దేశాల మీదే కాదు, వ్యక్తుల మీదైనా నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే ఆకలి తంత్రం ఒకటే! పైకి వైవిధ్యమున్న ప్యాకింగు ఉన్నా, లోపలి సరుకు అదే ఉంటుంది.

ఇటీవల మా బ్లాగులో వ్యాఖ్య వ్రాస్తూ రాఘవ గారూ,
>>>కామినీ-కాంచనాలు అని కదా అంటారు, మీరు కామినీ-క్షుత్తులు అన్నారేమిటి? బొత్తిగా ఆకలివఱకూ తీసుకువస్తారా? అలా చేస్తే మిగతావాళ్లు చూస్తూ ఊరకుంటారా?

అన్నారు. ’చుట్టూ ఉన్నవారు చూస్తూ ఊరుకుంటారా?’ మామూలు పరిస్థితుల్లో అయితే ఆపాటి మానవత్వం అందరిలో ఉంటుంది. కానీ గూఢచర్యం గురిపెట్టిన వ్యక్తుల చుట్టూ అయితే ఇలాంటి అసాధారణ స్థితులు అనివార్యంగా ఉంటాయి.

ఎక్కడిదాకో ఎందుకు? ఈ దేశపు ప్రధాని ఇందిరాగాంధీ, ఎమర్జన్సీ అనంతర ఎన్నికలలో తనూ, తన చిన్నకుమారుడు సంజయ్ గాంధీ ఓటమి పాలయ్యాక, వ్యక్తిగత, కుటుంబ ఖర్చుల కోసం స్నేహితురాలిని 50,000/- రూ. అప్పుగా అడిగిందని సదరు స్నేహితురాలు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈమె ఇందిరాగాంధీ జీవితాన్ని గురించి పుస్తకం కూడా వ్రాసింది. పేరు గుర్తులేనందున క్షమించాలి. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. [1992 జూన్ తరువాత, 1992 డిసెంబరు లోపల, ‘ఇండియా టుడే’ తెలుగు పక్షపత్రికలో ఆ ఇంటర్వ్యూ వచ్చింది.]

ఓ దేశ ప్రధానికి, ఒకప్పటి ప్రధాని కుమార్తెకి, గతంలో అత్యంత ధనికుల జాబితా కెక్కిన కుటుంబంలోని వ్యక్తికి ఇలాంటి స్థితిని ఊహించగలమా? ఇందిరాగాంధీ చుట్టు ఉన్నవారు చూస్తూ ఊరుకుంటారా అంటే తెలిస్తే ఎవరు ఊరుకోరు. కాని అప్పటికే ఆమె చుట్టూ ఎవరిని నమ్మని స్థితికి వచ్చింది. ఆమెకి, ఆమె అనుచర గణానికి మధ్య రకరకాల కాంప్లెక్స్ లు సృష్టించబడినవి. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యం, తాము గురిపెట్టిన వారి చుట్టూ అంత దుర్భేద్యమైన కనబడని ఇనపతెరని నిర్మిస్తుంది. అప్పటికీ సాయంగా నిలిచిన వారిపై సామదానభేద దండోపాయాలనీ ప్రయోగిస్తుంది.

మా ఉదాహరణే తీసుకుంటే, 2001 లో సూర్యాపేటలోని మా ఇంటి నుండి కట్టుబట్టలతో రోడ్డుమీదికి వెళ్ళగొట్టబడ్డాక, నానా వెతలు పడ్డాము. స్నేహితుల పంచన తలదాచుకున్నాము. ఎన్నాళ్ళని స్నేహితులు ఆదుకుంటారు? చివరికి ఆత్మాభిమానం గాయపడినా, సహాయం కోసం నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి చంద్రబాబునాయుడు వాళ్ళని చేరదీయటంతో మస్తు హవా నడుస్తోంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరిలో గల, వాళ్ళ కార్ డెకార్స్ కు, ప్రముఖ రాజకీయనాయకుల దగ్గర నుండి సినిమా తారల వరకూ చాలామంది వచ్చేవాళ్ళు. తెదేపా నాయకులూ, చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ తో బాటు, కాంగ్రెస్ నాయకుల వరకు! నా పెద్దతమ్ముడు చాలామంది బంధువులకీ, చిన్ననాటి మిత్రులకీ కూడా ఉద్యోగాలూ, ఇతర ఉపాధి సౌకర్యాలూ, వసతి సౌకర్యాలూ చూపెట్టాడు. బంధువుల పిల్లలను కూడా తన ఇంటి దగ్గరలో ఇళ్ళు చూసి, వాళ్ళ మంచి చెడ్డలు చూసాడు.

అయితే మాకు మాత్రం, నానల్ నగర్ లో చిన్నరేకుల గదిని అద్దెకు చూసాడు. మాకు పెద్దగా సాయం చేయలేక చేతులెత్తేసాడు. అప్పటికి ఆరెళ్ళ మా పాపతో సహా రెండు రోజుల పాటు పస్తులున్నా…. తల్లీ, తోబుట్టువులూ, బంధుమిత్రులూ, అందరూ చూస్తూ ఊరుకున్నారు. ఒక్కసారి కూడా నానల్ నగర్ లోని మా ఇంటికి వచ్చి చూడలేదు కూడా! స్కూటర్ ఉండి, సామాను లేకుండా, చిన్నపాపతో, ఆ ఏరియాకి తగని మనిషులు వచ్చి అద్దెకు ఉంటే, ఎవరూ చూడటానికి రావటం లేదంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. ఇదేదో లేచిపోయి వచ్చిన బాపతు అని అనుకోరా? అప్పుడు ఎంత చులకన ఉంటుంది? మేము ఆ స్థితికి ఎందుకు వచ్చామో చుట్టుప్రక్కల వాళ్ళకి చెప్పలేము. అలాగని వాళ్ళ చూపులని తప్పించుకోలేము.

బంధుమిత్రులే కాదు, బాల్య స్నేహితులు సైతం, "అందుకే తలవంచుకు పోవాలి. ఇవాళా రేపూ ఎవర్నీ ఎదురించకూడదు. ఎంసెట్ కుంభకోణం కాకపోతే సవాలక్ష అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. కాలమే అలా మారిపోయింది. ఈ అవినీతిని ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి రాజీ పడండి” అని సలహా లిచ్చేవారు. అప్పటికి నా దృష్టిలో ఎంసెట్ మీద ఫిర్యాదు చేసాను కాబట్టి సూర్యాపేట నుండి తరమ బడ్డానన్న భావన ఉండేది. “ఊరు దాటి వచ్చాము కదా! ఇంతకీ ఎవరితో రాజీపడాలి? జీవితం తిరిగి ప్రారంభించాటానికే ప్రయత్నిస్తున్నాము కదా!” అని అడిగితే ఇక అంతే! ’నువ్వే అర్ధం చేసుకో!’ అన్నట్లు తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళు.

అప్పట్లో మా జీవితంలో గూఢచర్యం నిండిపోయిందని గానీ, లేదా గూఢచర్యపు సుడిగుండంలో మా జీవితాలెప్పుడో పడిపోయాయని గానీ గుర్తించనందున, ఈ మాటలేవీ మాకు అర్ధమయ్యేవి కావు. ఎంసెట్ కుంభకోణంపైన ఫిర్యాదు ఇచ్చినందుకు మామీద వ్యవస్థీకృత వేధింపు నడుస్తోందనీ, దీన్నుండి రక్షించమనీ, చంద్రబాబు నాయుడిని సమతాబ్లాకులో 2001 మార్చి 20 న కలిసి అడిగితే, మహాక్రోధంతో గెడ్డం పైకెత్తి “ఎందుకు? ఎందుకు వేధిస్తారు?" అనేసి వెళ్ళిపోయినప్పుడు మా పరిస్థితి అయోమయమే!

అలాంటి ’అసాధారణాలన్నీ’ తరువాత గానీ మా బుర్రకి వెలగలేదు. ఇవి ఒక్క అనుభవంతో చెప్పటం లేదు. ఇలాంటివి చాలా చాలా అనుభవాల తరువాత చెబుతున్నాను. ఆ వివరాలన్నీ మీరు పీవీజీ – రామోజీరావు – మా కథ లేబుల్ లోనూ, భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర గురించిన టపాల మాలికలోనూ చదివి ఉన్నారు.

కాబట్టి స్వానుభవంతో మేము చెప్పేదేమిటంటే – దేశాలని , వ్యవస్థలనీ, జాతులనే కాదు, నకిలీ కణిక వ్యవస్థ తము గురిగా ఎంచుకున్న వ్యక్తులపై కూడా ’ఆకలి’ తంత్రం ప్రయోగిస్తుంది. పస్తులు దాకా తెస్తుంది. సోమాలియాలో ఆకలి చావులు తెచ్చినట్లు!

మీకు ఓ ఆసక్తికరమైన అంశం చెప్పాలి. ఇద్దరు ఆటగాళ్ళు చదరంగం ఆడుతున్నారనుకోండి. బోర్డుపైన పావులు నిమిత్తమాత్రులే! దీన్నే ఆధ్యాత్మిక దృష్టితో చూసి మన పెద్దలు “మనమంతా భగవంతుడి చేతిలో పావులం. నిమిత్తమాత్రులం” అంటారు. గతటపాలలో చెప్పిన ’వదలని ఎలుగుబంటి’ కథలాగా 1992 లో ఎప్పుడైతే రామోజీరావు కుట్రల మీద [అప్పటికి రాజీవ్ గాంధీ హత్య, మత ఘర్షణలు, హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు…. వరకే నాకు తెలుసు] పీవీజీకి ఫిర్యాదు ఇచ్చానో, అప్పుడే నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. నా జీవితమే కాదు, నా కుటుంబసభ్యుల జీవితాలు సైతం. కట్టుకున్నందుకు నాభర్తా, కడుపున పుట్టినందుకు నాబిడ్డా కూడా ఇందుకు అతీతులు కాలేదు. కాకపోతే ’మన జీవితం మన చేతుల్లో లేదు. మనం నిమిత్తమాత్రులం’ అన్న స్పృహ మాత్రం 2005 తరువాత కాలంలో కలిగింది. నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ మధ్య జరుగుతున్న ఈపోరులో నిజంగా మేం నిమిత్తమాత్రులమే!

ప్రపంచవ్యాప్తంగా, శతాబ్దాల తరబడి పాతుకుపోయిన నకిలీ కణిక వ్యవస్థనీ, దాని బలంతో వేళ్ళూనుకున్న నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తుల్నీ బహిరంగపరుస్తోన్న, చేసిన కర్మని [సువర్ణముఖిని] అనుభవింపచేస్తున్న నెం.5 వర్గం, మమ్మల్ని కాపాడదా అంటే కాపాడుతుంది. కాపాడుతుందా అంటే కాపాడటం లేదు.

వివరంగా చెప్పాలంటే మేం ప్రాణాలతో మిగిలి ఉన్నామంటే అందుకు కారణం నెం.5 వర్గమే. మేం వేధింపబడుతున్నామంటే అందుకు కారణం నెం. 10 వర్గమే! మా ప్రాణాల్ని కాపాడగలుగుతున్న నెం.5 వర్గం, మమ్మల్ని వేధింపు నుండి కాపాడటం లేదు. మమ్మల్ని వేధించగలుగుతున్న నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి మామీద ఉన్న క్రోధం, ప్రతీకారాలరీత్యా, మా ప్రాణాలు తీయటమూ లేదు. ఆ విధంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతున్న చదరంగపు ఆటలో మేం పావులం, నిమిత్తమాత్రులం. కొన్ని సంఘటనలు సోదాహరణంగా వివరిస్తాను. దానికి ముందు మరికొన్ని విషయాలు చెప్పాలి.

1992 లో పీవీజీ కి, రామోజీరావు మీద ఫిర్యాదు ఇచ్చేటప్పుడే, ఒకవేళ తేడా వస్తే ప్రాణాలకు హామీలేదని తెలుసు. ఒకవేళ విజయం వస్తే బాధే లేదు అనుకున్నాం. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు, నాణెం ఎగరేస్తే బొమ్మకాదు, బొరుసు కాదు నాణెం నిలబడటం అన్న సంభావ్యత జరిగింది. అదేంటంటే, వేధింపు లేదా సుదీర్ఘ యుద్దం.

అయితే, 1995 తర్వాత 2005 వరకూ, మేం ఇంకే విషయాలు ఆలోచించలేదు. మా బ్రతుకు, మా కెరీర్, మాపాప, దైవభక్తి! ఇదే లోకం. మా జీవితాల్లో జరిగేవన్నీ జ్ఞాపకం ఉండటం సహజంగా భగవంతుడిచ్చిన జ్ఞాపక శక్తి చలువ. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఏం జరిగాయో, జరుగుతుండేవో మాకేం పట్టేది కాదు. వార్తాపత్రికలు చదవటం, టీవీ వార్తలు చూడటం చాలా యధాలాపంగా చేసేవాళ్ళం. కాలేజీలో పని ఒత్తిడి కారణంగా నేనైతే అసలు పేపరే సరిగా చూసేదాన్ని కాదు. 2005 తర్వాతే మళ్ళీ అన్నీ పునఃపరిశీలించటం ప్రారంభించాము.

ఈ నేపధ్యంలో ’అసలు రామోజీరావుకైనా మమ్మల్ని వేధించాల్సిన అవసరం ఏమిటి?’ అని తెగ ఆలోచించాము. పీవీజీకి ఫిర్యాదు ఇచ్చామన్న కసీ,కోపం, ప్రతీకారేచ్ఛ అనుకుందామన్నా, మేం ఫిర్యాదు ఇవ్వటం వలన అతడికొచ్చిన నష్టం కానీ, కష్టంకానీ అప్పటికి మాకేం కన్పించలేదు. ఇంకా RFC, అనేక భాషల్లో ఛానెళ్ళూ గట్రాలతో, అతడి వ్యాపారం మూడుపువ్వులూ ఆరు కాయలుగా ఉండటమే అందరికీ తెలుసు. అందరికీ తెలిసినట్లే మాకూ తెలుసు. అదీగాక కసీ, కోపం, ప్రతీకారేచ్ఛ అయితే ఒక్కబిగిన పీక పిసికేయటం చాలా సులభం! ఇలా వేధింపు అవసరం లేదు.

దాంతో, వెనక్కి మా జీవితాలని కూడా పునఃపరిశీలించుకున్నాం. నిజానికీ అప్పటి నుండీ ఇప్పటికీ, మమ్మల్ని ఎందుకు వేధిస్తారో రామోజీరావుకీ, అతడి సోదరీతుల్య సోనియాకీ, అతడి అనుచరగణాలైన చంద్రబాబు, వై.యస్. [అతడు ఇప్పుడు లేడులెండి] వంటి వారికే తెలియాలి.

మమ్మల్ని వేధించి శోధించి తెలుసుకోవలసిన రహస్యాలేవీ మా దగ్గరలేవు. 2008, జనవరి 17 వ తేదీన ప్రధానికి మేం వ్రాసిన లేఖలో ఇదే వ్రాసాము. దాని తాలూకూ జిరాక్స్ కాపీని తీసుకుని, [లేకపోతే నమ్మమేమో నని] సిబిసిఐడి నుండి జోసెఫ్ అన్న అధికారి, నంద్యాలలోని మా ఇంటికి వచ్చినప్పుడూ అతడికి కూడా చెప్పాము. 2007లో మార్చిలో స్టేట్ మెంట్లు ప్రహాసనం నడిపినప్పుడు [ఆ తదుపరి శ్రీశైలంలోని మా గది, accommodation కాన్సిల్ చేశారు] శ్రీశైలం సిఐకీ చెప్పాము.

"ఎలా బ్రతికినా, పోయే రోజున పోతాం. ఒకసారి కాదు, వందసార్లు ఇదే చేయటానికైనా మేం సిద్దం” అని చెప్పాను. “అసలు రామోజీరావు మీద ఎందుకు… ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు?" అని రెట్టించాడు శ్రీశైలం. సి.ఐ. “తప్పా తప్పా?" అని నేనూ అన్నిసార్లు రెట్టించి అడిగాను. సిబిసిఐడి అధికారి జోసెఫ్ మాత్రం, చాలా కూల్ గా ప్రధాని అపాయింట్ మెంట్ ఎందుకు అడుగుతున్నామని అడిగాడు. “నా రిపోర్ట్ తో మీకు మేలు జరగాలని కోరుకుంటానమ్మా! ఆపైన పైవాళ్ళ ఇష్టం” అనేసి వెళ్ళిపోయాడు.

నిజానికి ఈ బ్లాగు ప్రారంభించినప్పుడు కూడా, మేం ఒకకోణంలో ఇంతే అనుకున్నాము. “మన దగ్గర ఏదో రహస్యాలున్నాయనుకుని కదా వేధిస్తున్నారు? మనకి తెలిసినవి ఏవో అందరికీ తెలిసినవే! అందరూ చదివినట్లే మనమూ వార్తాపత్రికలు చదువుతాం. అందరూ చూసినట్లే టీవీ వార్తలు చూస్తాం. కాకపోతే ప్రారంభం తెలుసుకాబట్టి, ఆయా ఘటనల కార్యకారణ సంబంధం మనకి తెలుస్తుంది. అది అందరికీ చెబుదాం. విషయం తెలిస్తే, ఆ దృష్టితో చూస్తే, చాలామందికి విషయం అర్ధమవుతుంది. కనీసం దీనితో నన్నా రామోజీరావుకి ఉబలాటం తీరిపోతుంది” అనుకున్నాము. అదే నా బ్లాగులోనూ ఓ టపాలో వ్రాసాను.

గతంలో మా మీద “నీ దగ్గరున్న సమాచారం ఏమిటో చెప్పు” అన్న ఒత్తిడి నడిచేది. బ్లాగు ప్రారంభించిన నాటి నుండి, బ్లాగు డిలీట్ చేయమన్న ఒత్తిడి కూడా నడుస్తోంది.

"బ్లాగు డిలిట్ చెయ్! ఢిల్లీ వచ్చి సోనియాను కలిసి, ఇంకా నీకు ఏమేం సమాచారం తెలుసో అదంతా చెప్పెయ్!” ఇదే ఒత్తిడి. వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లో “అతడికి చెప్పినా ఫర్లేదు” అనే ఒత్తిడి నడిచేది. ఇది మాకెలా అర్ధమైందో లేక ఇది మాకెలా అర్ధం చేశారో వివరంగా, దృష్టాంతాపూరితంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu