకటే చెప్పడంలోనూ ఏదో సారూప్యత, శృతీ లయ! అయినా మేమూ అన్నీమరిచి పోయేందుకే మొగ్గు చూపాము. ఎందుకంటే మరిచి పోవటమే మాకూ సుఖంగా అన్పించింది. అంతే!
1995 నుండి 2005 వరకూ, ’మేమూ, మా పాప, మా కెరీర్, దైవ భక్తి’ ఇది తప్ప ఏదీ ఆలోచించలేదు. తొలినాళ్ళలో కొన్ని నెలల పాటయితే భగవద్గీతను కూడా లోపల పెట్టేసాము. తర్వాత ’గీతసాధన’ జీవిత లక్ష్యం! దేశానికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు. కీడు చేయకపోతే చాలు! అనుకుని మళ్ళీ గీత చేతిలోకి తీసుకున్నాము. ఇదంతా ’మా కథ’లో కూడా వ్రాసాను.
అయితే,అప్పటికప్పుడు ఏం ఆలోచించకపోయినా, అన్నిటినీ క్రోడీకరించి విశ్లేషించుకునేటప్పుడు, 2005 తర్వాత ఇవన్నీ మాకు బాగా స్పురణ కొచ్చాయి. ఈ నేపధ్యంలో మేము తర్క వితర్కాలు చేసుకుంటూ వేసుకున్న ప్రశ్నలు - చెప్పుకున్న జవాబులలో ఎన్నో వైరుధ్యాలు కనిపించాయి.
మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నట్లు? - ఇది ప్రశ్న.
పీవీజీ, నెం.5 వర్గం మాకు గూఢచర్యం గురించిన అవగాహన, జ్ఞానం కలిగిస్తున్నారని రామోజీరావు బృందానికి, మా కంటే ముందుగానే అర్ధమైనందున, ఆ రహస్యాలేవో సోనియా, వై.యస్.లకు చెప్పాల్సిందిగా మాపై ఒత్తిడి నడిపించారు. - ఇది జవాబు.
అసలు తామే అన్ని నడుపుతున్నప్పుడు, వాళ్ళకి తెలియనివీ, మేం తెలియచేయవలసినవీ ఏముంటాయి? - అది మా సందేహం.
తామే పీవీజీ వారసులమనేటప్పుడు, అన్నీ వాళ్ళకే తెలిసి ఉండాలి కదా? పైగా, పీవీజీ మరణించినప్పుడు అంతగా అవమానించాల్సిన అవసరం ఏమిటి? అంత కడుపుమంట ఏమిటి? - ఇది ప్రశ్న.
అప్పటికి పీవీజీ కి ఎంత తెలుసో తమకీ అంచనా లేదయ్యె! దేశాన్ని దాటి, ప్రపంచం మీద నెం.5 వర్గానికి గూఢచర్య పట్టు కన్పించినా, ఆయన మరణంతో అన్నీ "హుష్ కాకీ!" అయిపోతాయనుకున్నారయ్యె! కాబట్టే ’ఇక చూస్కో నా తడఖా’ అనుకున్నారు. అదే, ఆ రోజు ఈనాడు వార్తల్లో చూపించుకున్నారు కూడాను. కాబట్టే నిర్మోహమాటంగా తమ అరిషడ్వర్గాలని ప్రదర్శించుకున్నారు - ఇది జవాబు.
పీవీజీ కూడా వీళ్ళ బాపతే అయితే - ఇప్పుడు ఈ సోనియాలు, తమని కలిసి మాకు తెలిసినవి చెప్పమన్నట్లే ఆయనా అని ఉండాలిగా! ఎప్పుడో మా పాప పసితనంలోనే, single childe ఇబ్బందులేవైనా మేం ఎదుర్కుంటున్నప్పుడు, ఈనాడు వసుంధరలో కౌన్సిలింగ్ వ్యాసాలు వచ్చినట్లు, కొత్త ఆలోచనలు రేకేత్తించినట్లు, పీవీజీ బ్రతికి ఉన్నరోజుల్లోనే, ఆయన్ని మేం కలిసేటట్లుగా provoke చేయబడే వాళ్ళం కదా! మాకు గూఢచర్యపు ఉనికి తెలిసినా తెలియకపోయినా, తలుపులు మూసిన గదిలో నుండి ఎటు ద్వారం తెరిచి ఉంటే అందులోంచి మాత్రమే బయటికి రాగలిగేటట్లు, తము గురిపెట్టిన వ్యక్తుల్ని [మమ్మల్ని] నియంత్రించగలరు కదా! అదేం జరగలేదే? - ఇది ప్రశ్న.
అసలు మొదట ఫిర్యాదు ఇచ్చిందే పీవీజీకి. ఆయనే గనక తమ బాపతు అయితే, అదెప్పుడో బుట్టదాఖలు అయ్యేది. తమకి ఈ బహిర్గతాలూ, సువర్ణముఖిలూ ఎందుకుంటాయి? మా చుట్టూ ఏదో మ్యాజిక్ సర్కిల్ ఎందుకు కన్పిస్తుంది? అదేదో తెలుసు కునేందుకు మా వెంట ఎందుకు పడతారు? మా చుట్టూ ఎందుకు తిరుగుతారు? - ఇది జవాబు.
అందుకే - ’మా చుట్టూ పీవీజీ ఏదైనా మ్యాజిక్ సర్కిల్ సృష్టించి ఉంటే దానికి మా నిమిత్తంగానీ, బాధ్యత గానీ ఏవీ లేవని’ 2005, 2006 లలో, ప్రధాని మన్మోహన్ సింగ్ కి, సోనియాకి, రాష్ట్రపతి APJ కలాంకి పంపిన ఫిర్యాదులలో వ్రాసాము కూడా!
నిజానికి ఇందరు మన వెంటపడుతున్నారంటే, మన దగ్గర ఏదో ఉండి ఉండాలి? అనుకున్నాకే మా పరిశీలన కి ఓ రూపం వచ్చింది. అంతకు ముందంతా ఏది జరిగినా ’విధి వ్రాత’ అనుకునే వాళ్ళం. ఇదంతా అర్ధమయ్యాక, ఇది విధివ్రాత కాదనీ, ’యుద్దరీతి’ అనీ అర్ధమైంది. Trojan War లో అకలీస్, అంగమొమ్మన్, యుల్సెస్ లు అనుకుంటారు చూడండి - జీవితంలో సురాపానం, సుదంరాంగులతో రసమయ జీవితం కంటే కూడా యుద్దంలో పరాక్రమం చూపటమే మజా అని!
గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి
శ్లోకం:
స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ర్ఛేయో2న్యత్ క్షత్రియస్య నవిద్యతే
భావం:
నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తే అందులో సంశయానికి తావుండదు. క్షత్రియులకు యుద్దమే శ్రేష్ఠ ధర్మం.
శ్లోకం:
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతం
సుఖినః క్షత్రియాః పార్ధ లభంతే యుద్ద మీదృశం
భావం:
ఆయాచితంగా తెరుచుకున్న స్వర్గద్వారాల వలె, యెంతో అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే యిటువంటి యుద్దాలు లభిస్తాయి.
ఇది అర్ధమయ్యాక జీవితం పట్ల మా దృక్పధం మారిపోయింది. శివరాత్రికి శ్రీశైలంలో పూసలు అమ్మటానికి వచ్చిన వాళ్ళు రోడ్డుప్రక్కనే నివసిస్తారు. ఒకరోజు వాళ్ళు చేపల కూర వండుకుంటూ కనిపించారు. చాలా రద్దీగా వ్యాపారం కూడా ఉన్నది. వాళ్ళు అలా వండుకోవటం చూసి నేను, మావారు ’వాళ్ళు చూడు అంత వ్యాపారం ఉన్నా, రోడ్డుప్రక్కనే ఉన్నా వాళ్ళేనయం చేపల కూర వండుకుంటున్నారు. అదేమనమయితే తినడానికి కూడా ఒక ప్రత్యేక పరిస్థితి, మూడ్ ఉండాలి’ అనుకున్నాము.
వెంటనే మా యిద్దరికీ స్పురించింది. "వాళ్ళు ఎప్పుడూ రోడ్డుప్రక్కనే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తారు. అలాంటప్పుడు వండుకు తినటానికైనా, రుచిని ఆస్వాదించటానికైనా వాళ్ళకు ప్రత్యేక సమయం అంటూ ఎక్కడిది అన్పించింది. అంతే! అదే మా జీవితానికి అప్లై చేసుకుంటే, ఎప్పుడూ సీరియస్ గా, complaints గురించి ఆలోచిస్తూ, సరదాగా ఉండటానికి ప్రత్యేకం సమయం కావాలి అనుకుంటాము. అలాగే మనం కూడా యుద్దమే జీవితం అని ఎందుకు అనుకోకూడదు?" అనుకున్నాం. అంతే జీవితంలోనే, ఒక్కసారిగా వత్తిడి మొత్తం రిలీవ్ అయిపోయింది.
మా దృక్పధం ఎంతగా మారిపోయిందంటే - శ్రీకృష్ణ దేవరాయలు యుద్దానికి వెళ్ళేటప్పుడు, ప్రతీరోజూ రణరంగంలో, యుద్దానంతర విరామ సమయంలో సేదతీరటానికి, వెంట కవిగాయకులని కూడా తీసికెళ్ళేవాడట. అలాగే మేమూ ఈ యుద్దంలోనే వినోదించటం, జీవించటం నేర్చుకున్నాము. మా జోకులు కూడా దీనికి సంబంధించే ఉంటాయి. రాజకీయనాయకులు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు, ఒక్కోరంగంలో అవినీతి బహిర్గతం అవుతున్నప్పుడు, ఇలా రకరకాలుగా దేశానికి సంబంధించి సంతోషించే సంఘటనలు!
అలాగే 1992 ముందు, తరువాత ఏఏ రంగాలలో మన విజయాలు సాధించామో ఆలోచించేవాళ్ళం. శాటిలైట్ టెక్నాజిలో మనకు ప్రపంచగుర్తింపు, ఐటీ గుర్తింపు ఇలా రకరకాలుగా మన విజయాలు చాలా సంతోషం కలిగించేవి. అవేకాదు, మా హిట్ కౌంటర్ ని ’కదల బొమ్మాళీ నే కదల’ అంటుంది అనుకోవటం దగ్గరి నుండి, వై.యస్.నీ, సోనియానీ మా శ్రేయోభిలాషులుగా నమ్మించటానికి, ఈనాడు - రామోజీరావు మాతో మాట్లాడే భాష మీద జోకులు దాకా!
అంతకు ముందు వరకూ... ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, సహజమైన అన్ని భావోద్రేకాలూ కలిగేవి. గీత నాశ్రయించి, సాధన చేసి దాటే వాళ్ళం. ’యుద్దం’ అన్నది అర్ధమయ్యాక, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు "మనం శత్రువు మీద మనకి చేతనైన దెబ్బతీసినప్పుడు, వాడూ వాడికి చేతనైన దెబ్బ మనల్ని తీస్తాడు కదా?" అనుకోవటం మొదలెట్టాము. అందునా మా శతృవు మమ్మల్ని దెబ్బతీయగలిగింది ’ఆకలి’ మీద మాత్రమే. అదే ’ఆకలి - ఆడది’ అన్న నా గతటపాలో వివరించాను.
నెం.5 వర్గం ఉంది. మరి ’ఆకలి’ దగ్గర మా శతృవు, మమ్మల్ని ఎలా వేధించగలుగుతున్నాడు అని సందేహం వస్తుంది కదా?
ఈ నేపధ్యంలో ఒక విషయం స్పష్టంగా చెబుతాను. మాకు నెం.5 వర్గానికీ మధ్యగల సంబంధం గురించి.....
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
5 comments:
Hats off to you, madam !
బహుకాల దర్శనం! మీ అభిమానానికి నెనర్లండి! :)
Do not publish my comment.
అమ్మా,
మీరు ఇచ్చె ఉదాహరణలు ఎవరైన ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నిచేవారికి అర్థమౌతాయి. సామాన్య ప్రజలు మీ స్థాయి ని అందుకోలేక మిమ్మల్ని వేరె విధము గా భావిస్తారు. ఎందుకంటె ట్రుత్ అనేది చాలా సింపుల్. మీరిచిన్న చేపల ఉదాహరణ కూడా ఆ కోవలోనిదే. రామకృష్ణ పరమహంస ని చాలా మంది పిచ్చి వాడను కొన్నారు అది మీకు తేలిసే ఉంటుంది. రమణ మహర్షి లాంటి వారు ఒక సంవాదం చాలా సేపు జరిగిన తరువాత ఆ ప్రశ్నిచేది ఎవరు అని ప్రశ్నలను తిప్పి కొట్టెవారు. కారణం మనిషి కి సింపుల్ ట్రుత్ మాటలతో చెపితె ఇంతేనా అనుకొని దానిని నమ్మడు. Those sages told you have to find out your own truth. మీరు ఇచ్చె ఉదాహరణలో కొంచెం అతి సాధారణమైన ఉదాహరణలు, సినేమాలలో ని ఉదాహరణలు ఇవ్వకండి. అందువలన ప్రజలు ఆ ఇది నాకు తెలిసింది ఇమె చెప్పిన కొత్త సంగతి ఏముంది అని అనుకుంటారు. Hence you are not going to achieve what you want to inform people.
I appreciate/ liked very much your post on Narasimha and prahlad. When you became Jnani world will understand you completly different way.
Regds,
ఆదిలక్ష్మి గారూ !
మీ కథనాలు పూర్తిగా కాకపోయినా చాలా వరకూ చదువుతున్నాను. మీలో నాకు పడి లేచే కెరటం కనిపిస్తోంది. మీ మానసిక స్థైర్యానికి జోహార్లు.
అజ్ఞాత గారు : నాకు తెలిసిన సత్యాన్ని నాకు చేతనయినంతగా సరళంగా అందరికి అర్ధమయ్యేటట్లుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నానండి. నా గురించి ఏమనుకుంటారు అన్నది నేను పట్టించుకోను. మీ సలహాకు ధన్యవాదాలు!
SR Rao గారు : మీ అభిమానానికి ధన్యవాదాలు.
Post a Comment