ముందుగా ఈ రోజు[16 July, 2010] సాక్షి పత్రికలో ప్రచురింపబడిన క్రింది వార్తాంశాన్ని ఓసారి పరిశీలించండి.

>>>ఇరాన్ శాస్త్రవేత్తకు రూ.23 కోట్ల సీఐఏ నజరానా
అమీరీ దేశద్రోహా? దేశభక్తుడా?
పరువూ, డబ్బూ పోగొట్టుకున్న సీఐఏ

అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు. గత వారంలో అమీరీ హఠాత్తుగా పాక్ ఎంబసీలో ఊడిపడి.... సీఐఏ తనను సౌదీ అరేబియా నుండి గత ఏడాది అమెరికాకు ఎత్తుకొచ్చిందని ప్రకటించాడు.

ఇరాన్ అణు రహస్యాల కోసం డబ్బు ఆశ చూపించిదన్నాడు. కానీ అణ్వస్త్ర రహస్యాలు తెలియనే తెలియవనీ అంటున్నాడు. ఏది ఏమైనా... అమీరీ అకౌంట్లలో లక్షలాది డాలర్లున్న మాట నిజం. అమీరీ, ఆ సొమ్ములోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోలేడనేది అంత కంటే నిజం. ఇరాన్ పై అమెరికా ఆంక్షలే అందుకు కారణం. బెడిసి కొట్టిన ఈ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న సీఐఏ, డబ్బన్నా దక్కించుకుందామంటే... అదీ పోయినట్లేనని తెలుస్తోంది.
~~~~~~~~~~~
ఇదీ వార్త!

ఒకప్పుడు గూఢచర్య వ్యవహారాలు రహస్యాలుగానే మిగిలిపోయేవి. అచ్చం ఇర్వింగ్ వ్యాలెస్ నవలల్లో లాగా! భూగోళం బ్రద్దలవబోయేంత పెను ప్రమాదాలు సంభవించి తృటిలో తప్పిపోయినా, చాపక్రింద నీరులా భూభాగం మెల్లిగా మునుగుతున్నా... అన్నీ రహస్యాలుగానే ఉండిపోయేవి.

ఇటీవలి కాలంలోనే రహస్యాలు రచ్చకెక్కుతున్నాయి. గుట్టుమట్లు గట్లు తెంచుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో పైవార్త ఒకటి.

ఇందులో ఎన్ని గమ్మత్తులు ఉన్నాయో చూడండి.

>>>అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇది ఇరాన్ చేసుకుంటున్న ప్రచారం.

>>>అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ఇది అమెరికా ప్రచారం.

ఇందులో ఏది నిజం? ఎలా తెలుసుకోవటం? మనం దగ్గరి కెళ్ళి చూసేందుకు, తెలుసుకునేందుకు ఏమీ ఉండదు. ఏ దుర్భిణి వేసీ నిజాన్ని చూడలేము. మరెలా?

మామూలుగానే అమెరికా అవునంటుంది. ఇరాన్ కాదంటుంది. లేదా ఇరాన్ ‘ఎస్’ అంటుంది. అమెరికా ‘నో’ అంటుంది. ఇప్పుడు మరో గమ్మత్తు పరిశీలించండి.

>>> అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు.

అమీరీ ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలు అమెరికాకి అమ్ముకున్నందుకే అతడి అకౌంట్ లో డబ్బొచ్చి పడిందా? అవన్నీ బయటికొస్తే తనకి ముప్పు వస్తుందని అమీరీ కొత్త కథ [తాను ‘హీరోయిక్’గా తప్పించుకొచ్చానని] అందంగా అల్లుతున్నాడా?

లేక అమీరీ ని ఇరికించేందుకు, సీఐఏ నే అమీరీ అకౌంట్ లో డబ్బు జమ చేసిందా? మరెవ్వరైనా ఆ పని చేశారా? ఎందుకు చేస్తారు? ఇంతా చేసి, ఈ డబ్బుని అమీరీ వాడుకోలేదు. అటు సీఐఏ కూడా ‘ఆ డబ్బుని’ పోగొట్టుకున్నట్లే! విషయం బైటకి పొక్కక డబ్బు వెనక్కి తీసుకోలేరు కదా ఎవరైనా!?

ఇంతకీ... ఎత్తుకుపోయింది అమెరికా సీఐఏ! ఎత్తుకెళ్ళింది ఇరాన్ అణు శాస్త్రవేత్తని! మరితడు హఠాత్తుగా, గతవారంలో, పాక్ ఎంబసీలో ఎలా తేలాడో? తనను సౌదీ నుండి అమెరికా ఎత్తుకెళ్ళిందన్న అమీరీ, మరే దేశపు ఎంబసీలోనో గాకుండా ‘పాక్ ఎంబసీ’లోనే ఎందుకు ఊడి పడ్డాడు? అమెరికా - ఇరాన్ ల మధ్య ‘పాక్’ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది?

అసలే, అమెరికా పాక్ కు, ఆర్దిక సాయాలు చేతులు నొప్పి పుట్టేదాకా చేస్తూనే ఉంది. అలాంటప్పుడు పాక్, తనను మళ్ళీ అమెరికాకు లోతట్టునే పట్టిస్తుందన్న భయం వేయలేదా ఈ శాస్త్రవేత్తకు!?

ఎవరం చెప్పగలం? వాళ్ళేవో చెబితే నోరెళ్ళ బెట్టి వినగలం తప్ప, నిజం ఎవరికి తెలుసు?

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పానంటే...

‘అమీరీ అకౌంట్ లో డబ్బు’ తో ముడిపడిన ఈ వ్యవహారం[స్ట్రాటజీ] లాంటిదే, మన దేశంలోనూ జరిగింది గనక!

వివరాల్లోకి వెళితే....

పీవీజీ హయాంలో, అవిశ్వాస తీర్మానం గట్టెక్కడానికి, తన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి, పీవీజీ తరుపున తనతో బేరసారాలు నడిచాయని జేఎంఎం నేత శిబూసోరన్ ఆరోపించాడు. జేఎంఎం ముడుపుల కేసుగా అది మీడియాలో మారుమ్రోగింది. అచ్చంగా అమీరీ లాగానే, శోరెన్ అకౌంట్ లో కూడా డబ్బు జమ అయ్యి కనబడింది. ఆ డబ్బు పీవీజీనే జమ చేసాడా?

"ఆయన కాదంటాడు, మనం ఔనంటాం. ఇంతే గదా?" అనుకున్నారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు సోనియాలు, రామోజీరావులు.

అయితే... అక్కడ డబ్బు అకౌంట్ లో ఉంది, ఇక్కడ ఆ డబ్బుతో తనకు అనుకూలంగా ఓటు వెయ్యాల్సిందని బేరాలు నడిచాయని శోరెన్ అన్నాడు. ఇంకేం? మీడియాకి కావలసినంత ‘రచ్చ’ దొరికింది. సరే! కోర్టులో ఆ కేసులు ఏళ్ళూ పూళ్ళూయ్యాక తేలాయి. అందుకోసం పీవీజీ ఇల్లు అమ్ముకున్నాడని వార్తలూ వచ్చాయి.

అయితే ఇందులో ఏది నిజమో కాలం నిరూపించింది కదా!

ఎలాగో వివరిస్తాను.

ఏ కారణంగానైతేనేం, శోరెన్ పీవీజీకి మద్దతిచ్చి, ఆయన మైనారిటీ ప్రభుత్వం అయిదేళ్ళు కొనసాగేందుకు దోహదపడ్డాడనుకుందాం!

నేటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకి పీవీజీ అంటే ఎంత కసీ, ద్వేషమో, పగా ప్రతీకారమో... మరణానంతరం ఆయన పార్దివ శరీరానికే కాదు, ఆరేళ్ళు గడిచినా ఆయన స్మృతికీ చేస్తున్న అవమానాలే సాక్షి!

పీవీజీకి సోరెన్ అనుకూలంగా ఓటేసాడు. అయిదేళ్ళు నిలబడేందుకు సహాయపడ్డాడు. పీవీజీ అయిదేళ్ళు అధికారంలో ఉండబట్టే గదా... ఇప్పుడిన్ని సువర్ణముఖిలు అనుభవించాల్సి వస్తుంది?

అలాంటప్పుడు... శిబూ సోరెన్ మీద, సోనియా గట్రాలకి ఎంత కోపం ఉండాలి? సోనియాకి పీవీజీ మీద ఉన్న కోపంలో, సగమన్నా, కనీసం అందులో పావు వంతన్నా ఉండాలి కదా!? ఆ కోపానికి శిబూ శోరెన్ ని చితక్కొట్టాలి కదా? మరెందుకు చంక నెత్తుకున్నారు?

అందునా.... జూలై 22, 2008 న పార్లమెంట్ సాక్షిగా ‘ఓటుకు నోటు’ తో అవిశ్వాసం గట్టెక్కడం అందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూసినా... ‘ఠాఠ్! అదంతా గిట్టనోళ్ళ కుట్ర’ అంటూ కిశోర్ చంద్రదేవ్... అన్నీ మాఫీ చేసేసినా...

శిబూ శోరెన్ మటుకూ ఢంకా భాజాయించి "అవిశ్వాస తీర్మానం విషయంలో, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర ప్రయోజనాలు సమకూరుస్తామని కాంగ్రెస్, అధినేత్రి మాట ఇచ్చారు. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటారా? లేదా!" అని మీడియా సాక్షిగా బహిరంగంగా అల్టిమేటం ఇచ్చాడు.

దెబ్బతో కాంగ్రెస్ అధిష్టానం, అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న మధుకోడాను దించి, శోరెన్ ని సీఎం ని చేసింది. [ఆ కోడానే తర్వాత హవాలా కేసు తాలూకూ అవకతవకల్లో దొరికాడు.]

ప్రభుత్వ మనుగడ కోసం పదవులిచ్చి ఓట్లు కొన్న అధినేత్రి, పైసలు మాత్రం ఇవ్వదా? ఇలాంటి ఈ శోరెన్ లు పదవులూ, పైసల కోసం, చెప్పమన్నట్లల్లా చెప్పడా? అతడి అకౌంట్ లో డబ్బు కన్పించేలా చెయ్యడం పెద్ద అసాధ్యమైన పనా?

ఇప్పుడు జార్ఖండ్ లో ఈ సోరెన్ తో పొత్తుపెట్టుకుని అంట కాగుతున్నది కాంగ్రెస్, భాజపాలే! ఎంత చక్కగా అన్నిపార్టీలూ, అందరూ రాజకీయ నాయకులూ, ఒకే శృతిలో నడుస్తున్నారని చెప్పుకున్నారో చూశారా? ఆ శృతే నకిలీ కణిక వ్యవస్థ!

ఇదీ... కాలం, నిజాన్ని నిరూపించే తీరు!

రెండు దశాబ్దాల క్రితం వరకూ గడపదాటని ఇల్లాలు, దశాబ్దం న్నర క్రితం నుండి నేటి వరకూ xyz సార్లు ప్రధాని పదవి త్యాగం చేసిన త్యాగశీలి, సోనియా అధికార దాహం ఎంతటి దంటే... అడ్డదారిలో అధికారం చేజిక్కించుకునేందుకు, రాజ్యాంగంలో లేని ప్రభుత్వ కుర్చీ వ్యక్తి పదవినీ, సీటునీ సృష్టించుకొని అధిష్టించేటంత!

ఈ నిజాన్నీ కాలమే నిరూపించింది మరి!

ఎప్పుడో 70 ఏళ్ళ క్రిందట ఇటలీ నియంత ముస్సోలినీ, తొలుత మీడియా వ్యక్తి . పిదప దేశాధినేత అయ్యాడు. అతడు బ్రిటన్ గూఢచారి అని ఇటీవల బయటపడింది. [ ఆ వార్త సాక్షి తప్ప మిగిలిన వాళ్ళు ప్రచురించ లేదు లెండి.] అదీ బ్రిటన్ గూఢచార సంస్థ MI 5 లు ప్రకటిస్తే బయటకు వచ్చింది.

ఇప్పుడు 23 కోట్ల రూపాయలతో అమీరీ కథ బయటికొచ్చింది. [మరీ ఇంత తక్కువ డబ్బా? మన దేశంలో అయితే చిన్నస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసిబి పట్టుకుంటే దొరుకుతున్నాయి.]

ఇందులో ఓ కొసమెరుపు ఏమిటంటే - ఇరాన్ అణు రహస్యాల కోసం అమెరికా తనకి డబ్బాశ చూపిందనీ, కానీ అణ్వస్త్ర రహస్యాలు అమ్మడానికి... తనకి అసలు ఎలాంటి రహస్యాలు తెలియనే తెలియవనీ అమీరీ అంటున్నాడు. అణ్వస్త్ర శాస్త్రవేత్తకి అసలు ఏ రహస్యాలూ తెలియవనడంలో రహస్యమేమిటో? నిజమేమిటో?

కాలం నిరూపిస్తే తెలియాల్సిందే!

అచ్చంగా అద్వానీ Vs జస్వంత్ సింగ్ ల ఆత్మకథల నేపధ్యంలో, 2001 నాటి కాందహార్ హైజాక్ రహస్యాలు బయటికొచ్చినట్లుగా నన్న మాట!

ఎందుకంటే... నిజం బహిర్గతం కావాలంటే - సంఘటనలన్నా జరగాలి. లేదా అందులో ప్రమేయమున్న వ్యక్తులు నోరన్నా విప్పాలి? [కలహమో, మరొకటో] ఏ కారణం చేతనైనా, వ్యక్తులకి మాత్రమే తెలిసిన రహస్య విషయాలు బయటపెడితే తెలియాల్సిందే!

అలాంటి నేపధ్యంలో... శోరెన్ వ్యవహారం ఒక్కటి చాలదా సోనియా నిబద్దత తెలియటానికి? అయినా ఇటలీ మహిళకి ఇండియా పట్ల నిబద్దత ఎలా ఉంటుంది? వింత గాకపోతే!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

4 comments:

నాలుగు రొజులు అయ్యింది మీ టపా వచ్చి...
కొత్త టపా ఎప్పుడండి ?

శ్రీరాం గారు: ఇతరత్రా పని ఒత్తిడిలో ఉండి టపాలు ప్రచురించలేదండి. మీ అభిమానానికీ, మా టపాల మీదా మీకున్న ఆసక్తికీ కృతజ్ఞతలండి!

రామోజీరావు నొ 10 వర్గం లో సూత్రధారి అనీ మీ మీద జరిగిన Organized Herrassment ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందనీ మీదగ్గర వున్న సాక్ష్యాలని ఏదన్నా టపాలో బహిర్గత పరిచారా? ఒకవేళ అవునయితే దయచేసి ఆ టపా లింక్ ఇవ్వగలుగుతారా?

అవన్నీ నా గత టపాలలో వివరించానండి. స్కాన్డ్ కాపీలు కూడా జతపరిచాను. ‘అన్ని టపాలు ఒకే చోట’ అనే లేబుల్ ని చూడగలరు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu