మరో సంఘటనాత్మక అంశం: వై.యస్. బ్రతికి ఉన్నరోజుల్లో ప్రరాపా నేత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్, 2009 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ’పంచెలూడతాయి’ ’పంచెలూడదీసి కొడతాం!’ అంటూ పదే పదే అన్నాడు. అప్పుట్లో "ఎంత మాస్ హీరో అయినా కూడా ఇంత భయంకరమైన నాలుకేమిటి? ఏం తిట్లు అవి?" అనుకున్నాము. తర్వాత నారా చంద్రబాబు నాయుడు, గోనే ప్రకాశ రావులు కూడా తమతమ ప్రత్యర్ధులని బట్ట లూడదీసి కొడతామని అన్నారు. చిత్రంగా.... సెప్టెంబరు 2, 2009 న హెలికాప్టర్ ప్రమాదంలో వై.యస్. మరణించి నప్పుడు, అతడి శరీరం ఛిద్రమవ్వటమే కాదు, పంచె కూడా ఊడిపోయి, శకలాలై పోయింది.

నిజానికి "బట్టలూడదీసి కొడతాం" అన్న తిట్లు, ఎవరు ఎవరిని ఉద్దేశించి ప్రయోగించినా, తగిలింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ! ఎలాగంటే - వీరి ఏజంట్లు కొందరు జన్మతఃముస్లింలై, గోప్యంగా ముస్లిం జీవనమే సాగిస్తూ, పైముఖంగా మాత్రం, హిందువులు గానూ, హిందూ ప్రముఖులు గానూ, హిందూ రాజకీయ నాయకులుగానూ, తమ తమ స్థానాల్లో ఉండి పనులు నిర్వహిస్తూన్నారు. ఆ జాబితాలో కీలక నేతలూ, వ్యక్తులూ ఉన్నారు.

ఏ మతస్థులైనా పరమత చిహ్నాలు ధరించటానికి ఇష్టపడరు. అది ఆయా వ్యక్తులకి తమ మతం పట్లా, మత విశ్వాసాల పట్లా ఉన్న నిజాయితీ, నిబద్దతలని బట్టి ఉంటుంది. అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కొందరు కీలక ఏజంట్లకు దమ్మీడీల పట్ల,అధికారం పట్ల ప్రేమ తప్పితే మత విశ్వాసాలు కూడా వాళ్ళకు పట్టవు. అందుచేత హిందువుగా నటిస్తూ, హిందూ మత చిహ్నాలు ధరిస్తూ ముస్లింలూ ఉండగలరు. ముస్లిం మత చిహ్నాలు ధరిస్తూ హిందువులూ, ముస్లిమేతరులు కూడా ముస్లింల లాగా కొనసాగగలరు.

అయితే మొలతాడు, సున్తీ వంటి కొన్ని అంశాల్లో చాలామంది రాజీపడరు. "మొలతాడు కట్టిన మగాడివైతే, మూతి మీద మీసం ఉంటే... ఫలానా విషయంలో పందేనికి రా" అంటూ సవాళ్ళు విసురు కోవటం హిందూ యువకుల్లో’ పరిపాటి. అలాగే, హిందువులు ఏ కారణం రీత్యానైనా [ఆరోగ్యాది ఇతర విషయాలై] సున్తీ చేయించుకోవచ్చునేమో గానీ, ముస్లింలు సున్తీ చేయించుకోకుండా ఉండరు. ఈ సున్తీ కార్యక్రమాలు చిన్నతనంలోనే చేయించబడతాయి.

ఎవరైనా ప్రముఖులు, మతపరమైన సాంప్రదాయంగా కాక, ఆరోగ్యాది ఇతర కారణాల రీత్యా, శస్త్ర చికిత్సగా భావించి సున్తీ చేయించుకుంటే, ఆసుపత్రి రికార్డు ఉంటుంది. ఇటీవల కాలంలో వైద్యులు దీన్ని సిఫార్సు చేయటం, పత్రికల్లో ఇంటర్యూలూ, వ్యాసాలు రావటం జరిగింది.

ఈ నేపధ్యంలో "బట్టలూడదీసి కొడతాం" అన్న సవాళ్ళకు ప్రత్యేక అర్ధం ఉంది. పైకారణంగా[over leaf reason గా] ఎవరు ఎవరిని ఉద్దేశించి అననివ్వండి. చంద్రబాబు, గోనె ప్రకాశ రావు, పవన్ కళ్యాణ్ గట్రాలు.... ఎవరిని ఎవరు తిట్టినా సరే... అది ఉద్దేశించబడింది రామోజీ రావుకీ, అతడికి అత్యంత ఆప్త, కీలక ఏజంట్లకే! ప్రయోగించింది నెం.5 వర్గమే!

వై.యస్. మరణం తర్వాత ఇలాంటి తిట్లు కొంత తగ్గిపోయాయి. నాగం జనార్ధన రెడ్డిని ఓయూలో విద్యార్ధుల వేషంలోని గుండాలు సొమ్మసిల్లి పడిపోయే దాకా కొట్టినా, చేష్టలుడిగిన చంద్రబాబు, ఎవరిని మాత్రం దిగంబరులని చేసి కొట్టగలడు? మరెలా అనగలిగాడు? తనకి ఇవ్వబడిన అసైన్ మెంట్ ప్రకారం తిట్టడం తప్పితే, ఇది మరొకటి కాదు. తామే పంపిణీ చేసిన అసైన్ మెంట్లు, తమకే హెచ్చరికలు కావటం - తమ నెట్ వర్క్ లోంచి తమకే ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్లు రావటం - తమ కాలు తమ మెడ మీద వేసుకొని తామే తొక్కుకోవటం!

తప్పించుకోగలిగింది ఏముంది? దీనికి దృష్టాంతమా అన్నట్లు, అమెరికా వంటి కొన్ని దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాలలో, ప్రయాణికులని, వారెంత ప్రముఖులైన సరే... స్కానింగ్ యంత్రం ద్వారా ప్రవేశించవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాంటివి పాటించబడటంలో అంతర్జాతీయంగా ఉన్న తంత్రంలో ఇది ఒక కోణం!

ఈ సందర్భంలో షారుఖ్ ఖాన్ వంటి సినిమా నటుల చిత్రాలు, బయటికి విడుదల అయ్యాయని నిందారోపణలూ వచ్చాయి. [నిజానికి ఈ స్కానింగ్ యంత్రంలో ఆ ఫోటోలు కొద్ది సేపటిలోనే వాటంతట ఆవే స్కాప్ చేయబడతాయి.] ఎల్ కే అద్వానీ వంటి ప్రముఖ, హిందూ మతతత్వ పార్టీల నాయకులు, విదేశీ పర్యటనలకి వెళ్ళిన సందర్భంలో ఇలాంటి సన్నివేశాలకి గురి అయ్యారనీ, లేదనీ, మీమాంసలూ, అనుమానాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం అల్జీమర్స్ తో బాధపడుతున్న మాజీ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండేజ్, ఇలాంటి సందర్భంలో, నగ్నంగా శల్యపరీక్ష చేయబడ్డానని స్వయంగా ఒప్పుకున్నాడు కూడాను.

ఈ వ్యవహారాల వెనుక నడిచిన భాష, సవాలు ఏమిటంటే - "మీ కుట్రల తాలూకూ నగ్నస్వరూపాలు, ద్వంద్వాల మాటున దాచిన నిజస్వరూపాలు అన్నీ బహిర్గతం చేయబడతాయి సుమా! సున్తీలతో కూడిన భౌతిక దేహాలతో సహా!" అనీ!

ఇలాంటి సవాళ్ళు - ప్రతిసవాళ్ళలో మరో అంశం - సినిమాలకూ, స్టార్ డమ్ లకు సంబంధించినది. 1992 కు ముందర అన్ని భాషల సినిమా రంగాలలో కొందరే హీరోలు - అదీ ఇద్దరు ముగ్గురే అన్నంతగా రాజ్యమేలేసారు. సినిమా పాటలన్నీ ఎస్.పీ. బాలసుబ్రమణ్యమే పాడేసినట్లన్న మాట! ఇందులో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ ఉన్న సౌలభ్యం ఏమిటంటే మోనోపలి అయితే డబ్బు వసూళ్ళ, గ్రిప్ కేంద్రీకరణా, నియంత్రణా సులభం. కణిక నీతిలోని తొలివాక్యం - శతృవుని బలహీన పరచాలనుకున్నప్పుడు ముందుగా వారి ఉత్సాహ ధైర్య మంత్రాంగాలు నాశనం చెయ్యాలి. అది కళల ద్వారా చేయటం సులభం. అందుచేత తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని కుటుంబాలు, తమిళంలో శివాజీ, జెమినీ గణేశ్ ల కుటుంబాలు, హిందీలో బచ్చన్ లూ, ఖాన్ లూ... ఇలా!

కొన్ని దశాబ్దాలపాటు ఆయా నటులని వట వృక్షాలుగా పెంచి పోషించారు నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. ఇంకా ఘోరం ఏమిటంటే కళాత్మక విలువలేమో ఆముదం వృక్షాలైపోగా, మీడియా ఇమేజ్ కవరేజితో వాటినే వట వృక్షాలుగా చూపటం! వివరంగా చెబుతాను. మిగిలిన నటీ నటులకు చక్కని పాటలూ, సంగీతమూ, డాన్సు కంపోజింగ్, కథలూ, మంచి బ్యానర్ నిర్మాతలూ రాకుండా నియంత్రిస్తూ, తమ ఆశీస్సులూ అండదండలూ ఉన్న నటీనటులకి మాత్రమే సాంకేతికత, కళాత్మక విలువలున్న పాటలూ, సంగీతం గట్రా సౌకర్యాలు అందించటం! ఆ విధంగా మొత్తం పరిశ్రమనే నియంత్రించటం! అప్పుడు సినిమాలు నాసిగా ఉండటమే కాదు, తమ చెప్పుచేతల్లో ఉంటాయి.

అలాగ్గాక స్వేచ్ఛ, పోటీ ఉంటే, ఒకరిని మించి మరొకరు సృజనాత్మకత చూపిస్తారు. అలా ఉంటే జాతి జాగృతి, ప్రజా చైతన్యం బాగా ఉంటాయి కదా! అలా ప్రజలలో చైతన్యమూ, తార్కికతా, సృజనాత్మకత పెరగటాన్ని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అనుమతించదు కదా! అందుచేత తమ ఆశీస్సులూ, అండదండలూ ఉన్న వారికి మాత్రమే, అదీ తాము అనుమతించిన మోతాదు మేరకే సృజనాత్మకత ఉన్న సినిమా హంగులు లభిస్తాయి. ఆ సృజనాత్మకతని అంతకంతకూ తగ్గిస్తే.... ఇదే ఆముదం వృక్షాలని చేయటం! తమ మీడియా బాకాలతో ఆ అముదపు వృక్షాల వంటి చిత్రాలని, నటనా కళాత్మక విలువలని తెగ పొగిడి పారేస్తే.... వట వృక్షాలుగా ముద్రవేయగలరు కదా! ఈ స్ట్రాటజీతో కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ నియంత్రించారు.

అందుకే, ఆయా నటులకి, ఎన్టీఆర్ చిరంజీవి గట్రాలకి, స్లోమోషన్ లూ, సాపేక్షంగా మిగిలిన వారికంటే మంచి పాటలూ, డాన్సుల వంటి హంగులూ దక్కేవి. ఆ స్టార్ డమ్ తో, తదుపరి ఆయా హీరోలని రాజకీయ నాయకులుగా కూడా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ మలిచింది. అది మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడులో ఎంజీఆర్, అమెరికా లో రోనాల్డ్ రీగన్ లూ ఉన్నారు.

"మాకు తెలియని రోజుల్లో ఇదంతా మీకు సాధ్యపడింది. ఏదీ ఇప్పుడు నిర్వహించు చూద్దాం?" - అనే సవాలు, నెం.5 వర్గం నుండి, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10వర్గానికీ 1992 తర్వాత ఇవ్వబడింది. గమనించి చూడండి - ఇటీవల సంవత్సరాలలో సినిమా అగ్రహీరోలకి ఇవ్వబడిన ప్రతీ సంచలనానికీ.... అదే స్టైల్, అదే డైలాగ్, అదే స్లోమోషన్, అదే నేపధ్య సంగీతంలో కమేడియన్లతో పేరడీలు రావటం జరిగింది. కమేడియన్లతో అది చూసి ఫక్కున నవ్వుతాం. ఆ నవ్వుల్లో హీరోలకి సృజించిన స్టార్ డమ్ పటాపంచలయ్యింది.

1992 కు ముందర తమిళ డబ్బింగ్ చిత్రం ’ఘర్షణ’ శివాజీ గణేశన్ కుమారుడు ప్రభూ, జెమినీ గణేశన్ మేనల్లుడు కార్తీక్ లతో సూపర్ డూపర్ హిట్టయ్యింది. దాని పేరడీ, మరో సినిమాలో సమాంతర హస్యంగా సుధాకర్, బాబూ మోహన్ లతో వచ్చింది. బోలెడు సినిమాలకు అలాంటి పేరడీలని వేణుమాధవ్, ఆలీ, సునిల్ వంటి నటులు చేశారు. వెంకటేష్ చిత్రం ’ఘర్షణ’ ని అనుకరిస్తూ బొమ్మనా బ్రదర్స్ - చందనా సిస్టర్స్ లో కృష్ణ భగవాన్ నవ్వించాడు.

ఇవన్నీ సామాన్య ప్రేక్షకులకి స్పృహ లేకుండానే, వాళ్ళ మీదే నడిచిన మానసిక తంత్రాలు. ఒకప్పుడు స్టార్ డమ్ ల సంకెళ్ళని నెం.10 వర్గం విధిస్తే... ఇప్పుడు నెం.5 వర్గం వాటిని తుత్తునియలు చేయటం! రెండింటిలోనూ అత్యధిక శాతం సామాన్య ప్రేక్షకులు, తమ ప్రమేయమూ, స్పృహ లేకుండానే అందులోంచి ప్రయాణిం చేసారు.

ఈ స్ట్రాటజీ అర్ధమైనందునే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో, 1992 కు ముందర, ఇందుకోసమే జాగ్రత్తగా బిల్డప్ చేసుకొచ్చిన ఇమేజ్ పనికొస్తుందో రాదో అన్న సందిగ్థంలో ’బాబా’ సినిమా తర్వాత రాజకీయ రంగంలోకి వస్తాడట, అప్పుడొస్తాడట, ఇప్పుడొస్తాడట గట్రా వార్తలతో, పుకార్లతో వెనుక ముందులాడారు. తర్వాత రజనీ కాంత్ మెల్లిగా డ్రాప్ అయిపోయాడు. విజయ్ కాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి నష్టపోయాడు. చిరంజీవి ముందుకు దూకి ఇబ్బందుల్లో పడ్డాడు. వీరందరి వెనుకా ఉన్నది సినీరంగ గాడ్ ఫాదర్ లూ, ఆ వెనుక ఉన్నది నెం.10 వర్గమే! ’నటులు సినిమాలలో వేషాలు మాత్రమే వేసుకోండి, మీరు నిజజీవితంలో హీరోలు కాదు సుమా’ అన్న హెచ్చరికల వెనుక ఉన్నది నెం.5 వర్గమే! తెరమీద హీరోయిజం కృత్రిమం. నిజ జీవితంలో హీరోలు కావాలంటే ఆయా ఉదాత్త లక్షణాలు ఉండాలి కదా!

నిజానికి సినిమా హీరోలని రాజకీయాల్లోకి తెచ్చి, ముఖ్యమంత్రులని చేసింది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమే. అయితే అది వారి ఉనికి తెలియని రోజుల్లో. అంటే off record లో నన్నమాట.అదే మరోసారి on record లో జరిపించబడింది. తొలి దానికి ఎన్టీఆర్ తెదేపా ఉదాహరణలయితే రెండో దానికి చిరంజీవి ప్రరాపాలు ఉదాహరణలు!

ఇలా అప్పట్లో off record లో జరిగిన సంఘటనలూ, కేసులూ, తర్వాత on record లో జరగటం ఇస్కాన్ గురించిన టపాలలో కూడా వివరించాను.

ఇది సినిమా రంగానికి సంబంధించి నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గానికీ మధ్యనడిచిన సవాళ్ళు ప్రతి సవాళ్ళల్లోనూ, భాషలోనూ ఒక అంశమైతే... మరి కొన్ని అంశాలు, కొన్ని ప్రత్యేక సినిమాలు ముఖతః నడిచాయి.

1992 కు ముందర భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనం తెలిపే శంకరాభరణం వంటి సినిమాలని మచ్చుకి అనుమతించటం ద్వారా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ... ఇంకా ప్రజలలో తమ సంస్కృతి పట్ల ఎంతగా గౌరవమూ, ఇష్టమూ ఉన్నాయో, తాము ఎంత ధ్వంసం చేయగలిగారో... ఇంకా ఎంత ధ్వంసం చేయాల్సి ఉందో అంచనా వేసుకునేవాళ్ళు.

అలాగే ఇప్పుడూ కొన్ని సినిమాలు నడిచాయి. ఉదాహరణకి ’భారతీయుడు’ ’ఠాగూర్’ గట్రాలు. ఇలాంటి సినిమాలని స్వేచ్ఛగా వదిలి, ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి గూఢచార సంస్థలు. భారతీయుడు సినిమా, లంచానికి వ్యతిరేకంగా.... అలనాటి స్వాతంత్ర సమరంతో సమానంగా.... అవినీతిపై పోరాటానికి తలపడిన ఓ వృద్దుడి కథ! ఈ కథతో సినిమా తీయటం అన్న అసైన్ మెంట్ తోనే, నెం.10 వర్గానికి, తమ అనుమానాలు తమకి వచ్చాయి. ఆ విధంగా నెం.5 వర్గం ప్రజలని మోటివేట్ చేయాలనుకుంటుందేమో ననే అనుమానం అది!

అందుకే, దాన్ని అపహాస్యం చేస్తూ.... తర్వాత రోజుల్లో, లంచానికి వ్యతిరేకులనీ, లంచం తీసుకోని వాళ్ళనీ ’ఓహ్! భారతీయుడివా?’ అంటూ [ఉదా: ఐతే సినిమా] వ్యంగ్యం పోవటం వంటివి చూపుతూ.... "చూశారా? ప్రజలంతా అవినీతికి అలవోకగా అలవాటుపడి ఉన్నారు. ఎవరికీ ఏమీ పట్టటం లేదు" అనే జవాబుని నెం.10 వర్గం, నెం.5 వర్గానికి ఇచ్చింది.

అలాంటిదే ఠాగూర్ సినిమా గురించి కూడా! అవినీతిని అంతం చేయాలనే సందేశాత్మక సినిమాని బ్లాకులో టిక్కెట్టు కొని సినిమా చూసే రకాలం మనం, జనం’ అంటూ వ్యంగ్యాస్త్రాలూ వదలబడ్డాయి. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అప్పట్లో పీవీజీ పలికిన ’చట్టం తన పని తను చేసుకుపోతుంది’ అనే మాట, తర్వాత సినిమాలలొ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ’ఠాగూర్’ లోని "తెలుగు భాష లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం" అనే డైలాగు కూడా! చివరికి ’తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బండోడు!’ అనే చెణుకులు కూడా!

ఆ డైలాగు ప్రత్యేకత ఏమిటంటే - సాక్షాత్తూ భగవత్ సాక్షాత్కారం పొందినా కూడా, కర్మఫలం అనుభవించాకే కైవల్యం అంటుంది హిందూధర్మం. అలాంటి చోట... పురాణ సినిమాలలో కూడా [దక్షయజ్ఞం వంటి పాత సినిమాలలో సైతం] ’పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అంటూ మిధ్యాభావనలని ప్రవేశ పెట్టింది నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. నిజానికి "ఎన్ని తప్పలన్నా చెయ్యి. పాప పరిహార పన్ను కడితే సరి! స్వర్గద్వారాలు నీ కోసం తెరిచి ఉంటాయి" లాగే, ఇది కూడా ప్రజలని ప్రక్కదోవ పట్టించే వాదమే! "ఎన్ని తప్పులు చేసినా మారు మనస్సు పొందితే సరి! పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కనుక శిక్ష అవసరం లేదు" అనే భావాలని, వాదనలని సమాజంలోని పంపిణీ చేయటమే ఇది.

నక్సల్స్ కూడా నానా తప్పులు చేసి "కామ్రేడ్! నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను" అంటే చాలు, నాయకత్వం క్షమించేస్తుంది. "ఇలాంటి పశ్చాత్తాపపు టెక్నికులు, మైండ్ సెట్ లు మార్చుకోవడాలు, మా దగ్గర పనిచేయవు. చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. సువర్ణముఖి నుండి ఎవరూ తప్పించుకోలేరు" ఈ సంకేతాన్ని నెం.5 వర్గం, నెం.10 వర్గానికి ఢంకా భజాయించి మరీ ఇచ్చింది.

ఇలా ప్రత్యేక సినిమాలతోనూ, సినిమా రంగంలోనూ రెండు గూఢచార వర్గాలూ మాట్లాడుకున్న నేపధ్యాలు చాలా ఉన్నాయి. అలాంటి మరో అంశమే ఆనాటి నీనా గుప్తా Vs ఈనాటి పద్మాలక్ష్మి వ్యవహారం; వాటిల్లో మీడియా ప్రమేయం! వివరంగా చెప్పాలంటే……

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

>> ఏ మతస్థులైనా పరమత చిహ్నాలు ధరించటానికి ఇష్టపడరు. అది ఆయా వ్యక్తులకి తమ మతం పట్లా, మత విశ్వాసాల పట్లా ఉన్న నిజాయితీ, నిబద్దతలని బట్టి ఉంటుంది. అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కొందరు కీలక ఏజంట్లకు దమ్మీడీల పట్ల,అధికారం పట్ల ప్రేమ తప్పితే మత విశ్వాసాలు కూడా వాళ్ళకు పట్టవు. అందుచేత హిందువుగా నటిస్తూ, హిందూ మత చిహ్నాలు ధరిస్తూ ముస్లింలూ ఉండగలరు. ముస్లిం మత చిహ్నాలు ధరిస్తూ హిందువులూ, ముస్లిమేతరులు కూడా ముస్లింల లాగా కొనసాగగలరు.




అటువంటిదే ఆ మధ్య వచ్చిన నాగార్జున ఆజాద్ సినిమాలో ఉంది. అందులో రఘువరన్ హిందూ వేషం వేసుకున్న ముస్లిం. హీరో అతని అసలు రూపాన్ని బట్టబయలు చేస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్లో ట్రైన్ ని పాకిస్తాన్ తిసుకుపోతారు అప్పుడు హీరో వచ్చి రక్షిస్తాడు . కార్గిల్ యుద్దంలో గడ్డిపోచను కూడా కదపలేని మీకు కాశ్మీర్ ఆపిల్ కావాల్సి వచ్చిందా అని - డైలాగ్ . ఈ చిత్రానికి దర్శకుడు తిరుపతిస్వామి అనే తమిజ్(ళ్) యువకుడు. మంచి దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు తీసిన దర్శకుడు.అదేంటో చిత్రంగా కారు ఏక్సిడెంట్ లో చనిపోయాడు. గణేష్ , ఆజాద్, వల్లరసు (కమిషనర్ నరసిమ్హ నాయుడు - విజయ్ కాంత్ ) మదలైన సినిమాలు అతనివే. ఇవే కాకుండా విజయ కాంత్ నటించిన ఒక సినిమా( పేరు గుర్తు లేదు ) లో ప్రకాష్ రాజ్ విలన్ - అతనో పత్రికాధిపతి .

అజ్ఞాత గారు : మాకు శంకర్ నాగ్ వంటి దేశభక్తి చిత్రాలు, మాల్గుడి డేస్ వంటి టీవీ సీరియల్స్ నిర్మించిన దర్శకులు రోడ్డు ప్రమాదంలో మరణించటం గురించి తెలుసు. శరత్ చంద్రుడి నవలలని భారతీయ ఆత్మసహితంగా తీర్చిదిద్దిన తోడికోడళ్ళు, అర్ధాంగి వంటి భావవాద చిత్రాలని నిర్మించిన ఆదుర్తి సుబ్బారావులు ఆత్మహత్యలకు తరమబడటం తెలుసు. ప్యాసాల వంటి చిత్రాలతో సినిమారంగంలో అసత్య కళాత్మక విలువలని, ఘోస్టుల గురించి బయటపెట్టిన గురుదత్త్ వంటి దర్శక నిర్మాతలు ఆత్యహత్యల పేరుతో అనుమానాస్పద మృతి చెందటం తెలుసు. నేటి భారతం వంటి దేశభక్తియుత, స్ఫూర్తి దాయక చిత్రాలకు దర్శకత్వం వహించిన టి.కృష్ణలు కాన్సర్ బారినపడి మరణించటం తెలుసు. అలాంటి వ్యాధులు పుట్టించటం తేలికని ఇప్పుడు అందరికి తెలిసిందే కదా! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబితానే ఉంటుందండి. అంతదాక ఎందుకు ఇటీవల బైకు ప్రమాదంలో మరణించిన ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రయోగాత్మాక పరికరాలను కనుగొన్నవాడు.

ఐతే మీరు ఉదాహరించిన దర్శకుడు తిరుపతి స్వామి గురించి తెలియదు. మంచి సమాచారం చెప్పారు. కృతజ్ఞతలండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu