’అన్నీ తనకి నడుస్తున్నాయి’ అనుకుంటే - తాను దేవుళ్ళకే దేవుణ్ణీ, రాజులకే రాజునీ అనుకునే జెక్సీస్ కి ’తనకి నడవటం లేదు’ అనిపిస్తే తగని భయం. అతడి అసలు నైజం పిరికితనమే! కాబట్టే కుట్రలకి తెగబడతాడు. స్పార్టా అధినేత లియోనైడర్స్ తన సేనకు ముందుండి యుద్దాన్ని నడిపిస్తే - జెక్సీస్ తన బానిసల వెనక ఉండి కొరడాలతో బాది వాళ్ళని ముందుకి ఉరికిస్తాడు.

కుట్రలు తాము పన్నుతూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ తాము ప్రధాన కుట్రదారులై ఉండి, పైకి మాత్రం తాను స్థానిక పత్రికాధిపతిని అన్న ముసుగు వేసుకుని, దేశంలో ప్రధాన ఏజంటుగా ఏ హిందూ ఎన్.రామ్ నో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాధ్ గోయంకా నో ప్రాజెక్ట్ చేస్తూ నకిలీ కణిక అనువంశీయులు నడిపిన కుట్రాజకీయం ఇదే!

తనకన్నీ నడుస్తున్నాయనుకుంటే తన అధిపత్యాన్ని అతిగా ప్రదర్శించుకునే జెక్సీస్, తన భారీ రధాన్ని బానిసల చేత లాగిస్తూ, తాను పాదం నేలపై పెట్టాలనుకుంటే ముందుగా తన బానిసల వీపుల మీద అడుగులు వేస్తూ దిగుతాడు. ప్రపంచానికి తీరిగ్గా ప్రదర్శించుకుందామనుకున్నా, గూఢచర్యంలో నకిలీ కణిక అనువంశీయులు ఇంత అధిపత్యాన్నీ ప్రదర్శించుకున్నారు.

తనని ఎదిరించిన వాళ్ళ కంకాళాలని మిగిలిన వాళ్ళకి ప్రదర్శించి భయపెట్టాలనుకునే జెక్సీస్ నైజాన్నే , నకిలీ కణిక అనువంశీయులు గూఢచర్యంలో తమ ఏజంట్ల మీద ప్రదర్శించారు. తమని కాదంటే ఎంతటి సెలబ్రిటీలైనా, దేశాధినేతలైనా, దేశాలైనా.... మట్టిగొట్టుకుపోవటాన్ని ప్రదర్శిస్తూ, దాన్నే తమ చెంచాల చేత కీర్తింపించుకుంటూ, నకిలీ కణిక అనువంశీయులు, తామో వ్యక్తి కాదు వ్యవస్థ నంటూ నడిపింది ఇదే!

ఎంతగా బాకా ఊదించుకుంటారంటే - జెక్సీస్ అనుచరుడు గనక ’మా మహారాజు దృష్టిసోకినా, కాలుపెట్టినా ఆ చోటు వారికే స్వంతం’ అన్నట్లుగానే! దీన్నే ఒకప్పుడు బ్రిటీషు ముఖతః ప్రదర్శించారు. తర్వాత కెజీబి, సిఐఏ ల పేరిట ప్రదర్శించారు. ఇప్పుడు ముస్లిం ఉగ్రవాద సంస్థల పేరిట ప్రదర్శిస్తున్నారు. అదే బిన్ లాడెన్ Vs బిల్ గేట్స్ ల ర్యాంకుల రూపంలో కనబడింది. అన్నీ సవ్యంగా నడిచి ఉంటే, తాము ప్రపంచధినేతలుగా ప్రకటించుకుని పట్టాభిషిక్తులైన ఉత్తర క్షణం.... ప్రపంచమంతా ఏక కంఠంతో తమని కీర్తించేటట్లుగా డిజైన్ చేసుకున్నారు. దాన్నే ట్రయల్ గా హిట్లర్ నాటి నుండి, పెద్దపులి ప్రభాకరన్ లు, బిన్ లాడెన్ ల ద్వారా ప్రయోగాత్మకంగా ప్రయోగించుకు చూసుకున్నారు.

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోనే కాదు, చరిత్రకు అందిన శ్రీకృష్ణదేవరాయల వారి యుద్దాలతో సహా భారతదేశీయ యుద్దాలలో రాత్రివేళ యుద్ద విరామం ఉంటుంది. ఆయుధహీనులపై, నిద్రిస్తున్న వారిపై దాడి చేయరాదు గట్రా నియమాలుంటాయి. అవేవీ లేని కుట్రపూరిత యుద్దాలు జెక్సీస్ చేస్తాడు. రాక్షస ఖడ్గమృగాలూ, మదగజాలు ఫలించ లేదంటే వినూత్న విస్ఫుటనాల వంటివి. నకిలీ కణిక అనువంశీయులు గూఢచర్యంతో మేళవించి.... దేశాల మీదా, ప్రజా సమాజాల మీదా ప్రయోగించేది ఇలాంటి తంత్రాలనే! హఠాత్తుగా రగిలే ఉద్యమాలు, పేలే వరుస బాంబులూ, రకరకాల సంచలనాలూ ఇలాంటివే!

అదే కాదు, ప్రత్యక్ష యుద్దంలో విరామ సమయాలుంటాయి. అలసట తీర్చుకోనిచ్చే పరిమితులుంటాయి. జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయులకి అలాంటివేవీ ఉండవు. ఎటూ తామూ వెనకనో, చాటునో నక్కి, తమ బానిసలనే కదా పంపుతారు!? అందుచేత, అలసట తీర్చుకునే విరామావేవీ పాటించకుండా, ఎదిరి పక్షం మీదకి జట్టు తర్వాత జట్టుని పంపుతూనే ఉంటారు. ముసలి వాడి చేతిలోని మేకని, ముసలి వాడి చేతే వదిలి పెట్టించి దోచుకోవటానికి, నలుగురు దొంగలు చాలకపోతే నలభైమంది వచ్చినట్లుగానన్న మాట!

లియోనైడర్స్ నాయకత్వంలో 300యోధుల సేన తనకిచ్చిన ప్రతిఘటనకే ’తాను దేవుణ్ణని విర్రవీగే జేక్సీస్ గగన తలంలో, కాదూ తాను సామాన్యుణ్ణే ననే కరిమబ్బు కమ్ముకుంది!’ అంతే కాదు, ఆ సినిమా తుది సీన్లలో ఒకటైన యుద్ద చరమ దశలో, లియోనైడర్స్ నిజంగా తనముందు మోకాలి దండ వేస్తున్నాడను కొని, ఆ క్షణం కోసం జెక్సీస్ ఎంతగా ఎదురు చూసాడో నన్నట్లు, హర్షాతి రేకంతో రెండు చేతులూ పైకెత్తి ఆనందించబోతాడు. అంతలోనే దాడి చేయమన్న ఆదేశాన్ని తన యోధులకిచ్చిన లియోనైడర్స్ ని చూసి ఖంగుతింటాడు, జెక్సీస్. అతడా విభ్రాంతి నుండి తేరుకునేలోగానే లియోనైడర్స్ విసిరిన ఈటె అతడి చెంప చీల్చుకు పోతుంది. ఆ రక్తాన్ని అరచేతిలోకి తీసి చూసుకున్న జెక్సీస్ ఎంత భయభ్రాంతుడవుతాడో!?

అప్పుడు తిన్న దెబ్బతాలూకూ భయం... సంవత్సరం పాటు అతడు స్పార్టన్లని తలుచుకుని గజగజలాడుతూనే ఉంటాడు. ఆ పిరికితనమే అతడి అసలి నైజం. చరిత్రలో జగ్గజ్జేత కావాలని కలలు కన్న అలెగ్జాండర్, జెక్సీస్ గట్రాలకి, The Great అనేబిరుదు కట్టబెట్టి ప్రచారించే మీడియాకి, అసలు సిసలు అధిపతులైన నకిలీ కణిక అనువంశీయుల అసలు నైజమూ ఆ పిరికి తనమే!

అంతేకాదు, జెక్సీస్ లియోనైడర్స్ తో ’నీ విరోధులైన ఎధీనియన్లని నీ ముందు మోకాలి దండ వేయిస్తాను. నీవు నా ముందు మోకాలి దండ వేయి’ అంటాడు. ఎధీనియన్లకీ ఇదే చెప్తూ వాళ్ళ విరోధులెవరినో చూపి ఉంటాడు కదా! ఒకసారి తనముందు మోకాలి దండ వేసాక, ఇక తాను ఎవరి ముందు మోకాలి దండ వేయమంటే వాళ్ళ ముందు వేయాల్సిందే! బానిసకి ఇష్టాఇష్టాలేముంటాయి? అదే విభజించి పాలించే సూత్రం! చరిత్రలో జెక్సీస్ దీన్ని ఎంతగా ప్రయోగించగలిగాడో కానీ, ఈ చిత్రంలో ఆ పాత్ర ద్వారా ప్రతిబింబించబడిన నకిలీ కణిక అనువంశీయులు మాత్రం, మహాభారతంలోని కణికుడి కూటనీతిని అంటే విభజించి - పాలించే తంత్రాన్ని బాగా వంటబట్టించు కున్నారు.

యుద్ద చివరి ఘట్టంలో జెక్సీస్ అనుచరుడు, లియోనైడర్స్ తో మాట్లాడేటప్పుడు "నీ దేశ స్వాతంత్రం కోసం కదా పోరాడావు. అది నీకు దక్కినట్లే! నీ పోరాట పటిమకి ముగ్దుడై నిన్ను మెచ్చుకోవటానికి స్వయంగా వచ్చారు మా మహారాజు జెక్సీస్! నీవు నీ పదవి కోసమే కదా పోరాడావు? ఇక ఈ గ్రీకు సామ్రాజ్యానికి నీవే ఏకైక దళపతివి" అంటాడు. గూనివాణ్ణి చూపిస్తూ "ఇతణ్ణి నువ్వు అవమానించినా, ఇతడు నీ గురించి మా మహారాజు దగ్గర మంచిగానే చెప్పాడు" అంటాడు. "నువ్వు మోకాలి దండవేయ వలసింది ఒక్కరి ముందే! అదే మా మహారాజు జెక్సీస్" అంటూ ’బరిసె క్రిందపారెయ్’ అని పదేపదే హెచ్చరిస్తాడు.

బానిస మరొకణ్ణి బానిస కమ్మంటూ బలవంత పెట్టటం! ఒక్క లియోనైడర్స్ మీదే కాదు, అవినీతికి వ్యతిరేకంగా, తమకి వ్యతిరేకంగా పోరాడే వారందరి మీదా.... నకిలీ కణిక అనువంశీయులు ప్రయోగించే తంత్రం ఇది. మొదలుకే వాళ్ళకి తెలిసింది పదే తంత్రాలు. వాటిల్లోదే ఇది కూడాను.

గూనివాణ్ణి చూస్తూ లియోనైడర్స్ "ఎంగిలి మెతుకులు మాకు రుచించవు. ఆ భోగం నీవే అనుభవించు" అంటాడు. నిజంగా ఊహించ చేతనవ్వాలే గానీ.... డబ్బుకీ, కెరీర్ కీ ఆశపడి మాతృభూమికి, స్వంత మతానికీ, స్వంత సంస్కృతికీ, స్వంత భార్య/భర్త కీ దోహం చేసేవారు తింటోంది ఆ ఎంగిలి కూటినే. వాళ్ళ కక్కుర్తి అంతటిది. ఊహించచేతనైతే కడుపులో దేవినట్లనిపించే అసహ్యపు తిండి అది!

ఇక ఈ చిత్రంలోని గూనివాడు ఆత్మద్రోహికి ప్రతీక! వాడు లియోనైడర్స్ తో తాను మాతృదేశ రక్షణ కి పోరాడాలనుకుంటున్నట్లు చెబుతాడు. స్పార్టా మహారాజు లియోనైడర్స్ తో అది చెప్పేందుకు అవకాశాన్ని కూడా ’దక్షిణం వైపున్న కొండ దారి తనకు తెలుసు!’ అన్న విషయాన్ని విశదం చేస్తూ, దాదాపు బేరం పెడుతున్నట్లుగా చెబుతూ పొందుతాడు. స్పార్టాల యుద్దరీతి - యోధులందరూ తమ డాలుని తొడ నుండి మెడ వరకూ పట్టుకుని, ఒక బలమైన గోడ లాగా దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని ఏర్పరుచుకొని, పోరాడతారు. అందులో ఏ ఒక్కరు బలహీనులైనా ఆ గోడ నిష్ప్రయోజనమై పోతుంది. అది వాస్తవం. అప్పుడు విజయం లభించదు. అక్కడ ఐకమత్యమే బలం. ఏ ఒక్కరూ శతృవుకి సందివ్వకూడని భౌతిక యుద్దరీతితో పాటు మానసిక యుద్దరీతి కూడా అదే!

అలాంటి చోట, సత్యాన్ని చెప్పాడే గాని లియోనైడర్స్ గూనివాడి అంగ వైకల్యాన్ని ఎత్తి చూపలేదు. నిజంగా గూనివాడికి మాతృదేశం పట్ల భక్తీ నిబద్దతా ఉంటే, లియోనైడర్స్ చెప్పినట్లుగా యుద్దంలో గాయపడిన యోధులకి సేవ చేయటానికి, వైద్యం నీరు అందించటానికీ ప్రయత్నించి ఉండేవాడు. దేశ రక్షణ కై సాగే యుద్దంలో తనకి చేతనైనది తను చెయ్యాలను కునే వాడు. తనని అవమానించారనే వంకపెట్టుకుని, అహంకారానికి పోయి, దేశద్రోహానికి ఒడిగడుతూ శతృవు పంచన చేరేవాడు కాదు.

’తనకున్న అర్హత, సామర్ధ్యమూ ఎంతో గ్రహించుకుని, ఆ అర్హతకు తగిన పదవి పొందటం, అందుకు సంతృప్తి చెందటం’ అన్నది వ్యక్తి విచక్షణనిబట్టి ఉంటుంది. గూనివాడి అర్హత యోధుడి పదవికి తగదు. యుద్దంలో గాయపడిన వారికి వైద్యమూ, నీళ్ళు అందించే పనికి, పదవికి తగి ఉంటుంది. వాడి ఆశ, భోగభాగ్యాలూ సుందరాంగులతో సరసాలూ దగ్గరుంది మరి!

అందుకే అలవోకగా శతృవుతో కుమ్మక్కు అయ్యాడు. అందుకు ఓ వాదన నిర్మించుకున్నాడు. అంతే! దాన్నే తెలివిగా చెబుతున్నానన్నట్లుగా జెక్సీస్ "నీ పరిస్థితి తెలిసీ నిన్ను నిటారుగా నిలబడమన్నాడు లియోనైడర్స్!" అంటూ గూనివాడి అహాన్ని మరింత రెచ్చగొడతాడు. తన ఐశ్వర్యాన్ని, నగ్న సుందరీ మణులనీ చూపెట్టి గూనివాణ్ణి మరింత ఉన్మత్తుణ్ణి చేస్తాడు. వాడు కోరినట్లే "అవన్నీ నీకు ప్రసాదిస్తాను. బదులుగా దక్షిణం వైపు కొండ దారి ఉంది కదా? దాన్ని నాకు తెలియజేయి" అంటాడు జెక్సీస్. "అవన్నీ నీకు ప్రసాదిస్తాను" అనేటప్పుడు ’నేనే దేవుణ్ణి’ అనే దర్పమే ఉంటుంది అతడి దగ్గర.

సుందరాంగులని, వారి కామ చేష్టల ప్రదర్శనలని చూసి వెర్రెత్తి పోయిన గూనివాడు, తన గూని శరీరంతో ఏ మాత్రం ఆనందించగలడో వాడికే తెలియాలి. అందుకే వైకల్యాలున్న బిడ్డలని పురిటిలోనే చంపాలనుకున్నారేమో స్పార్టన్లు! బహుశః మానసిక వైకల్యాలని తెరమీద, సామాన్య ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేటట్లూ చూపటం కష్టం కాబట్టి, గూనివంటి శారీరక అంగ వైకల్యాన్ని ఎంచుకున్నాడేమో దర్శకుడు!?

శారీరక అంగవైకల్యం నిర్ధయార్హం కాదు గానీ, స్వార్ధంతో కూడిన మనో వికారం నిశ్చయంగా క్షమార్హం కాదు. ఒక జాతి ధృఢమైనదిగా రూపొందాలంటే కొన్ని పరిమితులు, పరిస్థితులూ, నిర్దిష్టంగా నిర్ధ్వంద్వంగా నిర్ధయగా పాటించి తీరాల్సిందే.

నిజానికి ఈ విషయంలోనూ గీత స్పష్టంగా మార్గదర్శకత్వం చూపుతుంది. సమాజంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. పుట్టుకతోనే అందరూ సాత్వికులై, స్వార్ధరహితులై ఉండరు. అందుకు జన్మజన్మల సాధన అవసరం. అందుకే గీత

శ్లోకం:
సక్తాః కర్మ ణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత
కుర్యా ద్విద్వాం స్తథా2సక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్

భావం:
కాబట్టి, ఓ భారతీయుడా! అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోక సంగ్రహణానికై - చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి.

శ్లోకం:
న బుద్దిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్
జోషయ్ త్సర్వకర్మాణి విద్వా యుక్త స్పమాచరన్

భావం:
జ్ఞానియైన వాడు కర్మాసక్తుల యొక్క బుద్దిని చలింపజేయకుండగా - తాను కర్మాచరణ చేస్తూ, వారి చేత చేయించాలి.

అజ్ఞానులు ఫలాసక్తితో పనులు చేస్తే, జ్ఞానులు ఫలాసక్తి రహితంగా పనులు నిర్వహించి, ’యద్యదాచరతి శ్రేష్థః’ వలె ఇతరులకి ఆదర్శంగా నిలవాలంటుంది. మంచిపనులు చేసేవాడు, కర్మయోగి, ఎన్నడూ భ్రష్ఠుడు కాడని, జన్మజన్మాంతర సాధన తో ఉత్తముడవుతాడనీ ఆత్మసంయమ యోగంలో స్పష్టంగా చెబుతుంది.

మళ్ళీ 300 సినిమా దగ్గరికి వస్తే - ఇందులో మంత్రి తెరాస్ పాత్ర. లంచానికీ, పదవికీ అశపడిన వాడు. శతృవు ఇచ్చిన బంగారానికి ఆశపడి, తనలాంటి మరికొందరు శతృదేశ ఏజంట్లని దేశంలో తయారు చేస్తాడు. ’లియోనైడర్స్ జెక్సీస్ ని గెలిచి ప్రాణాలతో తిరిగి రాలేడు. ఒక వేళ వచ్చినా అతణ్ణి ఖైదు చేస్తా’నంటాడు. అసలు రాజుకు సైనిక సాయం అందనీయకుండా ఆదినుండీ అడ్డుకుంటాడు.

లియోనైడర్స్ రాణి పాత్ర, ఈ చిత్రంలో ప్రత్యేకమైనది. ఆ పాత్రకి ప్రతీకనీ, అందుకు గల సారూప్యతనీ తదుపరి టపాలో వ్రాస్తాను. ఈ రాణి పాత్ర, యుద్దరంగంలో పోరాడుతున్న మహారాజు లియోనైడర్స్ కి సాయంగా స్పార్టా సేనను పంపేటందుకూ, అందుకోసం రాజసభ ఏర్పాటు చేసి తాను మాట్లాడేటందుకూ ప్రయత్నిస్తుంది. అందుకు సహకరించని మంత్రి తెరాస్ కు లంచంగా, అతడు కోరినట్లు శారీరక సుఖం ఇస్తుంది.

ఆ విధంగా అవినీతిని ఆశ్రయించి, నీతికి విజయాన్ని, అధర్మానికి పాల్పడి ధర్మ విజయాన్ని ఎలా సంప్రాప్తింప చేసుకో వచ్చనుకుందో మరి! అయితే ఏ క్షణమైతే ఆమె ఆ స్టెప్ తీసుకుందో, అప్పటి నుండీ యుద్దరంగంలో లియోనైడర్స్ సేన అపజయం పాలవ్వటం ప్రారంభమౌతుంది. గూనివాడి ద్రోహంతో జెక్సీస్ సేనలు దక్షిణం వైపున్న కొండ దారి ద్వారా స్పార్టన్లని చుట్టుముడతారు. అప్పటి వరకూ వారితో కలిసి పోరాడుతున్న టేక్సాస్ తదితరులు యుద్దరంగం వదిలి వెళ్ళి పోతారు. ఆ యుద్దంలో అదే చివరి ఘట్టమై లియోనైడర్స్ తన యోధులతో సహా వీరమరణం పొందుతాడు.

ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతితో కుమ్మక్కు అయ్యాక, నీతి మిగిలి ఉండదు. అధర్మానికి పాల్పడ్డాక స్థైర్యధైర్యాలుండవు. లియోనైడర్స్ రాణి వంటి వారు ఆయా దేశాల్లో తమకి తెలియకుండానే, జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయులకి తోడ్పడుతుంటారు. తమ దేశ ప్రయోజనాలని ఆశించీ, ఇలాగైతేనే అభివృద్ది సాధ్యం అనే నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గాల ప్రచారాన్ని నమ్మీ, ఏదో వీళ్ళని డబ్బు సంపాదించుకోనిస్తే మన పనికి అడ్డం రారు అనుకునీ నకిలీ కణిక ఏజంట్లతో చేతులు కలుపుతుంటారు. సాపేక్షంగా చూస్తే, ఇలాంటి వాళ్ళకి తమ మాతృ దేశాల పట్ల నిబద్దత, నకిలీ కణిక ఏజంట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.

ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే - లియోనైడర్స్ రాణి రాజసభలో, లియోనైడర్స్ 300 మంది యోధులతో కలిసి జెక్సీస్ సేనలతో పోరాడుతున్న విషయాన్ని వివరించి, స్పార్టా సైన్యాన్ని పంపాలని ప్రతిపాదించినప్పుడు, మంత్రి తెరాస్ రాణినైతిక వర్తన గురించీ, రాణి గురించీ నీచంగా మాట్లాడతాడు. తర్వాత ఆమె అతణ్ణి కత్తితో పొడిచి చంపేస్తుంది. నేలకూలిన అతడి శవం నుండి జెక్సీస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణాలు జలజలా రాలతాయి.

ఆ విధంగా అతడి అవినీతి బహిర్గతం[expose] అయ్యాకనే స్పార్టా ప్రజల్లో స్ఫూర్తి రగులుతుంది. ద్రోహిని గుర్తించి, సత్యాన్ని గ్రహిస్తారు.

యుద్దరంగం నుండి లియోనైడర్స్ మెడలో దండనీ, సమాచారాన్ని తెచ్చిన యోధుడు [చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయిన వాడు. అయినా తాను యుద్దానికి వెరవననీ, మరో కన్నుందనీ, దేవుడందుకే మనిషికి రెండుకళ్ళు ఇచ్చాడనీ అనేంత ధీరుడు.] ’ఆనాడు మహారాజు లియోనైడర్స్ తమ విజయవార్త అందించమన్నాడు. అది విజయమెలాగవుతుందో అప్పుడు తనకి అర్ధం కాలేదనీ, ఇప్పుడర్ధం అయ్యిందనీ’ - యుద్దానికి కదిలిన పదివేల మంది స్పార్టన్ వీరులని చూస్తూ అంటాడు.

మాతృదేశం కోసం పోరాడిన యోధుల ఆత్మలు సైతం, తము చేసిన యుద్దంలోని నిజాయితీ సహితంగా ఎంతటి జడులనైనా, ఎంతటి తామసులనైనా ఏదొకనాడు కదిలించ గలవనే విశ్వాసం అతడిది. స్పార్టన్లతో అదే చెబుతూ.... యుద్దరంగంలో లియోనైడర్స్, అతడి యోధులు చిందించిన రక్తాన్ని, చేసిన త్యాగాన్ని గుర్తించమంటాడు. "ఆయన మీ నుండి పొగడ్తలనీ, కీర్తి గానాలని కోరలేదు. ఆయన మీనుండి కోరుకుంది కొన్ని జ్ఞాపకాలని మాత్రమే" అంటాడు. తన వెనక కదిలిన స్పార్టన్ల సేనని చూసి ’ఆనాడు 300 యోధులతో లియోనైడర్స్ కొట్టినదెబ్బకి సంవత్సర కాలంగా గజగజ వణుకుతూ కూర్చొన్న జెక్సీస్ ఓటమి నిశ్చయం’ అన్న విశ్వాసాన్ని ప్రకటిస్తాడు.

ఆ విశ్వాసం యుద్దభూమిలో చిందించిన రక్తం నుండీ, చూపించిన ధైర్యం నుండీ వచ్చింది. స్వాతంత్ర సమరంలో చూపిన శౌర్యం నుండి వచ్చింది. ఇంకా ఇది భౌతిక స్వాతంత్రమే. దీన్ని దాటి ఆత్మ స్వాతంత్రాన్ని పొందమంటాయి ఉపనిషత్తులు. దీన్నే వివేకానంద స్వామి Freedom of Soul గా ప్రతీ మనిషి సాధించవలసిందిగా చెప్పారు. ఆయన చెప్పి దాదాపు నూరేళ్ళయ్యింది. ఈ నూరేళ్ళల్లో నాటి మానవ స్వాతంత్రం గమనం ముందుకు గాక మరింతగా వెనక్కి పోయింది. నాటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు కూడా, నేటి యువజనులకి ఎంత వరకూ తెలుసన్నది ప్రశ్నార్ధకమే!

300 సినిమా మీది నా విశ్లేషణ ముగించే ముందు మరొక్క విషయం ప్రస్తావిస్తాను. జెక్సీస్ తో యుద్దపు చివరి ఘట్టంలో లియోనైడర్స్, అతడి యోధులు అమిత శౌర్యంతో, వెనుదీయక పోరాడతారు. మోకాలి దండ వేసినట్లుగా నేలకు వంగిన లియోనైడర్స్, తన మాతృభూమిని స్పృశిస్తూ, ఆ మట్టి వాసనని ఆఘ్రాణిస్తూ, తన ప్రియసఖిని ప్రేమానుబంధాలనీ గుర్తుకు తెచ్చుకుంటాడు. తాను లొంగి పోయానేమోనని పొంగి పోతూ చూస్తున్న జెక్సీస్ ను విభ్రాంతికి గురిచేస్తూ, దాడి చేయమన్న ఆదేశాన్ని తన యోధులకిస్తాడు. అందుకోసమే కాచుకున్నట్లున్న స్వార్టా యోధుడు ఎగిరి, లియోనైడర్స్ వీపు మీదగా, అప్పటి వరకూ జెక్సీస్ ని తెగ పొగుడుతూ, జెక్సీస్ తరుపున బేరాలాడిన అతడి బానిసని తెగనరుకుతాడు. అదీ వారి మధ్య ఉన్న కో ఆర్డినేషన్, పరస్పర అవగాహన! మహారాజు లియోనైడర్స్ జెక్సీస్ కి లొంగిపోయి మోకాలి దండ వేయలేదని వారికి ముందే తెలుసు.

[ఆ దృశ్యం అచ్చం చందమామ బాలల పత్రికలో బొమ్మ ఉన్నట్లే ఉంటుంది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు, pause చేసి చూస్తే అచ్చం చందమామలో వర్ణ చిత్రాల్లా ఉంటాయి. జెక్సీస్ దూతల్ని పాతాళ బావిలోకి తోసినప్పుడూ, సముద్రంలో జెక్సీస్ నౌకలు మునుగుతున్నప్పుడూ మదగజాలు మృత్యులోయలోకి జారుతున్నప్పుడు.... ఇలా!]

మొత్తంగా... ’మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా?’ అనిపించేటట్లుగా ప్రతీ దృశ్యమూ, ప్రతీ అంశమూ ఈ సినిమాలో చిత్రించబడ్డాయి.

స్పార్టా యోధుడు జెక్సీస్ బాకా ఊదే బానిసని చంపిన మరుక్షణం, భీకర యుద్దం మళ్ళీ ప్రారంభమౌతుంది. లియోనైడర్స్ విసిరిన ఈటెతో పొంగిన జెక్సీస్ భయాన్ని ఇంతకు ముందే వివరించాను. యుద్దంలో గాయాల పాలై, దాదాపు మరణపు అంచుకు వచ్చినప్పుడు కూడా, లియోనైడర్స్ జెక్సీస్ పంపిన భారీ కాయుణ్ణి కంట్లో కత్తిదించి చంపుతాడు.

ఆ క్షణం నేలపైకి వాలుతున్న లియోనైడర్స్ తో, స్పార్టా యోధుడు "మహారాజా! మీతో కలిసి మరణించడం నాకు సంతోషం" అంటాడు. అతడి కళ్ళల్లో అదే మెరుపు. మాతృదేశం కోసం చేసిన యుద్దంలో మరణిస్తున్నాననే తృప్తితో కూడిన మెరుపు. కాని ఆ క్షణంలో కూడా లియోనైడర్స్ ఆశావహ ఆలోచన విధానమూ, జీవితం పట్ల అనురక్తి,ఎంతగా ఉంటాయంటే - శరీరం గాయాలైన బాధతో కూడా "నీతో కలిసి జీవించడం నాకు సంతోషం" అంటాడు.

అవును! జీవితం జీవించడానికే! మరణించడానికి కాదు. మరణం అనివార్యం కావచ్చు. కానీ మృత్యువు సంభవించే వరకూ, నిండూనూరేళ్ళు శాంతీ సంతోషాలతో, జీవించడమే జీవితానికి అర్ధం. అయితే బానిసలా కాదు, స్వేచ్ఛా స్వాతంత్రాలనే ఊపిరిగా పీలుస్తూ.... సుఖాలూ సంపదలూ తగినంతగా కలిగి ఉండి... శాంతీ సంతోషాలు కొదవ లేకుండా ఉండే జీవితాన్ని ఆస్వాదించాలి. అందుకే భారతీయులు వసుధైక కుటుంబాన్ని స్వప్నించారు. ప్రాచీన కాలం నుండీ విశ్వమానవ ప్రేమని కాంక్షించారు. అందుకోసమే అన్వేషించారు, పోరాడారు, పోరాడుతున్నారు. ఒకప్పుడు విల్లూకత్తులతో, మరొకప్పుడు సత్యాహింసలతో, ఇప్పుడు మెదళ్ళతో!

ఒకసారి కేనోపనిషత్తుకీ, ప్రశ్నపనిషత్తుకీ, ముండకోపనిషత్తుకీ శాంతి మంత్రాన్ని పరికించండి.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్ష భిర్య జత్రాః
స్థిరైరంగై స్తుష్టువాగ్ం సస్తనూభిర్ వ్యశేమ దేవహితం యదాముః

భావం:
ఓం. ఓ దేవతలారా! మా చెవులు శుభాన్నే వినుగాక. యజ్ఞకోవిదుమైన మేము మా కళ్లతో శుభాన్నే చూచెదం గాక. మీ స్తోత్రాలను గానం చేసే మేము, పూర్తి ఆరోగ్యం బలాలతో మాకు నియమితమైన ఆయుష్కాలాన్ని గడిపెదం గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇంతకన్నా కోరదగినది ఇంకేముంటుంది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

G.R.E.A.T.

Really Great.

మీరు నియో హిందూవానను మరింత పదను గా వినిపిస్తున్నారు. ఇలా హిందువులను రెచ్చ గొడితె నేను వ్యాపారం ఎలా చేసు కోవాలి? మీకు తెలుసు గా నేను బ్రిటిష్ వాడు వెళ్లి పోతు ఇచ్చిన ఆర్య- ద్రవిడ వాదం, వెనక బడిన వారి కొరకు దళిత వాదం, విభజించి పాలించటం లో మరింత ముందుకేళ్ళి అబ్యుదయ భావన తో మహిళల కొరకు స్రీవాదం, సైన్స్ ముసుగులో హిందువులను ఎగతాళి చేయటానికి హేతు వాదం ఇన్ని వాదాలతో పుస్తకాలు రాసుకొని మా మిత్రులం ఒకరి నొకరు పొగుడుకుంటూ, సన్మాలు చేసుకుంటూ, పుస్తకాలు ప్రభుత్వ ఖర్చు తో ప్రచురింప చేసుకొని 20-50 లక్షల రూపాయలను సంపాదించు కొని వాటి మీద క్రైస్తవ సంస్థలు అమేరికా యునివర్శిటి లలో ప్రసంగాలు ఎర్పాటు చేయిస్తె మరి కొంత డబ్బును, కేరీర్ ను సంపాదించు కొంటాం కదా! అదే మీరు చెప్పె మాతృదేశ ప్రేమ వలన మాకు ఎమీ లాభం?

--సుత్తి సురేష్

300 సీరీస్ లొ వచ్చిన మూడు టపాలు అద్బుతం గా వున్నాయి..
మీట్ ద స్పార్టన్స్ పరమ చెత్త.. చూసే సాహసం చెయ్యకండి

కమల్ గారు, శివ గారు : నెనర్లండి.

సుత్తి సురేష్ గారు : అన్ని నిజాలు ఒకేసారి చెప్తే ఎలాగండి? తొక్కలో గుండె తట్టుకోవద్దూ!? :)

మంచుపల్లకీ గారు : నా విశ్లేషణ మీకు నచ్చినందుకు నెనర్లు!ఆ సినిమా చూడాలనుకోవటం లేదండి. సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

నిజమమ్మా
్ నాదేశం కోసం ,నా సంస్కృతి,ధర్మాల కోసం వేలసార్లు మరణించే అవకాశం ఇవ్వమని ఆ దేవ దేవుని ప్రార్ధించాలనే స్పూర్తి దేశభక్తులలో కలిగిస్తున్నారు . నీలాంటి వీరపుత్రికలను పొందిన ఈదేశం ,మీవంటి సోదరీమణులను పొందగలిగిన మాజన్మం ధన్యం

దుర్గేశ్వర గారు : మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

అద్భుతం.... ఇంతకుముందు మూడు సార్లు చూసాను గాని ఇంత deep గా చూడలేదు. ఇప్పుడు మరల చూస్తాను (మీ కళ్ళతో) ౩౦౦ కి ఒకటే పేరడీ కాదు నాకు తెలిసి ఇంకా రెండు మూడు పేరడీలు వచ్చాయి. ఇంత మంచి రివ్యూ అందించినందుకు కృతజ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu