మొన్నెప్పుడో హోంగార్డులు తమ హక్కుల సాధనకై ఆందోళన చేస్తూ సెక్రటేరియట్‌కు వెళ్ళారు. పోలీసులు వాళ్ళని చితకబాదారు. ఎన్నోసార్లు, తమలాగే అంగన్ వాడీ టీచర్లు, నిరుద్యోగులూ, విద్యార్దులూ... ఇతర వర్గాలు, తమ తమ డిమాండ్లకై ఆందోళనలు చేస్తున్నప్పుడూ, పోలీసులతో కలిసి హోంగార్డులు, ఆ ఆందోళన కారులని చితకబాదారు.
అదే హోంగార్డులని, అదే పోలీసులు ఇప్పుడు ఉతికి పారేసారు. మర్నాడు మామూలుగా పోలీస్ స్టేషన్లకి డ్యూటికీ పోక తప్పదు హోంగార్డులకైనా, పోలీసుల కైనా! అలా కలుసుకున్నప్పుడు, లాఠీగాయాలని చూపిస్తూ... హోంగార్డులు ఏడుపు గొంతుతో "ఏంటిసార్! హోంగార్డులమని కూడా చూడకుండా ఇలా విరక్కొట్టారు?" అంటారు. అనేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ, ఆక్రోశం, నిస్సహాయత ఉంటాయి. వాటిని కప్పెస్తూ కన్నీటి పొర కరుగుతుంటుంది.
సానుభూతిగా భుజం తడుతూ పోలీసులు "ఏం చెయ్యమర్రా! మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? పైనుండి ఆర్డర్లు! డ్యూటీ తప్పదు కదా! రేపొక వేళ మేమెందుకైనా మీలాగే ఆందోళనకి దిగితే, మా స్థానంలో మీరుంటే... పై బాస్‌లు మీకు ఆర్డరిస్తే, మీరూ మమ్మల్ని ఇలాగే చితక బాదేస్తారు. ఏం చేస్తాం భాయ్! అదంతా మనస్సులో పెట్టుకోకు" అంటారు. అనేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ, జాలి ఉంటాయి.
అవును! పైబాసుల ఆర్డర్! డ్యూటీ!
డ్యూటీ అనే మాటకి ‘విధ్యుక్త కర్తవ్యం’ అనే సమానార్ధకం ఉంది.
విధ్యుక్త కర్తవ్యం అంటే ‘తాను చెయ్యవలసిన పని, తన ధర్మం’ అంటుంది సనాతన సంస్కృతి.
అయితే ఇక్కడ, డ్యూటీ అలియాస్ విధ్యుక్త కర్తవ్యం, ఎంత విపర్యాయార్ధంలో ఉపయోగింపబడుతోంది చూడండి.
తనదైన కర్తవ్య నిర్వహణ కోసం, సర్వాన్ని త్వజించటం... స్వయంగా ఆచరించి చూపారు పురాణ పురుషులు, చారిత్రక పురుషులు.
అలాంటి చోట, పోలీసులు Vs హోంగార్డుల వ్యవహారంలో డ్యూటీ అంటే... కేవలం పై బాసుల ఆజ్ఞలు పాటించమే అయిపోయింది.
పై బాసుల ఆజ్ఞల ప్రకారం...
ఆందోళన చేపట్టిన ఇతరులని పోలీసులతో కలిసి హోంగార్డులు కొడతారు.
ఆందోళన చేపడితే, హోంగార్డులని పోలీసులు కొడతారు.
అదే ఆందోళనని పోలీసులు చేపడితే, కొండకచో హూంగార్డులూ కొడతారు.
వ్యక్తుల మధ్యగానీ, వర్గాల మధ్యగానీ ‘విభజించు పాలించటం’కి ఇదో మచ్చు తునక!
అంతా ‘పై బాసు/బాసిని’ ల గొప్పదనం!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
0 comments:
Post a Comment