2004 వేసవిలో ఎన్నికలు రానుండగా, 2003 వేసవి నాటికే వై.యస్.కి ఇమేజ్ ఇచ్చేపని పెట్టుకున్నాడు రామోజీరావు. 2020 వరకూ తానే సీఎం అనుకుంటూ ఊహల ఉయ్యాలలూ, ఆశల పల్లకీలు ఎక్కేసిన చంద్రబాబుకి ఇది మింగుడు పడలేదు. "ఎవరైనా చెప్పినట్లు చేసేదే! అదేదో తానైతే మాత్రం కష్టమేమిటి? తానూ, చెప్పినట్లు, నమ్మకంగా చేసిపెడతాడు గదా? మరెందుకు తనని దించేయటం?" - ఇది అర్ధం కాలేదు చంద్రబాబుకి. అంతకంటే ఎక్కువ అర్థమయ్యేందుకు చంద్రబాబుకి తెలిసిన గూఢచర్యమూ తక్కువే!

ఎందుకంటే - రామోజీరావు చంద్రబాబుని నమ్మకస్తుడిగా ఉపయోగించుకున్నాడే గానీ, నమ్మకంగా తన వ్యవహారాలేం చెప్పలేదు. అతడికే కాదు రాజకీయరంగంలో, కార్పోరేట్, సినిమా ఇత్యాది ఏ రంగంలోని వారికైనా.... లోతట్టు వ్యవహారాలు అవసరమైనంత మేరకే చెప్పబడతాయి. అందుకోసం, పరిస్థితుల గురించిన సమాచారాన్ని.... తగ్గించి, పెంచి, దాచి లేదా వక్రీకరించి చెబుతుంది నకిలీ కణిక వ్యవస్థ!

అచ్చంగా.... మీడియా గనక, ప్రజలకి వార్తావిశేషాలని తగ్గించి, పెంచి, దాచి లేదా వక్రీకరించి చెప్పినట్లు గానే! కేవలం తమకి ముఖ్యమైన సోనియా, అద్వానీ వంటి కీలక వ్యక్తులకి మాత్రమే, దాదాపు పూర్తి వ్యవహారాలు లేదా సాధ్యమైనంత ఎక్కువ సమాచారమూ ఇవ్వబడుతుంది.

ఈ విధంగా వై.యస్. పాదయాత్ర గట్రాలతో రాష్ట్రంలో తెదేపా, చంద్రబాబుల తర్వాత, కాంగ్రెస్సు వై.యస్. అధికారంలోకి వచ్చే ప్రకరణానికి ముందస్తు ఏర్పాట్లు చేయబడినట్లే, కేంద్రంలోనూ ఎన్డీయే తర్వాత, కాంగ్రెస్సూ సోనియా అధికారంలోకి వచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయబడ్డాయి.

గతటపాలలో చెప్పినట్లుగా... అందుకోసం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాజ్యాంగ సవరణ చేసి మరీ సోనియాకి అనుకూలంగా విదేశీయత తాలూకూ అడ్డంకిని నివారించింది. అందుకు రాజకీయనాయకులందరూ పార్టీల కతీతంగా సహకరించారు. ఒక్క శరద్ పవార్, పీఎం సంగ్మాల వంటి వారు తప్ప! అలాంటి వాళ్ళు సోనియా పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడే, కాంగ్రెస్ నుండి వేరుపడి ఎన్సీపీ పార్టీ పెట్టుకున్నారు. ఆనక కాంగ్రెస్ తో, సోనియాతో పొత్తూ పెట్టుకున్నారు. నడవనప్పుడు, అంతకంటే రాజకీయ నాయకులు చేసేదేముంది?

సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే, ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఊపు అందుకుంది. అంతగా భాజపా, ఇతర పార్టీలు.... అంతర్గత సర్ధుబాట్లు, వ్యూహాత్మక తప్పిదాలు చేసి మరీ, ఎంతో ’సహజంగా’ సోనియాకి గెలుపు ఇమేజిని, సమర్ధ నాయకత్వాన్ని కట్టబెట్టారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - రాష్ట్రంలో 2004 ఎన్నికలలో అధికారం కాంగ్రెస్ కీ, వై.యస్.కీ అప్పచెప్పాలంటే చంద్రబాబు గింజు కున్నాడు. అదే కేంద్రంలో 2004 ఎన్నికలలో అధికారం కాంగ్రెస్ కీ, సోనియాకీ అప్పచెప్పాలంటే, అద్వానీ అందుకు అనుకూలంగా వ్యూహాత్మక తప్పిదాలు, పొరబాట్లు చేసి మరీ, కాంగ్రెస్, సోనియాల గెలుపుకి బాటలు వేసాడు. సోనియా అద్వానీలు, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ కీలక వ్యక్తులు అనడానికి మరొక దృష్టాంతం ఇది!

సీఎం సీటు దిగడానికి చంద్రబాబు మొరాయించినట్లుగా, గృహమంత్రి సీటునీ అధికారాన్ని వదులు కోవటానికి అద్వానీ మొరాయించలేదు. ఎందుకంటే - అధికారంలో తానుండటం, సోనియా ఉండటం ల కంటే ముఖ్యమైన విషయం, తరతరాలుగా నడుస్తున్న నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ ప్రపంచవ్యాప్త గూఢచర్య వలయం[Net work] తిరిగి తమ అధీనంలోకి రావటం! తిరిగి తమకు గూఢచర్య పట్టు వస్తే దక్కనిది ఏమిటి? అంతేకాదు, గూఢచర్య పట్టు దొరకకపోతే పోయేదేమిటో కూడా, అద్వానీ సోనియాలకి తెలుసు. అందుకే అంత పరస్పర సహకారం!

ఇదంతా చంద్రబాబుకేం తెలుసు? "ఎవరైనా ’జీ హుజూర్!’ అని చెప్పిన పని చేసే చోట, తనని దించి మరొకరి చేత వ్యవహారాలు చక్కబెట్టించాల్సిన అవసరమేమిటి?" అనుకుని మొరాయించాడు. దెబ్బతో ’అలిపిరి’ లో నక్సల్స్ బాంబుదాడితో ప్రాణాపాయం వెంట్రుక వాసిలో తప్పించబడి బయటపడ్డాడు. అసలుకే అతడికి ప్రాణాల మీద తీపి ఎక్కువ! ప్రాణభయమూ ఎక్కువే!

కాబట్టే... ప్రమోద మహాజన్ ని అతడి సోదరుడు ప్రవీణ్ మహాజన్ కాల్చి చంపితే, ఆపైన భాజపా నేతలతో సహా ఎవరూ మాట్లాడక ఆ కేసులోని నిజానిజాలేమిటో ఎవరికీ తెలియనంతగా అన్నీ మామూలుగా నడిచిపోతే... చంద్రబాబుకి ’భయం’ గడగడలాడింది. దెబ్బతో తమ్ముడు రామ్మూర్తి నాయుడితో సయోధ్య చేసేసుకున్నాడు. 2007 నుండి 2009 లలో అమెరికాలో ఉన్మాదుల విచక్షణారహిత కాల్పుల్లో తెలుగు వాళ్ళు, భారతీయులు ప్రాణాలు కోల్పోతుంటే.... "నిజంగా ఉన్మాదులే కాలుస్తున్నారో, లేదో! ఆ పైకారణం[over leaf reason]తో తన వాళ్ళని లేపేస్తే మాత్రం ఏమిటి దిక్కు?" అనుకుని, అక్కడ చదువుకుంటున్న కొడుకూ, కోడల్ని వెంటనే వెనక్కు తెచ్చేసుకునేంత ప్రాణభయం అతడికి!

ఇక చంద్రబాబు విషయాన్ని ఇక్కడికి ఆపి మళ్ళీ కేంద్రం వైపు చూద్దాం. 2004 ఎన్నికలకు ముందు మరికొన్ని విశేషాంశాలు జరిగాయి.

ఒక అంశం - 1996 లో ప్రధాని సీటు దిగిపోయాక పీవీజీ మీద పెట్టబడిన జే ఎం ఎం ముడుపుల కేసు, సెయింట్ కీట్స్ పోర్జరీ కేసుల వంటి వన్నీ కోర్టుల్లో తేలి పోయాయి. భాజపా అధికారం లో ఉన్నప్పుడే, కోర్టు, పీవీజీని ఆయా కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. ఇందులో... వాజ్ పేయి, అద్వానీ, సోనియాల ’మతిలో ఎంతో గతిలో అంత’ - గురించిన విశేషాలని ఈ టపాల మాలికలోనే మరో టపాలో వివరిస్తాను.

అప్పటికే, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య పట్టు తమకి లేకపోవటం, నెం.5 వర్గంతో హోరాహోరీ ’మెదళ్లతో యుద్దం’ చేయవలసి రావటం, బాగానే అనుభవానికొచ్చింది. పీవీజీ పై కేసులు తేలిపోవడానికి ఇది కూడా ఒక కారణం.

మరో అంశం ఏమిటంటే - సోనియా, 1998లో రాజకీయ ఆరంగ్రేటం చేయగానే, అత్తగారు ఇందిరాగాంధీ పంజాబ్ తీవ్రవాదాన్ని అణిచేందుకు నిర్వహించిన ఆపరేషన్ బ్లూస్టార్ కు, ఆవిడ తరుపున, కాంగ్రెస్ తరుపున, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను సిక్కులకు క్షమాపణలు చెప్పుకుంది. ఆ పంజాబ్ [ఖలిస్తాన్] టెర్రరిజాని సమూలంగా నిర్మూలనం చేసిన పీవీజీని మాత్రం అవమానించి ఇంటికి పంపించింది. అంతే కాదు, ఇందిరాగాంధీ హత్య నేపధ్యంలో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత, 500/-రూ.లకి ఒక హత్యగా నిర్వహించిన వాళ్ళనీ, జగదీష్ టైటర్లని కూడా పదవులిచ్చి మరీ సత్కరించింది.

సిక్కులతో పాటు, పీవీజీ హయాంలో అయోధ్యలోని బాబ్రీ మసీదుని కూలగొట్ట నిచ్చినందుకు, కాంగ్రెస్ తరుపున, ముస్లింలకు క్షమాపణ చెప్పేసింది. అయోధ్యలో బాబ్రీమసీదుని కూలగొట్టిన కరసేవకుల దేం బాధ్యత లేదు. దేశవ్యాప్తంగా హిందువులని రెచ్చగొట్టి, తమ ఉపన్యాస ఘర్షణలతో వేలాదిమందిని సమీకరించి, అయోధ్యకి చేర్చిన ఆరెస్సెస్, భాజపాలకి ఏ బాధ్యత లేదు. మసీదు కూలిగొట్టబడుతుంటే తనువు పులకరిస్తోందన్న భాజపా నేత అద్వానీకి అంతకంటే బాధ్యత లేదు. అప్పటి ఆ జిల్లా ఎస్.పీ.గా ఉన్న మధుకర్ గుప్తాలాంటి ఐపీఎస్ లకి, అధికారులకి, ఇతర బ్యూరో క్రాట్లకీ ఏ బాధ్యత లేదు. మీదు మిక్కిలి, అడ్మినిస్ట్రేషన్ పరంగా రెడ్ టేపిజం చూపిస్తూ, కోర్టుకి సైతం నమ్మకంగా అఫిడవిట్లు సమర్పించి మరీ హామీలిచ్చిన, ఆనక వాటిని తుంగలో తొక్కిన, కేంద్రబలగాలు అవసరం లేదని తిరస్కరించి, పరిస్థితులని విషమింప చేసిన, అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కీ ఏ బాధ్యత లేదు. ప్రధాని పదవిలో ఉన్నాడు కాబట్టి, పీవీజీదే మొత్తం బాధ్యత!

పైగా, సోనియా పుత్రుడు రాహుల్ గాంధీ, మరో అడుగు ముందు వేసి, ’1992 నాటికి తమ కుటుంబంలోని వారు గనక అధికారంలో ఉండి ఉంటే బాబ్రీ మసీదు కూలి ఉండేది కాదనీ, తాము కూలనిచ్చేవాళ్ళం కాదనీ’ గంభీరంగా ప్రకటించేసాడు. [మరీ అతడి తల్లి సోనియా సారధ్యంలో ఉన్నప్పుడే కదా, నెలకి ఒకటి చొప్పున బాంబుపేలుళ్ళు, ముంబై బాంబుపేలుళ్ళు జరిగింది/జరుగుతోంది? మరి వాటిని ఎందుకు అడ్డుకోలేదో?]

కాబట్టే.... కాంగ్రెస్ తరుపున, సాక్షాత్తూ ఆ తప్పులన్ని తానే చేసినంత పశ్చాత్తాన్ని, నిజాయితీని, భావయుక్తంగా ముఖంలో ప్రదర్శిస్తూ మరీ, ముస్లింలకు క్షమాపణ చెప్పేసింది. అదీ! ఆమెలోని నిజ జీవిత నటనా వైదుష్యం!

ఆ విధంగా....1998 లో ఏఐసిసి అధ్యక్షురాలిగా రాజకీయ కెరీర్ ప్రారంభించాక, భాజపా ఇతర పార్టీల నేతల పరోక్ష, ప్రత్యక్ష, వ్యవస్థీకృత సహాయసహకారాలతో, ఉత్తరాది రాష్ట్రాల్లో గెలుపుల ఇమేజితో, ఇతోధిక మీడియా ప్రచారంతో, 2004 ఎన్నికలలో.... సోనియా సారధ్యాన కాంగ్రెస్, యూపీఏ గెలిచాయి.

రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలిచింది. కేంద్రంలో కంటే ముందుగా రాష్ట్రంలో వై.యస్. ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే, ’కేంద్రంలో రాష్ట్రంలో, ప్రభుత్వం ఏర్పాటు ఖాయం’ అనే పరిస్థితులు కనబడటంతోనే నేదురమల్లి జనార్ధన రెడ్డి తెగ ఉత్సాహపడిపోయి, అత్యంత క్రియాశీలకం అయిపోయాడు. 1992 అక్టోబరు 9న, పీవీజీ హయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలలో కాపిటేషన్ ఫీజు పైకారణంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన ఇతడు, తనకు పూర్వాశ్రమంలో రామోజీరావుతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా, ఇప్పుడు తనకి ’దశ’ తిరిగి పోతుందనుకున్నాడు.

ఆనాటి అతడి ఉత్సాహం, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పై చొరవ, టీవీ వార్తల్లో విజువల్స్ తో సహా వచ్చాయి. మారిన రాజకీయ నేపధ్యం అతడి కంతగా తెలియదయ్యె పాపం! అతడి ఉత్సాహం అంతలోనే గాలి తీసిన బెలూన్ మాదిరిగా అయ్యింది. కేంద్రంలో తనకి మంత్రిపదవి ఇవ్వకుండా, రాష్ట్రంలో తన భార్య రాజ్యలక్ష్మికి మంత్రిపదవి ఇవ్వడంతో, భార్యభర్తలిద్దరూ అలకలు కూడా పోయారు. ఆ విషయమై ప్రకటనలూ ఇచ్చారు. రాజ్యలక్ష్మి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనంది. తర్వాత అన్నీ దిగమింగుకుని రెండోదశలో ప్రమాణ స్వీకారం చేసింది. భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్రలో ఈ విషయం విపులంగా వ్రాసాను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే - నేదురుమల్లి జనార్ధన రెడ్డికి కూడా, రామోజీరావు గూఢచర్యం గురించి, సోనియా హస్తం గురించీ, 1992లో పీవీజీకి రామోజీరావు ఉనికి తెలియటానికి ముందే తెలుసు గనక! ’రామోజీరావు, సోనియాలది ప్రపంచస్థాయిలో గూఢచర్యం నెరపే సంస్థలో కీలక స్థానం’ అని జనార్ధన రెడ్డికి తెలుసు. అయితే ’అసలు ప్రపంచస్థాయిలో గూఢచర్య వలయాన్ని నడిపించే వాళ్ళల్లో రామోజీరావుది కీలక స్థానం’ అని తెలియదు. అందుచేత 1992 తర్వాత, పీవీజీ హయాంలో మారిన గూఢచర్య రాజకీయ నేపధ్యమూ తెలియదు. అందుకే అలకలు పోయి, భంగపడ్డాడు.

ఈ స్థితి ఇతడి ఒక్కడిదే కాదు. దేశ వ్యాప్తంగా, ఎన్నో రాష్ట్రాలలో [మన రాష్ట్రంలో కూడా] చాలామంది రాజకీయ వృద్దనేతలు [సీనియర్లు] అనుభవించిందే, అనుభవిస్తున్నదే!

ఇక 2004 ఎన్నికల ఫలితాల ప్రకటన పూర్తయ్యాక, యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ఖరారయ్యాక - ప్రధాని ఎవరౌతారో అని అందరూ ఉత్సుకతతో చూశారు. ఈ సందర్భం గురించి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి సహాయకుడిగా పనిచేసిన ఉద్యోగి ఒకరు[పేరు గుర్తులేదు] తన ఆత్మకథలో ప్రస్తావించిన అంశాలు పరిశీలినార్హమైనవి. దాని గురించి ఈనాడుతో సహా పత్రికలన్నీ అప్రధాన వార్తాంశంగా ఓ మూలన వ్రాసాయి.

రాష్ట్రపతి సెక్రటరీ, తన పుస్తకంలో, ఆనాటి సంఘటన గురించి వ్రాస్తూ.... "ఆ రోజు రాష్ట్రపతి నన్ను పిలిచి ’ప్రధానిగా ఎవరిని ప్రతిపాదిస్తారో? కాబట్టి ప్రధానిగా సోనియా గాంధీ పేరును ప్రస్తావిస్తూ ఒక లేఖ, మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావిస్తూ మరో లేఖ సిద్దంగా ఉంచమని’ కోరారు. నేను ఆ ప్రకారమే రెండు పత్రాలు సిద్దంచేసి తీసికెళ్ళాను. అప్పటికే సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లు వచ్చారు. రాష్ట్రపతి నన్ను పక్క గదిలో వేచి ఉండాల్సిందిగా అదేశించారు. కొంత వ్యవధి తర్వాత రాష్ట్రపతి నన్ను రమ్మని కోరినట్లు పిలుపు వచ్చింది. నేను వారి గదిలోకి వెళ్ళబోతుండగా.... అప్పటికే మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ లు కారిడార్ మలుపు వద్ద వెళ్ళిపోతూ కనిపించారు. రాష్ట్రపతి ’ఆ పత్రాల అవసరం ఇంకా రాలేదని, వారిద్దరూ ఆలోచించుకుని, నిర్దిష్ట నిర్ణయంతో మళ్ళీ వస్తామన్నారని’ నాతో చెప్పారు. తదుపరి, ప్రధానిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావిస్తూ పత్రాలు తయారు చేయమని నాకు ఆదేశాలు వచ్చాయి" - అని ఉటంకించారు.

ఆ నాటి టీవీ వార్తల్లో కూడా, రాష్ట్రపతి భవన్ లోకి వెళ్ళే ముందు, విలేఖరులతో మాట్లాడుతూ ’సోనియా చాల ఉత్సాహంతో ఉండటం, రాష్ట్రపతి భవన్ నుండి బయటకు వచ్చేసాక ముఖం మ్లానమై, నిరుత్సాహంతో, తీవ్ర ఆలోచనల్లో మునిగి ఉన్నట్లు ఉండటం’ గమనించి మేము ఆశ్చర్య పోయాము. అందునా సూర్యాపేటలో సామాగ్రినంతా పోగొట్టుకుని, ఆ గడపా ఈ గడపా తిరిగి, శ్రీశైలం చేరి చిన్నస్కూలు పెట్టుకున్నాక, 2004, మార్చి - ఏప్రియల్ లలో మళ్ళీ టీవీ కొనుక్కున్నాము.

2004 ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి, మేం డిష్ కనెక్షన్ పెట్టించుకుని కొన్ని రోజులే అవటంతో ప్రతి కార్యక్రమాన్ని ఉత్సాహంతో తిలకించాము. దాంతో... ఎన్నికల ఫలితాల అనంతరం, ప్రభుత్వ ఏర్పాటు దశలో.... ’సోనియా, మన్మోహన్ సింగ్ లు రాష్ట్రపతిని కలవటం’ అనే సంఘటనకు ముందు వెనకా, సోనియా ఉత్సాహనిరుత్సాహలు బాగా గుర్తుండి పోయాయి.

’అంతలొనే అంత మార్పు ఎందుకు వచ్చిందా?’ అనుకున్నాము. తర్వాత.... మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. అతడప్పటికి లోక సభ సభ్యుడు కాదు. తర్వాత రాజ్యసభలో సభ్యుడిగా ప్రధాని పదవికి అర్హతని రాజ్యాంగపరంగా పొందాడు. సోనియా యూపీఏ ప్రభుత్వ ఛైర పర్సన్ అయ్యింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రిమోట్ సోనియా చేతిలో ఉండటం ఇప్పటికి ఎన్నోసార్లు నిరూపితమైనా.... 2004 ఎన్నికలలో ప్రధాని పదవిని అధిష్టంచ ఉద్యుక్తమై ఉత్తర క్షణంలో వైదొలిగిన సోనియాని, ’త్యాగశీలివమ్మా ప్రభావశీల మహిళ’ అంటూ.... ’సోనియా x సార్లు ప్రధాని అయ్యే అవకాశాలని త్యాగం చేసింది’ అంటూ.... కాంగ్రెస్ లోని వీర భక్త శిఖామణులు భజనలు చేస్తుంటారు.

ఇక ఈ విషయం ప్రక్కన బెడితే.... 2004 మే 22న మన్మోహన్ సింగ్ తొలిసారి ప్రధాని అయ్యాడు. 2004 డిసెంబరు 23న పీవీజీ, తను ప్రారంభించిన పనిపట్ల తనకు ’కర్తృత్వాహంకారం లేకపోవటం, కర్మఫలాసక్తి కూడా లేక పోవటాన్ని’ దృష్టాంతపూరితం చేస్తూ, నిష్కామ కర్మ యోగిలాగా ఇహలోకం నుండి తరలి పోయాడు. [’ఈ పనిని నేనే చేశాను’ అనుకోవటం కర్తృత్వాహంకారం. ’ఈ పని ఫలితం కీర్తి ప్రతిష్ఠలతో సహా నాకే దక్కాలి’ అనుకోవటం కర్మఫలాసక్తి.]

అప్పటి వరకూ ’అందుకోసమే ఎదురు చూస్తున్నారా?’ అన్నట్లున్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో, కనీసం కాంగ్రెస్ భవన్ లో కూడా పీవీజీ పార్ధీవ శరీరాన్ని ఉంచనివ్వకుండా, సోనియా తన అరిషడ్వర్గాలని నిర్మొహమాటంగా ప్రదర్శించుకుంది. అప్పటి వరకూ తమని గూఢచర్యంతో, ’మెదళ్ళతో యుద్దం’తో ముప్పతిప్పలు పెట్టినందుకు పీవీజీపై తనకున్న అక్కసునంతా తీర్చుకుంది.

అద్వానీతో సహా కేంద్రంలోని అధికారప్రతిపక్షనేతలు ’ఫార్మల్’ సంతాపాలు తెలిపారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన పీవీజీ పార్ధివశరీరానికి మనోమోహనుడు మొక్కుబడి దండం పెట్టి మాయమైపోయాడు. ఢిల్లీలో ఆయన దహనానికి, స్మృతిగా సమాధికట్టడానికి స్థలం కూడా కేటాయించబడలేదు.

హైదరాబాదుకు తీసుకు రాబడిన పీవీజీ పార్దివ శరీరాన్ని సందర్శించడానికి వచ్చిన రామోజీరావైతే ’ఇహ చూస్కో నా తడాఖా’ అన్న చూపే చూశాడు. ఆనాటి ఈనాడు ఎవరి దగ్గరైనా ఉంటే, ఆ పోటో ఇప్పుడు చూసినా అతడి భావాన్ని గుర్తించవచ్చు. అప్పట్లో వార్తల్ని యధాలాపంగా పరిశీలించినందున ఆ ఫోటో మేము సేకరించలేదు.

మరునాడు దహనకాండ నిర్వహించబడింది. రామోజీరావు ’తన పెర్వర్షన్ నంతా వెళ్లగక్కడా?’ అన్నట్లు, ఈనాడు ప్రధానపేజీలో, పెద్దపెద్ద అక్షరాలతో పతాక శీర్షిక వేసి ’సరిగా కాలని పీవీ శరీరం’ అంటూ వార్త వ్రాయబడింది. పీవీజీ కంకాళాన్ని ఫోటోగా ప్రచురించి, రామోజీరావు తన పైశాచిక అక్కసు తీర్చుకున్నాడు. అయితే ఆ పేపరు పాఠకుల చేతికి వచ్చేటప్పటికే, కడలూరు దగ్గర సునామీ విరుచుకు పడి, వేలమంది మృత్యువాత పడిన విషాద వార్త, బడబానలంలా ప్రజల్లోకి పాకింది.

ఆ సంచలన విషాదం ముందు, ఈ వార్తని ఇంకా ప్రచారించడం, పీవీజీ పార్థివ శరీరాన్ని కూడా అవమానించి అరిషడ్వర్గాలని సంతృప్తి పరుచుకోవటం, రామోజీరావుకు సాధ్యం కాలేదు. అంతలో, వైయస్, ముఖ్యమంత్రిగా పీవీజీకి ఉత్తర కాండ జరిపే బాధ్యత తీసుకున్నందున, తన వివరణలు ఇచ్చాడు. ఆ విధంగా అది సద్దుమణిగింది.

ప్రపంచవ్యాప్తంగా, అప్పటి వరకూ నడుస్తున్న, నెం.5 వర్గపు గూఢచర్యపు పట్టు, పీవీజీ మరణంతో సడలిపోతుందనుకున్నారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు. తమ అనువంశీయులాగానే, నెం.5 వర్గం కూడా.... వ్యక్తులకి.... తరాలకి.... అతీతంగా కొనసాగుతుందనీ, తమ అనువంశీయం రక్త సంబంధమైతే, నెం.5 వర్గంలో వారి అనువంశీయం భావసంబంధమై ఉంటుందనీ ఊహించలేకపోయారు.

ఈ విధంగా.... పీవీజీ మరణంతో మూడోదశ పూర్తయ్యింది. పీవీజీ మరణించినా, నెం.5 వర్గానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూఢచర్యపట్టు సడల లేదు. తమకి ఎదురు దెబ్బలూ తప్పట్లేదు. నకిలీ కణిక వ్యవస్థకు, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, సోనియా, అద్వానీలకి అది పెద్దషాక్! ఆ షాక్ లో వాళ్ళుండగానే నాలుగో దశ ప్రారంభమైంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu