ఎప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా... ఈనాడు, అంబానీలని ఆకాశానికి కెత్తేయకుండా ఊరుకోదు. మదుపర్ల మీటింగ్ కి ముఖేష్ అంబానీ భార్యాబిడ్డల్నీ, తల్లినీ వెంటేసేకు వస్తే అదో పండగనీ, అందరి కళ్ళూ వాళ్ళ మీదేనని ఉత్ప్రేక్ష ఉపమాలంకారాలన్నీ జోడించి వ్రాసేస్తుంది.

‘అన్నం చపాతీ తినను’ అని ముఖేష్ అంబానీ సతీమణి నీతా సెలవిస్తే, దాన్ని ముఖపత్ర ప్రత్యేక కథనంగా ఆదివారం అనుబంధంలో వేసేస్తుంది. ఇలా.... ఏమాత్రం... సందు దొరికినా సదరు కుటుంబాన్ని ప్రశంశల్లో ముంచెత్తడం ఈనాడుకి ఎప్పటి నుండో ఉన్న రివాజు.

ఉదాహరణకి క్రింది వార్తాంశం పరిశీలించండి. జూలై 6 న ధీరూభాయ్ అంబానీ ‘వర్ధంతి’ సందర్భంగా ఈనాడు బిజినెస్ పేజీలో ప్రచురించిన వార్తాంశం ఇది.

"ధైర్యం చేస్తే ప్రపంచాన్ని జయించొచ్చు" హెడ్డింగ్ క్రింద వార్తాంశం.
‘కలలు కనడానికి ధైర్యం చేసేవారు. యావత్ ప్రపంచాన్ని జయించవచ్చు. కలలు కనండి. ధైర్యం చేయండి’


ఇందులో ముఖ్యంగా పరిశీలించాల్సిన అంశం ఒకటుంది...

>>>ధీరు భాయ్ జీవితంలో ప్రారంభ రోజులు చాలా ఆసక్తికరంగా నడిచాయి. హీరాచంద్ గోర్దన్ దాస్ అంబానీ, జమ్నా బెన్ లకు రెండో కుమారుడే ధీరూభాయ్. స్కూలు మాస్టారైన తండ్రికి సాయం చేయరా అంటూ తల్లి ఓసారి అడిగితే.. ‘ఎందుకలా అంటారు. ఏదో ఒకరోజు నేను గుట్టల కొద్దీ డబ్బును సంఫాదిస్తా’ అని కోపంగా అన్నారట. 16 ఏళ్ళ వయసులో రూ.300 జీతం కోసం యెమెన్ లో ఓ కంపెనీలో చేరి అక్కడ డబ్బు సంపాదించాడు. అప్పట్లో యెమెన్ రియాల్ స్వచ్ఛమైన వెండితో తయారు చేసే వారు. దీనికి లండన్ బులియన్ ఎక్స్చేంజిలో బోలెడు గిరాకీ ఉండేది. దీనిని కనిపెట్టి ధీరూభాయ్ వాటిని కరిగించి లండన్ లో విక్రయించే వారు. తద్వారా కొన్ని లక్షలు సంపాదించారు. ఇదంతా 1950 నాటి సంగతి.

16 ఏళ్ళకే డబ్బు సంపాదించాలన్న కాంక్ష అధికంగా ఉన్న వ్యక్తి ధీరూభాయ్ అంబానీ. అప్పట్లో 300/-రూ. జీతం అంటే ఎక్కువే! అంత పెద్ద జీతం కోసం యెమెన్ వెళ్లాడు. అందులో తప్పేం లేదు.

అయితే....
అప్పట్లో యెమెన్ రియాల్ స్వచ్చమైన వెండితో తయారు చేసేవారు. దాన్ని కరిగించి లండన్ లో అమ్ముకున్నాడు ధీరూభాయ్ అంబానీ! ఏ దేశంలోనైనా ఆ దేశపు కరెన్సీని కరిగించి అమ్ముకోవటం నేరమౌతుంది కదా? అంబానీ యెమెన్ రియాల్ ని కరిగించి, లండన్ లో అమ్ముకుంటే, యెమెన్ ప్రభుత్వం ఎలా ఊరుకుంది? ఆ దేశపు చట్టాలు, అధికారులు ఏం చేసారు? వాళ్ళకి తెలియకుండా ధీరూభాయ్ ‘పనులు’ చక్కబెట్టాడా?

కరెన్సీ కరిగించిన వెండిని లండన్ కి ఎలా చేరవేసి అమ్మినట్లు? అంటే అది స్మగ్లింగా? లేక అధికారికంగా, చట్టబద్దంగా, వెండి లండన్ కు చేరవేసాడా? ఆ వివరాలేం ఈనాడు వ్రాయలేదు!

ఏమైనా.... ఒక దేశపు కరెన్సీ నాణాలని కరిగించి, ఆ లోహాన్ని ప్రక్క దేశానికి చేరవేసి అమ్మటం.... చట్టబద్దమా?

అతడలా చేయటం యెమెన్ లో చట్టబద్దమే అయితే, ఆపని యెమెన్ ప్రభుత్వమే చేసుకునేది కదా! అంటే తానే వెండి లండన్ లో అమ్ముకునేది కదా! అంతేగాక, అది చట్టబద్దమే అయితే, ఆ అవకాశం ధీరూభాయ్ అంబానీకే ఎందుకు దొరుకుతుంది? ఇంకా చాలామంది అందుకు పోటీ పడతారు కదా!

అసలే విలువలకు పూతపూసిన విగ్రహమైన రామోజీరావు, ఏ దేశపు చట్టాలనైనా గౌరవించాలంటాడు. అలాంటిది మరి ధీరూభాయ్ అంబానీ 1950 లలో చేసిన ‘వెండి లండన్ కు చేరవేత’ న్యాయమూ, ధర్మాల విషయం వదిలేసినా, వాళ్ళు గౌరవించే చట్టమూ అంగీకరించని పని కదా?

అలాంటి పనులు చేసి పైకి వచ్చిన ధీరూభాయ్ అంబానీ ‘కలలు కనండి, ధైర్యం చేయండి’ అన్నాడంటూ, ఆ ఆదర్శమూర్తి గురించి ఈనాడు ఊదర!

అందులోనూ ఎంత గమ్మత్తో చూడండి.

1950 ల నాటికి భారత దేశంలో అన్ని రంగాలలో గూఢచర్యపూరిత కుట్ర నడుస్తుందని ఊహలైనా ఎవరికీ తెలియదు. ఆ రోజులలో.... ధీరూభాయ్ అంబానీ జీవితం, పరమ పద సోపానంలో చకచకా నిచ్చెనలన్నీ అందుబాటులోకి వచ్చిన వడ్డించిన విస్తరి మరి! కావాలంటే చూడండి అతడికి ఎంతగా పరిస్థితులు కలిసి వచ్చాయో!

ఎక్కడా, ఎవరి నుండీ ఫండింగ్ లేకుండా యెమెన్ కరెన్సీని కరిగించి, లండన్ మార్కెట్ కి తరలించే వరకూ ‘మార్గం’ సుగమం చేయబడింది. ఆ విధంగా, వ్యాపారానికి కావలసిన ప్రాధమిక పెట్టుబడి సంపాదించుకున్నాడు. ఆ విధంగా గాడ్ ఫాదర్లు అతడికి మార్గం చూపారు.

>>>ఆ తరువాత 1958 లో ఆయన ముంబై కి తిరిగి వచ్చి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేశారు. వచ్చిన లభాలతో, అదే సంవత్సరంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. ఆనక అంతా విస్తరణలూ, విజయాలే. దీనికంతటికి ధీరూభాయ్ నమ్మిన సిద్దాంతాలు కారణం.


అన్ని విస్తరణలూ విజయాలూ పొందటానికి, ధీరూభాయ్ నమ్మిన సిద్దాంతాలే కారణమట! ఏం సిద్దాంతాలో అవి? ‘ఏ దారైనా తొక్కు, డబ్బు సంపాదించటం ముఖ్యం!’ అంటూ ఇప్పుడు అతడి కొడుకులు ఆచరిస్తున్న సిద్దాంతాలేనా? తండ్రి నుండే కదా కొడుకులకి వారసత్వంగా సంక్రమిస్తాయి ఏదైనా![ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?]

ఇందుకు మరో తార్కాణం చూడండి. ఇది సరిగ్గా నెలక్రితం [09 June, 2010] న ఈనాడు ప్రచురించిన వార్తే!

>>>అనిల్ దావా వేయడానికి కారణం ఇదీ:

అమెరికా నుండి వెలువడే ద న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్యూలో, ముఖేష్ అంబానీ తన పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారంటూ, అనిల్ కోర్టును ఆశ్రయించారు. అందులో తమ తండ్రి మరణానంతరం, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరగడానికి కన్నా ముందు... తన తమ్ముడు న్యూఢిల్లీలో కొంతమంది పైరవీకారులు, గూఢచారుల నెట్ వర్క్ ను పర్యవేక్షించేవారని ముఖేష్ చెప్పినట్లు ఉంది. [అంబానీ సోదరులు 2005 జూన్ లో విడిపోయారు.] ‘మేం దానంతటి నుంచీ వేరుపడిపోయాం’ అని ముఖేష్ వ్యాఖ్యానించినట్లు పత్రిక కథనం. కాగా ఆ వార్తా పత్రికలపైన అనిల్ వేసిన దావాను కూడా ప్రస్తుతం ఉపసంహరించుకొన్నారు.

వెరసి అంబానీలు న్యూఢిల్లీలో కొంతమంది పైరవీకారులు [వీరిని లైజాన్ లంటారు.] గూఢచారుల నెట్ వర్క్ ను [ఎవరి బలహీనతలు ఏమిటీ, ఎవరిని ఎలా ఒప్పించాలి గట్రా వివరాలు కనుక్కోవటమే!] పర్యవేక్షించేవారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ బ్రతికి ఉన్న రోజులలో కూడా, తన తమ్ముడు అనిల్, ఆ ‘లాబీయింగ్’ వ్యవహారాలన్నీ పర్యవేక్షించేవాడని ముకేష్ గతంలో ఓసారి అన్నాడు. ఇలాంటి ఈ అంబానీలు చేసేదంతా సిద్దాంతపరమైన వ్యాపారమా?

అసలుకే మనదేశంలో ఇటలీ మహిళ నేతృత్వంలో చట్టాలు సామాన్య ప్రజలని అణిచిపెట్టడానికి, నేరస్తులని కాపాడటానికి పనిచేస్తున్నాయయ్యె!

ముకేష్ అంబానీ కోసం చట్టాలు మార్చి మరీ, రాయితీలు ధారదత్తం చేసింది యూపీఏ ప్రభుత్వం. ఈ క్రింది వార్తాంశాన్ని చూడండి.

>>>అంబానీకే లాభం: మైసురా

ఇంధన భద్రతకు స్వంత సౌకర్యాలు కల్పించినందుకు ఆదాయపన్ను చట్టం కింద పన్ను రాయితీ కల్పించడంపై టీడీపీ సభ్యుడు మైసూరా రెడ్డి తీవ్ర అభ్యంతరం చేశారు. ముఖేశ్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ సంస్థకు దీనివల్ల 20 వేల కోట్ల పన్ను మినహాయింపు లభిస్తుందని, తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు. ఈ సంస్థకు రాయితీ కల్పించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

ఇవీ ఈ వ్యాపార సామ్రాట్టుల సిద్దాంతాలు! ఇలాంటి ఈ అంబానీల మీద, ఈనాడు రామోజీరావుకు, యూపీయే కుర్చీవ్యక్తి కి, ఆమె బృందానికి అంత అమిత ప్రేమ ఎందుకనో!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

5 comments:

ఇంతకూ జగన్ ఎవరికి జంట ' పీత ' - చంద్రబాబుకా ? లేక పురందేశ్వరికా ?
ఇప్పుడు జరిగే ఓదార్పు అంతా అతన్నీ జంట పీతగా తయారు చేసే క్రతువే

ఓ నలభై యేళ్ళ క్రితం, ఇటలీ కోడలు రాకముందునించీ, వాళ్ళ అత్తగారు, అలాంటి లాబీయింగు వల్లే, నస్లీ వాడియా నీ, బోంబే డైయింగ్ నీ ముంచి, రిలయెన్స్ ని పైకెత్తింది అని పత్రికలన్నీ కోళ్ళై కూశాయి.

Very thoughtful. !

అజ్ఞాత గారు: వేచి చూద్దామండి. నిజానికి జగన్ పరోక్షంగా అధిష్టానం సోనియానే టార్గెట్ చేస్తున్నాడు. నా టపా మాలికలో శీర్షికతో సహా నేను చెప్పింది అదే! నెనర్లు!

కృష్ణశ్రీ గారు: ఈ నస్లీవాడియా పాక్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాకు మనమడు. [కూతురి కొడుకు]అతడిదే బాంబేడైయింగ్! 1992 వరకూ వెలిగిపోయిన సంస్థ! పత్రికలలో వర్షానికి బురద చిందితే బట్టల మీదా బాంబేడైయింగ్ ప్రింట్ పడినట్లు ఉందన్న ఉపమానాలతో మీడియా బాంబేడైయింగ్ కు బాకా ఊదేది! 1992 వరకూ తన పాస్ పోర్టును విడతల వారిగా పొడిగించుకునే నస్లీ వాడియా ఇబ్బందులో పడ్డాడు. తిరిగి ఈ కుటుంబపు ప్రస్తావన క్రికెట్ ప్రాంఛైజీల నేపధ్యంలో ప్రీతిజింతా ప్రేమాయణంతో వార్తల్లోకి వచ్చింది. మీ వ్యాఖ్యకు నెనర్లు!

హరీష్ గారు: నెనర్లు!

ఒక విధం గా చెప్పాలి అంటె చంద్ర బాబు నాయుడు మీద ఇప్పుడు ఎవ్వరికి పెద్ద ఆసక్తి లేదు. అది ఒక ముగిసిన కథ. జగన్ కి పురందరేస్వరితో పోటినా వింటె ఎవరైన నవ్వు కుంటారు. రామారావు కుటుంబ సభ్యులను చూసి ప్రజలు వోటు నిజం గా వేసె వారైతె క్రితం ఎన్నికలలోనే వేయాలి. అది జరగలేదు. అంతటి తో రామారవు లెగసి ముగిసింది. మహ ఐతె నాలు రోడ్ల కూడలి లో విగ్రహం పెట్టి పుట్టిన రోజుకి పూల మాల లేయతం అనేది రానున్న రెండు మూడు సంవత్సరాలు కొనసాగుతుంది. మళ్ళి కాంగ్రెస్ పార్టి వారు చేసిన తప్పుల వలన వారే వోడి పోయి తెలుగుదేసం అధికారం లో కి వస్తె పూలమాలలు వేయటం ఇంతక్రితం కన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటె ఈ సారి చంద్ర బాబు నాయుడు గారు రామా రావు ఇమేజిని అమాంతం పెంచె చర్యలు చేపట్టి ఆ ఇమేజ్ నుంచి భవిష్యత్ లో తనకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకుంటాడు.
--------------------------------------------------------------
జగన్ ట్రెండ్ ఇలాగే కొనసాగితె అసలికి రాబోయె ఎన్నికలు జగన్ వర్సెస్ కాంగ్రెస్. తెలుగు దేశం పార్టి దగ్గర డబ్బులు చాలా ఉంటె అప్పుడు సీన్లో నిలుస్తుంది. జగన్ భవిష్యత్ మటుకు రానున్న రోజులలో బ్రైట్ గా కనిపిస్తున్నాది. ఎందుకంటె చదరంగం లో మొదటి స్టెప్ వేస్తే అడ్వాంటేజ్ ఎక్కువ. ఈ గొడవలో చంద్రబాబు గారిని ప్రజలు మరచి పోయినా ఆస్చర్యం లేదు. వారు ప్రతిపక్షం గా ఉండి సాదించిన దాని మీద ఒక పేపర్ ప్రెస్ కి రీలిజ్ చేస్తే చాలా బాగుంట్టుంది. ఎంత సేపటికి అసెంబ్లి లొ 10సం|| చెసిన విమర్సలు చేసుకుంట్టుంటె దానినిన్ ప్రజలు ఎవ్వరు పట్టించు కోవటం లేదు. ప్రజలు ఇప్పుడు ఎదురు చూసేది ప్రతిపక్షల ఆందోళన వలన ఎమైనా ధరలు తగ్గాయా? రోడ్లు బాగు పడ్డాయ? ఇక్కడ గమనించ వలనసినది అధికార పక్షం వీరిని మరి లెక్క చేయటంలేదు అంటె తప్పు ప్రతిపక్షం లో కూడా ఉంది అని అర్థం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu