1992 లో, పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన తొలి రోజుల్లోనే, లెనిన్ కు తన స్నేహితుడొకరు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. అదేమిటంటే -

A మరియు B అనే ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళున్నారు. వాళ్ళకు ఆట వచ్చు. C అనే వాడికి చదరంగపు ఆట రాదు. అయినా A,Bలతో ఆడి గెలవాలన్నది C లక్ష్యం. దాంతో రెండు చోట్లా ఆటకు తలపడతాడు. ముందుగా A దగ్గరి కొస్తాడు. చదరంగపు బల్లమీద, A ఒక ఎత్తు వేస్తాడు. వెంటనే C, B దగ్గరున్న బోర్డు మీద అదే ఎత్తుగడ వేస్తాడు. అంటే A బోర్డు మీద, A ఏ పావుని ఎలా కదిపాడో అలాగే B బోర్డు మీద C కదిపాడన్న మాట. A తో ఆటలో... ఆట ప్రారంభకుడు A అయితే, Bతో ఆటలో.... ప్రారంభకుడు C అన్నమాట.

సరే! C వేసిన తొలి ఎత్తుకు ప్రతిగా B ఒక ఎత్తువేస్తాడు కదా, అదే ఎత్తుగడని తెచ్చి C, A మీద ప్రయోగిస్తాడన్న మాట. దానిమీద A మరో ఎత్తువేస్తాడు కదా! అది తీసికెళ్ళి B మీద ప్రయోగించటం, B వేసిన ఎత్తుగడని తెచ్చి A మీద ప్రయోగించటం - ఇదీ C ఆడే ఆట. ఆ విధంగా ఆడుతూ చివరికి రెండు బోర్డుల మీదా గెలిచాడు - ఇదీ లెనిన్ కి తన మిత్రుడు చెప్పినది.

అయితే ఇందులో ఓ లొసుగు ఉంది. A,Bలతో ఆడే ఆటలో C కి ఆటరాదు. A వేసిన ఎత్తు B మీద ప్రయోగించటం, B వేసినది తెచ్చి A మీద ప్రయోగించటం చేశాడు. A తో ఆటలో తను రెండవ ఎత్తు వేసిన ఆటగాడు. B తో ఆటలో తొలి ఎత్తు వేసిన ఆటగాడు.

అలాంటప్పుడు A తో ఆటలో ఓడిపోతేనే B తో ఆటలో గెలవగలడు. లేదా Bతో ఓడిపోతే A మీద గెలవగలడు. ఎక్కడో ఓ చోట ఓడిపోతేనే రెండో చోట గెలవగలడు. అంతే కానీ, రెండు బోర్డుల మీదా C గెలవటం అసాధ్యం కదా? ఎందుకంటే A లేదా B ల మీద గెలవటానికి తనకి [Cకి] ఆటరాదు. మరో మాటలో చెప్పాలంటే Cని మైనస్ చేస్తే A మరియు B లు ఆటలో ప్రత్యక్షంగా తలపడినట్లే.

ఈ లొసుగునే.... "ఏదో ఒక బోర్డు మీదే C గెలవగలడు కానీ రెండు చోట్లా ఎలా గెలవగలడు?" అని లెనిన్ తన మిత్రుణ్ణి ప్రశ్నించగానే, అతడికి ఆ లాజిక్ వెంటనే ఆర్ధం కాలేదు. లెనిన్ వివరించాక అతడూ తికమకపడి "ఏమో! ఇప్పుడు నాకూ గందరగోళంగా ఉంది" అనేసాడు. లెనిన్ నాకిది చెప్పినప్పుడు ఎంతో గమ్మత్తుగా, ఆసక్తిగా అన్పించింది.

శ్రీశైలంలో గుడిసెలో ఉంటున్న రోజుల్లోనూ దీన్ని అర్ధం చేసుకునేందుకూ, విశ్లేషించుకోవటానికి, అనువర్తించుకోవటానికి బాగా ప్రయత్నించాము. తోచినట్లు ఆలోచించే వాళ్ళం. రకరకాలుగానూ ఆలోచించేవాళ్ళం. ఏదీ సంతృప్తి కలిగించేది కాదు. 1995 వరకూ ఎన్నోసార్లు ఈ ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం’ గురించి ఆలోచించినా.... సరియైన విశ్లేషణా, అనువర్తనా చేయలేకపోయాము.

ఏదీ మాకు పెద్దగా అవగాహన లేని రోజులవి. ఎందుకంటే - అప్పటికి మా దృష్టిలో భారత దేశపు నేలమీద భారత ప్రభుత్వం కంటే, ప్రధానమంత్రి కంటే ఎవరూ బలవంతులు కాదు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల గురించీ, వాటి శక్తి గురించీ అస్సలు అవగాహన లేదు. వాటి అస్తిత్వం గురించిన ఊహ కూడా లేదు. అందుచేత మా జీవితంలో జరిగే అన్ని చర్యలకీ పీవీజీనే బాధ్యుడు అనుకునేవాళ్ళం.

కాబట్టే - "పీవీజీ దేశానికి మేలు చేస్తున్నాడు? మరి నాకేందుకు కీడు చేస్తున్నాడు? పౌరధర్మంగా నేను ఫిర్యాదు ఇచ్చాను. ప్రభుధర్మంగా పీవీజీ మమ్మల్ని కాపాడాలి. బదులుగా ఈ వేధింపు ఏమిటి? దీనికి భగవంతుడు కూడా క్షమించడు. పీవీజీ ధర్మపరుడే కావచ్చు గాక! మా పట్ల మాత్రం అధర్మం పాటిస్తున్నాడు. [అసలు దేశంపట్ల కూడా అధర్మం పాటించే వాడే అయితే దీనంతటి బదులు దేశాన్ని ఎప్పుడో బద్ నామ్ చేసి ఉండేవాడు. అంతేగాక ఇలా వేధించటం కంటే మా తలకాయలు లేపేసి ఉండేవాడు కదా? అందుచేత దేశం పట్ల పీవీజీ నిబద్దుడే అన్నది మా అభిప్రాయం.] కాబట్టి దేవుడు మా పక్షానే ఉన్నాడు, ఉంటాడు. పీవీజీ తప్పు చేస్తున్నాడు" అని తెగ ఆక్రోశ పడేవాళ్ళం. తర్వాత ఈ మధ్య వచ్చిన అనేక సినిమాలలో "తప్పు చేస్తున్నావ్?" అనే డైలాగ్ తప్పని సరిగా ఉండటం చూశాం.

గూఢచర్యం మీద అవగాహన కలిగిస్తున్నాడన్న అభిప్రాయానికి వచ్చినప్పుడూ అదే తిట్టుకున్నాము. "ఇవ్వని గురుత్వాన్ని ఎవరు పుచ్చుకొమ్మన్నారు" అనుకుని మరీ తిట్టుకున్నాము. మా దగ్గర అణుస్థాయిలో అహంకారం కన్పించినా, ఆ అహంకారం మీద కొట్టి మరీ, సరి చేసినప్పుడు "ఈ ప్రపంచంలో మాకు మాత్రమే అహంకారం ఉందా? ఎంతమందికి లేదు! అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష?" అని ఆక్రోశించాము. [తరువాత గాని దాని తాలూకూ మంచి ఫలితాలు మాకు తెలిసి రాలేదు. జ్ఞానము, దంతము వచ్చేటప్పుడు బాధపెడతాయని ఒకచోట చదివాను. నిజమే, అజ్ఞానము పోయేటప్పుడు చాలా దుఃఖం వస్తుంది.]

అయితే, 2005 తర్వాత.... మా జీవితాలలో రామోజీరావు ప్రమేయమూ, గూఢచర్యపు ఆస్తిత్వమూ అర్ధమయ్యాక చాలా విషయాలు పునశ్చరణా, పునఃపరిశీలనా చేశాము. అప్పుడు వెనుదిరిగి చూసుకుంటే మా జీవితాలలో రామోజీరావు తాలూకూ నెం.10 వర్గమూ, పీవీజీ తాలూకూ నెం.5 వర్గమూ రెండూ కన్పించాయి.

అయినా కూడా ’రెండు బోర్డుల మీదా ఒకే ఆటగాడి విన్యాసం’ గురించి విశ్లేషించటానికి, అనువర్తించటానికి చాలా రోజులు, చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. అది అర్ధమయ్యాక మాత్రం ఎంత ధ్రిల్ గా అన్పించిందంటే - యుద్దపు అసలు మజా, మెదళ్ళతో యుద్దంలోని మర్మమూ బాగా అనుభవంలోకి వచ్చాయి. పీవీజీ మేధస్సు అద్భుతంగా కన్పించింది. వివరంగా చెబుతాను. అయితే దీనికి ముందు మరికొన్ని వివరాలు చెప్పాలి.

ఈ లేబుల్ లోని గత టపాలలో 1992 నుండి గూఢచర్య అంకాలని నాలుగు దశలుగా విభజించి వివరించాను. అదే మా జీవితాలలో అయితే దాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

మొదట దశ: 1992 లో పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుండి 1995 లో మేము ఫ్యాక్టరీ ఖాళీ చేసేవరకూ.
రెండో దశ: 1995 లో ఫ్యాక్టరీ కోల్పోయినప్పటి నుండి 2005 లో రామోజీరావు మీద మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు ఇచ్చేవరకూ.
మూడో దశ: 2005 నుండి ఇప్పటి వరకూ.

ఇక తొలి దశలో.....
అప్పటికి మేము అవునన్నా కాదన్నా గూఢచర్యపు తొలిపాఠాలు నేర్చుకోక తప్పలేదు. ఆ రోజుల్లోనే, 1995 ఫిబ్రవరిలో మండలి వెంకట కృష్ణారావుని కలిస్తే.... "ఒక వేళ నేదురమల్లి జనార్ధన రెడ్డే ఇదంతా చేస్తున్నాడేమో?" అంటూ మాకు హింట్ చేయ ప్రయత్నించాడు. అప్పటికి మాకది స్ఫురించలేదు. నేదురమల్లినీ, కరుణానిధినీ, వీపీ సింగ్ నీ, రామోజీరావు నీ కలిపి దుష్టచతుష్టయంగా పోలుస్తూ, పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదులో వ్రాసాను. కాబట్టి నేదురమల్లిని గుర్తు చేస్తూ.... మండలి, రామోజీరావు బృందం యొక్క ప్రమేయాన్ని under line చేయ ప్రయత్నించాడన్నది 2005 తర్వాత పునరాలోచనతో అర్ధమయ్యింది.

అప్పట్లో కసిగా, అందరికీ చెబితే నన్నా ఈ వేధింపు ఆగుతూందేమోనని.... శ్రీశైలంలో కొందరికీ, ఫ్యాక్టరీ నడుపుతున్నప్పటి పాత మిత్రులు కొందరికీ చెప్పాము. ’వాటన్నింటిని ఆలోచించటం మాని వేయ్యండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి’ అని అందరూ సలహాలిచ్చారు. [చిత్రంగా శ్రీశైలంలో ఎవరెవరికి చెప్పామో వారందరికీ, తర్వాత హవా నడిచింది. లక్షల్లో ఆదాయము వచ్చింది. అంతే పరిమాణంలో అవకతవకల్లో దొరకడాలూ, కేసులూ, కాన్సర్లు వచ్చాయి.]

అందరూ ఒకే సలహా ఇవ్వటంలోనూ ఓ శృతీ లయా అర్ధమయ్యాయి. అయినా ఐబి అధికారిని కలిసాము. అతడు విధివ్రాతని నమ్మమన్నాడు. ఇక అన్నీ మర్చిపోవాలనే నిర్ణయానికి బలంగా వచ్చాము. గుర్తుంచుకొని ఆలోచించటం కంటే అన్నీ మరిచిపోయి బ్రతకటం హాయి అనిపించింది. నిజానికి అందరూ ఒకే మాట - "రామోజీరావు, పీవీజీకి ఫిర్యాదు అన్నీ మరిచిపొండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి" అన్నారు.

మొత్తంగా ఒకే సమయంలో అందరూ ఒకే విధంగా చెప్పటం - అందులోనూ ఓ శృతీ లయా ఉన్నప్పటికీ - మాకూ అదంతా మరిచిపోవటమే సుఖంగా అన్పించింది.

రెండో దశ:
ఆ విధంగా రెండో దశ 1995 లో ఫ్యాక్టరీ ఖాళీ చేయటంతో ప్రారంభమైంది. 2005 అక్టోబరు లో, శ్రీశైలంలో ఉండగా, రామోజీరావు మీద మన్మోహన్ సింగ్ కి ఫిర్యాదు చేసే వరకూ ఈ దశ కొనసాగింది. దాదాపు పదేళ్ళ పాటు [1995 నుండి 2005 వరకూ] ఏవీ ఆలోచించలేదు. మా కెరీర్ - మా పాప - దైవభక్తి. ఇదే మా లోకం! ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గుర్తు చేయబోయినా.... మేము మూగ చెముడూ గుడ్డివాళ్ళాలా ఉండేవాళ్ళం.

’మనస్సులో కూడా అనుకోకూడదు’ - అని నిర్ణయించుకున్నాక అస్సలు దాన్ని తలచనే లేదు. 2001 లో ఎంసెట్ అవకతవకల మీదా, వ్యవస్థీకృత వేధింపు మీదా నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశాక, కొందరు మర్మగర్భంగా మాట్లాడినా మాకది ఎక్కలేదు. అప్పటికి ఎదురుగా ఉన్న సూర్యాపేట కాలేజీ వాళ్ళనే వేధింపుదారులుగా చూశాము.

అదే మాకు తేలికగా అన్పించింది. తిన్న దెబ్బలకి.... 1992 గురించి గానీ, రామోజీరావు గురించి గానీ ఆలోచించటానికి మనస్సు మొరాయించింది.ప్రతి సమస్యకూ ఉన్న పైకారణాన్నే చూస్తూ, వాటికి తగిన పరిష్కరాన్నే చేయటానికి ప్రయత్నించాము. కాబట్టి కూడా చాలా ఎదురు దెబ్బలు తినవలసి వచ్చింది. కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోయాము కూడా! ఆ విధంగా రెండో దశ నడిచింది.

అయితే 2005 లో వేధింపు పరాకాష్టకు చేరి, మానసికతంత్రాలు మా పాప మీదికీ, మా భవిష్యత్తు మీదికీ వచ్చేసరికి, ఇక అనివార్యంగా రామోజీరావు గురించి పునరాలోచన చేశాము. అప్పుడే మన్మోహన్ సింగ్ కి, రామోజీరావు మీద ఫిర్యాదు చేశాము. ఆ విధంగా రెండో దశ ముగిసి మూడో దశ ప్రారంభమైంది.

మూడో దశ :
2005 నుండి ఇప్పటి వరకూ నడుస్తోన్న దశ ఇది. 2005 లో ప్రారంభమైన ఫిర్యాదుల పరంపర, 2007 చివరి వరకూ కొనసాగింది. వాటి వివరాలు, పీవీజీ - రామోజీరావు - మా కథ లోనూ, మరికొన్ని గత టపాలలోనూ వ్రాసాను. పత్రాలతో సహా సాక్ష్యాలు Coups On Worldలో ఉంచాను. వివిధ రంగాల మీద నకిలీ కణికుల కుట్ర గురించి కూడా అందులో పొందుపరిచాను. 2007 చివరి మాసాల నుండి 2008 జూలై దాకా.... నేను వ్రాయటం - మా పాప ఫెయిర్ చేయటం మా వారు టైపు చేయటం ప్రతీరోజూ అదే దినచర్యగా చేశాము.

2008 నవంబరు 2 న ’అమ్మఒడి’ బ్లాగు తెరిచాము. డిసెంబరు 20 - 22 లలో Coups On World[మేము cow అని పిలుచుకుంటాము] ను ఒకేసారి విడుదల చేశాము. అందులో 1992 వరకూ నకిలీ కణికులు ప్రపంచం మీద, భారత దేశం మీద నిర్వహించిన కుట్రల గురించీ వ్రాసాము.

వాటిల్లోంచి.... ’భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర’ అనే లేబుల్ క్రింద, రాజకీయరంగంపై కుట్రని తెలుగులోకి అనువదించాను. 2009 మే నుండి నకిలీ కణిక అనువంశీయుల తిరగబడ్డ కథని వివరించటం ప్రారంభించాను. అది తెలుగులో మాత్రమే వ్రాసాను, వ్రాస్తున్నాను.

ఇక ఈ మూడో దశలోనే.... 1992 నుండి దేశంలోనూ, మా జీవితాల్లోనూ జరిగిన, ప్రతీ సంఘటననీ, ప్రతీ అంశాన్నీ పరిశీలించటం, విశ్లేషించటం చేశాము. 2005లో వెనుదిరిగి చూస్తే మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయమూ కనబడింది. అతణ్ణి కట్టడి చేసే మరో బృందపు ప్రమేయమూ కనబడింది. రామోజీరావు బృందాన్ని నకిలీ కణిక వ్యవస్థగానూ, నెం.10 వర్గంగానూ వివరించాను. అతణ్ణి కట్టడి చేసే బృందాన్నే పీవీజీ సమీకరించిన నెం.5 వర్గంగా వివరించాను. ఎందుకంటే ఈ వేధింపు లోనూ ఓ శృతీ, లయా ఉన్నాయి కనుక. అదే ’రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం’ తాలూకూ వైచిత్రి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

http://eenadu.net/story.asp?qry1=16&reccount=27

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu