గత టపాలలో చెప్పిన సినిమాల కోవకి చెందినదే లగాన్ సినిమా:

బ్రిటీషు వాడికీ భారతీయ గ్రామీణులకీ మధ్య నడిచిన క్రికెట్ పందెం కథ. ఆటలో గెలుపు ఓటములు గ్రామీణుల స్వేచ్ఛాస్వాతంత్రాలకి ముడిపడి ఉంటాయి. వాళ్ళకి అది అసలే మాత్రమూ పరిచయం లేని ఆట! నైపుణ్యాలూ లేవు, పరికరాలూ లేవు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే, ఆడి గెలుస్తారు.

అనువర్తన:
అమెరికా సిఐఏ కీ, బ్రిటీషు వంటి ధనిక దేశాలకీ వ్యతిరేకంగా గూఢచర్యపు ఆటలో గెలువాలంటే మనకున్న వనరులు తక్కువ. కాబట్టి ఉన్నవాటితోనే పోరాడాలి. అందుకే నీకు ఆకలి బాధలు తప్పవు. ఓ ప్రక్క ఇల్లూ వాకిలీ ఊడగొడుతూ, ఉద్యోగ ఉపాధులకి గండి కొడుతూ.... మరో ప్రక్క మాకు చెప్పబడిన కథలివి!

ఇలాంటి కాకమ్మ కథలతో మాకు బాగా అర్ధమయ్యిందేమిటంటే - తమకి ఇష్టమైన వాటికి ఇష్టమైన భాష్యాలూ, విశ్లేషణలూ.... నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు రామోజీ, సోనియాలు చెప్పుకుంటారు అని! తమ అరిషడ్వర్గాలు తీర్చుకోవడం కోసం ఏ కథలైనా చెబుతారు అని! ఎంత చెత్తకైనా, చెడ్డ విషయానికైనా ధనాత్మక శీర్షిక [పాజిటివ్ కాప్షన్] పెట్టుకుంటారు.

వాళ్ళ ఈ లక్షణమే - తొలి రోజుల్లో..... విశ్లేషణా కేంద్రాల నుండి వచ్చిన సూచనలకి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ, అసైన్ మెంట్లకి భాష్యాలు చెప్పుకునేటప్పుడూ - కామ క్రోధాలూ, లోభ మోహలూ, మద మాత్సర్యాలతో కూడిన వాళ్ళ ఈ స్వభావమే - పర్యవసానంలో వాళ్ళని నిరూపించింది. బహిర్గత పరిచింది. సువర్ణముఖిలు అనుభవించేందుకు దారి తీసింది. అలాంటి అరిషడ్వర్గాలతోనే, మా మీద అక్కసు, క్రోధమూ తీర్చుకునేందుకు ’పరిమితవనరుల వంటి కథలు’ చెబితే సరిపోతుందనుకున్నారు.

పరిమిత వనరులతో పోరాడాలి కాబట్టి మేం ఆకలి బాధలు పడాలి, తాము మాత్రం పుట్టిన రోజు విహార యాత్రలకై విదేశాలకీ, విలక్షణ దీవులకీ వెళ్తారు. అచ్చంగా తాము ఏసీల్లోనూ, ప్రత్యేక విమానాల్లోనూ తిరుగుతూ, ఎం.ఎల్.ఏ., ఎంపీల జీత భత్యాలు విపరీతంగా పెంచుకుంటూ, ప్రజలని మాత్రం ’త్యాగాలకు సిద్దంకండి’ అని చెప్పినట్లే! [ఇది బాగా అర్ధం కావాలంటే - రెండు చదరంగపు బోర్డుల మీద, ఇద్దరు ఆటగాళ్ళతో ఒకేసారి ఆడే మూడో ఆటగాడి కథ చెప్పాలి. అది మరో టపాలో!]

"ఏదో ఒకటి! పదే పదే చెప్పి నమ్మించగలిగితే సరి! అంతగా అయితే దొరికినప్పుడు దొర్లించేయవచ్చు" అనుకుంటారు. పీవీజీ మరణించినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సైతం అవమానించేటప్పుడు, భవిష్యత్తులో ఇంతగా బహిర్గతమై, కేసులతో నిరూపించబడి, ఇరుకున పడతామని ఊహించలేదు.

మొదటిసారి లగాన్ చూసేటప్పటికి ఇదంతా మాకు దృష్టిలో కూడా లేనందున విధివ్రాత అనుకుంటూ గడుపుతున్నాము. 2005 తర్వాత పునారాలోచనలో ఉండగా మరోసారి ’లగాన్’ under line చేయబడి అర్ధమయ్యింది. ఏమైనా చక్కని సంగీతం, స్ర్కిప్టూ గల మనోహరమైన సినిమా లగాన్!

ప్రత్యేకాంశాలు:
ఆ తర్వాత గమనిస్తే.... ఒక ’ఎరా’లో తెలుగు, హిందీ సినిమా రంగాల్లో [బహుశః మిగిలిన భాషల్లో కూడా] దేశభక్తి తెగ పెరిగిపోయింది. దేశభక్తితో కూడిన కథలు [ఇటీవలి వెంకటేష్ సుభాష్ చంద్రబోసు, 1942 A Love Story ఇత్యాది చాలా సినిమాలు] పెరిగాయి. కనీసం సినిమాలో జెండా సీనో, హీరో లేదా హీరోయిన్ల దేశభక్తిని ప్రతిబింబించే సీనో ఒక్కటన్న ఉండటం ఆ ’ఎరా’లో పరిపాటి అయ్యింది. ఉదాః ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, మహేష్ బాబు ’బాబీ’ గట్రాలు. విజయశాంతి తో ఆమె తమ్ముణ్ణి తాలిబాన్లు బ్రెయిన్ వాష్ చేసేసి దేశద్రోహిగా మార్ఛేసిన సినిమా వంటివి.

మరో ముఖ్యమైన సినిమా ఖడ్గం:
ప్రజాదృక్పధాన్ని అంచనా వేసుకునేందుకు నిర్మించబడే ఇలాంటి సినిమాలలో, ఖడ్గం మరికొంత ప్రత్యేకమైనది. దానికున్న ఇతర ప్రయోజనాల్లో ఒకటి, మా మీద దాన్ని ప్రయోగించటం. కథ అందరికీ తెలిసిందే! దేశ ద్రోహనికి ఒడిగట్టిన పాతబస్తీ ముస్లింలు కొందరైతే, దేశం కోసం త్యాగం చేయటానికి సిద్దపడే ముస్లింలు మరి కొందరు. అద్బుతమైన గ్రాఫిక్స్ తో, జాతీయ జెండా చార్మినార్ ను చుట్టేయటం చిత్రీకరించబడిన స్ఫూర్తిదాయకమైన చిత్రం ఇది!

అనువర్తన: ఈ సినిమాతో మాకు చెప్పిందేమీ లేదు. కానీ మా నుండి చెప్పించుకో ప్రయత్నించింది చాలా ఉంది. రెండోసారి శ్రీశైలం చేరిన కొత్తల్లో.... అప్పటికి మేమింకా టీవీ కొనలేదు. మా పూర్వవిద్యార్ధి తన సీడీప్లేయర్ లో ఈ సినిమా చూపించాడు. భారతీయ ముస్లింలపై మా అభిప్రాయం చెప్పమని తెగ ఒత్తిడి చేశాడు. మా పూర్వ విద్యార్ధే కాకుండా, మరికొందరు కూడా దానిని under line చేసారు. అప్పటికి మాకు ఏ ధ్యాసా లేదు. కాని విచిత్రంగా ఆ ’ఎరా’లో మాకు ఏ స్నేహితుడూ సాయం చేయలేదు. చివరికి సాయం చేసిన వ్యక్తిగా ’ఖాసిం’ మాత్రమే మిగిలిపోయాడు. అయితే 2005 తర్వాత, 2007లో అన్నిటినీ విశ్లేషించుకునేటప్పుడు, ఇది మాకు చాలా ప్రాధాన్యతతో కనబడింది.

ఎందుకంటే - 1999 లో మేము ఫ్యాక్టరీలో ఉండగానే, [మా వివాహానికి ముందే] గూఢచర్యం గురించిన ప్రాధమిక అవగాహన చేసుకుంటున్న రోజుల్లో - అప్పటి గృహమంత్రి ఎస్.బి.చవాన్ ’పత్రికాధిపతుల్లో సిఐఏ ఏజంట్లున్నారు’ అని ప్రకటించాడు. ఆ నేపధ్యంలో ’ఈ రోజో రేపో రామోజీరావు అరెస్ట్’ అనటం కుదరదని అర్ధమయ్యింది. అప్పటి రోజుల్లోనే సెప్టెంబరు 11, 1893 లో చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాసం గురించీ, తదనంతర పరిణామాల్లో..... నూరేళ్ళుగా భారత దేశం మీద, హిందూమతం, సంస్కృతుల మీదా కుట్రజరుగుతోందన్న అవగాహన కలిగింది. ఆ విషయాలన్నీ నా డైరీలో వ్రాసుకున్నాను.

కాబట్టి భారతీయ ముస్లింల పట్ల మా అభిప్రాయం ఏమిటి అనే విషయమై అంత ఆరాటపడటం మాకు అర్ధమయ్యింది. ’1992 తర్వాత మాకు ఆ విషయమై పెరిగిన అవగాహన ఏమిటో తెలుసుకోవాలన్నది’ వాళ్ళ తపన. ఈ విషయం అర్ధమయ్యాకే మేము అటువైపు మరింతగా దృష్టి సారించాము.

అప్పటికే ఆస్థినీ, అయిన వాళ్ళనీ పోగొట్టుకున్నందున, భగవద్గీత మీదా, దేవుడి మీదా పూర్తిగా ఆధారపడేవాళ్ళం. ఆ రీత్యా భారత రామాయణ భాగవతాలు చదవటం, భక్తి సినిమాలు చూడటం చేసేవాళ్ళం. గీత ఆచరణ అన్నది కష్టాల కడలిలో మాకున్న ఏకైక పడవ. రామ కోటి కూడా కొన్నాళ్ళు వ్రాసాము.

అందుచేత ’ఖడ్గం’ విషయం అర్ధమయ్యాక, భారత భాగవత రామాయణాది ఇతిహాసాలని మరింత లోతుగా పరిశీలించటానికీ, గూఢచర్య దృష్టితో అవగాహన చేసుకోవటానికీ ప్రయత్నించాము. ఆ ప్రయత్నంలో మా అవగాహన మరింతగా పెరిగిపోయింది.

’కథ’ సినిమా:
ఈ కోవలో ఇటీవల వచ్చిన, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ’కథ’ సినిమా విలక్షణమైనది. ఎందుకంటే - ఈ సినిమా ద్వారా రామోజీరావు మాకు ఏదీ చెప్పేప్రయత్నం చెయ్యలేదు, మా చేత ఏదీ చెప్పించుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. ఈ సినిమా ద్వారా నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ జవాబిచ్చింది. మరోమాట చెప్పాలంటే లగేరహో మున్నాభాయ్[శంకర్ దాదా జిందాబాద్] ల వంటి వాటికి జవాబిచ్చింది.

300 సినిమా ఏ విధంగా మీడియా ద్వారా ప్రచారింపబడలేదో, అలాగే ’కథ’ సినిమా కూడా ప్రచారింపబడలేదు. అంతే కాదు, మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 2500 ధియేటర్లలో, 1500 ధియేటర్లకు పైగా రామోజీరావు, అతడి అనుచరులైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు గట్రాల చేతిలో ఉన్నాయని ఓ మాట ఇటీవల బయటికి వచ్చింది. అంతగా భౌతికపట్టు బిగించినందునే.... చాలా చిత్రాలు, నాణ్యతతో పని లేకుండా, అయిదురోజుల్లో ధియేటర్ల నుండి అంతర్ధాన మౌతూ ఉంటే, మరికొన్ని చిత్రాలు నాసిగా ఉన్నా ’నాన్ స్టాప్’ లాగా విజయవంతమైన 5 వ వారంల దాకా ప్రదర్శింపబడ్డాయి.

అలాంటి చోట.... తమ స్ట్రాటజీని బహిర్గతం చేసే సినిమాలు ఆడకపోవటం వింత కాదు కదా!

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే:
జార్ఖండ్ లో ప్రిన్స్ పల్ గా పనిచేసే ఓ ప్రొఫెసరు, కళాశాల ఎన్నికలలో రాజకీయ హింసని అడ్డుకున్నందుకు కుటుంబంతో సహా బలయిపోతాడు. అమ్మానాన్న, తోబుట్టువులు కళ్ళముందే హింసించబడి మరణించడంతో, ఆ ప్రొఫెసర్ కుమార్తె చిత్ర మానసికంగా కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఆమె ఎంతగా మొత్తుకున్నా, పోలీసులు ఆ కేసుని రోడ్డు ప్రమాదంగా చెప్పి మూసేస్తారు.

ఒంటరిగా మిగిలి, ఏడాదిపాటు పిచ్చాసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన చిత్ర, అరకులోని ఓ చిన్నపిల్లల బడిలో ఉపాధ్యాయునిగా చేరుతుంది. అక్కడికి సినిమా ఏర్పాట్లకై వచ్చి ఉన్న బృందంలోని దర్శకుడితో పరిచయం, స్నేహం, ప్రేమగా పరిణమిస్తుంది. అప్రయత్నంగా ఆమె ఒక హత్యని చూస్తుంది. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది.

అప్పటికే ఆమె కొన్ని ఫోబియాలతో బాధపడటం, మందులు వాడుతుండటం చూసే ప్రేక్షకులకి ’కథ’ సినిమా కథ, ఉత్కంఠపూరితంగా ఉంటుంది. ఆమె భ్రాంతి పడిందో, నిజంగా హత్య జరిగిందో ప్రేక్షకులకి చివరికి గానీ అర్ధం కాదు. ఆమె పనిచేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ కొడుకు, పోలీసు కానిస్టేబుల్ రాజు.... ఇలా ఎవరినైనా అనుమానించగలిగేలా ఉంటుంది కథలోని ఉత్కంఠ, సస్పెన్సు!

ఆమె పిచ్చిదనే వార్త ఒకటి ఊర్లో బాగా ప్రచారంలోకి వస్తుంది. తగ్గట్టుగానే చాలా చర్యలు జరుగుతాయి. ఫ్రిజ్జ్ లో ఉండాల్సిన పళ్ళు, కూరగాయలు చెప్పుల స్టాండ్ పై, చెప్పులు ఫ్రిజ్జ్ లో ఉండటం గట్రా. మల్లెపువ్వులు కనకాంబరాలుగా మారిపోవటం! పూలమ్మే ముసలామె అబద్దం చెప్పిందో, చిత్రే భ్రాంతి పడిందో అర్ధం కాదు.

అయితే ఆమె ఆత్మశక్తి గొప్పది. తాను జీవితంలో పరమ చేదునీ, భీభత్సాన్నీ చూసి ఉండవచ్చుగాక! అయితే తాను ’హత్య’ని చూశానని ఆమె బలంగా నమ్ముతుంది. హీరో అతడి స్నేహితులు ఆమెకి సహాయం చేయ ప్రయత్నిస్తారు. హతురాలి బొమ్మగీసి, Trace out చేసే ప్రయత్నం చేస్తారు. చివరికి హంతకుడు పోలీసు అధికారేనన్నది తెలుస్తుంది.

అప్పటికే అతడు కేసుని, తనక్రింది పోలీసు కానిస్టేబుల్ పైకి తోసి, అతణ్ణి చంపి, కేసు మూసేస్తాడు. తన అక్రమ సంతానమైన కూతుర్ని చంపేసిన సదరు పోలీసు అధికారి, ఈ కేసు నుండి బయట పడేందుకు చిత్రని పిచ్చిదానిగా చిత్రించటం, అది అందరి చేతా నమ్మించటమే గాక, అందుకోసం హీరో స్నేహితులలో ఒకణ్ణి చంపేస్తాడు, మరొకణ్ణి గాయపరుస్తాడు. ఒక దశలో.... చివరికి చిత్ర కూడా తానే ఆ పిచ్చి పనులన్నీ చేస్తున్నానేమో ననుకునేంతగా అయోమయానికి గురవుతుంది.

నగల దుకాణపు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీతో సహా పట్టుబడిన పోలీసు అధికారి, చిత్రనీ, హీరోని బెదిరిస్తాడు. అప్పటికి చిత్ర, తను ఎన్ని ఒత్తిడులకి గురైనా, సత్యాన్ని తర్కాన్ని సరిగ్గానే విశ్లేషించుకుంటుంది. నేరుగా వచ్చి అతడి చెంప చెళ్ళుమనిపించి హీరోని, సీడీని తీసుకుని వెళ్ళిపోతుంది. నేరం బయటపడి, అప్పటి వరకూ పోలీసు అధికారిగా గౌరవ మర్యాదలతో, హోదాతో బ్రతుకుతున్న సదరు పోలీసు అధికారి, నిస్సహాయంగా తన పిస్తోలుతో కణత మీద కాల్చుకుని తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు.

స్థూలంగా ఇదీ ’కథ’ సినిమా కథ!

అనువర్తన:
నువ్వు ఎన్ని భ్రాంతులకు గురిచేసినా, భ్రాంతి పరచాలని ప్రయత్నించినా వీళ్ళని [అంటే మమ్మల్ని] ఏమీ చెయ్యలేవు. నీ చరిత్ర బయటకు రాకుండా ఆపనూ లేవు. నీ ఆత్మహత్యా సదృశ్యమైన అసైన్ మెంట్లతోనే.... నీ మీడియాకీ, నీ వ్యక్తిగత గౌరవమర్యాదలకీ, హోదాకీ సమాధి కట్టుకుంటావు - ఈ హెచ్చరిక.... నెం.5 వర్గం, స్పష్టంగా నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ అందులో కీలక వ్యక్తి రామోజీరావుకీ ఇచ్చింది.

’అతడి కథ ఇదీ’ అని చెబితే, చెప్పిన వాళ్ళకి మెదడులో కెమికల్ గడబిడ, పిచ్చీ, హెలూసినేషన్ గట్రా బిరుదులు ఇస్తానన్న రామోజీరావుకి, అది జవాబన్నమాట.

గమనించి చూడండి: 2006లో మేము, ఐబి అధికారి తో మాట్లాడిన పదిరోజులకి మార్గదర్శి కేసు బయటకి వచ్చింది. అది మొదలు రామోజీరావు వ్యక్తిగత ప్రతిష్ఠ మసక బారటం మొదలైంది. ఆ తర్వాత మా బ్లాగు ప్రారంభించిన తర్వాత మరింత వేగంగా.... ప్రపంచవ్యాప్తంగా మీడియా, నకిలీ కణిక వ్వవస్థా, నెం.10 వర్గంలో కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ ఇతర రాజకీయ నాయకుల ప్రతిష్ట మరింత దిగజారింది. కార్పోరేట్ దిగ్గజాల, ఆర్ధిక వేత్తల దోపిడి సిద్దాంతాలు, డొల్ల సమీక్షలు బహిరంగ మయ్యాయి. వాటికి తగ్గట్లుగానే దృష్టాంతపూరితమైన సంఘటనలతో, వాళ్ళపైన నమ్మకం చాలా వేగంగా సడలిపోయింది.

మా బ్లాగు వలన కాదు ఇదంతా జరిగింది అనటం లేదు. సంఘటనాత్మకంగా నెం.5 వర్గం, నెం.10 వర్గపు కుహనా విలువలని కుప్పకూల్చింది. వాటినే దృష్టాంతపూరితంగా మేము వ్రాయటం జరిగింది. అంతే!

ప్రత్యేకాంశాలు:
ఈ సినిమాలో నాయికా నాయకుల సంభాషణలో.... చిత్ర, తనకి నచ్చిన సినిమా ’ఆది’ అంటుంది. ప్రేమ కథాచిత్రమైన గీతాంజలి నచ్చకుండా, ’ఫ్యాక్షన్ సినిమా ’ఆది’ నచ్చిందనీ, 20 సార్లు ఆ సినిమా చూసాననీ’ అనే చిత్రని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు కృష్ణ. సినిమా చివరిలో.... ’సీడీ ఇచ్చేసి తన హత్యానేరం గురించి నోరు మూసుకుని కూర్చొమని’ బెదిరించిన పోలీసు అధికారి, హీరో మీద దాడి చేస్తుండగా, హీరోయిన్ సీడీ తీసుకుని పోలీసు స్టేషన్ కి వెళ్ళాలని పరుగెడుతుంది. అంతలో తర్కం స్ఫురించి వెనుదిరిగి వచ్చి పోలీసు అధికారి చెంపచెళ్ళుమనిపిస్తుంది. ఆ విషయం ప్రస్తావిస్తూ కృష్ణ [హీరో] "అవును! అతడు మనల్ని చంపడని నీకెలా అన్పించింది?" అని అడుగుతాడు.

చిత్ర "తెలియని తనాన్నే భయం అంటారని అర్ధమైంది. కానిస్టేబుల్ రాజు ఆ అమ్మాయిని హత్య చేసాడనీ, ఆ విషయం గుర్తించినందుకు రఘని చంపాడనీ, శివని గాయపరచాడనీ, నన్ను చంపబోతుండగా తాను కానిస్టేబుల్ రాజుని షూట్ చేసానని వ్రాసి కేసు ఫైలు క్లోజ్ చేసాడు. మరి ఇప్పుడు మనిద్దరినీ చంపి, ఏం సంజాయిషీ ఇచ్చుకుంటాడు?" అంటుంది. నిజంగా ’తెలియని తనమే భయం. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ విషయంలోనైనా అంతే. అందుకే అంటారేమో ’Knowledge is Power’ అని.

ఇక చిత్రని గురించి కృష్ణ "నువ్వే ఒక ’ఆది’ అయిపోయావు" అంటాడు.

నా పేరు ఆదిలక్ష్మి. నా మిత్రులు కొందరు, ముఖ్యంగా నా ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు, నన్ను ’ఆది’ అనే పిలిచే వాళ్ళు. ’కథ’ సినిమాతో ’లగేరహో మున్నాభాయ్ [శంకర్ దాదా జిందాబాద్] లకి సమాధానంగా ’ఆది’ under line చేయబడింది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే - సినిమా ప్రారంభంలోనే చిత్ర కుటుంబాన్ని చంపిన విద్యార్ధి గుండాలని, పోలీసులు మారుతి వ్యాన్ లో బాంబుపెట్టి పేల్చేసే దృశ్యం చూపబడుతుంది. చిత్ర ఎంత చెప్పిన, వినిపించుకోకుండా హత్యాకాండని రోడ్డు ప్రమాదంగా పోలీసులు మూసి వేసిన అడ్మినిస్టేషన్ తాలూకూ రెడ్ టేపిజానికి జవాబుగా.... ఆమె తండ్రి [ప్రొఫెసర్] విద్యార్ధి అయిన మరో పోలీసు అధికారి, తన బృందంతో, అదే రెడ్ టేపిజాన్ని అడ్డం పెట్టుకుని ఈ వ్యాన్ ని పేల్చివేస్తాడు. "ప్రొఫెసర్ గారికి సంఘ విద్రోహులైన విద్యార్ధులే కాదు, మాలాంటి విద్యార్ధులూ ఉన్నారు" అనే డైలాగ్ చెప్పబడే ఈ సన్నివేశానికి మిగిలిన కథతో ఏ సంబంధమూ ఉండదు.

ఇప్పుడు కాదు గానీ 2006, 2007 లలో, ఈనాడు వసుంధరలో, తరుచుగా.... పనిఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి మనస్తత్వ నిపుణుల పేరిట కొన్ని సూచనలు వచ్చేవి. వాటిల్లో - కోపం వస్తే ఒంటరిగా గదిలో తలుపులు వేసుకొని గట్టిగా అరిచెయ్యాలనీ, లేదా పేపర్ మీద వ్రాసేయాలనీ చెప్పబడేది. ఇంతటితో ఆగితే సరే!

కానీ.... ఒత్తిడి తగ్గించుకునేందుకు, ఆదివారపు సెలవులనీ పండగ ప్రత్యేక దినాలనీ గడిపేటప్పుడు 35 - 40 ఏళ్ళ మహిళలైనా తమ కూతుళ్ళతో కలిసి నాట్యం చెయ్యాలనీ, రెండుజడలు వేసుకుంటే ఉత్సాహంగా అన్పిస్తుందనీ, ఎవరో ఏదో అనుకుంటారని సంకోచపడ వద్దనీ సూచనలు వచ్చేవి.

’నిజంగా మనస్తత్వ నిపుణులు అలా చెబుతారా?’ అన్పించేది. అలాంటి చిట్కాలు పాటిస్తే ఒత్తిడి ఏమాత్రం మాయమౌతుందో తెలీదు గానీ, అలా ప్రవర్తించిన వాళ్ళని చుట్టుప్రక్కల వాళ్ళు పిచ్చివాళ్ళనటం మాత్రం ఖాయం అనుకునేవాళ్ళం. కథ సినిమాలో నాయిక చిత్రని పిచ్చిదానిగా చిత్రించటానికి హంతుకుడైన పోలీసు అధికారి పన్నిన పన్నాగాలు చూసినప్పుడు, మాకు ఈనాడు వ్రాతలు మరింత బాగా గుర్తుకూ వచ్చాయి, అర్ధమూ అయ్యాయి.

ఇన్ని ప్రత్యేకాంశాలు ఉన్నాయి కాబట్టే, ఈ సినిమా మీడియా ప్రచారాన్ని పొందలేదు. హిట్టయ్యిందో లేదో నాకు తెలియదు. మరేదో సినిమా సీడీ తెస్తే అందులో ఈ చిత్రమూ ఉండటంతో ’కథ’ చూడటం సంభవించింది. ఇక్కడ మరో గమ్మత్తు వివరణార్హం. కథ వంటి సినిమాలే గాక, గతటపాలో చెప్పిన సిక్కు కుర్రాడు క్రికెట్ మ్యాచ్ గెలిపించే సినిమా, బిపాసాబసు మానసిక భ్రాంతుల సినిమాల వంటివి.... మీడియా ప్రచారం లేకపోయినా, హిట్టయినా గాకపోయినా, డీడీలో శుక్ర శని వారాల్లో ప్రసారం కావడం రీత్యా మేము చూడటం జరిగింది. సిక్కు కుర్రాడి సినిమా అయితే క్లైమాక్స్ కు ముందు టీవీ ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. తర్వాత క్లైమాక్స్ ఏం జరిగిందో వేరొకరిని కనుక్కొని నవ్వుకున్నాము.

ఎందుకంటే - ఆ సినిమా నిర్మించే నాటికీ, డీడీలో ప్రసారం చేసేనాటికీ మధ్యలో మేము బ్లాగులో చాలా విషయాలే చెప్పేసాము మరి! ఆ సినిమాలోనేమో "మన్మోహన్ సింగే మనల్ని గెలిపించే.... మన టీమ్ సభ్యుడు" అని చెప్పబడింది. కాబట్టే ఇలాంటి సినిమాలని నెం.10 వర్గం గమ్మున దాచి పెట్టుకుంది. మీడియా ప్రచారపు హోరేదీ తగలకుండా! అయితే అలాంటివి ప్రత్యేకంగా డీడీలో ప్రసారం కావటంతో మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. నవ్వుకున్నాము కూడా!

ఇలా సినిమాల ద్వారా మాట్లాడటం విషయంలో ’అరుంధతి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

నాకు ఎంత ప్రయత్నించినా మీ టపాలు అన్తుపట్టటం లేదు .. మొట్ట మొదటి టపా నించి చదివితే తప్ప అర్థం కాదంటారా.. లేక నాకు ఇది మరీ హై లెవెల్ ఏమో

వాసు గారు,

ఈ టపాలు అంత అర్ధంకాని జడపదార్ధం ఏమీ కాదండి. కాకపోతే వేర్వేరు శీర్షికలతో, వేర్వేరు లేబుళ్ళల్లో ఉన్నా, అన్నీ టపాలు ఒకే విషయం గురించి కాబట్టి మధ్య నుండి చదవటం వల్ల మీకు గందర గోళంగా అన్పించవచ్చు. అన్నిటపాలు ఒకేచోట, అన్నీ లేబుళ్ళు ఒకే చోట index ఇచ్చాను. ఓపికగా చదవాలి. సందేహం వస్తే తప్పకుండా వివరిస్తాను.

@ నీ ఆత్మహత్యా సదృశ్యమైన అసైన్ మెంట్లతోనే.... నీ మీడియాకీ, నీ వ్యక్తిగత గౌరవమర్యాదలకీ, హోదాకీ సమాధి కట్టుకుంటావు - ఈ హెచ్చరిక.... నెం.5 వర్గం, స్పష్టంగా నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ అందులో కీలక వ్యక్తి రామోజీరావుకీ ఇచ్చింది.

>> నెం.5 వర్గ రామోజీకి తన మీడియాని తానే నాశనం చేసుకునే అస్సైన్మెంట్ ఇచ్చిందంటారా? అందుకేనేమో ' ఈనాడు ' పేపరు రోజురోజుకీ దిగజారిపోతుంది. రెండురోజుల క్రితం పేపరు అయితే దీనినే దృవపరుస్తుంది .మైన్ పేజిలో మూడు అతి పెద్ద యాడ్లు ఒకేఒక్క న్యూస్ ఐటెం. రెగులర్ గా మొదటి పేజీలో వచ్చే శ్రీధర్ కార్టూన్ కూడా గతి తప్పింది- అది మూ నాలుగు పేజీలలో వస్తింది . ఒక్క ముక్కలో చెప్పాలంటే 'ఈనాడు ' ప్రమాణాలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ETv-2 కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు . మీగతా చానెళ్ళతో పోల్చుకుంటేచాలా వెనుకబడిపొయింది.రెందు రొజుల క్రితం ఒక బ్లాగరు తన బ్లాగులో చానెళ్ళ రేటింగులను రాసుకున్నాడు http://www.24gantalu.co.cc/2010/03/blog-post_4558.html


(టామ్ రేటింగ్స్ సీఎస్ 14 ప్లస్.. వీక్ 12 )
జెమిని 676
మా టీవీ 377
జీ తెలుగు 358
ఈటీవీ 335
తేజ 347
సితార 29

న్యూస్ ఛానల్స్

టీవీ9 108
టీవీ5 79
ఈటీవీ2 41
ఎన్‌టీవీ 38
సాక్షి 29
ఐ న్యూస్ 28
జీ 24 26
హెచ్‌ఎంటీవీ 22
ఏబీఎన్ 21
స్టూడియో ఎన్ 15
మహాటీవీ 13

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu