నేను ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చేనాటికి టన్ను 16,000/-Rs. ఉన్న సీసం (మా ఫ్యాక్టరీకి ప్రధాన ముడి పదార్దం అదే!), అంతర్జాతీయంగా 35,000/- Rs. లకు పెరిగింది. దాంతో వర్కింగ్ కాపిటల్ లో లోటు భారీగా వచ్చింది.
అయితే బ్యాంక్ ఆ లోటును భర్తీ చేయటానికి నిరాకరించింది. ఎందుకంటే - జామీనుగా చూపిన ఆస్తుల విలువ అంత లేదు కాబట్టి. నా ఫ్యాక్టరీకి సేకరించిన యంత్రసామాగ్రి సామర్ధ్యం... నేను టన్ను 16,000/-Rs.ల విలువ ఉన్నప్పుడు, నెలకు ఎన్ని టన్నులు అవసరంగా ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చానో... అంత!
నెలల పర్యంతం ఆలస్యం మూలంగా, పెరిగిన ముడి సరుకు ధరలరీత్యా, అంతలో సగంతో యంత్రాలు నడపవలసి వచ్చింది. దాంతో అన్నీ తల్లక్రిందులే! ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. తొలిరోజుల్లోనే బాగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇక ఉద్యోగ వర్గంతో కూడా చాలాసార్లు బాగా ఇబ్బందిపడ్డాను.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా, నా కెరీర్‌లో ప్రభుత్యోద్యోగుల్లో నిజాయితీపరులని తక్కువ సంఖ్యలో, అవినీతి పరులని అసంఖ్యాకంగా చూశాను.
ఓ సారి... ఏపీఎస్‌ఎఫ్‌సీ వాళ్ళు, తమ బ్రాంచి మేనేజర్ లిమిట్‌ని తగ్గించారు. దాంతో నాఫైలు హెడ్‌ఆఫీసుకి బదిలీ అయ్యింది. దాన్ని వాళ్ళు కొరియర్‌లో హైదరాబాదుకు పంపారు. పార్టీ చేతికి (అంటే మా చేతికి) ఇవ్వకూడదు కదా!
అయితే, హెడ్‌ఆఫీసులో నా ఫైలు గల్లంతయ్యింది. అందుకోసం గుంటూరు నుండి మూడుసార్లు హైదరాబాద్‌కి తిరగాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా ఏ జోన్ క్రిందికి వస్తుందో, ఆ జోన్ అధికారిగా సత్యనారాయణ అని, ఒక నడివయస్సు వ్యక్తి ఉండేవాడు. అతడికి లక్షకు ఇంత శాతం చొప్పున ‘లంచం’ ముందుగా ముడితేనే, ఫైలు అతడి టేబుల్ దాటేది.
అదొక్కటే ఇతడితో చికాకు కాదు. ఇతడి క్యాబిన్‌కు వెళ్ళిన ఏ మహిళనైనా, (అతడి క్రింది స్థాయి ఉద్యోగినులని కూడా) అకలి చూపులు చూసేవాడు. ఎంత ఛీదర వేస్తుందంటే... అప్పటి క్రోధం ఇప్పుడు మాటల్లో చెప్పలేను కూడా! చివరికి అతణ్ణి, మా ఊళ్ళోని ఛార్టెడ్ అకౌంటెంట్ చేత డీల్ చేయించి, నా పని పూర్తి చేసుకున్నాను.
ఇక ఈ అధికారి దగ్గరికి వెళ్ళవలసి ఉన్న నా ఫైలు (అది గుంటూరు నుండి కోరియర్‌లో పంపబడిన ఫైలు) ఎక్కడ గల్లంతయ్యిందో ఆచూకీ దొరకలేదు. ఆ నేపధ్యంలో, వారానికి ఓ సారి చొప్పున, హైదరాబాదు చుట్టూ తిరిగాను. శ్రమా, డబ్బూ కంటే కాలం వృధా అవ్వటం పరిశ్రమకి పెద్ద దెబ్బె! ఈ విషయం ప్రభుత్యోద్యోగులకి బాగా తెలుసు కూడా!
చివరికి ఇన్‌వార్డ్ సెక్షన్ అధికారిని కలిసి, సమస్య వివరించి, సాయం చెయ్యమని అర్ధించాను. ఇతడి పేరు మదన గోపాల స్వామి. ఆఫీసుకి పాత బజాజ్ స్కూటర్ మీద వస్తాడు. కానీ నిజాయితీ పరుడన్న పేరున్న వ్యక్తి. అతడు అటెండరుని పిలిచి "మూడు వారాలుగా ఫైలు ఆచూకీ తెలియటం లేదా?" అంటూ కేకలేసి, తక్షణం వెదకమన్నాడు.
ఆయన లేచి, ఇన్‌వార్డ్ క్లర్క్‌కి హెచ్చరిక చేస్తూ, ఫైల్ లొకెట్ చెయ్యమని ఆదేశించాడు. క్షణంలో ఆఫీసులో కదలిక వచ్చింది. ఫోన్లు మోగాయి. నానా గడబిడ తర్వాత, నాఫైలు కొరియర్ ఆఫీసులోనే ఉండిపోయిందంటూ ప్రకటించారు. ఏం చేసారో ఏమోగానీ, నా ఫైలు బయటపడింది.
స్టాంపు వేసి, పై సెక్షన్‌కి నా ఫైలు తీసుకెళ్తూ అటెండరు "అదేంటి మేడమ్, యెకాయెకి వెళ్ళి సారుకి కంప్లయింట్ చేశారు. ఆయనసలే స్ట్రిక్ట్. తేడావస్తే చాలా కష్టం!" అంటూ మొత్తుకున్నాడు. చివరికి ‘టీ మామూలు’ కూడా తీసుకోకుండా ఫైలు తీసుకెళ్ళి, పైఫ్లోరులోని జోనల్ అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్‌కి చేర్చాడు.
ఒక్క క్షణం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత చాలాసార్లు పరిశీలించాను. పాత బజాజ్ స్కూటర్ మీద వచ్చే ఇన్వార్డ్ సెక్షన్ అధికారికి ఉన్న గౌరవం, మారుతికారులో వచ్చే జోనల్ అసిస్టెంట్ మేనేజర్‌కు ఉండేది కాదు. అతడి అటెండరు కూడా అతడి మీద జోకులు వేయటమే కాదు, మంచినీళ్ళు టీ గట్రాలు సర్వ్ చేయమనప్పుడు కూడా, కొంత నిర్లక్ష్యమూ, అమర్యాదా కలగలిపి, సర్వ్ చేసేవాడు. అటెండరే కాదు, అతడి మహిళా పీఏ, టైపిస్టులు కూడా... అతణ్ణి గురించి అమర్యాదగా, అసహ్యించు కుంటూ మాట్లాడటం నాకు తెలుసు.
‘బహుశః "అవన్నీ పట్టించుకుంటే సంపాదించు కోలేం" అనుకుంటాడేమో, సదరు మానవుడు!’ అనుకునేదాన్ని!
ఇలా బ్యాంకులూ, ఎస్.ఎఫ్.సీ, రెవిన్యూ డిపార్డ్‌మెంట్లే కాదు, అప్పట్లో ఏపీఎస్‌ఇబీ పేరుతో ఉండిన విద్యుత్ శాఖ పని తీరు కూడా మరింత ఘోరంగా ఉండేది. వాళ్ళ వేధింపు, దోపిడి మరింత భయంకరం! లాలూచీ పడితే దొంగ కరెంట్ వాడుకోనిస్తారు. కానీ దాదాపు ప్రభుత్వాన్ని ఎంత మోసం చెయ్యవచ్చో... అందులో సగం వాళ్ళు గుంజుతుంటారు.
అది ఫ్యాక్టరీల విషయంలోనే కాదు, గృహవసరాల విషయంలోనూ ఇంతే అవినీతి, అక్రమాలు! అప్పుడే కాదు, ఇప్పుడు కూడా! ట్రాన్స్‌కో లో లైన్‌మెన్, హెల్పర్ స్థాయి వాళ్ళు కూడా, తమ పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణల్లో ఇంటెన్సివ్ కేర్‌ల్లో పెట్టి చదివించగలరు. అంటే సంవత్సరానికి దాదాపు ఒక్కరి చదువుకే లక్ష ఖర్చుపెట్టగలరన్న మాట. అప్పట్లో నలభై, యాభైవేల రూపాయలు ఖర్చయ్యేది.
ఇలాంటివన్నీ చూసి అప్పట్లో... అంటే 1992కు ముందర లేదా 1992 వరకూ, ఉద్యోగుల్లో 10% మంది మాత్రమే నిజాయితీ పరులుండి ఉంటారు అనుకునే దాన్ని! ఇప్పుడు చూస్తే 1% లేదా 2% మంది ఉంటారేమో అన్పిస్తుంది. లంచంగా పైసలు చెల్లించినా, పని నడవక పోవటం... మరింత పెరిగిపోయినట్లుంది. అంతగా అహంకారం, అరిషడ్వర్గాలు, అన్నివర్గాల(అధిక సంఖ్యలో) ఉద్యోగుల్లో, అధికారుల్లో పెరిగిపోయ్యాయి.
డబ్బుతో పాటు, అహం సంతృప్తి, ఇతరత్రా కోరికల సంతృప్తి కూడా తప్పనిసరి అవటం గురించి ఇటీవల చాలా విన్నాను. కాబట్టే - రాజకీయ నాయకుల దగ్గర నుండి... అధికార, ఉద్యోగ వర్గాల దాకా... డబ్బుతో పాటు, మందుపార్టీలు, మగువల పార్టీలు కూడా నడుస్తున్నాయి.
నైతికత మరింత దిగజారాక పరిణామం ఇదే అవుతుంది కదా! అప్పట్లోనే, అప్పటి సీఎం నేదురమల్లి జనార్దన రెడ్డి ఆఫీసులో ఇవి నేను దగ్గరగా పరిశీలించాను. ఇప్పటికి పరిస్థితి మరింత దిగజారిందో కూడా స్పష్టమే! అప్పట్లో ఆపాటి అవినీతిని చూసే "ఇలాగైతే భారతదేశం కుప్పకూలిపోతుంది" అనుకునేదాన్ని.
ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకు ఫిక్సింగు, ఇంటర్ పేపర్ లీకు గట్రా అవినీతి చూసి అదురుకున్నాను. ఇప్పుడిక లక్షల కోట్లలో ఆక్రమాల మాట విన్నాక, గతంలోవన్నీ చాలా చిన్నగా కనబడుతున్నాయి. పెద్దగీత ముందు చిన్నగీత, చిన్నగా ఉండటం సహజమే కదా!
అయితే ఒక విషయం మాత్రం సుస్పష్టం! లంచగొండితనం, రెడ్‌టేపిజం వగైరా పదాలన్నీ... కేవలం పైకారణాలు మాత్రమే! మానవతా విలువల్ని నాశనం చేసేందుకు ప్రయోగిస్తున్న పైకారణాలు ఇవన్నీ! అదే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యూహాలు, కుట్రే ప్రధాన కారణం! [వ్యాపార వాణిజ్య రంగాలతో సహా అన్నిరంగాలలో... టాపర్ల అధిపత్యానికి, మోనోపలీకి తొడుక్కుంటున్న పైదుస్తులు ఈ అవినీతి తొడుగులు.]
ఎందుకంటే... లోతుగా పరిశీలించి చూస్తే... చివరికి అవినీతితో కొంత వరకూ రాజీపడి... తమ వ్యాపార, ఉద్యోగ, ఇతర స్వంత అవసరాల నిమిత్తం ఎవరైనా లంచంగా డబ్బు ఇచ్చేందుకు సిద్దపడినా... వాళ్ళు పొందే సఫలత తక్కువగా ఉండటం, ఎక్చేంజ్ ఆఫర్‌గా డబ్బుతోపాటు ‘మందూ విందూ పొందూ’ అమర్చేందుకు సిద్దపడిన వాళ్ళే ఎక్కువగా సఫలీకృతులవ్వటం యదార్ధమై గోచరిస్తుంది.
ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. భారతీయత మీద కుట్రని అర్ధం చేసుకోవటానికి ఇది చాలనుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే - ఇది భారతీయుల మీద, భారతీయతల మీదే కాదు, మానవజాతి మీద, మానవీయత మీద కుట్ర! ఎందుకంటే - దాదాపు 3 1/2 శతాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న ఈ కుట్రదారులు i.e. నకిలీ కణిక అనువంశీయుల మూలాలు, అక్కడి నుండే ప్రారంభమయ్యాయి గనక!
నిశితంగా పరిశీలించి చూస్తే, నకిలీ కణిక అనువంశీయులకి ‘మంచి, సత్యం, ధర్మం’ - ఇలాంటి వంటే వెగటు. అత్మాభిమానం అంటే అమిత అసహ్యం. లజ్జాహీనత పట్ల వాళ్ళకి తగని ప్రీతి. లజ్జాహీనతని పాజిటివ్ లక్షణంగా ప్రచారించేంత ప్రీతి!
ఇక్కడ మీకో చిన్న కథ వివరిస్తాను.
సముద్ర తీరంలో ఉన్న ఒక మత్సకారుల పల్లెలో... మగవాళ్ళు సముద్రం మీదకి చేపల వేటకి వెళ్తే, వాళ్ళు తెచ్చిన చేపల్ని మహిళలు ప్రక్కనే ఉన్న పట్నంలో అమ్ముకొచ్చే వాళ్ళు.
ఓ రోజు... పల్లె నుండి పదిమంది మహిళలు చేపలు బుట్టల్లో పెట్టుకుని ఎప్పట్లానే పట్నం వెళ్ళారు. చేపలమ్ముకొని తిరిగి వస్తుండగా జోరు వాన పట్టుకుంది. వర్షం, చీకటి! పల్లె చేరటం కష్టమనిపించింది. అప్పటికి వాళ్ళు పట్నం శివార్లు చేరారు.
‘ఏం చేద్దామా?’ అని చుట్టూ చూసేసరికి... ప్రక్కనే పూల వ్యాపారి ఇల్లు కనిపించింది. తలుపు తట్టి ఆ రాత్రికి ఆశ్రయం అడిగారు. పూల వ్యాపారి, వాళ్ల చేపల బుట్టలు వసారాలో పెట్టుకుని, పూల గంపలుంచిన గదిలో నిద్రపొమ్మన్నాడు.
అది పెద్దగదే! కాకపోతే... గదంతా మల్లె, చేమంతి, జాజూలూ గులాబీల గంపలతో నిండి ఉంది. వాటి మధ్య జాగా చేసుకుని, మత్సకారుల మహిళలు నిద్రకుపక్రమించారు. గదంతా పూల పరిమళం మత్తెక్కిస్తోంది. మరెవరైనా అయితే పరవశించి పోయేవాళ్ళు.
పాపం! ఈ చేపల వాళ్ళకి మాత్రం నిద్రపట్టటం లేదు. అటూ ఇటూ పొసిగారు. చివరికి లేచి, తమ చేపల గంపలు తెచ్చుకుని, ముఖం మీద బోర్లించుకున్నారు. క్షణంలో గురకలు పెట్టేంత నిద్రలోకి జారుకున్నారు. అది వాళ్ళ జీవనశైలి, వాళ్ళ దృక్పధం.
సుగంధాలు విరజిమ్మే పూలు వాళ్ళకి వెగటు కలిగించాయి. తమకి అలవాటైన చేపల వాసనే వాళ్ళకి సౌకర్యవంతంగా కన్పించింది.
నకిలీ కణిక అనువంశీయులదీ అదే పరిస్థితి! వేశ్వావంశ సంజాతులైనందున... స్త్రీ గౌరవంగా బ్రతకటం వాళ్ళకి ఇచ్చగించదు. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, ఈనాడు రామోజీరావు అత్యంత కీలకమైన వ్యక్తి మరి!
మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. గత వారంలో మాజీ సినీనటి అమల జన్మదినం ఉండింది. ఆ సందర్భంగా ఈటీవీలో, అమల నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రం ప్రసారం చేయబడుతుందని ఈనాడు వ్రాసింది. సదరు నటి, వివాహానికి పూర్వం, మరో నటుడు చిరంజీవితో నటించిన సినిమా అది! ఏదో... ఆమె పెళ్ళిచేసుకుని, సినిమాలు వదిలేసి, సంసారపక్షంగా హాయిగా ఉంది. ‘బ్లూ క్రాస్’ అంటూ జంతువులకి వైద్యం గట్రా చేయిస్తూ, తనకు చేతనైనట్లుగా మంచిపనులు చేసే ప్రయత్నం చేస్తోంది.
ఎంత ఆమె పుట్టిన రోజుకైనా, సినిమా వెయ్యదలుచుకుంటే, అమల తన భర్త నాగార్జునతో నటించిన ‘నిర్ణయం’, ‘శివ’... మరొకటో వేయవచ్చు కదా! ఉహు! కుదరదు. గౌరవంగా బ్రతకాలనుకున్నా సరే, స్త్రీని అలా వదిలేయటం నకిలీ కణిక అనువంశీయులకి సుతరామూ గిట్టదు.
కాబట్టే... రాముడు తప్ప మరో పురుషుణ్ణి యెరగని సీతన్నా, సీత తప్ప మరో స్త్రీ తెలియని రాముడన్నా, మొత్తంగా రామాయణం అన్నా... నకిలీ కణికులకి విషవృక్ష ప్రచారమంత విద్వేషం! కాబట్టే - భారతీయుల జీవితం నుండి రామాయణంను విడదీయటానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇక మళ్ళీ, ఆర్దిక వాణిజ్య రంగాల ద్వారా భారతీయత మీద కుట్ర విషయానికి వస్తే...
ఇప్పటి స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ద్రవ్యోల్పణపు లెక్కలు పరిశీలిస్తే, ఎన్నో విచిత్ర తర్క వితర్కాలు, గజిబిజి గందరగోళాలు, కార్యకారణ సంబంధాల పట్ల సామాన్యులకే కాదు చదువుకున్న వాళ్ళకి కూడా అర్ధం కానంత మాయా మర్మాలూ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మాయాజాలం గురించి మరోసారి మాట్లాడుకుందాం!
ద్రవ్యోల్పణపు రేటు చూస్తే... ఇదెంత బూటకమో ఒక పట్టాన అర్ధం కాదు. కొన్ని వస్తువుల ధరవరల్లో మార్పుని అనుసరించి ద్రవ్యోల్బణపు రేటుని లెక్కగడతారు. కాబట్టే - ద్రవ్యోల్పణపు రేటుతో నిమిత్తం లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉంటాయి. గతంలో, లెక్కలో ఈ మతలబుల గురించి ఏమాత్రం బయటికి రానిచ్చేవాళ్ళు కాదు.
ద్రవ్యోల్పణం తగ్గితే ధరలు తగ్గుతాయనీ, పెరిగితే, పెరుగుతాయనీ మీడియా ప్రచారించేది. ఇటీవల కాలంలో అలాంటి ఆర్దిక సిద్ధాంతాలలోని లొసుగులు బయటపడ్డాయి. వాటిని ఆర్దిక మంత్రులు ఒప్పుకోవటం జరిగింది.
మన ఆర్దికవేత మన్మోహన్ సింగ్ సీటెక్కాకే దాని లీలలు మరింతగా బయటపడుతూ వచ్చాయి. ఏవో కొన్ని వస్తువుల ధరలని మాత్రమే పరిగణలోకి తీసుకున్నప్పుడు, ద్రవ్యోల్పణంతో నిమిత్తం లేకుండా నిత్యవసరాల ధరలు పెరగటం లేదా తరగటం (తరగటం కలలోని మాటనుకొండి!) సహజమే కదా?
ఇటీవల, మరికొన్ని వస్తువులని కూడా ద్రవ్యోల్పణ లెక్కింపు జాబితాలోకి చేర్చారు. ఇక మన్మోహన్ సింగ్ గారి+వారి మంత్రవర్గ బృందపు వారి లెక్కలన్నీ, కంతలమయమేనన్నట్లు... క్రితం సంవత్సరంలో "నెగిటివ్ ద్రవ్యోల్పణంలోకి దేశం ఆర్దిక వ్యవస్థ వెళ్ళనుంది. వెళ్తే ప్రజలకేం నష్టం లేదు, ఇంకా లాభమే. ధరలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగమే దెబ్బతింటుంది." అంటూ సెలవిచ్చాడు, మన ఒబామా గురువు మన్మోహన్ సింగ్!
ద్రవ్యోల్బణం సున్నాకి చేరింది, ఋణాత్మకమూ అయ్యింది. ఎప్పటిలాగే ప్రజలే డప్పయి పోయారు. ధరలు పెరిగి దిమ్మదిరిగింది. యధావిధిగా పారిశ్రామిక వేత్తలు బాగానే ఉన్నారు. కులాసాగా మరికొన్ని రంగాలలోకి ప్రవేశాన్ని ప్రకటించారు. చివరికి గిరిజనులు సేకరించి అమ్ముకునే ‘వట్టివేళ్ళు, సుగంధ వేళ్ళు’ లాంటి వాటిని వదలనంత విస్తరణ!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
5 comments:
Nice blog
బాగున్నదండీ.
నిజం :)
Admin, నరసింహా గారు, సత్యేంద్ర గారు :నెనర్లండి!
Link:
http://in.news.yahoo.com/248/20101011/1582/tnl-will-rahul-gandhi-ever-marry_1.html
Post a Comment