గత టపాలలో వివరించిన నేపధ్యంలో... 1960-90 లలో మిశ్రమ ఆర్దికవ్యవస్థ వైఫల్యం సిద్దాంతంలో లేదనీ, అమలు తీరులోనే ఉందనీ నిశ్చయంగా చెప్పవచ్చు.

ఇలాంటిదే మరో ఉదాహరణ గమనించండి. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కలల్లో మరొకటి సహకార రంగం. భారత దేశపు గ్రామాలని, సహకార సంస్థలతో, అభివృద్ది బాటలో పరుగులెత్తించాలన్నది అతడి మరో కల!

గ్రామీణులు సహకార సంఘాలుగా ఏర్పడి, కొద్ది మొత్తాలని పొదుపు చేసో, మదుపు చేసో, మరికొంత మొత్తాలని బ్యాంకుల నుండి ఋణాలుగా పొంది, చిన్న వ్యాపారాలనీ, పాడి వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలని, పశుపోషణ వంటి వృత్తులనీ చేపట్టి, జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలన్నది సహకార వ్యవస్థ ఆశయం!

సహకార సంఘాలూ, బ్యాంకులూ ఇందుకు సహకరించాలి. ఆ విధంగా ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ పేదలు, తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఆర్దికంగా నిలదొక్కుకోగలుగుతారు.

ఇదీ సహకార సంస్థల స్థాపన వెనక ఉన్న సిద్దాంతపు పునాది! అయితే ఇది కూడా 1960-90 లలో వాస్తవ రంగంలో దాదాపు పూర్తిగా విఫలమైంది. అదే సిద్దాంతం ఇప్పుడు ‘డ్వాక్రా’ సంఘాల పేరిట విజయవంతమైంది.

గ్రామీణ మహిళలు,పొదుపు సంఘాలుగా ఏర్పడి, రోజుకో రూపాయి దాచుకుని, ఆ నిష్పత్తిలో బ్యాంకు ఋణాలు తీసుకుని పాడి పశువుల్ని పెంచటమే కాదు, పచ్చళ్ళు, కారం మసాలా పొడులూ, అప్పడాలు వడియాలు, జంతికల వంటి తినుబండారాలూ తయారు చేసి అమ్ముతున్నారు.

కార్పోరేట్ కంపెనీల లేస్, అంకుల్ చిప్స్, గట్రాల కంటే తక్కువ ధరలో, రంగు రుచీ వాసనల కోసం వాడే రసాయనాల భయం లేకుండా, డ్వాక్రా ఉత్పత్తులని ఆనందిస్తున్నాము. [మా నంద్యాల ప్రక్కనే ఉన్న ఆదర్శ గ్రామం పాండురంగాపురం డ్వాక్రా సంఘాలైతే చాలా రకాల చిరుతిళ్ళనీ, కారం, పచ్చళ్ళనీ తయారు చేస్తారు.]

అదే సహకార సంఘాల సిద్దాంతమూ, పనితీరూ ఇప్పుడెలా సఫలమైంది? అప్పుడెందుకు విఫలమైంది?

ఇలాంటి ఎన్నో అంశాలు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల తాలూకూ కుట్ర కోణాన్ని సుస్పష్టంగా బహిర్గతం చేస్తున్నాయి.

కుట్రకోణాన్ని మరింత స్పష్టంగా, మరోసారి పరిశీలించేందుకు మరో ఉదాహరణ చెబుతాను. భారతదేశంలోకి ప్రైవేటు టీవీ ఛానెళ్లు ప్రవేశించక ముందు, 1990 వరకూ కూడా కేవలం ప్రభుత్వ రంగ టీవీ ఛానెల్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. 1985-89 లలో దాన్ని రాజీవ్ దర్శన్ అని కూడా పిలిచేవాళ్ళు.

[ఈ పేరుతో ఎక్కువగా ఈనాడు రామోజీరావు మహా వెటకారం చేసేవాడు. 1995 నుండి 2008 వరకూ రామోజీరావు చిన్న కొడుకు సుమన్ ఈటీవీని ఏలి పారేయటాన్ని ఏ వెటకారం చేసుకున్నాడో మరి!? ఇంకా డీడీ ఒక యాంటీనా పెట్టుకుంటే వస్తుంది. ఈ టీవీకి నెలనెలా రుసుము కూడా చెల్లించాలి! రాజీవ్ దర్శన్ అంటూ వెటకారం చేసినందుకు, ఈ టీవీ ని ‘సుమన్ దర్శన్’ గా తయారు చేసి, ఆత్మహత్య సదృశ్య అసైన్ మెంట్ల ద్వారా, ఆ సువర్ణముఖిని అనుభవించాడు.]

ఇక దూరదర్శన్ కు మరో పేరు కూడా ఉంది. ‘ప్రభుత్వ బాకా’ అని! ఎందుకంటే - ఎప్పుడూ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తల్ని, అంశాల్నీ ప్రచారం చేస్తుందని. [ఇప్పుడు కదా ప్రైవేటు పత్రికలూ టీవీలూ కూడా, తమకు అనుకూలమైన వార్తల్నీ, అంశాల్నీ ప్రచారం చేస్తాయనీ, మీడియా అచ్చంగా అధిపతుల స్వార్ద ప్రయోజనాల కోసమే పని చేస్తుందనీ బహిర్గతమైంది!?]

దానికి తగ్గట్లు డీడీ కార్యక్రమాలన్నీ చాలా నాసిగా ఉండేవి. [ఇప్పుడూ కొన్ని కార్యక్రమాలు అంతే నాసిగా ఉన్నాయనుకొండి!] అప్పట్లో డీడీలో, కేవలం పందుల పెంపకం వంటి చెత్త ప్రోగ్రాంలే వస్తాయనే పేరుండేది. ప్రైవేటు పత్రికలు, వాటి మీద, వేసిన కార్టూన్లూ జోకులూ వెయ్యకుండా వేస్తుండేవి!

అప్పట్లో డీడీ లో చాలా కార్యక్రమాలు నిజంగానే చెత్తగా, నాసిగా ఉండటమే కాదు, చివరికి వార్తలూ సమీక్షలూ కూడా సరిగా ప్రసారమయ్యేవి కాదు.

అధికారుల, రాజకీయుల ఆశ్రితులతో కళాకారుల బృందాలు క్రిక్కిరిసి పోయేవి. దాంతో నటన రాని వారు నటించటం, రచన రాని వారు రచించటం, అవన్నీ ప్రేక్షకులు భరించటం అతిగా ఉండేది. [అందులోంచే తెలంగాణా శకుంతల, కోట బ్రదర్స్, సుబ్బరాయశర్మ, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి నటులూ, ఇతర కళాకారులూ దొరకటం ప్రేక్షకుల అదృష్టమన్న మాట!]

ఇక డీడీలోని ఇలాంటి నాసి కార్యక్రమాలని విమర్శిస్తూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, పత్రికలూ, మేధావుల పేరిట, కేంద్ర ప్రభుత్వం మీద.... ప్రైవేటు టీవీ ఛానెళ్లకూ, ప్రసార సంస్థలకూ అనుమతి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసేవి. నాటి ప్రజాహిత ప్రభుత్వాలని విమర్శించేందుకూ, ఇబ్బంది పెట్టేటందుకు, ప్రైవేటు టీవీ ఛానెళ్ళుంటే ఎంతో అవకాశం ఉంటుంది.

ఇక ‘ప్రైవేటు టీవీ ఛానెళ్ళని ప్రభుత్వం అడ్డుకొని, తమ ఆనందానికి గండి కొడుతుందని’ ఆనాటి మీడియా ప్రచారానికి ప్రజలంతా ‘ఔను’ అంటూ తలలూపారు, గొంతుకలిపి అరిచారు. అయితే ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చి ఏం ఒరగ బెడతాయో, ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వచ్చింది కదా? ‘చిన్న పిల్లలతో గోచీ డాన్సు లేమిటి బాబోయ్!’ అని కోర్టుల్నీ, మానవహక్కుల సంఘాలనీ ఆశ్రయించాల్సి వస్తోంది.

నిజానికి ప్రైవేటు టీవీ ఛానెల్సూ, ప్రభుత్వ ఛానెల్సూ మంచి కార్యక్రమాలు చేపట్టడంలో పోటీపడితే, విజ్ఞాన వినోదాలకి ఇవ్వాల్సినంత నిష్పత్తిలో ప్రాధాన్యతలిస్తే... ఈ స్థితి వచ్చేది కాదు. ఎందులో నుండి అయినా Disadvantage ని వెలికి తీయటమే నకిలీ కణికుల గూఢచర్య స్ట్రాటజీ అయిన చోట, పరిస్థితి ఇలాగ్గాక ఇంకేలా ఉంటుంది?

ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే... టీవీల ద్వారా పెరిగిన మోజులూ, పబ్బుల్లో చిందులూ, మద్యంలో మునకలూ, రకరకాల ఉన్మాదాలూ, ఉన్మత్తతలూ ఎందరు యువతీ యువకుల్ని, ఎండమావుల వెంట ఉరుగులెత్తిస్తోందో చూస్తూనే ఉన్నాం కదా!

అలాంటిది గతంలో, అంటే ఇందిరాగాంధీ హయాంలో సైతం, ప్రచార సంస్థల స్వేచ్చకై గొంతెత్తి అరుస్తూ, ప్రైవేటు టీవీ ఛానెళ్ళ కోసం ఎలుగెత్తి డిమాండ్లు చేసిన నాడు, ప్రైవేటు ఛానెళ్ళను అనుమతించినా, ఇదే జరిగేది కదా?

నిజానికి ఇప్పుడే కాదు, అప్పటి రోజులకే, విదేశాలలో ప్రైవేటు టీవీ ఛానెళ్ళ నిర్వాకం ఏమిటో, సామాన్యులకి తెలియకపోయినా, భారత్ లోని ఆనాటి మీడియాకి, ప్రతిపక్ష నేతలకీ తెలుసు. ఎందుకంటే - ఆయా దేశాలు, భారత్ కి భవిష్యత్తులో ఉన్నాయి మరి! మన వర్తమానం వాటికి గతమైన నేపధ్యంలో, సదరు దేశాలలో ప్రైవేటు మీడియా సంస్థల, టీవీ ఛానెళ్ళ ప్రసార ఫలితాలు అనుభవంలోకి వచ్చినవే!

అయినప్పటికీ... ప్రైవేటు టీవీ ఛానెళ్ళని అనుమతిస్తే, ప్రభుత్వం గుట్టు రట్టవుతుందని, నిజాలు బయటికొస్తాయని భయపడి, ప్రభుత్వం అందుకు అనుమతివ్వటం లేదని ఆనాటి ‘మేధావులు’ ఎందుకంత బిగ్గరగా గోలపెట్టారో, వాళ్లకీ, వాళ్ళనాడించిన వాళ్ళకీ తెలియాలి!

నిజానికి, నకిలీ కణిక వ్యవస్థా.... బ్యూరాక్రాట్లు, రాజకీయ నాయకులూ, కార్పోరేటు సంస్థలతో కూడిన వాళ్ల అనుచర వర్గమూ, ఏ సిద్దాంతం నుండైనా, ఏ వ్యూహం నుండైనా Disadvantage నే వెలికి తీస్తాయి.

మరో తాజా ఉదాహరణ గమనించండి. మా నంద్యాలలో రెండేళ్ళ క్రితం, అంటే 2008లో, కొందరు కూలీలు రోడ్డు పొడవునా కాలువల కోసం గోతులు తవ్వారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద పని చేశారని, వాళ్ళతో మాటలు కలపటంతో తెలిసింది. మా వీధిలోనూ మూడు నాలుగు రోజులు పనిచేసిన వాళ్ళని విచారిస్తే, ఇంకా చాలా వివరాలే చెప్పారు.

పోస్టాఫీసు ఖాతాల ద్వారా వాళ్ళకి రోజు కూలీ ముట్ట చెప్పాలి. సంవత్సరంలో కనీసం వందరోజులు పని కల్పించాలి. ఈ విధంగా చేస్తున్నారనీ, ‘సరైన కూలీ దొరక్కపోతే గ్రామసభల్లో ప్రశ్నించమనీ, భారత్ వేగంగా వృద్ది చెందుతోందనీ’ టీవీల్లో కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రచారం ఓ ప్రక్క నడుస్తోంటే... వాస్తవంలో జరుగుతోంది పూర్తిగా తద్విరుద్దమే!

కూలీలకు ఇస్తోంది 40-50 రూపాయలే! అదీ 50-60 రోజులపాటే! కాగితాల మీద దినసరి కూలీ, పని దినాలు 100 అని ఉంటుంది. ఎందరు కూలీలు పనిచేస్తే అంత అదనపు సొమ్ము మిగులుతుందన్న మాట! అసలు కూలీలూ కాగితాల మీదే ఉంటే మరింత మిగులు! ఆ ఆదనపు సొమ్మంతా.... పైనుండి క్రింది దాకా [అధికారులూ, రాజకీయ నాయకులూ, వ్యవహారం బయటికి పొక్కనీయనందుకు వార్తా పత్రికల కంట్రిబ్యూటర్లూ... ఇలా ] అందరికీ, ఎవరి వాటా వాళ్ళకి పంపిణీ అవుతుంది. ఇందులో కూలీల వాటా కూలీలకు ముడుతుంది. ఆశ్చర్యంగా ఉందా?

ఖచ్చితంగా ముడుతోంది. ఎలాగంటే - రోజూ ఉదయాన్నే, ఎండ పొద్దెక్కక ముందే, మూడు నాలుగు గంటల పాటు సుతారంగా, చిన్న గొయ్యలు తవ్వేసి వెళ్ళిపోవచ్చు. 40-50 రూపాయలు వస్తున్నాయి. ఇలా ‘తిలా పాపం తలా పిడికెడు’ పుచ్చుకున్నందుకు, సదరు అధికారుల కరుణా దృష్టి ఉంటుంది.

అప్పుడు ఆరోగ్యశ్రీలు, రేషన్ కార్డులు, బోగస్ కార్డుల దగ్గరి నుండి ఇతరత్రా ప్రభుత్వ పధకాలలో కూడా తమనే లబ్దిదారులుగా వ్రాస్తారు - ఇదీ కూలీల సహకారానికి కారణం. మూడేళ్ళ నుండి మా వీధిలో అదే కాలవలని, ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పధకం క్రింద తవ్వుతున్నారు. నెల రోజులకే అవి పూడిపోతున్నాయి.

వెరసి ఆ డబ్బంతా కూలీలతో సహా, ప్రజలదే! భారమూ, తిరిగి అందరి మీదా పడేదే! సంక్షేమ పధకాలు భారమై పెట్రో, గ్యాస్ లూ, విద్యుత్ ఛార్జీలు పెరిగితే కుయ్యో మనేదీ ప్రజలే!

ఇంతటితో అయిపోలేదు - ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం [ఇది సోనియా గారాల పుత్రుడు రాహుల్ కు మానస పుత్రిక అట.] ఎక్కువగా రైతులకు పొలాల్లో కూలీలు అవసరం ఉన్న రోజుల్లో నిర్వహింప బడటం!

‘తక్కువ శ్రమతో కూడిన పనికి, ఎక్కువ కూలీ వస్తోందంటూ’, ఈ పధకాన్ని కారణంగా చూపించి, కూలీలు రైతులకు పొలాల్లో పనిచేయటానికి తిరస్కరించటం జరిగింది. పొలాల్లో, ఎండల్లో పడి ఎనిమిది గంటల పాటు, ఒళ్ళొంచి, చెమట కార్చి పనిచెయ్యాలి. అదే ఇలాంటి ప్రభుత్వ పధకంలో అయితే.... ఉదయాన్నే, సూర్యుడింకా పైకెక్కక ముందే మూడు లేదా నాలుగు గంటలు పనిచేస్తే చాలు!

దీని గురించి కూలీల పనిని తనిఖీ చేసే సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులూ ఎవరూ మాట్లాడరు. అదంతా కూలీలతో సహా అందరి సహకారంతో జరిగిపోతున్న పనయ్యె!

అంతిమంగా రైతులు అల్లాడారు. మా ఇంటి యజమానులూ రైతులే! మా పొరుగు వాళ్ళు [రెండేళ్ళ క్రితం] రైతులే! ఇద్దరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, కూలీలు దొరకలేదని మొత్తుకున్నారు. అసలు తమలాంటి రైతులని దెబ్బ కొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రధకాలని, వ్యవసాయ పనుల సీజనులో అమలు చేస్తోన్నట్లుందని వాపోయారు కూడా!

లేనట్లయితే వ్యవసాయపు పనులు ఉండని రోజులలో ఇలాంటి పధకాలు చేపట్టవచ్చు కదా? అప్పుడు కూలీల కొరత తమకు ఏర్పడదు కదా అని తర్కించారు. మిగతా రోజుల్లో పని లేక, గ్రామాలలో కూలీలు, వలసల బాట పడతారు. ఇది ప్రతీ సంవత్సరం జరిగే తంతే!

నిజంగా ప్రభుత్వమే గనక, పేద కూలీలకి మేలు చెయ్యాలని నిబద్దత కలిగి ఉంటే.... తప్పకుండా, అలాంటి పధకాలని, వ్యవసాయ పనులు లేని రోజుల్లో అమలు చేసి ఉండేది.

నిజంగా ప్రభుత్వమే గనక, ప్రజలకి మేలు చెయ్యాలనే నిబద్దత కలిగి ఉంటే.... తప్పకుండా, అలాంటి పధకాల క్రింద చెరువుల పూడిక తీయించటం, బావులూ, చెక్ డ్యాములూ, వ్యవసాయపు నీటి కాల్వల నిర్మాణం, నాలాలు శుభ్రపరచటం వంటి రైతులకు ఉపయోగపడే పనులని చేపట్టి ఉండేది.

అంతే కానీ, పనికి మాలిన పనులు చేసేది కాదు. రోడ్డుప్రక్కన రోడ్డు బారునా చిన్న కాలువలు తవ్వటం ఖచ్చితంగా పనికి మాలిన పనే! చిన్నవర్షానికే అవి పూడుకు పోయాయి. పంచాయితీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాలలో ఏ సంబంధమూ, సమన్వయమూ లేకపోవటం వల్ల, ఈ కాల్వలకి సిమెంటుతో లైనింగ్ చేయటం గానీ, డ్రైనేజీ గొట్టాలు అమర్చటం కానీ... పంచాయితీ చేయలేదు.

దాంతో తీసిన కాలవలు తీసినట్లే పూడుకుపోయాయి. అందునా అడుగున్నర లోతూ, అడుగు వెడల్పూగల ఆ గోతుల లోంచి తీసిన మట్టి, ఆ గోతుల ప్రక్కనే పోసారు మరి!

ఇందులో కొసమెరుపు ఏమిటంటే - రెండేళ్ళక్రితం తీసిన కాలవల్నే మళ్ళీ ఇప్పుడు 2010లో వాళ్ళు తీయటం!

ఈ విధంగా కోట్ల కొద్దీ ప్రజాధనం ఖర్చువుతోంది. అందులో 60% కుట్రదారులకు మద్దతుదారులైన అధికారులకీ, పైస్థాయి వ్యక్తులకీ పోతుంది. 40% దాకా కూలీలకు దక్కిందనుకున్నా అదీ నిష్ప్రయోజనమే! ఆ సొమ్ము వాళ్ళకి తేలికగా వచ్చినట్లే అన్పిస్తోంది. దాంతో కష్టపడడం పట్ల విముఖతనే తెస్తోంది.

ఆ విధంగా చూసినా, అలాంటి బూటకపు పధకాలు, ప్రజల దారిద్ర్యాన్ని వదల గొట్టవనే ఋజువవుతోంది.

అయితే, ఇలాంటి పధకాల కోసం అయ్యే ఖర్చు, నూటికి నూరు శాతం మాత్రం, ప్రజల నెత్తినే పడుతుంది. అందులో నయాపైసా ఉపయోగమూ పొందకుండానే! పరోక్షపు దెబ్బ రైతు తింటున్నాడు.

బదులుగా.... రోజుకి నూరు రూపాయల కూలీ ఇచ్చి, నూరురోజుల పాటు నికార్సుగా పనిచేయించుకొంటే, అటు కూలీలకీ ఉపయోగం! అదే విధంగా శాశ్వత నిర్మాణాలు, చెరువులూ, కాలువలూ బాగు చేయటం, పూడికలు తియ్యటం, చెక్ డ్యాంల వంటి రైతులకు ఉపయోగపడే పనులు చేస్తే, దేశానికీ ఉపయోగం!

ఈ నేపధ్యంలో.... ఇలాంటి పధకాల అమలులో లోపం ఉందా? లేక ఆ కాన్సెప్టులో లోపం ఉందా?

ఏ పధకం నుంచైనా దుష్ప్రయోజనాన్నీ, అప్రయోజనాన్నీ వెలికి తీయటమే నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం చేసే పని! అచ్చంగా మర్యాద రామన్న కథ ‘కోడి గుడ్డంత బంగారం’ లో లాగా! ఆ కథ ఏమిటంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

*అంతిమంగా రైతులు అల్లాడారు. మా ఇంటి యజమానులూ రైతులే! మా పొరుగు వాళ్ళు [రెండేళ్ళ క్రితం] రైతులే! ఇద్దరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, కూలీలు దొరకలేదని మొత్తుకున్నారు. అసలు తమలాంటి రైతులని దెబ్బ కొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రధకాలని, వ్యవసాయ పనుల సీజనులో అమలు చేస్తోన్నట్లుందని వాపోయారు కూడా! *

ఇలా చిన్న కారు రైతులు విసుగ్గెత్తి కొన్ని రోజుల తరువాత వ్యవసాయం చేయలేక పొలాలు అమ్ముకుంటారు. వాటిని వ్యుహత్మకం గా మొదట వేరు వేరు వ్యక్తులు కొన్నుకొని తరువాత ఒక పెద్ద కంపేనికి అమ్మితె అప్పుడు కార్పోరేట్ వ్యవసాయం మొదలు పెడతారు. అది అసలు సంగతి.
------------------------------------------------
మీరు ఒకటి గమనించారో లేదొ ఈ మధ్య చదువుల పిచ్చి ముదిరి పాకాన పడింది. ఒకప్పుడు రెడ్లు, కమ్మవారు భూస్వామ్యులు గా ఉండెవారు. వారు వ్యవసాయం చేయటం నామోషి గా ఫీలయ్యెవారు కాదు. మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, మేము పోలం లో ఇవి పండిస్తాం అని ధైర్యం గా చెప్పుకొనే వారు. ఇప్పుడు పరిస్థితి తిరగ బడింది. నిరంతరం పేపర్లో సాఫ్ట్ వెర్ ఉద్యోగాలే గొప్పవి, అమేరికా నె భులోక స్వర్గం అక్కడి కి వెళ్లి ఉండటమే మన ధ్యేయం అని ఊదర కొట్టం గత 15 సం|| ఎక్కువైంది. దీని దెబ్బతో ఈ రెండు వర్గాల లో పొలం చేసుకునే వారికి పిల్లను ఇవ్వటానికి ఎవ్వరు ముందుకు రావటం లేదు. ఎవరైనా అన్నదమ్ముల లో అన్న వయ్వసాయం చేస్తుంటె వాడిని వదలి తమ్ముడి(సాఫ్ట్ వెర్ ఇంజనిర్ కనుక) కి పిల్లనిస్తాం అని వస్తున్నారు. తమాషా ఎమిటంటె ఈ ఆధునిక ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయె ముక్కులాంటివి. ఎవరికి ఎన్ని రోజులు ఉద్యొగం ఉంట్టుందో నమ్మకం ఉండదు. అదే కనీసం 10 ఎకరాలు ఉన్న వాడికి పిల్లని ఇవ్వటానికి మనుషులు ఆలోచిస్తుంటె వ్యవసాయం చేసె వారికి వారేదొ పనికిమాలిన పని చేస్తున్నమని భావన కలుగ చేస్తున్నరు. ఆ దెబ్బతో కొంతమంది రియల్ ఎస్టెట్ వైపు, మిగతా రంగాల వైపుకి మరలు తున్నారు. 10 ఎకరాల పొలాన్ని ఆ ఊరిలో ఉండే మిగతా వర్గాల వారు వారి దగ్గర ఉన్న డబ్బును బట్టి ఒకటి, రేండు ఎకరాలు కొంట్టున్నరు. భవిష్యత్ లో వీరి మీద మీరు చెప్పిన గ్రామీణ పథకం అమలు జరిపి కార్పోరేట్ కంపేనిలు పొలాలను కొనుకుంట్టాయి.
నాకు తెలిసి ఇంచుమించు కుల వృత్తులు చేసుకొనే ప్రతివారికి ఇప్పుడు వాటినుంచి బయటకు పంపటం జరుగుతున్నాది. అది చేనేత రంగం కావచ్చు,వ్యవసాయం కావచ్చు, మరేదైనా కావచ్చు. నిన్న ఆంధ్ర జ్యోతిలో చిలుకూరి బాలాజి పూజారి సౌందర్య రాజన్ గారు అర్చక వృత్తి చేసుకొనె బ్రాహ్మణుల కి పిల్లనివటానికి ఎవ్వరు ముందుకు రావటం లేదని చేప్పారు.
ఒకసారి చిదంబరం గారు ఇంటర్వ్యూలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చదువుకునే వారు పెరుగుతున్నారు కనీసం 10+2 చదివేవారికి ఉద్యొగం చూపియాలంటే వారికి స్పెన్సర్స్,రిలయన్స్ ఫ్రెష్ లాంటివి ఉంటె వారు అక్కడ పని చేస్తారు అని అన్నారు. ఇప్పటి ట్రెండ్ ఎమిటంటె మునుపటిలా ఉద్యోగం దొరకటం కష్టం కాదు కాని వచ్చిన ఉద్యోగం లో పెద్ద జీతాలు ఉండవు, గ్రోత్ ఉండదు, నీకు గుర్తింపు ఉండదు, ఎక్కువ అడిగితె బయటకి పొమ్మంటారు.

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=545423&Categoryid=1&subcatid=33

i dont understand why ratantata visit puttaparthi saibaba and they discuss lonely for an hour.

is there any link in these actions,....?

మొదటి అజ్ఞాత గారు: మీ పరిశీలన సరియైనదే! బాగా చెప్పారు.

రెండవ అజ్ఞాత గారు: ఇంకా సందేహమా? :)

కృష్ణశ్రీ గారు:మీరు రెండోసారి ఇచ్చిన వ్యాఖ్య కూడా publish అవ్వలేదండి. ఇతర కామెంట్లతో పాటు select all కొట్టి publish చేసాను. మిగిలినవి పబ్లిష్ అయ్యాయి.మీ వ్యాఖ్య రాలేదు. కారణం నాకు తెలియదు. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu