ఇక పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లే - ఈ స్ట్రాటజీ గురించి మరో చిన్న కథ! ఇది ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథ!

అనగా అనగా....

ఓ కాలనీలో ఓ విశ్రాంత ఉద్యోగి ఉన్నాడు. పెద్దవయస్సురీత్యా అతడికి పెద్ద చప్పుళ్ళంటే చిరాకుగా ఉండేది. ఆ వీధిలో పిల్లలు పగలూ రాత్రీ లేకుండా, అలుపెరగకుండా, క్రికెట్టు ఆడుతుండే వాళ్ళు. వాళ్ళ అరుపులూ కేకలతో ఈ పెద్దమనిషికి అసహనంగా ఉండేది.

ఆ పిల్లలతో క్రికెట్టు ఆడటం మాన్పించటం ఎలాగా అని ఆలోచించాడు. అనునయంగా చెబితే వినే రకాలుగా కన్పించలేదు. అదీ గాక చుట్టు ప్రక్కల వాళ్ళు ఆ పిల్లలకి చెప్పి చూశారు. ఆ పిల్లలు వింటే కదా! ఓ ఉపాయం తట్టింది.

వెంటనే ఆ పిల్లల దగ్గరికి చేరి "నాకూ క్రికెట్టు ఆటంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మీలాగే బాగా ఆడేవాణ్ణి. మీరు ఈ వీధిలో క్రికెట్టు ఆడినప్పుడల్లా నేను మీకు పాతిక రూపాయలిస్తాను" అన్నాడు.

పిల్లలు మహాదానంద పడిపోయారు.

మర్నాడు మహోత్సాహంగా క్రికెట్టు ఆడేసారు. చెప్పినట్లుగానే మన పెద్ద మనిషి కూడా పిల్లలకి పాతిక రూపాయలిచ్చాడు. నాలుగురోజులు గడిచాయి.

ఆ తర్వాత ఆ పెద్దమనిషి పిల్లలతో "నా పెన్షన్ డబ్బులు తక్కువ వస్తున్నాయి. అందువలన ఇప్పుడు పాతిక రూపాయలు ఇవ్వలేను" అంటూ పది రూపాయలిచ్చాడు. పిల్లలు ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ మర్నాడు అయిదు రూపాయలే ఇచ్చాడు.

పిల్లలు ఓ మూలకి చేరి గుసగుసలు పోయారు.

"ఈ అంకుల్ మొదట్లో పాతిక రూపాలిచ్చాడు. ఇప్పుడు మరీ అయిదు రూపాయలిస్తానంటున్నాడు. రేపటి నుండి అదీ ఇవ్వనంటాడేమో! ఎంచక్కా తేరగా మాత్రం మన ఆటని ఆనందిస్తున్నాడు. రేపటి నుండి ఈ వీధిలో మనం క్రికెట్టు ఆడనే వద్దు. ప్రక్క వీధిలో ఆడుకుందాం" అనుకున్నారు.

దెబ్బతో పెద్దమనిషికి సమస్య పరిష్కారమై పోయింది.

ఇదీ కథ!

ఇందులో ప్రయోగింపబడింది.... ‘కొంచెం మేలు చేసి, దాన్ని తొలిగిస్తే కీడు చేసినట్లే’ అన్న తంత్రమే! అంటే పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లన్నమాట! నిజానికి పెద్దమనిషి పిల్లలకి పాతిక రూపాయలు ఇస్తాననటానికి ముందూ వెనకా, పిల్లలకి సంబంధించి, క్రికెట్ట్ ఆడుకోవటంలో తేడా ఏం లేదు. కాని తమ ఆటకి ముందు డబ్బులు వచ్చి, తరువాత రాకపోవటం తమకి నష్టంగా, కష్టంగా అంటే నెగిటివ్ గా అన్పించింది.

సాధారణంగా ఈ స్ట్రాటజీని, నకిలీ కణిక వ్యవస్థ ప్రజల మీద ప్రయోగించదు. ఎందుకంటే - ఎట్టి పరిస్థితులల్లోనూ, ఏ సమయంలోనూ, నకిలీ కణిక వ్యవస్థ ప్రజలకి మేలు, అంటే పాజిటివ్ చేయదు గనక! చేస్తున్నట్లు పిక్చర్ ఇస్తుంది అంతే!

అయితే ఈ ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ జరిగినట్లే’ అన్న స్ట్రాటజీని, తాము గురిపెట్టిన వ్యక్తుల మీద [అంటే రాజకీయులు, సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలూ మొదలైన ప్రముఖల మీద] ప్రయోగిస్తారు.

ఉదాహరణకి....

‘ఫలానా నటి లేదా నటుడికి, ఫలానా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వారి సినిమాలో వేషం వచ్చింది’ అంటూ తెగ ఊదర పెట్టటం, ఆ తర్వాత సదరు అవకాశం, సదరు నటి లేదా నటులకు దక్కలేదనీ, మరో తార ఆ అవకాశాన్ని ఎగరేసుకు పోయిందనీ వార్తలు చదువుతుంటాం. పెద్దగా పట్టించుకోం. అయితే ఆ స్ట్రాటజీ ఎవరి మీదైతే ప్రయోగింపబడిందో వాళ్ళకి మాత్రం, తమకి నెగిటివ్ జరిగిందనే అన్పిస్తుంది.

నిజానికి సదరు వార్తకి ముందూ వెనకా పరిస్థితిలో మార్పేమీ లేదు. ప్రతిష్ఠాత్మక సంస్థలో అవకాశం రావడం, పోవడం.... అంతే. అసలు ఆ అవకాశమే రాలేదనుకుంటే సరిపోదా? తేడా ఏమిటీ? చుట్టూ ఉన్న వాళ్ళలో.... చులకన అవుతామనీ, తమకి నెగిటివ్ లేదా ఓటమి వచ్చిందని, తమ చుట్టూ ఉన్నవాళ్ళు తమని గురించి అనుకుంటున్నారని... అనుకుంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి సదరు ప్రముఖ వ్యక్తులు దాన్ని నెగిటివ్ జరిగినట్లుగానే పరిగణించక తప్పదు.

అదే రాజకీయ నాయకుల జీవితాల్లో అయితే, ఈ స్ట్రాటజీ ప్రయోగం మరింత బలంగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి గురించి.... ‘ఫలానా నాయకుడికి మంత్రి పదవో మరో పదవో రానున్నదని’ ఓ ప్రచారం వచ్చిందనుకొండి. చుట్టూ ఉన్న వారిలో అతడి పరపతి, ప్రాముఖ్యత పెరుగుతుంది. అది పాజిటివ్ i.e. మేలు జరిగినట్లు! ఈ ప్రచారం బాగా జరిగాక.... ఎవరో ఎక్కడో అడ్డం పడినందునో, ఎవరో చక్రం తిప్పినందునో, మరింకో కారణంతోనో ‘పదవి రాలేదన్న’ ప్రచారం వస్తుంది. దెబ్బతో సదరు నాయకుడికి గౌరవభంగం కలుగుతుంది. అతడి బలం తగ్గిపోయినట్లూ సర్వత్రా మాట వస్తుంది. అది నెగిటివ్ i.e.కీడు.

మరో స్పష్టమైన ఉదాహరణ చెప్పాలంటే - 2009, మే ఎన్నికలకి ముందు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్., విపరీతంగా ఇందిరమ్మ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ఆకర్షణీయ పధకాలు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేసాడు. అది మరింత పాజిటివ్ చేయటం అన్నమాట.

ఒకవేళ ఎన్నికల్లో గెలవలేదనుకొండి. అప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఎటూ అతి భారమయ్యే సంక్షేమపధకాలని [ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళూ గట్రాలతో సహా] అధికారంలోకి వచ్చిన పార్టీ అమలు చేయలేక.... కోతలూ, రద్దులూ విధించక తప్పదు. అప్పుడు పాజిటివ్ లో పాజిటివ్ కట్ అవుతుంది. అంటే నెగిటివ్ జరిగినట్లే కదా!

దాన్నే ఆయుధంగా అందుకుని, అరిచి గోల చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నందుకు పైకారణమూ[over leaf reason] సరిపోతుంది. అధికార పక్షాన్ని ఇరుకునా పెట్టినట్లూ అవుతుంది. ఒకవేళ గెలిచారనుకొండి. అప్పుడెలాగో ఒకలా సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రచారంతో కమ్ముకోనూ వచ్చు. ఎటూ ఆర్దిక మాంద్యం కారణం ఉండనే ఉంది.

ఏది ఏమైనా గెలవడం ముఖ్యం! ఇదే అప్పట్లో వై.యస్. వ్యూహం. కాబట్టే.... తెదేపా, తెరాస, ఎర్రపార్టీలతో కూడిన అలయెన్స్ ప్రకటించిన ‘నగదు బదిలీ పధకపు’ ఆలోచన తమకు ముందుగా రాలేదని, వచ్చి ఉంటే సాధ్యసాధ్యాలు చూసుకుని, అదీ తమ హామీలలో ఉండి ఉండేదనీ, అప్పట్లోనే అన్నాడు వై.యస్.!

అయితే ఈవిఎం ల పుణ్యామా అని, ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్సే గెలిచి, వై.యస్సే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దాంతో మెల్లిగా బోగస్ కార్డులు ఏరివేత గట్రా నసుగుళ్ళు నసుగుతూ ఉండగానే, అర్ధాంతరంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.

అప్పుడు తండ్రి అమలు పరిచిన ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే, అదే నెగిటివ్ జరిగినట్లు’ అన్న స్ట్రాటజీని వై.యస్. కుమారుడు జగన్, రోశయ్య మీద ప్రయోగిస్తున్నాడు. అందుకే ప్రతిసభలోనూ రోశయ్య, ‘వై.యస్. పధకాలని కొనసాగించటం తప్ప, మరో అజెండా ఏదీ తమకు లేదని’ పదేపదే ప్రకటిస్తుంటాడు. వై.యస్. పధకాల అమలు సరిగా లేదని జగన్ అరుస్తుంటాడు. ఆపై కారణాల వెనక నడుస్తున్న వ్యవహారం సంపూర్తిగా వేరనుకొండి. మరికొంత పరిపక్వం అయ్యాక గానీ, మనకి దాని రంగు రుచి వాసనా స్పష్టం కావు, అది వేరే విషయం.

మా జీవితంలో రామోజీరావు ప్రయోగించిన ఈ ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే అదే నెగిటివ్’ అనే స్ట్రాటజీ యొక్క పర్యవసానాలు, అనుభవాలు చాలానే ఉన్నాయి.

ఒకోసారి మనల్ని మనచుట్టూ ఉన్న అందరూ తెగ పొగిడేస్తారు. ఎంతో స్నేహంగా మెలుగుతూ, మనకి చాలా ప్రాముఖ్యత నిస్తారు. హఠాత్తుగా అదంతా కట్టి పెట్టి, చాలా ముభావంగా, మనం కన్పిస్తే ముఖం తిప్పుకుంటారు. అందరూ! ఆ విధంగా మేలు చేసినట్లే చేసి, దాన్ని ఆపేసి, కీడు జరిగిందనటం - పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేసి నెగిటివ్ జరిగిందనటం!

నిజానికి ముందంతా మనల్ని ఉబ్బేయటం అంటేనే, మన అహన్ని సంతృప్తి పరచటం! ఒక్కసారిగా నిర్లక్ష్యానికి గురి చెయ్యట మంటే అహం మీద దెబ్బకొట్టటం. ఎటూ నకిలీ కణికులకి వచ్చిన పది స్ట్రాటజీలలో ముఖ్యమైనవి అవే! అహం తృప్తి పరచటం లేదా అహాన్ని రెచ్చగొట్టటం!

ఆ విధంగా పాజిటివ్ ఇచ్చినట్లే ఇచ్చి, దాన్ని కట్ చేస్తే అదే నెగిటివ్!

నిజానికి ఇవి మనస్తత్వపు శాస్త్రంతో మేళవించి ప్రయోగించే స్ట్రాటజీలు! మరో మాటలో చెప్పాలంటే - మానసిక యుద్దతంత్రాలు! ప్రస్తుతం నకిలీ కణిక వ్యవస్థ చాలామంది మీదా ప్రయోగిస్తున్న తంత్ర్రాలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

మీ ఈ రెండు టపాలు బాగున్నాయి . నిజంగా ఈ స్ట్రాటజీలు తెలీని వారికి కూడా తెలిసేట్టుగా ఉన్నాయి. వారు కూడా జీవితంలో ఉపయోగించవచ్చు వీటిని :-)

గూఢచర్యం, రామోజీల ప్రమేయం వలన మీరు మీ జీవితంలో చాలా నష్టపోయారు. 18 ఏళ్ళు నరకం అనుభవించారు. దైవికంగా మీ జీవితాల్లో వాళ్ళ ప్రమేయం అప్పుడే మీరు గుర్తించి ఉంటే మీరు ఏం చేసి ఉండే వారు , మీ వైఖరి ఎలా ఉండేది . మీ పోరాటం ఎలా ఉండేది. నేనొక మానసిక శాస్త్ర విధ్యార్ధిని. కేస్ స్టడీ లో భాగంగా ఇది study చేస్తున్నాను. మీ అభిప్రాయాలు నాకే గాక, డిప్రెషన్ లో ఉన్న ఎంతో మందికి ఉపయోగపడతాయి .

ఈ రోజు news చూశారా...EAMCET రాంకులు ఇవ్వడం ఒక వారం ఆలస్యమవుతుందంట. బేరాలు కుదిరినట్టులేవు.. ఇంకా ఎవరికి రాంకులు సెట్ చెయ్యాలో చర్చలు జరుగుతున్నట్లున్నాయి.

oremuna గారు : నెనర్లు! :)

మొదటి అజ్ఞాత గారు: మా జీవితాల్లో గూఢచర్యం, రామోజీరావుల ప్రమేయాన్ని గుర్తించక ముందూ, గుర్తించాక కూడా భగవంతుడి మీద నమ్మకం, భగవద్గీత దారి చూపించాయండి. భావోద్రేకాలను దాటటానికి భగవద్గీతని మించిన ఆసరా మరొకటి లేదు.

రెండో అజ్ఞాత గారు: :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu