"వెన్న తినే కన్నయ్య
మన్ను తిన్నాడు చూడమ్మా"
అని అన్న రామన్న చెబితే
"హమ్మా!" అని యశోదమ్మ
కృష్ణయ్య చెవులు మెలేసి
నోరు చూపించ మందట!
చిన్ని పాపడి నోటిలో
సకల లోకలూ చూసి సొమ్మసిల్లి
"యశోదనే కానో"
అనుకుందిట!
అంతలోనే మాయ గమ్మగా
అన్నీ మరిచిపోయి....
చిన్నారి కిట్టయ్యని పట్టుకుందామని,
తాడు తెచ్చి రోటికి కడదామని,
వెంటబడితే...
కొప్పుముడి ఊడింది
పూలు రాలి పడ్డాయి
కుంకుమ చెరిగి పోయింది గానీ,
కృష్ణుడు చిక్కలేదు.
"ఇక పరుగెత్తలేనురా నాన్నా!
ఒరే కన్నయ్య!
చిక్కరా చిట్టి తండ్రీ!"
అని చేతులు జోడిస్తే...
జాలి చూపులు చూస్తూ
బేలగా చిక్కిపోయి
రోటికి కట్టించుకొని
మోకుల కూల్చాడట.
ఇది మూల భాగవతంలో ఉందో లేదో కానీ,
బాపూ బొమ్మల్తో, రమణ రమణీయంగా
చిత్రిస్తే...
చదివినప్పుడు అన్పించింది.
"నిజంగా....
పరిశోధించి పట్టుకుందామంటే
దేవుణ్ణి దొరక పుచ్చుకోలేం,
ప్రేమతో ప్రార్ధిస్తే మాత్రమే పొందగలం!"
అని!
6 comments:
నకిలీ కనికుడి కి జన్మాష్టమి శుభాకాంక్షలు
దొంగ .... ఎవరికీ చిక్కడు .వానిచేతికి మనం చిక్కటమే
మీకు, మీ కుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .
meeku krishnastami subhakankshalu
దుర్గేశ్వర గారు, చిలమకూరు విజయమోహన్ గారు, మాలా కుమార్ గారు, సావిరహే గారు : నెనర్లండి!
Post a Comment