యుద్దం చేసే వాళ్ళెవరూ లేకుండానే, నెం.5 వర్గమైనా.... నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారినీ, వారి కర్మఫలాన్ని ఎలా అనుభవింప చేయగలదని అనుకుంటారేమో! అదీ సాధ్యమే! వివరిస్తాను.


1992 కు ముందర - ’విభజించి పాలించటం, విభజించి ప్రచారించటం’ అనే తంత్రాలని మనదేశంలో, మన సమాజం లో మాత్రమే కాదు, ప్రపంచమంతా అన్నిదేశాలలో, అన్ని వ్యవస్థలలో, అన్ని రంగాలలో, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గము అమలు చేసింది.

ప్రపంచంలో ఆయా దేశాలని, వ్యవస్థలని, వ్యక్తులని ఒకరికొకరిని ’జాతరబొమ్మలు - జంట పీతలుగా మలిచింది. చివరికి నిఘా సంస్థలని, గూఢచర్య సంస్థలని కూడా! కెజీబి కి సిఐఏ లాగానన్నమాట. ఒకప్పుడు పరమ ప్రయోజన కారి అయిన ఈ తంత్రమే, ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి, అందులోని కీలక వ్యక్తులకీ పరమ ప్రమాదకారి అయ్యింది.

ఉదాహరణకి... చిన్న పరిమాణంలో.... మన దేశంలో పరిశీలించండి. సీపీఐ వాళ్ళు ’భావసారూప్యత’ పైకారణంగా[over leaf reason]చెబుతూ రష్యాకు అనుకూలంగానూ, సీపీఎం వాళ్ళు చైనాకు అనుకూలంగానూ ఉంటారని అందరికీ తెలిసిందే. ఆయా పార్టీల అగ్రనేతలకి ఆయా దేశాలతో రాకపోకల సహితంగా సంబంధ బాంధ్యవాలు ఉన్నాయి. ఇక భాజపా, ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడైతే... ముస్లిం వ్యతిరేకత అనే భావసారూప్యత ని పైకారణంగా[over leaf reason] చూపెడుతూ ఇజ్రాయేల్ తో బాహాటంగానే రాసుకు పూసుకు తిరిగింది. కాంగ్రెస్, ఆమెరికాకు ఎంతగా సాగిలపడుతుందో మనకి ఇప్పుడు బాగానే కన్పిస్తుంది కదా! ఎంఐఎం అయితే సౌదీకి, పాక్ వంటి ముస్లిం దేశాలకి అనుకూలంగా పనిచేయటం, ఎన్నోమార్లు బాంబుదాడుల్లో పాతబస్తీవాసుల సహాయసహకారాల సహితంగా నిరూపితమైనదే!

అవసరాన్ని బట్టి, ఈ పార్టీలన్ని ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి సమీకరణాలని ఎంత వెంట వెంటనే మార్చాయో అందరూ చూసిందే. ’చంపు లేదా చావు’ లాగా ’ప్రత్యర్ధిని దెబ్బతియ్యి లేదా దెబ్బతింటావు’ అన్న పరిస్థితి వచ్చినప్పుడు... ఆయా పార్టీలూ, నేతలూ, తమ జాతర బొమ్మ - జంట పీతని విమర్శించటం, దెబ్బతియ్యటం చేయక తప్పదు.

ప్రపంచవ్యాప్తంగా తమదే పట్టు అయిన రోజులలో [1992 కు ముందు], నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, తాము తయారు చేసిన జాతరబొమ్మ - జంట పీతలలో ఒకరిని నియంత్రించాలంటే రెండో వారి చేత దెబ్బతీయించేది. మొదటి వాళ్ళు తోక ఝాడించటం ఆపి తమ ఆధీనం లోకి వచ్చాక, అప్పుడు మళ్ళీ వాళ్ళకి కెరీర్ ఇచ్చేది. దేశాలకైనా, సంస్థలకైనా వ్యక్తులకైనా ఇంతే! ఒకోసారి... ఒక జాతర బొమ్మని తొలగించి, అంటే తెరమరుగు చేసి, ఆ స్థానంలోకి కొత్త బొమ్మని తెచ్చేది. అందరూ తమ పావులూ/ ఏజంట్లే అయినప్పుడు ఇది తమకు బాగానే ఉంది. అంతా తమకు అడ్వాంటేజే!

ఇప్పుడు పరిస్థితులు తిరగబడి... ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య పట్టు తమది కాకపోయేసరికి, అదే disadvantage అయ్యింది. ఎందుకంటే పూర్వపు రోజుల్లోలాగా ఉత్తుత్తి తన్నులాటలు కాదు. చంపు లేదా చావు, దెబ్బతియ్యి లేదా దెబ్బతింటావు వంటి తన్నులాటలు అయిపోయాయి. అంతేగాక, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ... జాతర బొమ్మల్లో ఒకరిని మరి ఒకరి చేత నియంత్రించటమే గానీ, పూర్తిగా అణచివేయటం/నాశనం చేయటం , ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప చేసేవాళ్ళు కాదు. మహా అయితే తాత్కాలికంగా ఒకరిని తెరమరుగు చేయటం, మరోచోట, గుట్టు చప్పుడు కాకుండా, రంగం మార్చి, కెరీర్ ఇవ్వటం వంటివి చేసేవాళ్ళు.

ఇప్పుడలా కాదు. వై.యస్., చంద్రబాబుల్లాగా, ఒకరి నొకరు నిజంగా కొట్టుకోవాల్సి వస్తోంది. తండ్రులు పోతే సంతానం కొనసాగించాల్సి వస్తోంది. ఉమాభారతి, భాజపా అగ్రనాయకత్వం విషయంలో అయితే ఉమాభారతి తెరమరుగైపోయింది. ఇలా పరిశీలించి చూస్తే కోకొల్లల ఉదాహరణలు. ఈ నేపధ్యంలో.... అందరూ తమ ఏజంట్లు, అన్నీ తమ పావులే అయిన చోట, జాతరబొమ్మల్లో ఒకరు మరొకరిని వేసేసినా.... మొత్తంగా నష్టం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికే. కొన్నాళ్ళకి తమకి ఏజంట్లు, అనుభవజ్ఞులైన పావులూ, తగ్గిపోతారు. నెట్ వర్క్ బలహీనమై పోతుంది. దీన్నే ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో కూడా వివరించాను.

అలా జాతరబొమ్మలు కొట్టుకోలేదనుకోండి. అంటే భాజపా అగ్రనాయకత్వం అద్వానీ... ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం సోనియాని విమర్శించకుండా, తప్పని సరి అయితే ఆమె చేతిలో రిమోట్ కంట్రోల్డ్ ప్రధానమంత్రిని విమర్శించినట్లుగా నన్నమాట. అప్పుడు ఆ నాటకీయతే బహిర్గతం అవుతుంది. అది సాక్షాత్తూ ప్రపంచంలోని వివిధ దేశాల నిఘా సంస్థలకి సైతం ప్రదర్శింపబడుతుంది.

ఎలాగంటే... అదేదో మేం నడుపుతున్నాం అనుకుంటూ ఇజ్రాయేలు మొసాద్ [లేక x అనే గూఢచార సంస్థ] భాజపాని చూసి అనుకుంటూ ఉందనుకొండి. అలాగే సిఐఏ [లేక y అనే గూఢచార సంస్థ] కాంగ్రెస్ అధిష్టానాన్ని చూసి అనుకుంటూ ఉందనుకొండి. ఒకరి మీద ఒకరు దెబ్బతీసుకొని , రాజకీయంగా పుంజుకోగల అవకాశం ఉన్నాకూడా, వ్యూహాత్మక తప్పిదాలు చేసి మరీ, అద్వానీ సోనియాలు ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు, సాక్షాత్తూ సదరు నిఘా సంస్థలు కూడా తెల్లముఖం వేయాల్సిందే! అప్పుడు చచ్చినట్లుగా అర్ధమవుతుంది, పైకి తాము నడుపుతున్నట్లు కన్పిస్తున్నా.... అసలు మొత్తం గూఢచర్యాన్ని నడుపిస్తోంది మరొకరని!

ఇలాంటి పరిస్థితులు, సంఘటనలు మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో, చాలా దశల్లో [1992 తరువాత] జరిగాయి. పరస్పరం జాతరబొమ్మలయిన రెండు నిఘాసంస్థలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు గానీ, రెండు కార్పోరేట్ దిగ్గజాలు గానీ, ఒకరినొకరు చావు దెబ్బ తీసుకునే అవకాశం వచ్చినా, చేజేతులా ఒకరు ఆ అవకాశాన్ని జారవిడిచారనుకొండి. గతంలో అయితే, దాన్ని, నిఘాసంస్థలు సైతం గుర్తించలేనంతగా, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం ద్వంద్వాలు గందరగోళాలు సృష్టించేవి. అలా సృష్టించనీయకుండా కట్టడి చేసినప్పుడు - సదరు రాజకీయనాయకులు, లేదా కార్పోరేట్ దిగ్గజాలు ఒకరి నొకరు చావుదెబ్బ తీసుకొని తీరాలి. లేదంటే సదరు నిఘా సంస్థలకు, తాము గాక మరేవ్వరో i.e. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం పని చేయటం ప్రదర్శితమౌతుంది. అలాగని చావుదెబ్బ తీయనిస్తే తన పావు లేదా ఏజంట్లలలో ఒకరు చస్తారు.

ఈ విధంగా.... నెం.5 వర్గం గూఢచార వలయంలో నుండే ముల్లును ముల్లుతోనే నాశనం చేయిస్తోంది. కాబట్టే... ఎవరు చేసినా చేయకపొయినా, నమ్మినా నమ్మకపోయినా యుద్దం ఆగేది లేదు, నకిలీ కణిక అనువంశీయులకి బహిర్గతం కాకా, సువర్ణముఖిలు అనుభవించకా, సమూలంగా సర్వనాశనం కాకా తప్పదు.

మరో తాజా ఉదాహరణ కావాలంటే - ఎంఎఫ్ హుస్సేన్ హిందూ దేవతలని నగ్నంగా చిత్రించి, దేశం నుండి పారిపోయాడు. ఖతార్ పౌరసత్వం పొందటం ఒక బహిర్గతమైతే... ముస్లిం వ్యతిరేకతని ఒక భుజమ్మీదా, హిందూ పరిరక్షణని మరో భుజం మీదా మోస్తున్నామనే శివసేన, ఆరెస్సెస్ లూ, మోహన్ భగవత్ లూ... చాలా మామూలుగా... క్షమాపణలు చెబితే ఎంఎఫ్ హుస్సేన్ భారత్ రావచ్చంటారు. అతడు భారత్ వస్తే రక్షణ కల్పిస్తామని ప్రభుత్వమూ అంటుంది. మరోప్రక్క ఆ చిత్రాలన్నీ తన మనస్సులో పొంగిన కళావేశమంటాడు అతడు. అతడు కర్మయోగి, భారతీయులు సిగ్గుపడాలి అంటారు శ్యామ్ బెనగళ్ళు.

ఈ మొత్తం వ్యవహారంలో.... అందరూ.... తిలాపాపం తలా పిడికెడు చేతబట్టుకొని ప్రత్యక్ష ప్రసారంలో లాగా ప్రదర్శింపబడుతున్నారు. వెరసి అందరూ కలిసి ఎంఎఫ్ హుస్సేన్ ని తలకెత్తుకున్నారు. చివరికి మీడియా కూడా!

ఇందులో కొసమెరుపు ఏమిటంటే... మన్మోహన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తామన్నా, ఆరెస్సెస్ ’ఫర్లేదు లే వచ్చేయ్’ అనే సంకేతాలిచ్చినా, సదరు మోడ్రన్ ఆర్టిస్టు మాత్రం ఇండియా రావడానికి జంకు తున్నాడు. నాటి బాపూజీని నాధురాం గాడ్సే చంపాడు. పైముఖం అతడిది, అంతే! ఇందిరాగాంధీని సిక్కు సెక్యూరిటి గార్డులు చంపారు. రాజీవ్ గాంధీని ధనూ చంపింది. వాళ్ళు పైముఖాలే!

ప్రమోద్ మహాజన్ ని ప్రవీణ్ మహాజన్ చంపాడు. ఇప్పుడు [మార్చి3న] అనారోగ్యంతో అతడూ చచ్చిపోయాడు. అప్రధాన వార్తల్లో అది వెళ్ళిపోయింది. అచ్చం మొద్దు శీనుని హత్య చేసి సంచలనం సృష్టించిన తోటి ఖైదీ, అంతే గప్పుచుప్పున ఆనారోగ్యంతో మరణించినట్లు. వెరసి హత్యారహస్యాలు మాత్రం రహస్యాలు గానే ఉండిపోయాయి. అలాగే అయిపోతానని ఎంఎఫ్ హుస్సేన్ కి బ్రతుకు భయం వేస్తోందేమో! అందుకే భారత్ కి రాలేక పోతూ ’నా ఆత్మ భారత్ లోనే ఉంది’ అంటున్నాడు. మొత్తానికి అతడికీ ఓ ఆత్మ ఉందట.

ఇలాంటప్పుడు ఖచ్చితంగా ప్రదర్శితమౌతుంది, విభజించి పాలించటంలో తామూ భాగం అయిపోయామని, తమని కూడా నియంత్రిస్తున్న వ్యవస్థ మరొకటి ఉందనీ.... ఆయా దేశాల నిఘా సంస్థలకి కూడా!

ఆ విధంగానే.... తొలి దశలో పీవీజీ, నెం.5 వర్గం.... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో తమ దేశం పట్ల నిబద్దత గలవారికి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాన్ని గూఢచర్య స్ట్రాటజీలతోనే ప్రదర్శించి మరీ యదార్ధాన్ని తెలియ జేసారు. ఆ సత్య సందర్శనకి convince అయిన వారిని కలుపుకుంటూ నెం.5 వర్గాన్ని విస్తరించుకున్నారు. అందుకోసం కూడా సుదీర్ఘ కాలాన్ని వినియోగించుకుంటున్నారు. అలా.... ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పైకి వచ్చిన వారంతా తమ ఏజంట్లే అవ్వటం ఎంత ప్రయోజనకరం [Advantage] అయ్యిందో, అదే ఇప్పుడు నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకి ప్రమాదకరం [Dis advanatage ; నిఘంటు అర్ధం కాదులెండి] అయ్యింది.

ఈ విధంగా, నెం.5 వర్గంలో ఎవరు ఎక్కడి నుండి ఎలా పనిచేస్తున్నారో తెలియకుండానే.... నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని తుత్తునియలు చేస్తోంది. ఇన్ని తెలిసిన మాకు ఇలాంటివి ఇంకా ఏవో తెలిసే ఉంటాయని, ఎవరు ఎక్కడి నుండి ఎలా పనిచేస్తున్నారో కూడా తెలిసే ఉంటుందనీ రామోజీరావు అభిప్రాయం, అనుమానం. ఆ రహస్యమేదో చెప్పించుకోవాలనే ఈ వేధింపు.

నిజానికి 1998 ల నాటికే మా తమ్ముళ్ళని చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ స్నేహం ఎర వేసి, వ్యాపార సాయం చేసి దరి చేర్చుకున్నారు. ఎంత ప్రయోజనం పొందారో తెలీదు గానీ.... నా చెల్లెలు హత్యో ఆత్మహత్యో తెలియని బలవన్మరణానికి గురయ్యింది 2006 ఆఖరి రోజుల్లో! ఇప్పటికీ నా చిన్న తమ్ముడు చంద్రబాబునాయుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఒకప్పుడు అంటే నేను వాళ్ళని డీల్ చేయటానికి ముందు వరకూ హవా నడిచింది. సినీ రాజకీయ ప్రముఖలంతా వారికి కస్టమర్లుగా, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా మైకు గట్రా వ్యక్తిగత ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ, పత్రికలలో ఫోటోలు కూడా వచ్చినంతగా!

నిజానికి.... 1992 లో మా జీవితాలలోనికి గూఢచర్యం ప్రవేశించగా, 1993 లో నేను కట్టుబట్టలతో ఫ్యాక్టరీ వదిలి వచ్చాను. తామూ వెళ్ళిపోతామన్న నా కుటుంబసభ్యులు, నా వివాహానంతరం, 1995 లో నేను తిరిగి వెళ్ళే వరకూ ఫ్యాక్టరీలోనే ఉన్నారు. 1995 లో నేను, నా భర్తా పాపలతో నంబూరు గ్రామానికి మకాం మార్చగా, మా అమ్మాచెల్లీ తమ్ముళ్ళు హైదరాబాదుకు మకాం మార్చారు. APSFC వాళ్ళు ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకున్నారు. పంచనామా వంటి ప్రభుత్వ ప్రక్రియలేవీ లేకుండానే!

1992 - 95 ల మధ్య మా జీవితాల్లో సంభవించిన కష్టనష్టాలు మాకు అర్ధం గాక, వాటిమధ్య కార్యకారణ సంబంధాలు తెలియక, రకరకాలుగా అనుకునేవాళ్ళం. ఏ కారణాలు చెప్పుకున్నా తార్కికంగా వీగిపోయేవి. వేధింపు అనుకుంటే అంతకంటే చంపేయటం సులభం కదా అన్పించేది. రకరకాల విశ్లేషణలూ, భాష్యాల తర్వాత, పీవీజీ మాకు గూఢచర్యం పట్ల ప్రాధమికమైన అవగాహన జ్ఞానం కలిగిస్తుండవచ్చని అనుకున్నాము. అవి గూఢచర్య తంత్రాలని అప్పట్లో మాకు తెలియదు. [పీవీజీ మాకు ఎందుకు అవగాహన కల్పించాడో అర్ధం కాక, ఇంకా ఏవో తెలియజేసే ఉంటాడని, రామోజీరావు మా వెంటపడి వేధించాడు.అది గూఢచర్యం అన్న విషయం అతడికి తెలుసు కాబట్టే, మా తమ్ముళ్ళని చంద్రబాబు నాయుడి దరికి చేర్చాడు.]

వీటిలో కొన్నిటి గురించి నేను నాడైరీలో వ్రాసుకున్నాను. ఈ నేపధ్యంలోనే కేంద్ర హోంమంత్రి పత్రికాధిపతులలో సిఐఏ ఏజంట్లున్నారని ప్రకటన ఇవ్వటం - ఏ పత్రికా, పత్రికాధిపతీ దాన్ని ఖండించక పోవటం జరిగాయి. అలాగే ఈనాడు పత్రికలో సీఐఏ తన ఏజంట్లని రిక్రూట్ చేసుకునే విధానం గురించి వివరమైన వార్తాంశాలు ప్రచురింపబడ్దాయి. డైరీని 1993లో మా వివాహం అయిన తరువాత వ్రాయటం మానేసాను. తర్వాత కాలంలో అది ఏమయ్యిందో నాకు తెలియదు.

తర్వాత కాలంలో, డైరీ వ్రాయటం మంచి అలవాటనీ, అలా వ్రాసుకుంటే మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయనీ, వసుంధరలో వ్యాసాలు వస్తే యధాలాపంగా చదివేవాళ్ళం. డైరీగాకపోతే ఒక నోట్సులో నన్నా వ్రాయటం మంచిదని మరీ తరుచుగా వ్యాసాలు రావటం జరిగింది. నిజానికి నాకు డైరీ పేజీలు సరిపోవుగనుక, 1992 ముందు వరకూ పుస్తకాన్ని బైండ్ చేయించుకుని డైరీ వ్రాసేదాన్ని!

అల్జీమర్స్ వ్యాధి, అంటే బుర్రకేదో అయ్యి ఏమీ గుర్తుండకపోవటం మీద వ్యాసాలు, కథలు రావటంతో 2005 తర్వాత క్రమంగా మాకు ఏంజరుగుతుందో రూఢి అయిపోయింది. ముఖ్యంగా 2008 లో మేమిదంతా coups on world అనే ఆంగ్ల బ్లాగు కోసం వ్రాస్తున్నప్పుడు, అల్జీమర్స్ గురించిన ఈ వ్యాసాలు, కథల ప్రచురణల మధ్య కార్యకారణ సంబంధాలు స్పష్టంగా అర్ధమయ్యాయి. తర్వాత టపాలలో వివరంగా వ్రాస్తాను. ప్రస్తుతానికి పీవీజీ దగ్గరికి తిరిగి వస్తాను.

1993లో గుడిసెలో నివసిస్తున్న కాలంలో, పీవీజీ మాకు గూఢచర్యం గురించిన ప్రాధమిక అవగాహన, జ్ఞానం కలిగిస్తున్నాడన్న అభిప్రాయానికి మరింత స్థిరంగా వచ్చాము. అందుకు కారణాలేమిటో సృష్టత లేకపోయింది. పిల్లవాడికి అక్షరజ్ఞానం ఎందుకు కల్పిస్తామో అప్పటికి తెలియకపోయినా పెద్దయిన తరువాత అర్ధమవుతుంది చూడండి. అలాగన్నమాట! పిల్లవాడు నేర్చుకోను అంటే ఏంచేస్తాం? నాలుగు తన్నో, బుజ్జగించో చెప్తాము. అలాగే పీవీజీ కూడా మొదటి రోజుల్లో మా మెడమీద కత్తి పెట్టి, అర్ధం చేసుకునే అవసరం కల్పించాడు.

అందునా నేర్పేది యుద్దవిద్య అయినప్పుడు దెబ్బలు తినటం, దెబ్బలు కాచుకోవటం ప్రత్యర్ధిని దెబ్బతీయటం కూడా విద్యలో భాగమే అవుతాయి. అది విలువిద్య అయినా, కత్తి యుద్దం అయినా, అడ్మినిస్ట్రేషన్ యుద్దం అయినా, చివరికి మెదళ్ళతో యుద్దం అయినా అంతే!

అప్పటికి పీవీజీ కంటే రామోజీరావుకి బలం ఎక్కువ ఉండటం అన్న ఊహ కూడా మాకు లేదు. ’భారత ప్రభుత్వం కంటే ఈ గడ్డ మీద ఎవరూ బలవంతులు కారు’ అన్న సాంఘీక శాస్త్ర పాఠం దాటలేకపోయేవాళ్ళం. సీఐఏ కి బలం ఉండవచ్చుగాక గానీ రామోజీరావుకి ఉండదు కదా - ఇదీ మా అభిప్రాయం. కాబట్టి అప్పటికి మా జీవితంలో జరుగుతున్న ప్రతీ సంఘటనకీ ఆయననే బాధ్యుణ్ణి చేసుకుని బాగా తిట్టుకున్నాము.

మా జీవితాలని ఏమైనా చేసే అధికారం ఆయనకి ఎక్కడిది అని చాలా కోపం వచ్చింది. ఎందుకంటే పారిశ్రామిక వేత్తగా నా జీవితం నాకు ఇష్టమైనది. జీవితంలో పారిశ్రామికవేత్తగా ఉన్నత స్థాయికి చేరాలని, అప్పటికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాను. నా దృష్టికి వచ్చిన విషయాలని నేను ప్రధానికి చెప్పాను. పౌరధర్మంగా నా పని నేను చేశాను. ఇప్పుడు రాజులు లేకపోయినా, ప్రజాస్వామ్యం ఉన్నా, ప్రధానిగా అయన రాజ సమానుడే! అందుచేత రాజధర్మంగా ఆయన మమ్మల్ని కాపాడాలి. దుష్టుల్ని శిక్షించాలి. అంతేగానీ, ఇదంతా ఏమిటి?

"నా బ్రతుకు నా ఇష్టం. పల్లీలు తింటూ రికామిగా రోడ్డున నడవటం నాకిష్టం. నా ఇష్టమొచ్చినట్లు నేను బ్రతుకుతాను. అలా కాదు ఇలా అని చెప్పడానికి ఆయనెవరు?" అని గసపోసుకున్నాను. "నాకిది నేర్పండి గురువర్యా! అని నేనడిగానా? ఇవ్వని గురుత్వాన్ని ఆయననెవ్వరు తీసుకొమ్మన్నారు?" అని తిట్టుకున్నాను.

ఇంకా "ఆయన పీల్చింది బానిస గాలి. నేను పుట్టేటప్పటికే స్వాతంత్రం వచ్చింది. నేను పీల్చింది స్వేచ్ఛాగాలి. కాబట్టి నా బ్రతుకు నా ఇష్టం. నన్ను నియంత్రించే అధికారం ఎవరికీ లేదు" అని గొంతు నొప్పెట్టే దాకా ఆక్రోశపడ్డాను.

ఇదంతా తలచుకుని 2005 తర్వాత రోజుల్లో.... చాలా నవ్వుకున్నాము కూడా! 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిందనుకొని, పుట్టుకతోనే నేను పీల్చింది స్వేచ్ఛాగాలి అనీ, పీవీజీ పీల్చింది బానిస గాలి అనీ అనుకున్నాము. తొక్కలోది స్వాతంత్రం ఎక్కడొచ్చిందని? ప్యాకింగ్ మారిందే గానీ పరిస్థితిలో మార్పేముందనీ? బాపూజీ, తిలక్ ఇత్యాది వేలాది నాయకులూ, లక్షలాది స్వాతంత్ర సమరయోధులూ తెచ్చిన స్వాతంత్రం, 60 ఏళ్ళ తర్వాత వెనుదిరిగి చూసుకుంటే ఏముందని? దోపిడి చేసే అవకాశం తెల్లవాళ్ళ చేతుల నుండి నల్లవాళ్ళ చేతికి వచ్చింది అంతే! [ఒక తెల్లమహిళ, ఇటలీ సోనియా కూడా ఉందిలెండి దోపిడి మూకలో]

అంతేకాదు.... పౌరధర్మం, రాజధర్మం అంటూ వేరుగా లేవని కూడా అర్ధమయ్యింది. ఎందుకంటే ’ఈ దేశం, ఈ ధరిత్రి’ మనందరిదీ కదా! అయిదేళ్ళు పదవిలో ఉన్నంత మాత్రానా ఆయన కొక్కడికే బాధ్యత ఉండి, ఈ దేశంపట్ల పౌరులుగా మనకి బాధ్యత లేకుండా పోతుందా? అదీగాక.... తెలిసో తెలియకో.... దేశభక్తితోనో, అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేని బుద్దితోనో.... పోయి పోయి గూఢచర్యంలో పడ్డాము. నదిలోకి దూకాక ఈదక తప్పనట్లే, గూఢచర్య జ్ఞానాన్ని నేర్చుకోక తప్పదు, తప్పలేదు.

అంతేకాదు, రామోజీరావు తదితరుల అసలు రూపాన్ని ఎలా నిరూపించాలి? సాక్ష్యాధారాలు ఎలా సేకరించాలి? ఇందుకు తగినంత సమయం కావాలి. అలాగే మా ప్రాణాలనీ రక్షించాలి. అందుకే అనుభవపూర్వకంగా గూఢచర్యం నేర్చుకోవాల్సిన స్థితికి మేము తరమబడ్డాము. ఇదంతా 2005 తర్వాత.... క్రమ పరిణామాలలో అర్ధమైంది.

18 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే... తొలి మూడేళ్ళలో 1992 నుండి 1995 వరకూ మాకు గూఢచర్యం గురించిన ఓనమాలు పరిచయం చేయబడ్డాయి. 1995 నుండి 2005 వరకూ జీవితాన్ని విధివ్రాత అనుకుంటూ, భగవద్గీత సాయంతో ఎదురు దెబ్బలు కాచుకుంటూ, ఎదురీదుకుంటూ వచ్చాము. ఒకసారి 1992 లో రామోజీరావు మీద ఫిర్యాదు చేసి దెబ్బతిన్నాకూడా.... పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదన్నట్లు... మరోసారి ఎంసెట్ అవకతవకలపైన ఫిర్యాదు ఇచ్చాము. 2005 లో మా జీవితాలలో రామోజీ రావు , అతడి గూఢచర్యపు ఉనికి అర్ధమయ్యాక, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫిర్యాదులు పెట్టుకుంటూ పోరాడాము.

ఇన్నేళ్ళ మా పోరాటంలో ఎప్పుడూ... ఎక్కడా.... మేము మాలో ఉన్న పాజిటివ్ గుణాలు పోగొట్టుకోలేదు. నైపుణ్యాలు పోగొట్టుకోలేదు. నేను పాఠశాలలో ఉత్తమ విద్యార్ధినిని. వ్యాసరచన, పద్యగానం, ఉపన్యాసం, క్విజ్.... ఇలాంటి పోటీలలో మా స్కూలులో నేనే ఫస్ట్. నాటకాలు వ్రాయటం, డైరెక్టు చేయటం! నటించటం లో అయితే జిల్లాస్థాయిలో డిఇవో నుండి బహుమతులు అందుకున్నాను. వ్యాసరచన పోటీలో నెగ్గి, బాలల అకాడమీ వాళ్ళు నిర్వహించిన ఏపీ దర్శన్ లో పొల్గొన్నాను. నెలన్నరపాటు ఆంధ్రప్రదేశ్ అంతా దర్శించిన ఆ కార్యక్రమంలో నేను గుంటూరు జిల్లా తరుపున ఎన్నికయ్యాను. ఆ సందర్భంలోనే మండలి వెంకట కృష్ణారావు గారితో పరిచయం ఉండింది.

ఆయా నైపుణ్యాలేవీ మేము పోగొట్టుకోలేదు. అయితే జిహ్వ చాపల్యం, నోటి దురుసు, సహనం లేకపోవటం... ఇలాంటి చాలా అవలక్షణాలని అతిక్రమించగలిగాము. మా వారికి దుడుకు తనం ఎక్కువ. అనుభవాలతో నోటికంటే కండబలం కంటే బుద్దిబలాన్ని ఉపయోగించాలి, సమయం సందర్భం గుర్తెరిగి ప్రవర్తించాలనీ, దేనికైనా సహనంగా వేచి ఉండాలనీ నేర్చుకున్నాము.

అందుకే ’మా కథ’ వ్రాసేటప్పుడు, ’మా గురించి’ అనే టపాలోనూ.... ఆర్ధిక దృష్ట్యా పారిశ్రామికవేత్త స్థాయి నుండి ఎంసెట్ లెక్చరర్ స్థాయికి - అక్కడి నుండి సాధారణ పంతులమ్మ స్థాయికి జారానని, అంటే పై మెట్టు మీది నుండి క్రిందికి దిగానని - ఆధ్యాత్మిక దృష్ట్యా చూస్తే ఆత్మోన్నతి వైపు, క్రింది మెట్టు నుండి పైకి ఎక్కాననీ వ్రాసాను.

గూఢచర్యాన్ని మేము, జీవితంలో స్వానుభవం నుండి నేర్చుకున్నాము. కొన్ని అంశాలని ’మాపై రామోజీరావు వేధింపు - దాన్నుండి మేం నేర్చుకున్న పాఠాలు’ లో కూడా వ్రాసాను. మా జీవితాల్లో మాకు ఎదురైన వేధింపులోని స్ట్రాటజీలని పరిశీలిస్తే... గల్లీ మొదలు ఢిల్లీ దాకా, గ్రామం నుండి అంతర్జాతీయం దాకా.... ఒకటే శృతి, సారూప్యత! ఎందుకంటే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ వచ్చింది అవే పది స్ట్రాటజీలు గనక! ప్యాకింగ్ మారిన సరుకుల లాగా! వాటినే వివిధ టపాలలో, వేర్వేరు లేబుళ్ళలో వివరించాను. అందునా... రకరకాల శీర్షికలు పెట్టినా, లేబుళ్ళతో విభజించినా, ఇది మొత్తం ఒకే కుట్రకు సంబంధించిన వ్యవహారం గనక ఇంటరాక్షన్ ఉంటుందని ’అన్ని టపాలు ఒకే చోటలో’ కూడా వ్రాసాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

సచిన్ భారతరత్నా !?: హవ్వ
ఏంటొ ఈ మధ్య ఈనాడు సచిన్ ను ఆకాసానికెత్తేస్తుంది భారతరత్న అనీ పలానా రత్న అనీ. దానికి ఊతంగా వివిధ ప్రముఖుల చేత ప్రకతనలు ఇప్పిస్తింది . ఇదంతా చూస్తుంటే సచిన్ కు భారతరత్న ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్లుంది . దానికి గానూ మీడియా జనాలను మానసికంగా సిద్దం చేస్తున్నట్లుంది . ఈ రోజు ఈనాడులో థాకరే ఏమన్నాడో తెలుసా? సచిన్ భారతరత్నమట ఆయనను మించిన రత్నాలు ఈ దేశంలో లేవట , అలాంటి రత్నాలు మహారాష్ట్రలోనే పుడతాయట .ఇక్కడ నేనేదో ప్రాంతీయాభిమానం రెచ్చగొడుతున్నానని అనుకోవద్దు ఎక్కడ పుట్టినా వాళ్ళు కూడా భారతీయులే కదా ! ఇక్కడ విషయం అదికాదు . గత కొద్ది కాలంగా (2001 నుండి ) భారతరత్న ప్రధానం జరగడం లేదు . అయితే మధ్యలో (2008) భీంసెన్ జోషి కి ప్రధానం జరిగింది . ఈ సంఘటనను మినహాయిస్తే దాదాపు తొమ్మిదేళ్ళుగా అవార్డు ప్రధానం జరగడం లేదు. అంటె ఆ అవార్డు పొందడానికి తగిన అర్హులు లేరు ఇప్పుడు సచ్చిన్ అనే క్రిడాకారుడు తన రికార్డులతో దేశం పరువును దిగంతాలకు వ్యాపింపజేస్తున్నాడట అందుకని భారతరత్న ను ఆయనకివ్వాలని కొంతమంది (microscopic minorities) డిమాండ్. గత అవార్డు గ్రహీతల ప్రతిభాపాటవాలను పరిశీలిస్తే వారి ప్రతిభ ( వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ ) ఈ దేశానికి ఏదొవిధంగా ఉపయోగపడింది. ఉదాహరణకు లతా మంగేష్కర్ నే తీసుకుంటే భారత - చైనా యుద్ద సమయంలో జవహర్ లాల్ నెహ్రు సమక్షంలో Ae Mere Watan Ke Logon ( " Oh, The People Of My Country ) అనే పాట పాడి వేలాది భారత సైనికులను ఉత్తేజ పరిచారు ఆ ఉత్తెజం తోనే వారు ఆ యుద్దంలో పాల్గొన్నారు ( ఆ యుద్దంలో భారత్ ఓటమి చెందడం వేరే సంగతి ). మరి సచిన్ సాధించిన ఆయన వ్యక్తిగత రికార్డులు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయనే చెప్పాలి. కనీసం తన ప్రతిభతో ఈ దేశానికి ప్రపంచ కప్ కూడా సాధించి పెట్టలేకపోయారు . బహుశా ఆయనకు ప్రపంచ కప్ కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యం కావచ్చు. కప్ సాధిస్తే ఆ క్రెడిట్ జట్టు అందరికీ చెందుంతుది మరి వ్యక్తిగత రికార్డులు అలా కాదు కదా ! ఎప్పటికీ ఆయన పేరు మీదనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలనడం ఏం సమంజసం ? ఇంత కంటె గొప్ప్ వాళ్ళు ఎంతమంది లేరు ! భారతదేశంలో హరిత విప్లవానికి ( Green Revolution ) ఆద్యుడైన M, S. స్వామినాధన్ ను అందరూ మరిచిపొయారు. దేశాన్ని ఆహార ధాన్యాల కొరత నుండి కాపాడిన స్వామినాధంకు దక్కింది ఒక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి . హరిత విప్లవం మూలంగానే దేశంలో వరి, గోధుమల దిగుబడి గణనీయంగా పెరిగాయి . 1961 లో ఆయన నార్మన్ బోర్లాగ్ ను దేశానికి ఆహ్వానించకపోయినట్టైతే పరిస్తితి వేరే రకంగా ఉండేది . ఇక పోతె వర్గీస్ కురియన్ సంగతి ... ఈయన్ White Revolution కి ఆద్యుడు . ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో గ్రామీన ప్రాంతాలలో కోపరేటివ్ సొసైటీలను స్తాపించి పాల విప్లవానికి నాంది పలికాడు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆర్ధిక పరిపుష్టం చెసాడు. ఇక మూడవ వ్యక్తి పి.వి. నరసిం హా రావు . ఈయన సంగతి అందరికీ తెలిసిందే . మరి ఇంతమందిని వదిలేసి సచిన్ కు భారతరత్న ఇవ్వడంలో ఏ లాబీయింగ్ పనిచేస్తుందో అర్ధం కావడం లేదు

మీ అనాలిసిస్ ముందు కారల్ మార్క్స్ గతితార్కిక వాద అనాలిసిస్ దిగదుడుపు. మీరభిమానిచే పి.వి. గారి మైండ్ అంచనా వేయటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమౌతున్నాది. ఒక్క ముక్కలో చేప్పాలి అంటె 10 మంది గుడ్డి వాళ్ళు ఎనుగును తాకి దానిని వర్నించి నట్లుగా ఉంట్టుంది. ఆయన ఇన్ని అవమానాలకు గురి అయినా రామారావు గారి లా పదవి పోయిందన్న దిగులు తో చని పోలేదు. This show his detachment towards end result (like a yogi). అంటె ఆయన చని పోయే వరకు బాలెన్సేడ్ గా ఉన్నాడు అదికాక ఎమైనా దేవ గౌడా లా కోట్లు వెనక వేసి ఉంట్టె అది వారి పిల్లల కి ఇచ్చి ఉండాలి కదా! అది జరగలేదు అంటె ఆయన నీతి నిజాయితీ ల తో దేశానికి ఎంత సేవ చేయగలడో అంతకాలం సేవ చేసి చనిపోయాడు. ఇంతకు మించి మనం ఆయను అర్థం చేసుకోలేము.

మొదటి అజ్ఞాత గారు : మీరన్నది నిజమేనండి. ముంబై ముట్టడి నాడు ఈ సచిన్ నొరెత్తి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. తప్పకుండా సోనియా ప్రభుత్వం సత్కరిస్తుంది లెండి.

రెండవ అజ్ఞాత గారు : ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి. నిజానికి పీవీజీ మేధస్సు గురించి బహుభాషాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, రాజనీతి కోవిదుడు, దార్శనికుడు గట్రా పడికట్టు పదాలు మొక్కుబడిగా ఉపయోగించబడుతుంటాయి.

ఆయన మేధస్సు గురించి మాకున్న అవగాహనలో పదిశాతమే ఇప్పటికి కాగితాల మీదా, బ్లాగులోనూ, పెట్టి ఉంటాము. అక్షరాలలోకి తర్జుమా చేయటం మాకు శక్తికి మించిన పని! మీ వ్యాఖ్యతో మాకు చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu