ఏవిషయంలోనైనా ప్రజలని చైతన్యపరిచే ప్రయత్నంగానీ, జరుగుతున్న వ్యవహారాలపై ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నంగానీ మీడియా చేయదు. పైగా నిజం నిగ్గు తేల్చేందుకు ఎవరైనా ప్రయత్నించినా.... చర్చలనీ, తార్కిక వాదానలనీ ఎలా ప్రక్కదారి పట్టిస్తుందో చూడండి.

ఇలాంటి ప్రక్కదారి విన్యాసాలని టీవీ సమీక్షల్లోనూ, పత్రికల్లో వార్తల ఫాలోయింగ్ వ్రాసేటప్పుడూ మాత్రమే కాదు, మా జీవితంలోనూ ప్రత్యక్షంగా పరిశీలించాము. మీరూ గమనించండి!

ఉదాహరణకి.... మనం ఓ విషయం గురించి, తీవ్రంగా చర్చిస్తున్నామనుకొండి. తార్కికంగా, నిజమేమిటో వెలికి తీసేందుకు, విశ్లేషణాత్మకంగా చర్చిస్తున్నాం. నిజం బయటపడకుండా నిరోధించేందుకు, దాన్ని ప్రక్కదారి పట్టించేందుకు సదరు బృందం ఎన్ని విన్యాసాలు చేస్తుందంటే -

1]. అసత్యం పట్టుబడి, సత్యం బయటపడే పరిస్థితి వచ్చిందనుకొండి! అప్పడిక మనం చర్చిస్తున్న అసలు విషయం వదిలేసి మరేదో మాట్లాడుతూ విషయాన్ని దొర్లిస్తారు. బృంద సభ్యులంతా కలిసి ’కోరస్’గా అరుస్తూ మరీ దొర్లిస్తారు. [దీనిని మీడియా మరింత భారీ పరిమాణంలో చేస్తుంది.]

2]. లేదా, అక్కడికి ఆ విషయాన్ని కట్ చేసి, పొంతన లేకుండా మాట్లాడతారు.

3]. లేదా, అందరూ గొంతు కలిపి గోలగోలగా అరిచేస్తారు. "అంతా గందర గోళం అయిపోయింది. మళ్ళీ మొదటి కొద్దాం" అంటారు.

4]. మనం A నుండి E దాకా మాట్లాడామనుకొండి. A,B,C వంటి కీలక విషయాలకి D,Eలు సమర్ధనాంశాలనుకొండి. కీలకాంశాలని వదిలేసి, వాటిని వివరించడానికి సమర్ధన గానో, పోలిక గానో, ఉదాహరణ గానో తీసుకున్న D,E ల వంటి చొప్పదంటు అంశాల ప్రశ్నలని తీసుకుని, చర్చని ప్రక్కదారి పట్టించటమే గాక, మనల్ని, చూసేవారినీ కూడా, అసహనానికి గురి చేస్తారు.

[చొప్పదంటు ప్రశ్న అంటే - గురువు గారు పాఠం చెప్పి, ఏవైనా సందేహాలుంటే ప్రశ్నలడగ మన్నారట. గురువు పాఠం చెబుతున్నంత సేపూ అది వినకుండా, ప్రక్కనే ఉన్న పశువుల శాలలో, దూడ గడ్డి మేయటం చూసిన విద్యార్ధి ఒకడు "మాష్టారండి! అంత పొడవాటి చొప్పదంటు, దూడ కడుపులో ఎలా పట్టిందండి?" అన్నాడట - అదీ!]

5]. మనం చెప్పని విషయాన్ని, వాదనలో వాళ్ళే చొప్పించి [సాంబారులో తామే బొద్దింక వేసి హోటల్ యజమానితో దెబ్బలాడే రేలంగిలా, హిందుమతంలో చొప్పించిన ప్రక్షిప్తాల వంటివి], చర్చనంతా దాని మీదికి మళ్ళిస్తారు. ఇలా హైజాక్ [హైసరబజ్జా] చేయటంతో అసలు చర్చా, అందులో నిజం, ఎప్పట్లానే కప్పెట్ట బడతాయి.

6]. వాదనలో, ప్రధానంగా మనతో వాదించిన వ్యక్తి ఓడిపోయి, నిజం ఒప్పుకోవాల్సిన స్థితి వచ్చిందనుకొండి. వెంటనే మరొకడు, మిగిలిన వాళ్ళతో కలిసి కమ్ము కొస్తాడు. పెద్ద గొంతుకతో అందరూ కలిసి అరిచి, చర్చని దారి మళ్ళిస్తాడు.

7]. లేదా మరో సంచలనం ఏదో లేవదీసి విషయాన్నంతా పూర్వపక్షం చేస్తారు. ఓటుకు నోటు నుండి, విషయం దారి మళ్ళించడానికి వరుస బాంబు పేలుళ్ళు జరిగినట్లన్న మాట.

8]. ఇలా నానారకాలుగా చర్చని ప్రక్కదారి పట్టించి, మధ్యలో కలిపిన సంచలనాలు, మిర్చి మసాలాలతో, మొదట మనం ఇచ్చిన స్టేట్ మెంట్ కి విరుద్దమైన స్టేట్ మెంట్ దగ్గరికి మనల్ని తీసుకొస్తారు. "చూశావా? పరస్పర విరుద్దమైన స్టేట్ మెంట్లు ఇచ్చావు. కాబట్టి నీ వాదన తప్పు" అనటానికి ఆ బృందంలో మరొకడు సర్వదా సిద్దంగా ఉంటాడు. ఇలాంటి వాడి పని ఇది ఒక్కటే! చర్చలో వాడే మాత్రం పాలుపంచుకోడు. ఏకాగ్రంగా.... ఇలాంటి క్షణం కోసమే కాచుకుని ఉంటాడు. మన ఏకాగ్రతని మాత్రం, బృందంలోని మిగిలిన సభ్యులు, సంచలనాలతో, చొప్పదంటు ప్రశ్నలు గట్రాలతో, నిరంతరం భగ్నం చేస్తూనే ఉంటారు.

ఇది ఎలాంటి దంటే - ఒక ఊళ్ళో మనం "ఫలానా చౌదరి గారి ఇల్లు ఏది?" అని ఒకరిని అడిగామనుకొండి. ‘వేప చెట్టు వీధిలో’ అని జవాబిచ్చారనుకొండి. ఈ సారి "వేప చెట్టు వీధి ఎక్కడ?" అంటాం. ‘పోస్టాఫీసు ఎదురు సందులో’ అంటారు. "పోస్టాఫీసు ఎక్కడా?" అంటాం. ‘గిలకల బావి ప్రక్కన’ అంటారు. "గిలకల బావి..... చిలకల చెఱువు...." ఇలా పోయి పోయి చివరికి, చౌదరి గారిల్లు ఉత్తరాన ఉంటే, మనం ఎక్కడో దక్షిణాన, సరిగ్గా వ్యతిరేక దిశలో తేలతాం.

అదే, ముందు నుండి ప్రతీ ఒక్కళ్ళనీ "చౌదరి గారిల్లు ఎక్కడ?" అనే అడిగామనుకొండి. ఇంతకంటే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేరాల్సిన చోటుకే సరిగ్గా చేరాతాం. ఏ పనినైనా విడిచిపెట్టకుండా ఏకాగ్రంగా చేస్తే ఇంతే! అయితే మన ఏకాగ్రత మీదే దృష్టి కేంద్రికరించి, భగ్నం చేయటమే లక్ష్యంగా పనిచేస్తే....? నిజం నిగ్గు తేల్చుకునే చర్చల్లో, ఇది కూడా నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే వ్యూహమే!

9]. అయినప్పటికీ పట్టు విడవకుండా సత్యాన్ని ఆవిష్కరించామనుకొండి. అప్పుడు కొత్త వ్యక్తులూ, కొత్త బృందమూ వస్తుంది. "మీరు చూపిస్తున్న నిజం నిజమే కాదు. ఇదంతా చూస్తుంటే మాకు నవ్వొస్తోంది" అంటారు. మనం సత్యం ఏమిటో నిరూపించినా సరే, అదేమీ పట్టించుకోకుండా.... "ఇదంతా నిజమేనని నిరూపించండి" అంటారు. అలాగని వాళ్ళు అది నిజం కాదని కూడా నిరూపించరు, నిరూపించలేరు. ఇవి ఎక్కువగా దేవుడి ఉనికి గురించిన చర్చల్లో నడుస్తుంటాయి.

తాజా ఉదాహరణ కావాలంటే.... సానియా మీర్జా, షోయబ్ మాలిక్ గురించి అయోషా సిద్దిఖీ, నిరూపణలతో సహా ఆరోపణలని చేస్తుంటే "ఇదంతా చూస్తుంటే నవ్వొస్తుంది" అన్నది చూడండి, అలాగన్న మాట! షోయబ్, అయోషాకి విడాకులు ఇచ్చాక, మొదట ‘నవ్వొస్తుంది’ అన్న సానియా, మళ్ళీ దాని మీద ఏ వివరణలూ చెప్పలేదు. మీడియా సానియాని అడగనూ లేదు. [మా బ్లాగులో ‘నవ్వొస్తుంది’ అన్నది మరింతగా నడిచే ప్రక్రియ లెండి!]

10]. అయినా గానీ మనం, పట్టు విడిచిపెట్టకుండా చర్చ కొనసాగించి, నిజాన్ని వెలికి తీసామనుకొండి. అప్పుడందరూ నోరు మూస్తారు. కానీ కొత్త బృందం వస్తుంది. "మేము కొత్త వాళ్ళం మళ్ళీ చెప్పు" అంటారు. ఒకరి తర్వాత ఒకరు! ముసలి వాడి చేతిలోని మేకని వాడిచేతే వదిలి పెట్టించి, దొంగిలించుకు పోవటానికి, నలుగురు కాకపోతే 40 మంది దొంగలు, ఇంకా చాలక పోతే 4000 మంది దొంగలు వచ్చినట్లుగా! ఎంత మందికని శాంతంగా చెబుతాం?

మీడియా బలంతొ, ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు చేస్తోంది ఇదే!

ఇంతగా సామాన్య ప్రజలకి అవగాహన కలగకుండా, సత్యం తెలియకుండా ఉండటానికి, నానా ఫీట్లు చేసే నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు.... సామాన్యుల ధైర్య స్థైర్యాల మీద కూడా తక్కువ ఆటలేం ఆడలేదు.

చెప్పాలంటే.....

ఎప్పుడూ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు సామాన్య ప్రజలకి చెప్పేది ఒకటే - "డబ్బున్న చెడ్డవాణ్ణి [విలన్ ని] చూసి భయపడు. ఎదిరించకు. ఎదిరించటం తెలివి తక్కువ పని. ఎదిరిస్తే జీవితం సర్వనాశనమైపోతుంది. ఒంటరివై పోతావ్! ఆస్థీ, ఉద్యోగ ఉపాధులూ, కుటుంబం, పరువు మర్యాదా అన్నీ కోల్పోతావు..." అని! ఇప్పటికి దశాబ్దాల తరబడి, వేల రోజులుగా, లక్షల సినిమాలూ, వార్తాంశాలతో.... నిరంతరం చెప్పిందీ చెబుతోంది అదే!

చెడ్డవాణ్ణి, అందునా డబ్బున్న చెడ్డవాణ్ణి ఎదిరించకూడదు. ఎదిరించే హీరో కోసం ఎదురు చూడాలి. తీరా సదరు హీరో వచ్చి ఎదిరించినా, చెయ్యి కలిపే ప్రయత్నం చెయ్యకూడదు. పోరాటానికి ప్రేక్షకత్వం మాత్రమే వహించాలి. హీరో చేతిలో విలన్లు చావు దెబ్బలు తింటుంటే, పగ తీరిన ఆనందంతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, చిరునవ్వు నవ్వాలి. ఒక వేళ హీరో నే విలన్ చేతిలో తన్నులు తింటుంటే, ఆందోళనతో, దుఃఖంతో పెదవులు బిగించి చూడాలి. ఇంతే!

ఇంతగా సినిమాలతో, వార్తాంశాలతో బ్రెయిన్ వాష్ చేసి పారేసాక, ఇక ఇందుకు భిన్నంగా ఏం ఆలోచించగలరు ఎవరైనా?

ఇలాగ్గాక... ఇప్పటి వరకూ, దశాబ్దాలుగా, లక్షల సినిమాలూ, వార్తాంశాలతో..... డబ్బున్న వాడైనా సరే.... చెడ్డవాడైతే ఎదిరించు [శ్రీరాముడు చేసింది ఇదే!] ఎవరో హీరో కాదు. నువ్వూ నీ జీవితానికి నాయకుడివే! నీకు నువ్వు, నీ జీవితానికి నువ్వు, నాయకుడి వనే ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కలిగి ఉంటే - ప్రపంచం నిన్ను విశ్వసిస్తుంది, గౌరవిస్తుంది. శ్రీరాముడికీ ఆంజనేయుడిలా, అర్జునుడికి శ్రీకృష్ణుడులా ప్రపంచం మీకు తోడై వస్తుంది - అని బ్రెయిన్ వాష్ చేసి ఉంటే, ఇప్పటికి ఈ జాతి ఎలా ఉండేదో?

హిందూ ఇతిహాసాలు ఇవి చేస్తున్నాయనే, రంగనాయకమ్మలు, ఇన్నాసయ్యలూ తయారై, హిందూ ఇతిహాసాల మీద దుమ్మెత్తి పోసారు. అందుకే మీడియా వాటికి విపరీత ప్రచారమిచ్చింది. ఇలా ఇతిహాసాలని భారతీయుల జీవితాల్లోంచి తరిమేసి, సాంఘిక కథల పేరుతో సినిమాలు.... వార్తాంశాల పైకారణాలతో [over leaf reasons], మీడియా.... సామాన్య ప్రజలని ఎంతగా భీరువుల్ని చేసిందో మనందరికి తెలుసు. మాకు స్వానుభవపూరితంగా తెలుసు. [ఈనాడు ప్రచురించిన ‘సామాన్యుడి విఫల కథ’ ఇలాంటిదే.]

నంబూరు గ్రామంలో, మా మీద భౌతిక దాడి జరిగినప్పుడు, దాదాపు అందరూ వచ్చి చూసారు. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు సరికదా, మా విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా మౌనప్రేక్షకులై వీక్షించారు. ఇక సూర్యాపేటలో అయితే, మా విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా, మా ఇంటి యజమానురాలితో కలిసి మమ్మల్ని "సమాజానికి ఎదురిదీ, నీవేవి సాధించలేవు" అని తిట్టి పోసారు. శ్రీశైలంలో, మా విద్యార్దుల తల్లిదండ్రులు, మా గురించి కన్నీళ్ళు పెట్టుకున్నారు, మాకు ఓదార్పు చెప్పబోయారు తప్పితే.... సదరు ఈవో, డిఈవో లని ఎదిరించే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.

విక్రమార్కుడు సినిమాలో పోలీసు ఉన్నాతాధికారి పాత్ర [ప్రకాష్ రాజ్], ASP విక్రమ్ రాథోడ్ పాత్ర[రవితేజ]తో చెబుతాడు చూడండి "భయం తెలియని వాడు జీవితంలో ఎప్పుడూ కష్టాలే అనుభవిస్తాడు" అని... అలాంటిదే మేం పదేపదే విన్నాం.

సూర్యాపేటలో మాకు ఆ ఊరి పెద్ద మనిషి ఇదే చెప్పాడు. "ఆ త్రివేణి కాలేజీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు సార్! అస్థులు అమ్ముకొనైనా, వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళని నాశనం చేస్తారు" అని! అప్పటికి పైముఖంగా మమ్మల్ని వేధిస్తున్నది వాళ్ళే! అప్పటికి మా జీవితంలో గూఢచర్యపు విన్యాసాలు మాకు అసలు ఊహకు లేక పోయినా, స్వభావ కారణంగా మా వారు "నేను మొండి వాణ్ణి అనుకోండి, ముర్ఖుణ్ణి అనుకోండి! పంతాని కొస్తే నేనూ వెనక్కి తగ్గను. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఎదుటి వాళ్ళని నాశనం చేస్తారేమో! నేనూ అన్ని తెగనమ్ముకుని అయినా పోరాడతాను" అన్నారు. ఆ తర్వాత నెల రోజులకే ఇల్లూ వాకిలి ఊడగొట్టి మమ్మల్ని రోడ్డు మీదికి వెళ్ళగొట్టారు. అప్పటికి అది రామోజీరావు సంభాషిస్తున్న తీరుగా మేం గ్రహించలేదు.

అయితే శ్రీశైలంలో.... మమ్మల్ని కొంత కాలం పైముఖంగా నాలుగో తరగతి ఉద్యోగి ఒకడు వేధించాడు. తర్వాత ఆ స్థానంలోకి డిఈవో వచ్చాడు. సదరు నాలుగో తరగతి ఉద్యోగికి బినామీ పేరుతో ఓ పాఠశాల ఉంది. అతడి గురించి మాతో అందరూ "ఫణిధర్ ప్రసాద్ చాలా చెడ్డవాడండి. అతడితో గొడవ పడవద్దు. అందరూ అతడితో గొడవపడటానికి భయపడతారు" అంటూ చెప్పారు. పదే పదే ఇదే వినిపించే సరికి నాకు తిక్కరేగి పోయింది.

ఓ రోజు ఇదే చెప్పిన మా విద్యార్ధుల తల్లీ, ఒక పోలీసు కానిస్టేబుల్ భార్య అయిన ఒకామెతో "అవునండీ! అతడు చాలా చెడ్డవాడే. ఎంత చెడ్డవాడు కాకపోతే వదినని ఉంచుకుంటాడు, చెప్పండి?" అన్నాను. అతడు భర్తృవిహీన అయిన వదిన గారిని చేరదీసి, ఆవిడ పేరిట స్కూలు నడుపుతున్నాడు. దేవస్థానంలో తన పరపతి ఉపయోగించి, పక్కదారిలో ఆమెకు పెద్ద కాటేజీ కేటాయింపు పొందాడు. [ఆ వేధింపులోని ఇతర వివరాలు పీవీజీ - రామోజీరావు - మా కథ లోనూ, Documentary Evidence లోనూ ఉన్నాయి.]

ఇలా నేను జావాబిచ్చాక మాకు వింత గొలిపిందేమిటంటే - అతడికి భయపడమని మాకు కనీసం వందసార్లు, చాలా మంది, చెప్పి ఉంటారు. ఎప్పుడూ మేము జవాబు చెప్పలేదు. అలా చెప్పబడటమూ ఆగలేదు. అదే ఒకరితో నేను ఆ జవాబు చెప్పగానే, ఇక ఎవ్వరి నుండీ, యధాలాపంగా కూడా మళ్ళీ ‘భయపడమన్న’ మాట వినబడలేదు. దాంతో మాకు కార్యకారణ సంబంధం బాగానే అర్ధం అయ్యింది. ఎందుకంటే - ఇది జరిగింది 2005 తర్వాత కాబట్టి, అప్పటికి మా దృష్టికి సునిశిత వైఖరి పెరిగింది కాబట్టి!

ముందుగా.... మన చుట్టూ ఉన్న వారిలో ఎవరి పట్లనైనా మనల్ని భయపూరితులని చేసినా, ఎవరి ఆధిక్యతకైనా లొంగుబాటు పరచినా చాలు! అంతకంటే పెద్ద వాళ్ళకి ఆటోమాటిక్ గా భయపడతాం, లొంగిపోతాం. a a

చట్టం ప్రకారం ఏ అన్యాయాల గురించైనా, అవినీతి గురించైనా ప్రజలు ఫిర్యాదు చెయ్యాలి. అలాగ్గాక ’ప్రభుత్వాధికారులే చర్య తీసుకోవచ్చు’ అంటే - అధికార మదంతోనో, స్వార్ధంతోనో అధికారులూ, ఉద్యోగులూ అమాయకులని కేసుల్లో ఇరికించి పీడించవచ్చు. అందుచేత ’ప్రజలు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయటం’ అనే నిబంధన అడ్మినిస్ట్ర్షన్ లో చేర్చబడింది. అంతేగాక, ఎక్కడ ఏమీ జరుగుతుందో ప్రభుత్వానికి, పైస్థాయిలో వారికి తెలియాలంటే కూడా ప్రజలు ఫిర్యాదు చేయాలి.

అదీగాక.... పరిపాలనలో, పాలానా యంత్రాంగపు పనితీరులో, ప్రభుత్వం నడపటంలో.... ప్రజల ప్రమేయాన్ని, భాగస్వామ్యాన్ని [ఇన్వాల్వ్ మెంట్] బాధ్యతనీ మిళితం చేసేందుకు, ఇలాంటి నిబంధన ఉంచబడింది.

ఇక్కడే నకిలీ కణిక వ్యవస్థ, సామాన్య ప్రజలని బాగా ఆడుకుంది. 1992 కు ముందర సినిమాలలో ’ఎదురు తిరిగితే మట్టిగొట్టుకు పోతారు" అని చెప్పబడితే, 1992 తర్వాత వచ్చిన సినిమాలు కొన్నిటిలో ’పౌరబాధ్యతతో ఫిర్యాదు’ చేయటం గురించి చెప్పబడింది. యజ్ఞం సినిమాలో "ఇన్ని హత్యలు జరిగాయి. ఒక్కరన్నా ఫిర్యాదు ఇచ్చారా? లేదు కదా? కాబట్టి హాయిగా కూర్చో" అంటాడు ఓ పోలీసు అధికారి. అదే.... ఒక్క ఫిర్యాదు అందిన మరుక్షణం, చర్య ప్రారంభిస్తాడు.

నిజానికి డబ్బున్న చెడ్డవాడికి, ఎదురు తిరిగి దెబ్బకొట్టినప్పుడు కదా తెలిసేది, వాడు తిరిగి దెబ్బకొట్టగలడో లేదో!? అసలు దెబ్బే కొట్టనివ్వకుండా.... శబ్దంతోనే భయపెట్టే వ్యూహంతో.... ముందే మీడియా, సినిమాలూ కలిసి, జనాల నరనరాన ఎక్కించిన పిరికితనం ఇది!

అదీగాక ఒక్కడు దెబ్బ కొడితే, డబ్బున్న చెడ్డవాడు బలవంతుడు! అందరూ దెబ్బలు కొడితే....? చలిచీమల చేత చిక్కి చచ్ఛే బలవంతమైన సర్పం వంటి వాడే! అది ఒక్క చెడ్డవాడు Vs వంద మంది సామాన్య ప్రజల విషయంలోనైనా అంతే! వేలమంది చెడ్డవాళ్ళు Vs కోట్లమంది సామాన్యప్రజలైనా అంతే!

నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు వందల సంఖ్యలో, నెం.10 వర్గంలోని ఏజంట్లని కలుపుకున్నా వేల సంఖ్యలోనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు? 600 కోట్లకు పైగా ఉన్నారు. లెక్కల ప్రకారం చూసుకున్నా బలం సామాన్యులదే! ఉండాల్సింది ఐక్యమత్యమూ, ధైర్యమూ, స్థైర్యాలే!

ఒకరి కొకరు కలిస్తే, సామాన్యప్రజలలో తమని ఎదిరించే ధైర్యమూ, స్థైర్యమూ పెంపొందుతాయనే, నకిలీ కణిక వ్యవస్థ ‘విభజించి - పాలించటం’, ‘విభజించి - ప్రచారించటం’ అనే వ్యూహాలని [స్ట్రాటజీలని] ప్రయోగిస్తుంది. దాని గురించిన జ్ఞానమూ, అవగాహనా కలగ నివ్వకుండా అబద్దాలని ప్రచారిస్తుంది. సంచలనాలతో నిజాలు వెలికి రాకుండా, వ్యవహారాలని ప్రక్కదారి పట్టిస్తుంది.

ఇలా సామాన్యుల ఐక్యతనీ దెబ్బతీయటం, నిజాలు తెలియకుండా అసత్యాలని ప్రచారించటం ఇప్పుడే కాదు, స్వాతంత్ర్య పోరాటం నాడూ ఇబ్బడిముబ్బడిగా మన మీద ప్రయోగించిన స్ట్రాటజీలే! కాకపోతే అప్పటి పత్రికలు స్వాతంత్ర్య సమరానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. అదే బ్రిటీషు వాళ్ళకి, వాళ్ళ ముసుగు వెనక దాగిన నకిలీకణిక అనువంశీయులకి అశనిపాతమైంది. ఎక్కడ ఓటమి పొందారో, అక్కడి నుండే మళ్ళీ ప్రయత్నం ప్రారంభించారు. కాబట్టే ఈ సారి భారతదేశంలో ప్రధాన కుట్రదారు మీడియా రూపం సంతరించుకుంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ స్థితికి ఎప్పుడో ప్రయాణించాయి.

సామాన్యల ఐక్యతని దెబ్బతీయటం గురించి.....
ఒక ఉదాహరణ -
డబ్బున్న చెడ్డవాణ్ణి ఎదిరించటానికి ఒక్కరు ప్రయత్నం ప్రారంభించారనుకొండి. మెల్లిగా ఒకరికొకరు తోడై ఒక చిన్న బృందం ఏర్పడిందనుకొండి. వారి ఐక్యతని భగ్నం చేయటానికి నకిలీ కణిక వ్యవస్థలోని వారు, బృంద సభ్యుల మధ్య అపార్ధాలు సృష్టిస్తారు. ఒకరి గురించి మరొకరికి అపోహలు సృష్టిస్తారు. పితూరీల వంటి అసత్య వార్తలు ప్రచారించీ, అహం రెచ్చగొట్టి, అసలు లక్ష్యం కంటే వ్యక్తిగత ఆధిక్యతలు ప్రముఖమయ్యే స్థితికి తెస్తారు.

జౌరంగజేబుని ఎదిరించిన శివాజీ బృందం మీద ఇన్ని వ్యూహాలు ప్రయోగింపబడలేదు. ఉన్నది ప్రాణాలకు తెగించిన ప్రత్యక్ష పోరాటమే! అప్పటికి రాజకీయాలలోకి, భారతీయ ఇతిహాసాల నుండి గ్రహించిన గూఢచర్యం ఇంతగా చొప్పించబడలేదు. అప్పటికి - అవి నకిలీ కణిక అనువంశీయులకు ప్రారంభ సంవత్సరాలు. హైదరాబాద్ నవాబుల సంస్థానం నుండి పుట్టిన ఈ నకిలీ కణిక [వేశ్యపుత్రుల] వంశీయులు ఆనాటికి జౌరంగ జేబు ప్రాపకాన నక్కారు.

భారత స్వాతంత్ర్య సమరం నాటికి ఈ నకిలీ కణిక వంశీయులు మరింత బలపడి,.... ఇప్పుడు సిఐఏ, ఐఎస్ ఐ ముసుగుల మాటున చక్రం తిప్పగలుగుతున్నట్లు... అప్పుడు బ్రిటిషు రాజ వంశపు ముసుగు మాటున చక్రం తిప్పగలిగారు. కాబట్టే, కణికుడు భారతంలో చెప్పిన కూటనీతి ప్రయోగాలన్నీ నాటి స్వాతంత్ర్య సమర యోధుల బృందం మీద ప్రయోగింపబడ్డాయి. ఇప్పుడవి సామాన్యుల మీదికి కూడా వచ్చి పడ్డాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/apr/20/edit/20edit5&more=2010/apr/20/edit/editpagemain

ఎల్లుండి నకిలీ కణికుడి వలన కెరియర్ పొందిన /ఏజెంట్ ల పేర్లను రాస్తాను

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu