1992 తర్వాత, మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం ప్రారంభమయ్యాక, అన్నిచోట్ల, అన్ని విషయాల్లో ఓటమినే చవిచూశాను.

సాధారణంగా ఏ మనిషి జీవితంలోనైనా, ఏ ప్రయత్నాలలోనైనా గెలుపోటములు 50:50 ఉంటాయి. నా జీవితంలో 1992 కు ముందర అది 70:30 ఉండేది. అంటే నూరు ప్రయత్నాలు చేస్తే అందులో 70 గెలుపులు సాధించేదాన్ని. అదే 1992 లో పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు చేశాక, ఆ నిష్పత్తి 0:100 అయిపోయింది. నూరు ప్రయత్నాలు చేస్తే నూరింటిలోనూ ఓటమే పొందడం!

సంభావ్యతా సిద్దాంతం [Theory of Probability] ప్రకారమైనా, నూటికి నూరు శాతం సంభావ్యత ఉన్నప్పుడు దాన్ని అనిశ్చిత ఘటన [Random event] అనరు. నిర్దిష్ట ఘటన [Definite event] అంటారు.

ఇదే విషయాన్ని నా గతటపాలలోనూ, ప్రధాని మన్మోహన్ సింగూ, రాష్ట్రపతి కలాం, సోనియాలకు ఇచ్చిన ఫిర్యాదులలోనూ కూడా వివరించాను.

ఇక మా జీవితాలలో ఈ ఓటమి స్ట్రాటజీ, మా ప్రమేయం లేకుండానే ఎలా అమలు చేయబడిందీ అంటే - ఎప్పటి కప్పుడు, ఎక్కడక్కడ ఓటమి పొంది ఊరు వదిలి పోవటమే!

పారిశ్రామిక వేత్తగా 1988 లో స్థాపించిన, బ్యాటరీ తయారీ సంస్థని నష్టపోయి, 1995 చివరిలో, ఫ్యాక్టరీ ఖాళీ చేసి, నంబూరు పల్లెలో నివాసం మొదలు పెట్టాము. 1½ సంవత్సరాల తర్వాత, భౌతిక దాడికి గురయ్యి, అక్కడి నుండి గుంటూరు వికాస్ కాలేజీలో లెక్చరర్ గా చేరి, నివాసం గుంటూరుకు మార్చాము. అక్కడి నుండి ఎక్సెల్ కి మారాను. అక్కడి డైరెక్టర్లకు నేను పూర్వ విద్యార్థిని. ఫీజిక్సు చలపతిరావు గారి శిష్యురాలిని. ఎంసెట్ గ్రంధ రచయితగా, గుంటూరు విద్యాకేంద్రంగా భాసిల్లడానికి బాటలు వేసిన త్రిమూర్తులు [మాధ్స్ - సోమయాజులు గారు, ఫీజిక్స్ - చలపతి రావు గారు, కెమిస్ట్రీ - ముజీర్ గారులు] లో ఒకరిగా, అప్పటికే దాదాపు ఐదు దశాబ్దాల బోధనా కెరీర్ గలిగిన చలపతిరావు గారికి, sub hand గా పనిచేసే అవకాశం దొరకగానే సంతోషంగా ఎక్సెల్ లో చేరిపోయాను. అయితే అక్కడ డైరెక్టర్ల అంతర్గత విభేదాలు అనే పైకారణంతో ఒక్క సంవత్సరం లోనే అక్కడ నా కెరీర్ ముగిసి పోయింది. మంచి లెక్చరర్ గా పేరు లేదా అంటే ఉంది. అయినా గుంటూరు మాత్రం నాకు space run out అయిపోయింది.

ఆ సమయంలో, సూర్యాపేటలోని కాలేజీలో ఆఫర్ రావటంతో గుంటూరు నుండి సూర్యాపేటకు మకాం మార్చాము. గుంటూరు కార్పోరేట్ కాలేజీలలో లెక్చరర్స్ గా మేము ఏదో ఒక బ్రాంచి డీల్ చేస్తాము. నేను మెకానిక్స్ చెప్పేదాన్ని. ఇంటి దగ్గర నలుగురైదుగురు పిల్లలకి ఎంసెట్ లో ఎలక్ట్రిసిటి, వేవ్ నేచర్ గట్రాలతో మొత్తం సిలబస్ చెప్పేదాన్ని. అయితే కాలేజీల్లో కేవలం ఒకే బ్రాంచి చెప్పడం వల్ల కొన్నేళ్ళకు మిగిలిన అంశాలలో handicap అయిపోతామనే ఆందోళన లెక్చరర్స్ లో ఉండేది.

ఆ చర్చల ప్రభావంతో కూడా, గుంటూరులో అవకాశాలు మూసుకుపోయి, సూర్యాపేటలోని చిన్న కాలేజీలో మొత్తం Physics [Inter + Eamcet] ని సింగిల్ హాండ్ తో డీల్ చేసే అవకాశం కనిపించడంతో, ముందడుగు వేశాము. జరుగుతున్నవన్నీ ’విధివ్రాత’ అనుకునే దశలో ఉండటం వల్ల, అందులో ఏమాత్రం గూఢచర్యాన్ని గుర్తించలేదు. అన్నితలుపులు మూసి ఉంచిన గదిలోని పాము, ఎటు తలుపు తెరిచి ఉంటే అందులోంచే బయటకు రావలసినట్లుగా, తాము గురి పెట్టుకున్న వ్యక్తులపై గూఢచర్యం పనిచేస్తుందన్న ఊహ కూడా అప్పట్లో మాకు లేదు.

కాబట్టే - ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళు ఆడుతున్న ఆటలో ’మేము పావులం’ అని వ్రాసాను గతటపాలలో! కాకపోతే, మా చేతిలో మాత్రం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అదేమిటంటే - ’ఎటు వైపు మొగ్గటమా?’ అన్నది. ఏ దశలోనైనా... పరిస్థితులతో రాజీపడటం లేదా పరిస్థితులకి ఎదురు తిరగటం అనే అవకాశం ఎప్పుడూ మా చేతిలోనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం.

ఉద్యోగాలు పదేపదే ఏదో ఒక పైకారణంతో ఊడిపోయేవి. అలాగని సొంత వెంచర్ పెట్టుకుంటే, అది మూతపడేదాకా అక్కడి స్థానిక పరిస్థితులు ఉండేవి. మళ్ళీ ఉద్యోగప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. తరువాత కాలేజీ పెట్టే అవకాశం వచ్చింది. కాని అక్కడా ర్యాంకుల అక్రమాలు సహిస్తేనే అన్నది షరతు అయ్యింది. దాన్ని వదులు కున్నాము. ఆ విధంగా ఎప్పుడూ అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం!

అయితే అదృష్టవశాత్తూ అనండి, భగవంతుడి కరుణ అనండి, గూఢచర్యం గురించి ఊహ కూడా లేని రోజుల్లోనైనా, ఇప్పుడైనా, మా మార్గదర్శి భగవద్గీతే! గీతా శ్లోకాల సహాయంతో ఎప్పటికప్పుడు ’ఎటు వైపు నిర్ణయించుకోవాలా?’ అన్నదే తర్కించుకునే వాళ్ళం. జన్మతః వచ్చిన బుద్దీ, తల్లిదండ్రులూ గురువులూ నేర్పిన సంస్కారం మమ్మల్ని ధర్మమార్గం తప్పనివ్వలేదు. ఫలితంగా పరిస్థితులు విషమించటం, మేం ఊరు ఖాళీ చేయాల్సి రావటం.... అలా సాగిపోయాయి.

సూర్యాపేటలో నుండి ఇల్లూ వాకిలీ ఊడగొట్టి మరీ తరిమి వేయబడ్డాము. అవన్నీ మీరు ’పీవీజీ - రామోజీరావు - మా కథలో’ చదివినదే! సూర్యాపేట నుండి మిత్రుల ఇళ్ళలో కొన్నాళ్ళు తలదాచుకుని చివరికి హైదరాబాదులో కొన్ని నెలలు నివసించాము. మళ్ళీ శ్రీశైలం! అక్కడి నుండీ నివాస గది రద్దు చేయబడి, నడుపుతున్న చిన్నస్కూలు వదులుకుని నంద్యాల చేరాము.

ఎప్పటికప్పుడు, ఎక్కడకక్కడ, ఇలా ఓటమితో ఊరు వదిలి రావటం.... మా జీవితంలో పరిపాటి అయిపోయింది. ఎక్కడి కక్కడ, ఎవరు పడితే వాళ్ళు "ఏదో ఒక ఊరులో సెటిల్ అవ్వచ్చు కదా?" అనేవాళ్ళు! ఊళ్ళు తిరగటం మాకైనా సరదానా! ఇది తలుచుకు ఆలోచిస్తున్నప్పుడు, మాకు గీతాశ్లోకాలు

శ్లోకం:
సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో
శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః

శ్లోకం:
తుల్య నిందాస్తుతి ర్మౌనీ సంతుష్ణో యేన కేనచిత్
అనికేతః స్థిరమతి : భక్తిమాన్ మే ప్రియో నరః

భావం:
శత్రుమిత్రుల గురించి సమదృష్టిగలవాడు - మానావమాన, శీతోష్ణ, సుఖదుఃఖాదులందు సముడూ - వాంఛారహితుడూ - దొరికిన దానితో తృప్తిజెందేవాడు - మౌనియై, స్థిర నివాసం లేక, సుస్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు.

తోడుగా నిలిచి స్ఫూర్తి నింపేవి.

"అస్థిర నివాసులం అయితే అయ్యాము గాక, స్థిరబుద్ది లేనివాళ్ళం కాలేదు. అంతే చాలు" అనుకునే వాళ్ళం!

అయితే.... ఈ ఓటమి క్రమంలో పారిశ్రామిక వేత్త స్థాయి నుండి ఎంసెట్ లెక్చరర్ స్థాయికి, అక్కడి నుండి స్కూలు టీచరు స్థాయికి పడిపోయాను. ఇదే విషయం ప్రస్తావిస్తూ ప్రధానికీ, సోనియాకీ, రాష్ట్రపతికీ, రాష్ట్ర అప్పటి సీఎం వై.యస్.కి పంపిన చివరి ఫిర్యాదులలో "ఒకవేళ ప్రభుత్వం గనక LKG, UKG పిల్లలకి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తే, మేము వాళ్ళకి చదువు చెప్పేందుకు కూడా పనికి రాము అంటారేమో" నని వ్రాసాము.

సూర్యాపేటలో ఉండగా, విద్యార్ధులకి ఐఐటీ బేసిక్స్, ఇంటర్ పీజిక్స్, బోధించేదాన్ని. ఎంసెట్ కు శిక్షణ నిచ్చేదాన్ని. అప్పుడు ప్రారంభమైంది ఎంసెట్ ర్యాంకుల అవకతవకలు, ఇంటర్ మార్కుల అక్రమాలపై ఫిర్యాదుల పర్వం! పర్వవసానంగా, సూర్యాపేటలో, పూర్తిగా అప్రకటిత సాంఘీక బహిష్కరణని ఎదుర్కొన్నాము. వ్యవస్థీకృత వేధింపుని ఎదుర్కొన్నాము. నీళ్ళు కరెంట్ సరఫరాలని నిలిపి వేయటం, పాలవాణ్ణి సైతం రానివ్వక పోవటం, బూతులు తిట్టడం, ఇంటికి తాళాలు వేయటం..... ఒకటా రెండా! వీలయిన అన్ని మార్గాల్లో వేధించారు. రాబడికి గండికొట్టటం, ఖర్చులు పెరిగేలా చేయటం! ఊరు మారినా తీరని వేధింపు!

అప్పట్లో మా జీవితాల్లో రామోజీరావు ఉనికిని మేము గ్రహించుకోలేదు. విధివ్రాత అనుకుంటూ, ఎదురుగా పైకారణంగా[over leaf reasons] కన్పించేవాటిని, వారిని పరిశీలించటం, ఫిర్యాదులలో ఉటంకించటం చేసాము. సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ’సిండికేట్’ అయ్యి మమ్మల్ని వేధిస్తున్నారనుకున్నాము. దానికి స్థానిక రాజకీయ కారణాలు జతయ్యాయనుకున్నాము. అదే మా ఫిర్యాదులలో వ్రాసాము.

అప్పటికి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రముఖ్యమంత్రి. కేంద్రంలో అద్వానీ అద్వర్యంలో వాజ్ పేయి ప్రధానిగా, ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు చక్రం తిప్పగా, ఈనాడు రామోజీరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దాడన్న విషయం అందరికీ తెలిసిందే!

ఈ నేపధ్యంలో.... మేం రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబుకి పంపిన ఫిర్యాదులలో ఎక్కడా రామోజీరావు ప్రసక్తే లేదు. అతణ్ణి నిందితుడిగా పేర్కొంటూ ఫిర్యాదులిస్తే.... తమవాడి మీద ఫిర్యాదు ఇచ్చినందుకు వేధించారన వచ్చు. అంతేకాదు, తమ వాడి మీద ఫిర్యాదు ఇచ్చినందుకే స్పందించలేదన వచ్చు. ఎందుకంటే చంద్రబాబుకి అప్పట్లో రామోజీరావు అండదండలు ఎక్కువగా ఉండటం, అసలు తెదేపా ఆవిర్భావమే ఈనాడు భుజస్కంధాల మీద నడవటం అందరికీ తెలిసిందే కాబట్టి.

ఈ ఫిర్యాదుల ప్రకరణం, ఎంసెట్ 2000 ర్యాంకుల అవకతవకల తో ప్రారంభమై, వ్యవస్థీకృత వేధింపుపై వరసగా, 2001 లో స్వయంగా చంద్రబాబుని సెక్రెటేరియట్ లో కలిసి ఫిర్యాదు ఇవ్వటం వరకూ కొనసాగింది. అదే చివరి ఫిర్యాదు. ఇంటి నుండి గెంటి వేయబడి, చేతిలో డబ్బూ, నిలువ నీడా లేక దాదాపుగా నడిరోడ్డు మీద నిలబడిన స్థితిలో ఇచ్చాము.

ఆ నాటి అతడి వింత ప్రవర్తన గురించి గతటపాలలో వ్రాసాను. కోపంతో జేవురించిన ముఖంతో "ఎందుకు? ఎందుకు వేధిస్తున్నారు?" అంటూ ఎదురు నాపైనే మండిపడటంతో అయోమయానికి గురయ్యాను. ఆ తర్వాత న్యాయం జరుగుతుందన్న ఆశ వదిలేసుకున్నాము.

ఆ తర్వాత, 2004 లో వై.యస్. ప్రభుత్వం వచ్చింది. అప్పటికి మేం శ్రీశైలంలో చిన్నస్కూలు పెట్టుకుని సంవత్సరం అయ్యింది. మా విద్యార్ధి ఒకరికి 7 వ తరగతి ప్రైవేటుగా వ్రాయించగా మళ్ళీ అదే ఫలితం! చెప్పుకోదగినంతగా ప్రతిభగల విద్యార్ధి, తీవ్రకృషి చేసి, చక్కగా వ్రాసిన పరీక్షలు... అత్తెసరు మార్కులు! పరీక్షా కేంద్రం వారి, పోటీ స్కూళ్ళ వారి అనుమానాస్పద ప్రవర్తనా సరళి!

అప్పుడూ హైదరాబాద్ వెళ్ళి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సీఎంగా ఉన్న వైయస్ ని వ్యక్తిగతంగా కలిసి, ఎంసెట్ వ్వవహారం దగ్గరి నుండి మా ఫిర్యాదుల గురించి, మాపై జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపు గురించి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాము. క్రిక్కిరిసిన పత్రికా విలేఖరులందరూ మౌనంగా చూస్తుండగా, ఇదంతా మౌఖికంగా వివరిస్తూ మరీ ఫిర్యాదు పత్రం ఇచ్చాము. అప్పటికీ రామోజీరావు గురించిన ప్రస్తావన మా ఫిర్యాదులలో లేదు. ఎందుకంటే అప్పటికీ అతడి ప్రమేయాన్ని మేం గుర్తించలేదు.

అయితే - 2005 లో మా మీద, సునిశితమైన, నిగూఢమైన తంత్రాలు ప్రయోగింపబడటం, వేధింపులో పరాకాష్టలని చవిచూడటంతో, అప్పటి వరకూ నడిచిన అన్ని సంఘటనలని పునః పరిశీలించుకున్నాము. ’నల్లమేక - నలుగురు దొంగలు’ కథలో ముసలి వాడి చేతిలోని మేకని నలుగురు దొంగలు తన్ని లాక్కుంటే... అది నేరం. అతడంతట అతడే వదిలేసుకునేటట్లు చేస్తే.... అది గూఢచర్యం. వ్యక్తిని హత్య చేస్తే అది నేరం. ఆత్మహత్యకు పురికొల్పితే.... అది నిగూఢం.

పునః పరిశీలన, పునరాలోచనలతో, మా జీవితాలలో ఈ రకపు గూఢచర్యపు ప్రమేయం అర్ధమయ్యింది. 2005 అక్టోబరులో ఢిల్లీ వెళ్ళి, స్వయంగా ప్రధాని కార్యాలయంలో, వీటన్నిటి గురించిన ఫిర్యాదు దాఖలు చేసాము. 1992 లో పీవీజీకి రామోజీరావు మీద ఫిర్యాదు, దరిమిలా 2005 వరకూ మా జీవితాల్లో జరిగిన వ్యవహారాలని, తదనుగుణమైన దేశకాల పరిస్థితులని, మా కోణంలో వివరిస్తూ క్లుప్తంగా వ్రాసాము. అప్పటికి మాకు ఏదేమిటో, ఎవరేమిటో అంతగా తెలియదు. ఆ ఫిర్యాదు లేఖలోని సబ్జెక్ట్ , రిఫరెన్సులలో రామోజీరావు, చంద్రబాబు నాయుడులతో పాటు, పీవీజీ పేరు కూడా వ్రాసాము.

ఇదంతా పీవీజీ బ్రతికి ఉండగా మేం గమనించుకోలేదనీ, గమనించుకొని ఉంటే ఆయన్నే కలిసి ప్రశ్నించి ఉండేవాళ్ళమనీ స్పష్టంగా వ్రాసాము. ఆ ఫిర్యాదు అసలు ప్రతిని Coups on World లోని స్కాన్డ్ కాపీస్ లో కూడా ఉంచాము.

అప్పటి నుండి, మరింత పకడ్బందీగా, వేధింఫు తీవ్రం అయ్యింది. కాకపోతే ఈ సారి ’తీరు’ మారింది. ఆయా సంఘటనల వివరాలనీ నా ఆంగ్ల బ్లాగు Coups on World లోని Events List లోనూ, Documentary evedence లోనూ పొందుపరిచాను. మా కథలోనూ వివరించాను. 2005 అక్టోబరులో ప్రారంభమైన రెండోసారి ఫిర్యాదుల పర్వం 2007 సంవత్సరాంతం వరకూ కొనసాగింది.

ఈ వరుస ఫిర్యాదులలో, మేము ప్రతి దానిలోనూ, మా జీవితాల్లో రామోజీరావు గూఢచర్యం తాలూకూ అస్తిత్వాన్ని సంఘటనాత్మకంగా, పత్రాల సహితంగా కొనసాగించాము. సీబిసిఐడీ ఐజీ కృష్ణరాజ్ నుండి ఫోన్, వ్యక్తిగత సందర్శన, శ్రీశైలం సీఐ ఎస్ ఐ ల ’విచారణ - స్టేట్ మెంట్ల సంగ్రహణ’ ల సాక్షిగా, ఎప్పటికప్పుడు, అడ్మినిస్ట్రేషన్ పరంగా.... దృష్టాంతసహితంగా.... పత్రాల సాక్షిగా... ఫిర్యాదులు కొనసాగించాము. సంపూర్ణంగా, రామోజీరావు ప్రమేయాన్ని నిరూపించాము.

దాదాపు 60 కి పైగా గల ఈ ఫిర్యాదులలో రామోజీరావు ప్రధాన సబ్జెక్టు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి. స్వయంగా అతడే కోర్టులకి లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించి మరీ ప్రకటించుకున్న కాంగ్రెస్ వ్యతిరేకి. అయినా యూపీఏ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమాత్రం అతడిపై మా ఫిర్యాదులకి స్పందించలేదు.

ఎన్డీయే ప్రభుత్వానికి, అందులో భాగస్వామి అయిన తెదేపా చంద్రబాబుకీ రామోజీరావు ప్రియమైన వాడు. ’అతడి మీద ఫిర్యాదు చేస్తే తొక్కిపెట్టారనుకోవచ్చు!’ అనే మాటకు ఆస్కారం లేదు. ఎందుకంటే - ఎన్డీయేకి, తెదేపాకి ఫిర్యాదు, చేసేటప్పుటికి మా ఫిర్యాదులలో రామోజీరావు నమోదై లేడు. [off అయి ఉన్నాడు.] అయినా ఎన్డీయే, తెదేపా మా ఫిర్యాదులకి స్పందించలేదు. పైగా వేధింపుని కొనసాగనిచ్చింది.

యూపీఏ ప్రభుత్వానికి, అందులో భాగస్వామి అయిన కాంగ్రెస్ కి, రామోజీరావు వ్యతిరేకి. అతడి మీద ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోవచ్చు. అంతేగాక, యూపీఏ కి, కాంగ్రెస్ కి చేసిన ఫిర్యాదులలో పూర్తిగా రామోజీరావు ప్రమేయాన్ని ఉటంకించాము, సాక్ష్యాధార పత్రాలన్నీ ఇచ్చాము కూడా! ఆ రకంగా మా ఫిర్యాదులో రామోజీరావు నమోదై ఉన్నాడు. [on లో ఉన్నాడు.] అయినా యూపీఏ, కాంగ్రెస్, మా ఫిర్యాదులకి స్పందించలేదు. పైగా వేధింపుని కొనసాగనిచ్చింది.

రామోజీరావు ఊసు ఎత్తకపోతే, ఫిర్యాదుకి స్పందించకుండా ’రెడ్ టేపిజం’ అన్నారు. రామోజీరావు ఊసెత్తితే.... నాకు పిచ్చనీ, భ్రమతో [హెలూసినేషన్] అందరితో తగవులు పెట్టుకుంటాననీ మా చెవులకి చేరేటట్లు చూసే వారు. అది కూడా మాటలలోనే సుమా! మా కేసు ఎంతవరకు వచ్చిందని మేం అడిగితే మాత్రం ఎంక్వయిరీ చేస్తున్నామన్న సమాధానం వచ్చేది.

15 సంవత్సరాల క్రితం, ఫ్యాక్టరీ పోగొట్టుకున్నందున, ఆ పర్వెర్షన్ తో, హెలూసినేషన్ తో రామోజీరావుని క్లెయిమ్ చేస్తున్నానట. ఈ విషయమై ’వార్త’ పత్రిక ఉపసంపాదకుడు, ఓ అడుగు ముందుకు వేసి, మాకు ఓ గంట పాటు మెదడు కడుగుడు [Brain wash] కార్యక్రమం కూడా చేపట్టాడు. దానికి మా వారు "తనకైతే ఫ్యాక్టరీ పోగొట్టుకోవటం. మరి నాకు అలాంటిదేం లేవుగా? నాకూ జరుగుతున్న సంఘటనలు యదార్ధంగానే కన్పిస్తున్నాయిగా?" అని అడిగితే సంభాషణ దొర్లించేసాడు. పైగా ఈ భ్రమతో, తప్పుడు దృక్పధంతో [wrong attitude] నేను నా జీవితాన్నే గాక నా భర్త, నా కుమార్తెల జీవితాన్ని కూడా నాశనం చేసేస్తున్నానని హితవు చెప్పాడు. ’అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం, వేధింపుకి ఎదురు తిరుగుతూ ఫిర్యాదు చేయటం wrong attitude అన్నమాట’ అనుకున్నాము.

చిత్రంగా.... అంతకు ముందురోజు CBCID, IG, కృష్ణరాజ్ కూడా అదేమాట అనటం! మేమతణ్ణి అతడి కార్యాలయంలో సందర్శించినప్పుడు "మీరు collective News వ్రాసి complaints ఇస్తున్నారు" అన్నాడు. దేశరాజకీయాల సంగతి దేముడెరుగు, అప్పటి మా ఫిర్యాదులలో ఉన్నది మా జీవితాల్లోని వ్యవస్థీకృత వేధింపు గురించే. అందులో collective News ఏముంటుంది, facts తప్ప? అదీ... ఆయా సమయాల్లో.... పోలీసుల సాక్షిగా.... ఇరుగుపొరుగుల సాక్షిగా... ఫోన్ బెదిరింపుల సాక్షిగా.... నమోదైన ఫిర్యాదులు!

అయితే అతడు మా వాదన ఏం పట్టించుకోకుండా, మేము దాఖలు చేస్తున్న సాక్ష్యాధార పత్రాల్ని పరిశీలించకుండా...."మీరీ రకపు attitude తో ప్రపంచపు నలుమూలకు, ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యకు పరిష్కారం రాదు. మీరు మీ wrong attitude తో మీ జీవితమే గాక, మీ వారి, మీ పాపల జీవితాలనీ కూడా నాశనం చేస్తున్నారు!" అంటూ ధృఢ స్వరంతో చెప్పాడు.

అచ్చంగా.... పెరటిలో ఎప్పుడో వేసిన విత్తనం.... రోజుల తరబడి అలా పడి ఉన్నా.... ఎప్పుడో.... వర్షం, తేమ, ఎండా వెలుతురు సరిపోయిన స్థితిలో మొలకెత్తినట్లు.... బుర్రలో ఓ ’ఆలోచన’ని నాటితే, అప్పటికి పనిచేయకపోయినా... ఎప్పుడో నిరాశా నిస్పృహలు అవరించినప్పుడో, ఓటమి మరింతగా ఓపికని నశింప చేసినప్పుడో.... ఆలోచన మొక్కై, చెట్టై, పెనువృక్షం గాక పోతుందా? ప్రభావం చూపకపోతుందా? - ఇదీ అప్పుడు నడిపింపబడిన మానసిక తంత్రం!

అందుకే, వరుసగా... ఒకరిద్దరు[గతంలో చాలామంది] పదేపదే అదే చెప్పారు. ఇంతగా.... ప్రతిదశలో ఓడిపోతూ, ఊరు ఖాళీ చేసి వలసలు పోతూ.... ఇన్నేళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే మా కేసులో రామోజీరావు [on & off లతో] ప్రమేయం, అతణ్ణి రక్షిస్తూ తెదేపా, కాంగ్రెస్ లు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు పూర్తిగా నిరూపించబడ్డారు. ’ఓటమే స్ట్రాటజీ’గా నడిచిన ఈ అంశంలో, మా ప్రమేయం లేకుండానే ఇదంతా నిరూపించబడింది. మా ప్రమేయం ఏమైనా ఉంది అంటే, అది... ఎప్పటికీ సత్యాన్ని, ధర్మాన్ని వదలక పోవటమే!

ఈ నేపధ్యంలోనే - మాకు రామోజీరావు మాతో మాట్లాడే భాష అర్ధమైంది. ఆ ’కీ’తో ఓపెన్ చేస్తే, అతడి ఈనాడు పత్రిక, మాకు మరిన్ని వివరాలు చెప్పింది. ఆ నేపధ్యంలో రామోజీరావుకి ప్రత్యర్ధిగా మరో వర్గం పనిచేస్తుండటమూ అర్ధమైంది. దానికే నెం.5 వర్గంగా పేరుపెట్టాము. రామోజీరావు వర్గానికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అని పేరు పెట్టాము. ఈ రెండు వర్గాలకీ మధ్య నడిచే పోరాటమూ, భాషా కూడా మాకు స్పష్టంగానే అర్ధమయ్యాయి, అవుతూనే ఉన్నాయి.

వివరంగా చెబుతాను. ఆ ’కీ’తో తెరిస్తే.... మీకూ స్పష్టంగానే అర్ధమౌతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

One thing for sure - you people are very strong mentally! You never gave up.

Check this news.
http://news.bbc.co.uk/2/hi/middle_east/8533952.stm

మీకు న్యాయ౦ జరగాలని ఆశిస్తూ....ధర్మో రక్షతి రక్షితహ..

amazing.....

మలక్ పేట రౌడి గారు, రాజ్ గారు : ధర్మం మనకి తోడుగా ఉన్నంతకాలం మనం ఓడిఫోమండి. :)

అజ్ఞాతల గార్లు : నెనర్లు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu