క్రింది వార్తని పరిశీలించండి.





నారాయణ దత్ తివారి! ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్, U.P. మాజీ ముఖ్యమంత్రి. కేంద్రలో పలు పదవులు నిర్వహించిన సుదీర్ఘ రాజకీయాను భవం కలిగిన వాడు. 84 ఏళ్ళ ఈ ముసలి వ్యక్తి ఈ రోజు పితృత్వ కేసు ఎదుర్కుంటున్నాడు.

ఓసారి గతంలోకి తొంగి చూస్తే…….

1962 లో, చైనా యుద్ధంలో భారత్ ఓడిపోయినప్పుడు, అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ బాగా విమర్శలనెదుర్కున్నాడు. కలల మనిషి, వాస్తవాన్ని గ్రహించలేక పోయాడనీ, చైనా దురాక్రమణని ఊహించటంలోనూ, ఎదుర్కోవటంలోనూ విఫలమయ్యాడనీ…… ఈ నేపధ్యంలో మానసికంగా కూడా నెహ్రూ బాగానే కృంగిపోయాడనీ, తీవ్ర భావోద్వేగానికిలోనై ఒక బహిరంగ సభలో దుఃఖించాడనీ కధనాలున్నాయి. ఆ సమయంలోనే ఓ సారి యూపిలో బహిరంగ సభలో, N.D. తివారి దాదాపు పదివేల మంది సభికుల చేత దేశభక్తి గీతాన్ని ముక్త కంఠంతో పాడించి, వారిలో దేశభక్తినీ, స్థైర్యాన్ని నింపాడు. ఆ విషయం బాగా ప్రచారంలోకి రావటంతో 37 ఏళ్ళ వయసులో ఉన్న N.D. తివారీ నెహ్రు దృష్టిలో పడ్డాడట. దాంతో అతడు నెహ్రూకి అభిమాన పాత్రుడయ్యాడు. ఆ తర్వాత ఇందిరాగాంధికి కూడా విశ్వాసపాత్రుడయ్యాడు.

ఇందిరాగాంధీ ఎవర్నీ అంతగా నమ్మని కారణంగా, తరచూ ఆమె విశ్వాస పాత్రులు మారిపోతూ ఉండేవారు. కాబట్టి ఇతడి రాజకీయ కెరియర్ కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా, మొత్తానికి రాజకీయాల్లో చెప్పుకోదగినంతగా రాణించాడు.

అతడి 55 ఏళ్ళ వయస్సులో, కేంద్ర మంత్రిగా ఉండగా, మరో కేంద్ర మంత్రి షేర్ సింగ్ కుమార్తె ఉజ్వలా శర్మాతో సాన్నిహిత్యం ఏర్పడిందట. అప్పటికే వివాదాలరీత్యా భర్తకు దూరంగా ఉంటున్న ఉజ్వలా శర్మతో N.D. తివారీ ప్రేమాయణం ఓ కుమారుడికి జన్మనిచ్చింది. రోహిత శేఖర్ అనే ఈ యువకుడికి ఇప్పుడు 29 ఏళ్ళు. N.D. తివారీనే తన తండ్రి అనీ, అతడు తనని కుమారుడిగా అంగీకరించాలనీ 2005 లో కేసుపెట్టాడు. న్యాయస్థానాల్లో కొనసాగిన ఆ కేసులో, తివారీ మొదట ఆ యువకుడికి తాను తండ్రినన్న విషయాన్ని తిరస్కరించాడు.

విచారణ దశలో, న్యాయస్థానంలో తివారీ, రోహిత్ శేఖర్ గురించీ, అతడి తల్లి ఉజ్వలా శర్మ గురించీ ప్రస్తావిస్తూ, “ఉజ్వలా శర్మకు తనతోనెగాక ఇంకా కొందరితో సన్నిహిత సంబంధాలున్నాయనీ, అందుచేత ఆ పిల్లవాడు తన కుమారుడేనని ఖండితంగా ఎలా చెప్పటం” అనీ వాదించాడు. దాంతో DNA పరిక్షల గురించిన వాదనలు జరిగాయి.

కేసుదాదాపు నాలుగేళ్ళు నడచి, ఇప్పుడు, యధాప్రకారం కోర్టు ఈ కేసుని కొట్టేసింది. తమ పరిధిలోకి రాదనీ, కాలదోషం పట్టిందనీ కారణాలు చూపింది. కోర్టులూ, న్యాయవాదులూ కూడా రెడ్ టేపిజమ్ కీ, ప్రభావప్రలోభాలకీ అతీతం కాదు అని దినకరన్ లు నిరూపించటం అందరికీ తెలిసిందే. ఏదైతేనేం, మొత్తానికి తనను ఇబ్బంది పెడుతున్న పితృత్వకేసు నుండి తివారికి ఊరట లభించింది.

ఎంత నేర్పుగా…… యుద్ధంలో ఓటమి తాలూకు నైరాశ్యంలోంచి స్పూర్తిదాయక సంఘటనతో నెహ్రూకి దగ్గరైన N.D. తివారీ…….. తర్వాత కొనసాగిన అతడి కెరియర్ గ్రాఫ్! సుదీర్ఘ అనుభవం కలిగిన ఈ రాజకీయ నాయకుడి నైతికత చూస్తే ఇదీ పరిస్థితి.

వాస్తవం పరిశీలిస్తే ఇతడొక్కడే కాదు. పార్టీలకి అతీతంగా, ఇప్పుడు పైకి వచ్చిన రాజకీయనాయకులలో అత్యధికులు ఇలాంటి వారే. ఉదాహరణ పరిశీలించాలంటే – 2006 లో, ఓసారి, సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలోనే అధికార, ప్రతిపక్ష ఎం.ఎల్.ఏ.లూ, మంత్రులూ పరస్పర నిందారోపణలు చేసుకుంటూ, “నీకిందరు భార్యలూ, ప్రియురాళ్ళూ, ఉంపుడు గత్తెలూ ఉన్నా”రంటే, “నీకిందరున్నారని” మాటల ఈటెల విసురుకున్నారు. అప్పటి ఆర్ధిక మంత్రి, నేటి ముఖ్యమంత్రి రోశయ్యే, "ఇక మాట్లాడకండి. ఇప్పటికే ప్రజలలో చులకనైపోయాము, సిగ్గుపోతుంది” అని మందిలించటం జరిగింది.

గతంలో రాష్ట్రముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి గురించయితే, భారతీయ రాజకీయరంగంపై సుదీర్ఘకుట్ర లోని టపాలలో వివరించాను.

ఏదేమైనా 84 ఏళ్ళ వయస్సున్న ఈ వృద్దరాజకీయ నాయకుడి ఎన్.డి.తివారీ విషయలాలస గురించి ఇప్పుడు బయటి కొచ్చింది. పైకి కాషాయం ధరించి రాజకీయ సన్యాసిని అయిన ఉమాభారతి Vs గోవిందాచార్యుల ఉపాఖ్యానాల గురించి గతంలో విస్తుపోయాం. అలాగే నటి సుకన్యతో తమిళ నాడు మంత్రి సంబంధాలు, గుజరాత్ లో మంత్రుల రాసలీలల సి.డి.భాగోతాలు, ఒమర్ అబ్దుల్లా మీద ఆరోపణలు మనకందరికి తెలిసినవే కదా! ఈ రాజకీయ నాయకులే కాకుండా వారి క్రింద పనిచేసే అధికారుల రాసలీలలు, సచివాలయంలోనే వెలగబెట్టిన రాసలీలల వార్తాంశాలు కూడా మనకి తెలుసు.

ఏ రహస్యమైనా బహిరంగమైనప్పుడు కదా తెలిసేది? కుటుంబం పట్లా, కట్టుకున్న జీవిత సహచరి/సహచరుడి పట్లా నిబద్దతా లేనివారు, ఇక ప్రజల పట్ల ఏ నిబద్దత చూపగలరు?

నిజానికి ఇలా వివాహేతర సంబధాలు నడిపేవారి పట్లా, అనైతికత లోంచి జన్మించిన వారిపట్లా నకిలీ కణికులకి ప్రత్యేకమైన అభిమానం ఉండటానికి కారణం, తొలి తరం నకిలీ కణికుడు వేశ్యాపుత్రుదు కావటమేనన్న విషయం గత టపాలలో వివరీచాను.

ఇక్కడ ఓ కొసమెరుపు ఏమిటంటే………. N.D. తివారీ కుమారుణ్ణంటూ కేసు పెట్టిన 29 ఏళ్ళ యువకుడు రోహిత్ శేఖర్ తనకు 12 ఏళ్ళుండగా, N.D. తివారీ తన తండ్రి అన్న విషయం తనకు తెలిసిందని కోర్టుకి చెప్పుకున్నాడు. అంటే 1992లో అతడికీ విషయం తెలిసిందన్నమాట!

సరిగ్గా…… 1992 లో….. ఎంత యాదృచ్చికం?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీరుకూడా సస్పెన్స్ సీరియల్స్ వ్రాయటం మొదలుపెట్టారా? సరే కానివ్వండి.
సరిగ్గా…… 1992 లో….. ఎంత యాదృచ్చికం?

తరువాతి టపాకై వేచిచూస్తూ వుంటాము.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu