సేంద్రియ ఎరువుల బదులుగా రసాయనిక ఎరువుల వినియోగం వల్ల లాభనష్టాలేమిటో, నాటి రైతులకి తెలియక పోవచ్చు, నాటి భారతీయులకి తెలియకపోవచ్చు. కానీ, అప్పటికే విదేశాలలో రసాయనిక ఎరువులతో సహా, ఎన్నో కృత్రిమ పదార్ధాలను వాడటంతో సంభవించిన దుష్పలితాలు, కార్పోరేట్ కంపెనీలకి, మీడియాకి ఖచ్చితంగా తెలుసు కదా?

అంతేకాదు, ఏ రసాయనిక లేదా కృత్రిమ ఉత్పత్తి నైనా మార్కెట్టులోకి ప్రవేశపెట్టే ముందు, కార్పోరేట్ సంస్థలైనా, ఇక్రిశాట్ వంటి ప్రభుత్వ సంస్థలైనా.... కొన్నేళ్ళపాటు ఆయా ఉత్పత్తుల ప్రభావ ఫలితాలని అధ్యయనం చేయాలి. దుష్పలితాలు వస్తే, వాటిని అధిగమించే వరకూ పరిశోధనలు కొనసాగించి, తుది ఉత్పత్తినే ప్రజలకి అందుబాటులోకి తేవాలి. ఆ పరిశీలన అనంతరమే మార్కెట్ లోకి విడుదల చేయాలి.

ఈ నియమాలు, చట్టాలు అన్నీ కాగితాల మీద ఉంటాయి. కార్పోరేట్ కంపెనీలు ఇవేవీ పట్టించు కోకుండా, ప్రజలని మభ్యపెట్టి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మానవ జాతి మీదే కాదు, ప్రకృతి మీదా, పర్యావరణం మీదా కూడా కుట్రే! మీడియా, రాజకీయ నాయకులూ, కార్ఫోరేట్ వ్యాపారులూ కుమ్మక్కై నిర్వహిస్తున్న కుట్ర!

ఈ వ్యాపార కుట్రలో.... కృత్రిమ డిమాండ్ సృష్టించుకునేందుకు... సహజ వనరులని కలుషితం చేయటం, వీలైతే నాశనం చేయటం, ఆపైన తమ కృత్రిమ ఉత్పత్తులకు మార్కెట్లు సృష్టించుకోవటం - ఇదే కార్పోరేట్ వ్యాపారం! సేంద్రియ పళ్ళు, కూరగాయలు అందుకు ఒక ఉదాహరణ అయితే, మంచినీటి వ్యాపారం మహా ఉదాహరణ.

పాతికేళ్ళ క్రితం, ఎక్కడైనా నిర్బయంగా నీళ్ళు తాగే వాళ్ళం. ఇప్పుడో? బయటికెళ్తే... బస్టాండుల్లోనో, రైల్వేస్టేషన్లలోనో నల్లా నీళ్ళు పట్టుకుని తాగటం అంటే సాహసమే! నోరు మూసుకుని కిన్ లే, ఆక్వా వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే!

అలాంటప్పుడు పరిశ్రమల కాలుష్య నివారణకు ప్రభుత్వ కేంద్రం పేరుకే ఉంటుంది. మహా అయితే అధికారులు ఆటోలని, టాక్సీలని, లారీలని పట్టుకుని ఫైన్లు వేస్తారు. లంచాలు గుంజుతారు. నదుల్లోకి పారిశ్రామిక వ్యర్ధాలు వదిలే, రాజకీయ నేతలు కమ్ పరిశ్రమాధిపతుల దగ్గరికి వెళ్ళి, దండం పెట్టి, ఇచ్చింది పుచ్చుకుని ఇంటికి పోతారు. అంతే! నీటిని కలుషితం చేస్తే... ఎన్ని వేల కోట్ల వ్యాపారం, మంచినీటి మీద నడుస్తుంది!?

ఇలాంటిదే మరో ఉదాహరణ, ఆముదం! అవును ఆముదమే! ఒకప్పుడు భారతీయ సమాజంతో విడదీయరాని బంధం ఆముదానిది. ఎన్నోరకాలుగా ఆముదాన్ని ఉపయోగించేవాళ్ళు. నువ్వుల నూనె గట్రాలతో కలిపి దీపారాధన దగ్గర్నుండీ, పిల్లలకి విరోచన కారి దాకా!

ఎండలో పొలం పని చేసి గిటక బారిన చర్మానికీ, కండరాలకీ ఆముదపు మర్ధనా చేసుకునేవాళ్ళు. పిల్లలకి తలకి పట్టించేవాళ్ళు. ఇంట పసిబిడ్ద పుట్టిందంటే, పెద్ద సీసా ఆముదమే ముందు సేకరించబడేది. స్నానానికి ముందు, కాళ్ళమీద పడుకో బెట్టుకుని, పేదింటి తల్లి పసిబిడ్దకి ఆముదంతో వళ్ళు మర్ధనా చేస్తే, గొప్పింటి తల్లి వెన్నతో మర్ధనా చేసేది. ఒక పద్దతి ప్రకారం కాళ్ళు చేతులు మర్ధిస్తూ, ప్రత్యేకమైన పదాలేవో పాడుతూ, మాలీష్ చేస్తుంటే, పాపాయి బోసి నోరు తెరిచి కిలకిలలాడటం, నా చిన్నతనంలో చాలాసార్లు చూశాను.

ఇప్పుడు సింక్ లో చేపని రుద్ది కడిగినట్లు, స్లీవ్ లెస్ గౌనులు వేసుకున్న ఆధునిక భారతీయ అమ్మలు, టేబుల్ మీద ‘బేబీ’ని పడుకోబెట్టి, జాన్సన్ లేదా విప్రో బేబీ ఆయిల్ తో మాలీష్ చేయటం, ఆపైన టబ్బులో వేసి ఒళ్ళు కడగటం టీవీల్లో చూస్తున్నాను.

నిజానికి ఆ కార్పోరేట్ కంపెనీల సువాసనల బేబీ ఆయిల్ కంటే, ఆముదం అక్షరాలా లక్షరెట్లు నయం. జిడ్డు, వాసన ఉండటం నిజమే. కానీ తడి ఒంటి మీద, ఆముదం నువ్వుల నూనె కలిపి రుద్దితే, అది పేరున్న బ్రాండ్ మాయిశ్చరైజర్ కన్నా కూడా, నాణ్యతగా పనిచేస్తుంది. కాకపోతే తువ్వాళ్ళు నల్లగా అయిపోతాయి కాబట్టి, చలికాలంలో స్నానానంతరం, పాతబడిన నేత వస్త్రాలతో వళ్ళు తుడుచుకుంటే, ఆముదం+నువ్వుల నూనె మిశ్రమాన్ని మించిన మాయిశ్చరైజర్ లేదు.

చలికాలంలో చర్మం పగిలి, నెర్రెలిచ్చిన నేలలా ఉండకుండా, తగినంత మాయిశ్చరైజర్ వాడాలంటే, ఒక్కొక్కరికి నెలకు మూడువందల రూపాయలు మినిమమ్ ఖర్చువుతుంది. అదే ఆముదం అయితే, ముప్ఫై రూపాయలు కూడా పట్టదు.

ఆముదం జీర్ణశక్తినిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, మాయిశ్చరైజర్ గా మాత్రం చాలా సమర్ధంగా పనిచేస్తుందని ఘంటాపధంగా చెప్పగలను. దశాబ్దాల నుండి ఆముదం భారతీయుల దైనందిన జీవితంలో వినియోగింపబడుతూ ఉంది.

గతంలో, పల్లెల్లో, ఎద్దులతో నడిపించే నూనె గానుగలో ఆముదం, నువ్వుల నూనె , కొబ్బరినూనె, వేరుశనగ నూనె తయారు చేసేవాళ్ళు. వంట నూనెలుగా ఉపయోగించే నువ్వుల, పల్లీల నూనెలకు ప్రత్యేకంగా కొవ్వు వడపోత [Fileration] అవసరమయ్యేది కాదు. తగినంతగా శారీరక శ్రమ చేసేవాళ్ళు గనుక, అలాంటి నూనెలని జీర్ణించుకోవటం వాళ్ళకి సమస్య కాదు. మారిన జీవన శైలిలో మనకిప్పుడు అంత సీన్ లేదు.

రైతుపొలంలో పండిస్తే.... ఆముదం గింజల్ని గానుగలో ఆడిస్తే అందరికీ అందుబాటులో ఉండే ఆముదం... కార్పోరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసే బోలెడన్ని సౌందర్య ఉత్పత్తుల్లో ముడిపదార్ధమే అయినా....

తాము ఉత్పత్తి చేసి,
అందమైన సీసాలో పెట్టి,
అంతకంటే అందమైన ప్యాకింగ్ చేసి,
కళ్ళు చెదిరే రంగులలో పేరు ముద్రించి,
అందమైన అమ్మాయి[మోడల్] అవసరమున్నా లేకపోయినా గోచీ ధరించి మరీ నటించగా చిత్రించిన వాణిజ్య ప్రకటనతో కలిపి, తాము వ్యాపారం చేసుకోవటానికి వీల్లేకుండా ప్రజల అవసరాలు తీరిస్తే ఎలా?

అందునా, పెట్టిన పెట్టుబడికి పదింతలు MRP ముద్రించి తాము వ్యాపారం చేసుకోవాలయ్యె! ఇవేవీ లేకుండా, ఆముదం నేరుగా ప్రజా వినియోగంలో ఉంటే, తము ఇంత వ్యాపారం ఎలా చేసుకునేట్లు?

అందుకే... ఆముదపు రుచి, వాసనా, జిడ్డుతనాల మీద జోకులు, సెటైర్లు వేయబడ్దాయి. ఆముదం వాడేవాళ్ళని జిడ్డు పెనాలని, నూనె కళాయిలనీ, గ్రీజు ముఖాలనీ, పల్లెటూరి గబ్బిలాలనీ, ఫ్యాషన్ తెలియని బైతులనీ... ఇలా!

పదే పదే అదే ప్రచారం. నల్ల మేక - నలుగురు దొంగలు కథలా!

మెల్లిగా ఆముదపు వాడకం తగ్గింది. [నిజానికి కొందరు ఆముదమే కాదు, ఏ నూనె రాసినా, తల నుండి ధారగా కారేటట్లు రాసుకుంటూ ఉంటారు. మా స్కూలులో పిల్లల్ని ఆ విషయంలో ఎంతో సంస్కరించాల్సి వచ్చింది. వాళ్ల తల్లులకి కూడా చెప్పాల్సి వచ్చింది.]

ఇక ఈ ఆముదపు వ్యవహారంలో వింతేమిటంటే - పల్లెల్లో ఇప్పటికీ కిలో 50-60 రూపాయలకి దొరికే ఆముదం, మెట్రో పాలిటన్ సిటిలలో దొరకకపోవటం! ఒకసారి హైదరాబాద్ లో ఉండగా, మాకు ఆముదం అవసరమై విచారించగా, వీధి చివరి చిల్లర కొట్టుల్లో దొరకలేదు సరికదా, సూపర్ మార్కెట్లులొ వెదకగా.... చివరికి కిలో ఆముదం 360/-రూ.ల ఖరీదు చేస్తూ.... వంద ml ల అందమైన సీసా కనబడింది. జిడ్డు లేకుండా ఫిల్టర్ చేయబడిన ఆముదం, అందమైన బ్రాండు ముద్రించిన ఆ సీసాలో నుండి పలచగా, పారదర్శకంగా కనిపించింది.

తమ వ్యవస్థీకృత కమీషన్ నెట్ వర్కుతో కార్పోరేట్ వ్యాపారులు, ఏ వస్తువు లభ్యత, అలభ్యల నైనా, నియంత్రించగలరు. చిన్న రిటైల్ షాపుల దగ్గర నుండి హోల్ సెల్ షాపుల దాకా! కాబట్టే ఆముదమే కాదు, అలాంటి మరికొన్ని వస్తువులు కూడా, చిన్న దుకాణాలలో దొరకకపోవటం, పెద్ద పెద్ద సూపర్ బజార్ లలో అధిక ధరకు బ్రాండు సరుకులుగా లభ్యం కావటమూ పరిశీలించాను.

నిజానికి సూపర్ మార్కెట్లలో Caster Oil కిలో 360/- రూ.లు ఎలా పలుకుతోంది? అదే ఆముదం గింజలు రైతు దగ్గరైతే గిట్టుబాటు కూడా కావటం లేదేం? పరిశీలించి చూస్తే... ఇలాంటి మతలబులు ఇంకా చాలానే జాబితా చేయవచ్చు.

ఇక్కడ మీకు మరింత స్పష్టమైన వివరణ ఇస్తాను.

ఉదాహరణకి... ఒక కార్పోరేట్ కంపెనీ, ఏదైనా సబ్బుగానీ, డిటర్జంట్ పౌడర్ గానీ, వంట పాత్రలు శుభ్రపరిచే పొడి గానీ, మరో ఉత్పత్తి గానీ, మార్కెట్ లోకి ప్రవేశపెట్టిందనుకొండి. టీవీ గట్రా ఎలక్ట్రానిక్ మీడియాలో, వార్తాపత్రికలూ వారపత్రికలూ గట్రా ప్రింట్ మీడియాలోనూ, వ్యాపార క్యాంపెయిన్లతోనూ, ఒక ప్రచార సునామీ సృష్టించబడుతుంది. రోడ్ల మీద పెద్దపెద్ద హోర్డింగ్స్ పెట్ట బడతాయి. సదరు కంపెనీ తమ ఉత్పత్తిని విక్రయించుకునేందుకు పెట్టుబడి పెట్టి ఆ ప్రచారమంతా నిర్వహిస్తుంది. ఇది చట్టబద్దమే! అందులో తప్పేం లేదు.

సదరు ఉత్పత్తి [సబ్బు లేదా సబ్బు పొడి గట్రా] చౌకధరలో, మిగిలిన కంపెనీల అదే తరహా ఉత్పత్తితో పోల్చుకుంటే మరింత తక్కువ ధరలొ అందుబాటులో ఉంటుంది. అమ్మకాలని ప్రోత్సహించేందుకు ఉచిత బహుమతులూ, లాటరీ కూపన్లు కూడా జతపరచబడతాయి. అన్ని రిటైల్, హోల్ సెల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలోనూ, ఇవి అధిక మోతాదులో అందుబాటులో ఉంటాయి. సదరు కంపెనీ తమ ఉత్పత్తి అమ్మకాలని పెంచుకునేందుకు, ప్రారంభంలోనే జయప్రదంగా ఉత్పత్తిని విక్రయించుకునేందుకు, ఇదంత నిర్వహిస్తుంది. ఇదీ చట్టబద్దమే! ఇందులోనూ తప్పేమీ లేదు.

ఇక్కడ ఆశ్చర్యకరమైనదీ, చట్టబద్దం కానీదీ, ఏమిటంటే - కొత్తగా మార్కెట్ లోకి ప్రవేశ పెట్టబడిన సదరు కంపెనీ ఉత్పత్తికి పోటీ ఇచ్చే, ఇతర కంపెనీల ఉత్పత్తుల లభ్యత తగ్గిపోతుంది. అంటే, A అనే సబ్బు మార్కెట్ లోకి వస్తే, అప్పటి దాకా మార్కెట్ లో ఉన్న B,C,D గట్రా సబ్బులన్నీ, తాత్కాలికంగా, రిటైల్ హోల్ సెల్ షాపుల్లోనూ, సూపర్ మార్కెట్లలోనూ లభ్యం కావు. స్టాక్ ఉండదన్న మాట. "రావాలండి. ఇంకా రాలేదు" లాంటి జవాబులు విన్పిస్తాయి. నగరాలలో కంటే పట్టణాలు, గ్రామాలలో ఈ స్థితి బాగా ఎక్కువగా ఉంటుంది.

దాంతో వినియోగదారులకి, అంటే మనకి, అనివార్యత [un alternate situation] ఏర్పడుతుంది. కొత్త సబ్బు పట్ల మనకి వ్యతిరేకత ఏదీ ప్రత్యేకంగా లేనందునా, అప్పటికే వాణిజ్య ప్రకటనల సునామీతో ఏర్పడిన కుతూహలం వలనా, ‘సరే ఓసారి ప్రయత్నిద్దాం’ అనుకొని, ఆ సబ్బుని కొంటాం. నచ్చిందా, మళ్ళీ కొంటాం. లేదా మన పాత బ్రాండునే మళ్ళీ మనం కొనసాగిస్తాం. ఇది వినియోగదారుల మనస్తత్వం, వ్యవహార సరళి! ఇందులోనూ తప్పేం లేదు.

కానీ....

A అనే సబ్బు మార్కెట్ లోకి తొలిసారిగా వచ్చినప్పుడు, అప్పటికే మార్కెట్ లో పోటిగా ఉన్న B,C,D గట్రా సబ్బులు లభ్యం గాకపోవటం లేదా తక్కువగా లభ్యం కావటం అనే విషయం మీద... `A' ని ఉత్పత్తి చేసే కంపెనీకి పోటీదారులైన B,C,D గట్రా సబ్బుల ఉత్పత్తి కంపెనీలు, ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?

ఇలాంటి విషయాలు మీద మీడియా కూడా, ఎందుకు గప్పుచుప్పుగా ఉంటుంది? ఇక్కడ ఉన్న కుట్ర కోణం విస్మయం కలిగిస్తుంది. అదెలా జరుగుతుందంటే....

ఏ కంపెనీకి చెందినదైనా సరే... మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడ్డ కొత్త ఉత్పత్తి [`A' అనే సబ్బు] ఇబ్బడిముబ్బడిగా లభ్యం కావటం, అదే సమయంలో అప్పటిదాకా మార్కెట్ లో ఉన్న పోటీ ఉత్పత్తుల [B,C,D గట్రా సబ్బులు] లభ్యత లేకపోవటం లేదా తక్కువగా ఉండటం - అనే ప్రక్రియ వెనక ఉన్నకారణం.... అన్ని ఉత్పత్తి కంపెనీల మధ్య అంతర్లతంగా ఒక అవగాహన, సర్ధుబాటు ఉండటమే!

ఈ ప్రక్రియ కొంతకాలం గడిచి, సదరు కొత్త ఉత్పత్తి కొంత పాపులారిటీనీ, వ్యాపారాన్ని సంపాదించుకున్నాక, అప్పుడు దాని ధర పెంచబడుతుంది. తొలినాళ్ళలో, నిలదొక్కుకునే దశలో, ఉన్న నాణ్యత తగ్గించబడుతుంది. అప్పటికే కొంత చొచ్చుకుపోయినందున, పెద్దగా మార్కెటింగ్ సమస్యలుండవు.

ఒకసారి మార్కెట్ లోకి ఇన్ స్టాల్ అయ్యాక అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ కొత్త ఉత్పత్తి మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడినా, అది ఏ కార్పోరేట్ కంపెనీకి చెందినదైనా, ఇదే పద్దతి, ఇదే రకమైన అవగాహనా, సహకారమూ, కార్పోరేట్ కంపెనీల మధ్య ఉంటుంది. [అదే... చిన్న కంపెనీలు, షాపు వాళ్ళకి ఎంత కమీషన్ ఇచ్చినా, ఎంతగా ప్రకటనలు ఇచ్చినా ఈ పరిస్థితి ఉండదు. అంతేకాదు, సరిగ్గా అప్పుడే, భారీ ఎత్తున కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులు మార్కెట్ లోకి దిగుమతి అవుతాయి.]

ప్రతీ కంపెనీకి తమదైన వంతు వస్తుంది కదా! ‘తాము కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టినప్పుడు, ఇతరులు తమకి సహకరించాలంటే తాము ఇతరులకి సహకరించాలి’ అన్న సూత్రం ఇక్కడ అమలవుతుంది. తాత్కాలికంగా తమ ఉత్పత్తులకి మార్కెట్ లో లభ్యత తగ్గించటం ద్వారా, కొత్త ఉత్పత్తికి తమ నుండి పోటీని నివారించటం ద్వారా సహకరిస్తారు కాబట్టే, మొత్తం ఈ వ్యవహారం మీదా నిశ్శబ్దం పాటిస్తారు.

మీడియా సైతం ఈ విషయమై మౌనం పాటించటమే కాదు, వినియోగదారులు ఏ మాత్రం దీన్ని గమనించకుండా, వాళ్ళ దృష్టిని హైజాక్ చేస్తుంది కూడా!

అదే సమయంలో ‘స్థానిక చిల్లర దుకాణాల వారూ, [రిటైల్&హోల్ సెల్ షాపుల వాళ్ళతో సహా] అధిక కమీషన్ వస్తుందన్న ఆశతో క్రొత్త ఉత్పత్తిని అందుబాటులో ఉంచుతున్నారు. మిగిలిన ఉత్పత్తులని పట్టించుకోవటం లేదు’ అనే పైకారణం[over leaf reason] కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ విధంగా... చాలా పకడ్బందీగా, బలమైన, చక్కని సహకారం, సర్ధుబాటు, అవగాహనలతో కూడిన నెట్ వర్క్, ఈ కార్పోరేట్ కంపెనీల మధ్య ఉంటుంది. ఇది ఎంత బలమైన నెట్ వర్క్ అంటే - వాళ్ళ మధ్య ఎటువంటి వివాదాలు, నిందారోపణలు వెలుగు చూడవు. ఒకవేళ ఏవైనా పొరపొచ్చాలు సంభవించినా తెర వెనుకే పరిష్కారమైపోతాయి.

అడపా దడపా కొన్ని మాత్రం వెలుగుచూస్తాయి. అలాంటి వాటిల్లో కొన్ని సహజత్వం కోసం, ప్రజలనీ, దేశం పట్ల నిబద్దత గల నిఘాసంస్థల్నీ, ప్రభుత్వాలనీ నమ్మించేందు కోసం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లు పిక్చర్ ఇవ్వటం కోసం కూడా, వెలుగుచూస్తాయి.

ఇంత బలమైన నెట్ వర్క్ ఉంది కాబట్టే, దాదాపు అన్ని వస్తువుల ఉత్పత్తినీ చేజిక్కించుకొని, ప్రభుత్వాల మీదా, సమాజం మీదా, పట్టు బిగించింది కార్పోరేట్ కంపెనీలతో కూడిన నకిలీ కణిక వ్యవస్థ!

కాబట్టే, ఇప్పుడు చూసుకుంటే చిన్నతరహా పరిశ్రమలు, లఘ కుటీర పరిశ్రమలు కనుమరుగై పోయాయి. ఆలూచిప్స్ అమ్ముకునే మార్వాడీ మిఠాయి బండి, తుక్కు సామాన్ల కొట్టు కెళ్ళిపోయింది. లేస్, అంకుల్ చిప్స్, తోరణాల్లా వేలాడుతూ దుకాణాల్లో కన్పిస్తున్నాయి.

మళ్ళీ ఈ పదిహేనేళ్ళ నుండే.... డ్వాక్రా సంఘాల పేరిట, గ్రామీణ మహిళా సంఘాలు, చేగోడీలు జంతికలూ పచ్చళ్ళు అమ్మగలుగుతున్నారు. ఇప్పడవీ ఇబ్బందుల్లో పడ్డాయేమో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఏడెనిమిది ఆరు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఢిల్లీ లో ఆముదం భారీ ఎత్తున కల్తీ జరిగిందని ... ఇకనుండి ఆముదం లూజు అమ్మకాలు జరగకుండా కేవలం ప్యాకింగ్లలో మాత్రమే జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పటినుండి దుకాణాలలో ఆముదం లూజు (విడిగా ) అమ్మకాలు లేవు. కేవలం ప్యాకింగ్లలో మాత్రమే దొరుకుతుంది . ఆ విధంగా కిరాణా దుకాణాలలో ఆముదం అనధికారికంగా బేన్ చేయబడింది. లేకపోతే సూపర్ మార్కెట్లు దెబ్బతింటాయి కదా !. అప్పట్లో ఆ సంఘటన పెద్ద సంచలనం. అప్పుడు కొంత మంది సామాన్యులు కూడా చనిపోయినట్టు గుర్తు

Changing status of farmers - experiences from 4 decades close-view point (Interview excerpts with a senior agricultural scientist working dedicatedly towards farmer's welfare)

60’s to 70’s
70’s to 80’s
80’s to 90’s
2000 to present

We try to capture some key aspects that have influenced the psychology of farmers / community from a socio –economic point of view and also on the back drop of changing technology / industrial revolution and highly converging / complicated markets that are beyond comprehension for an average farmer.

60’s to 70’s
1. Agriculture was totally organic; there was no need to discuss on a need for organic methods!!
2. Farmers were self sufficient in terms of seeds, fertilizers and pesticides (there was absolutely no dependence on any mafia / input suppliers)
3. The only factor of dependence was on work force / labor. The only expenditure. Notable the relationship between farmers, labor was very healthy.
4. Farmers to farmers were inter-dependence for their farming requirement also to some extent barter systems were prevalent in society. This critical inter dependence factor with in farming community at micro level and the entire village folks / artisans related in a stronger bonding system amongst all villagers, which is alien to current day village lifestyles corrupted with politics. (of Castes, vote banks etc)

To elaborate: “There are several cases known to me – when a particular farmer was in trouble (to get his daughter married / having shortage of any agro-inputs /death a near, dear etc..) the entire farming community was standing behind him in the hours of crises)



70’s to 80’s

80’s to 90’s

2000 to present

Path ahead……….

(These inputs are being collected..)

Amma, see this link, it has som information regarding Bhopal gas
http://meeandarikosam.blogspot.com/2010/06/blog-post_1210.html

మొదటి అజ్ఞాత గారు: కల్తీసారా, కల్లు తాగి జనాలు చనిపోతే ప్రభుత్వం ఓ హడావుడి చేసి ఆనక గమ్మునుంటుంది. మద్యం, సిగిరెట్ త్రాగితే చావు గ్యారంటీ అయినా అధికారికంగా టెండర్లు వేసి అమ్ముతుంది.అయితే ఆముదం, సాధారణ ఉప్పు ఇలాంటి విషయాలలో అయితే జనాల ఆరోగ్యం పట్ల ఆరాటంతో స్పందించి, కార్పోరేట్ కంపెనీలకు వ్యాపారం కట్టబెడుతుంది. ఇందుకు పైకారణంగా ఉపయోగించేందుకు కల్తీ సంఘటనలు జరిపించబడతాయి.

చందమామ గారు: మీరు వ్రాసింది అక్షరసత్యాలండి. Coup on Agriculture లో వీటి గురించి వివరించాను. నెనర్లు!

రెండవ అజ్ఞాత గారు: ఆ టపా వివరణాత్మకంగా ఉందండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu