ప్రభుత్యోద్యోగుల నుండి నేను సహాయ సహకారాలని అందుకున్న అనుభవాలలో మరొకటి -

ఒక రోజు నేను ‘ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్’ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను. నా ఫ్యాక్టరీ లైసెన్సును రెన్యూవల్ చేయించవలసి ఉంది. అప్పటికే తేదీ దాటిందన్నది నేను గుర్తించుకోలేదు. పనుల ఒత్తిడితోనూ, హైదరాబాద్ గట్రా నగరాలకి పనుల నిమిత్తం వెళ్ళటంతోనూ బిజీగా ఉండి మర్చిపోయాను. దాంతో ఫైను పడ్తుందని అనుకోలేదు.

తీరా ఫైలు తీసాక, తేదీ దాటిందని క్రింది గుమస్తా చెప్పాడు. అప్పట్లో అక్కడ [నాకు గుర్తుండి] ఫకృద్దీన్ అనే అధికారి ఉండేవాడు. చిన్న వయస్సు వాడే! అతడు "ఫర్లేదమ్మా! విదిన్ డేట్, మీ లైసెన్స్ నేను రెన్యూవల్ చేసాను. ఫీజు నా జేబు నుండి కట్టాను. కాబట్టి మీరు ఫైను కట్టక్కర్లేదు. బహుశః మీరు మరిచిపోయి ఉండొచ్చునను కున్నాను. ఎటూ మీరు (camp) ఊరు నుండి వచ్చాక, మా ఆఫీసుకి వస్తారని నేను expect చేసాను. ఇదిగోండి మీ లైసెన్సు రెన్యూవల్" అంటూ పేపర్ ఇచ్చాడు.

ఆ యువ అధికారి పట్ల నాకెంత కృతజ్ఞత కలిగిందో! అతడిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పి, రెన్యూవల్ ఫీజు కట్టేసి, లైసెన్సు కాపీ తీసుకున్నాను. ఇలాంటి ఒక్క సంఘటన, ఒక ప్రోత్సాహం... తర్వాత పదిమంది అవినీతి ఉద్యోగుల్ని డీల్ చేసేందుకు శక్తినిచ్చేది.

ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ‘ఆకాశానికి పందిరి గుంజలు’ కథ గుర్తుకొచ్చేది. ‘దేశమంతా అవినీతి పరులే ఉంటే... ఈ పాటికి ప్రపంచపటంలో భారతదేశం మిగిలి ఉండేది కాదు’ అన్పించేది. ఆ కథ చందమామ లోనిది. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను కాబట్టి, రచయిత ఎవరో తెలీదు. ఇంతకీ కథేమిటంటే -

అనగా అనగా...

ఒక ఊరిలో రంగన్న అనే అమాయక యువకుడుండేవాడు. వాడు తల్లి దండ్రులు లేని అనాధ. ఏదో పనిపాట చేసుకొని పొట్టపోసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేవాడు.

ఓ రోజు రాత్రివేళ వాడు భోజనం చేసి, గుడిసె బయట నులక మంచం వేసుకుని పడుకున్నాడు. ఆరు బయట చల్లగాలినీ, ఆకాశంలో చంద్రుడూ, చుక్కలతో మబ్బులు సయ్యాటలనీ ఆనందించసాగాడు.

హఠాత్తుగా వాడికి, ఆకాశం పెద్ద పందిరిలాగా తోచింది. కానీ ఎటు చూసినా దానికి గుంజలు లేవు. అలాంటప్పుడు ఆకాశం భూమ్మీద పడకుండా ఎలా ఉంది?

అమాయకుడైన రంగన్నకు ఆకాశం గురించి ఇలా సందేహం రాగానే.... ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద కుప్పకూలుతుందని భయం వేసింది.

వాడు వీధిన బడి గట్టిగా "పారిపొండి! పారిపొండి! ఆకాశం భూమ్మీద కూల బోతుంది. ప్రాణాలు దక్కించుకొండి. పరుగెత్తండి, పరుగెత్తండి" అని గావుకేకలు వేస్తూ పరిగెత్తసాగాడు.

ఇలా అరుస్తూ గ్రామపు వీధుల్లో అడ్డదిడ్డంగా పరుగెట్టి, ఊరి చివరికి వచ్చేసాడు. వాణ్ణీ, వాడి అరుపులనీ గ్రామస్తులెవరూ పట్టించుకోలేదు. వాడి అమాయకత్వం వాళ్ళకి తెలుసు మరి!

మనవాడు మాత్రం పరుగాప లేదు. అప్పటికే ఊరుదాటి, అడవి దారి బట్టాడు. మధ్యలో ఎప్పుడు తలపైకెత్తి చూసినా, ఆకాశం వాడి నెత్తిమీదే ఉన్నట్లు కన్పించేది. దాంతో రెట్టించిన భయానికి గురై, మరింత వేగం పెంచి పరిగెత్త సాగాడు.

అలా పరిగెత్తి పరిగెత్తి... చివరికి అడవి మధ్యలో ఓ ముని ఆశ్రమానికి చేరాడు. ముని ధ్యానంలో ఉన్నాడు.

రంగన్న... అలసటతో, ఆయాసంతో రొప్పుతూ పోయి, ముని పాదాల మీద పడ్డాడు. కళ్ళు తెరిచిన ముని రంగన్నని జాలిగా చూశాడు.

రంగన్న భయంతో మాట తడబడుతుండగా "స్వామీ! ఆకాశం భూమ్మీద పడబోతోంది. పరిగెత్తండి. ఇక్కణ్ణుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి" అన్నాడు.

ముని కరుణతో చూస్తూ "నాయనా! ఎందుకలా అనుకుంటున్నావు?" అనడిగాడు.

"ఎందుకేమిటి స్వామీ! ఆకాశం చూడండి, పందిరి లాగే లేదూ? మరి దానికి స్థంబాలెక్కడ ఉన్నాయి? గుంజల్లేని పందిరి కూలిపోదా? కాబట్టి - ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద పడిపోగలదు" అన్నాడు రంగన్న వగరుస్తూ!

మునికి రంగన్న ఎంత అమాయకుడో అర్ధమయ్యింది. వాడి మీద కనికరం కలిగింది. చిరునవ్వుతో "లేదు నాయనా! ఆకాశపు పందిరికి భూమ్మీద గుంజలున్నాయి. అందుకే అదలా ఏళ్ళ తరబడి నిలిచి ఉంది" అన్నాడు కరుణ నిండిన కంఠంతో!

రంగన్న పట్టలేనంత ఆశ్చర్యంతో "ఎక్కడున్నాయి?" అనడిగాడు. ముని శాంతంగా, "తప్పకుండా నీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు అలిసి పోయి ఉన్నావు. ఈ రాత్రికి ఆశ్రమంలో నిదురపో! రేపు నేన్నీకు ఆకాశానికి పందిరి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.

అప్పటికి రంగన్నకి భయం తగ్గింది. దెబ్బకి అలసట గుర్తొచ్చింది. దాంతో ప్రశాంతంగా అక్కడే నిద్రపోయాడు.

మర్నాటి ఉదయం, ముని "చూడు నాయనా! దాపులనున్న పల్లెకు పోయి భిక్షమడుగు. అయితే అన్నం పెట్టినా, పెట్టకపోయినా, ఆ ఇంటి వాళ్ళను మాత్రం బాగా తిట్టు. సాయంత్రం వెనక్కి తిరిగి రా! అప్పుడు నీకు ఆకాశపు పందిరికి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.


రంగన్న బుద్దిగా తలూపాడు. ప్రక్కనున్న గ్రామానికి పోయి బిచ్చమడిగ ప్రారంభించాడు. ఏ ఇంటి గడప దగ్గర కబళమడగ బోయాడో, ఆ గృహిణీనీ, గృహస్తునీ బండతిట్లు తిట్టసాగాడు. అది చూసిన ప్రతి వారు వాణ్ణి తిట్టారు, కొట్ట బోయారు, అక్కడి నుండి తరిమేసారు.

సాయంత్రానికి కూడా వాడికి పిడికెడు అన్నం దొరక లేదు. వాడికప్పటికే బాగా ఆకలిగా, అలసటగా ఉంది. నీరస పడి పోయాడు. కానీ బిచ్చమడగ బోయిన చోటనల్లా తిట్టడం మాత్రం ఆపలేదు. ముని చెప్పిన దాన్ని ఆ విధంగా విధేయంగా ఆచరిస్తున్నాడు.

చివరికి, ఓ ఇంటి ముంగిట నిలబడి గట్టిగా బిచ్చమడుగుతూ, తిట్టసాగాడు. కాస్సేపటికి ఆ ఇంటి ఇల్లాలు ఓ విస్తరాకు నిండా, అన్నం పప్పూ కూరా తెచ్చి యిస్తూ, "అన్నం తీసుకో నాయనా! పాపం, ఎంత ఆకలితో ఉన్నావో, ఇంతగా వివేకం కోల్పోయి గృహస్తుల్ని తిడుతున్నావు! అన్నం పరబ్రహ్మ స్వరూపం. కడుపునిండితే కోపం పోతుంది. ముందు ఈ అన్నం తిని ఆకలి చల్లార్చుకో!" అంది.

రంగన్నకి కళ్ళ నిండా నీళ్ళు ఉబికాయి. అన్నం నిండిన ఆకు అందుకొని, ఆ తల్లికి తలవంచి అభివాదం చేసాడు. గిరుక్కున వెనుదిరిగి, అడవిలో ఆశ్రమానికి చేరాడు. ముని ముందు విస్తరి ఉంచి, జరిగిదంతా చెప్పాడు.

ముని మనోహరంగా నవ్వుతూ "ముందు అన్నం తిను" అన్నాడు. రంగన్న ఆవురావురు మంటూ అన్నం తిని స్థిమిత పడ్డాడు.

ముని రంగన్న సందేహం తీరుస్తూ "నాయనా! బిచ్చమడగబోయిన చోట, నోటి కొచ్చిన తిట్లు తిడితే, అందరూ నిన్ను కొట్టబోయారు. అలాంటి చాలా మందిలో, ఒక్క గృహిణి, నీకు అన్నం పెట్టింది. సహనంగా నీ తప్పుకి కారణాన్ని చెబుతూ అన్నం తినమంది. తనని తిట్టిన నీమీద కోపం తెచ్చుకోలేదు. లక్షలు, కోట్లలో... అలాంటి వాళ్ళు ఒక్కరుంటారు. వాళ్ళు... శాంతం, సహనాలు కలిగి, తమ ధర్మం తాము నెరవేరుస్తారు. వాళ్ళనే పందిరి గుంజలుగా ఆకాశానికి నిలబెట్టాడు భగవంతుడు. కాబట్టి - ఆకాశం భూమ్మీద పడనుందని భయపడకు!" అన్నాడు.

అమాయక రంగన్నకి అంతా అర్ధమైందనిపించింది. మంచితనం మీద మరింత నమ్మకం పెరిగింది. మునికి నమస్కరించి, తిరిగి తన గ్రామానికి బయలు దేరాడు.

ఇదీ కథ!

ఏ వృత్తిలో ఉన్నాసరే.... అ తమ ధర్మం తాము పాటించే వాళ్ళు ఆకాశానికి పందిరి గుంజలే!

అన్నిరంగాలలో, అవినీతి పరులున్నట్లే... నిజాయితీగా తమ ధర్మం తాము పాటించే ఇలాంటి పందిరి గుంజలు కూడా ఉన్నారు. కాబట్టే ఇంకా ఈ దేశం, ప్రపంచం మనగలుగుతున్నాయి. నా అదృష్టం కొద్దీ, నేను అలాంటి కొందరిని చూసాను కాబట్టే, మంచితనం మీద నమ్మకాన్ని కోల్పోలేదు.

పారిశ్రామిక వేత్తగా నా కెరీర్ లో ఇలాంటి పందిరి గుంజల్ని మరికొంత మందిని చూశాను.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, నా జీవన ప్రయాణంలో... నేను ఎందరో అవినీతిపరులనీ, పరమ నీచ ప్రవృత్తి కలవారినీ చూశాను. అదే విధంగా... నిజాయితీ పరులనీ, తమ పనిపట్ల నిబద్దత గలవారిని, సామాజిక బాధ్యతా, స్పృహా గల వారినీ చూశాను.

అప్పట్లో గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC)లో జనరల్ మేనేజర్ గా వెంకట రామయ్య అనే అధికారి ఉండేవారు. దాదాపు రిటైర్ మెంట్ వయస్సులో ఉన్నారు. ఆయన నన్నెంత గానో ప్రోత్సహించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాలసీల గురించి, రూల్సు&రెగ్యులేషన్స్ గురించి గైడ్ చేస్తుండేవాళ్ళు. తమ కుమార్తెనన్నట్లుగా భావించి, నాకు అవగాహన కలిగించేవాళ్ళు.

అప్పట్లో మా నాన్న నాకు తోడుగా ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ వచ్చేవాళ్ళు. [అధికారులతో మాట్లాడటం, ఫామ్స్ నింపి, సబ్ మిట్ చేయటం గట్రా అడ్మినిస్టేషన్ పనంతా నేను చూసుకునేదాన్ని. బైక్ మీద మా నాన్న నన్ను తీసుకెళ్ళెవారు. వేరే ఊళ్ళకు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై గట్రా కూడా, నాన్నే వెంట వచ్చేవాళ్ళు. తర్వాత్తర్వాత తమ్ముళ్ళు వచ్చేవాళ్ళు.]

మా నాన్నని కూడా వెంకట్రామయ్య గారు ఎంతో గౌరవంగా ఆదరించేవాళ్ళు. అది చూసి నాన్న ఎంతగానో ముచ్చటపడేవాడు. మాతోనే కాదు, DIC కి వచ్చే ఇతర సందర్శకులని కూడా, ఎంతో ఓపికగా రిసీవ్ చేసుకుని, క్రింది సిబ్బందికి పురమాయించి పనులు చేయించే వాడాయన.

నేను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. వెనక ధనిక లేదా రాజకీయ నేపధ్యమేమీ లేదు. NISIET వాళ్ళు నిర్వహించిన పోటీ పరీక్షలో శిక్షణావకాశాన్ని సంపాదించాను. [నాలుగు వేల మంది నుండి వ్రాత+మౌఖిక పరీక్షలో 20 మందిని ఎంపిక చేశారు. తర్వాత తెలిసిందేమంటే ఈ 20 మందిలో కూడా కొందరు రికమెండేషన్లతో వచ్చిన వాళ్ళని!]

అందులో భాగంగా, మార్కెట్ సర్వే, స్టాండర్డ్ బ్యాటరీ ముంబై [అప్పట్లో బొ౦బాయి] లో స్వల్పకాల శిక్షణ పొందాను. బ్యాంకర్స్ తో సమావేశాల్లో [సెమినార్స్] పాల్గొన్నాను. మా శిక్షణా కార్యక్రమంలో బ్యాంకుల ఉన్నతాధికారులు [నంబియార్ వగైరా] కూడా పాల్గొన్నారు. ఆ సర్టిఫీకేట్లే పెట్టుబడిగా రంగంలోకి దిగాను.

అప్పట్లో జోకులేసేదాన్ని, యండమూరి ‘డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు’ లో గాంధీ పదిపైసలు పెట్టుబడి పెట్టాడు, నేనదీ పెట్టకుండానే ఫ్యాక్టరీ పెట్టానని! కొద్దిపాటి డబ్బు నిల్వలని పెట్టుబడిగా పెట్టి, కొంత అప్పు గా తెచ్చి, వేలంలో కొన్న పాత ఐస్ ఫ్యాక్టరీని బ్యాటరీ ఫ్యాక్టరీగా మారుస్తూ, పెట్టుబడి సొమ్ములో చాలా వరకూ దాని నుండే నిధులు సమకూర్చుకున్నాను.

అందురీత్యా కూడా... మరికొందరు ధనిక వర్గం నుండి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కన్నా, నేనెక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నానేమోనని, అప్పట్లో విశ్లేషించుకునేదాన్ని.

వెంకట్రామయ్య గారు నన్ను ఎంతగా ప్రోత్సహించే వాళ్ళంటే, ఏదైనా ఇతర డిపార్డ్ మెంట్లతో నేను ఇబ్బందులు ఎదుర్కున్నప్పుడు, తాను స్వయంగా ఫోన్ చేసి, ఆయా అధికారులకు రికమెండ్ చేసి, నా పని అయ్యేటట్లుగా చెప్పేవాళ్ళు. ‘ఫస్ట్ జనరేషన్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్. మంచి ఉత్సాహం ఉన్న అమ్మాయి. పైకి వస్తే మన జిల్లాకే పేరొస్తుంది’ అంటూ, అవతలి అధికారులని కన్విన్స్ చేసేవారు.

నేను ఫ్యాక్టరీ స్థాపించడానికి తీసుకున్న శ్రమనంతా వివరిస్తూ ‘ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ అవార్డుకి నా పేరుని ప్రతిపాదించి పంపిస్తూ, కమీషన్ రేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కూడా పట్టుబట్టి నా ఫైల్ నడిపించారు.

దాంతో పైరవీలు పక్కన బెట్టి, 1990వ సంవత్సరానికి గాను ఉత్తమ పారిశ్రామిక అవార్డుని నాకు ఇవ్వక తప్పలేదు. దాన్ని అప్పుడే గవర్నరుగా మన రాష్ట్రానికి వచ్చిన కృష్ణకాంత్ నుండి అందుకున్నాను. ఆ రోజు టీవీ వార్తల్లో, ఆ క్లిప్పుంగు చూసుకుని, ఎంత మురిసిపోయానో! అందునా అప్పుడు దూరదర్శన్ తప్పించి, లోకల్ ఛానెల్స్ ఉండేవి కావు.

ఆయన నాకు ఈ అవార్డునిప్పించినందుకంటే... ‘నా ఫ్యాక్టరీ నిలదొక్కుకునేంతగా, ప్రభుత్వ ఆఫీసుల్లో పనితీరు గురించి నాకు అవగాహన కలిగించినందుకు, ఆ పెద్దాయనకు నేనెంతో ఋణపడి ఉన్నాను’ అనుకునేదాన్ని. ఆ విధంగా ఓనమాలు దిద్దుకున్నాను. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చే నాలాంటి చాలామందిని, ఆయన నన్ను ప్రోత్సహించినట్లుగానే ప్రోత్సహించారు.

రెండేళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. తర్వాత వచ్చిన అధికారి ఎవరెళ్ళినా ధుమధుమ లాడుతుండేవాడు. అప్పటికి నాకు ఆ కార్యాలయంతో పని ముగిసినట్లే! ఏడాది కోసారి లైసెన్సు రెన్యువల్ తప్ప పెద్దగా పని ఉండక పోవటాన, నేనంతగా ఇబ్బంది పడలేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

టైం మెషిన్ ఎక్కి, బాలకృష్ణ చంద్రబాబులూ, వై.ఎస్.జగన్, చివరికి కాంగ్రెస్ అధిష్టానం సోనియా కూడా గత కాలంలోకి ప్రయాణించి రావటం చూశాక... చిరంజీవికి కూడా టైం మెషిన్ ఎక్కాలన్న ఉబలాట కలిగింది. బావమరిది అరవింద్ తో చర్చించాడు.

"వెళ్ళిరా బావా! ఎవరైనా వద్దంటే, వాళ్ళ నాలుకలు కోయటానికి నేను కత్తితో సిద్దంగానే ఉన్నా!" అంటూ భరోసా ఇచ్చాడు అల్లు అరవింద్.

దాంతో చిరంజీవి ధైర్యం కూడ గట్టుకొని, వేలం పాటలో పాల్గొని, టైం మెషీన్ ఎక్కేందుకు ‘టికెట్’ కొనుకున్నాడు.

గతంలోకి ప్రయాణించి మామ అల్లు రామలింగయ్య దగ్గరికి చేరాడు.

అల్లుణ్ణి చూడగానే అల్లు రామలింగయ్య "నాయనా ఆంజనేయ వర ప్రసాద్! ఎంత పని చేశావోయ్! ఏదో సినిమాలు చేసుకుని, పది రాళ్ళు వెనకేసుకుంటావని పిల్లనిచ్చి, ఆపైన నా లాబీయింగ్ గొలుసులన్నీ అందిస్తే... మూడు సినిమాలు, ఆరు అవార్డులుగా ముందుకు పోకుండా ‘తగదునమ్మా’ అని రాజకీయాల్లోకి ఎందుకెళ్ళావ్? ఇప్పుడు చూడు! నేను తెర మీద మాత్రమే కమేడియన్ ని అయితే... నువ్వు రాజకీయ జీవితంలో కమేడియన్ వి అయిపోయావ్" అన్నాడు ఏడుపాపుకుంటూ!

అది చూసి చిరంజీవికీ దుఃఖ మాగలేదు. "అక్కడికీ నేనెంతో గుంజాటన పడ్డాను మామయ్యా! ఎంతో వెనక ముందులాడాను. చివరికి ‘తమిళ సూపర్ స్టార్ ‘రజనీ కాంత్’ ల వంటి వాళ్ళు దూకటానికి ప్రయత్నిస్తున్నారు కదా! మనకేం తక్కువని?’ రంగంలోకి దూకాను. తీరా చూస్తే... రాజకీయాల్లో నా పరిస్థితి చూసి, ‘ఎందుకొచ్చిందిలే?’ అన్నట్లు వాళ్ళంతా వెనక్కి తగ్గారు" అన్నాడు వెక్కిళ్ళు పెడుతూ!

"ఎవరో ఏదో చెప్పారని చేస్తారటయ్యా, పిచ్చి సన్నాసివి గాకపోతే!".... ఎన్నో సినిమాలలో రావుగోపాల రావు వెనకాల నక్కి డైలాగులు చెప్పిన అలవాటు కొద్దీ, అదే మాడ్యులేషన్ లో అనేసాడు అల్లు రామలింగయ్య.

"ఎవరో కాదు మామయ్యా! మీ కొడుకు అరవింద్ కూడా అదే సలహా చెప్పాడు" బిక్కముఖం వేసాడు చిరంజీవి.

"సర్లే! జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా, పరిస్థితులు చక్కదిద్దుకో! నిజానికి సినిమాలైనా, రాజకీయాలైనా, గాడ్ ఫాదర్ ల కాళ్ళు పట్టుకోవటమే అసలు టెక్నిక్! ఏమైనా... సినిమాలే మనకి మెయిన్ ప్రొఫెషనూ! రాజకీయాలంటూ ఏదో చేసినా, ఎవర్ని పట్టుకుంటే సినిమాలు హిట్టువుతాయో చూసుకో!" అని, తన అనుభవాన్నంతా రంగరించి సుద్దులు చెప్పాడు మామ అల్లురామలింగయ్య.

బుద్దిగా తలూపి, కళ్ళు తుడుచుకొని, టైం మెషీన్ ఎక్కి వెనక్కొచ్చాడు చిరంజీవి.

మెషీన్ దిగీ దిగగానే, ‘పేకప్’ అంటూ పరుగేఠుకొని ఇంటి కెళ్ళి పోయాడు, విలేఖర్లతో సహా ఎవరూ, తనని ఏ ప్రశ్నలూ వేసే అవకాశం ఇవ్వకుండా!

~~~~~
‘అందరూ గతంలోకి వెళ్ళొస్తున్నారు, తము వెళ్ళకపోతే తెలంగాణా ఉద్యమం పట్ల తమకు చిత్తశుద్ది లేదంటారు. తెలంగాణాకేం తక్కువా!?’ అనుకొని, కేసీఆర్ కూడా టైం మెషీన్ ఎక్కేసాడు.

గతంలోకి ప్రయాణించి హైదరాబాద్ నిజాం దగ్గరికెళ్ళి పోయాడు. కేసీఆర్ ని చూడగానే.... నిజాం, సంతోషంగా ఎదురొచ్చి కౌగలించుకున్నాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఆత్మీయుణ్ణి చూసినట్లు, ఆపకుండా కబుర్లు చెప్పాడు.

"కేసీఆర్! నిజంగా నువ్వే నాకు అప్తుడవయ్యా! ‘మంచైనా, చెడైనా మా నిజాం మాకు గొప్ప’ అని తెగేసి చెప్పావు. నా సొమ్ము తిన్న ఒవైసీ కుటుంబం కూడా చెప్పలేదు. బ్రతికి ఉండగా తెలంగాణా సాయుధ పోరాటం అంటూ, నన్ను నానా చీకాకులు పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళలో పీవీ నరసింహారావూ ఒకడు. అతణ్ణేమన్నా కిమ్మనవు గానీ, నా మీద ఈగ వాలనివ్వవు కదా! ఓప్రక్క ‘తెలంగాణా విమోచన దినోత్సవం గొప్పగా నిర్వహిచాలంటావ్!’ మరో ప్రక్క ‘నిజాం జిందాబాద్’ అంటావ్. నీ రెండు నాల్కల ధోరణి అంటే నాకెంతో ఇష్టమో! తిట్టటం నీ పేటెంట్ హక్కు చేసుకున్నావు.

ఎదుటి వాళ్ళు చీదరపడి ‘ఛీ! వీళ్ళతో మనకెందుకు? ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండటమే మేలు. విడిపోదాం’ అనుకునేంతగా పరిస్థితులు కల్పిస్తావు. నీలాంటి వాళ్ళు నాకు అప్పట్లో దొరికి ఉంటే, హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో కలిసే ఉండేది కాదు. మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎంచక్కా మధ్య పాకిస్తాన్ పేరుతో ఉండేవాళ్ళం. ప్చ్, ఏం చేస్తాం!? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం!" అంటూ ప్రేమగా హత్తుకున్నాడు.

పిచ్చి సన్నాసి! నిజంగ వీణ్ణీ పొగిడాననుకుంటున్నాడు. ఏదో ముస్లింల మద్దతు ఉంటుందని అన్నాను గానీ!"... అనుకున్నాడు మనస్సులో కేసీఆర్! అంతలోనే అతడి ద్వంద్వ ప్రవృత్తి అతణ్ణి హెచ్చరించింది.

దాంతో, కేసీఆర్ కి గుండెలు ఉప్పొంగి పోయాయి. నిజాంకి తానే నిలువెత్తు ప్రతినిధిని అనుకున్నాడు. "ఇక నుండీ తెలంగాణాలో సీమాంధ్రుల్నే కాదు, నిజాం భక్తుల్ని తప్ప ఎవ్వర్నీ తిరగనివ్వ కూడదు" అని ధృఢంగా నిశ్చయించుకుని, నిజాం దగ్గర సెలవు పుచ్చుకొని వెనక్కొచ్చాడు.
~~~~~~
ఇందరు తము తయారు చేసిన టైం మెషీన్ ఎక్కి గతంలోకి వెళ్ళి వస్తున్నారు. "ఒకసారి తామూ వెళ్ళొస్తే...?" అనుకున్నారు అంబానీ సోదరులు. ‘వొద్దులే బిజినెస్ దండగా’ అని కాస్సేపు ఊగిసలాడినా... "ఎప్పుడూ వ్యాపారమేనా? కాస్సేపు స్వంత జీవితం ఉండొద్దూ! వెళ్ళి నాన్న గారిని చూసి రండి" అని, తల్లి కోకిలా బెన్ కౌన్సిల్ చేయటంతో, సరేనని... ముఖేష్ అనిల్ అంబానీలిద్దరూ టైం మెషీన్ ఎక్కారు.

గతంలో కెళ్ళి తండ్రిని కలుసుకున్నారు. అన్నతమ్ములిద్దర్నీ చూడగానే ధీరూభాయ్ అంబానీకి మండిపోయింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆపకుండా ఉపన్యసించినట్లు, అరగంట పాటు... తిట్టిన తిట్టు తిట్టకుండా కొడుకులిద్దర్నీ తిట్టిపోసాడు.

తిట్లవాన తగ్గాక, అలుపు తీర్చుకుంటూ... "వెర్రి నాగన్నల్లారా! నేను అష్టకష్టాలు పడి, వెండి స్మగ్లింగులూ గట్రా చేసి, లైసన్స్ రాజ్ కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, విస్తరించి... మీ చేతుల్లో పెడితే.... దాన్ని మరింత మరింతగా అభివృద్ది చేయటం మీద దృష్టి పెట్టాలి గానీ, మీలో మీరు తన్నుకొని లొసుగులు బయటపెట్టు కుంటార్రా? ఆస్థుల విలువలు పెరిగి వ్యాపార సామ్రాజ్యం బలపడినట్లు కన్పిస్తోంది గానీ... నా హయాంతో పోలిస్తే, మీరు చేసిన అభివృద్ధి నిష్పత్తి తక్కువ తెలుసా?" అన్నాడు కోపంగా!

సోదరులిద్దరూ సోది ముఖం పెట్టారు. మెల్లిగా మాటలు కూడదీసుకుంటూ, "ఇక బుద్దిగా ఉంటాం" అన్నారు.

"ఏడిసారు పొండి!" అన్నాడు ధీరూభాయ్!

‘ఏదో ఒకటి! పొమ్మన్నాడు. అంతే చాలు" అనుకుంటూ... ఒక్కదుటున వచ్చి టైం మెషీన్ లో పడ్డారు అన్నదమ్ములిద్దరూ!

~~~~~~~~~
ఇది సైన్స్ ఫిక్షన్ లాగా రాజకీయ ఫిక్షన్ కథ! ఇందులో ఈకలు పీకటం, లాజిక్కిలు అడగటం చెయ్యకండేం! అడిగారను కోండి! ఏముంది? మిమ్మల్ని కూడా టైం మెషీన్ ఎక్కించేసి ‘ఏదో కాలానికి, ఎక్కడికో’ పంపించేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మరోసారి తీరికగా టైం మెషీన్ దొరికినప్పుడు మరికొన్ని....


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~

1989 లో బ్యాటరీ ఫ్యాక్టరీ స్థాపించటానికి, నేను దాదాపుగా 16 లైసెస్సులూ, అనుమతులూ, NOC లూ తీసుకోవాల్సి వచ్చింది. అచ్చంగా ‘శివాజీ’ సినిమాలో, రజనీకాంత్ తీసుకోవాల్సి వచ్చినట్లుగా! అదే ఇప్పుడు ఓ బార్ లేదా పబ్బు ప్రారంభించాలంటే... ఇందులో పదోవంతు శ్రమ కూడా అక్కర్లేదేమో! నేనైతే అప్పట్లో వివిధ రకాల డిపార్టమెంట్ల చుట్టూ ఒకటికి పదిసార్లు తిరిగి.... అనుమతులు పొందాల్సి వచ్చింది. వాటిల్లో...

1]. చిన్న తరహా పరిశ్రమ గుర్తింపు. [Small Scale Industry Registration. SSI అంటారు.] జిల్లా పరిశ్రమల కేంద్రం జారీ చేస్తుంది. ఇది నాకు కొంత సులభంగానే దొరికింది. ప్రోత్సాహకరంగానే ఇవ్వబడింది.

2]. APSEB [అప్పట్లో ‘ట్రాన్స్ కో’ ని ఇలాగే పిలిచేవారు.] నుండి విద్యుత్ సరఫరా కోసం Letter of Committment తీసుకోవాల్సి వచ్చింది. సదరు ఫార్మాలిటీస్ తర్వాత ముందుగా వాళ్ళ అనుమతి లేఖని, తర్వాత విద్యుత్ సరఫరా కనెక్షన్ ని ఇచ్చారు. అందుకు నాకు చాలా సమయం, డబ్బు, శ్రమా ఖర్చయ్యాయి. అది అప్పట్లో [ఇప్పట్లో కూడా నేమో] ఎవరికైనా తప్పని తిప్పలే!

3]. నా ఫ్యాక్టరీ ఏ గ్రామ పరిధిలోకి వస్తుందో, ఆ పంచాయితీ నుండి, NOC [No Objection Certificate] పొందాలి. దీనికి సర్పంచి నన్ను విసిగించలేదు. ‘వాళ్ళ గ్రామం అభివృద్ది లెక్కలోకి వస్తుంది, తమ గ్రామస్తులకి ఉపాధి అవకాశాలుంటాయి’ అన్న దృష్టితో, అతడు నాకు సహాయం అందించక పోయినా, అడ్డంకులు సృష్టించలేదు.

అయితే బీడీవో, వీడీవోలు బాగానే తిప్పుకున్నారు. ఉదయాన్నే వెళ్తే తప్ప దొరకరు. తర్వాత గుంటూరు టౌన్ కెళ్ళిపోతారు. గుంటూర్లో దొరకరు. నాలుగైదు సార్లుగా నెలపాటు తిరిగి, సదరు కాగితం పుట్టించుకున్నాను. డబ్బు బహుమతి మామూలే! అలా తిప్పించుకోవటం అదో అహం సంతృప్తిగా ఉండేది, అప్పటి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామందికి.

4]. ఇదే విధంగా.... పెదకాకాని మండల ఎమ్మార్వో నుండీ అనుమతి పత్రం పొందాలి. పదిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగి సంపాదించాను. ఇంతా చేసి, తీసుకున్న లంచం అయిదు వందలే! కానీ పదిసార్లు తిరిగాల్సి వచ్చిన ప్రయాణపు పెట్రోలు ఖర్చు తడిసి మోపెడయ్యింది. వాళ్ళ పనులు వాళ్ళకుండటం సహజం.

అయితే దొరికినప్పుడు కూడా... ‘పాపం చాలా సార్లు తిరిగారు’ అన్న concern ఏమీ చూపించేవాళ్ళు కాదు. ఏదో వంక పెట్టి, మరోసారి రమ్మనే వాళ్ళు. అప్పట్లో సెల్లుఫోన్లు లేవు. లాండ్ లైన్లు అధ్యాన్నంగా నడిచేవి. అందుచేత ఫోనులో అప్పాయింట్ మెంట్ లేదా ఆఫీసులో ఎప్పుడుంటారో ఆనుపానులు తెలుసుకుని, కలుసుకునేందుకు వెళ్ళే అవకాశం ఉండేది కాదు.

ఫోనులో అటెండర్లు సరిగా జవాబు చెప్పరు. బక్షీసులు, అంటే టీ కి డబ్బులు అందుకున్నప్పుడు ‘సలాం’ కొడతారు గానీ, తర్వాత మామూలే! మాకే కాదు, మాలాంటి ఎవరికైనా ఇవే అనుభవాలు ఎదురౌతాయి. ప్రభుత్వ కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్ తీరీ అలా ఉండేది. దాన్ని రెడ్ టేపిజం అని పిలవనీ, అలసత్వ అని పిలవనీ, లంచగొండితనం అననీ, సదరు ప్రభుత్వ ఉద్యోగులలో అధికుల దృక్పధం[attitude] ఇలాగే ఉండేది.

5]. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ నుండి అనుమతి పత్రం - ఇది నాకు తేలికగానే లభ్యమైంది. అప్పట్లో అక్కడ ఉన్న ఉన్నతాధికారి నిజాయితీ పరుడు. పైసా లంచం తీసుకోకుండా, తిప్పించుకోకుండా, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, అనుమతి పత్రం ఇచ్చాడు.

6]. VGT ఉడా [అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టాభివృద్ది సంస్థ] నుండి NOC తీసుకోవాల్సి ఉంది. వీళ్ళు గుంటూరులో, ACB ఉన్నతాధికారి సాయిబాబా నే ‘అడ్మినిస్టేషన్ పరంగా, ఏడిపించి ఏడు చెరువులు నీళ్ళు తాగించారనీ, తాను వేరేవాళ్ల ద్వారా తన చిన్న ఇంటికి అనుమతి పత్రం పొందాననీ’ ఏసీబీ అధికారే చెప్పాడు. ఈ విషయం గురించి గత టపాల్లో వివరించాను. అంతటి ఘనులు ఉడావాళ్ళు! తిరుపతి, హైదరాబాద్ [TUDA, HUDA]... ఎక్కడైనా వీళ్ళింతే! ఇక వాళ్ళ నుండి NOC పొందటానికి ఎన్ని విజిట్స్ చేసి ఉంటానో ఊహించ గలరు.

7]. రోడ్లు భవనాల శాఖ నుండి నిరభ్యంతర పత్రం [No Objection Certificate] తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసం సదరు డిపార్ట్ మెంటు వారికి, నేను ‘భవిష్యత్తులో వాళ్ళు రోడ్డు విస్తరించ దలిచినపుడు, అవసరమైతే నా ఫ్యాక్టరీ భూమిని వాళ్ళిచ్చిన ధర పుచ్చుకొని అప్పగిస్తానని’ ఒప్పందపత్రం [under-taking letter] వ్రాసి ఇవ్వాల్సి వచ్చింది. ఇందుకోసం నోటరీ సంతకాలనీ, అదనీ ఇదనీ, బాగానే శ్రమపడాల్సి వచ్చింది. ఒకటికి పదిసార్లు తిరగాల్సి వచ్చింది. అవన్నీ ఉంటేనే గానీ, బ్యాంకు ఋణాలు రావు మరి!

8]. కాలుష్య నివారణ మండలి [Pollution control Board] నుండి నిరభ్యంతర పత్రం [NOC] తీసుకోవాల్సి వచ్చింది. అసలు వీళ్ళంత సమాజ కాలుష్యకారులు మరొకరుండరు.

9]. నేను బ్యాంకులకు సెక్యూరిటీగా ఇస్తున్న ఆస్తుల విలువ కట్టించటం,

10]. అడంగళ్ కాపీలు

11]. అస్థి రిజిస్ట్రేషన్ హక్కుల కాపీ [Title Dead]లపై న్యాయ సలహాతో కూడిన స్పష్టీకరణలు, బ్యాంకుకు పొందుపరిచాను.

12]. నా బ్యాటరీ ఉత్పత్తికి ట్రేడ్ మార్క్ ను, చెన్నైలోని జోనల్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించాను.

13]. ఫ్యాక్టరికీ కావలసిన నీటి వసతి కోసం బోరు వేయిస్తే... `అందులో నీళ్ళు పడతాయని, నీటి లభ్యత భవిష్యత్తులో దశాబ్దాల పాటు ఉంటూందనీ' భూగర్భ జల వనరుల శాఖ నుండి హామీ పత్రం [certificates], తీసుకున్నాను.

దాదాపు 20 ఏళ్ళు గడిచినందున, మరింకో 3 పత్రాలు సరిగా గుర్తు రావటం లేదు.

అయితే... పైన ఉదహరించిన ఒక్కో అనుమతి పత్రం కోసం, పరిగణించదగినంతగా... సమయాన్ని, శ్రమనీ, డబ్బునీ వెచ్చించాను. ఒకటికి పదిసార్లు తిరిగితే గానీ ఏ పనులూ కాలేదు.

ఇంత తిప్పట, చికాకులు చూస్తే ‘ఓ పరిశ్రమ పెడతానంటూ సామాన్యులెవరూ ముందుకు రాకూడదు’ అన్నట్లే ఉండేది ప్రభుత్యోద్యోగులలో కొందరి వ్యవహార సరళి! రాజకీయ, వ్యాపార లేదా ఉన్నతాధికార నేపధ్యం ఉన్న కుటుంబంలో నుండి వచ్చేవారికి, ఏమైనా సులభంగా పనులుయ్యేవేమో గానీ, నా తోటి వాళ్ళు, నాలాగే ఇబ్బందులు పడటాన్నే చూశాను నేను.

‘ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే చాలు, జీవిత లక్ష్యం నెరవేరినట్లే. జీవితానికీ భద్రత చేకూరినట్లే!’

తమ దగ్గరికి పనులు నిమిత్తమై వచ్చే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం ఉండేది చాలామంది ఉద్యోగుల దగ్గర! ఇక పరిశ్రమ స్థాపనకై వచ్చేవాళ్ళు, వాళ్ళకి తమ అవసరాలు తీర్చే కల్పతరువుల్లాగా కనబడేవాళ్ళు! అలాగయ్యీ అవినీతిలోనూ సూటిదనం ఉండేది కాదు. లంచం తీసుకున్నా సరే, "ఏదో దయతలచి పనిచేస్తున్నాం" అన్నట్లుండేది ధోరణి.

ఈ విధంగా ఎన్నో చికాకులు, సమస్యలు భరించి పరిశ్రమ స్థాపించినందున, ఓసారి NISIET లో మా కోర్సు డైరెక్టరు, తన బంధువైన ఓ అమ్మాయి... ‘భారతదేశంలో ప్రస్తుతం [అంటే 1990-91లో] ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి’ పరిశోధన చేస్తుంటే... కేస్ స్టడీ కోసం ఆమెను నా దగ్గరికి పంపించారు. కర్ణాటకకు చెందిన ఆ అమ్మాయికి, మా ఇంట్లోనే వసతి కల్పించి, ఓ వారం పాటు నా అనుభవాలన్నీ చెప్పాను. ఆమె అడిగిన సందేహాలన్నీ తీర్చాను.

నా పేరు ‘వర్ష’ గానూ, నా ఫ్యాక్టరీ పేరు ఇండియన్ బ్యాటరీ ఇండస్ట్రీస్ ను, ‘భారత్ ఇండస్ట్రీస్’ గా మార్చి, ఆమె థీసీస్ సమర్పించింది. ఓ ఏడాది తర్వాత, ఆమెకు డాక్టరేట్ తో పాటు, గోల్డ్ మెడల్ వచ్చిందని నాకు లేఖ వ్రాసినప్పుడు, ఎంతగానో సంతోషించాను. ‘ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా నా అనుభవాలు మరికొందరికి పరిస్థితుల పట్ల అవగాహన కలిగించగలవు కదా!’ అనిపించింది.

ఈ విధంగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, నా జీవన ప్రయాణంలో... నేను ఎందరో అవినీతిపరులనీ, పరమ నీచ ప్రవృత్తి కలవారినీ చూశాను. అదే విధంగా... నిజాయితీ పరులనీ, తమ పనిపట్ల నిబద్దత గలవారిని, సామాజిక బాధ్యతా, స్పృహా గల వారినీ చూశాను.

ముందుగా నా పాజిటివ్ అనుభవాలని వివరిస్తాను. ప్రభుత్వోద్యోగుల నుండి, ఇతరుల నుండి... ప్రోత్సాహాన్ని, సహాయ సహకారాలని అందుకున్న అనుభవాలవి! అవి కొన్నే గనుక, ముందుగా వాటిని వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

దాదాపు రెండు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఈ బ్లాగులో ఉన్న 425+ టపాలలో, పది పదిహేను టపాలు తప్ప, మిగిలిన అన్నీ ఒకదానికొకటి సంబంధమున్నవే.

భారతదేశం మీద, హిందూమతం మీద, హిందూ జీవనవిధానం మీద, హిందూ సంస్కృతి మీద, ఒక్కమాటలో
చెప్పాలంటే మొత్తం మానవత్వం మీద, సుదీర్ఘకాలం నుండి, అన్నిరంగాలలో జరిగిన, జరుగుతున్న కుట్రని
వివరించటానికే అన్ని టపాలూ ఉద్దేశింపబడినాయి.

అయితే, కొత్తగా ఈ బ్లాగులోకి వచ్చేవారికి ఇన్ని టపాలలో మొదటి నుండీ చదువుకోవాలంటే…..ఇన్ని సుదీర్ఘమైన
అనేక టపాలలో ఏది ముందో ఏది వెనకో తెలుసుకోవాలంటే….. దాన్ని బట్టి Sequence అర్ధం
చేసుకోవాలంటే…… ఉన్న ఇబ్బందిని తొలగించటానికి ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా ఒక విషయం: మనదేశం మీద, మన సంస్కృతి మీద, మన మతం మీద, మన మీద జరుగుతున్న ఈ
కుట్ర గురించిన పరిజ్ఞానం, అవగాహన విషయంలో కుట్రదారులు Ph.D. స్థాయిలో ఉంటే, సామాన్య ప్రజలలో
అత్యధికులు నిరక్షరాస్యుల స్థాయిలోనూ, కొద్దిమంది ‘అఆఇఈల’ స్థాయిలోనూ ఉన్నారు. ఎందుకంటే
సామాన్యప్రజలు, ఎంతగా మీడియా విషప్రచారంలో పడి కొట్టుకుపోతున్నా, ప్రాధమికంగా అంతగా చెడుని,
కుట్రలని ఊహించలేరు కాబట్టి. ఊహించనే లేని వారికి వాటిని గుర్తించటం, అర్ధం చేసుకోవటం కొంచెం తికమకగా,
గందరగోళంగా అన్పిస్తుంది.

అంతేగాక, మా బ్లాగులోనికి కొత్తగా వచ్చేవారికి, కొన్నిపదాలు కూడా వింతగానూ, తలా తోక తెలియనట్లుగానూ
ఉంటాయి. వాటి తొలివివరణ ఎక్కడో ముందటి టపాలలో ఉంటుంది.

అటువంటి అసౌకర్యాలని పరిష్కరించటానికి, అన్నిటపాలని, తేదీల వారిగా మొదటి నుండి చూడగలిగేటట్లు, ఒక టపా ద్వారా ఏర్పాటు చేసాము. ‘ఈ బ్లాగుని అనుసరించటం ఎలా?’ లేదా ‘అన్నిలేబుల్స్ ఒకే టపాలో - 01’, మరియు ‘అన్ని లేబుల్స్ ఒకే టపాలో - 02' అనే ఈ టపాలో లేబుల్స్ ప్రకారం బ్లాగు టపాలని రిఫర్ చేయగలిగే ఏర్పాటు చేసాము.

ముఖ్యగమనిక: ఇది నేను ఎవరి కోసం వ్రాస్తున్నానంటే – ఎవరయితే ’ఇది నిజం, వీటి గురించి తెలుసుకోవాలి’
అని నమ్మేవాళ్ళ కోసం వ్రాస్తున్నాను. ఈ టపాలు అర్ధరహితంగా అన్పించిన వాళ్ళు, ఈ బ్లాగును నిరభ్యంతరంగా
విస్మరించవచ్చు.

01]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ ఒకేసారి చూడాలంటే –
తేదీల ప్రకారం అన్నిటపాలు ఒకేచోట ఉంటాయి.

000]. మా గురించి...

001]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ [1 - 300 వరకూ] ఒకేసారి చూడాలంటే – 01 [Oct. 16, 2009]

002]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ [301 నుండి] ఒకేసారి చూడాలంటే – 02 [Feb. 28, 2010]

003]. పీవీజీ - రామోజీరావు - మా కథ [Aug. 18, 2010]

004]. అన్నిలేబుల్స్ ఒకే టపాలో - 01 [Dec.22, 2009]

005]. అన్ని లేబుల్స్ ఒకే టపాలో - 02 [Aug. 18, 2010]01]. పీవీజీ – రామోజీరావు – మా కథ:
రామోజీ రావు మీద నేను పీవీజీకి చేసిన ఫిర్యాదు, దాని పర్యవసానంగా నాకుటుంబాన్ని వేధించిన తీరు, ఆ వేధింపుని అడ్మినిస్ట్రేషన్ పరంగా లేదా రాజ్యాంగబద్దంగా ఋజువు చేసిన తీరు:

01. ఎవరీ నకిలీ కణికుడు? – వివరాలివిగో [Dec.21, 2008]

02. ఊహాగానాలు కాదు – ఉన్ననిజాలు [మారిన భారత ముఖ చిత్రం] [Jan.17, 2009]

03.భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 42[ప్రధాని పీ.వి. – తొలి సమస్యలు] [Mar.09, 2009]

04. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 43 [మందిర్ – బి.జే.పి., ఆర్.ఎస్.ఎస్.] [Mar.10, 2009]

05. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 44 [నా పరిశీలన, పరిశోధన] [Mar.11, 2009]

06. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 45 [కొనసాగిన నా పరిశీలన] [Mar.12, 2009]

07. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 46 [రిజర్వేషన్లు] [Mar.13, 2009]

08. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 47 [మరికొంత పరిశీలన] [Mar.14, 2009]

09. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 48 [వై.ఎస్.రాజశేఖర రెడ్డి – కుముద్ బెన్ జోషి][Mar.16, 2009]

10. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 49 [ప్రధానికి నేనిచ్చిన ఫిర్యాదు] [Mar.17, 2009]

11. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 50 [నా ఫిర్యాదు అనంతర పరిస్థితులు] [Mar.18, 2009]

12. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 51 [కొన్ని అసాధారణలు – అసహజాలు] [Mar.19, 2009]

13. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 52 [శ్రీశైలం – మండలి వెంకట కృష్ణారావు] [Mar.20, 2009]

14. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 53 [నంబూరు పల్లెలో] [Mar.21, 2009]

15. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 54 [గుంటూరు కార్పోరేట్ కాలేజీల్లో] [Mar.24, 2009]

16. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 55 [సూర్యాపేటలో] [Mar.25, 2009]

17. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 56 [ఇంటర్ పేపర్ లీక్] [Mar.26, 2009]

18. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 57 [ఎంసెట్ కోచింగ్] [Mar.28, 2009]

19. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 58 [ఎంసెట్ ర్యాంకుల మోసంపై ఫిర్యాదు] [Mar.30, 2009]

20. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 59 [ఎంసెట్ ర్యాంకుల మోసపు తీరుతెన్నులు] [Mar.31, 2009]

21. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 60[ఎంసెట్ ర్యాంకుల మోసాల పర్యవసానాలు] [April 01, 2009]

22. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 61[వ్యవస్థీకృత వేధింపు] [April 02, 2009]

23. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 62[కొనసాగిన వ్యవస్థీకృత వేధింపు] [April 07, 2009]

24. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 63[సూర్యాపేట నుండి నిష్క్రమణ] [April 08, 2009]

25. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 64[చంద్రబాబు చిత్రమైన ధోరణి] [April 09, 2009]

26. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 65[నా తమ్ముడితో లోకేష్ స్నేహం] [April 11, 2009]

27. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 66[హైదరాబాదుకు వీడ్కోలు] [April 13, 2009]

28. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 67[మళ్ళీ శ్రీశైలంలో…..] [April 14, 2009]

29. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 68[7వ తరగతి ఫలితాలపై ఫిర్యాదు – చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు] [April 15, 2009]

30. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 69[మా చిన్నారుల లోకం] [April 16, 2009]

31. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 70[చిన్నారులకు నేర్పుతూ, మేము నేర్చుకున్న పాఠాలు] [April 17, 2009]

32. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 71[పాఠశాల విద్యపై కుట్ర] [April 18, 2009]

33. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 72[శ్రీశైలంలో మాకు గది కేటాయింపు] [April 21, 2009]

34. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 73[వేధింపుకు పరాకాష్ఠ] [April 22, 2009]

35. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 74[మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు] [April 23, 2009]

36. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 75[అడ్మినిస్ట్రేషన్ పరంగా మా యుద్ధం] [April 24, 2009]

37. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 76[వేధింఫుల వెనుక అంతరార్ధం] [April 25, 2009]

38. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 77[రాష్ట్రపతి కలాం, సోనియా గాంధీలకి ఫిర్యాదు] [April 27, 2009]

39. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 78[కేసు విచారణలో భాగంగా స్టేట్ మెంట్లు] [April 28, 2009]

40. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 79[సిబిసిఐడి ఐజి – శ్రీశైలం ఈ.వో.] [April 29, 2009]

41. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 80[రాష్ట్రపతి కలాం లేఖ – దిగ్విజయ్ సింగ్ లేఖ] [April 30,2009]

42. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 81[శ్రీశైలంలో చివరిరోజు నాటకీయ మలుపులు] [May 01, 2009]

43. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 82[ఢిల్లీ ఏ.పి.భవన్ నుండి హైకోర్టు దాకా] [May 02, 2009]

44. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 83[పూర్తయిన అడ్మినిస్ట్రేషన్ యుద్దం] [May 03, 2009]

45. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 84[ఇప్పుడు మొదలైన అసలు కథ][May 04, 2009]

46. భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 85[రాజ్యాంగ విఫలం సత్యం – రామోజీరావు వేధింపు సత్యం] [May 06, 2009]

47. ఈనాడు రామోజీరావు ప్రమేయం – మరోసారి సంఘటనాత్మకంగా ఋజువు [Aug.18, 2009]


00.పరమ గురువు, తాత పీవీజీ కి అక్షర నీరాజనం ![July 25, 2010]

00. అండర్సన్ లు – అధిష్టానాలు – ఎన్ని విషవాయువులో! [June 11, 2010]

00. భోపాల్ పాపాలు పీవీజీవేనా?– 1[Aug. 13, 2010]

00. భోపాల్ పాపాలు పీవీజీవేనా? – 2[Aug. 16, 2010]02]. ఒకే అంశం - విభిన్న కోణాలు:

01. తెలుగు వారిలో ఆత్మగౌరవం, ఐకమత్యం లోపించాయా? [ఒకే అంశం – విభిన్న కోణాలు -01] [July 21, 2010]

02. ‘మహా కిరాతకం’లో కొన్ని కీలక ఘటనలు![ఒకే అంశం – విభిన్న కోణాలు -02] [July 24, 2010]

03. రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం![ఒకే అంశం – విభిన్న కోణాలు -03] [July 26, 2010]

04. చంద్రబాబు, రామోజీరావు+సోనియాల మధ్య నడుస్తున్న సంకేత భాష![ఒకే అంశం – విభిన్న కోణాలు -04] [July 27, 2010]

05. మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు -05] [July 28, 2010]

06. జనం పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు -06] [July 31, 2010]

07. చేసింది చెప్పకా తప్పదు! తిన్నది కక్కకా తప్పదు! [ఒకే అంశం – విభిన్న కోణాలు -07] [Aug. 01, 2010]

08. రానున్న వెయ్యేళ్ళ పాటు ఎవ్వరూ గూఢచర్యం జోలికెళ్ళకూడదు![ఒకే అంశం – విభిన్న కోణాలు -08] [Aug. 03, 2010]

09. చెప్పనిస్తే ఎన్ని వాదనలైనా చెబుతారు![ఒకే అంశం – విభిన్న కోణాలు -09] [Aug. 04, 2010]


03]. ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?:

01. ప్రజాదృష్టి Vs తమో గుణం [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 01] [Feb. 05, 2010]

02. త్రిగుణాలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 02] [Feb. 06, 2010]

03. నెం.5 వర్గం - రజోగుణం రగలాల్సిందే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 03] [Feb. 07, 2010]

04. నెం.5 వర్గం యుద్దరీతి [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 04] [Feb. 09, 2010]

05. సమాజం చెత్తకుండీ కాదు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 05] [Feb. 10, 2010]

06. ఓటమే స్ట్రాటజీగా... [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 06] [Feb. 11, 2010]

07. ఓటమి స్ట్రాటజీనే ఎందుకు? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 07] [Feb. 13, 2010]

08. సమాచార సేకరణ - విశ్లేషణ - అమలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 08] [Feb. 14, 2010]

09. నిర్ధారణ - టాంపరింగ్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 09] [Feb. 16, 2010]

10. నాలుగు దశలలో తొలిదశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 10] [Feb. 17, 2010]

11. ప్రధానిగా పీవీజీ ఓటమి వరకూ రెండోదశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 11] [Feb. 18, 2010]

12. మధ్యంతర ఎన్నికలు - మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 12] [Feb. 19, 2010]

13. వెతుకులాటలు - మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 13] [Feb. 20, 2010]

14. టాంపరింగ్ అన్వేషణ – మూడో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 14] [Feb. 22, 2010]

15. పీవీజీ మరణం వరకూ – మూడో దశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 15] [Feb. 23, 2010]

16. ఇందిరా గాంధీ – సోనియా – నాలుగో దశలో [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 16] [Feb. 24, 2010]
http://ammaodi.blogspot.com/2010/02/16.html
17. ఓటమే స్ట్రాటజీ మా కేసులో – రామోజీరావు off/on [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 17] [Feb. 25, 2010]
http://ammaodi.blogspot.com/2010/02/offon-17.html
18. రామోజీరావు కీ, నెం.5 వర్గానికీ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 18] [Feb. 26, 2010]
http://ammaodi.blogspot.com/2010/02/5-18.html
19. చేదు గురుతులే కాదు తీపి జ్ఞాపకాలు కూడా! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 19] [Feb. 27, 2010]
http://ammaodi.blogspot.com/2010/02/19.html
20. మనిషి బొమ్మ తిరగేస్తే మ్యాపే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 20] [March. 01, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/20.html
21. పది - తాత - రక్షకుడు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 21] [March. 02, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/21.html
22. పూసలోళ్ళ చేపల పులుసు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 22] [March. 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/22.html
23. మాకూ, నెం.5 వర్గానికి మధ్య గల సంబంధం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 23] [March. 05, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/5-23.html
24. ప్రజాస్వామ్యంలో పౌరధర్మం, రాజధర్మం అంటూ వేరుగా లేవు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 24] [March. 06, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/5-24.html
25. నూజివీడు దాండియా – చోటా మోటాల ఆట [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 25] [March. 09, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/25.html
26. సినిమాల నేపధ్యంలో నడిచే భాష - భారతీయుడు, ఠాగూర్ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 26] [March. 10, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/26.html
27. భారతీయ మహిళ – వివాహ వ్యవస్థ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 27] [March. 11, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/27.html
28. మనం జీవించడం దేశాన్ని ఉద్దరించడమా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 28] [March. 12, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/28.html
29. చట్టాలు - సామాజిక బాధ్యతలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 29] [March. 15, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/29.html
30. 300 యోధులు – నకిలీ కణిక అనువంశీయుడికి అచ్చమైన ప్రతిరూపమే జెక్సీస్ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 30] [March. 17, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/300-30.html
31. బానిసత్వానికీ, స్వేచ్ఛాస్వాతంత్రాలకీ ఉన్న వ్యత్యాసం [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 31] [March. 19, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/31.html
32. మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 32] [March. 20, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/32.html
33. లియోనైడర్స్ రాణి – రామోజీరావు భాష ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 33] [March. 21, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/33.html
34. మరికొన్ని సినిమాలు – మరికొంత భాష ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 34] [March. 23, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/34.html
35. లగాన్ – ఖడ్గం – కథ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 35] [March. 27, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/35.html
36. అరుంధతిలో అన్వర్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 36] [March. 29, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/36.html
37. మరణానంతరమూ కొనసాగే భావప్రసారం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 37] [March. 30, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/37.html
38. రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం – సమస్య [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 38] [March. 31, 2010]
http://ammaodi.blogspot.com/2010/03/38.html
39. క్రికెట్ లో క్యాచ్ లాగా పలుకోణాలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 39] [April 01, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/39.html
40. తెల్లకాకులని ఎప్పుడైనా చూసారా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 40] [April 03, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/40.html
41. గయోపాఖ్యానం కి మరో రూపం [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 41] [April 06, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/41.html
42. సుందోప సుందులతో నెం 5 వర్గపు ఆట ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 42] [April 08, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/5-42.html
43. పకోడి ముక్క కోసం బోనులో చిక్కిన ఎలుక! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 43] [April 10, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/42.html
44. 8 గమ్మత్తు – 7వ తారీఖు, 7వ నెల! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 44][April 12, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/8-7-7-42.html
45. తెర మీద పెళ్ళి – విదేశీ కోచ్! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 45][April 13, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/45.html
46. అందరూ కోచ్ లే – అద్దం కథ ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 46][April 14, 2010]
47. సెలబ్రిటీల జీవితాలు – సుడి గుండాలు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 47] [April 16, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/47.html
48. సోనియాకి దెబ్బలమ్మాయి సానియా![ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 48] [April 17,2010]
http://ammaodi.blogspot.com/2010/04/48.html
49. తెలంగాణా - రెడీ 123…. [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 49] [April 19, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/123-49.html
50. తమిళ కారన్ - సోనియా ఉజ్జయినీ మొక్కు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 50] [April 20, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/50.html
51. తమకు రాని విద్యని మరొకరికి నేర్పటమంటే కామెడీనే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 51] [April 21, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/51.html
52. 10 అనుకుంటే భయపడు, 5 అనుకుంటే భ్రమపడు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 52] [April 22, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/10-5-52.html
53. హింట్స్ ఇచ్చి వ్యాసం - హెడ్డింగులు ఇచ్చి విషయపు పూర్తి పాఠం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 53] [April 23, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/53.html
54. ద్రౌపది ధర్మసందేహం - వికటకవి సమాధానం! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 54] [April 24, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/54.html
55. ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతిపుంజముగా [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 55] [April 27, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/55.html
56. లోపలి మనిషి నుండి అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 56] [April 28, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/55_28.html
57. సంకల్ప సిద్ది - తాత ఎవరికయినా తాతే! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 57] [April 29, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/57.html
58. మాతృభూమిపై మమకారం ఎప్పుడుంటుంది? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 58] [April 30, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/58.html
59. ‘దుష్టశిక్షణ – శిష్టరక్షణ’ విషయమై నెం 5 వర్గపు పనితీరు! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 59] [May 01, 2010]
http://ammaodi.blogspot.com/2010/05/5-59.html
60. వాదులాటలు – చొప్పదంటు మాటలు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 60] [May 03, 2010]
http://ammaodi.blogspot.com/2010/05/60.html
61. మానసిక యుద్ధతంత్రాలు - మా తోటి సైనికులు [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 61] [May 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/05/61.html
62. ఇది ఒక అజ్ఞాత సైనికుడి పరిశీలన ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 62] [May 05, 2010]
http://ammaodi.blogspot.com/2010/05/62.html
63. వ్యవస్థీకృత కుట్ర ఉంది – కుట్రా? అలాంటిదేం లేదే ! [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 63] [May 06, 2010]00. నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్ - ఒక స్ట్రాటజీ! [June 03, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/blog-post.html
00. పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ - మరో స్ట్రాటజీ! [June 04, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/blog-post_04.html

00. ప్రజల్ని గోతిలో పడెయ్యటం ఎలా? – ఎంసెట్ లెక్క! [July 01, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post.html
00. ప్రభుత్వానికి తక్షణ ఆదాయం – పరమ రహస్యం సుమా![July 12, 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post_12.html

ముందుగా ఆగస్టు 16వ తేదీ 2010, ఈనాడు వార్తాపత్రికలో ప్రచురింపబడిన క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి.

>>>ఆచార్యపై ఆయనకే నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి.
>>>ఎమ్మార్ వ్యవహారంలో ఏపీఐఐసీకి సంకటం.
>>>వివాదంలో చిక్కుకున్న అధికారి ఉన్నత స్థాయిలో ఉంటే ఆయన గురించి అభియోగాల నివేదికను ఆయన చేతికే ఇవ్వాల్సిన వస్తే... వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి వెళతాయా? తన గురించి నివేదికను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారా?
~~~~~~

ఎవరి మీద ఫిర్యాదు లేదా అవకతవకలను గురించిన నివేదిక ఉందో, దాన్ని వాళ్ళ దగ్గరికే, విచారణకై పంపిస్తే....? తమ మీద తామే చర్య తీసుకుంటారా? తమని తామే శిక్షించుకుంటారా?

"ఆయనే ఉంటే మంగలెందుకు?" అన్న సామెత చందాన, అంత సచ్చీలతే ఉంటే అసలు అవకతవకలకీ, అక్రమాలకీ పాల్పడరు కదా!?

ఇక్కడ మీకు కొన్ని వాస్తవ సంఘటనలు వివరిస్తాను.

1991లో... అప్పట్లో, నేను బ్యాటరీ తయారీ సంస్థ అధినేతగా... ఇండియన్ బ్యాంకు ఖాతాదారుని. అయితే ఆ బ్యాంకు రీజనల్ మేనేజరు, మరో అధికారి, నన్ను బాగా చికాకులకి గురి చేస్తుండేవాళ్ళు. ఆ మీదట, అప్పట్లో ఢిల్లీ లో ఫైనాన్షియల్ అఫైర్స్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న కె.జె.రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసాను. [ఈయన 1992 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ నుండి బదిలీ అయి వచ్చాడు.]

తక్షణమే నా సమస్య మీద స్పందించి, ఫోన్ ద్వారా ఇండియన్ బ్యాంకు హెడ్డాఫీసు[చెన్నై]లోని ఉన్నతాధికారితో మాట్లాడి, పరిష్కార మార్గం సూచించాడు.

అంతే తప్ప... రీజనల్ మేనేజరు మీది ఫిర్యాదుని, అతడికే పంపలేదు.

అలాగే... 1992లో ఆర్టీసీలో ఒక డైరెక్టరు, బినామీ పేరుతో బ్యాటరీ సంస్థ నడుపుతూ, మాలాంటి చిన్న సంస్థలని దెబ్బకొడుతున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే, సీఎం సెక్రటరీ చక్రపాణి అనే ఐఎఎస్ అధికారి, దానిపై విచారణ చేసాడు.

అంతేతప్ప... అతడి మీద ఫిర్యాదుని, అతణ్ణే విచారించుకొమ్మని, సదరు ఆర్టీసీ మెటీరియల్ డైరెక్టరుకి పంపలేదు!

ఇక 2004 తర్వాత......

మేము శ్రీశైలంలో స్కూలు నడుపుకుంటున్న రోజుల్లో, మాపై నడుస్తున్న వ్యవస్థీకృత వేధింపు, అందులో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రమేయం గురించిన ఫిర్యాదుని... కాంగ్రెస్ అధ్యక్షురాలూ, యూపీఏ ప్రభుత్వ కుర్చీవ్యక్తీ అయిన సోనియాకీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీ, అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కీ పంపించాము.

ఆ ఫిర్యాదు, విచారణ నిమిత్తమై, తిరిగి రాష్ట్రప్రభుత్వానికే పంపబడింది. ఆ విషయాన్ని... సిబిసీఐడీ ఐజీ కృష్ణ్ర రాజ్ స్వయంగా ధృవీకరించాడు. ఆ ఫిర్యాదు కాగితాలను, నేను శ్రీశైలం పోలీసు స్టేషన్ లో, సిఐ చూపగా కూడా చూసాను.

అలాగే 2007లో మా స్కూలు ఊడగొట్టబడ్డాక, మొత్తం వేధింపుని వివరిస్తూ, వై.యస్. మీద... ప్రధానికి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు యధాతధంగా రాష్ట్రప్రభుత్వానికే పంపబడింది. ఆ ఫిర్యాదును పట్టుకుని సిబిసీఐడీ అధికారి, మా ఇంటికి వచ్చాడు. అతడి మాటల్లోనే "నేను మీ గురించి పాజిటివ్ గా వ్రాస్తానండి. తరువాత పైఅధికారులు మారిస్తే నాకు తెలియదు. భగవంతుడు మీకు మంచి చేయాలని కోరుకుంటాను" అని చెప్పాడు.

అంటే వై.యస్. మీద పెట్టిన ఫిర్యాదుని, విచారించి చర్య తీసుకొమ్మని, తిరిగి వై.యస్.కే పంపించాడన్న మాట.[అది ఒకటికి రెండోసారి!]

మరొక సంఘటన....

ఆ కోవలోనే... మేము శ్రీశైలంలోని సీఐ కరుణాకర్ మీద... ‘మాపై వ్యవస్థీకృత వేధింపు గురించీ, దానికి దారి తీసిన మా మొదటి ఫిర్యాదు [పీవీజీకి రాజీవ్ హత్యపై రామోజీరావు సంబంధం గురించిన ఫిర్యాదు] గురించీ, స్థానిక సీఐ దృష్టికి తీసికెళ్ళి, సహాయం కోరితే అతడు, మా మీద, పీవీజీ మీద కూడా జోకులేసాడు. ఆ విషయమై నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.కీ, సోనియాకీ, ప్రధానికీ, రాష్ట్రపతికీ ఫిర్యాదు పంపాము.

అదీ... చాలా మామూలుగా... మళ్ళీ మా ఊరి సీఐ దగ్గరికే, విచారణ నిమిత్తం పంపించబడింది. ఆ విషయం అతడే ధృవీకరిస్తూ మా దగ్గరి నుండి స్టేట్ మెంట్లు వ్రాయించుకున్నాడు. [అప్పటి వివరాలన్నీ పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే లేబుల్ లో వివరంగా వ్రాసినవే!]

అంటే - సీఐ మీద పెట్టిన ఫిర్యాదు, విచారణ చేసి చర్య తీసుకునే నిమిత్తం సీఐకే పంపబడింది.

పోనీ... ఫిర్యాదు అతడి డిపార్ట్ మెంట్ పనితీరు మీదనైనా అయితే.... "సర్లే! ఎక్కడ లోటుపాట్లున్నాయో తెలుసుకొని సరిదిద్దుకుంటాడు" అని పంపించారనుకోవచ్చు.

అసలు ఫిర్యాదే అతడి అక్రమాల గురించి అయినప్పుడు... ఎవరి మీదైతే ఫిర్యాదు ఇచ్చామో... వాళ్ళకే దాన్ని పంపించడ మంటే... ఏమిటి సంకేతం?

"ఇదిగో! వీళ్ళెవరో! నీ మీదే ఫిర్యాదు చేసేరు. వాళ్ళ సంగతేమిటో ఓ చూపు చూస్కో!" అనటమే కదా?

[అలాగే ముఖ్యమంత్రీ, సీఐ లు కూడా మా భరతం పట్టే ప్రయత్నమే చేసారు లెండి.]

మరో సంఘటన ఏమిటంటే...

ఇప్పుడు మేమున్న నంద్యాలలో, అప్పుడప్పుడూ మా ఇంటర్ నెట్ కనెక్షన్ అంతరాయం పొందుతూ ఉంటుంది. సరిగ్గా శనివారం[ఎక్కువగా] రోజంతా పనిచేయకపోవటం జరుగుతుంటుంది. ఓ సారైతే వారంలో మూడు సార్లు ఇలా జరిగింది.

సదరు అధికారి జె.ఇ. ఎప్పుడు ఫోన్ చేసినా, కార్యాలయానికి వెళ్ళి కలుద్దామన్నా సీట్ లో ఉండడు. ఫోన్ లో ఫిర్యాదు ఇచ్చినా అది సా...గుతుంది గానీ, మనకి సర్వీసు పునరుద్దరింపబడదు.

దాంతో విసిగి పోయి ఓసారి "ఫలానా జేఇ మీద ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి చెప్పండి" అని అడిగాము.

దానికా డిపార్టుమెంటు ఉద్యోగి "ఎవరికిచ్చినా తిరిగి అది మా దగ్గరికే వస్తుంది మేడం" అన్నాడు.

‘అంటే అది పైనుండి క్రింది దాకా విస్తరించిన అడ్మినిస్ట్రేషన్ తీరన్న మాట’ అనుకున్నాము.

ఇక ఇలాంటి చోట, అవినీతి ప్రభుత్వాధికారి, ప్రజలకేం న్యాయం చేస్తాడు? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్దం! ఎందుకంటే ప్రజల విధులలో ఒకటి - అక్రమాలు దృష్టికొచ్చినప్పుడు ఫిర్యాదు చేయటం.

1992కు ముందు అడ్మినిస్ట్రేషన్ తీరు ఇలా లేదు. తరువాత ఎప్పుడు చల్లగా చట్టాలు మార్చుకున్నారో తెలియదు. మొత్తానికీ, ఎంచక్కా, తమకు అనుకూలంగా చట్టాలు మార్చుకున్నారు. ఎవరయినా అవినీతి గురించి ప్రశ్నిస్తే ఇక అంతే సంగతులన్న మాట. బహుశః అది యూపీఏ ప్రభుత్వ ప్రత్యేకత కాబోలు!

అలాంటి చోట...
ఎమ్మార్ లో ఆచార్య అయినా
పార్ద సారధి అయినా
ఏమున్నది వింత?

ఇక్కడో గమ్మత్తు ఉంది!

మనం పుణ్యక్షేత్రాలకీ, పర్యాటక కేంద్రాలకీ వెళ్ళినప్పుడు... గుడి గోడల మీదా, రాళ్ళు రప్పల మీదా... రంగుల్తోనో, బొగ్గుముక్కలతోనో, పదునైన కత్తితో చెక్కబడో, పేర్లు వ్రాసి ఉంటాయి. ఫలానా పేరు ఊరు అనో, ఫలానా వాళ్ళు లవ్ ఫలానా అనో... ఇలా!

అవి చూసి మేమెప్పుడూ "బహుశః జీవితంలో ఎటూ పేరు తెచ్చుకోలేం అనుకొని, ఇలాంటి వాళ్ళు, గుడిగోడలను ఖరాబు చేస్తుంటారేమో!" అనుకుని నవ్వుకుంటుంటాము.

సరిగ్గా... అలాగే... ఈ ఎమ్మార్ లో విల్లాలు కట్టుకున్న గొప్పొళ్ళల్లో కొందరు ఐఎఎస్ లు, సలహాదారులు, ఆ కాలనీలో రోడ్లకీ, భవనాలకీ తమ పేర్లు పెట్టించుకున్నారట. ఆచార్య మార్గ్ అనీ, పార్దసారధి భవన్ అనీ!

ఇలాంటి చోట... పీవీజీ పేరిట ఏమీ లేకపోవటమే మేలేమో! లేకపోతే... ఇలాంటి ఐఎఎస్ లు, వీధివీధిలో విగ్రహాలు నెలకొల్పించుకునే మాయవతులు, వై.యస్సులూ..... కూడా, ఒకే జాబితాలోకి చేరిపోగలరు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1988లో APSFC లో, నా ఫ్యాక్టరీ పైలూ, ఆంధ్రప్రదేశ్ లో తొలి పబ్బు ఫైలూ ఒకేసారి టేబుళ్ళ ప్రయాణం ప్రారంభించాయి. నా ఫ్యాక్టరీ వంటి వస్తు తయారీ సంస్థలు మూతపడితే, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా విస్తరించడంలో తెలియటం లేదా, బ్యాంకుల ఋణ సహకారంలోనూ, ప్రభుత్వ పనితీరులోనూ, మిశ్రితమైన కుట్ర తీరు! ఇండియన్ బ్యాంకులోనూ నాది ఇదే అనుభవం!

గతంలో చాలాసార్లు చెప్పినట్లుగా.... 1992 లో రామోజీరావు మీద పీవీజీకి ఫిర్యాదు ఇవ్వక ముందు, గుంటూరు జిల్లా కొప్పురావూరు గ్రామ పరిధిలో - గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పై, నేను ఒక బ్యాటరీ తయారీ సంస్థని స్థాపించాను. అదీ 1989 లో!

ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనే దశలోకి ప్రవేశించక ముందు... విద్యార్దినిగా నా కెరీర్ రికార్డు, చెప్పుకోదగిన విజయాలతోనే ఉండేది. వ్యాసరచన, ఉపన్యాస పోటీ, క్విజ్, ఏకపాత్రాభినయం, నాటక రచన, నటన గట్రాలతో, ఎక్కడ ఏ పోటీలకి వెళ్ళినా బహుమతి పొందకుండా తిరిగి వచ్చేదాన్ని కాదు. మూడేళ్ళుగా మా పాఠశాలకు రోలింగ్ షీల్డుని తెచ్చి, దాన్ని శాశ్వతంగా మా పాఠశాలకు చెందేటట్లు చేసి మా పంతులమ్మల ఆశీర్వాదాలని, అభినందలని పొందాను.

ఆంధ్రప్రదేశ్ బాలల ఆకాడమీ వాళ్ళు నిర్వహించిన పోటీలలో గుంటూరు జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచి 45 రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో పాల్గిన్నాను. హైదరాబాద్ నిసియట్ [NISIET] లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కిచ్చే శిక్షణ పూర్తి చేశాను.

ఈ సందర్భంలో, విషయాంతరమైనా... ఓ సరదా సంఘటన వివరిస్తాను.

అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా పాఠశాల వార్షికోత్సవంలో ‘తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాత’ అయిన చోళ రాజు గురించిన నాటకం ప్రదర్శించాము. అందులో నాది రాజు పాత్ర. తాను ఎంతో గొప్పదైన భారీ ఆలయాన్ని, ఎంతో డబ్బు వెచ్చించి నిర్మించానని పొంగిపోతూ, రాజు, తన పేరు శాశ్వతంగా నిలిచి ఉండేలా శిలా స్మారకాన్ని నిర్మించాలను కుంటాడు.

అయితే సువర్ణాక్షరాలతో వ్రాయించిన తన పేరును చెరిపేసి, ఓ ముసలమ్మ పేరును దేవుడు వ్రాసినట్లుగా రాజుకి కల వస్తుంది. పదే పదే అలాంటి కలను దర్శించిన రాజు, కోపంతో, ఆ ముసలమ్మ ఎవరో, ఆలయ నిర్మాణం కోసం ఆమె ఏం చేసిందో వివరాలు సేకరిస్తాడు.

ముసలమ్మని విచారిస్తే, భయంతో ఆమె.... ‘తాను పెద్దగా ఏమీ చేయలేదనీ, ఎండల్లో ఎంతో శ్రమిస్తూ శిల్పాలను చెక్కుతున్న శిల్పులకు ప్రతీ రోజూ చల్లని మజ్జిగ అందించాననీ, రాళ్ళను లాక్కువచ్చిన ఎద్దులకు పచ్చిక వేసాననీ’ చెబుతుంది. ‘అంత గొప్పగా రాజు గారు నిర్మిస్తున్న దేవాలయపు పనిలో, అంతటి దైవకార్యంలో ఉడతా భక్తిగా తాను చెయ్యగలిగింది ఇంతకన్నా ఇంకేమీ లేదే అని విచారిస్తూ ప్రతీ రోజూ శిల్పులకు మజ్జిగ, పశువులకు పచ్చికా అందించానని, తప్పయితే క్షమించమనీ’ వేడుకుంటుంది.

దెబ్బతో రాజుకి... ‘భగవంతుడు భక్తుల నిర్మల భక్తికి సంప్రీతుడౌతాడే గానీ, ఆర్బాటపు భక్తి ప్రదర్శనకి కాదనే’ స్పృహ కలుగుతుంది. దాంతో రాజు, బృహదీశ్వరాలయ నిర్మాణంలో పనిచేసిన వారందరి పేర్లు అక్కడ చెక్కించాడని చెబుతారు. తంజావూరు ఆలయంలో ఇప్పటికీ ఆ ఆనవాళ్లని చూడవచ్చు.

ఈ కథని, మా తెలుగు పంతులమ్మ ఎలిజబెత్ గారు నాటకంగా వ్రాసారు. మేము ప్రదర్శించాము. అలయ నిర్మాణం పూర్తవుతున్న దశలో, తన గొప్పదనాన్ని తానే అభినందించుకుంటూ... రాజు, కొన్ని డైలాగులు చెప్పి, వికటాట్టహాసం చెయ్యాలి. ఆ పాత్రలో నా నటనకై నాకు ప్రధమ బహుమతి వచ్చింది. అందరి నుండీ అభినందనలు వచ్చాయి. మర్నాడు వార్తాపత్రికలో, మా పాఠశాల వార్షికోత్సవపు వార్తలో, మా గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది.

ఆ వయస్సులో అదెంతో మజానో! అయితే... ఆ రోజు మా కార్యక్రమానికి, మా జిల్లా డీఈఓ గారు రాలేదు. తర్వాత ఆయనకి ఎవరో చెప్పారట, మా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు చాలా బాగున్నాయని! ఆయన... ఒక జానపద నృత్యాన్ని, మా నాటకాన్ని తన కోసం మళ్ళీ ప్రదర్శించాల్సిందిగా మా ప్రధానోపాధ్యాయినిని కోరాడు.

దాంతో మళ్ళీ మేము మా ప్రదర్శన ఇచ్చాం. గతం సారి మాకు మేకప్ వేయటానికి వచ్చినతను, మా ముఖాలకు రంగు లేసేటప్పుడు, చెంపల మీద రూష్ పూసి టపటపా కొట్టి పారేశాడు. మేం ఘోల్లుమన్నం. దాంతో మా పంతులమ్మలు, మేకప్ మెన్ మీద దెబ్బలాడారు.

‘ఆడపిల్లలు! కాస్త జాగ్రత్తగా, సున్నితంగా మేకప్ వెయ్యాల్సిందిగా’ మందలించారు. అందునా అప్పుడు నాకు మీసాలు అతికిన మేకప్ మెన్, జిగురు బాగా పూయటంతో, డ్రామా అయిపోయాక మీసాలు పీకితే పై పెదవి వాచి పొయి, మూతి ఆంజనేయస్వామిలా తయారయ్యింది! రెండు రోజులు బడికి డుమ్మా కొట్టాల్సి వచ్చింది.

అంచేత ఈసారి మా పంతులమ్మ, మేకప్ మ్యాన్ కి మరీ మరీ జాగ్రత్తలు చెప్పింది. సున్నితంగా హాండిల్ చెయ్యమంది. దాంతో ‘అతివృష్టి, అనావృష్టి’లాగా... ఈసారి మేకప్ మెన్, నాకు మీసాలు అంటించేటప్పుడు, జిగురు మహా పలచగా పూసేసాడు.

నేనేమో స్టేజీ ఎక్కేసి, ‘అందునా డీఈఓ గారు ప్రత్యేకంగా చూస్తాను అని అడిగి డ్రామా వేయించుకుంటున్నారు కదా!’ అని విరగ నటన చేసేస్తున్నాను. మా పంతులమ్మలు కూడా, డీఈఓ ని బాగా ఇంప్రెస్ చెయ్యాలని నాకు జాగ్రత్తలు చెప్పారు.

దాంతో... గొప్ప ఉత్సాహంతో డైలాగులు చెప్పి, మీసాలు మెలేసి వికటాట్టహాసం చేస్తున్నాను. ఇంతలో... ఠక్కున, ఓవైపు మీసం ఊడి చేతిలోకి వచ్చేసింది.

ఇంకేముంది? చూస్తున్న ప్రేక్షకులంతా విరగబడి నవ్వుతున్నారు. మా ప్రధానోపాధ్యాయిని, డీఈఓ... అందరూ బిగ్గరగా ఒకటే నవ్వడం! నాకు ఓ క్షణం ఏం అర్దం కాలేదు. తర్వాత ఉపద్రవపు సాంద్రత తెలిసింది. ఎలా మానేజ్ చెయ్యడం?

అందరి నవ్వులూ ఆపే వరకూ అలా ఉండిపోయాను. నవ్వులన్నీ ఆగాక, మైకుకు దగ్గరగా వెళ్ళి, కోపాన్ని అభినయిస్తూ... "ఇసీ! ఈ మీసంబునకు కూడా మేము చులకన అయితిమా?" అంటూ, రెండో వైపు మీసం కూడా పీకి క్రింది పడేసాను.

అంతే! అప్పటి వరకూ ఎంత నవ్వారో, అంతకు రెట్టింపుగా చప్పట్లు మ్రోగాయి. మా డీఈఓ నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. మా ప్రధానోపాధ్యాయిని ఫ్లారెన్స్ ప్రకాశం అయితే, నన్ను కౌగిలించుకుని అభినందించింది. ఆమె ఇచ్చిన బహుమతి కంటే, ఈ వాత్సల్యపూరితమైన అభినందనకి, నాకెంతో సంతోషం వేసిందో!

ఆ విధంగా విద్యార్ధినిగా, నా కెరీర్ గ్రాఫ్ బాగా ఉండేది. కాలేజీకి వచ్చాక నటన మానేసినా, వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలకు తప్పనిసరిగా వెళ్ళేదాన్ని.

ఉపన్యాసపు అంశాలన్నీ... ‘లంచగొండితనాన్ని రూపుమాపటం, సమాజంలో అవినీతిని అరికట్టటం, వరకట్నం వంటి దురాచారాలని తరిమికొట్టటం’ గట్రాలు ఉండేవి. వాటి మీద అనర్గళంగా ఉపన్యసించి బహుమతులు గెలుచుకునేదాన్ని. అయితే ‘పారిశ్రామికవేత్త’ పాత్రలోకి ప్రవేశించాక, అదే నాకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందని నేను అనుకోలేదు.

అదెలా అయ్యిందంటే....

ఇండియన్ బ్యాంకులో విజయవాడ, రీజినల్ ఆఫీసులో ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పటికే నాకు బ్యాంకు ఋణాలు శాంక్షన్ చేయించుకోవాలంటే... లంచాలు ఇవ్వాల్సి ఉంటుందన్నది తెలుసు. అనుభవంలోకి వచ్చింది. సదరు ఫీల్డ్ ఆఫీసర్ కి నేను సూటిగానే ఆఫర్ చేసాను. "సార్! నా ఫైలు మీ దగ్గరే ఉంది. ఫేవర్ బుల్ గా వ్రాయండి. ఖర్చయినా ఫరావా లేదు. మీరు చెప్పండి" అని చెప్పాను. అదీ అతడి ఇంటికి వెళ్ళి, అతడి భార్యాపిల్లలతో కొంత స్నేహం సంపాదించాకే!

అతడొక్కసారిగా ఖయ్యమన్నాడు. తన నిజాయితీని అవమానించానంటూ నన్నవమానించాడు. నిజం చెప్పాలంటే చాలా దిగ్ర్భాంతికి గురయ్యాను. గమ్మున వచ్చేసాను. వెంట మా తమ్ముడు ఉన్నాడు. ఇద్దరం ఏం మాట్లాడలేక పోయాం.

అదే వ్యక్తి, ఓ నెల తర్వాత మామూలుగా అయిదు వేలు తీసుకున్నాడు. [అప్పటికి అవే పెద్ద మొత్తాలు లెండి. దేని రేంజి దానికి ఉండేది. ఋణ మొత్తాన్నీ బట్టి నిష్పత్తులుండేవి. ఎంతైనా... ఇప్పటిలా లక్షలూ, కోట్లూ లేవు.] చాలా మామూలుగా "నేను విద్యార్ది దశలో ఘాటు ఉపన్యాసాలు ఇచ్చినదాన్ని కాబట్టి, పైకి మామూలుగా సూటిగా లంచంగా డబ్బు ఇస్తానంటూ, వెనక ఏ ఏసీబీకో పట్టిస్తానేమోనని భయపడ్డాడట." నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు.

ఇలాంటిదే మరో సంఘటన.... ఓసారి రెవిన్యూ డిపార్ట్ మెంటులో, నేను ‘బ్యాంకుకు ష్యూరిటీగా పెట్టిన ఆస్థుల డాక్యుమెంట్లనీ, అడంగళ్ కాపీని వెరిఫై చేసినందుకు, వెయ్యి రూపాయలు కావాలని’ సదరు గుమాస్తా అడిగాడు. నేను మామూలుగా, నా హ్యాండ్ బ్యాగులోంచి తీసి అందించాను. అతడు ఠక్కున బల్ల మీద పెట్టమన్నాడు. ఎంత వణికి పోయాడో! తర్వాత స్థిమిత పడ్డాడు.

అప్పటికి నా దృక్పధం... "నేను వ్యాపార రంగంలోకి వచ్చాను. రోజులని బట్టి నడవాలి. ఉపన్యాసాలు దంచితే పనులు కావు. డబ్బు కోసం డబ్బు [అంటే లంచం] ఖర్చు పెట్టటం తప్పదు. అంతకంటే అవినీతి అంటే మన వల్ల కాదు." ఇలా ఆలోచించేదాన్ని.

అంచేత స్పష్టంగానే నా ఆడిటర్స్ కి [వీళ్ళు ఒకోసారి మధ్యవర్తులుగా పనిచేస్తారు.]చెప్పేదాన్ని. అలాగే మా తమ్ముళ్ళు చేతా Deal చేయించేదాన్ని. అయినా గానీ, నా పట్ల వాళ్ళకి చాలా సందేహాలుండేవి.

‘మగవాళ్ళయితే మందుపార్టీ పెట్టుకుని అన్నీ సెటిల్ చేసుకునే వాళ్ళు కాబోలు’ అనుకునే దాన్ని. కొన్నిసార్లు మహిళగా ఇబ్బందులూ ఎదుర్కున్నాను. అందుచేత కూడా, ఫ్యాక్టరీ నష్టపోయాక చాలా ఆలోచించాను. నాకు బ్యాటరీ తయారీలో మోల్డింగ్ దగ్గర నుండి గ్యాస్ వెల్డింగ్ దాకా... పన్నులన్నీ వచ్చు. టెండర్లు వేయడం దగ్గర నుండి కరస్పాండెన్స్ వంటి అడ్మినిస్ట్రేషన్ పనులూ వచ్చు. డ్రాఫ్టింగ్ చక్కగా చెయ్యగలను.

ముంబై స్టాండర్డ్ బ్యాటరీస్ లో స్పల్పకాల శిక్షణ పొందాను. ఫ్యాక్టరీ నడిపిన అనుభవంతో... `Exide, Amco వంటి బహుళజాతి బ్యాటరీ తయారీ కంపెనీలలో ఉద్యోగానికి ప్రయత్నిద్దామా?, పల్లెటూరిలో పంతులమ్మగా సెటిల్ అవుదామా?' అని, 1995లో ఫ్యాక్టరీ నుండి నంబూరు పల్లెకు మకాం మార్చిన సందర్భంలో తెగ ఆలోచించాము.

చివరికి పంతులమ్మ జీవితం ప్రశాంతంగా ఉంటుందనీ, మహిళగా చికాకులు కార్పోరేట్ [బ్యాటరీ తయారీ] వ్యాపార రంగంలో ఎక్కువనీ విశ్లేషించుకుని, పల్లెకి మారాము. అయితే... విద్యారంగంలో కూడా కార్పోరేట్ కళాశాల/పాఠశాలల్లో యజమాన్యానికీ, మహిళా సిబ్బందికీ[అందరూ కాదు] మధ్య అవేవో సంబంధాలుండటం చూసి అదిరిపడ్డాను.

నైతికత అన్నది వ్యక్తుల్లోనే లోపించడం ఇప్పుడు సర్వసాధారణమైందనీ, అందరూ గాకపోయినా చాలామందే ఈ స్థితికి దిగజారారనీ, అందుకు ఏ రంగమైనా అతీతం కాదనీ... తర్వాత్తర్వాత తెలుసుకున్నాను.

ఇక, 1989 లో బ్యాటరీ తయారీ సంస్థని స్థాపించేందుకు నేను ఎదుర్కొన్న శ్రమ, ప్రయత్నాల విషయానికి వస్తే... ఫ్యాక్టరీ స్థాపించడానికి నేను దాదాపుగా 16 లైసెన్సులూ, అనుమతులూ తీసుకోవాల్సి వచ్చింది. వివిధ రకాల డిపార్ట్ మెంట్ల చుట్టూ ఒకటికి పదిసార్లు తిరిగీ! వాటిల్లో...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

దాదాపు రెండు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఈ బ్లాగులో ఉన్న 425+ టపాలలో, పది పదిహేను టపాలు తప్ప, మిగిలిన అన్నీ ఒకదానికొకటి సంబంధమున్నవే.

భారతదేశం మీద, హిందూమతం మీద, హిందూ జీవనవిధానం మీద, హిందూ సంస్కృతి మీద, ఒక్కమాటలో
చెప్పాలంటే మొత్తం మానవత్వం మీద, సుదీర్ఘకాలం నుండి, అన్నిరంగాలలో జరిగిన, జరుగుతున్న కుట్రని
వివరించటానికే అన్ని టపాలూ ఉద్దేశింపబడినాయి.

అయితే, కొత్తగా ఈ బ్లాగులోకి వచ్చేవారికి ఇన్ని టపాలలో మొదటి నుండీ చదువుకోవాలంటే…..ఇన్ని సుదీర్ఘమైన
అనేక టపాలలో ఏది ముందో ఏది వెనకో తెలుసుకోవాలంటే….. దాన్ని బట్టి Sequence అర్ధం
చేసుకోవాలంటే…… ఉన్న ఇబ్బందిని తొలగించటానికి ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా ఒక విషయం: మనదేశం మీద, మన సంస్కృతి మీద, మన మతం మీద, మన మీద జరుగుతున్న ఈ
కుట్ర గురించిన పరిజ్ఞానం, అవగాహన విషయంలో కుట్రదారులు Ph.D. స్థాయిలో ఉంటే, సామాన్య ప్రజలలో
అత్యధికులు నిరక్షరాస్యుల స్థాయిలోనూ, కొద్దిమంది ‘అఆఇఈల’ స్థాయిలోనూ ఉన్నారు. ఎందుకంటే
సామాన్యప్రజలు, ఎంతగా మీడియా విషప్రచారంలో పడి కొట్టుకుపోతున్నా, ప్రాధమికంగా అంతగా చెడుని,
కుట్రలని ఊహించలేరు కాబట్టి. ఊహించనే లేని వారికి వాటిని గుర్తించటం, అర్ధం చేసుకోవటం కొంచెం తికమకగా,
గందరగోళంగా అన్పిస్తుంది.

అంతేగాక, మా బ్లాగులోనికి కొత్తగా వచ్చేవారికి, కొన్నిపదాలు కూడా వింతగానూ, తలా తోక తెలియనట్లుగానూ
ఉంటాయి. వాటి తొలివివరణ ఎక్కడో ముందటి టపాలలో ఉంటుంది.

అటువంటి అసౌకర్యాలని పరిష్కరించటానికి, అన్నిటపాలని, తేదీల వారిగా మొదటి నుండి చూడగలిగేటట్లు, ఒక టపా ద్వారా ఏర్పాటు చేసాము. ‘ఈ బ్లాగుని అనుసరించటం ఎలా?’ లేదా ‘అన్నిలేబుల్స్ ఒకే టపాలో - 01’, మరియు ‘అన్ని లేబుల్స్ ఒకే టపాలో - 02' అనే ఈ టపాలో లేబుల్స్ ప్రకారం బ్లాగు టపాలని రిఫర్ చేయగలిగే ఏర్పాటు చేసాము.

ముఖ్యగమనిక: ఇది నేను ఎవరి కోసం వ్రాస్తున్నానంటే – ఎవరయితే ’ఇది నిజం, వీటి గురించి తెలుసుకోవాలి’
అని నమ్మేవాళ్ళ కోసం వ్రాస్తున్నాను. ఈ టపాలు అర్ధరహితంగా అన్పించిన వాళ్ళు, ఈ బ్లాగును నిరభ్యంతరంగా
విస్మరించవచ్చు.

01]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ ఒకేసారి చూడాలంటే –
తేదీల ప్రకారం అన్నిటపాలు ఒకేచోట ఉంటాయి.

000]. మా గురించి...

001]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ [1 - 300 వరకూ] ఒకేసారి చూడాలంటే – 01 [Oct. 16, 2009]

002]. ఈ బ్లాగులోని అన్ని టపాలనీ [301 నుండి] ఒకేసారి చూడాలంటే – 02 [Feb. 28, 2010]

003]. పీవీజీ - రామోజీరావు - మా కథ [Aug. 18, 2010]

004]. అన్నిలేబుల్స్ ఒకే టపాలో - 01 [Dec.22, 2009]

005]. అన్ని లేబుల్స్ ఒకే టపాలో - 02 [Aug. 18, 2010]01]. భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర:

01. వ్యాపారం నాడు – నేడు ![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 01] [June 05, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/01.html
02. కుంకుడు కాయలు - రసాయనిక ఎరువులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 02] [June 08, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/02.html
03. కాగితపు కట్టడం – ఆర్దిక గణాంకాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 03] [June 09, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/03.html
04. ఆముదం – కార్పోరేట్ కంపెనీల ఉత్తుత్తి పోటీ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 04] [June 10, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/04.html
05. సిమెంట్ సిండికేట్ – మీడియా సహకారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 05] [June 12, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/05.html
06. అప్పుడు ఆయుధాలు – ఇప్పుడు ఆరోగ్యాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 06] [June 14, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/06.html
07. ఉల్లిపాయలు – ముంగారు మొలకలు – ఈగా, మజాకా !? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 07] [June 17, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/07.html
08. కప్పకాళ్ళు – కాఫీ టీ లు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 08] [June 18, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/08.html
09. ఈ దేశం గాలి సోదరులదీ, అంబానీ సోదరులదేనా? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 09] [June 19, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/09.html
10. ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 10] [June 21, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/10.html
11. హేతువాద సంఘాలు ఎందుకు కిమ్మనవో? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 11] [June22 , 2010]
http://ammaodi.blogspot.com/2010/06/11.html
12. క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12] [June23 , 2010]
http://ammaodi.blogspot.com/2010/06/12_23.html
13. పుకార్లతో చీరల వ్యాపారం - వీరప్పన్ వ్యవహారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 13] [June24 , 2010]
http://ammaodi.blogspot.com/2010/06/13.html
14. వర్తకుల నిజాయితీ – ముత్యపు చిప్పల కలలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 14] [June25 , 2010]
http://ammaodi.blogspot.com/2010/06/14.html

15. మిశ్రమ ఆర్దిక వ్యవస్థతో అభివృద్ది ఆకాంక్షలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 15] [July03 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/15.html
16. నాడు రోడ్డుప్రక్క రత్నాల రాశులు – నేడు ఫోన్లు, బైకులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 16][July 05 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/16.html
17. సహకార సంఘాలూ – ఉపాధి హామీలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 17][July 06 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/17.html
18. ఏం చేసినా వచ్చేది డిజ్ ఎడ్వాంటేజే ! – మర్యాద రామన్న కథ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 18][July 08 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/18.html

00. అంబానీల ఐశ్వర్యం – వెండి లండన్ కు చేరవేత ! [July 09 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post_09.html

00. బట్టతల మీద జుట్టు – ప్రజల అభివృద్ది ! [June 07, 2010]
http://ammaodi.blogspot.com/2010/06/blog-post_07.html

నాటి ప్రఖ్యాత ఆంగ్ల రచయితల దగ్గరి నుండి, నేటి ఆధునిక రచయితల దాకా...

అందరికీ ‘టైం మెషీన్’ అంటే ప్రత్యేక ఆకర్షణ!

ఆదిత్య 369 వంటి సినిమాలలో చూసి, మనందరికీ కూడా... అదో మంచి సరదా!

ఒకసారి... ఎంచక్కా మనకే అలాంటి టైం మెషీన్ దొరికితే... ఏయే కాలాలకి, ఏయే ప్రదేశాలకీ వెళ్ళి పోవచ్చో, ఎన్నెన్ని తమాషాలు చేసేయొచ్చో... ఊహిస్తే భలే మజా వస్తుంది!

ఇన్ని ఆలోచనలలో బోలెడు సందేహాలు కూడా వస్తుంటాయి. సరే! టైం మెషీన్ ఎక్కి, ఆదిత్య 369 లో బాలకృష్ణ లాగా, ఏ శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలోకో వెళ్ళామనుకొండి.

వెళ్ళి నంగనాచిలాగానో, దెయ్యాల లాగానో అదృశ్యంగా ఉంటూ, వాళ్ళని పరిశీలించి వస్తే సమస్యలేదు. అలాగ్గాక వాళ్ళతో ఏదైనా ఇన్వాల్వ్ మెంట్ పెట్టుకుంటే... గతంలో వాళ్ళకి వాళ్ళవైన అనుభావాలేవో ఉండి ఉంటాయి కదా? అందులో, ఈ టైం మెషీన్ ఎక్కి వచ్చిన వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు కదా? ‘మరి వాళ్ళు దీన్నంతా ఎలా రిసీవ్ చేసుకుంటారు?’ అన్నది నాకు మహా గందర గోళంగా ఉంటుంది.

ఇలాంటిదే... మరో గజిబిజి!

మనవాడు టైం మెషీన్ ఎక్కి ఓ అయిదువందల ఏళ్ళు వెనక్కి పోయి, అప్పటి హంపి విజయనగరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి రాజ్యాన్ని చేరి, అన్నిటినీ చూసాడే... అనుకుందాం. మరి 500 ఏళ్ళ తర్వాత, ఇప్పుడున్న హంపి ఎక్కడ ఉంటుంది? ఒకే స్థలంలో రెండు కాలాలు ఎలా ఉంటాయి?

ఏమో బాబోయ్! అయినా... ఫిక్షన్ కథలో లాజిక్కులు అడక్కూడదు కదా?

అంచేత... నేనూ సరదాగా ‘రాజకీయ ఫిక్షన్ కథ’ వ్రాస్తున్నాను.

ఇక కథలోకి...

క్రీ.శ. 2010....

రిలయన్స్ కంపెనీ వాళ్ళు టైం మెషీన్ ని తయారు చేసారు!

ముందుగా ఎవరు దానిలో ప్రయాణించాలి అన్న దాని మీద వేలం పాట వేసి అవకాశం కల్పించారు. డిమాండు మరి!

సరే! ముందుగా బోలెడన్ని కోట్లు కుమ్మరించి, తొలి అవకాశాన్ని నందమూరి బాలకృష్ణ అందుకున్నాడు. బావమరిది, అందునా వియ్యంకుడూ అయిన బాలకృష్ణని కన్విన్స్ చేసి, చంద్రబాబు కూడా టైం మెషీన్ ఎక్కేసాడు.

అర్జంటుగా ఇద్దరూ, 1995 లో మరణించిన ఎన్టీఆర్ ని కలవటం కోసం, 1992-93 నాటి కాలానికి వెళ్ళిపోయారు. అప్పటికే తాను మరణించి పదిహేనేళ్ళయినందున... ఎన్టీ రామారావు, తానున్న లోకం నుండి, 2010 వరకూ గడిచిన కాలాన్ని, సంఘటనలని అప్పుడప్పుడూ చూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. మిగతా సమయంలో యమగోల, యమదొంగ లాంటి సినిమాలు చూస్తూ, గడుపుతూ ఉన్నాడు.

ఇంతలో హఠాత్తుగా తనముందు దిగిన కొడుకూ, అల్లుడిని చూసి విస్తుపోయాడు. మాటలుడిగి చూస్తున్నాడు. బాలకృష్ణ హడావుడిగా ‘సింహ’ సినిమా డైలాగు మాడ్యులేషన్ లో "నాన్నా! నా మాట వినండి. ఆ లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకోకండి. అప్పుడంతా దబ్బిడి దిబ్బిడే" అన్నాడు.

‘ఓర్నాయనో! బామ్మర్ది నా కొంప ముంచుతున్నాడే! లక్ష్మీపార్వతిని చేసుకోక పోతే, ఆ వంకతో నేను వెన్నుపోటు పొడిచేదెలా? పార్టీని చీల్చేదెలా? ముఖ్యమంత్రి నయ్యేదెలా?’ మనస్సులో ఇదంతా అనుకున్న చంద్రబాబు, బాబ్లీ యాత్రలో మాట్లాడినంత ఉద్వేగంగా,

"వద్దొద్దు మామయ్యా! మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి. లేకపోతే మీ బాగోగులు ఎవరు చూస్తారు? ఎందరు కూతుళ్ళు, కొడుకులూ ఉన్నా, ఎవరి సంసారాలు వాళ్ళవయ్యె! మీ సంసారం మీకుంటే... అన్నీ అవే నడిచిపోతాయి" అని గోలపెట్టాడు.

ఒక చెవిలో కొడుకు బాలకృష్ణ "రెండో పెళ్ళి వద్దు" అంటుంటే...

మరో చెవిలో అల్లుడు చంద్రబాబు "చేసుకో! పెళ్ళి చేసుకో!" అంటున్నాడు.

ఒక వైపు లక్ష్మీపార్వతితో పెళ్ళి, మరో వైపు అల్లుడుతో వెన్నుపోటు ఆలోచిస్తూ... పిచ్చెక్కినట్లయ్యి... ఎన్టీఆర్ ఒక్క గావుకేక పెట్టాడు.

"ఛస్ నోరు ముయ్యండి! దిగిన మెషిన్ ఎక్కి వచ్చిందారిన పొండి" అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి, వీళ్ళకి అందనంత దూరం వెళ్ళిపోయాడు.

~~~~~~

రెండోసారి టైం మెషీన్ ఎక్కే అవకాశాన్ని, వేలంపాటలో పాల్గొని, వై.యస్.జగన్ దక్కించుకున్నాడు.

కళ్ళొత్తుకుంటూ, కొండా సురేఖ దంపతుల నుండి టాటాని, అంబటి రాంబాబు లిచ్చిన ఓదార్పునీ అందుకుని, ధైర్యం తెచ్చుకుని, టైం మెషీన్ ఎక్కి బయలు దేరాడు.

సర్రున 2009 సెప్టంబరు 1వ తేదీ కెళ్ళిపోయాడు. తండ్రిని చూడగానే బావురుమన్నాడు. వై.యస్సారూ కొడుకుని కావలించుకుని ఓదార్చాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. 108 కుయ్యి కుయ్యి మంటోందా? అని అలవాటుగా అడిగేసాడు.

"అవన్నీ వదిలెయ్ నాన్నా! నే చెప్పేది విను" అన్నాడు జగన్ డగ్గుత్తికతో!

చెప్పమన్నట్లు చూసాడు వై.యస్సార్! "నాన్నా! నువ్వు సీఎం సీటులో ఉండగా.... పొన్నాలకీ, బొత్సాలకీ, మీ చేవెళ్ళ చెల్లెమ్మకీ... అందరికీ ఎంతెంత తినిపించావు? జలయజ్ఞం అనీ, అదనీ ఇదనీ, ఎంత ఉదారంగా ఆస్థులు కూడా బెట్టుకోనిచ్చావు? అయినా నువ్వు పోయాక... నన్ను చిన్నపిల్లాణ్ణి చేసి...." ఇక చెప్పలేక బోరుమన్నాడు.

వై.యస్సారు కొడుకు భుజం మీద తట్టి, వెన్ను నిమిరాక, దుఃఖం దిగమింగుకొని, కొనసాగిస్తూ... జగను,

"అదంతా మర్చిపోయి... ఇప్పుడు నేనెవ్వరో తెలీనట్లు మొహం తిప్పేసు కుంటున్నారు. మద్దతుగా నిలబడటం సంగతి అంటుంచి కనీసం మాట కూడా మాట్లాడటం లేదు! అంతేగాక తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లు నిన్నూ, నన్నూ తిడుతున్నారు నాన్నా! అధిష్టానం అయితే... నిన్ను ‘దార్శనికుడు’ అంది. నన్ను ‘నోర్మూసుకో’ అంటోంది" అన్నాడు, వెక్కిళ్ళు పెడుతూ!

"అంతేరా అబ్బాయ్! ‘పెట్టిన నాడు పెళ్ళి కూడు, పెట్టని నాడు శ్రాద్దపు కూడు!’ అంటారు. ఈ లోకం నుండి నాకూ అంతా కన్పిస్తూనే ఉంది. ఏం చెయ్యను? అలవి కాని రోజుల్లో ఆక్రోశం తప్ప ఒరిగేదేముంది? గతంలో అనుభవమే ఇలాంటివి మనకి!" ఓదార్పుగా అన్నాడు వై.యస్సార్.

ఎంతసేపు ఒగర్చినా, ఒరిగేదేమీ లేక, నిరాశగా టైం మెషీన్ వైపు నడిచాడు జగన్! నిట్టూర్పు విడిచాడు వై.యస్సారూ!

~~~~~

టైం మెషీన్ లో వెళ్ళిన వాళ్ళంతా క్షేమంగా వస్తుండేసరికి, తర్వాతి అవకాశం కాంగ్రెస్ అధిష్టానం సోనియా తీసుకుంది. ఆమె వేలంపాటలో పాడుకొని, డబ్బిచ్చి అవకాశం పొందింది - అనుకుంటున్నారా? అబ్బే, లేదు! అవకాశం ఇవ్వకపోతే, రిలయన్స్ మీద, ఐటీ దాడులు, సిబిఐ కేసులూ, వ్యాపార అనుమతులు రద్దు వంటివి చేస్తూందన్న భయంతో, అంబానీ సోదరులు అదురుకొని, అవకాశం ఇచ్చేసారు.

సరే! సోనియా టైం మెషీన్ ఎక్కి ‘ఏ కాలానికి వెళ్ళాలా?’ అని ఆలోచిస్తుండగానే... మెషీన్ కాస్తా 1980-84 లకి చేరిపోయింది. ఎదురుగా చూస్తే ఏముంది? అపర కాళికలా ఇందిరా గాంధీ నిలబడి ఉంది. గడిచిన పాతికేళ్ళుగా... ఇంటినీ, దేశాన్ని చూసి దిమ్మెర పోయి ఉందేమో, కోడల్ని చూడగానే రణ చండికలా అయ్యింది.

"ఒహో! కోడలివని కొంపలో చోటిస్తే కొరివి వయ్యిందే గాక, దేశాన్ని కొల్లగొడతావా?" అంటూ... భారతదేశం చుట్టూ, తిప్పించి త్రిప్పించి ....?

ఆ హైరానాలో టైం మెషీన్ ఎక్కడుందో కూడా గమనించ లేక, ఇబ్బందుల్లో పడింది ఇటలీ గాంధీ!

~~~~~

ఇది సైన్స్ ఫిక్షన్ లాగా రాజకీయ ఫిక్షన్ కథ! ఇందులో ఈకలు పీకటం, లాజిక్కిలు అడగటం చెయ్యకండేం! అడిగారను కోండి! ఏముంది? మిమ్మల్ని కూడా టైం మెషీన్ ఎక్కించేసి ‘ఏదో కాలానికి, ఎక్కడికో’ పంపించేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మరోసారి తీరికగా టైం మెషీన్ దొరికినప్పుడు మరికొన్ని....


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నిజానికి, భోపాల్ ప్రమాదం జరిగింది 1984 లో! తర్వాత కేంద్రంలో, అయిదేళ్ళు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. అర్ధాయుష్షులతో వీపీ సింగ్, చంద్రశేఖర్ ల ప్రభుత్వాలు నడిచాయి. తర్వాత పీవీజీ ప్రభుత్వం! ఆ తరువాత దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలు, ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలు, నడిచాయి. అవేవీ ఉటంకించకుండా... అదేదో పీవీజీ మాత్రమే దానికి బాధ్యుడన్నట్లు భాజపా ప్రకటన ఉంది.

నిజానికి అండర్సన్ ని భారత్ కు రప్పించే ప్రయత్నమే కాదు, అతడి మీద దోషి ముద్రవేసిందీ పీవీజీ హయాంలోనే! బాధితులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వబడిందీ పీవీజీ హయాంలోనే!

ఇక ఇప్పుడు, యూపీఏ హయాంలో అయితే నేరగాళ్ళకి ఏ పాటి శిక్ష పడిందో... రెండు నెలల క్రితం అందరమూ చూసిందే!

పాపం! న్యాయమూర్తి ఉదారంగా... నేరస్తులంతా ముసలి వాళ్ళయ్యారనీ, గుండె జబ్బులూ గట్రాలతో బాధపడుతున్నారనీ, ఎంతో జాలి పడ్డాడు. సింపుల్ గా రెండేళ్ళ శిక్ష విధించాడు. అదీ పై కోర్టుకీ అప్పీలు చేసుకోవచ్చాన్నాడు. బెయిల్ వెంటనే ఇచ్చేసాడు. నేరస్తులంతా, దర్జాగా, కోర్టుకి వచ్చిన కార్లోనే ఇంటికెళ్ళిపోయారు.

ఇదంతా జరిగాక కూడా... కేంద్ర న్యాయమంత్రి వీరప్పమొయిలీ ‘న్యాయం దగా పడిందనీ’ దుఃఖిస్తూ మొసలి కన్నీరు కార్చాడు. ఎంత అందమైన స్ర్కిప్టుతో నడుస్తున్న నాటకం ఇది!? పైగా సిబిఐ, అండర్సన్ గురించి ‘పరారీలో ఉన్నవాడి’గా లిఖితపూర్వకంగా పేర్కొంది.

గమ్మత్తేమిటంటే .... అండర్సన్ అచూకీ అలభ్యమైనదేమీ కాదనీ, అతడి చిరునామా సహితం తెలుసనీ, ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన నిర్మలా కరుణన్ సుస్పష్టంగా ప్రకటించింది. ఓసారి దిగువ వార్త పరిశీలించండి.

>>>అండర్సన్‌ జాడ చెప్పాం: గ్రీన్‌పీస్‌
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో నిందితుడు అండర్సన్‌ జాడ గురించి, తాము కొన్నేళ్ల క్రితమే సీబీఐకి చెప్పామని 'గ్రీన్‌ పీస్‌' పర్యావరణ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. 2002లో తాము, అమెరికాలో ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నప్పుడు ‘ఓ అపరిచిత వ్యక్తి’ అండర్సన్‌ ఎక్కడున్నారో చెప్పారని, సంస్థ సలహాదారు నిర్మల కరుణన్‌ తెలిపారు. అప్పుడు తాము అండర్సన్‌ ఇంటికి వెళ్లామని, అయితే ఆయన, ఇంటి వెనుక ద్వారం నుంచి తప్పించుకొని బయటికెళ్లారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై అమెరికా, భారత్‌ కోర్టులతోపాటు, సీబీఐకి కూడా, తాము సమాచారమందించామని చెప్పారు.
~~~~

>>>అండర్సన్‌ వైభోగం
విలాసవంతంగా విశ్రాంతి జీవితం...

భారత్‌ నుంచి 1984లోనే పారిపోయినా, అండర్సన్‌ 1986లో రిటైరయ్యేంత వరకు, యూనియన్‌ కార్బైడ్‌ సీఈవోగా కొనసాగాడు. ప్రస్తుతం దాదాపు తొంభయ్యేళ్ల వయసుకు చేరువైన అతడు, న్యూయార్క్‌లోని ఒక విలాసవంతమైన భవంతిలో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాడు. అండర్సన్‌ అప్పగింత కోసం, భారత్‌ చేసిన విజ్ఞప్తిని 2004లో, అమెరికా తిరస్కరించింది. బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో, 2009లో, కోర్టు అతడిపై అరెస్టు వారంట్‌ జారీ చేసింది. అండర్సన్‌ను పరారైన నిందితుడిగా ప్రకటించిన పదేళ్లకు... అంటే 2002లో భారత్‌కు చెందిన జర్నలిస్టు శక్తి భట్‌ అతడి ఆచూకీని కనుగొన్నారు.

రిడిఫ్‌ డాట్‌ కామ్‌ యాజమాన్యంలోని 'ఇండియా అబ్రాడ్‌' పత్రిక ద్వారా, న్యూయార్క్‌లోని అతడి విలాసవంతమైన విశ్రాంతి జీవితాన్ని, బాహ్య ప్రపంచానికి వెల్లడించారు. న్యూయార్క్‌లోని బ్రిడ్జిహాంప్టన్‌ ప్రాంతంలో ఉన్న అతడి భవంతి ఫొటోలను ప్రచురించారు. అండర్సన్‌, అతడి భార్య లిలియన్‌, ఈ భవంతిలో నివసిస్తున్నారు. అండర్సన్‌కు ఫ్లోరిడాలోని వీరో బీచ్‌లోను, గ్రీన్‌విచ్‌, కనెక్టికట్‌ ప్రాంతాల్లోను విలాసవంతమైన భవంతులు ఉన్నాయి.

Pasted from

ఇక ఈ కేసులో బాధితులకి వ్యతిరేకంగా, UCC కంపెనీని 1997లో చట్టపరంగా కొన్న డౌ కంపెనీ తరుపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ కు అధికార ప్రతినిధి! మరో న్యాయవాది అరుణ్ జైట్లీ భాజపా పార్టీ నేత! ఎవ్వరు కాపాడాలి ఈ దేశాన్ని, ఈ ప్రజలని?

[జూన్ 7 న తీర్పు వచ్చాక] కొద్ది రోజులు గలభా సృష్టించీ, ఆనక చల్లార్చిన అంశాలలో ఇదీ ఒకటి.

మీడియా... ప్రభుత్వం... కుమ్మక్కుగా నడుపుతున్న వ్యూహాత్మక నాటకాలవి! లేనట్లయితే, మీడియా... ప్రజల తరుపునా, భోపాల్ గ్యాస్ లీక్ బాధితుల తరుపునా, విషయాలని వెలుగులోకి తెస్తూ, ఫాలో అప్ చేస్తూ, పోరాడుతూనే ఉండాలి కదా?

బదులుగా, భోపాల్ పాపాన్ని పీవీజీ నెత్తికి రుద్దే కాంగ్రెస్ అధిష్టానపు ప్రయత్నానికీ, అందుకు సహకరించే రస్గోత్రాల వ్యాఖ్యానాలనీ ప్రచురిస్తుంది. అంతే! నిజానికి... మీడియా, కాంగ్రెస్ అధిష్టానానికి సయామీ కవలలాగే, ఒకే దిశలో, ఒకే వేగంతో, నడుస్తూ సహకరిస్తుంటుంది.

ఏదైనా విషయం, ప్రజలకి అర్దంగాకుండా చేయాలన్నా, తప్పుదోవ పట్టించాలన్నా... కొన్ని సత్యాలని, కొన్ని అసత్యాలని కలగలపి, నాయకుల స్టేట్ మెంట్ల రూపంలో, జనం నెత్తి మీద వేస్తే... ఆ విషయం జనానికి అర్దం గాకుండా పోతుంది. తరువాత ఆ విషయాలను, తమకు అనుగుణంగా నడుపుకోవచ్చు. అదే అండర్సన్ కేసు విషయంలో జరుగుతోంది. ఈ విషయం అర్దం కావాలంటే ఈ వ్యాసం చివరగా నివ్వబడిన వార్తాంశాలను ఒకసారి గమనించండి. మీకే అర్దమవుతుంది.
~~~~~

>>>అది పరిస్థితుల ప్రభావం
ఆండర్సన్ పరారీకి కాంగ్రెస్ కొత్త కలర్
శాంతి భద్రతల కోసమే ఆ నిర్ణయం: ప్రణబ్
ఇందులో రాజీవ్ పాత్ర లేదు: అరుణ్ నెహ్రూ
కోల్‌కతా, జూన్ 13: వారెన్ ఆండర్సన్ పరారీని కాంగ్రెస్ కొత్త మలుపు తిప్పుతోంది. తప్పు రాజీవ్‌గాంధీదో, అర్జున్‌సింగ్‌దో కాదని... అప్పటి 'పరిస్థితులది' అంటూ వివాదానికి కొత్త రంగు పులుముతోంది. విష వాయువు లీకేజీ, వేలమంది మరణంతో భోపాల్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యానే ఆండర్సన్‌ను అక్కడి నుంచి పంపించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. '1984 డిసెంబర్ 8 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో అర్జున్ వివరణ ప్రచురితమైంది.

‘భోపాల్‌లో అప్పటికే శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని, భావోద్వేగాలు తారస్థాయికి చేరుకున్నాయని, అందువల్లే ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపడం మంచిదనే నిర్ణయానికి వచ్చామని అర్జున్‌సింగ్ స్పష్టం చేశారు' అని ప్రణబ్ ఆదివారం, కోల్‌కతాలో తెలిపారు. మరోవైపు... ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపించాలన్న నిర్ణయం పూర్తిగా అర్జున్‌సింగ్‌దేనని కేంద్ర మాజీ మంత్రి, రాజీవ్‌కు అత్యంత సన్నిహితుడైన అరుణ్ నెహ్రూ తెలిపారు. 'అర్జున్‌సింగ్ 1984 డిసెంబర్ 7న విలేఖరులకు చెప్పిన వివరాలు చూస్తే... ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపింది ఆయనే అని అర్థమవుతుంది. ఇందులోకి రాజీవ్‌ను లాగాలనుకోవడం తప్పు' అని అన్నారు.
~~~~~

>>>రాజీవ్ పాత్రపై భిన్న వాదనలు
రాజీవ్‌పై పీసీ అలెగ్జాండర్ పరోక్ష విమర్శ

న్యూఢిల్లీ, జూన్ 11 : ఆండర్సన్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఈ విషయంలో రాజీవ్‌పై పరోక్షంగా వేలెత్తి చూపిన అప్పటి రాజీవ్ ముఖ్యకార్యదర్శి పీసీ అలెగ్జాండర్.. ఆండర్సన్ విడుదల వెనుక అనేక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ రోజు కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత రాజీవ్‌ను అర్జున్‌సింగ్ కలుసుకున్నారని, ఆ తర్వాత ఆండర్సన్ విడుదలయ్యారని చెప్పా రు. ఈ వ్యవహారంలో మంత్రులకు ఏమీ తెలియదని ఒక చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.

ఇదిలా ఉండగా... తొలుత రాజీవ్‌పై వేలెత్తిన అలెగ్జాండర్ తర్వాత తన స్వరం మార్చారు. ఆండర్సన్ పరారీ అంశంలో ఆయన పాత్ర ఉండి ఉండకపోవచ్చని పీటీఐ వార్తా సంస్థతో చెన్నైలో అన్నారు.
~~~~

పై రెండు వార్తాంశాలలో: శాంతి భద్రతల సమస్య కారణంగానే ‘అండర్సన్ ను విడుదల చేసి, విమానం ఎక్కించి పంపించడం’ అర్జున్ సింగ్ చేసాడని, అప్పుడు అతడు విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ... ప్రణబ్ ముఖర్జీ [గతంలో] చెప్పాడు. మరి పార్లమెంట్ లో, అర్జున్ సింగ్, అంతా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వత్తిడి మేరకే విడుదల చేసానని [నిన్న] ఎలా చెప్తున్నాడు?

క్యాబినెట్ మీటింగ్ తరువాత రాజీవ్ గాంధీని అర్జున్ సింగ్ కలిసిన తరువాత, అండర్సన్ విడుదల అయినపుడు, మరి పీవీజీ మీదకి నెపం ఎలా నెట్టబడుతుంది? క్రింది వార్తాంశంలో రస్గోత్రా, ఆ రోజు రాజీవ్ గాంధీ ఢిల్లీలోనే లేడని చెప్తున్నాడు. మరి క్యాబినెట్ మీటింగ్ తరువాత రాజీవ్ ని అర్జున్ సింగ్ కలిసాడని, రాజీవ్ కార్యదర్శి పీసీ అలెగ్జాండర్ ఎలా చెప్తున్నాడు?
~~~~~

>>>న్యూఢిల్లీ: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు వారెన్‌ ఆండర్సన్‌ పరారీ వివాదం గురువారం మరో మలుపు తిరిగింది. అతన్ని సురక్షితంగా దేశం దాటించాలనే నిర్ణయాన్ని నాటి కేంద్ర హోంమంత్రి పీవీ నరసింహారావే తీసుకుని ఉంటారని అప్పట్లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంకే రస్గోత్రా అభిప్రాయపడ్డారు. ఆండర్సన్‌ అరెస్టు సరికాదని పీవీ భావించారని గురువారం సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ చానల్లో కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనన్నారు. ఈ నిర్ణయం గురించి నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి తర్వాత తెలిసిందని, అందుకాయన అభ్యంతరమేమీ చెప్పలేదని వివరించారు.

"భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ ద్వారా ఆండర్సన్‌ మమ్మల్ని సంప్రదించారు. సురక్షితంగా తిరిగి వెళ్లనిచ్చే పక్షంలో ఆండర్సన్‌ భారత్‌ వచ్చి భోపాల్‌ దుర్ఘటనను పరిశీలిస్తారని, అందుకు వీలు కల్పించాలని యూఎస్‌ మిషన్‌ డిప్యూటీ చీఫ్‌ గార్డన్‌ స్ట్రీబ్‌ నన్ను కోరారు. విషయాన్ని నేను హోం శాఖ, కేబినెట్‌ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నిర్ణయాన్ని పీవీకే వదిలేశాం. అదే రోజు అందుకు అంగీకారం లభించింది. బహుశా పీవీయే అందుకు ఆదేశించి ఉంటారు' అని రస్గోత్రా చెప్పుకొచ్చారు.

ఈ విషయమై విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రాజీవ్‌ను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించగా, అప్పుడాయన ఢిల్లీలో లేరని బదులిచ్చారు. 'దాంతో నిర్ణయం తీసుకోవాల్సింది హోం శాఖేనని భావించాను. వారే నిర్ణయం తీసుకున్నారు' అని చెప్పారు. ఆండర్సన్‌ అరెస్టు తప్పిదమని, క్షేమంగా తిప్పి పంపాలన్న అతని విజ్ఞప్తి సమంజసమేనని రస్గోత్రా అభిప్రాయపడ్డారు. భారత ప్రయోజనాల రీత్యా ఆండర్సన్‌ను వదిలేయడమే సరైనదన్నారు.

~~~~

రెండు విరుద్దప్రకటనలు:

>>>పీవీ, జైల్‌సింగ్‌లను కలిసిన ఆండర్సన్!
భోపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత విడుదలైన వారెన్ ఆండర్సన్ 1984 డిసెంబర్ 7న నాటి హోం మంత్రిని, రాష్ట్రపతిని కలిశారు! ఈ విషయాన్ని నాటి రాజీవ్ మంత్రివర్గంలో పనిచేసిన అరుణ్ నెహ్రూ స్వయంగా చెప్పారు. "విడుదలైన తర్వాత ఆయన రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వచ్చారు. నాటి హోం మంత్రి పీవీ నరసింహారావును, రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలిశారు. ఈ విషయాన్ని నిర్ధారించాల్సింది ప్రభుత్వమే'' అని అరుణ్‌నెహ్రూ తెలిపారు.

Pasted from: http://www.andhrajyothy.com/nationalNewsShow.asp?qry=2010/jun/15/national/15national2&more=2010/jun/15/national/nationalmain&date=6/15/2010

కేంద్రమే ఏర్పాట్లు చేసింది: స్ట్రీబ్‌

ఆండర్సన్‌ దాటివేతకు కేంద్రమే ఏర్పాట్లు చేసిందని నాటి యూఎస్‌ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గార్డన్‌ స్ట్రీబ్‌ వెల్లడించారు. భోపాల్లో హౌస్‌ అరెస్టు నుంచి ఆండర్సన్‌ను విడిపించడం, అక్కణ్నుంచి విమానంలో అతన్ని ఢిల్లీ పంపడం విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోనే జరిగాయని ఎన్డీటీవీ ఇంట ర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. 'ఆండర్సన్‌కు ఎలాంటి హానీ జరగొద్దని అమెరికా భావించింది. నాటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా నాకందుకు హామీ ఇచ్చారు.

కానీ భోపాల్లో ఆయన్ను అరెస్టు చేసినట్టు తెలియడంతో రస్గోత్రాను సంప్రదించాను. తర్వాత ఆండర్సన్‌ను ఢిల్లీ తీసుకొచ్చారు. ఆయన ఉన్నంతసేపు యూఎస్‌ ఎంబసీలోనే గడిపి, తర్వాతి విమానంలోనే అమెరికా వెళ్లిపోయారు' అని చెప్పుకొచ్చారు.
~~~~~

పై రెండు వార్తాంశాల్లో ఏది నిజం? అండర్సన్ ఢిల్లీ వచ్చిన తర్వాత అమెరికా ఎంబసీలో గడిపినట్లా? పీవీజీ, జైల్ సింగ్ లని కలిసినట్లా?
~~~~~
పాతికేళ్ల గాయం
1984 డిసెంబర్ 3: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) పురుగు మందుల ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ (మిక్) అనే విషవాయువు లీక్. 15 నుంచి 25 వేల మంది మృతి. 5 లక్షల మందికి పైగా తీవ్రంగా అనారోగ్యంపాలు. ముందు తరాలపై కూడా దుష్ప్రభావం.
1984 డిసెంబర్ 4: యూసీఐఎల్ మాతృసంస్థ అమెరికాలోని యూసీసీ చైర్మన్ వారెన్ అండర్‌సన్, తదితరుల అరెస్టు. భారత్‌కు తిరిగి వస్తానంటూ ఇచ్చిన హామీపై అండర్‌సన్ బెయిలుపై విడుదల.
1985 ఫిబ్రవరి: నష్ట పరిహారంగా 330 కోట్ల డాలర్లు చెల్లించాలంటూ యూసీసీపై అమెరికా కోర్టులో భారత్ దావా.
1986: సంబంధిత కేసులన్నిటినీ భారత దేశానికి బదలాయించిన అమెరికా కోర్టు.
1987 డిసెంబర్: అండర్‌సన్, ఇతర దేశాల్లోని యూసీలు, తదితర నిందితులపై సీబీఐ చార్జిషీటు.
1989 ఫిబ్రవరి: అండర్‌సన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ. బేరానికి వచ్చిన యూసీసీకి, భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన కోర్టు వెలుపలి ఒప్పందం కింద ఆ కంపెనీ 47 కోట్ల డాలర్లు (సుమారుగా రూ.1,880 కోట్లు) చెల్లింపు.
1989 ఫిబ్రవరి-మార్చి: ఈ ఒప్పందంపై సుప్రీం కోర్టులో రిట్లు.
1992: కార్బైడ్ కంపెనీ చెల్లించిన పరిహారంలో కొంత బాధితులకు చెల్లింపు.
1992 ఫిబ్రవరి: సమన్లను ధిక్కరించినందుకు అండర్సన్‌పై నేరస్తుడిగా ముద్ర.
1994 నవంబర్: యూసీఐఎల్ తమ వాటాను కోల్‌కతా కంపెనీ మెక్ లియోడ్ రస్సెల్‌కు విక్రయించుకోడానికి యూసీసీకి సుప్రీం అనుమతి.
1996 సెప్టెంబర్: యూసీఐఎల్ భారత అధికారులు 8 మందిపై అభియోగాల తీవ్రతను తగ్గించిన సుప్రీం.
1999 ఆగస్టు: అమెరికా కంపెనీ డౌ కెమికల్‌్ లో విలీనమైపోతున్నట్టు యూసీసీ ప్రకటన.
2001 ఫిబ్రవరి: భారత్‌లోని యూసీఐఎల్ భారం మోసే ప్రసక్తి లేదంటూ యూసీసీ తిరస్కారం.
2002 ఆగస్టు: యూసీసీ చైర్మన్ ఆండర్‌సన్‌పై భారత కోర్టులో శిక్షార్హమైన హత్యాభియోగం నమోదు.
2004 జూన్: అండర్‌సన్‌ను అప్పగించాలంటూ భారత్ చేసిన వినతికి అమెరికా తిరస్కృతి.
2004 జూలై 19: యూసీఐఎల్ చెల్లించిన పరిహారం మొత్తంలో రూ.1,500 కోట్లకు పైగా బాధితులకు చెల్లించాల్సిందిగా సుప్రీం ఆదేశం. తరువాత అక్టోబర్ 26న ఇచ్చిన ఉత్తర్వులో మొత్తం పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశం. ఈలోగా పరిహారం చెల్లించడం లేదంటూ బాధితుల నిరసనల వెల్లువ.
2010 జూన్ 7: యూసీఐఎల్ భారత చైర్మన్ కేశుబ్ మహీంద్రాతో సహా 8 మంది కంపెనీభారత అధికారులూ దోషులుగా కోర్టు తీర్పు.
Pasted from: http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/8/main/8main6&more=2010/jun/8/main/main&date=6/8/2010
~~~

ఈ కేసు... అన్ని ప్రభుత్వ కాలాలలో నడిచింది. దోషుల మీద చర్యల కోసం ఎంతో కొంత క్రియాశీలంగా పనిచేసిన ప్రభుత్వాలు రాజీవ్, పీవీజీలవే! మిగతా అన్ని ప్రభుత్వాలు [వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకేగుజ్రాల్, భాజపా ప్రధాన భాగస్వామ్యంతో ఎన్డీయే, ఇటలీ కాంగ్రెస్ ప్రధాన భాగస్వామ్యంతో యూపీఏ ప్రభుత్వాలు] దోషులకు వెసులు బాటు కల్పించే ప్రయత్నాలే చేసాయి. ఈ విధంగా కూడా... నెం.5 వర్గం, ఈ ప్రభుత్వాల చిత్తశుద్దిని దృష్టాంతపూరితంగా నిరూపించింది.
~~~~~~

>>>అండర్సన్‌ విడుదలను భారత్‌ వేగవంతం చేసింది: సీఐఏ
న్యూఢిల్లీ: యూనియన్‌ కార్బైడ్‌ మాజీ సీఈవో అండర్సన్‌ను గృహ నిర్బంధం నుంచి విడిపించే ప్రక్రియను నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం వేగంగా ముగించిందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ పత్రాల్లో వెల్లడైంది. 'అండర్సన్‌ను నిన్న రాత్రి విడుదల చేయడంలో భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. యూనియన్‌ కార్బైడ్‌పై రాజకీయ లబ్ధి పొందేందుకు నాయకులు ఆరాటపడుతున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.

ముఖ్యంగా పార్లమెంట్‌ ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర నాయకులు భోపాల్‌ దుర్ఘటన బాధ్యతను యూనియన్‌ కార్బైడ్‌పై నెట్టేసి దాని మాతృ సంస్థ నుంచి పరిహారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు' అని 1984 డిసెంబర్‌ 8న సీఐఏ రహస్య పత్రాల్లో పేర్కొంది. ఈ పత్రాలను సీఐఏ 2002 జనవరిలో వర్గీకృత జాబితా నుంచి తొలగించింది.

Pasted from: http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=525993%26Categoryid=1%26subCatId=32
~~~~~~

వార్తాంశాల సాక్షిగా, దృష్టాంతాలని పరిశీలిస్తే, భోపాల్ పాపాలు ఎవరివో స్పష్టంగా అర్దమౌతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
ఏడాదికో రోజు మాతృదినోత్సవం...

ఓ రోజు పితృదినోత్సవం...

ఓ రోజు స్వాతంత్ర్య దినోత్సవం...

మూడు వందల అరవై అయిదు రోజులలో

ఒకరోజు మాత్రమే తలచుకోదగినదా అమ్మంటే!?

అమ్మ... మన జీవన ప్రదాత!

నాన్న... మన జీవిత నిర్మాత!

మాతృభూమి...? మన జీవితం!

ఈ నేల... నీరిచ్చి, నీడనిచ్చి

అన్నంపెట్టే అమ్మనిచ్చి

నడక నేర్పే నాన్న నిచ్చింది.

అమ్మబొజ్జలో పదినెలలే!

నాన్న వెనక పాతికేళ్ళే!

మాతృభూమి ఒడిలో....?

చివరి శ్వాస విడిచే వరకూ....!

చితిలో కాలినా

సమాధిలో ఒదిగి పోయినా

కలిసి పోయేది ఈ మట్టిలోనే!

అమ్మనీ నాన్ననీ కన్న మాతృదేశాన్ని

ఏడాది కొకసారి....

జండా పండగ అనుకుని

జైహింద్ అనేస్తే....!?

అరవై మూడేళ్ళ క్రితం

ఎందరో ఆత్మార్పణ చేస్తే

పొందిన అర్ద స్వాతంత్రం!

ఇదిగో... ఇలాగే...

శూన్యమై పోతుంది!

‘జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసి’ అనుకున్న

శ్రీరాముడే ప్రతి హృదయంలో నినదిస్తే

పూర్ణ స్వాతంత్రమై

భువి వెలుగుతుంది.

జై హింద్!

ఈ ఏడాది జూన్ 7 న కోర్టు తీర్పుతో ప్రారంభమై, జూన్ 29న ప్రధాని మన్మోహన్ సింగ్ "అండర్సన్ ను భారత్ రప్పిస్తాం. భోపాల్ కేసు ముగిసిపోలేదు" అంటూ ముక్తాయించటంతో ముగిసి, నిన్న పార్లమెంట్ లో చిదంబరం అదే డైలాగ్ తో ముక్తాయించిన... భోపాల్ విషవాయువు లీక్ కేసు ప్రకంపనల నేపధ్యంలో...

దాదాపు 2 నెలలు నడుస్తున్నా... అనేక ఇతర వార్తలు పతాక స్థానం సంపాదించుకొని, ఆపైన పాతబడి, మరుగైపోయినట్లుగానే... అండర్సన్ కేసు అటకెక్కి పోయింది. తిరిగి పార్లమెంట్ లో అర్జున్ సింగ్, చిదంబరాల ప్రకటనలతో మెలికలు తిరుగుతోంది.

‘అండర్సన్ ని అమెరికాకి క్షేమంగా తిప్పి పంపించింది పీవీజీనే’ అంటూ నేటి కాంగ్రెస్ కాకిగోల చేసింది. కోర్టు తీర్పు వచ్చిన తొలిక్షణం అర్జున్ సింగ్, అధినేత్రిని కలిసాడు. [పాదాలు పట్టి దాసోహం అనేసాడేమో!] ఆపైన వ్యూహాత్మకంగా కొన్నిరోజులు మౌనం పాటించాడు. ‘తర్వాత తీరిగ్గా అప్పుడు ప్రజలు ఆగ్రహోదగ్రులై ఉన్నారు. అండర్సన్ దొరికితే చంపేసి ఉండేవాళ్ళు. భద్రతరీత్యా అతణ్ణి అమెరికా పంపించేయాల్సి వచ్చిందని.... అర్జున్ సింగ్ అప్పుడే ఫలానా [?] పత్రికలో చెప్పాడు’ అంటూ ప్రణబ్ ముఖర్జీ కితాబు లివ్వడంతో, అర్జున్ సింగ్ వ్యవహారం అంతటితో తేలిపోయింది.

"న్యాయం దగా పడ్డది. న్యాయం జరగటంతో ఆలస్యం అవ్వటం అంటే బాధితులకి అన్యాయం జరిగినట్లే!" అంటూ సిద్దాంత ప్రవచనాలు చెబుతూ... ప్రస్తుత న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటనలివ్వడంతో... ప్రకరణం పూర్తయ్యింది. [బహుశః పంచ్ డైలాగులు కొట్టాననుకొని ఉంటాడు, ఈ రచయిత cum రాజకీయవేత్త!]

ఇక, అండర్సన్ విలాసంగా భారత్ వచ్చి ‘బైబై ఇండియా’ చెప్పేసి వెళ్ళిపోవటం, అమెరికాలో అతడి విలాసవంతమైన విశ్రాంతి జీవనం - ‘అండర్సన్ పలాయనంలో పీవీజీ హస్తమే ఉండి ఉండవచ్చంటూ’ నాటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా ప్రకటనలు... గట్రా ఎన్నో అంశాలతో కూడిన ఈ వ్యవహారంలో, అడ్మినిస్ట్రేషన్ లో రెడ్ టేపిజం నడిచిందన్నా... రాజకీయాలు నడిచాయి అన్నా.... పేరు ఏదైనా నడిచింది గూఢచర్యమే!

ఎందుకంటే - రాజకీయం, రెడ్ టేపిజం సమానార్దకాలయ్యాయి. రెడ్ టేపిజం అనే పదం, నేటి పరిస్థితులలో గూఢచర్యానికి పర్యాయపదమై పోయింది.

ఈ ‘నడిచిన కథ’లో... ఏదేమిటో విశ్లేషించే ముందు, ఓ చిన్న సంఘటనని వివరిస్తాను. అదీ మా జీవితం నుండే!

అప్పట్లో మేం సూర్యాపేటలోని చికెన్ దుకాణం యజమాని ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. అప్పటికి ఆ ఇంట్లో దిగి నాలుగైదు నెలలై ఉంటుంది. ఓ రోజు ఇంటి యజమాని పదిరోజులు ముందుగానే అద్దె అడిగాడు. "ఇంకా డేట్ రాలేదు కదా అంకుల్! ఇస్తాన్లెండి!" అన్నాను. "ఆ! అవసరం ఉండీ అడిగాను" అన్నాడు. నిజానికి వాళ్ళు డబ్బులు వడ్డీకి తిప్పుతారు.

అప్పుడు మా చేతుల్లో డబ్బుల్లేవు. [Increasing of Expenditure, Decreasing of Income స్థితి]. ఆ మర్నాడే, ఓ విద్యార్ది ఫీజు కట్టాడు. "సరే! ఎప్పుడైనా కట్టాల్సిన అద్దె! పది రోజులు ముందు కడుతున్నాం. అంతే! అడిగాడు కదా, ఇద్దాం" అనుకుని, ఇంటాయనకి రెండు వేల వంద రూపాయలు ఇచ్చాము.

ఆ తర్వాత రెండు రోజులకి, ఇంటామె, మాకు అద్దెకిచ్చిన పైవాటా తమకి కావాలని, క్రింది వాటాలోకి దిగమనీ చెప్పింది. గోడలోకి సింకు నీళ్ళు లీక్ అవుతున్నాయనీ... ఇలా రోజుకో వంకతో విసిగించింది. చివరికి ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పాల్సి వచ్చే స్థితికి తరిమింది.

అప్పటి వరకూ ఆమె దగ్గర, మాపట్ల ఉన్న గౌరవం, మన్ననా... అన్నీ, వాళ్ళు అడిగినట్లు మేం అద్దె డబ్బు ఇవ్వగానే మాయమై పోయాయి. అంత దాకా "ఏమో! గుంటూరు లెక్చరర్ అంటూ టౌన్ లో మంచి ఇమేజ్ ఉంది. విద్యార్దులకి ర్యాంకులు తెప్పించిన కెరీర్ ట్రాక్ ఉంది. లక్షల్లో జీతం తీసుకుంటారనీ పేరుంది. బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఏమో!" అనే జాగ్రత్త మాపట్ల ఉండేది. అవన్నీ పటాపంచలై పోయాయి.

అప్పట్లో మాకు అంతగా అవగాహన లేకపోయింది గానీ, ఆ పరిస్థితులని మాత్రం గుర్తుంచుకున్నాం. 2005 తర్వాత ఆలోచించినప్పుడు మాకు అవన్నీ బాగానే అర్దమయ్యాయి. అప్పుడేం జరిగిందంటే... అతడు అద్దె అడిగాడు, పదిరోజులు ముందుగానే! మా దగ్గర డబ్బులేదు. విద్యార్ది ఫీజు కట్టగానే,... అదే డబ్బు ఆమెకిచ్చాం. ఆ డబ్బే నోట్ల నంబర్లతో సహా ఆమెకు అంతకు ముందు చూపబడి, తర్వాత మా విద్యార్ది చేత మాకు ఇవ్వబడింది. అవే నోట్లు తిరిగి మేము ఆమెకి ఇవ్వగానే... "చూశావా! పైకి పేరే గానీ, వాళ్ళ దగ్గర డబ్బులేం లేవు. వెనక బ్యాక్ గ్రౌండ్ కూడా ఏం లేదు. బంధుమిత్రులు గానీ ఎవరూ వచ్చి పోవటం చూశారా? లేదు కదా? కాబట్టి ధైర్యంగా మేం చెప్పినట్లు చెయ్!" అని చెప్పబడితే చాలు కదా!

ధీమాగా వేధింపు మొదలు పెట్టింది. నాలుగు సార్లకి కూడా, మేం ఆమెని ఏ విధంగానూ నిరోధించలేక పోయాక... మరింత ధైర్యం వచ్చింది. "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కు లేదు" అనేంత ధైర్యం, బండబూతులు తిట్టేంత ధైర్యం!

ఆ విధంగా... మేం ఎంత బలహీనులమో, తన వెనక చేరిన తామెంత బలవంతులో.... మా ఇంటి ఓనర్ కి డెమోగా చూపిస్తే... ఏం చెప్పినా చేస్తుంది, చేసింది.

సరిగ్గా అలాంటి ‘పట్టు’నే, యూనియన్ కార్పైడ్ లీక్ వ్యవహారంలో, అండర్సన్ భారత్ సందర్శించి ‘బై ఇండియా’ అని చెయ్యూపి వెళ్ళటంలోనూ ప్రదర్శించారు.

"చూశారా? ఇండియా ఏమీ చెయ్యలేక పోయింది!" అన్న దాన్ని డెమో చేయటం కోసమే జరిపించబడిన సంఘటన అది! కాకపోతే... ఇప్పుడు నెం.5 వర్గపు పనితీరు కారణంగా పామై మెడకి చుట్టుకుంది. దాన్ని ఎలాగైనా పీవీజీ మెడలో వెయ్యాలన్న దుగ్ధ సోనియాది, ఆమెకి మార్గదర్శకత్వం వహిస్తున్న నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులది!

మరో స్పష్టమైన, బహిరంగ ఉదాహరణ చెప్పాలంటే - తెలుగు సినిమాలలో... కృష్ణకుమారి, బి.సరోజా దేవిల వంటి తారల తర్వాత, వెలిగిపోయిన ఓ నటి... వాణిశ్రీ. ఈమె భక్త ప్రహ్లదలో ఐటమ్ గాళ్. శ్రీ కృష్ణతులాభారం, ఉమ్మడి కుటుంబం వంటి చిత్రాలలో హాస్యనటి.

ఆమె, హీరోయిన్ అయ్యేనాటికే, సినిమా రంగంలో చాలా ఏళ్ళు, కెరీర్ కోసం పెనుగులాడింది. సక్సెస్ అందుకొనేటప్పటికే 3 1/2 పదుల వయస్సు దాటి ఉంటుంది. అయితే, ఒకసారి హీరోయిన్ అయ్యాక, ఆమె ప్రభ ఎంతగా నడిచిందంటే... కొన్ని చక్కని పైకారణాలతో ‘ఆమెకు అగ్ర హీరోల కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వబడింది’ అనే ప్రచారింపబడి, మరింతగా ఇమేజ్ ఇవ్వబడింది.

ఆమె, ప్రొడక్షన్ యూనిట్ కి తన కుర్చీ తను తెచ్చుకునేదనీ, అదనీ, ఇదనీ... వార్తలు... సినిమా పత్రికలలో నిండిపోయేవి. అప్పటి వరకూ తన అందంతో గానీ, నటనా సామర్ధ్యంతో గానీ ఆమె పొందలేని ‘హవా’ని, ఒకసారి ‘గాడ్ ఫాదర్ ల’ ఆశీర్వాదం పొందాక... పొందగటం, ఆ విధంగా ప్రదర్శింపబడింది.

మరో మాటలో చెప్పాలంటే - సదరు హీరోయిన్ కి ‘హవా’ నడుస్తోందన్న ప్రచారంతో, గాడ్ ఫాదర్ లు తమ పట్టు ప్రదర్శించుకున్నారు. తర్వాతే సినిమా రంగంలో నాణ్యత మరింతగా పడిపోయింది.

అప్పట్లో... "మేకప్ లేకుండా చూస్తే [బాబూ మోహన్ కన్నా] నల్లగా ఉండే వాణిశ్రీ... నిన్న మొన్నటి దాకా ‘ఎక్ స్ట్రా’ వేషాలేసిన వాణిశ్రీ... ఈ రోజు కళాభినేత్రిగా వెలిగిపోతోంది. అంతే మరి! ఫలానా ఫలానా వాళ్ళ ఆశీర్వాదాలుండాలే గానీ, పైకి రావడం ఎంత సేపు?" అంటూ సదరు గాడ్ ఫాదర్ ల ‘పై బొమ్మల పేర్లు’ పరిశ్రమలో నానేవి!

అదీ... తమ పట్టుని, సినిమారంగంలో, నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులు ప్రదర్శించుకున్న తీరు!

సరిగ్గా... ఇలాంటి వ్యూహమే యూనియన్ కార్బయిడ్ భోపాల్ గ్యాస్ లీక్ వ్యవహారంలో నడిపించబడింది. వివరంగా చెబుతాను.

1984 అక్టోబరు 31 న ఇందిరాగాంధీ హత్య చేయబడింది. రాజకీయాల్లో నాలుగేళ్ళ అనుభవంతో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే, రాజీవ్ గాంధీ, గూఢచర్యంలో ఓనమాలు రాని పసివాడితో సమానుడే!

గూఢచర్యంలో... చాలా వరకూ... ఏ సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. జరిపించబడతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా యాదృచ్చికంగా జరిగినా, వెంటనే గూఢచర్యం దాన్ని ఆవరించేస్తుంది.

1984 డిసెంబరు 2న జరిగిన భోపాల్ మిక్ గ్యాస్ లీక్ ప్రమాదం కూడా అలాంటిదే! కావాలనే వ్యూహాత్మకంగా జరిపింపబడింది.

పాతిక వేల మంది ప్రాణాలు, లక్షలాది మంది వేదనలు, గూఢచార వ్యవస్థలకు పట్టవన్నది...

తమ పట్టు చూపించుకునేందుకు హిరోషిమా, నాగసాకిల పైన అణుబాంబులు వేసిన కౄరత్వం సాక్షిగా, ప్రపంచం జీర్ణించుకోవలసిందే!

దేశ విభజన నాడు, దాదాపు 30 లక్షల మంది మనుష్యులు, జంతువుల కన్నా హీనంగా చంపబడిన వికృత రాజకీయాల సాక్షిగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జీర్ణించుకోక తప్పదు.

కాబట్టి - జరిపించబడినా, జరిగినా, భోపాల్ ఘటనలో... తదుపరి నడిచిన దంతా రాజకీయపు యవనిక నేపధ్యంగా గూఢచర్యమే!

అప్పటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినా, ఇందిరాగాంధీ కేబినేట్ ని మార్పుల్లేకుండా కొనసాగిస్తున్నాడు. అప్పటికే ఎన్నికలకు సిద్దమై ఉంది దేశం! ఇందిరాగాంధీ కేబినెట్ లో, పీవీజీ కీలకమైన హోంమంత్రిత్వ శాఖని నిర్వహిస్తున్నాడు.

కాబట్టి అప్పటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా... అండర్సన్ ని అమెరికాకి పంపించి వేయటంలో పీవీజీ ప్రమేయం ఉందనీ, ఉండి ఉండొచ్చనీ... అలవోకగా అనేసాడు.

[ఇతడు లాహోరు వాసి. దేశ విభజన సమయంలో భారత్ కు వలసవచ్చిన వాడు. 1949లోనే IFCలో చేరాడు. అప్పట్లో... లాహోరు, కరాచీల నుండి ఇటు వచ్చిన వాళ్ళలో చాలామంది అందుకున్నట్లే, వ్యూహాత్మక విజయాలని, పదవులనీ అందుకున్న వాడు!]

ఇక, సాక్షాత్తూ కాంగ్రెస్ అధిష్టానం, భోపాల్ పాపాలేం ఖర్మ... జరిగిపోయిన, జరగబోయే... అన్ని అనర్దాలనీ, పీవీజీ తలకి చుట్టటానికి సదా సంసిద్దంగా ఉంటుందన్నది ఇప్పటి వరకూ అందరూ చూసిందే!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇందిరాగాంధీ హయంలో హోంశాఖ వంటి కీలక శాఖల్ని నిర్వహించిన పీవీజీకి, 1985లో, సార్వత్రిక ఎన్నికల అనంతరం, రాజీవ్ గాంధీ అప్పగించిన శాఖ ఏమిటో తెలుసా? అప్పుడే కొత్తగా సృష్టించిన మానవ వనరుల శాఖ! పీవీజీ వంటి అనుభవజ్ఞుడికీ, ఉద్దండ ప్రాజ్ఞుడికీ ఇవ్వాల్సిన శాఖేనా అది? అయినా ఆ స్థిత ప్రజ్ఞుడు అదేమీ పట్టించుకోలేదు.

కీలక శాఖల్ని నిర్వహించినంత నిష్కామంగానే దాన్నీ నిర్వహించాడు. అయితే ‘మిస్టర్ క్లీన్’ గా ముందస్తుగా వ్యూహాత్మకంగా ప్రశంసించబడ్డ రాజీవ్ గాంధీ.... బోఫోర్సుపాఠంతో, గూఢచర్య మర్మాలని కొంత పసిగట్టగలిగాక, అనుభవంతో చేతులు కాలాక... ఇల్లాలైన సోనియాని ‘అపరిణతి’ అనుకొని దూరం పెట్టి, తిరిగి పీవీజీ వంటి సీనియర్ల వైపుకి మొగ్గాడు. దాంతో .... 1989లో మరోసారి ఎన్నికలకి దేశం సిద్దమయ్యేనాటికి, పీవీజీ, విదేశాంగ శాఖని నిర్వహిస్తున్నాడు.

అంతగా... అప్పట్లోనే కాదు, మొదటి నుండీ పీవీజీ మీద నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయుల గురి ఉండటం గురించి, రాజకీయాలకు సంబంధించిన గత టపాలలో వివరంగా వ్రాసాను.

అలాంటి నేపధ్యంలో... 1984, డిసెంబరులో అండర్సన్ భారత దేశ పర్యటన - అచ్చంగా సూర్యాపేటలోని మా ఇంటి ఓనర్ వ్యవహారం, వాణిశ్రీ వ్యవహారం లాంటిదే!

అండర్సన్ ఇండియాకి వచ్చి, సురక్షితంగా... మరికొంత ఎకసెక్కంగా "బై ఇండియా" అని చెప్పేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి విమానంలోనే ఢిల్లీకి వెళ్ళిపోయి, అక్కడి నుండి అమెరికా వెళ్ళిపోగలగటాన్ని... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు, అప్పట్లో అతి క్రియాశీలకంగా ఉన్న సీఐఏ లు... ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశంలోని తమ ఇతర ఏజంట్లకి తమ ‘పట్టు’గా ప్రదర్శించుకున్నాయి.

ఒక ఉదాహరణ గమనించండి.

ఒక గలాటా జరుగుతుందనుకొండి. భారీగా కన్పిస్తున్న ఓ వ్యక్తిని, ఒకడు కొట్టాడు. ఆ భారీ కాయుడు, తనని కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టలేక పోయాడు. మరొకడు కొట్టాడు. వాణ్ణీ ఏం చెయ్యలేకపోయాడు. ఆపైన మరొకడు. అదే కథ! చూస్తున్న వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది? మెల్లిగా... అందరూ ఆ భారీ కాయుణ్ణి కొట్టటానికీ, కొట్టి వినోదించటానికీ సిద్దపడతాడు.

సరిగ్గా... భారత ప్రభుత్వం భారీకాయుడైతే.... అండర్సన్ నీ, అర్జున్ సింగ్ లనీ ఏం చెయ్యలేక పోవటమే, అక్కడ ప్రదర్శన చేయబడింది. అంతే! ఎంతగా పరిస్థితులు రెచ్చిపోయాయో... ‘నాటి వార్తల నేటి ఉటంకింపులే’ చెబుతున్నాయి. గత చరిత్రా చెబుతోంది.

ఈ రెచ్చిపోవటం... 1991 లో పీవీజీ ప్రధాని అయ్యే వరకూ నిరాఘాటంగానే సాగింది.

1992 ఫిబ్రవరిలో, పీవీజీ హయాంలో, కొంత నష్టపరిషారాన్ని బాధితులకి పంచటం జరిగింది. అండర్సన్ ని, కోర్టు సమన్లని ధిక్కరించినందుకు, నేరస్తునిగా ముద్రవేసి, కేసు రిజిస్టర్ లో వ్రాసారు.

తర్వాతే... యూనియన్ కార్బయిడ్ కంపెనీ, UCIL [దాని భారత శాఖ] కొంచెం జాగ్రత్త పడాలని ప్రయత్నించాయి. UCIL ని, కోల్ కతా కంపెనీ మిక్ లియోడ్ కి అప్పగించేందుకు, 1994లో, సుప్రీం కోర్టు UCIL కి అనుమతి నిచ్చింది.

1999 అగస్టులో UCC ని ‘డీ కెమికల్స్’ లో విలీనం చేసారు. 2001 లో... UCIL భారం తమది కాదని UCC వాదించింది. ఇవన్నీ... చట్టపరంగా, చట్టాల్లో ఉన్న కన్నాల సహకారంతో... రెడ్ టేపిజం చూపుతూ... తమని తాము కాపాడుకునేందుకు చేసిన శతాధిక ప్రయత్నాల్లోనివే!

1996 సెప్టెంబరులో, దేవెగౌడ హయాంలో [అంటే పీవీజీ ప్రధాని పదవీ నుండి దిగిపోయిన నెలల వ్యవధిలో, హడావుడిగా] భోపాల్ నిందితులకి ప్రయోజనం చేకూర్చుతూ, కేసుని 304[2] నుండి 304[A] బదలాయించి, కేసుని నీరు కార్చారు. 2002లో, అంటే భాజపా [ఎన్డీయే] హయాంలో... సిబిఐ, మళ్ళీ అదే సిఫార్సు చేస్తూ కోర్టులో కేసు వేసింది. సెక్షన్ మార్చి కేసుని బలహీనం చేయటం, నేరగాళ్ళని రక్షించటం, అప్పటికే జరిగిపోయినందున, సిబిఐ 2002లో వేసిన రిట్ ని, కోర్టు కొట్టివేసింది.

ఆ విధంగా భాజపా కూడా... అండర్సన్ నే కాదు, UCIL ఛైర్మన్ కేశుభ్ మహీంద్రతో పాటు, మరి 8 మంది నేరగాళ్ళని కాపాడేందుకు, అత్యుత్సాహం చూపింది. మళ్ళీ నంగనాచిలా "అప్పటి పీవీ నరసింహ రావు నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం, అండర్సన్ ని భారత్ కు రప్పించే ప్రయత్నం చెయ్యకపోవటం దురదృష్టకరం" అంటూ గంభీర ప్రకటనలు చేసింది.

>>>అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆండర్సన్‌ను భారత్‌కు రప్పించకపోవడం దురదృష్టకరమని బీజేపీ వ్యాఖ్యానించింది. 1996లో నిందితులపై సు ప్రీంకోర్టు అభియోగాలను తగ్గించడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ తప్పుపట్టారు. భోపాల్‌ దుర్ఘటన కేసు తుది తీర్పును మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని బీజీపీఎంయూఎస్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ భోపాల్‌ గ్యాస్‌ ప్రమాద బాధితుల సంక్షేమం కోసం పోరాడుతోంది.

పై వార్తాంశంలో, పీవీజీ 1996లో అధికారంలో ఉన్నాడు కాబట్టి, పీవీజీ ప్రభుత్వమే అభియోగాలను తగ్గించిందన్నట్లు, భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నాడు. నిజానికి... పీవీజీ అధికారం నుండి దిగిపోయి, దేవగౌడ ప్రభుత్వంలో [1996 సెప్టెంబరులో] ఈ అభియోగాలను [సెక్షన్ లను మార్చటం!] తగ్గించారు. కానీ, పైవార్తాంశంలో పీవీజీనే ఇదంతా చేసినట్లు, పాఠకుడికి అన్పించేలా ఉంది. ఇదీ.... మీడియా మాయాజాలం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu