2004 డిసెంబరులో పీవీజీ మరణం వరకు మూడోదశ అయితే, అప్పటి నుండి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది నాలుగోదశ.

పీవీజీ మరణంతో, నెం.5 వర్గానికి గల ప్రపంచవ్యాప్త గూఢచార పట్టు సడలుతుందన్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల ఆశ అడియాస అయ్యింది. ఆ పెనుగులాటలోనూ, వెదుకులాటలోనూ వాళ్ళుండగానే ’మెదళ్ళతో యుద్దం’ మరింత తీవ్రతరం అయ్యింది.

వ్యక్తులపై, వ్యవస్థలపై, దేశాలపై కూడా ’ఆడది, ఆకలి’ ప్రయోగించటం నకిలీ కణిక వ్యవస్థ స్ట్రాటజీ అయితే, అందులో అహం రెచ్చగొట్టటం లేదా సంతృప్తి పరచటం లాగా పదే తంత్రాలుండటం గతటపాలలో వివరించాను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ బలహీనతలని ఆధారం చేసుకుని పనులు పూర్తి చేసుకోవటం వాళ్ళకి అలవాటు. అందుకే ప్రజలని తామసపు చీకటిలోకి తీసుకుపోతారు.

నెం.5 వర్గం.... నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గంలోని వారిపై ’కన్నా?కాలా?’ తంత్రం ప్రయోగించటం, ఆయా వ్యక్తుల నిజస్వరూపాలను బహిర్గతం చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం [చేసిన కర్మఫలితాన్ని అనుభవింపచేయటం] గురించి గతటపాలలో చాలా చోట్ల వివరించాను.

ఈ క్రమంలో, భారతదేశం మీద నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం పన్నిన, సుదీర్ఘ కాలంగా అమలు జరుపుతున్న , కుట్ర బహిర్గతం అయ్యింది, అవుతోంది. ఒక్క భారతదేశమ్మీదే కాదు, యావత్ర్పపంచం మీద, మొత్తంగా మానవత్వం మీదే జరుగుతున్న కుట్ర ఇది!

ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను. ఇందిరాగాంధీ హయాంలో, ఆవిడ మనదేశమ్మీద విదేశీ కుట్ర జరుగుతోందంటే జోకులేయటమే కాదు, ’తొక్కలో ఇండియాలో ఏముందని కుట్ర చేయడం?’ అంటూ ఎద్దేవా కూడా చేశారు. వెయ్యేళ్ళ ముస్లిం ముష్కర పాలనలో, 200 ఏళ్ళ బ్రిటిషు భయంకర దోపిడిలో, ఏమీ మిగలని ఇండియా, రసం పిండిన చెరకు పిప్పిలా ఉంది. "పేద దేశం? ఏముందని, ఏం దోచుకుపోవాలని కుట్ర చేయడం? తన అధికారం నిలబెట్టుకోవటానికి, సమస్యలని ప్రక్కదారి పట్టించడానికి [అంటే హైజాక్ చేయటం అన్నమాట] ఇందిరాగాంధీ ఈ ఆరోపణలన్నీ చేస్తోంది. పాక్ ని ప్రత్యక్షంగా, అమెరికాని పరోక్షంగా నిందిస్తోంది" అన్నారు.

అయితే ఇప్పుడు చూసుకుంటే...? రంగురాళ్ళ పేరుతో చల్లగా తరలి పోతున్న రతనాల సీమ రాయలసీమ రత్నాలు! ఎన్ని ఖనిజాలు!? అపారమైన గ్యాస్ నిక్షేపాలు! ఇటీవల బయటపడిన పుల్లరిన్ నిక్షేపాలు. బంగారం కంటే కూడా విలువైన పుల్లరిన్, 500 టన్నుల దాకా, దక్షిణ భారత్ లో నిక్షేపాలున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు. లక్షల కోట్ల డాలర్ల ఖరీదయ్యే పుల్లరిన్ నిక్షేపాలు! ఇవి ఇప్పుడు అధికారికంగా బయట పెట్టబడుతున్నాయి గానీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు, ఇలాంటి వాటి గురించి ఎంతో ముందు గానే సమాచారం సేకరించి పెట్టుకుంటారు. అలాంటిదే ముఖేష్ అంబానీకి అప్పగించాక అతడి అదృష్టం కొద్దీ, అద్భుతరీతిలో బయటపడ్డ గ్యాస్ నిక్షేపాలు!

దక్షిణాఫ్రికా లో బంగారు ఖనిజాలున్నా అక్కడి స్థానికులు మాత్రం దారిద్ర్యంతో కునారిల్లుతూనే ఉంటారు. గనులు గుత్తకు తీసుకున్న అంతర్జాతీయ కార్పోరేటు కంపెనీల వారు కోట్ల డాలర్లకు పడగలెత్తుతారు. రాయలసీమలో రతనాలు రంగురాళ్ళ పేరుతో చాలా మామూలుగా తరలిపోతుంటాయి. ఇక్కడి వాళ్ళ దారిద్ర్యం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అదే గల్ఫ్ దేశాల పెట్రోలు అయితే....? ఆయా దేశాల సుల్తానులు, రాజులు దర్జాగా మార్కెట్ చేసుకుంటారు. అక్కడి చమురు బావుల్ని అమెరికా, బ్రిటన్ గట్రా ఏ దేశాల కార్పోరేట్ కంపెనీలూ గుత్తకి తీసుకుని దోచుకోలేవు.

దక్షణాఫ్రికా లాగే మనదేశంలోనూ, ఎన్ని సహజ వనరులూ, ఖనిజనిక్షేపాలున్నా మామూలుగా ముడిసరుకు తరలిపోతోంది. అంతిమ ఉత్పత్తి అమ్మకాలకి మళ్ళీ మనమే మార్కెట్టు అవకాశం అయి కూర్చుంటాము. ఇదే కదా స్వాతంత్రం పూర్వం బ్రిటిషు వాడు చేసింది?

ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి ఖనిజం ఖరీదు చాలా తక్కువ ఉంటుంది. అదే ప్రైవేటు పరం చేయగానే లాభాల పంటలు పండుతాయి. గాలి జనార్ధన రెడ్డి సోదరులకి గుత్తకిచ్చిన ఓబుళాపురం గనులు అందుకు పెద్ద ఉదాహరణ. దేశవ్యాప్తంగా కూడా ఇదే కథ. గుత్తకిచ్చాక ఇనుప ఖనిజానికి భారీగా ధర పెరిగింది. రవాణా మార్గం పొడవునా సామాన్యులు, దుమ్ముధూళి పీడితులై రోగాల బారిన పడితే, గుత్తేదార్లు మాత్రం స్వంత హెలికాప్టర్లలో గగన విహారాలు చేస్తారు. [ప్రజల రోగాల వలన మందుల కంపెనీలకు, కార్పోరేట్ హాస్పటల్స్ కు గిరాకీ బాగుంటుంది. ఎలాగూ ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి కదా! మందుల వ్యాపారం ఎంత ఎక్కువ జరిగితే మన GDP వృద్ది రేటు కూడా అంత పెరుగుతుంది.] ఇటువంటి వారంతా నకిలీ కణిక వ్యవస్థలోని అనుచర కార్పోరేట్లే. కాకపోతే వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలొచ్చి గుట్టు మట్లు బయటపెట్టుకున్నారు. అంతే!

ఇది ఈ రత్నగర్భలోని ఖనిజ సంపద అయితే, ఇక ఇక్కడి మానవ వనరులూ, మేధో వనరులూ అపారం! భారతీయులు శ్రమజీవులు. సహనం, సామర్ధ్యం కలవాళ్ళు. శ్రమించటం, పొదుపు మొదలైన లక్షణాలతో బాగా సంపాదిస్తున్నారనే ఈర్ష్య కొద్దీనే ఆస్ట్రేలియా లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయని వాళ్ళేగాక చాలామంది అంగీకరించారు. అంతగా భారతీయులు శ్రమజీవులు. శారీరకంగానైనా, మేధో పరంగా నైనా, శ్రమ, సహన శక్తి గల వాళ్ళు. ఐటీలో భారతీయులు ముందంజ అదే నిరూపిస్తోంది.

[ఇక్కడ చిన్న విషయం. ఇంతకు క్రితం చెప్పినట్లు, 1992 క్రితం వరకూ ఉన్న నానుడి ’ప్రపంచంలో భారతీయులు వ్యర్ధజీవులు. భారతీయులలో ఆంద్ర్హులు వ్యర్ధ జీవులు’ అన్న మాట. అది తిరగబడి ’ఐటీలో, భారత్ ప్రపంచలోనే మేటి. భారత్ లో ఆంధ్రవాళ్ళు మేటి’ అన్న నానుడి వచ్చింది.]

ఇక భారత్ మార్కెట్టయితే, హిందూ మహా సముద్రమంత విస్తారంగా కన్పిస్తోంది విదేశీ కంపెనీలకి! అలాంటప్పుడు ఎందుకు చేయరు కుట్రలు? ఇందిరా గాంధీ హయాం నుండీ పీవీజీ హయాం దాకా, తరుముకు వెళ్ళింది, ఈ విదేశీయులకి భారత్ లొ మార్కెట్ల గేట్లు తెరిపించు కోవటానికే గదా? ఇక ఇప్పుడైతే....? చింతపండు కొట్టు i.e. సూపర్ మార్కెట్లు రిటైల్ దుకాణాలు దగ్గర నుండి సెలూన్ల దాకా పోటీలు పడుతున్నారు. సందు చివర కొట్టు పెట్టుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులని కూడా చితక్కొడుతున్నారు.

ఇక మంగలి షాపులు పెట్టుకుంటే.... ఎటూ ఆడవారికీ, మగవారికీ కూడా శిరోజాలంకరణ[హెయిర్ స్టైలిస్ట్ ]దుకాణాలు,[పార్లర్లు] తెరుస్తున్నారయ్యె! అందుకే కదా జడలు కత్తిరింపచేసి మరీ ఫ్యాషన్ల పేరుతో రక రకాల అలంకరణలు వచ్చింది. ఎంత తలకి మాసిన వాళ్ళైనా నెలకో సారైనా క్షవరం[బుడుగు భాషలో అయితే మెడ్రాసు క్రాపింగు షాపింగు] చేయించుకోక తప్పదు.

నూరుకోట్ల మందిలో కనీసం సగం మందైనా నెలకో సారి క్షవరం చేయించుకున్నా.... కనీసం తడవకి వందరూపాయలన్నా.... ఎంత వ్యాపారం? 50 కోట్లు x 100 = 5000 కోట్ల రూపాయలు. సంవత్సరానికి అరవై వేల కోట్ల వ్యాపారం.[మన సీఎం ఘనంగా చెప్పుకుంటున్న బడ్జెట్ లో సగంపైనే]. ఇదే నిష్పత్తిలో లోదుస్తుల దగ్గరి నుండీ పైదుస్తుల దాకా, కాస్మీటిక్స్ దగ్గరి నుండి తినుబండారాల దాకా, సినిమాల నుండి సెక్స్ వర్కర్స్ దాకా[ఇప్పుడు ఎలాగు వీళ్ళకి లైసన్స్ లు ఇస్తున్నారు కదా!]! ఎన్ని ఉత్పత్తులకి ఎంతెంత మార్కెట్!! ఇప్పటికే సెల్ ఫోన్ల విషయంలో ఇది మనందరం ప్రత్యక్షంగా చూసిందే!

ఇక విద్య, వైద్య రంగాలలోకి కార్పేరేట్లు ప్రవేశిస్తే, దోపిడి ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం కదా? పిల్లల్ని చదివించుకోకా, రోగం వస్తే వైద్యం చేయించుకోకా ఛస్తామా? వినోద రంగంలోకి, సినిమా నిర్మాణం లోకి ఇప్పటికే కార్పోరేట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఫలితాలూ కనుచూపు మేరలోనే ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యప్రజలు బ్రతకాల్సింది కార్పోరేట్ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టేందుకే! ముడి సరుకు దగ్గరినుండి తయారీ వరకూ, తయారీ నుండి రవాణా వరకూ, ఆపైన వినియోగం వరకూ.... అన్నిటా.... సామాన్యులు.... ఉద్యోగులుగా, కార్మికులుగా, శ్రామికులుగా చివరికి వినియోగదారులుగా.... అన్నిరకాలుగా వారి నియంత్రణలోనే ఉండాలి!

ఎటూ కార్పోరేట్ వ్యాపారులూ, అందులో వాటాలు కలిగిన రాజకీయ నాయకులూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంనికి అనుచరులే! అలనాడు చక్రవర్తులకి కట్నకానుకలూ, కప్పాలూ సమర్పించుకునే సామంతులూ, పాలెయ్యగాళ్ళ వంటి వారే.... నేడు నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులకి.... కార్పోరేట్ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఉన్న అనుచరులు.

కాకపోతే అప్పట్లో ఫలానా వాడు ఫలానా ప్రాంతానికి చక్రవర్తి అన్న రికార్డు ఉండేది. ఇప్పుడు ఆయాపదవుల పేర్లుగా అది రూపాంతరం చెందింది. ప్యాకింగ్ మారినా లోపలి సరుకు ఒకటే ఉన్నట్లుగా! అప్పట్లో అధికారంలో తెల్లతోలు వాళ్ళుంటే, ఇప్పుడు నల్లతోలు వాళ్ళున్నారు. అంతే!

లేకపోతే.... పొద్దున లేస్తూనే కుటుంబంలోని పెద్దలు తలా ఒక దిక్కుకు టిఫిన్ డబ్బాలు పట్టుకుని ఉరికితే, పిల్లలు మరో దిక్కుకు పుస్తకాల గోతాలు వీపుకేసుకుని ఉరుకుతూ.... ఉద్యోగమే పరమావధిగా... బ్రతకడమే లక్ష్యంగా.... ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికుల జీవన సరళి!

ఆ నాణానికి మరో పార్శ్యమే - ’జనం బ్రతకడమే తమ వ్యాపారం కోసం’ అన్న కార్పోరేట్ మంత్రం! ఇంకా... తమ వ్యాపారం కోసం కొత్తకొత్త పండగలు, దినాలు [ప్రేమికుల దినం, తల్లిదండ్రుల దినం, భాషకో దినం గట్రాలు], సెంట్ మెంట్లు, మోజులు, మోడళ్ళు, కొత్త ఆచారాలు [ధన్ తేరస్ లు ] గట్రా పుట్టిస్తారు.

అలాంటి చోట - భారతదేశంలో విశాల భూభాగం, భూగర్భ సంపద, అత్యధిక జనాభా! అందునా.... శ్రమించగల, మేధస్సుని ఉపయోగించగల, ఉద్యోగధర్మం అనుకుంటూ నిజాయితీగా కంపెనీల లాభాల కోసం ఆకలి ఆరోగ్యాలని, ఆలు బిడ్డలని విస్మరించి, పనిలో మునిగి పోయేంతగా దీక్ష చూపగల జనాభా!.... ఇంతకంటే వ్యాపార దిగ్గజాలకి ఇంకేం కావాలి?

ఇంతగా, ఈ దేశంలో దోచుకోవటానికి, వ్యాపారం చేయటానికి ఇన్ని వనరులు ఉన్నప్పుడు చేయరా కుట్రలు? అయితే పాతికేళ్ళ క్రితం, 1970 - 80లలో ఇందిరాగాంధీ ఈ మాట అంటే అంతర్జాతీయ మీడియా తెగ నవ్వేసింది మరి!

ఇప్పుడు సోనియా, ఆమె బృందం చేసినట్లుగానే.... దోపిడి, కార్పోరేట్ కంపెనీల దోపిడికి సహాయ సహకారాలందివ్వటం చేసి ఉంటే, ఇందిరాగాంధీ సైతం, ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్న సోనియా బృందం మాదిరిగానే, డబ్బు దాచుకోలేక పోయి ఉండేదా? దోచుకున్నన్ని నాళ్ళు, దోచుకున్నంత దోచుకుని, స్వదేశం విడిచిపోయిన ఇమెల్డా మార్కోస్ ల లాగా, తానూ వెళ్ళిపోవచ్చునని తెలియనిది కాదే? ఇమెల్డా మార్కోస్ పారిపోయినప్పుడు ఆమె ఇంటిలో పదివేల జతల చెప్పులు బయటపడ్డాయి. అదీ ఆ నాయకురాలి మోజు, సుఖలాలస క్రేజు! ఇలాంటి విషయాల్లో.... ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏం జరుగుతోందో అర్ధం కాని అమాయకురాలు కాదే ఇందిరాగాంధీ? అలా రాజీ పడటానికి బదులుగా ఎందుకు తుపాకీ గుళ్ళకు బలయ్యింది?

తన తర్వాత, తన కుమారుల పరిస్థితయినా ఇంతేనని తెలియనిది కాదు. అప్పటికే ఒక కొడుకు కళ్ళముందే అకాలమరణం చెందాడు. కుట్రకు వ్యతిరేకంగా పోరాడకుండా కుట్రదారులతో చేతులు కలిపి ఉంటే.... కోడలు సోనియాకి వచ్చినట్లు తనకీ ఇమేజ్, సమర్ధ నాయకురాలు బిరుదులు, ప్రపంచ ప్రభావశీల మహిళగా ప్రపంచవ్యాప్త రేటింగులూ వస్తాయని ఊహించలేనిది కాదు. ప్రతిపక్షాల చేత తనకి దాసోహం అనిపించుకునేది కదా? అప్పటి నుండి ఇప్పటి వరకూ మీడియా ప్రచారిస్తున్నట్లుగా, ఆమెకే గనక కీర్తి కాంక్ష ఉండి ఉంటే, కుట్రదారులతో చేతులు కలపటం తన చేతిలోని పని కదా! అప్పడెంతగా మీడియా తనని ఆకాశానికి ఎత్తేస్తుందో, అమెరికా సైతం తనకి ఎంత ప్రాధాన్య ప్రాముఖ్యతలిచ్చి వ్యక్తిగత ఇమేజ్ ఇస్తుందో ఇందిరాగాంధీకి తెలియని విషయమేం కాదు. అందునా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు స్పష్టంగానే తెలియజెబుతారు.

అయినా కుట్రకు వ్యతిరేకంగా పోరాడి తూటాలకి బలయ్యింది. రాజీవ్ గాంధీ సైతం బాంబుకు ఎరయై తునాతునకలయ్యాడు. అదే పోరాట బాటలో పీవీజీ మరణ పర్యంతం, మరణానంతరం అవమానాలే ఎదురౌతాయనీ తెలిసీ, ముందడుగే వేసాడు. అదీ భారతీయుల వారసత్త్వం, పోరాట ధీరత్వం!

అయితే విచారించదగ్గ, విషయం ఏమిటంటే - ఇలాంటి వారసత్వం కలిగి ఉన్న భారతీయుల్లో కూడా.... వెయ్యేళ్ళ క్రితం ఆఫ్ఘన్ ఇసుకపర్రల నుండి దోచుకునేందుకు భారత్ కు వచ్చిన ముస్లిం రాజులు గజనీ మహమ్మదులతో, ఘోరీ మహమ్మదులతో చేతులు కలిపి ప్రజాద్రోహానికి, దేశ ద్రోహానికి, ధర్మద్రోహానికి పాల్పడిన జయచంద్రుల్లాంటి వాళ్ళు.... రెండు మూడు వందల ఏళ్ళక్రితం యూరోప్ నుండి దోచుకునేందుకు భారత్ కు వచ్చిన బ్రిటీషు,ఫ్రెంచి వాళ్ళతో చేతులు కలిపి, సర్వద్రోహాలకు ఒడిగట్టిన గ్యాలియర్ సింధియాలు, విజయనగర గజపతులు వంటి వాళ్ళు.... ఉండటం.

మరింత విచారించదగ్గ విషయం ఏమిటంటే - అప్పుడు పోల్చి చూస్తే అల్పంగా ఉన్న ద్రోహుల సంఖ్య[ప్రత్యక్షంగా, పరోక్షంగా] ఈనాడు అత్యధికంగా ఉండటం.

ఇంతకీ ’ఎందుకంతగా ప్రాణాలు అర్పించి మరీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడారూ?’ అంటే - ప్రపంచదేశాల్లో ఆర్ధిక రంగంలో ఏం జరుగుతోందో, పెద్దవ్యాపారుల చేతిలో సామాన్యులు ఎలా నలిగి పోతారో, దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికే మన నాయకులకి అంచనా ఉంది! అందుకే రష్యాలో ఉన్నట్లు బలవంతపు సామ్యవాదాన్ని గానీ, అమెరికాలో ఉన్నట్లు పూర్తి స్వేచ్ఛా వాణిజ్యాన్నీ గానీ ఎంచుకోలేదు. అటు ప్రభుత్వ పెట్టుబడులతో ఉత్పత్తి వాణిజ్య సంస్థలుండేటట్లు, ఇటు ప్రైవేటు పెట్టుబడులతోనూ ఉండేటట్లు, పరస్పర పోటితో మార్కెట్టు నియంత్రణలో ఉండేటట్లు, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థని ప్రవేశపెట్టారు.

ఆచరణలో దానికి తూట్లు కొట్టటం ఎలాగో మనకి కుట్రదారులు చూపారు. సింగరేణి గనుల దగ్గరి నుండి ఆర్ టీసీ దాకా కార్మిక నాయకులు ప్రత్యక్షంగా రాజకీయనాయకుల జేబులో బొమ్మలు, పరోక్షంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు రామోజీరావుల చేతిలో పావులు. కొందరు కార్మికనాయకులు మరికొంత ముందుకెళ్ళి రాజకీయనాయకులు అయ్యారు. ఆయా నాయకత్వాల అధ్వర్యంలో, ఆయా సంస్థలు నష్టాలు చవిచూసాయి/ చూస్తాయి. అప్పటి ప్రభుత్వాలు అలాంటి వాటిని ప్రైవేటీకరించ నిరాకరించి నిందలూ నష్టాలూ పొందితే, ఇప్పటి ప్రభుత్వాలు నష్టాల వంక చూపి కొన్నిటినీ, లాభాలొస్తున్నా అదే దారిలో అన్నిటినీ అమ్మిపారేసాయి/పారేస్తున్నాయి.

పీవీజీ "ఇంటి సామానుల కోసం ఇల్లమ్ముకోవడం లాంటిది ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మడం" అన్నాడు. ఆయన హయాంలో రాజకీయ జీవితం ప్రారంభించిన అప్పటి విత్తమంత్రి, ఇప్పటి ప్రధానమంత్రి మాత్రం, సోనియా అధ్వర్యంలో, ప్రభుత్వరంగ సంస్థలని అంతరాయరహితంగా అమ్మిపారేస్తూ పోతున్నాడు.

ఇక్కడి భూగర్భ నిక్షేపాలని ముడిసరుకులుగా తరలించుకుపోయి, లేదా ఇక్కడే ప్రాసెస్ చేసి, అంతిమ ఉత్పత్తుల అమ్మకాలకీ మనల్నే మార్కెట్ గా మలచుకొని చేసే వ్యాపార దోపిడి ఇప్పటిది కాదు, బ్రిటీషు కాలం నాటి నుండి ఉన్నదే! ఇక్కడి పత్తి నెత్తుకెళ్ళి, బట్టల కట్టలుగా మార్చి, ఇక్కడికే తెచ్చి అమ్మేవాళ్ళు. పత్తిని వాళ్ళు చెప్పిన తక్కువధరకు అమ్మాలి. బట్టలని వాళ్ళు చెప్పిన ఎక్కువ ధరకు కొనాలి. ఇదీ దోపిడి! అందుకే బాపూజీ, ఆనాడు విదేశీ వస్త్ర మోజు అనే మాయలో పడి దోపిడికి గురవుతున్న వైనాన్ని ప్రదర్శింప చేస్తూ చరఖా చేబూనాడు.

మన వస్తువు కొనేటప్పుడూ, వాడి వస్తువు అమ్మేటప్పుడూ.... రెండుసార్లూ వాడు చెప్పిందే ధర! ఇక్కడే ఉంది దోపిడి కిటుకు! కావాలంటే పరిశీలించండి! కార్పోరేటు కంపెనీల వాళ్ళు తయారు చేసే సెంటూ సీసా దగ్గరి నుండీ టీవీ సెట్టు దాకా, ఉత్పత్తిదారుడే తన ఉత్పత్తి ధరని నిర్ణయించుకుంటాడు. అదే తిండి గింజలని ఉత్పత్తి చేసే రైతులైతే, టమాటా దగ్గర నుండీ ఏ పంటనీ, తనకు గిట్టుబాటు అయ్యే ధరకి అమ్ముకోలేడు. సరిగ్గా పంట వచ్చే సమయానికి మార్కెట్టు ధరలు పడిపోతాయి. అదీ ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ సాక్షిగా నకిలీ కణిక వ్యవస్థకి అందించే సహకారం!

మన పప్పెట్ ప్రధాని మంత్రి గారు ఒకడుగు ముందుకేసి "రైతులకి వ్యవసాయం సరిగ్గా చేతగాకే పంట దిగుబడి తగ్గుతుంది" అన్నాడు. అంటే రైతు పొలాలను అమ్ముకుంటే, ఎంచక్కా కార్పోరేట్ కంపెనీలే వ్యవసాయం చేసి బాగా పండిస్తాయని అతని అభిప్రాయం కాబోలు. ఇక రైతు దిగుబడి సమయంలో దోపిడికి గురి అవుతున్నాడనే మాటే ఉండదు. ఎలాగూ రైతులు కూలీలుగా మారిపోతారుగా! ఎటూ సెజ్ లలో కూలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు.

ఈ విధంగా, ఆనాటి ఇందిరాగాంధీ ఎందుకు విదేశీ కుట్ర అందో, ఆ కుట్ర ఫలితంగా మనం ఏం కోల్పోతున్నామో, ఈనాటి పరిస్థితులు బాగా తెలియజెపుతున్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ అన్నట్లే - ఇప్పుడు భారత్ లో తీవ్రవాదంతో, నకిలీ కరెన్సీతో, నకిలీ స్టాంపులతో, నకిలీ పాస్ పార్టులతో.... అన్నిరకాల కుట్రలలో పాక్ హస్తం ప్రత్యక్షంగా, పాకిస్తాన్ ని వెనకేసుకొస్తూ అమెరికా హస్తం పరోక్షంగా.... ఎంతగా బహిర్గతం అయ్యాయో, అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా కుట్ర బహిర్గతం [expose] అయ్యింది.

’ఓటమి స్ట్రాటజీ’ కారణంగానే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల విశ్వరూపం, నిజరూపం, కుట్ర స్వరూపం ఇంతగా ప్రదర్శితమయ్యాయి. నాలుగో దశలో ప్రధానాంశం ఇదే!

నాలుగో దశలో దేశం విషయంలోనే కాదు, మా కేసు విషయంలోనూ ’ఓటమే స్ట్రాటజీ’గా ప్రయోగింప బడింది. అందులోనూ మా ప్రమేయం లేకుండానే! వివరంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఆడం స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తకంలో అదృశ్యహస్తం (invisible hand) అనే పదం వాడుతుంది. అది ఈ కాలానికి మనం అన్వయించుకుంటె నకీలీ కణిక వ్యవస్థ (midiyaa)సరిగ్గా సరి పోతుంది.

khandavilli ramakrishna said... July 8, 2010 at 10:33 AM  

adbhutam. inni rojulu ee blog ela miss ayyana anipistondi. andariki mee blog gurinchi chebutunna. ee blog maa ajnananni pogodutondi

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu