వరుస టపాలకి విరామం ఇచ్చినందులకు మన్నించాలి.
నా బ్లాగు అతిధులు అందిస్తున్న ప్రోత్సాహనికి నాకెంతో సంతోషంగా ఉంది. ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. అందరికీ ధన్యవాదాలు.
2001 లో మన దేశజనాభా 102 కోట్లు అని చదివి “ఓర్నాయనో!” అనుకొన్నాను. తర్వాత శ్రీరామకృష్ణమిషన్, శ్రీరంగనాధానంద స్వామిజీ ఇచ్చిన ప్రకటన చదివాను. అందులో “మనం 102 కోట్లమందిమి ఉన్నాం. అమ్మో! 102 కోట్ల కడుపులు నిండాలా? అన్న నిరాశావాదం ఎందుకు? పని చేయటానికి 204 కోట్ల చేతులున్నాయి. ఆలోచించటానికి 102 కోట్ల బుర్రలున్నాయి అనుకొందాం.” అని. ఇది ఆశా వాదం. ధర్మబద్దమైన ఆశ, కోరిక, కాంక్ష భగవంతుడి ప్రతిరూపాలే. ధర్మబద్దమైన, సవ్యమైన ప్రతీదీ భగవంతుడి రూపమే.
అవును, నిరాశ ఎందుకు?
మనకి ఏం తక్కువని అనుకొన్నాను. అప్పుడెంత ఆత్మస్థైర్యం, ధైర్యము పెరిగాయో, ఇప్పడు మీరు చూపిస్తున్న ప్రోత్సాహనికి అలాగే ఉంది.
శ్రీశ్రీ అన్నట్లు,
"ఆశయాలలో, ఆవేదనలో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” కదా! అలాంటిది ఒక్కరు కాదు తెలుగు బ్లాగు చుట్టాలిందరున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతఙ్ఞతలు.
ఈ సందర్భంలో మరో చిన్న విషయం _
నా ఆంగ్ల బ్లాగు “Coups On World” [URL: motherindia369.blogspot.com] లో నకిలీ కణికుడి కుట్ర వ్వాపార రంగం, ఆర్ధిక రంగాల మీద ఎలా ఉందో వ్వాస పరంపర ఉంచాను. సమయం మిమ్మల్ని అనుమతిస్తే, ఆసక్తి పలకరిస్తే, ఆ వ్యాసాలు చదివి సమీక్షించండి.
మరో చిన్న విషయం -
మనం అంతగా గమనించుకోవటం లేదు గాని, పిల్లలు బలమైన వ్యక్తిత్వంతో తయారు కావాలంటే కథల అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మన కళ్ళ ముందు జిజియా బాయి పుత్రుడు ఛత్రపతి శివాజీ, పుతలీ బాయి పుత్రుడు మహాత్మ గాంధీ ఆవిష్కరించారు.
భారతీయ ఇతిహాసాలు, కథలకు గనులవంటివి. ఇక సాహిత్యం, జానపద సాహిత్యం ఎప్పటికీ తరగని నిధుల వంటివి.
చిత్రవిచిత్రమైన మలుపులతో, అద్భుతమని పించే సంఘటనలతో, ఆపకుండా చదివించే కథా గమనంతో భారతీయ జానపద సాహిత్యంలో చెప్పుకోదగిన స్థానం కలిగిన భట్టి విక్రమాదిత్య కథలు చిన్నప్పడు చదివి వింతలోకాల్లో విహరించాను.
ఆ కథల్ని నా పాపకు చెప్పినప్పడూ, ఆమె చేత చదివించినపుడు అదే ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఆమెలో గమనించాను.
నా విద్యార్ధులకి వాటిని పరిచయం చేసినప్పడూ అదే ఫలితాన్ని చూశాను.
ఆ ఆనందం పిల్లలందరికీ కలగాలని ఆ కథల్ని ఆంగ్లంలో వ్రాసాను. తెలుగులో ఇప్పటికే ఎందరో వ్రాశారు కూడా.
నాకు సాధ్యమైనంతగా పిల్లల్ని అలరించే ప్రయత్నం చేశాను. ఆ కథలు పిల్లల్లో ఊహశక్తినీ, ధైర్య, ఉత్సాహాల్ని, చక్కని వ్యక్తిత్వాన్ని, సామర్ధ్యాన్ని పెంచుకోవాలనే పట్టుదలనీ కలిగిస్తాయని నా నమ్మకం. అందుకే వ్రాసాను.
Charconstories1.blogspot.com అన్న బ్లాగులో ఉంచాను. మీకు నచ్చితే చదవండి. మీ చిన్నారుల చేత చదివించండి. నచ్చకపోతే కొద్ది సమయం వృధా అయ్యిందను కొని వదిలేయండి.
మన ఇతిహాసల మీద నకిలీ కణికుడి కుట్రని తదుపరి టపాలో కొనసాగిస్తాను.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
నేను చాలా కధలు చదివాను, కానీ మీరు కధ చెప్పే విధానము - దాని లో నీతి - అనువర్తన కలవటం తో అత్యద్బుతంగా వస్తున్నాయి, కొంత కాలం వరకు చందమామ , పత్రికలలో కతలు చదివే వాడిని కానీ అవి ఎప్పుడు కథ గానే ఉండేవి, నేను మీ బ్లోగ్ లోని కధలు అన్ని కాపీ చేసుకుంటున్నాను, నాకు పిల్లలు పుట్టిన తరువాత చెప్పాలి కదా..., మీకు అభ్యంతరం కాకపోతే మీ పేరుమీద గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాను , ఆల్‌రెడీ మీ బ్లోగ్ చదవమని నాకు తెలిసిన వాళ్ళకి చెబుతున్నాను,
పి. శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు
మామూలు గా కామెంట్ రాస్తే దాని లింక్ , దానికి రిప్లై వస్తే దాని లింక్ ఆటొమ్యాటిక్ గా ఈమేల్ కి వస్తుంది, ఆ ఆప్షన్ దయవుంచి ఆన్ చేయండి , రాసిన కామెంట్ పబ్లిష్ అయ్యిందో, రిప్లై వచిందో లేదో వెతుక్కోవటం కష్టం గా ఉంది,
శ్రీకాంత్
శ్రీకాంత్ రెడ్డి గారు,
ఇది మన పని అనుకొని చేస్తున్నందుకు మరో మారు నెనర్లు!
శ్రీకాంత్ రెడ్డి గారు,
ఈ మెయిల్ లింక్ ఆప్షన్ ఆన్ చేసాననుకుంటున్నానండి. ఒకవేళ రాకపోతే ఎలాగో చెబితే చేస్తాను.
Post a Comment