నా ఫిర్యాదు, నేనిచ్చిన సమాచారం నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావుకి దేశానికి మంచి చేయటానికి పనికి వస్తోంది. నా రిపోర్ట్ ప్రధానికి అందిందని, PMO లో OSD ఖండేకర్ ని నేను కలిసినప్పుడు, ఐ.బి.అధికారులు నా ఇంటికి వచ్చినప్పుడు నాకు కలిగిన confirmation అది. మరి నా జీవితంలో ఈ అసహజ మార్పులేమిటి? ఇక్కడ నాకు చాలా అసాధారణలు, అసహజాలు కనిపించాయి.

1]. నేను రహస్య సమాచారంతో ఫిర్యాదు ఇచ్చాను. అప్పుడు ఐ.బి.అధికారులు రెండు కిలో మీటర్ల దూరంలోని నన్ను గాక 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మానాన్నల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అసలు ఫిర్యాదు ఇచ్చింది నేను కదా! అప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాను కదా! నా తాత్కాలిక చిరునామా, ఢిల్లీ లోని హోటల్ అడ్రసు ఇచ్చాను గదా? – ఇది నాకు అర్ధం కాలేదు.

2]. నేను ఫిర్యాదు ఇచ్చాక ఐ.బి.అధికారులను నాఫ్యాక్టరీకి పంపినప్పుడు, PM నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు? అలాగని నన్ను OSD ఖండేకర్ కాని, PMR ముందు నేను ధర్నా చేసినప్పుడు నన్ను డీల్ చేసిన పోలీసు లు గాని, నాపట్ల వాళ్ళ ప్రవర్తనలో ఓ గౌరవం, ఓ concern. మొత్తంగా వాళ్ళు నాకిచ్చిన ట్రిట్ మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. [అదే పోలీసుల నుండి 1996 తరువాత సంవత్సరాలలో ఫిర్యాదుదారుగా నేను ఎలాంటి ట్రిట్ మెంట్ తీసుకున్నానో పత్రాలతో సహా తరువాత టపాల్లో వివరిస్తాను.]

3]. కుముద్ బెన్ జోషి గానీ, వై.యస్.ఆర్. గానీ, ముందుగా నేను చెప్పేది మొత్తం విన్న తర్వాత తమ ప్రతిస్పందన చెప్పారు. నమ్మకమో, నమ్మకపోవడమో లేదా నాకు సహాయం చెయ్యడమో చెయ్యకపోవడమో. అయితే 10, జనపధ్ లో సోనియా గాంధీ పి.ఏ. మాధవన్ మాత్రం నేను చెప్పిన రెండు ముక్కలు “I had given complaint against AP CM N. Janardhana Reddy, Karuna nidhi of Tamil Nadu, Ex PM V.P. Singh and Mr. Ramoji Rao of Enadu, a Telugu Daily News paper regarding their coups including Rajiv Gandhi’s assassination to the PM of India, Mr. P.V. Narasimha Rao. I want to meet Mrs. Sonia Gandhi regarding this.” వినీ వినగానే “Trash. I won’t believe what you are saying. You can’t meet our Madam” అని ఎందుకన్నట్లు? ఎదుట ఉన్నది ముక్కు మొఖం తెలియని అమ్మాయి కావచ్చు. చెబుతున్న విషయం చిన్నది కాదే? ఓ అబద్ధాన్ని తీసుకొని, అందులో ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానుల పేర్లు చెబుతూ, ప్రస్తుత ప్రధానికి ఫిర్యాదు ఇచ్చానంటూ ఎవరూ రారు కదా! అంతపని లేని వాళ్ళు ఉండరు. ఉన్నా అలాంటి ధైర్యం ఉండదు. ఇది మినిమమ్ కామన్ సెన్సు కదా! అదీగాక ‘Petitioner may be correct’ అన్న సూత్రం administration లో ఉంటుంది. ముందుగా ఫిర్యాది ఏం చెబుతున్నారో విని ఆపైన నిర్ణయించుకుంటారు, అది ఎంత వరకూ నిజం లేదా అబద్ధం అవుతుంది అని. అంతేగానీ, వినీ వినగానే ట్రాష్ అని ఎవరూ అనరు. అంతేగాక అది పెద్దవిషయం అయినప్పుడు కూడా తమకు తామే అంత నిర్ణయం తీసుకోరు. ఏ కన్నంలో ఏపాముందో అన్న సూత్రం ప్రకారమైన తమ పైవాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. అటువంటిది మాధవన్, సోనియాగాంధీకి చెప్పలేదు, సరికదా తనకంటే పైనున్న మరెవరినో సంప్రదించకుండానే ఏకపక్షంగా నాకు సారీ చెప్పేశాడు. కనీసం ‘రేపు రండి. కనుక్కొని చెబుతాను’ అని వాయిదా కూడా వెయ్యలేదు. ఇదీ నాకు అప్పుడే వింతగా, అసాధారణంగా అన్పించింది. బుర్రలో రికార్డు మాత్రం చేసుకొని ఊరుకున్నాను. అయితే 1992 నుండి 2007 వరకూ కూడా 10, జనపధ్ నుండి నేను “ఠాఠ్! రామోజీరావు గురించి నువ్వు చెప్పింది నేను నమ్మను” అన్న స్పందననే అందుకున్నాను. 1992 నాటికి నాచేతిలో ఋజువులు లేవు. 2007 నాటికి ఋజువులు పత్రాలతో సహా ఉన్నాయి. అయినా నేను పొందిన జవాబు మాత్రం అదే. సోనియా గాంధీకి, ఆమె పి.ఏ.లకి సంబంధించి నేనయినా, రామోజీరావు అయిన ఒకటే. నాతో ఏ పరిచయమూ సంబంధమూ లేనట్లే, అతడితోనూ ఆమెకు ఎలాంటి సంబంధమూ, పరిచయమూ లేదు. మరి అంతగా ‘నమ్మను’ అని భీష్మించుకు కూర్చోవాల్సిన పనేమిటి? నిజమే కాదో నిర్ధారించుకోవచ్చు కదా!

4]. అంతగా నమ్మని వ్యక్తి, మళ్ళీ రాయపాటి సాంబశివరావుకి ఎందుకు చెప్పినట్లు? సోనియా గాంధీ నుండి కబురు రాకుండా రాయపాటి సాంబశివరావుకి నేను ఏదో సమాచారం ఇచ్చానని ఎలా తెలిసినట్లు? ప్రధాని నివాసం లేదా కార్యాలయం నుండి తెలిసేటట్లుయితే అది జూన్ 5 తర్వాత ఎప్పుడైనా తెలియవచ్చు. కానీ రాయపాటి సాంబశివరావు ఆగస్టు 9 లేదా 13 వ తేదీ తర్వాత అంటే సోనియాగాంధీ పి.ఏ.ని నేను కలిసిన తర్వాతే సోనియా గాంధీ పేరు ఎందుకు రిఫర్ చేసాడు? సరే, నేను రాయపాటి సాంబశివరావు ని కలిసే ఆసక్తి చూపనప్పుడు, మరి వాళ్ళు తర్వాత నిజనిర్ధారణ చేసుకోవాలి కదా?

5]. రాజీవ్ మరణించిన తర్వాత, స్పల్ప వ్యవధిలోనే, ప్రధానిగా పీ.వి. బాధ్యతలు చేపట్టాక 100 కోట్ల రూపాయల నిధిని సోనియాగాంధీ అధ్యక్షతన ఏర్పడిన రాజీవ్ మిషన్ కు ప్రభుత్వం తరుపున ఇచ్చాడు. దానికి పత్రికలు అభ్యంతరం లేవనెత్తాయి. అప్పటికి ఎంతో దుఃఖభారాన్ని మోస్తున్న సోనియాగాంధీ ఆ నిధిని తిరస్కరించింది. అప్పుడు పత్రికలన్నీ ఆమె హుందాతనాన్ని, ఔదార్యాన్ని వేనోళ్ళ పొగిడాయి. అప్పుడంతా కూడా పీ.వి. – సోనియాగాంధీల మధ్య terms బాగానే ఉండేవని వార్తలుండేవి. 1992 జూన్ వరకూ కూడా నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావు మర్యాదాపూర్వకంగా సోనియాగాంధీని తరచూ కలుస్తుండే వాడు. అయితే 1992 జూన్ లో నా ఫిర్యాదు తర్వాత ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావుకి సోనియాగాంధీకి మధ్య సత్సంబంధాలు తెగిపోయాయి. నా ఫిర్యాదు తర్వాత కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే ప్రధానమంత్రి 10, జనపధ్ కి వెళ్ళాడు. తర్వాత terms బాగా చెడ్డాయి. ఎంతగా చెడ్డాయంటే – 1996 తర్వాత AICC అధ్యక్షడుగా కుర్చీ దింపేసేటంతగా, అప్పటి AICC అధ్యక్షడుగా కూర్చోబెట్టిన సీతారాం కేసరి అనే రిమోట్ కంట్రోల్డ్ బొమ్మ చేత పీ.వి.కీ తదుపరి ఎలక్షన్లలో టిక్కెట్ నిరాకరించేటంతగా, 1998 లో తానే స్వయంగా రాజకీయరంగప్రవేశం చేశాక 2004 లో పీ.వి.నరసింహారావు మరణించినప్పుడు అతడి భౌతిక కాయాన్ని కూడా అవమానించేటంతగా, నిన్నమొన్న కాంగ్రెస్ ప్రధానమంత్రుల ఫోటోలలో పీ.వి. ఫోటో పెట్టకూడదన్న పంతం పట్టేటంతగా. అందుకు సోనియాగాంధీ చెప్పిన పైకారణాలు [overleaf reason] గురించి ఇంతకు ముందు టపాల్లో చర్చించాను.

దానాదీనా నేను ఇక్కడ ప్రశ్నించాలనుకుంటున్నది – 1992 జూన్ వరకూ బాగానే ఉన్న సంబంధాలు, 1991 జూన్ లో పీ.వి. పేరు సోనియాగాంధీనే స్వయంగా సూచించేటంతగా బాగానే ఉన్న సంబంధాలు, 1992 జూన్ లో నేను రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చాక ఎందుకు చెడిపోయాయి? అని.

6]. ప్రధానమంత్రి OSD ఖండేకర్ నాకు ఇంటర్యూ ఇవ్వడంతోనూ, ఐ.బి.అధికారులు మాఇంటికి రావడంతోనూ నేను కొంత సంతృప్తి పడ్డాను. ప్రధానమంత్రి నాకు ఇంటర్యూ ఇవ్వకపోవటం పట్ల కన్నా, సోనియా గాంధీ ఇంట్లో ఆమె పి.ఏ. నుండి నేను రిసీవ్ చేసుకున్న స్పందన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. 10, జనపధ్ లో రామోజీరావు పై నేనిచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ప్రారంభమైన అసహజ పరిణామాలు అంతటితో ఆగలేదు. ఇప్పుటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. వాటి గురించిన సాక్ష్యాధారాలు, పత్రాలతో సహా తదుపరి టపాల్లో వివరిస్తాను.

7]. నేనిచ్చిన ఫిర్యాదు తర్వాత దేశంలో వేగంగా కొన్ని మార్పులు జరిగాయి. చాలా సమస్యలు పరిష్కారామయ్యాయి. కొన్ని తాత్కాలికంగా తెరమరుగయ్యాయి. కానీ నా బ్రతుకెందుకు సమస్యల సుడిగుండాల్లో పడింది? [ ఏ క్షణాన కుముద్ బెన్ జోషి ‘Don’t involve in such things. Life will become miserable’ అన్నదో గానీ, అదే అయ్యింది. అలాగనీ నేను 1992లో చేసిన పనికి నేను పశ్చాత్తాప పడటం లేదు. రామోజీ రావు గాక మరొకరు దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు పన్నినా నేనిలాగే ప్రతిస్పందిస్తాను. అది వేరే విషయం.] ‘అసలింతకీ ఈ పీ.వి.నరసింహారావు కుట్రదారులకు మద్దతుదారుడా లేక కుట్రకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాడా? ఈ ప్రధానమంత్రి నాకు శతృవా, మిత్రువా?’ అన్న విషయం తేల్చుకోలేకపోయాను. ఒకవేళ నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావు కూడా కుట్రదారుడే అయితే దేశపు సమస్యలు తాత్కాలికంగానైనా తీరవు. అంతేకాదు, నన్ను నాకుటుంబాన్ని ’లేపేయటం’ చాలా సులభం వాళ్ళకి. బదులుగా నా ఫ్యాక్టరీ మూత వేయించటం ఎందుకు?

8]. పీ.వి.నరసింహారావుకి నేను ఫిర్యాదు ఇచ్చాను. అతడు గనుక నాకు శతృవు అయితే నా పీక తెగ్గోసి ఉండేవాడు. కాబట్టి నాశతృవు కాదు. మరి మితృవే అయితే నా జీవితంలో ఈ ఒడిదుడుగులేంటి?

ఈ తికమకలు అప్పుడు నాకు అసలు అర్థంకాలేదు. దానికి తోడు నాకుటుంబసభ్యుల పోషణభారం, బాధ్యత కూడా నా భుజాల మీదే ఉన్నాయి. మా అమ్మ, చెల్లీ, తమ్ముళ్ళు మన భవిష్యత్తేమిటి అన్న గందరగోళానికి గురయ్యారు. మా అమ్మ, తమ్ముళ్ళని నేను సమాధాన పరచలేకపోయాను. చివరికి మా అమ్మ, తమ్ముళ్ళు, చెల్లి ఒకజట్టు అయ్యారు. మా నాన్నగారి అనారోగ్యంరీత్యా ఆయన పాత్ర నామమాత్రమైపోయింది. మా అమ్మ చెల్లి, తమ్ముళ్ళు జరుగుతున్న పరిణామాలు, సమస్యలు చూసి బాగా భయానికి, ఆందోళనికి గురయ్యారు. ‘దేశానికి మేలు జరుగుతుంది, పీ.వి. నరసింహారావు సమస్యల నుండి బయటపడుతున్నాడు. అలాంటప్పుడు మన మెందుకు crises పడుతున్నాం?’ అని నన్ను నిలదీసారు.

వాళ్ళకి జవాబిచ్చేందుకు, వాళ్ళని సమాధాన పరిచేందుకు నాదగ్గరా స్పష్టతేం లేదు. మా అమ్మా, చెల్లీ, తమ్ముళ్ళు పీ.వి.నరసింహారావు కూడా కుట్రదారుడేనేమో నన్న భయానికి గురయ్యారు. ’అదే నిజమైతే, మన ప్రాణాలు తీయడమే తేలిక కదా, ఇలా వేధించేబదులు’ అని నేను వాదించాను. లెనిన్ కూడా నా వాదనని బలపరిచాడు. క్రమంగా ఇంట్లో గొడవలు పెరిగాయి. మా అమ్మా, చెల్లీ, తమ్ముళ్ళు కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోతామన్నారు. దాంతో నేనే ఉత్తచేతులతో ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. ఇది 1993 మే చివరివారంలో జరిగింది. లెనిన్ నాకు సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. “ఏది ఏమైనా ఒకపనిని ప్రారంభించాము. ఏదైనా రిస్క్ ఉంటే అది ప్రారంభించిన మీకే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు చేసిన పని ఫలప్రదం అయి ఉంటే నేనూ ఫలితాన్ని ఆనందంగా అనుభవించేవాడిని కదా! అలాంటప్పుడు ఇప్పుడు ఒంటరిగా మిమ్మల్ని వదిలివేయటం సరైనది కాదు. ఇప్పుటికే తల్లితండ్రులూ, తోడబుట్టిన వాళ్ళు వదిలివేసారు. మీ స్నేహితులెవరైనా మీ బాధ్యత తీసుకొని మీకు సహాయం చేస్తే, అప్పుడు నేనూ నాదారిన నేను పోతాను” అన్నాడు. ముందుగా నన్ను వాళ్ళ ఇంటికి వైజాగ్ తీసుకెళ్ళాడు. అయితే వాళ్ళమ్మ గారు నా రాకని తీవ్రంగా వ్యతిరేకించారు. దానితో తన స్నేహితులనీ, హైదరాబాద్ చేరి నా స్నేహితులనీ కూడా approach అయ్యాము. తన స్నేహితులన్నా కొంత సహాయం చేసారు గాని, నాస్నేహితులైతే ముఖమ్మీదే తలుపులేసారు. కొందరు ఏ కారణం చూపకుండానే దురుసుగా ప్రవర్తించి మాటలన్నారు. విషాదమేమిటంటే 1992 జూన్ కు ముందు వరకూ కూడా వాళ్ళతో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి. వారిలో కొందరు నా బాల్యమిత్రులు కూడా. చిన్నతనంలో, స్కూల్లో చదువుకునే రోజుల్లో 1977 లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాసరచన, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించింది. అందులో జిల్లాల వారీగా, జిల్లాకు ఇద్దరు చొప్పున, నెగ్గిన వారిని 45 రోజుల పాటు ఏపి దర్శన్ పేరుతో టూర్ నిర్వహించింది. అప్పుడు నేను గుంటూరు జిల్లానుండి సెలక్ట్ అయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆనాటి AP Darshan మిత్రులు, 1992 వరకూ కూడా, 15 ఏళ్ళుగా ఉత్తరాలతోనూ, అప్పుడప్పుడూ గెట్ టూ గెదర్ లతోనూ కలుస్తూనే ఉండేవాళ్ళం. ఒకరికొకరం ఏ సాయం కావాలన్నా చేసుకునేవాళ్ళం. ఎంత ఆప్త మిత్రులంటే తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న మిత్రులకి అండగా నిలిచేటంత. వీరిలో కొందరు మిత్రుల తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మా ఇంట్లో ఉండి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లకు చదువుకున్నారు. అటువంటి స్నేహితులు కూడా అసాధారణరీతిలో, అసహజంగా, చెప్పుకునేందుకు మా మధ్య ఏ గొడవా జరగకుండానే, [కనీసం నేను ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారం వారెవ్వరికీ చెప్పకుండానే] నాకు ‘Get lost’ చెప్పారు. ‘బహుశః నేను నా ఫ్యాక్టరీతో పాటు హోదాని పొగొట్టుకున్నాను. మిత్రుల్నీ పొగొట్టుకున్నట్లున్నాను’ అనుకున్నాను.

దాదాపు చేతిలో రూపాయి లేకుండా నడివీధిలో నిలబడిన స్థితి నాది. ఇలాంటి స్థితిలో బహుశః లెనిన్ తోడు లేకపోతే అసలు ‘స్నేహం’ అన్న పదం మీద కూడా నమ్మకం కోల్పోయి ఉండేదాన్నేమో! ఇన్ని సమస్యల్లోనూ తను నాకు తోడుగా ఉన్నాడు. నా ఖర్మానికి నన్ను వదిలివేసి తన ఇంటికి తనని వెళ్ళమన్నాను. తను నిర్ధ్వంద్వంగా తిరస్కరించాడు. “గెలుపు వచ్చి ఉంటే ఆనందంగా నా వాటా నేను పుచ్చుకొని ఉండేవాడిని. అలాంటప్పుడు ఈ ఓటమిలోనూ అంతే” అన్నాడు. ఒక్క నెలరోజుల పాటు ఎవరైనా నాకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బిల్లు కడితే ఈ లోపున ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చన్నది నా ప్రయత్నం. ఆ అవకాశం నాకు ఏ స్నేహితురాలూ/ స్నేహితుడూ ఇవ్వలేదు. అప్పటికి హైదరాబాద్ నుండి మెహబూబ్ నగర్ చేరాను. అక్కడి నా మిత్రురాలు పరమ అవమానకరంగా నన్ను రిసీవ్ చేసుకుంది. దుఃఖంతో, దిక్కు తోచని స్థితిలో బస్టాండులో కూర్చొని ఉన్నాను. ఎదురుగా శ్రీశైలం బస్ కన్పించింది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్పించింది.

లెక్కచూసుకుంటే చేతిలో కొన్ని చిల్లర నోట్లున్నాయి. శ్రీశైలం చేరాము. అక్కడ తిరిగి జీవితం ప్రారంభించాలని అనుకున్నాను. మేమిద్దరం ఏసంబంధంతో జీవించాలి? అప్పటివరకూ లెనిన్ నాకు స్నేహితుడు మాత్రమే. ఎప్పుడూ మరే ఆలోచనా చెయ్యలేదు. ‘దేశం కోసం ఏదో చెయ్యాలి’ అన్న ఆలోచన తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. ఈ నేపధ్యంలో శ్రీశైలానికి 1993, జూలైలో చేరాము. అక్కడ గుడిలో వివాహం చేసుకున్నాము. శ్రీశైలంలో ప్రైవేటు భూమి ఉండదు. ప్రైవేటు ఆస్థులూ ఉండేవికావు. అంతా దేవస్థానం పరిధిలో ఉంటుంది. ఎన్నో కుల సత్రాలున్నాయి. కొన్ని ఆశ్రమాలున్నాయి. అక్కడ కొత్త జీవితం ప్రారంభించాలని ప్రయత్నించాము. అయితే అక్కడ సంవత్సరం క్రితం ఒక జంట వచ్చి హత్యకు గురైందని, అప్పుడు పోలీసు ఎంక్వయిరీలూ గట్రాతో శ్రీశైలం ప్రజలు అదిరిపోయి ఉన్నారు. ఆ ఙ్ఞాపకం ఇంకా ఉండటంతో ఎవరూ మమ్మల్ని నమ్మలేదు. ఏ సత్రంలో గానీ, ఎక్కడా ఉద్యోగం ఇచ్చేలా లేరు. ఇచ్చిన ఉద్యోగం కూడా తరువాత పోయింది. దాంతో మేము నేరుగా పోలీసు స్టేషన్ ని ఆప్రోచ్ అయ్యాము. మా పూర్తి వివరాలు వ్రాసి, వ్యాపారంలో నష్టపోయి ఫ్యాక్టరీ మూతపడటం రీత్యా బ్రతకడానికి శ్రీశైలం వచ్చామనీ, మా వెనుక ఏ నేర లేదా నెగిటివ్ చరిత్ర లేదనీ, మా ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్ లో మా గురించి ఎంక్వయిరీ చేసుకోవలసిందనీ వ్రాతపూర్వకంగా రిక్వేజేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎవరూ మమ్మల్ని నమ్మనిరీత్యా పోలీసు వారు మా గురించి ఎంక్వయిరీ చేసుకున్నాక ఇక్కడి వారికి మా గురించి రికమెండ్ చెయ్యమనీ అభ్యర్ధించాము.

దాంతో అక్కడి స్థానిక సి.ఐ., మరియు ఎస్.ఐ.లు ప్రతిస్పందించి, అక్కడి వారికి మా గురించి భరోసా ఇచ్చారు. స్థానికులు కాస్త మాపట్ల మెత్తబడ్డారు. ఎన్నో ప్రయత్నాల చేసి చివరికి ఓ చిన్న Hut లో మకాం పెట్టగలిగాము. అది కూడా ఎంతో కష్టంతో సంపాదించుకోగలిగాము. నా ఫ్యాక్టరీ పోర్టీకోలో సగం కూడా ఉండని చిన్న Hut అది. కరెంట్ లేదు. నీళ్ళూ లేవు. అక్కడ పిల్లలకి చదువుచెప్పటం మొదలు పెట్టాము. వీధిలైట్ల క్రింద, స్థానిక గుడుల్లోనూ విద్యార్దులకి క్లాసులు తీసుకునేవాళ్ళం. అక్కడదాదాపు రెండు సంవత్సరాలు నివసించాము. అయితే ఒడిదిడుగులు మాత్రం మమ్మల్ని వదలలేదు. నాదగ్గర చదువుకున్న ఇంటర్, బి.ఎస్సీ [ఇంగ్లీషు మీడియం] విద్యార్ధులకి మంచి మార్కులు వచ్చినా మా ఆదాయం మాత్రం అంతకంతకూ తగ్గిపోవచ్చింది. ఓ కొత్త విద్యార్ది చేరాడు అని సంతోషించేలోపల మరో ఇద్దరు పాతవిద్యార్ధులు డ్రాప్ అయిపోయేవారు. ఎందుకు మానేసారో గట్టికారణం కూడా ఉండేది కాదు.

నిజానికి ఎప్పుడైతే ఫ్యాక్టరీ పోగొట్టుకుని, Hut లో జీవితం ప్రారంభించామో అప్పుడే నేను ఈ కేసు గురించి, దేశం గురించి ఆలోచించటం మానేసాను. “ఏదీ ఆశించి చెయ్యనది నిజమైతే ఇప్పుడు వచ్చిన ఫలితం గురించి ‘ఇదా ఫలితాం’ అని విచారించకూడదు. మనం ఏదీ ఆశించలేదు” అనుకున్నాము. నిద్రలేస్తే పిల్లలకిపాఠాలు చెప్పుకోవటం. మిగిలిన సమయం గుడిలో గడపటం. మా ఇంటి ప్రక్కనే శుకయోగిశ్వర ఆశ్రమం ఉండేది. ఉదయం, సాయంత్రాల్లో పంచాక్షరి భజన జరిగేది. భగవద్గీత చేత బట్టుకొని భక్తి యోగమార్గన్ననుసరిస్తూ మేము బాగానే ఉండేవాళ్ళం. ఆదాయం ఆరు – ఏడు వందల కంటే ఎక్కువ ఉండేది కాదు. కాని మేము ఆనందంగానే ఉండేవాళ్ళం. ఆదివారం అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చేవాళ్ళం. చుట్టూ అడవి. మా గుడిసె అరుగు మీద కూర్చొంటే డ్యాం, రిజర్వాయర్ కనిపించేది. ప్రకృతిలో కలిసిపోయిన బ్రతుకు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

లెనిన్ ఎవరు? ఆ పెరు ఎలావచ్చింది? అతను ఎలా పరిచయము? అతని తల్లి దంద్రులు కమ్మునిస్టులా?

ఇప్పుడు అతను మీ భర్త, ఇది తెలుసు, మీ పొష్టుల ద్వారా.

మా అత్తమామలు కమ్యూనిస్ట్ లేనండి. తను నాకెలా పరిచయమో ముందు టపాలలో వ్రాసాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu