నాబ్లాగు చుట్టాలందరికీ ఈ రోజు టపా చదివే ముందు ఓ చిన్న విషయం చెప్పాలనుకొంటున్నానండి. నిజానికి ఈ నకిలీ కణికుడూ, అతడి ఏజంట్లూ, అతడి వ్యవస్థా మన భారతదేశంమీద, ఆపైన ప్రపంచం మీదా చేస్తున్న కుట్రని సహేతుకంగా, తార్కికంగా, దృష్టాంతపూరతంగా, సాక్ష్యాధారాలతో సహా ముందుగా ఆంగ్లంలో వ్రాసాను. నకిలీ కణికుడి సుదీర్ఘ కుట్రని వివిధ శీర్షికల క్రింద విపులంగా వ్రాసాను.ఇప్పుడు మీరు తెలుగులో చదువుతున్నంత సరళంగా వ్రాసాను. కొద్దిపాటి మార్పుచేర్పులతో ఇప్పుడు తెలుగులోకి కొంచెంకొంచెంగా అనువదిస్తున్నాను.
నా ఆంగ్ల బ్లాగ్ ‘COUPS ON WORLD’ లో ఆర్ధికరంగం మీద నకిలీ కణికుడి కుట్రని ప్రచురించాను. ఈ రోజు భారతదేశ రాజకీయా, పాలనారంగం మీద నకిలీ కుట్రని ఆంగ్లంలో ప్రచురణ ప్రారంభించాను. పూర్వవేదిక అయిన చరిత్రతో సహా వివరించాను. భారతీయులే గాక ఎవరు చదివినా అర్ధంకావాలన్న ఉద్దేశంతో వ్రాశాను. నాబ్లాగు చుట్టాలలో నకిలీ కణికుడి పూర్వాపరాల పట్ల ఆసక్తి, ఆతృత గమనించినందున ఈ విషయం ఇక్కడ ప్రస్తావించాను.
మీరు ‘COUPS ON WORLD’ చదివి సమీక్షిస్తారని ఆశిస్తాను.
ఇక నిన్నటి టపా కొనసాగింపు ....
ఈ నేపధ్యంలో, భారత్ మీద నకిలీ కణికుడు, అతడి వ్యవస్థ ప్రయోగించిన మరో అంశాన్ని, దృష్టాంతంగా పరిశీలించండి.
రామాయణ విషవృక్షాలూ, హేతువాద సంఘాలూ వగైరాలతో భారతీయ ఇతిహాసాల మీద విమర్శలూ, వ్యంగ్యాలు, జోకులూ వేస్తూ ప్రజాజీవితం నుండి, సమాజం నుండీ ఇతిహాసాలని రూపుమాపే ప్రయత్నం ఓప్రక్క ముమ్మరంగా జరుగుతూ ఉండగా, స్లోపాయిజన్ లాగా మరో ప్రక్క మరో ప్రచారం కొనసాగింది. అదేమిటంటే మొగల్ చక్రవర్తి అంటే ముస్లిం చక్రవర్తి అయిన ఔరంగజేబు గురించి. నిజానికి మొగల్ సామ్రాజ్యం ఇతడి చేతికి వచ్చేనాటికి [అతడి తండ్రి షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినందున ఖజనా ఖాళీ అయినా] ఉచ్ఛస్థితిలో ఉంది. కాని దాని పతనానికి ఇతడే నాందీ పలికాడు. ఇతడి తర్వాత ఇతడి వారసులు బ్రిటిషు కంపెనీల ముందు బలహీనులయ్యారు.ఇది చరిత్ర.
అలాంటి ఔరంగజేబు గురించి ప్రచారం [మౌఖకంగానూ, మీడియా లోనూ] ఏమని ఉండేదంటే “ఔరంగజేబు ప్రజల సొమ్ముతో బ్రతకలేదట. చక్రవర్తి అయినా గానీ అతడు ఖురాన్ ని చేత్తో వ్రాసి, ఆ వ్రాతపతులు అమ్మగా వచ్చిన సొమ్ముతోనూ, స్వయంగా తాను టోపిలు కుట్టి వచ్చిన సొమ్ముతోనూ బ్రతికాడట.[మరి అంతటి ఉదాత్తుడు ఎందుకు మహారాష్ట్ర మీద చాలాసార్లు, గోల్కొండ మీద 18 సార్లు దండయాత్ర చేశాడట? ఈ ప్రశ్న ఎవరూ అడగరు. అడిగినా మీడియా ప్రచురించదు. జవాబూ రాదు] షాజహాన్ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి తనకోసం, తన భార్య ముంతాజ్ మీద ప్రేమ చిహ్నంగానూ, తమిద్దరి సమాధుల కోసం తాజ్ మహల్ కట్టడం ఔరంగజేబుకి ఇష్టం లేక తండ్రిని ఖైదు చేశాడట”. [మరి సోదరుల్ని ఎందుకు హత్య చేశాడట. ఈ ప్రశ్న పై ప్రశ్నలాంటిదే!]
ఈ ప్రచారం చాలా బలంగా, చాప క్రింద నీరులాగా 1975 నుండి సాగింది. నిజానికి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం మీది ప్రేమకు గుర్తుగా [మీడియా ప్రచారించిన ప్రకారం] తాజ్ మహల్ నిర్మించి ఉండవచ్చు. కాని వారిద్దరూ కూడా కొడుకుల వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో విఫలమయ్యారు. ఔరంగజేబు ముంతాజ్ కుమారుడే అని నేను చదివాను. అలాగాక ఔరంగజేబు షాజహాన్ మొక్క మరో భార్య కొడుకు అయితే [షాజహాన్ కి ముంతాజ్ గాక ఇంకా భార్యలున్నారని చరిత్ర చెబుతుంది] అప్పుడు షాజహాన్ కొడుకుని పెంచడంలో విఫలుడైనట్లే. కాబట్టే అతడు తన తండ్రి షాజహాన్ని గానీ, తల్లితో అతడి ప్రేమానుబంధాన్ని గానీ గౌరవించలేదు. బహుశ ఔరంగజేబుకి అసలు ప్రేమానుబంధాల మీదే నమ్మకం లేదేమో. [ఔరంగజేబు పుత్రుడు ఔరంగాబాద్ దగ్గర మినీ తాజ్ మహల్ తన తల్లి గౌరవ చిహ్నంగా కట్టించాడు. దాన్ని మీడియా అసలు ప్రచారించలేదు. ఓ భర్తకి భార్య మీద, ప్రియుడికి ప్రియురాలి మీద ఉన్నది ప్రేమ గాని ఓ కొడుక్కి తల్లిమీద ఉన్నది ప్రేమేలా అవుతుందని మీడియా ఉద్దేశం కాబోలు. లేదా తల్లీ కొడుకుల ప్రేమని ప్రచారిస్తే తమకేం వస్తుంది బూడిద! అదే శృంగారానికి దారి తీసే స్త్రీ, పురుష ప్రేమని ప్రచారిస్తే వేలంటైన్స్ డే దగ్గర్నుండీ ఎన్నో వెర్రుల్ని ఎక్కించవచ్చు అన్నవ్వాపార సూత్రం కావచ్చు.]
ఇక ఇలాంటి వ్వక్తిత్వం ఉన్న ఔరంగజేబుకి, అటు మరాఠాను కబళించే ప్రయత్నం, ఇటు గోల్కోండని వశపరుచుకొనే ప్రయత్నం అతనిలోని రాజ్యకాంక్షనీ, ధన దాహాన్ని చూపిస్తుండగా, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఔరంగజేబు కుటిల తంత్రాల్ని [సెయిస్తఖాన్ రాయబారం, శివాజీని చెరలో పెట్టించడం, స్నేహం నటించిన రాజకీయాలు] విశద పరుస్తుండగా - వ్వక్తిగా అతడు సచ్చీలుడనీ, ఇస్లాంని ఆచరించిన పవిత్రుడనీ, ప్రజల సొమ్ముతో తిండి కూడా తిననంత సాధువనీ[హిందువుల మీద జుట్టుపన్ను, పరమత సహనం లేక వేసాడట] మీడియా పరోక్షంగా ఇమేజ్ [పాజిటివ్ కాప్షన్] ఇచ్చేది, ఇచ్చింది.
ఇంతటి నెగిటివ్స్ ఉన్న ఔరంగజేబుకి, [ముస్లిం చక్రవర్తికీ] అంతటి పాజిటివ్ ఇమేజ్ ఇచ్చి - ఎంతో పాజిటివ్ వ్యక్తిత్వం కలిగిన, పుత్రుల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడంలో సఫలీ కృతులైన కౌసల్యదశరధిలకీ, మానవతా విలువల్ని పాటించి చూపించి అందరికీ ఆదర్శప్రాయుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచే రాముడికీ, ఆయన సోదరులకీ అంతగా నెగిటివ్ ఇమేజ్ ఇవ్వడానికి - ఇంత పనిగట్టుకుని ప్రచారించిన మీడియాని చూస్తే తెలియడం లేదా, ఇది పక్కా కుట్రని?
ఈ రోజుల్లో లౌకిక వాదం అంటూ రాజకీయ పార్టీలు చేస్తోన్న [నకిలీ కణికుడి కుట్రలో భాగంగా] రాజకీయం కూడా దీనికి అనుగుణమైనదే. వీళ్ళ లౌకిక వాదం అంటే ముస్లింలని వెనకేసుకు రావడం, హిందువుల్ని విమర్శించడం. ఇదే విభజించడం - రాజకీయం చేయడం. ఇదిగాక ఇంకేమిటి? 14% ఉన్న ముస్లిం ఓట్లు అంతవిలువైనవి అయినప్పుడు, యు.పి.ఏ. నాయకురాలు నాగమ్మకి 79% హిందుఓట్లు అంత చులకన ఎందుకయ్యాయి? 14% ముస్లిం ఓట్లను ఎంతమంది పంచుకోగలరు? ఎన్ని శాతం ఓట్లు ఒక్కొక్కళ్ళకి వస్తాయి?
అసలీ ఓటు బ్యాంకు రాజకీయాలన్న పేరు ఓ వంక. కుహనా లౌకిక వాదము ఓ వంక మాత్రమే. అంతర్గతంగా ఉన్నది నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా చేస్తోన్న కుట్ర మాత్రమే. గమనించి చూడండి. వరుసగా దేశాలు [మొన్న బ్రిటిషు, నిన్న రష్యా, ఈ రోజు అమెరికా, ఇక రేపు చైనా] వెలిగి, ఆరిపోతున్నాయి. చాపక్రింద నీరులా, అనుశృతంగా గల్ఫ్ దేశాల పెట్రో వ్వాపారం, డబ్బు సంపాదన మాత్రం నిరంతరాయంగా నడిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 40% మాత్రమే వారి చమురు ఉత్పత్తి. అయినా ఒపెక్ దేశాలు [దాదాపు అన్ని ముస్లిం దేశాలే] పట్టు మాత్రం సడలనిది. రసాయన ఎరువులు, సౌందర్య ఉత్పత్తులూ అన్నింటికీ ముడి చమురు నుండి వచ్చే ఉత్పత్తులు కావాలి. చౌకగా దొరికే బయోడిజీల్ ప్రయోగాలు, సాంప్రదాయేతర ఇంధన వనరులు సౌరశక్తి వగైరా వినియోగ ప్రయోగాలు ఎప్పటికి ప్రయోగశాలలోనే ఉంటాయి. పరిశోధనలు కొనసా...........గుతుంటాయి. మైలేజ్ ఎక్కువ వచ్చే వాహనాలు హిట్టవ్వవు. మోడల్ మోజు పుట్టించదు. మైలేజ్ తక్కువ ఇచ్చే వాహనాలకు యువత వెంపర్లాడతారు. అలాంటి మోజు మీడియా [టీవి, సినిమా] పుట్టిస్తుంది. సర్వకాల సర్వావస్థలయందు పెట్రో వ్వాపరం 3 పువ్వులు, 6 కాయలుగా ఉంటుంది. ప్రపంచమంతటా ముస్లిం గారాబం నడుస్తూ ఉంటుంది. క్రమంగా ఎన్నోదేశాలు ముస్లిం దేశాలైపోయాయి. [బౌద్దా చరణ గల ఇండోనేషియా నేడు ముస్లిం దేశాలై పోయినట్లు. లేదా కెరీర్ బాగుంటుందను కుంటే ఏ.ఆర్.రెహమానులు, భజన్ లాల్ కొడుకు లాంటి వాళ్ళు ముస్లింలు అయిపోయినట్లు] అలాగని ఈ నకిలీ కణికుడు పూర్తిగా ముస్లిం పక్షపాతి అనుకోకండి. ఆ మతమౌఢ్యం ఎక్కిస్తే బలి కావడానికి బకరాలు ఎక్కువ దొరుకుతాయి. నకిలీ కణికుడికీ ముస్లిం మతానికి ఏదో అవినాభవ సంబంధాలున్న యన్నది నిజమే గాని, అతడి తంత్రం మాత్రం కొద్ది మంది ముస్లింలకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. [బ్రూనే సుల్తానులూ, దుబాయ్, సౌదీ రాజులు వగైరా లన్న మాట]
భారతీయ ఇతిహాసం మీద నకిలీ కణికుడి కుట్రచెబుతానంటూ ఏదేదో చెబుతున్నదేమిటి అనుకోకండి. హిందువుల పైన వ్యతిరేకంగా కుట్ర, ముస్లింల పైన అవ్యాజానురాగం - ఈ నకిలీ కణికుడి కుట్ర అనే నాణానికి రెండూ ముఖల్లాంటివి. అందుచేత చెప్పక తప్పలేదు. గల్ఫ్ లోని ముస్లిం దేశాలకు కూడా ప్రపంచంలో ఉన్న ముస్లింల పట్ల ప్రేమేమీ లేదు. ఉండుంటే వాళ్ళ జీవన స్థాయి పెంచటానికి ప్రయత్నించేవాళ్ళు. అంతేగాని తిండి గడుస్తుందని పేదముస్లిం పిల్లలనూ మదర్సాలకూ వచ్చేటట్లు కుట్రజరగదు [ సౌకర్యాలు తగ్గితే సర్దుకోగలం. తిండికి లేక పోతే సర్ధుకోలేం కదా! ఇదే ఇక్కడ నకిలీ కణికుడు ప్రయోగించే తంత్రం].
ఇక్కడ మరో మెలిక ఉందండి. ఓప్రక్క పైన చెప్పిన నకిలీ కణికవ్యూహం నడుస్తుండగా సహజంగానే హిందువులకి రగిలిపోయింది. దాన్ని భుజానికెత్తుకొని బి.జె.పీ.లు, సంఘపరివార్ లూ, హిందూ టెర్రరిస్టులూ తెరపైకి వచ్చారు. ఏ విధంగా అయితే MIM రాజకీయ నాయకులు ముస్లింలందరికీ ప్రతినిధులు కారో, అదేవిధంగా ఈ హిందుత్వనాయకులు హిందువులందరికీ ప్రతినిధులు కారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండూ వర్గాలూ నకిలీ కణికుడి ఏజంట్లే. భారతీయులు మీద మతం పేరుతో ’విభజించి గ్రిప్ చేసే తంత్రాన్ని ప్రయోగించడానికి పనిచేస్తోన్నారంతే.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
8 comments:
మీరు ఇక్కడితోనే(రాముడి మీద యుద్దం) ఆపారు. దానితో పాటు మీరు ఛత్రపతి శివాజీ గారి తల్లి మీద ఒక తెల్లవాడు వ్రాసిన ప్రేలాపనని గురించి కూడా చెప్పివుండాల్సింది. అలాంటి వాడిని కొట్టబోయిన వారిని హిందూ మతపిశాచాలు అన్నయి ఈ పత్రికలు. ఇంకా భారతదేశంలో నీతి ఎక్కడ ఉందండీ?
ఇక్కడితో ఆపలేదండి, ఇంకా చాలా ఉంది. తెల్లవాడు ఏమి వ్రాశాడో నాకు తెలియదు. వివరాలు తెలపగలరు.
ఇది జరిగి సుమారు ఒక సంవత్సరం దాటి ఉండవచ్చు. ఒక తెల్లవాడు శివాజీ తల్లి గురించి కొంచెం నీచంగా వ్రాసాడు. ఆమె ప్రవర్తన గురించి, చేతులు రావడం లేదు type చేయడానికి......
రాయండి, మేమూ తెలుసుకుంటాం.
వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.
I don't remember exactly what happened. I am expecting someone to narrate the incident.
(ఔరంగజేబు పుత్రుడు అహమదా బాద్ దగ్గర మినీ తాజ్ మహల్ తన తల్లి గౌరవ చిహ్నంగా కట్టించాడు.) ----
మినీ తాజ్ మహల్ ఉండేది ఔరంగాబాద్ లో, శిరిడి దగ్గర, నేను చూశాను, దీనిని ఔరంగజేబు కట్టించాడని విన్నాను , ఇది కాక అహమదా బాద్ లో ఉందేమో నాకు తెలియదు, దయతో సరిచూడండి,
ఈ కామెంట్ ని పబ్లిష్ చెయ్యొద్దు
శ్రీకాంత్
శ్రీకాంత్ రెడ్డి గారు,
మీరు చెప్పిందే సరియైనది. తప్పు దృష్టికి తెచ్చినందుకు నెనర్లు!
Post a Comment