మూడో దశ: 1996 సార్వత్రిక ఎన్నికలలో పీవీజీ ఓడిపోయినప్పటి నుండి 2004 లో పీవీజీ మరణించే వరకూ.

1996 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, పీవీజీ ఓడిపోయారు. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేని స్థితి! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకి, ప్రభుత్వం లోపల ఏంజరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం పీక మీద ఉంది. అదీ తనకు అత్యంత నమ్మకస్తులైన వారు ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలను ఆక్రమిస్తే తప్ప , పీవీ హయాంలో లోపల ఏంజరిగిందో తెలియదు. ’తను ఎలా పట్టుబడ్డాడు, ఏ విధంగా నిర్ధారణ చేసుకోబడ్డాడు, ఎంతెంత వరకూ తన గుట్లు తెలిసిపోయాయి... ఇలాంటి వివరాలు తెలియాలంటే గూఢచర్య, నిఘా సంస్థల మీద పట్టు ఉండాలి. అధికారం ఉండాలి’ అన్నది అతడి తపన, తాపత్రయం.

అయితే, అప్పుడున్న పరిస్థితుల్లో ఎకాఎకి తనకు సోదరీతుల్యమైన సోనియాని ప్రభుత్వంలోకి తెచ్చుకోలేడు. దాదాపుగా అంతే ఆప్తుడూ, నమ్మకస్థుడూ అయిన ఆద్వానీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నది నకిలీ కణిక వ్యవస్థలోని కీలకవ్యక్తి రామోజీరావు పెనుగులాట! భద్రతరీత్యా అటల్ బిహారీ వాజ్ పేయిని ప్రధానిగా ముందుంచుకొని, గృహమంత్రిగా అద్వానీ రంగంలోకి దిగాలన్నది ప్రణాళిక! దేవేగౌడకి ముందుగా వాజ్ పేయి 13 రోజుల ప్రధానమంత్రిగా పనిచేసాడు. [1996 మే16 నుండి 1జూన్ వరకూ,17 రోజులపాటు, తొలి పదమూడు రోజుల ప్రధానిగా! తర్వాతి నాలుగురోజుల ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే వరకూ అదే కుర్చీలో కొనసాగాడు.] తగినంత మద్దతు లభించక, భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు.

తర్వాత, వివిధపార్టీల మద్దతు తీసుకుని దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాడు. మతతత్త్వ శక్తులని ప్రభుత్వాధికారం నుండి నివారించటానికి ఎర్రపార్టీలు దౌవెగౌడకి మద్దతిచ్చాయి. చంద్రబాబు తెదేపా వంటి ప్రాంతీయ పార్టీలూ మద్దతిచ్చాయి. తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి ఎప్పుడూ పరస్పర విరుద్దశిబిరాలలో ఉండే ప్రాంతీయపార్టీలు DMK, AIDMK లలో ఏదో ఒకటి, తప్పనిసరిగా, కేంద్రంలో కలగూరగంప లేదా కిచిడి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కదా! ఇలాంటి అతుకుల బొతుకులతో దౌవెగౌడ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. సంవత్సరం తిరక్కుండా[దాదాపు 11నెలలకి] సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈసారి ఐకే గుజ్రాల్ ప్రధాని కుర్చీ ఎక్కాడు. అది మరో కొన్ని నెలలు. మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమయ్యింది.

పైకి ఇదంతా చాలా మామూలుగా కనబడింది. అయితే గూఢచర్య పరంగా ఇందులో చాలా ప్రకరణాలు నడిచాయి, అంశాలు ఇమిడాయి. అప్పటికి నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారికి, పీవీజీ దిగిపోయినా గానీ, గూఢచర్య పట్టు మాత్రం తమకి లేదనీ, ఆయనకే ఉందనీ అర్ధమయ్యింది. గూఢచర్య సంస్థల సహకారం తమకి తూతూమంత్రంగా తప్పితే సంపూర్ణంగా లేదని అర్ధమైపోయింది. ఇలాంటి స్థితి, పూర్వంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీసింగ్, చంద్రశేఖర్ ల హయాంలలో తమకి తెలిసిందే!

గూఢచర్య ఏజన్సీలు, కొన్ని దేశాలలో తమ స్వార్ధపు పరిధిలో కూరుకుపోయి, కొన్నిపార్టీల పట్ల, వ్యక్తుల పట్ల పక్షపాతంతో ఉంటాయి. ISI... పాకిస్తాన్ లో తనకి అనుకూలమైన వారినీ, అనుకూలంగా ఉన్నంత మేరకే పదవుల్లో ఉండనిచ్చినట్లన్న మాట! అమెరికా విషయంలో సిఐఏ కూడా, ఇలాగే పనిచేస్తుందని సీఐఏ గురించి పేరున్నది. సీఐఏ ముసుగు మాటున కార్పేరేట్ కంపెనీల వ్యాపార కారణాలు చెప్పబడితే, ఐ.ఎస్.ఐ. ముసుగు మాటున సైనిధికారుల వ్యాపారాలు, వ్యవహార లావాదేవీలు పైకారణాలుగా[over leaf reasons] చెప్పబడేవి. నిజానికి రెండింటి వెనకా ఉన్నది మాత్రం నకిలీ కణిక వ్యవస్థే!

ఇదే మాదిరి పనితీరు అయినా, భారతదేశంలో నిఘా సంస్థలు, గతంలో, అంటే 1992 కు ముందర [తర్వాత కూడా], దేశం పట్ల నిబద్దత గల శాస్త్రీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీజీ, వంటి వారిపట్ల తప్ప ఇతరుల పట్ల అనుకూలంగా ఉండవన్న మాట ఉండింది. అది నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకి దేవెగౌడ, గుజ్రాల్ ల హయాంలో మరోమారు అర్ధమయ్యింది. అయితే నిఘా సంస్థలే అనుకూలంగాలేవో, దేవెగౌడ తదితరులే తమకు పారదర్శకంగా లేరో అనుమానమే!

ఎంతటి వాడైనా, పడవ ఎక్కాక సరంగు చెప్పినట్లు వినాల్సిందే! చెప్పినచోట కూర్చోకపోతే పడవ మునుగుతుందని సరంగు అంటే, నమ్మినా నమ్మకపోయినా, సహించి గమ్మున సరంగు చెప్పిన చోట చతికిల బడాల్సిందే! అంచేత దేవెగౌడ, గుజ్రాల వంటి వారీ స్థానే, తనకి బాగా నమ్మకస్తులైన వారిని తెచ్చుకునేందుకు మధ్యంతర ఎన్నికలకి కొంత మొగ్గాడు.

అయితే, దానికీ మెడమీద కత్తి ఉంది. తమ ఉనికి, తమ గూఢచర్య కార్యకలాపాలు ఎవరికీ తెలియనప్పుడు, ఎన్నికలలో తమకి అనుకూలురుగా పైకి కనబడేవారు ఎంతమంది గెలవాలి, ప్రతికూలంగా కనబడతూ లోలోపల అనుకూలురు ఎంతమంది గెలవాలి, పూర్తిగా ప్రతికూలురు ఎంతమంది గెలవాలి, గట్రా నిష్పత్తులన్నీ పక్కాగా ప్రణాళిక రచించి, నిర్వహించుకోవచ్చు. కుదిరితే ప్రత్యర్ధి గూఢచార సంస్థచేతే గెలిపించుకోవచ్చు. అంటే సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లు!

అదే తమ ప్రత్యర్ధి గూఢచార వ్యవస్థకి కూడా తమ గుట్టుమట్లు తెలిసి ఉంటే, ఇక ఎన్నికలు హోరాహోరీ యుద్దమే! ఎన్నికల ఖర్చుకి కూడా మితి ఉండదు.రిస్క్ కి కొదవా ఉండదు. [గమనించి చూడండి. 1996 నుండి ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది. అలాగే తరువాత ఏర్పడిన ప్రభుత్వాలలో అవినీతి కూడా అంతే భారీ ఎత్తున పెరిగింది. ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థలోని వ్యక్తుల అవినీతి expose అయ్యింది/అవుతోంది.] అది 1992 తర్వాతి తొలిమధ్యంతర ఎన్నిక, 1998 కే నకిలీ కణిక వ్యవస్థకి, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ అర్ధమయ్యింది. ఎందుకంటే అప్పటికి 1996 ఎన్నికల పాఠం ఉంది కదా!

ఇక 1998 లో కూడా, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మళ్ళీ సమీకరణాలు, మారిన మద్దతులు. మళ్ళీ వాజ్ పేయి ప్రధాని. ఈసారి 13 నెలలు! పిదప మళ్ళీ మధ్యంతరాని కెళ్లారు. ఎన్నికల ముగిసి, మరో ప్రభుత్వం ఏర్పడేదాకా, వాజ్ పేయి ప్రభుత్వం కొనసాగింది.

1992 కు ముందర, ఎప్పటికప్పుడు, కేంద్రంలోని ప్రభుత్వాలని పడగొట్టటానికి నకిలీ కణిక వ్యవస్థ పనిచేసేది. నిలబెట్టుకునేందుకు నాటి భారత ప్రభుత్వం, నిఘా సంస్థలూ విన్యాసాలు చేసేవి. ఇందిరాగాంధీ హయాంలో మొదటిదశలో పదేపదే అవిశ్వాస తీర్మానాలని ఎదుర్కొంది. పార్టీ నిట్టనిలువుగా చీలడం ఒకటికి రెండుసార్లు జరిగింది. బ్రహ్మనందరెడ్డి, రెడ్డి కాంగ్రెస్, దేవరాజ్ ఆర్స్ , ఆర్స్ కాంగ్రెస్ గట్రాలుగా విడగొట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కాస్తా ఇందిరాకాంగ్రెస్ గా కొనసాగి, వేరుకుంపట్లు చల్లారి సొంతగూటికి తిరిగొచ్చామన్నాక, మళ్ళీ ఏఐసిసి అవుతూ ఉండేది. పీవీజీ హయాంలోనూ దాదాపు ఆరునెలలకోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నంతగా నడవాల్సి వచ్చింది.

ఆ విధంగా... అప్పట్లో[1992 కు ముందర] ప్రభుత్వాలని పడగొట్టేందుకు నకిలీ కణిక వ్యవస్థ, నిలబెట్టుకునేందుకు భారత నిఘా సంస్థలూ, వాళ్ళ సహకారం కలిగి ఉన్న అప్పటి ప్రభుత్వాలూ పనిచేస్తే... 1996 తర్వాత, ప్రభుత్వాలని నిలబెట్టుకోవటానికి నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులూ, పడగొట్టటానికి నెం.5 వర్గమూ పనిచేసాయి. అప్పటికి దాన్ని నెం.5 వర్గంగా కాకపోయినా, మరో నామాంతరంతో కూడా నకిలీ కణిక వ్యవస్థ గుర్తించలేదు. ఎందుకంటే పీవీజీ పదవి దిగిపోయినా కూడా తమకి ఎదురుదెబ్బలు తగులుతుండటాన్ని గురించిన అయోమయంలోనూ, కారణాల అన్వేషణలోనూ ముమ్మరంగా మునిగి, వాళ్ళ దృష్టి, అప్పటికీ, దేశాన్ని దాటి ప్రపంచం మీదికి పెద్దగా పోలేదు.

పీవీజీ హయాంలో, అమెరికా తదితర దేశాలలో, పరస్పర విరుద్ద గూఢచర్య శిబిరాలకు, పీవీజీ కారణంగా అయిన ’లీకులు’, తెలియ చేయబడిన సమాచారాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, నెలకొల్పుకున్న సంబంధ బాంధావ్యాలు... కారణమేమోనని కొంతా, అంతకంటే ఎక్కువే పీవీజీకి తెలిసిపోయిందేమోనన్న ఆందోళన కొంతా... నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి ఉండింది.

అందుకే, ఈసారి మధ్యంతర ఎన్నికలలో[1999లో] భాజపాకి తగినంత మెజారిటీ తెచ్చుకోవటానికి ఒడ్డి పోరాడారు. ’ఒక్క అవకాశం ఇవ్వమంటూ’ భాజపా ప్రజలకి అప్పీల్ చేసుకుంది. ఈమాటు ఎన్నికలలోనూ డబ్బు విచ్చల విడిగానే పారింది. పైసలు గలగలలాడిన చోట రాజకీయ చర్చలూ వేడివేడిగా జరగటం, పల్లెల దాకా ఓట్ల పండగ సందడి చేయటం’ భారీ స్థాయిలోనే జరిగింది. విపరీతమైన డబ్బు ఖర్చు అభ్యర్ధులకి ప్రాణాంతకమైతే, జనాలలో చాలామందికి కొన్ని నెలలపాటు రోజువారీ ఉపాధి లభించింది. అందునా అంచెలంచెల పోలింగ్ పద్దతి మరి!

1999 ఎన్నికల్లో కూడా, భాజపాకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారిటీ రాలేదు. ఇలాంటి ప్రమాదం ముందుగా ఊహించినందునే - ఎన్నికలకు వెళ్ళేప్పటికే కొన్ని చిన్నపార్టీలతో పొత్తులు కూడా పెట్టుకున్నారు. దాంతో ఇక రంగంలోకి ప్రత్యక్షంగా దిగాడు రామోజీరావు! [ఈ రామోజీరావు తను సామ్యవాదినంటాడు. మతతత్త్వాన్ని వ్యతిరేకిస్తాడు. అద్వానీలాంటి వాళ్ళతో మాత్రం సంబంధాలు కలిగి ఉండటం అప్పుడు expose అయ్యింది.] మతతత్త్వ పార్టీ అయిన భాజపాని అధికారం నుండి దూరంగా ఉంచడానికి ఎర్రపార్టీ వాళ్లతో కలిసి దేవెగౌడల ప్రభుత్వాలకి మద్దతిచ్చిన చంద్రబాబు, కరుణానిధి, ఈసారి మతతత్త్వ భాజపాకి మద్దతిచ్చారు.

"ఇదేమి రాజకీయపుటాట చంద్రబాబూ? సిద్దాంతాలు గట్రా ఏం లేవా?" అంటే ’దేశ భద్రత రీత్యా, పదేపదే ఎన్నికలు నిర్వహించే భారాన్ని ప్రజల మీద పడకుండా చూపేటందుకు తాను భాజపాకు మద్దతిచ్చా’నన్నాడు. కేంద్రంలో ప్రతిపక్షాలు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు కావటం, కేంద్రంలో మిత్రపక్షాలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కావటం లాంటి విచిత్రాలూ, స్నేహ పూర్వక పోటీలంటూ మరికొన్ని నియోజక వర్గాలలో పోటీ పడడం వంటి వైపరీత్యాలతో... మొత్తంగా ఆ పార్టీ ఈపార్టీ అని లేకుండా... అన్నిపార్టీలూ... ’తమకు విలువలు వంటి వేం లేవనీ, అధికారమే పరమావధి’ అని నిరూపించుకున్నాయి. డబ్బు సంపాదన కోసమే అధికారం కావాలని, అందుకు ఏ అవినీతినైనా చేస్తారనీ, ఎంతటి నైచ్యానికైనా దిగజారతారనీ దృష్టాంత సహితంగా నిరూపించుకున్నారు. ఇక ఏ ద్వంద్వపు మాటలూ చెప్పలేనంతగా చేతలలో నిరూపించబడ్డారు.

1999 ఎన్నికలలో.. ఈ రకపు పొత్తులతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. వాజ్ పేయి ప్రధానమంత్రి అద్వానీ గృహమంత్రి. అప్పటికి పీవీజీ ఓడిపోయి దాదాపు మూడేళ్ళయ్యింది.

ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు పరిశీలించాలి. అప్పటికే చాలా రాష్టాలలో [తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లతో సహా] ప్రజలకి, ఎన్నికలలో ఎన్నుకోవడానికి ’రెండు పార్టీలే అందుబాటులో ఉండటం’ అనే స్థితి ఏర్పడింది. అయితే ఈ పార్టీని, లేకపోతే ఆ పార్టీని! అయిదేళ్ళు కాంగ్రెస్ లేదా తెదేపా, DMK లేదా AIDMK లేదా X పార్టీని పదవిలో కూర్చోబెడితే, వాళ్ల అవినీతి అక్రమాలకి విసిగి వేసారిన ప్రజలు, అయిదేళ్ళకు ముందున్న వారి [ఉదాహరణకి Yపార్టీ] అవినీతి అక్రమాలని మరిచిపోయి కొంత, ’వీళ్ళకంటే వాడే నయం. వీడు మరీ బరితెగించాడు’ అనుకుని మరికొంత, మరో ప్రత్యామ్నాయం లేక... తదుపరి ఎన్నికలలో Y ని ఎన్నుకోవాల్సి వచ్చేది.

ఒకసారి తెదేపా, మరోసారి కాంగ్రెస్ లేదా ఒకసారి DMK మరోసారి AIDMK ఇలా...[EVM టాంపరింగ్ వచ్చాక, పరిస్థితి మారిపోయింది లెండి.] దీనికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే పాజిటివ్ కాప్షన్ పెట్టింది నకిలీ కణిక వ్వవస్థ చేతిలోని మీడియా! నిజానికి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, ప్రజలకి ప్రత్యామ్నాయం లేని ఓటు. ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టుకునేందుకు అనుకున్నా, ఎవరికో ఒకరికి ఓటెయ్యాలి కదా అనుకుని Xకో, Yకో వేయటం వంటిది. అందుకే, మాటికొస్తే, ఎర్రపార్టీ నేతలతో కలిసి మీడియా, తృతీయ ఫ్రంట్ అంటూ స్టంటులు చేసేది.

ఇలాంటి నేపధ్యంలో... 1999 ఎన్నికల సమయంలో... భాజపా ఒక్క అవకాశం తమకిమ్మని అడిగినప్పుడు ఆ అవకాశం వారికి ఇవ్వబడింది. [ఆ మాట భాజపా అంతకు ముందు కూడా ఉపయోగించినా స్పందన రాలేదు.] భారతదేశంలో ప్రజలకి... అయితే కాంగ్రెస్ లేదా నేషనల్ ఫ్రంట్ అలియాస్ మరో xyz పార్టీ... అంతేతప్ప మరో గత్యంతరం లేదు. ఇలా ఉన్న అవకాశాల వంటిదే, భారతదేశంలోని హిందువులకి ఉన్నపరిస్థితి! ముస్లింలకి వాళ్లవైన ప్రత్యేక సంస్థలున్నాయి, పార్టీలున్నాయి. బలహీన వర్గాల ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతో, ఇందిరాగాంధీ హయంలోనే కాంగ్రెస్ కూడా ముస్లింలని బాగానే నెత్తుకెత్తుకుంది.

అప్పటికి నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యం తెలియనందునా, పైకారణాలని[over leaf reasons] నమ్మి కొంతా, అనివార్యమై కొంతా, ఆ ప్రవాహంలో పడిపోక తప్పింది కాదు. అప్పట్లో పట్టు నకిలీ కణిక వ్యవస్థదే గనుక, ఇందిరాగాంధీపై ఇలాంటి విషయాల్లో ’కన్నా?కాలా?’ అన్న తంత్రాన్ని బాగా ఉపయోగించగలిగారు. ఇక 1999 నాటికి, సోనియా తన రాజకీయ నట విశ్వరూపాన్ని ఇంకా చూపించలేదు కదా! అప్పుడప్పుడే [అప్పటికి సంవత్సరం క్రితం] ప్రారంభించింది. అదే ఇప్పుడయితే, ఎంతగా... ముస్లింలకి కాదు, సాక్షాత్తూ పాకిస్తాన్ కే ఎంత అనుకూలమో ’కసబ్’ ’అఫ్జల్ గురు’ల కేసుల సాక్షిగా అందరం నోరెళ్ళ బెట్టిచూస్తున్నదే!

ఇంతకీ, 1999 ఎన్నికల నాటికి భారతదేశంలోని హిందువుల పరిస్థితి ఏమిటంటే - ఈ విధంగా ముస్లింలకి వాళ్ళవైన సంస్థలూ, రాజకీయ పక్షాలూ ఉంటే, దళితులకీ వాళ్లవైన కులపార్టీలు, ఎర్రపార్టీల మద్దతు ఉంది. కాబట్టి కూడా, హిందువులు భాజపా వైపు, ఆరెస్సెస్ వైపూ అనుకూలంగా స్పందించారు. ఆరెస్సెస్ కర్రలు పట్టుకుని,నిక్కర్లు ధరించి, క్రమశిక్షణ అంటూ ఊగిపోతే, నిజమనుకుని హిందువులు ఉర్రూతలూగారు.

’మతాన్ని అడ్డుపెట్టుకుని, భాజపా, అయోధ్యలో రామమందిరం పేరిట మారణహోమం నడిపే ఉద్దేశంలో ఉన్నదనీ, మత ఘర్షణలే దాని లక్ష్యం గానీ, మందిర నిర్మాణం కాదని’ చెబితే నమ్మేస్థితిలో కరసేవకులు కాదు గదా సగటు హిందువు కూడా నమ్మేస్థితిలో లేరు. ఎందుకంటే - క్రింది స్థాయిలో ఉన్న భాజపా, ఆరెస్సెస్ కార్యకర్తలు, హిందూమతం పట్ల నిజాయితీ తోనూ, నిబద్దతతోనూ స్పందించారు. [కాకపోతే వాళ్ళెక్కించిన మిధ్యా భావవాదాన్ని, భావజాలాన్ని ఇంకించుకుని భావోద్రేకాలతో ఊగిపోయారు.] కాబట్టే, అద్వానీ ’జై జిన్నా’ అంటే జీర్ణం చేసుకోలేక పోయారు.

కాబట్టి కూడా, ఇదంతా ప్రజలకి నిరూపితం కావాలంటే... భాజపా అగ్రనేతల నిజస్వరూపం బహిర్గతం కావాలంటే... భాజపా పూర్తికాలం అధికారంలో ఉండటం అవసరం. అందుకే 1999 ఎన్నికలలో, నెం.5 వర్గం హోరాహోరీ పోరాడి మరీ స్వచ్ఛందంగా, నింపాదిగా ఓడిపోయింది. భాజపా గెలిచింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యింది. వాజ్ పేయి పూర్తికాలం ప్రధానిగా కొనసాగాడు.

ఇది ఇటువైపు చిత్రం అయితే మరోవైపు...

కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారాం కేసరి వంటి పప్పెట్స్ ని నిలబెట్టి చక్రం తిప్పిన సోనియా, ఇక లాభం లేదని ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. పీవీజీకి తదుపరి ఎన్నికలలో టిక్కెట్టు సైతం నిరాకరించి అత్యంత అవమానకరంగా ఇంటికి పంపించింది. నిజానికి, 1991లోనే, రాజీవ్ బ్రతికుండగానే అప్పటి ఎన్నికలలో పోటీ చేయకుండా, హైదరాబాద్ కి వచ్చేయటానికి తిరుగుప్రయాణంలో ఉన్నప్పుడు పీవీజీకి PM పదవి వచ్చింది. అలాంటి చోట... ప్రధాని పదవి, ఏఐసిసి అధ్యక్షుడి పదవి పోయినప్పుడు తిరుగుప్రయాణం కట్టవచ్చుకదా! కాని, వాళ్ళ చేత గెంటించుకుని మరీ బయటికి వచ్చాడు. ఆ విధంగా, పీవీజీ పట్ల సోనియాకి, కాంగ్రెస్ నాయకులకి ఉన్నగౌరవం ఏపాటిదో ప్రజలకి expose అయ్యింది!

అప్పటికే పీవీజీ మెడకి జె ఎంఎం ముడుపుల కేసు, సెయింట్ కిట్స్ పోర్జరీ కేసు, ఇంకా ఇలాంటి చాలా కేసులు చుట్టబడ్డాయి. ఆయా ఆసైన్ మెంట్లు తమకి వచ్చాయి, నచ్చాయి. తమకి వచ్చిన సమాచారం, దాన్ని విశ్లేషణా కేంద్రాలకి పంపగా వచ్చిన సూచనలు, వాటన్నిటి రీత్యా తామే అంతిమనిర్ణయాధికారంతో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వచ్చిన అసైన్ మెంట్లు!

కాబట్టి... పదవిలో ఉండగా, ’పీవీజీ తన మంత్రివర్గ సహచరుల అవినీతి బండారాలు బయటపడితే సిబిఐ కి అప్పగించటం, కేసులు బయటపెట్టి గుట్టు లాగటం వంటివి చేసినందుకు, వాళ్లంతా పీవీజీపై కక్షగట్టి ఆయనని ఒంటరిని చేసారు’ అన్న పైకారణం[over leaf reason] వాళ్ళకి చాలా పక్కాగా ఉందనిపించింది. నిజంగానే అది పక్కాగా ఉంది కూడా! దాంతో ఆయనని ఒంటరిని చేయటం, ఇంటికి పంపించటం వగైరా అసైన్ మెంట్లు, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదరీ తుల్య సోనియా గట్రాలకి, తమ అరిషడ్వర్గాలరీత్యా కూడా బాగా నచ్చాయి. అన్నీ బాగున్నాయనిపించాయి.

అందునా రామోజీరావు, సోనియాల అరిషడ్వర్గాల గురించి మాకు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసు. 1996 లో మేము, మా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న నంబూరు అనే గ్రామంలో ఉండేవాళ్ళం. అక్కడ 1996 ఏప్రియల్ లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కు, నేను విద్యార్ధులకి కోచింగ్ ఇచ్చాను. 11మందికి శిక్షణ ఇస్తే ఏడుగురికి మంచి బ్రాంచెస్ లో సీట్లు వచ్చాయి. అయితే తదుపరి సంవత్సరం ఆ ఊరికి ఓ ప్రభుత్వ టీచర్ వచ్చాడు. ఫ్రీ కోచింగ్ ఇస్తాను అన్నాడు. దాంతో ఆ సంవత్సరం మాకు విద్యార్ధులెవరూ కోచింగ్ కి రాలేదు.

1996 జూన్ లో పీవీజీ ఓడిపోయాడు. అప్పటికే, మేం "ఏ విషయమూ పట్టించుకోకూడదు. మన బ్రతుకు మనం బ్రతకటమే ధ్యేయం. దేశానికి, ఇతరులకి మేలు చేయకపోయినా కీడు చేయక పోతే చాలు; మేలు చేసినట్లే" అనే నిర్ణయానికి వచ్చేసాము. ఎప్పుడైతే ఫ్యాక్టరీ పోగొట్టుకున్నానో అప్పుడే [1995 అక్టోబరు - నవంబరు] ఇలా నిర్ణయించుకున్నాము. అందుచేత అప్పటి రాజకీయ అంశాలేవీ మేం పట్టించుకోలేదు. మళ్ళీ 2005 లో మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయాన్ని గుర్తించుకున్నాకే అన్నిటినీ తిరిగి విశ్లేషించుకున్నాము.

నంబూరులో ఉండగా...1997 ఫిబ్రవరి - మార్చిలలో మా మీద భౌతిక దాడి జరిగింది. మా వారికి చెయ్యి ఫ్రాక్ఛర్ అయ్యింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాను సరిగా గుర్తులేదు హైదరాబాద్ పోలీస్ అకాడమికి వచ్చిన అద్వానీ అనుకోకుండా(బహుశ అనుకునే ... రామోజీ అహ్వానం మేరకు ) రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాడు ... ఇదంతా విశ్లేషించుకోవడానికే అనుకుంటాను

అజ్ఞాత గారు : రెండు మూడేళ్ళ క్రితమే కాదండి. అంతకు ముందు కూడా ఇలా జరుగుతుండేది. అప్పట్లో పేపర్లలో వార్తలు కూడా వచ్చేవి కావు. అద్వానీ, వీపీ సింగూ, కరుణానిధి లాంటి వాళ్ళు ఈనాడు సోమాజి గూడ కార్యాలయానికి చడీచప్పుడు లేకుండా వచ్చిపోతుండేవాళ్ళని నా మిత్రురాలు చెప్పినప్పుడు నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అదే ఇప్పుడయితే అద్వానీ రామోజీరావుల సంబంధాలు - అద్వానీ ఆత్మకథని రామోజీరావు ఆవిష్కరించడం దాకా అన్నీ బహిరంగం అయ్యాయి కదా!

చో రామస్వామి, ఒక ఇంటెర్వ్యులో నేను రాజీవ్ గాంధిని హెచ్చరించాను వి.పి.సింగ్ తో జాగ్రత్త గా ఉండమని. నీ అధికారానికి ఎదైనా ముప్పు అంటె అది సింగ్ వలననే అని చెప్పాను అతను చాలా అనుమానస్పదుడు, అధికారం దాహం ఎక్కువ అని అతడిరో జాగ్రత్త అని చెప్పాను అని అన్నాడు. అదే నిజమైంది కదా!. ఒక సభలో పి.వి. & వాజ్పాయి కలసి పాల్గొన్నపుడ్డు పి.వి. గారు చిన్న చిత్తు కాగితం మీద న్యూక్లియర్ పరిక్షలు జరపమని రాసి దానిని సభలో వాజ్ పాయి గారి చేతిలో ఎవరికి అనుమానం రాకుండా పెట్టాడని. తరువాత వాజ్ పాయి గారు దానిని చదివి న్యుక్లియర్ పరిక్షలు నిర్వహించారు. ఒక సందర్భం లో వాజ్ పాయి గారు నేను/ నా ప్రభుత్వం నిర్వహించిన ఈ న్యూక్లియర్ పరిక్షల క్రేడిట్ పి.వి. కి చేందుతుందని ఆయనను అభినందించాడు. పి.వి. మీద వాజ్ పాయ్ గారికి ఉన్న కనీస గౌరవం ఆయన పార్టి లో వారికే లేదు కొంతమంది కి ఉన్నా బయటకు చెప్పలేని పరిస్థితి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu