ఈ నేపధ్యంలో ఒక విషయం స్పష్టంగా చెబుతాను. మాకూ నెం.5 వర్గానికీ మధ్యగల సంబంధం గురించి...

శ్రీకృష్ణుడు, అర్జునుడు విషాదయోగంలో చతికిలబడి కూర్చున్నంత సేపూ, ఏ మార్గదర్శకత్వమూ సారధ్యమూ చెయ్యడు. విషయాలు విడమరిచి చెబుతాడంతే! నిర్ణయం అర్జునుడు తీసుకోవాల్సిందే! అర్జునుడు యుద్దోన్ముఖుడై గాంఢీవం ధరించాకే, కృష్ణుడు అతడి రధసారధియై పగ్గాలు చేబడతాడు. తానుగా, అర్జునుడికి మాట సాయమూ, మార్గదర్శకత్వమూ తప్పితే.... ఆయుధ, సాధన సంపత్తి సాయం గానీ, యుద్దంలో శృత సంహారం చేసిపెట్టటంగానీ, చేయడు. ఒక్క మాటలో చెప్పాలంటే - అర్జునుడి బదులుగా తాను యుద్దం చేయడు. యుద్దం అర్జునుడే చేయాలి. ప్రతీక్షణం యుద్దరంగంలో తనే నడిపిస్తాడు. అంతేకాని ప్రత్యక్ష యుద్దం మాత్రం చేయడు. అర్జునుడి చేతే శృత సంహారం చేయిస్తాడు. విశ్వరూప సందర్శన యోగంలో అదే చెబుతాడు కూడాను.

శ్లోకం:
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా న్యానపి యోధవీరాన్
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్టాః యుధ్యస్వ జేతా సి రణే సపత్నాన్

భావం:
ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదివీరులందర్నీ నేను పూర్వమే చంపివేశాను. నాచేత చచ్చినవారినే నువ్విప్పుడు చంపబోతున్నావు. ఆధైర్యం మాని, యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.

మాకూ నెం.5 వర్గానికీ ఉన్నది ఈ సంబంధమే! ఎక్కడా, ఎప్పుడూ, నెం.5 వర్గం అంటూ ఎవరూ.... మమ్మల్ని కలిసి, ఏ సాయమూ చేసింది లేదు. ఏ క్షణమైనా ’యుద్దం చేయనంటూ చతికిల బడే అవకాశం అర్జునుడికి ఎంతగా ఉందో మాకూ అంతగానే ఉంది. ఎప్పుడైనా.... ’అవినీతిపై పోరాడను, అవినీతిలో పొర్లాడుతాను’ అనుకుంటే అందుకు అవకాశాలెప్పుడూ మూసుకుపోయి లేవు.

అయితే - జీవితంలో ఇలాంటి రహదారి కూడళ్ళు ఎప్పుడు ఎదురైనా ’గీతే’ మమ్మల్ని రక్షించింది. మా స్పృహ ఒక్కటే - ఎలా బ్రతికినా చచ్చే రోజున ఛస్తాం. అవినీతి వైపు నిలబడినా, నీతి వైపు నిలబడినా, ఏదో రోజు చావు తప్పదు. ప్రపంచంలో పగలూ రాత్రి ఉన్నట్లే, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టసుఖాలూ తప్పవు. కాకపోతే ’ధర్మం, అధర్మం, ఎటు వైపు నిలబడి ఈ కష్టసుఖాలని అనుభవిస్తాము’ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. పాండవుల వైపు నిలిచినా, కౌరవుల పక్షాన నిలచినా, యుద్దరంగంలో బాణాల దెబ్బతినని వాడెవ్వడూ లేడు, చివరికి అర్జున దుర్యోధనులతో సహా! అటువంటప్పుడు, ఆ పడే కష్టసుఖాలేవో ధర్మపక్షాన పడటం మేలు కదా!


ఇదే ’మారీచుడు - ఉప్పు మూట’ టపాలో కూడా వ్రాసాను. సాక్షాత్తూ రాక్షసుడైన మారీచుడు, ఎటూ చావు తప్పనప్పుడు అది రావణుడి చేతిలో గాక రాముడి చేతిలో మేలు అనుకున్నాడు. అటువంటప్పుడు మనమెందుకు వెనక్కి తగ్గాలి? ఇక "యుద్ద రంగంలోనే ఉండము ఇంట్లో కూర్చుంటాము.... అనుకోవడానికి మాత్రం ఏముంది?" ఎవరి జీవితానికి వాళ్ళు అర్జునుడైన చోట, ఇంటా బయటా ఎవరి జీవితమైనా యుద్దరంగమే! ఆ స్పృహ మనకి ఉండటమూ, ఉండకపోవటమూ వేరే విషయం. అంతే!

"అసలు నేను ఎందులోనూ తలదూర్చను. అప్పుడు నా జీవితంలో యుద్దమో, ఘర్షణో ఏదీ ఉండే అవకాశమే లేదు" అని ఎవరైనా అనుకున్నా ఉపయోగం లేదు. మనం ఎందులోనూ తలదూర్చక పోయినా... తెలంగాణా వేర్పాటు వాదాలు, సమైక్య వాదాలు వంటివి వచ్చినప్పుడో, అధిక ధరలు, హిందూత్త్వమో, ముస్లిం తీవ్రవాదమో, నక్సలిజమో పీకల మీదికి వచ్చినప్పుడో కదలక తప్పదు. అన్ని విషయాల్లో ’నాకెందుకు వచ్చింది’ అనుకునే అలసత్వ ధోరణి శిఖరాగ్ర స్థితికి వచ్చే, అసలీ పరిస్థితులు వచ్చాయి. ఇక పరిస్థితి తీవ్రదశకు వచ్చినప్పుడైనా స్పందించక తప్పదు. తమోగుణం సమసి, రజోగుణం రగలకా తప్పదు.

కాబట్టే - గత టపాలలో వ్రాసేటప్పుడు ’నేను 1992లో రాజీవ్ గాంధీ హత్య, పాతబస్తీ మత ఘర్షణలలో ముఖం మీద 11 కుట్లు పడిన పసిపాప వంటి విషయాలలో స్పందించి ఉండవచ్చు, 2000 లో శ్రమించి ఎంసెట్ పరీక్ష వ్రాసి, మేధో చౌర్యానికి ర్యాంకు ఫిక్సింగ్ లకు గురైన రమాదేవి వంటి విద్యార్ధిని చూసి స్పందించి ఉండవచ్చు. అలాగే మీరు మరో విషయానికి స్పందించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో స్పందిస్తారు" అని వ్రాసాను.

స్పందించను అని భీష్మించుకు కూర్చోవటానికి కూడా ఏమీ లేదు. సాక్షాత్తూ ’గీత’ అదే చెబుతుంది. మోక్ష సన్యాస యోగంలో

శ్లోకం:
యదహంకార మాశ్రిత్య స యోత్స్య ఇతి మన్యసే
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి

భావం:
దురహంకారంతో యుద్దం మాని వెయ్యాలని తలంచినా, నీ నిశ్చయం వృధాయే అవుతుంది. నీ క్షత్రియ ధర్మమే నిన్ను యుద్దానికి నియోగించి తీరుతుంది.

శ్లోకం:
స్వభావజేన కౌంతేయ నిబద్ద స్స్వేన కర్మణా
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో2పి తత్

భావం:
అర్జునా! ప్రకృతి జనితమైన ఏభ్రాంతి వల్ల బద్దుడవై యుద్దం చెయ్యనని తలంచినా, సహజమైన క్షాత్రస్వభావానికిలోనై నీ నిశ్చయాన్ని తప్పి ఆ యుద్దాన్ని చేసి తీరతావు.

కాకపోతే భగవంతుడి కరుణ ఉంటే ఆ స్పృహ మనకి కలుగుతుంది. శ్రీరామకృష్ణ పరమహంస "భగవంతుడు నీకు కూడు, గూడు ఇచ్చినందుకు కృతజ్ఞుడవై ఉండనవసరం లేదు. ఎందుకంటే తండ్రిగా అది ఆయన బాధ్యత. కానీ, నీ బుద్ది పెడధోరణి పట్టకుండా చూసినందుకు కృతజ్ఞుడవై ఉండాలి" అంటాడు. అది నిజం!

దేవుడి దయ వలన ఆ స్పృహ మాకు కొంత ఉంది. జీవితంలో ఏ మలుపు దగ్గరైనా, ఏ అవకాశంలోనైనా ’మన ధర్మం, మన దేశం, మన సంస్కృతి’.... ఇటువైపే అడుగు లేసాము. ఈ యుద్దంలో నెం.5 వర్గం, ఎప్పుడూ, ఎవ్వరూ మాకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. కష్టపడి సంపాదించిందంతా ఢిల్లీ వెళ్ళటం, హైదరాబాద్ వెళ్ళటం, ఫిర్యాదులు పెట్టటం.... ఇందుకే ఖర్చుచేసాము. నిల్వలు కరిగిపోయినప్పుడు మిత్రుల దగ్గరా, భావ సంబంధీకుల దగ్గరా, సహృదయుల దగ్గరా అప్పులు చేసాము. మళ్ళీ పుంజుకోగానే అప్పులు తీర్చాము. మళ్ళీ యుద్దం! మళ్ళీ అప్పులు... మళ్ళీ తీర్చడం. ఇదే ఈ పదేళ్ళలో జరిగింది.

1992 లో పీవీజీకి రామోజీరావు మీద ఇచ్చిన ఫిర్యాదు తర్వాత.... 2000 ఎంసెట్ ఫలితాల మీద, ఆ తర్వాత నుండి మాపై వ్యవస్థీకృత వేధింపు మీదా... ఫిర్యాదులు పెట్టుకుంటూ పోయాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా చెయ్యవలసినంత చేసి వెనుదిరిగి చూస్తే.... రామోజీ రావు, తన కీలక ఆప్త అనుచరురాలు సోనియాతో సహా చక్కాగా నిరూపింపబడ్డారు.

అలాగే.... కృష్ణదేవరాయలు యుద్ద విరామంలో, సాయంత్రాలు కవులతో గోష్ఠి, నాట్య వినోదాలు ఉన్నట్లు, మా జీవితంలో కూడా సినిమాలు, షికార్లు, మా పాపకి చూపించటానికి పర్యటనలు అన్ని ఉన్నాయి. కాకపోతే యుద్దం ప్రధాన స్రవంతి. అంతే!

అంతే కాదు, నేను బ్లాగులో వ్రాసిన తర్వాత, ఆయా విషయాలు మరింతగా బహిర్గతం [expose] కావటం, సువర్ణముఖిలు మరింత స్పష్టంగా ఆయా వ్యక్తుల జీవితాలలో అనివార్యం కావటమూ ఉంది! ఇది ఒక రకంగా మాకు నైతిక విజయం వంటిది. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడటం! మరో మాటలో చెప్పాలంటే ధార్మిక విజయం వంటిది. అణుధార్మిక శక్తి కన్నా, నైతికత, ధర్మానుష్టానాలతో కూడిన ధార్మిక శక్తి అత్యంత తీవ్రమైనది.

గతటపాలలో బాబాలు, అమ్మవార్ల గురించి వ్రాసాను. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాబాలు, అమ్మవార్ల ఆశ్రమాలు సానికొంపలై బయట పడుతున్నాయి. సినిమా రంగంలో కుట్ర స్వరూపం గురించి వ్రాసాను. చిన్న నిర్మాతలని, చిన్ననటులని తొక్కేస్తున్నారంటూ ఆయా నటులూ, నిర్మాతలూ మానవహక్కుల సంఘాల గడప తొక్కుతున్నారు. ఆ మానవ హక్కుల సంఘాల అసలు రూపం గురించి కూడా వ్రాసాను. అదీ, మా కేసులో ఉన్న స్వానుభవం సహితంగా వ్రాసాను. అదే దృష్టాంత పూరితమౌతూ మానవహక్కుల సంఘాలూ, సదరు న్యాయమూర్తులూ, రామోజీ రావు వంటి పెద్దనిర్మాతలు Vs. కళ్యాణ్ కొల్లి వంటి చిన్న నిర్మాతల వ్యవహారాలు తమ పరిధిలోకి వస్తాయో రావో చూడాలంటూ ’రెడ్ టేపిజాన్ని’ చక్కగా చూపించారు.

>>>అంతర్జాతీయంగా, అమ్నెస్టీ కూడా నైతికంగా దివాళా తీసిందని విమర్శలు వస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన కవోజామ్‌ బెగ్‌ అనే మాజీ అనుమానిత ఉగ్రవాదితో కలసి పనిచేసిన ఆమ్నెస్టీ నైతికంగా దివాలా తీసిందని, బెగ్‌తో, అతని నేతృత్వంలోని 'కేజ్‌ ప్రిజనర్స్‌'తో ఆమ్నెస్టీ అనుంబంధం ఆ సంస్థకు పూడ్చలేని నష్టం కలిగించిందని విమర్శ. బెగ్‌ గతంలో అమెరికా జైలు గ్వాంటనామో బేలో ఖైదు అనుభవించాడు. రష్దీ వివాదాస్పద నవల 'శాటానిక్‌ వర్సెస్‌' ఇస్లాం మతాన్ని చెడుగా చూపుతోందని, ఇరాన్‌ గతంలో ఆయనను చంపాలని ఫత్వా జారీ చేయడం తెలిసిందే. ఆ సమయంలో ఆమ్నెస్టీ ఆయనకు మద్దతిచ్చింది. ఆమ్నెస్టీకి బెగ్‌తో, ఇతర ఇస్లామిక్‌ ఛాందసవాదులతో సంబంధాలున్నాయని, ఆ సంస్థకు చెందిన లింగ వివక్ష వ్యతిరేక విభాగం అధ్యక్షురాలు గీతా సెహెగల్‌ ఇటీవల ఆరోపించారు. దీంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. [ఆంధ్రజ్యోతి వార్త]

తెలంగాణా వెనుక అసలు కథలనీ, రాష్ట్రం వేరైనా సామాన్యుడి బ్రతుకు బాగుపడని తనాన్ని వ్రాసాను. పచ్చిగా.. కేసీఆర్ లూ, కోదండరాంలూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలూ, పదవీ రాజకీయాలూ, అధిష్టానపు విన్యాసాలూ [సర్కస్ ఫీట్లని తెలుగులో విన్యాసాలనే అంటారు కదా], అన్నిటినీ... అందరమూ.... చూస్తున్నదే! అలాగే ఈవిఎం ల టాంపరింగ్ గురించి ఎన్నికల ఫలితాల వచ్చిన తర్వాత రోజే టపా వ్రాసాను. తర్వాత ఈవిఎంల గురించి గగ్గోలయ్యింది. అలాగే వై.యస్. మరణం వెనుక మతలబు గురించి వ్రాసాను. ఈ రోజుకీ, ఆ మరణం గురించిన నిజాలు వెలికి తీయకుండా అధిష్టానం, బయటకు లాగటానికి వై.యస్. కుమారుడు జగన్ ల ఫీట్లు చూస్తున్నదే కదా!

ఇక స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలని, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ఎంతగా రోడ్డు కీడ్ఛిందంటే - వారి సంతానాలని నీతి బాహ్యులుగా, ధర్మభ్రష్ఠులుగా అయ్యేటట్లు తరిమింది. అదే చూపించి ఆ వృద్దులని ’ఇల్లు చక్కదిద్దు కోలేరుగానీ, దేశాన్ని దిద్దుతారట’ అనిపింప చేసి కృంగి కృశించేలా చేసింది. బాపూజీని సైతం... ఆయన నలుగురు కుమారుల్లో ఒకరు ఆంగ్లేయుల నాగరికతా వ్యామోహంలో పడి తండ్రికి వ్యతిరేక దిశలో ఉండటాన్ని తెగ ఎగతాళి చేసారు. శాస్త్రీజీ వారసుల మీదా గురిపెట్టబడింది.

ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. చిన్నప్పుడు మా వీధిలో ఓ పెద్దాయన ఉండేవాళ్ళు. ఖద్దరు కట్టేవాళ్ళు. స్వాతంత్ర సమరంలో జైలు కెళ్ళిన వాడు. వాళ్ళింట్లో చరఖా కూడా ఉంది. అయిదుగురు కుమారులు. బోసు, నెహ్రు, అశోక్... ఇలా పేర్లుండేవి. మేమంతా ఆయన్నిపెదనాన్నా అని పిలిచేవాళ్ళం. అప్పుడప్పుడూ వాళ్ళింట్లో ఆడుకునే వాళ్ళం. ఓ రోజు "నీ పేరేమిటి తల్లీ?" అని అడిగాడు. "ఆదిలక్ష్మి పెదనాన్నా" అన్నాను. "అంటే అర్ధం ఏమిటి?" అన్నాడు. "దేవుడి పేరు" అనేసాను. "నీ పేరుకు అర్ధం తొలిసంపద అనిరా! మీ అమ్మానాన్నలకు నువ్వు First money వన్న మాట" అని చెప్పారు. ఎంత సంతోషం వేసిందో.

వాళ్ళబ్బాయలని అన్నా అని పిలిచే వాళ్ళం. మా వీధిలో అందరూ ఆ కుటుంబాన్ని, ఆ పెద్దాయనని చాలా గౌరవించే వాళ్ళు. [పేరు గుర్తున్నా వ్రాయటం లేదు.] వాళ్ళకి ఒక అమ్మాయి. భర్తతో ఏదో వివాదం వచ్చి పుట్టిల్లు చేరింది. ఓ రోజామె నిండా నగలు పెట్టుకుని మాయా బజార్ లోని ఓ ముస్లింతో వెళ్ళిపోయింది. విషయం దుర్గంధ సంచలనం అయ్యింది.

దెబ్బతో వాళ్ళు, తమ రెండంతస్థుల స్వంత ఇంటిని వదిలేసుకుని, తెనాలికి మకాం మార్చుకున్నారు. తర్వాత అయినకాడికి ఇల్లు అమ్మేసుకున్నారు. ఇదొక్కటే కాదు. చాలా వరకూ స్వాతంత్ర సమర యోధుల మీదా, వారి కుటుంబసభ్యుల మీద గురిపెట్టబడిందన్న విషయం, చాలా కుటుంబాలని పరిశీలించి చెబుతున్నాను. ఆ సువర్ణముఖినే అనుభవిస్తూ.... రామోజీరావు! అతడి కుమారులు - కిరణ్, ఈనాడు పత్రిక సినిమా పేజితో మొదలు పత్రికా విలువలతో, పత్రిక నడపడంలో ఘన వారసత్వం చాటుకుంటూ ఉంటే.... రెండవ కుమారుడు సుమన్ ’నాన్ స్టాప్’ గా బహిర్గత సువర్ణముఖిలని ప్రదర్శిస్తున్నాడు.

తరాల మధ్య ఘర్షణపెట్టి వినోదించిన రామోజీరావు, నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులూ....

గౌరవనీయమైన, నైతికత వంటి విలువల పట్ల నమ్మకం కలిగిన కుటుంబాలని, నమ్మించి ద్రోహం చేసో సామదానభేద దండోపాయలతోనో నడిరోడ్డు కీడ్చిన రామోజీరావు, నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులూ....

గూఢచర్య స్ట్రాటజీ అనుకొని, నెం.5 వర్గాన్ని నమ్మించటం కోసం, నాటకం ఆడుతున్నామనుకొని, ఎంతగా వినోదాన్ని పండించారంటే - సుమన్ రామోజీరావుతో వివాదపడి సాక్షి పేపరు కెక్కాడు. ఫలించకపోయే సరికి, మళ్ళీ గుట్టు చప్పుడు గాకుండా తండ్రి గూట్లోకి కొడుకు వెళ్ళిపోయాడు. "తండ్రి కొడుకులు తగవులు పడతారు, ఆపైన రాజీలు పడతారు, కుటుంబ గొడవలు అందరికీ సహజమే - వాటి గురించి మాట్లాడ కూడదు" అంటారేమో, ఎవరైనా!?

అలాగని, ఆ తండ్రి i.e. రామోజీరావు అనుకోలేదు. ఎన్నో కుటుంబాలని తన మీడియా బలంతో, తన నెట్ వర్క్ బలంతో, మామూలుగా రోడ్డుకి లాగాడు. అంతేకాదు. పత్రిక సాక్షిగా... పత్రిక చేతిలో ఉంది కదా అన్నట్లు ’నాన్ స్టాప్’ సినిమా గురించి, ఈనాడు సినిమా పేజీలో, రామోజీరావు సతీసమేతంగా ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తూ, ఈ సినిమాలో సుమన్ ’బాబు’ నిర్మాణ బాధ్యతలు తప్ప మరింకేవీ నిర్వహించలేదు అని వ్రాసారు. సినిమా విడుదల తర్వాత ఒక సస్పెన్సూ ఉంటుందని ఊరించారు[?] లేదా ముక్తాయించారు. తీరా చూస్తే సినిమాలో విలన్ గానో హీరోగానో సుమన్ బాబు నటించేసాడు. కనుక్కుంటే సాంత్రో కారు బహుమతిగా ఇస్తాడటలెండి.

అయినా గానీ... నిర్మాణ బాధ్యత తప్ప మరే బాధ్యత నిర్వహించలేదు, అంటే నటించ లేదంటూ నమ్మించి మోసం చెయ్యటమా? ప్రజలంటే ఎంత చులకన?

ఈ విధంగా ప్రజలని పరిహాసం చేయటాన్ని పక్కన బెట్టి, సీరియస్ గా ఆలోచించినా.... ఇంతకు ముందు ఎన్నో సినిమాలు నిర్మించి, పంపిణీ చేసిన రామోజీరావుకి వాస్తవం తెలియదా? కృష్ణుడి వేషం వేసినంత మాత్రాన... సుమన్, ఎన్టీఆర్ కు సరిపోలుతాడా? ’ఇకముందు అందరూ సీనియర్ ఎన్టీఆర్ ని మరిచిపోయి శ్రీకృష్ణుడి వేషానికి సుమన్ నే అడుగుతారంటూ ’ వాణిజ్య ప్రకటనలు, సినిమా ఇంటర్యూలు ఇచ్చుకునేటప్పుడు రామోజీరావుకు తెలియదా?

ఎంత ప్రకటన కంపెనీలు, ప్రకటనలని ప్రచురించే పత్రికలూ, ప్రసారం చేసే టీవీలూ తమ చేతిలోనే ఉన్నా.... ఇంత నాసిగా తీసి, జనాలు నెత్తిన రుద్ది ’సక్సెస్ హిట్. విజయవంతమైన x వ వారం’ అంటూ ప్రకటించేస్తే.... పదే పదే అదే ప్రచారంతో, అబద్దాన్ని నిజం చేయ ప్రయత్నించే ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్ తప్పితే ఇది మరొకటి కాదని రామోజీరావుకు తెలియదా? తెలిసీ చేయగలిగిందే ముంది? సువర్ణముఖి అనుభవించక తప్పదు మరి!

ఇదంతా ఎందుకు చెప్పానంటే - శతృవు మా మీద ప్రయోగించే ఆకలిని ఎదుర్కోలేకో, లేక, చూపించే ప్రలోభాలు i.e. కీర్తి, సంపదలకి ఆశపడో మేము యుద్దాన్ని విరమించి రాజీపడినా.... నెం.5 వర్గానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పేటందుకు! మేము కాదు మరెవ్వరు మానినా యుద్దం ఆగేదీ లేదు, రామోజీరావు, నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులు బ్రతికేదీ లేదు. భౌతికమైన మరణాన్ని ఇక్కడ నేను ఉటంకించటం లేదు. గూఢచర్యపరమైన, భావపరమైన మరణాన్ని గురించి చెబుతున్నాను. ఎవ్వరు చేసినా మానినా, ఈ ధర్మయుద్దం కొనసాగి తీరుతుంది. దీనినే గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు.

శ్లోకం:
కాలో౨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే౨పి త్వాం న భవిష్యంతి సర్వే యే౨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః

భావం:
ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప, మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవడు కూడా మిగలడమనేది అసంభవం.

సరిగ్గా ఇదే.... మాకు, వ్రాతల ద్వారా ఈనాడు ముఖతః, వేధింపు ద్వారా రామోజీరావు ముఖతః కలిగిన స్పురణ. ’అవినీతిలో పొర్లాడినా, అవినీతిపై పోరాడినా వెతలు తప్పవు’ అన్న విషయం మా సహోద్యోగులు మందుబాబులని చూసినా, నా తమ్ముళ్ళని చూసినా అర్ధమయ్యింది. అదీగాక, ఎవరైనా మనకి నచ్చకపోతే వాళ్ళనుండి దూరంగా పోతాం. మనకి మనం నచ్చక పోతే ఎక్కడికి పోతాం? మనశ్శాంతి లేకపోయాక పట్టు పరుపులూ, శీతల యంత్రాలూ, పేరుప్రతిష్ఠలూ కూడా సంతోషాన్నివ్వలేవు. ఇది అందరికీ తెలిసిన సత్యమే!

అంతేకాదు, అవినీతి, ఆధర్మం రీత్యా చూసినా... [అప్పటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలు తెలియకపోయినా] రామోజీరావుల వంటి వాళ్ళు మాకు శతృవులే! మాలాగా సత్యాన్ని, ధర్మాన్ని నమ్మేవాళ్ళకి, ఆచరించాలని ఆశపడే వాళ్ళకి కూడా శతృవులే! అలాంటప్పుడు.... మాకూ, మాలాంటి వాళ్ళకూ, మనలాంటి వాళ్ళకూ, నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు ఉమ్మడి శతృవులే! కనుక యుద్దం అనివార్యం.

ఎవరు ఈ ధర్మయుద్దం చేసినా చేయకపోయనా, నమ్మినా నమ్మకపోయినా, ఇది అనివార్య, నిరంతర చర్య. మా స్వానుభవం ఏమిటంటే - తెలియని దాన్నే భయం అంటారట. ఈ యుద్దరీతి కూడా అంతే! ఈ దేశంనాది, ఈ జాతి నాది, ఈ సంస్కృతి నాది అనుకునే వాళ్ళకి, ఈ యుద్దరీతి తెలిస్తే.... ఎవరి స్థాయిలో వాళ్ళు, అవినీతి పైనా, కుట్రలకు వ్యతిరేకంగా పోరాడేటప్పుడు మరింత అవగాహన ఉంటుంది. అవినీతిపరుల, రాజకీయ నాయకుల, కార్పోరేట్ వర్గాల మాయ మాటలకు మనం తలొగ్గకుండా, మనకి ఈ అవగాహన సహాయపడుతుంది. అలాగ్గాక అవినీతిలో పొర్లాడే వాళ్ళకైనా, తమకి కష్టనష్టాలు తప్పనిది ఎందుకో ఎప్పటికైనా అర్ధమౌతుంది.

కాబట్టి కూడా.... పరిణామక్రమంలో యుద్దాన్ని కూడా ఆస్వాదించటం, వినోదించటం నేర్చుకున్నాము. ఇక యుద్దం చేసే వాళ్ళెవరూ లేకుండానే, నెం.5 వర్గమైనా.... నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారినీ, వారి కర్మఫలాన్ని ఎలా అనుభవింప చేయగలదని అనుకుంటారేమో! అదీ సాధ్యమే! వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

11 comments:

neeku pithyam chala undi first doctor daggariki po..ila net ni misuse cheyaku....nuvvu rasedi ninnu project chesukovatanike ani pistundi naaku....aslu nee level eanti ..ramoji,sonia level eanti.....pichhi P**** lo Naa M****

ంఈ భాధేమిటో అర్థం కాలేదు. ఏదో బ్లాగాయణం , మధ్య్లో రామోజ్జ్, ఆ తరువాత తెలంగాణ, కోదండం, ఫీట్లు, మళ్ళీ మీ వెక్కిళ్ళు.... అంతా అయోమయంగా వుందీలా సీరియల్ నవల కాకుండా క్లుప్తంగా రాయలేరూ?

ఇప్పటి వరకు రాసిన టపాలకు ఈ టపా ఒక అర్థం లా గా అనిపించింది... నేను కూడా ఇంతకు ముందు మీ రాతలని విమర్శించాను... కానీ.. కొన్ని టపాలు ఎంతో అర్థవంతం గా కనిపించాయి... మీ విశ్లేషణ చాలా బాగుంది... ఈ దేశాన్ని ఎవరు కాపాడగలరు అన్నారు కదా...
మీడియా అతిని గాడి లో పెట్టేందుకు హక్కుల కమిషన్ లా ఒక సపరేట్ కమిషన్ ఉండాలి... అది నిరంతరం గా మెడియా ని గమనిస్తూ ఉండాలి... వారి రాతలు గీత దాటి ...కావచ్చు ..ఉండొచ్చు లాంటివి రాసినా చర్యలు తీస్కొని క్షమార్పనలు చెప్పేలా ఉండాలి... ఎలాంటి విషయాన్నైనా ముద్రించొచ్చు కానీ... అందులో ఊహాజనిత విషయాలు ఉండకుండా నియంత్రించగలగాలి.... ఇక ఆర్థికం మీదకొస్తే...
అంబానీలకి టాటా లకి కోపం వస్తే గోచీ ఊడిపోయే పరిస్థితి అనేది నాకనిపించిన భావన.. కార్పొరేట్ సంస్థల ఆస్తుల , లావా దేవీల పైనా నిరంతర నిఘా ఉండేలా ఒక సంస్థ ని ఏర్పాటు చేయాలి... ఎలా అంటే... ఆ కంపని దశ దిశ అన్ని తెలిసేలా ఎప్పటి కప్పుడు అన్ని వివరాలూ ప్రజల ముందు ఉండాలి...దానికోసం ప్రభుత్వం తరపున శ్వెత పత్ర కమిటీ ఒకటి ఉండాలి...లేక పోతే సత్యం లాంటివి మరిన్ని జరుగుతాయి... అలాగే..

అవినీతికి వేల కాళ్ళు ..ఏదో ఒకరూపం లో ఉంటూనే ఉంటుంది.. మొక్కవోని మీ దీక్ష కి మా జోహార్లు.. మీ పోరాటం కొనసాగించండి... మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.. నిజం గా మీరు బార్న్ టఫ్

ఓ అజ్ఞాతలూ :

మేము రామోజీరావు, సోనియాల గురించి చెబితే మీకింత కోపం ఎందుకోస్తొందో మీకే తెలియాలి. ఇంతకు ముందు, సూర్యాపేటలో మా ఇంటి ఓనరు దగ్గర నుండి కొంత మంది మమ్మల్ని బండబూతులు తిట్టారు. ఇప్పుడు మీరు దాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. మీ సంస్కారం మీది. అసలు నైజం ఎంత దాచుకున్నా దాగుతుందా!

నా బ్లాగు మీకు అర్ధం కాని పక్షంలో మీ బాధ మీది. బాధ భరించలేనప్పుడు చక్కాపోవటం హాయి కదా!

వంశీ గారు,

శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయంటారు పెద్దలు. కాబట్టి ప్రధానంగా ఉండాల్సింది ప్రజల్లో ధైర్యమూ, నిజాయితీలు!

Ajnata2: artham kaavaTlEdu morrO anTE... daanni tiTTlu anTaaraa! Soniyaa, RamOjini, KCR ni banDa bootulu tiTTanDi, abhyantaram lEdu. kaani , iTlaa anni Taapiklu kalipi .. chaduvarulanu confuse chEyaDam avasaramaa?!

ayyO Sivaa.. ippuDu telustOndi, vaaLLevarO mimmalni bootulu tiTTaaranTE vaaLLa sahanaanni meeru mee rachanala dvaaraa pareekshinchi vunTaaru. , avunaa? :)

అమ్మా,
మిమ్మల్ని ఆ అజ్ఞాత అన్న మాట చదివి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయీ. మనుషులు చిన్న దెబ్బ తగిలితె నలుగురికి చెప్పుకొని సానుభూతికి ఎదురు చూస్తారు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలిన మీరు మొక్క వోని దీక్ష తో మీ మార్గాన్ని విడువలేదు. అంతులేని తెలివి, ధైర్యం, పట్టుదల, సాహసం ఉన్న మీలాంటి వారికి సామన్యుల నుంచి దోరికే ప్రతిఫలం ఇదా? మీ టపాలు చదివినప్పుడు నాకు మీ తెలివి తేటల స్థాయి ఒక పెద్ద యం.యన్.సి. కంపేని లో ఉండె సి.ఇ.ఒ. కన్నా ఎక్కువ అని అనిపించిది. అటువంటి మీరు డబ్బు, ప్రాంత,భాష,వర్గ ఉన్మాదం నెత్తికేక్కిన తెలుగు వారు మీ స్థాయి 50సం|| కూడా అందుకోలేరు. మరీ గత 20 సం|| చదువుకున్న చెత్త సరకు సభ్యుల సంఖ్య ఆంధ్రా వాళ్ళ లో ఎక్కువైంది. మీ బోటి వారు పరిశ్రమల రంగం లో లేక పోయినా కనీసం మీ ధైర్యం కొంతమంది చదువు కున్న వారికి గాంధి లాగ ఒక మార్గాన్ని చూపించారు.
*కాబట్టి ప్రధానంగా ఉండాల్సింది ప్రజల్లో ధైర్యమూ, నిజాయితీలు. *చాణుక్యుడు ధైర్యం లేని వారు చదువుకోవటానికి అనర్హ్యులు అని అన్నాడు.

amma odi garoo,
nenu mea blaagu ki abhimaanini....ea postlo modati comment ananymous ga pettina comment ni dayachesi delete cheyyandi....dat comment contains very vulgar n abusive words.....u might be ignorant of dose things...chadivi naa kadupu ragili poyindi....daya chesi aa comment delete cheyyandi....alanti neati malina trashtulu rase comments porapatuna chadivinaa panch maha patakaalu chuttukuntay.....

This comment has been removed by a blog administrator.

అక్క , మొదటి కామెంట్ చూసి చాల సేపు ఏమి రాయాలో అర్థం కాలేదు , మనం మాములుగా ఎవరితోనయిన ఫోన్ లో మాట్లాడిన జాగ్రత్తగా మాట్లడుతం , అలాంటిది వాడు రాత పూర్వకం గ తిట్టాడు , మొదట మీరు కామెంట్ ని అప్ప్రోవ్ చెయ్యకున్దాల్సింది అనిపించింది , కాని నా అభిప్రాయం తప్పు , మీరు దానిని అలాగే వుంచండి , వాళ్ళ వర్గం ఎలాగు రోజు చూస్తున్నారు కదా , ప్రతి రోజు వాళ్ళు మనుషుల - పశువులా తెలియచేస్తుంటుంది , ఇలాంటి మానసికమయిన బాణాలు మీ మిద ఏమాత్రం పని చేయవని తెలియ చేయాలి

శ్రీకాంత్

నైతిక మద్దతు చెప్పిన అజ్ఞాతలకు : ధన్యవాదాలండి.

శ్రీనివాస్ గారు: ఆ అజ్ఞాతల పేరుతో ఎవరు వ్రాసారో వాళ్ళ నైజం అది. మనం అలాగే తిట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీ అభిమానానికి, నైతిక మద్దతుకి కృతజ్ఞతలు.

శ్రీకాంత్ : తమ్ముడు, ఎవరయినా మనకి ఏదైనా ఇచ్చారనుకో మనం తీసుకోకపోతే అది వాళ్ళకే చెందింది. ఇలాంటి తిట్లు కూడా అలాంటివే. మొదటి అజ్ఞాత వ్రాసిన వ్యాఖ్యాలాంటి వాటిని ప్రచురించకపోతే మళ్ళీ మళ్ళీ అలాంటివే వ్రాసి చీదర, జుగుప్స కల్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రచురించాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu