’నేర్చుకునే తత్త్వమే మనకి ఉంటే, దేన్ని చూసైనా, ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు’ అంటారు పెద్దలు. కొందరిని చూస్తే ఎలా ఉండాలో [ఎలా ప్రవర్తించాలో] నేర్చుకోవచ్చు, కొందరిని చూస్తే ఎలా ఉండకూడదో [ఎలా ప్రవర్తించకూడదో] నేర్చుకోవచ్చు. ఏదైనా.... మన పరిశీలనని బట్టి ఉంటుంది. ఈ సూత్రం ప్రకారమే.... 2005 లో, తర్వాతా, రామోజీరావు, వై.యస్.సోనియాల ప్రవర్తన, విన్యాసాలు చూసి.... మాకు, వాళ్ళకి మా నుండి కావలసినదేదో ఉందని అర్ధమయ్యింది. వాళ్ళకి వ్యతిరేకమైన వర్గమొకటి ఉందనీ అర్ధమయ్యింది.
మమ్మల్ని వేధించే వీళ్ళు చంపని దెందుకు? చంపకుండా అడ్డుకుంటున్న మరో వర్గం [దానికే నెం.5 వర్గం అని పేరు పెట్టాను.] మమ్మల్ని వేధింపు నుండి కాపాడదెందుకు? - ఈ ప్రశ్నలతో ప్రారంభమైన మా పరిశోధనకి, ఈనాడు వ్రాతలు రామోజీరావు చేతలు, వై.యస్., సోనియా గట్రాల చర్యలూ హింట్స్ లేదా క్లూస్ అయ్యాయి.
మనం పత్రికలలో తరచు చదువుతుంటాం - అనుమానాస్పదంగా తిరుగాడుతున్న లేదా తచ్చాడు తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. తీరా విచారిస్తే.... అప్పటి వరకూ మనకి తెలియని దొంగతనాల క్రమమో, మరో పెద్ద నేరమో వెలుగు చూస్తుంది. "ఓర్నాయనో!" అని ఆశ్చర్యపోతాం. ఇది, పై విషయానికి చక్కని పోలిక.
ఇక్కడ మీకు కొన్ని చిన్న సంఘటనలని ఉదాహరణగా వివరిస్తాను.
1992 లో, పీవీజీ కి ఫిర్యాదు ఇచ్చాక, గూఢచర్యం గురించి పెద్దగా తెలియనందున, ఈ రోజో రేపో రామోజీరావుని అరెస్టు చేసేస్తారనీ, రాజీవ్ గాంధీ హత్య మొదలు పాతబస్తీ మతఘర్షణల దాకా అన్నీ కేసులూ బయటికొచ్చేస్తాయనీ ఎదురు చూస్తూ గడిపాను. అప్పట్లో పీవీజీకి మాకూ ఉన్న వయోభేదం రీత్యా, ఆయన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ’తాతా’ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. అప్పటికి ఈ సోనియా ఎంతటిదో మాకు తెలియదు. రాజీవ్ గాంధీ మీద ఉన్న అభిమానం కొద్దీ, అతడిని వివాహం చేసుకుని జీవితంలో ఒంటరిదయ్యిందన్న జాలి, ప్రేమ కొద్దీ ఆమెని ’తిక్కలమ్మ’ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. "పాపం, భర్తని కోల్పోయిన ఇల్లాలు. ఏ పాపం ఎరగని అమాయకురాలు" అన్నది మా భావం. అందుచేత అలా అనుకునే వాళ్ళం.
అలాగే, 1992 లో రామోజీరావు గురించి, పీవీజీ దృష్టికి తీసుకెళ్ళటానికి ముందు వై.యస్.ని డీల్ చేసాను. అతడి గురించి, నేను కలిసినప్పుడు అతడి స్పందన గురించి చాలా పాజిటివ్ గా నా డైరీల్లో వ్రాసుకున్నాను. 1991, 92 డైరీలలో, 1993 లో నా వివాహమయ్యే వరకూ.... అన్నీ డైరీల్లో వ్రాసుకునేదాన్ని. పెళ్ళాయ్యాక నా ప్రతి ఆలోచననీ, భావాన్ని పంచుకునేందుకు మా వారు ఉండగా మరో పుస్తకం, అది డైరీ అయినా సరే, నాకు అవసరం లేకపోయింది. ఆ డైరీలన్నీ శ్రీశైలంలో మా గుడిసెలో ఉండి పోయాయి.
1995 లో గుంటూరుకు కెళ్ళిన తర్వాత, మా విద్యార్ధి తండ్రికి ఉత్తరం వ్రాసి మా గుడిసెలో ఉన్న పుస్తకాలని, సామాన్లని ఎదురు ఇంటి [మంత్రసాని ఇంటి]లో పెట్టమనీ, స్టాండు ఊయలని స్వంతదారుకీ ఇచ్చెయ్యమని వ్రాసాము. అతడలాగే చేసినట్లు మాకు జవాబు వ్రాసాడు. మేము శ్రీశైలం మళ్ళీ వచ్చినప్పుడు, మా ఎదురింటామె [మంత్రసాని] తన గుడిసె ఓసారి అగ్ని ప్రమాదంతో చిక్కుకుందనీ, తన వస్తువులతో పాటు మా పుస్తకాలు కూడా కాలిపోయాయనీ చెప్పింది. ’సర్లే’ అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. అయితే తరువాత రోజుల్లో ఆమె బంధువులబ్బాయి ఓ సారి కనబడి "మీరు వ్రాసుకున్న పెద్ద పుస్తకం ఒకటి మాకు దొరికింది. దాంట్లో చాలా పెద్దవిషయాలు వ్రాసి ఉన్నాయి. అయితే మా పిల్లలు వాటిని చింపి ఆడుకున్నారు" అని చెప్పాడు. ఆ డైరీలు నిజంగా కాలిపోయాయో, మరెవ్వరికైనా చేరాయో మేం ఆలోచించలేదు.
తర్వాత కాలంలో వై.యస్. సంక్షేమ వసతి గృహానికి వెళ్ళి, అక్కడి పిల్లలు ’సార్’ అనీ, ’అంకుల్’ అనీ పిలవగా "నన్ను ’తాతా!’ అని పిలవండి" అన్నాడట. ఈ వార్త వ్రాస్తూ.... ఈనాడు, క్రింద వై.యస్. ఫోటో, పైన "నన్ను తాతా అని పిలవండి" అంటూ, ఎవరికైనా దృష్టిని ఆకర్షించే విధంగా [catching గా] ప్రచురించింది. గతంలో చెప్పినట్లుగా ఈనాడు వచ్చే వార్తలు ఒక సున్నా అయితే, మా చుట్టూ జరిగే సంఘటనలు మరోసున్నా. రెండింటినీ కలిపే లింకు తెలిస్తే అక్కడ ’8'[Eight No.] కనిపిస్తుంది. లేకపోతే పైన ఒక సున్నా క్రింద ఒక సున్నా కన్పిస్తుంది. అలాంటివే ఈ సంఘటనలు కూడా! ఆయా వార్తలకీ, సంఘటనలకీ మధ్య తత్కాల సంబంధం ఉండటమే ఆ లింకు. గత టపాలలో చెప్పినట్లుగా, మా మిత్రుడితో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నప్పుడు, ఈనాడు వసుంధరలో ’చెడిన స్నేహాలు ఎలా పునరుద్దరించుకోవాలో’ వార్తలు రావడం, అప్పుడు మా మిత్రుడు మేము ఎక్కడికి వెళ్ళినా తారసపడటం లాగానన్న మాట!
ఇలాంటివే మరికొన్ని సంఘటనలు!
మాకు 2004 సెప్టెంబరులో, శ్రీశైలంలోని చల్లా వెంకయ్య సత్రం మొదటి అంతస్తులో 10 వ నంబరు గది కేటాయించారు. కేటాయింపు పత్రం నా చేతి కొచ్చిన రోజున.... ఈనాడులో, మెయిన్ పేజీ, మొదటి కాలమ్ లో, ’పేదల గృహలకి ఒక బల్బుకు పది రూపాయలతో విద్యుత్తు సౌకర్యం’ అనే పధకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా చెబుతూ.... అప్పటి సీఎం వై.యస్. చేతిలో ఒక బల్బు పట్టుకున్న వార్త ప్రచురింపబడింది. అందులో విశేషం ఏమిటంటే - ఆ బల్బులో '10' అంకె వేసి ఉంది. అప్పటికి మాకు మా జీవితాల్లో గూఢచర్యం గురించి ఊహ కూడా లేనందున మేము దాన్ని యధాలాపంగా చదివి వదిలేసాము.
అయితే ఆ రోజున - మా గది కేటాయింపు విషయంలో - "పదో నంబరు గది పై అంతస్థులో చివరిది. స్కూలుకు అనుకూలం కాదు. క్రింది అంతస్తు అయితే రేకులు దించుకుని extend చేసుకొవచ్చు. మరో పదిమంది పిల్లల్ని చేర్చుకోవచ్చు. పిల్లలకి ఆటస్థలం కూడా ఉంటుంది. పైగా అందరి వరండాలలో నుండి పిల్లలు నడుస్తూ రావటం ప్రక్కవాళ్ళకి ఇబ్బంది కదా! గ్రౌండ్ ప్లోర్ లో గానీ, మరెక్కడైనా single cottage గానీ అయితే బాగుంటుంది" అని మేము, మాకు గది ఇప్పించిన మా విద్యార్ధి తల్లిదండ్రులతో అన్నాము.
వాళ్ళు "ఎంత అడిగినా కృష్ణయ్య సారు[Dy.E.O.] మీకు పదో నంబరే allot చేసారు మేడం. అసలే తిక్కమనిషి. ఇప్పటికి పోనీయండి. తరువాత చూద్దాం" అన్నారు. "పది మంచి నంబరు లెండి సార్!" అంటూ కొందరన్నారు. "సోనియా గాంధీ నివాసం పది జనపథ్, మన స్కూలు 10, వెంకయ్య సత్రం" అంటూ మరికొందరు నవ్వులాట లాడారు. ఆ విధంగా పదో నెంబరు గది మాకు under line చేయబడింది.
శ్రీశైలం దేవస్థానపు Dy.E.O. ’తిక్క, తిక్కమనిషి’ అన్న విశేషణం పదేపదే మా చెవికి చేర్చబడింది. అసలు లంచం తీసుకోడు గట్రా విశేషణాలతో అతడి గురించి చెప్పబడింది. [తరువాత అతడు ఎలాంటి వాడో బట్టబయలయ్యింది లెండి.] నిజానికి మాకు అప్పటికి పెద్దగా ఏదీ అవగాహనకి రాలేదు. ప్రతీరోజు... స్కూలు పని అయిపోగానే ’ఆలోచన - విశ్లేషణ’ మొదలుపెట్టేవాళ్ళం. ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది. పదో నెంబరు! అదే వాళ్ళు మాకు under line చేయాలనుకున్న విషయం.
మాకు పదో నెంబరు గది తామే ఇచ్చామనీ... పూర్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడూ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, మాకు ఇల్లూ వాకిలీ ఊడగొట్టి, బ్రతుకు బస్టాండు పాలు చేసి ఆ పంచన ఈ పంచన అగచాట్లు పడేటట్లు చేస్తే.... తాము అధికారంలోకి రాగానే పోగొట్టుకున్న సామాను మొత్తం మాకు వెంటనే కొనిపించామని, అలాగే మాకు పదో నంబరు గది కేటాయించామని, కాబట్టి మనదంతా ఒకటే విభాగమనీ... మా బుర్రకి ఇంకించేప్రయత్నాలు అన్నిరకాలుగా జరిగాయి.
ఇలా జరుగుతున్న విషయాలని పరిశీలించుకుంటూ పోవటం తప్పతే మేము ఎవ్వరితోనూ ఏవీ తర్కించేవాళ్ళం కాదు. మేమే బుర్రబద్దలయ్యేలాగా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు బ్లాగులో చెప్పడమే ఏదైనా....!
వీటన్నిటినీ పురస్కరించుకునే నకిలీ కణిక వ్యవస్థ కీ, ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాల్లోని వారితో కలిపి నెం.10 వర్గం అని పేరుపెట్టాను. ప్రత్యర్ధిగా పని చేస్తున్న వాళ్ళు కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండరు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న, సిఐఏ మాటున దాగిన నకిలీ కణిక వ్యవస్థకి, వ్యతిరేకంగ పనిచేయాలంటే.... ప్రపంచవ్యాప్తంగా సహాయ సహకారాలు అవసరం. కాబట్టే.... నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ వ్యతిరేక వర్గానికి నెం.5 వర్గం అని పేరుపెట్టాను. అమెరికా సహకారం లేనిది ఇది అసాధ్యం గనుక, ఏ దేశంలో నైనా తమ దేశంపట్ల ప్రేమాభిమానాలు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు గనక, అమెరికా రక్షణ అధికారిక భవనం పెంటగాన్ కాబట్టి దీనిని నెం.5 వర్గం అన్నాను.
ఈ వర్గాల గురించి నేను ’అమ్మఒడి’లో వ్రాసిన తర్వాత ఈనాడు పత్రికలో "ఈనాడు మాత్రమే 5" అంటూ ఓ వాణిజ్య ప్రకటన వచ్చింది. నిజానికి అది Rexona Soap తాలూకూ వాణిజ్య ప్రకటన. వాళ్ళు 5/-రూ. అఫ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. [ ’ఈనాడు మాత్రమే 5/-ఆఫ్’ ]
వెరసి మాకు చెప్ప వచ్చిందేమిటంటే - మేము నెం.5 వర్గాన్ని పది వర్గం గానూ, నెం.10 వర్గాన్ని 5 వర్గంగానూ పొరబాటు పడుతున్నామని. కాబట్టి సోనియా, బ్రతికి ఉండగా వై.యస్. మాకు శ్రేయోభిలాషులు. వై.యస్. అయితే ఏకంగా పీవీజీకి వారసుడే! కాబట్టి ’తాత’ అని పిలవమన్నాడన్న మాట. "అందరం పది వర్గీయులమే కాబట్టి, మీకు తెలిసిందంతా వచ్చి చెప్పండి".
ఈ భాష గురించి మచ్చుకి ఓ ఉదాహరణ చూపిస్తాను.
గత నెల ఫిబ్రవరి 16 వ తేదీన ఈనాడులో వరుసగా వార్తల శీర్షికలు - ’శాంతి లేకపోతే ఏమీ మిగలదు’ ’మన సభ్యులే బయటికెళ్తే ఎలా?’ ’నిర్లక్ష్యం కూడని 10 లక్షణాలు’ ’ఆ ఐదు త్వరగా తీస్తేనే’ ’అవి మాయ మాటలు’.....! ఇలాంటి శీర్షికలన్నీ వచ్చాయి. 10 ని కలుపుకోవటంలో నిర్లక్ష్యం కూడదని, 5 ని త్వరగా తీసేయాలని, చెప్పే ప్రయత్నం ఇది! అదే రోజు నా బ్లాగు వ్యాఖ్యల్లో ఒక అజ్ఞాత ’మీరు ఈ విధంగా వాళ్ళ స్ట్రాటజీ అంతా బహిర్గతం చేస్తుంటే వాళ్ళు [No.5 వర్గం] తమ పనిని ఎలా కొనసాగించగలరు?’ అన్నాడు.
"కాబట్టి నువ్విలా అన్నీబ్లాగుల్లో చెప్పి వేయకు. ఈనాడు రామోజీరావు 5 వర్గం. మనమంతా 10 వర్గం. వచ్చి నీకు తెలిసిందంతా మాకు చెప్పు!" - ఇదీ చెప్పబడింది. దీన్ని గురించే గతటపాలో రామోజీరావు మాతో మాట్లాడే తీరు - మరింత స్పష్టమైన భాషలో వ్రాసాను. నిజానికి మేం సామాన్యులం. తాము ఏ వర్గమైనా కానీ, పదవుల్లో ఉన్నారు, పైస్థాయిల్లో ఉన్నారు. వాళ్ళు రామోజీరావుకి వ్యతిరేకమైన వర్గమే అయితే, అన్ని వాళ్ళే కదా నడుపుతున్నారు? అలాంటి వాళ్ళకి మేం చెప్పాల్సిన దేం ఉంటుంది? దర్భలతో చేసిన కంకణాన్ని బంగారంగా చెబుతూ, పంచతంత్రంలో, కంకణం చేతబట్టుకుని బాటసారిని ఊబిలోకి ఆహ్వానించే పులిలాగా కాకపోతే ఏమిటిది?
ఇలా మేము నెం.5 ని పదిగా, అంటే రామోజీరావు వర్గంలోనే సోనియానీ, వై.యస్.నీ, కలిపేసి... ఆ ప్రకారమే బ్లాగు వ్రాసేస్తున్నామట. కాబట్టి బ్లాగు డిలీట్ చేసి, ఇంకా ఏమేమీ తెలుసో ఢిల్లీ వెళ్ళి సోనియాకి చెప్పాలి - ఇదీ వత్తిడి.
మరో ఉదాహరణ చెబుతాను. అప్పట్లో మేంపెద్దగా ఆలోచించని విషయం ఇది. 1993 లో మా వివాహం అయినప్పటి నుండి 1995 లో మా పాప పుట్టే వరకూ... ఆపైన రెండు నెలల వరకూ శ్రీశైలంలో గుడిసెలో నివసించాము. మా గత టపాలలో చెప్పినట్లుగా మా గుడిసె గోడకి బయటి వైపు కన్నంలో ఆరడుగుల పాము ఉండేది. మొదట్లో చాలా భయపడ్దాను. అనివార్యమై మెల్లిగా అలవాటు పడ్డాము. అప్పటికి కష్టాలు దాటటానికి ’అన్నిటికీ దేవుడే రక్ష’ అనుకునేవాళ్ళం. పాముని సైతం అలాగే అనుకుంటూ దాన్ని ’రక్షకుడు’ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. ఆ పాము గురించిన సంభాషణ వస్తే ఇవే మాటలు అనేవాళ్ళం. మా పాపకు నాగేంద్రుడి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాను కూడా! మానసికంగా ’పాము’ భయాన్ని దాటడానికి దాన్నే మాకు ’రక్షకుడు’ అనుకున్నాము. ఇప్పటికీ మేము గూఢచర్యం కంటే భగవంతుణ్ణి చూస్తాము. దైవేచ్ఛ ఉంటేనే ఏదైనా నడుస్తుందని ధృఢంగా నమ్ముతాము.
శ్రీశైలం నుండి వచ్చేసాక, ఫ్యాక్టరీ ఖాళీ చేసాక.... నంబూరు నుండి గుంటూరు చేరి ఎక్సెల్ లో పనిచేస్తున్నప్పుడు 1998 సంక్రాంతి పండగ రోజున ఈ-టీవీలో రక్షకుడు సినిమా వచ్చింది. మధ్యాహ్నం ఈ టీవీలో ప్రసారమైన ఆ సినిమా, సాయంత్రం ఆరు గంటలకి [అంటే వెంటనే నన్నమాట] జెమినీలో ప్రసారమైంది. అప్పటికి ఆ సినిమా వచ్చి ఎక్కువ కాలం కాలేదు. విశ్వసుందరిగా గెలిచిన సుస్మితా సేన్ నటించినందున, అప్పటికే ఆ సినిమా గురించి అందరూ తెగ మాట్లాడేసినందునా, పండుగ సెలవుల్లో ప్రసారమైన ఆ సినిమాని మేము ఆసక్తిగా చూశాము. అందులో కథానాయిక పేరు సోనియా. దాదాపు అదే తొలిసారి అనుకుంటాను తెలుగు [హిందీ సంగతి నాకు తెలియదు.] సినిమాలలో ’సోనియా’ అన్నపేరు వాడటం. ఆమె రక్షకుడు కథానాయకుడైన నాగార్జున. అప్పట్లో మేం చాలా క్యాజువల్ గా చూసిన సినిమా అది.
ఇదంతా ఆలోచించినప్పుడు ’మమ్మల్ని ఏ రక్షకుడైతే కాపాడుతున్నాడో.... సోనియానీ, ఆ రక్షకుడే కాపాడుతున్నాడనీ, కాబట్టి ఆమె మన తరుపున, మన కోసం నకిలీ కణిక వ్యవస్థతోనూ పోరాడుతుందనీ మేం నమ్మవచ్చనీ, నమ్మి అన్నీ చెప్పాల్సిందనీ’ మాకు అర్ధం చేయాలన్నదే వాళ్ల ప్రయత్నం.
అదే నిజమైతే.... ఇప్పటికి 18 ఏళ్ళుగా కావలసినంత సమయం నడిచింది. ప్రపంచవ్యాప్తంగా బహిర్గత మవ్వాల్సినంతగా కుట్ర బహిర్గతమూ అయ్యింది. మా కేసుతొ రామోజీరావు ప్రమేయం దేశం విషయంలోనూ, మా విషయంలోనూ కూడా సాక్ష్యాధార పత్రాల సహితంగా! నిజంగా సోనియాకి నిబద్దత ఉన్నదే నిజమైతే, రామోజీరావు కార్యకలాపాలని బయటిపెట్టి అతడి మీద చర్యతీసుకుంటే సరిపోతుంది కదా! ఈ పాటి దానికి ఇంత డొంక తిరుగుడంతా ఎందుకు?
ఎంత డొంక తిరుగుడంటే - దిగ్విజయ్ సింగ్, "సోనియాకి మేం పంపిన ఫిర్యాదులు తనకి ఫార్వార్డు చేయబడ్డాయంటూ" మాకు వ్రాసిన లేఖలో ఈనాడు సంస్థల ఛైర్మన్ ’రామారావు’ అని వ్రాయబడింది. అంత జాగ్రత్త తీసుకున్నారన్న మాట. ఈనాడు ఛైర్మన్ రామోజీరావు గాక రామారావా? అంత అలక్ష్యంగా నన్నా విషయాన్ని డీల్ చేసి ఉండాలి. అలాగైనా సోనియాకి, ఆమె అనుచరులకి ఈ విషయం పట్ల నిజాయితీ లేదని చెప్పవచ్చు.
లేదా ఎందుకొచ్చింది, అందునా లిఖీత పూర్వకంగా పంపుతున్నాం అనుకొని ’అతి’ జాగ్రత్త తీసుకొనైనా ఉండాలి. అలాగైనా నిజాయితీ లేనట్లే గదా! కానీ ’మనం మనం ఒకటే’ అంటూ మమ్మల్ని నమ్మించగలిగితే.... అప్పుడది వాళ్ళకి అలవాటున్న ప్రక్రియ అవుతుంది. మెదళ్ళతో కాదు గదా, ఏ యుద్దమైనా, ప్రత్యక్షంగా వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళు చెయ్యగలిగింది నమ్మకద్రోహమే! స్నేహితుల ముఖం పెట్టుకొని, కోడలు కాదు కూతురన్నంత ముఖం పెట్టుకొని! చివరకు సమాజానికి కూడా, శ్రేయోదాయకుల మనే మీడియా ముఖం పెట్టుకుని!
[కాబట్టే ఈ వత్తిడి మా మీద ఎక్కువగా ఉన్నప్పుడు, ఒకసారి ’అమ్మఒడి’లో ’పంచె కట్టినంత మాత్రాన వై.యస్.లు పీవీజీలు కారు, నేత చీరలు కట్టినంత మాత్రాన సోనియాలు ఇందిరాగాంధీలు కాలేరు’ అని వ్రాసాను.]
అయితే శ్రీశైలంలో చల్లా వెంకయ్య సత్రంలో ఉండగా మా చుట్టుప్రక్కల ఇళ్ళల్లోనికి, మాకు తెలిసిన వారి ఇళ్ళల్లోకి ’పాము వచ్చింది’ అన్నమాట మాకు ప్రత్యేకంగా వినిపింపబడేది. ఆ కథనాలు వచ్చిన తర్వాత కొన్నిరోజులకే సదరు వ్యక్తుల నుండి మాకు వేధింపు మొదలయ్యేది. చాలామంది విషయంలో ఇలాగే జరిగేసరికి, రానురాను మాకు ’ఫలానా వాళ్ళింటిలోకి పాము వచ్చిందట’ అన్నమాట వినగానే "ఓహో! ఇక రాబోయే రోజుల్లో వీళ్ళతో మన terms చెడిపోనున్నాయన్న మాట" అనుకునేవాళ్ళం. ఇక సున్నిపెంటలోని ఖాసీం వాళ్ళింటికైతే ఏకంగా కొండ చిలువే వచ్చింది. దాదాపు గంటపాటు వాళ్ళ తోటలో సంచరించింది. 11 అడుగుల పైగా ఉన్న ఆ కొండ చిలువని, తర్వాత అటవీ శాఖ వాళ్ళుపట్టుకుని, అడవిలోతట్టు ప్రాంతంలో వదిలి వచ్చినట్లు ఫోటోతో సహా పత్రికలలో వచ్చింది.
ఇక, బ్లాగులో మొత్తం విషయాలని చెబుతున్నామని, మన పనిని మనమే పాడుచేస్తున్నామని మాకు స్పురింప చేస్తూ... ఈనాడులో ఈ మధ్య కొన్ని వార్తాంశాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఫోటోలతో సహా ప్రచురించారు. ’పాముని పామే మింగింది’ ’పాముని మింగిన కప్ప’ ఇలాంటి వార్తాంశాలు!
అదీగాక మేము అన్నిటికీ దేవుడి మీదే ఆధారపడతూ, ఎవరి తోనైనా చెప్పేటప్పడు "ఫలానా సమయంలో ఫలానా సమస్య నుండి దేవుడి దయవల్ల బయటపడ్డాం" అనీ, "కానీండి. దేవుడేం చేస్తే అది!" అనీ... ఇలా సందర్భాన్నీ బట్టి అనే వాళ్ళం. దాంతో నెం.5 వర్గాన్ని [ఏదైతే మమ్మల్ని కాపాడుతొందని మేం అనుకుంటున్నామో అది. దానికి ఏ పేరైనా ఉండనీయండి.] మేము ’దేవుడు’ గా రిఫర్ చేస్తున్నామనుకున్నారేమో.... ’నా మనసే మహాశివుడు’ అంటూ శివరాత్రికి ప్రతికా ప్రకటనలిస్తూ, వై.యస్. "నేనే దేవుణ్ణి" అనేసాడు. ఇలా పత్రికలో ప్రకటనలతో, శీర్షికలతో, వార్తాంశాలతో నిరంతర మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదొక నిరంతర వార్తాస్రవంతి!
ఇవన్నీ విశ్లేషిస్తూ, ఎప్పటికప్పుడు మేము తర్క వితర్కాలు చేసుకుంటూ వేసుకున్న ప్రశ్నలు - చెప్పుకున్న జవాబులలో ఎన్నో వైరుధ్యాలు కనిపించాయి.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
6 comments:
మీరు ఈ విధంగా వాళ్ళ స్ట్రాటజీ అంతా బహిర్గతం చేస్తుంటే వాళ్ళు [No.5 వర్గం] తమ పనిని ఎలా కొనసాగించగలరు? అన్న అఙ్ఞాతను నేనే. మీ సీక్వెన్స్ చదివి ఇది నేను చాలా నిజాయితీగా అడిగిన ప్రశ్న. మీలాగా తర్క వితర్కాలతో ఆలోచి౦చి౦ది కాదు. మీరు పైన చెప్పిన స౦ఘటనలకూ నేనడిగిన సమయానికీ ఏ స౦బ౦ధమూ లేదు. మీరు అనవసర౦గా బుర్ర బద్దలు కొట్టుకు౦టున్నారనిపిస్తో౦ది.
తిక్కలమ్మ సోనియాకాదు, మీరే అనిపిస్తో౦ది. మీ మీద స౦వత్సరాల తరబడి గూఢచర్య౦ నెరపవలసిన౦త సరకు మీ వద్ద లేదని తెలియడానికి మీ బ్లాగులు 2, 3 చదివితే తెలిసిపోతు౦ది. అటువ౦టిది మీ డైరీ నిజ౦గానే వాళ్ళు చదివు౦టే వారికి అది 100 శాత౦ నిర్దారణ అయిపోతు౦ది. మిమ్మల్ని లోబరచుకోవడానికి చ౦పడమే కాకు౦డా అనేక మార్గాలున్నాయి. ఇలా మిమ్మల్ని స౦వత్సరాల తరబడి అదే పనిగా ఈనాడు ద్వారా బుజ్జగి౦చడ౦/బెదిరి౦చడ౦ చేయనవసర౦ లేదు.
ఈ వ్యాఖ్యను మీరు ప్రచురిస్తారో లేదో తెలియదు. అవసర౦ లేదు కూడా. మీరు ఇది ఎ౦దుకు రాస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు మధుబాబు లా౦టి నవలను రాస్తున్నట్లయితే ఒకే. కానీ మీరు నిజ౦గా ఇద౦తా నిజమని నమ్మి నిజాయితీతో రాస్తు౦టే మాత్ర౦ నాకు చాలా విచార౦గా ఉ౦ది. మీరు మీ భ్రమ లో౦చి బయటకు పడితే చాలా మ౦చిది.
ఇది చూసి నేను నె౦.10 ఏజె౦ట్ అని అనుకోవద్దు. అలాగని నేను నె౦.5 ఏజె౦టునూ కాదు. అసలు ఏ ఏజె౦టునూ కాదు. నచ్చి౦ది చదివి తోచేది రాసే ఒక అనామక బ్లాగు వీక్షకుడిని.
అజ్ఞాత గారు,
మిమ్మల్ని మీరు అజ్ఞాన బ్లాగు వీక్షకుడిగా చెప్పుకున్నారు. మీరు నిజంగా స్వతంత్ర అజ్ఞాత బ్లాగు వీక్షకులే అయితే... మీ వ్యాఖ్యాకు నా జవాబు ఇది - మీ రెండు వ్యాఖ్యలలోనే ఎంత పరస్పర వైరుధ్యాలు ఉన్నాయో చూడండి.
ఫిబ్రవరి 16 వ తేదీన మీరు వ్రాసిన వ్యాఖ్య
>>>మీరు ఈ విధంగా వాళ్ళ స్ట్రాటజీ అంతా బహిర్గతం చేస్తుంటే వాళ్ళు [No.5 వర్గం] తమ పనిని ఎలా కొనసాగించగలరు?
అప్పటికి మీకు అలా అన్పించింది. నెం.5 వర్గమేదో ఉందనీ, ఈ విధంగా మేము స్ట్రాటజీ అంతా వివరించేస్తూ పోతుంటే వాళ్ళకి ఇబ్బందికరం కాదా అనీ అన్పించింది.
అదే ఈ రోజుటి మీ వ్యాఖ్యలో అయితే ఇదంతా నా భ్రమ అన్పిస్తోంది. ఎంత పరస్పర వైరుధ్యాలు!
ఇక వేళ ఇది నా భ్రమ అని మీకు అన్పిస్తే నిరభ్యంతరంగా మీరీ బ్లాగు చదవటం మానెయ్యవచ్చు. ఎందుకంటే - మిమ్మల్ని నమ్మించవలసిన, convince చేయవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు గనక.
నేను మధుబాబు నవలేదో వ్రాస్తున్నాననుకొంటే అది మీ విచక్షణ. అందుచేత ఆలోచించకుండా, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించకండి. ఆ విధంగా నా సమయం వృధా చేయకండి.
ఇక మీరన్నట్లు
>>>>మిమ్మల్ని లోబరచుకోవడానికి చ౦పడమే కాకు౦డా అనేక మార్గాలున్నాయి. ఇలా మిమ్మల్ని స౦వత్సరాల తరబడి అదే పనిగా ఈనాడు ద్వారా బుజ్జగి౦చడ౦/బెదిరి౦చడ౦ చేయనవసర౦ లేదు.
అలాంటి వంద ప్రయత్నాలు చేయటం గురించే కదా నేనూ వ్రాస్తున్నాను!
ఒకవేళ మీరు స్వతంత్ర అజ్ఞాత బ్లాగు వీక్షకులు గాక, ప్రయత్నపూర్వకంగా ఈ వ్యాఖ్య వ్రాసి ఉంటే, నా జవాబు ఇది -
నా టపాలో ఫిబ్రవరి 16 వ తేదీ అజ్ఞాత వ్యాఖ్య ని ఉంటకించేటప్పుడే, దానికి స్పందనగా ఇలాంటి వ్యాఖ్య వస్తుందని నేను అంచనా వేసాను. రాకపోయి ఉంటేనే నేను ఆశ్చర్యపోయి ఉండేదాన్ని. ఈ రోజు ఇలాంటి వ్యాఖ్య వస్తే.... తప్పకుండా జవాబు ఇవ్వాలని కూడా ముందే అనుకున్నాను.
అప్పుడెప్పుడో కాదు, దాదాపు ప్రతీరోజూ.... ఈనాడు రామోజీరావు నుండి మాకు నిరంతర వార్తా స్రవంతి అందుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఈ రోజుటి వసుంధర పేజీలో చూడండి. ’మీ వారు తెలివైన వారా?’ అంటూ బాక్సు ఐటం ఉంది. సాధారణ మహిళా పాఠకులెవరు చదివినా ’మీ భర్త తెలివైన వాడా’ అని అర్ధం చేసుకుంటారు. లోపలేదో సంస్థ వారు చేసిన సర్వే గురించి వ్రాసారు లెండి. దానికే మరో అర్ధం చెప్పమంటారా?
మీ యుద్దం[వారు : తెలుగైజ్ చేయబడిన 'war' u]తెలివైనా యుద్దమేనా?
మేము 5 ని 10 గా పొరబాటు పడుతున్నామనీ, సోనియాని అనుమానిస్తున్నామనీ చెప్పే ప్రయత్నం ఇది. ఇలాంటివి ఇది ఒక్కటి కాదు. నాలుగురోజుల ఈనాడు పత్రికల్లో వంద చూపించగలను. వాటి మధ్య కార్యకారణ సంబంధాన్నీ, sequence నీ కూడా చూపించగలను.
కాబట్టి మెదళ్ళతో యుద్దమే కాదు, మాటలతో యుద్దమూ మాకు బాగానే వచ్చు. అంతే కాదండి, ’శంకర్ దాదా జిందాబాద్’ వంటి సినిమాలతో మానసిక యుద్ద తంత్రమూ తెలుసు. ’లగేరహో మున్నాభాయ్’ లే కాదు, ’అరుంధతి’ల దాకా ఇంకా చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి లెండి.
ఈ జవాబు నేనూహి౦చి౦దే!
మిమ్మల్ని ఇబ్బ౦ది పెట్టు౦టే క్షమి౦చ౦డి.
ఇక సెలవ్!!
- అదే అఙ్ఞాని..
అయ్యా అజ్ఞాత గారు,
మీ అజ్ఞానం సంగతి నాకు తెలియదు కాని, మీరు ఉదయం 10.16 గం.లకి వ్యాఖ్యావ్రాస్తే, నేను దానికి జవాబు 1.47 PM కి ఇచ్చాను. దానికోసమే వేచి చూస్తున్నట్లుగా మీరు 1.54గం.లకి అంటే 7నిముషాలలో జవాబివ్వటం మాత్రం నాకు ఆశ్చర్యమే. ఇంతకీ మీరు స్వతంత్ర అజ్ఞాత బ్లాగు వీక్షకులా లేక ప్రయత్నపూర్వక వ్యాఖ్యాతలా? చెప్పారు కాదు!
నేను పైన రాసిన అననిమస్ ను కాదు
ఈ రోజు వసుంధర పేజీలో మీ వారు తెలివైన వారా ? చూసి ఆస్చర్యపోయాను ఎందుకంటే నిన్ననే(1-3-2010) మీ బ్లాగులో క్రింది వాఖ్యలు చూసాను అంతేగాక రామొజీరావు మీతో కమూనికేట్ చెస్తాడని రాసారు ఎలా అని నేను ఆస్చర్యపొయాను
>>> భగవంతుడి దయ వలన నాకు జ్ఞాపక శక్తి మెండు. చిన్నప్పటి నుండి ఒకసారి చదివినవీ, చూసినవీ, విన్నవీ, అన్నవీ అంత తేలిగ్గా మరిచి పోను. మనస్సుకి పట్టనివి అసలు గుర్తే ఉంచుకోను. అదృష్టవశాత్తూ మా వారిదీ మంచి జ్ఞాపక శక్తీ, తార్కిక శక్తీ!
రెండవ అజ్ఞాత గారు : మీ వారు తెలివైన వారా? అన్న దానికి ఇది ఇంకో కోణం అండి. అయితే మాకు మాకంటే కూడా మా పనే[యుద్దం] ఎక్కువ. అందుచేత యుద్దపు['war'u] కోణమే వ్రాసాను. గుర్తించినందుకు నెనర్లు!:)
Post a Comment